బెంగళూరు: ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలను 15నుంచి20 శాతం వరకు పెంచేందుకు కర్ణాటక ఆర్టీసీ(కేఎస్‌ఆర్టీసీ) సిద్ధమవుతోంది. ఛార్జీలు పెంచక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని కేఎస్‌ఆర్టీసీ చైర్మన్ ఎస్ఆర్ శ్రీనివాస్ ఆదివారం(జులై 14)చెప్పారు. ఛార్జీల పెంపు ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపామన్నారు.
ఛార్జీలు పెంచాలా వద్దా అనే విషయంలో సీఎం సిద్ధరామయ్య తుది నిర్ణయం తీసుకుంటారన్నారు. డీజిల్,నిర్వహణ వ్యయం పెరగడం వల్లే ఛార్జీలు పెంచాల్సి వస్తోందన్నారు. 2019 నుంచి బస్సుల్లో టికెట్ ఛార్జీలను పెంచలేదన్నారు. గడిచిన మూడు నెలల్లో సంస్థకు రూ.295 కోట్ల నష్టం వచ్చిందని చెప్పారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ‘శక్తి’ పథకం ద్వారా బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తోంది.ఛార్జీల పెంపుతో కేవలం పురుష ప్రయాణికులపైనే భారం వేస్తామనే వాదన సరికాదన్నారు. మహిళల ఛార్జీలను కూడా ప్రభుత్వం చెల్లిస్తున్నందున పెరిగిన మేరకు డబ్బులను కూడా ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment