అటు కర్ణాటక, ఇటు తెలంగాణాలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు పథకం మహిళలను బాగా ప్రయోజనకరంగా మారింది. మరోవైపు ఉచిత ప్రయాణంపై అనేక సందర్భాల్లో తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. తాజాగా బెంగళూరుకు చెందిన వ్యక్తి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ చర్చకు దారి తీసింది. ప్రస్తుతం దీనిపై తెగ చర్చ నడుస్తోంది.
బెంగళూరుకు చెందిన కిరణ్ కుమార్ అనే వ్యక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై తన అభిప్రాయాన్ని ట్విటర్‌లో పంచుకున్నాడు. అసలు కేవలం ఆధార్ చూపించిబస్సులో ప్రయాణించడం ఎంతవరకు న్యాయం అంటూ తన అక్కసంతా వెళ్లగక్కాడు.
కుమార్ పోస్ట్‌లో అందించిన వివరాల ప్రకారం బెంగళూరు నుండి మైసూరుకు KSRTC బస్సులో ప్రయాణ ఛార్జీ రూ.210. ఈ బస్సులో 50 మంది ప్రయాణికులలో దాదాపు 30 మంది మహిళలు. 20 మంది పురుషులు డబ్బులుచెల్లించి టికెట్ తీసుకుంటే, ఆధార్ చూపించి 30మంది ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఇది న్యాయమా? సమానత్వం అంటే ఇదేనా?. ఒక వృద్ధుడు చెల్లించడానికి నోట్లు దొరక్క ఇబ్బంది పడుతోంటే, మరో పక్క వీడియో కాల్‌లో ఒక ధనిక యువతి దర్జాగా ఫ్రీగా వెళుతోంది అంటూ చెప్పుకొచ్చాడు.
ప్రభుత్వం అంత మిగులు ఆదాయాన్ని ఆర్జిస్తుంటే, విమానాశ్రయ షటిల్ సర్వీస్ తరహాలో సార్వత్రిక ఉచిత బస్సు సేవను ప్రకటించవచ్చు కదా అని ప్రశ్నించాడు. ప్రపంచవ్యాప్తంగా, సబ్సిడీలు, సంక్షేమం భరించలేని వారికి కదా ఇచ్చేది, కానీ బెంగళూరు , మైసూరు వంటి నగరాల్లో ధనవంతులైన మహిళలకు ఉచిత పథకమా అంటూ ఆక్రోశమంతా వెళ్లగక్కాడు. ఓట్ల కోసం ఉచితాలనే దుర్మార్గపు చక్రంలోకి ప్రవేశించాం, సమీప భవిష్యత్తులోదీన్నుంచి బయటపడటం కష్టం అంటూ వాపోయాడు.
దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. చాలామంది ఈ పథకాన్ని సమర్థించారు. సాధారణంగా ఉచితాలను ఆమోదించను కానీ రెండుమూడు సార్లు BMTCలో ప్రయాణించా. బస్సులో ప్రయాణించే చాలా మంది మహిళలు రోజువారీ వేతన కార్మికులు లేదా సాధారణ ఉద్యోగులే కనుక..అది చూసి మంచిగా అనిపించింది ఒక యూజర్ వ్యాఖ్యానించారు.
"ఇది ఉచితాలు కాదు. ప్రజలు ఇచ్చే పన్నులకు బదులుగా ప్రభుత్వం సమాజానికి తిరిగి చెల్లిస్తోంది. ఇది అర్థం చేసుకోకపోతే, ప్రజాస్వామ్య ప్రభుత్వం ,పాలనా సూత్రాలు అర్థం కావు అంటూ మరో వినియోగడదారుడు చురకలేశాడు.
మరి కొంతమంది ఆయన వాదను సమర్ధించారు. తాము చెల్లించే ఇలా పోతున్నాయి.. ఇది తనకు నచ్చలేదు అంటూ మహిళల ఫ్రీ బస్సు పథకంపై ప్రతికూలంగా స్పందించారు.
నెగెటివ్ కామెంట్స్
‘‘మీ వాదన సరైనదే. ఉచితం కాదు.. 50శాతం చేయండి. మహిళలకు ఈ ఉచిత ప్రయాణం పాఠశాల, కళాశాల ,పనికి వెళ్లే సాధారణ ప్రయాణికులకు కష్టంగా మారింది.’’
"నా ఆదాయపు పన్నును రోడ్లు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉపయోగించాలి... అర్హత లేని వారికి ఉచితాలను పంపిణీ చేయడానికి కాదు"
I took an early morning bus to Mysuru, from Bengaluru. ₹210 fare. Comfortable KSRTC bus and a world class highway for fast travel.
But I got a few thoughts.
1) Nearly 30 of the 50 passengers were women. Just show Aadhar and travel free. Is this fair? Is it equality?
2) 20… pic.twitter.com/2TfkzF88IA— Kiran Kumar S (@KiranKS) January 8, 2025
"ఇతరులు చెల్లించడానికి ఇబ్బంది పడుతుండగా, సంపన్న మహిళలకు ఉచితాలను అందజేయడం. ఓటు బ్యాంకు రాజకీయం తప్ప మరొకటి కాదు. సబ్సిడీలను మౌలిక సదుపాయాలు లేదా నిజంగా అవసరమైన వారికి సహాయం చేయడం వంటి నిజమైన సమస్యలకు ఉపయోగించాలి. ఇలా కొంతమందిపై అదనపు భారం ఎందుకుమోపాలి? ఇది స్పష్టమైన అసమానత, పురోగతి కాదు"
Comments
Please login to add a commentAdd a comment