netizens
-
ఫుడ్ డెలివరీ యాప్‌పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్స్
ఒక బిజినెస్ అభివృద్ధి చెందాలంటే.. పబ్లిసిటీ చాలా అవసరం. ఈ పబ్లిసిటీ కోసం వ్యాపార వేత్తలు వివిధ మార్గాలను అన్వేషిస్తారు. అయితే ఇటీవల బెంగళూరులో.. ఓ ఫుడ్ డెలివరీ యాప్ కంపెనీ వినూత్నంగా అలోచించి, పబ్లిసిటీ కోసం మనుషులనే వాడేస్తోంది. ఇది చూసిన నెటిజన్లు నెట్టింట్లో ఫైర్ అయిపోతున్నారు.ఫుడ్ డెలివరీ యాప్‌ను ప్రచారం చేయడానికి బిల్‌బోర్డ్‌లను భుజాన వేసుకుని బెంగళూరులోని వీధుల్లో నడుస్తున్న మనుషుల ఫోటోను ఒక ఎక్స్ (ట్విటర్) యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. లక్షల మంది ఈ ఫోటోలను వీక్షించారు.చాలామంది నెటిజన్లు ఆ ఫుడ్ డెలివరీ యాప్ యాజమాన్యం మీద విరుచుకుపడుతున్నారు. ఆ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో కనిపించకుండా చేయాలని చెబుతున్నారు. ఇది శ్రమ దోపిడీకి నిదర్శమని దుమ్మెత్తి పోస్తున్నారు. బిజినెస్ పబ్లిసిటీ కోడం ఇంత చెత్త ఆలోచన మరొకటి ఉండదని కోప్పడుతున్నారు. అంత బరువున్న బోర్డులను మోయడం ఎంత కష్టంగా ఉంటుందో అంటూ ఆ వ్యక్తుల మీద పలువురు జాలి చూపించారు.VC : how much funding do you need ?Startup : 5 million $ VC : what's your customer acquisition plan Then : Human ads VC : Take my money pic.twitter.com/67BkVHLG1j— Roshan (@roshanonline) December 6, 2024 -
నెటిజన్ పోస్టుకు ఆనంద్ మహీంద్రా రిప్లై: ఎంత దూరం..
ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉండే ప్రముఖ పారిశ్రామిక దిగ్గజంగా 'ఆనంద్ మహీంద్రా'.. తాజాగా ఓ నెటిజన్ చేసిన పోస్టుపై స్పందించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఇటీవల దేశీయ మార్కెట్లో బీఈ 6ఈ, ఎక్స్ఈవీ 9ఈ కార్లను లాంచ్ చేసిన తరువాత.. సుశాంత్ మెహతా తన ఎక్స్ ఖాతాలో కార్ల డిజైన్ గురించి, సర్వీస్ క్వాలిటీ వంటి వాటిపై విమర్శిస్తూ ట్వీట్ చేశారు. అంతే కాకుండా.. మీరు ఇప్పటికే ఉన్న కార్లు, సర్వీస్ సెంటర్లు, విడిభాగాల సమస్యలు, ఉద్యోగుల ప్రవర్తనలకు సంబంధించిన.. గ్రౌండ్ లెవల్ సమస్యలను ముందుగా పరిష్కరించుకోవాలని అన్నారు.మీ కార్ల డిజైన్స్ విషయానికి వస్తే.. అవన్నీ హ్యుందాయ్ కార్లకు సమీపంలో కూడా ఎక్కడా నిలబడలేవు. బీఈ 6ఈ కారు లుకింగ్ కూడా వింతగానే ఉందని పేర్కొన్నాడు. మీ డిజైన్ టీమ్ ఇలాగే ఆలోచిస్తోందా? లేదా మీకు డిజైన్ మీద సరైన అవగాహనా లేదా? అని విమర్శించాడు. అంతే కాకుండా మహీంద్రా కంపెనీ మాత్రమే కాకుండా.. టాటా కంపెనీ కూడా ప్రపంచ స్థాయి కార్లను తయారు చేయాలని ఆశిస్తున్నాను. కానీ నాకు ఇప్పటికీ నిరాశే మిగిలిందని అన్నాడు.దీనిపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. మీరు చెప్పింది నిజమే సుశాంత్. మనం చాలా దూరం వెళ్ళాలి. అయితే మనం ఎంత దూరం వచ్చామన్న విషయాన్ని కూడా ఆలోచించండి. నేను 1991లో కంపెనీలో చేరాను. అప్పుడే భారత్ ప్రపంచీకరణకు తలుపులు తెరిచింది. దేశంలోకి అడుగుపెట్టే కార్లు.. గ్లోబల్ బ్రాండ్లతో పోటీపడలేవని, ఈ రంగం నుంచి తప్పకోవాలని ఓ సంస్థ సలహా ఇచ్చింది. అయినప్పటికీ మేము మూడు దశాబ్దాలుగా కార్లను తయారు చేస్తూ.. అనేక ప్రపంచ బ్రాండ్ వాహనాలకు గట్టి పోటీ ఇస్తున్నాము. ఎటువంటి ఆత్మసంతృప్తికి మేము ఆస్కారం లేదు. నిరంతర అభివృద్ధి మా మంత్రంగా కొనసాగుతుంది. మమ్మల్ని మరింత రగిల్చినందుకు ధనవ్యవాదాలు.. అంటూ ట్వీట్ చేసారు.మహీంద్రా ట్వీట్ చూసిన నెటిజన్లు తమదైన రీతిలో స్పందించారు. ఆనంద్ మహీంద్రా సానుకూల ప్రతి స్పందనను కొనియాడారు. దేశంలో మారుతి సుజుకి, హ్యుందాయ్ బ్రాండ్ కార్ల కంటే మహీంద్రా, టాటా కార్లు చాలా సురక్షితమైనవి పేర్కొన్నారు.ఆనంద్ మహీంద్రా స్పందనకు సుశాంత్ మెహతా సైతం ఫిదా అయిపోయాడు. నేను చేసిన విమర్శను కూడా స్వీకరిస్తూ.. సమాధానం ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. నా ట్వీట్ చూసి మీ టీమ్ కాల్ చేసింది. వారు బహుశా హర్ట్ అయ్యి ఉంటారని నేను భావించాను. అందుకే ట్వీట్ డిలీట్ చేశా అని మరో ట్వీట్ ద్వారా పేర్కొన్నారు.OMG this is so sweet.I am glad you took the criticism constructively, I had to delete the tweet after a call from yiur team because I thought they are unhappy with the harsh words.— Sushant Mehta (@SkyBarrister) December 1, 2024 -
‘మా నగరానికి ఏమైంది’ : కాలుష్యంపై నెటిజన్ల ఆగ్రహం
సాక్షి, ముంబై: దేశరాజధాని ఢిల్లీ తీవ్ర వాయు కా లుష్యంతో ఇప్పటికే సతమత మవుతుండగా, ఇప్పు డు ముంబై కూడా అదే సమస్యను ఎదుర్కొంటోంది. గత కొన్ని రోజులుగా నగరంలో వాయునాణ్యత క్షీణిస్తుండటంతో పర్యావరణవేత్తలు, ముంబైవాసు లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘మా నగరా నికి ఏమైంది? దీనికి బాధ్యులెవరు?‘అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై ప్రశ్నలు సంధిస్తున్నారు. పరిస్థితిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. బహిరంగప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి ముంబైలోని అత్యంత కాలుష్య ప్రాంతాలుగా గుర్తించిన బాంద్రా – కుర్లా కాంప్లెక్స్, బైకుల్లా, శివ్డీ, కొలాబా, శివాజీనగర్ ప్రాంతాల్లో గాలి నాణ్యత క్రమేపీదిగజారుతుండటంతో ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలనెదుర్కొంటున్నారు. గుండె జబ్బులు, ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు, గొంతు నొప్పి, జలుబు, జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని డాక్టర్లు చెబుతున్నారు. కాలుష్య నియంత్రణకు సూచనలు.. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకుంటే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.నగరంలో కాలుష్య నియంత్రణకు పలు సూచనలు చేస్తున్నారుపరిశ్రమల నుంచి వెలువడే వాయు మలినాలను తగ్గించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవడం. ట్రాఫిక్ నియంత్రణ ద్వారా వాహన కాలుష్యాన్ని తగ్గించడం. పెద్ద ఎత్తున మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించడం. కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కఠినమైన నిబంధనలు అమలు చేయడం. -
నీ వెనుక నేనుంటా.. నెటిజన్ ప్రపోజల్‌కి సమంత ఎమోషనల్!
సమంత ప్రస్తుతం ‘సిటాడెల్: హనీ బన్నీ ’ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఇందులో భాగంగా ఆమె వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ముంబైతో పాటు పలు నగరాలు తిరుగుతూ వెబ్ సిరీస్‌ని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తోంది. ఒకవైపు మీడియాతో ముచ్చటిస్తూనే..మరోవైపు సోషల్ మీడియా ద్వారా అభిమానులను పకలరిస్తోంది.వీలున్నప్పుడల్లా నెట్టింట సందడి చేసే సామ్..తాజాగా తన ఫాలోవర్స్, అభిమానులతో మాట్లాడేందుకు ఇన్‌స్టాలో చిట్‌చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నెటిజన్స్ ఆమెకు పలు ప్రశ్నలు సంధించారు. వాటన్నింటికి ఎంతో ఓపికగా సామ్ సమాధానం చెప్పింది. ఇక ఓ నెటిజన్ అయితే సమంతపై తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తూ.. ‘నిన్ను చూస్తే గర్వంగా ఉంటుంది. నీకు తోడుగా ఎవ్వరు లేకపోతే.. ఆ సమయంలో నేను ఉంటా. ఐ లవ్ యూ సమంత’ అని కామెంట్ చేశాడు. నెటిజన్ ప్రపోజ్కి సమంత ఫిదా అయింది. మీ ప్రేమే నాకు బలం అంటూ ఎమోషనల్ అయింది. ‘సిటాడెల్’ భారీ అంచనాలుసమంత, బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కలిసి నటిచిన వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’. ‘దీ ఫ్యామిలీమేన్’ వెబ్ సిరీస్ ఫేమ్ రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ నవంబర్ 7 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ప్రియాంక చోప్రా నటించిన అమెరిక్ వెబ్ సిరీస్ ‘సీటాడెల్’కి ఇది ఇండియన్ వెర్షన్. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి భారీ స్పందన వచ్చింది. ప్యామిలీమేన్ తరహాలో ఈ వెబ్ సిరీస్ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని మేకర్స్ చెబుతున్నారు. ట్రైలర్ బట్టి చూస్తే.. ఇందులో సమంత భారీ యాక్షన్ సీన్స్ చేసినట్లు తెలుస్తోంది. భారీ అంచనాలతో వస్తోన్న ఈ వెబ్ సిరీస్ ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి. -
సమంత చిట్‌చాట్.. ఆ ప్రశ్నతో విసిగించిన నెటిజన్!
హీరోయిన్ సమంత ప్రస్తుతం సిటాడెల్ ఇండియన్ వర్షన్ హానీ:బన్నీతో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్‌కు జంటగా నటించింది. ఈ సిరీస్ త్వరలోనే ప్రేక్షకులను పలకరించనుంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లతో బిజీగా ఉన్న సమంత.. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా సమంతకు ఓ నెటిజన్ ఆసక్తికర ప్రశ్న వేశాడు. దయచేసి మీరు కాస్తా బరువు పెరగండి మేడమ్? అని అడిగాడు. అయితే ఈ ప్రశ్నకు సమంత సైతం స్పందించింది, తనదైన శైలిలో నెటిజన్‌కు ఇచ్చిపడేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.సమంత వీడియోలో మాట్లాడుతూ..'మళ్లీ అదే ప్రశ్న. నా బరువు గురించి నాకు అంతా తెలుసు.. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే.. ప్రస్తుతం నేను కఠినమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్లో ఉన్నా.. అందువల్లే నా బరువు నిర్దిష్టంగానే ఉంది. నా ఆరోగ్య పరిస్థితుల వల్ల ఇలానే ఉండాలి. దయచేసి ఇతరులను జడ్జ్ చేయడం ఆపండి. అవతలి వారిని కూడా జీవించనివ్వండి. ప్లీజ్ గాయ్స్.. ఇది 2024' అంటూ కౌంటర్ ఇచ్చింది. తనకు మరోసారి ఇలాంటి ప్రశ్న ఎదురైందని సమంత చెప్పుకొచ్చారు. దీంతో నెటిజన్‌కు కాస్తా ఘాటుగానే రిప్లై ఇచ్చేసింది. కాగా.. సమంత నటించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ఈ నెల 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడీయోలో స్ట్రీమింగ్ కానుంది. -
ద్రోహం తలపెట్టినా చూస్తూ ఉండిపోవాలా?
సాక్షి, అమరావతి: ఆనాడు పిల్లనిచ్చి.. పదవులిచ్చి.. పార్టీ నీడనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. నేడు ఆయన చేతిలో కీలుబొమ్మగా మారిన షర్మిల సొంత అన్న జగన్‌కే ద్రోహం తలపెట్టారు. స్వార్జిత ఆస్తుల్లో వాటా ఇస్తానన్న అన్న ప్రేమకు విలువ లేకుండా చేస్తూ, ఆయన బెయిల్ రద్దుకు శత్రువులతో కలిసి కుట్రలు చేస్తున్నారు.పెళ్లయిన 20 ఏళ్ల తరువాత, తండ్రి మరణించిన పదేళ్ల అనంతరం కూడా చెల్లికి ఆస్తులిచ్చేంత సహృదయం ఉన్న జగన్‌ను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. ఈ కుతంత్రాలను రక్తి కట్టించడం కోసం మీడియా ముందు దొంగ ఏడుపులతో డ్రామాలాడుతున్నారు. ఇదేనా వైఎస్సార్ బిడ్డ నైజం. ఇలాగేనా ఆ మహానేత కుమార్తె నడుచుకోవాల్సిన విధానం... అంటూ షర్మిలపై సోషల్ మీడియా వేదికలపై నెటిజన్లు మండిపడుతున్నారు. పబ్లిక్ పోస్టులతో దుమ్మెత్తి పోస్తున్నారు. వాటి సారాంశం ఇలా ఉంది.. భారతి పేరు ఉంది.. మీ పేరు లేదంటే ఏంటి అర్థం? ‘వాళ్ల పేర్లతో ఆస్తులు ఉంటే... నిజంగా వాళ్లవి అవుతాయా? నా పేరు మీద ఆస్తులు రాసి ఉంటే నేను ఎందుకు జైలుకి వెళ్లలేదు అంటున్నారు. అలా అయితే భారతి కూడా జైలుకు వెళ్లాలి కదా’ అని అంటున్న షర్మిలకు భారతి పేరు ఈడీ కేసుల్లో ఉందనే విషయం తెలియదా? మరి షర్మిల పేరు ఎందుకు లేదు. అంటే ఆ ఆస్తులతో షర్మిలకు సంబంధం లేదనే కదా అర్థం. ఎవరైనా తమ ఆస్తులకు వేరే వాళ్ల పేర్లు పెట్టుకుంటుంటే పోనీలే పేరు పెట్టుకుంటే ఏముందిలే అని ఊరుకుంటారా.? అవి జగన్ ఆస్తులు కాబట్టే వాళ్ల పేర్లు పెట్టుకున్నా దివంగత వైఎస్సార్ అభ్యంతరం చెప్పలేదనేది నిజం కాదా? చిన్నాన్నను అంత మాట మీరనొచ్చా? సొంత చిన్నాన్న అంటుంటే నా కళ్లలో నీళ్లు తిరిగాయని, నా బిడ్డలు నీ ముందు పెరగలేదా... అని సుబ్బారెడ్డిని ప్రశ్నించిన షర్మిల అదే చిన్నాన్నను జగన్ మోచేతి నీళ్లు తాగుతున్నారని, పదవులు ఇస్తే అనుభవిస్తున్నారని అనడం సమంజసమా. ఆయనపై అంత ప్రేమ ఉన్నప్పుడు కనీసం ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వకుండా అంత పెద్ద మాట ఎలా అనగలిగారు షర్మిలమ్మా.? చిన్నాన్న కాబట్టే, మొదటి నుంచీ జరుగుతున్న పరిణామాలను దగ్గరగా చూస్తున్నారు కాబట్టే సుబ్బారెడ్డి వాస్తవాలు మాట్లాడితే తట్టుకోలేక ఆయనను నిందించడమేనా మీ సంస్కారం. పైగా సాయిరెడ్డి, సుబ్బారెడ్డిలను పరీక్షించడం కోసం, వాళ్ల గురించి విజయమ్మకు తెలియడం కోసం లేఖలో వారి పేర్లు ప్రస్తావించారా? ఇప్పుడు మీరు వారిద్దరి గురించి విజయమ్మకు కొత్తగా చెప్పాలా..? విజయమ్మ క్షోభకు కారణం మీరే కదా? ‘సొంత కొడుకు తల్లిని కోర్టుకి ఈడ్చాడని, ఇలాంటి కొడుకును ఎందుకు కన్నాను.. పురిటిలోనే చంపేయాల్సింది అని ఆ తల్లి అనడం లేదని, ఇది చూడటానికా నేను ఇంకా బతికి ఉన్నాను’ అని విజయమ్మ ఏడుస్తోందని చెప్పుకొస్తున్నారు షర్మిల. విజయమ్మ ఈ మాటలు అన్నారో లేదో షర్మిలకే తెలియాలి. అయితే నిజానికి విజయమ్మను ఇంతటి క్షోభకు గురిచేస్తున్నది మాత్రం షర్మిలేనని స్పష్టంగా అర్థం అవుతోంది. ఆస్తుల కోసం షర్మిల పట్టుబట్టి తల్లిని, కొడుకుని వేరు చేయాలని ప్రయత్నిస్తుండటం విజయమ్మకు కడుపుకోత కాదా? కుమారుడి ప్రతి కష్టంలోనూ, ప్రతి విజయంలోనూ తోడున్న విజయమ్మను కూడా మీ కుట్రలకు వాడుకుంటారా..? బహుశా ఇలాంటి కూతురు నాకెందుకు పుట్టిందా అని విజయమ్మ బాధపడుతూ ఉండి ఉంటారు. ఒకసారి చేస్తే సరేగాని ప్రతి సారీ మీడియా ముందుకు వచ్చి దొంగ ఏడుపులు ఏడ్చేయడం షర్మిలకే చెల్లింది. చంద్రబాబును కాపాడాలనుకున్న ప్రతిసారీ ప్రెస్‌మీట్ పెట్టడం... కన్నీళ్లు పెట్టేసుకోవడం ఆమెకు బాగా అలవాటైపోయింది. ప్రజలపై రూ.6 వేల కోట్లకు పైగా విద్యుత్ చార్జీల భారం వేస్తే రాని కన్నీరు, వాస్తవాలను ఒప్పుకోలేక వస్తున్నాయంటేనే అర్థం అవుతోంది ఆమెకు ప్రజల మీద ఎంత ప్రేమో.. విద్యుత్ చార్జీల విషయంలో చంద్రబాబు, కూటమి సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత రాకూడదనేగా ఈ ఏడుపు డైవర్షన్లు? నిజమే.. జగన్ లాంటి అన్న ఎవరుంటారు? ఏ అన్న అయినా... చెల్లికి గిఫ్ట్ అంటే ఏ బంగారమో, చీరనో ఇస్తారని, అంతేకాని ఆస్తుల్లో 40 శాతం వాటా ఇస్తారా? నా హక్కు కాబట్టే నాకు ఇస్తామన్నారని షర్మిల అంటున్నారు. నిజమే ఆస్తి కోసం సొంత తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్కచెల్లెళ్లను నిర్ధాక్షిణ్యంగా చంపేస్తున్న రోజులివి. అలాంటి కలికాలంలోనూ చెల్లిలికి తన సొంత ఆస్తి నుంచి, కష్టార్జితం నుంచి వాటా ఇస్తాననే అన్న బహుశా ఒక్క జగన్ తప్ప ఎవరూ ఉండరేమో. అది కూడా ఆమెకు పెళ్లి జరిగిన 20 ఏళ్ల తరువాత, తండ్రి మరణించిన 10 ఏళ్లు అయిపోయాక అంటే నిజంగా చెల్లిలి మీద ఎంత ప్రేముంటే ఇంతటి నిర్ణయం తీసుకుంటారు..? పైగా అడగకుండానే ఎంవోయూ రాసిచ్చారని మీరే అంటున్నారంటే, అంత చిత్తశుద్ధి ఉన్న అన్న ఇంకెవరుంటారు. మీ లేఖను టీడీపీ విడుదల చేయడమేమిటి? ఐదేళ్లు ఎంవోయూ చేతిలో ఉన్నా ఏ మీడియాకు విడుదల చేయని షర్మిల.. అన్నకు రాసిన లేఖను మాత్రం టీడీపీ అధికారికంగా ఎలా విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ లేఖ, ఆమె కాకుండా టీడీపీ అధికారికంగా ఎలా బయటపెడుతుంది. అంటే కాంగ్రెస్, టీడీపీలు ఒక్కటేనని మీరే చెప్పినట్టు కాదా.? మీరు చేస్తున్నది ఏమిటి...? జగన్ సొంత లబ్ధి కోసం తల్లిని, చెల్లిని కోర్టుకి ఈడ్చారంటున్నారే మరి మీరు చేస్తున్నదేమిటి. మీ లబ్ధి కోసం, మీరు మోస్తున్న చంద్రబాబు లబ్ధి కోసం సొంత అన్న బెయిల్‌ను రద్దు చేయించి జైలుకు పంపాలనుకోవడం లేదా? ఇందుకోసం మీరు మీ తల్లి విజయమ్మను వాడుకోవడం లేదా..? దీన్నేమనాలి? మీరేం త్యాగాలు చేశారు? వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించడానికి మీ త్యాగాలు, కష్టమే కారణమా షర్మిల. మీరు పదేళ్లలో అన్న ఇచ్చిన రూ.200 కోట్లు తీసుకున్నారు. తండ్రి పంచి ఇచ్చిన ఆస్తులతో వ్యాపారాలు చేసుకున్నారు. అదేనా మీ త్యాగం? అన్నంటే ప్రాణం అంటూనే అన్న చేసిన సాయాన్ని మర్చిపోయి కుట్రలు చేయడమేనా మీ నైజం? మీరు సంపాదించుకున్న ఆస్తుల్లో జగన్ వాటా అడిగితే మీకెలా ఉంటుంది?. -
దయచేసి ఆ వీడియోని ఇప్పుడు వైరల్ చేయకండి: యాంకర్ రష్మి
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎక్కడా చూసినా దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే గత వారం నుంచి జానీ మాస్టర్ మ్యాటరే నడుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా యాంకర్ రష్మి ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. అయితే అది పాత వీడియో. గతంలో రష్మి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూని ప్రస్తుతం జానీ మాస్టర్ వ్యవహారంతో ముడిపెడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అది కాస్త వైరల్ కావడంతో చివరకు రష్మి ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ఆ ఇంటర్వ్యూని ఇప్పుడు వాడొద్దని విజ్ఞప్తి చేసింది.‘మైనర్‌పై లైంగిక వేధింపులు, క్యాస్టింగ్ కౌచ్‌కు చాలా వ్యత్యాసం ఉంది. క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇద్దరి వ్యక్తుల వ్యక్తిగత సమ్మతికి సంబంధించిన విషయం. నేను ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ(ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోను ఉద్దేశించి) చాలా పాతది. 2020 కంటే ముందే నేను ఆ ఇంటర్వ్యూ ఇచ్చాను. ఇప్పుడు ఆ వీడియోని వైరల్ చేస్తూ జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారు. దయచేసి ఆ వీడియోని వాడకండి. పని ప్రదేశాలు మహిళలకు సురక్షితంగా ఉండాలి. ఏదైనా విషయంలో ఒక మహిళ నో అని చెబితే ఆమె అభిప్రాయాన్ని గౌరవించాలి’అని రష్మి ట్వీట్ చేసింది.ఆ వీడియోలో ఏముందంటే..రష్మి గతంలో ఓ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్‌కౌచ్ గురించి మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలోనే కాదు అన్ని పరిశ్రమల్లోనూ మహిళలకు వేధింపులు ఎదురవుతున్నాయి. ఇలాంటివి ఎదురైనప్పుడు ‘నో’ చెప్పడం అమ్మాయిలు నేర్చుకోవాలి. నీకు చేయాలని లేకపోతే చేయలేనని చెప్పాలి. కొంతమంది అమ్మాయిలు త్వరగా ఉన్నత శిఖరాలకు వెళ్లాలని అలాంటివాటికి ఓకే చెబుతారేమో. ఎవరూ ఎవరిని బలవంతం చేయరు. దాన్ని రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. అత్యాచారానికి పాల్పడితే అది తప్పు’ అని రష్మిక అన్నారు. ఈ వీడియోని ఇప్పుడు షేర్ చేస్తూ.. జానీ మాస్టర్ వివాదంపై రష్మిక ఇలా స్పందించింది అంటూ వైరల్ చేస్తున్నారు. Sexually exploiting a minor is different from cast and couch where two adults might have given consent to an individual choice Pls do not use this interview now and mislead audience This interview was taken way before 2020 Work place shud be comfortable and and when a girl… https://t.co/zexu8Xeohu— rashmi gautam (@rashmigautam27) September 25, 2024 -
నాలుగేళ్ల క్రితం నివాళి అర్పించా.. దయచేసి ఆమెను అవమానించొద్దు: అనసూయ కౌంటర్!
టాలీవుడ్ నటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టి తెలుగులో స్టార్ నటిగా ఎదిగింది. ప్రస్తుతం ఆమె పుష్ప-2 ది రూల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వస్తోన్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో థియేటర్లలో సందడి చేయనుంది. అయితే సినిమాలతో ఎప్పుడు బిజీగా ఉండే ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లోనే ఉంటోంది.తాజాగా అనసూయ ఓ టీవీ షోలో అనసూయ ప్రదర్శనకు సంబంధించిన ఓ వీడియోను నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇది చూసిన మరో ఆ వీడియోపై ట్రోలింగ్ చేశాడు. దీనిపై అనసూయ రియాక్ట్ అయింది. ఇకపై దేనికి స్పందించకూడని నిర్ణయించుకున్నాని ఆమె తెలిపారు. కానీ.. మహానటికి నివాళులర్పించిన తన వీడియోను అవమానించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.అనసూయ ట్వీట్లో రాస్తూ. 'నేను దేనికీ స్పందించకూడదని నిర్ణయించుకున్నా. కానీ నాలుగేళ్ల క్రితం ఒక ఛానెల్లో జరిగిన ఒక పండుగ కార్యక్రమంలో మహానటి సావిత్రమ్మకు నివాళులు అర్పించా. నా ప్రదర్శన పట్ల నాకు గౌరవంగా భావిస్తున్నా. కానీ మీరు ఇలా అవమానకరమైన రీతిలో ట్రోల్ చేయడం మంచిది కాదు. ఏదైనా నా గురించి గౌరవప్రదమైన విమర్శలు చేస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా. కానీ ఇది మహానటి సావిత్రిమ్మకు నివాళిని ఉద్దేశించి ఇలా చేయడం అగౌరవంగా అనిపిస్తోంది. దయచేసి ఈ ఈవెంట్లో నా పూర్తి ప్రదర్శనను చూసి ఆపై జడ్జ్ చేయమని సూచిస్తున్నా. కావాలంటే ఈ ప్రోగ్రామ్ జీ5లో అందుబాటులో ఉంది. ఇక్కడ నా నటన మీకు నచ్చవచ్చు లేదా నచ్చకపోవచ్చు. కనీసం లెజెండ్ అయినా సావిత్రమ్మ కోసమైనా ఇలాంటి ట్రోల్స్ చేయకండి. ఎప్పటిలాగే నాపై విమర్శలు చేయాలనుకుంటే చేస్కోండి' అంటూ అతనికి చురకలు అంటించింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Hello Teju! Hope you are well!! I decided for my own peace not to react on anything mean.. but I have been seeing this particular bit of my performance giving a tribute to the Mahanati Savithramma for one of the festival events on a channel 4 years back.. using it in a very… https://t.co/u05s1L16oG— Anasuya Bharadwaj (@anusuyakhasba) July 15, 2024 -
'గాడిద గుడ్డేం కాదు'.. నెటిజన్‌కు ఇచ్చిపడేసిన విశ్వక్ సేన్!
టాలీవుడ్ యంగ్ విశ్వక్ సేన్ ఇటీవలే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో అలరించాడు. ఇటీవల థియేటర్లలో రిలీజైన బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇప్పుడు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. జూన్ 14న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.అయితే విశ్వక్ సేన్ ప్రస్తుతం మెకానిక్ రాకీ చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీని ఉద్దేశించి ఓ నెటిజన్ ట్వీట్ చేసింది. ఈ మూవీ రైట్స్‌ను దక్షిణాది రాష్ట్రాల్లో కేవలం రూ.8 కోట్లకే అమ్మినట్లు పోస్ట్ చేసింది. అది కూడా జీఎస్టీతో కలిపి అంటూ పోస్ట్ పెట్టింది. అయితే ఇది చూసిన విశ్వక్ సేన్ తనదైన శైలిలో నెటిజన్‌కు ఇచ్చిపడేశాడు.'గాడిద గుడ్డేం కాదు.. టీ షాపు ముచ్చట్లు తీసుకొచ్చి ట్విటర్లో పెట్టొద్దు. మెకానికి రాకీ చిత్రానికి సంబంధించిన ఇంకా ఎలాంటి విక్రయాలు జరగలేదు. మీరు కాస్తా వాస్తవాలను తెలుసుకోండి. ఇదంతా ఓ టీమ్ కెరీర్‌కు సంబంధించింది' అంటూ నెటిజన్‌కు అదిరిపోయే రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. Donkey egg em kadhu . With gst anta 😂 tea shop muchatlu theeskochi tweeter lo pettodhu priyaji. #mechanicrocky was never sold yet ! Get facts right . Its teams career— VishwakSen (@VishwakSenActor) June 12, 2024 -
జాన్వీ కపూర్ వీడియోపై కామెంట్.. ఇచ్చిపడేసిన హీరోయిన్!
బాలీవుడ్ భామ జాన్వీకపూర్ మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా ఈ రోజే థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రంలో రాజ్‌కుమార్ రావుకు జంటగా నటించింది. ఈ సినిమాలో మహిమ పాత్రలో మెరిసింది. అయితే ఇటీవల ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసిన సంగతి తెలిసిందే. అందులో తన భూజానికి గాయమైనట్లు కనిపించింది. ఇది చూసిన ఫ్యాన్స్ నటనపై తన అంకితభావాన్ని కొనియాడారు.అయితే ఈ వీడియో చూసిన ఓ నెటిజన్ జాన్వీ కపూర్‌ను ట్రోల్ చేశాడు. టెన్నిస్‌బాల్‌తో ఆడిన క్రికెట్లో కూడా మీకు గాయమైందా? అంటూ నవ్వుతున్న ఎమోజీలను పెట్టారు. అయితే ఇది చూసిన జాన్వీ కపూర్ సైతం అతనికి అదిరిపోయే రిప్లై ఇచ్చింది. తనకు సీజన్ బాల్‌తో ఆడుతుండగానే గాయమైందని.. అందుకే టెన్నిస్ బాల్‌తో ఆడాల్సి వచ్చింది. నా భుజాలకు ఉన్న బ్యాండేజ్‌లను చూస్తే ఆ విషయం మీకు అర్థమవుతుందంటూ రాసుకొచ్చింది. ఇలాంటి వాటిపై కామెంట్ చేసే ముందు ఒకసారి వీడియో మొత్తం చూడండి.. అప్పుడు మీ జోక్స్‌కు నేను కూడా నవ్వుతా అంటూ కౌంటర్ ఇచ్చిపడేసింది. దీంతో దెబ్బకు సారీ జాన్వీ మేడమ్.. అంటూ రిప్లై ఇచ్చాడు. కాగా.. 'మిస్టర్ అండ్ మిసెస్ మహి' చిత్రాన్ని కరణ్ శర్మ డైరెక్షన్లో తెరకెక్కించారు. అభిమానుల అంచనాల మధ్య మే 31 థియేటర్లలో విడుదలైంది. కాగా.. జాన్వీ కపూర్ టాలీవుడ్లో దేవర చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
అందాల హీరోయిన్ వెజిటబుల్ సూప్ రెసిపీ, నెటిజన్లు ఏమన్నారంటే!
ప్రేమ పావురాలు సినిమాతో యువతరం మనసు దోచుకున్న భాగ్యశ్రీ గుర్తుందా. ఆ తరువాత సెకండ్ ఇన్నింగ్స్‌లో తెలుగులో ప్రభాస్ మూవీ రాధేశ్యామ్‌లో కూడా కనిపించింది. 2.3 మిలియన్ల ఫాలోయర్లతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే భాగ్యశ్రీ రెసిపీలు, తన బ్యూటీ సీక్రెట్స్‌ను పంచుకుంటూ ఉంటుంది. తాజాగా సింపుల్‌గా తయారు చేసుకునే వెజిటబుల్ సూప్ గురించి ఒక వీడియో పోస్ట్ చేసింది. ఇది ప్రస్తుతం వైరల్ గా మారింది. View this post on Instagram A post shared by Bhagyashree (@bhagyashree.online)వెజిటబుల్ సూప్: క్యారట్, కాప్సికమ్, ఫ్రెంచ్బీన్స్, వెన్న, మైదా కార్న్ ఫ్లోర్, పాలు, చీజ్ సాయంతో సూప్ తయారు చేసింది. దీనికి కొద్దిగా పెప్పర్, చిల్లీ సాస్ యాడ్ చేసి చీజ్‌తో గార్నిష్ చేసింది.అయితే దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. మైదా, మొక్కజొన్న పిండి, వెన్న ఆరోగ్యానికి మంచిది కాదని ఒకరు కమెంట్ చేశారు. అలాగే మైదాకు బదులుగా గోధుమ పిండి లేదా జొన్న పిండి లేదా రాగి పిండిని ఉపయోగిస్తే మంచిదని, మొక్కజొన్న పిండిని ఎవాయిడ్ చేయవచ్చు అని కూడా మరొకరు సూచించారు. -
స్టార్ హీరోయిన్ను పట్టించుకోని డెలివరీ బాయ్.. నెటిజన్ల ప్రశంసలు!
ఎవరైనా సెలబ్రిటీ మనకు ఎదురైతే చాలు. సెల్ఫీల కోసం ఎగబడే కాలం ఇది. ఇక పొరపాటున స్టార్స్ హీరోయిన్స్, హీరోలు కనపడితే ఇంక అంతే. సెల్పీ కోసం క్యూ కడతారు. అలాంటి ఈ రోజుల్లో ఓ డెలివరీ బాయ్ చేసిన పని నెట్టింట తెగ వైరలవుతోంది. అసలేం అతను ఏం చేశాడు? ఎందుకు అంతలా హాట్ టాపిక్‌గా మారిందో తెలుసుకుందాం.తాజాగా ముంబయిలోని ఓ సెలూన్ నుంచి స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను బయటకొచ్చింది. దీంతో ఆమె అక్కడే వేచి ఉన్న ఫోటోగ్రాఫర్స్ ఫోటోలు తీసేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో ఓ ఫుడ్ డెలివరీ బాయ్ అనుకోకుండా అదే సమయంలో సెలూన్ లోపలికి వెళ్తూ కనిపించారు. అతనికి ఎదురుగా హీరోయిన్ తాప్సీ వస్తున్నప్పటికీ అసలు ఆమెను పట్టించుకోకుండా తన పనేంటో చూసుకుంటూ వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్స్ జరుగు అంటూ గట్టిగా అరిచినా ఎవరినీ లెక్కచేయకుండా సైలెంట్‌గా లోపలికి వెళ్లిపోయాడు. దీంతో ఆ డెలివరీ బాయ్‌పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అతని డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అతను తన పని పట్ల అంకితభావంతో ఉన్నాడంటూ మరొకరు రాసుకొచ్చారు. అతన్ని చూస్తుంటే సంతోషంగా ఉందంటూ మరో నెటిజన్ పోస్ట్ చేశారు. అతనికి కంపెనీ ప్రోత్సాహం ఇవ్వాలని కొందరు సూచించారు.ఆ తర్వాత తాప్సీ తన కారులో ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయింది. కాగా.. ఈ ఏడాది మార్చిలో తాప్సీ తన చిరకాల ప్రియుడు, బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోయ్ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. దాదాపు 13 ఏళ్ల పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు రాజస్తాన్‌లోని ఉదయపూర్‌లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇక సినిమావ విషయానికొస్తే ఖేల్ ఖేల్ మే, ఫిర్ అయి హసీన్ దిల్రుబాలో తాప్సీ కనిపించనుంది.Hey @Swiggy, this delivery partner deserves an incentive for his dedication!! 😬😂pic.twitter.com/8MM6RfDZ2V— Divya Gandotra Tandon (@divya_gandotra) May 19, 2024 -
పవన్‌కు వీళ్లా స్టార్ క్యాంపెయినర్లు!
పెళ్లి కార్డు చూసి.. అందులోని కుటుంబాలు.. బంధువుల తీరు చూసి అది ఎంత గొప్ప సంబంధమో చెప్పేయొచ్చు. సినిమా పోస్టర్‌లోని పేర్లు చూసి.. అంటే హీరో హీరోయిన్లు.. డైరెక్టర్.. మ్యూజిక్.. విలన్స్.. ఇతర టెక్నీషియన్స్‌ను చూసి అది ఎలాంటి కాంబినేషలో చెప్పేయొచ్చు. క్రికెట్ టీమ్ లోని సభ్యులను బట్టి ఆయా జట్టు ఎంత బలమైందో ఒక అంచనాకు రావచ్చు. అదే విధంగా ఒక రాజకీయ పార్టీ తానూ ఎంపిక చేసుకున్న అభ్యర్థులను బట్టి.. దానికోసం ఆ పార్టీ చేసిన కసరత్తును బట్టి.. ప్రచార శైలిని బట్టి దానికి రాజకీయాలు అంటే ఎలాంటి అభిప్రాయం ఉంది.. ఆ పార్టీ గమనం ఎలా ఉంటుందో చెప్పవచ్చు. అందుకే పెద్దలు కాళ్ళు తొక్కినపుడే కాపురం కళ తెలిసిపోతుందని అనేవాళ్ళు. ఇప్పుడు ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో జనసేన ప్రకటించిన అభ్యర్థుల ప్రొఫైల్స్ చూసి ప్రజలు.. కార్యకర్తలు నీరుగారిపోగా ఇప్పుడు ఆ పార్టీ తరఫున ప్రచారం చేసే ప్రధాన ప్రచారకర్తలు (స్టార్ క్యాంపెయినర్లను) చూసి కూడా జనం నివ్వెరపోతున్నారు. మొత్తానికి జబర్దస్త్ నటులతో ఈ 2024 ఎన్నికల స్కిట్ పూర్తి చేస్తావ్ అన్నమాట. రాజకీయాలంటే మీ @JanaSenaParty కి అంత కామెడీ అయిపోయాయి! ప్రజాసేవ మీ దృష్టిలో కామెడీ అయిపోయింది. ఇక మీకు రాజకీయాలెందుకు, డైలీ డబ్బులు వచ్చే కామెడీ స్కిట్లు, సినిమా కాల్షీట్లు చూసుకోండి! #PackageStarPK… https://t.co/4Sh27uDfyq — YSR Congress Party (@YSRCParty) April 10, 2024 వాస్తవానికి ఏదైనా పార్టీ తరఫున ప్రముఖ రాజకీయ నాయకుడు.. లేదా పెద్ద క్రీడాకారుడు.. సినిమా స్టార్లను స్టార్ క్యాంపెయినర్లుగా పెట్టుకుంటారు కానీ, జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం జబర్దస్త్.. ఇతర టీవీ షోల్లో కామెడీ కార్యక్రమాలు వేసే కామెడియన్లను స్టార్ క్యాంపెయినర్లుగా ప్రకటించారు. డాన్స్ మాస్టర్ జానీ.. హైపర్ ఆది.. గెటప్ శీను, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి ఇలాంటివాళ్లను స్టార్ క్యాంపెయినర్లుగా పెట్టుకుని రాజాకీయ ప్రచారం చేస్తున్నారు. అసలు వాళ్లకు రాజకీయాలు గురించి ఏమైనా తెలుసా? వాళ్లకు కనీస అవగాహనా అయినా ఉందా.? అసలు ఆ పార్టీని నెత్తినపెట్టుకుని మోయాల్సిన అవసరం.. ఆ జనసేనకు వత్తాసు పలకాల్సిన అవసరం వాళ్లకు ఏముందనున్నది అర్థం కానీ విషయం. ఇక పార్టీలో కేవలం చందాలు వసూళ్లకు మాత్రమే ముందుకు వచ్చే నాగబాబు ఎక్కడా ప్రచారసభల్లోకి వెళ్లడం లేదు. పోనీ జనసేన పోటీ చేస్తున్న చోట్ల కూడా నాగబాబు ప్రచారం చేయడం లేదు. ఇదిలా ఉండగా కేవలం కొద్దిమంది టీవీ ఆర్టిస్టులు మినహా పవన్ వెంట ఎవరూ కనిపించడం లేదన్నది మరోమారు స్పష్టమైంది. పవన్‌కు రాజకీయాలు అంటే ఎలాంటి అభిప్రాయం.. ఎలాంటి దృక్పథం ఉందన్నాడో ఈ ప్రచార కమిటీ చూస్తే తెలుస్తోందని అప్పుడే సోషల్ మీడియాలో పోస్టులు హోరెత్తుతున్నాయి. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం తమ ప్రభుత్వంలో ప్రయోజనాలు పొందినపేదలు, లబ్దిదారులే తమ పార్టీకి స్టార్ క్యాంపెయినర్లు అంటున్నారు. -సిమ్మాదిరప్పన్న -
విజయ్ సింపతీ డైలాగులు.. నేనూ తెలంగాణ బిడ్డనే అన్న అనసూయ
గతేడాది విమానం చిత్రంతో అలరించిన అనసూయ.. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప-2 చిత్రంలో నటిస్తోంది. యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ టాలీవుడ్లో స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. రంగస్థలం, పుష్ప చిత్రాలు ఆమె కెరీర్‌ను మరో రేంజ్‌కు తీసుకెళ్లాయి. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే ముద్దుగుమ్మ.. అప్పుడప్పుడు కాంట్రవర్సీ కామెంట్స్ కూడా చేస్తూ ఉంటుంది. తాజాగా ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు అనసూయ తనదైన స్టైల్లో స్పందించింది. మీకు, నాకు ఎలాంటి రిలేషన్ లేదంటూనే కాస్తా వ్యంగ్యంగానే ఇచ్చిపడేసింది. ఇంతకీ అసలేం జరిగింది? అనసూయ ఎందుకు రియాక్ట్ అయిందో మీరు కూడా చూసేయండి. అనసూయ తన ట్వీట్లో రాస్తూ.. 'ఎందుకు కార్తీక్ అస్తమానం నన్ను లాగుతారు. ఎవరు ఏం మాఫియా చేస్తున్నారో నేను ఎప్పుడో చెప్పి చెప్పి వదిలేశాను. అనవసరంగా నేనే హైప్ ఇస్తున్నానని మా వాళ్లు అంటుంటే నిజమేనేమో అని వదిలేశాను. నేను కూడా తెలంగాణ బిడ్డనే. కానీ నాకు సింపతి అక్కర్లేదు. నాకు నా మీద నమ్మకం. నా దేవుడి మీద నమ్మకం. మా అమ్మ, నాన్నలు నాకిచ్చిన విలువలు, పెంపకం నన్ను నా దృష్టిలో ఎప్పుడు దిగజారనివ్వవు. ఇప్పుడు ఈ ట్వీట్‌ను కూడా తమ స్వార్థానికి వాడుకున్న నేను ఆశ్చర్యపోను. కానీ నాకు, వాళ్లకి ఎటువంటి సంబంధం అప్పుడు లేదు.. ఇప్పుడు లేదు.. అన్నట్లు నాకు తెలిసి మీరు, నేను చుట్టాలం అస్సలు కాదండి. సో నేను నీకు ఆంటీ కానేమో.. అయినా ఒకసారి మీ ఇంట్లో అడగండి. మీకు తెలియకుండా ఏమైనా రిలేషన్స్ ఉన్నాయోమో?.. ఎందుకంటే నాకు చుట్టాలైతేనే ఆ పలకరింపులు ఉంటాయని మా పెద్దలు నేర్పించారు. ఏదేమైనా మీరు అంతా మంచే జరగాలి అండి.' అంటూ పోస్ట్ చేసింది. అసలేం జరిగిందేంటే.. తాజాగా ఓ నెటిజన్ విజయ్ దేవరకొండను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో అనసూయను ఆంటీ అని ప్రస్తావించాడు. ఇది చూసిన అనసూయ తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చేసింది. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనసూయ, విజయ్ ఫ్యాన్స్‌కు కోల్డ్ వార్ కాగా.. గతంలో సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కి తనకు మధ్య జరిగిన ట్విటర్ వార్‌పై కూడా అనసూయ భరద్వాజ్ స్పందించింది. విజయ్ దేవరకొండ డబ్బులిచ్చి మరి నన్ను తిట్టించాడని తెలిసి చాలా బాధ పడ్డానని ఆమె పేర్కొంది. గతంలో విమానం సినిమా సక్సెస్ మీట్లో మాట్లాడుతూ.. నాకు పీఆర్ టీమ్ లేదు. ఏదైనా నేనే మాట్లాడుతా.. ట్వీట్స్ కూడా నేనే చేశా. కానీ ఇకపై ఈ వివాదానికి దూరంగా ఉండాలనుకుంటున్నా.. అని అనసూయ చెప్పుకొచ్చింది. కాగా.. గతంలోనే అనసూయ, విజయ్ ఫ్యాన్స్ మధ్య కోల్డ్ వార్ జరిగిన సంగతి తెలిసిందే. Yenduku Karthik garu astamaanam nannu laagutaaru.. evaru em mafia chestunnaro nenu yeppudo cheppi cheppi odilesanu.. anavasaranga nene hype istunnanani na vaallu antunte nijamenemo ani odilesanu..nenu kuda telangana biddane.. kaani naaku sympathy akkarledu.. naku naa meeda… https://t.co/JhIdIBBM32 — Anasuya Bharadwaj (@anusuyakhasba) April 4, 2024 -
షారుఖ్ రూ. 5 కోట్ల లగ్జరీ వాచ్ : నెటిజన్ల జోక్స్ వైరల్
గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. గత కొన్నేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ల కొద్దీ అభిమానుల ఫాలోయింగ్, కోట్లాది రూపాయల సంపద, ఖరీదైన వస్తువులు, లగ్జరీ లైఫ్ ఆయన సొంతం. తాజాగా కింగ్ ఖాన్ లగ్జరీ వాచ్ వార్తల్లో నిలిచింది. నీలిరంగు Audemars Piguet చేతి గడియారం దాని ధర చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. దీని ధర సుమారు . 5 కోట్లు. అయితే ఈ వాచ్ ధరపై నెటిజన్లు కమెంట్లు హాట్‌టాపిక్‌గా లిచాయి ఆడెమర్స్ పిగెట్ బ్రాండ్‌కు చెందిన రాయల్ ఓక్ వాచ్‌ను తన బ్లాక్‌బస్టర్ మూవీ పఠాన్ ప్రమోషన్ సమయంలో దీన్ని ధరించి అందర్నీ విస్మయ పర్చిన సంగతి తెలిసిందే. దీని డెలివరీ కోసం రూ. 8 వేలకు చెల్లించాడంటేనే దీని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. ఆడెమర్స్ వెబ్సైట్ ప్రకారం ఇది బ్లూ-హ్యూడ్ స్టార్రి-నైట్ పీస్. ఇదిచాలా లిమిటెడ్ వెర్షన్ కూడా. ఈ వాచ్ డిజైన్, బిల్డ్ విషయాలను గమనిస్తే..ఇందులో నాలుగు డయల్స్ ఉంటాయి. ఇందులో సమయంతోపాటు, నెలలు, రోజులు తదితర వివరాలు కూడా ఉంటాయి. దుబాయ్‌లో జరిగిన ఇంటర్నేషనల్ T20 సందర్భంగా కూడా ఈ వాచ్‌తో దర్శమనిచ్చాడు షారుఖ్. అయితే దీన్ని కొంతమంది అభిమానులు వెరైటీగా స్పందించారు. రూ. 500 అయితే ఏంటి, 5 కోట్లు చూపించే టైం ఒకటేగాఅని ఒకరు, మీషో, షాప్సీ వంటి ఆన్లైన్ షాపింగ్ పోర్టల్స్‌లో 200 రూపాయలకే దీన్ని కొనుక్కోవవచ్చు. అంతేకాదు ఇంతకంటే మంచి వాచ్‌లు దొరుకుతాయంటూ వ్యాఖ్యానించడం విశేషం.షారుఖ్ ఖాన్ ఆడెమర్స్ పిగ్యెట్ రాయల్ ఓక్ వాచెస్ కలెక్షన్లో ఖరీదైనది మరొకటి కూడా ఉంది. నీతా అంబానీ నేతృత్వంలోని ఎన్ఎంఏసీసీ ఈవెంట్లో కింగ్ ఖాన్ దీన్ని ధరించాడు. దీని ధర రూ. 31.1 లక్షలు. -
గాయకుడి అంత్యక్రియల్లో సెల్ఫీ పిచ్చి: ‘కొంచెమైనా సిగ్గుండాలి’!
స్మార్ట్ యుగంలో సెల్ఫీలకున్న క్రేజ్అంతా ఇంతా కాదు. సెలబ్రిటీలు కనిపిస్తే చాలు సమయం, సందర్భం చూసుకోకుండా.. పిచ్చి పట్టినట్టుగా వ్యవహరిస్తారు. దివంగత ప్రముఖ గజల్ గాయకుడు పంకజ్ ఉధాస్ అంత్యక్రియల సమయంలో జరిగిన ఘటన దీనికి తాజాగా ఉదాహరణ. అనారోగ్యంతో సోమవారం (ఫిబ్రవరి 26న) కన్నుమూసిన పంకజ్ ఉధాస్కు నివాళులు అర్పించేందుకు ఆయన నివాసానికి తరలి వెళ్లారు. తెల్లని దుస్తుల్లో అక్కడున్న వారంతా విషణ్ణ వదనాలతో ఆయన ఆత్మశాంతికోసం ప్రార్థిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నటి విద్యాబాలన్ అభిమాని ఒకరు సెల్పీ కోసం వెంటబడటం అందరి దృష్టినీ ఆకర్షించింది. విద్య ఫ్యాన్ ఒకరు ఆగకుండా విద్యతో కలిసి తన ఫోన్‌ని చేతిలో పెట్టుకుని సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించాడు. పదే పదే వారిస్తున్నా వినకుండా... వెంటబడ్డాడు. అయితే దీనికి ఏమీ స్పందించకుండా, మౌనంగా అక్కడినుంచి వెళ్లిపోయారు విద్యా బాలన్. కొంతమంది విద్యా బాలన్ ప్రవర్తనను కొనియాడగా, మరికొందరు నెటిజన్లు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కొంచెమైనా సిగ్గుండాలి’’ అంటూ ఫ్యాన్‌పై మండిపడ్డారు. View this post on Instagram A post shared by Snehkumar Zala (@snehzala) కాగా గజల్ మేస్ట్రో అస్తమయంపై యావత్ సంగీత ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులతోపాటు తమ అభిమాన గాయకుడిని కడసారి దర్శించు కునేందుకు పలువురు ప్రముఖులు ఆయన నివాసానికి తరలి వచ్చారు. సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను, గౌరవాన్ని సంపాదించుకున్న నటి విద్యా బాలన్ కూడా పంకజ్ పార్థివ దేహాన్ని దర్శించి నివాళులర్పించారు. విద్యతో పాటు, శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్, సునీల్ గవాస్కర్ మంగళవారం ఆయనకు అంతిమ నివాళులర్పించారు. -
నెటిజన్లకు పూనకాలు తెప్పిస్తోన్న సాంగ్..ప్రముఖ వ్యాపారవేత్త ఫిదా!
ఏదైనా కొత్త సాంగ్ వచ్చిందంటే చాలు సంగీత ప్రియులకు పండగే. చిన్న జానపద పాటల నుంచి సినిమాల పాటల వరకు కనెక్ట్ అవుతారు. భాషతో సంబంధం లేకుండా కాలు కదిపేస్తారు. అలా గతంలో చాలా సాంగ్స్ సినీ ప్రేక్షకులను ఓ ఊపు ఉపేశాయి. తాజాగా ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ సాంగ్ నెటిజన్లకు పూనకాలు తెప్పిస్తోంది. ఎక్కడ చూసినా ఆ పాటకు స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఈ సాంగ్‌కు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం 'గులాబీ షరారా' అనే ఉత్తరాఖండ్ పాట సోషల్ మీడియాను ఊపేస్తోంది. ప్రముఖ సింగర్ ఇందర్ ఆర్య రూపొందించిన మెలోడీ సాంగ్ ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ విషయాన్ని ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంక సైతం ట్వీట్ చేశారు. ఉత్తరాఖండ్‌కు చెందిన ఈ సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోందని.. ప్రతి ఒక్కరూ ఈ పాటను ఎంజాయ్ చేస్తున్నారంటూ రాసుకొచ్చారు. పాఠశాల పిల్లల నుంచి పెద్దల వరకు డ్యాన్స్ రీల్స్‌ను ఆయన ట్విటర్లో పంచుకున్నారు. అయితే ఈ సాంగ్ యూట్యూబ్‌లో రిలీజై నాలుగు నెలలైనా క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. Here it is my Daughter Adyaa Raj is practicing with the same song. pic.twitter.com/lcqiRstUgY — Raj Nayak (@RajNaya50858983) December 26, 2023 Sir such is the craze that my wife and sil(twin sisters) danced to it in Rishikesh. pic.twitter.com/vJSPZHaQ3H — Joy Sanyal,MD, DM, (@JoySanyal74) December 26, 2023 This Uttarakhandi song has gone viral. I hope you enjoy its beat as much as I do! pic.twitter.com/uEvMDvKTOE — Harsh Goenka (@hvgoenka) December 26, 2023 -
'మీకు మలబద్ధకం అనుకుంటా.. మందులు పంపిస్తా'.. షారుక్ ఖాన్ అదిరిపోయే రిప్లై!
ఈ ఏడాది పఠాన్, జవాన్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేసుకున్న బాలీవుడ్ బాద్షా మరో హిట్ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. డీంకీ పేరుతో ఈ ఏడాది క్రిస్మస్ పండుగకు అభిమానులను పలకరించబోతున్నారు. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకులు ముందుకు రానుంది. అయితే మూవీ విడుదలకు ముందు నెటిజన్స్‌తో చిట్ చాట్ నిర్వహించడం మన స్టార్ హీరోకు అలవాటు. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ట్విటర్లో ముచ్చటించారు షారుక్. అయితే ఈ సందర్భంగా షారుక్ ఖాన్‌కు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఓ నెటిజన్ రాస్తూ.. ' మీ పీఆర్ టీమ్ బాగా పని చేయడం వల్లే పఠాన్, జవాన్ సినిమాలు సక్సెస్ అయ్యాయి కదా సార్. అలాగే డంకీ సినిమాకు కూడా అలాగే బ్లాక్ బస్టర్ అవుతుందంటారా? అని ప్రశ్నించాడు. అయితే దీనికి షారుక్ ఖాన్ కాస్తా వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు. షారుక్ రిప్లై ఇస్తూ..'సాధారణంగా మీలాంటి తెలివైన వారికి నేను సమాధానం చెప్పను. కానీ మీ విషయంలో మాత్రం మినహాయింపు ఇస్తున్నా. ఎందుకంటే మీరు మలబద్ధకం కోసం చికిత్స తీసుకోవాల్సి ఉందని నేను భావిస్తున్నా. నా పీఆర్ బృందానికి కొన్ని మంచి మందులు నీకు పంపమని చెబుతా...మీరు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా' అంటూ తనదైన శైలిలో ఇచ్చిపడేశాడు. కాగా.. హ్యాట్రిక్ లక్ష్యంగా షారుక్ 'డంకీ' సినిమాతో ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ చిత్రంలో షారుక్‌తో పాటు విక్కీ కౌశల్, తాప్సీ కీలక పాత్రల్లో నటించారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. అదే బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ సలార్‌తో పోటీ పడి నిలుస్తోందో లేదో వేచి చూడాల్సిందే. డంకీ రిలీజైన తర్వాత రోజే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తోన్న సలార్ విడుదల కానుంది. Normally I don’t answer amazingly intelligent people like you. But in your case I am making an exception because I feel you need to be treated for constipation. Will tell my PR team to send you some golden medicines…hope u recover soon. https://t.co/FmKfCZxmyp — Shah Rukh Khan (@iamsrk) December 6, 2023 -
లో దుస్తులపై అసభ్యకర కామెంట్.. నెటిజన్‌కు ఇచ్చిపడేసిన హీరోయిన్!
ప్రస్తుతం సోషల్ మీడియాలో మంగళవారం మూవీ గురించే తెగ ట్రెండ్ అవుతోంది. ఆర్ఎక్స్100 పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇటీవలే థియేటర్లలో రిలీజైన మంగళవారం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తనకు తొలి ఛాన్స్ ఇచ్చిన అజయ్ భూపతి దర్శకత్వంలోనే ఆమె నటించింది. పాయల్ ప్రధాన రోల్లో తెరకెక్కించిన ఈ చిత్రం నవంబరు 17న సినిమా థియేటర్లలో రిలీజైంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్లతో దూసుకెళ్తోంది. (ఇది చదవండి: నన్ను హీరో చేసింది తెలుగు డైరెక్టరే.. అనిల్ కపూర్ ఆసక్తికర కామెంట్స్!) అయితే సోషల్ మీడియాలో పాయల్ రాజ్‌పుత్‌పై రోజుకు ట్రోల్స్ వస్తున్నాయి. తాజాగా ఓ నెటిజన్ చేసిన అసభ్యకర కామెంట్స్‌కు తనదైన శైలిలో ఇచ్చిపడేసింది. మంగళవారం చిత్రంలోని ఓ సీన్ క్లిప్‌ను ట్విటర్లో షేర్ చేసిన నెటిజన్ చాలా నీచంగా పోస్ట్ పెట్టాడు. ఆమె లో దుస్తులపై దారుణంగా కామెంట్స్ చేయడంతో దీనికి పాయల్ రియాక్ట్ అయింది. పాయల్ రాజ్‌పుత్ ఏమాత్రం భయపడకుండా గట్టిగానే కౌంటరిచ్చింది. అది నాది కాదు.. ప్రొడక్షన్ హౌస్ వాళ్లు ఇచ్చింది' తనదైన శైలిలో బుద్ది చెప్పింది. ఇది చూసిన నెటిజన్స్ సైతం అతని తీరును వ్యతిరేకిస్తున్నారు. Payal Rajput bra#PayalRajput #payal #payalbra#bra #boobs #cleavage #hot#actresshot #sexy #actresshot pic.twitter.com/uxQMZXn9sN — actresspicshot (@ViaanSharma0210) November 27, 2023 -
బ్లూ దోస వీడియో వైరల్: నెటిజన్లు మాత్రం..!
Blue Pea Dosa దక్షిణ భారత వంటకాలు అందులోనూ దోస అంటే నోరు ఊరనిది ఎవరికి. పళ్లు లేని వారుకూడా నమల గలిగేలా మెత్తగా దూదపింజ లాంటి దోస మొదలు కర కరలాడే దోస, మసాలా దోస, ఉల్లి దోస, చీజ్ కార్న్ దోస అబ్బో ఈ లిస్ట్ పెద్దదే. ఇక దీనికి సాంబారు తోడైతే ఇక చెప్పేదేముంది. అంత క్రేజ్ దోస అంటే. తాజాగా కొత్త రకం దోసం ఒకటి వైరల్‌గా మారింది. శంఖు పుష్పాలు, లేదా అపరాజిత పూలతో ఇలాంటి ప్రయోగాలు సోషల్ మీడియాలో చాలానే చూశాం. గతంలో బ్లూ రైస్ వీడియోకూడా వార్తల్లో నిలిచింది. ఇపుడు బ్లూ పీ దోస అన్నమాట. జ్యోతీస్ కిచెన్ అనే ఇన్స్టాగ్రామ్ రీల్లో బ్లూ పీ దోస ఇపుడు నట్టింట వైరల్‌గా మారింది. నీలి రంగు అపరాజిత పూలను ఉడికించిన నీళ్లలో దోస పిండి కలిపి దోస తయారీ అవుతోంది. ముఖ్యంగా చక్కటి నీలి రంగులో నోరూరించే దోస రడీ కావడం విశేషంగా నిలిచింది. ఇప్పటి 10 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకున్న ఈ దోస వీడియోపై Instagram యూజర్లు మిశ్రమంగా స్పందించారు. వావ్ చాలా అద్భుతంగా ఉంది.. బ్యూటిఫుల్ కలర్ అని కొంతమంది కమెంట్ చేశారు. అవును.. శంఖు పూలు ఎడిబుల్.. ఈ పూలతో చేసిన టీ చాలా బావుంటుంది అంటూ ఒక యూజర్ కమెంట్ చేశారు. మరికొంతమంది మాత్రం అరే ఎందుకురా..అందమైన దోసను ఇలా పాడు చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి కొంతమందయితే విచిత్రమైన దోసలతో పాపులరైన మరోఫుడ్ బ్లాగర్కి ట్యాగ్ చేశారు. రివ్యూ చే బ్రో... ఎక్కడున్నావ్..లాంటి ఫన్నీ కామెంట్లు కూడా ఉన్నాయి. View this post on Instagram A post shared by jyotiz kitchen (@jyotiz_kitchen) -
ఈ ఆమ్లెట్ తింటే లక్ష.. కండీషన్స్ అప్లై!
దేశరాజధాని ఢిల్లీలోని ఒక స్ట్రీట్ వెండర్ ఆమ్లెట్ ఛాలెంజ్ చేస్తూ, అందరినీ ఆకర్షిస్తున్నాడు. తన ఛాలెంజ్‌లో గెలిస్తే భారీగా నగదు గెలుచుకునే అవకాశం ఉంటుందని ప్రకటించాడు. తాను చేసిన అతిపెద్ద ఆమ్లెట్‌ను 30 నిముషాల్లో తింటే ఒక లక్ష రూపాయలు ఇస్తానని చెబుతున్నాడు. రాజీవ్ భాయ్ అనే ఈ స్ట్రీట్ వెండర్ భారీ మోతాదులో వెన్న, 31కి పైగా గుడ్లు, కబాబ్, మిక్స్ వెజ్ మొదలైనవన్నీ కలిపి భారీ ఆమ్లెట్ తయారు చేస్తున్నాడు. ఫిట్నెస్ను అమితంగా ఇష్టపడే భరజాత్య ఈ భారీ ఆమ్లెట్కు చెందిన వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో వేడిపెనంపై వెన్నను కరిగిస్తూ, ఇతర దినుసులు జతచేస్తూ, ఆమ్లెట్ తయారు చేయడాన్ని చూడవచ్చు. ఆమ్లెట్ పూర్తికాగానే దానిపై కూరగాయల ముక్కలు, పన్నీర్ మొదలైనవాటితో టాపింగ్ చేయడాన్ని గమనించవచ్చు. ఈ ఆమ్లెట్ ధర 1,320. వైరల్‌గా మారిన ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు.. డబ్బుల కోసం ఆశపడి ఎవరైనా ఈ ఛాలెంజ్ స్వీకరిస్తే అనారోగ్యం బారినపడతారని హెచ్చరిస్తున్నారు. ఇది కూడా చూడండి: కర్నాటకలో మహిష దసరా వివాదం ఏమిటి? 450g butter, 31 whole eggs, 50g cheese, 100g seekh kebab and 200g paneer. Approximately 3,575 mg of cholesterol in total. Nahi chahiye bhai tere 1 lakh. 👍🏻 pic.twitter.com/wfhayx7UGn — Chirag Barjatya (@chiragbarjatyaa) October 10, 2023 -
ఎంత కావాలో చెప్పు అంటూ.. సింగర్ చిన్మయిపై వల్గర్ కామెంట్
ప్రముఖ గాయనిగా చిన్మయి శ్రీపాదకు మంచి గుర్తింపు ఉంది. అంతేకాకుండా సమంతకు డబ్బింగ్ చెప్పడం ప్రారంభించిన ఆమె మల్టీటాలెంటెడ్‌గా చిత్ర పరిశ్రమలో రానించింది. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చిన్మయి తరుచూ సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతుంది. ఎదుటివారు ఎంతిటివారైనా సరే తను ఓపెన్‌గానే విరుచుకుపడుతుంది. దీంతో ఆమెపై ఒక వర్గం నెటిజన్లు ట్రోల్స్ కూడా చేస్తూ ఉంటారు. (ఇదీ చదవండి: బోరున ఏడ్చేసిన రతిక తల్లిదండ్రులు.. అందరినీ కదిలిస్తున్న వ్యాఖ్యలు ) తాజాగా అలాంటి సంఘటనే సోషల్ మీడియాలో ఆమెకు ఎదురైంది. కొద్దిరోజుల క్రితం ఆమెకు ఒక నెటిజన్ ఇలా మెసేజ్ చేశాడు. 'మీరంటే నాకు చాలా ఇష్టం. సాటి అమ్మాయిల కోసం నిలబడే తీరు నాకు ఎంతో నచ్చింది. ఇలాగే మీరు ఎప్పుడూ ఉండాలి. మా సోదరికి కూడా అలాంటి చేదు అనుభవాల వల్ల ఇబ్బందులు ఎదుర్కుంది.' అని మెసేజ్ చేశాడు. కానీ చిన్మయి తిరిగి సమాధానం ఇవ్వకపోవడంతో అతనిలో దాగున్న అసలు స్వరూపం బయటకు వచ్చింది. మళ్లీ ఇలా మెసేజ్ చేశాడు. 'నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తా.. నాతో కొంత సమయం స్పెండ్ చేస్తావా.?' అంటూ మరో అర్థం వచ్చేలా మెసేజ్ పెట్టాడు. అంతటితో ఆగక 'నీకు ఏం కావాలన్నా కొంటాను.. లగ్జరీ జీవితాన్ని ఇస్తాను.' అని వరుసబెట్టి మెసేజ్‌లు పంపాడు. (ఇదీ చదవండి: రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్, ఏడ్చేసిన వరుడు) దీనిపై చిన్మయి ఫైర్ అయింది. ఈ చెత్త ఎదవను చూడండి మొదట పద్దతిగా మెసేజ్‌లు చేశాడు.. నేను తిరిగి రిప్లై ఇవ్వకపోవడంతో వాడి ఈగో దెబ్బతిన్నట్లు ఉంది. దీంతో వాడి అసలు రూపం బయటకొచ్చింది. ఇలాంటి వాడ్ని ఏం చేయాలి.. ముందు వాడి నాన్నను అనాలి. ఇంత చెత్తగా పిల్లలను ఎలా పెంచాడు. ఇలాంటి ఎదవలు సమాజంలో చాలామందే ఉన్నారు. అమ్మాయిలా కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చిన్మయి తెలిపింది. View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) -
పెళ్లి చేసుకోమని నన్ను తిట్టాడు.. కొవ్వెక్కిపోయానట.. హీరోయిన్!
నచ్చావులే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ 'మాధవి లత'. 2008లో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ సొంతం తెచ్చుకుంది. ఆ తర్వాత మాధవి స్నేహితుడా, అరవింద్-2 చిత్రాల్లో కనిపించింది. అంతే కాకుండా మహేష్ బాబు మూవీ అతిథిలో హీరోయిన్ స్నేహితురాలిగా మొట్ట మొదటిసారి కనిపించింది. అయితే రాజకీయాల్లోనూ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. అయితే సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటుంది. తన జర్నీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ నెట్టింట హల్చల్ చేస్తోంది. (ఇది చదవండి: పెళ్లి ఎప్పుడు.. మాధవీలత స్ట్రాంగ్ కౌంటర్!) అయితే ఇప్పటివరకు మాధవి లత ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. దీంతో ఆమె పెళ్లి గురించి నెటిజన్ల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే ఆమె షేర్ చేసిన వీడియోల్లో పెళ్లి గురించి ప్రస్తావన తీసుకొచ్చింది. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు తనదైనశైలిలో ఇచ్చిపడేసింది. ఫేస్బుక్లో ఓ నెటిజన్ చేసిన కామెంట్స్‌కు బాధపడిన మాధవిలత తన పెళ్లి గురించి ఘాటుగానే బదులిచ్చింది. మాధవిలత మాట్లాడుతూ..'పెళ్లి చేసుకోకపోతే ఈ భూమి మీద బతికే అర్హత లేదా? పెళ్లి చేసుకోని వాళ్లకు నిజంగానే బలుపు ఉంటుందా? పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంటే వెంటనే మంచిగా అవుతానా? మీ మాటలు చూస్తే.. పెళ్లి చేసుకోలేదంటే నాకు ఆత్మాభిమానం ఉన్నట్టే కదా? మీరు ఎలా ఉన్నారంటే.. పెళ్లి చేసుకోని వారంతా సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలా? పీఎం మోదీ, యూపీ సీఎం యోగి, వివేకానంద, అబ్దుల్ కలాం వీరంతా పెళ్లి చేసుకోకుండానే గొప్పోళ్లు అయ్యారు కదా? అయితే నాకు పెళ్లి కానందు వల్ల మీరంతా ఫీలవుతున్నారా? అయితే మీరే నాకు పెళ్లి చేయండి' అంటూ వీడియోలో ఫన్నీగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మాధవిలత షేర్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. మహాభారత్ నటుడు కన్నుమూత!) View this post on Instagram A post shared by MadhaviLatha ll Actor ll sanathani ll BJP Women ll Serve NGO ll (@actressmaadhavi) View this post on Instagram A post shared by MadhaviLatha ll Actor ll sanathani ll BJP Women ll Serve NGO ll (@actressmaadhavi) View this post on Instagram A post shared by MadhaviLatha ll Actor ll sanathani ll BJP Women ll Serve NGO ll (@actressmaadhavi) -
నా జీవితంలో అది ఎప్పటికీ ప్రత్యేకమే: నిహారిక
మెగాడాటర్, నాగబాబు కూతురు నిహారిక కొణిదెల టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. మెగా కుటుంబం నుంచి వచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తోంది. ఎప్పటికప్పుడు పోస్టులు చేస్తూ టచ్‌లో ఉంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా నెటిజన్స్‌తో సరదాగా చిట్ చాట్ నిర్వహించారు. ఈ ఇంటరాక్షన్‌లో నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు. అసలు ఆమెను ఎలాంటి ప్రశ్నలు అడిగారో ఓ లుక్కేద్దాం పదండి. (ఇది చదవండి: ‘భోళా శంకర్’కు తొలి రోజు ఊహించని కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే.. ) నిహారిక తన ఫ్యాన్స్‌తో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆమె ఇష్టమైన విషయాల గురించి మాట్లాడారు. మీకిష్టమైన ప్రదేశం, వెబ్ సిరీస్‌లు ఏవని అడగ్గా.. ఇండోనేషియాలోని బాలి తన బెస్ట్ వెకేషన్ ప్లేస్ అని వెల్లడించింది. ఇక వెబ్ సిరీస్‌లు విషయానికొస్తే దిస్ ఇజ్ అజ్, డెక్ట్సర్ అని తెలిపింది. మరో నెటిజన్ ఆసక్తికర ప్రశ్న వేయగా.. నిహారిక బదులిచ్చింది. వరుణ్‌తేజ్‌తో దిగిన ఏ ఫోటో మీకు ఇష్టమని ప్రశ్నించగా.. ఎంగేజ్మెంట్లో అన్నయ్యతో దిగిన ఫోటోనే నా జీవితంలో అత్యంత ప్రత్యేక సందర్భమని తెలిపింది. అంతే కాకుండా నాకు బోర్డ్ గేమ్స్ అంటే చాలా ఇష్టమని.. రొమాన్స్, మర్డర్ మిస్టరీ జోనర్ సినిమాలంటే తనకు ఆసక్తి అని వెల్లడించింది. కాగా.. ఇటీవలే తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. (ఇది చదవండి: 'జైలర్' థియేటర్లో అత్తగారి ముందే ఆ హీరోయిన్‌తో ధనుష్ రచ్చ) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
నెటిజన్ వింత ప్రశ్న.. గట్టిగానే ఇచ్చిపడేసిన స్టార్ హీరోయిన్!
తెలుగు, తమిళ భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న స్టార్ నటి శృతిహాసన్. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో కథానాయికగా నటిస్తూ అగ్ర కథానాయికగా కొనసాగుతున్నారు. ఇటీవల సోషల్ మీడియాలోనూ ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటూ అప్పుడప్పుడు చాలా ఫన్ చేస్తూ ఉంటుంది. ఆస్క్ మీ ఎనీథింగ్ అంటూ నెటిజన్స్‌తో సందడి చేస్తూ ఉంటుంది. తాజాగా చిట్ చాట్ నిర్వహించింది ముద్దుగుమ్మ. ఈ చిట్ చాట్‌లో నెటిజన్స్ పలు ఆసక్తికర ప్రశ్నలు వేశారు. దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా కొందరు ఆకతాయిలు రెచ్చిపోతుంటారు. హద్దులు మీరి ప్రశ్నలు వేస్తుంటారు. అలా ప్రశ్నించిన ఓ నెటిజన్‌కు తనదైన శైలిలో కౌంటరిచ్చింది శృతిహాసన్. కొందరు నెటిజన్స్ చిన్నప్పటి ఫోటో పెట్టమని అడగ్గా.. మరొకరు ఎర్ర డ్రెస్సులో ఉన్న ఫోటో.. అలాగే బాయ్ ఫ్రెండ్ శంతన హజారికాతో ఉన్న ఫోటో పెట్టమని అడిగారు. అలా అన్ని ఫోటోలను షేర్ చేసిన శ్రుతి హాసన్‌కు.. ఓ నెటిజన్ చాలా వింత ప్రశ్నవేశాడు. నీ పాదాల ఫోటో పెట్టు పెట్టు అని అడిగాడు. అయితే అతనికి శృతి తనదైన శైలిలోనే స్పందించింది. ఏదో ఒక ఏలియన్‌ను పోలిన పాదాల ఫోటోను పెట్టింది. దీంతో నెటిజన్‌కు వింత ప్రశ్నకు తగిన బుద్ది చెప్పింది. అంతే కాకుండా ఆ ఫోటోతో పాటు బై అంటూ కామెంట్ చేసింది. మొత్తానికి ఆ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.