టీడీపీ చీప్‌ ట్రిక్స్‌.. ఉతికి ఆరేస్తున్న నెటిజన్లు.. | Netizens Criticized The Behavior Of Tdp On Social Media | Sakshi
Sakshi News home page

టీడీపీ చీప్‌ ట్రిక్స్‌.. ఉతికి ఆరేస్తున్న నెటిజన్లు..

Published Tue, Jun 27 2023 7:46 PM | Last Updated on Tue, Jun 27 2023 8:58 PM

Netizens Criticized The Behavior Of Tdp On Social Media - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఏ క్రైమ్ జరిగినా వైఎస్సార్‌సీపీ మీద నెట్టేయడమే పనిగా పచ్చ మీడియా, ప్రతిపక్షాలు పెట్టుకున్నాయి. సోషల్ మీడియాలో టీడీపీ తీరును ఎండగడుతూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. టీడీపీ నీచ రాజకీయాలపై మండిపడుతున్నారు. ఆ పార్టీ పరిస్థితి రాష్ట్రంలో రోజురోజుకు క్షీణించిపోవడంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ఏదో విధంగా బురద చల్లాలనే ఉద్దేశంతో కుట్రలకు  తెగబడుతున్నారు.

సోషల్ మీడియాలో టీడీపీ తీరుపై నెటిజన్లు వ్యగ్యంగా పోస్టులు పెడుతూ దుమ్మెతిపోస్తున్నారు..
►కర్నూలులో కుక్క కరిచి వ్యక్తికి గాయాలు.. ఆ కుక్క వైసీపీ నాయకుడిది అని అనుమానం..
►నంద్యాలలో నాలుగు పచ్చని చెట్లను నరికేసిన వ్యక్తులు.. ఆ వ్యక్తులు వైసీపీ వారిగా అనుమానం..
►చిత్తూరు అత్తను చంపిన అల్లుడు.. అల్లుడు వైసీపీ వ్యక్తిగా అనుమానం..
►కడపలో ఒకే కాన్పులో నలుగురు కవలను జన్మనిచ్చిన టీడీపీ నేత.. ఇది వైసీపీ నాయకుల కుట్రగా అనుమానం..
►గుంటూరులో ఓ అమ్మాయిని లేపుకెళ్లిన యువకుడు.. ఆ యువకుడు వైసీపీ వ్యక్తిగా అనుమానం..
►ఒంగోలులో బర్రెను ఢీకొన్న లారీ.. లారీ ఓనర్ వైసీపీ వ్యక్తిగా అనుమానం..
►నెల్లూరులో ఓ ఇంట్లో దొంగతానికీ పాల్పడ్డ దొంగలు.. దొంగలు వైసీపీ వారిగా అనుమానం..
►విజయవాడలో కొట్టుకున్న రౌడీమూకలు.. వైసీపీ మూకలుగా అనుమానం..

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ.. తెలుగుదేశం, జనసేన రకరకాల కుట్రలు చేస్తున్నాయి. ఎక్కడ లేని క్రైం అంతా ఏపీలోనే జరుగుతున్నట్టు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి.  రాష్ట్రంలో ఎక్కడ ఏది జరిగినా.. ఏది జరగకపోయినా.. దాన్ని అధికార పార్టీపై రుద్ది రాజకీయ లబ్ది పొందాలన్నది టీడీపీ కుట్రగా మారింది. ఏ క్రైం జరిగినా.. దానికి వైఎస్సార్‌సీపీకి అంటగట్టే ప్రయత్నం జరుగుతోంది.
చదవండి: నిసిగ్గుగా చందబ్రాబు, లోకేష్‌ శవ రాజకీయాలు.. ఇదీ అసలు వాస్తవం..

తాజాగా, జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమాని శ్యామ్‌ మృతిపై టీడీపీ శవ రాజకీయాలకు తెరలేపింది. ఆ యువకుడి మృతికి వైఎస్సార్‌సీపీ నేతల ప్రమేయం ఉందంటూ అసత్య ఆరోపణలు చేస్తూ.. ఆత్మహత్యకు లింకు పెట్టే కుట్రకు బీజం వేశారు. ఒక వ్యక్తి బాధతో, వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుంటే.. దాన్ని అడ్డం పెట్టుకుని శవరాజకీయాలు చేయడానికి ఏకంగా చంద్రబాబు, లోకేష్ రంగంలోకి దిగారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement