criticized
-
పార్కింగ్ స్థలంలో కంపెనీ : కట్ చేస్తే..యూకే ప్రధానికంటే మూడువేల రెట్లు ఎక్కువ జీతం
నెలకు లక్షల్లో సంపాదిస్తేనే ఔరా అనుకుంటాం కదా. కానీ బ్రిటీష్ బిలియనీర్, మహిళా వ్యాపారవేత్త, అత్యధిక వేతనం పొందే మహిళగా నిలిచింది. 2024లో జీతం , డివిడెండ్లలో 150 మిలియన్ పౌండ్లను ( రూ.1,500 కోట్లకు పైగా) వేతనం అందుకుంది. అంటే రోజురు నాలుగు కోట్ల వేతనం అన్నమాట. అదీ 45 శాతం వేతన కోత తరువాత. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఎవరీ డెనిస్.. ఆమె కంపెనీ ఏంటి తెలుసుకుందాం ఈ కథనంలో.57 ఏళ్ల డెనిస్ కోట్స్(denise Coates)కన్న కల చాలా పెద్దది. అందుకే ఆమె స్థాపించిన ఒక చిన్న కంపెనీ ఇపుడు ప్రపంచాన్ని ఏలుతోంది. 2000లో ఒక మామూలు కారు పార్కింగ్ స్థలంలో "బెట్365" (Bet365)అనే ఆన్లైన్ బెట్టింగ్ సంస్థను ప్రారంభించింది. బహుశా అపుడు ఆమె ఊహించి ఉండదు..వేల కోట్ల టర్నోవర్‌తో, 8,500 మంది ఉద్యోగులతో దిగ్గజంగా ఎదిగుతుందని. కట్ చేస్తే...ఆమె విజయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. డెనిస్ కోట్స్ బ్రిటన్‌లోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరిగా అవతరించారు. సంస్థలో ఆమె మెజారిటీ వాటా50 శాతానికి పైమాటే.ది గార్డియన్ నివేదిక ప్రకారం "బెట్365" కంపెనీ అంతకుముందు సంవత్సరంలో 3.4 బిలియన్ పౌండ్ల నుండి 3.7 బిలియన్ పౌండ్లకు ఆదాయ వృద్ధిని సాధించింది. ఈక్విటీ మార్కెట్ పరిస్థితుల మెరుగుదల మధ్య ఖర్చులను తగ్గింపు, పెట్టుబడి మదింపుల నుండి లాభాన్ని ఆర్జించింది. గత ఏడేళ్లలో ఆమె సంపద ఏకంగా రూ. 20 వేల కోట్లను దాటిపోగా, గత పదేళ్లలో ఆమె ఆర్జించిన మొత్తం దాదాపు రూ.24 వేల కోట్లు. మార్చి 2024తో ముగిసిన ఏడాది లో సంస్థ పన్నుకు ముందు 626 మిలియన్ పౌండ్ల లాభాన్ని సాధించింది. ఇది గత ఏడాదితోపోలిస్తే 60 మిలియన్ పౌండ్ల ప్రీ-టాక్స్ నష్టం నుండి గణనీయమైన పెరుగుదల.ఆన్లైన్ బెట్టింగ్స్ ఊపందుకున్న కోవిడ్-19 మహమ్మారి సమయంలో (2020) ఆమె ఆదాయం అత్యధికంగా రూ.4,690 కోట్లుగా నమోదైంది. కాగా ప్రపంచంలోని ప్రముఖ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కంపెనీల్లో ఒకటి నిలిచిన Bet365 వ్యవస్థాపకురాలైన కోటస్ 1967, సెప్టెంబరు 26న ఇంగ్లాండ్‌లోని స్టోక్-ఆన్-ట్రెంట్‌లో జన్మించింది. షెఫీల్డ్ విశ్వవిద్యాలయంలో ఎకనామెట్రిక్స్ అభ్యసించింది. బెట్టింగ్ షాపులను నిర్వహించు కుటుంబ నేపథ్యంతో ఆమె ఈ కంపెనీని స్థాపించింది. ఆమె సోదరుడు జాన్ కోట్స్ సంస్థకు సంయుక్త సీఈఓగా(CEO), ప్రధాన వాటాదారుగా కొనసాగుతున్నారు. అంతేకాదు స్టోక్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్ స్టేడియానికి బెట్365 పేరు పెట్టారంటేనే Bet365కంపెనీ ప్రాముఖ్యతను ఇట్టే అర్థం చేసుకోవచ్చు.విమర్శలు, వివాదాలు అయితే ఇంత ప్రాపులర్ అయిన సంస్థకు సంబంధించి మరో కోణం కూడా ఉంది. పేదప్రజల ఆశను సొమ్ము చేసుకుంటున్న కంపెనీ అంటూ సంస్థపై అనేక విమర్శలు భారీగానే ఉన్నాయి. ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్న లక్షలాది మంది కష్టార్జితాన్ని ఈ సంస్థ కొల్లగొడుతోందని విమర్శకులు మండిపడుతున్నారు.మరోవైపు 2020లో డెనిస్ తండ్రి పీటర్ కోట్స్(Peter Coates) బ్రిటన్ ప్రధాని కెయిర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీకి రూ.25 లక్షలు విరాళంగా ఇవ్వడం రాజకీయ దుమారాన్ని రేపింది . అలాగే 2023లో కస్టమర్ల భద్రతా వైఫల్యం, మనీలాండరింగ్ లాంటి ఆరోపణలతో ఈ సంస్థ రూ.5.82 కోట్ల జరిమానా కూడా చెల్లించాల్సి వచ్చింది. -
అదృశ్యం అంటే.. ఇక అంతే
బిలియనీర్ల దగ్గర్నుంచి రాజకీయ నాయకుల వరకు, క్రీడాకారుల దగ్గర్నుంచి నటీనటుల వరకు అదృశ్యం కావడం చైనాలో సర్వ సాధారణంగా మారింది. కొన్నాళ్ల పాటు కనిపించకుండా పోయిన తర్వాత ఏ అవినీతి ఆరోపణలో చిక్కుకోవడమో, జైలుకు వెళ్లడమో లేదంటే లో ప్రొఫైల్‌లో ఉండడమో జరుగుతోంది. ఇలా అదృశ్యమైన వారి జాబితా క్రమంగా పెరుగుతోంది. ఇన్నాళ్లూ విదేశాంగ మంత్రిగా పని చేసిన చిన్‌గాంగ్ తాజాగా ఆ జాబితాలో చేరారు. నెలరోజులుగా ఆయన కనబడకుండా పోయినా ప్రభుత్వం పెదవి విప్పడం లేదు. ఆయన స్థానంలో వాంగ్ యీని విదేశాంగ మంత్రిగా నియమించింది. ఆ సమయంలోనూ చిన్‌గాంగ్ ఆచూకీపై మౌనం పాటించింది. చైనా ప్రభుత్వ విధానాలను విమర్శించిన వారే ఇప్పటివరకు అదృశ్యమవుతూ వచ్చారు. కానీ చిన్‌గాంగ్‌ది దీనికి పూర్తిగా భిన్నం. అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడుగా ఆయనకు పేరుంది. రష్యా, వియత్నాం, శ్రీలంక నుంచి వచ్చిన అధికారులతో జూన్ 25న చివరిసారిగా ఆయన కనిపించారు. అప్పట్నుంచి ఎన్నో కీలకమైన సదస్సుల్ని చైనా వాయిదా వేసింది. కొన్ని సమావేశాలకు వాంగ్ యీ హాజరయ్యారు. చైనా సోషల్ మీడియాలో నెటిజన్లు చిన్‌గాంగ్ గురించి తెలుసుకోవాలని ప్రయతి్నంచినా ‘నో రిజల్ట్స్ అన్న సందేశమే వస్తోంది. హాంగ్‌కాంగ్‌కి చెందిన మహిళా జర్నలిస్టు ఫు షియోన్‌తో వివాహేతర సంబంధమే చిన్‌గాంగ్ అదృశ్యానికి కారణమని తెలుస్తోంది. ప్రపంచంలోని రాజకీయ ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేసే ఆమె 2022లో చిన్గాంగ్ను ఇంటర్వ్యూ చేశారు. అదే ఆమె చివరి ఇంటర్వ్యూ. ఆ తర్వాత ఆమె కనిపించకుండా పోవడంతో ఇద్దరి మధ్య సంబంధం ఉందనే అనుమానాలున్నాయి. వివాహేతర సంబంధాలను చైనా కమ్యూనిస్ట్ పార్టీ అనుమతించదు. ఈ వ్యవహారం కారణంగానే అధ్యక్షుడితో చిన్‌గాంగ్‌కు విభేదాలు వచ్చాయన్న ప్రచారం జరుగుతోంది. చిన్‌గాంగ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కొన్నిసార్లు ప్రభుత్వం చెబుతున్నా నమ్మేట్టు లేదు. అదృశ్యమైన ప్రముఖులు వీరే హు జింటావో చైనా మాజీ అధ్యక్షుడు హు జింటావోను అత్యంత నాటకీయ పరిణామాల మధ్య గత ఏడాది అక్టోబర్‌లో చైనీస్ కాంగ్రెస్ పార్టీ సమావేశం నుంచి బలవంతంగా స్టీవార్డ్స్ బయటకు తీసుకువెళ్లడం సంచలనం సృష్టించింది. ఆ తర్వాత రెండు నెలల పాటు ఆయన కనిపించకుండా పోయారు. అనారోగ్య కారణాలతో ఆయన సమావేశం విడిచి వెళ్లారని ప్రభుత్వం అప్పట్లో వెల్లడించింది. రాజకీయ కారణాలతోనే అతన్ని సమావేశం నుంచి పంపేసినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత డిసెంబర్లో చైనా నాయకుడు జియాంగ్ జెమిన్ అంత్యక్రియల సమయంలో జింటావో కనిపించారు. జాక్ మా చైనాలో అత్యంత సంపన్నుడు, ఆలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా 2020 చివర్లో కనిపించకుండా పోయారు. చైనా ప్రభుత్వ ఆర్థిక నియంత్రణలను విమర్శిస్తూ ప్రసంగించిన కొద్ది రోజుల్లోనే జాక్ మా అదృశ్యమయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకే చైనా దర్యాప్తు సంస్థల నుంచి ఆయనకు సమన్లు అందాయి. ఆయన కొత్తగా పెట్టబోయే కంపెనీలకు అనుమతుల్ని ప్రభుత్వం రద్దు చేసింది. జాక్ మా సంపదలో సగానికి సగం కోల్పోయినట్టు అంచనా. అప్పట్నుంచి ఆయన ఇప్పటివరకు బహిరంగంగా ఎవరికీ కనిపించలేదు. ప్రస్తుతం ఆయన టోక్యోలో ఉన్నారని తెలుస్తోంది. బావో ఫ్యాన్ చైనాకు చెందిన టెక్నాలజీ డీల్ మేకర్ బావో ఫ్యాన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో అదృశ్యమయ్యారు. చైనా రనెసాన్స్ హోల్డింగ్స్ అనే ప్రైవేటు బ్యాంకు వ్యవస్థాపకుడైన బావోను చైనా ప్రభుత్వ ఏజెన్సీల అధికారులు విచారిస్తున్నారంటూ ఆయన కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఏ దర్యా ప్తు సంస్థలు ఆయనని విచారిస్తున్నారో, కారణాలేంటో ఇప్పటివరకు బయట ప్రపంచానికి తెలీదు. గువో గ్వాంగ్‌చాంగ్ 2015లో అదృశ్యమైన అయిదుగురు ఎగ్జిక్యూటివ్‌లలో ఫోసన్ ఇంటర్నేషనల్ గ్రూప్ చైర్మన్ గువో గ్వాంగ్‌చాంగ్ ఉన్నారు. కొన్నాళ్లు కనిపించకుండా పోయిన ఆ తర్వాత హఠాత్తుగా ఒకరోజు ప్రత్యక్షమయ్యారు. ఫుట్‌బాల్ క్లబ్‌కి యజమాని కూడా అయిన గ్వాంగ్‌చాంగ్‌ని అవి నీతి కేసుల్లో దర్యాప్తు సంస్థలు అదుపులోనికి తీసుకొని తర్వాత విడిచిపెట్టినట్టు వార్తలు వచ్చాయి. రెన్ జికియాంగ్ చైనాలో రియల్ ఎస్టేట్ టైకూన్ రెన్ జికియాంగ్ 2020 మార్చిలో అదృశ్యమయ్యారు. కరోనా మహమ్మారిని నియంత్రించడంలో అధ్యక్షుడు జిన్‌పింగ్ ఒక విదూషకుడు తరహాలో వ్యవహరించారంటూ వ్యాఖ్యానించిన కొద్ది రోజుల్లోనే ఆయన కనిపించకుండాపోయారు. ఏడాది తర్వాత అవినీతి ఆరోపణలపై ఆయనకు 18 ఏళ్లు జైలు శిక్ష విధించారు. ఫ్యాన్ బింగ్‌బింగ్ రాజకీయ నాయకులు వ్యాపార వేత్తలతో పాటు చైనాలో నటీనటుల చుట్టూ అదృశ్యం మిస్టరీ నెలకొంది. 2018 జూలైలో ఫ్యాన్ బింగ్‌బింగ్ అనే నటీమణి హఠాత్తుగా కనిపించకుండాపోయారు. సోషల్ మీడియాకి ఆమె దూరమయ్యారు. బింగ్‌బింగ్ చైనా విడిచిపెట్టారని, గృహ నిర్బంధంలో ఉంచారన్న వదంతులు వ్యాపించాయి. దాదాపుగా ఏడాది తర్వాత బయటకు వచ్చిన ఆమె పన్నులు ఎగ్గొట్టినందుకు 8.83 కోట్ల యువాన్లు జరిమానా చెల్లించారు. పెంగ్ షూయీ చైనా టెన్నీస్ క్రీడాకారిణి పెంచ్ షూయీ 2022లో అదృశ్యమైంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధికారి జాంగ్ గయోలిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన కొద్ది రోజులకే ఆమె కనిపించకుండా పోయారు. ప్రస్తుతం ఆమె చైనాలోనే ఉంటున్నారని తెలుస్తోందికానీ లో ప్రొఫైల్‌లో ఉన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘డబుల్’పై బీజేపీ డ్రామాలు
సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో బీజేపీ నాయకులు రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ విమర్శించారు. దేశంలో పేద ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను ఉచితంగా ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్ర మేనని అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రమంత్రిగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న కిషన్ రెడ్డికి అధికారికంగా డబుల్ బెడ్ రూం ఇళ్లను సందర్శించి పరిశీలించే అవకాశం ఉన్నప్పటికీ అలా కాదని రోడ్డుపై బైఠాయించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఏం ఆశించి, ఎందుకోసం ఈ రాద్ధాంతం చేస్తున్నారో చెప్పాలని అన్నారు. ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని ప్రకటించిన తర్వాత కూడా ఆందోళన ఎందుకు చేస్తున్నారో చెప్పాలని, పేద ప్రజల సంక్షేమం కోసం మీరేం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిజంగా పేదలకు మేలు చేయాలనే ఆలోచన మీకు ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎందుకు నిధులు తేలేకపోతున్నారని ప్రశ్నించారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే.. పేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించాలనే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ అన్ని మౌలిక సౌకర్యాలు, వసతులతో కూడిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తలసాని చెప్పా రు. రాష్ట్రవ్యాప్తంగా 2.65 లక్షలు, జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకు న్నట్లు తెలిపారు. కొల్లూరులో రూ. 6,700 కోట్ల వ్యయంతో నిర్మించిన డబుల్‌బెడ్ రూం ఇళ్ల కాలనీని ఇటీవలే సీఎం ప్రారంభించారన్నారు. గతంలో డబుల్‌బెడ్ రూం ఇళ్ల ప్రారంభ కార్యక్రమంలో కిషన్‌రెడ్డి పాల్గొని ప్రశంసించిన విషయం వాస్తవం కాదా? అని నిలదీశారు. -
టీడీపీ చీప్ ట్రిక్స్.. ఉతికి ఆరేస్తున్న నెటిజన్లు..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఏ క్రైమ్ జరిగినా వైఎస్సార్సీపీ మీద నెట్టేయడమే పనిగా పచ్చ మీడియా, ప్రతిపక్షాలు పెట్టుకున్నాయి. సోషల్ మీడియాలో టీడీపీ తీరును ఎండగడుతూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. టీడీపీ నీచ రాజకీయాలపై మండిపడుతున్నారు. ఆ పార్టీ పరిస్థితి రాష్ట్రంలో రోజురోజుకు క్షీణించిపోవడంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఏదో విధంగా బురద చల్లాలనే ఉద్దేశంతో కుట్రలకు తెగబడుతున్నారు. సోషల్ మీడియాలో టీడీపీ తీరుపై నెటిజన్లు వ్యగ్యంగా పోస్టులు పెడుతూ దుమ్మెతిపోస్తున్నారు.. ►కర్నూలులో కుక్క కరిచి వ్యక్తికి గాయాలు.. ఆ కుక్క వైసీపీ నాయకుడిది అని అనుమానం.. ►నంద్యాలలో నాలుగు పచ్చని చెట్లను నరికేసిన వ్యక్తులు.. ఆ వ్యక్తులు వైసీపీ వారిగా అనుమానం.. ►చిత్తూరు అత్తను చంపిన అల్లుడు.. అల్లుడు వైసీపీ వ్యక్తిగా అనుమానం.. ►కడపలో ఒకే కాన్పులో నలుగురు కవలను జన్మనిచ్చిన టీడీపీ నేత.. ఇది వైసీపీ నాయకుల కుట్రగా అనుమానం.. ►గుంటూరులో ఓ అమ్మాయిని లేపుకెళ్లిన యువకుడు.. ఆ యువకుడు వైసీపీ వ్యక్తిగా అనుమానం.. ►ఒంగోలులో బర్రెను ఢీకొన్న లారీ.. లారీ ఓనర్ వైసీపీ వ్యక్తిగా అనుమానం.. ►నెల్లూరులో ఓ ఇంట్లో దొంగతానికీ పాల్పడ్డ దొంగలు.. దొంగలు వైసీపీ వారిగా అనుమానం.. ►విజయవాడలో కొట్టుకున్న రౌడీమూకలు.. వైసీపీ మూకలుగా అనుమానం.. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ.. తెలుగుదేశం, జనసేన రకరకాల కుట్రలు చేస్తున్నాయి. ఎక్కడ లేని క్రైం అంతా ఏపీలోనే జరుగుతున్నట్టు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ ఏది జరిగినా.. ఏది జరగకపోయినా.. దాన్ని అధికార పార్టీపై రుద్ది రాజకీయ లబ్ది పొందాలన్నది టీడీపీ కుట్రగా మారింది. ఏ క్రైం జరిగినా.. దానికి వైఎస్సార్సీపీకి అంటగట్టే ప్రయత్నం జరుగుతోంది. చదవండి: నిసిగ్గుగా చందబ్రాబు, లోకేష్ శవ రాజకీయాలు.. ఇదీ అసలు వాస్తవం.. తాజాగా, జూనియర్ ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ మృతిపై టీడీపీ శవ రాజకీయాలకు తెరలేపింది. ఆ యువకుడి మృతికి వైఎస్సార్సీపీ నేతల ప్రమేయం ఉందంటూ అసత్య ఆరోపణలు చేస్తూ.. ఆత్మహత్యకు లింకు పెట్టే కుట్రకు బీజం వేశారు. ఒక వ్యక్తి బాధతో, వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుంటే.. దాన్ని అడ్డం పెట్టుకుని శవరాజకీయాలు చేయడానికి ఏకంగా చంద్రబాబు, లోకేష్ రంగంలోకి దిగారు. -
చంద్రబాబుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: ‘హైదరాబాద్‌కు అది తెచ్చాం, ఇది తెచ్చామని గొప్పులు చెప్పుకోవడం కాదు.. మీరు ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్రకు ఏం తెచ్చారో చెప్పండి.. కేంద్రం ఇచ్చిన సంస్థలు కాకుండా మీరేమి తెచ్చారో చెప్పండి’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబును బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సూటిగా ప్రశ్నించారు. పార్టీ సహచరులతో కలిసి శనివారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌ను అద్భుతంగా అభివృద్ధి చేశానని చెప్పుకునే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి ఆయన ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ‘అధికారం పోగానే చంద్రబాబు హైదరాబాద్ ఎందుకు వెళ్లిపోయారు. ఏపీ అభివృద్ధిపట్ల శ్రద్ధలేదా.. అధికారం కావాలంటే ఆంధ్రా జనాన్ని వాడుకోవాలి.. అది అయిపోయాక హైదరాబాద్‌లో మీ ఆస్తులను పెంపొందించుకోవాలి. ఇదేనా మీ ఆలోచన. మీకు మీ ప్రాంతంపట్ల చిత్తశుద్ధిలేదు. హైదరాబాద్‌లో సొంత ఆస్తులు ఉన్నాయనే, సొంత వ్యాపారాలు ఉన్నాయనే, బలగం ఉందనో మీరు అక్కడే తిష్ట వేసుకుని కూర్చుంటున్నారు. మీకు హైదరాబాద్‌కు ఏం సంబంధం.. మీరు తెలంగాణలో రాజకీయాలు చేసుకోండి..’ అంటూ జీవీఎల్ ఘాటుగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఏం చర్యలు చేపడుతున్నారో చెప్పాలని, ఐటీ ఉద్యోగులందరూ వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఈ తరుణంలో ఐటీ కంపెనీలకు రాయితీలిస్తే, వాటి కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటుచేసే అవకాశముంటుందని జీవిఎల్ సూచించారు. చదవండి: (ఘనంగా కొండా విశ్వజిత్, రిషికల వివాహ రిసెప్షన్) -
మహానాడు కాదు.. ఏడుపునాడు
పార్వతీపురం టౌన్: తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తు న్నది మహానాడు కాదు.. ఏడుపు నాడు అని వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్రెడ్డి సాగిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పాలనను చూసి ఓర్వలేక టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మహానాడు పేరుతో ప్రజలను తప్పు దోవపట్టిస్తున్నారని ఆరోపించారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు రోజులు ఒంగోలులో టీడీపీ నిర్వహించిన మహానాడు ఆద్యంతం సీఎంను, ఆయన కుటుంబా న్ని దూషించడమే లక్ష్యంగా సాగిందన్నారు. చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని, బీసీలకు కల్పించిన ప్రయోజనాలను, భవిష్యత్తులో ఏమి చేస్తారో చెప్పకుండా ప్రభుత్వంపై బురదజల్లడ మే పనిగా పెట్టుకోవడం విచారకరమన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇదివరకు ఎవరూ చేయని విధంగా మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాలకు 70 శాతం పదవులు కేటాయించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదని పేర్కొన్నారు. ఆయా వర్గాల్లోని లబ్ధిదారులకు 95 శాతం మేర సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్టు వివరించారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న సామాజిక న్యాయ భేరి బస్సుయాత్రకు ఆయా వర్గాల నుంచి వస్తున్న విశేష స్పందనను చూసి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడికి భయం పట్టుకుందన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలకు మానసిక స్థైర్యం కల్పించేందుకు నానా తంటాలు పడుతున్నారన్నారు. అదే ఆనాడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2017లో నిర్వహించిన ప్లీనరీ సమావేశంలో తాము అధికారంలోకి వస్తే నవరత్నాల కార్యక్రమం కింద ఏమీ చేస్తామో చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 95 శాతం చేసి చూపించారన్నారు. తమ నాయకుడికి, ప్రతిపక్ష నాయకుడికి ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ బి.గౌరీశ్వరి, పార్టీ పట్టణ అధ్యక్షుడు కొండపల్లి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: సమ్మర్ స్టడీస్.. ఇంట్లోనే చదవండి ఇలా!) -
ఆస్తులు కాపాడుకోవడానికే బీజేపీలోకి..
వీణవంక (హుజూరాబాద్): ఈటల రాజేందర్ తన స్వార్థం కోసమే రాజీనామా చేశాడని, బట్ట కాల్చి మీద వేయడంలో ఈటల కన్నా మించినోళ్లులేరని ఆర్థిక మం త్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మామిడాలపల్లి, ఇప్పలపల్లి, ఎల్బాక, గంగారంతోపాటు పలు గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి హరీశ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారుడు, పేదింటి బిడ్డ గెల్లు శ్రీనివాస్‌ను ఆశీర్వదించాలని కోరారు. తన ఆస్తులను కాపాడుకోవడానికే ఈటల బీజేపీ లో చేరారని, రైతుబంధు దండగ అన్న ఈటల రూ.10 లక్షలు రైతుబంధు కింద తీసుకున్నారని, ఇదెక్కడి న్యాయమో ప్రజలే నిర్ణయించాలన్నారు. కేంద్రం అనాలోచిత నిర్ణయాలతో గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయని, పెరిగిన సిలండర్ ధరలపై ఇప్పటివరకు ఈటల మాట్లాడలేదని విమర్శించారు. మామిడాలపల్లిని దత్తత తీసుకుంటా మామిడాలపల్లిలో 90 శాతం ఓట్లు టీఆర్ఎస్కు పడితే గ్రామాన్ని దత్తత తీసుకుంటా నని హరీశ్‌రావు ప్రకటించారు. మాజీ మం త్రి ముద్దసాని దామోదర్‌రెడ్డి పేరును నిలబెట్టేలా మామిడాలపల్లిలో కార్యక్రమా లు చేపడతానని, ఒక్కసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, దాసరి మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్‌రెడ్డి పాల్గొన్నారు. -
దేశాన్ని అమ్మేందుకు మోదీ తహతహ
సాక్షి, హైదరాబాద్: దేశాన్ని అమ్మనీయబోమంటూ అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ ఇప్పుడు దేశాన్ని అమ్మేందుకు తహతహలాడుతున్నారని సీపీఐ జాతీయకార్యదర్శి అతుల్ కుమార్ అంజాన్ విమర్శించారు. నేషనల్ ఇన్ పైప్ పేరుతో రైల్వే, రోడ్లు వంటి ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్, విదేశీ కంపెనీలకు మోదీ ప్రభుత్వం కట్టబెట్టి రూ.6 లక్షల కోట్లు సమీకరిస్తోందని ఆరోపించారు. బీజేపీ హయాంలో ఆర్థికవ్యవస్థ కుదేలైపోయిందని, శాంతిభద్రతలు గాలికి ఎగిరిపోయాయని, సరిహద్దులకు రక్షణ కరువైందని, ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని విమర్శించారు. శుక్రవారం ఇక్కడి మఖ్దూంభవన్‌లో రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర సహాయ కార్యదర్శులు పల్లా వెంకట్‌రెడ్డి, కూనంనేని సాంబశివరావులతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. మోదీ పాలనలో ఆర్థికరంగం అథఃపాతాళానికి చేరుకుందని, తిరిగి పూర్వస్థితికి రావడం కష్టంగా మారిందన్నారు. లఖింపూర్ ఖిరీ ఘటనకు కారణమైన కేంద్ర హోం శాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిశ్ మిశ్రాను ఎందుకు అరెస్టు చేయలేదని అతుల్ కుమార్ ప్రశ్నించారు. అజయ్ మిశ్రాకు నేరచరిత్ర ఉన్నదని, 2003లో ఒక యువకుని హత్య కేసులో హైకోర్టు తీర్పు రిజర్వ్‌లో ఉందన్నారు. అటువంటి వ్యక్తిని మంత్రివర్గం నుంచి ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. రైతుల డిమాండ్ కేంద్ర ప్రభుత్వం పరిష్కరించకపోతే మరోసారి చలో పార్లమెంటు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, బుల్లెట్లు దూసుకొచ్చినా ఖాతరుచేయబోమని స్పష్టం చేశారు. జూలైలో సీపీఐ రాష్ట్ర మహాసభలు: చాడ వచ్చే ఏడాది జూలై నెలాఖరున రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో సీపీఐ రాష్ట్ర మహాసభలు, వచ్చే ఏడాది అక్టోబర్ 14–17 తేదీలలో విజయవాడలో జాతీయ మహాసభలు జరుగుతాయని చాడ తెలి పారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని తాను ఎన్నడూ అనలేదని సీఎం కేసీఆర్ శాసనసభలో అసత్యం పలకడం శోచనీయమన్నారు. 2014 టీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో మూడెకరాల భూమి ఇస్తామని స్పష్టంగా ఉందన్నారు. లఖింపూర్ ఖీరి ఘటన నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఈ నెల 11న రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నుట్లు తెలిపారు. రెండు రోజులపాటు ఇక్కడ జరిగిన సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాల నిర్ణ యాలను వెల్లడించారు. పోడుభూముల సమస్య పరిష్కారమయ్యే వరకు ప్రత్యక్ష కార్యాచరణ కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. -
రాష్ట్రానికి బీజేపీ ఎంపీలు తెచ్చింది గుండుసున్నా: వినోద్
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో అధికారంలో ఉండి కూడా బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి ఒక్క రూపాయి అదనపు నిధులు తీసుకురాలేకపోయారని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్ విమర్శించారు. రెండేళ్లలో కేంద్రం నుంచి బీజేపీ ఎంపీలు తెచ్చింది గుండుసున్నా అని ఎద్దేవాచేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎంపీగా ఉండి తెలంగాణ కోసం పార్లమెంట్లో ఏమీ మాట్లాడలేదన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో వినోద్ విలేకరుల భేటీలో మాట్లాడారు. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం 150 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని, బీజేపీ ఎంపీలు కూడా దీనిపై పోరాడిందేమీ లేదని అన్నారు. బీజేపీ ఎంపీలకు దమ్ముంటే టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణం కోసం ఐదారు వేల కోట్ల నిధులు తీసుకురావాలని సవాల్ విసిరారు. ఎన్నికల కమిషన్ అనుమతిస్తే హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్ సభలుంటాయని వినోద్ వెల్లడించారు. -
ధరణిపై కోర్టుకెక్కుతా: రాజనర్సింహ
లక్డీకాపూల్: సమస్యాత్మకంగా తయారైన ధరణి పోర్టల్‌పై హైకోర్టులో పిటిషన్ వేయనున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ముఖ్యంగా రాచకొండ భూముల అంశంపై రిట్ పిటిషన్ వేయాలన్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ‘ధరణి పోర్టల్–భూ సమస్యల పరిష్కారం’డిమాండ్‌తో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వేదిక అధ్యక్షులు బోదనపల్లి వేణుగోపాల్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆయా సమస్యలపై సోమవారం పిటిషన్ దాఖలు చేయనున్నామన్నారు. ఈ విషయంలో బాధిత రైతులు తమ ధ్రువీకరణ పత్రాలను అందజేయాలని కోరారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు కొట్లాడిన తరహాలోనే ధరణి పోర్టల్ సమస్యపై పోరాటం చేద్దామని, జిల్లా కేంద్రాల్లో చర్చా వేదికలను నిర్వహించి తద్వారా బాధిత రైతులను సంఘటితం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ఏడు లక్షల ఎకరాలు అక్రమంగా టీఆర్ఎస్ నేతల పేర్లపై మారిపోయాయని ఆందోళన చెందారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పాలసీపై నిర్ణయం తీసుకున్నా, దాని వెనుక కుట్ర దాగి ఉంటుందని విమర్శించారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ధరణి ద్వారా పేదల భూములను బలవంతంగా లాక్కుంటోందన్నారు. రాష్ట్రంలో 2.77 కోట్ల ఎకరాలకుగాను సగం భూమి కూడా ధరణి పోర్టల్‌లో ఎక్కలేదన్నారు. అందులోనూ 25 లక్షల ఎకరాలను నిషేధిత జా బితాలో చేర్చడం ఆక్షేపణీయమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు న్యాయం జరగాలంటే శాశ్వత ట్రిబునల్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ గ్రేటెస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ, కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు డిజైన్ చేసిన ఆయన సాఫ్ట్వేర్ ఎక్స్‌ఫర్ట్ కావద్దా అని సూటిగా ప్రశ్నించారు. ధరణి పోర్టల్‌ను డెవలప్ చేసిందెవరన్నది గోప్యంగా ఉంచడానికి కారణమేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ, ధరణి పోర్టల్, పోడు భూముల పేరిట రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూదందా జరుగుతున్నదన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు రావుల చంద్రశేఖరరెడ్డి, సీపీఐ నాయకురాలు పశ్య పద్మ, సోషల్ మీడియా ఫోరం కన్వీనర్ దాసరి కరుణాకర్, సీపీఎం నాయకులు నంద్యాల నరసింహారెడ్డి, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, ధరణి బాధితులు పాల్గొన్నారు. -
ఆత్మగౌరవానికి వెలకట్టి కొంటున్నారు
వీణవంక: ‘ఆత్మగౌరవానికి వెలకట్టి నాయకులను కొనుగోలు చేస్తున్నారు. వాళ్లు కొన్నట్టు భావిస్తున్నారు. మనవాళ్లు అమ్ముడుపోయినట్లు నటిస్తున్నారు’అని మాజీమంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. పోతిరెడ్డిపల్లి గ్రామంలో వివిధ పార్టీల నాయకులు బీజేపీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆనంతరం ఈటల మాట్లాడుతూ ‘పొద్దున్నే లేచి నా భార్య ఒక మాట అడిగింది. నీ చుట్టూ తిరిగే వాళ్లను లేకుండా చేశారు. ఇక డ్రైవర్‌ను కూడా ఉంచరట అని. అప్పుడు నేను అన్నా. సరే నిన్ను (జమున) అన్నా ఉంచుతరటనా లేదా’అని పేర్కొన్నారు. ఈ పోరాటం తన ఒక్కడిది కాదని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పోరాటమని అన్నారు. సీఎం కేసీఆర్ పథకాల పేరుతో చెక్కుతోపాటు కత్తిని కూడా ఇస్తున్నారని ఈటల మండిపడ్డారు. -
కేసీఆర్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభం
మెదక్‌జోన్/మెదక్‌రూరల్: తెలంగాణలో సీఎం కేసీఆర్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైందని బీజేపీ సీనియర్ నేత, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబ పాలనలో తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని, అవినీతి ప్రభుత్వం అంతం కావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రం అనుకున్నంత అభివృద్ధి చెందకపోవడానికి కారణం కేసీఆరేనని విమర్శించారు. రాష్ట్రంలో 1.35 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఉద్యోగాల్లేక యువత అల్లాడిపోతున్నా నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రలో రమణ్‌సింగ్ పాల్గొన్నారు. ప్రజా సంగ్రామయాత్రలో భాగంగా సోమవారం మెదక్‌జిల్లా కొల్చారం మండలం పొతంశెట్టిపల్లి చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ‘తెలంగాణలో చీకటి పోతుంది. సూర్యుడు వస్తాడు. కమలం వికసిస్తుంది’ అని రమణ్‌సింగ్ అన్నారు. నరేంద్రమోదీ ఆరేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పనులు కాంగ్రెస్ 60 ఏళ్లు పాలించినా చేయలేకపోయిందని ఆరోపించారు. బండి సంజయ్ మాట్లాడుతూ.. ప్రజావసరాలకు ఉపయోగపడేంత ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయలేని సీఎం ప్రజలకు అవసరమా? అని ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతిపై చర్యలు తప్పవు: శోభా కరంద్లాజే కేంద్రం సంక్షేమ పథకాల పేరిట డబ్బులు మంజూరు చేస్తుంటే కేసీఆర్ తనకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నారని కేంద్రమంత్రి శోభా కరంద్లాజే విమర్శించారు. కేంద్రం అమలుచేస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి పేరు మార్చి రైతుబంధు అని పెట్టారన్నారు. కేసీఆర్ అవినీతిపై సరైన సమయంలో చర్యలు తీసుకొని, పూర్తి ఆధారాలతో ప్రజల ముందు దోషిగా నిలబెడతామన్నారు. సోమవారం మెదక్ మండలం మంబోజిపల్లి గీతా పాఠశాల ఆవరణలో ఆమె బండి సంజయ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. -
రేవంత్‌కు రాజకీయ పరిపక్వత లేదు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని మోదీని కలవడం రాజకీయ పరిపక్వత లేని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి అర్థం కావడం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎ.జీవన్‌రెడ్డి విమర్శించారు. ఫెడరల్ స్ఫూర్తి గురించి రేవంత్‌కు అవగాహన లేదని, రాష్ట్రానికి సంబంధించిన పన్నెండు అంశాలపై ప్రధానికి, సీఎం వినతిపత్రాలు ఇచ్చిన విషయాన్ని మరచిపోతున్నారని ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్‌లో ఎంఐఎం సీట్ల సర్దుబాటు గురించి మోదీ, కేసీఆర్ మాట్లాడుకున్నారని రేవంత్ చేసిన వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చంద్రబాబు పెంచిన లిల్లీపుట్ రేవంత్‌రెడ్డి.. ఆయనకు రేబిస్ వ్యాధి సోకింది’అని జీవన్‌రెడ్డి తీవ్ర పదజాలంతో విమర్శించారు. ప్రధాని మోదీని కలసిన పంజాబ్ సీఎం అమరీందర్ కూడా కాంగ్రెస్ టికెట్ల గురించి చర్చించారా? చైనా రాయబారిని కలసిన రాహుల్ గాంధీ దేశ ద్రోహానికి పాల్పడ్డారా? కాంగ్రెస్ టికెట్లు నిర్ణయించేందుకే ఎమ్మెల్యే సీతక్కను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వద్దకు పంపించారా? అని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. రేవంత్‌రెడ్డి గోబెల్స్‌ను మించిపోయి గాంధీభవన్‌ను గాసిప్స్ అడ్డాగా మార్చారని, సోషల్ మీడి యాలో అబద్ధాలు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. కేరళలో ముస్లింలీగ్‌తో, మహా రాష్ట్రలో శివసేనతో కాంగ్రెస్ ఎందుకు స్నేహం ఏర్పరచుకుందో చెప్పాలన్నారు. ప్రధాన మంత్రిని ముఖ్యమంత్రులు కలవడం సాధారణ విషయమని, రేవంత్ రాజకీయ పరిణతి పెంచుకోవాలని జీవన్‌రెడ్డి సూచించారు. -
ఇంటికొక ఉద్యోగం ఎక్కడ వచ్చింది?
సుందరయ్యవిజ్ఞానకేంద్రం (హైదరాబాద్): తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఇంటికొక ఉద్యోగం వస్తుందని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఇంటికొక ఉద్యోగం ఎక్కడ వచ్చిందో చెప్పాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు. ఆదివారం బాగ్‌లింగంపల్లిలోని ఓంకార్ భవన్లో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ విధానాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు కావాలని, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యా, వైద్యం అందించాలని డిమాండ్ చేస్తూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ 1,600 గ్రూప్–1 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం భర్తీ చేయడంలేదని విమర్శించారు. అనేక మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్ అధికారులకు ప్రాధాన్యత లేని పోస్టులు ఇచ్చారన్నారు. భూకబ్జాదారులు, దొంగలు, చదవులేని వారికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ రాజకీయాలను భ్రష్టుపట్టిస్తోందని ఆరోపించారు. బహుజనులకు రాజ్యాధికారం కోసం యువత పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. జేఏసీ చైర్మన్ కోలా జనార్దన్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, సింహాద్రి, అంజి, ఆనందం, చాంద్‌పాషా, శ్రీనివాస్, గుజ్జ సత్యం తదితరులు పాల్గొన్నారు. -
ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ
కరీంనగర్‌టౌన్: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ.. రెండూ ఒక్కటేనని, ఢిల్లీలో దోస్తీ చేస్తూ గల్లీలో కుస్తీ పడుతున్నట్లు నటిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ విమర్శించారు. ఆదివారం ఆయన కరీంనగర్‌లోని డీసీసీ కార్యాలయంలో పార్లమెంట్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచేస్తోందని, ఆ కుటుంబ పాలనకు తెర దించాల్సిన అవసరం ఉందని అన్నారు. రాత్రి 8 గంటల తర్వాత రాష్ట్రంలో ఎలాంటి విపత్కర సంఘటనలు జరిగినా ప్రజలకు అందుబాటులో ఉండని మోడ్రన్ ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ అవినీతి, అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు చర్యలెందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పూర్తిస్థాయిలో అవినీతిలో కూరుకుపోయారని ఆరోపించారు. మంత్రి గంగుల కమలాకర్ అక్రమంగా గ్రానైట్ తవ్వకాలు చేస్తూ, కోట్లాది రూపాయల పన్నులు ఎగ్గొట్టినా ఈడీ చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి చిత్తశుద్ధి ఉంటే గంగుల కమలాకర్ గ్రానైట్‌స్కాంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేయాలని సూచించారు. సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
కిషన్‌రెడ్డిది ప్రజావంచన యాత్ర: జగదీశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ‘ప్రజాఆశీర్వాద యాత్ర’పేరిట ప్రజలను మోసం చేసే యాత్ర నిర్వహిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, బొల్లం మల్లయ్య యాదవ్‌తో కలసి శుక్రవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘బీజేపీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. రూ.70 ఉన్న పెట్రోలు, డీజిల్ ధరను రూ.100 దాటించినందుకు ఆశీర్వదించాలని ప్రజలను అడగాలి. కిషన్‌రెడ్డి తన యాత్రలో వాస్తవాలను కాకుండా గాలిమాటలు చెప్తున్నారు’అని మంత్రి విమర్శించారు. ‘నల్లడబ్బును రప్పిస్తామన్న ప్రధాని మోదీ మాటలు విని ప్రజలు తెల్లడబ్బు కూడా పోగొట్టుకున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా రూ.2 వేల సామాజిక పింఛన్లు ఇస్తున్నారా? కనీసం మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోనైనా అమలు చేస్తున్నారా’అని నిలదీశారు. రాబోయే రోజుల్లో బీజేపీకి దేశ ప్రజలు షాక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, రైతుల జేబులు కొట్టేందుకు తెస్తున్న కొత్త చట్టాలతో రైతాంగం నడ్డి విరుగుతోందని అన్నారు. మహారాష్ట్ర, కర్ణాటకవాసులు కూడా కేసీఆర్ పాలన కోరుకుంటున్నారు... తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి బీజేపీ పార్లమెంటులో ఒకలా, బయట మరోలా మాట్లాడుతోందని, తెలంగాణ ప్రజలను మోసం చేయడం బీజేపీ నేతలకు సాధ్యం కాదని జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘చట్టబద్ధంగా వచ్చిన నిధులు మినహా అదనంగా రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. పొరుగునే ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర ప్రజలు కూడా కేసీఆర్ పాలన కోరుకుంటున్నారు’అని మంత్రి అన్నారు. బీజేపీ ప్రభుత్వానికి సరిహద్దుల వద్ద కాపలా కాయడం చేతకాకపోతే తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని ఎద్దేవా చేశారు. -
‘తెలంగాణ తాలిబన్’గా మారిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ తాలిబన్‌గా మారారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. తెలంగాణను బిహార్‌గా మారుస్తున్నారని, ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. దళితబంధు పేరుతో రాజకీయ డ్రామా మొదలుపెట్టారన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో దాసోజు విలేకరులతో మాట్లాడారు. ఏడేళ్లు దళితులను పట్టించుకోని సీఎం.. ఇప్పుడు రసమయి మొదలుకుని దళిత నేతలను, నాయకులను కౌగిలించుకుంటున్నారని విమర్శించారు. హుజూరాబాద్‌లోని శాలపల్లిలో ప్రభుత్వ సభలో కౌశిక్‌రెడ్డి, గెల్లు శ్రీనివాసు ఏ అధికారంతో కూర్చున్నారని ద్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ చిల్లరగా వ్యవహరించారని, ప్రభుత్వ సభలో తెరాస నాయకులు కూర్చుంటే అతనికి సోయి లేదా? అని దుయ్యబట్టారు. సోమేశ్‌కుమార్ బాధ్యత మరిచి ఓ వ్యక్తికి బానిసలా పనిచేస్తున్నారని ఆరోపించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో తలపెట్టిన దండోరా సభను విజయవంతం చేయాలని కోరారు. -
కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలే...
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక తెరపైకి వచ్చినప్పటి నుంచి సీఎం కేసీఆర్ కొంగ జపం చేస్తున్నారని, ఒక్క అసెంబ్లీ స్థానం గెలవడానికి ఆయన దిగజారి వ్యవహరిస్తున్నారని టీపీసీసీ చీఫ్, మల్కాజ్గిరి ఎంపీ ఎ. రేవంత్‌రెడ్డి విమర్శించారు. హుజూరాబాద్ దళితబంధు సభలో సీఎం అన్నీ అబద్ధాలు చెప్పారని, ఆయన మాటల్లో పిరికితనం కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. అబద్ధాల పునాదులపై బీటలు వారుతున్న గులాబీ కోటను కాపాడుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. సోమవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు బెల్లయ్య నాయక్, సిరిసిల్ల రాజయ్య, అనిల్‌కుమార్ యాదవ్, మెట్టు సాయికుమార్, నర్సారెడ్డి తదితరులతో కలసి రేవంత్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో దళితులను పాచికలా వాడుకున్న కేసీఆర్... ఏడున్నరేళ్లలో ఎప్పుడూ అంబేడ్కర్, జగజ్జీవన్‌రాంల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించలేదని విమర్శించారు. నెక్లెస్ రోడ్డులో అంబేడ్కర్ భారీ విగ్రహం పెడతానని చెప్పి ఇప్పటివరకు తట్టెడు మట్టి కూడా తీయలేదని దుయ్యబట్టారు. దళితులకు మూడెకరాల చొప్పున భూపంపిణీ, దళిత విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిలిపివేత, 4 వేల సింగిల్ టీచర్ స్కూళ్ల మూసివేత, 9.50 లక్షల మంది దళితుల ఉపాధి దరఖాస్తుల తిరస్కృతి, ఇసుక మాఫియాను అడ్డుకున్న దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగం, దళిత మహిళ మరియమ్మ లాకప్‌డెత్ వంటి ఉదంతాలన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వ ‘ఘనత’లేనని చురకలంటించారు. దళితులకు అన్యాయం చేసిన వారిలో మొదటి ముద్దాయి కేసీఆరేనని రేవంత్ ఆక్షేపించారు. ఒక్క శాసనసభ ఎన్నికలో గెలవడం కోసం కేసీఆర్ తన భార్య శోభను కూడా రాజకీయాల్లోకి తెచ్చారని, ఆయన పాపాలను కడుక్కోవడానికి శోభమ్మను ముందుకు తెస్తున్నారని దుయ్యబట్టారు. 6 నెలల్లోగా ఇస్తారా? రాష్ట్రంలోని 30 లక్షల కుటుంబాలకు దళితబంధు కింద రూ. 10 లక్షలు ఇస్తామని కేసీఆర్ హామీ ఇవ్వాలని, ఇందుకోసం శాసనసభను సమావేశపరిచి ఒక రోజంతా చర్చ చేసి తీర్మానం చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. దళిత కుటుంబాలకు ఆరు నెలల్లోపు రూ. 10 లక్షలు ఇస్తామంటే కాంగ్రెస్ పక్షాన ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతామన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో వచ్చే తుపానుకు కేసీఆర్ కొట్టుకుపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. దళితులను మోసం చేస్తున్నందుకు సీఎం కేసీఆర్ ఇంటి ముందు చావు డప్పు మోగిస్తామని, రావిర్యాల సభ తర్వాత హుజూరాబాద్‌పై దండెత్తుతామని రేవంత్ చెప్పారు. -
మతతత్వపార్టీలో చేరి ఎర్రజెండా డైలాగులు
హుజూరాబాద్: బీజేపీ నేత, మాజీమంత్రి ఈటల రాజేందర్ మాటలకు, చేతలకు పొంతన ఉండదని, మతతత్వ పార్టీ అయిన బీజేపీలో చేరి, ఎర్రజెండా డైలాగులు కొడుతున్నారని రాష్ట్ర ఆర్థికమంత్రి టి.హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. రక్తసంబంధం కన్నా, వర్గసంబంధం గొప్పదని ఈటల అన్నారని, ఆ మాట మాట్లాడే అర్హత ఆయనకు లేదని హరీశ్ అన్నారు. వర్గ సంబంధమైన పార్టీని కాదని, మత సంబంధమైన పార్టీలో చేరింది ఎవరని నిలదీశారు. ఎప్పడు మాట్లాడినా తనది వామపక్ష భావజాలం, లెఫ్ట్ ఇజం అని చెప్పుకునే ఈటల బీజేపీలో చేరి ఆత్మవంచన చేసుకున్నారని విమర్శించారు. ఆదివారం హుజూరాబాద్‌లో ప్రజా ఉద్యమనాయకుడు పులవేని పోచమల్లు యాదవ్ టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హరీశ్ మాట్లాడారు. ఈటల పెట్టిన కష్టాలు, నష్టాలు భరించలేక పోచమల్లు టీఆర్ఎస్లో చేరారని తెలిపారు. ఏడేళ్లు మంత్రిగా ఉండి నియోజకవర్గంలో ఏమీ చేయలేని ఈటల బీజేపీ నుంచి గెలిస్తే అభివృద్ధిని ఎలా సాధిస్తారని ప్రశ్నించారు. హుజూరాబాద్ ప్రజలు అభివృద్ధి, సంక్షేమం కోరుకుంటున్నారని టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు సీఎం కేసీఆర్ ఆశీస్సులు ఉన్నాయని అన్నారు. శ్రీనివాస్ తెలంగాణ ఉద్యమంలో పనిచేశారని, పోలీసుల రబ్బర్ బుల్లెట్లకు అడ్డంగా ఉరికారని గుర్తు చేశారు. ఈటల ఓటమి ఖాయమని, తల కిందకు, కాళ్లు మీదకు పెట్టినా గెలిచే ప్రసక్తే లేదని అన్నారు. ఇప్పటికే గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయమైందని, ఇక మెజార్టీ ఎంతనేది తెలాల్సి ఉందని అన్నారు. ఈటల చారాణ బీసీ.. బారాణ రెడ్డి: గంగుల ఈటల ఏనాడూ బీసీలాగా ప్రవర్తించలేదని, అందుకే ఆయన చారాణ బీసీ, బారాణ రెడ్డి అని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఎద్దేవా చేశారు. అసలు సిసలైన బీసీ బిడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపించుకోవాలని, ఆయన కేసీఆర్ విడిచిన బాణం అని అన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మికాంతారావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీష్‌కుమార్, పాడి కౌశిక్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పెద్ద దుష్మన్ కాంగ్రెస్సే
నిర్మల్: దేశానికి, సమాజానికి పెద్ద దుష్మన్ కాంగ్రెస్ పార్టీయేనని, కులాలు మతాలుగా ప్రజలను వీడదీసిందని, 75 ఏళ్ల నుంచి కేన్సర్ వ్యాధిలా పీడిస్తోందని ఎంపీలు సోయం బాపూరావు, ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యే రఘునందన్‌రావు దుయ్యబట్టారు. రేవంత్‌రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నారని, కేసీఆర్‌ను మూడు నెలల్లోనే గద్దెదించవచ్చని పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో హిందూవాహిని ఆధ్వర్యంలో శనివారం అఖండ భారత్ దివస్ సభ నిర్వహించారు. హిందూవాహిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధ్యక్షుడు రాజవర్ధన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు హరిచంద్రరెడ్డి మాట్లాడుతూ.. భైంసా ఘటనల్లో ఒకవర్గం యువకులపైనే తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారని మండిపడ్డారు. 1970 నుంచి 2020 వరకు భైంసా అల్లర్లలో హిందువులే నష్టపోయారని చెప్పారు. కేసీఆర్‌వి చిల్లర రాజకీయాలు మనోడే మోసం చేస్తే వంద అడుగుల బొంద తీసి పాతిపెట్టాలని కాళోజీ చెప్పారని, ఇప్పుడు రాష్ట్రంలో భయంకర హిందువునని చెప్పుకొనే సీఎం ఉన్నా భైంసాలో హిందువులపై దాడులు జరుగుతున్నాయని ఎంపీ ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు. పనికిరాని కొడుకును సీఎం చేసేందుకు సీఎం కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. ఇంద్రవెల్లిలో ఆదివాసీలను చంపింది కాంగ్రెసేనని, అదే గడ్డకు వెళ్లి రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని పేర్కొన్నారు. కొందరు ఐపీఎస్ అధికారులు యూనిఫాం లోపల గులాబీ కండువాలు వేసుకుని పనిచేస్తున్నారని, అలాంటి వారి లెక్క లు రాసిపెట్టి, తాము అధికారంలోకి వచ్చాక వారి సంగతి చూస్తామని హెచ్చరించారు. ఒవైసీ చేతిలో కారు స్టీరింగ్.. రాష్ట్రంలో పేరుకే టీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తోందని, కారు స్టీరింగ్ మాత్రం ఒవైసీ చేతుల్లో ఉందని ఎంపీ సోయం బాపూరావు అన్నారు. భైంసాలో 40 ఏళ్లుగా అధికార పార్టీతో కుమ్మక్కై ఎంఐఎం దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి తొత్తులుగా మారిన పోలీసులు ఒక వర్గం యువతపైనే కేసులు పెడుతున్నారని ఎమ్మెల్యే రఘునందన్‌రావు మండిపడ్డారు. ఒవైసీ చేతిలో కారు స్టీరింగ్.. రాష్ట్రంలో పేరుకే టీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తోందని, కారు స్టీరింగ్ మాత్రం ఒవైసీ చేతుల్లో ఉందని ఎంపీ సోయం బాపూరావు అన్నారు. భైంసాలో 40 ఏళ్లుగా అధికార పార్టీతో కుమ్మక్కై ఎంఐఎం దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి తొత్తులుగా మారిన పోలీసులు ఒక వర్గం యువతపైనే కేసులు పెడుతున్నారని ఎమ్మెల్యే రఘునందన్‌రావు మండిపడ్డారు. -
బ్రిటిష్, నిజాంలను మరిపిస్తున్న కేసీఆర్
కొణిజర్ల: గత ముప్ఫై ఏళ్లుగా పోడు సాగు చేసుకుంటున్న గిరిజనులు, నిరుపేదలపై కేసీఆర్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తూ జైలుపాలు చేయడం బ్రిటిష్, నిజాంల పాలనను తలపిస్తోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ఎల్లన్ననగర్‌లో ఇటీవల పోడు ఘర్షణలో అటవీ అధికారులు కేసులు నమోదు చేయగా, జైలుకు వెళ్లి వచ్చిన మహిళారైతులను వారు శుక్రవారం ఇక్కడ పరామర్శించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... దశాబ్దాలుగా పోడు భూములు సాగు చేసుకుంటున్నవారికి తమ హయాంలో హక్కు కల్పించగా, 2014 తర్వాత ఆ చట్టం అమలు కావడం లేదన్నారు. దీనికితోడు నిరుపేద దళితులు, గిరిజనులకు మూడెకరాలు భూమి ఇస్తానని గద్దెనెక్కిన కేసీఆర్ తర్వాత ఆ భూమి ఇవ్వకపోగా, ఉన్న పోడు భూములను లాగేసుకుంటున్నారని మండిపడ్డారు. ఎల్లన్ననగర్ పోడు సాగుదారుల విషయంలో అటవీ, జైలు శాఖల అధికారుల తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌కు నిరుపేదలంటే చిన్నచూపని ఆరోపించారు. బడా భూస్వాములు గుట్టలకు పట్టాలు చేయించుకున్నా రైతుబంధు ఇస్తూ, పేదలు పోడు సాగుచేసుకుంటే మాత్రం ఒప్పుకోవడం లేదని విమర్శించారు. ఇక్కడి మహిళలపై అట వీ అధికారులు తప్పుడు కేసులు పెట్టి జైలుకు పం పితే, జైలు అధికారులు ఇబ్బంది పెట్టడం క్షమించరాని నేరమని పేర్కొన్నారు. ‘కొత్త భూమి కొట్టం, పాత భూమి పోనివ్వం’అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందని సీతక్క వెల్లడించారు. వారి వెంట మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య పాల్గొన్నారు. గిరిజనులిచ్చిన రొట్టెలు తిన్న భట్టి, సీతక్క ఎల్లన్ననగర్ పోడు సాగుదారులను పరామర్శించడానికి వచ్చిన భట్టి విక్రమార్క, సీతక్కకు వారు జొన్నరొట్టెలు ఇచ్చారు. స్థానిక గిరిజన మహిళలు రొట్టెలు తినాలని కోరగా, తొలుత వద్దని చెప్పిన నేతలు ఆ తర్వాత పప్పుతో జొన్న రొట్టెలు తినడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. -
దమ్ముంటే కేసీఆర్,హరీశ్‌రావు నాపై పోటీచేయాలి:ఈటల
హుజూరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికలో దమ్ముంటే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు తనపై పోటీచేయాలని మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. ఉరుములు వచ్చినా.. పిడుగులు పడినా తన గెలుపును ఎవరూ ఆపలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం చెల్పూర్లో బీజేపీలో చేరిన దాదాపు 500 మంది ముదిరాజ్ కులస్తులకు ఈటల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ, ‘నన్ను బక్కపల్చటి పిలగాడు.. దిక్కులేని వాడని అనుకోవద్దు.. హుజూరాబాద్ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్న బిడ్డను నేను’ అన్నారు. దళితబంధుతో రూ.10 లక్షలు ఇచ్చినా.. గొర్రెలిచ్చినా, కులాల వారీగా తాయిలాలిచ్చినా ప్రజల గుండెల్లో ఉంది తానేనని పేర్కొన్నారు. తాను పనిచేస్తేనే ఇక్కడి ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, జెడ్పీటీసీలుగా గెలిచారన్నారు. సీఎం కేసీఆర్‌కు దళితుల ఓట్ల మీద తప్ప, హుజూరాబాద్ దళితులపై ప్రేమ లేదని, ఆసరా పింఛన్లు, రేషన్‌కార్డులు ఇవ్వాలని కోరినందుకే తనపై కేసీఆర్ కోపం పెంచుకున్నారని తెలిపారు. కమ్యూనిటీ హాళ్లకు, ఆలయాలకు నిధులిస్తే తప్పులేదని, ఆ సొమ్మంతా ప్రజలదే అన్నారు. ఏమిచ్చినా తీసుకుని ఓటు మాత్రం పువ్వు గుర్తుకు వేయాలని ఈటల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
కేసీఆర్ ముఖ్యమంత్రా.. వాసాలమర్రి సర్పంచా?
సాక్షి, హైదరాబాద్: కేసీ ఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రో లేక వాసాలమర్రి గ్రామానికి సర్పంచో చెప్పాలని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ విమర్శించారు. ఆత్మగౌరవంతో బతకాల్సిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లకు ఉద్యోగాలు కల్పించి ఉంటే సీఎం ఇచ్చే రూ.10 లక్షల అవసరం ఎందుకు ఉండేదని అన్నారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన ప్రచార కమిటీ కో కన్వీనర్ అజ్మతుల్లా హుస్సేనీ, టీపీసీసీ వీవర్స్ సెల్ చైర్మన్ శ్రీనివాస్‌తో కలసి మీడియాతో మాట్లాడుతూ ఆత్మగౌరవం, విద్యా, ఉద్యోగాలు, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అ యిందని అన్నారు. నయా నిజాంలా పాలిస్తు న్న కేసీఆర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఈ నెల 9న దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా నిర్వహిస్తోందని చెప్పారు. హుజూరాబాద్ ఎ న్నికల కోసమే కేసీఆర్, దళితబంధు డ్రామాకు తెరలేపారని ఆరోపించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గాంధీభవన్‌లో టీపీసీసీ వీవర్స్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. -
శశాంక్ భారత క్రికెట్‌ను దెబ్బతీశారు!
ముంబై: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా ఇన్నాళ్లు వ్యవహరించిన శశాంక్ మనోహర్ భారత్ క్రికెట్‌ను బాగా దెబ్బతీశారని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ దుయ్యబట్టారు. భారతీయుడై ఉండి తన గొప్పల కోసం మన బోర్డు ప్రయోజనాలకు వ్యతిరేకిగా పనిచేశారని ఆరోపించారు. తను ఎలాగూ మళ్లీ బీసీసీఐలో క్రీయాశీలం కాలేనని భావించే... చేయాల్సిన నష్టమంతా చేశారని తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ‘నేను కచ్చితంగా చెప్పగలను... శశాంక్ బీసీసీఐ ప్రతిష్టను భ్రష్టు పట్టించారు. పలుకుబడిని పాతాళానికి తీసుకెళ్లారు. బోర్డు, భారత ప్రయోజనాలకు పాతరేశారు. ఇలాంటి వ్యక్తి పదవి నుంచి దిగిపోవడం ఇప్పుడు ప్రతి భారత క్రికెట్ అధికారికి సంతోషం కలిగించే అంశం. ఆయన భారత్‌ను ఆర్థికంగా దెబ్బతీసి ఒకప్పుడు ఐసీసీని శాసించే స్థితిలో ఉన్న బీసీసీఐని ఇప్పుడు ప్రాముఖ్యత లేకుండా చేశారు. చెప్పుకోలేనంత నష్టాలెన్నో చేసి అన్ని రకాలుగా బోర్డుకు కీడు తలపెట్టారు’ అని శ్రీనివాస్ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. శ్రీనివాసన్ వ్యాఖ్యలతో మాజీ కార్యదర్శి నిరంజన్ షా కూడా ఏకీభవించారు. -
‘అయోమయంగా కరోనా లెక్కలు’
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ సంఘటనల విషయంలో ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు, వెలువడుతున్న నివేదికలకు తేడా ఉంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ విమర్శించారు. ఆ లెక్కలు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయన్నారు. ఆదివారం ఆన్లైన్ ద్వారా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈశ్వరయ్య అనే వ్యక్తి గతనెల 29న చనిపోయారని గాంధీ ఆçస్పత్రి వర్గాలు చెబుతుంటే ప్రభుత్వం మాత్రం 30న అని అంటోందన్నారు. ఈశ్వరయ్య కొడుకు మధుసూదన్ 30వ తేదీ సాయంత్రం ఆస్పతిలో చేరారని, ఆ వెంటనే ఆయనను వెంటిలేటర్‌పై పెట్టామని ప్రభు త్వం చెబుతోందన్నారు. కానీ మే 1న మధ్యాహ్నం 12.05 గంటలకు మధుసూదన్‌తో ఆయన భార్య మాట్లాడారని, వెంటిలేటర్ పై ఉన్న వ్యక్తి తన భార్యతో ఎలా మాట్లాడారని సంజయ్ ప్రశ్నించారు. ప్రభుత్వం మధుసూదన్ మృతిని ఎందుకు దాచి పెట్టే ప్రయత్నం చేస్తోంది? అని ప్రశ్నించారు. -
నిర్మల.. యాక్సిడెంటల్ మినిస్టర్!
సాక్షి, హైదరాబాద్: పేద ప్రజల కోసం, వలస కార్మికుల కోసం ప్రతిరోజూ తపిస్తూ తన వంతు మనోధైర్యాన్ని ఇస్తూ అండగా నిలుస్తున్న ఎంపీ రాహుల్ గాంధీని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించడం విడ్డూరంగా ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. సీతారామన్ అనుకోకుండా ఆర్థిక మంత్రి అయ్యారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని, రాహుల్‌ను విమర్శించడం మానుకోవాలని సోమవారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. ఆమె బయటకు వచ్చి వలసకార్మికులను చూస్తే వారు పడుతున్న కష్టాలు ఏంటో అర్థమవుతాయని, ఏసీ గదుల్లో కూర్చుని ప్రెస్మీట్లు పెడితే ఏం తెలుస్తాయని పొన్నం ఎద్దేవా చేశారు. రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ అంటూ దేశ ప్రజలను మోసం చేస్తున్నారని, ఈ ప్యాకేజీలతో పేద ప్రజలకు ఒరిగిందేమీ లేదని, కరోనా మాటున దేశంలో ఉన్న కీలక రంగాలను ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర చేస్తూ లబ్ధి పొందాలని కేంద్రం చూస్తోందని ఆయన ఆరోపించారు. -
ట్రంప్‌పై ఒబామా సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ కాలేజీలో ఏర్పాటుచేసిన గ్రాడ్యుయేషన్ సెరిమనీలో పాల్గొన్న ఒబామా నల్లజాతీయులపై జరుగుతున్న దాడులు, వివక్ష, దేశంలో కరోనాతో నెలకొన్న పరిస్థితులు వంటి అంశాలను ప్రస్తావించారు. కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. 75,000 మందికి పైగా అమెరికన్ల ప్రాణాలను తీసిన మహమ్మారిని ఎదుర్కోవడానికి తగిన వైద్య పరికరాలు లేవు. కరోనా మహమ్మారిని ఎదుర్కొవడంలో డొనాల్డ్ ట్రంప్ దారుణంగా విఫలమయ్యారంటూ ఒబామా మండిపడ్డారు. చదవండి: భారతీయులు భళా: ట్రంప్ ప్రస్తుత పరిస్థితుల్లో అనేక మంది తమను తాము ఇన్‌చార్జ్‌లుగా చెప్పుకుంటున్నా వారు చేస్తున్న పనులు వారికే అర్థం కావడంలేదు. అనేక సంవత్సరాలుగా నల్లజాతీయులపై వివక్ష కొనసాగుతూనే ఉంది. ఈ సందర్బంగా ఫిబ్రవరి 23న జార్జియాలో 25ఏళ్ల అహ్మద్ ఆర్బెరిని కాల్చి చంపిన ఘటనని గుర్తు చేశారు. కరోనా తీవ్రంగా విస్తరిస్తున్న సమయంలోనూ.. బయటికి వచ్చిన నల్లజాతీయులను చంపేస్తున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధ్యాతాయుతమైన పదవుల్లో ఉన్నవారు తాము విధులు నిర్వర్తిస్తున్నట్లు కనీసం నటించడం లేదంటూ' ఒబామా విమర్శలు గుప్పించారు. కాగా.. గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోవిడ్–19పై పోరాటంలో పూర్తిగా విఫలమయ్యారని, ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో ట్రంప్ వ్యవహరించిన తీరు.. విపత్తుని మరింత గందరగోళంగా మార్చిందని విమర్శించిన విషయం తెలిసిందే. చదవండి: వాటి వల్ల కరోనా చావదు: డబ్ల్యూహెచ్‌వో -
కేసీఆర్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్తారు: బండి సంజయ్
కరీంనగర్‌టౌన్: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపు విషయంలో ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసినా.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న కేసీఆర్ సర్కారు తీరుకు నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ శనివారం కరీంనగర్‌లోని తన నివాసంపై నల్ల జెండా ఎగరేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని బీజేపీ లేవనెత్తే వరకు సీఎం కేసీఆర్ స్పందించలేదని, అన్ని వర్గాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారని విమర్శించారు. బీజేపీ కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాయడం, నిరసన దీక్ష వంటి అనేక కార్యక్రమాలు చేపట్టిందని, ఇవాళ ఇంటిపై నల్లజెండా ఎగరేసే కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా రాబట్టుకోవడంలో విఫలమైన కేసీఆర్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. -
కేసీఆర్ క్వారంటైన్ సీఎం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ క్వారంటైన్లో ఉన్నారని, పేదలు ఇబ్బందులు పడుతు న్నా ఇంట్లో నుంచి ఆయన బయటకు రారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ విమర్శించారు. జోకర్ ముఖ్యమంత్రి, క్వారంటైన్ ముఖ్యమంత్రి అన్న పేరు కేసీఆర్‌కు కరెక్ట్‌గా సెట్ అవుతుందన్నారు. ఆరేళ్లుగా ఆయన క్వారంటైన్లో నే ఉన్నారని, తాను బతికే ఉన్నానని చెప్పేందుకు అప్పుడప్పుడు బయటకు వస్తారని దుయ్యబట్టా రు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఆయన మీడియాతో జూమ్ యాప్ ద్వారా మాట్లా డారు. ప్రజలను, రైతులను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆరోపించారు. కోటి టన్నుల ధాన్యం సేకరిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు 20 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే సేకరించిందన్నారు. దేశంలో 18 రాష్ట్రాల ప్రభుత్వా లు ధాన్యం కొనుగోలు చేస్తున్నాయని, కేసీఆర్ మాత్రం తాము ధాన్యం సేకరించకుంటే పరిస్థితి ఏంటని రైతులను బెదిరిస్తున్నారన్నారు. కేసీఆర్‌కు దమ్ము, దైర్యం ఉంటే కొనుగోళ్ల కేంద్రాల్లో పర్య టించాలన్నారు. గన్నీ బస్తాలు, రవాణా చార్జీలు ఇలా ప్రతి పైసా కేంద్రమే ఇస్తుందని, గిడ్డంగుల నిర్మాణం కోసం రూ.464 కోట్లు ఇచ్చిందని తెలి పారు. కరోనా విషయంలో వైద్యులు టెస్టులు చేయండని వేడుకున్నా సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని సం జయ్ మండిపడ్డారు. ప్రజల ప్రాణాలు, మరణాలను కేసీఆర్ కోరుకుంటున్నారని, ఆయన నిర్ణయాల వల్లే హైదరాబాద్‌లో మళ్లీ కేసులు పెరిగాయని ఆరోపించారు. గత నెలలో కరోనాతో ఒకరు చనిపోయినా ప్రకటించకపోవడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను దొంగలకు అడ్డాగా మారుస్తున్న ఎంఐఎంకు టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇవ్వడం బాధాకరమన్నారు. పాతబస్తీలో దళిత మైనర్ బాలికపై అత్యాచారం చేయడం దురదృష్ట కరమని, ఆ ఘటనకు పాల్పడిన ఎంఐఎం వ్యక్తిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
బీజేపీ దీక్ష ఓ రాజకీయ డ్రామా
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో కూడా రైతులు పండించిన ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతున్న వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుపై తప్పుడు ప్రచారం చేయడానికే బీజేపీ దీక్షపేరుతో డ్రామాలాడుతోందని విమర్శించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన దీక్ష పెద్ద డ్రామా అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు, అన్ని రకాల పంటలకు మద్దతు ధర ప్రకటించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు, మద్దతు ధర అమలు కోటా పరిమితి లేకుండా రైతులు పండించిన మొత్తం ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు దీక్షలు చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. -
‘పీఆర్సీ, నిరుద్యోగం’పై ఉద్యమం
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగుల సమస్యలు, ఉద్యోగుల పీఆర్సీ కోసం త్వరలోనే బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపట్టనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ మాటలకు, టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు, ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌కు పొంతనే లేదన్నారు. నిలువెల్లా అబద్ధాలతో కూడిన మోసపూరిత బడ్జెట్‌గా అభివర్ణించారు. రైతులు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు, బీసీలు, ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలు ఇలా అన్ని వర్గాలను మోసం చేశారని దుయ్యబట్టారు. ప్రస్తుత బడ్జెట్ ‘బడ్జెట్ బారెడు – ఖర్చు జానెడు, పేరు గొప్ప – ఊరు దిబ్బ’అన్న చందంగా ఉందని విమర్శించారు. తలసరి ఆదాయం చెప్పిన ప్రభుత్వం అప్పును ఎందుకు చెప్పడం లేదు? లోటును ఎలా పూడ్చుతారో చెప్పలేదేంటని ప్రశ్నలు సంధించారు. ఫీజు రీయింబర్స్మెంట్, డబుల్ బెడ్రూం ఇళ్లు.. వంటి కీలకమైనవాటిని గాలికొదిలేశారన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయకుండా నిరుద్యోగులను దారుణంగా మోసం చేస్తున్నారని మండిపడ్డారు.ఒక్కొక్కరి తలపై రూ.91వేలు అప్పు పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని విమర్శించారు. ‘నిరుద్యోగ భృతి అని చెప్పి ఏడాదిన్నర కావొస్తున్నా అతీగతి లేదన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వకుండా, తాజాగా డబ్బులు ఇస్తామని కొత్త మోసం చేయబోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు త్వరలో ఉన్నందునే నగరానికి రూ.పది వేల కోట్లు అంటున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రంపై సాకు వేసి తమ అసమర్థతను కప్పిపుచ్చుకుంటున్నారన్నారు. జిల్లాకో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నారు. ఏమైందని ప్రశ్నించారు. కరోనాకు పారాసిటమాల్ మందును డాక్టర్ కేసీఆర్ కనుగొన్నారా? అని ప్రశ్నించారు. ఎంఐఎంకు తలొగ్గి సీఏఏపై తీర్మానం చేస్తామంటున్నారని విమర్శించారు. -
కంటెంట్ కావాలి డ్యూడ్!
వేదికలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడం పాత పద్ధతి. ఆన్లైన్లో ఓ పంచ్ డైలాగ్‌తో సెటైర్లు వేసుకోవడం కొత్త ఆనవాయితీ. ఈ ట్రెండ్‌కు తగ్గట్టు పార్టీలూ, నాయకులూ మారారు. స్మార్ట్ఫోన్లలోకి దూరి మరీ ప్రచారం చేస్తున్నారు. ప్రత్యర్థిని తెలివిగా విమర్శించాలి. చేతగానితనాన్ని ఎత్తిచూపాలి. వీలైతే కళ్లకు కట్టినట్లు చూపాలి. అప్పుడే ఓటరు ప్రభావితమవుతాడు. చేసింది చెప్పడం ఒక ఎత్తు.. చేయబోయేదీ చెప్పడం మరో ఎత్తు. మొత్తానికి దేన్నయినా ఎఫెక్టివ్‌గా చెప్పడానికి చేయాలెంతో కసరత్తు.. అందుకే, భాషపై పట్టున్న కంటెంట్ రైటర్లకు డిమాండ్ పెరిగింది. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల నాయకులు విమర్శలకు పదును పెడుతున్నారు. ఆరోపణలకు సానబెడుతున్నారు. ప్రెస్మీట్లు, బహిరంగసభల్లో మంచి ప్రసంగాలు రాయించుకుంటున్నారు. రాష్ట్రంలో 40 శాతానికి పైగా 20 నుంచి 40 ఏళ్ల యువ ఓటర్లున్నారు. వీరందరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్లున్నాయి. అందుకే, తమ విమర్శలు, చేసిన ప్రచారం 24 గంటలూ అందరికీ చేరేలా పార్టీలు పలు వ్యూహాలు అమలు చేస్తున్నాయి. తమ విమర్శలకు మంచి కంటెంట్‌తో తయారైన సెటైర్లు, పంచ్‌లు, ప్రాసలతో ప్రత్యర్థులపై ఆన్లైన్లో మెరుపు యుద్ధానికి దిగుతున్నాయి. నాయకులకు లక్షల్లో ఫాలోవర్లు! తమ ప్రసంగాలను, విమర్శలను మంచి పదాలతో పొందుపరచడంతో పాటు, ఆ వీడియోలను ఫేస్బుక్, ట్విట్టర్లో లైవ్‌లో అందుబాటులో ఉంచడం లేదా క్షణాల్లో అప్లోడ్ చేయడం, వాటికి గ్రాఫిక్స్ జోడించడం ఇపుడు సాధారణ విషయమైపోయింది. అందుకే, రాజకీయ నేతల ట్విట్టర్, ఫేస్బుక్ ఖాతాలను లక్షల మంది అనుసరిస్తున్నారు. అన్ని పార్టీలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలన్న నిబంధన విధించడంతో అభ్యర్థులు, ఆశావహులు ఖాతాలు తెరిచేశారు. వీటి కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించుకుని, తమ ఫాలోవర్లు పెరిగేలా 24 గంటల పాటు ఈ ఖాతాలను నిర్వహిస్తున్నారు. వీటికి లైకులు కొట్టేందుకు, షేర్ చేసేందుకు కొందరు ప్రత్యేకంగా ఫేక్ ఫాలోవర్లు ఉంటారు. వీరికి రోజుకు రూ.200 నుంచి 400 వరకు చెల్లిస్తున్నారు. ఎన్నికల ప్రచారం ముగిసేదాకా ఫలానా నాయకుడు చేసిన ట్వీట్లను రీట్వీట్ చేయడం, కామెంట్ చేయడం, ఫేస్బుక్ పోస్టులను లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం వీరి పని. వీరు తమ సెల్ఫోన్ల ద్వారా షిప్టుల వారీగా నిరంతరం ఇదే పనిలో ఉంటారు. వీరిలో కొందరు రాత్రిపూట సైతం ‘ఆన్లైన్’ విధుల్లోనే ఉంటారు. అన్ని పార్టీలదీ ‘సోషల్’ దారే! రాజకీయ సోషల్ వార్ విషయంలో నాలుగేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ముందుంది. వీటిని నడిపే వారిలో అధికశాతం కాంగ్రెస్ సానుభూతి పరులే. ఈ పార్టీ అధికారిక ఖాతాతో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తన ఓటుబ్యాంకును కాపాడుకుంటోంది. ఈ క్యాంపెయిన్‌కు ఎన్నారైలూ బాసటగా నిలుస్తున్నారు. ఈ విషయంలో టీఆర్ఎస్, బీజేపీ, టీజేఎస్ అందరిదీ ఒకటే లక్ష్యం. తమ సందేశం లక్షలాదిమంది యువతకు చేరాలి. రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఓటరుకు తమ వినతి అందాలన్న తాపత్రయంతో సోషల్ మీడియాపై నెలానెలా రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఇక, ఎవరికి వారు నిర్వహించుకుంటున్న వాట్సాప్ గ్రూపులు సరేసరి. ఫేస్బుక్, ట్విట్టర్ కంటే వాట్సాప్ పోస్టులు, షేరింగులే క్షణాల్లో చక్కర్లు కొడుతూ ఎక్కువ మందికి చేరుతున్నాయి. ఈసీ దృష్టి సారించేనా.. పార్టీల సోషల్ మీడియా ఖాతాల నిర్వహణ ఆషామాషీ కాదు. తెలుగు భాషపై, స్థానిక రాజకీయాలపై పట్టున్న కంటెంట్ రైటర్లకు ఒక్కొక్కరికి రూ.30 వేల నుంచి రూ.70 వేల దాకా ఇచ్చి రిక్రూట్ చేసుకుంటున్నారు. ఈ పనులను కొన్ని పార్టీలు నేరుగా చేస్తుంటే.. మరికొందరు సానుభూతిపరుల రూపంలో ఈ వ్యవహారాన్ని చక్కబెట్టేస్తున్నారు. పైగా నోటిఫికేషన్ వచ్చేవరకు వీటికి లెక్కలు చూపించాల్సిన పని లేదు. సోషల్ మీడియా ఖర్చులకు అభ్యర్థులు నామినేషన్ వేసేంత వరకు లెక్క చూపించనక్కర్లేదు. ఇదే అదనుగా చాలామంది ఆన్లైన్ క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు. పంచ్..ప్రాస.. వైరల్ పార్టీలు పంచ్ కామెంట్లతో ఆకట్టుకునేందుకు పోటీపడుతున్నాయి. సినిమా సన్నివేశాల్లోని హీరో ముఖానికి తమ పార్టీ అధినేత ముఖాన్ని మార్ఫింగ్ చేసి, విలన్ల (పత్యర్థి)ను చితక్కొట్టినట్లు చెలరేగిపోతున్నారు. ప్రాసలతో పంచ్ డైలాగ్‌లు ఉంచుతున్నారు. వీటికి సంగీతం సమకూర్చి.. ఎడిటింగ్ చేయాలి. డైలాగులు తిరగ రాయాలి. అందుకే, కంటెంట్ రైటర్స్, గ్రాఫిక్ డిజైనర్స్, వీడియో ఎడిటర్లకు డిమాండ్ పెరిగింది. -
ఆరెస్సెస్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది: పాక్
న్యూఢిల్లీ: భారత్‌లో ఆరెస్సెస్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందని పాక్ విమర్శించింది. ఐక్యరాజ్య సమితిలో సుష్మాస్వరాజ్ ప్రసంగానికి పాక్ ప్రతినిధి సాద్ వారైచ్ సమాధానమిస్తూ.. భారత్‌లో ‘ఫాసిస్టు’ ఆరెస్సెస్ కారణంగా మతసామరస్యం దెబ్బతింటోందని.. కేంద్ర ప్రభుత్వం ఇందుకు పూర్తిగా సహకరిస్తోందని విమర్శించారు. ‘మా (ఆసియా) ప్రాంతంలో నియంతృత్వ ఆర్ఎస్ఎస్ కేంద్రాలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయి. భారతదేశంలో మైనారిటీలైన ముస్లింలు, క్రైస్తవులపై అత్యాచారాలు జరుగుతున్నాయి. హిందుత్వవాది అయిన యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎంగా ఉన్నారు. భారత్ నుంచి వచ్చే వారు ఇతరులకు సూక్తులు చేప్పాల్సిన పనిలేదు’అని వారైచ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. అస్సాంలో జాతీయ పౌర రిజిస్టర్ పేరుతో మైనారిటీల ఓట్లను తొలగించారన్నారు. అమిత్ షా వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ఓ ముఖ్యనేత వారిని దేశం నుంచి బహిష్కరిస్తామన్నారని విమర్శించారు. -
సాహెబ్ కా కమాల్ దేఖో..!
న్యూఢిల్లీ: ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ప్రధాని మోదీపై విమర్శనాస్త్రాలు సంధించటం ఆపలేదు. పెరుగుతున్న చమురు ధరలు, రాఫెల్ ఒప్పందం, పడిపోతున్న రూపాయి విలువ అంశాలుగా శనివారం ట్విట్టర్లో ఒక హిందీ కవితను పేరడీగా మలిచారు. ప్రధాని మోదీని సాహెబ్ అని సంబోధించారు. మధ్యప్రదేశ్ పర్యాటక శాఖ ప్రకటనల్లో ఉన్న ఒక లైన్‌ను ఆధారంగా చేసుకుని సాహెబ్ కా కమాల్ దేఖో.. అంటూ ప్రారంభించి ముంబై, ఢిల్లీల్లో అత్యధిక పెట్రోల్ ధరలను, డాలర్‌పై రూపాయి విలువ పతనాన్ని ప్రస్తావించారు. రాఫెల్ ఒప్పందం ఒక కుంభకోణం అని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌లో ఓ టీచర్‌ను బీజేపీ అనుబంధ విద్యార్థి విభాగం నేతలు వేధిస్తున్నట్లుగా ఉన్న ఓ వీడియోనూ షేర్ చేశారు. -
రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం
సుభాష్‌నగర్(నిజామాబాద్‌అర్బన్): ప్రభుత్వానికి రైతులపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం పాలనను కొనసాగిస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి, రాష్ట్ర కార్యవర్గసభ్యులు బస్వా లక్షీనర్సయ్య విమర్శించారు. మంగళవారం నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాలువకు ఒక టీఎంసీ నీటిని విడుదల చేయాలని రైతులు గత పదిరోజులుగా ఆందోళనలు చేస్తున్నా.. ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ప్రస్తుతమున్న 16 టీఎంసీల్లో 6టీఎంసీలు డెడ్ స్టోరేజీ, 6 టీఎంసీలు మిషన్ భగీరథ, 4 టీఎంసీలు ఆవిరి నష్టాల కింద ఉంచుతున్నారని, అందులో నుంచి ఒక టీఎంసీ నీటిని వదిలితే నష్టమేంటని ప్రశ్నించారు. రైతులకు సంకెళ్లు వేసిన చరిత్ర ఈ ప్రభుత్వానిది.. రాష్ట్రంలో ప్రభుత్వం నాలుగేళ్లలో రైతులకు చేసింది శూన్యమని వారు ఆరోపించారు. నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీరందిస్తామని చెప్పారని, కానీ కొత్తగా జిల్లాలో ఎన్ని ఎకరాలకు నీరందించారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖమ్మంలో మిర్చి రైతులకు సంకెళ్లు, మల్లన్నసాగర్లో రైతులను కొట్టి రక్తాన్ని కళ్లచూసిన చరిత్ర, మెదక్‌లో కరెంట్ కోసం, ఇప్పుడు సాగునీటిని అడిగిన రైతులపై కేసులు నమోదు చేసిన చరిత్ర ఈ ప్రభుత్వాని దని విమర్శించారు. ఎస్సారెస్పీ నుంచి వెంటనే 26 గ్రామాల రైతులకు సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్‌చేశారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ యాక్ట్ సవరణ బిల్లు–2018 పార్లమెంట్లో ఆమోదం పొందినందుకు హర్షం వ్యక్తంచేస్తూ ప్రధానమంత్రి మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈసమావేశంలో నాయకులు గజం ఎల్లప్ప, జాలిగం గోపాల్, న్యాలం రాజు, లింగం, శైలజ, పుట్ట వీరేందర్, స్వామి యాదవ్, తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు
సాక్షి, న్యూఢిల్లీ : వర్షాకాల సమావేశాల్లో భాగంగా పార్లమెంట్ ఉభయ సభలు రెండో రోజు గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. నేడు రాజ్యసభలో ఆర్టీఐ అనుబంధ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు లోక్‌సభలో కొద్దిసేపు గందరగోళ వాతావరణం చోటుచేసుకుంది. చెన్నై విమానాశ్రయం విస్తరణ పనులపై అన్నాడీఎంకే సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి జయంత్ సిన్హా సమాధానం చెబుతున్న సమయంలో విపక్షాలు పెద్ద ఎత్తున నిరసన గళాన్ని వినిపించాయి. స్పీకర్ వారించిన కూడా వారు వినిపించుకోలేదు. సిన్హా మాట్లాడుతున్న సమయంలో విపక్ష నాయకులు ఆయనకు వ్యతిరేకంగా, హేళన చేసేలా వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్‌లో ఓ మాంస వ్యాపారిని కొట్టి చంపిన కేసులో జైలు నుంచి విడుదలైన నిందితులకు ఆయన పూలమాలలు వేసి, స్వీట్లు పంచి సన్మానం చేసిన సంగతి తెలిసిందే. హత్యకేసులో నిందితులకు సన్మానం చేసిన సిన్హా.. ఈ విషయమై సభకు సమాధానం చెప్పాలంటూ ప్రతిపక్ష సభ్యులు ఆయన నిలదీశారు. సిన్హాకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. -
దీక్ష పేరుతో ప్రజాధనం వృథా
రైల్వేకోడూరు అర్బన్ : రాష్ట్రానికి ప్రత్యేకహోదా తేవడంలో నాలుగేళ్లుగా ప్రజలను మభ్యపెట్టి, ఇప్పుడు ఒక రోజు దీక్ష అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృథా చేశారని వైఎస్సార్ సీపీ నాయకులు విమర్శించారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శనవారం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికైనా ప్రజలను మభ్య పెట్టడం మానాలని హితవు పలికారు. విభజన చట్టం ప్రకారం అప్పటి ప్రధాని హామీలు, రావల్సిన నిధులు తెప్పించడంలో చంద్రబాబు విఫలమయ్యారని ఆరోపించారు. ఎన్నికల ముందు ప్రజలను మభ్య పెట్టడానికి ప్రతిరోజు ఏదోక నాటకానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. దీక్ష చేయాల్సింది రాష్ట్రంలో కాదని, ధైర్యం ఉంటే ఢీల్లీలో ప్రధాని నివాసం ముందు చేయాలన్నారు. బీజేపీతో తెగతెంపులు అంటూ ప్రజలను నమ్మించి, లోపాయికారిగా కేసుల కోసం బీజేపీ వారికి టీటీడీ పాలక మండలి సభ్యులుగా పదవులు ఇవ్వడమేంటని వారు ప్రశ్నించారు. ఏసీలు పెట్టుకుని దీక్షలు చేసే చంద్రబాబుకు ఉద్యమాల గురించి ఏం తెలుసునని వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజం సుకుమార్‌రెడ్డి, జెడ్పీటీసీ మారెళ్ల రాజేశ్వరి, పట్టణ కన్వీనర్ సీహెచ్ రమేష్ విమర్శించారు. పార్టీ మండల కన్వీనర్ గుంటిమడుగు సుధాకర్‌రాజు, నియోజకవర్గ అధికార ప్రతినిధి మందల నాగేంద్ర, జిల్లా స్టీరింగ్ కమిటీ సబ్యులు నందాబాల, ఎంపీటీసీలు మందల శివయ్య, డాక్టర్ సుబ్రమణ్యం, పట్టణ కన్వీనర్ అబ్దుల్‌రౌఫ్, సిగమల రామచంద్రారెడ్డి, నాయకులు తిరుపతి శేఖర్, సుదర్శన్ రాజు, గంగయ్య, తిప్పన మణి, డీవీ రమణ పాల్గొన్నారు. -
నీరవ్‌తో రాహుల్, సింఘ్వీలకు సంబంధాలు!
న్యూఢిల్లీ/ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్లు కుచ్చుటోపీ పెట్టిన నీరవ్ మోదీ అండ్ కో విదేశాలకు చెక్కేయగా.. మరోవైపు ఈ పాపానికి బాధ్యులు మీరంటే మీరంటూ బీజేపీ, కాంగ్రెస్‌లు పరస్పర విమర్శల్లో మునిగితేలాయి. ఈ కుంభకోణం యూపీఏ హయాంలోనే జరిగిందని, అయితే ప్రజల్ని తప్పుదారి పట్టించేలా కాంగ్రెస్ పార్టీ అబద్ధాల్ని ప్రచారం చేస్తోందని బీజేపీ ఆరోపించగా.. దేశానికి కాపలాదారుగా ఉన్న మోదీ నిద్రపోతుంటే.. దేశ సంపదను దోచుకుని దొంగలు పరారవుతున్నారని కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు సంధించింది. మరోవైపు శనివారం కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) దేశ వ్యాప్తంగా సోదాలు కొనసాగించి రూ. 25 కోట్ల విలువైన ఆభరణాల్ని స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ఇంతవరకూ రూ. 5,674 కోట్ల ఆస్తులు సీజ్ చేశామని ఈడీ తెలిపింది. నీరవ్‌ను పట్టుకుని తీరుతాం: సీతారామన్ నీరవ్ మోదీ కేసులో కాంగ్రెస్ ఆరోపణల్ని తిప్పికొట్టేందుకు రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను శనివారం బీజేపీ రంగంలోకి దింపింది. ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘యూపీఏ హయాంలో జరిగిన కుంభకోణాలు ఎన్డీయే హయాంలో బయటకొస్తుంటే.. మోదీ ప్రభుత్వ హయాంలో ఈ కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేస్తోంది. నీరవ్ మోదీ దేశం వదిలి పారిపోవచ్చు. అయితే అతనిపై ప్రభుత్వం తప్పకుండా చర్య తీసుకుంటుంది. నీరవ్‌ను పట్టుకుని తీరుతాం’ అని పేర్కొన్నారు. అసలు పాపమంతా కాంగ్రెస్ హయాంలోనే ప్రారంభమై.. రెట్టింపుగా విస్తరించిందని సీతారామన్ ఆరోపించారు. మోసగాళ్లు దేశం వదిలి పారిపోయేందుకు కుట్ర చేయకుండా.. వారిని పట్టుకుంటున్నామని చెప్పారు. ఎన్డీఏ హయాంలో ఆర్థిక నేరగాళ్లు దేశం వదిలి పారిపోతున్నారు కదా! అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘పారిపోయారు అంటే వారిని మేం పట్టుకోబోమని అర్థం కాదు. వారిపై చర్యలు కొనసాగుతున్నాయి. దర్యాప్తు జరుగుతోంది. తప్పకుండా పట్టుకుని తీరుతాం’ అని చెప్పారు. నీరవ్ మోదీ నిర్వహించిన ప్రమోషన్ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారని సీతారామన్ ఆరోపించారు. కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ భార్య డైరెక్టర్‌గా ఉన్న అద్వైత్ హోల్డింగ్స్‌కు చెందిన ఆస్తిని.. నీరవ్ నడుపుతున్న ‘ఫైర్ స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్’ లీజుకు తీసుకుందని ఆమె తెలిపారు. గీతాంజలి జెమ్స్ ఆర్థిక వ్యవహారాలపై 2013లో అభ్యంతరాలు వ్యక్తం చేసిన అలహాబాద్ బ్యాంకు ప్రభుత్వ డైరెక్టర్‌ను రాజీనామా చేయాలని కోరారని, అతని అభ్యంతరాల్ని కనీసం పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు. 2017లోనే కుంభకోణం: కపిల్ సిబల్ పంజాబ్ నేషనల్ బ్యాంకులో కుంభకోణానికి బీజేపీదే బాధ్యతని, ఆశ్రిత పక్షపాత ధోరణిని ప్రధాని నరేంద్ర మోదీ వ్యవస్థీకృతం చేశారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ప్రధాని, ఎన్డీఏ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను దాదాపు నాశనం చేశారని, మోదీ నాయకత్వంలో అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట దెబ్బతింటుందని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ నిద్రపోతుంటే.. దేశ సంపదతో దొంగలు పారిపోతున్నారని విమర్శించారు. సీబీఐ రెండో ఎఫ్ఐఆర్లో నిందితుడికి జారీ చేసిన అన్ని ‘లెటర్ ఆఫ్ అండర్ స్టాండింగ్(ఎల్వోయూ)’లపై 2017లోనే సంతకం చేసినట్లు ఉందని, కుంభకోణాన్ని అడ్డుకోవడంతో ఎన్డీఏ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. నీరవ్, చోక్సీలతో తమ కుటుంబానికి సంబంధాలపై బీజేపీ ఆరోపణల్ని కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ తోసిపుచ్చారు. తన భార్య, కుమారుడు డైరెక్టర్లుగా ఉన్న అద్వైత్ హోల్డింగ్స్‌కి చెందిన కమలా మిల్స్‌ను నీరవ్ కంపెనీ లీజుకు తీసుకుందని ఆయన వివరణ ఇచ్చారు. బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని, తప్పుడు ఆరోపణలు చేసినందుకు సీతారామన్, ఆమె సహచరులపై సివిల్, క్రిమినల్ పరువు నష్టం దావా వేస్తానని సింఘ్వీ హెచ్చరించారు. ‘అంతా నోట్ల రద్దు వల్లే’ ప్రధానిపై రాహుల్ ఆరోపణలు కొనసాగించారు. ‘నీరవ్ కేసులో ఏం జరిగిందో ప్రధాని చెప్పాలి. ఏం చర్యలు తీసుకున్నారో వెల్లడించాలి’ అని రాహుల్ అన్నారు. నీరవ్‌తో తనకు వ్యక్తిగత సంబంధాలున్నాయన్న బీజేపీ ఆరోపణల్ని ఆయన తోసిపుచ్చారు. ‘నోట్ల రద్దుతో ఇదంతా మొదలైంది. ప్రజాధనాన్ని సేకరించి మోదీ బ్యాంకింగ్ వ్యవస్థలో పెట్టారు. నీరవ్ రూ. 20 వేల కోట్ల ప్రజాధనంతో దేశం నుంచి పరారయ్యారు’ అని విమర్శించారు. 21చోట్ల సోదాలు శనివారం కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ) దాడులు కొనసాగించింది. దేశవ్యాప్తంగా 21 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి రూ. 25 కోట్ల విలువైన వజ్రాలు, ఆభరణాల్ని స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) అధికారుల్ని సీబీఐ అరెస్టు చేసింది. రిటైర్డ్ డిప్యూటీ మేనేజరు గోకుల్ నాథ్ శెట్టి, సింగిల్ విండో ఆపరేటర్ మనోజ్ ఖారత్‌తో పాటు నీరవ్ తరఫున హామీదారుగా ఉన్న హేమంత్ భట్‌ను అదుపులోకి తీసుకుంది. వీరిని ముంబైలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు వారికి 14 రోజుల కస్టడీ విధించింది. ఈ కేసులో మరింత మంది పీఎన్బీ అధికారుల ప్రమేయం ఉండవచ్చని సీబీఐ కోర్టుకు తెలిపింది. రూ. 280 కోట్ల మోసం జరిగిందని, ఇది రూ. 6 వేల కోట్ల వరకూ ఉండవచ్చని రిమాండ్ రిపోర్టులో సీబీఐ పేర్కొంది. పన్ను ఎగవేత కేసులో ఐటీ శాఖ శనివారం గీతాంజలి జెమ్స్, దాని ప్రమోటర్ మెహుల్ చోక్సీ, ఇతరులకు చెందిన 9 బ్యాంకు ఖాతాల్ని అటాచ్ చేసింది. ‘పీఎంఓతో కలిసి పనిచేస్తున్నాం’ ఈ కుంభకోణాన్ని పరిష్కరించేందుకు ప్రధాని కార్యాలయంతో కలిసి పనిచేస్తున్నామని ఆర్థిక శాఖ తెలిపింది. పీఎంఓ ఏ నిర్ణయం తీసుకుంటే దానిని ఆర్థిక శాఖ అమలు చేస్తుంది’ అని ఆర్థిక శాఖ సహాయ మంత్రి శుక్లా తెలిపారు. పీఎన్బీ కేసులో తమ బ్యాంకు వాటా రూ. 2,636 కోట్లు ఉందని యూకో బ్యాంకు తెలిపింది. పీఎన్బీ జారీ చేసిన లెటర్ ఆఫ్ క్రెడిట్ల ఆధారంగా హాంకాంగ్ బ్రాంచీ ఆ మేర రుణాలిచ్చిందని స్టాక్ ఎక్సే్ఛంజీకి తెలిపింది. నీరవ్‌కు ద్వంద్వ పౌరసత్వం! నీరవ్ మోదీ పాస్‌పోర్టును విదేశాంగ శాఖ రద్దు చేసినా.. అతనికి ద్వంద్వ పౌరసత్వాలు ఉండవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. నీరవ్, అతని సోదరుడు నిశాల్లు బెల్జియంలో పుట్టి పెరిగారు. నిఘా వర్గాల కథనం మేరకు నీరవ్ భారతదేశ పాస్‌పోర్టును వదులుకుని బెల్జియం పాస్‌పోర్టును సంపాదించినట్లు తెలుస్తోంది. నీరవ్ మాత్రం తాను భారతీయ పౌరుడినేనని గతంలో పేర్కొన్నాడు. గుజరాత్‌కు చెందిన అతను ఫైర్‌స్టార్ డైమండ్ పేరిట ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ప్రఖ్యాత వార్టన్ బిజినెస్ స్కూలులో చేరి మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పాడు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ 2015లో న్యూయార్క్‌లో నీరవ్ స్టోర్‌ను ప్రారంభించారు. -
సొంత పార్టీ నేతలే కుట్ర పన్నుతున్నారు..!
సాక్షి, బెంగళూరు: నేను మహదాయి నదీ జలాల వివాదాన్ని పరిష్కరించేందుకు పూర్తి నిజాయితీతో ప్రయత్నిస్తున్నాను. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు సొంత పార్టీ నేతలు సైతం నా పై కుట్ర పన్నుతున్నారు. నన్ను కావాలనే ఇబ్బందులకు గురిచేసేలా ప్రయత్నిస్తున్నారు... అని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బి.ఎస్.యడ్యూరప్ప తీవ్ర అసహనాన్ని ప్రదర్శించారు. నగరంలోని డాలర్స్ కాలనీలో ఉన్న యడ్యూరప్ప నివాసంలో మంగళవారం బీజేపీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జ్‌లు ప్రకాష్ జవదేకర్, పీయూష్ గోయల్‌తో పాటు పార్టీ రాష్ట్ర నేతలు జగదీష్ శెట్టర్, ప్రహ్లాద్ జోషి, ఆర్.అశోక్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యడ్యూరప్ప మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనైనట్లు సమాచారం. బీజేపీ-జేడీఎస్ సంయుక్త ప్రభుత్వం ఉన్న సమయంలో నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఆ సమయంలో కళసా-బండూరి నాలా కార్యక్రమం అమలుకు రూ.100 కోట్లు కేటాయించాను. ఇందుకు అప్పటి సీఎం హెచ్.డి.కుమారస్వామి తీవ్ర అభ్యంతరం తెలియజేసినా నేను అదేమీ పట్టించుకోలేదు. అందుకే ఉత్తర కర్ణాటక ప్రజలు నన్ను అభిమానిస్తారు. అయితే ఈ విషయాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ నేతలు నా పై కుట్రలు పన్నుతున్నారు. ఇందుకు సొంత ఆర్టీ నేతలే సహకారం అందిస్తున్నారు... అని పేర్కొన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక ఇదే సమావేశంలో ఇటీవల కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు సైతం చర్చకు వచ్చినట్లు సమాచారం. అనంత్‌కుమార్ హెగ్డే చాలా దూకుడుగా వ్యవహరిస్తూ వివాదాలను పార్టీ నేతల మెడకు చుడుతున్నారని కొందరు నేతలు హైకమాండ్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అనంత్‌కుమార్ హెగ్డేకు భాష మార్చుకోవాల్సిందిగా సూచించాల్సిందిగా నేతలు హైకమాండ్‌ను కోరినట్లు సమాచారం. -
కాంగ్రెస్ కబంధ హస్తాల్లో కోదండరాం: సుమన్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ కబంధ హస్తాల్లో జేఏసీ చైర్మన్ కోదండరాం బందీ అయ్యారని ఎంపీ బాల్క సుమన్ విమర్శించారు. ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చునే ఓపిక లేని కాంగ్రెస్ నాయకులు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక పోతున్నారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మాట్లాడుతూ.. కాళేశ్వరం, మల్లన్న సాగర్, పాలమూరు, డిండి, కొండపోచమ్మ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేసులు వేసిన ముఠానే నిరుద్యోగుల సమస్యను వాడుకుంటూ విద్యార్థుల భవిష్యత్‌ను దెబ్బతీస్తోందని మండిపడ్డారు. రాజకీయం చేస్తున్న కోదండరాం ముఠా: పల్లా సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణకు వస్తున్న ఖ్యాతిని తట్టుకోలేక విపక్షాలు కోదండరాంను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం, కేసీఆర్, ఆయన కుటుంబంపై విషం కక్కుతున్నాయని మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కోదండరాంను, ఆయన ముఠాను నిరుద్యోగులు నమ్మడం లేదన్నారు. కోదండరాంకు దమ్ముంటే పార్టీ పెట్టాలన్నారు. విద్యార్థి మురళి డీఈడీ, బీఈడీ చేయలేదని తెలిసి కూడా ఆయన డీఎస్సీ కోసం సిద్ధమవుతున్నారని కోదండరాం అసత్యాలు చెప్పడం దురదృష్టకరమన్నారు. -
'నువ్వుంటే ఎంత..? పోతే ఎంత..?'
-
ఔను.. నీకు తిక్కుంది..!
పవన్‌కల్యాణ్‌పై కవిత మండిపాటు నిజామాబాద్, న్యూస్‌లైన్: ‘‘ ఔను.. నీకు తిక్కనే ఉంది లెక్కలేదు.. కానీ లెక్క లేదు’’ అని నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌పై నిజామాబాద్ లోక్‌సభ టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత విమర్శించారు. సోమవారం నిజామాబాద్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు. ఆకాశం వైపు ఉమ్మివేస్తే అది నీపైనే పడుతుంది. కేసీఆర్‌ను తిట్టే నైతిక హక్కు, స్థాయి నీకు లేదన్నారు. పవన్ అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ రైలు తిరుపతిలో ప్రారంభమై హైదరాబాద్‌కు రాకుండానే ఆగిపోయిందని దెప్పిపొడిచారు. అవసరానికి తగినట్లు మాట్లాడే మీరు విలన్లు అంటూ మండిపడ్డారు. నిజమైన హీరోలు, కథానాయకులు తెలంగాణ బిడ్డలేనన్నారు. బీజేపీ అంటే బాబు జేబు పార్టీ అని విమర్శించారు. నరేంద్ర మోడీ తెలంగాణ అమరవీరులకు ఏనాడూ నివాళులు అర్పించలేదని, ఉద్యమానికి కూడా మద్దతు తెలుపలేదని పేర్కొన్నారు.