ఔను.. నీకు తిక్కుంది..! | kalvakuntla kavitha on pawankalyan touchy | Sakshi
Sakshi News home page

ఔను.. నీకు తిక్కుంది..!

Published Tue, Apr 29 2014 12:38 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

ఔను.. నీకు తిక్కుంది..! - Sakshi

ఔను.. నీకు తిక్కుంది..!

పవన్‌కల్యాణ్‌పై కవిత మండిపాటు
 నిజామాబాద్, న్యూస్‌లైన్: ‘‘ ఔను.. నీకు తిక్కనే ఉంది లెక్కలేదు.. కానీ లెక్క లేదు’’ అని నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌పై నిజామాబాద్ లోక్‌సభ టీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత విమర్శించారు. సోమవారం నిజామాబాద్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు. ఆకాశం వైపు ఉమ్మివేస్తే అది నీపైనే పడుతుంది. కేసీఆర్‌ను తిట్టే నైతిక హక్కు, స్థాయి నీకు లేదన్నారు.

 

పవన్ అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ రైలు తిరుపతిలో ప్రారంభమై హైదరాబాద్‌కు రాకుండానే ఆగిపోయిందని దెప్పిపొడిచారు. అవసరానికి తగినట్లు మాట్లాడే మీరు విలన్లు అంటూ మండిపడ్డారు. నిజమైన హీరోలు, కథానాయకులు తెలంగాణ బిడ్డలేనన్నారు. బీజేపీ అంటే బాబు జేబు పార్టీ అని విమర్శించారు. నరేంద్ర మోడీ తెలంగాణ అమరవీరులకు ఏనాడూ నివాళులు అర్పించలేదని, ఉద్యమానికి కూడా మద్దతు తెలుపలేదని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement