janasena Party president
-
‘పవన్ కళ్యాణ్ ఇంటిని ముట్టడిస్తాం..’
సాక్షి, అనంతరపురం: మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ ఇటీవల జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కానీ పవన్ వ్యాఖ్యలపై గిరిజన జేఏసీ నాయకులు అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఇంటిని ముట్టడించడానికి కూడా తాము వెనుకాడబోమని వారు హెచ్చరించారు. మంగళవారం స్థానిక నాగులకట్ట వద్ద విలేకరుల సమావేశంలో గిరిజన జేఏసీ పుట్టపర్తి కన్వీనర్ కే. రవీంద్ర నాయక్, కో కన్వీనర్ కుళ్లాయి నాయక్, జిల్లా యువజన విభాగం కన్వీనర్ ఎస్. నారాయణస్వామి నాయక్ మాట్లాడారు. మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చాలని.. ఇందుకు తాను మద్దతిస్తానని, ప్రభుత్వంతో కూడా మాట్లాడతానని పవన్ చెప్పడం గర్హనీయమన్నారు. గిరిజనుల పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధి ఏంటో దీన్నిబట్టి అర్ధమవుతోందన్నారు. వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని చంద్రబాబు నేతృత్వంలోని మంత్రివర్గం నిర్ణయిస్తే ఆ అడుగుజాడల్లోనే పవన్ నడవటం విచారకరమని గిరిజన నాయకులు అన్నారు. పవన్ తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ గిరిజనుల ఆగ్రహం చవిచూడక తప్పదన్నారు. -
ప్రశ్నిస్తానన్నాడు... పత్తా లేకుండా పోయాడు
తనది సామాన్యుడి పక్షం... రాజకీయ నాయకులను నిలదీయడమే తన పని ... పాలించడానికి కాదు ప్రశ్నించడానికే పార్టీ అంటూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీతో వాయుసేనకు చెందిన యుద్ద విమానంలా ఎన్నికల ముందు దూసుకువచ్చాడు. బీజేపీ, టీడీపీ పొత్తుకు ఓటేయండంటూ రాష్ట్రమంతా ప్రచారం చేశాడు. సామాన్యుడికి అన్యాయం జరిగితే బీజేపీ, టీడీపీలనైనా నిలదీస్తానంటూ ప్రజలకు భరోసా ఇచ్చాడు. భారత ప్రధానిగా నరేంద్ర మోడీ పదవి చేపట్టిన నెలరోజుల లోపే రైల్వే ఛార్జీలు ఎన్నడూ లేనంతగా 14.2 శాతం పెరిగాయి. డిజిల్, పెట్రోల్, గృహ నిర్మాణం సామగ్రి సిమెంట, ఉక్కు తదితర వస్తువుల ధరలు ఆకాశానంటాయి. దాంతో సామాన్యుడి ఇల్లు కట్టుకోలేని పరిస్థితి. కూరగాయల ధరలు మండిపోతున్నాయి. వంట గ్యాస్ ధర త్వరలో రూ.250 వరకు పెరగబోతుందంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. మరో వైపు ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించి నెల గడిచింది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రైతు రుణమాఫీ దస్త్రంపై తొలి సంతకం చేస్తానంటూ ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు హమీ ఇప్పటి వరకు అమలు కాలేదు. నేడోరేపో రుణమాఫీ చేస్తాడంటూ రైతులు కళ్లలో ఒత్తులు వేసి ఎదురు చూస్తున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయస్సు 58 నుంచి 60 పెంచారు. దాంతో తమకు ఉద్యోగాలు రావంటూ రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఇంటికో ఉద్యోగం అంటూ ప్రకటించిన బాబు ఇప్పటి వరకు ఉద్యోగ ప్రకటన చేయకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర వేదనతో ఉన్నారు. ఇంతమంది ఇన్ని విధాల బాధపడుతుంటే సామాన్య ప్రజల కోసమే పోరాటం... వారి కోసం జైలు ఊచలు లెక్కించడానికైనా చివరికి మరణానికైనా సిద్ధమని ఎన్నికల చెప్పిన ఈ ఆరడుగుల బుల్లెట్ సదరు నేతలను ప్రశ్నించడం లేదంటే ఆవి సమస్యలు కాదనుకున్నాడేమో. ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలు విజయకేతనం ఎగురవేయడంతో ప్రజలకు మంచి రోజులు వచ్చాయని ప్రకటించిన పవన్ కల్యాణ్ ... ప్రజల సమస్యలను అటు ప్రధాని మోడీ, ఇటు చంద్రబాబుల దృష్టికి తీసుకువెళ్తానని చెప్పిన విషయాన్ని ఏదో కథలో చెప్పినట్లు ముని శాపం వల్ల మరిచిపోయి ఉండవచ్చని సామాన్యుడి నుంచి రాజకీయ విశ్లేషకులు చెవులు కొరుకుంటున్నారు. -
ఔను.. నీకు తిక్కుంది..!
పవన్‌కల్యాణ్‌పై కవిత మండిపాటు నిజామాబాద్, న్యూస్‌లైన్: ‘‘ ఔను.. నీకు తిక్కనే ఉంది లెక్కలేదు.. కానీ లెక్క లేదు’’ అని నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌పై నిజామాబాద్ లోక్‌సభ టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత విమర్శించారు. సోమవారం నిజామాబాద్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు. ఆకాశం వైపు ఉమ్మివేస్తే అది నీపైనే పడుతుంది. కేసీఆర్‌ను తిట్టే నైతిక హక్కు, స్థాయి నీకు లేదన్నారు. పవన్ అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ రైలు తిరుపతిలో ప్రారంభమై హైదరాబాద్‌కు రాకుండానే ఆగిపోయిందని దెప్పిపొడిచారు. అవసరానికి తగినట్లు మాట్లాడే మీరు విలన్లు అంటూ మండిపడ్డారు. నిజమైన హీరోలు, కథానాయకులు తెలంగాణ బిడ్డలేనన్నారు. బీజేపీ అంటే బాబు జేబు పార్టీ అని విమర్శించారు. నరేంద్ర మోడీ తెలంగాణ అమరవీరులకు ఏనాడూ నివాళులు అర్పించలేదని, ఉద్యమానికి కూడా మద్దతు తెలుపలేదని పేర్కొన్నారు.