
వీణవంక: ‘ఆత్మగౌరవానికి వెలకట్టి నాయకులను కొనుగోలు చేస్తున్నారు. వాళ్లు కొన్నట్టు భావిస్తున్నారు. మనవాళ్లు అమ్ముడుపోయినట్లు నటిస్తున్నారు’అని మాజీమంత్రి ఈటల రాజేందర్ టీఆర్‌ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. పోతిరెడ్డిపల్లి గ్రామంలో వివిధ పార్టీల నాయకులు బీజేపీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆనంతరం ఈటల మాట్లాడుతూ ‘పొద్దున్నే లేచి నా భార్య ఒక మాట అడిగింది.
నీ చుట్టూ తిరిగే వాళ్లను లేకుండా చేశారు. ఇక డ్రైవర్‌ను కూడా ఉంచరట అని. అప్పుడు నేను అన్నా. సరే నిన్ను (జమున) అన్నా ఉంచుతరటనా లేదా’అని పేర్కొన్నారు. ఈ పోరాటం తన ఒక్కడిది కాదని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పోరాటమని అన్నారు. సీఎం కేసీఆర్ పథకాల పేరుతో చెక్కుతోపాటు కత్తిని కూడా ఇస్తున్నారని ఈటల మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment