మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ నాయకులు
రైల్వేకోడూరు అర్బన్ : రాష్ట్రానికి ప్రత్యేకహోదా తేవడంలో నాలుగేళ్లుగా ప్రజలను మభ్యపెట్టి, ఇప్పుడు ఒక రోజు దీక్ష అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృథా చేశారని వైఎస్సార్ సీపీ నాయకులు విమర్శించారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శనవారం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికైనా ప్రజలను మభ్య పెట్టడం మానాలని హితవు పలికారు. విభజన చట్టం ప్రకారం అప్పటి ప్రధాని హామీలు, రావల్సిన నిధులు తెప్పించడంలో చంద్రబాబు విఫలమయ్యారని ఆరోపించారు.
ఎన్నికల ముందు ప్రజలను మభ్య పెట్టడానికి ప్రతిరోజు ఏదోక నాటకానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. దీక్ష చేయాల్సింది రాష్ట్రంలో కాదని, ధైర్యం ఉంటే ఢీల్లీలో ప్రధాని నివాసం ముందు చేయాలన్నారు. బీజేపీతో తెగతెంపులు అంటూ ప్రజలను నమ్మించి, లోపాయికారిగా కేసుల కోసం బీజేపీ వారికి టీటీడీ పాలక మండలి సభ్యులుగా పదవులు ఇవ్వడమేంటని వారు ప్రశ్నించారు. ఏసీలు పెట్టుకుని దీక్షలు చేసే చంద్రబాబుకు ఉద్యమాల గురించి ఏం తెలుసునని వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజం సుకుమార్‌రెడ్డి, జెడ్పీటీసీ మారెళ్ల రాజేశ్వరి, పట్టణ కన్వీనర్ సీహెచ్ రమేష్ విమర్శించారు.
పార్టీ మండల కన్వీనర్ గుంటిమడుగు సుధాకర్‌రాజు, నియోజకవర్గ అధికార ప్రతినిధి మందల నాగేంద్ర, జిల్లా స్టీరింగ్ కమిటీ సబ్యులు నందాబాల, ఎంపీటీసీలు మందల శివయ్య, డాక్టర్ సుబ్రమణ్యం, పట్టణ కన్వీనర్ అబ్దుల్‌రౌఫ్, సిగమల రామచంద్రారెడ్డి, నాయకులు తిరుపతి శేఖర్, సుదర్శన్ రాజు, గంగయ్య, తిప్పన మణి, డీవీ రమణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment