spacial status
-
బాబు.. చెత్త పొలిటీషియన్
సాక్షి, హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లాంటి డర్టీ పొలిటీషియన్ (చెత్త రాజకీయ నేత) దేశంలోనే ఎవరూ లేరని సీఎం కేసీఆర్ తీవ్రంగా విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి చంద్రబాబుకు ఓటమి తప్పదని.. అక్కడి ప్రజలు ఆయన్ను దారుణంగా ఓడిస్తారని కేసీఆర్ చెప్పారు. ఏపీ ప్రత్యేక హోదా విషయంలో టీఆర్ఎస్ వైఖరి స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. హోదా విషయంపై అవసరమైతే.. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాస్తానని కేసీఆర్ పేర్కొన్నారు. ఒడిశా, పశ్చిమబెంగాల్, ఢిల్లీ పర్యటనల్లో వివరాలను తెలిపేందుకు శనివారం ప్రగతి భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయి ఐదేండ్లవుతోంది. మెడకాయ మీద తలకాయ ఉన్న ఏ సీఎం అయినా ప్రజలను దీనికి అనుగుణంగా మార్చుకోవాలి. చంద్రబాబుకు మెదడు ఉందా? అడ్డగోలుగా ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. డిసెంబర్ నాటికి హైకోర్టు భవనం సిద్ధమవుతుందని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది. ఏపీ హైకోర్టును ఆ రాష్ట్రానికి తరలించకున్నా హైదరాబాద్‌లోనే వేరుగా ఉంటే సరిపోతుందని మేం సుప్రీంకోర్టుకు విన్నవించాం. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం జనవరి 1 నుంచి రెండు హైకోర్టులు మనుగడలోకి వస్తాయని సుప్రీంకోర్టు నెలన్నర క్రితం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై తాజాగా రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టుకు చెప్పిన ప్రకారం ఏపీ ప్రభుత్వం డిసెంబర్ వరకు అమరావతిలో ఎందుకు హైకోర్టు భవనాన్ని సిద్ధం చేయలేదు. ఉమ్మడి హైకోర్టును సుప్రీంకోర్టు విభజిస్తే కేంద్రం నోటిఫై చేసింది. ఈ విషయంలో కేంద్రంపై చంద్రబాబు ఎలా విమర్శలు చేస్తాడు. ఆయనంత చెత్త రాజకీయ నేత దేశంలోనే ఎవరూ లేరు. నవీన్ పట్నాయక్‌ను ఎందుకు కలిసినవు. మల్లయ్యను, ఎల్లయ్యను ఎందుకు కలిసినవు అని అడుగుతడు. నేను ఎవరిని కలిస్తే నీకెందుకు? నువ్వు (చంద్రబాబు) మోదీ సంకనాకుతావు. సంకల కూచుంటవు. అకస్మాత్తుగా ఓ రోజు రాహుల్‌గాంధీ సంకనాకుతావు’అని కేసీఆర్ ఘాటైన పదజాలంతో విమర్శించారు. ‘చంద్రబాబుకు సిగ్గు, లజ్జ లేదు. ఇలాంటి నేతను భరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేతులెత్తి మొక్కాలి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వస్తే ఏమొస్తదని ఆయనే వాదించిండు. అప్పట్లో రాహుల్‌గాంధీ విజయవాడకు వస్తుంటే.. ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని ప్రశ్నించిండు. ఇప్పుడు నరేంద్రమోదీ వస్తుంటే ఇదే మాట అంటున్నాడు. నీకో పాలసీ, పద్ధతి ఉందా. మనిషిలాగా మాట్లాడుతున్నావా? మీడియా ఇలాంటి డర్టీ లీడర్లను చీల్చి చెండాడాలి’అని టీఆర్ఎస్ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. పచ్చి అబద్దాలతో.. ‘ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని రాఫ్ట్ ఫౌండేషన్‌తో నిర్మిస్తున్నారని.. దేశంలోనే ఇదే మొదటిది అని పేపర్ల నిండా ప్రకటనలు ఇచ్చారు. ఈ విషయాన్ని చంద్రబాబు గొప్పగా చెప్పారు. రాఫ్ట్ ఫౌండేషన్ టెక్నాలజీ కొత్తదేం కాదు. హైదరాబాద్‌లో వెయ్యికిపైగా ఇళ్లు ఇలాగే కట్టారు. బలహీనవర్గాలకు ప్రభుత్వం కట్టించే ఇళ్లు ఇలాగే నిర్మిస్తారు. మిషన్ భగీరథ కింద నిర్మిస్తున్న 18 వేల ట్యాంకులు ఇలాగే నిర్మించాం. రేగడి నేలలో ఏ నిర్మాణమైనా ఈ విధానంలోనే నిర్మిస్తారు. హుస్సేన్‌సాగర్ చుట్టు ఉన్న అన్ని భవనాలను ఇలాగే కట్టారు. ఏపీ సచివాలయం 56 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, అసెంబ్లీ 12 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ సైతం పది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోనే ఉంది. ఏపీ సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1500 కోట్లు ఇచ్చింది. హైకోర్టు నిర్మాణం కోసం రూ.500 కోట్ల వేరుగా ఇచ్చింది. ఇవన్నీ ఏం చేశావు. నాకేశావా? ఇన్ని అబద్దాలా? ఇంత మోసమా? చంద్రబాబు అనే వ్యక్తి వాడుకుని వదిలేసే రకం. హరికృష్ణ శవంపై పేలాలు ఎరుకునే ప్రయత్నం చేశాడు. ఆయన చావును సొమ్ము చేసుకునేందుకు హరికృష్ణ కూతురును బలవంతంగా పోటీకి పెట్టారు. ఆ అమ్మాయికి ఇప్పుడైనా ఏమైనా ఇస్తరా. చంద్రబాబు నీచంగా, రాక్షసంగా వ్యవహరిస్తడు’అని కేసీఆర్ మండిపడ్డారు. హోదాకు టీఆర్ఎస్ అనుకూలం ‘చంద్రబాబు కేంద్రం ఏమీ ఇవ్వలేదని అంటడు. మళ్లీ అభివృద్ధి పేరుతో శ్వేతపత్రాలు విడుదల చేస్తడు. జనం ఏది నమ్మాలి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడాన్ని నేను వద్దన్నట్లుగా ప్రచారం చేస్తున్నడు. దీనిపై మా వైఖరి సుస్పష్టం. ప్రత్యేక హోదా ఇవ్వాలని మా పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్‌సభలో మా ఎంపీ కవిత స్పష్టంగా చెప్పారు. నేనెందుకు వద్దంట. అవసరమైతే దీనిపై ప్రధానమంత్రి లేఖ రాస్తా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని 94 సెక్షన్లో 1, 2 సెక్షన్లలో దీనిపై స్పష్టంగా ఉంది. రెండు రాష్ట్రాలకు పరిశ్రమల రాయితీ ఇస్తూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని పేర్కొన్నారు. చంద్రబాబు వట్టి అబద్ధాల కోరు. కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి ఇక్కడికి వచ్చి రెండు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై అంచనాతో ప్రతిపాదనలు చేశారు. హైదరాబాద్‌ను వదులుకుంటున్నందుకు ఏపీకి పదేళ్లపాటు లోటు బడ్జెట్ ఉంటుందని ఆ మేరకు రూ.24 వేల కోట్లను కేంద్రం ఆ రాష్ట్రానికి ఇవ్వాలని ›ప్రతిపాదించారు. కేంద్రం దీన్ని అమలు చేస్తోంది. మళ్లీ లోటు బడ్జెట్ ఎక్కడ ఉంది. ఇది వాస్తవం కాదా? ఆ డబ్బులు లేవా? నీకు చేతకాదు. ప్రజా సంక్షేమం తెలియదు. అంతా అవినీతిమయం. నీకున్న ఈ జాఢ్యాల వల్లే ఇలా అయ్యింది. ప్రత్యేక హోదా సంజీవని కాదన్నావు. అలా అంటే జైళ్లో వేస్తానన్నావు. అప్పుడు చంద్రబాబు మాట్లాడిన వీడియోలు ఉన్నాయి. నువ్వు ఒట్టి స్వార్థపరుడివి. రాజకీయ స్వార్థం కోసం ఎంతకైనా దిగజారతావు. నువ్వు దుర్మార్గుడివి. ఏమీ తెలియదు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా భయం. మామ పెట్టిన పార్టీని లాక్కుని మేనేజ్ చేస్తున్నావు. చంద్రబాబు రాజకీయ నాయకుడు కాదు పొలిటికల్ మేనేజర్. మేం ఇద్దరు ఎంపీలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం. తెలంగాణ వచ్చేదాక విశ్రమించేదిలేదని అప్పటిదాకా పోరాడాం. నీలాగా చిల్లర రాజకీయాలు రావు. కేంద్రంలో బాబు చక్రాలు తిప్పలేదు. తిప్పితే ఆ అభివృద్ధి ఎక్కడ. మేనేజ్ చేసి పేపర్లలో ఏదో తిప్పినట్లుగా పత్రికల్లో ఫొటోలు వేసుకున్నారు. చంద్రబాబువి నకిలీ పనులు. తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానాన్ని కాపీ కొట్టారు. కళ్యాణలక్ష్మీ పథకాన్ని అక్కడా అమలు చేస్తున్నారు. ఈవోడీపీ ర్యాంకుల ప్రతిపాదనలతో మేం పొరపాటున ఒక పదాన్ని తప్పుగా పెడితే దాన్ని కూడా ఒక్క అక్షరం మార్చకుండా అలాగే కేంద్రానికి సమర్పించారు. దీనిపై మేం కేంద్రానికి ఫిర్యాదు చేశాం. కేసు నమోదు చేశాం. ప్రజలను ఎన్ని రోజులు మోసం చేస్తారు. చంద్రబాబుకు సిగ్గు లేదు. నోటికొచ్చింది మాట్లాడటమే. నీతిఅయోగ్ సమావేశంలో ఒకసారి మోదీని పొడిగేందుకు ఏదేదో మాట్లాడారు. ఒక ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అయినందుకే రాష్ట్రాలకు నిధులు ఇస్తున్నారని అన్నాడు. అదేంటని అక్కడ ఉన్న ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు నాతో అన్నారు. పీవీ నర్సింహారావు, చరణ్‌సింగ్, దేవేగౌడ అలాగే అయ్యారు కదా అని అఖిలేష్‌యాదవ్ నాతో అన్నారు. చంద్రబాబు లాంటి వారిని ఇన్నాళ్లు ఎలా భరించావని నన్ను అడిగారు. ఇలా ఉంటుంది చంద్రబాబు తీరు. తెలంగాణ ఎన్నికలలోకి వచ్చిన చంద్రబాబుకు కచ్చితంగా గిఫ్ట్ తిరికి ఇస్తాం. జాగ్రత్త ! ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి చంద్రబాబుకు ఓటమి తప్పదు. అక్కడి ప్రజలు ఆయనను దారుణంగా ఓడిస్తారు’అని కేసీఆర్ పేర్కొన్నారు. రెండు బాకా పేపర్లు చంద్రబాబు నాయుడు ఏం చేయకున్నా ఏదో చేసినట్లుగా రెండు పత్రికలు, కొన్ని టీవీలు ప్రజలను నమ్మిస్తుంటాయని తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శించారు. ‘చంద్రబాబు దగ్గర రెండు, మూడు బాకా పేపర్లు ఉన్నాయి. రెండు బాకా పేపర్లు డప్పు కొట్టుడు. ఏది మాట్లాడినా ఈస్ట్‌మన్ కలర్ ఫొటోలతో కథలు వేస్తారు. చక్రం తిప్పుడు లేదు. చంద్రబాబుకు రెండు ముక్కలు ఇంగ్లీషు మాట్లాడం రాదు. కనీసం రెండు లైన్లు హిందీ కూడా రాదు. కేసీఆర్ యజ్ఞాలు చేస్తాడని మోదీ అన్నాడు. నాకు నమ్మకం ఉంది వస్తే నీకు కూడా ప్రసాదం పెడతా అన్నా. యజ్ఞ, యాగాలపై నాకు నమ్మకం ఉంది. దేవుడిపై నాకు విశ్వాసం ఉంది. యజ్ఞాలు చేస్తే నాకు మంచే అవుతోంది. నేను రాజశ్యామల యాగం చేశా. రాజశ్యామల అమ్మవారి ఆలయం విశాఖపట్నంలోనే ఉంది. ఫెడరల్ ఫ్రంట్ కోసం భువనేశ్వర్ వెళ్లాలని నిర్ణయించుకున్నా. శారదాపీఠం స్వామి వారికి ఇదే విషయం చెప్పా. విశాఖపట్నానికి రండి పూజలు చేసి భోజనం చేసి వెళ్దురు అన్నారు. నేను వెళ్లా. నేను ఊహించలేదు. అక్కడ విమానాశ్రయానికి చాలా మంది వచ్చారు. శారదాపీఠం వరకు 18 కిలోమీటర్ల దారి పొడవునా స్థానికులు నాకు ఉత్సాహంగా అభివాదం చేశారు. అభిమానంతో వచ్చారు. నేను అభివాదం చేశా. ఆ దారి పొడవునా కొందరు ఫెక్సీలు కట్టారు. ఆ రెండు బాకా పేపర్లు వైఎస్సార్సీపీ వాళ్లు, వెలమలు వచ్చారు అని రాశాయి. వాళ్లు ఆంధ్ర ప్రజలు కాదా. వాళ్లు ఎందుకు వచ్చారు. చంద్రబాబును తెలంగాణలో పొల్లుపొల్లు కొట్టినందుకు, తన్ని పంపించినందుకు ప్రజలలో కనిపించిన ఉత్సాహం అది. ఆంధ్రప్రదేశ్ వార్తలు ఇక్కడ హైదరాబాద్‌లో ఎందుకు. ప్రజలను అయోమానికి గురి చేయడానికా? తెలంగాణ ప్రాంతంగా ఉండే పేపర్లకు సహరించేలా నిర్ణయాలు తీసుకుంటాం’అని ఆయన స్పష్టం చేశారు. -
ప్రత్యేక ప్యాకేజీకి టీడీపీ ఒప్పుకుంది
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీని ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పుడు చంద్రబాబు ప్రభుత్వమే అంగీకారం తెలిపిందనీ, తర్వాత రాజకీయ కారణాలతో యూటర్న్ తీసుకుందని విశాఖ బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు విమర్శించారు. శుక్రవారం లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు ఏపీని విభజించాలని చంద్రబాబే లేఖ ఇచ్చి, ఇప్పుడు విభజనను తప్పుపడుతున్నారు. రాష్ట్రంపై టీడీపీకి చిత్తశుద్ధి లేదు. ఆ పార్టీకి రాజకీయాలే ముఖ్యం. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా దివంగత ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే, ఈ రోజు చంద్రబాబు కాంగ్రెస్‌తో జట్టు కట్టారు. ఇది చూసి ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోంది. అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తోంది. అంత చిత్తశుద్ధి ఉంటే విభజన చట్టంలోనే ఆ విషయాన్ని ఎందుకు పెట్టలేదు? రాష్ట్ర విభజన సమయంలో టీడీపీ నాయకులు హోదాపై ఎందుకు మాట్లాడలేదు? విభజన చట్టంలో ఇచ్చిన హామీల్లో 85 శాతం హామీలు అమలు చేసినందుకా? చట్టంలో ఇచ్చిన సంస్థలను పదేళ్ల కాలపరిమితిలో ఏర్పాటు చేయాలని ఉన్నా నాలుగేళ్లలోనే ఏర్పాటు చేసినందుకా? టీడీపీ అవిశ్వాసం పెట్టింది?’ అని నిలదీశారు. ఎస్పీవీ ఏర్పాటు చేయండి.. ‘ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ చెప్పిన మాట వాస్తవమే. అయితే 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల వల్ల ఆ హామీ అమలు కాలేదు. అయినా ప్రత్యేక హోదా పేరు లేకుండా హోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ఇస్తున్న 90 శాతం నిధులను ఏపీకి ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి రూ.17,500 కోట్ల విలువైన ఈఏపీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈఏపీ ప్రాజెక్టుల మంజూరు ప్రక్రియ ఆలస్యమవుతున్నందున హడ్కో, నాబార్డు రుణాలిప్పించాలని ఏపీ ప్రభుత్వం కోరింది. దీనివల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎఫ్ఆర్బీఎం సమస్యలు తలెత్తే వీలుండడంతో స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ) ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం సూచించింది. కానీ, ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు ఎస్పీవీని ఏర్పాటు చేయలేదు. దీనివల్ల రాష్ట్రం రూ.17,500 కోట్లు నష్టపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీవీ ఏర్పాటు చేస్తే ఒక్క రోజులోనే నిధులు విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది’ అని ఆయన తెలిపారు. -
6 విద్యా సంస్థలకు కిరీటం
న్యూఢిల్లీ: ఆరు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ‘ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్ (ఐవోఈ)’ హోదా కల్పించింది. ఇందులో మూడు ప్రభుత్వ, మూడు ప్రైవేటు సంస్థలు ఉన్నాయి. ప్రపంచ స్థాయి యూనివర్సిటీలుగా తీర్చిదిద్దేందుకు వీటికి స్వయం ప్రతిపత్తి కల్పించడంతోపాటు, ప్రత్యేక ప్రోత్సాహకాలు అందజేయనుంది. ప్రభుత్వ రంగ సంస్థలు ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) బెంగళూరుతోపాటు ప్రైవేటు సంస్థలైన మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, బిట్స్ పిలానీ, రిలయన్స్ ఫౌండేషన్‌కు చెందిన జియో ఇన్స్టిట్యూట్ను కేంద్రం ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్‌గా గుర్తించింది. ఐవోఈ హోదా పొందిన ఈ మూడు ప్రభుత్వ సంస్థలకు వచ్చే ఐదేళ్లలో రూ.వెయ్యి కోట్ల నిధులను కేంద్రం అందజేయనుంది. ప్రైవేటు సంస్థలకు మాత్రం ప్రభుత్వ నిధులు అందవు. మొత్తంగా 20 సంస్థలకు (10 ప్రభుత్వ, 10 ప్రైవేటు సంస్థలు కలిపి) ఐవోఈ హోదా ఇవ్వాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణయించింది. మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్.గోపాలస్వామి నేతృత్వంలోని ఎంపవర్డ్ ఎక్స్పర్ట్ కమిటీ (ఈఈసీ).. తొలి దశలో 6 సంస్థలకు ఐవోఈ ప్రకటించింది. టాప్ 100లో ఒక్క వర్సిటీ లేదు ‘ఐవోఈ దేశానికి ఎంతో ముఖ్యం. దేశంలో మొత్తం 800 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 100 వర్సిటీల్లో ఒక్కటి కూడా చోటు దక్కించుకోలేదు. కనీసం టాప్ 200లో నిలవలేదు. తాజాగా తీసుకున్న నిర్ణయం ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఉపకరిస్తుంది’ అని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ట్వీట్ చేశారు. ఐఓఈ హోదా కోసం తెలంగాణకు చెందిన ఉస్మానియా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలతోపాటు 114 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో 11 సెంట్రల్ యూనివర్సిటీలు, 27 టాప్ ఐఐటీలు, ఎన్ఐటీలు, రాష్ట్రాలకు చెందిన 27 వర్సిటీలు, పది ప్రైవేటు వర్సిటీలు, నాలుగు గ్రీన్‌ఫీల్డ్ సంస్థలు ఉన్నాయి. ఇంకా స్థాపించని సంస్థకు ఐఈవోనా? రిలయన్స్ సంస్థకు చెందిన జియో ఇన్స్టిట్యూట్ను ఇంకా స్థాపించనేలేదనీ, ఎన్నో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను కాదని జియో ఇన్స్టిట్యూట్కు ఐఈవో హోదా ఎలా ఇచ్చా రని పలువురు ప్రశ్నిస్తున్నారు. అసలు జియో ఇన్స్టిట్యూట్ అనే విద్యా సంస్థ ఒకటి రాబోతోందని ప్రపంచానికి తెలిసిందే సోమవారమని అంటున్నారు. ‘జియో ఇన్స్టిట్యూట్కు క్యాంపస్ లేదు. వెబ్సైట్ లేదు. కానీ ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఖరగ్‌పూర్ లేదా ప్రైవేట్ రంగంలోని అశోక వర్సిటీ, ఓపీ జిందాల్ గ్లోబల్ వర్సిటీ వంటి ప్రఖ్యాత సంస్థలనెన్నింటినో కాదని ఐఈవో హోదా జియోకు ఎలా దక్కింది?’ అని పలువురు విద్యావేత్తలు సహా అనేక మంది ట్వీటర్లో హెచ్చార్డీ మంత్రి ప్రకాశ్ జవడేకర్‌ను ప్రశ్నించారు. అయితే జియోకు ఐఈవో హోదా ఇవ్వడాన్ని యూజీసీ సమర్థించుకుంది. గ్రీన్‌ఫీల్డ్ ఇన్స్టిట్యూషన్స్ కేటగిరీలో జియోకు ఆ హోదా ఇచ్చామనీ, ఈ కేటగిరీ కింద మొత్తం 11 సంస్థలు దరఖాస్తు చేసుకోగా జియోను అవకాశం వరించిందని యూజీసీ పేర్కొంది. -
చంద్రబాబు బూటకపు మాటలు నమ్మి...
బెళుగుప్ప : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో 610 హామీలను ఇచ్చి గత నాలుగు సంవత్సరాల్లో పది హామీలను కూడా అమలు చేయలేదని, ప్రస్తుతం మరోసారి బూటకపు మాటలతో ప్రజల ముందుకు వస్తున్నారని, అలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పాలని ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, అనంతపురం పార్లమెంట్ స్థానం సమన్వయకర్త తలారి పీడీరంగయ్యలు విమర్శించారు. శనివారం బెళుగుప్పలో పార్టీ మండల కన్వీనర్ శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన బూత్ కమిటీ సభ్యుల సమావేశానికి ఎమ్మెల్యే మరియు అనంతపురం సమన్వయకర్తలు ముఖ్య అథితుగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయం వరకు రాష్ట్రానికి రూ. 90 వేల కోట్లు అప్పులు ఉండగా ప్రస్తుతం రూ.2.4 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయన్నారు. కేవలం నాలుగు సంవత్సరాల కాలంలో ఏకంగా రూ.1.5 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిపై రూ.50,000 పైగా అప్పులు మోపిందన్నారు. రాష్ట్రంలో రూ.87 వేల కోట్ల రైతు రుణాలను మొత్తం మాఫీ చేస్తామని ప్రకటించి ఇప్పటి వరకు కేవలం రూ.14 వేల కోట్లు అది వడ్డీకి సరిపోయే విధంగా రుణమాఫీ చేసి రైతుకు ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీలు సకాలంలో రాకుండా రైతాంగాన్ని ఇబ్బందుల్లో పడేశారన్నారు. రుణమాఫీ చేయకుండా 6 లక్షల మంది డ్వాక్రా సంఘాల సభ్యులను మోసం చేశారన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు కాలువ పనుల్లో నాలుగేళ్లుగా గంప మట్టిని కూడా తీయని పాలకులు రూ.50 కోట్లతో పూర్తి అయ్యే 36వ ప్యాకేజీ పనులను ప్రస్తుతం రూ. 250 కోట్లకు పెంచుకుని రూ. 200 కోట్లు అవినీతికి పాల్పడుతున్నారన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ది చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం కొన్ని సంస్థలు చేసిన సర్వేల్లో టీడీపీ ప్రభుత్వం అత్యంత అవినీతి ప్రభుత్వంగా పేరు తెచ్చుకుందని తలారి పీడీ రంగయ్య అన్నారు. తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ కొనుగోలులో ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నాడన్నారు. ఉమ్మడి రాజధానిలో దాదాపుగా 85 రోజుల పాటు హైదరాబాద్‌లో సెక్రటేరియట్‌కు సీఎం వెళ్లకుండా ఉన్నారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాకుండా ప్యాకేజీకి మొగ్గు చూపి అసెంబ్లీ తీర్మానం చేశాడన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలతో వ్యాపారులు కొనుగోలు చేయలేని దుస్థితి నెలకొనడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేవలం వచ్చే ఏడాది ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నాలుగు సంవత్సరాలుగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాడుతున్న ప్రత్యేక హోదా అంశాన్ని కూడా సీఎం చంద్రబాబునాయుడు యుటర్న్గా తీసుకోవడం సిగ్గుచేటని అన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠాన్ని చెప్పాలని పిలుపునిచ్చారు. బెళుగుప్ప : రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని గాలికి వదలిన టీడీపీ ప్రభుత్వ అవినీతిని ఎండగడుతూ వైఎస్సార్సీపీ అభ్యున్నతికి ప్రతి కార్యకర్త, బూత్ కమిటీ సభ్యులు సైనికుల్లా పోరాడుదామని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, అనంతపురం పార్లమెంట్ స్థానం సమన్వయకర్త తలారి పీడీ రంగయ్యలు పిలుపునిచ్చారు. శనివారం బెళుగుప్పలో శ్రీనివాస్ తోటలోని హాల్ నందు పార్టీ మండల కన్వీనర్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన బూత్ కమిటీ సభ్యుల శిక్షణా కార్యక్రమానికి ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, తలారి రంగయ్యలు ముఖ్య అథితులుగా పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే అమలు చేసే నవరత్నాల పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో బెళుగుప్ప సర్పంచ్ రామేశ్వరరెడ్డి, బెళుగుప్ప సింగిల్ విండో అధ్యక్షుడు శివలింగప్ప, కాలువపల్లి ఎంపీటీసీ వెంకటేశులు, దుద్దేకుంట సర్పంచ్ ఎర్రిస్వామి, పార్టీ మండల మహిళా కన్వీనర్ యశోధమ్మ, నాయకులు మరియు బూత్ కమిటీల కన్వీనర్లు ఓబిరెడ్డి కేశవరెడ్డి, చౌదరి, అంగడి ఎర్రిస్వామి, నరిగన్న, తిమ్మారెడ్డి, మచ్చన్న, నరిగన్న, దొడగట్ట క్రిష్టప్ప, రమనేపల్లి రమేష్, శ్రీరంగాపురం శ్రీనివాసరెడ్డి, జగన్మోహన్, మోహన్‌రెడ్డి, అంకంపల్లి శ్రీనివాసరెడ్డి, రుద్రానంద, గురుమూర్తిరెడ్డి, బాబురెడ్డి, పూలప్రసాద్, వినోద్, తిప్పేస్వామి, నరసింహ, బ్రహ్మయ్య, తిమ్మారెడ్డి, రమనేపల్లి రమేష్, హనుమంతురాయుడు, దొడగట్ట క్రిష్టప్ప, నరిగన్న అక్కులన్న,రమేష్, మల్లి, ధనుంజయ, నాగరాజు, తాతెప్ప, తగ్గుపర్తి క్రిష్ణ, గంగవరం రమేష్, రవి, వెంకటనరసు, కాలువపల్లి ఫకృద్దీన్, మదు, తిమ్మన్న, రాము, యలగలవంక తిమ్మారెడ్డి, లేపాక్షి, శీనప్ప, తిప్పేస్వామినాయక్, లక్ష్మానాయక్, రామునాయక్, తగ్గుపర్తి నరేంద్ర, హనిమరెడ్డిపల్లి గోపాల్, గోవిందు, ఆనంత్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఉప ఎన్నికలు అనగానే చంద్రబాబు భయపడుతున్నారు?
సాక్షి, విజయనగరం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతి, అసమర్థత, పాలనతో గత నాలుగు సంవత్సరాలు నుంచి ఆంధ్ర ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్ర స్వామి తీవ్రంగా మడిపడ్డారు. ఆయన గురువవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ... శుక్రవారం రోజు బ్లాక్ డేగా గంట స్తంభం వద్ద నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఆంధ్ర ప్రజల ఆంకాంక్ష మేరకు ప్రత్యేకహాదా కోసమే వైఎస్సార్ సీసీ ఎంపీలు ఒక సంవత్సరం పదవి కాలం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజల శ్రేయసు కోసం తమ పదవులకు రాజీనామా చేశారని అన్నారు. తమ ఎంపీలు రాజీనామాలు స్పీకర్ ఆమోదించిన తర్వాత కూడా ఉప ఎన్నికలు రావని చంద్రబాబు అనడంలోనే ఎన్నికలు అంటేనే చంద్రబాబు భయపడుతున్నారని అర్థం అవుతోందన్నారు. తమ పార్టీ ఎంపీల మాదిరిగానే టీడీపీకి చెందిన 25 మంది ఎంపీలు రాజీనామాలు చేస్తే తప్పకుండా కేంద్రం దిగి వస్తుందని అన్నారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు వందల హామీలలో పది శాతం కూడా టీడీపీ అమలు చేయలేదని కోలగట్ల ధ్వజమెత్తారు. -
ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి..
సాక్షి, నెల్లూరు : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోసం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో రాజీలేని పోరాటం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారం మాట్లాడుతూ.. హోదా విషయంలో ముందు నుంచి పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్సార్ సీపీ మాత్రమేనన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం నాలుగు సంవత్సరాల నుంచి డ్రామాలు ఆడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నాలుగేళ్ల టీడీపీ ప్రభుత్వ పరిపాలన యథా చంద్రబాబు.. తథా ఎమ్మెల్యేలు అన్నట్లుగా సాగుతోందని, పైన ముఖ్యమంత్రి అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతుంటే కింద ఆయన పార్టీ ఎమ్మెల్యేలు దొరికినంత మేరకు దోచుకుంటూ దుర్మార్గాలకు పాల్పడుతున్నారని నల్లపురెడ్డి ఆరోపించారు. ఈ నాలుగేళ్లలో ఎన్నో దారుణాలు, మోసాలు చేస్తూ.. అబద్ధాలు చెబుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఉండటం మన దురదృష్టకరమని ఆయన విమర్శించారు. నిజంగా చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే పార్టీ మారిన 23 మంది ఎమ్మెలేలతో వెంటనే రాజీనామ చేయించాలని నల్లపురెడ్డి డిమాండ్ చేశారు. -
‘వంచన వ్యతిరేక దీక్ష’కు తరలిరండి
రాజాం : వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో సోమవారం చేపడుతున్న వంచన వ్యతిరేఖ దీక్షను విజయవంతం చేయాలని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు పిలుపునిచ్చారు. ఈ దీక్షకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు, పార్టీ అభిమానులు, నాయకులు తరలిరావాలని కోరారు. స్థానిక పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశం ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా జోగులు మాట్లాడుతూ టీడీపీ నాలుగళ్లుగా ప్రత్యేకహోదాకు వ్యతిరేకంగా పని చేసిందని అన్నారు. కేంద్రానికి రాష్ట్రాన్ని తాకట్టుపెట్టిన సీఎం చంద్రబాబుపై ప్రజలంతా వ్యతిరేక జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ విధివిధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తానని మోసగించిన ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వంచన వ్యతిరేఖ దీక్ష జరుగుతుందని, ప్రజలంతా తరలిరావాలని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కరే ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నారని స్పష్టంచేశారు. తొలి నుంచి ప్రత్యేకహోదా కోసం ఎన్నో పోరాటాలు చేశారని గుర్తుచేశారు. వీటన్నింటినీ ప్రభుత్వం అణిచివేసేందుకు ప్రయత్నించిందన్నారు. -
తిరగని సైకిళ్లు
ఉరూరా తిరగాలి.. హోదా కోసం చంద్రబాబునాయుడు కృషిని వివరించాలి.. ప్రతిఒక్కరినీ కలసి హోదా కోసం టీడీపీ చేస్తున్న కార్యక్రమాలను వివరిం చాలి. ఇందుకోసం ప్రతి నియోజకవర్గంలో సైకిల్ యాత్రలు నిర్వహించాలి. ఇది టీడీపీ రూపొందించిన సైకిల్ యాత్ర కార్యక్రమ సారాంశం. అయితే ప్రజల్లోకి ఏ ముఖం పెట్టుకుని వెళ్లాలో తెలియకో.. బీజీగా ఉన్నారో కానీ జిల్లాలో సైకిల్ యాత్రలు కేవలం మొక్కుబడిగా సాగుతున్నాయి. పర్యవసానంగా జిల్లాలో పార్టీ పరిస్థితి రోజురోజుకీ దయనీయంగా మారుతుందనే ఆందోళన టీడీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ప్రత్యేక హోదా విషయంలో ఇప్పటి వరకు రోజుకో రీతిలో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయు డు మొదలుకుని నియోజకవర్గ ఇన్చార్జిల వరకు అందరూ మాట్లాడారు. ఈ క్రమంలో ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ వైఖరిపై ప్రజల్లో సష్టమైన అవగాహన ఉంది. నాలుగేళ్లుగా హోదా విషయాన్ని నీరుగార్చారు. దీనిపై గ్రామస్థాయిలో కూడా ప్రజల్లో కొంత వ్యతిరేకత అధికార పార్టీ మూటగట్టుకుంది. ఈ క్రమంలో సైకిల్ యాత్ర ద్వారా అయినా జనాల్లోకి వెళ్లాలని భారీ షెడ్యూల్‌ను రూపొందించి ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలపై కార్యక్రమాన్ని రుద్దారు. ఈ నెల 21 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు జిల్లాలో సైకిల్ యాత్రలు నిర్వహించాలని షెడ్యూల్ రూపొందించారు. ఈ షెడ్యూల్ జిల్లాలో ఎక్కడా అమలు కాకపోవటం పార్టీ పరిస్థితికి నిదర్శనం. జిల్లాలో యాత్రలు సరిగా జరగకపోతే మరో వారం రోజులు పొడిగించాలని కూడా నిర్ణయించారు. ఈ క్రమంలో సైకిల్ యాత్రలు నిర్వహిస్తున్న నేతలకు స్థానిక పరిస్థితులు కత్తిమీద సాములా మారాయి. మరోవైపు కొందరు ఇన్చార్జిలు, ఎమ్మెల్యేలు అయితే అసలు ఈ యాత్రల గోల ఏంటని నియోజకవర్గాలకే పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ప్రజలకేం చెప్పాలి? టీడీపీ నేతల్లో ప్రజల వ్యతిరేకత భయం వెంటాడుతోంది. నాలుగేళ్లుగా ఏమీ చే యకుం డా బీజేపీతో దోస్తీ కట్టి ఇప్పుడు తప్పు అంతా బీజేపీపై రుద్ది ప్రజల్లోకి వెళ్లి సానుభూతి పొందాలన్నదే సైకిల్ యాత్ర అంతిమ లక్ష్యం. ప్రజల్లోకి వెళితే వారు ప్రశ్నిస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి. వారికి ఏం చెప్పాలి.. ఇలా రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్న తరుణంలో కొందరు నాయకులు ఈ యాత్రలు మనకొద్దని నిర్ణయించినట్లు సమాచారం. 3 నియోజకవర్గాల్లో ప్రారంభంకాని యాత్రలు జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో గత వారం రోజుల్లో సైకిల్ యాత్రలు మొక్కుబడిగా జరగ్గా, మిగిలిన మూడు నియోజకవర్గాలైన ఆత్మకూరు, సూళ్లూరుపేట, కావలిలో అసలు ప్రారంభం కాని పరిస్థితి. బిజీ షెడ్యూల్ తర్వాత మంత్రి సోమిరెడ్డి శనివారం పొదలకూరులో సైకిల్‌యాత్ర నిర్వహించారు. వెంకటగిరిలో కార్యకర్తలే సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నారు. కనీసం ఒక్కచోట కూడా ఎమ్మెల్యే కురుగుండ్ల పాల్గొన్న దాఖాలాల్లేవు. నెల్లూరులో సిటీ ఇన్చార్జి శ్రీధరకృష్ణారెడ్డితో పాటు మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఆత్మకూరులో మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి ఆయన సోదరుడు వివేకానందరెడ్డి మరణంతో నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. కావలి ఇన్చార్జిగా ఉన్న బీద మస్తానరావు వ్యాపారాల పనిమీద విదేశాల్లో బిజీగా ఉండి శనివారం స్వదేశానికి వచ్చారు. సూళ్లూరుపేట ఇన్చార్జి పరసా రత్నం ఇంతవరకు యాత్ర ఆలోచనే చేయలేదు. -
పార్టీ బలోపేతంలో యువత పాత్ర కీలకం
పీలేరు : వైఎస్సార్సీపీ బలోపేతంలో యువత పాత్ర కీలకమని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం పీలేరులో పార్టీ యువ నేత కృష్ణచైతన్యరెడ్డి జన్మదిన వేడుకలకు ఆయన హాజరయ్యారు. వైఎస్సార్సీపీ జెండా రంగులో రూపిందించిన కేక్‌ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను గడప గడపకూ తీసుకెళ్లి వివరించడంలో యువత చురుకైన పాత్ర పోషించాలని సూచించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవని కాదని, ముగిసిపోయిన అధ్యాయమని అవహేళన చేసిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. హోదా కోసం ఉద్యమించిన ఎమ్మెల్యేలు, నాయకులు, యువకులపై అక్రమ కేసులు పెట్టించిన సీఎం ఉన్నఫలంగా యూటర్న్ తీసుకుని మరోమారు ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైఎస్. జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో హోదా కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నామని చెప్పారు. సీఎం డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు.. తన ఉనికికే ప్రమాదం ఏర్పడడంతో సీఎం హోదా అంటూ కొత్తనాటకానికి తెరలేపారని విమర్శించారు. రూ. 30 కోట్ల ప్రజాధనంతో దొంగ దీక్ష చేసి తన ధ్వంద నీతిని సీఎం ప్రదర్శించారని ధ్వజమెత్తారు. సీఎం మాటలకు చేతలకు పొంతన ఉండదని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి వచ్చే ఎన్నికల్లో టీడీపీని భూస్తాపితం చేయడంలో యువత కీలకంగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ కన్వినర్ నారే వెంటక్రమణారెడ్డి, పార్టీ నాయకులు ఎం. భానుప్రకాష్‌రెడ్డి, కొత్తపల్లె సురేష్‌కుమార్‌రెడ్డి, పెద్దోడు, చైతన్యరెడ్డి, ఆనంద్, శ్యామ్‌రెడ్డి, ఉదయ్, హరి, వెంకటేశ్వర్‌రెడ్డి, జీవన్, నవీన్, సుధాకర్, కిషోర్, మణి తదితరులు పాల్గొన్నారు. భాస్కర్‌నాయుడు కుటుంబానికి పరామర్శ కలకడ: స్థానిక వైఎస్సార్సీపీ నాయకుడు నీళ్ల భాస్కర్‌నాయుడు కుటుంబాన్ని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పరామర్శించారు. ఆదివారం మండలంలోని కె.బాటవారిపల్లెలో భాస్కర్‌నాయుడు తమ్ముడు భార్య సూర్యకుమారి శుభస్వీకరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మనోహర్‌నాయుడు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలసుకున్నారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ వెంకట్రమణరెడ్డి, నాయకులు నల్లారి తిమ్మారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, కేఎస్ మస్తాన్ తదితరులు ఉన్నారు. గెలుపే లక్ష్యంగా పని చేయాలి కేవీపల్లె: వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పని చేయాలని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని జిల్లేళ్లమంద పంచాయతీ నగిరిలో పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయి నుంచి ప్రతి కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని కోరారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్. జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాల హామీలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. సమావేశంలో జెడ్పీటీసీ జి. జయరామచంద్రయ్య, పార్టీ మండల కన్వీనర్ వెంకటరమణారెడ్డి, నాయకులు గజ్జెల శీన్‌రెడ్డి, రెడ్డెప్పరెడ్డి, రమేష్, ధర్మారెడ్డి, నాగసిద్ధారెడ్డి, గణపతిరెడ్డి, సైఫుల్లాఖాన్, అమరేంద్రనాయుడు, యర్రయ్య, చిన్నబ్బ, చెంగయ్య, ప్రభాకర, రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దీక్ష పేరుతో ప్రజాధనం వృథా
రైల్వేకోడూరు అర్బన్ : రాష్ట్రానికి ప్రత్యేకహోదా తేవడంలో నాలుగేళ్లుగా ప్రజలను మభ్యపెట్టి, ఇప్పుడు ఒక రోజు దీక్ష అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృథా చేశారని వైఎస్సార్ సీపీ నాయకులు విమర్శించారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శనవారం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికైనా ప్రజలను మభ్య పెట్టడం మానాలని హితవు పలికారు. విభజన చట్టం ప్రకారం అప్పటి ప్రధాని హామీలు, రావల్సిన నిధులు తెప్పించడంలో చంద్రబాబు విఫలమయ్యారని ఆరోపించారు. ఎన్నికల ముందు ప్రజలను మభ్య పెట్టడానికి ప్రతిరోజు ఏదోక నాటకానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. దీక్ష చేయాల్సింది రాష్ట్రంలో కాదని, ధైర్యం ఉంటే ఢీల్లీలో ప్రధాని నివాసం ముందు చేయాలన్నారు. బీజేపీతో తెగతెంపులు అంటూ ప్రజలను నమ్మించి, లోపాయికారిగా కేసుల కోసం బీజేపీ వారికి టీటీడీ పాలక మండలి సభ్యులుగా పదవులు ఇవ్వడమేంటని వారు ప్రశ్నించారు. ఏసీలు పెట్టుకుని దీక్షలు చేసే చంద్రబాబుకు ఉద్యమాల గురించి ఏం తెలుసునని వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజం సుకుమార్‌రెడ్డి, జెడ్పీటీసీ మారెళ్ల రాజేశ్వరి, పట్టణ కన్వీనర్ సీహెచ్ రమేష్ విమర్శించారు. పార్టీ మండల కన్వీనర్ గుంటిమడుగు సుధాకర్‌రాజు, నియోజకవర్గ అధికార ప్రతినిధి మందల నాగేంద్ర, జిల్లా స్టీరింగ్ కమిటీ సబ్యులు నందాబాల, ఎంపీటీసీలు మందల శివయ్య, డాక్టర్ సుబ్రమణ్యం, పట్టణ కన్వీనర్ అబ్దుల్‌రౌఫ్, సిగమల రామచంద్రారెడ్డి, నాయకులు తిరుపతి శేఖర్, సుదర్శన్ రాజు, గంగయ్య, తిప్పన మణి, డీవీ రమణ పాల్గొన్నారు. -
మా రాజీనామాలతో పోరాటం ఆగదు..
కడప కార్పొరేషన్ : ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ప్రతి పౌరుడు సొంతం చేసుకోవాలని కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఎంపీ పదవికి రాజీనామా చేసి, ఆరు రోజులపాటు ఢిల్లీలో ఆమరణ దీక్ష చేసి మొదటిసారి కడపకు వచ్చిన వైఎస్ అవినాష్‌రెడ్డికి పార్టీ శ్రేణులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇక్కడి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యేలు ఎస్. రఘురామిరెడ్డి, పి. రవీంద్రనాథ్‌రెడ్డి, ఎస్బి అంజద్‌బాషా, మేయర్ సురేష్‌బాబు, జమ్మలమడుగు, కమలాపురం నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తలు డాక్టర్ సుధీర్‌రెడ్డి, దుగ్గాయపల్లె మల్లికార్జున్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డిలతో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రత్యేక హోదా, విభజన హామీలైన కడప ఉక్కు పరిశ్రమ, విశాఖ రైల్వేజోన్, దుగ్గరాజ పట్నం పోర్టు, పెట్రో కెమికల్ ఫ్యాక్టరీ, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ కోసం నాలుగేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్రాంత పోరాటం చేస్తోందని తెలిపారు. గత ఫిబ్రవరిలో ఈ డిమాండ్ల సాధన కోసం ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన కార్యాచరణ ప్రకటించారన్నారు. పార్లమెంటు సమావేశాల్లో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని, ఏప్రిల్ 6వ తేదిలోగా హోదాపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని ప్రకటించారని గుర్తు చేశారు. అందులో భాగంగానే తాము పార్లమెంటులో 13 సార్లు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చి చర్చకు, ఓటింగ్‌కు పట్టుబట్టామన్నారు. చర్చ జరిగితే తాను దోషిగా నిలబడాల్సి వస్తుందనే కేంద్రం చర్చ జరపకుండా విలువైన సమయాన్ని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. ఈ మొత్తం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం మొదటి ముద్దాయి అయితే రాష్ట్ర ప్రభుత్వం రెండో మొదటి ముద్దాయి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు మొదటి నుంచి స్పష్టమైన స్టాండ్ లేదని విమర్శించారు. రాజకీయాలు ఎన్నికల సమయంలో చేసుకుందాం, ఇప్పుడు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం 25 మంది ఎంపీలతో రాజీనామాలు చేయించి పిడికిలి బిగించి కేంద్రాన్ని బలంగా కొడదామని వైఎస్ జగన్ పిలుపునిస్తే చంద్రబాబు ముందుకు రాలేదని విచారం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ఎంపీలతోపాటు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసి ఉంటే దేశం మొత్తం చర్చ జరిగేదని, కేంద్రం దిగివచ్చి ప్రత్యేక హోదా ఇచ్చేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించాల్సిన సమయంలో స్పందించకుండా ప్రజల ఆకాంక్షలకు గౌరవం లేకుండా చేశారని అన్నారు. ధర్మం లేదు.. పోరాటం లేదు.. ధర్మ పోరాట దీక్ష పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.20కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేసి చేసే దీక్షలో ధర్మం లేదు, పోరాటం లేదని ఆయన విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇళ్లు, ప్రయాణాలు, తన జల్సాల కోసం ఇష్టం వచ్చినట్లు ప్రజాధనం దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన అయ్యాక ఏపిపై తొంబై వేల కోట్ల అప్పులు ఉండగా, ఇప్పుడు రెండు లక్షలా 30 వేలకోట్లు అప్పులున్నాయన్నారు. రైతు రుణమాఫీ ఇంకా కాలేదు, డ్వాక్రా రుణమాఫీ పూర్తి కాలేదు, నిరుద్యోగ భృతి అసలే ఇవ్వలేదు, మరి ఇంత అప్పు ఎలా అయిందని నిలదీశారు. ప్రత్యేక హోదా ఉద్యమం తమ రాజీనామాలతోనే ఆగదని, వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో దీన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకు వెళ్తామని స్పష్టం చేశారు. చంద్రబాబుది 420 దీక్ష: ఎమ్మెల్యే రఘురామిరెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏప్రిల్ 20వ తేదీన ధర్మపోరాట దీక్ష 420 దీక్ష అని మైదుకూరు శాసనసభ్యులు ఎస్. రఘురామిరెడ్డి విమర్శించారు. హోదా అవసరం లేదు, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే చాలని, రాష్ట్ర అసెంబ్లీలో ప్రధాని నరేంద్రమోదీకి అభినందనలు తెలిపిన విషయం చంద్రబాబు మరిచిపోయినట్లున్నారని ఎద్దేవా చేవారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవాడలో ఏడు రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే, దీక్ష చేయాల్సింది ఇక్కడ కాదని మాట్లాడారని గుర్తు చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి దీక్ష ఎక్కడ చేస్తున్నారని, ఎవరి సొమ్ముతో చేస్తున్నారని ప్రశ్నించారు. దొంగదీక్ష: ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల కోసం వైఎస్ఆర్సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి ఆమరణ నిరాహార దీక్ష చేస్తే టీడీపీ నాయకులు దొంగనాటకాలు ఆడారని «ధ్వజమెత్తారు. తమ లోక్‌సభ ఎంపీలతో రాజీనామాలు చేయిస్తే, టీడీపీ ఎంపీలు చేయకపోగా రాజ్యసభ ఎంపీలను రాజీనామా చేయమని చెప్పడం దారుణమన్నారు. టీడీపీ లోక్‌సభ ఎంపీలతో రాజీనామా చేయించకుండా ఆమాట ఎలా చెప్తారని నిలదీశారు. చంద్రబాబు దీక్ష దొంగ దీక్ష అని విమర్శించారు. హోదా కోసం ఉద్యమాలు చేసేవారిపై కేసులు పెట్టి సీఎం అణిచివేస్తున్నారన్నారు. ఆయన దీక్షకు మాత్రం జిల్లాకు కోటి రూపాయలు కేటాయించి ఆర్టీసీ బస్సుల్లో జనాన్ని తోలడం దారుణమన్నారు. ఇది అంతం కాదు ఆరంభమేనని, రాబోయే ఎన్నికల్లో ఎవరైతే ప్రత్యేక హోదా ఇస్తారో ఆ పార్టీకే తమ పార్టీ మద్దతు పలుకుతుందని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు పులి సునిల్‌కుమార్, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు కరీముల్లా, నగర అధ్యక్షుడు షపి, జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి శివప్రసాద్, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్, పవర్ అల్తాఫ్, ఆయూబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి సోమిరెడ్డిని నిలదీసిన తెలుగు తమ్ముళ్లు..
కడప రూరల్ : స్ధానిక ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో గురువారం జిల్లా ఇన్ చార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈసందర్భంగా మరోమారు విబేధాలు బయట పడ్డాయి. సమాచారం మేరకు ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపడుతున్న ధర్మ పోరాట దీక్ష, అనంతరం 15 రోజుల పాటు చేపట్టే సైకిల్, పాదయాత్రలు తదితర అంశాల గురించి సమావేశంలో చర్చించారు. కాగా ఇటీవల కాలంలో టీడీపీలో ఆధిపత్యం, వర్గ పోరు ఎక్కువైంది. ప్రతి నియోజక వర్గంలో రెండు, మూడు గ్రూపులు ఉన్నాయి. ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాలను గ్రూపుల వారీగా నిర్వహించి అందరినీ విస్తుపోవయేలా చేశారు. ఈ పరిణామాలు అధిష్టానానికి తల నొప్పిగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా అంశంతో ప్రజల్లోకి వెళ్లలేక పోతున్నారు. హోదా అంశంపై తమ ఉనికిని చాటు కోవడానికి తాపత్రయ పడుతున్నారు. అందులో భాగంగా శుక్రవారం జిల్లాలోని అన్ని నియోజక వర్గాల్లో ‘ధర్మ పోరాట దీక్ష’ను చేపడుతున్నారు. ఈ తరుణంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులురెడ్డి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దృష్టికి కొన్ని అంశాలను తీసుకెళ్లారు. దీనిపై మంత్రి స్పందించారు. శుక్రవారం చేపట్టే దీక్షలను పార్టీ నియోజక వర్గ ఇన్చార్జిలు, ఇతర నాయకులు అందరూ ఐకమత్యంగా నిర్వహించాలన్నారు. ఒకే దీక్షా శిబిరం ఉండాలన్నారు. జమ్మలమడుగు, కమలాపురం, బద్వేలు తదితర నియోజక వర్గాల్లో ఒకే దీక్షా శిబిరంలో నేతలంతా పాల్గొంటారని తెలిపారు. అందుకు కొంతమంది తమ్ముళ్లు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఐకమత్యం ఇప్పుడే గుర్తుకు వచ్చిందా..? అని ప్రశ్నించారు. ప్రధానంగా రాయచోటి మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు తనయుడు ప్రసాద్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీలో తాము కష్టించి పనిచేశాం. గడిచిన నాలుగేళ్లుగా తమను ఎవ్వరూ పట్టించుకోలేదు అని నిలదీశారు. మాకు ఎలాంటి గుర్తింపు లేదు. ఇప్పుడేమో ఐకమత్యంగా పనిచేయమంటున్నారు. ప్రత్యేక శిబిరాలు పెట్టవద్దని అంటున్నారు. అది ఎంతమాత్రం కదరదు. ప్రత్యేక శిబిరం పెట్టి తీరుతామని తెగేసి చెప్పారు. దీంతో మంత్రి సోమిరెడ్డి నిశ్చేఘ్టడయ్యారు. కాసేపటికి తేరుకొని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. మీ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని చెప్పారు. మరికొంతమంది తమ్ముళ్లు తమ నియోజక వర్గాల్లోని సమస్యలను ఏకరువు పెట్టారు.కొంతమంది నాయకులు అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేసేలా చూడాలని, లేదంటే వ్యతిరేకత వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులురెడ్డి, నాయకులు లింగారెడ్డి, వరదరాజులరెడ్డి, పుత్తా నరసింహరెడ్డి, రమేష్‌రెడ్డి, విజయజ్యోతి, ఆరీఫుల్లా, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం పాలిట బీజేపీ శత్రువుగా మారింది ప్రత్యేక హోదా కల్పిస్తామని ఇచ్చిన మాటను విస్మరించి రాష్ట్రం పాలిట భారతీయ జనతా పార్టీ శత్రువుగా మారిందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. గురువారం ఇక్కడ విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి తీరని ద్రోహం చేశారన్నారు. బీజేపీకీ రాష్ట్రంలో పుట్టగతులు ఉండవన్నారు. -
ప్రత్యేక హోదా సాధనే వైఎస్సార్ సీపీ లక్ష్యం
మైదుకూరు టౌన్ : రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేకహోదా సాధించడమే వైఎస్సార్ సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే ఎస్ రఘురామిరెడ్డి పేర్కొన్నారు. పార్టీ పిలుపుమేరకు ప్రత్యేకహోదా సాధనకు స్థానిక కడప రోడ్డులోని బస్టాండ్ ఎదురుగా వైఎస్సార్ సీపీ రిలేదీక్షలు చేపట్టింది. ఆదివారం దీక్షలో రాజీవ్‌గాంధీ నగర్‌కు చెందిన మహిళలు, పార్టీ నాయకులు కూర్చున్నారు. ముందుగా వారు రాజీవ్‌గాంధీ నగర్ నుంచి ర్యాలీగా దీక్ష శిబిరం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రత్యేకహోదా విషయంలో టీడీపీ ప్రభుత్వం రోజుకో కొత్త నాటకం ఆడుతోందన్నారు. ఏదో పేరుకు బైక్‌ల ర్యాలీ, పార్లమెంట్లో దిండ్లు వేసుకుని పడుకుని నిరసన చేశారే తప్ప, ఉద్యమ స్ఫూర్తి టీడీపీ నాయకుల్లో లేదని ఆయన విమర్శించారు. ప్రత్యేకహోదా ఉద్యమాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని ఎమ్మెల్యే ప్రశ్నించారు. తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేసి ఆమరణ దీక్షలు చేపడితే, టీడీపీ ఎంపీలు ఏ ఉద్యమాలు చేయకుండా మీడియా ఎదుట కేంద్రంపై నాటకీయ విమర్శలు చేయడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా తీసుకురావాలనే చిత్తశుద్ధి చంద్రబాబుకు ఉంటే తమ ఎంపీలచే రాజీనామాలు చేయించి, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు. ప్రత్యేకహోదా కోసం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు పోరాటం చేయాల్సి ఉందన్నారు. రిలే దీక్షల్లో రాజీవ్‌గాం«ధీ నగర్‌కు చెందిన సీవీ చలమయ్య, లక్ష్మిదేవి, ఆదిలక్షుమ్మ, చొక్కం శివ, పాములేటి, రఘురామయ్య, ఇర్షాద్, కొండపేట షరీఫ్, రాంశివ, బాలయ్య యాదవ్, బండి తిరుమలయ్య, చింతకుంట వీరారెడ్డి, గోశెట్టి లక్షుమయ్య, మాజీ ఎంపీటీసీ దండు రామయ్య, అధిక సంఖ్యలో కార్యకర్తలు కూర్చున్నారు. వీరికి సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి పీ శ్రీరాములు, సుబ్బరాయుడు, కొండపేట షరీఫ్ తదితరులు మద్దతిచ్చారు. -
ఇద్దరు మోసగాళ్లతో ఏపీకి అన్యాయం
కదిరి : ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో ప్రధాని నరేంద్రమోడీ ఎంత మోసం చేశాడో... హోదా తెచ్చే విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంతకన్నా ఎక్కువ మోసం చేశాడు. ఈ ఇద్దరు మోసగాళ్లూ ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలను బంగాళాఖాతంలో కలపాలి’ అని వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ పీవీ.సిద్ధారెడ్డి ధ్వజమెత్తారు. ప్రత్యేకహోదా కోసం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్ కూడలిలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు ఆదివారం 9వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోదా కోసం పోరాడుతున్న జగన్ వెంటే జనం ఉన్నారని తెలుసుకున్న చంద్రబాబు ఇప్పుడు హోదా జపం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలేం అమాయకులు కాదని, ఎవరు చిత్తశుద్ధిగా పోరాడుతున్నారో వారికి బాగా తెలుసని అన్నారు. హారతి పట్టిన మహిళలు ప్రత్యేకహోదా కోసం తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్న సిద్ధారెడ్డిని పట్టణంలోని పలువురు మహిళలు అభినందించారు. ఆయనకు హారతి పట్టి మీ సంకల్పం నెరవేరాలని ఆశీర్వదించారు. మేము సైతం అంటూ వారు కూడా దీక్షలో కూర్చున్నారు. హోదాకు తూట్లు పొడుస్తున్న చంద్రబాబుకు ఓటు ద్వారా బుద్ధి చెబుతామన్నారు. -
బంద్‌కు సహకరించండి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం నేడు చేపట్టే రాష్ట్రబంద్‌కు సహకరించాలని వివిధ వర్గాల ప్రజలను హఫీజ్‌ఖాన్ కోరారు. ఇప్పటికే బంద్‌కు పలు మర్చంట్ సంఘాలు, ఆటో యూనియన్లు, ప్రైవేట్ స్కూల్స్ అసోయేషన్, పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు మద్దతు తెలిపాయన్నారు. ఉదయం ఐదు గంటల నుంచే బస్సుల రాకపోకలను అడ్డుకుంటామన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలేనిరాహారదీక్షలు ఆదివారంతో ఉదయం తొమ్మిదో రోజుకు చేరాయి. కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, నగర అధ్యక్షుడు రాజావిష్ణువర్ధన్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. దీక్షను ప్రారంభించిన హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ.. ఇటీవల వైఎస్ఆర్సీపీ ఎంపీలు పార్లమెంట్లో ఇచ్చిన అవిశ్వాస తీర్మాణంపై చర్చ జరగకుండా బీజేపీ ప్రభుత్వం అడ్డుకుందన్నారు. బీజేపీ నిరంకుశ విధానాన్ని నిరసిస్తూ ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్, వామపక్షాలు, జనసేన ఇచ్చిన రాష్ట్రబంద్‌ను విజయవంతం చేసేందుకు పెద్ద ఎత్తున యువకులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయ, కార్మికులు, మహిళలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ నాలుగేళ్ల నుంచి ప్రత్యేక హోదా కోసం అనేక పోరాటాలు చేస్తోందని పార్టీ నగర అధ్యక్షుడు రాజావిష్ణువర్ధన్‌రెడ్డి చెప్పారు. కార్యక్రమంలో నాయకులు సీహెచ్ మద్దయ్య, ధనుంజయాచారి, ఆదిమోహన్‌రెడ్డి, కొనేటి వెంకటేశ్వర్లు, ఫైజాన్, శౌరీ విజయకుమారి, విజయలక్ష్మి, సాంబశివారెడ్డి, «రామ్మోహన్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, రాఘవేంద్రారెడ్డి, శ్రీనివాసరెడ్డి, మల్లికార్జున, శ్రీనివాసరెడ్డి, ప్యాలకుర్తి రఘు, విజయాచారి, సుమీర్ అలిఖాన్, ఆర్టీసీ నాయకులు జార్జ్, ప్రసాద్, మహిళలు సఫియాఖాతూన్, వహిదా, సరోజా, గౌసియా, పార్వతమ్మ, పద్మ తదితరులు పాల్గొన్నారు. -
మోసానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు
పత్తికొండ టౌన్ : ప్రత్యేక హోదా అంటే జైలుకే అన్న సీఎం చంద్రబాబు ఇపుడెందుకు యూటర్న్ తీసుకున్నాడో ప్రజలకు సమాధానం చెప్పాలని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి, జిల్లా కార్యదర్శి శ్రీరంగడు డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తమ పదవులకు రాజీనామా చేసి, ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్న వైఎస్సార్సీపీ ఎంపీలకు మద్దతుగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పత్తికొండలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారంతో 9వ రోజు చేరుకున్నాయి. దీక్షలో వైఎస్సార్సీపీ నాయకులు హరీశ్‌రెడ్డి, ఇమ్రాన్, నజీర్, షేక్ లాలు, బొంబాయి శ్రీనివాసులు, కారుమంచప్ప, కోతికొండ చిరంజీవి, కోతికొండ లాలు, హుసేన్, మాణిక్యం, పరమేశ్ కూర్చున్నారు. టీడీపీకి పోరాడే నైతికహక్కు లేదు... వారు మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం పోరాడిన విపక్ష నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి, జైళ్లలో పెట్టించిన సీఎం చంద్రబాబు, టీడీపీ నాయకులకు ఇపుడు హోదా కోసం పోరాడే నైతిక హక్కు లేదన్నారు. దేశంలోనే సీనియర్ రాజకీయ నాయకుడని గొప్పలు చెప్పుకునే సీఎం చంద్రబాబు, హోదా సాధించడంలో నీ సీనియారిటీ ఏమైందని ప్రశ్నించారు. మోసానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని, పూటపూటరూ రంగులు మార్చే ఊసరవెల్లిలా, ఏ అవసరాని ఆ మాట మాట్లాడుతూ పబ్బం గడుపుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా సాధించుకునే ఉద్యమంలో కడదాకా పోరాడదామని, ఇందులో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బంద్‌ను జయప్రదం చేయండి... ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం సోమవారం చేపట్టనున్న రాష్ట్ర బంద్‌ను జయప్రదం చేయాలని కంగాటి శ్రీదేవి విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీపీ, సీపీఐ, సీపీఎం, ఇతర విపక్షాలు, ప్రజాసంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యా, కార్మిక, రైతు, మహిళా, యువ సంఘాలతో కలిసి బంద్‌లో పాల్గొంటున్నట్లు ఆమె తెలిపారు. ఈ బంద్‌కు అన్ని వర్గాలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ జూటూరు బజారప్ప, చక్రాళ్ల, శభాశ్పురం సర్పంచులు శ్రీరాములు, హనుమంతు, జిల్లా కమిటీ సభ్యుడు ఎర్రగుడి రామచంద్రారెడ్డి, నాయకులు కారం నాగరాజు, రవికుమార్ నాయుడు, బురుజుల భరత్‌రెడ్డి, దేవన్న, పెద్దహుల్తి నాగరాజు, తిప్పన్న, పోతుగల్లు వెంకటేశ్, మల్లికార్జునరెడ్డి, రంగానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్‌తోనే ప్రత్యేక హోదా సాధ్యం
రాయచోటి : వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాట ఫలితంగానే రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధ్యమవుతుందని వైఎస్సార్సీపీ నాయకులు నినదించారు. రాయచోటిలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన రీలే దీక్షలు శనివారంతో 8వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ జిల్లా బీసీ శాఖ ప్రధాన కార్యదర్శి విజయభాస్కర్ అధ్యక్షతన పట్టణం, మండల పరిధిలోని బీసీ నాయకులు దీక్షలో కూర్చొన్నారు. దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపిన యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మదనమోహన్‌రెడ్డి మాట్లాడుతూ పూర్తి స్థాయిలో నష్టపోయిన ఆంధ్రరాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేకహోదా ఒక్కటే శరణ్యమన్నారు. ప్రత్యేకహోదా కేటాయింపులో బీజేపీ, టీడీపీ రాష్ట్రానికి తీవ్ర మోసం చేశాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామాలు చేసి ఆమరణ దీక్షకు కూర్చొన్నారని, ఈ విషయంలో టీడీపీ కూడా చిత్తశుద్ధితో ఎంపిల చేత రాజీనామాలు చేయించాలని డిమాండ్ చేశారు. దీక్షా శిబిరం ప్రారంభం సందర్భంగా రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రత్యేకహోదా కోసం చేపట్టిన రిలే దీక్షా శిబిరానికి మున్సిపల్ చైర్పర్సన్ నసిబూన్‌ఖానమ్, కో ఆప్షన్ సభ్యులు సలావుద్దీన్, కౌన్సిలర్లు ఫయాజ్ రహిమాన్, కొలిమి చాన్‌బాషా, లయన్ నాగేశ్వరరావు, అన్వర్‌బాషా, గిరిజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు గుండా సురేంద్ర, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు అఫ్జల్‌అలీఖాన్, డీసీఎంఎస్ మాజీ డైరెక్టరు బుల్లి వెంకటరమణ సంఘీభావం తెలిపారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా కార్యదర్శి కిషోర్, జగన్ యువసేన నాయకులు సురేష్‌కుమార్‌రెడ్డి, విక్కీ, దేవేంద్రకుమార్, మహేష్, లాలాదాస్, సాదిక్, మండెం ప్రసాద్, హేమంత్నాయక్, గిరివర్దన్ దీక్షల్లో కూర్చొన్నారు. -
హోదా ఉద్యమాన్ని నీరుగార్చాలని చూస్తున్నారు
ఉరవకొండ : రాష్ట్రంలో హోదా కోసం బంద్‌లు, ధర్నాలు చేయడం రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడమేనని సీఎం చంద్రబాబు మాట్లాడటం అన్యాయమని, అది ప్రజా పోరాటాన్ని నీరుగార్చడమేనని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. ఎంపీల ఆమరణ దీక్షకు మద్దతుగా శుక్రవారం ఉరవకొండలో చేపడుతున్న రిలే దీక్షల శిబిరాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు ముందు నుంచీ హోదా ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నారని, తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే ఇప్పుడు హోదా అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. హోదా కావాలని రాష్ట్రం ఉద్యమిస్తుంటే ఆయనకు సింగపూర్ ప్రయాణాలు ఎందుకని ప్రశ్నించారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి అమరావతిలో ఆనంద నగరం కార్యక్రమం చేపట్టారన్నారు. హోదా కోసం ఈనెల 16న హోదా సాధన సమితి అధ్వర్యంలో చేపట్టే రాష్ట్ర బంద్‌ను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరారు. ఇప్పటివరకు హోదా కోసం టీడీపీ వారు చేసిన ఆందోళనలు టీవీలు, పేపర్లలో తప్ప రోడ్లపై కన్పించలేదన్నారు. నాలుగేళ్లుగా ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం పేరుతో హడావిడి చేస్తున్నా నేటికీ అమరావతి డిజైన్లు కార్యరూపం దాల్చలేదన్నారు. కేవలం సింగపూర్, మలేషియా అంటూ చంద్రబాబు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. పార్లమెంట్లో వైఎస్సార్సీపీ 14 రోజులపాటు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడితే కేంద్రం 15 నిమిషాలు కుడా దానిపై చర్చించలేకపోయిందన్నారు. పార్లమెంట్‌ను స్తంభింప చేయడాన్ని నిరసిస్తూ ప్రధాని మోదీ దీక్ష చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు సుశీలమ్మ, జెడ్పీటీసీ సభ్యులు తిప్పయ్య, లలితమ్మ తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ, టీడీపీలు ప్రజాగ్రహానికి గురికాక తప్పదు
బద్వేలు అర్బన్ : ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన బీజేపీ, టీడీపీలు ప్రజాగ్రహానికి గురికాక తప్పదని వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సింగసాని గురుమోహన్, జిల్లా సంయుక్త కార్యదర్శి అందూరి రామక్రిష్ణారెడ్డి పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం నాటికి ఆరవ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలలో అట్లూరు మండల నాయకులు పాల్గొని.. చెవిలో పూలు పెట్టుకుని వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాడు ప్రత్యేక హోదా సంజీవని కాదని కారు కూతలు కూసిన చంద్రబాబు, నేడు హోదా కావాలని తన ఎంపీలతో నాటకాలు వేయిస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. నాలుగేళ్లుగా హోదా కోసం అలుపెరగని పోరాటాలు చేస్తున్న ఏకైక నాయకుడు జగన్మోహన్రెడ్డి మాత్రమే అని అన్నారు. హోదా కోసం తమ ఎంపీలు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా చేసిన పోరాటం చరిత్రాత్మకం అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ బద్వేలు మండల అధ్యక్షులు బోడపాడు రామసుబ్బారెడ్డి, బ్రాహ్మణపల్లె సింగిల్‌విండో అధ్యక్షులు జి.సుందర్రామిరెడ్డి, అట్లూరు మండల కన్వీనర్ మల్లికార్జునరెడ్డి, సర్పంచ్‌లు ప్రభాకర్‌రెడ్డి, జయరామిరెడ్డి, వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గోపాలస్వామి, మాజీ జెడ్పీటీసీ చెవుల రమణయ్య, అట్లూరు మండల నాయకులు మాధవరెడ్డి, ఓబుల్‌రెడ్డి, గోపిరెడ్డి, కొల్లు సుబ్బారెడ్డి, క్రిష్ణారెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, సుబ్బారెడ్డి, సుబ్బరాయుడు, గంగయ్య, సుబ్బయ్య, పెంచలయ్య, చిన్న, బాలయ్య, వెంకటసుబ్బయ్య, హజరత్, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శులు పుత్తా శ్రీరాములు, సింగసాని శివయ్య, సాంబశివారెడ్డి, మున్సిపాలిటీ నాయకులు ఈవై ఎద్దారెడ్డి, గాజులపల్లె కేశవరెడ్డి, ఆర్.శ్రీనివాసులు యాదవ్, వెంకటరత్నం, బిజ్జం రమణ, జయరామ్ యాదవ్, చెన్నక్రిష్ణారెడ్డి, బీమారెడ్డి, చిన్నసుబ్బారెడ్డి, గుజరాత్ యాదవ్, రామచంద్రయాదవ్, ప్రసాద్ నాయుడు, రోశిరెడ్డి, హసాన్, అనిల్, చెన్నయ్య, ఇమ్మానియేల్, సిద్ధువెంకట సుబ్బారెడ్డి, ఓబులేసు పాల్గొన్నారు. -
అలుపెరుగని పోరు
ప్రత్యేక హోదా ఉద్యమం ఉధృతంగా జరుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అలుపెరగని పోరాటం ఆది నుంచి కొనసాగుతూ ఉంది. ఢిల్లీలో ఎంపీల దీక్షలకు మద్దతుగా ప్రారంభమైన ఆందోళనలు...గురువారం ఆరోరోజు కూడా కొనసాగాయి.అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని నినదించారు. సాక్షి, కడప : హోదా సాధనే ధ్యేయంగా జరుగుతున్న రిలే నిరాహారదీక్షలు ఆరో రోజు కొనసాగాయి. కడప కార్పొరేషన్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలకు కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్‌బాబు, ఎమ్మెల్యే అంజద్‌బాష తదితరులు సంఘీభావం తెలియజేశారు. రాజంపేటలో జరుగుతున్న దీక్షలకు రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి,పలువురు నాయకులు సంఘీభావం తెలిపారు. కమలాపురంలో దీక్షలను ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి పూలమాలలు వేసి ప్రారంభించారు. ప్రొద్దుటూరులో రిలే నిరాహార దీక్షల్లో కూరగాయల మార్కెట్ అసోసియేషన్ ప్రతినిధులు కూర్చొన్నారు. ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి సంఘీభావం తెలియజేశారు. పులివెందులలో రిలే నిరాహార దీక్షలను వైఎస్సార్ సీపీ నియోజకవర్గ నాయకులు వైఎస్ భాస్కర్‌రెడ్డి, మున్సిపల్ వైఎస్సార్ సీపీ నాయకులు వైఎస్ మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో వేంపల్లె మండల ప్రజాప్రతినిధులతోపాటు పులివెందుల ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల నేతలు దీక్షల్లో కూర్చొన్నారు. రైల్వేకోడూరులో వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజం సుకుమార్‌రెడ్డి, జెడ్పీటీసీ మారెళ్ల రాజేశ్వరమ్మ, ఇతర వైఎస్సార్ సీపీ నాయకులు రిలే నిరాహార దీక్షల్లో కూర్చొన్నారు. పోరుమామిళ్లలో 101 టెంకాయలు కొట్టిన నేతలు బద్వేలు నియోజకవర్గంలోని పోరుమామిళ్ల వెంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం ఎంపీల ఆరోగ్యం బాగుండాలని.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని ఎంపీపీ చిత్తా విజయ్‌ప్రతాప్‌రెడ్డి, కాశినాయన మండల కన్వీనర్ విశ్వనాథరెడ్డిల ఆధ్వర్యంలో 101 టెంకాయలు కొట్టారు. వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోరుమామిళ్లలో యథావిధిగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. కడపలో ‘ఛాయ్ వాలా’లకు వినతిపత్రాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని టీకొట్టు నిర్వాహకులకు వినతిపత్రాలు ఇచ్చి వైఎస్సార్ సీపీ వినూత్న నిరసనకు దిగింది. ప్రధాని మోదీ ఛాయ్ విక్రయించారని.. ప్రస్తుతం కనీసం టీకొట్టు నిర్వహించే మీరైనా ప్రత్యేక హోదా ఆవశ్యకతను వివరిస్తే టీ వాలాలను చూసైనా ప్రత్యేక హోదా ఇవ్వాలని వినతిపత్రాలు సమర్పించారు. రాజంపేటలో పాత బస్టాండు సమీపంలో పోలి గ్రామస్తులు రిలే దీక్షల్లో కూర్చొన్నారు. అరుంధతివాడకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున దీక్షా శిబిరానికి చేరుకుని మోకాళ్లపై నిలుచొని నిరసన తెలియజేశారు. రాయచోటిలో కువైట్ సంఘం సంఘీభావం రాయచోటిలో గురువారం రామాపురం మండలానికి చెందిన నాయకులు, కార్యకర్తలు దీక్షల్లో కూర్చొన్నారు. అందుకు సంబంధించి వైఎస్సార్ సీపీ గల్ఫ్ కన్వీనర్ బీహెచ్ ఇలియాస్‌తోపాటు ఇతర నాయకులు సంఘీభావం తెలియజేశారు. వైఎస్సార్ మజ్దూర్ యూనియన్, పలు ఉద్యోగ సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. -
అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు
అనంతపురం టౌన్ : ఐదుకోట్ల ఆంధ్రుల ఆకాంక్ష మేరకు సాగుతున్న ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అరెస్టులో అపలేరని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో సాగుతున్న హోదా ఉద్యమంలో భాగంగా గురువారం ఆ పార్టీ నేతలు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబుల దిష్టిబొమ్మలకు శవ యాత్ర నిర్వహించారు. పార్టీ శ్రేణులు నల్లవస్త్రాలు ధరించి తొలుత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి దిష్టిబొమ్మలను శవయాత్రగా టవర్‌క్లాక్ వరకూ తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడే దిష్టిబొమ్మలను దహనం చేసి పిండ ప్రధానం చేశారు. అనంతరం ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ, హోదాపై నాలుగేళ్లుగా నోరుమెదపని చంద్రబాబు.. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో హోదా రాగం అందుకోవడం ఆయన స్వార్థ రాజకీయానికి నిదర్శనమన్నారు. హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు శంకర్‌నారాయణ మాట్లాడుతూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల దీక్షలతోనే టీడీపీ ప్రభుత్వంలో చలనం వచ్చిందన్నారు. చంద్రబాబు డ్రామాలను ప్రజలను గమనిస్తున్నారన్నారు. హోదాపై చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే తన పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. అనంతపురం నియోజకవర్గ సమన్వయ కర్త నదీమ్ అహమ్మద్ మాట్లాడుతూ, ప్యాకేజీకి మొగ్గు చూపిన చంద్రబాబు రాష్ట్రానికి తీరని అన్యాయం చేశాడన్నారు. కేంద్రం నుంచి వైదొలిగినా...లోపాయికారి ఒప్పందాన్ని నేటికీ కొనసాగిస్తున్నాడన్నారు. అందులో భాగంగానే టీడీపీ ఎంపీలతో సైకిల్, బస్సు యాత్రల పేరిట డ్రామాలు ఆడిస్తున్నాడన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిష్టప్ప మాట్లాడుతూ, చంద్రబాబు మోసాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు గౌస్‌బేగ్, విద్యార్థి విభాగం నేతలు నరేంద్రరెడ్డి, బిల్లే మంజునాథ్, గోపాల్‌మోహన్, రామచంద్రారెడ్డి, ట్రేడ్ యూనియన్ నాయకులు ఆదినారాయణరెడ్డి, కొర్రపాడు హుస్సేన్‌పీరా, చింతకుంట మధు, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, కార్పొరేటర్లు గిరిజమ్మ, జానకి, సాకే చంద్ర, సతీష్, బీసీసెల్ శ్రీనివాసులు, పసుపుల బాలకృష్ణారెడ్డి, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు క్రిష్ణవేణి, శోభ, సుజాత, రెడ్డెమ్మ, జాహ్నవి, రాజీవ్‌కాలనీ ప్రశాంతి, నాగలక్ష్మీ, జయమ్మ, లక్ష్మీ పాల్గొన్నారు. -
నాడు వద్దు..నేడు కావాలి!
ఆదోని టౌన్ : నాలుగేళ్లలో ప్రత్యేక హోదాపై నోరు మెదపని సీఎం చంద్రబాబు నాయుడు నేడు హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్న తీరు మరోమారు రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ గౌరవ అధ్యక్షుడు చంద్రకాంతరెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి గోపాల్‌రెడ్డి, పీఏసీ సభ్యులు డాక్టర్ మధుసూదన్ ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు చేపట్టిన ఆమరణ దీక్షలకు మద్దతుగా స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆ పార్టీ నాయకులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆరవ రోజు గురువారం కొనసాగాయి. పట్టణ ఎస్సీ సెల్ నాయకులు ఏసేపు, చిన్న, క్రిష్ణ, రవి, రాజేష్, వైపీ రాజశేఖర్, వీరేష్, లక్ష్మన్న, భాస్కర్, కిరణ్, తిమ్మప్ప, ఈరన్న కూర్చున్న దీక్ష శిబిరాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. హోదా సాధనకు ఎంపీలు ప్రాణాలు తెగించి చేపట్టిన ఆమరణ దీక్షలను భగ్నం చేస్తూ ఆసుపత్రికి తీసుకెళ్లడం అప్రజాస్వామికమని విమర్శించారు. సీఎం చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసం హోదా అంశాన్ని పక్కనపెట్టి ప్రత్యేక ప్యాకేజీ పాటపాడారనే విషయం ప్రజలకు తెలుసని చెప్పారు. హోద ఉద్యమంలో పాల్గొంటే కేసులు నమోదు చేస్తామని సీఎం విద్యార్థులను హెచ్చరించిన విషయాన్ని ఎవరూ మరిచిపోలేదన్నారు. ఇప్పటికైనా సీఎం తమ ఎంపీలతో రాజీనామా చేయించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు వెంకటేశ్వర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, ప్రసాదరావు, విశ్వనాథ్, తాయన్న, ఈరన్న, నాగేంద్ర, వేణు, నల్లారెడ్డి, కిట్టు, ప్రసాద్, అశోక్, దేవిరెడ్డి, చిన్న, గోవిందరాజులు, మధు, బాలు, సురేష్, రవి తదితరులు పాల్గొన్నారు. -
కడక్‌నాద్ కోళ్లపై మధ్యప్రదేశ్‌కే హక్కులు!
నల్ల కోళ్లు.. అదేనండి కడక్‌నాద్ కోళ్లపై ప్రాదేశిక గుర్తింపు(జీఐ) హక్కులను మధ్యప్రదేశ్ దక్కించుకుంది. అనాదిగా గిరిజనులు పెంచి పోషిస్తున్న కడక్‌నాద్ కోళ్ల జాతిపై ప్రాదిశిక గుర్తింపు హక్కుల కోసం మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్ రాష్ట్రాల మధ్య గత ఏడాది నుంచి వాదప్రతివాదాలు జరగుతూ వచ్చాయి. చెన్నైలోని జీఐ రిజిస్ట్రీ కార్యాలయం మధ్యప్రదేశ్‌కే జీఐ హక్కు ఇస్తూ మార్చి 28న జర్నల్ 104లో నోటిఫై చేసినట్లు ఆ రాష్ట్ర పశుసంవర్థక మంత్రి అంతర్ సింగ్ ఆర్య ప్రకటించడంతో వివాదానికి తెరపడింది. ఝబువ, అలిరాజ్పుర్ జిల్లాలకు చెందిన గిరిజనులు కడక్‌నాద్ కోళ్లను అనాదిగా పరిరక్షిస్తున్నారు. ఈ రెండు జిల్లాల్లోని 21 సహకార సంఘాలలో సభ్యులైన 430 మంది గిరిజనులు కడక్‌నాద్ కోళ్లను సాకుతూ, పిల్లలను, మాంసాన్ని అమ్ముకొని జీవిస్తున్నారు. గ్రామీణ్ వికాస్ ట్రస్టు 2012లో గిరిజనుల తరఫున ప్రాదేశిక గుర్తింపు కోరుతూ ధరఖాస్తు చేసింది. ఝబువలో 1978లో తొలి కడక్‌నాద్ కోడి పిల్లల హేచరీ ఏర్పాటైంది. అయితే, ఛత్తీస్‌ఘడ్‌లోని 120 స్వయం సహాయక బృందాల ద్వారా 1600 మంది గిరిజన మహిళలు కడక్‌నాద్ కోళ్ల పెంపకం ద్వారా జీవనోపాధి పొందుతున్నందున వీరికే జీఐ హక్కులు ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం కోరింది. చివరికి మధ్యప్రదేశ్‌కే జీఐ మంజూరైనందున ఇకపై ఈ కోళ్ల జాతిపై సర్వహక్కులు ఝబువ, అలిరాజ్పుర్ జిల్లాల గిరిజనులకే దక్కాయి. అంటే ‘కడక్‌నాద్’ పేరుతో నల్ల కోళ్లను ఇక మరెవరూ అమ్మటానికి వీల్లేదు. అందేకే, దేశంలో ఎక్కడివారైనా కడక్‌నాద్ కోళ్ల లభ్యతను తెలుసుకొనేందుకు, సులభంగా కొనుగోలు చేసేందుకు వీలుగా MP Kadaknath పేరిట హిందీ/ఇంగ్లిష్ మొబైల్ యాప్‌ను మధ్యప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కడక్‌నాద్ కోళ్లకు ఎందుకింత క్రేజ్? కడక్‌నాద్ కోడి మాంసం రుచికరమైనదే కాకుండా పోషక విలువలు, ఔషధ గుణాలను కలిగి ఉంది. సాధారణ జాతుల కోడి మాంసంలో మాంసకృత్తులు 18% ఉంటే.. ఇందులో 25–27% ఉంటాయి. ఐరన్ అధికం. కొవ్వు, కొలెస్ట్రాల్ తక్కువ అని మధ్యప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది. వాతావరణ మార్పులను దీటుగా తట్టుకోవడం ఈ కోళ్లకు ఉన్న మరో ప్రత్యేకత. మధ్యప్రదేశ్ ప్రభుత్వ హేచరీలలో ఏటా రెండున్నర లక్షల కడక్‌నాద్ కోడి పిల్లలను ఉత్పత్తి చేస్తున్నారు. మన కృషి విజ్ఞాన కేంద్రాలు ఈ కోడి పిల్లలను తెప్పించి, మన రైతులకు అందజేస్తే వారి ఆదాయం పెరుగుతుంది. -
ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి
– కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి – ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ సేవాదళ్ నిరాహార దీక్ష కర్నూలు(ఓల్డ్‌సిటీ): ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోరుతూ బుధవారం స్థానిక కళావెంకట్రావ్ భవనం, జిల్లా కాంగ్రెస్ కార్యాలయం వద్ద సేవాదళ్ విభాగం రాష్ట్ర చైర్మన్ భవానీ నాగేంద్ర ప్రసాద్, రాష్ట్ర ఆర్గనైజర్ చక్రపాణిరెడ్డి, జిల్లా చైర్మన్ సజ్జాద్హుసేన్, సేవాదళ్ నాయకులు నిఖిల్, సురేశ్‌లతో పాటు ఎస్సీసెల్‌కు చెందిన సత్యరాజు, నాగప్ప నిరాహార దీక్ష చేపట్టారు. శిబిరాన్ని కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడారు . ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్యాకేజీ ప్రకటించి రాష్ట్ర ప్రజలను మోసగించారని ఆరోపించారు. ప్యాకేజీ మంచు ముక్కలాంటిదని, అది రాష్ట్రానికి చేరేలోపు ఆవిరవుతుందని, ఉన్న కాస్తోకూస్తో నిధులు చంద్రబాబు, మంత్రులు, తెలుగు తమ్ముళ్ల చేతుల్లో నీరుగారిపోతాయని ఆరోపించారు. ప్యాకేజీతో పాటు హోదా తప్పనిసరన్నారు. ఒక్కో జిల్లాలో ఒక్కో రోజు చేపడుతున్నామని ఈ కార్యక్రమం వచ్చే నెల 7తో ముగుస్తుందని సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు పి.లక్ష్మిరెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే మదనగోపాల్, కాంగ్రెస్ నగరాధ్యక్షుడు సర్దార్ బుచ్చిబాబు, డీసీసీ ఉపాధ్యక్షులు వేణుగోపాల్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, మజరుల్‌హక్, వై.వి.రమణ, కార్యదర్శులు నారాయణరెడ్డి, చున్నుమియ్య, ఎస్.ఖలీల్‌బాష, ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు నాగమధు యాదవ్, మహిళా నేతలు సారమ్మ, సూర్యకాంతమ్మ పాల్గొన్నారు. -
'ఏం కొంపలు మునిగిపోయాయని..'
-
'ఏం కొంపలు మునిగిపోయాయని అర్థరాత్రి వేళ..'
హైదరాబాద్: ప్యాకేజీ అనేది సహాయంలాంటిదని.. ప్రత్యేక హోదా ఉద్యోగం ఇవ్వడంలాంటిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా వస్తే తమ పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుందని ప్రతి ఒక్కరూ ఎదురు చూశారని, అలాంటి వారిని దారుణంగా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి మరిచిపోయారని మండిపడ్డారు. పార్లమెంటు సాక్షిగా నేటి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని అడిగారని, అధికారంలోకి వచ్చాక ఆ విషయం వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో పేర్కొన్న అంశాలే ఇచ్చారు తప్ప కొత్తగా ఇచ్చిందేమీ లేదని అన్నారు. ప్రత్యేక హోదాపై చర్చ జరగాలని తాము పట్టుబట్టామని, వాయిదా తీర్మానం కూడా ఇచ్చామని, అయితే, కేవలం ప్రకటన ఇచ్చి వెళ్లిపోవాలని చంద్రబాబు అనుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాపై చర్చకు చంద్రబాబు భయపడ్డారని అన్నారు. ఏవో కొంపలు మునిగిపోయినట్లు ప్యాకేజీపై అర్ధరాత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేస్తే రాత్రి 12.30కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వాగతించారని మండిపడ్డారు. అసలు అర్థరాత్రి ప్రకటన చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా అనేది రాజ్యంగపరంగా జరిగే విధానం కాదని, కార్యనిర్వాహక శాఖ కేంద్రమంత్రి మండలి నిర్ణయం తీసుకుంటే అయిపోతుందని గుర్తు చేశారు. రాష్ట్రం విడిగొట్టి ప్రత్యేక హోదా చేర్చిన తర్వాతే 14వ ఫైనాన్స్ కమిషన్ వచ్చిందని, ముందే ప్రకటించిన దానికి తర్వాత వచ్చిన 14వ కమిషన్ అడ్డుచెప్పిందని చెప్పడం సరైన చర్య కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు సుదీర్ఘ అనుభవం ఉందని యనమల రామకృష్ణుడు అంటున్నారని, అలాంటప్పుడు ఆయన వయసు, అనుభవానికి తగినట్లు మాట్లాడితే బాగుంటుందని చెప్పారు. అనుభవం ఉన్న వ్యక్తి ఒక మాట మాట్లాడితే ఆ మాటను అందరూ ఆమోదించాలని, తమలాంటి జూనియర్లమే ఎలాంటి వివాదాల్లేకుండా మాట్లాడుతున్నామని చెప్పారు.