
సాక్షి, నెల్లూరు : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోసం వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో రాజీలేని పోరాటం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారం మాట్లాడుతూ.. హోదా విషయంలో ముందు నుంచి పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్సార్ సీపీ మాత్రమేనన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం నాలుగు సంవత్సరాల నుంచి డ్రామాలు ఆడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో నాలుగేళ్ల టీడీపీ ప్రభుత్వ పరిపాలన యథా చంద్రబాబు.. తథా ఎమ్మెల్యేలు అన్నట్లుగా సాగుతోందని, పైన ముఖ్యమంత్రి అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతుంటే కింద ఆయన పార్టీ ఎమ్మెల్యేలు దొరికినంత మేరకు దోచుకుంటూ దుర్మార్గాలకు పాల్పడుతున్నారని నల్లపురెడ్డి ఆరోపించారు. ఈ నాలుగేళ్లలో ఎన్నో దారుణాలు, మోసాలు చేస్తూ.. అబద్ధాలు చెబుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఉండటం మన దురదృష్టకరమని ఆయన విమర్శించారు. నిజంగా చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే పార్టీ మారిన 23 మంది ఎమ్మెలేలతో వెంటనే రాజీనామ చేయించాలని నల్లపురెడ్డి డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment