critisize
-
తెలంగాణకు బీఆర్ఎస్, కాంగ్రెస్ డేంజర్: ప్రధాని మోదీ
వరంగల్: వరంగల్ పర్యటనలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. భద్రకాళీ మహత్యం, సమ్మక్క సారక్క , రాణి రుద్రమ పౌరషం అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ.. కాంగ్రెస్, బీఆర్ఎస్పై నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ను అడ్రస్ లేకుండా చేయాలని అన్నారు. కుటుంబాన్నిపెంచి పోషించుకోవడమే ఇరుపార్టీల పని అని ఆరోపించారు. కుటుంబ శ్రేయస్సు కోసమే కేసీఆర్ పరితపిస్తారని ప్రధాని మోదీ అన్నారు. 'అవినీతే వారి ధ్యేయం..' కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ప్రధాని మోదీ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిందని ఆరోపించిన ప్రధాని.. ప్రాజెక్టుల్లో ప్రతీది అవినీతి మయమేనని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అవినీతి దేశమంతా.. కేసీఆర్ అవినీతి రాష్ట్రమంతా తెలుసని అన్నారు. తెలంగాణకు బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రమాదకరమని అన్నారు. అవినీతి లేని ప్రాజెక్టు ఏదైనా ఉందా? అని బీఆర్ఎస్ను ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతిపై దర్యాప్తు సంస్థలు గురిపెట్టాయని ప్రధాని మోదీ అన్నారు. అవినీతిపై దృష్టి మళ్లించేందుకు కేసీఆర్ కొత్త నాటకాలు ఆడుతున్నారని చెప్పారు. 'అది ట్రైలర్ మాత్రమే..' మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ట్రైలర్ మాత్రమే చూపించిందని చెప్పిన ప్రధాని మోదీ.. సభకు హాజరైన జనాన్ని చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో కాషాయ విజయం ఖాయమనిపిస్తోందని అన్నారు. కేంద్రాన్ని తిట్టడమే బీఆర్ఎస్కు తెలిసిన పని అని అన్నారు. 9 ఏళ్లలో బీఆర్ఎస్ చేసింది నాలుగే పనులని ఎద్దేవా చేశారు. 'నిరుద్యోగులకు మోసం..' ఉద్యోగాలిస్తామని యువతను బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని మోదీ అన్నారు. టీఎస్పీఎస్సీ స్కాంలతో నిరుద్యోగులు ఎంతో నష్టపోయారని చెప్పారు. రాష్ట్రంలో 12 యూనివర్శిటీల్లో విద్యార్థుల భవిష్యత్‌లో ఆందోళన నెలకొందని అన్నారు. వేలాది ఉద్యోగ ఖాలీలను నింపకుండా కేసీఆర్ తమాషా చూస్తున్నారని దుయ్యబట్టారు. నిరుద్యోగులకు రూ.3 వేల నిరుద్యోగ బృతి ఇవ్వలేదని అన్నారు. నూతన ప్రాజెక్టులకు శంకుస్థాపన.. వరంగల్‌లో నేడు నిర్వహించిన విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ మేరకు ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. దేశ అభివృద్ధిలో తెలంగాణ ప్రజల పాత్ర గొప్పదని ప్రధాని మోదీ అన్నారు. 6 వేల కోట్లతో కొత్త జాతీయ రహదారులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 176 కిలోమీటర్ల జాతీయ రహదారులకు పునాది రాయి వేశారు మోదీ. తెలంగాణ ఆర్థిక కేంద్రంగా మారబోతోందని అన్నారు. కాజీపేట రైల్యే వ్యాగన్ యూనిట్‌కు మోదీ శంకుస్థాపన చేశారు. ఇదీ చదవండి: రూ.6 వేల కోట్లతో నూతన జాతీయ రహదారులకు ప్రధాని మోదీ శంకుస్థాపన -
‘హామీలు ఇచ్చి మోసం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు’
సాక్షి, అనంతపురం: నారా చంద్రబాబు నాయుడు ఎల్లోమీడియా కుట్రను దీటుగా ఎదర్కొవాలని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్సార్సీపీ కార్యకర్తలకు పిలుపినిచ్చారు. ఈ మేరకు ఆయన అనంతపురంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ..‘ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన నాయకత్వంలో 98 శాతం హామీలు అమలు చేయడం చారిత్రాత్మకం అని ప్రశంసించారు. కానీ 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఏ ఒక్క మంచిపనైనా చేశారా? అని నిలదీశారు. ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అని మంత్రి పెద్దిరెడ్డి విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఏపీ అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం టీడీపీ అవశాన దశలో ఉందని, మళ్లీ అధికారంలోకి రావడం ఒక కల అని ఎద్దేవా చేశారు. అంతేగాదు చంద్రబాబు బీసీలకు చేసిందేమీ లేకపోగా, వాళ్లను వంచనకు గురిచేశారంటూ ఆరోపణలు చేశారు. ఐతే బీసీ సామాజిక వర్గానికి చెందిన 80 వేల మందికి పదవులు ఇచ్చి గౌరవించిన ఘనత మాత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కే దక్కుతుందని నొక్కి చెప్పారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కార్యకర్తలను ఉద్దేశిస్తూ... జగన్ నాయకత్వంలో పనిచేస్తున్నందుక మనమంతా గర్వపడాలన్నారు. ఈ మేరకు అనంతలో జరిగిన వైఎస్ఆర్సీపీ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఉష శ్రీ చరణ్ తదితరలు పాల్గొన్నారు. (చదవండి: 'రాజకీయ నేత ఎలా ఉండకూడదో చెప్పేందుకు.. చంద్రబాబే ఉదాహరణ') -
FIFA World Cup 2022: ఖతర్‌ను పొగుడుతూ ట్వీట్.. రిషి సునాక్‌పై విమర్శలు!
లండన్: ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌లో మ్యాచ్‌లు తుది అంకానికి చేరుకుంటున్నాయి. ఏమాత్రం అంచనాలు లేని జట్టు బలమైన జట్లను ఓడించాయి. ఇదిలా ఉంటే..ఫిఫా ప్రపంచకప్‌పై బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ చేసిన ఓ ట్వీట్ విమర్శలకు దారి తీసింది. 16వ రౌండ్లో సెనెగల్‌తో ఇంగ్లాండ్ మ్యాచ్‌కు ముందు ఫిఫా ప్రపంచకప్‌ను నిర్వహిస్తున్న ఖతర్‌ను పొగుడుతూ ట్వీట్ చేశారు రిషి సునాక్. ‘ఇప్పటివరకు అద్భుతమైన ప్రపంచకప్‌ను నిర్వహించినందుకు ఖతార్‌కు హ్యాట్సాఫ్. గ్రూప్ దశలు ఆల్ టైమ్ గ్రేట్స్‌లో ఒకటిగా గుర్తుండిపోతాయి. కమాన్ ఇంగ్లాండ్.. మన కలను సజీవంగా కొనసాగించండి.’ అంటూ ట్విట్టర్ వేదికగా ఖతార్‌పై ప్రశంసలు కురింపించారు. ఆయన ట్వీట్‌కు మిశ్రమ స్పందనలు వచ్చాయి. ‘నిజంగానా? ఆల్ టైమ్ గ్రేట్స్? మీరు ఏం చూస్తున్నారో మాకైతే అర్థం కావటం లేదు.’ అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చారు. మరోవైపు.. కొందరు ఇంగ్లాండ్, సెనెగల్ మధ్య థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగినట్లు పేర్కొన్నారు. ‘ఎస్ రిషి సునాక్, ఖతర్ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కొంత మందికి మాత్రం సమస్యగా ఉన్నా.. చూడదగ్గ ఈవెంట్.’ అంటూ మరొకరు రాసుకొచ్చారు. మరోవైపు.. ఇంగ్లాండ్ గత మ్యాచ్‌లో విజయం సాధించటంపై ప్రశంసలు కురింపించారు. తాము గతంలో ఎన్నడూ ఇంగ్లాండ్ ఆటను ఈ విధంగా చూడలేదని పేర్కొన్నారు. సెనెగల్పై విజయం సాధించిన ఇంగ్లాండ్.. డిసెంబర్ 11 డిఫెండింగ్ ఛాంపియన్స్ ఫ్రాన్స్‌తో క్వార్టర్ ఫైనల్లో తలపడనుంది. Hats off to Qatar for hosting an incredible World Cup so far. The group stages will be remembered as one of the all-time greats. Come on @England keep the dream alive 🦁🦁🦁#FIFAWorldCup #ENGSEN pic.twitter.com/YyLv9Y2VjZ — Rishi Sunak (@RishiSunak) December 4, 2022 ఇదీ చదవండి: FIFA World Cup 2022: మరో సంచలనం.. బెల్జియంను ఖంగుతినిపించిన మొరాకో -
భారత్ మానవ హక్కుల రికార్డుపై.. యూఎన్ చీఫ్ సీరియస్
ముంబై: ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ తన మూడు రోజుల పర్యటనలో భారత్ మానవ హక్కుల రికార్డుపై విమర్శలు కురిపించారు. ఈ మేరకు ఆయన ముంబైలో ప్రసంగిస్తూ...ప్రభుత్వ విమర్శకులు, జర్నలిస్టులు, మహిళా రిపోర్ట్‌ర్లపై దాడులు అధికమైపోయాయి. మానవ హక్కుల మండలిలో ఎన్నుకోబడిన సభ్య దేశంగా భారత్‌కి ప్రపంచ మానవ హక్కులను రూపొందించడం, మైనారిటీ వర్గాల సభ్యులతో సహా అందరి హక్కులను రక్షించడం, ప్రోత్సహించడం వంటివి చేయాల్సిన బాధ్యత ఉంది. బ్రిటీష్ పాలన నుంచి విముక్తి పొంది 75 ఏళ్ల భారత్‌లో సాధించిన విజయాలను గురించి కూడా ప్రశంసించారు. అలాగే భారత్‌లో వైవిధ్యం గొప్పగా ఉంటే సరిపోదని, హక్కులు రక్షింపబడాలి. అలాగే ద్వేషపూరిత ప్రసంగాలను నిర్ద్వద్వంగా ఖండించి విలువలను కాపాడుకోవాలి. మానవహక్కులను భారత న్యాయవ్యవస్థ నిరంతరం రక్షిస్తూ ఉండాలి. ఈ ప్రసంగంలో భారత్ కర్భన ఉద్గారాలు తగ్గించే విషయం గురించి కూడా ప్రస్తావించారు. పునరుత్పాదక శక్తి కోసం లక్ష్యాలను నిర్దేశిస్తున్నప్పటికీ భారత్ మాత్రం 70 శాతం బొగ్గును వినయోగిస్తోంది. భారత్ వంటి దేశాలు పర్యావరణ పరిరక్షణ చర్యలు మరిన్ని తీసుకోవాలి. ఆరవ వంతు మానవాళి అధికంగా ఉన్న భారత్ 2030 కల్లా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధిస్తుంద? లేక విచ్ఛన్న చేస్తుందా? అని ప్రశ్నించారు. (చదవండి: మానవత్వం అంటే ఇది కదా! రోడ్లపై చెత్త కాగితాలు ఏరుకుంటున్న ఆమెను..) -
కట్టు కథలు, పిట్ట కథలు మానుకో శ్రీరామ్
రాప్తాడురూరల్: పరిటాల శ్రీరామ్ చెబుతున్నట్లు వారి తాతల కాలం నుంచి వారి కుటుంబం నిజంగా బడుగు, బలహీన వర్గాల బాగు కోసం పనిచేసి ఉంటే నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న వెనుకబడిన వర్గాలే 2019 ఎన్నికల్లో ఏకంగా 25 వేలకు పైగా ఓట్ల తేడాతో ఎందుకు ఓడించారో ఆత్మవిమర్శ చేసుకోవాలని వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ సీనియర్ నాయకుడు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి (చందు) సూచించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి కుటుంబంపై పరిటాల శ్రీరామ్ కట్టు కథలు, పిట్ట కథలు మానుకోవాలని హితవు పలికారు. ‘మా నాన్న తోపుదుర్తి ఆత్మారామిరెడ్డి ఎవరికీ బెదిరే, అదిరేవారు కాదు. దౌర్జన్యాలకు తలవంచే మనస్తత్వం అసలే కాదు. పరిటాల రవి మంత్రిగా ఉన్నప్పుడే దౌర్జన్యాలను ఎదిరించిన ధీరుడు. నీ దౌర్జన్యాలకు ఇక్కడ భయపడే వారెవరూ లేరని రవి మొహం మీదే చెప్పిన వ్యక్తి మా నాన్న. ఈ విషయాన్ని అప్పటి టీడీపీ జిల్లా అధ్యక్షుడు సాలార్ బాషా, మీ చిన్నాన్న గడ్డం సుబ్రహ్మణ్యంను అడిగితే తోపుదుర్తి పౌరుషం ఏంటో తెలుస్తుంది. మీ తాతల గురించి, మీ నాన్న గురించి గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలకు మీరు మంచి చేసిందేమీ లేదు. ఉద్యమం పేరుతో దోపిడీ సాగించారు. ఐదెకరాల నుంచి ఈరోజు వేల కోట్ల రూపాయలకు పడగలెత్తారు. మా ఆస్తులు పేదలకు పంచేందుకు సిద్ధం. మీ ఆస్తులు పంచేందుకు మీరూ సిద్ధమేనా?’ అని సవాల్ విసిరారు. మీరా సిద్ధాంతాల గురించి మాట్లాడేది! ‘పరిటాల శ్రీరాములు, బోయ సిద్దయ్య ఇద్దరూ కలసి దోపిడీలు చేస్తే..బోయ సిద్దయ్యనేమో దొంగగా మార్చి, శ్రీరాములు ఉద్యమకారుడు అంటూ పచ్చమీడియా చిత్రీకరించింది. ఇద్దరూ దొంగలైనా కావాలి.. లేదంటూ ఇద్దరూ ఉద్యమకారులైనా కావాలి. పరిటాల శ్రీరాములు ఒక్కడే ఉద్యమకారుడు ఎలా అవుతాడు? పరిటాల రవి హత్యలు చేసి ఎంతో మంది మహిళల తాలిబొట్లు తెంపినాడు. గత ప్రభుత్వంలో శ్రీకాకుళం అడవుల్లో 26 మంది నక్సల్స్‌ను ఎన్కౌంటర్ చేస్తే మంత్రిగా ఉన్న మీ తల్లి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. మీరా సిద్ధాంతాల గురించి మాట్లాడేది? నసనకోట పంచాయతీలోనే భూములు లాక్కున్న చరిత్ర మీ నాన్నది. నువ్వు బచ్చావు.. నీకు తెలీకపోతే ఓసారి పెద్దోళ్లను అడిగితే చెబుతార’ని పరిటాల శ్రీరామ్‌కు హితవు చెప్పారు. అనంతపురం చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ మాఫియా నడుపుతూ లిటిగెంట్ భూములను కొనుగోలు చేస్తూ దందాలు చేస్తోంది మీరుకాదా అని నిలదీశారు. బెంగళూరు కేంద్రంగా అడ్రెస్ లేని సిమ్ల ద్వారా తమ కుటుంబం గురించి అసభ్యకరంగా మాట్లాడిస్తూ పైశాచిక ఆనందం పొందుతుండడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఐటీడీపీ పేరుతో పరిటాల కుటుంబం ఉన్మాద చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. (చదవండి: అనంతలో ప్రభుత్వ ఉద్యోగుల కృతజ్ఞత ర్యాలీ) -
బిహార్‌లో బహిరంగంగా మద్యం సరఫరా... నితీష్ ప్రభుత్వాన్ని నిలదీసిన చిరాగ్ పాశ్వాన్
బిహార్: భారతీయ జనతాపార్టీ(బీజేపీ)తో రాజకీయ సంబంధాలు తెంచుకున్నప్పటి నుంచి బిహార్ సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వం పై ప్రతిపక్షాలు, ఇతర పార్టీల నుంచి ఎడతెగనిదాడి ఎక్కువైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు చిరాగ్ పాశ్వాన్ , ప్రశాంత్ కిషోర్, ఆర్సీపీ సింగ్ వంటి నేతలు నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని విమర్శించడంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. బిహార్‌లో నేరాలు పెరిపోతున్నాయంటూ లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ఇటీవలే నితీష్ ప్రభుత్వం పై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. అంతేకాదు సామాజిక మాధ్యమాల్లో కూడా అతనిపై పలు విమర్శలు చేస్తూ...ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే చిరాగ్ పాశ్వాన్ బిహార్‌లో మద్యం పూర్తిగా నిషేధింపబడిందంటూ... నితీష్ కుమార్ ప్రభుత్వం చేస్తున్న వాదనలను తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగా ఒక వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఒక వ్యక్తి బల్లియా నుంచి దరౌలికి బహిరంగంగా మద్యం సరఫరా చేస్తానంటూ బైక్ నడుపుతూ వెళ్లుతుంటాడు. అయినా సీఎం దృష్టి ప్రధాని కుర్చిపైనే ఉంది, ఆయన దయచేసి ఇక్కడ దృష్టి సారించి ఉంటే ఇదంతా జరిగేది కాదు అని ఆరోపణలు కూడా చేశాడు. ఆ వీడియోలో పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహంచినట్లు కనిపిస్తుంది. వాస్తవానికి బిహార్‌లో 2016 నుంచి మద్యాన్ని నిషేధించడమే కాకుండా అతిక్రమించింన వారికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే పెద్ద సంఖ్యలో నేరస్తులు జైళ్లల్లో శిక్ష అనుభవించడం ఎక్కువవ్వడం...మరోవైపు కేసుల సంఖ్య పెండింగ్‌లో ఉండటం తదితర కారణాల రీత్యా నితీష్ కుమార్ ప్రభుత్వం ఆర్టికల్ 37 ప్రకారం మద్యపాన నిషేధ చట్టాన్ని సవరించింది. మొదటిసారి నేరానికి పాల్పడితే మేజిస్ట్రేట్ సమక్షంలో సుమారు రూ. 2000 నుంచి 5000 వరకు జరిమాన చెల్లిస్తే వదిలేస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు, ఇతర పక్షాలు పెద్ద ఎత్తున నితీష్ కుమార్ ప్రభుత్వం పై విరచుకుపడుతున్నాయి. मुख्यमंत्री @NitishKumar जी! माना की आपकी दृष्टि अभी प्रधानमंत्री की कुर्सी पर ज्यादा है , लेकिन थोड़ा ध्यान इधर भी देते तो शायद बिहार में ये सब न हो रहा होता।देखिए कैसे खुलेआम दारू सप्लाई की जा रही है और आपकी पुलिस मूकदर्शक बन देख रही है। pic.twitter.com/IKTnFFoh5J — युवा बिहारी चिराग पासवान (@iChiragPaswan) September 12, 2022 (చదవండి: నా శాఖలో అందరూ దొంగలే... బిహార్ మంత్రి వ్యాఖ్యలు వైరల్) -
దివంగత సింగర్ కేకేకు క్షమాపణలు.. ఎలాంటి శత్రుత్వం లేదు
Bengali Singer Rupankar Bagchi Issues Apology To KK After Criticised: ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నత్ (53) మరణంతో సినీ ఇండస్ట్రీ తీవ్ర శోకంలో మునిగిపోయింది. వివిధ భాషల్లో కలుపుకుని సుమారు 800కు పైనే పాటలు పాడిన ఆయన మే 31 రాత్రి కోల్‌కతాలో ప్రదర్శన తర్వాత గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. సంగీతంలో ఎలాంటి శిక్షణ తీసుకోని ఆయన అనేక భాషల్లో పాడి అందరి మనసులను గెలుచుకున్నారు. ఆయన మృతి పట్ల యావత్ సినీ లోకం సంతాపం తెలియజేసింది. అయితే ప్రముఖ బెంగాలీ గాయకుడు, గేయ రచయిత రూపాంకర్ బగ్చీ మాత్రం 'ఎవరు ఈ కేకే, ప్రాంతీయ సింగర్లను ప్రోత్సహించాలి' అంటూ వీడియో రూపంలో తన అక్కసును వెళ్లగక్కిన విషయం విదితమే. ఆయన మాటలకు అనేక మంది నెటిజన్స్ దుమ్మెత్తిపోశారు. అయితే తాజాగా రూపాంకర్ ఈ విషయంపై కేకేకు అతని కుటుంబానికి క్షమాపణలు తెలిపాడు. ఈ విషయాన్ని ప్రెస్ మీట్ నిర్వహించి బహిరంగంగా క్షమాపణలు కోరాడు. తను పోస్ట్ చేసిన వీడియోను కూడా డిలీట్ చేసినట్లు పేర్కొన్నాడు. 'కేకే కుటుంబానికి, నా వ్యాఖ్యలతో బాధపడిన ప్రతి ఒక్కరికీ చెప్పాలనుకుంటున్నాను. కేకేతో నాకు ఎలాంటి శత్రుత్వం లేదు. బెంగాలీ పరిశ్రమకు చెందిన వారి కంటే దక్షిణ, పశ్చిమ భారతదేశానికి చెందిన గాయకులకు ఎక్కువ ప్రేమ, గుర్తింపు లభిస్తుందని మాత్రమే నేను చెప్పాలనుకున్నాను. చదవండి: కేకే ఎవరు? మాలాంటి గొప్ప సింగర్లు మీ కళ్లకు కనిపించడం లేదా? ఇంత విద్వేశానికి గురవుతారని ఊహించలేదు. నా భార్యకు కూడా బెదిరింపు మెస్సేజ్‌లు వస్తున్నాయి. అందుకే కేకే కుటుంబ సభ్యులకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాను. నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆ వీడియోను కూడా డిలీట్ చేశాను. కేకే ఇప్పుడు ఎక్కడ ఉన్న దేవుడు ఆయన ఆత్మకు శాంతి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని ప్రెస్మీట్లో రూపాంకర్ బగ్చీ తెలిపాడు. -
అందుకే ప్రమోషన్స్‌కు రావడం లేదట.. అగ్రనటిపై విమర్శలు
చైన్నై సినిమా: ఒక తమిళ అగ్రనటిని నిర్మాత, నటుడు కె.రాజన్ ఘాటుగా విమర్శించారు. జీఎన్ఏ ఫిలిమ్స్ పతాకంపై జయరాజ్ ఆర్. వినాయక సునీల్ కలిసి నిర్మించిన చిత్రం 'గ్రాండ్ మా'. షిజన్ లాల్ ఎస్ఎస్ దర్శకత్వం వహించిన ఇందులో సోనియ అగర్వాల్, విమలారామన్, ఛార్మిళ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. మలయాళం, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ శనివారం చెన్నైలో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైనా కె. రాజన్ మాట్లాడుతూ.. తమిళ చిత్ర పరిశ్రమ మలయాళ చిత్ర పరిశ్రమను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ చిత్ర షూటింగ్‌ను 23 రోజుల్లో పూర్తి చేసినట్లు, షూటింగ్లో ఒక్క కేరవాన్ కూడా వాడలేదని దర్శకుడు చెప్పారన్నారు. చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమానికి నటీనటులందరూ విచ్చేశారని, తమిళంలో అగ్ర కథానాయికగా రాణిస్తున్న ఒక నటి మాత్రం చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలకు రావడం లేదన్నారు. అదేమని అడిగితే తాను వెళ్లి చిత్రం బాగుందని చెప్పి ఆ చిత్రం ఫ్లాప్ అయితే తనకు చెడ్డ పేరు వస్తుందని చెబుతోందన్నారు. రూ.5 కోట్లు తీసుకుంటున్న ఆమెకు చిత్రం ఫ్లాప్ అవుతుందని ముందుగా తెలియదా అంటూ విమర్శించారు. -
మామ మెప్పు కోసం హరీశ్ ఆరాటం
ఇల్లందకుంట(హుజూరాబాద్): ‘నాతో 18 సంవత్సరాల అనుబంధాన్ని మరిచిపోయి.. మంత్రి హరీశ్‌రావు తన మామ కేసీఆర్ మెప్పు పొందడానికి ఆరాటపడుతున్నారు’అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ విమర్శించారు. పచ్చి అబద్ధాలు మాట్లాడడంలో హరీశ్‌రావు మామ కేసీఆర్‌ను మించిపోయారని ఎద్దేవా చేశారు. గురువారం ఈటల కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హరీశ్‌రావు ఎంత ఆరాటపడ్డా కేసీఆర్ నమ్మరని పేర్కొన్నారు. 2018 ఎన్నికల్లో తనతోపాటు మరో 11 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఓడించడానికి కేసీఆర్ డబ్బులు పంపారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆర్థిక శాఖకు మంత్రిగా ఉన్న తాను.. తన శాఖ నుంచే ముఖ్యమంత్రికి జీతం ఇచ్చానని.. అలాంటి తాను నియోజకవర్గ అభివృద్ధిని ఎలా విస్మరిస్తానని ఆవేదన వ్యక్తం చేశారు. మూడుసార్లు మంత్రులతో కలసి ప్రగతి భవన్‌కు వెళ్తే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానపరిచారని పేర్కొన్నారు. 2003లో తనకున్న ఆస్తులెన్ని.. ఇప్పుడున్న ఆస్తులెన్నో తేల్చేందుకు సీబీఐతో విచారణకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. అదే సమయంలో ‘మీ ఆస్తులపై కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపేందుకు సిద్ధమా’అని నిలదీశారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ కాకుండా మిగతా ఎక్కడా 2 వేలకు పైగా డబుల్ బెడ్రూం ఇళ్లు లేవని, అవి కూడా ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో కాంట్రాక్టులు తీసుకున్న వారు పూర్తి చేశారని తెలిపారు. అబద్ధాలు మాట్లాడితే దుబ్బాకలో ప్రజలు ఏ విధంగా కర్రు కాల్చి వాతపెట్టారో.. హుజూరాబాద్‌లో కూడా అలాగే చేస్తారని హెచ్చరించారు. సంక్షేమ పథకాలకు తాను వ్యతిరేకం కాదని, ఆ ఫలాలు నిజమైన లబ్ధిదారులకు మాత్రమే చేరాలని చెప్పానని వెల్లడించారు. హుజూరాబాద్, జమ్మికుంటలను అద్దంలా మార్చాలని రూ.25 కోట్ల చొప్పున జీవో తెస్తే, కేటీఆర్ నిధులు ఆపారని పేర్కొన్నారు. అది ప్రగతి భవన్ కాదు.. బానిసలకు నిలయమని రాసుకోమని ఎంపీ సంతోష్‌కుమార్‌కు చెప్పానని, రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఈటల అన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు దొరకడం లేదు..జీఎస్టీ ఎందుకు కట్టాలి: నటి
కంటికి కనిపించని కరోనా వైరస్ ఎంతో మందిని పొట్టన పెట్టుకుంటుంది. డబ్బులు ఉన్నా సరైన వైద్యం అందక ఎంతోమంది తమ ఆప్తులను పోగొట్టుకుంటున్నారు. కరోనా కట్టడిలో కేంద్రం ఘోరంగా విఫలమయ్యిందని అటు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ నటి, ప్రియాంక చోప్రా సోదరి మీరా చోప్రా కేంద్రం వైఖరిపై విమర్శలు గుప్పించారు. కోవిడ్ రోగులకు సకాలంలో బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు దొరక్క ప్రాణాలు కోల్పోతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రానికి 18 శాతం జీఎస్టీని ఎందుకు చెల్లించాలంటూ ప్రశ్నించారు. ప్రజలకు కనీస సౌకర్యాలను కూడా కల్పించనప్పుడు ఈ జీఎస్టీని తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ పీఎంవో ఇండియా, అమిత్ షా సహా కొందరు కేంద్ర మంత్రలకు ట్యాగ్ చేశారు. ఇక కొద్ది రోజుల క్రితమే బాలీవుడ్ నటి మీరా చోప్రా బంధువులు కరోనా కారణంగా చనిపోయిన సంగతి తెలిసిందే. కేవలం పది రోజుల వ్యవధిలోనే ఆమె తన ఇద్దరు కజిన్స్‌ను పోగొట్టుకున్నారు. అయితే వారు కోవిడ్ వల్ల చనిపోలేదని, సరైన వైద్యం అందక మరణించారని మీరా చోప్రా ఇటీవలె వెల్లడించిన సంగతి తెలిసిందే. బెంగళూరులో రెండు రోజుల వరకు ఐసీయూ బెడ్ దొరక్క ఒకరు మరణిస్తే..ఆక్సిజన్ అందక మరొక కజిన్ చనిపోయారని పేర్కొంది. ఇద్దరూ దాదాపు 40 ఏళ్ల వయసు వారేనని, కానీ అప్పుడే ఈ లోకాన్ని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి దాపరించిందని ఆవేదన వ్యక్తం చేసింది. I dont want to pay 18% gst when i cant get a bed in the hospital or an oxygen to breathe and live. #removeGST @AmitShah @FinMinIndia @ianuragthakur @PMOIndia @BJP4India — meera chopra (@MeerraChopra) May 15, 2021 చదవండి : ప్రియాంక వల్ల సినిమా ఛాన్స్‌లు రాలేదు : మీరా చోప్రా ప్రియాంకతో పెళ్లి వచ్చే జన్మలో అయినా.. -
పవన్ కల్యాణ్‌పై తమిళ మీడియా సెటైర్లు
సాక్షి, చెన్నై: జనసేన అధ్యక్షులు, నటుడు పవన్ కల్యాణ్‌పై తమిళమీడియా సెటైర్లు విసిరింది. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీపై ఆయన అకస్మాత్తుగా యూ టర్న్ తీసుకున్నారు, గందరగోళ రాజకీయవాదిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారని శుక్రవారం నాటి తమిళ సాయంకాల దినపత్రిక ‘తమిళ మురసు’ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ వివరాలు యథాతథంగా..్ఙహైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీచేయాలని సంకల్పించింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ ముఖ్యనేత కే లక్ష్మణన్‌లను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కలుసుకున్న తరువాత తమ పార్టీ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీచేయడం లేదు, బీజేపీకి మద్దతుగా నిలుస్తుందని ప్రకటించారు. అంతేగాక తమ పార్టీ తరఫున ప్రకటించిన అభ్యర్థులను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. పవన్ కల్యాణ్ 2014లో జనసేన పార్టీని స్థాపించారు. అప్పటి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా వ్యవహరించారు. (బాబు డీఏ బకాయిలకు ఏటా రూ.2,400 కోట్లు) 2019 పార్లమెంటు ఎన్నికల్లో బహుజనసమాజ్ పార్టీ కూటమిలో చేరగా ఆ పార్టీ కేవలం 6 శాతం ఓట్లను మాత్రమే పొందగలిగింది. తరువాత కొద్ది నెలల్లోనే మాయావతి కూటమికి స్వస్తి పలికి ప్రస్తుతం బీజేపీతో సంబంధాలు పెట్టుకున్నారు. దీంతో పవన్‌ను ‘గందరగోళ రాజకీయ నేత అని ఆంధ్ర, తెలంగాణ ప్రజలు విమర్శిస్తున్నారు’ అని బాక్స్ కట్టి మరీ కథనాన్ని ప్రచురించింది. -
ప్రాణహిత ప్రాణం తీసిన కేసీఆర్
కౌటాల: ప్రాణహిత ప్రాజెక్ట్‌ను నిర్మించకుండా ప్రాణం తీసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుండా మల్లేష్ ఆరోపించారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత ప్రాజెక్ట్‌పై అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఆదివారం మండలంలోని తుమ్మిడిహెట్టి గ్రామ సమీపంలోని ప్రాణహిత నదిలో ప్రాణహిత పరిరక్షణ ఐక్య కార్యాచరణ సమితి ఆధర్యంలో పిండప్రదానం చేశారు. అంతకుముందు డాక్టర్ బీఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం కౌటాల మండల కేంద్రంలోని ఆరే సంక్షేమ సంఘం భవనంలో అఖిలపక్ష ఐక్య పోరాట వేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ప్రాణహిత ప్రాజెక్ట్ నిర్మించి కుమురం భీం, మంచిర్యాల జిల్లాల్లోని ఐదు నియోజకవర్గాలలో ఐదు లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలని డిమాండ్ చేశారు. గుండా మల్లేష్ మాట్లాడుతూ తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత బ్యారేజీ నిర్మించవద్దని కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్ట్‌కు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును తొలగించి మహనీయుడిని అవమానించిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. కేసీఆర్ నీళ్ల దోపిడీ చేస్తున్నారు : నైనాల గోవర్ధన్ సీఎం కేసీఆర్ నీళ్ల దోపిడీ చేస్తున్నారని తెలంగాణ జలసాధన సమితి రాష్ట్ర నాయకుడు నైనాల గోవర్దన్ అన్నారు. కేసీఆర్ తన సొంత జిల్లా అభివృద్ధి కోసం లక్ష కోట్ల నిధులతో కాళేశ్వరం వద్ద ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారన్నారు. ప్రాణహితను తుంగలో తొక్కిన కేసీఆర్ : కేవీ ప్రతాప్ ప్రాణహిత ప్రాజెక్టుతో రెండున్నర లక్షల ఎకరాలకు నీరందిస్తామని ప్రజలకు హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ దానిని తుంగలో తొక్కారని ప్రాణహిత ప్రాజెక్టు పరిరక్షణ వేదిక కన్వీనర్ కేవీ. ప్రతాప్ విమర్శించారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ వద్ద నాలుగేళ్లలో తట్టెడు మట్టి తీయలేదన్నారు. ప్రాణహిత ప్రాజెక్ట్‌ను వెంటనే నిర్మించి ఐదు నియోజకవర్గాలకు తాగు, సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. రైతుల నోట్లో మట్టికొట్టిన సర్కారు : పాల్వాయి హరీశ్‌బాబు ప్రాణహిత ప్రాజెక్ట్‌ను నిర్మించకుండా రైతుల నోట్లో మట్టికొట్టిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని నియోజకవర్గ నాయకులు పాల్వా యి హరీష్‌బాబు అన్నారు. కాలువలో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం న్యాయమైన పరిహారం చెల్లించారన్నారు. అనంతరం ప్రాజెక్ట్‌ను వెంటనే నిర్మించాలని ఆయా సంఘాల నాయకులు ప్రతిజ్ణ చేశారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు టీ.శ్రీనివాస్, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎండీ.చాంద్‌పాషా, జిల్లా నాయకులు మేకల రామన్న, ఎ.లాల్‌కుమార్, అంబాల ఓదెలు, మండల నాయకులు బండి రాజేందర్‌గౌడ్, దుర్గం మోతిరాం, విఠల్, బావూజీ, శ్రీనివాస్, ప్రశాంత్, తిరుపతిరావు, తిరుపతి, చందు, సుధాకర్, రైతులు పాల్గొన్నారు. ప్రాణహిత నదిలో ప్రభుత్వానికి పిండ ప్రదానం చేస్తున్న అఖిలపక్ష నాయకులు -
మైనార్టీల అభివృద్ధి జగన్‌తోనే సాధ్యం
బద్వేలు అర్బన్ : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మైనార్టీల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, అదే స్థాయిలో మైనార్టీల అభివృద్ధి జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 9,10,11,12 వార్డుల్లోని 100 మైనార్టీ కుటుంబాలు సరిటాల మౌలాలి, నజీర్, మన్సూర్ ఆధ్వర్యంలో శనివారం టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి చేరారు. ఈ సందర్భంగా స్థానిక మహబూబ్‌నగర్‌లోని ఉర్దూ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ మైనార్టీలకు పెద్ద పీట వేశారని, వారి ఇబ్బందులను కళ్లారా చూసి వారికి 4 శాతం రిజర్వేషన్ కల్పించారని తెలిపారు. అప్పట్లో 5 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని రాజశేఖర్‌రెడ్డి భావించినా.. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు సుప్రీంకోర్టులో కేసు వేసి అడ్డుకున్నారని పేర్కొన్నారు. నేడు మైనార్టీలపై కపటప్రేమ చూపిస్తూ లబ్ధి పొందాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు కే సురేష్‌బాబు, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి మాట్లాడుతూ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మైనార్టీల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారి అభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు మైనార్టీ శాఖకు వేరే వర్గాల వారిని మంత్రిగా పెట్టి మైనార్టీలపై తనకున్న వివక్షతను చూపారని విమర్శించారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ జీ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ మైనార్టీల అభివృద్ధే లక్ష్యంగా జగన్మోహన్రెడ్డి పాలన అందిస్తారని తెలిపారు. ఇందుకోసం మైనార్టీలు జగన్‌కు అండగా నిలవాలని కోరారు. అనంతరం పార్టీలో చేరుతున్న వారికి కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మున్సిపాలిటీ కన్వీనర్ కరీముల్లా, బ్రాహ్మణపల్లె, బీ కోడూరు సింగిల్‌విండో అధ్యక్షులు జీ సుందర్రామిరెడ్డి, ఓ ప్రభాకర్‌రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ బీ మునెయ్య, 6వ వార్డు కౌన్సిలర్ గోపాలస్వామి, అట్లూరు మాజీ ఎంపీపీ బాలమునిరెడ్డి, వేమలూరు సర్పంచు ప్రభాకర్‌రెడ్డి, మున్సిపాలిటీ నాయకులు వాకమళ్ల రాజగోపాల్‌రెడ్డి, యద్దారెడ్డి, సింగసాని శివయ్య, చెన్నకృష్ణారెడ్డి, మల్లేష్, నాగేశ్వర్రావు, మురళి, కుప్పాల శ్రీరాములు, చెన్నయ్య, మల్లికార్జునరెడ్డి, సాంబశివారెడ్డి, హుస్సేన్, బాబు, ముంతాజ్, షరీఫ్, అల్తాఫ్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి మాటలు నీటి మూటలేనా..?
బోయినపల్లి: మండలంలోని విలాసాగర్ గ్రామం లో మే 15న నిర్వహించిన రైతుబంధు పథకం చెక్కుల పంపిణీలో విలాసాగర్ చెరువు నింపే పనుల శంఖుస్థాపన చేస్తానని మంత్రి కేటీఆర్ చెప్పిన మాటలు నీళ్ల మూటలటు అయ్యాయని నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మేడిపల్లి సత్యం ఆరోపించారు. మండల కేంద్రంలోని ఆర్ఎంపీ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలో సాగు, తాగునీటి వనరులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విలాసాగర్ సభలో విలాసాగర్ చెరువు నింపాలని మంత్రి ఎదుట పెద్ద మొత్తంలో ప్రజలు, యువకులు నిరసనలు తెలపడంతో తానే వచ్చి శంఖుస్థాపన చేస్తానని మంత్రి అన్నారని గుర్తు చేశారు. రెండు నెలలు గడిచినా ఎలాంటి ప్రగతి లేదన్నారు. ఎల్లంపల్లి నీటితో బోయినపల్లి, తడగొండ, అనంతపల్లి గ్రామాల చెరువులను నింపాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో సాగునీటి సాధన ఉధ్యమం చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సంబ లక్ష్మిరాజం, జాగీరు శోభన్‌గౌడ్, ఎండీ.బాబు, రాజుకుమార్, గంగిపెల్లి లచ్చయ్య పాల్గొన్నారు. -
ప్రధాన మంత్రి రైతు పక్షపాతి
ఆత్మకూరురూరల్/వెలుగోడు: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రైతు పక్షపాతి అని శ్రీశైలం నియోజకవర్గ బీజేపీ నాయకుడు బుడ్డా శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల కేంద్రం 14 రకాల పంటలకు మద్దతు ధర పెంచడం పట్ల వెలుగోడు, ఆత్మకూరు పట్టణాల్లో ఆ పార్టీ ఆధ్వర్యంలో రైతులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ని రైతన్నల ఆదాయం మెరుగుపడేలా కేంద్ర ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుందన్నారు. ప్రధానంగా వరి ధాన్యానికి కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.200 పెంచుతున్నట్టు ప్రకటించడం హర్షించదగ్గ విషయమన్నారు. ప్రజా పాలనను మరిచి పూర్తిగా అవినీతి మయమైన టీడీపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని విమర్శించా రు. రైతు వ్యతిరేక టీడీపీని గద్దె దించాల్సిన అవసరం ఉందన్నారు. నీరు – చెట్టు కార్యక్రమం శ్రీశైలం ఎమ్మెల్యేకు కల్పతరువుగా మారింద న్నారు. మంజూరైన నిధుల్లో 90 శాతం స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే చుట్టూ ఎప్పుడు కాంట్రాక్టర్లు, వ్యాపారులే ఉంటారని, ప్రజా సేవ చేయాలనే ఆలోచన ఆయనకు లేదన్నారు. రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్న బీజేపీపై టీడీపీ నాయకులు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక హోదా పేరుతో మొసలి కన్నీరుకారుస్తున్నారని విమర్శించారు. వాస్తవాలు చెబుతున్న తమ పార్టీ నాయకులు దాడులు చేయించడం దారుణ మన్నారు. వరికి మద్దతు ధర ప్రకటించడం పట్ల వెలుగోడు పొట్టి శ్రీరాములు సెంటర్లో, ఆత్మకూరు గౌడ్ సెంటర్ బాణాసంచా పేల్చి, స్వీట్లు పంచుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ మల్లె కృష్ణారెడ్డి, నాయకులు సుబ్బారెడ్డి, విశ్వరూపాచారి, విశ్వనాథం, మౌళీ, బిజ్జం వెంకట సుబ్బారెడ్డి, చండ్ర వెంకటేశ్వరరెడ్డి, వెంకటకృష్ణ్ణ, ప్రతాప్ ఆచారి తదితరులు పాల్గొన్నారు. -
నిజాంను మరిపిస్తున్న కేసీఆర్
పెద్దపల్లిరూరల్/సుల్తానాబాద్(పెద్దపల్లి): తెలంగాణలో టీఆర్ఎస్ పాలన నిజాం పాలనను మరిపిస్తోందని , సీఎం కేసీఆర్ ఫాం హౌస్ నుంచి చేస్తున్న రాష్ట్రాన్ని పాలిస్తు అప్పులపాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఆరోపించారు. భారతీయ జనతాపార్టీ చేపట్టిన ప్రజాచైతన్య బస్సుయాత్ర బుధవారం పెద్దపల్లి, సుల్తానాబాద్, గర్రెపెల్లిమీదుగా కరీంనగర్‌కు వెళ్లింది. పెద్దపల్లి శాంతినగర్‌లో మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ నుంచి పార్టీ శ్రేణులు చేపట్టిన బైక్‌ర్యాలీ బస్టాండ్, ప్రగతినగర్, అమర్‌నగర్, శివాలయం, మెయిన్‌రోడ్, జెండా చౌరస్తా, కమాన్ల మీదుగా సాగింది. బస్సుయాత్ర శివాలయం ప్రాంతానికి చేరగా అక్కడ పలువురికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కండువాలు కప్పి ఆహ్వానించారు. పట్టణ అధ్యక్షుడు కొంతం శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు ఠాకూర్‌రాంసింగ్, పుట్టమొండయ్య తదితరులు లక్ష్మణ్‌ను సన్మానించారు. మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఫహీం లక్ష్మణ్ చేతికి రక్ష కట్టారు. జెండా కూడలిలో మత్స్యకారులు చేపలు బహూకరించారు. బస్సుయాత్ర పెద్దపల్లికి చేరినా మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి బస్సు పైకి పిలిచేదాకా ఎక్కకపోవడం చర్చనీయాంశమైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఇతర నాయకులు గుజ్జుల రామకృష్ణారెడ్డి బస్సుపైకి రావాలంటూ పదేపదే కోరారు. అయితే ఇదే బస్సుపై ఈ నియోజకవర్గానికే చెందిన దుగ్యాల ప్రదీప్‌కుమార్ ఉండడంతో అలకబూనారని పలువురు చర్చించుకుంటున్నారు. అంతకు ముందే దుగ్యాల ప్రదీప్‌రావు మద్దతుదారులు బస్సుపై ఉన్న లక్ష్మణ్‌కు గొంగడితో సత్కరించారు. సుల్తానాబాద్‌లో రోడ్‌షోను ఉద్దేశించి లక్ష్మణ్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ మాటలతో గారడి చేస్తున్నారే తప్ప ఆచరణలో శూన్యమని అన్నారు. కాళేశ్వరం, ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్ట్‌లతో కాంట్రాక్టర్లు లాభపడుతున్నారని అందులో నుంచి పర్సెంటేజిలతో టీఆర్ఎస్ నాయకులు లాభపడుతున్నారని ఆరోపించారు. నేరెళ్ల దళితుల చిత్ర హింసలు నేటికి మర్చిపోలేమని అన్నారు. గడిల రాజ్యాన్ని కూలదోసి గరీబోళ్ల రాజ్యం తీసుకురావడానికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో మజ్లీస్ పార్టీని టీఆర్ఎస్ పెంచి పోషిస్తుందని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, బోర్ బావులు ఉచితంగా వేయించడం, అప్పుల మీద వడ్డీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ దళితులను మఖ్యమంత్రి చేస్తానని మాట ఇచ్చిన కేసీఆర్ నేడు రాజభోగాలను అనుభవిస్తూ ఎన్నికల హామీలైన డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, నాణ్యమైన విద్య, ఎక్కడ అమలు అవుతుందో చెప్పాలని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రాంచంద్రారెడ్డి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కాసిపేట లింగయ్య, మాజీ అధ్యక్షుడు అర్జున్‌రావు, సంజీవరెడ్డి, కోట రాంరెడ్డి, కొమ్ము తిరుపతియాదవ్, కేశవరావు, కరుణాకర్, రాజేంద్ర ప్రసాద్, మహేందర్, నారాయణ, శైలేందర్, శ్రీనివాస్ రెడ్డి, పిన్నింటి రాజు, కోట నాగేశ్వర్, బాపు, మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ర్యాలీలో అపశ్రుతి బీజేపీ మండల మాజీ కార్యదర్శి వేగోళం శ్రీనివాస్‌గౌడ్ బైక్ ర్యాలీలో సుల్తానాబాద్ బస్టాండ్ సమీపంలో వెనుక నుంచి మరో వాహనం ఢీకొనడంతో బైక్ బోల్తాపడింది. దీంతో శ్రీనివాస్ గౌడ్ భుజానికి గాయమైంది. కార్యకర్తలు హుటాహుటిన ప్రైవేట్ వాహనంలో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. -
టీడీపీ నేతలను తరిమి కొడతాం: పవన్‌కల్యాణ్
పెందుర్తి: విశాఖ జిల్లాలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న టీడీపీ నాయకులను తరిమికొట్టాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పిలుపునిచ్చారు. పెందుర్తిని స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అండతో అతడి కుమారుడు అప్పలనాయుడు దోపిడీ చేస్తున్నాడని.. అడిగిన వారిని బెదిరిస్తున్నాడని ఆరోపించారు. ప్రజలు నమ్మకంతో ఇచ్చిన పదవులు ఎమ్మెల్యేలు, ఎంపీల పిల్లలకు దోచుకోవడానికి లైసెన్సులు కాదన్నారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా పెందుర్తిలో పర్యటించిన పవన్‌కల్యాణ్ ముదపాక భూములను సందర్శించారు. అనంతరం ముదపాకలోనూ, పెందుర్తి నాలుగు రోడ్ల కూడలి వద్ద జరిగిన సభల్లో ప్రసంగిస్తూ టీడీపీ పాలనను ఎండగట్టారు. ప్రజాసమస్యలు పట్టని టీడీపీకి మళ్లీ అధికారమిస్తే ఉత్తరాంధ్రను సమూలంగా అమ్మేస్తారని ధ్వజమెత్తారు. కాలుష్యం నిండిన పరిశ్రమలను ఇక్కడపెట్టి కనీసం గాలి కూడా పీల్చుకోనీయకుండా చేసేస్తారని అన్నారు. పెందుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కుమారుడు దోపిడీలకు పాల్పడుతూ తనకు అడ్డుచెప్పిన వారిని భయబ్రాంతులకు గురి చేసి వేధింపులకు పాల్పడుతున్నాడని మండిపడ్డారు. ఎమ్మెల్యే, అతడి కుమారుడు తీరు మార్చుకోకపోతే రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ముదపాక భూముల దోపిడీ వ్యవహారంలో వీరికి సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయన్నారు. తాడి గ్రామం తరలింపులో జాప్యం, హిందుజా, ఎన్టీపీసీ తదితర కంపెనీల్లో అక్రమ నియామకాల్లో వీరి పాత్ర ఉందని ఆరోపించారు. పరవాడ ప్రాంతంలోని ఫార్మా, ఇతర కంపెనీల్లో స్థానికులకు/అర్హులకు కాకుండా టీడీపీ నాయకులు సిఫార్సు చేస్తున్న వారికే ఉపాధి లభించడం ఏంటని ప్రశ్నించారు. సింహాచలం భూ సమస్య పరిష్కారంలో ఎమ్మెల్యే ఈ నాలుగేళ్లలో చూపిన చొరవ ఏంటో ప్రజలకు తెలియజేయాలని అడిగారు. లంకెలపాలెం అండర్‌పాత్ బ్రిడ్జి నిర్మాణం కోసం నాలుగేళ్లగా చొరవ చూపని ఎంపీ అవంతి శ్రీనివాస్ రైల్వేజోన్ కోసం దీక్షలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జిల్లాలో టీడీపీ నాయకులు ప్రజలకు మంచి చేస్తారని తాను గత ఎన్నికల్లో మద్దతు ఇస్తే వారంతా ఏకమై జనాన్ని పీడించుకుతింటున్నారని ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ వారికి తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు. తాను పదవులకు ఆశించే వ్యక్తిని కాదని ప్రజాసమస్యల గురించి పోరాటం చేసేందుకే పార్టీని స్థాపించానని వివరించారు. పెందుర్తిలో తన పర్యటన అడ్డుకునేందుకు టీడీపీ చేసిన కుట్రలు సిగ్గుచేటని.. అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తీయించిన టీడీపీ నాయకుల తీరు వారి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. టీడీపీ నాయకులు ప్రజల జోలికి వస్తే సహించబోమని హెచ్చరించారు. పవన్‌కల్యాణ్ ప్రసంగం ముగింపు సమయంలో ‘తాటిచెట్టు ఎక్కలేవు.. తాటి కల్లు తీయలేవు’ పాటతో అభిమానుల్లో ఉత్సాహం నింపారు. ముదపాకలో భూ బాధితులతో జరగాల్సిన ముఖాముఖి కార్యక్రమం అభిమానుల కారణంగా రసాబాసగా మారడంతో గందరగోళం మధ్యలో పవన్ కాసేపు ప్రసంగించి ముగించేశారు. -
కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యం
మంచిర్యాలక్రైం: ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దెదించడమే లక్ష్యంగా తెలంగాణ జన సమితి అవిర్భవించిందని జిల్లా కన్వీనర్ మందల శ్యాంసుందర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని టీజేఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ఒక్కడే ఉద్యమం చేస్తే రాలేదన్నారు. రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ కోదండరాం అన్ని వర్గాల ప్రజలను, విద్యార్థ సంఘాల నాయకులను, ఉద్యోగ సంఘాల నాయకులను ఏకతాటిపై తెచ్చి ఉద్యమం నడపడం ద్వారానే రాష్ట్రం సాధించుకున్నామని అన్నారు. అనేక మంది విద్యార్థులు ఆత్మబలిదానాలు, త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్రమని పేర్కొన్నారు. రాష్ట్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన విద్యార్థుల ఆశయాలను, ఉద్యమానికి ఊపిరిపోసిన నాయకులను పక్కన పెట్టి ఉద్యమ ద్రోహులకు కేసీఆర్ పట్టం కడుతున్నాడని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్నిన హామీలను మరిచి స్వార్థపూరితమైన పథకాలను అమలు చేస్తూ తమ ఖజానా నింపుకుంటున్నారని ఆరోపించారు. ప్రజలు కలలు గన్న రాష్ట్రం ఇది కాదన్నారు. ఆ కలలను సాకారం చేసుకునేందుకు మలిదశ ఉద్యమం చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. తెలంగాణ జన సమితి నిర్మాణంలో భాగంగానే జిల్లా విద్యార్థి విభాగం అడ్‌హక్ కమిటీని నియమించినట్లు తెలిపారు. కేసీఆర్ ఇప్పటికే ప్రభుత్వ విద్యను నీరుగార్చే కుట్రకు పూనుకున్నాడన్నారు 4800 పైగా ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారని అరోపించారు. కేజీ టూ పీజీ ఉచిత విద్య అంటూ ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రోత్సహిస్తున్నాడని ఆరోపించారు. అనంతరం జిల్లా అడ్‌హక్ కమిటీని, మందమర్రి పట్టణ కన్వీనర్‌ను నియమించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం జిల్లా కో ఆర్డినేటర్ గడ్డం వెంకటేష్, జిల్లా సలహాదారు బాబన్న, జిల్లా కో కన్వీనర్ ఒడ్డెపల్లి మనోహర్, దుర్గం నరేష్, గోపాల్, క్యాతం రవికుమార్, ఎర్రబెల్లి రాజేష్, కుర్సింగ వెంకటేష్, రవికుమార్, కనకరాజు పాల్గొన్నారు. టీజేఎస్వీ అడ్‌హక్ కమిటీ తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం జిల్లా అడ్‌హక్ కమిటీని నియమించారు. కన్వీనర్‌గా చిప్పకుర్తి శ్రీనివాస్, కో కన్వీనర్లుగా పూరెల్ల నితిన్, గొడిసెల సురేందర్, సభ్యులుగా మామిడాల అరుణ్, ఆవునూరి ప్రసాద్, చిలుక శ్రావణ్, జక్కె ప్రశాంత్, భూక్య కిరణ్‌కుమార్, రమేష్, రామగిరి సాగర్లను నియమించారు. టీజేఎస్ మందమర్రి పట్టణ కన్వీనర్‌గా బండారి రవికుమార్‌ను నియమించారు. -
రాష్ట్రంలో తుగ్లక్ పాలన
మంచిర్యాలసిటీ: తెలంగాణ రాష్ట్రంలో నచ్చిన వారికి నజరానాలు, నచ్చని వారికి జరిమానాలు విధించే విధంగా తుగ్లక్ పాలన నడుస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఆరోపించారు. బీజేపీ చేపట్టిన మార్పు కోసం జన చైతన్య యాత్ర మంగళవారం మంచిర్యాలకు చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణంలోని ఆర్బీహెచ్వీ పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఎన్నికల ముందు దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్‌కు ఎన్నికల తర్వాత అది నచ్చలేదన్నారు. అందుకే ఆయనే ముఖ్యమంత్రి పదవి తీసుకున్నాడని విమర్శించారు. తన కుటుంబసభ్యులకు మరో నాలుగు పదవులు కట్టబెట్టారని, అంతా ఆ నలుగురిదే రాజ్యమని మండిపడ్డారు. రాష్ట్రంలో లక్షా ఇరవై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి ఇప్పటివరకు 20వేల ఉద్యోగాలే భర్తీ చేశారన్నారు. అందులో 12వేల పోస్టులు పోలీసు ఉద్యోగాలేనని పేర్కొన్నారు. కేసీఆర్ పరిపాలనతో నిరుద్యోగులు, రైతులు, యువత తిరగబడితే వారి గొంతు నొక్కడానికి, హక్కులను కాలరాయడానికే పోలీసు ఉద్యోగాలను పెద్ద ఎత్తున భర్తీ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇంటికో ఉద్యోగం అని ప్రకటించి అధికారంలోకి వచ్చిన తరువాత ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు, వారి కుటుంబాలు వీధినపడే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగం అనే పదం ఉండదని ప్రకటించిన కేసీఆర్ కాంట్రాక్టు ఉద్యోగులందరినీ ఎందుకు రెగ్యులర్ చేయలేదని ప్రశ్నించారు. ఉద్యోగాలు భర్తీ చేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలు బాగుపడుతారని అన్నారు. కానీ ఆ వర్గాలు బాగుపడడం కేసీఆర్‌కు ఇష్టం లేదన్నారు. 40 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. అలాగే నిరుద్యోగులకు ఉపాధి దొరికేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దళితులకు మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఇస్తానని చెప్పి రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది ఎకరాలు మాత్రమే పంచితే మిగతా దళిత కుటుంబాలు ఎలా బతకాలని నిలదీశారు. డ్రైవరు కొడుకైనా, మంత్రి కొడుకైనా ప్రభుత్వ బడిలోనే చదవాలని, అందుకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని చెప్పిన కేసీఆర్ మనవడు ఏ బడిలో చదువుతున్నాడో, డ్రైవర్ బాలయ్య కొడుకు ఏ బడిలో చదువుతున్నాడో చెప్పాలని సవాల్ విసిరారు. కమీషన్ల కోసమే సాగునీరు, తాగునీరు పేరిట మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఊరికో బెల్టుషాపు పెట్టించి వచ్చిన ఆదాయంతో దేశంలోనే రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందని గొప్పగా కేసీఆర్ చెప్పుకుంటున్నాడని దుయ్యబట్టారు. బొందలగడ్డగా సింగరేణి.. సింగరేణిలో ఓపెన్ కాస్ట్‌లు ఉండవని ఉద్యమంలో ప్రకటించిన కేసీఆర్ నేడు కొత్తగా 11 గనుల ప్రారంభానికి అనుమతించారన్నారు. తద్వారా సింగరేణి ప్రాంతాలను బొందల గడ్డగా మార్చనున్నారని ధ్వజమెత్తారు. చెన్నూర్‌లో భూగర్భ గనుల నిర్మాణానికి అవకాశం ఉన్నప్పటికీ ఎందుకు ప్రారంబించడం లేదన్నారు. అక్కడ భూగర్భ గనులు ప్రారంభిస్తే ఆ ప్రాంతం బాగుపడుతుందన్నారు. సర్వ రోగాల నివారణకు జిందా తిలస్మాత్ అన్నుట్టుగా రైతు సమస్యలు పరిష్కరించకుండా రైతుబంధు పథకంతో మోసపుచ్చుతున్నాడని విమర్శించారు. కౌలురైతులను అపహాస్యం చేస్తున్న కేసీఆర్‌కు వారి గోస తగులుతుందన్నారు. పోడు వ్యవసాయం చేసుకుంటున్న అడవిబిడ్దలను ఎందుకు గుర్తించడం లేదన్నారు. వారు తెలంగాణ బిడ్డలు కాదా అని ప్రశ్నించారు. రేషన్ డీలర్లకు కేంద్రం ఇచ్చే కమీషన్ ఇస్తే వారు ఈ రోజు సమ్మెలోకి వెళ్లే వారు కాదన్నారు. సాక్షర్ భారత్ ఉద్యోగులకు కూడా వేతనాలు ఇవ్వకుండా, ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాలు పెంచకుండా వారిని ఇబ్బందుల పాలుచేయడం ఎంతవరకు సమంజసమన్నారు. పెరుగన్నం తినే రైతు తెలంగాణ ఏర్పడ్డాక పురుగుల మందు తాగుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్టు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ రాజకీయాలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సచివాలయానికే రాని వ్యక్తి దేశ రాజకీయాలను ఏలుతానంటే ఎవరైనా కేసీఆర్‌ను నమ్ముతారా అని ప్రశ్నించారు. నిధులిచ్చినా నిందలు... కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హంసరాజ్ గంగారాం మాట్లాడుతూ కేంద్రం ఇచ్చే నిధులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా.. కేంద్రం నిధులు ఇవ్వడం లేదని బద్నాం చేస్తున్న కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. నేషనల్ హైవే, రైలుమార్గాలు, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ వంటి వాటికి తమ ప్రభుత్వం వేలకోట్ల నిధులు ఇచ్చినప్పటికీ కేసీఆర్ తిరిగి కేంద్ర ప్రభుత్వాన్ని అవమానిస్తున్నాడని మండిపడ్డారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల మల్లారెడ్డి మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో భూ కబ్జాలు పెరిగిపోయాయని, ఇందులో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారని ఆరోపించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దివాకర్‌రావు మంచిర్యాలను ఏ మేరకు అభివృద్ధి చేశారో చెప్పాలని మల్లారెడ్డి సవాల్ విసిరారు. -
ప్రశ్నోత్తరాల సమయం లేదా?
సాక్షి బెంగళూరు: విధాన పరిషత్తులో ప్రశ్నోత్తరాల సమయం తీసివేయడంతో ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం తెలిపారు. సభ ఆరంభంలోనే ప్రశ్నోత్తరాల సమయం లేకపోవడం ఏంటని బీజేపీ సభ్యులు అరుణ్‌శాహపుర అభ్యంతరం వ్యక్తం చేశారు. అదేవిధంగా రఘునాథ్ మల్కాపుర కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం జేడీఎస్ సభ్యులు శరవణ, భుజేగౌడ స్పందిస్తూ మల్కాపుర వ్యాఖ్యలను ఖండించారు. ప్రభుత్వాన్ని అనవసరంగా విమర్శించరాదని సూచించారు. ఈసందర్భంగా సభాపతి బసవరాజు హొరట్టె కల్పించుకుని మాట్లాడారు. పరిషత్తు సజావుగా సాగడానికి సహకరించాలని కోరారు. సభాపతి అనుమతి లేకుండా ఎవరూ మాట్లాడకూడదన్నారు. ప్రశ్నోత్తరాల సమయం ఉంటే సభ్యులు ప్రశ్నించే హక్కు ఉంటుందన్నారు. అయితే ప్రశ్నోత్తరాల సమయం లేకపోవడంతో సమావేశం నడిచేందుకు సహకరించాలని కోరారు. కాగా ప్రశ్నోత్తరాల సమయం లేదనే విషయం ముందే తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. సమయం లేకపోవడంతో ప్రశ్నోత్తరాలు తొలగించారని సభాపతి బసవరాజు హొరట్టె స్పష్టం చేశారు. అయితే రానున్న రోజుల్లో ప్రశ్నోత్తరాల సమయం తప్పకుండా నిర్వహిస్తారని చెప్పారు. అనంతరం ప్రతిపక్ష నాయకుడు కోటా శ్రీనివాస్ పూజారి మాట్లాడుతూ సభ్యుల ఆధారంగా సమావేశం జరగాలన్నారు. అనంతరం మంత్రి యూటీ ఖాదర్ మాట్లాడుతూ ప్రశ్నోత్తరాల సమయం ఉండాలని తాను కూడా ఒప్పుకుంటున్నానన్నారు. అయితే అనివార్య కారణాల రీత్యా ప్రశ్నోత్తరాల గంట లేదన్నారు. ప్రభుత్వం, అధికారుల చేతకాని తనం వల్లే ప్రశ్నోత్తరాల గంట తీసివేశారని సభాపతి బసవరాజు హొరట్టె విమర్శించారు. అనుచరులకు ప్రవేశం బంద్ విధాన పరిషత్తు సభ్యుల గన్మెన్లు, అనుచరులు, వ్యక్తిగత కార్యదర్శులకు ప్రవేశం లేదని సభాపతి బసవరాజు హొరట్టె హెచ్చరించారు. ఈమేరకు విధాన పరిషత్తు ద్వారం వద్ద మార్షల్స్‌ను నియమించారు. వారి సభ్యులను తప్ప ఎవరినీ లోపలికి అనుమతించలేదు. సభాపతి ఆదేశాలు అని చెప్పుకొచ్చారు. దీంతో గన్మెన్లు, అనుచరులు బయటే ఉండిపోయారు. ఈసందర్భంగా కొత్త సభ్యులను సభాపతి పరిచయం చేశారు. -
టీడీపీని ప్రజలు నమ్మరు
హాలహర్వి: గత ఎన్నికల్లో లేనిపోని హామీలు ఇచ్చి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీని ఈసారి ప్రజలు నమ్మరని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. సీఎం చంద్రబాబుపై రాష్ట్ర ప్రజలకు విరక్తి పుట్టిందన్నారు. మంగళవారం సిద్ధాపురం, గూళ్యం గ్రామాల్లో ఆయన పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సీఎం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారన్నారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతిని పూర్తిగా మరిచారన్నారు. వేదావతి నదిపై ప్రాజెక్టు నిర్మాణానికి రూ.250 కోట్లు నిధులు మంజూరు చేస్తామని 2016లో ప్రకటించిన బాబు ఇంతవరకు పైసా మంజూరు చేయలేదన్నారు. ఇప్పటి వరకు సర్వే పనులు కూడా జరగలేదన్నారు. ప్రాజెక్టు నిర్మాణం జరిగితే నియోజకవర్గంలోని వెయ్యి ఎకరాలకు సాగునీరు, వంద గ్రామాలకు తాగునీరు అందుతుందన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి సొంత నిధులతోనే సీసీ రోడ్లు, తాగునీటి సమస్య పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. రైతుల కోసం పోరాటం చేసి హంద్రీనీవా నుంచి కేసీ కెనాల్‌కు సాగునీరు అందించానన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ కోసం సీఎం రమేష్ కడపలో చేపట్టిన దీక్ష ఓ డ్రామా అని చెప్పారు. ఎన్నికలు దగ్గర పడుతున్నందుకు లేనిపోని దీక్షలు, హామీలు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. హంద్రీనీవా కాలువకు తూం ఏర్పాటు చేయాలని కోరుతూ స్థానిక టీడీపీ నాయకులు చేపట్టిన దీక్షలు ఒట్టి నాటకమేనని ఆరోపించారు. రైతులపై ప్రేమ ఉంటే గత నాలుగేళ్లుగా తూముల ఏర్పాటు విషయం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. అనంతరం సిద్ధాపురం గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకుడు కుమార్తె వివాహానికి ఎమ్మెల్యే హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. -
‘పవన్ మీరు సినిమాల్లో మాత్రమే నటించాలి’
సాక్షి, విశాఖపట్నం: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై పెందుర్తి టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ... సీఎం చంద్రబాబుపై పవన్ అసత్యా ప్రచారాలు చేయిస్తున్నారని విమర్శించారు. ‘మీరు రాజకీయాల్లోకి కొత్తగా ఏమీ రాలేదు. మీ అన్న పార్టీలో పనిచేశారు. ప్రజారాజ్యం పార్టీని మీరు కాంగ్రెస్ పార్టీకి ఎంతకు అమ్మేశారో అందరికీ తెలుసు’ అని అన్నారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా బీజేపీని మీరు ఎందుకు విమర్శించడం లేదని ప్రశ్నించారు. పవన్ కేవలం బీజేపీ స్క్రిప్ట్‌నే ఫాలో అవుతున్నారని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం విషయంలో పవన్ ప్రజలను రెచ్చగొడుతున్నారని వ్యాఖ్యానించారు. మూడు నెలలుగా విశాఖలోనే ఉండి ఎందుకు రైల్వే జోన్ గురించి పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు. మీరు సినిమాలో మాత్రమే నటించాలి కానీ రాజకీయాల్లో కాదని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో కేవలం వాస్తవాలు మాత్రమే మాట్లాడాలని అన్నారు. కేంద్రంపై విమర్శలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు చేయడం సరికాదని అన్నారు. -
ఇంకో 15 ఏళ్ళు అధికారంలో ఉంటాం : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ద్రోహం అంతా ఇంతా కాదని మంత్రి కేటీఆర్ తీవ్రంగా మడిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... వాసవి క్లబ్‌ను ఏర్పాటు చేసింది కేసీ గుప్తా అని కేసీ అంటే కల్వకుంట్ల చంద్రశేర్ గుప్తా అని గుప్తాకు మాకు ఎక్కడో దగ్గరి సంబంధం ఉందని అన్నారు. యాద్రాద్రి, హైదరాబాద్ లో చారిటబుల్ హాస్పిటల్ స్థలం కోసం డిప్యూటీ సీఎం మహమూద్ అలీ తో కలిసి సీఎంను ఒప్పిస్తామన్నారు. కేసీఆర్ అది చేయలేదు ఇది చేయలేదు అని అడుగుతున్న కాంగ్రెస్ నేతలు 60 ఏళ్ళు అధికారంలో ఉన్నపుడు అభివృద్ది చేసి వుంటే ఇంకా మన దేశంలో వేల గ్రామాలకు ఇప్పటికి కరెంట్ దిక్కు లేదని ప్రశ్నించారు. ఒకప్పుడు ఆంధ్ర, తెలంగాణలకు బలవంతపు పెళ్లి చేసింది కాంగ్రెస్ పార్టీయే అని ఎద్ధేవ చేశారు. తెలంగాణ అమ్మ ఇచ్చింది అని కాంగ్రెస్ వాళ్ళు చెబితే ఎవరు ఇవ్వలేదు.. మేమే గుంజుకున్నం అని మంత్రి కేటీఆర్ అన్నారు. అందుకే పోయిన ఎన్నికల్లో ప్రజలు వాళ్ళను ఓడించారు. జనాలను చైతన్యం చేస్తారట బిజేపి వాళ్ళు. ఇప్పటికే ప్రజలు చైతన్యంగ ఉన్నారని, ఈ సారి కూడా వారి వీపులు పగలగొడతారిని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ కోటి ఏకరాల మాగాణి అని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో ఇంటింటికీ నీలిచ్చిడు పక్కా.. కాంగ్రెస్ వాళ్ళ కిందకు నీళ్ళు తెచ్చుడు కూడా పక్కా అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇంకో 15 ఏళ్ళు టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉంటారని కేటీఆర్ ధీమ వ్యక్తం చేశారు. ఎన్నికల కాలం వచ్చిందంటే ఎక్కువగా గాలి మాటలు వినిపిస్తాయి. కొద్ది రోజులు ఉంటే నోటికి ఏది వేస్తే అది మాట్లాడే నాయకులు కూడా మీ దగ్గరి వస్తారు. అవసరం అయితే ఇంటికి తులం బంగారం కూడా ఇస్తారని చెప్పుతారు, రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాని ఇప్పటికే ఎన్నికల వాతావరణం వచ్చిందని కేటీఆర్ అన్నారు. -
సీఎం కేసీఆర్ కు ప్రజల సమస్యలు పట్టవా? : జీవన్ రెడ్డి
సాక్షి, జగిత్యాల: తెలంగాణలో ప్రజల సమస్యలను సీఎం కేసీఆర్ గాలికి వదిలేశారని కాంగ్రెస్ సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రధాన సమస్యలపై ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ చర్చించకపోవడం ఆయన చిత్తశుద్థకి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో ముస్లింలకు 12 శాతం, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ల సమస్యల గురించి అసలు పట్టించుకోక పోవడం విచారకరమని వ్యాఖ్యానించారు. గొప్పలు చెప్పుకోవటానికే పరిమితమైన కేసీఆర్ రాష్ట్రంలో ఉన్న సమస్యలను గాలికి వదిలేయడం బాధకరమని అన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ద్వారా లక్షల మందికి ఉపాధి కలిగే విషయాలను కూడా సీఎం మర్చిపోయారని ఆరోపించారు. నీతి ఆయోగ్ సమావేశంలో వీటి గురించి మాట్లావకపోవడం దారుణమని, టీఆర్ఎస్ బీజేపీ బీ టీమ్ పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 50 ఏళ్ల పాలనలో అప్పుల వాటా రూ. 60వేల కోట్లు ఉండగా, టీఆర్ఎస్ పాలనలో అప్పుల వాటా రూ రెండు లక్షల కోట్లకు పెరిగిందని అంటే నాలుగు ఏళ్లలోనే రూ. 150000 వేల కోట్లు పెరిగిందని జీవన్ రెడ్డి తెలిపారు. -
వైఎస్ చొరవతోనే పోలవరం
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): పోలవరం ప్రాజెక్టు కార్యరూపం దాల్చడానికి నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చూపిన చొరవే కారణమని ఎమ్మెల్సీ పి.వి.ఎన్.మాధవ్ స్పష్టం చేశారు. రైల్వే న్యూకాలనీలోని సుబ్బలక్ష్మి కల్యాణ మండపంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి పర్యావరణ శాఖల నుంచి అనుమతులు తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టును కార్యరూపంలోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం కాంట్రాక్టర్లను వత్తాసు పలికేందుకే అన్నట్టుగా వ్యయాన్ని పెంచుకుంటూ పోతోందని ఆరోపించారు. ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం పూర్తి చేస్తానంటే కమీషన్లు అందవేమోనని భయపడి ఇవ్వడం లేదన్నారు. నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అధిక నిధులు కేటాయించిందని తెలిపారు. నేషనల్ హైవే ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1.15 లక్షల కోట్లు మంజూరు చేసిందని, ఇప్పటికే రూ.10 వేల కోట్లు ఖర్చు చేసినట్టు ఆయన తెలిపారు. రాష్ట్రానికి 24/7 కరెంట్ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అన్ని ప్రాజెక్టుల్లోనూ అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. గృహనిర్మాణంలో చదరపు అడుగుకు కేవలం రూ.1200 ఖర్చుతో పూర్తి చేయడానికి పలు సంస్థలు ముందుకు వచ్చినా.. కాంట్రాక్టర్ల ఒత్తిడికి లోనై నేడు చదరపు అడుగు దాదాపు రూ. 2500లను ముట్టచెబుతోందన్నారు. రాష్ట్రంలో ఏ పేదవాడికైనా ఉచితంగా ఇసుక అందించారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్నికల ముందు 600 హామీలు ఇచ్చారని, ఏ ఒక్కటీ నేరవేర్చలేదన్నారు. ఈ తప్పులన్నీ కేంద్రంపై మోపాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం ప్రభుత్వం రాష్ట్రానికి అందించిన సాయంపై ప్రజలకు వివరిస్తామని, రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ ప్రారంభించిన సంపర్క్ అభియాన్ కార్యక్రమం త్వరలో విశాఖలో ప్రారంభమవుతుందన్నారు. అంతకుముందు కార్యవర్గ సమావేశం జరిగింది. బీజేపీ నాయకులు, వార్డు అధ్యక్షుడు పాల్గొన్నారు.