Minister PeddiReddy Ramachandra Reddy Remarks On Chandrababu Naidu, Details Inside - Sakshi
Sakshi News home page

‘హామీలు ఇచ్చి మోసం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు’

Published Mon, Dec 12 2022 1:22 PM | Last Updated on Mon, Dec 12 2022 1:43 PM

Minister PeddiReddy Ramachandra Reddy Remarks On Chandrababu - Sakshi

సాక్షి, అనంతపురం: నారా చంద్రబాబు నాయుడు ఎల్లోమీడియా కుట్రను దీటుగా ఎదర్కొవాలని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు పిలుపినిచ్చారు. ఈ మేరకు ఆయన అనంతపురంలో వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ..‘ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన నాయకత్వంలో 98 శాతం హామీలు అమలు చేయడం చారిత్రాత్మకం అని ప్రశంసించారు. కానీ 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఏ ఒక్క మంచిపనైనా చేశారా? అని నిలదీశారు.

ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అని మంత్రి పెద్దిరెడ్డి విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఏపీ అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం టీడీపీ అవశాన దశలో ఉందని, మళ్లీ అధికారంలోకి రావడం ఒక కల అని ఎద్దేవా చేశారు. అంతేగాదు చంద్రబాబు బీసీలకు చేసిందేమీ లేకపోగా, వాళ్లను వంచనకు గురిచేశారంటూ ఆరోపణలు చేశారు.

ఐతే బీసీ సామాజిక వర్గానికి చెందిన 80 వేల మందికి పదవులు ఇచ్చి గౌరవించిన ఘనత మాత్రం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కే దక్కుతుందని నొక్కి చెప్పారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కార్యకర్తలను ఉద్దేశిస్తూ... జగన్‌ నాయకత్వంలో పనిచేస్తున్నందుక మనమంతా గర్వపడాలన్నారు. ఈ మేరకు అనంతలో జరిగిన వైఎస్‌ఆర్‌సీపీ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఉష శ్రీ చరణ్‌ తదితరలు పాల్గొన్నారు. 

(చదవండి: 'రాజకీయ నేత ఎలా ఉండకూడదో చెప్పేందుకు.. చంద్రబాబే ఉదాహరణ')

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement