peddi reddy ramachandra reddy
-
పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం
-
వైఎస్ జగన్ పుంగనూరు పర్యటన.. ఏర్పాట్లను పరిశీలించిన పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి
-
పుంగనూరుకు పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి.. బాలిక కుటుంబానికి పరామర్శ
-
చంద్రబాబు, నారా లోకేష్ పై పెద్దిరెడ్డి ఫైర్
-
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పేర్ని నాని వ్యాఖ్యలు
-
‘రాష్ట్రంలో సత్ఫలితాలు ఇస్తున్న మైనింగ్ సంస్కరణలు’
సాక్షి,విజయవాడ: మైనింగ్ రంగంలో ప్రగతి కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి అనుగుణంగా రెవెన్యూ లక్ష్యాలను సాధించాలని రాష్ట్ర గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. మైనింగ్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనంను తీసుకువచ్చేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకువచ్చిన పలు సంస్కరణలు మంచి ఫలితాలను ఇస్తున్నామని తెలిపారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో మంగళవారం గనులశాఖ, ఎపిఎండిసి అధికారులుతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 1)2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.4500 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకోగా దానిని అధిగమించి రూ.4692 కోట్లు ఆర్జించడం జరిగిదని అన్నారు. లక్ష్యాన్ని అధిగమించిన అధికారులను ఈ సందర్భంగా అభినందించారు. మేజర్ మినరల్స్ లో 81 శాతం సాధిస్తే, మైనర్ మినరల్స్ లో ఏకంగా 125 శాతం పురోగతిని సాధించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్ రంగంలో ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు సీఎం జగన్ విప్లవాత్మక నిర్ణయాలను అమలు చేస్తున్నారని అన్నారు. దీనిలో భాగంగా గత ఆర్థిక సంవత్సరంలో 2వేల మైనింగ్ ఏరియాలకు ఈ-ఆక్షన్ ఇవ్వాలని నిర్ణయించగా, దానిలో 539 ఏరియాలకు ఈ-ఆక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. దీనిలో 405 ఏరియాలకు ఆక్షన్ ప్రక్రియ దాదాపు పూర్తి అయ్యే దశలో ఉందని, వాటిల్లో 117 ఏరియాలకు ఈ-ఆక్షన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యిందని, మరో 134 ఏరియాలకు ఆక్షన్ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. 2)రాష్ట్రంలో నాన్-వర్కింగ్ లీజులను అన్నింటిలోనూ మైనింగ్ కార్యకలాపాలను ప్రారంభించేందుకు వీలుగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. మొత్తం 4222 లీజుల్లో ఇప్పటికే 3142 లీజుల్లో మైనింగ్ జరుగుతోందని తెలిపారు. మరో 1080 లీజుల్లో మైనింగ్ కోసం గనులశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. అన్ని లీజుల్లో మైనింగ్ ప్రారంభమైతే రాష్ట్రానికి అవసరమైన ఖనిజాల లభ్యత, పరిశ్రమలకు ప్రోత్సాహం, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు, ప్రభుత్వానికి మైనింగ్ రెవెన్యూ లభిస్తాయని తెలిపారు. 3) ఇతర రాష్ట్రాల్లో విజయవంతంగా అమలు చేస్తున్న సీనరేజీ, కన్సిడరేషన్ కలెక్షన్ లను అవుట్ సోర్సింగ్ ద్వారా వసూలు చేసే విధానంను మన రాష్ట్రంలోనూ అమలు చేయడం ద్వారా రెవెన్యూను పెంచుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దీనిలో భాగంగా ఇప్పటి వరకు 5 జిల్లాల్లో ఇందుకు సంబంధించి టెండర్లను విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని అన్నారు. అలాగే మిగిలిన జిల్లాల్లోనూ ఈ విధానం అమలుకు టెండర్లను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి మైనింగ్ నుంచి సీనరేజీ, కన్సిడరేషన్ మొత్తాల రూపంలో స్థిరమైన ఆదాయం లభిస్తుందని తెలిపారు. 4)ప్రభుత్వరంగ సంస్థగా ఉన్న ఎపిఎండిసి గత ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే ఈ ఏడాది తన ఆదాయాన్ని రెట్టింపు చేసిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.902 కోట్లు రెవెన్యూ వస్తే, 2022-23 ఆర్థిక సంవత్సరంకు ఏకంగా రూ.1801 కోట్లు సాధించడం జరిగిందని తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరంకు గానూ మొత్తం రూ.2137 కోట్లు మేర రెవెన్యూ ఆర్జించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. 5) జాతీయస్థాయిలో ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థలతో ధీటుగా మధ్యప్రదేశ్ లోని సుల్యారీలో ఎపిఎండిసి నిర్వహిస్తున్న బొగ్గుగని ద్వారా గత ఏడాది 1.9మిలియన టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసి, విక్రయించడం జరిగిందని అన్నారు. గత ఏడాది సుల్యారీ ద్వారా రూ.483.5 కోట్లు రెవెన్యూ ఆర్జించామని, 2023-24 ఆర్థిక సంవత్సరంలో దానిని రూ.1624 కోట్లకు పెంచుకునేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మంగంపేటలోని బెరైటీస్ గనుల నుంచి ఎపిఎండిసి చరిత్రలోనే మొట్టమొదటి సారి ఏకంగా 3 మిలియన్ టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేసి, రూ.1000 కోట్ల రెవెన్యూ మైలురాయిని అధిగమించడం జరిగిందని అన్నారు. మొత్తం ఆర్థిక సంవత్సరంలో రూ.1201 కోట్లు బెరైటీస్ ద్వారా రెవెన్యూ సాధించగా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.1369 కోట్లు రెవెన్యూ ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 6) ఝార్ఝండ్ లోని బ్రహ్మదియాలో కూడా కోకింగ్ కోల్ మైనింగ్ ఈ జూలై నెలలో ప్రారంభించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అలాగే హెచ్ఎంబిసి, ఐరన్ ఓర్ ప్రాజెక్ట్ లను కూడా త్వరలోనే ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లోని మైనింగ్ సంస్థలు, కేంద్ర మైనింగ్ సంస్థలతో పోలిస్తే మైనింగ్ పురోగతిలో ఎపిఎండిసి ముందంజలో ఉందని, దీనిని మరింత మెరుగుపరుచు కోవడం ద్వారా సంస్థను అగ్రగామిగా నిలబెట్టాలని కోరారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ మైన్స్ గోపాలకృష్ణ ద్వివేది, డిఎంజి, ఎపిఎండిసి విసి&ఎండి విజి వెంకటరెడ్డి, ఎపిఎండిసి వైస్ ప్రెసిడెంట్ రామ్ నారాయణన్, సలహాదారు డిఎల్ఆర్ ప్రసాద్, గనులశాఖ జెడి రాజబాబు, డిడి రవిచంద్, ఎపిఎండిసి జీఎంలు టి.నతానేయల్, ఎ.నాగేశ్వరరెడ్డి, డిజిఎం సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గ్రానైట్ ఫ్యాక్టరీ నిర్వాహకులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమావేశం
-
‘హామీలు ఇచ్చి మోసం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు’
సాక్షి, అనంతపురం: నారా చంద్రబాబు నాయుడు ఎల్లోమీడియా కుట్రను దీటుగా ఎదర్కొవాలని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్సార్సీపీ కార్యకర్తలకు పిలుపినిచ్చారు. ఈ మేరకు ఆయన అనంతపురంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ..‘ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన నాయకత్వంలో 98 శాతం హామీలు అమలు చేయడం చారిత్రాత్మకం అని ప్రశంసించారు. కానీ 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఏ ఒక్క మంచిపనైనా చేశారా? అని నిలదీశారు. ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అని మంత్రి పెద్దిరెడ్డి విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఏపీ అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం టీడీపీ అవశాన దశలో ఉందని, మళ్లీ అధికారంలోకి రావడం ఒక కల అని ఎద్దేవా చేశారు. అంతేగాదు చంద్రబాబు బీసీలకు చేసిందేమీ లేకపోగా, వాళ్లను వంచనకు గురిచేశారంటూ ఆరోపణలు చేశారు. ఐతే బీసీ సామాజిక వర్గానికి చెందిన 80 వేల మందికి పదవులు ఇచ్చి గౌరవించిన ఘనత మాత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కే దక్కుతుందని నొక్కి చెప్పారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కార్యకర్తలను ఉద్దేశిస్తూ... జగన్ నాయకత్వంలో పనిచేస్తున్నందుక మనమంతా గర్వపడాలన్నారు. ఈ మేరకు అనంతలో జరిగిన వైఎస్ఆర్సీపీ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఉష శ్రీ చరణ్ తదితరలు పాల్గొన్నారు. (చదవండి: 'రాజకీయ నేత ఎలా ఉండకూడదో చెప్పేందుకు.. చంద్రబాబే ఉదాహరణ') -
నారాయణ అరెస్ట్‌లో కక్ష సాధింపు ఏముంది?
సాక్షి, అమరావతి: టెన్త్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారానికి సంబంధించి గత ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన నారాయణను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నారాయణ విద్యాసంస్థల నుంచే ఈ లీకేజ్ జరిగినట్లు పోలీసులు సైతం నిర్ధారణకు వచ్చారు. ఈ క్రమంలో.. తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు చేస్తున్న విమర్శలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి స్పందించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొత్తం నారాయణ విద్యాసంస్థల్లోనే ఈ ప్రశ్న పత్రాల మాల్ ప్రాక్టీస్ జరిగిందని అన్నారు. ఇప్పటికే ప్రశ్న పత్రాలు మాల్ ప్రాక్టీస్ కేసులో 60 మందిని అరెస్ట్ చేసినట్లు ఆయన గుర్తు చేశారు. అందులో పూర్తి విచారణ జరిగాకే.. ఇప్పుడు నారాయణను అరెస్ట్ చేశారన్నారు మంత్రి పెద్దిరెడ్డి. ‘ఇందులో ఎలాంటి కక్ష సాధింపు లేదు. విచారణలోనే అంతా తేలింది. వాస్తవాల ఆధారంగానే పోలీసులు అరెస్ట్ చేశారు’ అని స్పష్టం చేశారు. ఇక పొత్తులపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేస్తున్న ప్రకటనలపైనా మంత్రి పెద్దిరెడ్డి స్పందించారు. ‘‘చంద్రబాబుకి మతిమరుపు వచ్చి రోజుకో మాట మాట్లాడుతున్నాడు. పొత్తులపై మాట్లాడింది ఆయనే, మాట మార్చింది ఆయనే. చంద్రబాబుకి జనం ఎలాగూ తనను గెలిపించరని తెలుసు. అందుకే పొత్తుల కోసం రోజు మాట్లాడుతారు. వైఎస్సార్సీపీ మాత్రం ఒంటరిగా పోటీ చేసి మళ్ళీ గెలిచి తీరుతుంద’’ని ధీమా వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి. చదవండి👉: ఏపీ సీఐడీ అదుపులో మాజీ మంత్రి నారాయణ -
సమగ్రాభివృద్ధికే తొలి ప్రాధాన్యత
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా సమగ్రాభివృద్ధికే తొలి ప్రాధాన్యత ఇస్తామని మంత్రులు స్పష్టం చేశారు. పునర్విభజన తర్వాత మొదటి సారి జిల్లా సమీక్షా కమిటీ సమావేశం(డీఆర్సీ) శనివారం స్థానిక వైఎస్సార్ సభావేదిక ప్రాంగణంలో నిర్వహించారు. సమావేశానికి జిల్లా ఇన్చార్జి మంత్రి ఉషశ్రీచరణ్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కే.నారాయణస్వామి, ఆర్కే రోజా హాజరయ్యారు. కలెక్టర్ హరినారాయణన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లాలో చేపడుతున్న పలు సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలపై కూలంకషంగా చర్చించారు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు అందిస్తున్నట్లు డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లో నాడు–నేడు పథకం ద్వారా పాఠశాల లు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని మండలాల్లో సప్లయ్చానల్స్ సర్వే చేసి, వాటి మరమ్మతు పనులను ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టాలన్నారు. అన్ని రంగాల్లో ప్రగతి పరుగు చిత్తూరు జిల్లా అన్ని రంగాల్లో ప్రగతి సాధించేందుకు తన వంతు కృషి చేస్తానని ఇన్చార్జి మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేసేందుకు అధికారులు కీలక పాత్ర పోషించాలన్నారు. రైతులకు అధునాతన సాగు పద్ధతులపై వ్యవసాయ శాఖాధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించాలని చెప్పారు. మందుల కొరత లేకుండా అందుబాటులో పెట్టాలన్నారు. స్పందన కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతగా భావించి ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలిపారు. శాఖల వారీగా చర్చ ∙పేదలందరికీ ఇళ్లు పథకంలో జిల్లాలో రూ.318.19 కోట్లతో 72,272 గృహాల నిర్మాణంలో 72 శాతం గ్రౌండింగ్ చేసి చిత్తూరు జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపారని జిల్లా గృహనిర్మాణశాఖ పీడీ పద్మనాభం వివరించారు. జిల్లాలో రూ.316.70 కోట్లతో టిడ్కో ద్వారా నిర్మిస్తున్న గృహాలను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు. జిల్లాలో నాడు నేడు పథకం రెండో విడతలో 783 పాఠశాలల్లో రూ.217 కోట్లతో పనులు చేపడుతున్నట్లు సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణారెడ్డి వివరించారు. రెండో విడతలో 784 అదనపు తరగతులను నిర్మించనున్నట్లు చెప్పారు. నాడు నేడు పథకంలో జిల్లాలోని 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రూ.11.95 కోట్లతో పనులు చేపడుతున్నామని డీఎంహెచ్ఓ శ్రీహరి వివరించారు. ∙జిల్లాలోని 370 గ్రామాల్లో రీసర్వే కార్యక్రమాన్ని చేపడుతున్నామని సర్వే శాఖ ఏడీ గిరి« తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జిల్లాలో 1,50,682 జాబ్‌కార్డులు కలిగిన వారికి 79,68,671 పని దినాలు కల్పించినట్లు డ్వామా పీడీ చంద్రశేఖర్ తెలిపారు. ఇందుకు రూ.181.311 కోట్లను ఖర్చు చేసినట్లు చెప్పారు. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రైతుల పంటలకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచామని వ్యవసాయ శాఖ అధికారి మురళీ కృష్ణ వివరించారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్‌లు, మిల్క్ బల్క్ యూనిట్ల శాశ్వత భవనాల పనులను నిర్మిస్తున్నట్లు అధికారులు వివరించారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, ఎంఎస్ బాబు, వెంకటే గౌడ, ఎమ్మెల్సీ భరత్, చిత్తూరు మేయర్ అముద, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి, రాష్ట్ర జానపద కళల అభివృద్ధి సంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణం, డీసీసీబీ చైర్ పర్సన్ రెడ్డెమ్మ, కుప్పం రెస్కో చైర్మన్ సెంథిల్‌కుమార్, జెడ్పీ సీఈఓ ప్రభాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ... రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్, అటవీ పర్యావరణ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాలను అభివృద్ధిలోకి తీసుకువస్తామని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. పేదలందరికీ ఇళ్లు పథకంలో చిత్తూరు జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచినందుకు కలెక్టర్, జేసీలతోపాటు ఇతర అధికారులను అభినందించారు. ఇదే స్ఫూర్తితో పథకాల అమలులో చిత్తూరు జిల్లా ముందుండేలా పనిచేయాలని చెప్పారు. పార్టీలకతీతంగా కుల, మత, వర్గ, పార్టీలకతీతంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే.రోజా అన్నారు. నాడు–నేడు పథకంతో సర్కారు బడుల రూపురేఖలు మారాయని చెప్పారు. చెరువులు, శ్మశానవాటికలు ఆక్రమణకు లోనుకానుండా రెవెన్యూ శాఖ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. -
భూ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తాం
-
ఇది ఇంటర్వెల్ మాత్రమే.. శుభం కార్డు వేరేగా ఉంటుంది
తిరుపతి రూరల్: బిల్లులో టెక్నికల్ సమస్యల వల్లే మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించామని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఇది ఇంటర్వెల్ మాత్రమేనని, సినిమా శుభంకార్డు ముగింపు వేరేగా ఉంటుందని పేర్కొన్నారు. ఆయన సోమవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. న్యాయపరమైన చిక్కుల వల్లే వెనక్కి తగ్గామని, సమస్యలను సరిదిద్ది మూడుప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా మెరుగైన బిల్లుతో వస్తామని చెప్పారు. వ్యక్తిగతంగా తాను మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. పాదయాత్ర చేస్తోంది టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులు మాత్రమేనని, ఆ పాదయాత్రను చూసి చట్టం ఉపసంహరించలేదని చెప్పారు. -
గ్రామ సర్పంచ్‌లతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్
-
జులై 1 నుంచి కొత్త మార్పులతో వైఎస్ఆర్ బీమా అమలు
-
సరిహద్దు చెక్‌పోస్టులను మరింత కట్టుదిట్టం చేస్తున్నాం
-
కరోనా బాధితులను వేధిస్తే సహించం: పెద్దిరెడ్డి
-
‘రాజకీయ దురుద్దేశంతోనే ఆరోపణలు’
సాక్షి, అమరావతి: రాజకీయ దురుద్దేశంతోనే ఇసుక టెండర్లపై టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ హయాంలోనే ఇసుక దోపిడీ జరిగిందని, విచ్చల విడిగా ఇసుకను దోచుకున్నారని ఆరోపించారు. ఇసుక టెండర్లలో టీడీపీ నేతలు ఎందుకు పాల్గొనలేదని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ద్వారానే టెండర్లు పిలిచామన్నారు. రూ.120 కోట్లు సెక్యూరిటీ డిపాజిట్ చేసిన సంస్థ దివాళా తీసిందని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. వినియోగదారులకు సక్రమంగా ఇసుక సరఫరా అందిస్తున్నామని, సొంతంగా వినియోగదారులే ఇసుక తరలించేందుకు అవకాశం కల్పించామని చెప్పారు. అలాగే ఇసుక అక్రమాలపై ఫిర్యాదులకు కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశాం పెద్దిరెడ్డి వివరించారు. -
కర్నూలు రోడ్డు ప్రమాదం: ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం
సాక్షి, విజయవాడ /కర్నూలు: కర్నూలు రోడ్డు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందజేయాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు సహాయ సహకారాలు అందించి ఆదుకోవాలని పేర్కొన్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశం కర్నూలు: ప్రమాద ఘటనపై ఇంచార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కర్నూలు ప్రమాద ఘటన దురదృష్టకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో ప్రాణాలు విడిచిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. మృతులు 14 మంది కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందని తెలిపారు. గాయపడిన నలుగురికి రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. రేపు మదనపల్లికి వెళ్లి చెక్కులు అందజేస్తామని ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉండాలని సీఎం ఆదేశించారని ఆయన గుర్తు చేశారు. డ్రైవర్ నిద్ర మత్తువల్లే.. టెంపో మినీ బస్సు డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చోటుచేసుకుందని ప్రాథమిక విచారణలో తేలిందని జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ వెల్లడించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు సహాయ సహకారాలు అందించి, ఆ కుటుంబాలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని తెలిపారు. ప్రమాద కారణాలను ప్రత్యేక సాంకేతిక బృందంతో సమగ్ర విచారణ చేపడుతున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. మృతుల వివరాలను చిత్తూరు జిల్లా అధికారులకు సమాచారం అందించామని ఆయన తెలిపారు. బాధితులకు అండగా ప్రభుత్వం: ఆళ్ల నాని కర్నూలు ప్రమాద ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని దిగ్భ్రాంతి చెందారు. కర్నూలు జిల్లా కలెక్టర్, డీఎంహెచ్‌వోతో ఫోన్లో ఆళ్ల నాని మాట్లాడారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలను అడిగితెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తెలిపారు. (చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. అంతా మదనపల్లి వాసులే!) -
ప్రగల్భాలు పలికి ‘స్టే’ తెచ్చుకుంటారా?
సాక్షి, అమరావతి: రాజధాని భూముల వ్యవహారాల్లో దమ్ముంటే విచారణ చేసుకోవాలని ప్రగల్భాలు పలికిన టీడీపీ నేతలు కోర్టులకు వెళ్లి ‘స్టే’ ఎందుకు తెచ్చుకున్నారని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. సవాల్ చేసి పారిపోవడంపై చంద్రబాబు, టీడీపీ నేతలు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి బొత్స బుధవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. కోర్టుల్లో స్టేలు తెచ్చుకొని మేం నిస్వార్థపరులం, రుషి పుంగవులం అంటే ఎలా? అని వ్యాఖ్యానించారు. ► అమరావతి భూముల వ్యవహారాల్లో పలు అక్రమాలు, దోపిడీ జరిగిందని మేం ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి చెబుతూనే ఉన్నాం. చంద్రబాబు, లోకేష్, వాళ్ల తాబేదారులు ఆ ప్రాంతంలో వేలాది ఎకరాల భూములు అక్రమంగా కొనుగోలు చేశారు. దీనిపై దమ్ముంటే విచారణ జరిపించాలని టీడీపీ నేతలు సవాళ్లు చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాదైంది, ఏం తేల్చారంటూ వ్యాఖ్యలు చేశారు. ► అసెంబ్లీలో చర్చించిన అనంతరం దీనిపై సిట్ దర్యాపునకు ఆదేశిస్తే కోర్టుకు వెళ్లారు. ఏసీబీ కేసు పెడితే దానిపైనా కోర్టుకు వెళ్లారు. ఎందుకు వెళ్లారు? మీడియా ఈ విషయాన్ని చర్చకు పెట్టాలి. చర్చకు మేం సిద్ధం. ► ఈ వ్యవహారాల్లో కొందరు వ్యక్తుల పాత్రకు సంబంధించి ఆధారాలున్నట్లు ప్రాథమికంగా నిర్థారణ కావడంతో ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. నిబంధనలకు అనుగుణంగానే ఏసీబీ కేసులు నమోదు చేసింది. ► రాజధాని భూముల వ్యవహారాల్లో తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదు. సామాన్యులకు అన్యాయం చేశారు. అందుకు సాక్ష్యాలు చూపించాం. చట్టం తన పని తాను చేస్తుంది. రాష్ట్రంలో సమస్యలను పక్కదారి పట్టించేందుకు కేసులు పెడుతున్నారన్న టీడీపీ నేతల ఆరోపణల్లో నిజం లేదు. పక్కదారి పట్టించేందుకు ఏ సమస్య ఉందో చెప్పాలి. కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర ప్రభుత్వమేప్రశంసించింది. ఈ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఏమీ లేకపోవడంతో చంద్రబాబు చివరకు దేవాలయాల పేరుతో విమర్శలు చేస్తున్నారు. విజయవాడ దుర్గగుడిలో రథాన్ని మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వినియోగించలేదు. -
చిత్తూరు: పాల ఫ్యాక్టరీలో గ్యాస్ లీకేజీ
సాక్షి, చిత్తూరు : జిల్లలోని పూతలపట్టు మండలంలో గురువారం రాత్రి అమ్మోనియం గ్యాస్ లీక్ కావడంతో 20మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో 100మందికి పైగా కార్మికులు ఉండగా వారిలో 14మంది మహిళా కార్మికులు ఆస్పత్రి పాలయ్యారు. పూతలపట్టు మండలం బండపల్లి హట్సన్ పాల డెయిరీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పాలు కోల్డ్ స్టోరేజ్ కోసం అమ్మోనియం వాయువును ఉపయోగిస్తుంటారు. ఆ వాయువు లీక్ కావడంతో 14మంది అస్వస్థతకు గురైయ్యారు. వెంటనే ఫ్యాక్టరీ నిర్వాహకులు చిత్తూరు, గుడిపాల ఆస్పత్రులకు తరలించారు. ఇద్దరు అపస్మారక స్థితిలో ఉన్నారు. పాల డెయిరీ ఘటనపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తాతో మాట్లాడి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.మరోవైపు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా హట్సన్ పాల డెయిరీని పరిశీలించారు. అస్వస్థతకు గురైనవారికి మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. గ్యాస్ లీక్ సంఘటనపై ఎమ్మెల్యే ఎంఎస్ బాబు సీరియర్ అయ్యారు. యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఆయన వ్యాఖ్యానించారు. -
వీధి దీపాల నిర్వహణ సచివాలయాలకు
సాక్షి, అమరావతి: గ్రామాల్లో వీధి దీపాల నిర్వహణ, ఫిర్యాదుల పర్యవేక్షణ ప్రక్రియను గ్రామ సచివాలయాలకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2014కి ముందు గ్రామ పంచాయ తీల పర్యవేక్షణలో ఉన్న వీధి దీపాల నిర్వహణను టీడీపీ హయాంలో ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించారు. గ్రామాల్లో చాలా వీధి దీపాలు రేయింబవళ్లు వెలుగుతుండడం, మరికొన్ని రాత్రివేళ వెలగకపోవడంపై పంచాయతీరాజ్ శాఖకు పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, మైనింగ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎనర్జీ అసిస్టెంట్‌కు బాధ్యతలు.. ► ఇక నుంచి వీధి దీపాల మరమ్మతులు, నిర్వహణను గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఎనర్జీ అసిస్టెంట్‌కు అప్పగిస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఫిర్యాదు అందిన 24–48 గంటల లోపే సమస్య పరిష్కరిస్తారు. ► రాష్ట్రవ్యాప్తంగా ఎల్ఈడీ వీధి దీపాలు లేని 2,000 గ్రామాల్లో కొత్తగా నాలుగు లక్షల ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు కార్యక్రమాన్ని ఇక నుంచి జగనన్న పల్లె వెలుగుగా పేరు మార్చారు. ఇళ్ల పట్టాల లేఔట్ల వద్ద భారీగా మొక్కల పంపిణీ జూలై 8వ తేదీన ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 11 లక్షల మొక్కలు నాటాలని సమావేశంలో నిర్ణయించారు. 25,814 కిలోమీటర్ల పొడవునా రహదారుల వెంట ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈ ఏడాది చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి జగన్ సూచనలకు అనుగుణంగా ఈ ఆర్థిక ఏడాది ఉపాధి హామీ పథకం కూలీలకు 25 కోట్ల పనిదినాలు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని మంత్రి పెద్దిరెడ్డి సూచించారు. మంగంపేట బైరటీస్ విస్తరణ వేగవంతం చేయాలి మంగంపేట బైరటీస్ విస్తరణ, ఉత్పత్తి పనులు మరింత వేగవంతం చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన సులియేరి, మదన్‌పూర్ బొగ్గు బ్లాకుల ప్రస్తుత పరిస్థితిపై అధికారులను వివరాలు అడిగారు. బొగ్గు బ్లాకుల కోసం కేంద్రం నిర్వహించే వేలంలో పాల్గొనేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. సమావేశంలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, కోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పాల్గొన్నారు. -
ఈఎస్ఐ కుంభకోణంలో చట్టం తన పని తాను చేస్తుంది
-
‘చంద్రబాబు డైరెక్షన్లోనే ఈఎస్ఐ స్కాం’
సాక్షి, అమరావతి: ఈఎస్ఐ కుంభకోణం కేసులో చట్టం తనపని తాను చేసుకుపోతుందని మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వారు శనివారం మీడియాతో మాట్లాడుతూ అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై టీడీపీ కుల ప్రస్తావన తీసుకురావడం దారుణమన్నారు. బీసీలకు పెద్దపీట వేసింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డేనని తెలిపారు. (కౌంట్‌డౌన్ స్టార్ట్.. అచ్చెన్న ఆటకట్టు) వందల కోట్ల ప్రజాధనం నొక్కేసి ఇప్పుడు కులాలను ఎలా ప్రస్తావిస్తారంటూ టీడీపీ నేతలపై మంత్రులు మండిపడ్డారు. ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడుతో పాటు చంద్రబాబుకు కూడా సంబంధం ఉందని ఆరోపించారు. చంద్రబాబు డైరెక్షన్లోనే దోపిడీ జరిగిందన్నారు. టీడీపీ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలు ఇంకా చాలా ఉన్నాయన్నారు. అందరి బండారం బయటపడుతుందన్నారు. త్వరలో మరికొన్ని అరెస్ట్‌లు తప్పవని మంత్రులు స్పష్టం చేశారు. (అచ్చెన్న.. ఖైదీ నెంబర్ 1573) -
ముందస్తు ప్రణాళికతో మంచినీటి ఎద్దడికి చెక్
సాక్షి, అమరావతి: లాక్డౌన్ ఇబ్బందుల మధ్య కూడా గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి ఇబ్బందులపై రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే ప్రత్యేక దృష్టి సారించింది. తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న 2,837 గ్రామాలకు గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) శాఖ ఆధ్వర్యంలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. వేసవి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది జనవరిలోనే రూ. 204.75 కోట్లతో గ్రామీణ మంచినీటి ప్రణాళికను ప్రభుత్వం రూపొందించింది. ఈ వివరాలను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆ ప్రకటనలో మరికొన్ని ముఖ్యాంశాలు.. ► ఈ వేసవిలో 2,055 గ్రామాల్లో పశువుల అవసరాలకు కూడా నీటి సరఫరా ప్రణాళికను ప్రభుత్వం రూపొందించింది. ► 347 వ్యవసాయ బావులను అద్దెకు తీసుకుని, ఆ నీటిని సమీప గ్రామాల్లోని మంచినీటి పథకాలకు అనుసంధానం చేశారు. ► సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల్లో, గ్రామాల్లోని బావుల్లో పూడిక తీత వంటి అవసరాలకు రూ. 5.80 కోట్లు కేటాయింపు. ► మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు మండల స్థాయిలో ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్, ఎంపీడీవో, ఈవోపీఆర్డీ సభ్యులుగా కమిటీలను ప్రభుత్వం నియమించింది. ► భూగర్భ జలాలు కలుషితమైన చోట వైఎస్సార్ సుజల పథకంలో మంచినీటి ప్లాంట్ల ద్వారా క్యాన్ వాటర్ సరఫరాకు రూ. 46.56 కోట్ల ఖర్చుకు ప్రభుత్వం అంచనాలు రూపొందించింది. ► రాష్ట్ర వ్యాప్తంగా రూ. 55.86 కోట్లతో సోలార్ స్కీంల ద్వారా ఆయా ప్రాంతాలకు నీటిని ప్రభుత్వం సరఫరా చేస్తోంది. -
వీధి దీపం వెలగలేదా?
సాక్షి, అమరావతి: ఎల్ఈడీ వీధి దీపాలు వెలగలేదని ఫిర్యాదు అందిన 72 గంటల్లో సమస్యను పరిష్కరించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. వేగవంతమైన స్పందన యంత్రాంగాన్ని (రాపిడ్ రెస్పాన్స్ మెకానిజం–ఆర్ఆర్ఎం) ఏర్పాటు చేయాలని సూచించారు. వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన వెరిఫికేషన్ కమిటీతో మంత్రి సోమవారం భేటీ అవుతారు. ఇందుకు సంబంధించి ఆయన అధికారులతో సమీక్ష జరిపారు. ఈ వివరాలను రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు. గ్రామాల్లో నూరు శాతం వీధిదీపాలు వెలగాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎల్ఈడీ వీధిదీపాల ఫిర్యాదులపై తక్షణం స్పందించాలంటే క్షేత్రస్థాయిలో పటిష్టమైన, విస్తృతస్థాయి నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి సూచించారు. ప్రజల ఫిర్యాదులపై అధికారులు స్పందించి 72 గంటల్లో పరిష్కరించాలన్నారు. ఎల్ఈడీ వీధి దీపాలపై ఫిర్యాదుల పరిష్కారానికి ఇప్పటికే ఒక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేశామని అధికారులు మంత్రికి వివరించారు. గ్రామ వలంటీర్ల ద్వారా వచ్చిన ఫిర్యాదులను పంచాయతీ కార్యదర్శి సదరు పోర్టల్‌లో నమోదు చేస్తే ఈఈఎస్ఎల్ తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. గ్రామాల్లో దాదాపు 25.04 లక్షల ఎల్ఈడీ వీధి దీపాలు అమర్చామని, వీటిలో 1.5 లక్షల వీధి దీపాలు నెడ్‌క్యాప్ చేయగా, 23.54 లక్షల వీధి దీపాలను ఈఈఎస్ఎల్ ఏర్పాటు చేసిందని, దీనివల్ల ఏడాదికి 260 మిలియన్ యూనిట్ల విద్యుత్, రూ.156 కోట్ల నిధులు ఆదా అవుతాయని అంచనా వేసినట్టు తెలిపారు. కొత్తగా ఏర్పాటైన కాలనీల్లో మరో 35 లక్షల వీధి దీపాలను ఏర్పాటు చేసే అవకాశం ఉందని వివరించారు. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ మాట్లాడుతూ ఎల్ఈడీ కార్యక్రమం అమలుతీరుపై వెరిఫికేషన్ కమిటీ క్షేత్రస్థాయిలో అధ్యయనం నిర్వహిస్తుందని, దీన్ని పటిష్టంగా అమలు చేసేందుకు, ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించేందుకు అనువైన సిఫారసులను చేస్తుందని వివరించారు.