రెండో రోజూ ప్రభం‘జనం’
=జగన్‌ను అక్కున చేర్చుకున్న కుప్పం, పలమనేరు వాసులు
=దారి పొడవునా అభిమాన వర్షం
=కరచాలనాలు, కర్పూర హారతులు
సాక్షి, తిరుపతి: కుప్పం ఆర్‌అండ్ బీ అతిథి గృహం నుంచి ఆదివారం సమైక్య శంఖారావం యాత్ర ప్రారంభమైంది. వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డితో పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త సుబ్రమణ్యంరెడ్డి తదితరులు ఉదయం 9.30 గంటలకు యాత్రకు బయలుదేరారు. దారి పొడవునా సమీప గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. ముందుగా సామగుత్తిపల్లె క్రాస్ వద్ద పార్టీ నాయకుడు శివకుమార్ నేతృత్వంలో స్వాగతం పలికారు.
మహిళలు కర్పూర హారతులు పట్టారు. రోడ్డు పక్కన ఆగిన బస్సుల నుంచి ప్రయాణికులు చేతులు ఊపుతూ జగన్‌మోహన్‌రెడ్డికి సంఘీభావం తెలిపారు. సమీపంలోనే చప్పడిగురుగులు గ్రామం వద్ద వేచి ఉన్న ప్రజలను జగన్‌మోహన్‌రెడ్డి ఆప్యాయంగా పలకరించారు. చంటిపిల్లలను హత్తుకుని ముద్దాడారు. చిన్నశెట్టిపల్లె మార్గంలో బడుగు వర్గాలకు చెందిన ప్రజలు వేచి ఉండగా కారు ఆపి వారి వద్దకు వెళ్లారు. అందరినీ పలకరించారు. మహిళలు, చిన్నారులను దీవించారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్ద ఆగి విద్యార్థులతో కా సేపు ముచ్చటించారు. వారందరికి ‘బాయ్’ చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు.
పెద్దిశెట్టిపల్లెలో స్థానిక నాయకులు నాగరాజు, రామకుమార్ భారీ ఎత్తున స్వాగతం పలికారు. శెట్టిపల్లె క్రాస్ వద్ద మహిళలు హారతులు పట్టి జై జగన్ అంటూ నినాదాలు చేశారు. బొగ్గుపల్లె పంచాయతీలోని పీఈఎస్ మెడికల్ కళాశాల ప్రాంగణం వద్ద కళాశాల విద్యార్థులు, స్థానికులు పెద్దఎత్తున గుమికూడారు. స్థానిక నాయకుడు సెంథిల్ నేతృత్వంలో మహిళలు హారతులు పట్టారు. అక్కడే పార్టీ జెండాను ఆవిష్కరించారు.
గణేషపురం, పుడూరు, కడపల్లె, శివపురం క్రాస్ వద్ద జగన్‌మోహన్‌రెడ్డికి అ పూర్వ స్వాగతం లభించింది. అక్కడ నుంచి బయలుదేరిన ఆయనకు తిమ్మరాజుపురం, కనుమదొడ్డి, మురసనపల్లె, తులసినాయుడుపల్లె వద్ద జనం సాదర స్వాగతం పలికారు. జగన్‌మోహన్‌రెడ్డి అందరినీ పలకరిస్తూ కరచాలనం చేస్తూ ముందుకు కది లారు. తుమ్మిశ గ్రామం వద్ద భారీగా జనం తరలివచ్చారు. స్థాని క నాయకులు ఆవుల గోపి, బాబు నేతృత్వంలో ఘన స్వాగతం పలికారు. శాంతిపురం మండలంలోకి ప్రవేశించిన ఆయనను స్థానిక నాయకులు సాదరంగా ఆహ్వానించారు. అక్కడ మ హానేత వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
హెరిటేజ్ ఫ్యాక్టరీ ఉన్న మఠం గ్రామం వద్దకు చేరుకోగానే, ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న పలువురు రోడ్డుపైకి వచ్చి జగన్‌మోహన్‌రెడ్డితో కరచాలనం చేశారు. గుండుశెట్టిపల్లె, నాయినిపల్లెకు చేరుకోగానే అక్కడివారు పూలవర్షం కురిపించారు. రాజుపేట వద్ద ఒక అభిమాని గొర్రెపిల్లను కానుకగా అందజేశారు. అక్కడి నుంచి జగన్‌మోహన్‌రెడ్డి రామకుప్పం చేరుకుని మహానేత రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం వి.కోటలో బహిరంగ సభకు వెళుతూ మార్గ మధ్యంలో వేచి ఉన్న అభిమానులను పల కరించారు.
వి.కోటలో పలువురు టీడీపీ నేతలు వైఎస్‌ఆర్ కాంగ్రెసు పార్టీలో చేరారు. కాన్వాయ్‌లో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అమరనాథ్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, నియోజకవర్గాల సమన్వయకర్తలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఆది మూలం, ఏఎస్.మనోహర్, షమీమ్ అస్లాం, పార్టీ రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు మిథున్‌రెడ్డి, తిరుపతి నేత వరప్రసాదరావు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి, యువజన కన్వీనరు ఉదయకుమార్, తిరుపతి కన్వీనరు పాలగిరి ప్రతాప్‌రెడ్డి తదితరులు ఉన్నారు.