Samiyakashkaram Yataya
-
జన శంఖారావం
సమైక్య సారథికి నీరా‘జనం’ జగన్‌కు అడుగడుగునా అఖండ స్వాగతం చోడవరంలో పోటెత్తిన ప్రజానీకం దుడ్డుపాలెం (కె.కోటపాడు), న్యూస్‌లైన్ : వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి పార్టీ సీపీ సీఈసీ సభ్యుడు బూడి ముత్యాలునాయుడు ఆధ్వర్యంలో దేవరాపల్లి మండలప్రజలు చోడవరం మండలం దుడ్డుపాలెం జంక్షన్ వద్ద ఘనస్వాగతం పలికారు. చోడవరంలో సమైక్య శంఖారావం సభకు జగన్మోహన్రెడ్డి వస్తున్న మార్గంలో సుమారు పదివేలమంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు రెండు కిలోమీటర్ల మేర రోడ్లకు ఇరువైపులా నిలబడి శనివారం స్వాగతం పలికారు. దుడ్డుపాలెం జంక్షన్‌కు మధ్యాహ్నం 12 గంటలకు చేరుకున్న అభిమానులు ఎండను సైతం లెక్క చేయకుండా అభిమాన నాయకుడి రాక కోసం గంటలకొద్దీ వేచి ఉన్నారు. పార్టీ అధినేతకు గిరిజనులు థింసా నృత్యం, కోలాటాలతో అపూర్వ స్వాగతం పలికారు. గంటల తరబడి వేచిఉన్న కార్యకర్తలు, మహిళలను పలుకరిస్తూ జగన్మోహన్రెడ్డి కాన్వాయ్‌ను ముందుకు సాగించారు. ఈ సందర్భంగా అశేష జనాన్ని చూసిన జగన్మోహన్రెడ్డి బూడి ముత్యాలనాయుడుతో మాట్లాడారు. పార్టీ పట్టిష్టతకు చేసిన సేవలను బూడి వివరించారు. రెండు కిలోమీటర్ల పొడవునా ఉన్న మహిళలు, కార్యకర్తలకు జగన్మోహన్రెడ్డి భివాదం చేసి ఉత్తేజపరిచారు. ఈ స్వాగత కార్యక్రమాల్లో దేవరాపల్లి వైఎస్సార్ సీపీ నాయకులు కర్రి సత్యం, బూరె బాబూరావు, పోతల లక్ష్మి, గూడెపు రాము, రొంగలి శంకరరావు, రెడ్డి బలరాం, నాగిరెడ్డి శఠారినాయుడు, వరదపురెడ్డి లలితానాయుడు, బొడ్డు పేరునాయుడు, ఈర్లె గంగునాయుడు (నాని) పాల్గొన్నారు. విమానాశ్రయంలో హోరెత్తిన జగన్నినాదం విశాఖపట్నం: విశాఖ విమానాశ్రయంలో శని వారం వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డికి అఖండ స్వాగతం లభించింది. సమైఖ్య శంఖారావం సభల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయనను కలిసేందుకు ఉత్తరాంధ్ర నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో అభిమానులు, నేతలు తరలి వచ్చారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు, డాక్టర్ జహీర్అహ్మద్, నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు చొక్కాకుల వెంకటరావు, ఉత్తరాంధ్ర ఎన్నికల పరిశీలకుడు కొయ్య ప్రసాద్‌రెడ్డి, మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు, సమన్వయకర్తలు గండి బాబ్జీ, దాడి రత్నాకర్, తిప్పల నాగిరెడ్డి, జి.వి.రవిరాజు, కోలా గురువులు, కోరాడ రాజబాబు, పెట్ల ఉమాశంకర్ గణేష్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పిన్నింటి వరలక్ష్మి, చెంగల వెంకటరావు, నగర మహిళా కన్వీనర్ పసుపులేటి ఉషాకిరణ్, బీసీ సెల్ కన్వీనర్ పక్కి దివాకర్, పార్టీ నాయకురాలు పీలా ఉమారాణి, మాజీ కార్పొరేటర్ చొప్పా నాగరాజు తదితర నాయకులు జగన్మోహన్రెడ్డిని కలుసుకున్నారు. ఇక్కడి నుంచి దారిపొడువునా మహిళలు, యువకులు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. మంగళ హారతులతో అభిమానాన్ని చాటుకున్నారు. జై..జగన్ నినాదాలతో హోరెత్తించారు. పులకించిన చోడవరం.. చోడవరం, న్యూస్‌లైన్: తమప్రియతమ నాయకుడు రావడం తో చోడవరం పులకరించిపోయింది. సుమా రు మూడు సంవత్సరాల త ర్వాత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహనరెడ్డి చోడవరం రావడంతో అభిమానులు ఆయనను చూసేందుకు బారులు తీరా రు. చోడవరం పట్టణంలోని ప్రజలతోబాటు పరిసర మండలాల నుంచి భారీ సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో చోడవరం జన సం ద్రంగా మారింది. మద్యాహ్నం రెం డు గం టల నుంచే అభిమాన నాయకుని రాకకోసం చోడవరం కార్యకర్తలు, అభిమానులు, సమైక్యవాదులు చేరుకున్నారు. సుమారు మూడు గంటల పాటు జగన్ రాక ఆలస్యమైనా ఏ ఒక్కరూ నిరాశ చెందలేదు. అంతకంతకు జనం పెరగడంతో ఇసుక వేస్తే రాలనంతగా కొత్తూరు జంక్షన్ నిండిపోయింది. 2011 జనవరిలో ఓదార్పు యాత్ర అనంతరం మూడేళ్ల తర్వాత వచ్చిన జగన్‌ను చూసేందుకు చిన్నా పెద్ద అంతా ఉత్సాహం చూపారు. మహిళలు, విద్యార్థులు, యువకులు, వృద్దులు, రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సభా స్థలి వద్ద చుట్టు పక్క ఉన్న భవ నాల పైకి సైతం ఎక్కి తమ అభిమాన నాయకుడిని తనివి తీరా చూసుకున్నారు. జగన్ ప్రసంగానికి అడుగడుగునా కరతాళ ధ్వనులతో తమ స్పందనను వ్యక్తపరిచారు. చంద్రబాబుపై విమర్శలకు జనం నుంచి అనూహ్యస్పందన వచ్చింది. చోడవరం, మాడుగుల నియోజకవర్గాలతోపాటు జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది సభకు తరలిరావడంతో రోడ్లన్నీ నిండిపోయాయి. జగన్ నినాదంతో సభా ప్రాంతమంతా మారుమోగింది. -
నేడు సమైక్య శంఖారావం
వైఎస్సార్సీపీ అధినేత జగన్ రాక నేడు మధ్యాహ్నం 12.30 గంటలకు విమానాశ్రయానికి.. 3 గంటలకు చోడవరం సభ సాయంత్రం 5కు పాతగాజువాకలో.. విస్తృత స్థాయిలో ఏర్పాట్లు సమైక్య ఉద్యమంలో ఇది మహోజ్వల ఘట్టం. కుత్సితాల చీకట్లను తొలగించుకుని వేయివెల్గులరేడుగా ప్రభవించిన అనంతరం వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలిసారిగా విశాఖ గడ్డపై సమైక్య సమర శంఖం పూరించేందుకు శనివారం రానున్నారు. ఈ సందర్భంగా జనహృదయాధినేతకు ఘన స్వాగతం పలికేందుకు అభిమాన కోటి ఉవ్విళ్లూరుతున్నారు.మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు ఆయన విమానాశ్రయానికి చేరుకుంటారు. జగన్ అక్కడినుంచి నేరుగా చోడవరం పయనమవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు సమైక్య శంఖారావం సభలో ప్రసంగించనున్నారు. చోడవరం నుంచి సాయంత్రం ఐదు గంటలకు గాజువాక చేరుకుంటారు. సమైక్య శంఖారావం సభలో జగన్ ప్రసంగిస్తారు. చోడవరం, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనే చోడవరం, గాజువాక సమైక్య శంఖారావం సభలను విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర పోగ్రాం కో- ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా శాఖ అధ్యక్షుడు చొక్కాకుల వెంకట్రావు పిలుపునిచ్చారు. పార్టీ అధినేత పాల్గొనే సమైక్య శంఖారావం సభ ప్రదేశాన్ని శుక్రవారం వారిద్దరూ పరిశీలించారు. కొత్తూరులోని నాలుగు కూడళ్ల జంక్షన్ వద్ద సభాస్థలిని చూశాక వారు మాట్లాడుతూ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు చోడవరంలో, సాయంత్రం 5 గంటలకు గాజువాకలో జరిగే సభల్లో జగన్మోహన్రెడ్డి పాల్గొంటారని చెప్పారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఆదివారం శ్రీకాకుళం సభలో కూడా పార్టీ అధినేత పాల్గొంటారన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న దృఢనిశ్చయంతో జగన్మోహన్రెడ్డి ఆది నుంచీ పోరాటం చేస్తున్నారని చెప్పారు. సమైక్యవాదులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. సభ నిర్వహణపై సీఈసీ సభ్యుడు పీవీఎస్ఎన్ రాజుతో, సమన్వయకర్తలు బలిరెడ్డి సత్యారావు, బూడి ముత్యాలనాయుడుతో సమీక్షించారు. పార్టీ నాయకుడు కొయ్య ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. -
సమైక్య చాంపియన్ జగనే
వైఎస్సార్సీపీ విద్యార్థి సమైక్య శంఖారావంలో వక్తలు కిరణ్ , చంద్రబాబు నాటకాలాడుతున్నారని విమర్శ సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో సమైక్యం కోసం శాయశక్తులా కృషిచేస్తున్నది వైఎస్ జగనేనని... ఆయనే సమైక్య చాంపియన్ అని వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ నాగిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, విజయవాడ నగర అధ్యక్షుడు జలీల్‌ఖాన్ స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ విద్యార్థి సమైక్య శంఖారావం సభ బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది. ముందుగా తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి సమైక్య నినాదాలు చేశారు. ఈ సభకు జిల్లా విద్యార్థి జేఏసీ నాయకుడు అంజిరెడ్డి అధ్యక్షత వహించారు. సభలో నాగిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విభజన ముసుగులో సమైక్యం అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విభజన వాదమా? సమైక్యమా? అనే విషయాన్ని ఇప్పటికీ స్పష్టంగా చెప్పలేకపోతున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఒక్కరే సమైక్యం కోసం పోరాటం చేస్తున్నారని చెప్పారు. 1969లో చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు నాటి ప్రధాని ఇందిర ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. వేర్పాటువాదాన్ని ఆమె ప్రోత్సహించలేదన్నారు. వైఎస్సార్సీపీ ఏనాడూ విభజన కోరలేదని, కేవలం కన్నతండ్రిలా న్యాయం చేయాలని మాత్రమే సూచించిందని వివరించారు. సమైక్యంగా ఉంటేనే హైదరాబాద్‌లో అవకాశాలు... పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే హైదరాబాద్‌లో అందరికీ అవకాశాలు దొరుకుతాయని చెప్పారు. సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు జరగాలని వైఎస్సార్సీపీ కోరుకుంటోందన్నారు. సమైక్యం కోసం జగన్మోహన్రెడ్డి దీక్ష చేసిన విషయాన్ని గుర్తుచేశారు. విద్యార్థులకు భవిష్యత్తు ఇచ్చింది వైఎస్సేనన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటుతో లక్షలాది మంది విద్యార్థులు లబ్ధి పొందారన్నారు. పార్టీ నగర అధ్యక్షుడు జలీల్‌ఖాన్ మాట్లాడుతూ విభజనకు బీజం వేసింది కాంగ్రెస్ పార్టీయేనని చెప్పారు. చిన్న రాష్ట్రాలుంటే కేంద్రం లెక్కచేయదన్నారు. సమన్వయకర్తలు పి.గౌతంరెడ్డి, పడమటి సురేష్‌బాబు మాట్లాడుతూ విద్యార్థులతోనే రాజకీయాల్లో మార్పులు వస్తాయన్నారు. జగన్మోహన్రెడ్డితో విద్యార్థులు కలిసి రావాలన్నారు. ఎల్కేజీ నుంచి పీజీ వరకు అందరికీ ఉచిత విద్య అందిస్తానని జగన్మోహన్రెడ్డి చెప్పారని గుర్తుచేశారు. నగర మాజీ మేయర్ తాడి శకుంతల, వాణిజ్య విభాగం నాయకుడు కొణిజేటి రమేష్, డాక్టర్ల విభాగం కన్వీనర్ మహబూబ్, నాయకులు కాకర్ల వెంకటరత్నం, రామలింగమూర్తి, ఎం.ఎస్.నారాయణ, నారుమంచి నారాయణ, టి.హేమంతరావు తదితరులు పాల్గొన్నారు. -
దుండగులను శిక్షించాలి
వరదయ్యుపాళెం, న్యూస్‌లైన్: మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు వరదయ్యపాళెం బస్టాండ్ వద్ద శుక్రవారం భారీ ఎత్తున ధర్నా చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభివూనులు వరదయ్యుపాళెం బస్టాండ్ ఆవరణలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనిని సమైక్య శంఖారావం యూత్రలో భాగంగా జనవరి 27న వరదయ్యుపాళెం వచ్చిన వైఎస్ఆర్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. ఇక్కడ జననేతకు అపూర్వ స్వాగతం లభించింది. దీనిని ఓర్వలేని కొందరు గురువారం రాత్రి వైఎస్ఆర్ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. విగ్రహం ఎడవు చేతిని విరిచి దూరంగా పడేశారు. దిమ్మెను పాక్షికంగా ధ్వంసం చేశారు. వైఎస్ఆర్సీపీ నేతల ధర్నా విగ్రహం ధ్వంసం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సత్యవేడు నియోజకవర్గ సవున్వయుకర్త ఆదివుూలం, పార్టీ కార్మిక విభాగం అధ్యక్షుడు బీరేంద్ర వర్మల నేతృత్వంలో పార్టీ వుండల నేతలు, స్థానికులు వైఎస్ఆర్ విగ్రహం వద్ద శుక్రవారం ధర్నాకు దిగారు. విగ్రహ ధ్వంసాన్ని పిరికిపందల చర్యగా ఆదిమూలం అభివర్ణించారు. దుండగులను కఠినంగా శిక్షించాలంటూ వరదయ్యుపాళెం ఎస్ఐ వంశీధర్‌కు ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో నేతలు ఆందోళన విరమించారు. విగ్రహాన్ని బాగుచేయించారు వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం అభిమానులకు తీవ్ర మనస్థాపం కలిగించింది. శుక్రవారం మధ్యాహ్నం నిపుణులను పిలిపించి విగ్రహాన్ని బాగుచేయించారు. తర్వాత పాలాభిషేకం చేశారు. నాయకులు మాట్లాడుతూ ప్రజల హృదయాల్లో కొలువై ఉన్న వైఎస్ఆర్ రూపాన్ని ఎవరూ చెరపలేరన్నారు. ఈ కార్యక్రవుంలో వైఎస్ఆర్సీపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త ఆదివుూలం, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు బీరేంద్ర వర్మ, పార్టీ వుండల కన్వీనర్ సుబ్రవుణ్యం రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు వెంకట కృష్ణయ్యు, కడూరు సహకార బ్యాంకు అధ్యక్షుడు హరిబాబు రెడ్డి, సర్పంచ్ల సంఘం వుండల అధ్యక్షుడు తిలక్ బాబు, నేతలు దామోదర్ రెడ్డి, చిన్న, డిబి, చంద్రారెడ్డి, విజయ్ రెడ్డి, చిన్న వెంకటయ్యు, శ్రీనివాసుల రెడ్డి, వుహిళా కన్వీనర్ ధనలక్ష్మి, యుూత్ నేతలు సందీప్(నాని) రెడ్డి, వుహేంద్ర, వుహేష్, తులసి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మార్మోగిన సమైక్యవాణి
అలుపెరుగని జననేత పర్యటన సమైక్యశంఖారావం యాత్ర విజయవంతం ఆప్యాయపలకరింత... కష్టాలపై భరోసా అన్ని వర్గాలతో మమేకం జిల్లాలో వైఎస్.జగన్మోహన్రెడ్డి ఓదార్పు, సమైక్య శంఖారావం యాత్ర క్షణం తీరిక లేకుండా సూర్యుడితో పోటీపడుతూ సాగింది. సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసం శంఖాన్ని పూరించిన జగన్ ‘ఈ రాష్ట్రాన్ని విభజించేందుకు మీరు ఒప్పుకుంటారా..’ అని జనాన్ని ప్రశ్నిస్తూ.. వారితో ‘నో..’ అన్న సమాధానాన్ని ఓ పదునైన నినాదంగా మలుస్తూ ముందుకు సాగారు. సాక్షి ప్రత్యేక ప్రతినిధి: జిల్లాలో నాలుగు విడతలుగా సాగిన ఓదార్పు, సమైక్య శంఖారావం యాత్ర శుక్రవారంతో ముగి సింది. తనకోసం రోడ్డుపైకి వచ్చిన ఏ అవ్వా, తాతా నొచ్చుకోకూడదు.. ఏ అక్కా, చెల్లీ చిన్నబుచ్చుకోకూడదు.. నన్ను పలుకరించకుండా వెళ్లిపోయాడే అని ఏ చిన్నారీ బుంగమూతి పెట్టుకోకూడదన్న పట్టింపు., పట్టుదల జగన్మోహన్రెడ్డిలో కనిపించాయి. అడుగడుగునా అభిమానంతో తరలివచ్చిన జనానికి ఓ ఆప్యాయ పలకరింత, ఓ అనురాగ స్పర్శ, అవ్వా తాతలకు నుదిటిపై ప్రేమానురాగాల చుంబనం., చిన్నారుల సంబరానికి తన సంతకాన్ని కానుకగా ఇస్తూ... ముందుకు సాగారు. చిన్న చిన్న గ్రామాల్లో దివంగత నేత విగ్రహావిష్కరణల సందర్భంగా కూడా ఉపన్యాసాన్ని ప్రజలకు కృతజ్ఞత తెలిపేందుకే పరిమితం చేసి, వేదిక దిగి అక్క చెల్లెళ్లు, అవ్వాతాతల మధ్యకు వెళ్లి వారి కష్టసుఖాలడిగి.. మరో నాలుగు నెలలు ఓపిక పట్టండి.. రాజన్న సువర్ణయుగం మళ్లీ వస్తుందంటూ భరోసా ఇచ్చారు. ఓ చిన్న ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఎంత ఖర్చవుతుంది ? ఇందిరమ్మ ఇంటికోసం ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న డబ్బు సరిపోతుందా ? ఇంటి ప్లాను ఎలా ఉండాలి ? ఇత్యాది సూక్ష్మమైన అంశాలన్నిటిపై ఇటీవల స్థానిక నేతలను జగన్ ఆరాతీశారు. రోడ్డుకిరువైపులా తనకోసం వచ్చి నిలుచున్న జనంలోకి వెళ్లి.. వాళ్ల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. మీ ఇబ్బందులు పోవాలంటే రాబోయే ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందో మీరే చెప్పండి అని జనాన్ని అడిగారు. క్లుప్తమైన ప్రశ్నలు వేస్తూ.. వారిచ్చే సుదీర్ఘ సమాధానాలను శ్రద్ధగా ఆలకించారు. సన్న చిన్న కారు రైతులు, రైతు కూలీలు, విద్యార్థులు, వృద్ధులు, వికలాంగులు, కార్మికులు.. ఇలా అన్ని వర్గాల ప్రజల జీవితానుభవాల లోతుల్లోకి చూసే ప్రయత్నం చేశా రు. పేదల సమస్యల పరిష్కారానికి వైఎస్ఆర్ సీపీ ఇప్పటికే ప్రకటించిన పథకాలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దడం ఎలా ? ఈ ప్రశ్నకు సమాధానాన్ని ‘మేథావుల’ చర్చల్లో కాకుండా సామాన్యుని జీవిత అనుభవం నుంచి తెలుసుకోవాలన్న తపన ఆయనలో కనిపించింది. రైతుల గానుగల వద్దకు వెళ్లారు. మరమగ్గాల కార్మికులను పలకరించారు. వలస కూలీల వెతలను ఓపిగ్గా ఆలకించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం పెద్ద ఎత్తున జనాభిప్రాయాన్ని సమీకరిస్తూ, ఇతర జిల్లాల నుంచి తరలి వస్తున్న ‘ఆశావహు’లతో సంభాషిస్తూ.. సమాధానపరుస్తూ.. మరో వైపు పేదల జీవితాల బాగుకు మరింత మెరుగైన పాలన ఎలా అందివ్వగలమన్న సమాచారాన్ని ఆ ప్రజల నుంచే తెలుసుకుంటూ జగన్ యాత్ర సాగింది. -
చంద్రగిరి నియోజకవర్గంలో ఘనస్వాగతం
చంద్రగిరి నియోజకవర్గం లో ఓదార్పు, సమైక్య యాత్రకు విచ్చేసిన వైఎస్.జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగతం లభించిం ది. వైఎస్ఆర్సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తిరుపతి రూరల్, చంద్రగిరి, ఎర్రావారిపాళెం, చిన్నగొట్టిగల్లు, రామచంద్రాపురం మండలాల నుంచి వచ్చిన నాయకులు దామినేడు వద్ద ఘన స్వాగతం పలికారు. వీరిలో నాయకులు ఉపేందర్‌రెడ్డి, చిన్నియాదవ్, బ్రహ్మానందరెడ్డి, చంద్రారెడ్డి, రుద్రగోపి, శివశంకర్, ఎంపీటీసీ మాజీ సభ్యులు సుబ్రమణ్యం, మాధవరెడ్డి, అవిలాల లోక తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున బాణసంచా పేల్చారు. సభ అనంతరం జననేత తిరుచానూరు క్రాస్, అవిలాల క్రాస్, అవి లాల, ఎంఆర్‌పల్లె పోలీస్ స్టేషన్, వైకుంఠపురం ఆర్చి సెంటర్ మీదుగా తుమ్మలగుంటలోని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇంటికి రాత్రి బసకు చేరుకున్నారు. అవిలాలలో మహానేత వైఎస్ఆర్ విగ్ర హాన్ని ఆవిష్కరించారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినా ప్రజలు ప ట్టుదలతో మహానేత విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉం దన్నారు. ప్రతి ఒక్కరినీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పర్యటనలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్ఆర్సీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి, తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు వరప్రసాద్, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, యువత కన్వీనర్ ఉదయ్‌కుమార్, చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త ఏఎస్.మనోహర్, ఆర్టీసీ వైఎస్ఆర్టీయూసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి లతారెడ్డి, శ్రీకాళహస్తి నియోజకవర్గ పార్టీ నాయకులు మల్లం రవిచంద్రారెడ్డి, నాయకులు వై.సురేష్, విరూపాక్షి జయచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జగన్ వెంటే జనం
-
పులకించిన పల్లెలు
8వ రోజూ సమైక్య, ఓదార్పుయాత్రకు అపూర్వ స్పందన ఎస్.ఎస్.పురంలో ఓదార్పులో పాల్గొన్న వై.ఎస్.జగన్ ఆరు గ్రామాల్లో మహానేత విగ్రహాల ఆవిష్కరణ {పభుత్వం వచ్చిన వెంటనే పావలా వడ్డీ విడుదల టీపీ కోట మహబూబ్ సుభానీ దర్గాలో ప్రార్థనలు ఓబులరాజుకండ్రిగలో జగన్‌కు ఘన స్వాగతం జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి అడుగడుగునా అఖండ స్వాగతం లభించింది. మారుమూల పల్లెల్లో కూడా జనం ఆయనను చూడడానికి బారులుతీరారు. నాలుగు నెలల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వృద్ధాప్య పింఛన్ మొత్తాన్ని పెంచుతామని జననేత ప్రజలకు హామీ ఇచ్చారు. జిల్లాలో నిర్వహిస్తున్న నాలుగో విడత సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్రకు ఎనిమిదో రోజు సోమవారమూ విశేష స్పందన లభించింది. సత్యవేడు నియోజకవర్గంలోని నాగలాపురం, సత్యవేడు, వరదయ్యపాళెం మండలాల్లో సమైక్య శంఖారావం యాత్ర నిర్వహించారు. సత్యవేడు, న్యూస్‌లైన్: వైఎస్ఆర్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఎనిమిదో రోజు సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర నాగలాపురం మండలంలోని రాజులకండ్రిగ నుంచి ప్రారంభమైంది. మధ్యలో వడ్డిపాళెంలో మహిళలను, గ్రామస్తులను పలకరిస్తూ రోడ్‌షో నిర్వహిస్తూ ముందుకు సాగారు. ఈ గ్రామంలోనే రెండు చోట్ల ప్రజలు జగన్‌ను ఆపి స్వాగతం పలికారు. వడ్డిపాళెం మీదుగా రోడ్ షోగా బయల్దేరి ఓదార్పులో పాల్గొనేందుకు ఎస్.ఎస్.పురం చేరుకున్న వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఈ గ్రామంలో మహానేత వై.ఎస్.రాజశేఖర రెడ్డి అకాలమరణాన్ని తట్టుకోలేక ఆయన అభిమాని బాలపల్లి సుబ్బమ్మ మృతిచెందింది. బాధిత కుటుం బాన్ని జగన్ ఓదార్చారు. వారికి అన్నివిధాలా అండ గా ఉంటానని భరోసా ఇచ్చారు. అంతకుముందు గ్రామంలో రోడ్లపై రంగవల్లులు వేసి పులివెందుల పులిబిడ్డకు స్వాగతం అని రాశారు. ఇక్కడ హైదరాబాద్ ఓక్కుడోలు వాయిద్యాలు వాయిస్తూ నృత్యకారులు నాట్యం చేయడం చూపరులను ఆకట్టుకుంది. గ్రామాల్లో జననీరాజనం రోడ్ షోలో భాగంగా దామకండ్రిగలో వై.ఎస్.జగన్ కాన్వాయ్‌ను మహిళలు ఆపి స్వాగతం పలికారు. కాన్వాయ్ వెళుతుండగా యువకులు మోటారు సైకిళ్లపై వెంటవస్తూ జగన్‌ను చూసేందుకు పోటీపడ్డారు. జానికాపురం వద్ద మహిళలు జగన్‌ను పలకరించా రు. తమ సమస్యలు తెలియజేశారు. జానికాపురం క్రాస్‌లో వైఎస్ఆర్ జిల్లాకు చెందిన నేతలు జననేతను కలిశారు. అనంతరం వజ్జావారికండ్రిగకు చేరుకున్న వై.ఎస్.జగన్ రోడ్‌షో నిర్వహించారు. ఇక్కడ మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో బారులుతీరి తమ అభిమాన నాయకుడికి ఆహ్వానం పలికారు. జగన్ ప్రతి ఒక్కరినీ పలకరించి వారి సమస్యలు ఓపికగా విన్నారు. కడివేడు గ్రామంలో మహిళలను పలకరిం చి కారు నుంచే అభివాదం చేస్తూ వెళ్లారు. ఈ గ్రామం లో కమలమ్మ అనే వృద్ధురాలు తనకు వస్తున్న పింఛన్ చాలడం లేదని, కుటుంబం పేదరికంలో ఉందని జగన్ దృష్టికి తెచ్చారు. నాలుగు నెలల్లో తమ ప్రభుత్వం రాగానే వృద్ధుల పింఛన్ పెంచుతామని ఆయన భరోసా ఇచ్చారు. ఇదే గ్రామంలో గిరిజ అనే మహిళ తన భర్త చనిపోయాడని, తనకు ఒకే కిడ్నీ ఉందని ఆర్థికసాయం చేయాలని జననేత వద్ద కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో చలించిన వై.ఎస్.జగన్ ఆమెను ఓదార్చారు. సాయం చేయాల్సిందిగా తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు వరప్రసాద్‌కు సూచించారు. వరప్రసాద్ ఆ మహిళతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పావలా వడ్డీని విడుదల చేస్తాం కడివేడు గ్రామంలో మహిళలు పెద్ద ఎత్తున జననేతకు స్వాగతం పలికారు. గ్రామంలోని మహిళలందరూ వరుసలో నిలబడి జగన్‌ను కలుసుకున్నారు. రుణాల మొత్తం చెల్లించినా పావలా వడ్డీ డబ్బులు తిరిగి ప్రభుత్వం జమ చేయడం లేదని మహిళలు జగన్ దృష్టికి తెచ్చారు. ఆయన స్పందిస్తూ నాలుగు నెలల్లో మన ప్రభుత్వం వస్తుందని, మహిళా తల్లులకు రావాల్సిన పావలావడ్డీని పూర్తిగా వెంటనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. కడివేడులో వై.ఎస్.జగన్ రోడ్‌షోలో పాల్గొన్న విద్యార్థులు, కొందరు మహిళలు ఆయన ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. మహానేత విగ్రహావిష్కరణ బీరకుప్పం శివార్లలోనే గ్రామస్తులు బాణసంచా కాలుస్తూ, డప్పులు వాయిస్తూ, నృత్యాలు చేస్తూ తమ అభిమాన నాయకుడికి ఘనస్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు పలికారు. పాఠశాల విద్యార్థులూ జగన్‌ను చూసేందుకు వేచి ఉండడం కనిపించింది. బీరకుప్పంలో మహానేత వై.ఎస్.రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని జననేత ఆవిష్కరించారు. వేదిక సమీపంలో ఎన్నికల గుర్తు ఫ్యాను వేలాడదీశారు. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు మిద్దెలపైకి ఎక్కి నిలబడ్డారు. గ్రామస్తులు శాలువలతో జగన్‌ను సత్కరించారు. వరదయ్యపాళెం మండలంలో.. జననేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రోడ్‌షో వరదయ్యపాళెం మండల సరిహద్దు అంబికాపురం చేరుకోగానే మండల పార్టీ నాయకులు, సర్పంచులు, అభిమానులు భారీ ఎత్తున స్వాగతం పలికారు. తొండంబట్టు గ్రామంలో బాణసంచా కాలుస్తూ, నృత్యం చేస్తూ ర్యాలీగా గ్రామంలోకి వై.ఎస్.జగన్‌ను ఆహ్వానించారు. ఇక్కడ మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కప్పడుతాగేళిలోనూ జననేత పెద్ద సంఖ్యలో వేచి ఉన్న మహిళలను ఆప్యాయంగా పలకరించారు. అక్కడ నుంచి పెద్దపాండూరు చేరుకుని మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. రోడ్‌షో నిర్వహిస్తూ వెంగారెడ్డి కండ్రిగ, చెన్నావారిపాళ్యంలో ప్రజలను పలకరించారు. చీకట్లో, చలిలో సైతం జనం జగన్ కోసం వేచి ఉండడం కనిపించింది. అక్కడ నుంచి జగన్ వరదయ్యపాళెంలో రోడ్‌షో నిర్వహించారు. ఇక్కడ స్థానికులు బాణసంచా కాలుస్తూ, డప్పులు వాయిస్తూ జననేతకు ఘన స్వాగతం పలికారు. కాన్వాయ్ వెంట యువకులు పరుగులు తీశారు. బస్టాండ్ సెంటర్ వరకు రోడ్ షో నిర్వహించిన అనంతరం మహానేత వై.ఎస్.రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. తర్వాత బహిరంగసభలో ప్రసంగించారు. అనంతరం బీఎన్‌కండ్రిగ మండలం నీర్పాకోట గ్రామంలోని వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ విద్యానాథరెడ్డి ఇంట్లో రాత్రి బస చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం, మాజీ ఎమ్మెల్యేలు అమరనాథరెడ్డి, ఎ.ఎస్.మనోహర్, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, యువత కన్వీనర్ ఉదయకుమార్, కార్మికవర్గ కన్వీనర్ బీరేంద్ర వర్మ, నాగలాపురం మండల కన్వీనర్ అపరంజిరాజు, జిల్లా మహిళా కన్వీనర్ గాయత్రీదేవి, పార్టీ స్టీరింగ్ కమిటీ సభ్యులు చిన్నదొరై, నాయకులు విరూపాక్షి జయచంద్రారెడ్డి తదితరులు పాల్గొనారు. -
నేడు జగన్ పర్యటన ఇలా..
సాక్షి, చిత్తూరు: వైఎస్సాఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి నాలుగో విడత సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర ఎనిమిదవరోజు సోమవారం సత్యవేడు నియోజకవర్గంలో సాగుతుందని ఆ పార్టీ ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ కె.నారాయణస్వామి వెల్లడించారు. సోమవారం ఉదయం రాజులకండ్రిగ నుంచి యాత్ర ప్రారంభం అవుతుంది. ఎస్ఎస్. పురంలో బాలపల్లి సుబ్బమ్మ కుటుంబాన్ని ఓదారుస్తారు. జనకపురం క్రాస్, కడివేడుల్లో రోడ్‌షో. బీరకుప్పంలో మహానేత వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. టీపీకోటలో రోడ్‌షో టీపీపాళెంలో మహానేత వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆనందపురం ఎస్టీకాలనీ, ఓబులరాజు కండ్రిగ, పీవీపురం, చమర్తికండ్రిగ, ముఠపాళెం, ఆర్జీపురం ఎస్సీ కాలనీల్లో రోడ్‌షో రాజగోపాలపురంలో మహానేత వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అంబికాపురం, తొడింబేడు, వడ్డిపాళెంలో రోడ్‌షో. పెద్దపాండూరులో మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. వెంగారెడ్డి కండ్రిగ, చిన్నవారిపాళెం రోడ్‌షో. వరదయ్యపాళెంలో మహానేత వైఎస్ఆర్ విగ్రహం ఆవిష్కణ, బహిరంగ సభ. -
ప్రజల గుండెల్లో వైఎస్ఆర్
వైఎస్ఆర్ సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నాలుగో విడత సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర ఏడో రోజు ఆదివారం నగరి, సత్యవేడు నియోజకవర్గాల్లో సాగింది. జననేతకు గ్రామగ్రామాన జనం అపూర్వ స్వాగతం పలికారు. నగరి నియోజకవర్గంలోని విజయపురం, నిండ్ర మండలాల్లో, సత్యవేడు నియోజకవర్గంలోని పిచ్చాటూరు, సత్యవేడు, నాగలాపురం మండలాల్లో జగన్మోహన్రెడ్డి రోడ్‌షో నిర్వహించారు. పన్నూరు సబ్‌స్టేషన్, నిండ్ర, కొప్పేడు, పిచ్చాటూరు, నాగలాపురంలో మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఆవిష్కరించారు. ప్రజల గుండెల్లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నారని, పేదరికమనే జబ్బును నయం చేయడానికి నిరంతర కృషి చేసిన వైద్యుడు ఆయనని జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. సాక్షి, సత్యవేడు: విజయపురం మండలంలోని సూరికాపురం నుంచి ఆదివారం ఉద యం 9.30 గంటలకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి యా త్రను ప్రారంభించారు. అదే గ్రామం లో తన కోసం వేచి ఉన్న ప్రజలను కలుసుకున్నారు. మహిళలతో ముచ్చటించారు. సూరికాపురం ప్రాథమిక పాఠశాలలో జరిగిన గణతంత్ర దినోత్సవంలో పాల్గొన్నారు. గాంధీ, నెహ్రూ ఫొటోలవద్ద నివాళులర్పించా రు. విద్యార్థులను పలకరించారు. అక్క డ నుంచి జగన్నాథపురం వరకు రోడ్ షో నిర్వహించారు. మాధవరం గ్రామంలోనే మూడుచోట్ల మహిళలు జగన్‌ను ఆపి చూసేందుకు పోటీ పడ్డా రు. ఆయన అందరినీ పలకరించడం తో సంతోషంగా వెనుదిరిగారు. ఈ గ్రామంలో వెంగమ్మ అనే వృద్ధురాలిని జననేత పలకరించారు. తనకు పింఛన్ రావడం లేదని ఆమె జగన్ దృష్టికి తెచ్చింది. ఇక్కడే విద్యార్థులను పలకరించారు. పన్నూరు దళితవాడలో చర్చిలోకి వెళ్లి ప్రార్థనలు చేశారు. చర్చి ఫాదర్ ఇక్కడ తమిళంలో ప్రార్థనలు వినిపించారు. తన కోసం వేచి ఉన్న మహిళలను జగన్ కలిశారు. ఈ గ్రా మంలో సర్పంచ్ పి.లక్ష్మి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ తోరణాలు, ఫ్లెక్సీలు ఏ ర్పాటుచేసి భారీగా స్వాగతం పలికా రు. పన్నూరు గ్రామంలోనూ మూడు చోట్ల ప్రజలు జగన్మోహన్రెడ్డిని ఆపి మాట్లాడారు. రైతులు జననేతను కలిసి సమస్యలు తెలియజేశారు. యువకులు జననేతను చూసేందుకు మిద్దెలపైకి ఎక్కి నిలబడ్డారు. పులివెందుల పులిబిడ్డ జగన్ నాయకత్వం వర్థిల్లాలి, జగనన్న గుర్తు ఫ్యాను గుర్తు అంటూ యువకులు పదేపదే నినాదాలు చేశారు. ఈ ఊర్లోనే ఇళ్లత్తూరుకు చెందిన చిరంజీవి అనే వికలాంగుడిని ఆయన పలకరించారు. విద్యుత్‌షాక్‌తో చేయి కోల్పోయానని ఆ యువకుడు తెలిపాడు. పింఛన్ వస్తోందా అని ఆరా తీశారు. పన్నూరు సబ్‌స్టేషన్ వెళ్లే దారి లో హైదరాబాద్ నుంచి వచ్చిన 15 మంది ఏపీ ప్రయివేటు బస్సు ఆపరేటర్ల సంఘం నాయకులు కలిసి తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. మహానేత విగ్రహావిష్కరణ పన్నూరు సబ్‌స్టేషన్ వద్ద పెద్ద సంఖ్యలో మహిళలు కాన్వాయ్‌ను నిలిపేసి జననేతకు స్వాగతం పలికా రు. తమ అభిమాన నాయకుడి నుంచి ఆశీర్వాదం అందుకున్నారు. పన్నూరు సబ్‌స్టేషన్ రోడ్డు జంక్షన్లో మహానేత రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇక్కడ ఒక అభిమాని వీర ఖడ్గం బహూకరించారు. దానిని అభిమానుల కోసం జగన్మోహన్రెడ్డి ఒకసారి గాలిలో తిప్పారు. విగ్రహావిష్కరణకు విచ్చేసిన జనంతో పన్నూరు సబ్‌స్టేషన్ కూడలి కిక్కిరిసింది. స్థలం సరిపోకపోవడంతో జనం ముఖ్యంగా మహిళలు మిద్దెలపైకి, భవంతులపైకి ఎక్కి జగన్‌ను చూడడం కనిపించింది. ప్రజలు జగన్ మాట్లాడాలని పదేపదే విజ్ఞప్తి చేశారు. మైక్ లేదని తెలుపుతూ సైగలు చేస్తూ ఆయన రోడ్‌షో కొనసాగించారు. అక్కడ నుంచి యల్లసముద్రం వరకు రోడ్ షో జరిగింది. గ్రామస్తులు ఇక్కడ సమైక్య సింహం వై.ఎస్.జగన్ అంటూ ఫ్లెక్సీలు పెట్టడం అందరినీ ఆకర్షించింది. చర్చిలో ప్రార్థనలు నిండ్ర గ్రామం చేరుకుని మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. గ్రామంలోని చర్చికెళ్లి ప్రార్థనలు చేశారు. ఇక్కడ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ పేదరికానికి వైద్యం చేసిన డాక్టర్ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు. ఆయన సువర్ణపాలనలో పేదల కోసం ఎన్నె న్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. అంతకుముందు నిండ్ర శివార్ల నుంచి డప్పులు వాయిస్తూ, నృత్యాలు చేస్తూ జగన్‌కు ప్రజలు స్వాగతం పలికారు. అక్కడ నుంచి షుగర్ ఫ్యాక్టరీ గేటు, ఉద్యోగుల క్వార్టర్స వద్ద జరిగిన రోడ్‌షోలో జనాన్ని జగన్ పలకరించారు. తర్వాత నిండ్ర మండలంలోని కొప్పేడు గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలో మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మధ్యాహ్నం పార్టీ స్టీరింగ్ కమిటీ నాయకులు రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఇంట్లో భోజనం చేశారు. అనంతరం బయల్దేరి సత్యవేడు నియోజకవర్గం చేరుకున్నారు. -
నేడు జననేత పర్యటన ఇలా..
సాక్షి, చిత్తూరు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నాలుగో విడత సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర ఏడవరోజు ఆదివారం నగరి, సత్యవేడు నియోజకవర్గాల్లో సాగుతుందని ఆ పార్టీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ కె.నారాయణస్వామి వెల్లడించారు. ఆదివారం ఉదయం విజయపురం మండలం సూరికాపురం నుంచి యాత్ర ప్రారంభం అవుతుంది. నిండ్ర మండలం పన్నూరు సబ్‌స్టేషన్ వద్ద మహానేత వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మాధవరంలో మహానేత వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆళ్లపాకం క్రాస్, కమ్మకండ్రిగ క్రాస్, 9వ మైలు, నిండ్ర, షుగర్ ఫ్యాక్టరీ మీదుగా రోడ్‌షో కొప్పేడుకు చేరుకుంటుంది. కొప్పేడులో మహానేత వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలం కీర్లపూ డిలో మహానేత వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. పిచ్చాటూరులో బహిరంగ సభ అప్పంబట్టు, రామగిరి, కృష్ణాపురంల్లో రోడ్‌షో నాగలాపురంలో మహానేత వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. వడలకుప్పం, వెల్లూరులో రోడ్ షో ఎస్ఎస్ పురంలో ఓదార్పు. ఓబులరాజుల కండ్రిగలో పార్టీ జిల్లా కార్మికవర్గ విభాగం కన్వీనర్ బీరేంద్ర ఇంట్లో బస చేస్తారు. -
వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన జగన్
చిత్తూరు : చిత్తూరు జిల్లాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం ఆయన తన యాత్రను ముసలయ్యాగారి పల్లె నుంచి ప్రారంభించారు. అభిమానుల కోలాహలం మధ్య మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. పల్లెప్రజలు చూపించిన ప్రేమానురాగాలకు జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ్టి యాత్ర గంగాధర నెల్లూరు, నగరి నియోజకవర్గాల్లో సాగనుంది. వీర్లగుడి ఎస్సీ కాలనీలో శిఖామణి సుగానందం కుటుంబాన్ని జగన్ ఓదారుస్తారు. నగరిలో బహిరంగ సభలో ఆయన పాల్గొన్న అక్కడే రాత్రి బస చేస్తారు. -
వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం
రేణిగుంట,న్యూస్‌లైన్: రేణిగుంట విమానాశ్రయంలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డికి గురువారం మధ్యాహ్నం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. జిల్లాలో నాలుగో విడత సమైక్య శంఖారావం, ఓదార్పుయాత్ర పర్యటనలో ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సాయంత్రం హైదరాబాద్‌కు వెళ్లిన విషయం విధితమే. రాత్రి అక్కడ అక్కినేని నాగేశ్వరావుకు నివాళులు అర్పించారు. గురువారం మధ్యాహ్నం హై దరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నా రు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల సమన్వయకర్తలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఆదిమూలం, మహిళా విభా గం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు బీరేంద్రవర్మ, నాయకులు వై.సురేష్, రెడ్డివారి చక్రపాణిరెడ్డి, తిరుపతి పట్టణ కన్వీనర్ పాలగిరి ప్రతాప్‌రెడ్డి, విరూపాక్షి జయచంద్రారెడ్డి, అత్తూరు హరిప్రసాద్‌రెడ్డి, నగరం భాస్కర్‌బాబు, యోగీశ్వర్‌రెడ్డి, షంషేర్, చిన్నారావు, మోహన్‌నాయుడు, మిద్దెల హరి, గుమ్మడి బాలకృష్ణయ్య, కార్యకర్తలు స్వాగతం పలికారు. జగన్మోహన్రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అన్న నినాదాలతో విమానాశ్రయం హోరెత్తింది. అనంతరం ఇక్కడ నుంచి రోడ్డు మార్గంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గ సమైక్య శంఖారావం, ఓదార్పుయాత్రకు బయలుదేరి వెళ్లారు. -
మీ ఆప్యాయత మరువలేను
నాలుగో రోజూ అదే జోరు జగన్‌ను చూసేందుకు జనం పరుగులు జీడీనెల్లూరు నియోజకవర్గంలో ఓదార్పు, సమైక్యయాత్ర వైఎస్సార్ సీపీ ఉచిత మినరల్ ప్లాంట్ ప్రారంభోత్సవం సాక్షి, చిత్తూరు: ‘మీ ఆప్యాయతను మరువ లేను, ఒక రోజు ఆలస్యంగా కార్యక్రమానికి వచ్చినా మీరు చూపిన అభిమానం, ఆప్యాయత, అనురాగానికి వందనం’ అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. గురువారం నాలు గో విడత నాలుగో రోజు ఓదార్పు, సమైక్య శంఖారావం యాత్ర జీడీ నెల్లూరు మండలంలో జరిగింది. హైదరాబాద్ నుంచి విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడ నుంచి జీడీ నెల్లూరు నియోజకవర్గ ఓదార్పు, సమైక్య శంఖారావ యాత్రను కొనసాగించారు. జీడీ నెల్లూరు నియోజకవర్గంలో ఎస్ఆర్.పురం, జీడీనెల్లూరు మండలాల్లో నిర్వహించిన పర్యటనలో జనం జోరు పెరిగింది. కాన్వాయ్ వెంట పరుగులు తీసే యువకులు, ఆటోగ్రాఫ్‌ల కోసం పోటీలు పడిన విద్యార్థిని, విద్యార్థులతో ఆయన పర్యటన ప్రత్యేక ఆకర్షణగా మారింది. కొత్తపల్ల్లె మిట్టలో మహిళలు పెద్దసంఖ్యలో వైఎస్సార్ సీపీ రంగులైన పచ్చ, నీలం, తెలుపు రంగులతో తయారు చేసిన చీరలను ధరించి ఆకట్టుకున్నారు. కొటార్లపల్లెలో మిట్టపల్ల్లె పెద్దబ్బ కుటుంబాన్ని ఓదార్చారు. మధ్యాహ్నం ఎస్ఆర్.పురం మండలం మంగుంట గ్రామం నుంచి ఆయన సమైక్య శంఖారావ యాత్ర, ఓదార్పును ప్రారంభించారు. మంగుంట లో వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రసంగిస్తూ గ్రామస్తులు పెద్దమనస్సుతో ఈ కార్యక్రమం కోసం వేచి ఉండడం వారి ఆప్యాయత, అనురాగాలకు నిదర్శనమన్నారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులతో ముచ్చటించారు. యువకులకు షేక్ హ్యాండ్ ఇచ్చి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. అక్కడ నుంచి అరిమాకులపల్లె చేరుకున్నారు. ఈ పల్లెలో మహిళలు రోడ్డుపైకి వచ్చి జగన్‌ను చూసేందుకు కాన్వాయ్ వద్దకు పరుగులు తీశారు. జగన్ కారుదిగి మహిళలను పలకరించారు. అభిమాన నేతను చూసేందుకు యువకులు బస్టాప్ పైకి ఎక్కి నిలబడ్డారు. జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు 150 మంది తమ అభిమాన నాయకుడి ఆటోగ్రాఫ్ కోసం క్యూలో నిలబడడం కనిపించింది. అక్కడి నుంచి వడ్డిపల్లె చేరుకుని జగన్ రోడ్డుషో నిర్వహించారు. సమీపంలోని పల్లెల నుంచి కూ డా ప్రజలు గంగమ్మగుడి గ్రామం వద్దకు వచ్చి జగన్‌ను చూశారు. మహిళలు చంటి బిడ్డలను తీసుకెళ్లి జగన్ చేతికిచ్చి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అక్కడ నుంచి వడ్డిపల్లెకు చేరుకున్న జగన్మోహన్రెడ్డి రోడ్డుషోలో పాల్గొన్నారు. తన కోసం వేచి ఉన్న గ్రామస్తులకు అభివాదం చేస్తూ పలకరిం చారు. ఇక్కడ పార్టీ గ్రామ కమిటీ ఏర్పాటు చేసిన జెండాను ఆవిష్కరించారు. స్కూల్ పిల్లల్ని పలకరించారు. రోడ్డుపై ఉన్న గొర్రెలకాపరి మహిళలతో మాట్లాడారు. పర్లాంగు దూరం గంట సమయం కొత్తపల్ల్లెమిట్ట శివారులో నడవలేని స్థితిలో ఉన్న మునిలక్ష్మమ్మ అనే వృద్ధురాలిని కుటుంబ సభ్యులు తీసుకొచ్చి రోడ్డుపై కుర్చీలో కూర్చోబెట్టారు. ఆమెను చూసిన జగన్ వాహనం దిగివచ్చారు. అవ్వ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అమెకు పింఛన్ ఇవ్వడం లేదని కుటుంబ సభ్యులు జగన్ దృష్టికి తీసుకొచ్చారు. ఆమెకు పింఛన్ వచ్చేలా చూడాలని పార్టీ నాయకులకు సూచించారు. ఇక్కడే మరొక వికలాంగుడు తనకు కాలు లేదని, ఆదుకోవాలని కోరాడు. త్వరలోనే సమస్యలు పరిష్కారమవుతాయని, పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంటే పార్టీ నాయకులు అధికారులతో మాట్లాడి ఇప్పిస్తారని అన్నారు. అక్కడ నుంచి కొత్తపల్ల్లెమిట్టలో మహిళలు, యువకులు పార్టీ జెండాలను ఊపుతూ ఆపేయడంతో ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ ముందు కు సాగాల్సి వచ్చింది. పర్లాంగు దూరం దాటేందుకు గంటకు పైగా సమయం పట్టింది. కాలేజీ విద్యార్థినులు జగన్ ఆటోగ్రాఫ్ తీసుకునేందుకు పోటీపడ్డారు. అందరికీ ఓపిగ్గా ఆటోగ్రాఫ్ ఇచ్చారు. పార్టీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు విజయానందరెడ్డి ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్సార్ ఉచిత మంచినీటి మినరల్ వాటర్‌ప్లాంట్‌ను ప్రారంభించారు. కొటార్లపల్లెలో ఓదార్పు ఎస్ఆర్.పురం మండలం కొటార్లపల్లెలో వైఎస్.జగన్మోహన్రెడ్డి ఓదార్పులో పాల్గొన్నారు. గ్రామంలో మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి మరణానంతరం మృతి చెందిన మిట్టపల్ల్లె పెద్దబ్బరెడ్డి కుటుంబాన్ని ఓదార్చారు. అక్కడ నుంచి లక్ష్మీరెడ్డిగారిపల్లె చేరుకుని పెద్దసంఖ్యలో వేచి ఉన్న మహిళలను, గ్రామస్తులను పలకరించారు. నెల్లెపల్లె చిన్నమిట్టలో గ్రామస్తులు ఏర్పాటు చేసిన మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎట్టేరి, వీరకనెల్లూరు, మోతరంగనపల్లె, బొమ్మవారిపల్లె క్రాస్, కోటాగారం మీదుగా పల్లెపల్లెకూ కాన్వాయ్ ఆపుతూ జనాన్ని పలకరిస్తూ అభివాదం చేస్తూ చిరునవ్వుతో ముందుకు సాగారు. నెల్లేపల్లె చర్చిలో ప్రార్థనలు చేశారు. వినాయకుడి గుడిలో పూజలు చేశారు. ఎట్టేరిలో పెద్ద ఎత్తున మహిళలు స్వాగతం పలికారు. మోతరంగనపల్లె, బొమ్మావారిపల్లె క్రాసులో చలిమంట వేసుకుని మరీ జననేత కోసం వేచి ఉండడం కనిపించింది. ఎట్టేరి, మోతరంగనపల్లెలో భారీ ఎత్తున బాణసంచా కాల్చారు. బొమ్మావారిపల్లె దాటి ముందుకు రాగానే జైన్ డ్రిప్ ఇరిగేషన్ ఫ్యాక్టరీ సమీపంలో స్థానికులు పార్టీ జెండా పట్టుకుని జగన్‌కు స్వాగతం పలికారు. జీడీ నెల్లూరు శివారు నుంచి బహిరంగ సభ వరకూ కోలాహలంగా రోడ్‌షో సాగింది. జీడీనెల్లూరు సభ ముగిసిన తర్వాత జగన్మోహన్రెడ్డి గొల్లపల్లెకు చేరుకున్నారు. జగన్ వెంట మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా కన్వీనర్, జీడీ నెల్లూరు సమన్వయకర్త కే.నారాయణస్వామి, మాజీ ఎంపీ జ్ఞానేం ద్రరెడి,్డ చంద్రగిరి సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తిరుపతి పార్టీ కన్వీనర్ పాలగిరి ప్రతాప్‌రెడ్డి, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, మహిళ కన్వీనర్ గాయత్రీదేవి, యువత కన్వీనర్ ఉదయ్‌కుమార్, వైఎస్సార్సీపీ కార్మికవర్గ విభాగం కన్వీనర్ బీరేంద్రవర్మ, పార్టీ నాయకులు వై.సురేష్, విరూపాక్ష జయచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
జనం.. జనం
మూడవరోజూ అదే ఉత్సాహం జననేతను చూసేందుకు పరుగులు తీసిన జనం జీడీ నెల్లూరు నియోజకవర్గంలో ఓదార్పు, సమైక్యయాత్ర జగన్ బొమ్మలతో టీషర్టులు, బెలూన్లతో ప్రచారం సాక్షి, చిత్తూరు: గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో బుధవారం జరిగిన సమైక్య శంఖారావం యాత్రలో జననేతకు అఖండ స్వాగతం లభించింది. మూడవరోజు కొత్తపల్లిమిట్టలో జరిగిన నాలుగో విడత సమైక్య శంఖారావం యాత్రలో ఆయన పాల్గొన్నారు. దారి పొడవునా తమ అభిమాన నాయకుడికి స్వాగత ద్వారాలు ఏర్పాటు చేసి వైఎస్సార్సీపీ జీడీ నెల్లూరు నాయకులు ఆహ్వానం పలికారు. ఇందులో సమైక్య సింహానికి స్వాగతం అని రాయడం చూపరులను ఆకర్షించింది. కొత్తపల్లిమిట్టలో జరిగిన బహిరంగసభా వేదిక వద్ద వై.ఎస్.జగన్ ఫొటోలతో గాలిలోకి ఎగురవేసిన బెలూన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇలా పర్యటన జననేత వై.ఎస్.జగన్ బుధవారం నెలవాయి గ్రామం నుంచి బయల్దేరి క్షీరసముద్రం చేరుకుని రోడ్‌షోలో పాల్గొన్నారు. ఇక్కడ అభిమానులు, కార్యకర్తలు బాణసంచా కాలుస్తూ, నృత్యాలు చేస్తూ తమ అభిమాన నాయకుడిని ఆహ్వానించారు. అక్కడ నుంచి కొద్దిగా ముందుకు రాగానే రోడ్డు పక్కన తన కోసం వేచి ఉన్న పులివెందుల వైఎస్సార్ సీపీ నాయకులను జగన్మోహన్రెడ్డి పలకరించా రు. క్షీరసముద్రం ఎస్సీ కాలనీలో వాహనం దిగి ప్రతి ఒక్క మహిళనూ పలకరిస్తూ, ఆశీర్వదిస్తూ సాగారు. చిన్నారులను ఆప్యాయంగా ముద్దు పెట్టుకుని దీవించారు. తమ గ్రామానికి విచ్చేసిన జగన్మోహన్రెడ్డిని చూసేందుకు మ హిళలు కాన్వాయ్ వద్దకు పరుగులు తీశారు. నాయుడుపల్లె వద్ద జగన్ ఫొటో ఉన్న టీషర్టులను ధరించిన యువకులు ట్రాక్టర్లలో ఎదురొచ్చి స్వాగతించారు. ఎస్ఆర్ పురం, ఎస్ఆర్ పురం క్రాస్‌లో రెండువేల మందికి పైగా గ్రామస్తులు, ముఖ్యంగా మహిళలు చంటి బిడ్డలను ఎత్తుకుని ఎండలో ప్రియతమ నేత కోసం రోడ్డుకు ఇరువైపులా వేచి ఉండడం కని పించింది. ఇక్కడ జననేత వాహనం దిగి ప్రతి ఒక్కరినీ పలకరించారు. చిన్నారులకు నామకరణం ఎస్ఆర్ పురం క్రాస్ నుంచి పుల్లూరు క్రాస్ చేరుకుని జగన్మోహన్రెడ్డి రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ గ్రా మంలో మహిళలు తమ నాయకుడికి మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ ఊర్లో ఒక మహిళ తన ఇద్దరు ఆడపిల్లలను జగన్ చేతుల్లో ఉంచి నామకరణం చేయాలని కోరారు. ఆయన వారిద్దరికి విజ యమ్మ అని నామకరణం చేశారు. శూలగిల్లులో పార్టీ జెండాను జగన్ ఆవిష్కరించారు. కార్యకర్తలు, గ్రామస్తులను పలకరించారు. జగన్ బొమ్మలతో రూ పొందించిన టీషర్టులు ధరించిన వైఎస్సార్ సీపీ కా ర్యకర్తలు, యువకులు కాన్వాయ్ వెంట సాగారు. శూలగిల్లులో చెరుకు రైతులతో జననేత మాట్లాడారు. వారు చెప్పిన సమస్యలు ఓపిగ్గా విన్నారు. అక్కడ నుంచి తెల్లగుండపల్లె చేరుకుని ఓదార్పులో పాల్గొన్నారు. మహానేత వైఎస్ మరణం తట్టుకోలేక మృతి చెందిన పోతగంటి నరసయ్య కుటుంబాన్ని ఓదార్చారు. వారికి అండగా ఉంటానని, అన్ని విధాలా ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. అక్కడ నుంచి ఎన్ఆర్.పురం, ఎన్.ఆర్‌పురం ఎస్సీ కాలనీల మీ దు గా రోడ్‌షో నిర్వహించారు. దళితులను, గిరిజనులను పలకరిస్తూ, వారి సమస్యలు వింటూ కదిలారు. ఆగిన ప్రతిచోటా యువకులు జగనన్న నాయకత్వం వర్ధిల్లాలి, సమైక్యాంధ్ర జిందాబాద్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం జననేత అన్నాగారి ఊరు చేరుకుని అక్కడ మహిళలను ఆశీర్వదించారు. ఒక విద్యార్థినికి ఆటోగ్రాఫ్ ఇచ్చారు. రోడ్‌షో కొనసాగిస్తూ వడ్డికండ్రిగ, వేణుగోపాలపురం చేరుకున్నారు. వేణుగోపాలపురంలో పెద్ద సంఖ్యలో మహిళలు మంగళహారతులు ఇచ్చి స్వాగతం పలికారు. ఇక్కడ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన జెండాను జగన్ ఆవిష్కరించారు. ఎస్‌జె కాలనీ వద్ద షికారీలను పలకరించి, వారి సమస్యలు తెలుసుకున్నారు. ఏఎం.పురం, ఆదిఆంధ్రవాడ వద్ద జనానికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. దారిలో చిన్నపాప అనే గిరిజన మహిళను జగన్మోహన్రెడ్డి పలకరించారు. చిన్నబాపనపల్లె, శెట్వనత్తంలో వాద్యాలతో నాట్యం చేస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ నాయకుడ్ని స్వాగతించారు. అక్కడ నుంచి నేరుగా కొత్తపల్లిమిట్ట చేరుకుని సమైక్య శంఖారావం సభలో వైఎస్.జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. అనంతరం హైదరాబాద్ బయల్దేరి వెళ్లారు. మూడవరోజు పర్యటనలో జగన్ వెంట మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్, జీడీ నెల్లూరు సమన్వయకర్త కె.నారాయణస్వామి, మాజీ ఎమ్మెల్యే ఎన్.అమరనాథరెడ్డి, చంద్రగిరి సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాంధీ, రాజం పేట నియోజకవర్గ పరిశీలకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గాయత్రీదేవి, నాయకులు వై.సురేష్, లిడ్‌క్యాప్ మాజీ చైర్మన్ రెడ్డప్పరెడ్డి, విరూపాక్షి జయచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
జగన్‌కు జేజేలు
-
నేడు జగన్ పర్యటన ఇలా
సాక్షి,చిత్తూరు: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి నాలుగోవిడత సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర రెండో రోజు పర్యటన మంగళవారం ఉదయం నగరి, సత్యవేడు, గంగాధరనెల్లూరు నియోజకవర్గాల్లో జరుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ నారాయణస్వామి తెలిపారు. పుత్తూరు ఆర్అండ్బీ అతిథిగృహం నుంచి పర్యటన ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి తాయిమాంబాపురం, పుత్తూరు బైపాస్ మీదుగా సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం చేరుకుంటారు. నారాయణవనంలో మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ప్రారంభిస్తారు. తిరిగి పుత్తూరు చేరుకుంటారు. చిన్నరాజకుప్పం, పద్మసరస్సుల్లో రోడ్‌షో నిర్వహించి కార్వేటినగరం చేరుకుంటారు. కార్వేటినగరంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆర్కేవీవీపేట క్రాస్, రాజుల కండ్రిగ క్రాస్,పాదిరికుప్పం, కొల్లాగుంట, ముద్దుకుప్పం క్రాస్, నెలవాయి, ఎస్ఆర్పురం క్రాస్‌ల్లో రోడ్‌షో నిర్వహిస్తారు. -
జన హృదయ విజేత వైఎస్
అడుగడుగునా అపూర్వ స్వాగతం రేణిగుంట నుంచి పుత్తూరు వరకు మూడు నియోజకవర్గాల్లో రోడ్‌షో {బాహ్మణపట్టు, పత్తిపుత్తూరుల్లో వైఎస్ విగ్రహాల ఆవిష్కరణ చక్కెర ఫ్యాక్టరీని కాపాడాలని రైతుల వినతి సమైక్యాంధ్ర మీవల్లే సాధ్యమంటూ విద్యార్థుల నినాదాలు సాక్షి, చిత్తూరు: మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఆయన కుమారుడు, వైఎస్ఆర్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో నాలుగో విడత సమైక్య శంఖారావం, ఓదార్పుయాత్ర సోమవారం ప్రారంభమైంది. ఉదయం రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రారంభమైన వై.ఎస్.జగన్మోహన్రెడ్డి యాత్ర శ్రీకాళహస్తి, చంద్రగిరి, నగరి నియోజకవర్గాల్లో సాగింది. నగరి నియోజకవర్గం పుత్తూరు పట్టణానికి జగన్మోహన్రెడ్డి చేరుకునే సమయానికి రాత్రి 9.30 గంటలు అయింది. చలిగా ఉన్నా జనం లెక్కచేయక తమ అభిమాన నాయకుడిని చూసేందుకు వేచి ఉన్నారు. పుత్తూరు పట్టణంలో రాత్రి కిక్కిరిసిన జనం మధ్య జగన్ మోహన్‌రెడ్డి సమైక్య శంఖారావం పూరిం చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాకుండా అసెంబ్లీలో రాష్ట్ర విభజన కోసం చర్చలు జరుగుతుండడం బాధ కలిగిస్తోందన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ చేసిన ప్రసంగానికి జనం నుంచి విశేష స్పందన వచ్చింది. ఇదిలావుండగా వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఉదయం విమానాశ్రయం నుంచి గురవరాజుపల్లె పంచాయతీ రామక్రిష్ణాపురం చేరుకుని అక్కడ రోడ్‌షో నిర్వహించారు. జనం వాహనాన్ని ఆపి జననేతను కలిశారు. ఆయన వారిని పలకరించి ముందుకు కదిలారు. కేఎల్ఎం ఆస్పత్రి ప్రాంతంలో చిన్నపిల్లలు, మహిళలను చూసి జగన్ వాహనం ఆపి కిందకు దిగి వారితో కరచాలనం చేసి మాట్లాడారు. మహిళలు చెప్పిన సమస్యలు ఓపికగా విన్నారు. అక్కడ నుంచి గాజులమండ్యం చేరుకున్నారు. ఇక్కడ మహిళలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో రోడ్డుకు ఇరువైపులా నిలబడి వై.ఎస్.జగన్‌ను చూసేందుకు పోటీపడ్డారు. ఇక్కడ దాదాపు గంట సేపు రోడ్డుకు ఇరువైపులా నిలబడిన మహిళలను, విద్యార్థులను ఒక్కొక్కరిని పలకరించి వారు చెప్పింది విన్నారు. తన కోసం వేచి ఉన్న విద్యార్థులతో ముచ్చటిస్తూ ‘మీరు బాగా చదువుకోవాలమ్మా’ అంటూ వారి భుజం తట్టి ప్రొత్సహించారు. ఈ సందర్భంగా యువకులు, విద్యార్థులు సమైక్యాంధ్ర మీ వల్లే సాధ్యమంటూ జైజగన్ అని నినాదాలు చేశారు. గాజులమండ్యం- షుగర్‌ఫ్యాక్టరీ వరకు నేషనల్‌హైవేలో నిలిచిన బస్సుల్లో నుంచి జనం కిందకు దిగి నిలబడి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని చూసేందుకు ఆసక్తి చూపారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు చేతులూ ఊపుతూ జగన్ నిర్వహిస్తున్న సమైక్య శంఖారావం యాత్రకు మద్దతు పలికారు. ఎస్వీ షుగర్స్‌ను కాపాడండి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన వెంటనే రేణిగుంట ఎస్వీ షుగర్స్‌ను కాపాడేందుకు చర్యలు చేపట్టాలని ఫ్యాక్టరీ షేర్‌హోల్డర్స్‌గా ఉన్న ఈ ప్రాంత రైతులు వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. షుగర్ ఫ్యాక్టరీ ముందు వైఎస్ఆర్సీపీ అధినేతకు స్వాగతం పలికారు. వినతిపత్రం సమర్పించారు. మహానేత వైఎస్ ముఖ్యమంత్రి అయిన వెంటనే షుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణకు చర్యలు చేపట్టారన్నారు. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తూ ఫ్యాక్టరీ మూతపడే విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తాము ప్రభుత్వంలోకి రాగానే తగిన న్యాయం చేస్తామని వై.ఎస్.జగన్ హామీ ఇచ్చారు. అక్కడ నుంచి ఆయిల్ ఫ్యాక్టరీ, అల్లికేశం వరకు యువకులు కాన్వాయ్ వెంట బైక్‌ల్లో ర్యాలీగా వచ్చి అభిమానం చాటుకున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ పర్యటనలో జగన్ వెంట నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఉన్నారు. నగరి నియోజకవర్గంలో.. వై.ఎస్.జగన్ తొలి రోజు పర్యటనలో వడమాలపేట మండలం కదిరిమంగళం నుంచి నగరి నియోజకవర్గంలో రోడ్‌షో నిర్వహించారు. కదిరి మంగళం వద్ద పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యురాలు, నగరి ఇన్చార్జ్ ఆర్.కె.రోజా నాయకత్వంలో గ్రామస్తులు, నియోజకవర్గ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అక్కడ నుంచి వై.ఎస్.జగన్ పూడి గ్రామం చేరుకున్నారు. ఇక్కడ మహిళలు మంగళహారతులు, పూలమాలలు వేసి స్వాగతించారు. మహిళలు అందరినీ వారి వద్దకు వెళ్లి పలకరించి జగన్మోహన్రెడ్డి అర్ధగంటకుపైగా ఇక్కడ ఉన్నారు. పూడి గ్రామం దాటగానే అప్పలాయిగుంట క్రాస్ వద్ద యువకులు, మహిళలు గుమిగూడి రోడ్డుపై పూలు చల్లుతూ స్వాగతించారు. ఇక్కడ ఒక అభిమాని వైఎస్ కుటుంబసభ్యుల ఫొటోను జగన్‌కు అందజేశారు. పూడి ఎస్సీ కాలనీ, బీసీ కాలనీల్లోనూ ప్రజలు జగన్‌ను ఆపి మాట్లాడేందుకు, తమ సమస్యలు చెప్పేందుకు ఉత్సాహం చూపారు. ఇక్కడ ఉన్న స్టయిపాక్ థర్మోకోల్ ఫ్యాక్టరీ ఆవరణకు వెళ్లి వైఎస్ఆర్టీయూసీ జెండాను కార్మికుల కోరిక మేరకు ఆవిష్కరించారు. కాయం, కాయంపేట గ్రామాల్లో యువతులు జెండాలు ఊపుతూ వై.ఎస్.జగన్‌కు స్వాగతం పలికారు. నాలుగు అడుగుల స్థలమూ ఇవ్వని ప్రభుత్వం కాయంపేట నుంచి చంద్రగిరి నియోజకవర్గం బ్రాహ్మణపట్టు వద్దకు వై.ఎస్.జగన్ చేరుకున్నారు. ఇక్కడ మహానేత వై.ఎస్.రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. పెద్దసంఖ్యలో హాజరైన జనాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ‘బ్రాహ్మణపట్టు గ్రామం చిన్నదైనా ఈ గ్రామస్తుల మనస్సు అందులో మహానేత విగ్రహానికి స్థలం ఇచ్చిన శంకర్‌రెడ్డి తాత మనస్సు ఎంతో పెద్దది, గొప్పది. ఆ మహానేత విగ్రహం ఏర్పాటుకు నేను స్థలం ఇస్తానని ఆ తాత సొంత స్థలం నాలుగు అడుగులు ఇచ్చారు.’ అంటూ వై.ఎస్.జగన్ గ్రామస్తులను అభినందించారు. ‘ఈ ప్రభుత్వం మహానేత విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునేందుకు నాలుగు అడుగుల స్థలం అడిగితే ఇవ్వలేదు’, అంటూ ప్రభుత్వ వైఖరిపై ధ్వజమెత్తారు. ఈ పర్యటనలో జగన్ వెంట మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, పార్టీ ప్రోగామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్, నగరి ఇన్చార్జ్ ఆర్.కె.రోజా, పలమనేరు మాజీ ఎమ్మెల్యే ఎన్.అమరనాథరెడ్డి, చంద్రగిరి సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, శ్రీకాళహస్తి సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, రెడ్డివారి చక్రపాణి రెడ్డి, జిల్లా యువత కన్వీనర్ ఉదయ్‌కుమార్, జిల్లా కార్మిక వర్గ కన్వీనర్ బీరేంద్రవర్మ ఉన్నారు. అప్పలాయగుంట వేంకటేశ్వరుని దర్శనం వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం 4.30 గంటలకు ఆలయంలో స్వామిరిని దర్శించుకుని, ఆలయ అర్చకుల ఆశీర్వచనాలు అందుకున్నారు. అంతకు ముందు బ్రాహ్మణపట్టు నుంచి చింతకాల్వ మీదుగా పత్తిపుత్తూరు వరకు రోడ్‌షో నిర్వహించారు. పత్తిపుత్తూరులో మహానేత వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడ నుంచి గొల్లపల్లె, తిరుమణ్యం, టి.ఆర్.కండ్రీ, వేమాపురం, వడమాల మీదు గా వడమాలపేట చేరుకున్నారు. సాయంత్రం వడమాలపేట బహిరంగసభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అక్కడ నుంచి ఎస్యూపురం, లక్ష్మీపురం, తడుకుస్టేషన్ల మీదుగా రోడ్ షో నిర్వహిస్తూ పుత్తూరు మండలం చేరుకున్నారు. మజ్జిగకుంట, తడుకు, గొల్లపల్లె ప్రాంతాల్లో చలిని సైతం లెక్క చేయకుండా జనం వేచి ఉండడం కనిపించింది. వై.ఎస్.జగన్ పుత్తూరు అగ్రహారం, ఈసలాపురంలో రోడ్‌షో నిర్వహించారు. పుత్తూరు పట్టణంలో రోడ్ షో.. సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా సోమవారం రాత్రి పుత్తూరు పట్టణానికి చేరుకున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగతం లభించింది. పుత్తూరు బైపాస్ క్రాస్ నుంచి ఘనస్వాగతం పలుకుతూ బాణసంచా కాలుస్తూ పార్టీ కార్యకర్తలు, నాయకులు, నియోజకవర్గ ఇన్చార్జ్ ఆర్.కె.రోజా, చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో ఆహ్వానించారు. రైల్వేఓవర్ బ్రిడ్జి మీదుగా, బజారువీధి, కార్వేటినగరం సర్కిల్ వరకు రోడ్‌షో సాగింది. -
బిందె నీళ్లు 2 రూపాయలా!
చిత్తూరులో నీటి సమస్యపై జగన్ ఆందోళన ఇప్పుడే ఇలా ఉంటే రాష్ట్రం విడిపోతే పరిస్థితి ఏమిటి వైఎస్ బతికుంటే విభజన అనే మాట వినబడేది కాదు జగన్ ప్రసంగానికి విశేష స్పందన సాక్షి, తిరుపతి: చిత్తూరు నగరంలో బిందె నీళ్లు రెండు రూపాయలకు విక్రయిస్తున్నారని తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడే ఇలా ఉంటే, రాష్ట్రం విడిపోతే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఆయన చేపట్టిన మూడో విడత ఓదార్పు, సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా ఎనిమిదో రోజైన ఆదివారం చిత్తూరు నగరంలో ప్రసంగించారు. ఆయన ప్రసంగం ఆద్యంతం ప్రజలను ఆకట్టుకుంది. వైఎస్ మరణం తరువాత రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారిందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం పదవి కోసం దిక్కుమాలిన ఆలోచనలు చేస్తున్నారని అనగానే ప్రజలు జగన్మోహన్రెడ్డికి జేజేలు పలికారు. రాష్ట్రాన్ని విభజిస్తే చదువుకున్న వారు ఉద్యోగాల కోసం, రైతులు నీటి కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డిని, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడును కాలరు పట్టుకుని అడుగుతారా అనగా, అడుగుతామని సమాధానమిచ్చారు. రాష్ట్ర శాసనసభలో ప్రతిపాదన చేయకుండా, బిల్లును పంపించి చర్చించమనడం ఎంత అన్యాయం అన్నారు. రాష్ట్ర విభజన జరిగితే సోనియా, కిరణ్, చంద్రబాబుకు రాష్ట్రంలోని 70 శాతం మంది ఉసురు తగులుతుందని అన్నారు. రాష్ట్రంలో చర్చించాల్సిన ఆంశాలు అనేకం ఉండగా, రాష్ట్రం విడగొట్టేందుకు చర్చించమనడం దారుణమని అన్నారు. ప్రతి రైతు, విద్యార్థుల గుండెలు సమైక్యాంధ్ర అని కొట్టుకుంటున్నాయని అన్నారు. ప్రతి పేదవాడి మనసెరిగి ప్రవర్తించడమే రాజకీయమని, ఓట్ల కోసం సీట్ల కోసం రాజకీయం చేయరాదని అన్నారు. వైఎస్ జీవించి ఉంటే, విభజన అనే మాట వినబడేది కాదని అనగానే, వైఎస్ఆర్ అమర్హ్రే అని ప్రజలు నినాదాలు చేశారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలని, దీంతో ప్రతి కుటుంబం సంపాదన పెరిగి, బాగుపడతారని వైఎస్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఏర్పాటు చేశారన్నారు. అనారోగ్యం వచ్చిన పేదవాడు పెద్ద ఆస్పత్రుల్లో చికిత్స చేసుకోవడానికి అప్పులు చేసి, వాటికి వడ్డీలు కట్టుకోలేక ఇబ్బంది పడకూడదనే ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేశారని అన్నారు. ప్రతి ఒక్కరికీ దివంగత నేత వైఎస్ఆర్ ఒక అన్నలా, ఒక తండ్రిలా వ్యవహరించారని అన్నారు. వైఎస్ గురించి జగన్మోహన్రెడ్డి మాట్లాడుతుంటే, ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. బహిరంగ సభకు చిత్తూరు సమన్వయకర్త ఏఎస్. మనోహర్ అధ్యక్షత వహించగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, మాజీ ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి, నగరి సమన్వయకర్త ఆర్కే. రోజా, మహిళా కన్వీనర్ గాయత్రీదేవి, యువజన కన్వీనర్ ఉదయకుమార్, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పార్టీ నాయకులు గాంధీ, తలుపులపల్లి బాబు రెడ్డి, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. -
అభిమాన నేతను.. అక్కున చేర్చుకున్న పల్లెప్రజలు
సాక్షి, తిరుపతి: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి మూడో విడత ఏడవ రోజు నిర్వహించిన సమైక్య శంఖారావం పర్యటనకు శనివారం విశేష స్పందన లభించింది. తవణంపల్లె, ఐరాల మండలాల్లో రోడ్‌షోలు జరిగాయి. గ్రామీణ ప్రాంతాలు జగన్మోహన్రెడ్డికి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో నిండిపోయూయి. పూలవర్షం కురి పిస్తూ, బాణసంచా పేలుస్తూ, డప్పు వాయిద్యాలు, కోలాటాలతో అభిమాన నేతను స్వాగతించారు. శుక్రవారం రాత్రి తిరువణంపల్లెలో జగన్మోహన్రెడ్డి బస చేశారు. ఉదయం అక్కడి నుంచి పర్యటన ప్రారంభించారు. కాణిపాకం వినాయక స్వామి ఆలయాన్ని ఆయన సందర్శించారు. అక్కడ నుంచి అగరంపల్లె, ఎల్బీపురం, ఐరాల, ద్వారకాపురం, మారేడుపల్లె క్రాస్‌ల మీదుగా ఉత్తర బ్రాహ్మణపల్లె వరకు రోడ్‌షో నిర్వహించారు. అనంతరం తవణంపల్లె చేరుకోగానే అభిమానులు ఆయనను చుట్టుముట్టారు. ఘనంగా స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలను మోగించారు. పూలు చల్లవద్దంటున్నా, అభిమానులు వినకుండా పూల వర్షం కురిపించారు. అక్కడ నుంచి మిట్టపల్లె, ముత్యాలమిట్ట, దిగువతడకరలో రోడ్ నిర్వహిం చారు. అక్కడి నంచి మత్యం క్రాస్ చేరుకుని, వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు.అక్కడ చర్చిలో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. తరువాత అరగొండ క్రాస్‌కు చేరుకున్నారు. దిగువమత్యంలో రోడ్‌షో నిర్వహించి, ఎగువ మత్యంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం అరగొండ క్రాస్, జొన్నగురుకులలో నిర్వహించిన రోడ్‌షోలో జనం నుంచి భారీ స్పందన లభించింది. అక్కడి నుంచి అరగొండకు చేరుకుని వైఎస్సార్, రాజ్యాంగకర్త అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడి ప్రజలు ఆయనకు తలపాగా చుట్టి, నాగలిని బహూకరించారు. తరువాత దిగువమాఘం, పల్లె చెరువు, మత్యం క్రాస్‌ల మీదుగా ఐరాల, పట్నం గ్రామంలో రోడ్‌షో నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, సమన్వయకర్తలు ఆదిమూలం, సునీల్‌కుమార్, రాజంపేట పార్లమెంటరీ పరిశీలకుడు మిథున్‌రెడ్డి, యువజన విభాగం కన్వీనర్ ఉదయకుమార్, పార్టీ నాయకులు బాబ్జాన్, బీరేంద్ర, వై.సురేష్ పాల్గొన్నారు. -
ఏ నోట విన్నా సమైక్యమే
=విడిపోతే ఉద్యోగాలు లభిస్తాయా? =ప్రజల గోడు పట్టించుకోని సీఎం, ప్రతిపక్ష నేతలు =జగన్ ప్రసంగంపై వెల్లువెత్తిన హర్షధ్వానాలు సాక్షి, తిరుపతి: రాష్ట్రంలో ఏ నోట విన్నా సమైక్యాంధ్ర నినాదమే వినిపిస్తోందని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్ రెడ్డి అన్నారు. జిల్లాలో మూడోవిడత ఆయన చేపట్టిన ఓదార్పు, సమైక్య శంఖారావం యాత్ర బుధవారం నాలుగవ రోజుకు చేరుకుంది. సోమల మండలం కందూరు నుంచి యాత్ర ప్రారంభించారు. సోమలలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, బహిరంగ సభలో ప్రసంగించారు. ఆయన ప్రసంగానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఆయన మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు నీరు ఎక్కడి నుంచి తీసుకు వస్తారని ప్రశ్నించారు. చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయని ప్ర శ్నించారు. పంట పొలాలకు రైతులు నీటి కోసం ఎక్కడికి వెళ్లాలని అడిగారు. రాష్ర్టంలో ఏ నోట విన్నా జై సమైక్యాంధ్ర నినాదమేనని అనడంతో, అక్కడున్న వారు ‘జై సమైక్యాంధ్ర’ అంటూ నినాదాలు చేశారు. ఈ జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుకు ఇక్కడి వారి కష్టాలు పట్టకపోవడం శోచనీయమని అన్నారు. వీరికి ప్ర జలగోడు వినిపించదన్నారు. ఇందుకు ప్రజలు ‘అవును అవును’ అంటూ నినాదాలు చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా, కిరణ్‌కుమార్ రెడ్డి, చంద్రబాబునాయుడు అసెంబ్లీకి రాకుండా ఏసీ గదుల్లో కూర్చుని ఉన్నారని ఆరోపించారు. చంద్రబాబునాయుడు తెలంగాణ వారు వస్తే ‘జై తెలంగాణ’ అంటూ, సీమాంధ్రులు వస్తే ‘జై సమైక్యాంధ్ర’ అంటూ సొంత పార్టీకి చెందిన వారినే మభ్య పెడుతున్నారని అన్నారు. ఇందుకు కూడా ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. అసెంబ్లీలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేయాలని జగన్మోహన్రెడ్డి చేసిన డిమాండ్‌తో ఏకీభవిస్తూ హర్షం వ్యక్తం చేశారు. సాధారణంగా రాష్ట్రాన్ని విడగొట్టడానికి అసెంబ్లీ తీర్మానం పంపించాలని తరువాతే, కేంద్రం బిల్లును తీసుకు రావాలని అన్నారు. అయితే కేంద్రం రాష్ట్రాన్ని విడగొట్టాలి అని నిర్ణయం తీసుకుని బిల్లు పంపించిందని అన్నారు. దీనికి కిరణ్, చంద్రబాబు వంత పాడుతున్నారని అన్నారు. ఈ గడ్డ మీదకు వస్తే చంద్రబాబును, కిరణ్ కుమార్‌ను కాలర్ పట్టుకుని అడగాలని అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు, కిరణ్‌లు అసెంబ్లీకి వచ్చి, సమైక్య తీర్మానం పెట్టాలని అన్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఈ భాషరాదని, ఆమె మనదేశం కాకపోయినా, మన రాష్ట్రాన్ని విడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అనగానే ‘‘సోనియా డౌన్ డౌన్’’ అని నినాదాలు చేశారు. ప్రజలను మోసం చేస్తున్న కిరణ్‌కు, ప్యాకేజీలు కోరుతున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని అన్నారు. సోనియా గాంధీకి గుండెపోటు వచ్చేలా గట్టిగా అందరూ జై సమైక్యాంధ్ర అని అరవాలని ఆయన కోరగానే, అక్కడున్న వారందరూ రెండు చేతులు పెకైత్తి ‘‘జై సమైక్యాంధ్ర’’ నినాదాలు చేశారు. ఈ బహిరంగ సభలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు మిథున్‌రెడ్డి, నగరి, పీలేరు, మదనపల్లి సమన్వయకర్తలు రోజా, చింతల రామచంద్రారెడ్డి, షమీమ్ అస్లాం, నాయకులు పోకల అశోక్‌కుమార్ పాల్గొన్నారు. -
నేటి నుంచి మూడో విడత జగన్ సమైక్య శంఖారావం
సాక్షి, తిరుపతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడో విడత సమైక్య శంఖారావం యాత్ర ఆదివారం తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి ప్రారంభం కానుంది. ఉదయం తొమ్మిది గంటలకు ఆయన తంబళ్లపల్లెలోకి ప్రవేశించి పలు ప్రాంతాల్లో రోడ్‌షోలో పా ల్గొంటారు. తంబళ్లపల్లెలో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో సమైక్య శంఖారావం యాత్ర ప్రారంభం కానుంది. జిల్లాలోకి ఆయన ప్రవేశించే ప్రాంతంలో భారీ స్వాగత ఏర్పాట్లు చేపట్టారు. జగన్మోహన్రెడ్డి రాక కోసం తంబళ్లపల్లె నియోజకవర్గం ఎదురుచూస్తోంది. ఆయన వచ్చే మార్గానికి ఇరువైపులా భారీ ఫ్లెక్సీలతో స్వాగత ఏర్పాట్లు చేశారు. జగన్మోహన్రెడ్డి నవంబర్ 29వ తేదీన కుప్పం నుంచి యాత్రను ప్రారంభించారు. కుప్పం, పలమనేరుల్లో తొలి విడత యాత్రను పూర్తి చేశారు. రెండో విడత యాత్ర డిసెంబరు 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు చేపట్టారు. పలమనేరు నుంచి ప్రారంభ మైన రెండో విడత యాత్ర పుంగనూరు మీదుగా మదనపల్లె వరకు సాగింది. మూడో విడత తంబళ్లపల్లె నుంచి ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో భాగంగా పలు ప్రాంతాల్లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. ఆదివారం 15 ప్రాంతాల్లో రోడ్డు షోలు నిర్వహించనున్నారు. నాయనబావి, గుట్ట, ఉలవలవారిపల్లెలో మహానేత వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. జగన్మోహన్రెడ్డిని ఆహ్వానించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు శనివారమే తంబళ్లపల్లెకు చేరుకున్నారు. నేటి పర్యటన ఇలా... ఉదయం 9.00 గంటలకు తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి పర్యటన ప్రారంభమవుతుంది. బెంగళూరు నుంచి జిల్లాలోని ప్రవేశించే ఆయన ముందుగా శంకరాపురంలో సుబహాన్ సాహెబ్ కుటుంబాన్ని ఓదారుస్తారు. అక్కడ నుంచి బి.కొత్తకోట, కొండకిందపల్లె, గుట్ట, పట్రవారిపల్లె, గట్టుపాళెం, నాయనబావి, ఉలవలవారిపల్లె, పయపుగారిపల్లె, పత్తిరెడ్డిగారిపల్లె, చేదబావిపల్లె, తోకలపల్లె, శీలంవారిపల్లెలో సమైక్య శంఖారావం యాత్రలో పాల్గొంటారు. తర్వాత కనికలతోపు, కోటిరెడ్డిగారిపల్లె, కాండ్లమడుగు క్రాస్ మీదుగా కంచెవారిపల్లె, చెన్నామర్రిమిట్ట, దొమ్మనమ్మబావి, అంగళ్లులో పర్యటిస్తారు. అంగళ్లులో బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం కురబలకోటలో రోడ్‌షో నిర్వహించి, తిరిగి అంగళ్లు చేరుకుంటారు. అక్కడ రాత్రి బస చేస్తారని ప్రోగామ్ కో-ఆర్డినేటర్ తలసిల రఘురాం, జిల్లా కన్వీనర్ నారాయణస్వామి తెలిపారు. -
ఉప్పొంగిన ఉత్సాహం
-
చంద్రబాబుపై జగన్ నిప్పులు
=పుంగనూరు ప్రజల జయ జయ ధ్వానాలు =జనసంద్రమైన పుంగనూరు పట్టణం =పండుగ వాతావరణం కలుగజేసిన శంఖారావం సభ సాక్షి, తిరుపతి: సమైక్య శంఖారావంలో భాగంగా సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి పుంగనూరులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తారు. ఆయన ప్రతి మాటకూ పుంగనూరువాసులు జయ జయ ధ్వానాలతో హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు అబద్ధాల పుట్ట అని చెప్పగానే ప్రజలు సైతం బాబుపట్ల వ్యతిరేకత వ్యక్తం చేశారు. పుంగనూరులోని బస్టాండ్ కూడలి వద్ద సమైక్య శంఖారావం సభలో జగన్మోహన్రెడ్డి ప్రసంగించారు. ఆయన ముందుగా, ఎన్ని పనులు ఉన్నా, ఎంత సేపైనా వేచి ఉన్న ప్రతి అక్కకు, చెల్లికి, అవ్వకు, తాతకు.. అనగానే ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. నాలుగున్నర సంవత్సరాలైనా మరణించిన మహానేతను ప్రజలు గుండెల్లో పెట్టుకుని ఉన్నారని, ఆయన ప్రజల గుండెల్లో ఇంకా జీవించి ఉన్నారని అనగానే ప్రజలు ‘‘వైఎస్ఆర్ అమర్ రహే’’ అని నినాదాలు చేశారు. తన తండ్రి వైఎస్ఆర్ ఎన్నాళ్లు జీవించామనేది ముఖ్యం కాదని, ఎలా బతికామనేది ముఖ్యమని తనకు చెప్పారనగానే ‘‘అవును’’ అంటూ చేతులెత్తి మద్దతు పలికారు. చంద్రబాబు నాయుడు ప్రజాగర్జన పేరుతో సభ నిర్వహించారని అయితే ఆయన ఆ సభలో సమైక్యం అన్నమాట అంటారని చాలా సేపు ఎదురుచూశానని అనగానే ‘‘చంద్రబాబు విభజన ద్రోహి’’ అంటూ ప్రజలు నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు అయ్యారని చంద్రబాబు తనపై ఆరోపణలు చేస్తూ, ఆయన కుమ్మక్కు అయ్యారని అన్నారు. కుమ్మక్కు అయితే మహానేత మరణించిన 18 నెలల్లోనే తనను ఎందుకు అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై 30 వేల కోట్ల రూపాయల భారం మోపితే, తాము అవిశ్వాసం పెట్టామని, దీనికి మద్దతు ఇవ్వకుండా, ఓటింగ్‌లో పాల్గొనవద్దంటా వారి ఎమ్మెల్యేలకు విప్ జారీచేశారనగానే చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేశారు. చంద్రబాబుకు నిజాలు మాట్లాడకూడదని మునిశాపం ఉందని అందుకే ఆయన ఎప్పుడూ అబద్ధాలు మాట్లాడతారనగానే ప్రజలు జయ జయ ధ్వానాలు చేశారు. సొంత మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని జననేత వ్యాఖ్యానించడాన్ని సమర్థిస్తూ నినాదాలు చేశారు. ఉచిత కరెంటు ఇస్తామని వైఎస్ అంటే, దానిపై బట్టలు ఆరేసుకోవాలన్న చంద్రబాబు ఇప్పుడు అదే హామీని ఇస్తున్నారంటే నమ్మశక్యమా అని ప్రశ్నించారు. దీనికి ప్రజలు ‘‘కాదు’’ అని సమాధానమిచ్చారు. 1975లో రెండు ఎకరాల ఆసామిగా రాజకీయంలోకి వచ్చిన చంద్రబాబుకు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ విస్తరించిన హెరిటేజ్ సంస్థలు, వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. గోల్ఫ్ కోర్టుకు 530 ఎకరాలు శనక్కాయలకు విక్రయించారనగానే, ప్రజల నుంచి నవ్వులు వినిపించాయి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఐఎన్ జీకి 830 ఎకరాలు కట్టబెట్టినా సీబీఐ ప్రశ్నించలేదని చెప్పడంతో, ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. రాష్ట్రాన్ని విడగొడితే ఒప్పుకుంటారా అని ప్రశ్నించగా ‘‘వద్దు’’ అని సమాధానమిచ్చారు. సోనియాగాంధీకి తెలుగురాదని, ఇంగ్లీషులో చెప్పమంటూ, వారిచే ‘‘నో’’ అనిపించారు. జగన్మోహన్రెడ్డి మాట్లాడిన ప్రతి మాటకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఈ సభలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి, ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి, మాజీ ఎమ్మేల్యే అమరనాథరెడ్డి, ఆర్కే.రోజా, జిల్లా కన్వీనర్ నారాయణ స్వామి, మహిళా కన్వీనర్ గాయత్రీదేవి, యువజన కన్వీనర్ ఉదయకుమార్ తదితరులు ప్రసంగించారు. -
జననేతకు బ్రహ్మరథం
సమైక్య శంఖారావం చేపట్టిన వైఎస్.జగన్మోహన్రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పూలతో స్వాగతం పలుకుతూ, డప్పు వాయిద్యాల నడుమ నృత్యం చేస్తూ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇప్పుడు తాము చల్లుతున్న పూలు జననేత అధికారంలోకి వచ్చాక తమకు పూల బాటలుగా మారుతాయని భావిస్తున్నారు. సాక్షి, తిరుపతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి చేపట్టిన సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర మూడో రోజైన సోమవారం కూడా విజయవంతంగా నడిచిం ది. దారి పొడవునా ప్రజలు ఎల్లలులేని అభిమానంతో ఆయనకు స్వాగతం పలికారు. పూలు చల్లుతూ, డప్పు వాయిద్యాలతో, కోలాటం చేస్తూ జననేతకు ఆహ్వానం పలికారు. వేలమంది పాఠశాల విద్యార్థులు జగన్మోహన్రెడ్డికి నీరాజనాలు పలికారు. ఆదివారం రాత్రి చౌడేపల్లెలో బసచేసిన ఆయన సోమవారం ఉదయం బయలుదేరారు. బసచేసిన ఇంటి నుంచి అరకిలోమీటరు దూరంలోని బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహావిష్కరణ ప్రాంతానికి చేరుకోవడానికి రెండు గంటల సమయం పట్టింది. వందలాది మంది అభిమానులు జగన్మోహన్రెడ్డి కాన్వాయ్‌ను చుట్టుముట్టడంతో, ఎవరినీ నిరాశ పరచకుండా అందరినీ పలకరిస్తూ వచ్చారు. వైఎస్ విగ్రహావిష్కరణ చేసి కొద్దిసేపు ప్రసంగించాక, కొండామర్రి ప్రాంతానికి బయలు దేరారు. మార్గమధ్యంలో హైదరాబాద్ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం నాయకులు అయనను కలుసుకున్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండేలా సహకరించాలనే వారి కోరికను అంగీకరించారు. అక్కడి నుంచి బయలుదేరగా మదనపల్లె మైనారిటీ నాయకులు అక్తర్ అహ్మద్ నాయకత్వంలో జననేతను కలుసుకున్నారు. దాదాపు 70 మసీదులకు చెందిన మత పెద్దలు, 30 మంది దర్గా కమిటీ సభ్యులు పలు వాహనాలతో బారులుతీరి నిలబడ్డారు. వారిని జగన్మోహన్రెడ్డి ఉర్దూలో పలకరించారు. రానున్న ఎన్నికల్లో ముస్లింలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని వారు కోరారు. దీనికి స్పందించిన ఆయన పీలేరులో 37,500 మంది ముస్లిం సోదరులు ఉన్నారని, మదనపల్లెలో 24 వేల మంది ఉన్నారన్నారు. తన నిర్ణయం ముస్లింసోదరులకు ఆమోదయోగ్యంగానే ఉంటుందని తెలిపారు. అక్కడి నుంచి బయలుదేరిన ఆయనకు గుంటూరు మార్కెట్ యార్డుకు చెందిన 50 మంది నూతలపాటి హనుమయ్య నాయకత్వంలో కలుసుకున్నారు. అక్కడే సమీపంలో ఉన్న గుంటూరు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గానికి చెందిన దాదాపు 300 మందిని జననేత కలుసుకున్నారు. అనంతరం కొండామర్రికి చేరుకోగా ఆప్రాంతంలో నివసిస్తున్న సుగాలీలు జగన్మోహన్రెడ్డికి అఖండ స్వాగతం పలికారు. డప్పులు మోగిస్తూ, మహిళలు కూడా నాట్యం చేస్తూ ఆహ్వానించారు. అక్కడి నుంచి బయలుదేరిన ఆయన, బారులుతీరి నిలుచున్న విజయవాణి పాఠశాల విద్యార్థులను చూసి ఆగి వారిని పలకరించారు. పిల్లల పేర్లు అడిగి తెలుసుకుని బాగా చదువుకోవాలంటూ దీవించారు. ఠాణా ఇండ్లు, బిల్లేరు క్రాస్ మీదుగా చింతమాకులపల్లె వద్ద వేచి ఉన్న అశేష జనవాహినిని కలుసుకున్నారు. అక్కడి నుంచి పుదిపట్ల గ్రామం చేరుకోగా, జిల్లా పరిషత్ పాఠశాలలకు చెందిన బాల బాలికలు ఆహ్వానం పలికారు. పూలను ఆయనపై చల్లి అభిమానాన్ని చాటుకున్నారు. బోయకొండ క్రాస్ వద్దకు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం వైఎస్ మృతిని తట్టుకోలేక మరణించిన కణగాని ఆంజప్ప కుటుంబాన్ని ఓదార్చారు. చదళ్ల, భగత్‌సింగ్ కాలనీల్లో రోడ్‌షో నిర్వహించి, పుంగనూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ప్రవీణ్‌కుమార్ రెడ్డి, అమరనాథరెడ్డి, సమన్వయకర్తలు ఆర్కే.రోజా, ఆదిమూలం, జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, మహిళా కన్వీనర్ గాయత్రీదేవి, యువజన కన్వీనర్ ఉదయకుమార్, నేతలు పోకల అశోక్‌కుమార్, వై.సురేష్, వీరేంద్ర పాల్గొన్నారు.