వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం
రేణిగుంట,న్యూస్‌లైన్: రేణిగుంట విమానాశ్రయంలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి గురువారం మధ్యాహ్నం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. జిల్లాలో నాలుగో విడత సమైక్య శంఖారావం, ఓదార్పుయాత్ర పర్యటనలో ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సాయంత్రం హైదరాబాద్‌కు వెళ్లిన విషయం విధితమే. రాత్రి అక్కడ అక్కినేని నాగేశ్వరావుకు నివాళులు అర్పించారు.
గురువారం మధ్యాహ్నం హై దరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నా రు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల సమన్వయకర్తలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఆదిమూలం, మహిళా విభా గం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు బీరేంద్రవర్మ, నాయకులు వై.సురేష్, రెడ్డివారి చక్రపాణిరెడ్డి, తిరుపతి పట్టణ కన్వీనర్ పాలగిరి ప్రతాప్‌రెడ్డి, విరూపాక్షి జయచంద్రారెడ్డి, అత్తూరు హరిప్రసాద్‌రెడ్డి, నగరం భాస్కర్‌బాబు, యోగీశ్వర్‌రెడ్డి, షంషేర్, చిన్నారావు, మోహన్‌నాయుడు, మిద్దెల హరి, గుమ్మడి బాలకృష్ణయ్య, కార్యకర్తలు స్వాగతం పలికారు.
జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అన్న నినాదాలతో విమానాశ్రయం హోరెత్తింది. అనంతరం ఇక్కడ నుంచి రోడ్డు మార్గంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గ సమైక్య శంఖారావం, ఓదార్పుయాత్రకు బయలుదేరి వెళ్లారు.