సాక్షి, తిరుపతి: ఏపీలో కూటమి పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. రేణిగుంట మండలంలో ఎమ్మెల్యే ఆదేశాలతో అన్యాయంగా పేదల ఇళ్లను రెవెన్యూ అధికారులు కూల్చి వేస్తున్నారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచే కూల్చివేతలు ప్రారంభమయ్యాయి.
వివరాల ప్రకారం.. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు కూల్చివేతలు కొనసాగుతున్నాయి. రేణిగుంట మండలం పరిధిలో చెంగారెడ్డిపల్లి, కుర్రకాలువ, సూరప్ప కశం ప్రాంతాల్లో 144 ఇళ్లను రెవెన్యూ అధికారులు కూల్చి వేశారు. శనివారం అర్ధరాత్రి నుంచే కూల్చివేతలు జరుగుతున్నాయి. పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారుల సమక్షంలో జేసీబీలతో నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఇక, కూల్చివేతలపై పేదలు, దళిత వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment