breaking news
bojjala sudhir reddy
-
బొజ్జల సుధీర్‌ను ప్రశ్నిస్తూ పోస్టు.. జనసేన నేత అరెస్ట్
సాక్షి, తిరుపతి: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో మరో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. తిరుపతిలోని(Tirupati) వెంకటగిరిలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై(Bojjala Sudhir Reddy) పోస్ట్ పెట్టినందుకు జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లును పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో, టీడీపీ, జనసేన మధ్య రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో వెంకటేశ్వర్లు అరెస్ట్‌ను అతడి కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.తిరుపతిలో కూటమి రాజకీయం మరో మలుపు తిరిగింది. కొద్దిరోజుల క్రితం శ్రీకాళహస్తి మాజీ జనసేన(janasena) ఇన్చార్జ్ కోటా వినుతకు(Kota Vinutha) న్యాయం చేయాలి అని సోషల్ మీడియా వేదికగా జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు పోస్ట్ పెట్టారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు. దీంతో, ఆ పోస్టు వైరల్‌గా మారింది. సుధీర్ రెడ్డి వ్యతిరేకంగా పలువురు నెటిజన్లు కామెంట్స్ చేశారు. అనంతరం, కూటమి ఎమ్మెల్యేపైనే పోస్టు చేశారన్న కారణంగా జనసేన నేత వెంకటేశ్వర్లును పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఇలా పోస్టు పెట్టినందుకే అరెస్ట్ చేస్తారా?.. ఏంటి ఈ అన్యాయం అని వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.ఇదిలా ఉండగా.. శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్‌ఛార్జి, ఆ పార్టీ బహిష్కృత నేత వినుత కోటా(Vinutha Kotaa) అనూహ్యంగా తెర మీదకు వచ్చారు. హత్యకు గురైన ఆమె మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడుకు సంబంధించిన ఓ సెల్ఫీ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చి.. తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి(bojjala sudheer reddy) తన ద్వారా వినుత.. ఆమె భర్త చంద్రబాబుపై కుట్ర పన్నారంటూ రాయుడు ఆ వీడియోలో చెప్పడం సంచలన చర్చకు దారి తీసింది.ఈ క్రమంలో.. వినుత కోట తాజాగా ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి ట్విస్ట్ ఇచ్చారు. జైలుకు వెళ్లామన్న బాధ కంటే హత్య చేశామని చెప్పడమే బాధగా ఉందని ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో తమ తప్పు లేదు కాబట్టే వెంటనే బెయిల్ వచ్చిందని అన్నారు. మనసునిండా పుట్టెడు బాధ ఉంది. చేయని తప్పుకు జైలుకు వెళ్లిన బాధ లేక పోయినా.. మేము చంపామని ప్రచారం చేయడం చాలా బాధ కలిగిస్తోంది. రాయుడి చావులో మా ప్రమేయం లేదని కోర్టు భావించింది. కాబట్టే 19 రోజుల్లో బెయిల్ ఇచ్చింది. నెల రోజుల్లోనే కేసులలో ఉన్న వారందరికీ బెయిల్ వచ్చింది. విదేశాల్లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికే తప్ప మనుషుల ప్రాణాలను తీసేందుకు కాదు. అలాంటి మనస్తత్వం మాది కాదు. .. చెన్నై కోర్టులో విచారణ జరుగుతున్నందున ఎక్కువ మాట్లాడలేను. ఏ తప్పు చేయలేదు. నిజ నిజాలు శివయ్యకు తెలుసు. ధైర్యంగా పోరాడుతాం. ఎలాంటి సంబంధం లేదని ఈ కేసులో క్లీన్ చిట్‌తో బయటకు వస్తాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలవడానికి ప్రయత్నిస్తున్నాను. కాబట్టే.. మీడియా ముందుకు రాలేక పోతున్నాను. కుట్రకు సంబంధించిన అన్ని ఆధారాలతో త్వరలో మీడియా ముందుకు వస్తాను. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. సత్యమేవ జయతే. జై హింద్ అని చెప్పుకొచ్చారు. మరోవైపు.. వినుత కోటా, ఆమె భర్త చంద్రబాబు ప్రైవేటుగా ఉన్న వీడియోలుగానీ, ఆమెకు సంబంధించిన అసభ్యకర దృశ్యాలు పంపితే తనకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి రూ.30 లక్షలు ఇస్తానని చెప్పారంటూ రాయుడు ఆ సెల్ఫీ వీడియోలో చెప్పడం చర్చనీయాంశమైంది. -
బొజ్జల 20 కోట్ల వ్యాఖ్యలపై వినుత కోట సంచలన ఆడియో
-
ఎమ్మెల్యే బొజ్జల చెప్పేవన్నీ అబద్ధాలే: వినుత కోటా
తిరుపతి జిల్లా: తనపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి చేస్తున్న ప్రచారాన్ని శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇంచార్జి, ఆ పార్టీ బహిష్కృత నేత వినుత కోటా ఖండించారు. ఆ ప్రచారమంతా అబద్ధమేనని ఆమె తెలిపారు. ఎన్నికల సమయంలో తాను రూ. 8 కోట్లు డబ్బులు అడిగానంటూ బొజ్జల చేస్తున్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. అదంతా అసత్య ప్రచారమేనన్నారు వినుత కోట. ఎన్నికల ప్రచారంలో తనను ఎన్నోసార్లు అవమానించిన పార్టీ నిర్ణయం మేరకు పనిచేశానని ఆమె తెలిపారు. ఇదీ చదవండి:మరో ట్విస్ట్.. వినుత కోటా సెల్ఫీ వీడియో -
మరో ట్విస్ట్.. వినుత కోటా సెల్ఫీ వీడియో
సాక్షి, చెన్నై: శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్‌ఛార్జి, ఆ పార్టీ బహిష్కృత నేత వినుత కోటా(Vinutha Kotaa) అనూహ్యంగా తెర మీదకు వచ్చారు. హత్యకు గురైన ఆమె మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడుకు సంబంధించిన ఓ సెల్ఫీ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చి.. తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి(bojjala sudheer reddy) తన ద్వారా వినుత.. ఆమె భర్త చంద్రబాబుపై కుట్ర పన్నారంటూ రాయుడు ఆ వీడియోలో చెప్పడం సంచలన చరచకు దారి తీసింది. ఈ క్రమంలో.. వినుత కోట తాజాగా ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి ట్విస్ట్ ఇచ్చారు. జైలుకు వెళ్లామన్న బాధ కంటే హత్య చేశామని చెప్పడమే బాధగా ఉందని ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో తమ తప్పు లేదు కాబట్టే వెంటనే బెయిల్ వచ్చిందని అన్నారామె. ఆ వీడియోలో సారాంశం ఇలా.. ‘‘మనసునిండా పుట్టెడు బాధ ఉంది. చేయని తప్పుకు జైలుకు వెళ్లిన బాధ లేక పోయినా.. మేము చంపామని ప్రచారం చేయడం చాలా బాధ కలిగిస్తోంది. రాయుడి చావులో మా ప్రమేయం లేదని కోర్టు భావించింది. కాబట్టే 19 రోజుల్లో బెయిలు ఇచ్చింది. నెల రోజుల్లోనే కేసులలో ఉన్న వారందరికీ బయలు వచ్చింది. విదేశాల్లో రూ లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికే తప్ప మనుషుల ప్రాణాలను తీసేందుకు కాదు. అలాంటి మనస్తత్వం మాది కాదు. .. చెన్నై కోర్టులో విచారణ జరుగుతున్నందున ఎక్కువ మాట్లాడలేను. ఏ తప్పు చేయలేదు. నిజ నిజాలు శివయ్యకు తెలుసు. ధైర్యంగా పోరాడుతాం.ఎలాంటి సంబంధం లేదని ఈ కేసులో క్లీన్ చిట్ తో బయటకు వస్తాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలవడానికి ప్రయత్నిస్తున్నాను. కాబట్టే.. మీడియా ముందుకు రాలేక పోతున్నాను. కుట్రకు సంబంధించిన అన్ని ఆధారాలతో త్వరలో మీడియా ముందుకు వస్తాను. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. సత్యమేవ జయతే. జై హింద్ అని అన్నారామె. మొన్నీమధ్యే కొట్టే సాయిప్రసాద్‌కు శ్రీకాళహస్తి ఆలయ ఛైర్మన్‌గా పదవి లభించింది. దీనిపై వినుత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళలంటే గౌరవం లేని వ్యక్తికి పదవి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నానని పేర్కొంటూ జనసేన అధినేత పవన్‌కల్యాణ్(Jana Sena Chief pawan Kalyan)కు ఆమె లేఖ రాశారు. ఈలోపు.. రాయుడి వీడియో కలకలం రేపింది.ఇదిలా ఉంటే.. వినుత కోటా, ఆమె భర్త చంద్రబాబు ప్రైవేటుగా ఉన్న వీడియోలుగానీ, ఆమెకు సంబంధించిన అసభ్యకర దృశ్యాలు పంపితే తనకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి రూ.30 లక్షలు ఇస్తానని చెప్పారంటూ రాయుడు ఆ సెల్ఫీ వీడియోలో చెప్పడం చర్చనీయాంశమైంది. ఈ వీడియోపై బొజ్జల నుంచి స్పందన రావాల్సి ఉంది. ఈ ఏడాది జులై 7న కోట వినుత, ఆమె భర్త చంద్రబాబు.. రాయుడిని హత్యచేసి మర్నాడు చెన్నై కూవం నదిలో పడేశారని కేసును ఎదుర్కొంటున్నారు. ఈ కేసు విచారణ నేపథ్యంలో నిందితులు చెన్నైలోనే ఉండిపోవాల్సి వచ్చింది.ఇదీ చదవండి: పవన్ కొత్త పాట.. ఏకిపారేస్తున్న నెటిజన్స్ -
సీటు కోసం వినూతపై భారీ స్కెచ్.. బయటపడ్డ బొజ్జల బండారం
-
అవునా బొజ్జలా?
రాజకీయాల్లో కొందరు నేతలు నైతిక విలువలను వదిలేస్తున్నారు. పదవుల కోసం ఎత్తులు వదిలేసి జిత్తులకు దిగుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోసం యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారు. చివరకు ప్రాణాలు తీసేందుకు సైతం దిగజారుతున్నారు. ఇదే కోవలో జనసేన మాజీ నేత కోట వినూతపై ఎమ్మెల్యే బొజ్జల సు«దీర్‌రెడ్డి పలు కుట్రలకు తెగబడినట్లు సోషల్ మీడియాలోకి వచ్చిన ఓ వీడియో వైరల్‌గా మారింది. వినూత డ్రైవర్‌గా పనిచేసి హత్యకు గురైన రాయుడు తీసుకున్నట్టుగా చెబుతున్న సెల్ఫీ వీడియో జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. కోట దంపతులను టార్గెట్ చేసుకుని బొజ్జల తనకు డబ్బులు ఎరవేసినట్లు డ్రైవర్ స్పష్టంగా వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది. అయితే నేతల నడుమ పోరులో చివరకు సదరు దళితుడు బలి కావడం విషాదంగా మిగిలింది. సాక్షి టాస్‌్కఫోర్స్ : జనసేన శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ ఇన్చార్జి కోట వినూత వద్ద డ్రైవర్‌గా పనిచేసిన శ్రీనివాసులు అలియాస్ రాయుడు మాట్లాడినట్టుగా వచ్చిన ఓ సెల్ఫీ వీడియోలో ఎమ్మెల్యే బొజ్జల సుదీర్రెడ్డిపై పలు ఆరోపణలు వినిపించాయి. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ కోసం కుట్ర పన్నినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే వినూత రహస్య సమాచారం, కొన్ని వీడియోలు సేకరించి అధిష్టానానికి చేరవేసి సు«దీర్‌రెడ్డి టికెట్ సాధించినట్లు శ్రీకాళహస్తి వాసులు చర్చించుకుంటున్నారు. బొజ్జల సు«దీర్‌రెడ్డి కారణంగా కూటమిలోని అనేక మంది నేతలు రాజకీయంగా అణచివేతకు గురవుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.రాష్ట్రంలో ఎన్నికల ముందు కూటమిగా ఏర్పడిన టీడీపీ, జనసేన, బీజేపీలోని ముఖ్య నేతలు టికెట్లు దక్కించుకునేందుకు ఒకరిని ఒకరు వెన్నుపోట్లు పొడుచుకున్న విషయం తెలిసిందే. ప్రధానంగా శ్రీకాళహస్తి టికెట్ కోసం ఏకంగా హత్యా రాజకీయాలకు తెరతీశారనే ప్రచారం కోట వినూత డ్రైవర్ రాయుడు వీడియో ద్వారా గుప్పుమంది. శ్రీకాళహస్తి అసెంబ్లీ టికెట్ కోసం కూటమి పారీ్టలోని బొజ్జల సు«దీర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎస్సీవీ నాయుడు, సత్రవాడ మునిరామయ్య కుమారుడు, బీజేపీ నేత కోలా ఆనంద్, జనసేన నేత కోట వినూత పోటీ పడిన విషయం విధితమే. టికెట్ దక్కించుకునేందుకు ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలే చేశారు. ఈక్రమంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేయడంతో పాటు.. ఆయా పార్టీల అధిష్టానాలకు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. ఒకానొక సందర్భంలో మీడియా ముఖంగా వీధికెక్కారు. నాడు టీడీపీ, జనసేన నేతల మధ్యే పోటీసార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి పారీ్టల సీట్ల కేటాయింపుకు సంబంధించి శ్రీకాళహస్తి టికెట్ టీడీపీ లేదా జనసేనలో ఒకరికి ఇస్తారని ముందుగానే తేలిపోయింది. దీంతో కోట వినూతను లక్ష్యంగా చేసుకుని ఆమె డ్రైవర్ని కోవర్టుగా బొజ్జల సుధీర్‌రెడ్డి ఎంపిక చేసుకున్నట్లు రాయుడి వీడియో ద్వారా బయటపడింది. ఒకరి విషయాలు ఒకరు తెలుసుకునేందుకు కూటమి నేతలు కోవర్టులను నియమించుకున్నారు. అందులో భాగంగా కోట వినూత విషయంలో బొజ్జల చాలా దూరంగా ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. అందుకే డ్రైవర్ రాయుడుకి రూ.60 లక్షలు ముట్టజెప్పేందుకు సిద్ధమైనట్లు వీడియో ద్వారా వెలుగు చూసింది. అలాగే అనేక మందిని పావుగా వాడుకున్నట్లు వీడియో ద్వారా వెల్లడైంది. చివరకు కోట వినూత దంపతులను యాక్సిడెంట్ ద్వారా హత్య చేసేందుకు సైతం రెండు పర్యాయాలు యతి్నంచినట్లు రాయుడు వీడియో ద్వారా బయటపెట్టాడు. రాజకీయ పోరులో దళితుడైన సీహెచ్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్యకు గురవడం అప్పట్లో సంచలనంగా మారింది. రాయుడు హత్యకు దారి తీసిన కారణాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆరోపణలు నిజమేనా? డ్రైవర్ రాయడు హత్య తర్వాత అరెస్ట్ అయిన కోట వినూత దంపతులు మీడియా సాక్షిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సు«దీర్‌రెడ్డి పేరును ప్రస్తావించారు. రాయుడి హత్య వెను ఎవరి పాత్ర ఉందని మీడియా ప్రశ్నించిన సమయంలో ఎమ్మెల్యే సు«దీర్‌రెడ్డి పేరును వెల్లడించడం నాడు కలకలం రేపింది. అన్ని విషయాలను త్వరలోనే బయటపెడతామని చెప్పినట్టే.. నేడు రాయుడి వీడియో వైరల్ కావటం పెద్ద దుమారమే రేపుతోంది. శ్రీకాళహస్తి ఆలయ పాలకమండలి అధ్యక్ష పదవిని కొట్టే సాయికి కట్టబెట్టడం వెనుక ఎమ్మెల్యే బొజ్జల సు«దీర్‌రెడ్డి హస్తం ఉందని కోట వినూత లేఖ ద్వారా ఆరోపించింది. బొజ్జల సుదీర్‌రెడ్డికి టికెట్ కేటాయించడం వెనుక జనసేనలోని మరో నాయకుడు కొట్టేసాయి ఉన్నారని రాయుడు వీడియో ద్వారా తెలుస్తోంది. అదే విధంగా శ్రీకాళహస్తిలో పలువురు ప్రధాన భూమిక పోషించారని డ్రైవర్ వీడియో ద్వారా వెల్లడవుతోంది. ఈ క్రమంలోనే రాబోయే రోజుల్లో ఇంకెన్ని వీడియోలు, వాయిస్ రికార్డులు బయటకు వస్తాయోనని కూటమి నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. -
కూటమి రాజకీయాల్లో డ్రైవర్ రాయుడు సెల్ఫీ వీడియో ప్రకంపనలు
-
కోట వినూత, చంద్రబాబుల హత్యకు టీడిపీ ఎమ్మెల్యే బొజ్జల కుట్ర
-
కోటా వినుత డ్రైవర్ రాయుడు హత్య కేసులో సంచలన ట్విస్ట్
సాక్షి,శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి జనసేన పార్టీ మాజీ ఇన్ఛార్జ్ కోటా వినుత (Vinutha Kota) డ్రైవర్ శ్రీనివాసులు (రాయుడు) హత్య కేసులో సంచలన ట్విస్ట్ చోటు చేసుకుంది. కోట వినూత హత్యకు టీడీపీ ఎమ్మెల్య బొజ్జల సుధీర్‌రెడ్డి స్కెచ్ వేసినట్లు ఆలస్యంగా కోట వినుత డ్రైవర్ తీసుకున్న సెల్ఫీ వీడియోలో బయటకు వచ్చింది. ఆ వీడియోలో బొజ్జల సుధీర్‌రెడ్డి (Bojjala Sudhir Reddy).. కోట వినూత దంపతులను హత్య చేసేందుకు రెండు సార్లు ఏ విధంగా కుట్ర చేశారు. ఆ కుట్రలు బెడిసి కొట్టడంతో తనకు భారీ మొత్తంలో డబ్బులు ముట్టజెప్పి కోట వినూత ఏకాంత వీడియోలు తీయాలని పురమాయించడం, కోట వినుత దంపతులు ఎప్పుడు ఎక్కడికి వెళుతున్నారు. ఏం చేస్తున్నారన్న సమాచారం తనకు ఇవ్వాలని బొజ్జల సుధీర్‌రెడ్డి తనని బెదిరించి, భయపెట్టినట్లు ఆ వీడియోలో చెప్పాడు. 👉ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్‌కు అంతా తెలుసుఆ వీడియోలో కోట వినూత,ఆమె భర్త చంద్రబాబు హత్యకు బొజ్జల ప్రయత్నించినట్లు తెలిపాడు. ఇందుకోసం కోట వినూత డ్రైవర్ రాయుడిని (Kota Vinutha Driver Rayudu ) పావుగా వినియోగించుకున్నాడు.కోట వినూత ప్రైవేట్ వీడియోలు తీయాలని డ్రైవర్ రాయుడికి బొజ్జల సుధీర్‌రెడ్డి రూ.30లక్షలు ఆఫర్ చేశాడు. ముందుగా కోట వినూత, చంద్రబాబుల సమాచారం ఇవ్వాలని డ్రైవర్ రాయుడికి రూ.20లక్షలు ఇచ్చాడు. ఈ క్రమంలో బొజ్జల సుధీర్ చెప్పినట్లుగా డ్రైవర్ రాయుడు కోట వినూత బెడ్రూమ్లో కెమెరాలు పెట్టి దొరికిపోయాడు. ఈ వరుస పరిణామాలల నేపథ్యంలో జులై 7న డ్రైవర్ రాయుడును కోట వినూత, చంద్రబాబు హత్య చేశారు. జులై 10వ తేదీన కూవం నది కాలువులో తేలిన డ్రైవర్ రాయుడు శవంజులై 10వ తేదీ చెన్నై కూవం నది కాలువ నుంచి గుర్తు తెలియని శవాన్ని అక్కడి పోలీసులు స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నివేదికలో హత్య అని గుర్తించారు. మృతుడి చేతిపై కోట వినుత, జనసేన సింబల్ పచ్చబొట్లు ఉండడంతో.. లోతుగా దర్యాప్తు చేశారు. ఆ మృతదేహం డ్రైవర్ రాయుడిదని నిర్ధారించారు. ఆ దిశగా పోలీసులు చేపట్టిన విచారణలో అప్పటి శ్రీకాళహస్తి(తిరుపతి) జనసేన ఇన్చార్జ్ వినుత దంపతులు జులై 8వ తేదీన అతన్ని హత్య చేసి కూవం కాలువలో పడేసినట్లు తేల్చారు. అనంతరం కోట వినుత దంపతులతో పాటు మరో ముగ్గురు వారి అనుచరుల్ని అరెస్ట్ చేశారు. జనసేన తరఫున చాలా యాక్టీవ్‌గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే వినుత దంపతులు హత్య కేసులో అరెస్ట్ కావడం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఆమె పేరు బయటకు రావడంతో ఆగమేఘాల మీద ఆమెను పదవి నుంచి తొలగించి.. పార్టీ నుంచి బహిష్కరించింది జనసేన. అయితే.. అరెస్ట్ తర్వాత మీడియా ముందు.. దీని వెనుక ఎవరెవరు ఉన్నారనేది త్వరలోనే బయటికి వస్తుందని కోట వినుత అనగా.. చంద్రబాబు కల్పించుకుని బొజ్జల సుధీర్ రెడ్డి (టీడీపీకి చెందిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే) ఉన్నాడని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. తాజాగా హత్యకు ముందు వెలుగులోకి వచ్చిన కోట వినూత డ్రైవర్ రాయుడు తీసుకున్న సంచలన సెల్ఫీ వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో కోట వినూత దంపతుల హత్యకు టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి ప్రయత్నించారంటూ డ్రైవర్ రాయుడు చెప్పడం కూటమి నేతల్లో కలకలం రేపుతోంది. -
కోటా వినుత డ్రైవర్ హత్య వ్యవహారంపై స్పందించిన బొజ్జల సుధీర్ రెడ్డి
-
బొజ్జలను సేవ్ చేసేందుకు తమిళనాడు పోలీసులపై బాబు ఒత్తిడి
-
Big Question: తమిళ పోలీసుల చేతిలో ప్రూఫ్.. మాస్టర్ మైండ్ అతనే..
-
Driver Rayudu Case: కాళహస్తి జనసేన ఇన్ ఛార్జ్ వినుత కోట ఇంట్లో బొజ్జల కోవర్ట్ ఆపరేషన్
-
చేసిందంతా టీడీపీ ఎమ్మెల్యేనే.. జనసేన వినుత సంచలనం
-
ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హస్తం ఉంది: వినుత భర్త చంద్రబాబు
-
Bhumana: భయం అనేది నా బ్లడ్ లోనే లేదు టీడీపీ ఎమ్మెల్యేలకు లైవ్ లో కౌంటర్
-
TDP: అదృష్టంతో ఎమ్మెల్యే అయ్యావ్!
శ్రీకాళహస్తి: ‘అదృష్టం వల్లో.. పూర్వజన్మ సుకృతం వల్లో ఎమ్మెల్యే అయ్యావు. నిజాలు తెలుసుకుని మాట్లాడాలి. హేయమైన నీ మాట తీరు మార్చుకో’ అంటూ టీడీపీ నాయకుడు, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు ప్రస్తుత ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డిపై ధ్వజమెత్తారు. అసెంబ్లీలో ఓటేరు కాలువపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు శుక్రవారం తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాటల్లోనే.. ‘ఓటేరు కాలువ భూముల గురించి క్షుణంగా విలేకరుల సమావేశంలో తెలిపాను.అయినా సుధీర్‌రెడ్డి రైతులు కడుపుకొట్టే విధంగా అసెంబ్లీలో ప్రసంగించడం బాధ కలిగించింది. మాపై సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేష్‌కు ఏదో ఒకటి చెప్పి కలరింగ్ ఇచ్చుకుంటున్నావని తెలిసింది. మొత్తం వివరాలతో వెళ్లి నువ్వు చేస్తున్న ఆగడాలను బయటపెడుతా. నీ కుటుంబానికి మూడు తరాలుగా అండగా నిలిచాను. నీకు అదృష్టం కలిసి వచ్చి ఎమ్మెల్యే అయ్యావు. అహంకార ధోరణితో తొమ్మిది నెలల్లో నువ్వు చేసిన అరాచకాలపై వంద పేజీల నివేదిక సీఎంకు అందజేస్తా. ఓటేరు భూముల విషయంలో రైతుల కడుపు కొట్టేవిధంగా నువ్వు చేస్తున్న దుష్పష్ప్రాన్ని మేము పక్కా ఆధారాలతో నిరూపిస్తాం.డొనేషన్లు తీసుకుని గెలిచి ఎవరినీ పట్టించుకోవడం లేదు. నీ కుటుంబం పరువు, పేరు చెడగొడుతున్నావు. ఒకసారికే నీకు తోక వచ్చేస్తే నీ కుటుంబం కంటే ముందు 1982లో నేను పార్టీలో చేరాను. 9 నెలల నీ పాలన చూసిన తర్వాత బియ్యపు మధుసూదన్‌రెడ్డి వెయ్యి రెట్లు మేలు అని ప్రజలు అనుకుంటున్నారు. ఈ విధంగా పార్టీని భ్రష్టు పట్టిస్తున్నావు. ఇక ప్రతి వారం పార్టీని, నియోజకవర్గాన్ని కాపాడుకోవడానికి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నీ బాగోతాలు కడిగేస్తా’. అంటూ విరుచుకుపడ్డారు. మాజీ ఎమ్మెల్యే సత్రవాడ మునిరామయ్య, గురుదశరథన్, ప్రసాద్‌నాయుడు పాల్గొన్నారు. -
దళితులపై టీడీపీ దమనకాండ
-
కూటమి ఎమ్మెల్యే ఆదేశాలు.. పోలీసుల సమక్షంలో ఇళ్ల కూల్చివేతలు
సాక్షి, తిరుపతి: ఏపీలో కూటమి పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. రేణిగుంట మండలంలో ఎమ్మెల్యే ఆదేశాలతో అన్యాయంగా పేదల ఇళ్లను రెవెన్యూ అధికారులు కూల్చి వేస్తున్నారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచే కూల్చివేతలు ప్రారంభమయ్యాయి.వివరాల ప్రకారం.. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు కూల్చివేతలు కొనసాగుతున్నాయి. రేణిగుంట మండలం పరిధిలో చెంగారెడ్డిపల్లి, కుర్రకాలువ, సూరప్ప కశం ప్రాంతాల్లో 144 ఇళ్లను రెవెన్యూ అధికారులు కూల్చి వేశారు. శనివారం అర్ధరాత్రి నుంచే కూల్చివేతలు జరుగుతున్నాయి. పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారుల సమక్షంలో జేసీబీలతో నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఇక, కూల్చివేతలపై పేదలు, దళిత వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై శాపనార్థాలు
-
వలంటీర్లు టెర్రరిస్టులా!?
సాక్షి, అమరావతి/వీరపునాయునిపల్లె/ఏర్పేడు (తిరుపతి జిల్లా)/ఎంవీపీ కాలనీ (విశాఖ తూర్పు) /కవితి/టంగుటూరు : నిరంతరం ప్రజల సేవలో ఉంటున్న వలంటీర్లను శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్‌రెడ్డి టెర్రరిస్టులతో పోల్చడంపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోని అనేక రాష్ట్రాలు ఈ వ్యవస్థను మెచ్చుకుంటుంటే టీడీపీ నేతలు మాత్రం రాజకీయ కోణంలో వారిని టార్గెట్ చేయడంపై అన్ని వర్గాలు మండిపడుతున్నాయి. సేవే పరమావధిగా ప్రజలకు మంచి చేస్తున్న వీరిని స్లీపర్స్ సెల్స్ అని.. ఉగ్రవాదులు, డేటా చోరీ చేస్తున్నారని అనడం చాలా బాధాకరమని.. సుధీర్‌రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బేషరతుగా రాష్ట్రంలోని వలంటీర్లందరికీ క్షమాపణలు చెప్పాలని వలంటీర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. బొజ్జల సుధీర్‌రెడ్డి వ్యాఖ్యలపై ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్ చంద్రశేఖర్‌రెడ్డి మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. కరోనా కష్టకాలంలో వలంటీర్ల సేవలను మరచిపోయారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో వారు ముఖ్యపాత్ర పోషిస్తున్నారని, అలాంటి వారిని ఉగ్రవాదులతో పోల్చడం అమానుషమన్నారు. గతంలో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు కూడా వలంటీర్లను తీవ్రంగా విమర్శించారని.. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు మంచిగా అమలవుతుండడంతో టీడీపీ, జనసేన పార్టీలకు కడుపుమంటగా మారిందన్నారు. వలంటీర్ల విశ్వసనీయత, తేల్చుకుందామా? మరోవైపు.. బొజ్జల సుధీర్‌రెడ్డి వలంటీర్లపై చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ వలంటీర్స్ అసోషియేషన్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా తప్పుబట్టింది. ప్రజలోకి మీరు, మేము వెళ్దాం.. ఎవరిపట్ల మంచితనం, విశ్వసనీయత, విశ్వాసం ఉందో చూద్దాం అని వలంటీర్లందరి తరఫున కమిటీ సవాల్ విసిరింది. అప్పట్లో సొంత కుటుంబ సభ్యులే దగ్గరికి రాని పరిస్థితుల్లో వలంటీర్లు తమ ప్రాణాన్ని పణంగా పెట్టి సేవలు చేశారని.. అలాగే, ఆ రోజుల్లో సుధీర్‌రెడ్డి హైదరాబాద్‌కే పరిమితమయ్యారని.. కానీ, వలంటీర్లు ప్రజలకు అందించిన సేవలు ఆయనకేం తెలుసని ప్రశ్నించింది. ‘అలాంటి వారిపై సుధీర్‌రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం చాలా బాధాకరమని, సుధీర్‌రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని వలంటీర్లందరికీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం’.. అంటూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పీట నాగమల్లేష్, ప్రధాన కార్యదర్శి, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు మద్దిలి కాళిదాస్, ఉపాధ్యక్షులు పూజారి ఉదయ్‌కుమార్, సంయుక్త కార్యదర్శి కొమ్ము సురేష్‌బాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 13 మంది వలంటీర్లు రాజీనామా.. సుధీర్‌రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ వైఎస్సార్ జిల్లా వీరపునాయునిపల్లె మండలంలోని పాయసంపల్లె సచివాలయ పరిధిలో విధులు నిర్వహిస్తున్న 13మంది వాలంటీర్లు మంగళవారం రాజీనామా చేశారు. ఎంపీడీఓ పులి రాంసింగ్, పంచాయతీ కార్యదర్శి విజయ్‌కుమార్ నాయక్‌లకు రాజీనామా పత్రాలను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ టీడీపీ నేతలు వలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపట్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యాయమని ఆవేదన వ్యక్తంచేశారు. అవ్వతాతలు, చదువురాని పేదలకు సేవచేసేందుకు సీఎం వైఎస్ జగన్ తమకు అవకాశం కల్పించడం దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నామని.. కానీ, టీడీపీ నేతలు దీనిని రాజకీయం చేస్తున్నారన్నారు. బొజ్జల సుధీర్‌రెడ్డి లాంటి నేతలు మరోసారి విమర్శించేందుకు అవకాశంలేకుండా రాజీనామాలు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఇక తిరుపతి జిల్లా ఏర్పేడులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద వివిధ సచివాలయాలకు చెందిన వలంటీర్లు నిరసన చేపట్టారు. టీడీపీ అంటేనే టెర్రరిస్ట్ పార్టీ అని వారు మండిపడ్డారు. ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజలకు సేవచేస్తున్న వలంటీర్లను జిహాదీ తీవ్రవాదులు, బాంబులు పెట్టే టెర్రరిస్టులు, స్లీపర్ సెల్స్ అంటూ వ్యాఖ్యానించడం దారుణమన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన బొజ్జల వలంటీర్లకు క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి: మంత్రి సురేష్ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా ఉంటూ సంక్షేమ సారథులుగా సేవలందిస్తున్న వలంటీర్లపై టీడీపీ నాయకులు, కూటమి పార్టీల నేతలు అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని మంత్రి, కొండపి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మీడియా సమక్షంలో చెప్పారు. వలంటీర్లను చూస్తే చంద్రబాబు కూటమికి భయం పట్టుకుందన్నారు. తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల సంగతి తెలుస్తామని గతంలో వారు మాట్లాడారన్నారు. ప్రజలకు సేవలు చేస్తున్న వలంటీర్లపై టీడీపీ నేతలు ఇలా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే వలంటీర్లే బుద్ధి చెబుతారని మంత్రి హెచ్చరించారు. అలాగే, వలంటీర్లపై టీడీపీ, జనసేసే, బీజేపీ కూటమి పగబట్టిందని విశాఖ ఎంపీ, తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ విశాఖలో విమర్శించారు. వలంటీర్లను టెర్రరిస్టులుగా పేర్కొనడం దారుణమన్నారు. వలంటీర్లపై టీడీపీ కూటమి పగబట్టడం దారుణమన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం తెచ్చిన జన్మభూమి కమిటీలు ప్రజలను ఎలా దోచుకున్నాయో అందరికీ తెలిసిందేనని.. కానీ, వలంటీర్లు అలా కాదని.. వారు అందిస్తున్న సేవలను ప్రజలు మరిచిపోరన్నారు. -
వాలంటీర్ల పై బొజ్జల సుధీర్ కామెంట్స్ కు పెద్దిరెడ్డి కౌంటర్
-
టీడీపీ పై వాలంటీర్ స్టేట్ సెక్రటరీ ఫైర్
-
చంద్రబాబు అధికారంలోకి వస్తానని కలలు కంటున్నాడు: గుంటూరు వాసులు
-
వాలంటీర్లపై బొజ్జల కామెంట్లతో ఆగ్రహజ్వాలలు
-
వాలంటీర్ల సేవలను ప్రధాని మోడీ ప్రశంసించారు..!
-
బొజ్జల సుధీర్ రెడ్డిని టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని ప్రజల డిమాండ్
-
బాబు బాటలోనే.. బొజ్జల విషపు వ్యాఖ్యలు
సాక్షి, గుంటూరు: నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న వలంటీర్లపై శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్‌రెడ్డి దారుణ వ్యాఖ్యలు చేశారు. కరోనా వంటి విపత్కర సమయంలో ధైర్యంగా సేవలు అందించారన్న విషయం కూడా మర్చిపోయి వారిని జిహాదీ తీవ్రవాదులు, టెర్రరిస్టులతో పోల్చారు. బొజ్జల విషపు వ్యాఖ్యలపై ఇప్పుడు వలంటీర్లు భగ్గుమంటున్నారు. మరోవైపు వైఎస్సార్సీపీ నేతలు, మంత్రులు కూడా బొజ్జల వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. బొజ్జల సుధీర్‌రెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు నిరసనలు చేపడుతున్నారు. తమకు ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తాము సేవకులమని ప్రజలకు సేవ చేసేందుకే పనిచేశామని చెబుతున్నారు. కరోనాలో ప్రజలందరికీ మందులు, ఇతర సామగ్రిని ఇళ్లకు చేర్చామని గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో తమపై ఆరోపణలు చేస్తున్న సుధీర్‌రెడ్డి హైదరాబాద్‌లో దాక్కున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలే ఈ ఎన్నికల్లో అతనికి బుద్ధి చెబుతారన్నారు. సుధీర్ రెడ్డి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం: ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి ప్రతిపక్షాలు ఉద్యోగులపై అభాండాలు వేస్తున్నాయి ఉద్యోగులు ప్రభుత్వంలో ఒక భాగం ప్రభుత్వ చట్టాలను నిర్వర్తించడమే ఉద్యోగస్తుల బాధ్యత రాష్ట్రాన్ని బాగు చేసేందుకే వాలంటీర్, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు వలంటీర్, సచివాలయ వ్యవస్థలకు జాతీయ స్థాయిలో మంచిపేరు వచ్చింది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పదే పదే వాలంటీర్ వ్యవస్థను విమర్శిస్తున్నారు శ్రీ కాళహస్తి టీడీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం కరోనా సమయంలో సుధీర్ రెడ్డి హైదరాబాద్ లో దాకున్నాడు కరోనా సమయంలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పనిచేశారు లోకేష్ పోలీసులను బెదిరిస్తున్నారు పార్టీలు వస్తూ పోతూ ఉంటాయి.. ఉద్యోగులే పర్మినెంట్ ఎన్నో పార్టీలను చూశాం కానీ టీడీపీ మాదిరిగా ఎవరూ ఉద్యోగులను బెదిరించలేదు లోకేష్ రెడ్ బుక్ బెదిరింపులకు ఎవరూ భయపడరు ఉద్యోగులకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది కోవిడ్ వల్ల కొన్ని ఆర్థిక సమస్యలు వచ్చాయి ఎన్ని సమస్యలు ఉన్నా ఇటీవలే రెండు డీఏ ఇచ్చారు ఉద్యోగులు ఏది అడిగినా చేయాలనే తాపత్రయం సీఎం జగన్ ది ఆర్థిక సమస్యలతోనే కొన్ని చేయలేకపోతున్నారు దశలవారీగా ఉద్యోగస్తులను రెగ్యులర్ చేస్తున్నాం ఉద్యోగస్తులంతా పోస్టల్ బ్యాలెట్ ను తప్పకుండా ఉపయోగించుకోవాలి వెల్ఫేర్ స్కీమ్స్ లో దేశానికే ఆదర్శంగా ఉన్న ప్రభుత్వానికి ఉద్యోగస్తులంతా అండగా ఉండాలి టీడీపీకి ప్రజలే గుణపాఠం చెప్తారు: మంత్రి పెద్దిరెడ్డి టీడీపీ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డ మంత్రి పెద్దిరెడ్డి వలంటీర్ల వ్యవస్థకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది కానీ టీడీపీ వాళ్లు వలంటీర్లను ఉగ్రవాదులతో పోల్చడం దారుణం వలంటీర్లు స్లీపర్ సెల్స్ అంటూ శ్రీకాళహస్తి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి దారుణంగా మాట్లాడారు గతంలో చంద్రబాబు కూడా వలంటీర్ వ్యవస్థను కించపరుస్తూ మాట్లాడారు టీడీపీకి ప్రజలే గుణపాఠం చెప్తారు నిస్వార్ధంగా సేవలు అందిస్తున్న వలంటీర్ల గురించి నీచంగా మాట్లాడడం సిగ్గుచేటు టీడీపీపై ఇక ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది ప్రజలకు సేవ చేస్తున్న వలంటీర్లను ఏ ఒక్కరు వదులుకోరు కేవలం తమ స్వార్థం కోసం వలంటీర్లపై టీడీపీ నిందలు వేస్తోంది టీడీపీ ఓ జిహాదీ పార్టీ: ఎంపీ మార్గాని భరత్ ఫైర్ వలంటీర్లను బొజ్జల సుధీర్ టెర్రరిస్టులతో పోల్చడం దారుణం జగనన్న పేదలకు సహాయం చేస్తున్నాడని కారణంతోనే జీతం లేకపోయినా వలంటీర్లు పనిచేశారు అభం శుభం తెలియని వలంటీర్లపై కత్తి కట్టడం దారుణం తెలుగుదేశం పార్టీ ఒక జిహాది పార్టీ వెల్లంపల్లి వార్నింగ్ వలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బొజ్జల సుధీర్‌రెడ్డికి వెల్లంపల్లి శ్రీనివాస్ వార్నింగ్ సుధీర్ రెడ్డి మనీషా . పశువా ? వలంటీర్లు ప్రజల కుటుంబ సభ్యులు లాంటి వారు అలాంటి సేవకుల గురించి ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదు బొజ్జల క్షమాపణలు చెప్పాల్సిందే: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి వలంటీర్లను చూసి చంద్రబాబుకు, టీడీపీ నేతలకు వెన్నులో వణుకు పుడుతుంది.. వలంటీర్లు ఉగ్రవాదులు కాదు సేవా సైనికులు వలంటీర్లలో 70 శాతంకు పైగా మహిళలే ఉన్నారు వారంతా ఉగ్రవాదులా? గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం వలంటీర్లతోనే సాధ్యమైంది వలంటీర్లలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ లో ఉన్నారు వారంటే చంద్రబాబుకు చులకన అందుకే టీడీపీ నేతలు వారిని ఉగ్రవాదులతో పోల్చుతున్నారు సుధీర్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి ఓ మీడియా ఇంటర్వ్యూలో సుదీర్‌రెడ్డి మాట్లాడుతూ.. వలంటీర్లు జిహాదీ తీవ్రవాదులు, బాంబులు పెట్టే టెర్రరిస్టులు, స్లీపర్ సెల్స్ అంటూ తీవ్రంగా వాఖ్యానించారు. వలంటీర్లను జగన్మోహన్రెడ్డి తెలివిగా ఏర్పాటు చేశారన్నారు. వలంటీర్లు వారికిచ్చిన విధులు వారు నిర్వహించడం లేదని.. డేటా చౌర్యం చేసి ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ఒక వ్యక్తి ఎవరితో తిరుగుతాడు. ఏ పార్టీతో ఉంటాడు. అతని కూతురు ఎక్కడ ఉంది. కొడుకు ఏం చేస్తుంటాడు. వాడు మంచివాడా.. కాదా.. లాంటి వివరాలు వలంటీర్లు సేకరిస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో వలంటీర్లను సంఘ విద్రోహ శక్తులైన స్లీపర్ సెల్స్‌తో పోల్చారాయన. -
బొజ్జల సుధీర్ వ్యాఖ్యలపై వాలంటీర్ల ఆగ్రహం
-
వలంటీర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు.. వైఎస్సార్సీపీ నేతల స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో వలంటీర్లపై శ్రీకాళహస్తి నియోజకవర్గం టీడీపీ అభ్యర్ధి బొజ్జల సుధీర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ నేతలు, వలంటీర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వలంటీర్లను టెర్రరిస్ట్లంటూ బొజ్జల సుధీర్ వ్యాఖ్యలను మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఖండించారు. వలంటీర్ల సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారని ప్రస్తావించారు. ప్రజలకు నిస్వార్ధంగా సేవ చేస్తున్నరనే వలంటీర్లపై టీడీపీ నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి వలంటీర్లు తమ విధులు నిర్వహించారని పేర్కొన్నారు. వారి ఆత్మవిశ్వాసం దెబ్బ తినే విధంగా టీడీపీ నేతలుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ వలంటీర్లను కించపరిచే విధంగా మాట్లాడారని అన్నారు. టీడీపీ నేతలు వలంటీర్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి: వలంటరీ వ్యవస్థపై బొజ్జల సుధీర్ చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బొజ్జల సుధీర్ తండ్రి మంత్రిగా పనిచేసినప్పుడు ఎర్రచందనం స్మగ్లింగ్‌లో కోట్ల రూపాయలు సంపాదించారని విమర్శించారు. బొజ్జల సుధీర్‌కు బుద్ది లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వం చేసే కార్యక్రమాన్ని ప్రజలకు అందించే వ్యవస్థ వలంటరీ వ్యవస్థ.. ఒక్క రూపాయి అవినీతి లేకుండా పనిచేస్తుందన్నారు. ‘2 లక్షల 50 వేల మంది వలంటీర్లు అంటే ఎవరు, వాళ్లంతా మన ఇంట్లో పిల్లలు, ఇరుగు పొరుగు పిల్లలు కాదా? కేరళ రాష్ట్రంలో వలంటరీ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు అధ్యయనం చేస్తున్నారు. ఆనాడు పవన్ కల్యాణ్ వలంటరీ వ్యవస్థను విమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు అని పిచ్చి కూతలు కూశాడు. వలంటీర్లు చంద్రబాబు, పవన్ కల్యాణ్, పచ్చ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలి. వలంటరీ వ్యవస్థతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని తప్పుడు తెలుగుదేశం నాయకులు రాజకీయాలు చేస్తున్నారు.’ అని మండిపడ్డారు. వలంటీర్లపై విషం అవ్వతాతాలు గడప దాటకుండా ఒకటో తారీఖున టంచన్‌గా పింఛన్ ఇస్తున్న వాలంటరీలపై కాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుదీర్ రెడ్డి విషం కక్కుతున్నాడని మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే ఆదర్శంగా నిలిచినా వాలంటరీ వ్యవస్థను స్లీపర్ సెల్స్‌తో పోల్చిన బొజ్జల సుదీర్ రెడ్డి అసలు మనిషేనా అని ప్రశ్నించారు. వలంటరీలను తమ సొంత బిడ్డల్లా ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. అలాంటి వాళ్ళను టెర్రరిస్టులు ఉగ్రవాదులు జిహాదీలతో పోల్చిన బొజ్జలపై ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు , పవన్‌లు వలంటరీలపై విషం కక్కి అబాసు పాలయ్యారపి. వంలంటరీ వ్యవస్థపై పడి ఏడుస్తున్న వీరందరికి త్వరలో ప్రజలు బుద్ది చెప్తారని అన్నారు కృష్ణా జిల్లా: వలంటీర్లను తీవ్రవాదులుగా పోల్చి మాట్లాడడం దారుణమన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట వెంకయ్య. చంద్రబాబు సన్నిహితుడు బొజ్జల సుధీర్ రెడ్డి వలంటీర్లపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. గతంలో చంద్రబాబు ఇళ్లదగ్గర మగవాళ్ళు లేని సమయంలో వలంటీర్లు తలుపులు కొడతారని అన్నడం విన్నామని. దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ ఒంటరి మహిళలను వలంటీర్లు ట్రాప్ చేస్తున్నారని అన్నారని గుర్తు చేశారు. టీడీపీ నాయకులు అధికార దాహంతో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘రాష్ట్రంలో 2.50 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం జగన్‌ది. 2006 నుంచి గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గత 10 ఏళ్లుగా సొంత ఖర్చులతో మోటార్లు ఏర్పాటు చేసి పట్టిసీమ నీరు రైతులకు అందిస్తున్నారు. అదే క్రమంలో ప్రస్తుత రైతుల అవసరాల కోసం మోటార్లు ఏర్పాటు చేసి నీరు అందిస్తున్నారు. వంశీ రైతులకు మేలు చేస్తుంటే టీడీపీ నాయకులకు కళ్ళు కుడుతున్నాయి. కావాలని ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తున్నారు. స్థానిక టీడీపీ నాయకులు రైతుల పొట్టలు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ నాయకుల కుయుక్తులు నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో టీడీపీని ప్రజలు తరిమి కొట్టడం ఖాయం.’ అని పేర్కొన్నారు. కాగా వలంటీర్లు శ్రీకాళహస్తి నియోజకవర్గం టిడిపి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వలంటీర్లు టెర్రరిస్టులతో సమానమని, స్లీపర్ సేల్స్లాగా మారి శ్రీకాళహస్తిని సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక వలంటీర్ల అంతు చూస్తామని అన్నారు. -
బొజ్జల సుధీర్ రెడ్డిపై సీరియస్ యాక్షన్
-
26 మంది టిడిపి లీడర్లపై కేసు నమోదు
-
శ్రీకాళహస్తి టిడిపి ఇంఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డిపై కేసు నమోదు
-
పోలీస్ స్టేషన్ ఎదురుగా టీడీపీ బొజ్జల సుధీర్ రెడ్డి రౌడీయిజం..!
-
ఆయనింకా టీడీపీలో చేరలేదు.. అప్పుడే పరువు పోయిందట!
సాక్షి, తిరుపతి: పార్టీలో చేరకముందే ఆ ఇద్దరూ మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు పరువు తీశారు. నియోజకవర్గ ఇన్చార్జ్ని కలిశాకే రమ్మని తేల్చిచెప్పడంతో మాజీ ఎమ్మెల్యే షాక్‌కు గురయ్యారు. కండువా కప్పుకోక ముందే ఇదేం పంచాయితీ అంటూ ఎస్సీవీ నాయుడు తలపట్టుకుంటున్నారు. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు పేరు వింటే.. తరచూ పార్టీలు మారే నాయకుడని అందరికీ తెలుసు. టీడీపీలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి ముఖ్యఅనుచరుడుగా ఉంటూ... ప్రతి ఎన్నికలో ఆయన కోసం పనిచేసేవారు. అయినా టీడీపీలో గుర్తింపు లేదని భావించి 2003లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి, 2004లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో సైలెంట్‌గా ఉంటూ.. తన పనులు తాను చేసుకుంటూ ఉండేవారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ నుంచి టికెట్ ఆశించినా ప్రయోజనం లేకపోవడంతో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక మళ్లీ టీడీపీలో చేరిపోయారు. టీడీపీ ప్రభుత్వంలో తనను ఎవ్వరూ పట్టించుకోలేదంటూ.. 2019 ఎన్నికల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని, ఆయన కుటుంబంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఉండేవారు. డామిట్.. కథ అడ్డం తిరిగింది శ్రీకాళహస్తి టీడీపీ ఇన్చార్జ్ సుధీర్‌రెడ్డి అభ్యర్థిత్వంపై పార్టీ శ్రేణుల్లో మంచి అభిప్రాయం లేకపోవడం.. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని ఎస్సీవీ నాయుడు గ్రహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ.. టీడీపీ నేతలతో సఖ్యతగా ఉండడం ప్రారంభించారు. అందులో భాగంగా ఇటీవల బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సంవత్సరీకానికి మరో మాజీ ఎమ్మెల్యేతో కలిసి సుధీర్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. పేరుకు సంవత్సరీకానికి వెళ్లామని చెప్పుకున్నా.. 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా పనిచేసేందుకు కుట్రలకు తెరదీశారు. విషయం బయటపడడంతో టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఇటీవల చంద్రబాబుని కలిసి.. పార్టీలో చేరికపై నిర్ణయం తీసుకున్నారు. అయితే చంద్రబాబుని కలిసిన విషయం, పార్టీలో చేరిక విషయం బొజ్జల సుధీర్‌రెడ్డికి తెలియదు. ఎస్సీవీ నాయుడు చేరిక వెనుక దాగి ఉన్న రహస్యాన్ని తెలుసుకున్న బొజ్జల సుధీర్‌రెడ్డి బుధవారం వాయిస్ రికార్డు విడుదల చేశారు. ‘ఎస్సీవీ నాయుడు గురువారం పార్టీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. నియోజకవర్గ ఇన్చార్జ్ అయిన నాకు ఎటువంటి సమాచారం లేదు. కావున టీడీపీ శ్రేణులు ఎవ్వరూ ఎస్సీవీ నాయుడుతో వెళ్లొద్దు’ అని స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న చంద్రబాబు ఎస్సీవీ చేరికను వాయిదా వేశారు. దీంతో ఎస్సీవీ నాయుడు చేరికపై సందిగ్ధం నెలకొంది. పోయిన పరువు పార్టీలో చేరక ముందే అటు చంద్రబాబు.. ఇటు బొజ్జల సుధీర్‌రెడ్డి తన పరువు తీశారని ఎస్సీవీ నాయుడు మనస్తాపానికి గురైనట్లు సమాచారం. టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లన్నీ చేసుకున్నాక నియోజకవర్గంలో ఎలా తలెత్తుకు తిరగాలని అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రతి గెలుపు కోసం నేను ఎంతగా కష్టపడ్డానో చంద్రబాబు తెలియదా? అంతెందుకు.. బొజ్జల కుటుంబానికి తెలియదా?’ ఇంత అవమానం జరిగాక ఈనెల 14న కుప్పంకి ఎలా వెళ్లాలి? పార్టీలో ఎలా చేరాలి. ఒక వేళ చేరినా.. అడుగడుగునా అవమానించరని గ్యారెంటీ ఉందా..?’ అని తన అనుచరుల వద్ద ఎస్సీవీ తీవ్ర మనోవేదనకు గురైనట్లు ప్రచారం జరుగుతోంది. -
వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ వర్గీయుల దాడి
రేణిగుంట: చిత్తూరు జిల్లా రేణిగుంటలో టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై మంగళవారం దాడులకు తెగబడ్డారు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బొజ్జల సుధీర్‌రెడ్డి కారు వారిపైకి దూసుకెళ్లడంతో వార్డు సభ్యులు, ముగ్గురు మహిళలు గాయపడ్డారు. విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా టీడీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి బొజ్జల సుధీర్‌రెడ్డి, పార్టీ తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు నరసింహయాదవ్‌ల నేతృత్వంలో మండల టీడీపీ నాయకులు రేణిగుంటలోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపైన, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డిపైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత దూషణలతో నినాదాలు చేశారు. దీంతో ఎంపీపీ హరిప్రసాద్‌రెడ్డి నేతృత్వంలో అక్కడికి చేరుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని వారిని కోరారు. దీంతో టీడీపీ వారు మరింతగా దూషిస్తూ వైఎస్సార్ సీపీ వర్గీయులపై చెప్పులు, రాళ్లు విసిరారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ సమయంలోనే బొజ్జల సుధీర్‌రెడ్డి కారు వైఎస్సార్ సీపీ శ్రేణులపై వేగంగా దూసుకెళ్లింది. దీంతో వైఎస్సార్సీపీకి చెందిన రేణిగుంట వార్డు సభ్యుడు కృష్ణమూర్తి, కార్యకర్తలు ఈశ్వరి, దర్బార్‌బీ, సాయిలత గాయపడ్డారు. రేణిగుంట డీఎస్పీ రామచంద్ర, సీఐ అంజూయాదవ్ అక్కడకు చేరుకుని సర్దిచెప్పారు. కారుతో తొక్కించి గాయపరచారని బొజ్జల సుధీర్‌రెడ్డిపై వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
‘మరో లోకేష్ బాబు వచ్చారు’.. మాజీమంత్రి కుమారుడికి చేదు అనుభవం
మీ నాన్న 30 ఏళ్లు మంత్రిగా.. ఎమ్మెల్యేగా ఉన్నారు కదా. ఏ రోజైనా ఇటు వచ్చారా? సమస్యలు విన్నారా? మేము దళితులమనే మా ప్రాంతాన్ని చిన్నచూపు చూశారు. కనీసం కట్టుకున్న ఇళ్లు కూడా దక్కకుండా చేశారు. ఇప్పుడు అధికారం లేదని సమస్యలు పరిష్కరిస్తామంటున్నారు. ఇదేనా ప్రజాసేవ అంటే..? ఇలాంటి పనికిమాలిన రాజకీయాలు చేయడమెందుకు..? అంటూ శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ బొజ్జల సుధీర్‌ను స్థానికులు నిలదీయడంతో ఆయన కంగుతిన్నారు. అక్కడి నుంచి జారుకున్నారు. ఈ ఘటన శ్రీకాళహస్తిలో చర్చనీయాంశమైంది. సాక్షి, తిరుపతి / శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తిలో మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ప్రభుత్వంపై బురదజల్లేందుకు వచ్చి ప్రజావ్యతిరేకతతో అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. శ్రీకాళహస్తి సమీపంలోని రామచంద్రాపురం వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 1,748 మందికి ఇందిరమ్మ గృహాలు మొదటి విడత కింద మంజూరు చేశారు. ఆ ప్రాంతానికి రాజీవ్‌నగర్ కాలనీగా నామకరణం చేసి, ఇంటి నిర్మాణాలు ప్రారంభించారు. ఆయన హఠాన్మరణంతో గృహనిర్మాణాలు నిలిచిపోయాయి. ఆ తర్వాత చంద్రబాబు సీఎం అయిన సమయంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కొనసాగారు. ఆయన మంత్రిగా పలు కీలక పదవులు అలంకరించారు. ఆ సమయంలో రాజీవ్‌నగర్ అభివృద్ధి చేసే అవకాశం ఉన్నా వైఎస్ రాజశేఖరరెడ్డికి పేరొస్తుందనే దురుద్దేశంతో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పక్కాగృహాలు అసంపూర్తిగా దర్శనమిస్తుండడంతో అధికారులు పట్టాలను రద్దుచేయడంతోపాటు ముందుగానే నోటీసులిచ్చి లబ్ధిదారులకు తెలియజేశారు. ఇది ఎవరికీ గుర్తుండవనుకుని నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ బొజ్జల సుధీర్ ప్రభుత్వంపై బురదజల్లేందుకు శ్రీకాళహస్తిలో పర్యటనకు సిద్ధపడ్డారు. పట్టణానికి చెందిన టీడీపీ నేత ఒకరు పద్మాలయ చెరువును ఆక్రమించి రాత్రికి రాత్రే అక్రమ నిర్మాణాలకు తెరలేపారు. ఇది తెలుసుకున్న అధికారులు ఆ నిర్మాణాలను తొలగించి పద్మాలయ చెరువులో బోర్డులు నాటారు. ఇది జరిగి పది రోజులైంది. అయితే గత సోమవారం శ్రీకాళహస్తికి చేరుకున్న బొజ్జల సుధీర్‌రెడ్డి హడావుడిగా వెళ్లి పద్మాలయ చెరువు ఆక్రమణల విషయమై నానాయాగీ చేశారు. అంతేకాకుండా రాజీవ్‌నగర్‌లో లబ్ధిదారులకు అండగా ఉంటానంటూ మంగళవారం ధర్నా చేయాలని నిర్ణయించుకున్నారు. ఉదయం కొంత మందితో అక్కడికి చేరుకున్నారు. అయితే స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో.. టీడీపీ ప్రభుత్వంలో రాజీవ్నగర్ని నిర్మించామని బొజ్జల సుధీర్ నోరు జారారు. బొజ్జల మాట విన్న స్థానికులు కొందరు ‘మరో లోకేష్ బాబు వచ్చారు’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడడంతో ఆయన చిన్నగా అక్కడి నుంచి జారుకోవడం గమనార్హం. -
సుధీర్.. నోరు అదుపులో పెట్టుకో..
శ్రీకాళహస్తి : టీడీపీ శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి బొజ్జల సుధీర్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని... ఆయన దబాయింపులకు ఎవరూ భయపడరని శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు అన్నారు. చిన్నవాడు భవిష్యత్ ఉన్నవాడు పెద్దలను గౌరవించడం... మర్యాదగా మాట్లాడం నేర్చుకోవాలని సూచించారు. మంగళవారం ఎస్సీవీ నాయుడు ఆయన నివాస గృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ మీ ఆరోపణలు స్వీకరిస్తున్నా.. ఎవరి వద్ద కమీషన్లు తీసుకున్నానో నిరూపించు, బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నా ఎప్పుడు.. ఎక్కడ కూర్చుని మాట్లాడుకుందామో... చెప్పండి అంటూ సవాల్ విసిరారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఆయన తండ్రి బొజ్జల గంగసుబ్బరామిరెడ్డిని శ్రీకాళహస్తిలోకి రానీయకుండా అడ్డగిస్తే వారికి అండగా నిలిచి సహాయ సహకారాలు అందించింది తామేనని చెప్పారు. బ్లాక్మెయిల్ రాజకీయాలు చెల్లవని, నీచ రాజకీయాలు శ్రీకాళహస్తిలో చేయలేరని తెలిపారు. ‘పార్టీని నమ్ముకుని ఉన్నవాళ్లం మేము.. సొమ్ములు చేసుకుంది సంపాదించింది మీరే...’ అంటూ ధ్వజమెత్తారు. ‘మీరేమైనా రాజుల కుటుంబంలోంచి వచ్చారా... మీ తాత ఓ కాంట్రాక్టర్... అది తెలుసుకో, మేము నీ కింద పనిచేసే గుమస్తాలం కాదు, నీ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు’ అని తెలిపారు. ‘తప్పులు ఉంటే సరిదిద్దుకో, మేము సరిదిద్దుకుంటాం ...బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడివి అనే అర్హత తప్ప నీకు ఏమీ లేదు..’ అని విమర్శించారు. ఎవరి సత్తా ఏమిటో ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరారు. వైఎస్సార్సీపీ తొట్టంబేడు మండల కన్వీనర్ ఉన్నం వాసుదేవనాయుడు మాట్లాడుతూ ఉపాధి పనులు తాను చేయలేదని, తాను కమీషన్లు ఇచ్చినట్లు తనపై ఆరోపణలు చేయడం తగదని చెప్పారు. ఏర్పేడు మాజీ ఎంపీపీ ప్రకాష్ యాదవ్, నాయకులు గురుదశరథన్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మ్యాగీక్లారా తదితరులు పాల్గొన్నారు. -
బొజ్జల తనయుడి ఆవేదన
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యం సరిగా లేదని మంత్రి పదవి నుంచి తొలగించడం బాగోలేదని మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి తనయుడు సుధీర్ అన్నారు. ఒక్క మాట కూడా చెప్పకుండా మంత్రి పదవి నుంచి తొలగించడం బాధకరమన్నారు. సోమవారం ఆయన తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమ కుటుంబానికి మంత్రి పదవి కొత్తేమి కాదని, తన తాత దగ్గర నుంచి మంత్రులుగా వ్యవహరించారన్నారు. 35 ఏళ్లుగా పార్టీ కోసం శ్రమించిన వ్యక్తిని డీ గ్రేడ్ చేయడం ఆవేదన కలిగిస్తోందన్నారు. మంత్రులందరి కంటే తన తండ్రి ఎక్కువగా తిరిగారని చెప్పారు. మంత్రిగా పనికిరానప్పుడు ఎమ్మెల్యేగా ఎందుకని రాజీనామా చేశారన్నారు. తన తండ్రికి మద్దతుగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజక వర్గంలోని జెడ్పీటీసీ సభ్యుల నుంచి ఆలయ కమిటి చైర్మన్ల వరకు అందరూ మూకుమ్మడిగా రాజీనామాలు చేశారని చెప్పారు. ఇదే విషయాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ సీఎం రమేష్‌లకు వివరించామన్నారు. ఇదంతా ప్రశాంత వాతావరణంలో జరిగితే, తన తల్లి వారిపై ఆగ్రహించినట్టుగా సోషల్ మీడియాలో రావడం బాధాకరమన్నారు. ఈ దుష్ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. రెండు మూడు రోజుల్లో నియోజకవర్గంలోని కార్యకర్తలతో తన తండ్రి సమావేశమవుతారని, తదుపరి కార్యచరణపై నిర్ణయం తీసుకుంటారని ఆయన వివరించారు.


