సాక్షి, గుంటూరు: నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న వలంటీర్లపై శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్‌రెడ్డి దారుణ వ్యాఖ్యలు చేశారు. కరోనా వంటి విపత్కర సమయంలో ధైర్యంగా సేవలు అందించారన్న విషయం కూడా మర్చిపోయి వారిని జిహాదీ తీవ్రవాదులు, టెర్రరిస్టులతో పోల్చారు. బొజ్జల విషపు వ్యాఖ్యలపై ఇప్పుడు వలంటీర్లు భగ్గుమంటున్నారు. మరోవైపు వైఎస్సార్‌సీపీ నేతలు, మంత్రులు కూడా బొజ్జల వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.
బొజ్జల సుధీర్‌రెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు నిరసనలు చేపడుతున్నారు. తమకు ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తాము సేవకులమని ప్రజలకు సేవ చేసేందుకే పనిచేశామని చెబుతున్నారు. కరోనాలో ప్రజలందరికీ మందులు, ఇతర సామగ్రిని ఇళ్లకు చేర్చామని గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో తమపై ఆరోపణలు చేస్తున్న సుధీర్‌రెడ్డి హైదరాబాద్‌లో దాక్కున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలే ఈ ఎన్నికల్లో అతనికి బుద్ధి చెబుతారన్నారు.
సుధీర్ రెడ్డి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం: ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి
- ప్రతిపక్షాలు ఉద్యోగులపై అభాండాలు వేస్తున్నాయి
- ఉద్యోగులు ప్రభుత్వంలో ఒక భాగం
- ప్రభుత్వ చట్టాలను నిర్వర్తించడమే ఉద్యోగస్తుల బాధ్యత
- రాష్ట్రాన్ని బాగు చేసేందుకే వాలంటీర్, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు
- వలంటీర్, సచివాలయ వ్యవస్థలకు జాతీయ స్థాయిలో మంచిపేరు వచ్చింది
- చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పదే పదే వాలంటీర్ వ్యవస్థను విమర్శిస్తున్నారు
- శ్రీ కాళహస్తి టీడీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
- కరోనా సమయంలో సుధీర్ రెడ్డి హైదరాబాద్ లో దాకున్నాడు
- కరోనా సమయంలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పనిచేశారు
- లోకేష్ పోలీసులను బెదిరిస్తున్నారు
- పార్టీలు వస్తూ పోతూ ఉంటాయి.. ఉద్యోగులే పర్మినెంట్
- ఎన్నో పార్టీలను చూశాం కానీ టీడీపీ మాదిరిగా ఎవరూ ఉద్యోగులను బెదిరించలేదు
- లోకేష్ రెడ్ బుక్ బెదిరింపులకు ఎవరూ భయపడరు
- ఉద్యోగులకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది
- కోవిడ్ వల్ల కొన్ని ఆర్థిక సమస్యలు వచ్చాయి
- ఎన్ని సమస్యలు ఉన్నా ఇటీవలే రెండు డీఏ ఇచ్చారు
- ఉద్యోగులు ఏది అడిగినా చేయాలనే తాపత్రయం సీఎం జగన్ ది
- ఆర్థిక సమస్యలతోనే కొన్ని చేయలేకపోతున్నారు
- దశలవారీగా ఉద్యోగస్తులను రెగ్యులర్ చేస్తున్నాం
- ఉద్యోగస్తులంతా పోస్టల్ బ్యాలెట్ ను తప్పకుండా ఉపయోగించుకోవాలి
- వెల్ఫేర్ స్కీమ్స్ లో దేశానికే ఆదర్శంగా ఉన్న ప్రభుత్వానికి ఉద్యోగస్తులంతా అండగా ఉండాలి
టీడీపీకి ప్రజలే గుణపాఠం చెప్తారు: మంత్రి పెద్దిరెడ్డి
- టీడీపీ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డ మంత్రి పెద్దిరెడ్డి
- వలంటీర్ల వ్యవస్థకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది
- కానీ టీడీపీ వాళ్లు వలంటీర్లను ఉగ్రవాదులతో పోల్చడం దారుణం
- వలంటీర్లు స్లీపర్ సెల్స్ అంటూ శ్రీకాళహస్తి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి దారుణంగా మాట్లాడారు
- గతంలో చంద్రబాబు కూడా వలంటీర్ వ్యవస్థను కించపరుస్తూ మాట్లాడారు
- టీడీపీకి ప్రజలే గుణపాఠం చెప్తారు
- నిస్వార్ధంగా సేవలు అందిస్తున్న వలంటీర్ల గురించి నీచంగా మాట్లాడడం సిగ్గుచేటు
- టీడీపీపై ఇక ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది
- ప్రజలకు సేవ చేస్తున్న వలంటీర్లను ఏ ఒక్కరు వదులుకోరు
- కేవలం తమ స్వార్థం కోసం వలంటీర్లపై టీడీపీ నిందలు వేస్తోంది
టీడీపీ ఓ జిహాదీ పార్టీ: ఎంపీ మార్గాని భరత్ ఫైర్
- వలంటీర్లను బొజ్జల సుధీర్ టెర్రరిస్టులతో పోల్చడం దారుణం
- జగనన్న పేదలకు సహాయం చేస్తున్నాడని కారణంతోనే జీతం లేకపోయినా వలంటీర్లు పనిచేశారు
- అభం శుభం తెలియని వలంటీర్లపై కత్తి కట్టడం దారుణం
- తెలుగుదేశం పార్టీ ఒక జిహాది పార్టీ
వెల్లంపల్లి వార్నింగ్
- వలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బొజ్జల సుధీర్‌రెడ్డికి వెల్లంపల్లి శ్రీనివాస్ వార్నింగ్
- సుధీర్ రెడ్డి మనీషా . పశువా ?
- వలంటీర్లు ప్రజల కుటుంబ సభ్యులు లాంటి వారు
- అలాంటి సేవకుల గురించి ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదు
బొజ్జల క్షమాపణలు చెప్పాల్సిందే: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
- వలంటీర్లను చూసి చంద్రబాబుకు, టీడీపీ నేతలకు వెన్నులో వణుకు పుడుతుంది..
- వలంటీర్లు ఉగ్రవాదులు కాదు సేవా సైనికులు
- వలంటీర్లలో 70 శాతంకు పైగా మహిళలే ఉన్నారు వారంతా ఉగ్రవాదులా?
- గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం వలంటీర్లతోనే సాధ్యమైంది
- వలంటీర్లలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ లో ఉన్నారు వారంటే చంద్రబాబుకు చులకన అందుకే టీడీపీ నేతలు వారిని ఉగ్రవాదులతో పోల్చుతున్నారు
- సుధీర్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి
ఓ మీడియా ఇంటర్వ్యూలో సుదీర్‌రెడ్డి మాట్లాడుతూ.. వలంటీర్లు జిహాదీ తీవ్రవాదులు, బాంబులు పెట్టే టెర్రరిస్టులు, స్లీపర్ సెల్స్ అంటూ తీవ్రంగా వాఖ్యానించారు. వలంటీర్లను జగన్‌మోహన్‌రెడ్డి తెలివిగా ఏర్పాటు చేశారన్నారు. వలంటీర్లు వారికిచ్చిన విధులు వారు నిర్వహించడం లేదని.. డేటా చౌర్యం చేసి ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ఒక వ్యక్తి ఎవరితో తిరుగుతాడు. ఏ పార్టీతో ఉంటాడు. అతని కూతురు ఎక్కడ ఉంది. కొడుకు ఏం చేస్తుంటాడు. వాడు మంచివాడా.. కాదా.. లాంటి వివరాలు వలంటీర్లు సేకరిస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో వలంటీర్లను సంఘ విద్రోహ శక్తులైన స్లీపర్ సెల్స్‌తో పోల్చారాయన.
Comments
Please login to add a commentAdd a comment