Renigunta
-
కూటమి ఎమ్మెల్యే ఆదేశాలు.. పోలీసుల సమక్షంలో ఇళ్ల కూల్చివేతలు
సాక్షి, తిరుపతి: ఏపీలో కూటమి పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. రేణిగుంట మండలంలో ఎమ్మెల్యే ఆదేశాలతో అన్యాయంగా పేదల ఇళ్లను రెవెన్యూ అధికారులు కూల్చి వేస్తున్నారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచే కూల్చివేతలు ప్రారంభమయ్యాయి.వివరాల ప్రకారం.. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు కూల్చివేతలు కొనసాగుతున్నాయి. రేణిగుంట మండలం పరిధిలో చెంగారెడ్డిపల్లి, కుర్రకాలువ, సూరప్ప కశం ప్రాంతాల్లో 144 ఇళ్లను రెవెన్యూ అధికారులు కూల్చి వేశారు. శనివారం అర్ధరాత్రి నుంచే కూల్చివేతలు జరుగుతున్నాయి. పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారుల సమక్షంలో జేసీబీలతో నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఇక, కూల్చివేతలపై పేదలు, దళిత వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జగన్ ఫ్లెక్సీలను తీసేసిన రేణిగుంట పోలీసులు
-
తిరుపతి: ఆర్టీసీ బస్సులో విషాదం
సాక్షి, తిరుపతి: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సులో ఉరేసుకుని ఓ యువకుడు మృతిచెందాడు. శ్రీకాళహస్తి-తిరుపతి మార్గంలో వెళ్లే ఆర్టీసీ బస్సులో ఈ తెల్లవారు జామున ఘటన జరిగింది.బస్సులో వెనుక సీటు వద్ద ఉన్న హ్యాంగర్‌కు ఉరేసుకుని చనిపోయినట్లు రేణిగుంట వద్ద కండక్టర్ గుర్తించి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో బస్సులో ముగ్గురు ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతిచెందిన యువకుడి వివరాలు కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. -
రేణిగుంట విమానాశ్రయంలో ప్రయాణికుల నిరసన
-
పేదల ఇళ్లు కూల్చివేత
రేణిగుంట (తిరుపతి జిల్లా): తిరుపతి జిల్లా రేణిగుంటలో దళిత వర్గానికి చెందిన సుమారు 65 రేకుల ఇళ్లను అక్రమ నిర్మాణాల సాకుతో గురువారం అధికారులు నేలమట్టం చేశారు. పేదలకు తీరని నష్టాన్ని కలిగించారు. దళిత నాయకులు, ప్రజా ప్రతినిధులను హౌస్ అరెస్ట్ చేసి ఈ దౌర్జన్య కాండను నిర్దయగా కొనసాగించారు. కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలను మోహరింపజేసి, బాధితులెవరూ రాకుండా అడ్డుకున్నారు. తొలుత రేణిగుంట సీబీఐడీ కాలనీ సమీపంలో 25 రేకుల ఇళ్లను, ఆ తర్వాత వివేకానంద కాలనీ సమీపంలో 40 ఇళ్లను కూల్చి వేశారు. బాధితులు లబోదిబోమంటూ ఆర్తనాదాలు చేసినా అధికారులు పెడచెవిన పెట్టి ఇళ్లను పూర్తిగా నేలమట్టం చేశారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ఇళ్లు లేని నిరుపేదలు ఏడాది కిందట రేణిగుంటలో రెవెన్యూ అధికారుల అనుమతులతో రేకుల ఇళ్లను నిర్మించుకుని విద్యుత్ కనెక్షన్ తీసుకుని నివాసం ఉంటున్నారు. బుధవారం రేణిగుంట సీబీఐడీ కాలనీలోని కొన్ని ఇళ్లను ఎంపీడీవో విష్ణుచిరంజీవి వెళ్లి జేసీబీ సాయంతో తొలగించారు. స్థానికులు అడ్డు చెప్పడంతో తిరిగి వెళ్లిపోయారు. అయితే గురువారం ఉదయం భారీగా పోలీసు బలగాలతో రేణిగుంట తహసీల్దార్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కూల్చివేత సాగింది. కళ్లెదుటే ఇల్లు కూల్చి వేయడంతో ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. దళితులంటే అంత చులకనా? అని బాధిత మహిళలు తహసీల్దార్ నాగేశ్వరరావును నిలదీశారు. ఈ ఇళ్లు అక్రమ నిర్మాణాలైతే అనుభవ ధ్రువీకరణ పత్రాలు, ఎన్వోసీ, ఇంటి పన్నులను రెవెన్యూ, పంచాయతీ అధికారులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఒక్కో ఇంటికి రూ.1.50 లక్షల నుంచి రూ.2.50 లక్షలు ఖర్చు చేశామని కన్నీటిపర్యంతమయ్యారు. ఇళ్లు నిర్మిస్తున్నప్పుడు ఇటువైపు కన్నెత్తి చూడని అధికారులు.. ప్రభుత్వం మారగానే, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి ఆదేశాలతో దళితుల ఇళ్లను ఇలా కూల్చేయడం దుర్మార్గం అని మండిపడ్డారు. పేద దళితులపై ఎందుకింత పగ?ఇళ్లులేని పేద దళితులు కట్టుకున్న చిన్నపాటి రేకుల ఇళ్లను దౌర్జన్యంగా కూల్చేయడం బాధాకరం. నేను అడ్డుకుంటానని భావించి మా ఇంటి వద్దకు పోలీసులను పంపి నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. మీకిది తగునా? పెత్తందార్ల ఇళ్ల జోలికి వెళ్లగలరా? ఇలాంటి ఆకృత్యాలు చేసేందుకా ప్రజలు మీకు అధికారాన్ని ఇచ్చింది? దళితులపై మీకు ఎందుకింత పగ? – ఆనందరావు, ఎంపీటీసీ సభ్యుడు, తూకివాకం, రేణిగుంట మండలంఇళ్ల కూల్చివేత దుర్మార్గంరేణిగుంట వివేకానంద కాలనీలో పేదలు, దళితులు నిర్మించుకున్న ఇళ్లను టీడీపీ నాయకుల ఆదేశాలతో అధికారులు కూల్చి వేయడం దుర్మార్గం. ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మించి ఉంటే ఆ ఇళ్లకు అనుభవ ధ్రువీకరణ పత్రం, విద్యుత్ కనెక్షన్లు ఎలా ఇచ్చారు? ఇంటి పన్నులు ఎలా వసూలు చేశారు? స్థలాలకు సంబంధించి సర్టిఫికెట్లు జారీ చేసిన అధికారులపైనా విచారించి చర్యలు తీసుకోవాలి. కరకంబాడి ఎర్రగుట్ట వివాదాస్పద భూమిని సిద్ధల రవి అనే వ్యక్తి ఆక్రమించుకుని పెద్ద ఎత్తున గ్రావెల్ తోలుకుంటుండటం మీకు కనిపించలేదా?– హరినాథ్, సీపీఎం మండల కార్యదర్శి, రేణిగుంట -
ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై శాపనార్థాలు
-
ప్రైవేట్ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం
సాక్షి, తిరుపతి: తిరుపతి జిల్లాలో ఓ ప్రైవేటు ట్రవెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గరేణిగుంట మండలం, వెదళ్ళ చెరువు వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మార్నింగ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు బెంగళూరు నుంచి అమలాపురం వెళుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు.. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో బస్సులో మంటలను అదుపు చేయించారు. అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. బస్సులో 12 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో 12 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులను స్థానిక పోలీసులు చొరవ తీసుకొని గమ్యస్థానాలకు పంపారు. ఈ ఘటనపై రేణిగుంట అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
టీడీపీ బస్సు యాత్రను అడ్డుకున్న జగనన్న కాలనీ ప్రజలు
-
తిరుపతి, రేణిగుంట రైల్వే స్టేషన్ లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు
-
కిలాడీ మాంత్రికుడు టీడీపీ నాయకుడు
-
తిరుపతి జిల్లా రేణిగుంటలో భారీ అగ్నిప్రమాదం
-
తిరుపతి: రేణిగుంటలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నారా లోకేష్
-
రేణిగుంటలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన నారా లోకేష్
సాక్షి, తిరుపతి: రేణిగుంటలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ను నారా లోకేష్ ఉల్లంఘించారు. పార్టీ జెండాలను తొలగిస్తున్న వీఆర్వో, వీఆర్ఏ, డిప్యూటీ తహశీల్దార్‌పై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. ఐడీ కార్డులు చూపించాలంటూ అధికారులపై టీడీపీ నేతలు దాడులకు దిగారు. సీఐ ఆరోహణరావును అసభ్య పదజాలంతో లోకేష్ దూషించారు. పాదయాత్రలో బయట నుంచి వచ్చిన గూండాలతో దౌర్జన్యానికి తెర తీశారు. కాగా, నారా లోకేశ్ బుధవారం కూడా బెదిరింపులకు దిగారు. ‘మా జోలికొస్తే వదిలిపెట్టం. వాళ్లు ఒక్క పార్టీ ఆఫీసు మీద దాడిచేస్తే మేం వంద పగలదొబ్బుతాం. దాడిచేసిన వారిని కడ్రాయర్లతో ఊరేగిస్తాం. మాపైనే అక్రమ కేసులు పెడుతారా? రేపు అధికారంలోకి వచ్చేది మేమే. పోస్టింగులు నిర్ణయించేది నేనే. గుర్తుపెట్టుకో..’ అంటూ లోకేష్ నోరు పారేసుకున్నారు. చదవండి: ‘ఎల్లో గ్యాంగ్’ బరితెగింపు.. ఈనాడు ‘కొట్టు’కథ.. ఆపై చింతిస్తున్నామని సవరణ -
చెన్నై ఆస్పత్రిలో నారాయణ కాలేజ్ విద్యార్థి మృతి..
సాక్షి, తిరుపతి: రేణిగుంట నారాయణ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న నవదీప్ చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నారాయణ క్యాంపస్ హాస్టల్లో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న సమయంలో నవదీప్ కత్తిపోటుకు గురయ్యారు. వెంటనే దగ్గర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడు నవదీప్ రైల్వేకోడూరు వాసిగా తెలుస్తోంది. నవదీప్ ఒంటిపై గాయాలపై అనుమానం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: (మహా నగరంలో మాయగాడు.. సివిల్ సప్లయీస్ డెప్యూటీ కలెక్టర్‌నంటూ..) -
ఘోర రోడ్డు ప్రమాదం.. వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ మృతి
సాక్షి, తిరుపతి: పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారి మర్రిగుంట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వెంకటగిరి జెడ్పీటీసీ, వైఎస్సార్సీపీ నాయకులు కోలా వెంకటేశ్వర్లు(45) మృతి చెందారు. ఆయన కారు ఇనుప లోడు లారీని ఢీకొట్టింది. వెంకటేశ్వర్లు తిరుపతి నుంచి వెంకటగిరి వెళ్తుండగా రేణిగుంట యోగానంద కాలేజి సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందగా.. అదే కారులో ఉన్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాజుల మండ్యం పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనంలో తిరుపతికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: అనంతలో విషాదం: కరెంట్ తీగలు తెగి కూలీల దుర్మరణం -
మానసిక వికలాంగుల విద్యాలయంలో దారుణం.. అల్లరి చేస్తున్నాడని..
సాక్షి, తిరుపతి: రేణిగుంట మానసిక వికలాంగుల విద్యాలయంలో దారుణం చోటు చేసుకుంది. వైఎస్సార్‌కు జిల్లాకు చెందిన విద్యార్థిని సిబ్బంది చితకబాదారు. అల్లరి చేస్తున్నాడని విద్యార్థి వీపుపై దారుణంగా కొట్టారు. దీపావళి సందర్భంగా ఇంటికి తీసుకువెళ్లిన తల్లిదండ్రులు.. తమ బిడ్డ గాయాలు గమనించి జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రేణిగుంట అభయక్షేత్రం నిర్వాహకులపై తల్లిదండ్రులు మండి పడుతున్నారు. గతంలోనూ ఇదే తరహా ఘటనలు జరిగాయని స్థానికులు అంటున్నారు. చదవండి: పెళ్లి కాకుండానే బిడ్డకు ప్రసవం.. క్యాంటమ్ కంపెనీ బాత్రూమ్లో శిశువు కలకలం -
అగ్ని ప్రమాదానికి కుటుంబం బలి
రేణిగుంట: అగ్నిప్రమాదం ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఓ తండ్రి, ఇద్దరు పిల్లలు నిద్రలోనే అగ్నికి ఆహుతవ్వగా.. తల్లి ఏకాకిగా మారిపోయింది. తిరుపతి జిల్లా రేణిగుంటలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రేణిగుంట డీఎస్పీ రామచంద్ర తెలిపిన వివరాలు.. వైఎస్సార్ జిల్లా పాటూరుకు చెందిన డాక్టర్ ఎం.రవిశంకర్‌రెడ్డి(47), గుంటూరుకు చెందిన డాక్టర్ అనంతలక్ష్మికి సిద్దార్థ్‌రెడ్డి (14), కార్తీక (10) అనే ఇద్దరు పిల్లలున్నారు. వీరు ఏడాదిన్నర కిందట రేణిగుంటలోని బిస్మిల్లానగర్‌లో రెండంతస్తుల ఇల్లు నిర్మించుకుని.. కింద ఫ్లోర్లో క్లినిక్ నిర్వహిస్తున్నారు. రవిశంకర్‌రెడ్డి తిరుపతిలోని డీబీఆర్ ఆస్పత్రిలో రేడియాలజిస్ట్‌గా పనిచేస్తున్నాడు. రవిశంకర్‌రెడ్డి తల్లి రామసుబ్బమ్మ కూడా వీరితోనే నివసిస్తోంది. శనివారం రాత్రి మొదటి అంతస్తులోని బెడ్రూమ్లో రామసుబ్బమ్మ, 2వ అంతస్తులోని ఓ గదిలో ఇద్దరు పిల్లలతో అనంతలక్ష్మి, మరో గదిలో ఆమె భర్త రవిశంకర్‌రెడ్డి నిద్రపోయారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో 2వ అంతస్తులోని వంటగది నుంచి మంటలు వ్యాపించడాన్ని గమనించిన వాచ్మెన్ కేకలు వేస్తూ తలుపులు బాదాడు. అనంతలక్ష్మి తలుపు తీసి బయటకు రాగా.. అప్పటికే మంటలు దట్టంగా కమ్మేశాయి. దీంతో ఆమె ప్రాణభయంతో కిందకు పరుగు తీసింది. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. మొదటి అంతస్తులో ఉన్న రామసుబ్బమ్మను కిటికీ అద్దాలు పగలగొట్టి.. జేసీబీ సాయంతో సురక్షితంగా తీసుకొచ్చారు. 2వ అంతస్తులో ఉన్న పిల్లలను అతికష్టం మీద బయటకు తీసుకురాగా.. అప్పటికే వారు మృతి చెందారు. మరో గదిలో నిద్రించిన డాక్టర్ రవిశంకర్‌రెడ్డి పూర్తిగా కాలిపోయి మరణించాడు. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఆయన కుమార్తె పవిత్రారెడ్డి ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతలక్ష్మిని ఎమ్మెల్యే పరామర్శించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలకు తరలించినట్లు గాజులమండ్యం పోలీసులు తెలిపారు. గ్యాస్ లీకై.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. -
తిరుపతి జిల్లా రేణిగుంట లో తీవ్ర విషాదం
-
అగ్నిప్రమాదంలో సజీవదహనమైన డాక్టర్, ఇద్దరు చిన్నారులు
-
తిరుపతి జిల్లా రేణిగుంట అగ్నిప్రమాదంలో ఇద్దరు మృతి
-
తిరుపతి జిల్లా రేణిగుంటలో భారీ అగ్నిప్రమాదం
-
YSR Kdapa-Renigunta: వడివడిగా హైవే.. రూ.4వేల కోట్లతో రోడ్డు నిర్మాణం
సాక్షి, రాజంపేట : శేషాచలం అటవీ ప్రాంతంలో పచ్చటి ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన ప్రయాణం చేసే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. రాయలసీమ జిల్లాలకు ముఖ్య రహదారిగా ప్రాచుర్యం పొందిన 716 కడప–రేణిగుంట జాతీయరహదారిని 2024 నాటికి పూర్తిగా అందుబాటులో తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. తక్కువ వ్యవధిలోనే తిరుపతి.. కడప–రేణిగుంట ఎన్‌హెచ్ ఏర్పడిన తర్వాత తక్కువ వ్యవధిలో తిరుపతికి చేరుకోవచ్చు. ఫలితంగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణా రాష్ట్రాల నుంచి వచ్చేవారు తిరుపతి, చెన్నై నగరాలకు వెళ్లే వారికి కడప–రేణిగుంట రహదారి ఎన్‌హెచ్ చేయడం వల్ల త్వరితగతిన గమ్యానికి చేరుకునే వీలు కలుగుతుంది. రెండు ప్యాకేజీలుగా..హైవే నిర్మాణం కడప నుంచి చిన్నఓరంపాడు(64.2కేఎం), చిన్నఓరంపాడు నుంచి రేణిగుంట వరకు రెండుప్యాకేజీలుగా హైవే నిర్మాణపనులు జరుగుతాయి. నాలుగులేన్లుగా రోడ్డు నిర్మితం కానుంది. ఇందు కోసం టెండర్లను కూడా కేంద్రం పిలిచింది. రెండు ప్యాకేజీలకు కలిపి రూ.4వేల కోట్లు వ్యయం చేయనుంది. సెప్టెంబరు 16 తర్వాత టెండర్ల ఖరారును నిర్ణయిస్తారు. రాజంపేట, రైల్వేకోడూరులో బైపాస్ రహదారి కడప–రేణిగుంట రహదారిలో రాజంపేట, రైల్వేకోడూరులో బైపాస్ రహదారి నిర్మించాలని యోచిస్తున్నారు. ముంబై–చెన్నై రైలుమార్గం వెంబడి (పడమర వైపు )భాకరాపేట నుంచి చిన్నఓరంపాడు వరకు మార్గం నిర్మితం కానున్నది.ఇది పూర్తిగా అటవీమార్గంలోనే కొనసాగుతుంది. మార్గమధ్యలో ఆర్వోబీలు, చెయ్యేరునదిపై వంతెనలు, చిన్న చిన్న బ్రిడ్జిల నిర్మాణాలు ఉన్నాయి. త్వరతగితిన హైవే నిర్మాణానికి ఎంపీ మిథున్‌రెడ్డి కృషి కడప–రేణిగుంట నేషనల్ హైవే త్వరితగతిన నిర్మితమయ్యేలా రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి తన వంతు కృషిచే శారు. కేంద్రం తీసుకున్న ప్రయార్టీలో కడప–రేణిగుంట ఎన్‌హెచ్‌ను చేర్చేలా ఎంపీ విశ్వప్రయత్నాలు చేశారు. ఫలితంగా భూసేకరణ, మరోవైపు టెండర్ల ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. రెండేళ్లలో ఎన్‌హెచ్‌ను అందుబాటులోకి తీసుకురావాలన్నదే అభిమతంగా ఎంపీ ప్రయత్నిస్తున్నారు. ఒంటిమిట్ట, నందలూరు ప్రాంతాలకు స్పెషల్ కనెక్టిటివిటీ అవసరం జిల్లాలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలైన నందలూరు, ఒంటిమిట్ట కేంద్రాలకు ఎన్‌హెచ్ నుంచి కనెక్టిటివిటీ రోడ్ (సర్వీసురోడ్డు) అవసరమని పలువురు భక్తులు కేంద్రాన్ని కోరుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి వెళ్లే యాత్రీకులు ఒంటిమిట్ట రామయ్య, సౌమ్యనాథుని దర్శించుకుంటారు. అంతేగాకుండా రాయలసీమలో తొలిసారిగా బయల్పడిన బౌద్ధారామాలున్నాయి. ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. ప్రస్తుతం కడప–రేణిగుంట హైవేలో ట్రాఫిక్ పెరుగుతోంది. ఈ మార్గం మీదుగా తిరుపతి, చెన్నై, ముంబై, హైదరాబాదులకు రాకపోకలు జరుగుతున్నాయి. నిత్యం 17వేలకు పైగా వాహనాలు పరుగులు తీస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్‌కు హైవే కెపాసిటీ సరిపోవడంలేదు. ఫలితంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతేగాకుండా కడప–రేణిగుంట రోడ్డు ప్రయాణం మూడు నుంచి నాలుగు గంటలకుపైగా పడుతోంది. సకాలంలో గమ్యాలకు చేరలేని పరిస్ధితి. నాలుగులైన్లరోడ్డు నిర్మాణంతో ట్రాఫిక్ తగ్గుతుంది. ప్రమాదాలు తగ్గుముఖం పడతాయి. భూసేకరణ ప్రక్రియ ప్రారంభం కడప–రేణిగుంట ఎన్‌హెచ్‌కు 1,066 ఎకరాల భూసేకరణ చేపట్టారు. ఇప్పటికే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పూర్తి అయింది. డ్రాఫ్ట్ డిక్లరేషన్ చేయాల్సి ఉంది. పరిహారం చెల్లింపు ప్రక్రియను రెవెన్యూ అధికారులు చేపట్టారు. అన్నమయ్య జిల్లా జేసీ తమీమ్ అన్సారియాలు పరిహారం అందజేసే అంశంపై కసరత్తు చేస్తున్నారు. వైఎస్సార్ జిల్లా జాయింట్ కలెక్టర్ కూడా భూసేకరణపై దృష్టి సారించారు. త్వరగా అందుబాటులోకి తీసుకొస్తాం రాజంపేట, రైల్వేకోడూరులో బైపాస్‌రోడ్డు నిర్మితం కానుంది. రూ.4వేల కోట్లతో రెండు ప్యాకేజీలుగా నిర్మాణ పనులు జరుగుతాయి. గ్రీన్‌హైవే ఎక్స్‌ప్రెస్‌లో పచ్చటి ప్రకృతిలో.. ఆహ్లాదకరమైన వాతవరణంలో త్వరితగతిన గమ్యాలకు చేరుకోవచ్చు. 2024 నాటికి అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. –పీవీ మిథున్‌రెడ్డి, ఎంపీ, రాజంపేట ప్రమాదాలు తగ్గుతాయి కడప–రేణిగుంట ఎన్‌హెచ్ నిర్మాణంతో ప్రమాదాలు తగ్గుముఖం పడతాయి. కడప–తిరుపతి మధ్య ప్రయాణ వ్యవధి తగ్గిపోతుంది. ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఒంటిమిట్ట, నందలూరులో ఉన్నందున ప్రత్యేకంగా స్పెషల్ సర్వీసు రోడ్డు నిర్మిచాల్సిన అవసరం ఉంది. త్వరగా అందుబాటులోకి వస్తే ఉభయ వైఎస్సార్ జిల్లా వాసులే కాకుండా, ఉత్తరభారతదేశం వారికి సకాలంలో తిరుపతి,గా చెన్నైలకు వెళ్లే వీలు ఉంటుంది. –మేడారఘునాథరెడ్డి, అధినేత, ఎంఆర్‌కెఆర్ సంస్థ, నందలూరు -
నాతో సన్నిహితంగా ఉంటే డబ్బులు, దుస్తులు ఇస్తానంటూ యజమాని..
సాక్షి, రేణిగుంట: వివాహితపై లైంగిక దాడికి యత్నించిన సంఘటన పట్టణంలో ఆలస్యంగా వెలుగు చూసింది. సీఐ అంజూయాదవ్ కథనం మేరకు.. రేణిగుంటకు చెందిన నేమిచంద్ (57) ఆర్టీసీ బస్టాండు సమీపంలో పీఆర్జీ నగలషాపు నడుపుతున్నాడు. రాజస్థాన్‌కు చెందిన ఒక వ్యక్తి ఐదేళ్లుగా అతని షాపులో పని చేస్తున్నాడు. నేమిచంద్ భార్య ఊరెళ్లింది. ఈ క్రమంలో ఇంట్లో పనిచేసేందుకు ఈ నెల 13న తన షాపులో పనిచేస్తున్న వ్యక్తి భార్యను పంపించాలని చెప్పాడు. దీంతో వివాహిత (25) యజమాని ఇంటికి చేరుకుని చెత్త తోస్తుండగా నేమిచంద్ వెనుక నుంచి గట్టిగా పట్టుకుని లైంగిక దాడికి యత్నించాడు. తనతో సన్నిహితంగా ఉంటే డబ్బులు, దుస్తులు ఇస్తానని చెప్పి లొంగదీసుకునేందుకు యత్నించాడు. ఆమె అక్కడి నుంచి తప్పించుకుని జరిగిన విషయం భర్తకు చెప్పింది. చదవండి: (ఆకాశవాణి రేడియో కేంద్రం.. మీరు వింటున్నారు..) బాధితురాలి భర్త యజమానిని నిలదీయడంతో విషయం ఎక్కడైనా చెప్తే మిమ్మల్ని చంపేస్తానని, షాపులో నగలు దొంగతనం చేశావని కేసు పెడతానని బెదిరించాడు. దీంతో దంపతులు భయంతో ఎవరికీ చెప్పలేదు. మంగళవారం ముభావంగా ఉన్న బాధితురాలి భర్తను తమ సమీప బంధువు ఆరా తీయడంతో జరిగిన విషయం చెప్పాడు. దీంతో అతని సాయంతో మంగళవారం సాయంత్రం బాధితురాలు రేణిగుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. చదవండి: (బిడ్డ పుట్టిన తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగి నట్టేట ముంచాడు) -
రేణిగుంట చేరుకున్నగౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులు
-
బిడ్డ భవిష్యత్ కోసం కువైట్‌కు.. మరోగంటలో ఆమెను చూస్తాననగా..
పెళ్లయిన కొన్నాళ్లకే భర్తను మృత్యువు కబళించేసింది. ఒక్కగానొక్క బిడ్డ భవిష్యత్ కోసం దేశంగాని దేశం వెళ్లింది. మూడేళ్లకోసారి వచ్చి కుమార్తెను తనివిదీరా చూసుకునేది. వయసు మీద పడడంతో ఇక చివరిమజిలీని కుమార్తె వద్దే గడపాలనుకుంది. కువైట్‌లో విమానమెక్కి స్వదేశానికి వచ్చింది. అక్కడి నుంచి కారులో జిల్లా పొలిమేర వరకు వచ్చింది. మరో గంటలో కన్నబిడ్డను చూసేస్తామనుకుంది. అంతలోనే మృత్యువు అడ్డుపడింది. కారులో ఉన్న ఆమెతో పాటు, సోదరుడినీ తీసుకెళ్లిపోయింది. అమ్మ వచ్చేస్తోందని ఎంతో ఆత్రుతగా ఇంటి దగ్గర ఎదురుచూస్తున్న కుమార్తె జీవితంలో చీకటి నిండిపోయింది. ఇటు మామయ్య కుటుంబం కూడా తనలాగే పెద్ద దిక్కు కోల్పోయిందని తెలిసి గుండె పగిలేలా ఏడ్చింది. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో ఊరంతా శోకసంద్రంలో మునిగిపోయింది. సాక్షి, చిత్తూరు(రేణిగుంట): రేణిగుంట–కడప రోడ్డు మార్గంలో గురువారం ఉదయం ఎదురెదురుగా వస్తున్న కారు, లారీ ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. రేణిగుంట అర్బన్ సీఐ అంజూయాదవ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం హస్తవరం పంచాయతీ చెర్లోపల్లి ఎస్టీ కాలనీకి చెందిన ముద్దనూరు సుబ్బనరసమ్మ(60) 15 ఏళ్లుగా మస్కట్, కువైట్‌కు ఉపాధి కోసం వెళ్లి వస్తూ ఉండేది. ఈ క్రమంలో మూడేళ్ల కిందట కువైట్‌కు వెళ్లి, తిరిగి ఇంటికొస్తున్నట్లు బంధువులకు సమాచారం అందించడంతో ఆమెను తీసుకొచ్చేందుకు బుధవారం సాయంత్రం సుబ్బనరసమ్మ సోదరుడు లక్ష్మయ్య(40), అతని కుమారుడు శేఖర్(20), బావ సిద్ధయ్య(67), ఓ బాడుగ కారును మాట్లాడుకుని చెన్నైకి బయల్దేరారు. వారితోపాటు కారు డ్రైవర్ భాను(32) కూడా ఉన్నాడు. చెన్నై విమానాశ్రయంలో దిగిన సుబ్బనరసమ్మను కారులో ఎక్కించుకుని గురువారం తెల్లవారుజామున 3 గంటలకు చెన్నై విమానాశ్రయం నుంచి స్వగ్రామానికి బయల్దేరారు. చదవండి: (రాజేంద్రనగర్‌లో దారుణం.. టెన్త్ క్లాస్ విద్యార్థినిపై అత్యాచారం) రేణిగుంట మండలం మామండూరు పంచాయతీ కుక్కలదొడ్డి సమీపంలో ఎదురుగా రేణిగుంట వైపు వస్తున్న లారీ వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో కువైట్ నుంచి వస్తున్న సుబ్బనరసమ్మ(60), ఆమె సోదరుడు లక్ష్మయ్య(40) అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న లక్ష్మయ్య కుమారుడు శేఖర్(20), బావ సిద్ధయ్య(67), బెరసపల్లికి చెందిన కారు డ్రైవర్ భాను (32)కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న సీఐ అంజూయాదవ్ ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. వీరిలో సిద్ధయ్య, భాను పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అక్కడ నుంచి తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. చదవండి: (డ్యూటీకి వెళ్లిన భర్త తిరిగి ఇంటికి వచ్చేసరికి..) కుమార్తె భవిష్యత్ కోసమే.. సుబ్బనరసమ్మకు పెళ్లయిన కొన్నేళ్లకే భర్త మృతి చెందాడు. ఒక్కగానొక్క కూతురు లక్ష్మీదేవి భవిష్యత్తు కోసం, పొట్ట చేతపట్టుకుని 15ఏళ్ల కిందట ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లింది. కొంత సంపాదించి కుమార్తెను మడంపల్లివాసికి ఇచ్చి తొమ్మిదేళ్ల కిందట వివాహం జరిపించింది. మూడేళ్లకోసారి వచ్చి కుమార్తె చూసుకుంటూ కొన్నేళ్లపాటు ఇక్కడే ఉండి మళ్లీ కువైట్‌కు వెళుతుండేది. ఈ క్రమంలో 2019లో ఆమె కువైట్‌కు వెళ్లింది. ఇక ఇంటివద్దే ఉండి, కూతురు బాగోగులను చూసుకుంటానని కుమార్తె, బంధువులకు చెప్పి కువైట్‌లో బుధవారం బయల్దేరింది. గురువారం ఉదయం కన్నకూతురును చూడకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఆమె సోదరుడు లక్ష్మయ్యది కూడా రెక్కాడితే గానీ డొక్కాడని దుస్థితి. ఆయనకు భార్య గంగాదేవి, ఇద్దరు కుమారులు మహేంద్ర(22), శేఖర్(20) ఉన్నారు. ఈ ప్రమాదంలో శేఖర్ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరో గంటకల్లా ఇల్లు చేరుతామనుకున్న వారిపై దూసుకొచ్చిన మృత్యుశకటం ఆ కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగిల్చింది. -
ఇంజనీరింగ్ నైపుణ్యానికి మచ్చుతునక.. మల్లెమడుగు రిజర్వాయర్
సాక్షి, తిరుపతి అర్బన్ (చిత్తూరు జిల్లా): రాయలసీమలో ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, ప్రాజెక్టులకు గండ్లు పడి తీవ్రనష్టం వాటిల్లుతోంది. ఇదే సమయంలో చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలో ఉన్న మల్లెమడుగు రిజర్వాయర్‌కు మాత్రం ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. వచ్చిన వరదను వచ్చినట్టుగా సులువుగా దిగువకు విడిచిపెట్టేశారు. అలాగే వరదకు కొట్టుకొచ్చిన పెద్ద పెద్ద వృక్షాలను సైతం అవలీలగా కిందకు పంపేశారు. దీనికి కారణం.. మల్లెమడుగు రిజర్వాయర్‌ను సైఫన్లతో నిర్మించడమే. సైఫన్ల వల్లే ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలను, దానికి తగ్గట్టే వస్తున్న వరద నీరును రిజర్వాయర్ తట్టుకుంటోంది. 61 ఏళ్లు గడిచినా చెక్కు చెదరలేదు.. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం ఎస్వీపురం, కరకంబాడి పంచాయతీల్లో 2,230 ఎకరాల విస్తీర్ణంలో మల్లెమడుగు రిజర్వాయర్‌ను ఏర్పాటు చేశారు. దీని నీటి నిల్వ సామర్థ్యం 0.181 టీఎంసీలు. 1960లో 47 సైఫన్లు అమర్చారు. ఇవి 61 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం విశేషం. రాష్ట్రంలో కేవలం మల్లెమడుగు రిజర్వాయర్‌కు మాత్రమే ఈ సైఫన్లు ఉన్నాయి. మొత్తం 21 అడుగుల లోతు కలిగిన ఈ రిజర్వాయర్‌లో 14 అడుగుల్లో నీటిని నిల్వ చేస్తున్నారు. ఇదే తరహాలో రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లకు సైఫన్ సిస్టమ్ ఏర్పాటు చేస్తే వరదలతో ఇబ్బంది ఉండదని నిపుణులు చెబుతున్నారు. చదవండి: ఏపీలో పేదల ఇళ్ల నిర్మాణానికి మార్గం సుగమం సైఫన్లు అంటే.. సిమెంట్, కాంక్రీట్లతో తయారుచేసిన రోలర్లులాంటివి.. ఈ సైఫన్లు. మొత్తం 47 సైఫన్లు ఉన్నాయి. ఒక్కోదాన్ని 20–25 అడుగుల ఎత్తు, 5 – 7 అడుగుల వెడల్పుతో నిర్మించారు. రిజర్వాయర్‌లో 14 అడుగుల్లో నీటిని నిల్వ చేయడానికి అవకాశం ఉంది. 14 అడుగులకు మించి ఒక్క అడుగు నీరు వస్తే 28 సైఫన్లు వాటంతటవే ఓపెన్ అవుతాయి. రోలర్ మాదిరిగా తిరుగుతూ వచ్చిన నీటిని వచ్చినట్టు సైక్లింగ్ చేస్తూ దిగువకు వదిలేస్తాయి. 14 అడుగులకంటే మరో రెండు అడుగుల నీరు అధికంగా వస్తే 28 సైఫన్లతోపాటు 12 ఓపెన్ అవుతాయి. చదవండి: తక్షణ వరద సాయం కింద రూ.1,000 కోట్లు ఇవ్వండి: విజయసాయిరెడ్డి 14 అడుగుల కంటే మూడు అడుగులపైన నీరు వస్తే ఇంకో 7 ఓపెన్ అవుతాయి. అధికంగా వచ్చిన నీటిని పంపేయగా యథావిధిగా 14 అడుగుల నీటిని రిజర్వాయర్‌లో నిల్వ చేస్తాయి. ఇందుకు మానవ వనరుల అవసరం ఏమీ ఉండదు. ఇవికాకుండా మరో 17 ఇనుప గేట్లు ఉన్నా వాటి అవసరం ఎప్పుడూ రాలేదు. ఈ సైఫన్ల పనితీరును చూసిన ఇంజనీర్లు అప్పటి ఇంజనీర్ల పనితీరును ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. పుణ్యజలం.. మల్లెమడుగు మల్లెమడుగు నీటిని స్థానికులు పుణ్యజలంగా భావిస్తుంటారు. తిరుమల కొండల్లోని గోగర్భం, పాపవినాశనం, కుమారధార, పసుపుధార, ఆకాశగంగ.. ఇలా పంచ జలాశయాల నుంచి వచ్చే నీరు మల్లెమడుగు రిజర్వాయర్‌లోకి చేరుతోంది. ప్రస్తుతం రేణిగుంట, ఏర్పేడు మండలాల్లోని 14 చెరువులకు ఈ రిజర్వాయర్ నీటిని పంపుతున్నారు. దీంతో 3,950 ఎకరాల భూములు సాగులోకి వచ్చాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మల్లెమడుగు రిజర్వాయర్ ద్వారా 10 వేల ఎకరాలకు పైగా సాగునీరు అందించడానికి కృషి చేస్తోంది. -
అమ్మమ్మ మందలించిందని..చెన్నైలో అదృశ్యం.. రేణిగుంటలో ప్రత్యక్షం
సాక్షి, రేణిగుంట: అమ్మమ్మ మందలించిందని ఓ మనవరాలు ఇంటి నుంచి అదృశ్యమైంది. ఎక్కడెక్కడో తిరిగి చివరికి రేణిగుంటకు చేరింది. అదృష్టవశాత్తు సీఐ అంజూయాదవ్ దృష్టికి రావడంతో వ్యవహారం సుఖాంతమైంది. కుటుంబ సభ్యుల దరికి చేరింది. శనివారం రాత్రి సీఐ తెలిపిన వివరాలు.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన యువతి(18) చెన్నైలో చదువుతోంది. అక్కడే అమ్మమ్మ ఇంటిలో ఉంటోంది. ఆమె తల్లి ఓ ప్రైవేటు స్కూలులో టీచర్‌గా పనిచేస్తోంది. చదువుల పరంగా వెనుకబడిపోతున్నావని అమ్మమ్మ ఇటీవల మందలించడంతో ఇంటి నుంచి పారిపోయింది. ఈమేరకు చెన్నైలో మిస్సింగ్ కేసు కూడా నమోదైంది. చెన్నై నుంచి గుంటూరు ఇతర ప్రాంతాలకు వెళ్లిన యువతి శనివారం రేణిగుంటలో ప్రత్యక్షమైంది. ఆమె అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో ఆటోడ్రైవర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సీఐ ఆ యువతిని తన వెంట స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఒకింత బెరుకు, భయంతో ఉన్న విద్యార్థినికి తొలుత అల్పాహారం తెప్పించి పెట్టారు. ఆ తర్వాత అనునయించి మాట్లాడితే విషయం చెప్పింది. ఇలా చెప్పాపెట్టకుండా ఇంటి నుంచి వచ్చేస్తే కుటుంబ సభ్యులు ఎంతగా టెన్షన్ పడతారో..ఆలోచించావా తల్లీ? అంటూ బుజ్జగించారు. చదవండి: (చిరునవ్వుతో భర్తకు ఎదురెళ్లింది.. ఏమైందో తెలియదు.. కొద్ది నిమిషాల్లోనే..) కుటుంబ సభ్యుల వివరాలతో పాటు ఆ విద్యార్థి వద్ద ఉన్న ఐడీ కార్డును చూసి ఎక్కడ చదువుతోందో తెలుసుకున్నారు. ఆ విద్యార్థిని తల్లి, అమ్మమ్మతో తన ఫోన్ నుంచి మాట్లాడించారు. అంతే! ఉరుకులు పరుగులతో ఆ విద్యార్థిని తల్లి తన కుమారుడితో వచ్చి శనివారం రాత్రి సీఐను కలిసింది. కుమార్తెను చూడగానో భావోద్వేగంతో కదలిపోయింది. అప్పటివరకు పడిన టెన్షన్ ఎగిరిపోయిందేమో..! కళ్ల నుంచి రాలుతున్న ఆనందభాష్పాల నడుమ కుమార్తెను హత్తుకుంది. పోలీసుల మోముల్లో నవ్వులు పూశాయి. -
తిరుపతిలో టీడీపీ నేత చదలవాడ రౌడీయిజం
-
రూ.500 కోట్ల స్థలం కబ్జా.. అధికారులకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బెదిరింపులు
తిరుపతి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి రెవెన్యూ అధికారులను బెదిరిస్తూ.. దౌర్జన్యకాండకు దిగాడు. కబ్జా స్థలం పరిశీలనకు వెళ్లిన రెవిన్యూ అధికారులను బెదిరించారు. స్థలంలో అడుగుపెడితే కొడతామంటూ హెచ్చరించాడు. ఇక్కడ్నుంచి వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేశాడు. తన వెనుక పదివేల మంది జనం ఉన్నారంటూ చదలవాడ బెదిరింపులకు దిగాడు. రేణిగుంట రోడ్డులో చదలవాడ కృష్ణమూర్తి 72 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశాడు. ఆ స్థలం విలువ 500 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. -
తుపాకీతో కాల్చుకుని హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
-
అమర్‌రాజా ఫ్యాక్టరీ యాజమాన్యంపై కేసు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: జల, వాయు కాలుష్యాలను వెదజల్లుతూ కార్మికులు సహా చుట్టుపక్కల ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తున్న అమర్‌రాజా ఫ్యాక్టరీ యాజమాన్యంపై పోలీసు కేసు నమోదైంది. ఆ ఫ్యాక్టరీలో కాలుష్యం శాతం ఏ మేరకు ఉందో పరిశీలించేందుకు వచ్చిన చెన్నై ఐఐటీ నిపుణులతో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను అడ్డుకున్నందుకు గాను అమర్‌రాజా బ్యాటరీ ఇండస్ట్రీస్‌పై రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేశారు. రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ పరిధిలో ఉన్న అమర్‌రాజా ఫ్యాక్టరీల నుంచి వచ్చే కాలుష్యం శాతం, దాని ప్రభావాలపై ఏపీ కాలుష్య నియంత్రణ మండలి పరిశీలన చేపట్టింది. ఈ క్రమంలో ఫ్యాక్టరీల ఎన్విరాన్మెంటల్ ఆడిటింగ్‌తో పాటు కాలుష్య శాతం ఏ మేరకు ఉందో అధ్యయనం చేయాలని చెన్నైకి చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)కి కాంట్రాక్ట్ అప్పగించింది. ఈ నెల 3వ తేదీన చెన్నై నుంచి వచ్చిన ఐఐటీ నిపుణుల బృందం సభ్యులు ఫ్యాక్టరీలోకి వెళ్లేందుకు యత్నించారు. అయితే, ఫ్యాక్టరీ సెక్యూరిటీ సిబ్బంది ఐఐటీ నిపుణులను లోనికి అనుమతించలేదు. అమర్‌రాజా ఫ్యాక్టరీస్ డీజీఎంగా పనిచేస్తున్న ఎన్.గోపీనాథరావుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (పీసీబీ) తరఫున వచ్చామని చెప్పినా పట్టించుకోలేదు. చివరకు పీసీబీ ఈఈ నరేంద్రబాబు వచ్చినా లోనికి అనుమతించలేదు. దీంతో పీసీబీ ఈఈ నరేంద్రబాబు ఈ నెల 16వ తేదీన రేణిగుంట పోలీస్ స్టేషన్లో సదరు ఫ్యాక్టరీల నిర్వాకంపై ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించినందుకు గానూ కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో కోరారు. ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు శనివారం తెలిపారు. -
కరోనా మిగిల్చిన కన్నీటి గాథలు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం తూకివాకం గ్రామానికి చెందిన టి.చంద్రశేఖర్‌రెడ్డి (44) మే మొదటి వారంలో కరోనా బారినపడి మృతి చెందారు. ఆయనకు భార్య దీప, కుమారులు మంజునాథ, సాయిప్రతాప్ ఉన్నారు. చంద్రశేఖర్‌రెడ్డి తిరుపతిలో బియ్యం వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. ఇద్దరు పిల్లల్ని బాగా చదివించి ఉన్నత స్థానంలో చూడాలని ఆశపడ్డారు. అందుకోసం నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. ఉన్నట్టుండి కరోనా రూపంలో మృత్యువు ఆయనను కాటేసింది. ఆ కుటుంబాన్ని దిక్కులేని వాళ్లను చేసింది. చంద్రశేఖర్‌రెడ్డి మరణాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. అనుక్షణం ఆయన ఫొటో చూస్తూ రోదిస్తూనే ఉన్నారు. బిడ్డను పోషించుకోలేక.. తిరుపతి కోలా వీధిలో నివాసం ఉన్న ఆటోడ్రైవర్ అల్లావుద్దీన్ (44)ను కరోనా కాటేసింది. ఈయనకు ఆరుగురు ఆడపిల్లలు ఉండగా.. తన రెక్కల కష్టంతోనే ఐదుగురికి వివాహం జరిపించారు. చిన్న కుమార్తె షమీమ్ 8వ తరగతి చదువుతోంది. ఆమెను కూడా చదివించి వివాహం చేస్తే ఆయన బాధ్యత తీరేది. ఈలోగానే కరోనా బారినపడిన ఆయన తనువు చాలించాడు. దీంతో ఆ కుటుంబానికి పోషణ భారమైంది. షమీమ్ చదువు నిలిచిపోయింది. ఆయన భార్య కృషీదా కుటుంబ పోషణ కోసం మహతి ఆడిటోరియం వద్ద పుట్‌పాత్‌పై కూరగాయల అమ్మకం చేపట్టింది. ఇంటి అద్దె చెల్లించలేక కుమ్మరి తోపులోని ఒక చిన్న ఇంట్లోకి మారారు. దాతల సహకారంతో కూరగాయల వ్యాపారం ప్రారంభించినా.. కర్ఫ్యూ కారణంగా వ్యాపార వేళలు కుదించడంతో వచ్చే ఆదాయం తినడానికే చాలడం లేదు. ఇంటి అద్దె ఎలా చెల్లించాలో కూడా తెలియక సతమతమవుతుండగా.. ఇంటి యజమాని వారి దీన స్థితి చూసి అద్దె అడగటం లేదు. ఇలా ఎంతకాలం నెట్టుకురావాలో తెలియక అల్లావుద్దీన్ భార్య కృషీదా అల్లాడుతోంది. చిత్తూరు జిల్లాలో ఎక్కడ చూసినా ఇలాంటి గాథలే కనిపిస్తున్నాయి. ఇంటి పెద్దలు దూరమవటంతో ఎన్నో కుటుంబాలు అతలాకుతలం అవుతున్నాయి. నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. కరోనా మొదటి విడతతో పోలిస్తే రెండో వేవ్‌లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. వయోభేదం లేకుండా యువకులు సైతం కరోనాకు బలవుతున్నారు. జిల్లాలో 12.07 శాతం మరణాలు కోవిడ్–19 చిత్తూరు జిల్లాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కరోనా కారణంగా జిల్లాలో ఇప్పటివరకు 1,412 మంది మృత్యువాత పడ్డారు. కోవిడ్ మరణాల్లో చిత్తూరు నగరానిదే అగ్రస్థానం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 11,696 మంది మృత్యవాత పడితే అందులో 12.07 శాతం మరణాలు చిత్తూరు జిల్లాలోనే నమోదయ్యాయి. ఒక మరణం అనేక సమస్యలకు.. వేదనలకు దారి తీస్తోంది. మరణించిన వారి కుటుంబాల్లో అలముకున్న శూన్యాన్ని.. పెల్లుబుకుతున్న వేదనను తీర్చడం ఎవరివల్ల సాధ్యం కావటం లేదు. ‘ఇల్లు వదిలి బయటకు రావొద్దు.. కరోనా బారిన పడొద్దు’ అని పాలకులు, అధికారులు వైద్యులు పదపదే విజ్ఞప్తి చేస్తున్నా చెవికెక్కించుకోని సమాజం.. కనీసం కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని అయినా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. -
18న తిరుపతికి సీఎం వైఎస్ జగన్
చిత్తూరు కలెక్టరేట్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 18న తిరుపతిలో పర్యటించనున్నారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌కు అందిన సమాచారం మేరకు.. గురువారం సాయంత్రం 4.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి రుయా ఆసుపత్రి సమీపంలో స్వామి వివేకానంద సర్కిల్ వద్దనున్న రిటైర్డ్ మేజర్ జనరల్, బంగ్లాదేశ్ యుద్ధంలో పాల్గొన్న 95 ఏళ్ల సి.వి.వేణుగోపాల్ ఇంటికి వెళ్లి ఆయన్ని సత్కరిస్తారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని విజయజ్వాలను వెలిగిస్తారు. అనంతరం పలువురు సైనికులకు అవార్డులు అందజేస్తారు. సైనికులనుద్దేశించి ప్రసంగించిన అనంతరం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని తిరుగుప్రయాణం అవుతారు. -
వీడిన రేణుగుంట పేలుడు మిస్టరీ
సాక్షి, రేణిగుంట (చిత్తూరు జిల్లా): రేణిగుంట–కోడూరు రైల్వే మార్గంలో రైలు పట్టాలపై రసాయన వ్యర్థాల వల్ల పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలివీ.. రేణిగుంట తారకరామానగర్‌కు చెందిన శశికళ (35) మంగళవారం గ్రామ శివారులో ఆవులను మేపుతోంది. ఆవులు రైలు పట్టాలపైకి వెళ్లడంతో వాటిని పక్కకు తోలేందుకు పట్టాలపైకి వెళ్లింది. రైలు పట్టాలపై ఓ బాక్స్ ఆమెకు అనుమానాస్పదంగా కనిపించడంతో చేతిలో ఉన్న గొడుగు సాయంతో బాక్స్‌ను కదిపింది. ఒక్కసారిగా భారీ శబ్దంతో బాక్స్ పేలింది. దీంతో ఆమె చేతులు, కాళ్లు, ముఖానికి తీవ్ర రక్త గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనంలో ఆమెను తిరుపతి రుయాకు తరలించారు. రైలు పట్టాలపై ఆ బాక్స్ ఉన్న సమయంలో రైళ్ల రాకపోకలు జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బాంబ్ స్క్వాడ్ నిపుణులు అక్కడకు చేరుకుని పేలుడు అవశేషాలను సేకరించారు. రసాయన వ్యర్థాల వల్లే పేలుడు రసాయన వ్యర్థాలతో కూడిన డబ్బాను నిర్లక్ష్యంగా రైలు పట్టాలపై పడేయడం వల్లే ఈ పేలుడు ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా నిర్ధారించామని తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్‌రెడ్డి తెలిపారు. ఇనుప కడ్డీలను వేడి చేసేందుకు ఉపయోగించే మిథైల్ ఇథైల్ కీటో పెరాక్సైడ్ అనే రా మెటీరియల్‌తో కూడిన డబ్బాను స్థానికంగా ఉన్న బాలాజి వెల్డింగ్ షాపు నుంచి తెచ్చి ఇక్కడ పడేసినట్లు విచారణలో గుర్తించామన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన షాపు యాజమాన్యంపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. (చదవండి: స్నానం చేస్తుంటే వీడియో తీసి.. ఆపై) -
వాగులో చిక్కుకున్న ముగ్గురు రైతులు
సాక్షి, చిత్తూరు: పొలంలో మోటార్ కోసం వెళ్లి ముగ్గురు రైతులు వాగులో చిక్కుకున్నారు. వారిలో ఇద్దరు రైతులను ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రక్షించాయి. గల్లంతు అయిన మరో రైతు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా మల్లెమడుగు రిజర్వాయర్ నిండిపోవడంతో నీటి ఉధృతి పెరిగి ప్రాణాపాయ స్థితిలో పడ్డారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం డిక్షన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు,ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక దళ సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. నివర్ తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. (చదవండి: తీరాన్ని దాటిన నివర్ తుపాను..) -
‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ పేరుతో ఘరానా మోసం
సాక్షి, తిరుపతి : ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ పేరుతో మహిళను నిలువునా ముంచాడు ఓ మోసగాడు. 25 లక్షల రూపాయల లాటరీ తగిలిందని చెప్పి చిత్తూరు జిల్లా రేణిగుంటకు చెందిన మహిళకు కుచ్చు టోపి పెట్టాడు. రేణిగుంటకు చెందిన ఓ మహిళకు 25 లక్షల రూపాయల లాటరీ తగిలిందని ఫోన్ వచ్చింది. తొలుత 35 వేల రూపాలయలు చెల్లిస్తే లాటరీ డబ్బులు అందిస్తామని నమ్మబలికారు. మోసగాళ్ల మాయ మాటలు నమ్మిన మహిళ.. 35వేలను చెల్లించింది. ఆ తర్వాత జీఎస్టీ కోసం మరో 10 వేల రూపాయలు చెల్లించాలని పదేపదే ఫోన్లు చేశారు. దీంతో మహిళకు అనుమానం కలిగి.. పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
రైలు.. @130
సాక్షి, అమరావతి: ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి ఆరు ప్రధాన రూట్లలో రైళ్ల వేగాన్ని గంటకు 130 కిలోమీటర్ల మేర పెంచేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రయాణికులను సకాలంలో గమ్యానికి చేర్చేందుకు ఢిల్లీ–ముంబై, ఢిల్లీ–చెన్నై, ముంబై–చెన్నై, ఢిల్లీ–హౌరా, ముంబై–హౌరా, హౌరా–చెన్నై రూట్లలో ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేగాన్ని పెంచనున్నారు. వీటిలో ఢిల్లీ–ముంబై మినహా మిగిలిన ఐదు రూట్లు ఏపీ పరిధిలోనూ ఉన్నాయి. ఈ మార్గాల్లో కన్ఫర్మేటరీ ఆసిల్లోగ్రాఫ్ కార్ రన్ (సీఓసీఆర్) టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పడుతున్న సమయం కన్నా అరగంట ఆదా ► ముంబై–చెన్నై ప్రధాన మార్గంలో గల గుత్తి–రేణిగుంట రైల్వే లైన్ మధ్య ట్రాక్ సామర్థ్యాన్ని పెంచారు. 280 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రైలు మార్గంలో టెస్ట్ డ్రైవ్ ఇప్పటికే పూర్తయింది. ► ఈ పరీక్షలో ప్రస్తుతం నడుస్తున్న రైళ్ల సమయం కంటే అరగంట ఆదా అయింది. ఈ మార్గంలో ప్రస్తుతం ప్యాసింజర్ రైళ్ల వేగం 90 కిలోమీటర్ల వరకు ఉంది. ► ఈ వేగాన్ని 130 కి.మీ వరకు పెంచేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ► గుంతకల్లు–రేణిగుంట మార్గంలో ఏర్పాటు చేసిన రైల్వే ట్రాక్‌పై టెస్ట్ డ్రైవ్ నిర్వహించాల్సి ఉంది. 130 కిలోమీటర్ల వేగంతో రైలు వెళుతుంటే పట్టాలు తట్టుకోగలవా అనే విషయాన్ని పరిశీలిస్తారు. ► టెస్ట్ డ్రైవ్ విజయవంతమైన తర్వాత రైల్వే భద్రత కమిషన్ (సీఆర్సీ) కూడా పరిశీలించి అనుమతులిస్తుంది. ► ముంబై–చెన్నై మార్గంలో ఏపీ పరిధిలోని గుంతకల్ డివిజన్ పరిధిలో 1,330.90 కి.మీ. ట్రాక్ ఉంది. రైల్వే గేట్ల ఎత్తివేత దిశగా.. ► గంటకు 130 కిలోమీటర్ల వేగం పెంచే ఈ ప్రధాన రైలుమార్గాల్లో దాదాపు రైల్వే గేట్లను ఎత్తివేసేందుకు రైల్వే ఇప్పటికే చర్యలు చేపట్టింది. ► ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న గేట్ల స్థానంలో ఆర్వోబీ (రోడ్ ఓవర్ బ్రిడ్జి)లను నిర్మిస్తోంది. పలు గేట్ల స్థానంలో ఆర్యూబీ (రోడ్ అండర్ బ్రిడ్జి)లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ► గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలో 30 లెవల్ క్రాసింగ్ గేట్లను మూసివేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ► మూసివేయాలనుకుంటున్న ఎల్సీ గేట్ల స్థానంలో ఒక్కో ఆర్యూబీ నిర్మాణానికి రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల లోపు వ్యయమవుతుందని అంచనా. -
లాక్డౌన్: చెట్టినాడ్ సిమెంట్స్ నిర్వాకం!
సాక్షి, తిరుపతి: తమిళనాడుకు చెట్టినాడ్ సిమెంట్ సంస్థ లాక్డౌన్ నిబంధనలను తుంగలో తొక్కింది. కరోనా రెడ్‌జోన్‌గా ఉన్న రేణిగుంటలో ఆంక్షల్ని పట్టించుకోకుండా గూడ్స్ రైళ్ల ద్వారా భారీగా సిమెంట్ దిగుమతి చేసుకుంది. దాంతోపాటు భౌతికదూరం పాటించకుండానే హమాలీలతో యాజమాన్యం సిమెంట్ అన్లోడ్ చేయిస్తోంది. దాదాపు 20 వేల టన్నుల సిమెంట్ తమిళనాడు నుంచి రేణిగుంటకు వచ్చినట్టు తెలుస్తోంది. చెట్టినాడ్ సిమెంట్ సంస్థ నిర్వాకంపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. (చదవండి: ఏపీలో కొత్తగా 75 పాజిటివ్ కేసులు) ఇక గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావడంతో.. మొత్తం కేసుల సంఖ్య 722కు చేరింది. వారిలో 92 మంది కోలుకున్నారు. 20 మంది మృతి చెందారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 610గా ఉంది. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 53కు చేరగా.. వారిలో నలుగురు కోలుకున్నారు. ఏపీ వ్యాప్తంగా తాజాగా నమోదైన 75 కేసుల్లో అత్యధికంగా చిత్తూరులో 25 కేసులు నమోదవడం గమనార్హం. (చదవండి: ఏపీ ప్రభుత్వ బాటలో కేంద్ర ప్రభుత్వం) -
పరిచయం చేసుకుని.. పని ఇప్పిస్తానని..
సాక్షి, చిత్తూరు: రేణిగుంట రైల్వేస్టేషన్లో గత రాత్రి కలకలం చోటుచేసుకుంది. ఆరు నెలల బాబును దుండగులు కిడ్నాప్ చేశారు. నాలుగు రోజుల క్రితం తాడి పత్రి నుంచి రేణిగుంటకు బాబుతో వచ్చిన స్వర్ణ లత అనే మహిళ తన కొడుకు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. తాడిపత్రికి చెందిన స్వర్ణలత భర్తతో విభేదాల కారణంగా పుట్టింట్లో ఉంటోంది. ఆమె తాగుబోతు భర్త అక్కడకు కూడా వచ్చి గలాట చెయ్యడంతో పుట్టింటి నుంచి బయటకు వచ్చింది. ఈక్రమంలో రేణిగుంట రైల్వే స్టేషన్లో పనిచేసే స్వీపర్ ద్వారా ఆమెకు అనిత అనే మహిళ పరిచయమైంది. తాను రైల్వేలో ఉద్యోగం చేస్తున్నానని.. స్వర్ణలతకు పని ఇప్పిస్తానని నమ్మబలికింది. దాంతో స్వర్ణలత నాలుగు రోజుల పాటు రైలల్వే స్టేషన్లోనే గడిపింది. ఈ నేపథ్యంలో తల్లీ బిడ్డలకు కొత్త బట్టలు కొనిస్తానని తీసుకెళ్లిన అనిత.. అక్కడ ఆమెను బురిడీ కొట్టించి బాబుతో ఉడాయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ ప్రారంభించారు. ఇద్దరు అనుమానిత మహిళలను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. -
మాజీ స్పీకర్ అగరాల ఈశ్వరరెడ్డి మృతి
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి)/సాక్షి, అమరావతి: విద్యావేత్త, తిరుపతికి చెందిన తొలితరం నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ డాక్టర్ అగరాల ఈశ్వర రెడ్డి(87) ఆదివారం మృతి చెందారు. వారం రోజులుగా అనారోగ్యంతో స్విమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈయన స్వగ్రామం చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలోని తూకివాకం. ఈయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు తిరుపతిలో, కుమార్తె చెన్నైలో వైద్యురాలిగా స్థిరపడ్డారు. డాక్టర్ ఈశ్వరరెడ్డి తిరుపతి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983లో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తిరుపతి, రేణిగుంటలో విద్యా సంస్థలు స్థాపించి, విద్యాదానం చేస్తున్నారు. ఆచార్య ఎన్జీరంగా, మాడభూషి అనంతశయనం అయ్యంగార్లకు శిష్యుడిగా గుర్తింపు పొందారు. 1982 సెప్టెంబర్ 7 నుంచి 1983 జనవరి 16వరకు స్పీకర్‌గా పనిచేశారు. అంతకు ముందు 1981 మార్చి 23 నుంచి 1982 సెప్టెంబర్ 6 వరకు డిప్యూటీ స్పీకర్‌గానూ పనిచేశారు. స్వతంత్ర పార్టీ నుంచి ఎన్నిక 1967లో డాక్టర్ అగరాల ఈశ్వరరెడ్డి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1978లో ఇందిరా కాంగ్రెస్‌లో చేరి గురవారెడ్డిపై గెలుపొందారు. అప్పటి సీఎం అంజయ్య ఈయనను డిప్యూటీ స్పీకర్‌గా నియమించారు. అనంతరం ఇందిరా ఆశీస్సులతో స్పీకర్‌గా నియమితులయ్యారు. విద్యావేత్త : డాక్టర్ అగరాల ఈశ్వరరెడ్డి మద్రాస్ రెసిడెన్సీ కళాశాల నుంచి డిగ్రీ, ప్రెసిడెన్సీ కళాశాల నుంచి ఎంఏ పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశారు. మద్రాస్ లా కళాశాల నుంచి బీఎల్ డిగ్రీ పొందారు. రాంచీ యూనివర్సిటీలో పరిశోధనలు చేసి, రాజనీతి శాస్త్రంలో డాక్టరేట్ పొందారు. విద్యాసంస్థలు నెలకొల్పడమే కాకుండా అనేక పుస్తకాలు రచించారు. ఎస్వీయూ, ఏపీ వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు సిండికేట్ సభ్యుడిగా పనిచేశారు. ఉస్మానియా వర్సిటీకి సెనెట్ మెంబర్‌గానూ పనిచేశారు. కాగా ఈశ్వరరెడ్డి భౌతిక కాయానికి సోమవారం సాయంత్రం తిరుపతిలోని గోవిందధామంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. సీఎం వైఎస్ జగన్ సంతాపం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ మాజీ స్పీకర్ అగరాల ఈశ్వరరెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయవేత్త అయిన ఈశ్వరరెడ్డి తన అభిప్రాయాలను నిర్భయంగా, నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తారనే పేరును గడించారని జగన్ కొనియాడారు. ఈశ్వరరెడ్డి కుటుంబీకులకు ముఖ్యమంత్రి జగన్ తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. -
బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎంలో చోరీకి యత్నం
-
బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎంలో చోరీకి యత్నం
సాక్షి, రేణిగుంట : చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వేస్టేషన్ సమీపంలో ఓ దుండగుడు భారీ చోరీకి యత్నించాడు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం మిషన్‌ను బద్దలుకొట్టి నగదును దోచుకునేందుకు ప్రయత్నించి, విఫలం అయ్యాడు. ఈ నేపథ్యంలో సైరన్ మోగడంతో రైల్వే పోలీసులు అప్రమత్తమై, ఏటీఎం మిషన్ వద్దకు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా నిందితుడు తమిళనాడుకు చెందిన మని మారన్‌గా పోలీసులు గుర్తించారు. అయితే ఏటీఎం మిషన్ నుంచి నగదు పోలేదని బ్యాంక్ సిబ్బంది తెలిపారు. కాగా నిందితుడు 2007లో తిరుపతిలోని ఇండియన్ బ్యాంక్ ఏటీఎంలో దోపిడికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మని మారన్‌ను విచారణ జరుపుతున్నారు. -
ఆర్టీవో చెక్‌పోస్ట్‌పై ఏసీబీ దాడి
-
రేణిగుంట ఆర్టీవో చెక్‌పోస్ట్‌పై ఏసీబీ దాడి
సాక్షి, చిత్తూరు: రేణిగుంట ఆర్టీవో చెక్‌పోస్ట్‌పై శనివారం తెల్లవారు జాము నుంచి ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. లారీ డ్రైవర్ల నుంచి చెక్‌పోస్ట్ సిబ్బంది డబ్బులు తీసుకొంటుండగా పట్టుకున్నారు. చెక్‌పోస్టులో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు.. చెక్‌పోస్టు సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఎంత డబ్బు పట్టుబడింది పూర్తి వివరాలు తెలియరాలేదు. రేణిగుంట చెక్‌పోస్టు సిబ్బందిపై చాలా కాలంగా అవినీతి ఆరోపణలు నేపథ్యంలో ఏసీబీ ఆకస్మిక దాడులు నిర్వహించింది. -
కాసేపట్లో రైలు వస్తుందని అనౌన్స్మెంట్ ఇంతలోనే..
సాక్షి, చిత్తూరు: రేణిగుంట రైల్వే స్టేషన్లో ప్రయాణికులు ధర్నాకు దిగారు. యశ్వంత్‌పూర్ నుంచి హౌరా వెళ్ళవలసిన అంగా ఎక్స్‌ప్రెస్ రైలును అధికారులు చెప్పపెట్టకుండా రద్దు చేయడంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. మరికొద్దిసేపట్లో అంగా ఎక్స్‌ప్రెస్ మూడో నంబర్ ప్లాట్‌ఫాం మీదకు వస్తుందని అనౌన్స్ చేయడంతో ప్రయాణికులంతా ఫ్లాట్‌ఫాం మీదకు వచ్చి రైలు కోసం వేచిచూశారు. చాలాసేపు వేచిచూసినా రైలు రాకపోవడంతో వారు ఆందోళన చెందారు. ఇంతలో అంగా ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసినట్టు అనౌన్స్మెంట్ వచ్చింది. దీంతో ఆ రైల్లో వెళ్లేందుకు టికెట్లు, రిజర్వేషన్లు చేయించుకున్న దాదాపు 500 మంది ప్రయాణికులు షాక్ తిన్నారు. ఇంత దారుణమైన నిర్లక్ష్యమా? అంటూ ఆందోళనకు దిగారు. స్టేషన్ మాస్టర్ గది వద్ద ధర్నా చేపట్టారు. కనీసం రైలు రద్దయిన సమాచారాన్ని కూడా తమకు చెప్పకపోవడం దారుణమని ప్రయాణికులు మండిపడుతున్నారు. రాత్రి సమయంలో చిన్న, చిన్నపిల్లలతో ఉన్న మహిళలు తమ రైలు రద్దు కావడంతో స్టేషన్లో చిక్కుకుపోవాల్సి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ మహిళలు పిల్లలతో కలిసి ధర్నా చేశారు. -
రెండు కాదు...నాలుగు వరుసలు..
కడప–రేణిగుంట రహదారికి మహర్దశ పట్టనుంది. ప్రస్తుతం రెండు వరుసలుగా ఉన్న దీనిని నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. విస్తరణ బాధ్యతలను జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్హెచ్ఐఏ)కి అప్పగించారు. రూ. 2 వేల కోట్లతో 138 కిలోమీటర్ల మేర కడప వైఎస్సార్ టోల్‌ప్లాజా నుంచి రేణిగుంట్ల విమానాశ్రయం వరకు నాలుగు వరుసల రహదారిగావిస్తరించనున్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఇందుకోసం ప్రత్యేక కృషి చేశారు. ఇప్పటికే ఏపీ ఎన్హెచ్ఐఏ సీజీఎం అజ్మీర్‌సింగ్ కూడా విస్తరణ చేపట్టే రహదారిని పరిశీలించారు. అన్ని సక్రమంగాపూర్తయితే నవంబరులో ఈ పనులకు టెండర్లు పిలిచే అవకాశం కనిపిస్తోంది. కడప సిటీ : కడప–రేణిగుంట రహదారి ప్రస్తుతం పది మీటర్లు కలిగి రెండు వరుసలుగా ఉంది. నాలుగు వరుసలు చేసేందుకు 20 మీటర్ల వరకు పెంచనున్నారు. ఇప్పటికే రెవెన్యూశాఖకు ల్యాండ్ అక్విడేషన్ చేపట్టాలని ఎన్హెచ్ఐ అధికారులు విన్నవించారు. డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) కూడా సిద్ధమైంది. గతంలో ఎన్‌ఎస్‌యూలో ఉన్న ఈ రహదారిని ఎన్హెచ్ఐఏపీకి అప్పగించడంతో ఎన్‌హెచ్ 716 అనే నంబరును కేటాయించారు. కడపజిల్లాతోపాటు కర్నూలు, చిత్తూరు, ఇతర పలు రాష్ట్రాల వాహనాలు ప్రతి నిత్యం ఇదే రహదారిలో తిరుగుతుంటాయి. దీంతో తరుచూ ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో విస్తరణ బాధ్యతలను ఎన్‌హెచ్ నుంచి ఎన్హెచ్ఐఏ (జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ)కు అప్పగించారు. జాతీయ రహదారి–716 నంబరును కేటాయిస్తూ విస్తరణకు పూనుకున్నారు. డీపీఆర్ కూడా సిద్ధం చేశారు. దీంతో రెండు వరుసల రహదారి నాలుగు వరుసలుగా మారనుంది. భూ సేకరణ, నిర్మాణానికి కలిపి రూ. 2000 కోట్లు అవసరమవుతుందని అధికారులు అంచనాలు కూడా సిద్దం చేశారు. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కృషి కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఈ రహదారి విస్తరణ అంశంపై అధికారులతో చర్చించారు.. నిధుల విషయంలో కూడా కృషి చేశారు. ప్రారంభంలో ఎన్హెచ్ఐ అధికారులు రిమ్స్‌రోడ్డు నుంచి రేణిగుంట వరకు నాలుగు లేన్ల రహదారిని విస్తరించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇక్కడి నుంచి అలైన్మెంట్ మార్చి వైఎస్సార్ టోల్‌ప్లాజా నుంచి రేణిగుంట విమానాశ్రయం వరకు విస్తరణ చేపట్టాలని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అధికారులకు సూచించడంతో చివరకు ఆయన నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకుని అలైన్‌మెంట్‌ను సిద్ధం చేశారు. బద్వేలు నుంచి కృష్ణపట్నం పోర్టు వరకు కడప–రేణిగుంట రహదారి విస్తరణతోపాటు బద్వేలు నుంచి నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు వరకు కూడా నాలుగు వరుసల రహదారిని నాణ్యతతో నిర్మించేందుకు ఎన్హెచ్ఐఏ అధికారులు డీపీఆర్ సిద్ధం చేశారు. రాయలసీమ జిల్లాలతోపాటు బళ్లారి, కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాల నుంచి ఇనుప ఖనిజం, గ్రానైట్ విదేశాలకు ఎగుమతి చేసేందుకు కృష్ణపట్నం పోర్టు ఎంతో ఉపయోగపడుతోంది. ఈ నేపథ్యంలో కృష్ణపట్నం నుంచి కడపజిల్లా బద్వేలుకు వరకు 138 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరణ చేయనున్నారు. ఇందులో కొంత భాగాన్ని ఆర్అండ్బీ, జాతీయ రహదారుల విభాగం ఆధ్వర్యంలో నాలుగు వరుసలుగా విస్తరించినప్పటికీ తాజాగా ఎన్హెచ్ఐఏ తన ప్రమాణాల మేర పూర్తి స్థాయిలో విస్తరించేందుకు సిద్ధమయ్యారు. రేపు ఢిల్లీలో సమావేశం విస్తరణకు సంబంధించి బుధవారం ఢిల్లీలో ఎన్హెచ్ఐఏ అధికారులతో ప్రత్యేక సమావేశం ఉన్నట్లు ఎన్హెచ్ఐఏ ప్రాజెక్టు డైరెక్టర్ సుధాకర్‌రెడ్డి తెలిపారు. అక్కడ దీని గురించి వివరిస్తామని తెలిపారు. కన్సెల్టెంట్‌గా తాను కూడా వెళుతున్నట్లు తెలిపారు. త్వరలో టెండర్లను పిలిచే అవకాశం ఉంది. -
ఒక బ్యూటీ.. ముగ్గురు ఖతర్నాక్‌లు..
లిఫ్ట్ ఇవ్వాలని రాత్రి పూట రోడ్డు మీద ఓ అందమైన అమ్మాయి వాహనాన్ని ఆపితే లారీ డ్రైవర్లు ఏం చేస్తారు? వారెవ్వా! ఏం బ్యూటీ అని ఎగిరి గంతేసి ఆపితే..! వాళ్ల ఆశలకు బ్రేకులేసి ఉన్నదంతా ఊడ్చేశారు. ఒక బ్యూటీ+ముగ్గురు ఖతర్నాక్‌లు కలిసి లూటీలకు వేసిన ప్లాన్ ఇది. తీరా చూస్తే ఆ బ్యూటీ కూడా ఆడవేషం ధరించిన ఓ ఖతర్నాక్గాడే..పోలీసులు ఎట్టకేలకు ఈ ముఠా భరతం పట్టారు. సాక్షి, రేణిగుంట : జాతీయ రహదారులపై వెళుతున్న లారీలను టార్చ్‌లైట్ వేసి ఆపి వారి నుంచి బలవంతంగా డబ్బులు, సెల్ఫోన్లు లాక్కుని దారిదోపిడీకి పాల్పడుతున్న నలుగురిని అరెస్ట్ చేసినట్లు రేణిగుంట డీఎస్పీ చంద్రశేఖర్ తెలిపారు. శనివారం రేణిగుంట అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో మీడియాకు డీఎస్పీ తెలిపిన వివరాలు.. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందిన వెంకటరమణ, శ్రీరామ్, వెంకటాద్రి, సైదాపురం మండలానికి చెందిన శరత్‌కుమార్ కొంత కాలంగా రేణిగుంట, వడమాలపేట, కరకంబాడి, రైల్వే కోడూరు, శ్రీకాళహస్తి, నాయుడుపేట ప్రాంతాలలో రాత్రిపూట హైవేలలో దారిదోపిడీకి పాల్పడుతున్నారు. వీరిలో శ్రీరామ్‌కు అందమైన యువతిలా వేషం వేసి హైవేపై టార్చ్‌లైటుతో లారీలను ఆపేవారు. ఎవరో అందమైన అమ్మాయి లిఫ్ట్ అడుగుతోందని భావించి లారీడ్రైవర్ ఆపగానే హఠాత్తుగా తక్కిన ముగ్గురూ ఒక్కసారిగా అక్కడికి చేరుకుని దాడి చేసేవారు. లారీడ్రైవర్ల నుంచి నగదు, సెల్ఫోన్లను దోచుకునేవారు. ఈనెల 16న కాట్పాడి నుంచి రైలులో వస్తున్న మహేష్ అనే యువకుడితో వీరు నలుగురూ పరిచయం పెంచుకుని అతనికి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికారు. రేణిగుంట పోలీస్‌స్టేషన్‌లో దారిదోపిడీ ముఠా అరెస్ట్ చూపుతున్న డీఎస్పీ చంద్రశేఖర్ రేణిగుంట రైల్వేస్టేషన్లో అందరూ దిగారు. అక్కడ నుంచి మామండూరు అటవీప్రాంతంలోకి మహేష్‌ను తీసుకెళ్లి కొట్టి, అతని వద్దనున్న రూ.1600తోపాటు సెల్‌ఫోన్, సర్టిఫికెట్లను లాక్కుని ఉడాయించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు సీఐ అంజూయాదవ్ విచారణ చేశారు. శుక్రవారం రేణిగుంట చెక్‌పోస్ట్ రమణ విలాస్ సర్కిల్ వద్దనున్న ఈ నలుగురిని అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణలో వీరు హైవేలపై దారిదోపిడీలకు పాల్పడమే కాకుండా విశాఖ నుంచి గంజాయిని అక్రమంగా తీసుకొచ్చి రేణిగుంట పరిసరాల్లో విక్రయిస్తున్నట్లు తేలింది. నిందితుల నుంచి 800గ్రాముల గంజాయి, రూ.460 నగదు, నాలుగు సెల్ఫోన్లు, ఒక చీర, జాకెట్, టార్చిలైటు, జడ(విగ్)ను స్వాధీనం చేసుకున్నారు. శనివారం రిమాండ్‌కు తరలించారు. దారిదోపిడీ ముఠాను చాకచక్యంగా పట్టుకున్న సీఐ, సిబ్బందిని తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్ అభినందించారు. -
వివాహిత దారుణ హత్య
చిత్తూరు, రేణిగుంట : అగ్ని సాక్షిగా జీవితాంతం తోడుగా ఉంటానని పెళ్లినాటి ప్రమాణాలను గాలికొదిలేశాడు. తిరుమల వెంకన్న దర్శనం కోసం అని మాయమాటలు చెప్పి భార్యను కిరాతకంగా కడతేర్చాడు. గురువారం ఈ సంఘటన రేణిగుంట మండలంలో వెలుగుచూసింది. గాజులమండ్యం సీఐ అమరనాథరెడ్డి కథనం... గాజులమండ్యంకు చెందిన రుక్మానందరాజు కుమార్తె రూప(26)కు విప్పమానుపట్టెడకు చెందిన మునిశంకర్(30)తో 2014లో వివాహమైంది. వీరికి నిఖిత(4) కుమార్తె ఉంది. మునిశంకర్ టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వివాహమైన కొంత కాలానికే మునిశంకర్ తాగొచ్చి భార్యతో గొడవ పడుతూ తరచూ కొట్టి హింసించేవాడు. ఈ నేపథ్యంలో తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లాలని భార్యను నమ్మించాడు, చిన్నారి నిఖితను గాజులమండ్యంలోని అమ్మమ్మ ఇంటి వద్ద దింపి అక్కడ నుంచి బుధవారం ఉదయం దంపతులిద్దరూ తిరుమలకు ఇంటి నుంచి వ్యానులో బయల్దేరారు. అయితే సాయంత్రానికి పూటుగా మద్యం సేవించి మునిశంకర్ ఒక్కడే విప్పమానుపట్టెడకు చేరుకుని కాసేపటికే పరారయ్యాడు. అయితే గురువారం ఉదయం మండలంలోని తూకివాకం–విప్పమానుపట్టెడ మార్గంలోని ఓ ప్రైవేటు వెంచర్ సమీపంలో వివాహిత మృతదేహం పడి ఉండటాన్ని గుర్తించిన ఇసుక ట్రాక్టర్ డ్రైవర్లు సమాచారం చేరవేయడంతో డీఎస్పీ చంద్రశేఖర్, సీఐ అమరనాథరెడ్డి, ఎస్ఐ స్వాతి, తహసీల్దార్ విజయసింహారెడ్డి అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఇనుపరాడ్‌తో తలపై బలంగా మోది వివాహితను హతమార్చినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. ఘటన స్థలంలో రక్తపు మరకలు అంటిన ఇనుప రాడ్ పడి ఉండడంతో దానిని స్వాధీనం చేసుకున్నారు. హతురాలు రూప అని నిర్థారించుకున్న పోలీసులు ఆమె తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న మృతురాలి బంధువులు గుండెలవిసేలా రోదించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో రూపను ఆమె భర్తే హత్య చేసి పరారైనట్లు గ్రహించిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా తండ్రి చేతిలో తల్లి దారుణ హత్యకు గురవడంతో చిన్నారి నిఖిత అనాథగా మారింది. -
తిరుమలకు నిర్మలా సీతారామన్
సాక్షి, తిరుపతి: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి శనివారం రేణిగుంట విమానాశ్రయంలో స్వాగతం పలికారు. అనంతరం ఆమె రోడ్డు మార్గంలో తిరుమలకు బయల్దేరి వెళ్లారు. స్వామివారి దర్శనార్థం తిరుమల చేరుకున్న నిర్మలా సీతారామన్‌కు టీటీడీ ప్రత్యేక అధికారి ధర్మారెడ్డి శ్రీకృష్ణ అతిథి గృహం వద్ద స్వాగతం పలికగా, విజయసాయి రెడ్డి కూడా స్వామి వారి దర్శనం చేసుకోనున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం కేంద్రమంత్రి తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు. పూర్తి వివరాలు మరికాసేపట్లో... -
అతివేగం; టాటాఏస్‌పై పడిన వోల్వో బస్
సాక్షి, చిత్తూరు : విశాఖపట్నం నుంచి బెంగుళూరుకు 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న వోల్వో బస్ ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న టాటాఏస్ వాహనంపై పడిపోయింది. ఈ ఘటన రేణిగుంట ఆర్టీవో చెక్‌పోస్టు సమీపంలో శుక్రవారం తెల్లవారు జామున జరిగింది. బస్‌లో ఉన్న ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. టాటాఏస్‌లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న రేణింగట అర్బన్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. అతివేగం, బ్రేకులు ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. -
ఖాకీ వేషంలో ఉన్న దొంగల అరెస్టు
సాక్షి, రేణిగుంట(తిరుపతి) : నగలు చోరీ చేయడానికి పోలీసు దుస్తుల్లో వచ్చిన జులాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 1,080 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పాకాల రైల్వేస్టేషన్లో గత నెల 11న జరిగిన నగల చోరీ కేసును రేణిగుంట జీఆర్పీ పోలీసులు ఛేదించినట్లు తిరుపతి జీఆర్పీ డీఎస్పీ రమేష్‌బాబు తెలిపారు. రేణిగుంట జీఆర్పీ స్టేషన్లో మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో నిందితుల అరెస్ట్‌ను చూపిన పోలీసులు రికవరీ చేసిన బంగారు ఆభరణాలను ప్రదర్శించారు. డీఎస్పీ తెలిపిన వివరాల మేరకు, తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన నగల వ్యాపారి ముకుందరాజన్ తరచూ కోయంబత్తూరు నుంచి రైలులో కడప జిల్లా ప్రొద్దుటూరులో నగల దుకాణాలకు బంగారు ఆభరణాలను విక్రయిస్తుంటాడు. ఈ క్రమంలో ప్రొద్దుటూరుకు చెందిన నక్కా రాజశేఖర్(24) ముకుందరాజన్ రాక, పోకలపై కన్నేశాడు. ఈ క్రమంలో అతని స్నేహితులు ప్రొద్దుటూరుకు చెందిన మాజీ సిపాయి పుల్లారెడ్డి(28), యర్రగుంట్లకు చెందిన ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకుడు ప్రసాద్(26)తో కలసి ముకుందరాజన్ నుంచి నగలను తస్కరించేందుకు పథకం వేశాడు. గతనెల 11న కోయంబత్తూరుకు వెళ్లి అక్కడ నుంచి రైలులో ప్రొద్దుటూరుకు జయంతి ఎక్స్‌ప్రెస్‌రైలులో బయల్దేరిన ముకుందరాజన్‌ను వెంబడించారు. రైలులో పుల్లారెడ్డి ఎస్ఐ దుస్తుల్లోనూ, ప్రసాద్ కానిస్టేబుల్ దుస్తుల్లోనూ ముకుంద్‌రాజన్ వద్దకు వెళ్లి బ్యాగులను తనిఖీ చేశారు. తాము పోలీసులమని, బంగారం అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం వచ్చిందని బెదిరించి అతని నగల బ్యాగును, రెండు మొబైల్ ఫోన్లను తీసుకున్నారు. పాకాల రైల్వేస్టేషన్లో రైలు ఆగగానే అతనిని కిందికి దింపి, రైల్వే క్వార్టర్స్ వైపు వెళ్లారు. ఉదయం చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్‌కు రావాలని అతనికి చెప్పి, అక్కడ నుంచి ఆటో ఎక్కి వెళ్లిపోయారు. దీంతో నగల వ్యాపారి ముకుంద్ ఉదయం చిత్తూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని తెలిపాడు. రేణిగుంట జీఆర్పీ సీఐ అశోక్‌కుమార్ కేసు నమోదు చేసి ఎంతో చాకచక్యంగా దర్యాప్తు చేశారు. పాకాల సమీపంలో తిరుగుతున్న నిందితులు రాజశేఖర్, పుల్లారెడ్డి, ప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా ప్లాస్టిక్ కవరులో బంగారు ఆభరణాలను మూటకట్టి పాకాల సమీపంలోని ఓ గుట్టపై ముళ్లపొదల్లో పాతిపెట్టినట్లు తెలిపారు. నిందితులను తీసుకెళ్లి ఆ నగలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 21 లక్షల 90వేలు ఉంటుందని తెలిపారు. వారు ఉపయోగించిన పోలీసు దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేధించిన సీఐ అశోక్‌కుమార్, ఎస్ఐలు అనిల్‌కుమార్, ప్రవీణ్‌ను అభినందిస్తూ వారికి రివార్డులను అందజేయాలని సిఫార్సు చేస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. ప్రొద్దుటూరులో కమాండ్ కంట్రోల్ విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సుబ్బరాయుడు పోలీసుల వేషంలో వెళ్లండని నిందితులకు చెప్పడంతో అతనిపై చర్యలు తీసుకోనున్నారు. నిందితులను నెల్లూరు రైల్వేకోర్టుకు రిమిండ్ నిమిత్తం తరలించినట్లు తెలిపారు. -
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
రేణిగుంట(చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని జైలో కారు ఢీకొనడంతో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. రేణిగుంట డీఎస్పీ చంద్రశేఖర్ కథనం మేరకు... గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం రుద్రవరం గ్రామానికి చెందిన తలతల సత్యనారాయణరెడ్డి (41), అతని భార్య విజయభారతి (36), కుమారుడు చెన్నకేశవరెడ్డి (13), కుమార్తె ప్రసన్నలక్ష్మి (17), బెల్లంకొండ మండలం పాపయ్యపాళెంకు చెందిన అతని బావమరిది వీరారెడ్డి (31), అదే జిల్లా అచ్చంపేట మండలం ఓర్వకల్లుకు చెందిన పూల అంకయ్య (70), అతని కుమారుడు గోపి (35), కోడలు పద్మ (30), మనుమడు హరి (12) కలసి బాడుగకు జైలో కారు మాట్లాడుకుని గురువారం రాత్రి 10 గంటలకు ఓర్వకల్లు నుంచి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు బయల్దేరారు. అచ్చంపేట మండలం గింజుపల్లికి చెందిన కారు డ్రైవర్ ప్రేమ్‌రాజ్ (23)తో కలిసి మొత్తం 10మంది కారులో వస్తున్నారు. మరో గంటలో తిరుమల శ్రీవారి చెంతకు చేరనున్న సమయంలో అనూహ్యంగా జరిగిన ఘోరరోడ్డు ప్రమాదం వారిని గాఢ నిద్రలో నుంచి శాశ్వత నిద్రలోకి తీసుకెళ్లింది. శ్రీకాళహస్తి–తిరుపతి హైవేలో రేణిగుంట మండలం గురవరాజుపల్లి సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారు రోడ్డుపక్కన ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొంది. కారు ముందుభాగం నుజ్జునుజ్జు కావడంతో పాటు ముందు సీట్లో కూర్చొన్న డ్రైవర్‌తో పాటు మిగిలిన వారంతా కారులోనే ఇరుక్కుపోయారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ ప్రేమ్‌రాజ్, సత్యనారాయణరెడ్డి భార్య విజయలక్ష్మి, చెన్నకేశవరెడ్డి, పూల అంకయ్య, పూల గోపి అక్కడికక్కడే మృతి చెందగా గోపి భార్య పద్మ తిరుపతి రుయాలో చికిత్స పొందుతూ మృతి చెందింది. సత్యనారాయణరెడ్డి, ఆయన కుమార్తె ప్రసన్నలక్ష్మి, బావమరిది వీరారెడ్డి, గోపి కుమారుడు హరిలకు తీవ్ర గాయాలు కావడంతో వారిని పోలీసులు చికిత్స నిమిత్తం 108 వాహనంలో తిరుపతి రుయాకు తరలించారు. విషయం తెలుసుకున్న రేణిగుంట డీఎస్పీ చంద్రశేఖర్, సీఐ శివరాముడు, ఎస్ఐ మోహన్‌నాయక్ వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని కారులో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీసి, పోస్ట్‌మార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్, ఏఎస్పీ అనిల్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఘోర ప్రమాద విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ నారాయణ భరత్‌గుప్తా క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని రుయా వైద్యాధికారులను ఆదేశించారు. -
రేణిగుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, తిరుపతి : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో అయిదుగురు దుర్మరణం చెందగా, మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే...గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం రుద్రవరం వాసులు తిరుమల స్వామివారి దర్శనానికి జైలో వాహనంలో బయల్దేరారు. రేణిగుంట మండలం గురవరాజుపల్లి వద్ద ఆగి ఉన్న లారీని ఈ వాహనం వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అయిదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న రేణిగుంట అర్భన్ పోలీసులు గాయపడినవారిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రేణిగుంటలో కేసీఆర్‌కు ఘన స్వాగతం
-
రేణిగుంటలో కేసీఆర్‌కు ఘన స్వాగతం
సాక్షి, తిరుపతి : శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం తిరుమల పర్యటన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. కుటుంబ సమేతంగా ఆదివారం రేణిగుంట చేసుకున్న ఆయనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, చింతల రామచంద్రరెడ్డి తదితరులు స్వాగతం పలికారు. కాగా కేసీఆర్ కుటుంబం సోమవారం ఉదయం స్వామివారిని దర్శించుకుంటారు. అంతకు ముందు కేసీఆర్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో తిరుమల వెళ్లారు. రాత్రికి తిరుమలలోని శ్రీకృష్ణ అతిథి గృహంలో బస చేస్తారు. మరోవైపు కేసీఆర్ రాక సందర్భంగా తిరుమలలో పటిష్టమైన భద్రత చేపట్టారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : రేణిగుంట ఎయిర్ పోర్ట్ వద్ద కేసీఆర్‌కు ఘన స్వాగతం -
పక్కా స్కెచ్.. 10 కోట్ల డ్రగ్స్ కొట్టేశారు..!
సాక్షి, తిరుపతి : రేణిగుంటలోని ఓ డ్రగ్స్ ఫ్యాక్టరీలో గత నెలలో చోరీకి గురైన రూ.10 కోట్ల విలువైన అల్ఫాజోన్ దోపిడీ కేసులో నిందితులు పట్టుబడ్డారు. ప్యాక్టరీలో పనిచేసే ముగ్గురు ఉద్యోగులతో కలిసి ఓ మాజీ ఉద్యోగి ఈ చోరీలో నిందితులుగా ఉన్నారని తెలిసింది. వివరాలు.. రేణిగుంటలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న మల్లాడి ఫ్యాక్టరీలో పనిచేసి సస్పెండైన దక్షిణా మూర్తి అనే మాజీ ఉద్యోగి అదే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న చిట్టిబాబు అనే వక్తితో కలిసి డ్రగ్స్ కొట్టేయడానికి పథకం పన్నారు. ఆల్ఫాజోన్ అనే అతి ఖరీదైన మత్తుమందును కాజేసి ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించాలనుకున్నారు. ఫ్యాక్టరీలోని స్టోర్‌లో పనిచేస్తున్న నాగరాజు, శ్రీనివాసులు అనే వ్యక్తులకు రూ.10 లక్షలు ఆశ చూపి వారి ద్వారా గత నెలలో 30 కేజీల ఆల్ఫాజోన్ కాజేశారు. తర్వాత బెంగుళూరులో ఓ వ్యక్తికి 15 కేజీలను అమ్మేసి మిగిలిన దానిని దక్షిణామూర్తి తన ఇంట్లో దాచిపెట్టాడు. అదేక్రమంలో బెంగుళూరులోని నార్కోటిక్ అధికారులు ఒక డ్రగ్స్ కేసులో ముద్దాయిని అరెస్టు చేయగా అతని వద్ద భారీగా మత్తుమందు దొరికింది. విచారణలో రేణిగుంటలోని మల్లాడి ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వారి వద్ద దానిని కొనుగోలు చేసానని చెప్పాడు. పేర్లు వెల్లడించారు. నార్కోటిక్ అధికారులు బుధవారం సాయంత్రం ఫ్యాక్టరీ వద్దకు చేరుకొని చిట్టిబాబు, నాగరాజు, శ్రీనివాసులును అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పేసుకున్నారు. అనంతరం దక్షిణామూర్తిని పట్టుకుని అతని ఇంట్లో దాచిపెట్టిన 15 కేజీల మత్తుమందును స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం నిందితులను హైదరాబాద్ కార్యాలయానికి తరలించారు. నిందితుల వివరాలు... చిట్టిబాబు - అడుసుపాళ్యం, శ్రీనివాసులు - గాజులమండ్యం, నాగరాజు - కే ఎల్ ఏం హాస్పిటల్, దక్షిణా మూర్తి - కే ఎల్ ఏం హాస్పిటల్. -
ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో అగ్నిప్రమాదం
చిత్తూరు, రేణిగుంట : రేణిగుంట– తిరుపతి మార్గంలో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రెండు చిన్న తరహా కర్మాగారాలు కాలి బూడిదయ్యాయి. సుమారు రూ.20లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. రేణిగుంట ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని ఏపీఐఐసీ రీజనల్ కార్యాలయ సమీపంలో ఉన్న ఓ ప్లాస్టిక్ రీసైక్లింగ్ ఫ్యాక్టరీలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు తెల్లవారుజామున 3గంటలకు అకస్మాత్తుగా అంటుకున్నాయి. మంటలు పెద్దఎత్తున ఎగసిపడటంతో పక్కనున్న చీపురు ప్లాస్టిక్ బుర్రల తయారీ కర్మాగారానికి మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో తెల్లవారుజామున 4గంటల నుంచి వారు సుమారు నాలుగు గంటలపాటు శ్రమించి మంటలను పూర్తిగా ఆర్పివేశారు. అయితే అప్పటికే కర్మాగారాలు పూర్తిగా బుగ్గి అయ్యాయి. ఫ్యాక్టరీకి ఆనుకుని ఉన్న విద్యుత్ తీగలు సైతం మంటల్లో కాలిపోయి తెగిపడ్డాయి. ప్రమాద విషయం తెలుసుకుని అప్పటికే ట్రాన్స్‌కో సిబ్బంది విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఫ్యాక్టరీ లోపల మండే స్వభావం ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు ఉండటంతో మంటలను తొందరగా అదుపులోకి తీసుకురావడం సాధ్యం కాలేదు. కాగా, ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. అటుగా వెళుతున్న గుర్తుతెలియని వ్యక్తులు ఎవరైనా నిప్పు రాజేశారా...? పైనున్న విద్యుత్ తీగలు షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు ఎగసిపడ్డాయా...? అని బాధితులు అనుమానిస్తున్నారు. తరచూ అగ్ని ప్రమాదాలు.. రేణిగుంట ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో ఓ దూది వ్యర్థాల పరిశ్రమలోనూ అగ్నిప్రమాదం సంభవించింది. ఏడాది కిందట బిందెల కర్మాగారంలోనూ ఇదే తరహా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ కార్మికుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో కుటీర, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు సుమారు 80కి పైగా ఉన్నాయి. వీటిలో సగభాగానికి పైగా కర్మాగారాలు నిర్దేశిత భద్రతా చర్యలు, కార్మికుల సేఫ్టీ చర్యలు తీసుకోవడం లేదు. సంబంధిత శాఖ అధికారులు మామూళ్ల మత్తులో కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు ఆస్తి నష్టానికే పరిమితమవుతున్న అగ్నిప్రమాదాలలో ప్రాణనష్టం జరగక ముందే అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ప్రజాసంఘాలు నినదిస్తున్నాయి. -
మహిళ ఆత్మహత్యాయత్నం
రేణిగుంట: మతిస్థిమితం లేని ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించగా ఆటోడ్రైవర్లు గుర్తించి ఆమెను కాపాడిన ఘటన మంగళవారం తిరుపతి సమీపంలోని ఆటోనగర్ వద్ద చోటుచేసుకుంది. మహిళా రక్షక్ పోలీసుల కథనం మేరకు.. మతిస్థిమితం లేని 45 ఏళ్ల మహిళ ఆటోనగర్ వద్ద రైలుపట్టాలపై అడ్డంగా పడుకుని ఉండడాన్ని కొందరు ఆటోడ్రైవర్లు గుర్తించారు. ఆమెను రక్షించి, రక్షక్ పోలీసులకు సమాచారం అందజేశారు. వారు అక్కడికి చేరుకుని ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమె మానసిక స్థితిగా బాగోలేకపోవడంతో రేణిగుంటలోని అభయ క్షేత్రానికి తరలించారు. నిర్వాహకురాలు తస్లీమ్‌కు ఆమెను అప్పగించి, వివరాలను ఆరా తీశారు. తన పేరు ప్యారీబేగం అని, భర్తపేరు చాను నజీర్, తమది వెంకటగిరి అని చెప్పినట్లు పోలీసులు చెప్పారు. బాధిత మహిళను కుటుంబ సభ్యులు గుర్తిస్తే సమాచారం ఇవ్వాలని తస్లీమ్ (9291225514) కోరారు. -
రేణిగుంటలో వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం
-
తిరుపతి చేరుకున్న వైఎస్ జగన్
సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో తిరుపతి చేరుకున్నారు. పద్మావతి అతిథిగృహానికి వచ్చిన ఆయనకు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ప్రజాసంకల్పయాత్ర పూర్తి చేసుకుని శ్రీవారి దర్శనం కోసం వచ్చిన జననేతను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన జనంతో గెస్ట్‌హౌస్ ప్రాంగణం కిక్కిరిసింది. వైఎస్ జగన్ ఈ మధ్యాహ్నం అలిపిరి వెళ్లి అక్కడి నుంచి కాలినడకన సాయంత్రం తిరుమలకు చేరుకుంటారు. ఈ రోజు రాత్రి సర్వదర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుంటారు. రాత్రి తిరుమలలో బసచేసి శుక్రవారం ఉదయం తిరుమల నుంచి బయలుదేరి కడప మీదుగా పులివెందులకు చేరుకుంటారు. రేణిగుంటలో... వైఎస్ జగన్ ఈ ఉదయం 10 గంటల ప్రాంతంలో రేణిగుంట చేరుకున్నారు. దురంతో ఎక్స్‌ప్రెస్ రైలులో ఇక్కడికి వచ్చిన జననేతకు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు తరలివచ్చిన జనంతో రేణిగుంట రైల్వే స్టేషన్ కిక్కిరిసింది. వారందరికీ అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగారు. జై జగన్ నినాదాలతో రైల్వే స్టేషన్ ప్రాంగణం మార్మోగింది. సీఎం జగన్ అంటూ రైల్వేస్టేషన్లో ఉన్న వారితో పాటు, రైలులో ఉన్న ప్రయాణికులు నినదించడం విశేషం. -
రేణిగుంట సమీపంలో పోలీసుల కూంబింగ్
-
రేపు దుబాయ్ వెళ్లాల్సి ఉండగా..
రేణిగుంట: చిత్తూరు జిల్లా రేణిగుంటలో దారుణం జరిగింది. బుధవారం రోజున దుబాయ్ వెళ్లాల్సిన ఓ వ్యక్తి మంగళవారం రాత్రి కిడ్నాప్‌నకు గురయ్యాడు. రేణిగుంటలో బైక్ మీద వెళ్తున్న ముగ్గురిపై గుర్తుతెలియని దుండగులు కారం పొడి చల్లి దాడి చేశారు. బైక్‌ను దహనం చేసి ఖాదర్ బాషా అనే యువకుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఖాదర్‌తో పాటు ఉన్న మరో ఇద్దరు కారం పొడి దాడి నుంచి తేరుకునే లోపే దుండగులు పారిపోయారు. దాదాపు నిన్న(మంగళవారం రాత్రి) జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కిడ్నాప్‌నకు గురైన ఖాదర్ బాషా బుధవారం రోజున దుబాయ్ వెళ్లాల్సి ఉంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
రేణిగుంట ఎంవీఐపై ఏసీబీ సోదాలు
-
రాస్కెల్.. నీవెంత, నీ ఉద్యోగం ఎంత
రేణిగుంట/చిత్తూరు కలెక్టరేట్: చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గిరీషాగౌడ్, రేణిగుంట తహసీల్దార్ నరసింహులునాయుడులపై నెల్లూరు జిల్లా ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు అసభ్య పదజాలంతో రెచ్చిపోయారు. రాస్కెల్.. నీవెంత, నీ ఉద్యోగం ఎంత, నువ్వు నాకు చెప్పేవాడివా అంటూ తహసీల్దార్‌పై చిందులు తొక్కారు. నీ అంతు చూస్తానంటూ జాయింట్ కలెక్టర్‌ను హెచ్చరించారు. వివరాలు.. గురువారం సాయంత్రం 5.45 గంటలకు ప్రత్యేక విమానంలో మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక సీఎం కుమారస్వామి ప్రత్యేక విమానంలో బెంగళూరు నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. రన్‌వే నుంచి వారు అరైవల్ ఎంట్రెన్స్ గుండా బయటకు వస్తారని ప్రొటోకాల్ అధికారులు వేచి ఉన్నారు. ఆ సమయంలో వారికి స్వాగతం పలికేందుకు ఉదయగిరి ఎమ్మెల్యే రామారావు అక్కడే వేచి ఉన్నారు. అయితే అతిథులు అనూహ్యంగా మెయిన్‌గేటు గుండా బయటకు వచ్చారు. ఎమ్మెల్యేను మెయిన్ గేటు వద్దకు తీసుకుని వెళ్లడానికి జేసీ వచ్చిన సమయంలో.. తనను అనసవరంగా అక్కడ కూర్చోబెట్టారంటూ ఎమ్మెల్యే ఆగ్రహంతో ఊగిపోయారు. ‘‘నీకు ప్రొటోకాల్ మర్యాదలు తెలియవా? నీ అంతు చూస్తా’’ అంటూ పరుష పదజాలంతో దూషించారు. అక్కడే ఉన్న తహసీల్దార్ నరసింహులునాయుడు ఎమ్మెల్యేకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా ఆయనపై తీవ్ర దుర్భాషలాడారు. దీంతో అక్కడున్న వారంతా హతాశులయ్యారు. ఎమ్మెల్యేది అహంకార ప్రవర్తన ఎమ్మెల్యే బొల్లినేని రామారావుది అహంకారపూరిత ప్రవర్తన అని రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం కార్యదర్శి నరసింహులునాయుడు, జిల్లా రెవెన్యూ ఉద్యోగ సంఘ అధ్యక్షుడు విజయసింహారెడ్డి, వీఆర్వో సంఘనేత చెంగల్రాయులు అన్నారు. ఎమ్మెల్యే పదవిలో ఉన్న వ్యక్తి అధికారుల పట్ల ఈ విధంగా ప్రవర్తించడం సహించరానిదన్నారు. ఘటనపై తాము సీఎంకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాల్సిందే.. జాయింట్ కలెక్టర్ గిరీష, తహసీల్దార్ నరసింహులునాయుడులకు శుక్రవారం ఉదయం 10 గంటలోపు ఎమ్మెల్యే రామారావు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ విజయసింహారెడ్డి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతామని, రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులంతా ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. -
వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు విజయవాడ రైల్వే డివిజన్ ఇన్చార్జి పీఆర్వో జేవీ ఆర్కే రాజశేఖర్ గురువారం తెలిపారు. సికింద్రాబాద్–విజయవాడ ప్రత్యేక రైలు (07757) ఆగస్టు 5, 12, 19, 26వ తేదీల్లో, సెప్టెంబర్ 2, 9, 16, 23, 30వ తేదీల్లో, అక్టోబర్ 7, 14, 21, 28వ తేదీల్లో ఉదయం 5.30 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. విజయవాడ–సికింద్రాబాద్ రైలు (07758) ఆగస్ట్ 5, 12, 19, 26వ తేదీల్లో, సెప్టెంబర్ 2, 9, 16, 23, 30వ తేదీల్లో, అక్టోబర్ 7, 14, 21, 28వ తేదీల్లో విజయవాడలో సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరుతుంది. తిరుపతి–కాకినాడ ప్రత్యేక రైలు (07942) ఆగస్టు 5, 12, 19, 26వ తేదీల్లో, సెప్టెంబర్ 2, 9, 16, 23, 30వ తేదీల్లో, అక్టోబర్ 7, 14, 21 ,28వ తేదీల్లో తిరుపతిలో సాయంత్రం బయలుదేరుతుంది. కాకినాడటౌన్–రేణిగుంట ప్రత్యేక రైలు (07941) ఆగస్టు 6, 13, 20, 27వ తేదీల్లో, సెప్టెంబర్ 3, 10, 17, 24వ తేదీల్లో, అక్టోబర్ 1, 8, 15, 22, 29వ తేదీల్లో సాయంత్రం 7.00 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరుతుంది. నాందేడ్ –తిరుపతి ప్రత్యేక రైలు (07607) ఆగస్టు 7, 14, 21, 28వ తేదీల్లో, సెప్టెంబర్ 4, 11, 18, 25వ తేదీల్లో, అక్టోబర్ 2, 9, 16, 23, 30వ తేదీల్లో సాయంత్రం 6.45కు నాందేడ్‌లో బయలుదేరుతుంది. -
బొలెరోను ఢీ కొన్న డీసీఎం ; ఐదుగురు మృతి
-
బస్సును ఢీకొన్న లారీ
రేణిగుంట: ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఇంకొందరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం నడిరేయి రేణిగుంట చెక్ పోస్టు సమీపంలో జరిగింది. శ్రీవారి దర్శనం ముగించు కున్న భక్తులు, ఇంకొందరు సొంత పనులు ముగించుకుని తిరుపతి నుంచి విజయవాడ బస్సులో బయలుదేరారు. ఆ బస్సు రేణిగుంట చెక్‌పోస్టు సమీ పంలోని శ్రీకాళహస్తి మార్గంలో మలుపు తిరిగింది. అదే సమయం బస్సుకు ఎడమ పక్క నుంచి మితిమీరిన వేగంతో దూసుకుని వచ్చిన లారీ ఢీకొని వెళ్లింది. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌చాకచక్యంగా వ్యవహరించినప్పటికీ లారీ ఢీకొన్న ధాటికి బస్సు అంతెత్తున ఎగిరి ట్రాఫిక్ ఐలాండ్‌పైకి దూసుకుని వెళ్లింది. దీంతో భారీ ప్రాణనష్టం తప్పింది. కాగా, లారీ ఢీకొన్న ధాటికి బస్సులో కిటికీ పక్కన కూర్చుని ఉన్న ఇద్దరు మహిళలు రోడ్డుపైకి ఎగిరి పడడంతో కాళ్లు విరిగాయి. వీరిది తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా అని బాధిత మహిళల సంబంధీకులు తెలిపారు. బస్సులోని ప్రయాణికులు ప్రాణ భయంతో కిటికీల నుంచి దూకారు. కాగా, బస్సును ఢీకొన్న లారీ ఆగకుండా వెళ్లిపోయింది. అదే సమయంలో పోలీసు పట్రోలింగ్ లేకపోవడంతో ఘటన జరిగిన వెంటనే బాధితులకు సహాయ చర్యలు అందించే వారు కరువయ్యారు. ఆలస్యంగా రేణిగుంట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. -
ఇండస్ట్రియల్ హబ్‌గా రేణికుంట
అల్గునూర్(మానకొండూర్): తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామాన్ని ఇండస్ట్రియల్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. గ్రామంలోని 19ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని 2016 టీఎస్ ఐపాస్‌కు కేటాయించినట్లు తెలిపారు. ఈ çస్థలాన్ని గురువారం పరిశీలించి మాట్లాడాడు. కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధికి మంత్రి కేటీఆర్ ప్రత్యేక నిధులు కేటాయించారని తెలిపారు. ఇందు లో భాగంగా పలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు రూపొందించినట్లు చెప్పారు. టీఎస్ ఐపాస్‌లో భాగంగా పరిశ్రమలు నెలకొల్పేవారికి రేణికుంటలో స్థలం కేటాయిస్తున్నామన్నారు. 19 ఎకరాల విస్తీర్ణంలో ప్రహరీ నిర్మిస్తామని తెలిపారు. అనంతరం అల్గునూరులోని ఎస్సారెస్పీ స్థలాన్ని సందర్శించారు. దీంట్లో నర్సరీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం తిమ్మాపుర్లోని మోడల్ స్కూల్ స్థలాన్ని సందర్శించారు. పాఠశాల ప్రహరీ వివాదాన్ని పరిష్కరించారు. -
రిమాండ్ విధించిన గంటలోపే బెయిల్
‘ఏర్పేడు’ ఇసుకాసురులపై నామమాత్రపు కేసులు గనుల శాఖ అధికారులపై న్యాయస్థానం అక్షింతలు రేణిగుంట(శ్రీకాళహస్తి): ఇసుక మాఫియా ముఠాను అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించిన గంటలోపే నిందితులందరూ బెయిల్‌పై బయటకొచ్చారు. పెద్ద ఎత్తున ఇసుకను అక్రమంగా తరలిస్తుంటే పటిష్టమైన రీతిలో కేసులు పెట్టాల్సిన గనుల శాఖ అధికారులు ఏమయ్యారంటూ న్యాయస్థానం ప్రశ్నించినట్లు సమాచారం. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మునగల పాళెం గ్రామ శివారున స్వర్ణముఖీ నదిలో ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్న 10 మంది అధికార పార్టీ నాయకులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారిపై బలమైన సెక్షన్లు› పెట్టకుండా, ఐపీసీ 120(బీ), 21(4) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో ఇవి బెయిల బుల్ కేసులు కావడంతో అప్పటికే నిందితుల తరపు న్యాయవాదులు బెయిల్ పత్రాలతో సిద్ధంగా ఉండి రాత్రికి రాత్రే వారిని బయటకు తీసుకొచ్చారు. ఇసుక మాఫియా కేసుకు సంబంధించి వారంరోజులుగా పరారీలో ఉన్న వారిపై బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేయరాదని నిబంధ నలు చెబుతున్నాయి. అయినా పోలీసు అధికారులు పైస్థాయి నుంచి వచ్చిన ఒత్తిళ్లకు తలొగ్గి నామమాత్రపు కేసులతో చేతులు దులుపుకున్నా రు. ఇసుక అక్రమ రవాణా గత ఏడాదన్నరగా సాగుతున్నా గనుల శాఖ అధికారులు స్పందించకపోవడం పట్ల శ్రీకాళహస్తి అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ మొదటి తరగతి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. -
వరకట్న వేధింపులకు వివాహిత బలి
– కొట్టి చంపేశారని మృతురాలి తల్లి ఫిర్యాదు రేణిగుంట : మండలంలోని సూరప్పకశం పంచాయతీ అల్లికశంలో మంగళవారం రాత్రి ఒక వివాహిత వరకట్నం వేధింపులతో మృతిచెందింది. రేణిగుంట రూరల్ సీఐ సాయినాథ్, గాజులమండ్యం ఎస్ఐ నాగేంద్రబాబు కథనం మేరకు.. అల్లికశంకు చెందిన కౌమతి అలియాస్ గుణవతి(21)కి అదే గ్రామానికి చెందిన ఉమాపతి(25)తో ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. ఆ సమయంలో కట్న కానుకలు ఇచ్చి ఘనంగానే వివాహం జరిపించారు. గణపతి ప్రైవేటు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వారికి పిల్లలు కలుగలేదు. ఈ క్రమంలో పుట్టింటి నుంచి అదనపు కట్నం తీసుకురావాలని భర్త గణపతి, అత్తామామలు నిత్యం హింసించేవారు. అలాగే రెండవ పెళ్లికి అంగీకరించాలని తరచూ ఆమెను వేధించేవారు. ఈ నేపథ్యంలో ఆమె మంగళవారం రాత్రి మృతిచెందింది. అత్తింటి వారే కొట్టి చంపేశారు కట్నం తీసుకురావాలని వేధింపులకు గురిచేయడంతోపాటు రెండో పెళ్లికి అడ్డుగా ఉందని తన కూతురును భర్త, అత్తామామలు కొట్టి చంపేశారని మృతురాలి తల్లి మునెమ్మ కన్నీరుమున్నీరైంది. మృతురాలి ఎడమ మోచేతిపై కాలిన గాయం, మెడపైన, వివిధ శరీర భాగాల్లో కమిలిన గాయాలు ఉండడంతో మృతిపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. మృతురాలి భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. సీఐ సాయినాథ్ మాట్లాడుతూ మృతురాలి తల్లి చేసిన ఫిర్యాదు మేరకు వరకట్నం వేధింపుల కేసు నమోదు చేశామన్నారు. తహసీల్దార్ గోవర్దన్ స్వామి సమక్షంలో పంచనామా చేసి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. -
రేణిగుంటలో నకిలీ పోలీసుల అరెస్ట్
-
రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు వెంకన్న పేరు
- రాష్ట్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం - శ్రీవారి భక్తుల్లో ఆనందం తిరుపతి : రేణిగుంటలో ఉన్న తిరుపతి అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు పేరు మారనుంది. త్వరలో దీన్ని శ్రీ వేంకటేశ్వర అంతర్జాతీయ విమానాశ్రయంగా పిలవనున్నారు. గురువారం అమరావతిలో జరిగిన రాష్ట్ర కేబి నెట్ సమావేశంలో మంత్రులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఒకట్రెండు మాసాల్లో ఈ మేరకు ఎయిర్‌పోర్ట్సు అధారి టీకి ఉత్తర్వులు అందే అవకాశాలున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. తిరుపతి ఎయిర్‌పోర్టును 1976లో ఏర్పాటు చేశారు. ఆ తరువాత పీవీ నరసింహారావు ప్రధాని హోదాలో రూ.11 కోట్లు మంజూరు చేసి ఆ యా నిధులతో న్యూ టెర్మినల్ భవనాన్ని, న్యూ రన్ వే, రేడియో టవర్లను నిర్మించారు. 1999 నుంచి ప్యాసింజర్ ట్రాఫిక్ పెరిగింది. ప్రస్తుతం రోజూ 10 వి మానాలు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నా యి. హైదరాబాద్, కోయంబత్తూరు, న్యూ ఢిల్లీ, విశాఖపట్నం, విజయవాడ వెళ్లే ప్రయాణికులకు తిరుపతి నుంచి విమాన ప్రయాణం సులభతరమైంది. ఎయిర్‌కోస్తా, స్పైస్‌జెట్, ట్రూ జెట్, ఎయిర్ ఇండియా సంస్థలకు చెందిన విమానాలు రోజుకు 1000 నుంచి 1500 మందిని సుదూర ప్రాంతాలకు చేర వే స్తున్నాయి. సుమారు 12 దేశాల నుంచి విదేశీ యాత్రికులు తిరుపతి చేరుకుని శ్రీవారిని దర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి ఎయిర్ పోర్టులో దిగే దేశ విదేశాలకు చెందిన ప్రయాణికులందరూ ఎయిర్‌పోర్టులోనే స్వామి వారిని స్మరించుకునేలా ఉండాలంటే పేరు మా ర్చడం ఎంతో అవసరమన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తిరుపతి ఎయిర్‌పోర్టును శ్రీవేంకటేశ్వర ఎయిర్‌పోర్టుగా మా ర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం తీసుకున్న నిర్ణయాన్ని కేబినెట్ కేంద్రానికి పంపితే అక్కడి మినిస్ట్రీ ఆఫ్ ఏవియేషన్ పరి శీలించి ఆమోదాన్ని వ్యక్తం చేసి, ఎయిర్‌పోర్టు అధారిటీకి పంపుతుంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తవడానికి కనీసం రెండు నెలలు పడుతుం ది. ఈ లెక్కన వచ్చే మే నెల తరువాత ఎయిర్‌పోర్టును వెంకన్న పేరుతో పిలుచుకోవచ్చన్నమాట. కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో శ్రీవారి భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
అల్లుడే కాలయముడు
► అవమానించారనే వృద్ధ దంపతుల హత్య ► అత్యాచారంగా చిత్రీకరణ ► విలేకరుల సమావేశంలో డీఎస్సీ నంజుండప్ప వెల్లడి రేణిగుంట: మండలంలోని ఆర్.మల్లవరం పంపుసెట్ షెడ్డులో గతనెల 26వ తేదీన నిద్రిస్తున్న వృద్ధ దంపతులను అల్లుడు వెంకటేష్(30) హతమార్చినట్లు డీఎస్పీ నంజుండప్ప తెలిపారు. ఆయన గురువారం రేణిగుంట పోలీస్‌స్టేషన్ ఆవరణలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. గుత్తివారిపల్లి ఎస్టీ కాలనీకి చెందిన కొత్తకోట శ్రీనివాసులు(60), అతని భార్య ఇందిరమ్మ అలియాస్ ఇంద్రాణమ్మ(55) దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు చేశారు. ఈ క్రమంలో కొడుకులకు ఆసరాగా ఉండేందుకు ఆర్.మల్లవరం సమీపంలోని పంపు సెట్ వద్ద కాపలా ఉండేవారు. ఈ క్రమంలో గత నెల 26వ తేదీన వారు హత్యకు గురయ్యారు. ఈ కేసును అర్బన్ సీఐ బాలయ్య నేతృత్వంలో ఎస్ఐలు శ్రీనివాసులు, మధుసూదన్‌రావు, సిబ్బంది శేఖర్, వరప్రసాద్, మధు, రమణరాజు రెండు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. మృతుల అల్లుడు వెంకటేష్‌పై అనుమానంతో బుధవారం సాయంత్రం కరకంబాడి ఆటో స్టాండు వద్ద ఉన్న అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. అతను హత్యకు దారితీసిన కారణాలను వెల్లడించాడు.నిందితుడు వెంకటేష్ గుత్తివారిపల్లి ఎస్టీ కాలనీలో అత్తమామల ఇంటి సమీపంలోనే కాపురముండే వాడు. అతనికి అత్త ఇందిరమ్మపై కామవాంఛ కలిగింది. ఈ విషయం ఆమెకు చెప్పాడు. ఆమె అల్లరిచేసి అల్లుడిని అందరి ముందు అవమానపరిచింది. దీంతో ఎలాగైనా అత్తామామలను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 26న రాత్రి గుత్తివారిపల్లి కాలనీ నుంచి అత్తమామలిద్దరూ పంపు షెడ్డుకు రావడాన్ని గమనించాడు. అర్ధరాత్రి వారు నిద్రిస్తున్న షెడ్డు వద్దకు చేరుకున్నాడు. తలుపునకు గడియ పెట్టకపోవడంతో ఇంట్లోకి వెళ్లి అక్కడే ఉన్న ఇనుపరాడ్‌తో తొలుత శ్రీనివాసులు తలపై మోది చంపేశాడు. తర్వాత విషయం బయటపెడుతుందని అత్త ఇందిరమ్మను ఇనుపరాడ్, గుండ్రాయి సాయంతో తలపై బలంగా కొట్టి హత్య చేశాడు. అత్యాచారంగా చిత్రీకరించేందుకు ఇంది రమ్మ ఒంటిపై దుస్తులను తొలగించి కాళ్లను తాళ్లతో కట్టేసి పారిపోయాడు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలిస్తున్నట్లు డీఎస్పీ నంజుండప్ప తెలిపారు. జంట హత్యల కేసును త్వరితగతిన ఛేదించిన సీఐ బాలయ్య, సిబ్బందిని ఆయన అభినందించారు. -
పాశవికం
► కలకలం రేపిన దంపతుల హత్య ► మృగాలను మరపించిన దుండగులు ► పోలీసు జాగిలం, క్లూస్ టీం బృందం నిశిత పరిశీలన ► మంట కలసిపోతున్న మానవ సంబంధాలు ► నిందితులను పట్టుకుని తీరుతాం : పోలీసులు రేణిగుంట: అమావాస్య చీకటిలో ఊహకందని విషాదం. దుం డగులు మానవ మృగాలుగా మారి కళ్లెదుటే భర్తను దారుణంగా హతమార్చారు. ఆపై ఆరు పదుల వయస్సున్న వృద్ధురాలిని కాళ్లు చేతులు తాళ్లతో కట్టేసి పాశవికంగా కామవాంఛ తీర్చుకుని ఊపిరి తీశారు. ఈ హృదయ విదారక సంఘటన రేణిగుంట మండలం ఆర్.మల్లవరం సమీపంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఊరుగాని ఊరొచ్చి.. పూతలపట్టుకు చెందిన కొత్తపల్లి శీనయ్య(65), ఇందిరమ్మ(58) దంపతులకు కుమారులు రాజశేఖర్, కుమార్, కుమార్తె కళావతి ఉన్నారు. వీరు 30 ఏళ్ల క్రితం రేణిగుంట మండలానికి వచ్చి స్థిరపడ్డారు. పిల్లలకు పెళ్లిళ్లు చేశారు. పంట చేలు, మామిడి తోటల్లో కాపలా ఉంటూ పొట్టపోసుకుంటున్నారు. ఏడాది క్రితం సమీపంలోని గుత్తివారిపల్లె గిరిజనకాలనీలో ఇంటి స్థలం ఇవ్వడంతో అక్కడే ఓ గుడిసె ఏర్పాటు చేసుకున్నారు. వారి సమీపంలోనే పెద్ద కుమారుడు రాజశేఖర్ కుటుంబం, కూతురు కళావతి, ఆమె భర్త వెంకటేశు కాపురముంటున్నారు. రెండు నెలల క్రితం నుంచి ఆర్.మల్లవరం సమీపంలోని సదాశివరెడ్డి పొలాల వద్ద కాపలా ఉంటున్నారు. వీరికి నెలకు రూ.5 వేలు ఇస్తున్నారు. గత గురువారం శీనయ్య తండ్రి అనారోగ్యంతో మృతి చెందడంతో పూతలపట్టుకు వెళ్లి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. పొలం వద్ద కాపలా ఉండాల్సి రావడంతో శీనయ్య శుక్రవారం గుత్తివారిపల్లెకు చేరుకుని అక్కడి నుంచి పనికి కుదిరిన పంపు షెడ్డు వద్ద వెళ్లాడు. పూతలపట్టు నుంచి ఆదివారం మధ్యాహ్నం గుత్తివారిపల్లెకు చేరుకున్న శీనయ్య భార్య ఇందిరమ్మ ఇంట్లో భర్త లేకపోవడంతో మల్లవరంలోని పంపు షెడ్డు వద్దకు వచ్చింది. సాయంత్రం ఇద్దరు కలిసి ఇంటికి వెళ్లారు. ఇటీవలే శీనయ్య పాముకాటుకు గురై పత్యం ఉండడంతో ఇంట్లో వండిన చేపలకూర పెట్టలేదని అలిగి రాత్రి 8 గంటలకు పంపు షెడ్డుకు బయలుదేరాడు. అతనితోపాటు భార్య కూడా వెళ్లింది. ఇద్దరూ అక్కడే పడుకున్నారు. అతి కిరాతంగా హతమార్చిన వైనం రాత్రి వెళ్లిన తల్లిదండ్రులిద్దరూ రక్తపు మడుగులో పడి ఉన్నారని సోమవారం ఉదయం సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు పరుగు పరుగున అక్కడికి చేరుకున్నారు. రేణిగుంట డీఎస్పీ నంజుండప్ప, అర్బన్ సీఐ బాలయ్య, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇద్దరూ గదిలో చాపపై పడుకున్న చోటే రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గమనించారు. డాగ్‌స్క్వాడ్‌ను రప్పించారు. దుండగులు తొలుత ఎలుకలు పట్టేందుకు వినియోగించే ఇనుప గునపంతో శీనయ్య తలపై మోది హత్య చేశారు. అనంతరం అతని భార్య ఇందిరమ్మను వివస్త్రను చేసి కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేశారు. గోడ చువ్వలకు తాళ్లను బిగించి విచక్షణా రహితంగా అత్యాచారం చేసి ఆపై తలపై కొట్టి చంపినట్లు ఆనవాళ్లను బట్టి తెలుస్తోంది. పోలీసు జాగిలం అక్కడి నుంచి గది వెనుకకు వెళ్లి మృతుల అల్లుడు వెంకటేశు కూర్చున్న చోట కాసేపు ఆగింది. అక్కడి నుంచి హైవేపై పరుగులు తీసి సమీపంలో ఉన్న మల్లవరం ఎస్టీ కాలనీలోకి వెళ్లింది. పోలీసులు మృతుల అల్లుడు వెంకటేశును విచారించారు. అలాగే గదిలో హత్యకు వినియోగించిన గునపాన్ని, మూడు మందు బాటిళ్లను, సెల్‌ఫోనును స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయాకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. దర్యాప్తు ముమ్మరం చేసి నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఆయన వెల్లడించారు. -
నేడు రేణిగుంటకు వైఎస్ జగన్ రాక
తిరుపతి (మంగళం): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఉదయం 9.30గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారని పార్టీ జిల్లా అధ్యక్షులు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి సోమవారం మీడియాకు తెలిపారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన శ్రీ పొట్టిశ్రీరాములు జిల్లా నెల్లూరుకు వెళతారని తెలిపారు. రెండు రోజుల క్రితం నెల్లూరు జిల్లాలో సంభవించిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను జగన్ మోహన్ రెడ్డి పరామర్శిస్తారని తెలిపారు. అనంతరం సాయంత్రం తిరిగి హైదరాబాదుకు బయలుదేరి వెళుతారన్నారు. జిల్లాలోని పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున హాజరై పార్టీ అధినేతకు ఘనస్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. -
నారాయణ కళాశాల విద్యార్థి ఆత్మహత్య
-
నారాయణ కళాశాల విద్యార్థి ఆత్మహత్య
♦ చిత్తూరు జిల్లా రేణిగుంటలో ఘటన ♦ అధ్యాపకుల ఒత్తిళ్లే కారణమనే ఆరోపణలు ♦ ఫర్నిచర్ ధ్వంసం చేసిన విద్యార్థులు ♦ జాతీయ రహదారిపై రాస్తారోకో రేణిగుంట: చిత్తూరు జిల్లా రేణిగుంట చెక్‌పోస్టు సమీపంలోని నారాయణ కళాశాలలో ఆదివారం రాత్రి కమలేష్ (16) అనే ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాత్రి 10.30 గంటల తర్వాత ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు కళాశాలలో ఆందోళనకు దిగారు. చదువు విషయంలో అధ్యాపకుల ఒత్తిళ్ల కారణంగానే కమలేష్ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని ఆరోపించారు. పోలీసుల కథనం మేరకు.. పలమనేరుకు చెందిన కమలేష్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటల వరకు స్టడీ అవర్‌లో సహచర విద్యార్థులతో కలసి చదువుకున్నాడు. తర్వాత హాస్టల్లోని తన గదికి వెళ్లిన కమలేష్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. దీన్ని గమనించిన తోటి విద్యార్థులు వెంటనే కళాశాల యాజమాన్యానికి సమాచారం అందించారు. యాజమాన్యం కమలేష్‌ను తిరుపతి సమీపంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అక్కడ మృతిచెందాడు. అయితే ఈ ఘటనను బయటకు పొక్కనీయకుండా కళాశాల యాజమాన్యం జాగ్రత్తలు తీసుకుంది. రాత్రి పొద్దుపోయిన తర్వాత విషయం తెలుసుకున్న విద్యార్థులు ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపైకి చేరుకుని ధర్నాకు దిగారు. వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. కళాశాల యాజమాన్యం కమలేష్ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంలో ఆలస్యం చేసినట్లు విద్యార్థులు ఆరోపించారు. ఎస్ఐ మధుసూదన్ రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రన్‌వేపైకి స్పైస్‌జెట్ విమానం
– నేటినుంచి యథావిధిగా విమాన రాకపోకలు రేణిగుంటః రేణిగుంటలో బురదలో కూరుకుపోయిన విమానాన్ని ఆదివారం రాత్రి రన్‌వేపైకి తీసుకొచ్చారు. రేణిగుంట విమానాశ్రయంలో శనివారం రాత్రి స్పైస్‌జెట్ విమానం ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పి రన్‌వేను దాటి బురదలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. విమాన ప్రమాద విషయం తెలుసుకున్న విమానయానశాఖ అధికారులు ఢిల్లీ నుంచి విమానాశ్రయానికి చేరుకున్నారు. స్పైస్‌జెట్ ఉన్నతాధికారులు కూడా ఇక్కడకు చేరుకున్నారు. సుమారు 20టన్నులకు పైగా బరువుతో బురద మట్టిలో దిగబడిన విమానాన్ని రన్‌వే పైకి లాక్కొచ్చేందుకు ఆదివారం ఉదయం నుంచి మూడు భారీ క్రేన్ల సాయంతో సిబ్బంది ప్రయత్నించారు. చివరకు రాత్రి 7.30 గంటలకు రన్‌వే మీద పార్కింగ్ ప్రాంతంలోకి తీసుకొచ్చారు. ఎయిర్‌పోర్టు డైరెక్టర్ పుల్లా, రేణిగుంట డీఎస్పీ నంజుండప్ప, శ్రీకాళహస్తి డీఎస్పీ వెంకటకిషోర్ సహాయక చర్యలను పర్యవేక్షించారు. దీంతో సోమవారం నుంచి ఇక్కడి నుంచి విమాన రాకపోకలు యథావిధిగా కొనసాగుతాయని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ పుల్లా తెలిపారు. ప్రయాణికుల అవస్థలు రేణిగుంట విమానాశ్రయం నుంచి ఆదివారం పూర్తిగా విమాన సర్వీసులు నిలిపివేస్తూ కేంద్ర విమానయాన శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కాగా శనివారం రాత్రి టేకాఫ్ కాకుండా ఇక్కడే నిలిచిపోయిన ట్రూజెట్ విమానాన్ని వూత్రం ఆదివారం మధ్యాహ్నం 3.30గంటలకు ఇక్కడ నుంచి హైదరాబాద్‌కు పంపారు. దీనిని మినహాయిస్తే మిగిలిన విమాన రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
తిరుపతిలో స్పైస్ జెట్ విమానానికి తప్పిన ప్రమాదం
తిరుపతి: హైదరాబాద్ నుంచి బయలుదేరి తిరుపతి చేరుకున్న స్పైస్ జెట్ విమానం తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది. విమానాశ్రయంలో రన్ వే దాటి అరకిలోమీటరు ముందుకు వెళ్లింది. దీంతో విమానంలో ఉన్న ప్రయాణీకులు ఈ ఊహించని పరిణామానికి ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణీకులను బస్సులో విమానాశ్రయానికి తరలించారు. విమానంలో 60 మంది ప్రయాణీకులున్నారు. -
ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు ఉద్యమం
– తిరుపతి సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద రేణిగుంట వాసులు ధర్నా తిరుపతి మంగళం : ఏళ్ల తరబడి రేణిగుంటలో నివాసముంటున్నా తలదాచుకోవడానికి గూడు లేదని రేణిగుంట వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు ఉద్యమాలు ఆగవని వారు హెచ్చరించారు. ఇంటిస్థల పోరాట కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రేణిగుంట నుంచి పాదయాత్రగా తిరుపతి సబ్‌కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని ధర్నా నిర్వహించారు. సీపీఎం మండల కార్యదర్శి వెంకటరమణ మాట్లాడుతూ రేణిగుంటలో సుమారు 1,500 మంది పేదలు ఇళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రేణిగుంట మండలంలో వందల ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయని, అందులో పేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే అనేక సార్లు ఇంటి స్థలాలపై ధర్నాలు, నిరాహార దీక్షలు చేపట్టినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం రాలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పేదల పట్ల ప్రభుత్వానికి ఇంత చిన్నచూపా..? అని మండిపడ్డారు. సంబంధిత అధికారులు స్పందించి రేణిగుంటలోని పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.