
సాక్షి, తిరుపతి: రేణిగుంట మానసిక వికలాంగుల విద్యాలయంలో దారుణం చోటు చేసుకుంది. వైఎస్సార్‌కు జిల్లాకు చెందిన విద్యార్థిని సిబ్బంది చితకబాదారు. అల్లరి చేస్తున్నాడని విద్యార్థి వీపుపై దారుణంగా కొట్టారు. దీపావళి సందర్భంగా ఇంటికి తీసుకువెళ్లిన తల్లిదండ్రులు.. తమ బిడ్డ గాయాలు గమనించి జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రేణిగుంట అభయక్షేత్రం నిర్వాహకులపై తల్లిదండ్రులు మండి పడుతున్నారు. గతంలోనూ ఇదే తరహా ఘటనలు జరిగాయని స్థానికులు అంటున్నారు.
చదవండి: పెళ్లి కాకుండానే బిడ్డకు ప్రసవం.. క్యాంటమ్ కంపెనీ బాత్‌రూమ్‌లో శిశువు కలకలం
Comments
Please login to add a commentAdd a comment