handicapped
-
స్మితా సబర్వాల్ మెంటల్‌గా అన్‌ఫిట్
పంజగుట్ట/సుందరయ్య విజ్ఞాన కేంద్రం: అఖిల భారత సర్వీసు (ఏఐఎస్)ల్లో దివ్యా ంగులకు రిజర్వేషన్లు ఎందుకంటూ సామా జిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ప్రశ్నించిన సీని యర్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యదర్శి స్మితా సబర్వాల్ వ్యాఖ్య లను ప్రముఖ విద్యావేత్త, మాజీ ఐఏఎస్ అధికా రిణి మల్లవరపు బాలలత తీవ్రంగా ఖండించారు. బ్యూరో క్రాట్లకు శారీరక ఫిట్ నెస్కన్నా మానసిక ఫిట్నెస్ ఉండాలని.. కానీ స్మిత ఫిజికల్‌గా ఫిట్‌గా ఉన్నారేమో కానీ మెంటల్‌గా ఫిట్‌గా లేరని మండి పడ్డారు.తన లాంటి దివ్యాంగులను ఉద్దే శించి ఆమె చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే దివ్యాంగులను దూరంగా పెట్టాలని సమా జానికి సంకేతం ఇస్తున్నట్లుగా ఉన్నాయ న్నారు. సోమవారం హైదరా బాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో బాల లత మాట్లా డారు.స్మిత వ్యాఖ్యలు వ్యక్తిగత మైనవా లేక ప్రభుత్వ ప్రతినిధిగా చేసినవో ఆమె వివరణ ఇవ్వాలన్నారు. ఆమెపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎం వెంటనే చర్యలు తీసుకోవాలని.. 24గంటల్లోగా ఆమె చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించు కొని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే దివంగత కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి సమాధి స్ఫూర్తిస్థల్ వద్ద దివ్యాంగ సమాజమంతా శాంతియుత నిరసన తెలుపుతామన్నారు.ప్రతిపక్షాలు, మీడియా, సమాజం స్పందించాలి..జైపాల్‌రెడ్డి లాంటి పెద్ద నేత రెండు కాళ్లు పనిచేయకపోయినా ఉత్తమ పార్లమెంటేరియన్‌గా నిలిచారని బాలలత గుర్తు చేశారు. స్మితా సబర్వాల్ పదవికి రాజీ నామా చేసి తనతోపాటే మళ్లీ సివిల్స్ రాసి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని సవాల్ విసిరారు. ఈ విషయమై మిగిలిన బ్యూరో క్రాట్లు, ప్రతిపక్ష పార్టీలు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మీడియా కూడా స్పందించాలని కోరారు.కాగా, స్మిత వ్యాఖ్యలు దేశంలోని 4 శాతం దివ్యాంగుల మనోభా వాలు దెబ్బతీసేలా ఉన్నాయని అఖిల భారత దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు విమర్శించారు. రాజ్యా ంగాన్ని అమలు చేయాల్సిన ఒక ఐఏఎస్ అధికారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని పీవోడబ్ల్యూ సంధ్య వ్యాఖ్యా నించారు. మరోవైపు స్మితా సబర్వాల్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డెవలప్మెంట్ సొసైటీ ఫర్ ది డెఫ్ జాతీయ కన్వీనర్ వల్లభనేని ప్రసాద్, కో–కన్వీనర్ కాటమోనీ వెంకటేష్ గౌడ్ డిమాండ్ చేశారు.వరుస ఫిర్యాదులుసీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ సోమవారం జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయగా మరికొందరు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీఓపీ టీ)కు ఫిర్యాదు చేశారు. మరోవైపు శాంతి దివ్యాంగుల సంఘం అధ్యక్షురాలు శ్రీగిరి రజిని ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌లో స్మితపై కంప్లయింట్ ఇచ్చారు. అలాగే చదువుకోని వారంతా వికలాంగులతో సమానం అంటూ సినీ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి వ్యాఖ్యానించారని ఆరోపిస్తూ ఆయనపైనా పోలీసులకు ఫిర్యాదు చేశారు.క్షేత్రస్థాయిలో తిరుగుతున్న ఐఏఎస్‌లు ఎందరు?: మురళిఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌పై ‘ఎక్స్’ వేదికగా రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి తీవ్ర విమర్శలు చేశారు. ఇలాంటి అహంకారపూరిత, రాజ్యాంగాన్ని గౌరవించని వాళ్లు మన విధాన రూపకర్తలని మండిప డ్డారు. ‘దివ్యాంగుల చట్టం–1995 చట్టం ప్రకారమే ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ వచ్చా యని ఆవిడకు తెలియదా లేక పార్లమెంటు నే కించపరిచేలా గర్వం తలకెక్కిందా?’ అని దుయ్యబట్టారు. కలెక్టర్లు, జేసీలుగా పని చేస్తున్నప్పుడు మినహా అసలు ఎంత మంది ఐఏఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో తిరు గుతున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ అండతో దేశంలోనే హెలికాప్టర్లలో తిరిగిన ఏకైక ఐఏఎస్ అధికారి కదా.. ఆ మాత్రం తల బిరుసు ఉంటుందేమోనని విమర్శించారు. -
సీఎం జగన్ పెద్ద మనసు
-
సీఎం వైఎస్ జగన్‌కు వికలాంగుడు ప్రత్యేక బహుమతి
-
మాటిచ్చిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు సీఎంగా..
తెలంగాణలో తొలి ఉద్యోగం నాకే రాబోతున్నందుకు సంతోషంగా ఉంది. రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు. గాంధీ భవన్ వెళ్లినప్పుడు ఆయన నాకు ఉద్యోగం ఇస్తామని మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ ఆయన నెరవేరుస్తుండడం హ్యాపీగా ఉంది.. :::రజిని అధికారంలోకి గనుక వస్తే.. అంటూ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సర్కార్ ఏర్పాటు అవుతున్న తరుణంలో వాటిని నెరవేర్చేందుకు సిద్ధమైపోయింది. రేపు డిసెంబర్ 7న ఎల్బీ స్టేడియంలో రేవంత్ ప్రమాణం ముఖ్యమంత్రిగా చేయనున్నారు. ఈ సందర్భంగా ఆరు గ్యారెంటీ హామీలు నెరవేర్చడంపైనా ఆయన స్పష్టమైన ఒక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే.. తొలి ఉద్యోగం కూడా ఎవరికి ఇవ్వాలనే దానిపై ఓ క్లారిటీతో ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పాలనలో తొలి ఉద్యోగం రజినీ అనే యువతికి దక్కనుంది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేయాలని అధికార యంత్రాంగాన్ని రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఆదేశించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. తొలి ఉద్యోగం రజినీకి ఇస్తాం అని స్వయంగా ప్రకటన చేసిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడా గ్యారెంటీని నెరవేర్చేందుకు రెడీ అయిపోయారు. అక్టోబర్ 17వ తేదీన.. నాంపల్లికి చెందిన రజిని అనే ఓ దివ్యాంగురాలు గాంధీభవన్‌కు వెళ్లి రేవంత్‌రెడ్డిని కలిశారు. రజిని రెండేళ్ల క్రితం పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం వెతుకుతోంది. పీజీ చేసిన తనకు ఇటు ప్రభుత్వంలోనూ అటు ప్రైవేటులోనూ ఉద్యోగం రావట్లేదని తన బాధను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి చెప్పింది. అప్పుడు రేవంత్ రెడ్డి .. ‘‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మొదటి ఉద్యోగం నీకే ఇస్తాం. డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకార సభ ఉంటుంది. ఆ సభకు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ వస్తారు. ఆ సభలోనే మొదటి ఉద్యోగం నీకేనమ్మా. ఇది నా గ్యారెంటీ’’ అంటూ రేవంత్ ఆమెకు హామీ ఇచ్చారు. అంతేకాదు.. కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు మీద స్వయంగా ఆయన రజినీ పేరు రాసి.. కింద సంతకం కూడా చేశారు. As PCC President of Telangana , promised first job to Rajini, a physically challenged girl from Nampally as soon as #Congress comes to power. I filled the Congress guarantee card with Rajini's name. Rajini, who completed post graduation expressed her grief that she is not… pic.twitter.com/JFSha8a56M — Revanth Reddy (@revanth_anumula) October 17, 2023 నెలన్నర తర్వాత.. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో తొలి ఉద్యోగం రజినికే దక్కబోతోంది. కానీ, ప్రమాణ స్వీకారమే రెండు రోజులు ముందుగానే జరుగుతోంది. -
ఈయన ఓటేశారు.. ఆ తర్వాత ఏమన్నారంటే..
సాక్షి, హైదరాబాద్: పవిత్రమైన ఓటును పవిత్రంగానే ఉపయోగించుకోవాలి.. ఇది ఓటర్లకు పెద్దలు ఇస్తున్న సందేశం. తెలంగాణ ఓటర్ల జాతర నేపథ్యంలో.. ఎనిమిది పదుల వయసు దాటిన కొందరు చురుకుగా, అదీ ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు సైతం ఇంట్లో వాళ్ల సాయంతో ఓటింగ్ పాల్గొని.. ఓటుకు దూరంగా ఉండొద్దని మిగతా వాళ్లకు పిలుపు ఇస్తున్నారు. అంబర్‌పేటలో 92 సంవత్సరాల వృద్ధుడు ఓటు హక్కు వినియోగించుకుని.. యువత ఇంట్లో ఉండకుండా బయటికి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పారు. అలాగే.. శివానంద రిహబిలిటేషన్ లో వృద్దులు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినయోగించుకున్న దృశ్యాలు కనిపించాయి. మరోవైపు దివ్యాంగులు సైతం ఎన్నికల్లో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. తెలంగాణ ఎన్నికల కోసం తొలిసారిగా.. ఓట్ ఫ్రమ్ హోం ద్వారా 27వేలమందికి పైగా వృద్ధులు, దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకోవడం తెలిసిందే. మిగిలిన వాళ్లు ఇవాళ నేరుగా పోలింగ్‌కేంద్రాలకు వెళ్తూ ఓటేస్తున్నారు. తద్వారా ఓటు హక్కు అందరి బాధ్యత అని గుర్తు చేస్తున్నారు. -
కీపిటప్..మహమ్మద్ యూనస్!
ఉదయాన్నే కాఫీ తాగుతూ పేపర్ తిరగేస్తుంటే కనిపించింది.ప్రభుత్వ ఉద్యోగం రాలేదని ఒకరు ఆత్మహత్య అని..అలా మరో పేజీ తిప్పానో లేదో సివిల్స్‌లో ఫెయిలయ్యానని బలవన్మరణం అంటూ మరోవార్త ఇదేమిటి చిన్నచిన్న కారణాలతో ఇలా చనిపోవడాలు అనిపించింది.అప్పుడే నిన్న కలిసిన మహమ్మద్ యూనస్ గుర్తొచ్చాడు.. బతుకంతా కష్టాలు ఎదుర్కొన్నా అతడి మొహంలో చెదిరిపోని ఆ చిరునవ్వు గుర్తొచ్చింది.అంగవైకల్యం వెనక్కులాగుతున్నా..ముందుకు దూసుకెళ్లాలన్న అతడిగుండెధైర్యం ఈ ఆత్మహత్యల వార్తల సమయంలో మరీ గుర్తొచ్చింది. ఆ మహమ్మద్ యూనస్ ఎవరో తెలుసుకుందాం. ఓ సాక్షి పాఠకుడి మాటల్లో అతడి కథను విందాం ఓ ఆయుర్వేద మందుల దుకాణంనుంచి మెడిసిన్స్ తెప్పించాలి. దాంతో ఒక బైక్ ట్యాక్సీ అగ్రిగేటర్ యాప్‌లో రైడర్‌ను బుక్ చేసుకుని మందులు ఇంటికి తెప్పించుకు న్నాను. కిందకు వెళ్లి అడిగాను.. డెలివరీ బాయ్ వచ్చాడా అని.. అప్పుడు నేనేనండి అంటూ నవ్వుతూ వచ్చాడు మహమ్మద్ యూనస్.. చూడగానే ఆశ్చర్యం కలిగింది.. ఎందుకంటే.. తను దివ్యాంగుడు.. ఎప్పుడూ ఈ పనిలో దివ్యాంగులను చూడని నేను ఆసక్తి తో అతడి వివరాలు అడిగాను.. అప్పుడు చెప్పాడు.. 36 ఏళ్ల యూనస్ తన కథ.. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ చెందిన యూనస్‌ది పేద కుటుంబం. చిన్నతనంలోనే పోలియో బారిన పడ్డాడు. రెండు కాళ్లూ చచ్చుబడి పోయాయి. శరీరం సహకరించక పోయినా ఇంటర్ పూర్తి చేశాడు. ఒక మీడియా సర్వీసెస్ సంస్థలో పదేళ్లు పనిచేశాడు. అది మూతపడ్డాక ఒక మొబైల్ షాపులో చేరాడు. పైగా తండ్రి మరణంతో కుటుంబ బాధ్యత ఇతడి మీదే పడింది. లాక్‌డౌన్‌తో ఆ మొబైల్ షాపు కాస్తా మూతపడటంతో బతుకు రోడ్డున పడింది. ఇదే సమయంలో అనారోగ్యంతో తన 6 నెలల బిడ్డనూ పోగొట్టుకున్నాడు. కష్టాల మీద కష్టాలు వచ్చిపడ్డాయి. కానీ గుండె ధైర్యం మాత్రం సడలలేదు. లాక్డౌన్ సడలించాక ఒక బైక్ ట్యాక్సీ యాప్ వేదికగా రైడర్‌గా మారాడు. ‘ఈ నా బండిని చూసి రోజూ ఒకరిద్దరు రైడ్ క్యాన్సిల్ చేసుకునేవారు. కన్నీళ్లు వచ్చేవి. నా వైకల్యాన్ని చూసి రైడ్ క్యాన్సిల్ చేసుకున్నారని చాలా బాధపడ్డాను. అయితే.. బతకాలంటే పని చేయాలి. అందుకే పరుగు ఆపకూడదని నిర్ణయించుకున్నాను. రైడ్ లేకపోతే సరుకు డెలివరీ అయినా ఉంటుంది. రోజూ ఖర్చులుపోను ఇంటికి రూ.300 దాకా తీసుకువెళతాను. ఒంట్లో శక్తి ఉన్నంత వరకు నా రైడ్ ఆగదు.. సార్’ అంటూ చిరునవ్వుతో సెలవు తీసుకున్నాడు యూనస్. ‘ప్రభుత్వం నుంచి రుణం అందితే ఇంటి దగ్గర మీ సేవ లేదా మొబైల్/కిరాణా దుకాణం పెట్టుకోవాలన్న ఆలోచన ఉంది.. సార్’ అని తన మనసులోని మాట చెప్పాడు. ఈ ఆత్మహత్యల వార్తలు చదివాక.. యూనస్‌ను చూశాక అనిపించింది. మనం చూడాల్సింది నిరాశ అనే నిశీధిని కాదు.. దాన్ని తరిమేసే ఆ చిరుదివ్వెను.... కష్టాల చీకట్లో మగ్గుతున్న ఎంతోమందికి ఈ యూనస్ కథ ఒక చిరుదివ్వెనే... కీపిటప్.. మహమ్మద్ యూనస్.. -
దివ్యాంగునిపై పోలీసుల దారుణం.. నీళ్లు అడిగాడని.. వీడియో వైరల్..
లక్నో: దివ్యాంగునిపై ఇద్దరు పోలీసులు అమానవీయంగా ప్రవర్తించారు. నీళ్లు అడిగినందుకు అర్థరాత్రి అతనిపై విరుచుకుపడ్డారు. దివ్యాంగుడని కూడా చూడకుండా అతన్ని విచక్షణా రహితంగా కొట్టారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ముడు చక్రాల బండిలో కూర్చున్న వ్యక్తి పేరు సచిన్ సింగ్. 2016లో రైలు ప్రమాదంలో రెండు కాళ్లు పోయాయి. స్థానికంగా సిమ్‌లు అమ్మతుంటాడు. ఓ రెస్టారెంట్లో సప్లయర్‌లా కూడా పనిచేస్తాడు. శనివారం రాత్రి పని ముగించుకుని వస్తుండగా.. అతనికి ఓ తాబేలు కనిపించింది. దాన్ని పట్టుకుని స్థానికంగా ఉన్న చెరువులో వదిలి వస్తుండగా.. పోలీసులు ఎదురైనట్లు చెప్పారు. చేతి కడుకోవడానికి నీళ్లు అడిగిన క్రమంలో పోలీసులు ఫైరనట్లు వెల్లడించారు. In UP's Deoria, a purported video of a specially-abled man on a tricycle being assaulted by two men identified as Prantiya Rakshak Dal (PRD) jawans has surfaced on social media. pic.twitter.com/grJgsp195G — Piyush Rai (@Benarasiyaa) July 30, 2023 చేతికి తాబేలు వాసన కారణంగానే తాను నీళ్లు అడినట్లు బాధితుడు పోలీసులకు తెలిపారు. విచక్షణా రహితంగా తలపై కొట్టారని తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. స్థానిక ఎస్పీ సంకల్ప్ శర్మ స్పందించారు. ఆ ఇద్దరు పోలీసులను రాజేంద్ర మని, అభిషేక్ సింగ్‌గా గుర్తించినట్లు వెల్లడించారు. వారు ప్రాంతీయ రక్షక్ దళానికి చెందినవారిగా గుర్తించారు. విధుల నుంచి తప్పించినట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఉమేశ్ పాల్ హత్య కేసులో గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ లాయర్ అరెస్టు.. -
కాలు పోయినా కళను వీడలేదు.. నాట్యం నేర్చుకుని ప్రశంసలు పొందింది
-
మానసిక వికలాంగుల విద్యాలయంలో దారుణం.. అల్లరి చేస్తున్నాడని..
సాక్షి, తిరుపతి: రేణిగుంట మానసిక వికలాంగుల విద్యాలయంలో దారుణం చోటు చేసుకుంది. వైఎస్సార్‌కు జిల్లాకు చెందిన విద్యార్థిని సిబ్బంది చితకబాదారు. అల్లరి చేస్తున్నాడని విద్యార్థి వీపుపై దారుణంగా కొట్టారు. దీపావళి సందర్భంగా ఇంటికి తీసుకువెళ్లిన తల్లిదండ్రులు.. తమ బిడ్డ గాయాలు గమనించి జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రేణిగుంట అభయక్షేత్రం నిర్వాహకులపై తల్లిదండ్రులు మండి పడుతున్నారు. గతంలోనూ ఇదే తరహా ఘటనలు జరిగాయని స్థానికులు అంటున్నారు. చదవండి: పెళ్లి కాకుండానే బిడ్డకు ప్రసవం.. క్యాంటమ్ కంపెనీ బాత్రూమ్లో శిశువు కలకలం -
దివ్యాంగులకు మూడు చక్రాల మోటార్ వాహనం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని దివ్యాంగులకు మూడు చక్రాల మోటార్ వాహనాలు ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు, సీనియర్ సిటిజన్స్ సహకార సంస్థ (ఏపీడీఏఎస్‌సీఏసీ) మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆన్లైన్ ద్వారా ఈ నెల 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. 70 శాతంపైగా వైకల్యం కలిగిన 18 నుంచి 45 ఏళ్లలోపు వారు అర్హులు. కనీసం పదో తరగతి పాసవ్వాలి. రూ.3లక్షలలోపు వార్షిక ఆదాయం ఉండాలి. లబ్ధిదారుల ఎంపికకు రెండు నెలల ముందు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వారికి సొంత వాహనం ఉండకూడదు. గతంలో ఇటువంటి వాహనాలు తీసుకుని ఉండకూడదు. గతంలో దరఖాస్తు చేసినప్పటికీ ఇవి మంజూరు కాకపోతే కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులే. జిల్లా మెడికల్ బోర్డు వారు ఇచ్చిన సదరం ధ్రువపత్రం, ఆధార్ కార్డు, ఎస్ఎస్సీ ధ్రువపత్రం, ఎస్సీ, ఎస్టీ అయితే కుల ధ్రువీకరణపత్రం, దివ్యాంగుల పూర్తి ఫొటోను పాస్‌పోర్టు సైజులో ఉన్నది దరఖాస్తుతోపాటు ఏపీడీఏఎస్‌సీఏసీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ఇదీ చదవండి: జగనన్న విద్యా కానుక.. 'ఇక మరింత మెరుగ్గా' -
టీచర్ దారుణం.. స్నాక్స్ ఉన్నాయని 300 గుంజిళ్లు... చివరకు..
స్కూళ్లకు వెళ్లే పిల్లలు బుద్ధిగా ఓ చోట కూర్చోమంటే ఎందుకు ఉంటారండి! చిరుతిళ్లు తింటూ టీచర్‌కి దొరికి పోవడమో, పెన్సిల్ దొంగతనం చేయడమో, క్లాస్ ఎగ్గొట్టడమో, పరీక్షలు బాగా రాయకపోవడమో.. ఒకటేమిటి అన్నీ చేస్తారు! ఆనక టీచర్ ఇచ్చే పనిష్మెంట్లు తీసుకోవడం.. ఇంట్లో టీచర్‌పై పిర్యాదులు చేయడం ఇది మామూలే! ప్రతి స్కూల్లో జరిగేదే. ఐతే చైనాలో ఒక టీచర్ ఇచ్చిన పనిష్మెంట్కు ఓ విద్యార్ధిని శాశ్వతంగా అంగవైకల్యురాలైంది. అసలేంజరిగిందంటే.. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌కు చెందిన హై స్కూళ్లో చదివే 14 యేళ్ల విద్యార్ధిని వసతి గృహంలో తన బెడ్ పక్కన ఉన్న స్నాక్స్ గురించి టీచర్ ప్రశ్నించిందట. ఐతే బాలిక తనవి కావని బుకాయించిందట. దీంతో ఆగ్రహించిన టీచర్ 300 గుంజిళ్లు తీయమని పనిష్మెంట్ ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన టీచర్‌కి బాలిక సక్రమంగా గుంజిళ్లు తీస్తుందో లేదో పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఐతే గతంలొనే బాలిక కాలి గాయంతో బాధపడుతుందన్న విషయం తెలిసినా ఎవ్వరూ శిక్షను రద్దు చేసే ప్రయత్నం చేయలేదు. దీంతో 150 గుంజిళ్లు తీశాక, బాలిక పరిస్థితి విషమించడంతో సమీప ఆసుపత్రికి తరలించారు. బాలికను పరీక్షించిన డాక్టర్లు ఇక మీదట మామూలుగా నడవలేదని, ఊత కర్రల సాయంతోనే నడవవల్సి ఉంటుందని చెప్పాడు. దీంతో తీవ్ర షాక్‌కు గురైన బాలిక డిప్రెషన్లోకి వెళ్లింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం ఈ సంఘటన గురించి తెలిసిన స్కూల్ యాజమాన్యం సదరు టీచర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేసింది. అంతేకాకుండా బాలికకు రూ. 13 లక్షలు నష్టపరిషారం ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చినట్టు సమాచారం. ఐతే బాలిక తల్లిదండ్రులు దానిని నిరాకరించారట. ఇది గత యేడాది జూన్ 10న జరిగినట్లు బాలిక తల్లి జోవూ స్థానిక మీడియాకు తెల్పింది. తాజాగా వెలుగులోకొచ్చింది. చదవండి: ప్రమాదంలో ప్రపంచంలోనే అతి పురాతన చెట్టు.. -
పురుష ఉద్యోగులకు 730 పెయిడ్ లీవులు
సాక్షి, ముంబై: అంగవైకల్య పిల్లల బాగోగులు చూసుకునేందుకు బెస్ట్ సంస్థలో పనిచేస్తున్న పురుష ఉద్యోగులకు 730 రోజులు పేయిడ్ లీవులు ఇవ్వాలనే ప్రతిపాదనకు బీఎంసీ మహాసభలో ఆమోదం లభించింది. మొదటి ఇద్దరు పిల్లలకు, వారికి 22 ఏళ్ల వయసు వచ్చే వరకు ఇది వర్తిస్తుందని బీఎంసీ స్పష్టం చేసింది. దీంతో ఇంటివద్ద తమ వికలాంగ పిల్లల బాగోగులు చూసుకోవలన్నా, ఆస్పత్రిలో చూపించేందుకు వెళ్లాలన్నా పురుషులు తమ సొంత సెలవులు వాడుకునే అవసరం ఉండదని, 730 రోజుల్లోంచి వాడుకోవచ్చని మేయర్ కిశోరీ పేడ్నేకర్ తెలిపారు. వికలాంగులుగా జన్మించిన పిల్లలను సాకడానికి, చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి కొందరి ఇళ్లలో తల్లులుగాని, కుటుంబ సభ్యులు, ఇతరులు ఎవరుండరు. దీంతో గత్యంతరం లేక తండ్రులే వారి బాగోగులు చూసుకోవల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో ఉద్యోగులైతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. సెలవుపెట్టి ఇంటివద్ద ఉండటం లేదా ఆస్పత్రికి తీసుకెళ్లడం లాంటివి చేయాల్సి వస్తుంది. ఉద్యోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారు పదవీ విరమణ పొందేవరకు లేదా దివ్యాంగ పిల్లలకు 22 ఏళ్ల వయసు వచ్చేవరకు 730 సెలవులు వాడుకునేందుకు అవకాశం కల్పించినట్లు బెస్ట్ సమితి అధ్యక్షుడు ప్రవీణ్ షిండే తెలిపారు. ఈ సెలవులు పొందాలంటే దరఖాస్తుతోపాటు 40 శాతం వికలాంగుడిగా ఉన్నట్లు సర్టిఫికెట్ జోడించాల్సి ఉంటుంది. వికలాంగ పిల్లలు తనపై ఆధారపడి ఉన్నట్లు సర్టిఫికెట్ జతచేయాల్సి ఉంటుంది. చదవండి: ప్రకృతికి కోపం వస్తే ఇలాంటి విధ్వంసాలే. -
మంచు తుపానులో మనుషుల్ని వదిలేసినట్లుగా ఉండకూడదు
సాక్షి, హైదరాబాద్: దివ్యాంగుల సంక్షేమ ఫలాలు పేపర్లకే పరిమితం అవుతున్నాయని, అధికారులు ఏసీ గదుల్లో కూర్చుని సమీక్షలు చేస్తే అంతా భేషుగ్గానే ఉంటుందని హైకోర్టు అభిప్రాయపడింది. గ్రామ స్థాయిలో తనిఖీలు చేస్తే విస్తుపోయే నిజాలు బయట పడతాయని, దీని కోసం ఒకే ఒక్క జిల్లాలో అధ్యయనం చేస్తే సరిపోతుందని వ్యాఖ్యానించింది. గత 60 ఏళ్లుగా వృద్ధాశ్రమాల్లో 80– 90 ఏళ్ల వయసు వాళ్లు ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేసింది. వసతులు లేని బ్రిటిష్ కాలంలోనే చాలా లోతుగా సమాచారాన్ని సేకరించారని, ఇప్పుడు అన్ని వసతులు, సాంకేతికత అరచేతిలో ఉన్నా ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నించింది. అలస్కా మంచు తుపానులో కదల్లేకపోయిన వారిని వదిలేసినట్లుగా ఉండకూడదని ఘాటు వ్యాఖ్య చేసింది. లాక్డౌన్లో దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ఉత్తర్వులివ్వాలంటూ హైదరాబాద్‌కు చెందిన గణేశ్ కర్నాటి దాఖలు చేసిన పిల్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం బుధవారం విచారించింది. కోర్టు విచారణకు హాజరైన మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ కమిషనర్ దివ్య కల్పించుకుని దేశంలోనే అత్యధికంగా తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ల కోసం రూ.1,800 కోట్లు కేటాయించిందని, నెలకు రూ. 3,016 చొప్పున ఇస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులకు అత్యవసరాల కోసం రూ.3.5 కోట్లను సిద్ధంగా ఉంచిందన్నారు. దీనిపై స్పందిం చిన ధర్మాసనం, లాక్డౌన్లో ఇబ్బందిపడే వారి కోసం రూ.10 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించింది. వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల్లో 45 వేల మంది దివ్యాంగులు ఉంటే ఆ జిల్లాలకు రూ.లక్ష కేటాయిస్తే ఏ మూలకు సరిపోతాయని అడిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రం లో 10.46 లక్షల మంది దివ్యాంగులు ఉంటే ఇప్పుడు పెరిగే ఉంటారని, వారి జనాభాకు అనుగుణంగా సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే ఎలాగని ప్రశ్నించింది. దివ్యాంగుల బతుకులు మరొకరికి భారం కాకూడదని హితువు చెప్పింది. దీనిపై దివ్య సమాధానమిస్తూ.. అంగన్వాడీ వర్కర్ల ద్వారా రూ.3.5 కోట్ల నిధి గురించి వీడి యో కాన్ఫరెన్స్‌లో వివరించామని, 1,533 మంది దరఖాస్తులు చేసుకున్నారని చెప్పారు. అనంతరం విచారణ జూలై 16కి వాయిదా పడింది. మాయమైపోతున్న ప్రభుత్వ భూములు సాక్షి, హైదరాబాద్: నిన్న మొన్నటి వరకు కళ్ల ముందు కనబడిన ప్రభుత్వ భూములు, చెరువులు మాయం అవుతుంటే ప్రభుత్వం ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోందని హైకోర్టు ప్రశ్నించింది. రాజేంద్రనగర్ మండలం పుప్పాలగూడ చెరువు, కుత్బుల్లాపూర్ మండలం సూరారంలోని కట్టమైసమ్మ చెరువు, మూసీ నది ఆక్రమణలపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలన్నింటినీ కలిపి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం బుధవారం విచారించింది. మూసీ నది గురించి గూగుల్‌లో చూస్తే ఎంతగా ఆక్రమణలకు గురైందో తెలుస్తుందని, మురుగు నీటిని మూసీలోకి మళ్లిస్తుంటే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. మూసీ నదికి సమీపం లోని వారు కాలుష్యంతో కలిసి కాపురం చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ వాదనలు ఒకే రీతిగా లేకపోవడాన్ని తప్పుబట్టింది. మాస్టర్‌ప్లాన్, రెవెన్యూ, నీటిపారుదల, హెచ్ఎండీఏ రికార్డుల్లో అక్కడ ఏముందో పూర్తి వివరాలు నివేదించాలని ఆదేశిం చింది. వాదనల అనంతరం విచారణను వచ్చే నెల 15కి వాయిదా వేసింది. -
మానవుని శక్తికి, సహనానికి సెల్యూట్
-
స్పూర్తిని రగిలించే వీడియో ఇది
క్రికెట్ ఆడాలన్న గట్టి సంకల్పం ముందు అతడికున్న వైకల్యం ఓడిపోయింది. అకుంటిత దీక్ష, పట్టుదల, ధైర్యంతో మైదానంలోకి దిగాడు.. అనుకున్నది సాదించాడు.. అందరిలోనూ స్పూర్తి రగిలించాడు. రెండు చేతుల సరిగా లేక అంగవైకల్యం గల ఓ పిల్లాడు బౌలింగ్ చేయడం టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్‌ను ఆకట్టుకుంది. దీంతో వెంటనే ఆ వీడియోను తన అధికారిక ట్విటర్లో షేర్ చేశాడు. ‘మానవునికున్న ఆత్మ స్తైర్యం, పట్టుదల, ధైర్యాన్ని ఎవరూ దొంగలించలేరు. మానవుని శక్తికి, సహనానికి సెల్యూట్’ అంటూ లక్ష్మణ్ కామెంట్ జతచేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. చదవండి: మా ఇద్దరిదీ ఒకే స్వభావం.. ఎందుకంటే ‘అవే గంభీర్ కొంప ముంచాయి’ -
ఒకే కుటుంబంలో రెండో పింఛన్
సాక్షి, అమరావతి : కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఒకే కుటుంబంలో రెండో వ్యక్తి లేదా మహిళకు కూడా పింఛన్ మంజూరు చేసేందుకు అనుమతి తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత తెలుగుదేశం ప్రభుత్వం ఒక కుటుంబానికి ఒక పింఛను విధానాన్ని అమలు చేసిన నేపథ్యంలో తాజాగా వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ నిబంధనలను సరళతరం చేస్తూ పలు నిర్ణయాలు తీసుకుంది. 80 శాతం కంటే అంగ వైకల్యం ఎక్కువగా ఉన్నప్పుడు ఒకే కుటుంబంలో రెండో వ్యక్తికి పింఛన్ మంజూరుకు వీలు కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. కిడ్నీ రోగులు, తీతీవ్రమైన మానసిక వ్యాధితో బాధ పడేవారు, ఎయిడ్స్ రోగుల విషయంలో కూడా అదే కుటుంబంలో రెండో వ్యక్తికి కూడా పింఛన్ మంజూరుకు వీలు కల్పిస్తున్నట్టు ఉత్తర్వులో పేర్కొంది. పింఛన్ మంజూరుకు కుటుంబ ఆదాయంతో పాటు పలు అర్హత ప్రమాణాలలో మినహాయింపు ఇస్తూ సీఎం తీసుకున్న నిర్ణయం మేరకు నిబంధనలలో మార్పులు చేసింది. పింఛన్ నిబంధనలు ఇవీ.. ►గ్రామీణ ప్రాంతంలో నెలకు గరిష్టంగా రూ.10,000, పట్టణాల్లో రూ.12,000 ఆదాయం ఉన్నా కూడా పింఛన్ పొందేందుకు అర్హులు. ►గరిష్టంగా మూడు ఎకరాల మాగాణి, లేదా పది ఎకరాల మెట్ట భూమి ఉన్నప్పటికీ పింఛన్ పొందేందుకు అర్హత ఉంటుంది. రెండూ కలిపి 10 ఎకరాలలోపు ఉంటే కూడా అర్హులే. ►ప్రస్తుతం వృద్ధాప్య, చేనేత, దివ్యాంగ, మత్స్యకార, కల్లుగీత కేటగిరీల్లో పింఛన్ పొందుతున్న వ్యక్తి చనిపోతే, వెంటనే అతని భార్యకు వితంతు పింఛన్ మంజూరు. -
భిన్న తలంబ్రాలు.. కల్యాణం చూతము రారండీ
దివ్యాంగుల వివాహాలు ప్రోత్సహించేందుకు తమిళనాడులో పథకాలు ఉన్నాయి. స్వచ్ఛంద సంస్థలు కూడా పని చేస్తున్నాయి. నిన్న సోమవారం, అంటే నవంబర్ 18న చెన్నైలో 48 జంటల సామూహిక వివాహ మహోత్సవం జరిగింది. ఈ మహోత్సవం భిన్నమైనది. హర్షించదగినది. ప్రోత్సహించదగినది. ఎందుకంటే వీరిలో దాదాపు అందరూ దివ్యాంగులే. భారతదేశంలో పెళ్లి చాలా ముఖ్యమైన జీవన పరిణామం. స్త్రీల విషయంలో చూస్తే పురుషాధిపత్యం వల్ల తరాలుగా వారు ‘ఎంచుకోబడేవారు’గానే ఉన్నారు. ‘అబ్బాయికి నచ్చాలి’ అనేది ప్రాథమికమైన మెట్టుగా మన పెళ్లిళ్లలో కనిపిస్తుంది. అబ్బాయికి నచ్చితే సగం మాట ముందుకు నడిచినట్టే. అమ్మాయికి నచ్చడం పట్ల అమ్మాయి తల్లిదండ్రులు పట్టింపుకు పోవడం ముందు నుంచి మన దగ్గర తక్కువ. కట్నాలు, లాంఛనాలు అమ్మాయి తల్లిదండ్రులకు పెనుభారమై ‘అమ్మాయి గుండెల మీద కుంపటిలా కూచుని ఉంది’ అనే మాట వాడుకలోకి వచ్చింది. ఇప్పుడు అమ్మాయిలు బాగా చదువుకుంటున్నారు. ‘అమ్మాయికి నచ్చాలి’ వరకూ ఎదిగారు. అయినప్పటికీ రూపం విషయంలో సమాజం ‘మెచ్చే ప్రమాణాలు’ లేని అమ్మాయిలకు వివాహం పెద్ద సమస్యగా ఉంది. అలాగే దివ్యాంగులకు పెళ్లి జరగడం ఇంకా సమస్యగా ఉంది. దివ్యాంగుడైన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చే సాధారణ అమ్మాయిల సంఖ్యతో పోల్చితే దివ్యాంగురాలైన అమ్మాయిని చేసుకోవడానికి ముందుకు వచ్చే సాధారణ అబ్బాయిల సంఖ్య బహు తక్కువ. ఇవన్నీ దివ్యాంగులలో పెళ్లి సమస్యను సృష్టిస్తున్నాయి. దివ్యాంగుల సామూహిక వివాహాలు కాని పెళ్లి చేసుకునే హక్కు, తమ జీవన భాగ స్వామిని ఎంచుకుని జీవితాన్ని నిర్మించుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. తమిళనాడు ప్రభుత్వం ముందుగా ఈ విషయాన్ని గుర్తించింది. ఆ ప్రభుత్వం 1986లోనే అంధ వధువును వివాహం చేసుకునే సాధారణ వరునికి ఐదు వేల రూపాయల వివాహ ప్రోత్సాహకం ప్రకటించింది. ఇది క్రమంగా పెరుగుతూ దివ్యాంగులను పెళ్లి చేసుకునే సాధారణ వధు/వరులకు 25,000 రూపాయల ప్రోత్సాహం వరకూ పెంచబడి, ఇప్పుడు 50 వేల రూపాయలు ఇవ్వబడుతున్నాయి. దివ్యాంగులను, సాధారణ వ్యక్తులు వివాహం చేసుకున్నా, దివ్యాంగులే పరస్పరం పెళ్లి చేసుకున్నా 25 వేల రూపాయల నగదు, 4 గ్రాముల తాళిబొట్టు తమిళనాడు ప్రభుత్వం అందజేస్తుంది. అదే ఈ దివ్యాంగులలో ఎవరైనా గ్రాడ్యుయేట్లు, డిప్లమా హోల్డర్లు ఉంటే 50 వేల రూపాయల నగదు, 8 గ్రాముల తాళిబొట్టు అందిస్తున్నారు. ప్రభుత్వమే కాకుండా ‘తమిళనాడు డిఫరెంట్లీ ఏబుల్డ్ చారిటబుల్ ట్రస్ట్’ సంస్థ కూడా దివ్యాంగుల వివాహాలను ప్రోత్సహిస్తోంది. ఇది ఒక రకంగా మ్యాట్రిమొనీలా పని చేసి జంటలను కలుపుతుంది. రాష్ట్రంలోని వధువు, వరులు ఎవరైనా ఈ సంస్థలో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. సంస్థే తగిన జోడీని వెతికి సామూహిక వివాహ మహోత్సవం జరిపి ఒక్కటి చేస్తుంది. ఈ వివాహ మహోత్సవం కూడా వాలెంటీర్ల సహాయంతో ఎంతో హుందాగా జరుగుతుంది. నడవలేనివారిని, చూడలేని వారిని, వినలేని వారిని, అర్థం చేసుకోలేని వారిని (బుద్ధిమాంద్యం) ఈ పెళ్లితంతు అర్థం చేయించి దానిని సరిగా ముగించేందుకు సాయపడే వాలెంటీర్లు ఉంటారు. సైగల ద్వారా, మాటల ద్వారా వీరు వివాహ తంతులో వధువరులకు సాయం చేస్తారు. అయితే అక్కడి ప్రభుత్వ విధానంగానీ, స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న చైతన్య కార్యక్రమాలుగానీ కోరుతున్నది ఒక్కటే. దివ్యాంగులను దివ్యాంగులు వివాహం చేసుకోవడం కన్నా సాధారణ వ్యక్తులు వివాహం చేసుకుంటేనే సామాజిక న్యాయం జరుగుతుంది అని. చెన్నైలో జరుగుతున్న ఇటువంటి కార్యక్రమాలు అన్ని ప్రాంతాలకు విస్తరించాల్సిన అవసరం ఉంది. మేరేజ్ బ్యూరోలకు రారు దివ్యాంగులు తమ వివాహ సంబంధాల కోసం మేరేజ్ బ్యూరోలకు రావడం తక్కువ. మా వద్ద అప్లికేషన్ ఫామ్‌లో ఏదైనా శారీరక లోపం ఉందా అనే కాలమ్ ఉంటుంది. ఇన్నేళ్లలో దానిని నింపిన వాళ్లు బహు తక్కువ. పోలియో ఉన్నవారు ఒకరిద్దరు సంప్రదించారు. వీరంతా తమకు తెలిసినవారి ద్వారా పెళ్లి సంబంధాలు నిశ్చయించుకోవడానికి చూస్తారు. ఆర్థిక భద్రత లేదా గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న దివ్యాంగురాలిని జీవితంలో ఇంకా సెటిల్ కాని కాలేని అబ్బాయిలు పెళ్ళిళ్లు చేసుకోవడం చూశాను. దివ్యాంగ ఆడపిల్లల విషయంలో సంబంధాలు రావడానికి అవసరమైన పరిణితి, హృదయం ఉన్న కుర్రవాళ్లు తయారు కావాల్సి ఉంది. – బి.నాగకుమారి, మేరేజ్ బ్యూరో కన్సల్టెంట్, హైదరాబాద్. -
వైద్యుడి నిర్లక్ష్యం.. బాలికకు వైకల్యం
సాక్షి, ఇచ్చోడ(బోథ్): ఓ వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా అభం..శుభం.. తెలియని ఆరేళ్ల బాలిక శాశ్వత వికలాంగురాలిగా మారిపోయింది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ప్రతాప్ నాయక్ అనే ఓ వైద్యుడు బోథ్ సివిల్ ఆసుపత్రిలో ప్రభుత్వ వైద్యాధికారిగా పనిచేస్తూ ఇచ్చోడలో ప్రైవేట్ క్లీనిక్ నడుపుతున్నాడు. ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన కళ్యాణ్కర్ బాబు కూతురు సారిక నాలుగునెలల క్రితం ఇంట్లో ఆడుకుంటూ పడిపోయింది. దీంతో చేయి వా పురావడంతో మండల కేంద్రంలో ఉన్న ప్రతాప్ నాయక్ క్లీనిక్‌కు తీసుకెళ్లాడు. సారికకు ఎక్స్‌రే తీయించి చేతికి ఉన్న బొక్క విరిగిపోయిందని, సిమెంట్ పట్టి కట్టి పంపించాడు. నాలుగైదు రోజుల తర్వాత బాలిక చేయి వాచిపోవడంతో మళ్లీ ఆసుపత్రికి వచ్చారు. సిమెంట్ పట్టి తొలగించి చూస్తే చేయి పూర్తిగా కుళ్లిపోయింది. దీంతో బాధితులు డాక్టర్‌ను నిలదీశారు. వైద్యఖర్చులు తానే ఇస్తానని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించారు. అయినా చేయి నయం కాకపోగా మరింత ఇన్ఫెక్షన్ అయ్యింది. దీంతో హైదరాబాద్‌కు పంపించి అక్కడ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వారంరోజుల పాటు చికిత్స చేయించాడు. అక్కడి వైద్యులు చేయి నయం కాదని, తిరిగి వెళ్లిపోవాలని తిప్పిపంపారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ప్రతాప్ నాయక్‌ను మరోసారి నిలదీశారు. దీంతో సదరు వైద్యుడు జరిగిన పరిణామానికి పూర్తి బాధ్యత వహిస్తూ పాప కోలుకునేంత వరకు తానే ఖర్చులు భరిస్తానని ఒప్పంద పత్రం రాసిచ్చాడు. రోజురోజు కు పాప చేయి క్షీణించిపోయి వంకర్లు తిరుగుతుండడంతో భయాందోళనకు గురైన కుటుంబసభ్యులు రిమ్స్ వైద్యులను సంప్రదించారు. అప్పటికే 60 శాతం మేర చేయి పనికిరాకుండా పోయిందని, భవిష్యత్‌లో చేయి కొట్టివేసే పరిస్థితి కూడా రావచ్చని సూచించారు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు డాక్టర్ ప్రతా ప్ నాయక్‌ను మంగళవారం ఆసుపత్రికి వెళ్లి నిలదీయడానికి ప్రయత్నించారు. అతని అనుచరుడు డాక్టర్‌ను కలవకుండా చేసి దిక్కున్నచోట చెప్పుకొమ్మని వారిని ఆసుపత్రి నుంచి గెంటివేశారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు బుధవారం ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వైద్యుడు ప్రతాప్‌నాయక్, అతని అనుచరుడు గణేశ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పుల్లయ్య తెలిపారు. తమ కూతురుకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు జిల్లా అధికారులను వేడుకుంటున్నారు. -
దివ్యాంగుల సంక్షేమం దైవాధీనం!
సాక్షి, సిటీబ్యూరో: సాక్షాత్తు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనే దివ్యాంగులు సంక్షేమం అగమ్యగోచరంగా మారింది. పాలకుల చిన్న చూపు కారణంగా దివ్యాంగుల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. ప్రభుత్వం ఏటా విడుదల చేస్తున్న అరకొర నిధులు ఏ మూలకూ సరిపోవడం లేదు. సామాజిక, ఆర్థిక చేయూత కింద కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు అందుతున్నా నిధులు లేమి కారణంగా ఆయా పథకాలు అమలుకు నోచడం లేదు. దీంతో దరఖాస్తులు మెజార్టీ శాతం పెండింగ్‌లో పడిపోతున్నాయి. దరఖాస్తుల డిమాండ్‌ను బట్టి ఉన్నత స్థాయికి నిధుల ప్రతిపాదనలు వెళ్తున్నా... తిరిగి అరకొరగానే నిధులు మంజూరు అవుతుండటం దివ్యాంగులను విస్మయానికి గురిచేస్తోంది. ఇదీ పరిస్థితి... జిల్లా వికలాంగుల సంక్షేమం, వయోవృద్ధుల శాఖకు నిధుల కేటాయింపు మొక్కుబడిగా మారింది. 2018–19 ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 31.45 లక్షలు మంజూరు కాగా, అందులో రూ. 16.11 లక్షలు మాత్రమే విడుదలయ్యాయి. మరో రూ. 13.83 లక్షల నిధులకు సంబంధించి బిల్లులకు ట్రెజరీలో ఆమోదం లభించలేదు. వాస్తవంగా గత ఆర్థిక సంవత్సరం దివ్యాంగులు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. నిధులు కొరతను బట్టి సీనియారిటీ, బ్యాంక్ కన్సెంట్ ప్రాతిపదికన ఎనిమిది మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేసి సబ్సిడీ కింద రూ. 10.28 లక్షలు మంజూరు చేశారు. ఆర్థిక సంవత్సరం ముగింపు, ఆంక్షలు తదితర కారణాలతో ట్రెజరీలో సంబంధిత బిల్లులకు ఆమోదం లభించలేదు. అలాగే ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కింద 480 మంది విద్యార్థులకు రూ. 3.55 లక్షలు మంజూరైనా బిల్లులు ట్రెజరీ నుంచి విడుదల కాలేదు. ప్రతిపాదనలకు దిక్కేదీ... వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా సామాజిక, ఆర్థిక చేయూత అంతంత మాత్రంగా మారింది. దివ్యాంగుల ఆర్థిక చేయూత దరఖాస్తులు పెండింగ్‌లో పడిపోతున్నాయి. వాటి పరిష్కారం కోసం ప్రభుత్వానికి నిధుల ప్రతిపాదనలు వెళ్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. వాస్తవంగా 2018–19 ఆర్థిక సంవత్సరంలో అందిన దరఖాస్తుల్లో 74 పెండింగ్‌లో పడిపోయాయి. దీంతో సంబంధిత శాఖ విజ్ఞప్తి మేరకు జిల్లా కలెక్టర్ గత ఆర్థిక సంవత్సరం చివర్లో పెండింగ్ దరఖాస్తులకు ఆర్థిక చేయూత కోసం రూ. 1.43 కోట్ల నిధుల విడుదలకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కనీసం 2019–20 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లోనైనా నిధుల విడుదల పెరుగుతుందని ఆశించినా ఫలితం లేదు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం కింద మొక్కుబడిగా నిధులు కేటాయింపు జరగడం కొసమెరుపు. -
వైకల్యం ఓడింది..
వారి ధృడ సంకల్పం ముచ్చట గొలిపింది.. వారి పట్టుదల ఆశ్చర్యం కలిగించింది.. వారి గెలుపు ఏ ప్రపంచ కప్పుకూ తీసిపోనిది.. వారి ఆత్మవిశ్వాసం ఎందరికో స్ఫూర్తిని కలిగిస్తుంది. ఔను.. వారి మనోశక్తి ముందు వైకల్యం ఓడింది.. విధి వెక్కిరించినా వారిని విజయం వరించింది.. ఆదివారం నగరంలో జరిగిన దివ్యాంగుల క్రికెట్ రసవత్తరంగా సాగింది.. శరీరం సహకరించకపోయినా పట్టుదలగా ఆడిన ప్రతి ఒక్కరూ విజేతగా నిలిచారు. శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా దివ్యాంగుల క్రికెట్ జట్టు ఎంపికలు ఆద్యంతం ఉత్సాహంగా సాగాయి. దివ్యాంగుల క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ (ఆర్ట్స్) కళాశాల మైదానం వేదికగా ఆదివారం జిల్లాస్థాయి ఎంపికలు జరిగాయి. జిల్లా నలుమూలల నుంచి 30 మందికిపైగా క్రీడాకారులు హాజరయ్యారు. ఇందులో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు, గతంలో అంతర్‌జిల్లాల క్రికెట్ టోర్నీలో రాణించిన క్రికెటర్లను తుది జట్టుకు పరిగణనలోకి తీసుకున్నారు. 15 మంది సభ్యులతో కూడిన జాబితాను జిల్లా దివ్యాంగుల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి, జి.అర్జున్‌రావురెడ్డి వెల్లడించారు. ఆటతీరు అదుర్స్.. సకలాంగులకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆకట్టుకునే ఆటతీరుతో దివ్యాంగ క్రికెటర్లు రాణించారు. తమకే సాటివచ్చిన ఆటతీరుతో అలరించారు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో మంత్రముగ్ధులను చేసి భళా అనిపించారు. ఫీల్డింగ్‌లో మెరికల్లా కదిలారు. సిక్కోలు వేదికగా నార్త్‌జోన్ పోటీలు.. నార్త్‌జోన్ దివ్యాంగుల క్రికెట్ పోటీలకు శ్రీకాకుళం జిల్లా మరోసారి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నెల 12 నుంచి 14 వరకు శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానం వేదికగా ఈ పోటీలు జరగనున్నాయి. రెండేళ్ల తర్వాత ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ టోర్నమెంట్ కోసం జిల్లా దివ్యాంగుల క్రికెట్ అసోసియేషన్ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. మైదానాన్ని పోటీలకు అనువుగా తీర్చిదిద్దుతున్నారు. క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎమ్మెస్సార్ నేతృత్వంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా సంఘ కార్యదర్శి జి.అర్జున్‌రావురెడ్డి పేర్కొన్నారు. నార్త్‌జోన్ దివ్యాంగుల సంఘం హెడ్ మధుసూదన్ ఇప్పటికే జిల్లా చేరుకున్నారు. జిల్లా జట్టు ఇదే.. బగ్గు రామకృష్ణ (కెప్టెన్– బలగ), సీహెచ్ అప్పలరాజు, ఐ.దిలీప్ (బలగ), బి.హిమగిరి (చిన్నకిట్టాలపాడు), ఎం.రాజు (సంతకవిటి), పి.రాజు, ఎం.ప్రసాద్ (రాజాం), ఎన్.నరేష్ (నరసన్నపేట), కె.రవి (పలాస), ఎ.సాయికుమార్, ఎస్.సాయిశేఖర్ (శ్రీకాకుళం), కె.శ్రీను (భామిని), కె.రాముజ (రణస్థలం), పి.తిరుపతిరావు, కె.నాగరాజు. స్టాండ్‌బైగా మోహనరావు, ఎం.ప్రసాద్ ఎంపికైనవారిలో ఉన్నారు. -
అవ్వా తాతలకు వైఎస్సార్ పెన్షన్ కానుక
సాక్షి, అమరావతి : అవ్వా తాతలకు శుభవార్త. ముఖ్యమంత్రిగా గురువారం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాక వృద్ధ్యాప్య పెన్షన్‌ను నెలకు రూ.2,250లకు పెంచే ఫైలుపై ఆయన సీఎంగా తొలి సంతకం చేశారు. ఆ సంతకాన్ని తక్షణమే అమలుచేస్తూ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్ ఉత్తర్వులు జారీచేశారు. వృద్ధాప్య పెన్షన్ పొందడానికి గరిష్ఠ వయో పరిమితిని 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించారు. వితంతవులు, గీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలకు ఇచ్చే పెన్షన్‌ను రూ.2,250కు పెంచారు. వికలాంగులకు ఇచ్చే పెన్షన్‌ను రూ.మూడు వేలకు పెంచారు. ప్రస్తుతం డయాలసిస్ రోగులకు నెలకు రూ.3,500 చొప్పున పెన్షన్ ఇస్తున్నారు. దాన్ని రూ.పది వేలకు పెంచారు. ఈ పెన్షన్ల పెంపును తక్షణమే వర్తింపజేశారు. అంటే.. పెంచిన పెన్షన్‌ను జూలై 1న పంపిణీ చేస్తారు. ఈ పథకానికి వైఎస్సార్ పెన్షన్ కానుకగా ప్రభుత్వం నామకరణం చేసింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక చేసిన తొలి సంతకాన్ని అమలుచేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఎన్నికల ప్రచారంలోనూ నవరత్నాల్లో భాగంగా పెన్షన్‌ను రూ.మూడు వేలకు పెంచుకుంటూ పోతామని హామీ ఇచ్చారు. ఆ హామీని అమలుచేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తొలి సంతకం చేయడంపై అవ్వాతాతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, వికలాంగులను ప్రస్తుతం రెండు కేటగిరీలుగా విభజించి పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. ఇకపై వారిని ఒకే కేటగిరి కిందకు తెచ్చి నెలకు రూ.మూడు వేల చొప్పున పెన్షన్ పంపిణీ చేస్తారు. అలాగే, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్న వారికి నెలకు రూ.3500 నుంచి రూ.పది వేల చొప్పున పెన్షన్ ఇవ్వనున్నారు. పెంచిన పెన్షన్‌ను వృద్ధాప్య, వికలాంగ, వితంతు, ఒంటరి మహిళ, డయాలసిస్ విభాగాల్లో 53,32,593 మందికి పంపిణీ చేస్తారు. కాగా, పెన్షన్ల పెంపు జూన్ నుంచి అమల్లోకి వస్తుందని.. జూలై నుంచి పెరిగిన రూ.250తో కలిపి మొత్తం రూ.2,250 చెల్లిస్తారని సెర్ప్ అధికారులు తెలిపారు. మే నెలకు సంబంధించిన పెన్షన్లు జూన్ ఒకటవ తేదీ నుంచి పంపిణీ జరుగుతుందని.. అలాగే, జూన్ నెల పెన్షన్లు జులై ఒకటవ తేదీ నుంచి పంపిణీ జరుగుతుందని వారు వివరించారు. కాగా, జూన్ నెల నుంచి పంపిణీ జరిగే మే నెల పెన్షన్ల నిధులు రూ.1,094.91కోట్లను గురువారమే మండలాల వారీగా ఆయా ఎంపీడీవోల ఖాతాలకు జమచేసినట్లు అధికారులు చెప్పారు. -
జయహో..!
అతనో దివ్యాంగుడు. రెండు అరచేతులు లేకుండా మొండి చేతులతో విధికి ఎదురీదాడు. బ్రహ్మరాతను మార్చేశాడు. కష్టాల వారధిని దాటేశాడు. ఒక వైపు చదువు.. మరో వైపు ఫుట్‌బాల్.. బాస్కెట్‌బాల్.. లాంగ్ జంప్.. రన్నింగ్.. బైక్ రైడింగ్.. ఇలా అన్నింటా అద్భుతమైన ప్రదర్శన. ఎవరికి తానేమి తక్కువ కాదని నిరూపించాడు సురేష్. నేనున్నానంటూ తల్లికి సైతం అండగా ఉంటూ శభాష్ అనిపించుకుంటున్నాడు. నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. అతని పోరాటాన్ని దర్శించిన దైవం తలదించగా.. అతని సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తి జై కొట్టింది. నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): మర్రిపాడు మండలం అల్లంపాడుకు చెందిన తుపాకుల పోలయ్య, సునీత దంపతులు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ నెల్లూరు నగరానికి వలస వచ్చారు. బీవీనగర్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. వీరికి బాలకృష్ణ, సురేష్, పుల్లయ్య ముగ్గురు కొడుకులు. బేల్దారి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని భారంగా నెట్టుకొస్తున్నారు. 2013లో వినాయక చవితి వేడుకలు సురేష్ జీవితంలో విషాదాన్ని నింపాయి. అప్పుడు సురేష్ కేఎన్ఆర్ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్నాడు. ప్రమాదవశాత్తూ టపాసు చేతుల్లో పేలడంతో రెండు చేతుల అరచేతులు పూర్తిగా కాలిపోయాయి. మొండి చేతులు మిగిలాయి. సురేష్ బాధ వర్ణణాతీతంగా మారింది. తన స్నేహితులు బడికి వెళ్తుంటే దుఃఖంతో రెండేళ్లకు పైగా ఇంట్లోనే ఉండిపోయాడు. తల్లి బిడ్డకు మరోజన్మను ప్రసాదించేందుకు సకల ప్రయత్నాలు చేసింది. తాను కూలీ పనికి వెళ్తూ సురేష్‌కు మరోసారి పాదాలతో అక్షరాభ్యాసం చేయించాల్సి వచ్చింది. రాయడం నేర్చుకున్న తర్వాత ప్రగతి ఛారిటీస్ నిర్వాహకులు సురేష్‌కు సహకారం అందించారు. సుగుణ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు కిరణ్ దంపతులు సురేష్‌కు ఉచితంగా చదువు చెప్పారు. పదో తరగతిలో 5.2 పాయింట్లతో ఉత్తీర్ణత సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ లోపు కేఎన్ఆర్ స్కూల్ పీఈటీ అజయ్‌కుమార్ సురేష్‌లో ఉన్న ప్రతిభను గుర్తించాడు. క్రీడల్లో శిక్షణ ఇస్తూనే ఆర్థికంగా సహాయం చేస్తూ సురేష్‌కు అండగా నిలిచాడు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యను పూర్తి చేయడంలో శ్రీ వెంకటేశ్వర కళాశాల కరస్పాండెంట్ సునీల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. క్రీడలపై ఆసక్తి చదువుతో పాటు క్రీడలపై సురేష్ ఆసక్తి పెంచుకున్నాడు. స్నేహితులతో కలిసి క్రీడల్లో పాల్గొనేవాడు. ఏసీసుబ్బారెడ్డి స్టేడియంలో కోచ్‌లు జెస్సీం, రజనిలు సురేష్ ఆసక్తిని గమనించి అథ్లెటిక్స్‌లో శిక్షణ ఇచ్చారు. కోచ్‌లందరు ఆయా క్రీడల్లో తమ వంతు సహాయ సహకారాలను అందించారు. దీంతో సురేష్ ఫుట్‌బాల్, కబడ్డీ, ఖోఖో, క్రికెట్, వాలీబాల్‌లో ప్రావీణ్యం సా«ధించారు. అధ్లెటిక్స్‌లో పరుగుల్లో తన సత్తాను చాటాడు. జాతీయస్థాయిలో ప్రతిభ గతేడాది విశాఖపట్నంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో, విజయవాడలో జరిగిన పారామెడికల్ పోటీల్లో సురేష్ ప్రతిభ కనబరిచాడు. ఆ విజయంతో త్వరలో అంతర్జాతీయ స్థాయిలో దుబాయ్‌లో జరిగే పోటీల కోసం ప్రస్తుతం శ్రమిస్తున్నాడు. వెంటాడుతున్నఆర్థిక ఇబ్బందులు ప్రతిభతో రాణిస్తున్న సురేష్‌కు అవకాశాలు వస్తున్నాయి. అయితే ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. స్పాన్సర్ల కోసం ఎదురు చూపులు చూడాల్సి వస్తోంది. అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనాలంటే అయ్యే ఖర్చులు, ఆ స్థాయి సాధనకు సరిపడే పౌష్టికాహారం తనకు అందుబాటులో లేని పరిస్థితులు. అనారోగ్యం కారణంగా తండ్రి బేల్దారీ పని మానేయాల్సి వచ్చింది. తమ్ముడు పనికి పోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయ స్థాయిలో తనను తాను నిరూపించుకోవడానికి దాతల సహాయం ఎంతైనా అవసరం ఉంది. అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి క్రీడాకారుడిగా అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించాలి. రైల్వేస్‌లో ఉద్యోగం పొంది కుటుంబానికి అండగా నిలవాలనేది జీవిత లక్ష్యం. డ్యాన్స్ డైరెక్టర్, దర్శకుడు లారెన్స్ దర్శకత్వంలో నటించాలని కోరిక. దేవుడే తీరుస్తాడేమో చూడాలి. చేతులు లేవనే దిగులు పడటం లేదు. నాపై జాలి చూపడం సైతం నచ్చదు. విధిని ఎదురించి మనమేంటో నిరూపించాలి. -
ఫైనాన్సర్ టోకరా!
సాక్షి, తుర్కపల్లి(ఆలేరు): అతనో వికలాంగుడు.. ఏప్రాంతంవాడో తెలియదు.. చిరువ్యాపారులకు డబ్బులు అప్పుగా ఇస్తూ ఫైనాన్సర్‌గా మారాడు. అయ్యప్పమాల వేసి పరమభక్తుడిగా నటించాడు.. పండుగలొస్తేచాలు హంగూఆర్భాటాలతో పూజలు చేసి స్వీట్లు పంపిణీ చేసేవాడు. అన్నదానాలూ చేసేవాడు. విలాసవంతమైన జీవితం గడుపుతూ ధనవంతుడినని నమ్మించాడు. తాను కొనుగోలు చేసిన భూములను తక్కువ ధరకు అమ్ముతానని కొందరిని నమ్మించి అడ్వాన్స్‌ల పేరిట రూ.51లక్షల వరకు వసూలు చేసి ఆ సొమ్ముతో రాత్రికిరాత్రే బిఛానా ఎత్తేశాడు. ఈ సంఘటన తుర్కపల్లి మండల కేంద్రంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆకుల ఆనంద్‌రెడ్డిగా పరిచయం చేసుకున్న ఓ వికలాంగుడు నాలుగేళ్లక్రితం ఓ చిన్నపాటి సూట్‌కేసుతో తుర్కపల్లికి వచ్చాడు. తాను ఫైనాన్సర్అని చెప్పి ఓ ఇంట్లో అద్దెకు దిగాడు. వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇంట్లోకి కావాల్సిన ఏసీలు, ఫ్రిజ్, టీవీ, సోఫాలు, ఇలా రకరకాల వస్తువులు కొనుగోలు చేశాడు. తను ఉండే ఇంట్లో పరమభక్తుడిలా రోజూ పూజలు చేస్తూ చుట్టపక్కల వారికి ప్రసాదాలు పంచేవాడు. దీపావళి పండుగ వస్తే ఘనంగా లక్ష్మీపూజ చేసి స్వీట్లు పంపిణీ చేసేవాడు. తుర్కపల్లిలో చిరువ్యాపారులకు, ఆటోడ్రైవర్లకు ఫైనాన్స్ ఇచ్చి డెయిలీ వసూళ్లకు యువకులను సైతం తన దగ్గర ఉద్యోగులుగా పెట్టుకున్నాడు. తాంత్రికస్వామిగా.. కార్తీకమాసం కంటే ముందే అయ్యప్పమాలధారణ చేసేవాడు. 23 సార్లు తాను మాలవేసుకున్న తాంత్రికస్వామిగా పరిచయం చేసుకున్నాడు. అయ్యప్ప పూజల సందర్భంగా పెద్ద ఎత్తున్న మండల కేంద్రంలో అన్నదానాలు చేసేవాడు. గుళ్లు గోపురాలకు పెద్ద ఎత్తున చందాలు రాసేవాడు. గణేశ్ నవరాత్రోత్సవాలు వచ్చాయంటే అన్నదాన కార్యక్రమాలు నిర్వహించేవాడు. ఆర్థికంగా ఉన్న అయ్యప్ప భక్తులు, ప్రజలపై కన్ను మాల వేసుకున్న భక్తుల్లో ఆర్థికంగా ఉన్నవారిపై ఓ కన్నువేసేవాడు.ఆ క్రమంలోనే చుట్టు పక్కల ఉన్న భూములను కొనుగోలు చేసానని భూమి జిరాక్స్ పత్రాలను వారికి చూపించేవాడు. ఎవరూ లేని సమయంలో ఆ భూముల వద్దకు తీసుకెళ్లి ఈ భూమి నేను అగ్రిమెంట్ చేసుకున్నానని నమ్మించే వాడు. ఆ భూములను తక్కువ ధరలకు మీకు అమ్ముతామని పెద్ద మొత్తంలో అడ్వాన్స్‌లు తీసుకునేవాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని అందరికీ తెలిస్తే భూమిని మీకు అమ్మనని స్పష్టంచేసేవాడు. అనంతపురం వాసుడిగా.. మీరు ఏప్రాంతం నుంచి వచ్చారని ప్రజలు అడిగితే తనది అనంతçపురం అని, ధనవంతుల కుటుంబం అని నమ్మించాడు. కుటుంబ సభ్యులు ఎక్కడ అని అడిగితే తన ఫొటోతో ఇతరుల ఫొటోలను జతచేసి మార్ఫింగ్చేసి కుటుంబ సభ్యులని చూపించాడు. గురుస్వామిని నమ్మించి.. తుర్కపల్లికి చెందిన ఓగురుస్వామిని నమ్మించి రూ.36లక్షలు వసూలు చేశాడు. తాను బొమ్మలరామారంలోని మెయిన్‌రోడ్డులో భూమి కొనుగోలు చేశానని ఆ గురుస్వామిని అక్కడికి తీసుకెళ్లి చూయించాడు. ఇక్కడ 14 ఎకరాలు ఉందని దీనిని యజమానులు రూ.75వేలకు ఎకరం చొప్పున కొనుగోలు చేశారని తెలిపాడు. ఇందులో 5 ఎకరాల భూమని తాను వారి వద్దనుంచి రూ.5లక్షలకు ఎకరం చొప్పున కొనుగోలు చేశానని చెప్పాడు. ఈ భూమికి ఎకరం రూ.80లక్షల వరకు డిమాండ్ ఉందని కానీ గురుస్వామి కాబట్టి మీకు రూ.20లక్షలకు ఎకరం చొప్పున విక్రయిస్తానని చెప్పి నమ్మించాడు. ఇలా ఆ గురుస్వామినుంచి ఇటీవల రూ. 36 లక్షలు వసూలు చేశాడు. మరో వ్యక్తి వద్దనుంచి రూ.5లక్షలు, ఓహోటల్ యజమాని వద్ద రూ.2.50లక్షలు, మరికొంతరి వద్ద కొంత సొమ్ము వసూలు చేశాడు. ఈ నెల 27న భూమి రిజిస్ట్రేషన్ చేస్తానని రావాలని గురుస్వామికి చెప్పాడు. అయితే 27తేదీన ఫైనాన్సర్‌కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోంది. దీంతో గురుస్వామి ఆఫైనాన్సర్ ఇంటి వెళ్లివాకబు చేశాడు. పనిమీద రాత్రి బయటికి వెళ్లాడని, రెండు రోజుల తర్వాత వస్తానని చెప్పాడని అతని వద్ద పనిచేసే వర్కర్లు చెప్పారు. మంగళవారం ఫోన్ చేసినా స్విచ్ఆఫ్ వచ్చింది. అతడు 51 లక్షల రూపాయల నగదు ,నగలతో ఆదివారం రాత్రి తన మూడుచక్రాల వాహనంపైన భువనగిరికి వెళ్లి బస్‌స్టాండ్‌లోని పార్కింగ్‌లో ఉంచి ఆటోలో పరారయ్యాడు. గురుస్వామితో పాటు మరో ఐదుగురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేశారు. ఎటువంటి ఆధారం దొరకకుండా.. ఎవరికీ ఎలాంటి ఆధారాలు దొరకకుండా ఆనంద్‌రెడ్డి వ్యవహరించాడు. అతడు వాడిన ఫోన్లు, సి మ్‌లతో పాటు వాహనం కూడా గ్రామస్తుల పే రుమీదనే కొనుగోలు చేశాడు. తన ఉంటున్న గది లో పలుబ్యాంక్లకు సంబంధించిన పాస్పుస్తాకా లు, ఖాళీ చెక్కులు, ఆధార్‌కార్డులు, ప్రామిసరీ నోట్లు, వాహనాలు ధ్రువీకరణ పత్రాలు లభించాయి. పలు జిల్లాల్లో కూడా కేసులు ఆంధ్రరాష్ట్రంలోని అనంతపుం, తాడిపత్రి, చిత్తూ రు, మదనపల్లి, తిరుపతిలో అతని పై పలు కేసులున్నాయని పోలీసులు తెలియజేశారు. -
కులాంతర వివాహం.. ఒక్కటైన దివ్యాంగులు
మాకవరపాలెం: దివ్యాంగులు ఒక్కటయ్యారు. కులమతాలు పక్కనపెట్టారు. ప్రాంతం వర్గం వేరైనా అందరి సమక్షంలో వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచారు. వివరాల్లోకి వెళితే. చింతపల్లికి చెందిన షేక్.దర్గాబాబు చిన్నప్పుడే తల్లిదండ్రులు మరణించారు. దీంతో దర్గాబాబును మోహన్ అనేవ్యక్తి కొండలఅగ్రహారంలో ఉన్న ఇమ్మానుయేలు సంస్థలో చేర్చాడు. అప్పటినుంచి సంస్థ డైరెక్టర్ బిషప్ కె.జీవన్‌రాయ్ సంరక్షణలోనే ఉంటూ ఉన్నత చదువులు పూర్తి చేశాడు. ఆంధ్రాయూనివర్సిటీ నుంచి ఎంఏ పట్టా పొందాడు. ఇక ఇమ్మానుయేలు ఎడ్యుకేషనల్ క్యాంపస్‌లో బీఈడీ కూడా పూర్తి చేసిన దర్గాబాబు ఇక్కడే ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్నాడు. దర్గాబాబు బాగోగులు చూసుకునే జీవన్‌రాయ్ దంపతులు వివాహ విషయంలోనూ కూడా శ్రద్ధ తీసుకుని విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన సిగనం కృష్ణవేణితో వివాహం కుదిచ్చారు. ఈ మేరకు గురువారం తామరంలో జీవన్‌రాయ్, నలినీరాయ్ చేతుల మీదుగా వీరిద్దరి ఆదర్శ వివాహం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగులు ఏ విషయంలోనూ తక్కువ కాదని, వారికి ప్రోత్సాహం, సహాయ సహకరాలు అందిస్తే వారికాళ్లమీద వారు నిలబడతారన్నారు. ఇలాంటి వివాహాల ద్వారా సమాజంలో ఎందరికో ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వికలాంగ శాఖ ప్రతినిధులు, ఇమ్మానుయేలు సిబ్బంది నూతన వధూవరులను ఆశీర్వదించారు. -
వికలాంగుల వసతి గృహమా.. లేక పశువుల కొట్టమా..?
సాక్షి, ఒంగోలు సిటీ: అసలే దివ్యాంగులు..పైగా ఎముకలు,కీళ్ల సంబంధమైన బాధలతో నరకం చూస్తున్నారు. వీరిలో కొందరికి చేతులు,కాళ్లు ఉన్నట్లుగా కన్పిస్తున్నా అవి వంగే పరిస్థితిలో ఉండవు. ఇలాంటి శారీక బాధలతో బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వ వసతి గృహానికి వస్తే అక్కడా వారికి న్యాయం జరగడం లేదు. వీరి కోసం ప్రభుత్వం చేస్తున్న దుర్వినియోగం జరుగుతోంది. ఒంగోలు సంతపేటలోని ప్రభుత్వ దివ్యాంగుల వసతి గృహంలో దివ్యాంగులకు అందుతున్న సౌకర్యాలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు ఎస్పీ ఎం.రజిని ఆధ్వర్యంలో పరిశీలన చేస్తే వాస్తవాలు వెలుగు చూశాయి. మంగళవారం రాత్రి విజిలెన్సు అధికారులు ఆకస్మికంగా తనిఖీలు జరిపారు. జిల్లా కేంద్రం ఒంగోలు సంతపేటలో దివ్యాంగులకు వసతి గృహం ప్రభుత్వ ఆధీనంలో నడుస్తుంది. ఎక్కడ లబ్ధిపొందే వారికి ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా వారు ఎవ్వరికి చెబుకొనే పరిస్థితి లేదు. విజిలెన్స్ అధికారులు ఇటీవల జిల్లాలోని పర్చూరు, కందుకూరు తదితర కేంద్రాలలోని దివ్యాంగుల, బుద్ధిమాంద్యంతో ఇబ్బందిపడుతున్న వారి వసతి గృహాలను తనిఖీ చేసినప్పుడు వారికి అందుతున్న సౌకర్యాలు దీనావస్థలో ఉన్నట్లుగా గుర్తించారు. వీటిపై ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ నేపథ్యంలోనే జిల్లా కేంద్రం ఒంగోలులో నడుస్తున్న దివ్యాంగుల (ఆర్ధో) వసతి గృహంలోని వసతులను పరిశీలించినప్పుడు దారుణమైన విషయాలు బయటపడ్డాయి. సరైన వసతి కరువు దివ్యాంగుల వసతి గృహంలో వసతి సరిగ్గా లేదు. రాత్రి వేళ దోమల బెడద. ఉదయం ఎటూ తప్పని కీటకాల సమస్యలు. ఈ బాధలను వీరు నిత్యం అనుభవించి అలవాటు పడ్డారు. వారిని వసతుల విషయమై ప్రశ్నించినప్పుడు దోమలు ఎడతెరిపి లేకుండా కుడుతున్నా అలాగే భరించి అలవాటైందని అంటున్నారు. వీరు అనుభవిస్తున్న ఎముకలు, కీళ్ల సంబంధమైన బాధల కన్నా కీటకాలు పెడుతున్న ఇబ్బంది అంతగా భరించలేనిది కాదు. పరిశుభ్రత అంతంత మాత్రంగానే ఉంటుంది. ఎక్కడ చూసినా మురుగు, అపరిశుభ్రత. ఎప్పుడో గానీ శుభ్రం చేయరు. దీంతో వసతి గృహంలో అనుభవిస్తున్న వసతి వీరికి ఆశించిన సౌకర్యాన్ని ఇవ్వలేకపోతున్నాయి. విజిలెన్స్ అధికారుల ఎదుట దివ్యాంగులు తమ బాధలు తెలుపుకొని వాపోయారు. వసతి గృహంలో శుభ్రత లేని మరుగుదొడ్లు మరుగుదొడ్డికి వెళ్లాలంటే ఇక మరుగుదొడ్డికి వెళ్లాలంటే నానా పాట్లు పడాల్సిందే. ప్రస్తుత పరిస్థితుల్లో అతి చిన్న వయస్సులోనే మోకీళ్లు వ్యాధులు, నొప్పులతో బాధపడ్తున్న వారు అధికమయ్యారు. అన్నీ బాగున్నా, ఆరోగ్యం సరిగ్గా ఉన్న వారే మరుగుదొడ్డి విషయంలో ఎత్తైన వెస్ట్రన్ సీటును వాడుతున్నారు. ఇక వీరు దివ్యాంగులు. పైగా వీరిలో అధిక భాగం కాళ్లు వంగే పరిస్థితిలో లేవు. చేతులు పని చేయవు. అలాంటి వారికి నేల బారు సీటుతో ఉండిన మరుగుదొడ్లే వసతి గృహంలో ఉన్నాయి. అవి కూడా సీటు పగిలిపోయి ఎందుకు పనికిరాని విధంగా ఉన్నా వాటితోనే నెట్టుకొస్తున్నారు. దివ్యాంగులు మరుగుదొడ్డికి వెళ్లాలంటే నానా పాట్లు పడ్తున్నారు. హాజరులో మతలబు దివ్యాంగుల వసతి గృహంలో పిల్లల హాజరులో మతలబు చేస్తున్నారు. మొత్తం 25 పిల్లలను హాజరుపట్టీలో చూపిస్తున్నారు. వీరికి తగినట్లుగా ఆహారం డ్రా చేస్తున్నారు. వాస్తవానికి 13 మందే గృహంలో అందుబాటులో ఉన్నారు. మిగిలిన వారికి ఇస్తున్న బియ్యం,ఇతర వస్తువులు దుర్వినియోగం జరుగుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. రికార్డులను పరిశీలించారు. వీటి ఆధారంగా సరుకులు పెద్ద ఎత్తున దుర్వినియోగం జరిగినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. బియ్యం నిల్వలను పరిశీలిస్తే అక్కడిక్కడే 250 కిలోల బియ్యం అదనంగా ఉన్నాయి. అలాగే సరుకులు ఉన్నాయి. వీటిపై నిశితంగా విజిలెన్స్ అధికారులు పరిశీలన చేస్తున్నారు. పాడుపడిన మిద్దెకు రూ.50వేలు వసతి గృహం ప్రైవేటు గృహంలో నడుస్తుంది. మిద్దె బాగా పాడుపడింది. దీనికి నెలకు రూ.50 వేలు అద్దె చెల్లిస్తున్నారు. నెలకు ఇంత పెద్ద మొత్తం వెచ్చిస్తే మంచి సౌకర్యాలు, వసతులు ఉన్న బిల్డింగే వస్తుందని అభిప్రాయపడ్తున్నారు. ఎందు వల్ల ఇంత పెద్ద మొత్తం వెచ్చించి పాడుపడిన మిద్దెలో వసతి గృహాన్ని నడుపుతున్నారని అనుమానాలను వ్యక్తం చేశారు. వీటికి సంబంధించిన రికార్డులను విజిలెన్స్ తనిఖీ చేసింది. వసతి గృహంలో తాగేందుకు సరిగా నీరు లేదు. రిసోర్సు పర్సన్ లేరు వసతిగృహంలోని విద్యార్థులు తొమ్మిది,పది, ఇంటర్,డిగ్రి చదువుతున్న వారున్నారు. వీరికి ఏవైనా డౌట్లు వస్తే సంబంధిత సమస్యను నివృత్తి చేయడానికి అవసరమైన రిసోర్స్ పర్సన్ ఉండాలి. ఇక్కడ ట్యూటర్ కూడా లేరు. వారికి వివిధ సబ్జెక్టుల్లో వచ్చే అనుమానాలను నివృత్తి చేయలేకపోతున్నారు. వీరు చదువుల్లో వెనుకబడి ఉన్నారు.అలాగే ఆహారం కూడా సరిగ్గా లేదు. కనీసం జంతువులు తినేందుకు కూడా పనికిరాకుండా ఆహారం ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. బాత్రూంలు సరిగ్గా లేవు. విద్యుత్ సౌకర్యం సక్రమంగా లేదు. దివ్యాంగుల వసతి గృహం సమస్యలకు నెలవుగా ఉంది. దివ్యాంగుల పట్ల అధికారులు, ప్రభుత్వం ఇంత నిర్దయగా ఉందా అన్న వాస్తవాలు అధికారుల ఆకస్మిక దాడుల్లో వెలుగు చూశాయి. అదనపు ఎస్పీ రజిని సాక్షితో మాట్లాడుతూ దివ్యాంగుల వసతి గృహంలో గుర్తించిన అంశాలపై ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లుగా తెలిపారు. ఇలాగే జిల్లాలో ఎక్కడైనా వసతి గృహాల సమస్యలు ఉంటే విజిలెన్స్ అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
12 ఏళ్ల తర్వాత కలిశారు..
శ్రీనగర్‌కాలనీ: మతి స్థిమితం కోల్పోయిన ఓ వ్యక్తి రాష్ట్రాలు దాటి వచ్చాడు. తను ఎవరో.. ఏమిటో.. ఎక్కడి వాడో కూడా తెలియని పరిస్థితి. ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రి వైద్యుల కృషితో కోలుకున్న అతడు దాదాపు 12 ఏళ్ల తర్వాత తన కుటుంబ సభ్యులను కలుసుకున్నాడు. లేడనుకున్న వ్యక్తి తిరిగి రావడంతో ఆ కుటుంబ సభ్యుల ఆనందాన్ని అవధుల్లేవు. ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రి సూపరిడెంట్ డాక్టర్ ఉమాశంకర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌కు చెందిన జశ్వంత్‌కుమార్ మతిస్థిమితం కోల్పోయాడు. అనుకోని పరిస్థితుల్లో ఖమ్మం చేరాడు. అక్కడి మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు 2016 అక్బోబర్లో ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ అందించిన వైద్యంతో కొన్ని నెలలకు కోలుకున్న అతడు.. తన పేరు జశ్వంత్‌కుమార్ అని, యూపీ అని మాత్రమే చెప్పాడు. పూర్తి వివరాలు చెప్పలేకపోవడంతో అదే విషయాన్ని ఖమ్మం మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే, రోగికి సంబంధించిన వారు ఎవరూ రాకపోవడంతో ఎర్రగడ్డ ఆస్పత్రిలోనే చికిత్స అందించసాగారు. ూ మూడు నెలల క్రితం ఎర్రగడ్డ మానసిక వైద్యులు ఓ కాన్ఫరెన్స్ నిమిత్తం లక్నో వెళ్లగా.. అక్కడ పోలీసింగ్ వ్యవస్థ మెరుగైన సేవలు అందిస్తున్నట్టు తెలుసుకున్నాడు. లక్నో పోలీసుల ‘హెల్పింగ్ పోర్టల్’ ద్వారా ఇక్కడ ఉంటున్న రోగి వివరాలను చెప్పారు. దీంతో గతంలో యూపీలో నమోదైన మిస్సింగ్ కేసులను వడగట్టగా.. జస్వంత్‌కుమార్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. వెంటనే అక్కడి పోలీసులతో మాట్లాడి రోగి బంధువులకు సమాచారం ఇవ్వగా.. వారు మంగళవారం ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రికి రోగి కుటుంబ సభ్యులు నలుగురు వచ్చి జశ్వంత్కుమార్ను కలిసి సంతోషం పట్టలేకపోయారు. జశ్వంత్‌కు సంబంధించిన గుర్తింపు కార్డులను పరిశీలించి ఆస్పత్రిలోని లీగల్ సెల్ ద్వారా అతడిని బంధువులకు అప్పగించారు. తమ తమ్ముడిని ఇన్నేళ్ల తర్వాత బాగుచేసి అప్పగించిన వైద్యులకు రోగి అన్న విశ్వనాథ్ వైద్య బృందాన్ని కృతజ్ఞతలు చెప్పాడు. చాలా ఆనందంగా ఉంది.. ఎర్రగడ్డలో రోగులకు అత్యాధునిక వసతులతో చికిత్స అందిస్తున్నాం. చాలామంది రోగులకు చికిత్స అనంతరం వారి బందువుల వద్దకు, కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నాం. కానీ ఓ మతి స్థిమితం కోల్పోయిన వ్యక్తి కోలుకుని 12 ఏళ్ల తర్వాత కుటుంబ సభ్యులను చేరుకోవడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. రోగికి పూర్తి చికిత్స అందించాం. మా డాక్టర్లు లక్నో వెళ్లడం జస్వంత్‌కుమార్ బంధువుల వద్దకు చేర్చేలా చేసింది. – డాక్టర్ ఉమాశంకర్, ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రి సూపరింటెండెంట్ -
వైకల్యం నిర్ధారణలో ‘నిర్లక్ష్యం ’..!
విజయనగరం ఫోర్ట్: పై ఫొటోలో కనిపిస్తున్న విద్యాంగురాలి పేరు పెంకి చరణి. ఈమెది విజయనగరం పట్టణంలోని కేఎల్‌పురం. రెండు రోజుల కిందట కేంద్రాస్పత్రిలో సదరం ధ్రువపత్రం కోసం వెళ్లింది. ఈమెకు వినికిడి సమస్య ఉంది. ఈమెను పరిక్షించిన వైద్యులు 65 శాతం వైకల్యం ఉన్నట్టు నిర్ధారించారు. అయితే దివ్యాంగురాలి తండ్రికి వైకల్యం నిర్ధారణలో అనుమానం రావడంతో వైద్యులని ప్రశ్నించారు. మా అమ్మాయికి 90కి పైగా వైకల్యం ఉంటే 65 శాతం మాత్రమే ఉందని ఏవిధంగా నిర్ధారిస్తారని నిలదీశారు. దీంతో వారు బెరా టెస్టు చేయించమని చరణి తండ్రికి సూచించారు. దీంతో ఆయన ఘోషాస్పత్రిలో ఉన్న సత్వర చికిత్స కేంద్రంలో బెరా టెస్టు చేయించారు. దీంతో చరణికి అక్కడ వైద్యులు 90 శాతం వైకల్యం ఉన్నట్టు నిర్ధారించారు. ఇది వెలుగులోకి వచ్చిన సంఘటన . వెలుగులో రాకుండా ఇటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. దివ్యాంగుల వైకల్యాన్ని పారదర్శకంగా చేయాల్సిన వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దివ్యాంగులు ఆరోపిస్తున్నారు. ఫలితంగా దివ్యాంగులు నష్టపోవాల్సిన పరిస్థితి. కొంతమంది వైద్య సిబ్బంది వైద్యులను తప్పుదోవ పట్టిస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ధ్రువపత్రం తప్పనిసరి.. దివ్యాంగులు పింఛన్ పొందాలన్నా.. లేదా బస్సు, రైల్వే పాస్‌లు పొందాలన్నా.. ఉద్యోగంలో రిజర్వేషన్ సౌకర్యం పొందాలన్న సదరం ధ్రువపత్రం తప్పనిసరి. అయితే ఇప్పుడు సదరం ధ్రువపత్రం పొందడం పెద్ద ప్రహసనంగా మారింది. ధ్రువపత్రాలు లేకపోవడంలో దివ్యాంగులు పింఛన్లు, రాయితీలు పొందలేకపోతున్నారు. కొంతమంది నెలల తరబడి నిరీక్షిస్తుండగా.. మరి కొంతమంది ఏళ్ల తరబడి ఎదరుచూపులు చూస్తున్నారు. వైకల్య ధ్రువీకరణ పత్రం కాలపరిమితి దాటిని వారు కూడ అవస్థలు పడుతున్నారు. స్లాట్ బుకింగ్ ఆలస్యం.. ఆగస్టు మొదటి వారం నుంచి వైద్య విధాన్ పరిషత్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ధ్రువపత్రాలు జారీ ఆన్లైన్ ద్వారా మొదలైంది. అంతకు ముందు మీ–సేవలో స్లాట్ బుక్ చేసుకుని ఆస్పత్రికి వెళితే అదే రోజు వైద్యుడు వైకల్య శాతాన్ని నిర్ధారించి సదరం ధ్రువపత్రం ఇచ్చేవారు. ఆగస్టు నెల నుంచి నూతన విధానాన్ని తీసుకొచ్చారు. ఈ విధానం ప్రకారం మీసేవ లో స్లాట్ బుక్ చేసుకుని ఆస్పత్రికి వెళితే అక్కడ వైద్యులు వైకల్య శాతాన్ని నిర్ధారించి ఆన్లైన్ లో నమోదు చేస్తారు. తిరిగి మరలా దివ్యాంగుడు మీ–సేవకు వెళ్లి ధ్రువపత్రాన్ని తీసుకోవాలి. అయితే మీ సేవలో స్లాట్ బుకింగ్ సక్రమంగా కావడం లేదు. ఒక వేళ వచ్చినా రెండు, మూడు నెలల తర్వాత వస్తుంది. దీంతో దివ్యాంగులు ఆస్పత్రికి వెళ్లడానికి కూడా నెలల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి . వైద్యుల నిర్లక్ష్యం... దివ్యాంగులకు జిల్లాలోని పార్వతీపురం ఏరియా ఆస్పత్రి, కేంద్రాస్పత్రిలో సదరం ధ్రువపత్రాలు అందజేస్తారు. అయితే వైద్యులు వైకల్యాన్ని నిర్ధారించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నారు. అర్హత ఉన్నప్పటికీ అనేక మంది దివ్యాంగులు ధ్రువపత్రాలు పొందలేకపోతున్నారు. వైకల్యం నిర్ధారణలో అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేసినప్పటికీ ఆ సమస్య పరిష్కరానికి నోచుకోవడం లేదని దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చర్యలు తీసుకుంటాం.. వైకల్య శాతం నిర్ధారణలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు నిర్ధారణ అయితే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం.– కె .సీతారామరాజు, కేంద్రాస్పత్రి , సూపరింటెండెంట్ -
ఫస్ట్ టైమ్.. ‘బ్రెయిలీ’ ఈవీఎం
ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటు అనే ఆయుధం కీలకం. దాన్ని సరిగా వినియోగించుకోకుంటే అనర్థాలు అనేకం. మనకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోవడం అనేది ‘రహస్య ఓటింగ్’ ద్వారా జరుగుతుంది. అయితే, దివ్యాంగులు, అంధులు, ఇతర శారీరక వైకల్యం ఉన్నవారికి మాత్రం రహస్య ఓటింగ్ అనేది గగనమైంది. ఓటు వేసేప్పుడు వారు ఇతరులపై ఆధారపడక తప్పడంలేదు. ఈ పరిస్థితికి చెక్‌పెడుతూ తెలంగాణలో వికలాంగ సంక్షేమశాఖ, ఎన్నికల కమిషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అంధుల కోసం ఏకంగా బ్రెయిలీ లిపిలో ఈవీఎంలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతికి ప్రత్యేక ఫైలు పంపించింది. ‘అందరికీ అందుబాటులో ఎన్నికలు’ పేరిట ఎన్నికల కమిషన్ విస్త్రృత ఏర్పాట్లు చేస్తోంది. బ్రెయిలీ లిపిలో ఈవీఎంలు, బ్యాలెట్లు రాష్ట్రంలోని అంధ ఓటర్ల కోసం 31 జిల్లాల పరిధిలోని 217 పోలింగ్ కేంద్రాల్లో బ్రెయిలీ లిపి ఈవీఎంలను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లోని అంధుల ఓటర్లను ఆధారం చేసుకొని వీటిని అందుబాటులో ఉంచుతారు. ఇంకా ఓటరు గుర్తింపు కార్డు, బ్యాలెట్ పేపరు, ప్రచార కరపత్రాలను బ్రెయిలీ లిపిలో ప్రత్యేకంగా ముద్రిస్తున్నారు. బ్యాలెట్లు, ఈవీఎంలపై క్రమపద్ధతిలో అభ్యర్థుల పేర్లు, పార్టీ గుర్తు బ్రెయిలీ లిపిలో ఉంటాయి. బ్యాలెట్‌ను చేతితో తడిమి గుర్తించాక ఈవీఎంల వద్దకు వెళ్లి ఎవరి సాయం లేకుండానే అంధులు ఓటు వేయవచ్చు. శారీరక వికలాంగులకు చక్రాల కుర్చీ శారీరక వికలాంగులైతే ప్రతీ పోలింగ్ కేంద్రంలోనూ చక్రాల కుర్చీ అందుబాటులో ఉంచనున్నారు. 32,796 పోలింగ్ కేంద్రాల్లో సుమారు 20 వేల చక్రాల కుర్చీలు అవసరమని అంచనా. వీటిలో రెండు వేల కుర్చీలను వికలాంగుల సంక్షేమశాఖ సమకూర్చింది. వికలాంగులను పోలింగ్ కేంద్రంలోకి తీసుకు వెళ్లేందుకు ప్రత్యేక ర్యాంప్‌లు నిర్మిస్తున్నారు. ఒక్కో ర్యాంప్‌కు రూ.8 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో తాత్కాలిక ర్యాంప్‌లు ఏర్పాటు చేస్తారు. వీల్‌ఛైర్ గదిలోకి తీసుకెళ్లడం, తీసుకురావడం ఇలా ప్రతీ విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు జారీచేసింది. ఇక పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వికలాంగులతో ఎలా వ్యవహరించాలనే దానిపై ఎన్నికల అధికారులకు సూచనలు ఇస్తున్నారు. అంధులు, బధిరుల కరపత్రాలతోపాటు వీటినీ పంపిణీ చేస్తారు. రెండు మూడు నియోజకవర్గాల్లో వారి ప్రభావం.. రాష్ట్రంలో కనీసం రెండు మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములను దివ్యాంగ ఓటర్లు ప్రభావితం చేయగల సంఖ్యలో ఉన్నారు. రాష్ట్రంలో మొత్తంగా 6,39,276 మంది దివ్యాంగులు ఉన్నారు. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 38,958 మంది ఉన్నారు. తరువాత స్థానాల్లో రంగారెడ్డి జిల్లాలో 37,147 మంది, ఖమ్మంలో 34,110, హైదరాబాద్‌లో 33,362, కరీంనగర్జిల్లాలో 30,643, మహబూబ్‌నగర్ జిల్లాలో 30,169 మంది ఓటర్లున్నారు. కొమురంభీం, ఆదిలాబాద్ జిల్లాల్లో పదివేల లోపు ఓటర్లుండగా, మిగిలిన జిల్లాల్లో 14 వేలకు తగ్గకుండా దివ్యాంగ ఓటర్లున్నారు. అయితే దివ్యాంగ ఓటర్లు ఇంకా కొంతమేరకు పెరిగే అవకాశముందని ఎన్నికల కమిషన్ చెబుతోంది. ప్రాథమిక అంచనా ప్రకారం 7.40 లక్షలు ఉండే అవకాశముందని అంటున్నారు. దీనిపై త్వరలో స్పష్టత వస్తుందంటున్నారు. ..::: బొల్లోజు రవి ఎన్నో సదుపాయాలు ఈసారి ఎన్నికల్లో దివ్యాంగులు పూర్తి స్థాయిలో ఓటు వినియోగించుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. బ్రెయిలీ లిపిలో గుర్తింపు కార్డులు, ఈవీఎంలు ఈ చర్యల్లో భాగమే. బధిర ఓటర్ల కోసం సంజ్ఞల భాషలో కరపత్రాన్ని రూపొందించాం. ఎన్నికల సామగ్రితోపాటు వీటినీ అధికారులకు అందజేస్తాం. ఓటు వేయడానికి వచ్చే బధిరులను కరపత్రంలో సూచించిన సంజ్ఞలతో అధికారి సమన్వయం చేసుకుంటారు. కరపత్రంలో 11 అంశాలతో కూడిన వివరాలు ఉంటాయి. పోలింగ్ కేంద్రానికి వచ్చింది మొదలు వెళ్లే వరకు బధిర ఓటరును ఎన్నికల అధికారి సంజ్ఞల ద్వారా ఆయా విషయాలు అడుగుతారు. ఉదాహరణకు ‘మీ పేరు, వినికిడి లోపమా?, మాట్లాడలేరా?, ఓటరు కార్డు స్లిప్ చూపించండి, లిస్ట్‌లో పేరుందా, ఎడమ చేతిపై సిరా వేయించుకోండి, సిరాను ఎట్టి పరిస్థితుల్లో తొలగించకూడదు, ధన్యవాదాలు’ అనే సంజ్ఞల భాషతో కరపత్రం ఉంటుంది. – బీ.శైలజ, రాష్ట్ర ఎన్నికల ఉప ప్రధానాధికారి -
మనసున్న డాక్టర్
అనంతపురం, కదిరి: ఈ చిన్నారి పేరు కార్తీక్. వయస్సు 12ఏళ్లు. పుట్టుకతోనే బుద్ధిమాంద్యం, అంగవైకల్యంతో జన్మించాడు. చిన్నారికి రెండేళ్లు కూడా నిండకనే తల్లి భారతి కడుపునొప్పితో కన్నుమూసింది. తండ్రి మల్లికార్జున బేల్దారి పనిచేస్తూ ఇంటికి వారానికో 10 రోజులకో వచ్చి వెళ్తుంటాడు. పిల్లాడి బాధ్యతలన్నీ అవ్వ(నాన్మమ్మ) వెంకటమ్మ చూసుకుంటోంది. ఈమెకు 80 ఏళ్లు. తనకు వచ్చే రూ.1000 పింఛన్‌తోనే కుటుంబాన్ని పోషిస్తూ చిన్నారి బాగోగులు కూడా చూస్తోంది. 90 శాతం అంగవైకల్యం సర్టిఫికెట్ చేతబట్టుకొని మనవడికి పింఛను ఇప్పించాలని ఈ అవ్వ తొక్కని గడపంటూ లేదు. తిరగని కార్యాలయం అంటూ లేదు. ‘నీకు రూ.1000 పింఛను ఇస్తున్నాం కదా.. మళ్లీ నీ మనవడికి కూడానా..? అలా కుదరదు. నువ్వు చస్తే నీ మనవడికి పింఛన్ వస్తుంది. లేదంటే కుదరదు.’ అని తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ స్థానిక నాయకుడు అన్నట్లు ఈ అవ్వ వాపోతోంది. ‘వాడి పింఛన్ కోసం నేను చావాలంట నాయనా.. నేను చస్తే వీడికి దిక్కెవరు? వీడికి అమ్మ లేదు. వీళ్ల నాయన అమావాస్యకో, పున్నానికో వస్తాడు..’ అని కన్నీరు పెట్టింది. ఈ పరిస్థితుల్లో ‘గుడ్‌మార్నింగ్ కదిరి’ కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పీవీ సిద్దారెడ్డి గురువారం అమీన్‌నగర్‌లో గడపగడపకూ వెళ్లి ప్రజల కష్టసుఖాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో తన కంటపడిన ఈ దివ్యాంగుడిని పలకరించాడు. అక్కడే ఉన్న ఓ మహిళ ‘సార్ పిల్లోడికి మాటలు రావు.. బుద్ధిమాద్యం’ అని చెప్పింది. పింఛన్ కోసం ఆ పిల్లోడి అవ్వ తిరిగి తిరిగి వేసారింది. ఎవ్వరూ పట్టించుకోలేదని ఆయన దృష్టికి తీసుకొచ్చింది. పిల్లాడికి సంబంధించిన అంగవైకల్యం సర్టిఫికెట్‌ను డాక్టర్ సిద్దారెడ్డి పరిశీలించారు. 90 శాతం అంగవైకల్యం ఉందే.. అంటూ పింఛన్ ఎందుకివ్వలేదని ఆరా తీశారు. ‘సరే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ అబ్బాయికి నెలకు రూ.3 వేల పింఛన్ ఇప్పిస్తాం. అంత వరకు నేనే నెలకు రూ.2 వేలు చొప్పున పింఛన్ రూపంలో నగదు ఇస్తా’ అని హామీ ఇచ్చారు. సిద్ధారెడ్డి నిర్ణయం పట్ల ఆ వీధి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ తామంతూ మీవెంటే ఉంటామని ఆశీర్వదించారు. -
ఆస్తికోసం ఆడ బిడ్డను గెంటేశారు
వైఎస్ఆర్ జిల్లా, రాజంపేట టౌన్ : పుట్టుకతోనే వికలాంగురాలిగా పుట్టిన ఆమెకు పుట్టెడు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. రాజంపేట పట్టణం రామ్‌నగర్‌కు చెందిన పసుపులేటి కృపమ్మ రెండు కాళ్లు లేని దివ్యాంగురాలిగా జన్మించింది. కృపమ్మ తల్లిదండ్రులు వెంకటసుబ్బయ్య, పార్వతమ్మ నిరుపేదలు. రెక్కాడితేకాని డొక్కాడని జీవనం వారిది. తమ బిడ్డ దివ్యాంగురాలిగా పుట్టినా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ వచ్చారు. పదేళ్ల క్రితం కృపమ్మ తల్లి పార్వతమ్మ మృతి చెందింది. దీంతో తండ్రి, అన్న వెంకటేష్ తల్లిలేని లోటు కనిపించకుండా కృపమ్మను చూసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏడాది క్రితం తండ్రి కూడా మృతి చెందాడు. ఇదిలా ఉండగా అన్న వెంకటేష్‌కు అతని భార్యతో వచ్చిన విభేదాల వల్ల భార్య, భర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. వారి ఒక్కగానొక కుమార్తె కూడా వెంకటేష్ వద్దనే ఉండిపోయింది. దీంతో వెంకటేష్ డ్రైవర్‌గా పనిచేసుకుంటూ తన చెల్లెలు కృపమ్మ, కుమార్తెను పోషించేవాడు. ఈ నేపథ్యంలో వెంకటేష్ భార్య దుబాయ్ వెళ్లిపోయింది. భార్య విదేశాలకు వెళ్లిపోవడంతో వెంకటేష్ మద్యానికి బానిసయ్యాడు. దీంతో ఆరోగ్యం క్షీణించి మూడు నెలల క్రితం మృత్యువాత పడ్డాడు. వెంకటేష్ మృతి చెందిన విషయాన్ని అతని భార్యకు తెలిపినా వెంటనే రాకుండా అంత్యక్రియలు నిర్వహించిన నాలుగైదు రోజుల తరువాత వచ్చినట్లు బంధువులు చెబుతున్నారు. అన్న మృతి చెందిన తరువాత రామ్‌నగర్‌లోని అన్న ఇంటిలో ఉన్న తనను వదిన ఇంటి నుంచి గెంటివేసిందని కృపమ్మ విలపిస్తోంది. రెండు కాళ్లులేక జోగాడితే కాని ముందుకు కదలలేని దయనీయ స్థితిలో ఉన్న తనను వదిన ఇంటి నుంచి గెంటివేయడంతో ఇప్పుడు అనాథగా బంధువుల పంచన జీవించాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం ఇచ్చే దివ్యాంగుల ఫింఛన్తో తన తండ్రి నిర్మించిన ఇంటిలో తలదాచుకొని జీవిస్తామనుకున్నా వదిన ససేమిరా అంటోందని కృపమ్మ వాపోతోంది. కనీసం ఇంటిని విక్రయించి తనకు రావాల్సిన వాటా ఇవ్వాలని వేడుకుంటున్నా వదిన ఆమె స్నేహితుడితో కలిసి తనపై దౌర్జన్యానికి పాల్పడుతోందని బాధితురాలు పేర్కొంటోంది. తనలాంటి అభాగ్యుల దీనగాధలను పత్రికల్లో చూసి న్యాయం చేస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోకవరపు శ్రీనివాస్ తనపై దయచూపి న్యాయం చేయాలని ఆ దివ్యాంగురాలు వేడుకుంటోంది. -
దివ్యాంగుడికి హీరో ఆర్థిక సాయం
పెరంబూరు: నటుడు ఉదయనిధి స్టాలిన్ ఓ దివ్యాంగుడికి ఆర్ధిక సాయం అందించారు. తంజై టౌన్, కరంబై ప్రాంతానికి చెందిన దివ్యాంగుడు అరుళ్ సహాయరాజ్. అదే ప్రాంతంలో చిల్లర దుకాణం నడుపుతున్నాడు. ఇతను కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో నటుడు ఉదయనిధి స్టాలిన్‌ను సాయం కోరుతూ ఆయన అభిమాన సంఘం ద్వారా లేక రాశారు. సోమవారం తంజైలో జరిగిన ఒక వివాహవేడుకలో ఉదయనిధి స్టాలిన్ పాల్గొన్నారు. అనంతరం ఆ ప్రాంతంలోని అరుణ్ సహాయరాజ్ ఇంటికి వెళ్లి రూ.10 వేలు ఆర్థిక సాయం చేశారు. అరుళ్ సహాయరాజ్ ఆనందంతో కంట తడిపెట్టాడు. ‘తాను ఉదయనిధి స్టాలిన్‌ను సాయం కోరాను గానీ, ఆయన ఇలా స్వయంగా ఇంటికి వచ్చి సాయం చేస్తారని ఊహించలేదు’అన్నాడు. -
ఆ తల్లి సేవలకు సలామ్
కర్ణాటక, సిరుగుప్ప రూరల్: ఉన్నది ఒక్కగానొక్క కుమారుడు. అతను దివ్యాంగుడు. అయినప్పటికీ ఆ తల్లి తన కుమారున్ని అపురూపంగా చూసుకుంటోంది. చేతిలో చిల్లిగవ్వలేకపోయినా భిక్షమెత్తుకొని రెండు కాళ్లు లేని కుమారున్ని పోషిస్తూ మాతృప్రేమనుచాటుకుంటోంది. సింధనూరు తాలూకా కెంగల్ గ్రామానికి చెందిన మహబూబికి ఒక్కడే కుమారుడు. ఇతనికి రెండు కాళ్లు లేవు. దీంతో తల్లే అతని ఆలనా పాలన చూస్తోంది. రోజూ భిక్షమెత్తుకొని కుమారున్ని పోషిస్తోంది. ఈక్రమంలో సిరుగుప్పలో ఏటా పెద్ద ఎత్తున జరిగే రంజాన్ సంబరాల కోసం కుమారున్ని వీపున మోస్తూ పట్టణానికి చేరుకుంది. ఆమె మాట్లాడుతూ భిక్షమెత్తుకొని కడుపు నింపకుంటున్నానని, ఏటా జరిగే రంజాన్ సంబరాలకు కుమారుడితో కలిసి సిరుగుప్పకు వస్తుంటానని పేర్కొంది. -
ఏదీ.. మానవత్వం..!
‘ప్రతి ఇంటిలో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తాం.. ఉద్యోగం ఇవ్వని పక్షంలో నిరుద్యోగ భృతి ఇస్తాం’ అని గత ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు హామీలు ఇచ్చారు... ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించారు.. ఎందుకంటే.. సాక్షాత్తు సీఎంకే ఓ వికలాంగుడు తన పరిస్థితి వివరించినా ఉద్యోగం రాలేదు.. తనకు ఉద్యోగం ఇచ్చి జీవనాధారం కల్పించాలని అతను వేడుకుంటున్నారు. సాక్షి, కడప : అతన్ని చూడగానే ఎవరికైనా పాపం అనిపిస్తుంది. ఎందుకంటే అతనికి పుట్టుక తర్వాత మూడు నెలలకే అమ్మవారు పోసి కనుచూపు దూరమైంది. మూడు నెలల క్రితం ప్రమాదం రూపంలో కాలిని దెబ్బతీసింది. కట్టె లేనిదే ముందుకు కదల్లేడు. మనిషి సాయం లేనిదే అడుగు వేయలేడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు అతన్ని చూసినా జాలి చూపిస్తారు. కానీ కడప కలెక్టరేట్ చుట్టూ 25 సార్లకు పైగా ప్రదక్షిణలు చేశాడు. పెద్ద దేవున్ని మొక్కితే న్యాయం జరుగుతుందని అమరావతి వెళ్లి సీఎంను కలిశాడు. అదిగో ఇదిగో అంటూ కాలాయాపన జరుగుతుందే తప్ప ఆ దివ్యాంగుడి వేదన ఆలకించేవారు కనిపించడం లేదు. ఒకరోజు కాదు.. రెండు రోజులు కాదు.. రెండేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నాడు పక్కీరుగాండ్ల శివ. కడప నగరంలోని బాలాజీనగర్‌లో నివాసముంటున్న పి.శివ అనే యువకుడు 2016 డిసెంబరులో బ్యాక్లాగ్ పోస్టుల కింద అటెండర్ ఉద్యోగానికి దరఖాస్తు చేశాడు. తర్వాత 2017 మార్చి నుంచి పోస్టు కోసమై తిరుగుతూనే ఉన్నాడు. శివకు తల్లిదండ్రులు లేరు. అండగా నిలబడేవారు లేరు. బతుకు దెరువుకోసం కడప నెహ్రూ పార్కు సమీపంలోని ఆయుర్వేద సంస్థలో పని చేస్తూ నెలకు రూ. 5 వేలు సంపాదించుకునే వాడు. అయితే విధి వక్రీకరించడంతో మార్చి 9న ప్రమాదం జరగడం, కాలికి ఆరోగ్యశ్రీ కింద రాడ్డు వేసి ఆపరేషన్ చేశారు. దీంతో చిరుద్యోగం కూడా దూరం కావడంతో తీవ్ర వేదనతో అల్లాడిపోతున్నాడు. ఉద్యోగం పక్కన పెడితే..సమాచారమూ కరువే.. శివ ఉద్యోగానికి దరఖాస్తు చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు తిరుగుతూనే ఉన్నా.. ఒక్కరంటే ఒక్కరు కూడా పట్టించుకోలేదు. శివకు తోడు మరో స్నేహితురాలైన అంధురాలు గంగమ్మను వెంట బెట్టుకుని కలెక్టరేట్‌కు వస్తున్నా.. అధికారులను కలుస్తున్నా ఎవరూ స్పష్టంగా సమాచారం ఇవ్వడం లేదు. ఇప్పటికే వికలాంగుల సంక్షేమ శాఖతోపాటు కలెక్టరేట్ కార్యాలయాలకు, మీకోసం కార్యక్రమానికి 25 సార్లకు పైగా తిరిగినా స్పందన లేదు. కనీసం ఉద్యోగం సంగతి పక్కన పెడితే.. దరఖాస్తుకు సంబంధించి ఏమైంది? అని చెప్పే నాథుడు కూడా లేడని ఆవేదన వ్యక్తం చేశాడు. బాలాజీనగర్ నుంచి ఆటోలో కలెక్టరేట్‌కు చేరుకోవడం.. అక్కడ ఎవరినో ఒకరిని అడుగుతూ కట్టె సాయంతో అధికారులను కలుస్తూ అగచాట్లు పడుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో అతనితోపాటు మరో అంధురాలు కూర్చొని దరఖాస్తుకు సమాచారం తెలియక అవస్థలు పడుతున్న నేపథ్యంలో గమనించిన ‘సాక్షి’ ఏఓ వెంకటరమణ వద్దకు తీసుకెళ్లి మాట్లాడించగా... దరఖాస్తు నంబరు, ఆధార్‌కార్డు ఆధారంగా పరిశీలించిన వారు ఉద్యోగ విషయంలో ఏమీ చెప్పలేదు. తర్వాత ఖాళీల భర్తీ సమయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సీఎంకు విన్నవించినా.. ఉద్యోగం కోసం పట్టువదలని విక్రమార్కుడిలా శివ అన్ని చోట్ల తిరుగుతూనే ఉన్నాడు. చివరకు అమరావతి వెళ్లి సీఎం చంద్రబాబును కూడా కలిసి ఉద్యోగ విషయమై గోడు వెళ్లబోసుకున్నాడు. తర్వాత కాలంలో కూడా ఇక్కడ రాత్రి బయలుదేరడం.. అక్కడ ఉదయాన్నే సీఎం కార్యాలయానికి వెళ్లగా.. ఆయన లేకపోవడంతో నాలుగు సార్లు పీఏలకు దరఖాస్తు ఫారాలు ఇచ్చి వచ్చామని ‘సాక్షి’కి వివరించారు. అయితే కలెక్టరేట్‌కు పంపిస్తామని.. అక్కడికి వెళితే న్యాయం చేస్తారని సీఎం ఆఫీసులో చెప్పడంతో ప్రతిసారి వెనక్కి వచ్చి ఇక్కడ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాడు. పదో తరగతి వరకు చదువుకున్న అతను పూర్తిగా అంధుడు కావడంతో అడుగు కూడా పక్కకు వేయలేని పరిస్థితి నెలకొంది. మానవతా దృక్పథంతో కలెక్టర్ కరుణిస్తే.. బ్యాక్లాగ్ పోస్టుల కోసం దరఖాస్తు చేసి రెండేళ్లుగా తిరుగుతూనే ఉన్న శివకు మానవతా దృక్పథంతో ఏదో ఒక చోట.. కనీసం ఏదో ఒక ఔట్సోర్సింగ్ ఉద్యోగం అవకాశం కల్పిస్తే ఒక జీవితాన్ని నిలబెట్టినట్లు అవుతుంది. ఎందుకంటే అతనికి కనిపించక.. కాళ్లు సహకరించక పోయినా అధికారులపై నమ్మకంతో చాలా సార్లు అగచాట్లు పడుతున్నా.. తిరుగుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కలెక్టర్ కొంతైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఏదో ఒక ఉద్యోగం కల్పిస్తే బాగుంటుంది. ఎందుకంటే జీవనాధారం లేక అగచాట్లు పడుతున్న శివ పరిస్థితిని అర్థం చేసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
కరువైన ఆసరా..!
పేరు ఎస్బీ సుబ్బారావు. వయసు 37ఏళ్లు. 90శాతం వికలత్వం ఉంది. మైదుకూరులోని నంద్యాల రోడ్డులో నివసిస్తున్నారు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. డిగ్రీ వరకు చదివారు. ఆర్థికంగా ఎదగడానికి పేదరికం, వైకల్యం అడ్డుగోడగా నిలిచింది. అయినా నిరుత్సాహ పడలేదు. ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తున్నారు. జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖలో మూడు చక్రాల మోటార్ వాహనానికి దరఖాస్తు చేశారు. ఇంతవరకు మంజూరు కాలేదు. కార్యాలయం చుట్టూ అధికారులు తిప్పుకుంటున్నారు. ఈ వాహనం వస్తే తిరగడానికి అవకాశం ఉంటుందని, ప్రభుత్వం మాత్రం స్పందిం చడం లేదని సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక్క సుబ్బారావు వ్యథ మాత్రమే కాదు.. జిల్లా వ్యాప్తంగా 226 మంది దివ్యాంగుల సమస్య. వీరి గురించి పాలకులు మాత్రం పట్టించుకోవడం లేదు.. సాక్షి, కడప : అన్నీ సక్రమంగా ఉండి అగచాట్లు పడేవారు కొందరైతే... అవయవ లోపంతో పుట్టిన వారు మరికొందరు. వారికి అందించే ప్రతిఫ లాల విషయంలోనూ ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టం గా కనబడుతోంది. దివ్యాంగులన్న దయ కూడా లేకుండా నెలల తరబడి తిప్పుకుంటుండడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ ముందుకు వెళుతుందేతప్ప ఆచరణలో అంతా అయోమయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంతా ఆన్లైన్ అంటూ ఇప్పటికే దరఖాస్తులుకూడా స్వీకరించి నెలలు గడుస్తున్నా..వాహనాలు అందించడంలో మాత్రం తాత్సారం జరుగుతోంది. ఎప్పుడిస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దరఖాస్తులకు తొమ్మిది నెలలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయిన తర్వాత మేలుకుంది. ఇటీవల దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలు స్కూటీ తరహాలో అందించాలని నిర్ణయించింది, 2017 సెప్టెంబరులో దరఖాస్తుల స్వీకరణకు అవకాశం వచ్చింది. అందుకు సంబంధించి సెప్టెంబరు 15 నుంచి అక్టోబరు 16 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దరఖాస్తులు స్వీకరించారు. మూడు చక్రాల వాహనాలకు దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతి ఉత్తీర్ణులై 40 సంవత్సరాలలోపు వయస్సు కలిగి ఉండాలి. స్వయం ఉపాధి పొందుతుండాలని నిబంధనలు పెట్టింది. అన్ని అర్హతలు ఉన్న వారు నెల రోజుల వ్యవధిలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే దాదాపు తొమ్మిదినెలలు అవుతున్నా ఇంతవరకు అతీగతీ లేదు.జిల్లాలో దాదాపు 226 మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాకు 60 మంజూరైనట్లు తెలుస్తున్నా వాటిని అందించేందుకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు. కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు మూడు చక్రాల వాహనాల కోసం దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులు సంక్షేమ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 2017–19కు సంబంధించి దరఖాస్తు చేసుకున్న వారు కలెక్టరేట్లోని కార్యాలయానికి వచ్చి ప్రతిరోజు అగుతూనే ఉన్నారు. అంతేకాకుండా 2018–19 ఆర్థిక సంవత్సరం కూడా ప్రారంభమైన నేపథ్యంలో మళ్లీ ఈ ఏడాదికి సంబంధించి కూడా మూడు చక్రాల వాహనాల మంజూరు ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంది. కొంతమందికే అవకాశం జిల్లాలో దివ్యాంగులకు సంబంధించి కేవలం 60 వాహనాలు మాత్రమే మంజూరు కావడంతో ఎవరికి వస్తుందో..ఎవరికి రాదో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులన్నీ అధికారులు ఇక్కడి నుంచి ఉన్నతాధికారులకు పంపించారు. క్రమపద్ధతినే ఇస్తారో.. లేక ఇతర ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తారో తెలియక ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నుంచిఆదేశాలు రాగానే అందజేస్తాం! జిల్లాలోని దివ్యాంగుల దరఖాస్తులను ఆన్లైన్లో అప్లోడ్ చేశాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే మూడుచక్రాల వాహనాలు అందజేసేందుకు చర్యలు తీసుకుంటాం. కానీ ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. త్వరలో వస్తే అందుకు అనుగుణంగా పంపిణీకి చర్యలు చేపడతాం. – వాణి, అసిస్టెంట్ డైరెక్టర్, వికలాంగుల సంక్షేమశాఖ, కడప. -
వేధింపులకు వికలాంగుడు బలి
అచ్చంపేట (పెదకూరపాడు): కోళ్లు దొంగిలించాడంటూ ఓ దివ్యాంగుడిపై అక్రమ కేసు బనాయించి గత 15 రోజులుగా రోజూ స్టేషన్‌కు పిలిపించి వేధించడంతో అవమానం భరించలేక ఆ అభాగ్యుడు ఉరేసుకున్నాడు. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం కొండూరులో ఈ ఘటన జరిగింది. బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. కొండూరుకు చెందిన దివ్యాంగుడు చొప్పరపు బాలయ్య (27)పై గ్రామానికి చెందిన సర్పంచ్ వర్గీయులు పులి తిరుపతిరాజు, పులి గురవరావు, వీరరాజు అనే వ్యక్తులు తమకు చెందిన 10 కోళ్లను దొంగిలించాడంటూ 15 రోజుల క్రితం అచ్చంపేట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఎస్ఐ కేసు నమోదు చేయకుండా రోజూ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపుతున్నారు. గ్రామంలోనే పరిష్కరించుకోవాలని సూచించడంతో.. 10 కోళ్లు దొంగిలించినందుకు బాలయ్య రూ.లక్ష చెల్లించాలని పంచాయితీలో పెద్దలు తీర్పు ఇచ్చారు. దీంతో బాలయ్య తీవ్ర మనస్తాపం చెంది శుక్రవారం ఉదయం 6 గంటలకు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాలయ్య మృతికి సర్పంచ్, అతని వర్గీయులు, అచ్చంపేట ఎస్ఐ కిరణ్ కారణమంటూ భార్య నాగమ్మ, అక్క అంకాళమ్మ, వదిన శివరావమ్మ ఆరోపిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేత కావటి మనోహరనాయుడు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. -
శభాష్... శివలాల్
సాక్షి, హైదరాబాద్: అతని ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం చిన్నబోయింది. కష్టపడేతత్వం ఉండాలే గానీ... ఎన్ని సమస్యలొచ్చినా ఎదురీదొచ్చని నిరూపించాడు అతడు. రాష్ట్రంలో 300 మంది మరుగుజ్జులు ఉండగా, వారిలో డిగ్రీ చేసిన మొట్టమొదటి వ్యక్తిగా ఘనత సాధించారు గట్టిపల్లి శివలాల్(35). జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన శివలాల్ బీకామ్ పూర్తిచేసి, పీజీడీసీఏ చేశాడు. ప్రస్తుతం బంజారాహిల్స్ రోడ్ నెంబర్.1లోని డెక్కన్ ట్రయల్స్ సంస్థలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. మెట్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన శివలాల్... తన కాళ్లపై తాను నిలబడాలనే ఉద్దేశంతో నగరానికొచ్చి ఉద్యోగంలో చేరాడు. సంస్థ ఎండీ ప్రోత్సాహం, సహోద్యోగుల సహకారంతో ఆయన 12 ఏళ్లుగా ఇక్కడే పని చేస్తున్నాడు. శివలాల్.. చిన్మయి అనే మరుగుజ్జు అమ్మాయినే వివాహమాడాడు. వీరికి ఒక బాబు ఉన్నాడు. ఎంతో కష్టపడి కుటుంబాన్ని పోషిస్తున్న శివలాల్‌కు సొంతిల్లు కూడా లేదు. బంజారాహిల్స్‌రోడ్ నెంబర్.11లోని ఉదయ్‌నగర్‌లో అద్దె ఇంట్లో జీవనం కొనసాగిస్తున్నాడు. తమలాంటి వారిని ప్రభుత్వం ఆదుకోవాలని, ఏదైనా ఉపాధి కల్పించడంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని శివలాల్ వేడుకుంటున్నాడు. నడుచుకుంటూ ఆఫీస్‌కు.. ఇంటికి సమీపంలోనే కార్యాలయం ఉండటంతో శివలాల్ రోజూ నడుచుకుంటూనే వెళ్తుంటాడు. దారి పొడవునా తనను చాలా మంది వింతగా చూస్తుంటారని, అవేమీ తాను పట్టించుకోనన్నారు. అయితే ఆఫీస్‌లో సహోద్యోగులంతా తనకెంతో ధైర్యాన్ని ఇస్తారన్నాడు. టైప్ నేర్చుకునేప్పుడు పొట్టివేళ్లు పనికిరావని తిట్టిన నిర్వాహకులకు నిమిషానికి 80–100 పదాలు కొట్టి సవాల్ విసిరాడు. గుండె ధైర్యంతో అన్నింటినీ జయిస్తున్న శివలాల్ ఎక్కడా సిగ్గుపడకుండా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నాడు. -
అ‘త్త’మ్మ
అమ్మతనం కోసం పరితపించిన దివ్యాంగురాలు ఒకరు. ఆమె కల నెరవేరిందని సంతోష పడే అత్త మరొకరు. వారిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. అత్త అనే పదానికే సరికొత్త అర్థాన్ని తీసుకొచ్చారు. గయ్యాళి పేరును తుడిచేసి.. అ‘త్త’మ్మ అని చాటిచెబుతున్నారు. వారే పుత్తూరుకు చెందిన కోడలు రాజాలియోనా.. అత్త శోభారాణి. ఆ ఇద్దరూ మహిళా లోకానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సాక్షి, తిరుపతి: ‘నా పేరు పల్లం రాజాలియోనా. నేను పుట్టింది శ్రీకాళహస్తిలో. పోలియో కారణంగా రెండు కాళ్లూ చచ్చుబడ్డాయి. అమ్మ కృపావరమ్మ మెడికల్ ఫీల్డ్‌లో పనిచేస్తోంది. నాన్న రాజు సినిమా థియేటర్లో పనిచేస్తున్నాడు. అమ్మ వృత్తిరీత్యా ఇంటి వద్ద ఉండే అవకాశమే లేదు. కాళ్లు పనిచేయకపోయినా ఆత్మస్తైర్యాన్ని కోల్పోవద్దని చెప్పేది. ఆ సమయంలో అన్నీ నాయనమ్మ వైలెటమ్మే చూసుకునేది. నాకు కాళ్లు లేవని ప్రేమగా ఆదరించేది. ఎనిమిదో తరగతి వరకు శ్రీకాళహస్తిలోనే చదువుకున్నా. నాయనమ్మ ఆరోగ్యం క్షీణించింది. తప్పని పరిస్థితుల్లో నన్ను పుత్తూరులో ఉన్న అమ్మమ్మ పరంజోతమ్మ వద్దకు చేర్చారు. అప్పటి నుంచి అమ్మమ్మే నాకు అన్నీ. తొమ్మిది, పదో తరగతి పుత్తూరులోనే చదువుకున్నా. వికలాంగురాలిని కావడంతో మైసూరులో జేఎస్ఎస్ మహా విద్యాపీఠంలో డిప్లొమో, కంప్యూటర్ సైన్స్ పూర్తిచేశాను. పుత్తూరులో ఉద్యోగం దొరక్క 2005లో చెన్నైకి వెళ్లా. వర్కింగ్ హాస్టల్లో ఉంటూ ఎస్బీఐ కాల్సెంటర్లో 2010 వరకు పని చేశా. ఆ సమయంలో ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన పెయింటర్ దీపక్‌కుమార్ ఆన్లైన్ ద్వారా పరిచమయ్యారు. అతనికి ఒక కాలు సరిగా పనిచేయదు. తల్లిదండ్రుల సమక్షంలో వివాహం జరిగింది. ఇద్దరం చెన్నైలోనే ఇల్లు అద్దెకు తీసుకుని ఉండేవాళ్లం. కొన్నాళ్లకు భర్తకు కూడా తనతో పాటే ఎస్బీఐ కాల్సెంటర్లో పనిదొరికింది. భర్త నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు’. ప్రాణాలు పోయినా బిడ్డ కావాలనుకున్నా.. నేను చాలా మొండిదాన్ని. చిన్నప్పటి నుంచి నాకు పట్టుదల ఎక్కువ. నాకు కాళ్లు పనిచేయకపోయినా ఇంట్లో ఎవ్వరూ నన్ను తక్కువ చేసి చూసేవారు కాదు. తన జీవితం ఇంతటితోనే అంతమైపోవాలా? అని ఆలోచించేదాన్ని. అమ్మా అనిపించుకోవాలనే కోరిక బలంగా ఉండేది. తనలా కాకుండా పుట్టే పిల్లలను మంచి చదువులు చదివించి ప్రయోజకుల్ని చేయాలని నిర్ణయించుకున్నా. వివాహం అయ్యాక డాక్టర్ని కలిశాం. గర్భం దాల్చితే తల్లి ప్రాణానికే ప్రమాదం అని హెచ్చరించారు. ప్రాణం పోయినా పర్వాలేదని పిల్లలు కావాలని నిర్ణయించుకున్నా. గర్భం దాల్చిన తర్వాత చెన్నైలో ఉండడం మంచిది కాదని పుత్తూరుకు వచ్చేశాం. పుత్తూరు మున్సిపాలిటీలో ఉద్యోగం కోసం ప్రయత్నించా. కాంట్రాక్టు పద్ధతిన ఉద్యోగం ఇస్తామని చెప్పారు. నాకు కాదు భర్త దీపక్‌కు ఇస్తామని చెప్పారు. తరువాత ఆయన ఉద్యోగం నాకు ఇప్పించాడు. ప్రస్తుతం పుత్తూరు మున్సిపాలిటీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నా. భర్త ఆటో నడుపుతున్నాడు. పండంటి పాపకు జన్మనిచ్చా పురిటినొప్పులతో తిరుపతిలో తిరుపతిలో ఆసుపత్రులన్నీ తిరిగినా డాక్టర్లు బిడ్డను బతికిస్తాము, తల్లి గురించి చెప్పలేమని చెప్పారు. ప్రాణం పోయినా పర్వాలేదు బిడ్డకావాలని పట్టుబట్టా. భర్త ఒప్పుకోలేదు. తమిళనాడులోని వేలూరు సీఎంసీకి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు నా పరిస్థితిని చూసి తిట్టారు. ‘శరీరంలో ఎముకలు కూడా సరిగాలేవు. నీ ఆరోగ్యం ఏమిటి.. గర్భం దాల్చటం ఏంటమ్మా’ అన్నారు. దేవుడిచ్చిన వరం అమ్మతనం. నా ప్రాణం పోయినా పర్వాలేదు. బిడ్డ కావాలి సార్’ అని అన్నాను. డాక్టర్ నా మాటలు విని చలించిపోయారు. అతికష్టమ్మీద పండంటిపాప పుట్టింది. నా పరిస్థితి సీరియస్ అయ్యింది. రెండు రోజులు స్పృహలో లేను. నేను బతకనేమో అనుకున్నారంతా. డాక్టర్ దేవుడిలా నా ప్రాణాలు కాపాడారు. నేను కళ్లు తెరవడంతో డాక్టర్ కూడా సంతోషపడ్డారు. అమ్మనయ్యాను అని తెలిసి సంబరపడ్డాను. అత్తమ్మే అన్నీ నా భర్త దీపక్ అమ్మ శోభారాణి. ప్రస్తుతం అన్నీ తానై చూసుకుంటోంది. చిన్న బిడ్డలా సపర్యలు చేస్తోంది. పాప ఆలనా, పాలనా అన్నీ తనే చూసుకుంటుంది. వంట చేయడం, పాపకు, నాకు స్నానం చేయించడం, బాత్రూముకి తీసుకెళ్లడం అన్నీ అత్తమ్మే. అత్తాకోడళ్లకు పడకుండా కొట్టుకుంటున్న సంఘటనలు ఉన్నాయి. అయితే మేము అందుకు విరుద్ధం. నాకు, నా బిడ్డకు అత్తమ్మే అమ్మ. నన్ను అత్తమ్మ చూసుకున్నట్లు మా అమ్మ కూడా చూసుకోలేదు. ఆమె నాకు అమ్మకంటే ఎక్కువ. ఆమెకు జీవితాంతం రుణపడి ఉంటాను. అదేవిధంగా భర్త కూడా. ఇంట్లో భర్త, అత్తమ్మ, ఆఫీసులో తోటి ఉద్యోగులు ఎంతో ఆప్యాయంగా చూసుకుంటారు. నేను వికలాంగురాలిని అనే ఆలోచనే రాకుండా చూసుకుంటున్నారు. మానవత్వం బతికే ఉందనటానికి నా చుట్టూ ఉన్న వాళ్లే నిదర్శనం అని పల్లం రాజాలియోనా స్పష్టం చేశారు. -
మంచంపై కలెక్టరేట్‌కు..
నల్లగొండ: తిప్పర్తి మండలం జంగారెడ్డిగూడానికి చెందిన కొత్త రమేష్‌గౌడ్ తాటిచెట్టుపై నుంచి కింద పడడంతో రెండు కాళ్లు విరిగాయి. దీంతో భార్యే కుటుంబానికి పెద్ద దిక్కు అయ్యింది. తనకున్న మూడెకరాల భూమి పక్కన ఉన్న పొలం రైతు మరో బోరు వేశాడు. దీంతో తన బోరు వట్టిపోయి పొలం ఎండిపోయింది. దీనికి ఆర్థికభారం తోడుకావడంతో తిప్పర్తి అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేదని రమేష్ తెలిపాడు. దీంతో లక్ష్మి తన భర్తను మంచంపై పడుకోబెట్టి ముగ్గురు కూతుళ్లతో కలిసి సోమవారం కలెక్టరేట్‌కు తీసుకువచ్చింది. న్యాయం చేయాలని డీఆర్ఓ కీమ్యానాయక్కు వినతిపత్రం అందజేసింది. – కంది భజరంగ్‌ప్రసాద్, సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నల్లగొండ -
నోటి గీత..మార్చింది రాత
ఆడపిల్ల అంటే ఆధారపడేదని ఎందుకు అనుకోవాలి? వైకల్యం ఉన్నంత మాత్రాన ఎవరో ఒకరి ఆసరా తీసుకోవాల్సిందేనని ఎందుకు భావించాలి? అని ప్రశ్నిస్తుంది శ్రీలేఖ. తన ప్రశ్నలకు తానే సమాధానం.. అంతేనా? మరెందరినో లక్ష్యం వైపు నడిపించే మోటివేషనల్ స్పీకర్. వైకల్యాన్ని జయించి, వైవిధ్యభరితమైన కళలకు ప్రాణం పోస్తున్న ఈ అమ్మాయి ‘అందరితో ఉందాం.. ఆధారపడకుండా ఉందాం’ అంటోంది. సాక్షి, సిటీబ్యూరో: కుంచె నోటితో పట్టుకొని కాన్వాస్‌పై చిత్రాలు గీస్తున్న చందానగర్ నివాసి మందలపల్లి శ్రీలేఖను చూస్తే మన కళ్లు ఆశ్చర్యంతో ఆమెనే చూస్తాయి. పుట్టుకతోనే కాళ్లు, చేతులు పనిచేయకపోయినా తనలోని ప్రతిభ, ఆత్మవిశ్వాసాలనే అవయవాలుగా మలచుకొని... తాను కదలలేకపోయినా ఎందరినో కదిలించే చిత్రాలు గీస్తోంది. ‘మనిషి తలచుకుంటే ఏమైనా సాధించొచ్చు. జీవితమంటే ఎంతో ఉందని తెలుసుకున్నాను. తెలుసుకున్నది నలుగురికి తెలియజేయడమే ఇప్పుడు నా పని’ అంటున్న ఈ యువతి నోటితో కళాత్మక అపురూపాలు ఆవిష్కరిస్తున్న తీరు... విధిపై ఆమె సాధించిన విజయాల ‘చిత్రం’. ‘సాక్షి.. నేను శక్తి’ శీర్షికతో శ్రీలేఖ పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే... పుట్టుకతోనేపరీక్ష... పాకడం, తప్పటడుగులు వేయడం, పరుగెత్తడం ఇలాంటివేవీ చిన్నప్పుడు నాకు తెలీదు. నాకు కండరాల క్షీణత వ్యాధి. శరీరం పెరుగుదల, కండరాల్లో పట్టుండదు. కీళ్లు పనిచేయవు. దేహం గాలి ఊదిన బెలూన్లా ఉంటుందని... పుట్టుకతోనే నేను జీవితకాల వైకల్య బాధితురాలని వైద్యులు తేల్చారు. అయితే ‘ఇలాంటి జబ్బున్న పిల్లల్లో మెదడు ఎదుగుదల ఉండదు. కానీ అదృష్టవశాత్తు మీ అమ్మాయికి మెదడు బాగానే పనిచేస్తుంద’ని మా అమ్మానాన్నకు చెప్పారు. ఇక నా తల్లిదండ్రులు చేతనైన చికిత్సలన్నీ చేయించినా ఎలాంటి మార్పు రాలేదు. కూర్చోవడం, పడుకోవడం, తినిపిస్తే తినడం తప్ప మరేమీ చేయలేని నన్ను కంటికిరెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. మిగతా ఇద్దరు పిల్లల్లానే చదివించారు. నన్ను ఎత్తుకొని స్కూల్‌కి తీసుకెళ్లి బెంచిమీద కూర్చోబెట్టి వెళ్లేది అమ్మ. మళ్లీ మధ్యాహ్నం వచ్చి అన్నం తినిపించి, టాయ్‌లెట్‌కి తీసుకెళ్లి బట్టలు శుభ్రం చేసి, స్కూల్ టైమ్ అయ్యేంత వరకు ఉండి... తిరిగి ఇంటికి తీసుకెళ్లేది. ఇలాగే నానాయాతన పడుతూ డిగ్రీ వరకు చదివించారు. పట్టుదలతో ఫస్ట్‌క్లాస్... ‘చలనం లేని శరీరానికి చదువులెందుకని’ కొందరు... ‘ఏం సాధించాలని?’ అని మరికొందరు ఎద్దేవా చేశారు. ఆ మాటలు నాలో మరింత పట్టుదలను పెంచాయి. కుడి చెయ్యి ఒక్కటి లేపి పుస్తకం మీద పెడితే రెండువేళ్లతో అతి కష్టంగా, చాలా మెల్లగా రాసేదాన్ని. ఆ రాత కోసం రాత్రి పగళ్లు సాధన చేసి నేర్చుకున్నాను. పరీక్ష మూడు గంటల సమయముంటే.. టీచర్లు, లెక్చరర్లు నాకోసం మరో అరగంట అదనంగా కేటాయించేవారు. ప్రతి తరగతిలోనూ ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యాను. డిగ్రీలో 70శాతం మార్కులు సాధించాను. ఉపాధి సృష్టి బీకామ్ పూర్తయ్యాక ఉద్యోగం చేద్దామంటే.. ‘95 శాతం వైకల్యం. ఒకరి అండ లేకుండా కదలలేని వ్యక్తికి ఉద్యోగం ఎలా ఇస్తాం?’ అని ప్రశ్నించారు. ఉద్యోగం పేరుతో ఒకరిని అడిగే కన్నా.. ప్రతిభకు సానబెట్టి మనమే ఏదో ఉద్యోగం ఎందుకు సృష్టించుకోకూడదు? అని ఆలోచించాను. చిన్నప్పటి నుంచి అమ్మ చీరల మీద ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేస్తుంటే... చూస్తూ కొంచెం నేర్చుకున్నాను. దాన్నే ఆధారం చేసుకోవాలనుకున్నాను. అయితే బరువైన బ్రష్‌లు చెయ్యితో పట్టుకోవడం కుదిరేది కాదు. బ్రష్ తీసి చేతిలో పెట్టినా జారిపోయేది. దీంతో నోటితో పట్టుకున్నాను. ‘నువ్వేం వేయగలవు. చాలా కష్టం’ అని నా పంతం తెలిసిన అన్నయ్య నన్ను మరింత రెచ్చగొట్టేవాడు. నోటితో అన్ని రకాల స్ట్రోక్స్ ఇవ్వడం అసాధ్యమని, క్లాస్ తీసుకోలేనని చెప్పారు టీచర్. ఒక్క అవకాశం ఇవ్వమని వేడుకున్నాను. సార్ చెప్పినట్టు పెయింటింగ్ వేసి చూపించాను. అలా రోజు ఐదారు గంటలు పెయింటింగ్ ఎగ్జిబిషన్స్‌లో పాల్గొంటున్నాను. అంతర్జాతీయ ఫుట్ అండ్ మౌత్ ఆర్టిస్ట్‌ల కాంటెస్ట్‌కి పెయింటింగ్స్ పంపాను. ఈ మధ్యే ఇంటి దగ్గర చిన్నపిల్లలకు పెయింటింగ్ క్లాస్‌లు కూడా తీసుకుంటున్నాను. అయితే ఇది ఆదాయం కోసం కాదు... నాకు వచ్చిన కళ మరికొందరికి నేర్పడానికి మాత్రమే. వీల్‌చైర్ మీద కూర్చున్నా.. వీలైనంత మందిని మార్చాలని ఉంది. అందుకే మోటివేషన్ క్లాసెస్. -
వైకల్యానికి నేస్తం.. ఆమె ఆత్మవిశ్వాసం..
జూబ్లీహిల్స్: వైకల్యంతో బాధపడేవారిని చూసి కొందరు ‘అయ్యో పాపం’ అని జాలి చూపిస్తారు. మరి కొందరు తోచిన సాయం చేస్తారు. ఓ రోజు సాయం చేసినందుకే ఎంతో ఆనందపడిపోతాం.. కానీ అలాంటివారి బతుకుకు భరోసా ఇచ్చేవారు చాలా కొద్దిమందే ఉంటారు. ఈ కోవకు చెందినవారే సామాజికవేత్త, సోషల్ ఎంటర్ప్రెన్యూర్ మీరా షెనాయ్. వికలాంగులకు కొద్దిపాటి శిక్షణ ఇచ్చి వారి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్నారు. ఇతరుల్లా వారూ కుటుంబానికి ఆసరాగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. ఆత్మవిశ్వాసంతో బతిలేలా జీవితాలను మారుస్తున్నారు. ఇందుకోసం మీరా సమాజంతో ఓ యుద్ధమే చేశారు. వారి జీవితాల్లో వెలుగు నింపాలని.. మన దేశంలో సుమారుగా 2 కోట్ల మంది వివిధ రకాల శారీరక వైకల్యం, అంధత్వంతో బాధపడుతున్నారని ఓ అంచనా. వారిలో కేవలం 0.1 శాతం మంది మాత్రమే ఉద్యోగాలు, ఉపాధి పొందుతున్నారు. సరైన అవగాహన, ప్రోత్సాహం లేక చాలా మంది చీకట్లోనే మగ్గిపోవడం బాధాకరం. వీరిలో సాధ్యమైనంతమంది జీవితాల్లో వెలుగులు నింపడానికి మేం పనిచేస్తున్నాం. మా ఈ కృషికి యాక్సిస్ బ్యాంక్ ఫౌండేషన్, నాస్కామ్ ఫౌండేషన్, కాప్ జెమినీ తదితర కంపెనీలు అండగా నిలుస్తున్నాయి. 2020 నాటికి కనీసం లక్ష మందికి శిక్షణ, ఉద్యోగాలు లభించేలా ప్రణాళిక రూపొందించాం. – మీరా షెనాయ్, ‘యూత్ 4 జాబ్స్’ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు అభిరుచి.. సంస్థల అవసరం మేరకు.. మీరా జర్నలిజం చదువుకున్నారు. కార్పొరేట్ రంగంతో సంబంధాలున్నాయి. అంతేగాక ఉమ్మడి రాష్ట్రంలో ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్‌కు సారధ్యం వహించిన అనుభవమూ ఉంది. తన అనుభవాన్ని.. పరిచయాలను వికలాంగులకు చేయూతనిచ్చేందుకు వినియోగిస్తున్నారు. ఇందుకోసం ‘యూత్ 4 జాబ్స్’ సంస్థను ఏర్పాటు చేశారు. వికలాంగులకు ఉపాధి అంశాల్లో శిక్షణనిస్తున్నారు. అంతేకాదు.. తనుకున్న కార్పొరేట్ పరిచయాలతో ఆయా సంస్థల్లో ఉద్యోగాలు పైతం ఇప్పిస్తున్నారు. శారీరక వైకల్యం ఉన్నవారు ఏ స్థితిలో ఉన్నా మీరా దారి చూపిస్తున్నారు. ఇందుకోసం జిల్లాస్థాయి ప్రభుత్వ అ«ధికారుల సాయం సైతం తీసుకుంటున్నారు. అభ్యర్థులు కనీసం 10వ తరగతి పూర్తిచేసి 18 నుంచి 31 ఏళ్ల లోపు వయసుండి 40 శాతం శారీరక వైకల్యం, 50 శాతం మూగ, చెవుడు ఉన్నవారిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నారు. పదో తరగతి కంటే తక్కువ చదువుకున్నవారి కోసం ఇటీవల ప్రత్యేక శిక్షణ బ్యాచ్‌లు ప్రారంభించారు. వీరికి స్పోకెన్ ఇంగ్లిష్, సాఫ్ట్‌స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు వివిధ అంశాలపై రెండు నెలలు శిక్షణ ఉంటుంది. వారికి హాస్టల్, భోజనం వసతి కల్పిస్తారు. శిక్షణ పూర్తి చేసుకొన్నవారికి వివిధ కంపెనీల్లో వారి అభిరుచి, అవసరం బట్టి ఉపాధి చూపుతున్నారు. ఇలా హైదరాబాద్ సెంటర్లో శిక్షణ పొందినవారు గూగుల్, అమెజాన్, వెబైనర్, యాక్సిస్ బ్యాంక్, లైఫ్‌స్టైల్, కేఎఫ్‌సీ, వింద్యా టెక్నాలజీస్, గీతాంజలి జెమ్స్ తదితర కంపెనీల్లో పనిచేస్తున్నారు. వీరికి కనీస ప్రారంభ వేతనం రూ.10 వేలకు తగ్గకుండా ఉంది. సిటీలో మొదలై..ఆపై విస్తరించి.. మీరా షెనాయ్ 2012లో ‘యూత్ 4 జాబ్స్’ సంస్ధను ఏసీ గార్డ్స్‌లో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. దీనికి అనుబంధంగా హాస్టల్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇలా ప్రారంభమైన సంస్థ ప్రస్తుతం 11 రాష్ట్రాల్లో 22 శిక్షణ కేంద్రాలు నిర్వహిస్తోంది. సంస్థ ద్వారా ఇప్పటివరకు దాదాపు 12 వేల మంది వికలాంగులు ఉద్యోగాలు పొందారు. ఇక్కడ సుశిక్షితులైన టీచర్లతో పాటు కార్పొరేట్ ప్రముఖులు, సామాజికవేత్తలు, వివిధ రంగాల్లో నిష్ణాతులు స్వచ్ఛందంగా తరగతులు చెబుతుంటారు. ఈ సంస్థ రాకతో వికలాంగుల జీవితాల్లో కొత్త వెలుగు వచ్చినట్టయింది. నా జీవితమే మారిపోయింది.. మాది వరంగల్. చిన్నప్పుడే పోలియో బారిన పడ్డాను. ఆర్థిక ఇబ్బందులతో ఇంటర్ వరకే చదివాను. యూత్ 4 జాబ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ పొందాను. ప్రస్తుతం వింద్యా టెక్నాలజీస్‌లో కంప్యూటర్ అపరేటర్‌గా పనిచేస్తున్నా. శిక్షణ నా జీవితాన్ని మార్చేసింది. నాలో ఆత్మవిశ్వాసం నింపింది. నాకు ఉపాధి చూపించింది. – అశ్వని, కంప్యూటర్ ఆపరేటర్, వింద్యా టెక్నాలజీస్ భవిష్యత్ పై నమ్మకం పెరిగింది.. మాది లంగర్‌హౌజ్. మాటలు రావు. కనీసం వినబడదు. డిగ్రీ వరకు చదివుకున్నా. స్నేహితుల ద్వారా ఈ సంస్థలో చేరాను. గతంలో నిరాశ నిస్పృహల్లో బతికిన నాకు శిక్షణ పూర్తి పాజిటివ్ శక్తినిచ్చింది. త్వరలో శిక్షణ పూర్తి చేసుకొని మంచి జాబ్ సాధిస్తానని పూర్తి నమ్మకంతో ఉన్నాను. (ఈ వివరాలు సైగలతో చెప్పింది) – కె.ప్రియాంక (మూగ, చెవిటి), లంగర్‌హౌజ్ ప్రఖ్యాత అంతర్జాతీయ పత్రికలు ఫోర్బ్స్, హార్వర్డ్ బిజినెస్ రివ్యూ,స్టాన్ఫోర్డ్ సోషల్ రివ్యూ తదితర జర్నల్స్ యూత్ 4 జాబ్స్ చేస్తున్న సేవలను కొనియాడాయి. మీరా ఆలోచనతో వికలాంగుల జీవితాల్లో వచ్చిన మార్పును ప్రపంచానికి చాటిచెప్పాయి -
దివ్యాంగుల పథకాల అమలుకు కృషి
ఎదులాపురం : దివ్యాంగుల పథకాల అమలుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీషా అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని స్మాట్‌స్కూల్ ఆవరణలో నిర్వహించిన దివ్యాంగుల జిల్లా కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దివ్యాంగుల సంక్షేమానికి పాటు పడుతుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ అమలుకు కృషి చేస్తుందని వివరించారు. సభాధ్యక్షులు లింగాల రాజ సమ్మయ్య మాట్లాడుతూ దివ్యాంగుల హక్కుల పరిరక్షణ చట్టం 2016 అమలు చేయడంలో ప్రభుత్వం చొరవ చూపాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో దివ్యాంగుల ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, నారాయణ, జానీ, దివ్యాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బావునే నగేశ్, ఆకుల సునిల్‌కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ సుకుమార్, సంఘ బాధ్యులు సురేశ్, ప్రమోద్ కుమార్, ఎండీ ఇమ్రాన్, సూర్య, మహిళా విభాగం, మధుకర్, రవీందర్, నానయ్య, సలీం, అమానుల్లఖాన్, శ్రీధర్, సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
వ్యక్తి అదృశ్యం మిస్టరీ వీడేనా?
ఇరగవరం : దివ్యాంగుడైనా ఎవరి మీదా ఆధారపడకుండా సొంతంగా వ్యాపారం చేసుకుంటూ తల్లిదండ్రులను, భార్యను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న వ్యక్తి అదృశ్యమై రెండు నెలలు కావస్తున్నా ఇంతవరకూ ఆచూకీ లభించ లేదు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇరగవరం మండలం రేలంగి గ్రామానికి చెందిన తలాటి రామాంజనేయులు గత సంవత్సరం డిసెంబర్లో అదృశ్యమయ్యాడు. గాలించినా ఫలితం లేకపోవడంతో కుటుంబ సభ్యులు జనవరి 23న ఇరగవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులపై తమకు అనుమానం ఉందని పేర్కొన్నారు. అయినా ఇప్పటివరకూ అనుమానితులను విచారించినా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డ కనిపించకుండా పోయి రెండు నెలలు కావడంతో తల్లిదండ్రులు తలాటి ధనరాజు, కృష్ణవేణి కన్నీటి పర్యంతమవుతున్నారు. తమ బిడ్డ వికలాంగుడైనా సొంతంగా ఫినాయిల్, యాసిడ్ తయారు చేసి షాపులకు విక్రయింగా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తున్నాడని చెప్పారు. రెండు నెలల క్రితం గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని వ్యాపారంలో భాగస్వామిగా చేర్చుకున్నాడని అప్పటినుంచి తమ కుమారుడు ఎంతో కష్టపడి నిర్మించుకున్న వ్యాపారాన్ని వాళ్లు హస్తగతం చేసుకోవాలనే దురుద్దేశంతోనే తమ కుమారుడిని అదృశ్యం చేశారని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. రామాంజనేయులుకు 9 నెలల క్రితం తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం సందికూడి గ్రామానికి చెందిన సురేఖ అనే యువతితో వివాహం జరిగింది. రామాంజనేయులు అదృశ్యమవడంతో ఆమె కన్నీరుమున్నీరవుతోంది. ఈ కేసును త్వరలోనే ఛేదిస్తాం రామాంజనేయులు అదృశ్యంపై కేసును నమోదు చేశాం. తెలిపారు. ఫిర్యాదులో పేర్కొన్న అనుమానితులను కూడా విచారించాం. కాల్ డేటా వివరాలు అందితే నేరస్తులు ఎవరో తెలుస్తుంది. త్వరలోనే కేసును ఛేదిస్తాం. – జి.శ్రీనివాస్, ఎస్సై, ఇరగవరం -
దొంగల్ని చూసి భర్త గుండె ఆగిందని..
చిత్తూరు, మదనపల్లె క్రైం: మదనపల్లెలో శనివారం వేకువజామున అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందా డు. డీఎస్పీ చిదానందరెడ్డి, టూటౌన్ సీఐ సురేష్‌కుమార్, మృతుని కుటుంబ సభ్యుల కథనం మేరకు.. తం బళ్లపల్లె మండలం రేణుమాకులపల్లె పంచాయతీ తిమ్మయ్యగారిపల్లెకు చెందిన నరసింహులు, నరసమ్మ కుమారుడు రామ్‌నాథ్ (30) వికలాంగుడు. ఇతనికి రాజంపేట, గరుగుపల్లె పంచాయతీ ఈడిగపల్లెకు చెం దిన ఏఎన్ఎం లక్ష్మీతో వివాహమైంది. వీరు మదనపల్లె పట్టణం గొల్లపల్లెమిట్టలోని విజయనగర కాలనీలోని సొంత ఇంటిలో ఉంటున్నారు. రామ్‌నాథ్ మల్లికార్జున సర్కిల్లో ఉంటున్న ఓ ఇంజినీర్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అతను శనివారం వేకువజామున మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతుడి భార్యను విచారించారు. దొంగలను చూసి.. తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో తన భర్త బాత్ రూమ్‌కు వెళ్లేందుకు తలుపు తీశారని, ఆ సమయంలో ఐదుగురు ముసుగు దొంగలు ఇంటిలోకి చొరబడ్డారని భార్య లక్ష్మి తెలిపింది. వారిని చూసి తన భర్త గుండె ఆగి చనిపోయాడని పేర్కొంది.తనను చంపుతామని బెదిరించడంతో మిన్నకుండిపోవాల్సి వచ్చిందని తెలిపింది. దొంగలు బీరువా తెరిచి రూ.5 వేల నగదు, భర్త మెడలోని బంగారు చైను, తన మెడలోని మరో బంగారు చైను అపహరించారని వివరించింది. అక్కడి పరిస్థితులను బట్టి ఇది పతకం ప్రకారం జరిగిన హత్య జరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. తెల్లవారే సమయంలో దొంగలు ఇంటిలోకి చొరబడే ప్రసక్తే ఉండదని, అందులోనూ పేదలు ఎక్కువగా ఉంటున్న ఏరియా కావడంతో దొంగలు వచ్చే అవకాశం లేదని పేర్కొన్నారు. అలాగే మృతుడి గొంతుపై కమిలిన గాయాలు ఉన్నాయని పేర్కొ న్నారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి అన్ని కోణాల్లొ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత రామ్‌నాథ్ మృతికి కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. -
దివ్యాంగురాలి ఆత్మహత్యాయత్నం
ఎస్వీఎన్కాలని (గుంటూరు) : తనకు కేటాయిస్తానన్న ఉద్యోగంపై ఉన్నతాధికారులు నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ పొన్నూరు మండల కేంద్రానికి చెందిన ఓ దివ్యాంగురాలు గుంటూరులోని వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ కార్యాల యం ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసు కుని ఆత్మహత్యాయత్నానికి పాల్ప డింది. వివరాలిలా ఉన్నాయి. పొన్నూరుకు చెందిన దివ్యాంగురాలు కె.మాధవికి పుట్టుకతోనే అంగవైకల్యం. అయినా, విధిని ఎదురించి పోరాడి పదో తరగతి, ఇంటర్, పాలిటెక్నిక్ పూర్తి చేసింది. తన వంతుగా దివ్యాంగుల సంక్షేమం కోసం అనేక పోరా టాలు చేసింది. ఇరవై ఏళ్లుగా దివ్యాంగుల పోరాటాల్లో పాల్గొంటూ వస్తోంది. అయితే రిజర్వేషన్ కోటాలో వికలాంగుల సంక్షేమ శాఖ పరిధిలోని వసతి గృహాల్లో ఔట్ సోర్సింగ్ పోస్టులు భర్తీ చేస్తున్న నేపథ్యంలో ఆమె గతేడాది దరఖాస్తు చేసుకుంది. తనకు పోస్టు కేటా యింపు కోసం సదరు కార్యాలయానికి కాళ్లరిగేలా తిరిగింది. అయితే వికలాంగుల సంక్షేమ శాఖ కమిషనర్ నుంచి ఆర్డర్ రావాలనే నెపంతో జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ రఘురామయ్య తనకు పోస్టు కేటాయింపులో తాత్సా రం చేస్తూ వచ్చారు. దీంతో ఆమె గత పది నెలలుగా వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం వద్ద స్వచ్ఛందంగా సేవలను అందిస్తూ వస్తోంది. అయితే, ఆర్నెల్ల క్రితం రిజర్వ్ కోటాలోని పోస్టును వేరే వ్యక్తికి అప్పగించారని, తనకు మాత్రం తీరని అన్యాయం చేశారని బాధితురాలు వాపోయింది. ప్రస్తుత ఏడీ రఘురామయ్య బుధవారంతో ఇన్చార్జి ఏడీ పోస్టు నుంచి వైదొలగనున్నారని, ఆ స్థానంలో కొత్త ఏడీ నియమితులవుతున్నారని ఆమె తెలిపింది. ఈ క్రమంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ చైర్మన్ గోనుగుంట కోటేశ్వరరావు.. ప్రస్తుత ఏడీ రఘురామయ్యకు తన పోస్టు విషయంలో క్లీన్ చిట్ ఇచ్చారని, అయినా ఏడీ మాత్రం తనకు ఇచ్చేం దుకు ససేమిరా అంటున్నారంటూ వాపోయింది. ఈ క్రమంలోనే ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టినట్లు వివరించింది. విషయం తెలుసుకున్న ఏడీ రఘురామయ్య బాధితురాలు మాధవితో ఫోన్లో సంభాషించి బుధవారం ఔట్ సోర్సింగ్ పోస్టు కేటాయింపు ఉత్తర్వులు జారీ చేస్తానని హామీ ఇచ్చారని ఆమె తెలిపింది. విషయం తెలుసుకున్న పట్టాభిపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలికి నచ్చజెప్పి పొన్నూరు పంపించారు. -
ఇది వైకల్యం కాదట
పశ్చిమగోదావరి, ఏలూరు (మెట్రో) : ఈ వ్యక్తి శారీరక వైకల్యం అందరికీ కనిపిస్తుంది. చూసిన ప్రతి ఒక్కరికీ అయ్యో అనిపిస్తుంది. కానీ ఆ వ్యక్తిని పరిశీలించిన వైద్యునికి మాత్రం వైకల్యం కనిపించలేదు. ఫలితంగా ఆ నిర్భాగ్యుడు ప్రభుత్వం నుంచి పొందాల్సిన ప్రయోజనాలను అందుకోలేకపోతున్నాడు. చేసేదిలేక చివరకు జిల్లా కలెక్టరేట్‌కు చేరుకుని కలెక్టర్‌కు తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఏలూరు మస్తానమన్యం కాలనీకి చెందిన బర్లా గొల్ల అనే వ్యక్తి చిన్నప్పుడు ప్రమాదంలో తన ఎడమచేతిని కోల్పోయాడు. అప్పటి నుంచి వికలాంగునిగానే ఉండిపోయాడు. వికలాంగులకు ప్రభుత్వం కల్పించే ప్రయోజనాలు పొందాలంటే ప్రభుత్వ వైద్యులు గుర్తించి సదరం ధ్రువీకరణ పత్రం జారీ చేయాల్సి ఉంది. ఇది జారీ చేసేందుకు ఎన్నిసార్లు వైద్యుల వద్దకు తిరిగినా పట్టించుకోవడం లేదు. ఇటీవల సదరం ధ్రువీకరణ పత్రానికి జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి వెళ్లి దరఖాస్తు చేసుకున్నాడు. గొల్లను పరీక్షించిన వైద్యులు ప్రమాదానికి గురైన చేతిని కదిలించమని చెప్పడంతో ఆ మొండి చేతినే కదిలించాడు. చేయి కదులుతుంది కాబట్టి వికలాంగునిగా ధ్రువీకరణ పత్రం ఇవ్వడం వీలుపడదని సదరు వైద్యుడు తిప్పి పంపించేశారు. దీంతో సోమవారం జిల్లా కలెక్టరేట్‌కు చేరుకుని మీ కోసంలో కలెక్టర్ భాస్కర్‌కు విషయాన్ని వివరించాడు. కలెక్టర్ స్పందించి వైద్యారోగ్యశాభాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ ఏవీఆర్ మోహన్‌తో మాట్లాడి తక్షణమే సదరం ధ్రువీకరణ పత్రం జారీ చేయాలని ఆదేశించారు. -
దివ్యాంగుల కోసం ప్రత్యేక చట్టం: కేంద్ర మంత్రి గెహ్లాట్
సాక్షి, చిక్కడపల్లి(హైదరాబాద్): కేంద్ర సామాజిక న్యాయం శాఖ మంత్రిగా మూడున్నరేళ్లుగా ఆనందంగా పనిచేస్తున్నానని, తన శాఖలో మూడు గిన్నిస్ రికార్డులు రావడం గర్వకారణంగా ఉందని తావర్ చంద్ గెహ్లాట్ అన్నారు. 2014లో మోదీ ప్రభుత్వం వచ్చాక దివ్యాంగుల హక్కుల కోసం ప్రత్యేక చట్టం తెచ్చిందన్నారు. ఇక్కడి త్యాగరాయ గానసభలో వికలాంగుల హక్కుల చట్టం-2016 పై శనివారం జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. 21 కేటగిరీలను చట్టంలోకి తెచ్చిన ఘనత తమదేనని, 3 శాతం ఉన్న రిజర్వేషన్‌ను 4 శాతానికి పెంచామని, కళాశాలల్లో చేరికల కోసం 5 శాతం రిజర్వేషన్‌ను తమ ప్రభుత్వమే మొదలు పెట్టిందని వివరించారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో 6 శాతం రిజర్వేషన్లు ఉన్నాయని, తెలంగాణలో కూడా ఇస్తే సంతోషమని అన్నారు. వికలాంగుల గుర్తింపు కార్డులు జిల్లాస్థాయిలో మాత్రమే కాదు దేశమంతా చెల్లుబాటయ్యేలా త్వరలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం దివ్యాంగుల కోసం ఒక్క స్కూల్ అయినా ప్రారంభించిందా అని నిలదీశారు. 10 లక్షల మంది దివ్యాంగులలో 4 లక్షల మందికి మాత్రమే సర్టిఫికెట్ ఇచ్చారన్నారు. మెట్రో రైలులో వికలాంగులకు ఉచిత ప్రయాణం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వికలాంగులకు కేంద్రం అమలు జరిపే పథకాలపై అవగాహన కల్పిస్తామని, రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడేందుకు త్వరలో వికలాంగుల హక్కుల భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. ఎస్సీ కమిషన్ జాతీయ సభ్యుడు రాములు కూడా పాల్గొన్నారు. -
దివ్యాంగులకు మరిన్ని సదుపాయాలు
సాక్షి, హైదరాబాద్: దివ్యాంగులు, వయోధికుల కోసం దక్షిణ మధ్య రైల్వే మరిన్ని సదుపాయాలను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం రైల్వేస్టేషన్లలో వీల్‌చైర్లే వినియోగంలో ఉన్నాయి. ట్రైన్ దిగిన తరువాత స్టేషన్ బయటకు వెళ్లేందుకు, స్టేషన్ నుంచి ట్రైన్ వద్దకు వెళ్లేందుకు మాత్రమే ఇవి సౌకర్యంగా ఉన్నాయి. ఇక నుంచి నేరుగా ట్రైన్‌లోకి వెళ్లేందుకు వీలైన ఫోల్డింగ్ ర్యాంప్‌ను దివ్యాంగులైన ప్రయాణికుల కోసం వినియోగంలోకి తేనున్నారు. గుంటూరు–వికారాబాద్ పల్నాడు ఎక్స్‌ప్రెస్‌లో మొట్టమొదట ఈ నెల 18 నుంచి ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తేనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్ కుమార్ తెలిపారు. ట్రైన్ డోర్ నుంచి నేరుగా లోపలికి వెళ్లేందుకు, ట్రైన్ లోంచి నేరుగా బయటకు వచ్చేందుకు వీలుగా ఇవి పనిచేస్తాయి. మొదట పల్నాడు ఎక్స్‌ప్రెస్‌లోని థర్డ్ ఏసీ బోగీలో వీటిని వినియోగిస్తారు. ఆ తరువాత దశలవారీగా అన్ని రైళ్లకూ విస్తరించనున్నారు. -
'అందరూ నన్ను వెక్కిరించేవారు'
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వికలాంగుల దినోత్సవం(డిసెంబర్ 3) సందర్భంగా శనివారం నక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో దివ్యాంగుల అభివృద్ధి, సంక్షేమం కోసం అవగాహన సదస్సు, వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హీరో రాజశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ' నేను వికలాంగుడినే.. నాకు నత్తి ఉండేది.. మా నాన్న పేరు సరిగ్గా పలకడం వచ్చేది కాదు. అందరూ హేళన చేసేవారు. అయినా పట్టుదలతో డాక్టర్ అయ్యాను.. ఆ తర్వాత మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాను. మనం అంతా సమానం అనే భావన ఉండాలి. దివ్యాంగులు నిరుత్సాహ పడకుండా పట్టుదలతో ముందుకు వెళ్లాలి. నా జీవితాంతం వికలాంగుల కోసం సహాయ పడుతా' అని తెలిపారు. కాగా ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం మహ్మద్ అలీ, చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేనున్నానంటూ అభయం
చిన్నతనంలో అందరిలానే తానూ పాఠశాలకు వెళ్లి చదువుకోవాలని జీలపాటూరు పంచాయతీ, ఏవీఎస్ నగర్ కాలనీ వాసి కూసరవేడు మణికంఠన్ కలలు కన్నారు. అయితే పోలియో కబళించడంతో పాఠశాలకు వెళ్లాలనే ఆశ అడియాసగా మిగిలింది. తనలా చదువుకు ఎవరూ దూరం కాకూడదని నిశ్చయించుకున్నారు. గ్రామంలో పాఠశాల లేకపోవడం.. వేరే ప్రాంతాల్లోని పాఠశాలలకు పంపాలంటే ప్రమాదాలు జరుగుతాయని భయపడిన తల్లిదండ్రులకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. రోజూ 15 మంది పిల్లలను దాతలకు తనకు సమకూర్చిన మూడు చక్రాల బండిలో రెండున్నర కిలోమీటర్ల దూరంలోని దొడ్లవారిమిట్టలోని పాఠశాలలో దింపుతూ.. తిరిగి తీసుకొస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పెళ్లకూరు: తమిళనాడు రాష్ట్రం పండ్రోటి ప్రాంతానికి చెందిన కొందరు వలస కూలీలు 40 ఏళ్ల క్రితం మండలంలోని జీలపాటూరు పంచాయతీ, ఏవీఎస్ నగర్ కాలనీలో వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ స్థిరపడ్డారు. కాలనీకి చెందిన కూసరవేడు శాంతి, గోపాల్‌కు మూడో సంతానం మణికంఠన్. పుట్టుకతో మణికంఠన్ పోలియో బారిన పడటంతో మంచానికే పరిమితమయ్యారు. చిన్నతనంలో పాఠశాలకు వెళ్లే పరిస్థితి లేదు. దీనికితోడు తల్లిదండ్రులు రోజూ కూలీ పనులకు వెళ్తేనే పూట గడిచే పరిస్థితి. దీంతో చిన్నతనంలో తోటి పిల్లలంతా గంతులేస్తూ పాఠశాలకు వెళుతుంటే చూస్తూ కాలం వెళ్లదీయడం తప్ప అడుగు ముందుకేసి బడి మెట్లు ఎక్కి అ..ఆలు నేర్చుకునే అవకాశం ఈయనకు లభించలేదు. భరోసా ప్రస్తుతం ఏవీఎస్ నగర్లో సుమారు 52 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. కాలనీలో సుమారు 15 మంది బడిఈడు పిల్లలు ఉన్నారు. ఏవీఎస్ నగర్లో పాఠశాల లేకపోవడం, సమీప గ్రామాల్లోని పా ఠశాలలకు పంపాలంటే రోడ్డు మార్గంలో వాహనాల ప్రమాదాలతో భయం.. ప్రైవేట్ పాఠశాలల్లో చదివించే స్తోమత లేక అక్కడి ప్రజలు తమ బిడ్డలను చదివించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో మణికంఠన్ పిల్లల తల్లిదండ్రులకు నేను సైతం అంటూ భరోసా ఇచ్చారు. రోజూ తన మూ డు చక్రాల బండిలో కాలనీలోని 15 మంది పిల్లలను వెంటబెట్టుకొని దొడ్లవారిమిట్ట ప్రభుత్వ పాఠశాలకు జాతీయ రహదారి మార్గంలో జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు. తిరిగి ఇంటికి చేరుకొని తమ శక్తికి తగినట్టు చిన్నపాటి పనులు చేసి కుటుంబసభ్యులకు ఆసరాగా నిలుస్తున్నారు.సాయంత్రం మళ్లీ పాఠశాల వద్దకు చేరుకొని పిల్లలందర్నీ తీసుకొస్తున్నారు. కాలనీలోని పిల్లలను పాఠశాలకు తీసుకెళ్లే సమయంలో అక్కడి ఉపాధ్యాయులు నేర్పిన పదాలు, పాఠాలు, పద్యాలను పిల్లలతో చెప్పించుకొంటూ తానూ నేర్చుకుంటున్నారు. పిల్లలందరూ బాగా చదువుకోవాలి కాలనీలో పాఠశాల సదుపాయం లేదు. ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు వాహనాల రాకపోకలతో పిల్లలకు ప్రమాదం ఉందని తల్లిదండ్రులు భయపడుతున్నారు. కాలనీలోని ప్రజలు వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇక్కడి పిల్లలందరూ బాగా చదువుకొని ప్రయోజకులవ్వాలనే లక్ష్యంతో ఆరేళ్లుగా పాఠశాలకు వెంటబెట్టుకొని తీసుకెళ్తున్నాను. రెండు కాళ్లు పని చేయకపోవడంతో పాఠశాలకు వెళ్లి చదువుకునే అవకాశం లభించలేదు. ఇక్కడి పిల్లలందరూ బాగా చదువుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలి. – మణికంఠన్, ఏవీఎస్ నగర్ -
విభిన్న విద్యావంతులపై వింత ప్రేమ!
ప్రభుత్వం ప్రకటిస్తున్న కొన్ని పథకాలు కేవలం ప్రచారానికే అన్న అనుమానం కలిగిస్తున్నాయి. ఊరించేలా ప్రకటనలు గుప్పించడం.. తర్వాత కఠిన నిబంధనలు విధించడం పరిపాటిగా మారింది. విభిన్న విద్యావంతుల(దివ్యాంగులు)కు మూడు చక్రాల పెట్రోల్ వాహనాలు, బ్యాటరీ వీల్ చైర్స్ అందించే కార్యక్రమం కూడా ఇదే కోవలోకి చేరుతోంది. శ్రీకాకుళం, సీతంపేట: దివ్యాంగులపై ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపిస్తోంది. శారీరక వైకల్యం కలిగిన వారికి మూడు చక్రాల పెట్రోల్ వాహనాలు, బ్యాటరీ సాయంతో నడిచే వీల్ చైర్లను ఉచితంగా అందిస్తామంటూ గత నెల 15న సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిలో దరఖాస్తులు ఆహ్వానించే వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్దుల శాఖ ద్వారా ఈ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దివ్యాంగులు సైతం తమకు వాహనాలు వస్తాయని ఎంతో ఆనందించారు. అయితే నిబంధనలు చూస్తే అవాక్కవ్వడం తప్పదు. వీటిని నిశితంగా పరిశీలిస్తే వాహనాలు ఇవ్వడానికా, లేక ప్రకటనలకేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 2,450 మందికి మూడు చక్రాల మోటార్ వాహనాలు పంపిణీ చేస్తామని ప్రకటించింది. దీని ప్రకారం సగటున జిల్లాకు రెండు వందల వరకు యూనిట్లు మంజూరవుతాయి. వీటిలో పాటు బ్యాటరీతో నడిచే వీల్చైర్లు 175 మంజూరు చేస్తామని ప్రకటించారు. ఇవి కూడా జిల్లాకు 15లోపు వస్తాయి. ఈ నెల 16లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, ఆ పత్రాలను ప్రింట్ అవుట్ తీసి ఈ నెల 23లోపు వయోవృద్ధుల సంక్షేమశాఖ కార్యాలయానికి అందజేయాలని ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో 40 వేల మంది వరకు శారీరక వైకల్యం ఉన్నవారు ఉన్నారని అంచనా. వీరిలో 80 శాతం అర్హులంటే సుమారు 8 వేల వరకు ఉంటారని సమాచారం. వీరిలో పీజీ చేసి స్వయం ఉపాధి యూనిట్లు నిర్వహించే వారు మరింత అరుదుగా ఉంటారు. ఇవేం నిబంధనలు.. మూడు చక్రాల వాహనానికి దరఖాస్తు చేసుకోవాలంటే 80 శాతం వైకల్యంతో పాటు 18– 40 ఏళ్లు లోపు వయస్సు, పోస్టు గ్రాడ్యుయేషన్ చదివి ఉండాలి. లేదంటే పదో తరగతి చదివి, స్వయం ఉపాధిలో మూడేళ్లు అనుభవం ఉండాలి. పీజీ విద్యార్హత సర్టిఫికెట్తో పాటు డ్రైవింగ్ లైసెన్స్, స్వయం ఉపాధి యూనిట్ ఫొటో జత చేయాల్సి ఉంది. బ్యాటరీ వీల్‌చైర్స్‌కు దరఖాస్తు చేసే అభ్యర్థులు పదో తరగతి చదివి ఉండాలనే నిబంధన విధించారు. లైసెన్స్‌లు ఎలా..? సాధారణంగా ఉండే పురుషులు, స్త్రీలు డ్రైవింగ్ లైసెన్స్‌లు పొందేందుకు అష్టకష్టాలు పడుతుంటారు. అలాంటిది దివ్యాంగులకు వాహనాలు నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్స్‌లు తప్పనిసరని పేర్కొనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దివ్యాంగులకు ఇన్వ్యాలిడిటీ వెహికిల్ కింద ఎల్‌ఎల్‌ఆర్‌ను అందించే వీలుంది. దివ్యాంగులు నడపగలిగిన వాహనాన్ని కొనుగోలు చేసి రవాణా శాఖా కార్యాలయంలో సంప్రదిస్తే అక్కడ నిబంధనలు పాటిస్తే ఎల్‌ఎల్‌ఆర్‌ను జారీ చేస్తారు. వాహనాలు కొనుగోలు చేసే స్థోమత ఉన్న వారే లైసెన్స్‌లకు వెళ్తారని, అలాంటప్పుడు ముందస్తు డ్రైవింగ్ లైసెన్స్ అడగడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇవీ అర్హతలు... ⇒ పెట్రోల్స్కూటర్లు/బ్యాటరీ వాహనా లు పొందాలంటే 80 శాతం వికలాంగత్వం ఉండాలి.సదరం వైద్య ధ్రువపత్రం ఉండాలి. ⇒ 18–40 ఏళ్ల వయస్సు కలిగినవారు. ⇒ పీజీ/ప్రొఫెషనల్ కోర్సులను ప్రస్తుతం అభ్యసిస్తున్న విద్యార్థులు గానీ, కనీసం పదోతరగతి ఉత్తీర్ణులై ఉండి, మూడేళ్ల వ్యాపార అనుభవం ఉన్నవారు. ⇒ ప్రభుత్వం ఆర్థోపెడిక్ సివిల్ సర్జెన్ ఇచ్చిన మెడికల్ ఫిట్నెస్ ధ్రువపత్రంతో పాటు నోఅబ్జెక్షన్ ఫర్ డ్రైవింగ్ ధ్రువపత్రం సమర్పించాలి. ⇒ మోటార్ వాహన చట్టం ప్రకారం లైసెన్స్ కలిగి ఉండాలి ⇒ మూడు చక్రాల కుర్చీకోసం వైద్యనిపుణుడి ధ్రువీకరణ పొందాలి. దివ్యాంగులకు ఇన్ని నిబంధనలా? దివ్యాంగులకు ఇన్ని నిబంధనలు విధించడం తగదు. ప్రభుత్వం పెట్టిన నిబంధనలు పరిశీలిస్తే ఏ ఒక్కరికీ యూనిట్లు మంజూరయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ వాహనాలకు దరఖాస్తు చేయడానికి కేవలం ఐదు రోజులు మాత్రమే గడువు ఉంది. ఇప్పటికైనా నిబంధనలు సడలించి అర్హులందరీకి పెట్రోల్ వాహనాలు మంజూరు చేయాలి. –విశ్వాసరాయి కళావతి, పాలకొండ ఎమ్మెల్యే -
అతను అంధుడు.. ఆమె చెవిటి.. ఒకరికొకరు
ఆయన అంధుడు. ఆమె బధిర (చెవిటి, మూగ). అతనికి కనిపించదు. ఆమెకు వినిపించదు..మాట్లాడలేదు. అయితేనేం వారు ఒకరికొకరు బాగా అర్థం చేసుకోగలరు. ఇద్దరూ చక్కగా సంసారం చేసుకుంటూనే వ్యాపారంలో కూడా రాణిస్తున్నారు. ఎవరిపైనా ఆధారపడకుండా తమ భవిష్యత్‌కు బాటలు వేసుకుంటున్నారు. అన్నీ సవ్యంగా ఉండి ఏమీ చేయలేని ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు.- సాక్షి, అనంతపూర్ ఆయన పేరు మహమ్మద్ వలి, ఆమె పేరు తాహీరాబేగం. వీరి స్వగ్రామం గుంతకల్లు. చిన్నతనంలోనే తీవ్రమైన జ్వరం, అమ్మవారు పోయడంతో మహమ్మద్ వలి కంటిచూపు కోల్పోయాడు. పదేళ్ల వయస్సులో తండ్రీ దూరమయ్యాడు. దీంతో తల్లి హలీమా ఇళ్లలో పనులు చేసుకుంటూ మహమ్మద్ వలి పెంచి పెద్ద చేసింది. నాలుగేళ్ల క్రితం ఆమె కూడా కన్నుమూసింది. దీంతో బతుకుదెరువు కోసం నేర్చుకున్న హర్మోనియమే మహమ్మద్ వలికి అన్నం పెట్టింది. నాటకాల ట్రూప్, ఖవ్వాలి ప్రోగ్రామ్‌లలో హార్మోనియం వాయిస్తూ జీవనం సాగించాడు. ఈ క్రమంలోనే బధిర (మూగ, చెవుడు) యువతి తాహీరాబేగంతో పరిచయం ఏర్పడింది. అదికాస్త ఇష్టంగా మారడంతో దీంతో వీరిద్దరికీ పెళ్లి చేసి ఒకటి చేశారు. తాహీరా తన కళ్లతో వలికి ప్రపంచాన్ని చూపుతుండగా...వలి తన భార్యకు అన్నీ తానై ముందుకు నడిపిస్తున్నాడు. వీరి ఆన్యోన్య దాంపత్యానికి ప్రతిరూపంగా ఒక బాబు కూడా పుట్టాడు. ♦ ఉపాధిలేక... ఇల్లు గడవక వలికి చూపు లేకపోయినా హార్మోనియంను కళ్లుగా చేసుకొని అందరినీ ఆకర్షించేవాడు. ఖవ్వాలి, పౌరాణిక నాటక ప్రదర్శనల ద్వారా నెలకు రూ.2 లేదా 3 వేలు దాకా ఆర్జిస్తుండేవాడు. పెళ్లి తర్వాత ఖర్చులు పెరిగాయి. హార్మోనియానికి పిలుపు కరువైంది. నెలకు వచ్చే రూ.2 వేలు, ప్రభుత్వ పింఛనుతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. ఆదాయం తక్కువ..ఖర్చులు ఎక్కువ కావడంతో కుటుంబ పోషణ భారమైంది. దిక్కు తోచని స్థితిలో మహమ్మద్ వలి ప్రతి శుక్రవారం మసీదుల వద్ద భిక్షాటన చేసేవాడు. ♦ ఆర్థిక చేయూత నిచ్చిన మీడియా సంస్థ ఈ దంపతుల దీనగాథ తెలుసుకున్న ఓ మీడియా సంస్థ మానవతా దృక్ఫథంతో స్పందించింది. ఆర్థిక సహాయం అందజేసి వలి, తాహీరాబేగం దంపతులతో పట్టణంలోని 60 అడుగులరోడ్డులో సుధాకర్‌రెడ్డి కోళ్లపారం సమీపాన పేపర్ ప్లేట్లు, డిస్పోజబుల్ గ్లాసులు దుకాణాన్ని ఏర్పాటు చేయించింది. ♦ వ్యాపారంలోనూ తోడూనీడగా.. తాహీరాబేగం, మహమ్మద్ వలిలు చేతి సవ్వడిల ద్వారా ఒకరికొకరు భావాలను పంచుకుంటూ ఈ వ్యాపారాన్ని చక్కగా సాగిస్తున్నారు. వినియోగదారుడు వస్తే ఆర్డర్ తీసుకునే వలి... చేతి సవ్వడిల ద్వారా భార్య తాహిరాబేగానికి తెలుపుతాడు. ఆమె సరుకు అందజేసి డబ్బులు తీసుకుంటుంది. ఈ తరహా వ్యాపారం చేసేవారు పట్టణంలో అధికంగా ఉండటంతో వలి షాప్‌నకు గిరాకీ తక్కువగానే ఉంటోంది. మొత్తమ్మీద విధిని ఎదురించి ధైర్యంగా ముందుకు వెళ్తున్న ఈ దంపతులు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. -
ట్రైసైకిల్ అదుపుతప్పి దివ్యాంగుడు..
ధర్మవరం రూరల్: ధర్మవరం మండలం రేగాటిపల్లి వద్ద సోమవారం ట్రైసైకిల్ అదుపు తప్పి కనగానపల్లి మండలం చంద్రాశ్చర్ల గ్రామానికి చెందిన దివ్యాంగుడు నాగభూషణం(50) మృతి చెందాడు. పోలీసులు, బంధువుల సమాచారం మేరకు... నాగభూషణం స్వగ్రామం నుంచి ధర్మవరానికి ట్రై సైకిల్లో వస్తుండగా రేగాటిపల్లి వద్ద అదుపు తప్పి బోల్తా పడ్డాడు. ఫెడల్ బలంగా తగలడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. రూరల్ ఎస్ఐ యతీంద్ర ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
వికలాంగ బ్యాక్లాగ్ టీచర్ పోస్టుల భర్తీ
అనంతపురం ఎడ్యుకేషన్: 2008, 2012 డీఎస్సీల్లో మిగిలిపోయిన వికలాంగ అభ్యర్థుల బ్యాక్లాగ్ టీచర్ పోస్టుల భర్తీకి శనివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. స్థానిక కేఎస్ఆర్ బాలికల పాఠశాలలో జిల్లా విద్యాశాఖ అధికారి పగడాల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ జరిగింది. 2014 డీఎస్సీలో అర్హత సాధించిన అభ్యర్థులతో ఈ పోస్టులు భర్తీ చేశారు. మొత్తం 18 పోస్టులు భర్తీకి చర్యలు తీసుకున్నారు. వీటిలో ఎస్జీటీ తెలుగు 11, ఎల్పీటీ 4, ఎల్‌పీహెచ్ 2, ఎల్పీ ఉర్దూ ఒకపోస్టు ఉన్నాయి. -
వికలాంగురాలిపై సామూహిక అత్యాచారం
అడవిదేవులపల్లి (మిర్యాలగూడ): నల్లగొండ జిల్లాలో సోమవారం ఓ వికలాంగురాలిపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అడవిదేవుల పల్లి మండలం చాంప్లాతండా హమ్‌తండాలో ఇటీవల దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని నిర్మించారు. ఆదివారం రాత్రి కోలాట ప్రదర్శన జరిగింది. దీనిని చూసేందుకు పక్కనే ఉన్న గోన్యా తండాకు చెందిన వికలాంగురాలు (40) వెళ్లింది. ఈ క్రమంలో ఆమె చెట్ల పొదల మాటుకు బహిర్భూమికి వెళ్లింది. అడవిదేవులపల్లికి చెందిన గొడుగు సతీశ్, గొడుగు హనుమయ్య, బిల్లకంటి మహేశ్‌లు ఆమెను అనుసరించారు. ఆ వికలాంగురాలిని బలవంతంగా చేలోకి తీసుకువెళ్లి సామూహిక లైంగికదాడి జరిపారు. అభాగ్యురాలిని అక్కడే వదిలేసి తిరిగి కోలాట ప్రదర్శన వద్దకు వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన బాధితురాలు కేకలు వేస్తూ కోలాటం వద్దకు వచ్చి జరిగిన విషయాన్ని రోదిస్తూ బంధువులకు తెలిపింది. అక్కడే ఉన్న గొడుగు సతీశ్‌ను గుర్తించి చూపించడంతో గిరిజనులు అతడిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. -
బాలికపై అత్యాచారయత్నం
పగిడ్యాల: ముచ్చుమర్రి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పడమర ప్రాతకోట గ్రామంలో 14 ఏళ్ల దివ్యాంగ బాలికపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామంలో ఓ ఆర్ఎంపీ వద్ద ఓ యువకుడు శిక్షణ పొందుతున్నాడు. గురువారం సాయంత్రం ఇదే గ్రామానికి చెందిన దివ్యాంగ బాలికను క్లీనిక్‌లో కసువు కొట్టడానికి పిలిచి అత్యాచారయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ఈ విషయం బాలిక శుక్రవారం కుటుంబీకులకు చెప్పడంతో వెలుగులోకి వచ్చింది. క్లీనిక్‌లో జరిగిన సంఘటనపై ఆర్ఎంపీని విలేకరులు ప్రశ్నించగా అలాంటేదేమి జరుగలేదన్నారు. అయితే బాధిత బాలిక మాత్రం తనపై రెండు పర్యాయాలు బలాత్కారానికి పాల్పడ్డాడని విలేకరులకు చెబుతోంది. ఈ విషయమై ముచ్చుమర్రి ఎస్ఐ బాలనరసింహులును వివరణ కోరగా ఇంత వరకు తమ దృష్టికి రాలేదని, బాధితురాలు ఫిర్యాదు చేస్తే చట్టపరంగా కేసు నమోదు చేసి బాలికకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. -
‘కాటమరాయుడు’పై దివ్యాంగుల ఆగ్రహం
- చర్యలు తీసుకుంటామన్న డైరెక్టర్ బి.శైలజ హైదరాబాద్: దివ్యాంగుల మనోభావాలను కించపరిచినా, ప్రయత్నించినా.. అటువంటి వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ బి.శైలజ హెచ్చరించారు. సోమవారం జోగులాంబ జిల్లాకు చెందిన పలువురు దివ్యాంగులు వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్‌ను కలిసి ‘కాటమరాయుడు’ సినిమాలో వికలాంగులను కించపరిచేలా వ్యాఖ్యలు ఉన్నాయని, వాటిని వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందచేశారు. స్పందించిన డైరెక్టర్ శైలజ ‘కాటమరాయుడు’ సినిమా డైరెక్టర్‌ను విచారించి నోటీసులు పంపుతామని హామీ ఇచ్చారు. కాటమరాయుడు సినిమా చూసి వివరాలు తనకు తెలియచేయాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. అనంతరం దివ్యాంగుల సేవా సంఘం అధ్యక్షుడు చంటి మాట్లాడుతూ.. వెంటనే కాటమరాయుడు సినిమా నిలిపివేయాలని, దివ్యాంగులపై చేసిన అనుచిత వ్యాఖ్యల చిత్రీకరణను తొలగించాలని, సినిమా యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం అందచేసిన వారిలో దివ్యాంగుల సేవా సంఘం ఉపాధ్యక్షుడు కె.జయంతుడు, కార్యదర్శి నాగరాజు, పలువురు దివ్యాంగులు ఉన్నారు. -
దివ్యాంగులకు సేవ చేయడం అదృష్టం
– కర్నూలు డయాసిస్ బిషప్ పూల ఆంథోని అయ్యలూరుమెట్ట (నంద్యాలరూరల్): దివ్యాంగులకు సమాజంలో వారికి గౌరవ స్థానం కల్పించడం అదృష్టంగా భావించాలని కర్నూలు డయాసిస్ బిషప్ మోస్ట్ రైట్ రెవరెండ్ పూల ఆంథోని అన్నారు. అయ్యలూరు మెట్ట నవజీవన్ బధిరుల పాఠశాల వార్షికోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బిషప్ పూల ఆంథోని మాట్లాడుతూ ఏసుప్రభువు చూపిన ప్రేమ, దయ, కరుణతో 39 సంవత్సరాలు విచారణ గురువుగా సేవలు అందిస్తున్న ఫాదర్ మర్రెడ్డి సేవలు మరువలేనివన్నారు. పెద్దకొట్టాలలో శారీరక వికలాంగుల ఆశ్రమం, గోపవరం వద్ద మానసిక వికలాంగుల ఆశ్రమం, అయ్యలూరు మెట్ట వద్ద మూగ, చెవిటి పిల్లల ప్రత్యేక పాఠశాలను నెలకొల్పి వికలాంగులకు వసతితో పాటు విద్యను అందించడం దేవుడు ఆయనకు ఇచ్చిన గొప్పవరం అన్నారు. జేఎంజే సంస్థ పర్య అధినేత సిస్టర్ సెలీనా ఆలాపాట్ కూడా దైవ కన్యగా నిలుస్తూ 50 సంవత్సరాలుగా దైవ మార్గంలో విద్యార్థులకు, సేవలు అందించడం అభినందనీయమన్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకొని సేవాదృక్పథం పెంచుకోవాలని సూచించారు. అనంతరం బిషప్ పూల ఆంథోని, సిస్టర్ సెలీనా ఆలాపాట్, ఫాదర్ మర్రెడ్డిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో హైదరాబాద్ సిస్టర్ రాజమ్మ, పెద్దకొట్టాల ఆర్సీఎం చర్చి విచారణ గురువు ఏర్వ జోజిరెడ్డి, ప్యారీస్ క్రీస్ ఫాదర్ సురేష్, నవజీవన్ డీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ నారపురెడ్డి, ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ పద్మావతమ్మ, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం రాజశేఖర్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు: పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా నవజీవన్ విద్యార్థుల నాటికలు, సాంస్కృతిక ప్రదర్శనలు, కోలాటం నృత్యం, చెక్కభజన, ఆహుతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఏసుప్రభువు జీవిత ఘట్టం, గ్లోరిగ్లోరి దేవుని మహిమ గీతం, ప్రేమసింధు, పరమాత్మ నీవనే అనుక్రమ గీతం, అల్లేలూయ గీతాలకు బధిర విద్యార్థుల ప్రదర్శన శభాష్ అనిపిచింది. ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. -
మూడో రోజూ కరుణించని సీఎం!
రైలు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయినా వికలాంగ పింఛన్‌కు నోచుకోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన వికలాంగుడు నారాయణ ముఖ్యమంత్రికి తన గోడు వెల్లబోసుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నాడు. మూడు చక్రాల సైకిల్‌పై ఇక్కడకు చేరుకున్న అతను శుక్రవారం రాత్రి సీఎం ఇంటి ఎదురుగా నిద్రించాడు. సీఎంను కలవడానికి శనివారం విఫలయత్నం చేశాడు. ఆదివారం సాయంత్రం వరకు ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద నిరీక్షించినా ఫలితం లేకపోయింది. సోమవారం ఉదయం సచివాలయానికి వస్తారని పోలీసులు చెప్పడంతో రాత్రికి రాత్రి ట్రైసైకిల్‌పై వెలగపూడి సచివాలయానికి చేరుకున్నాడు. ఎప్పుడు తెల్లవారుతుందా అని అక్కడే నిరీక్షిస్తున్నాడు. సోమవారమైనా నారాయణకు సీఎంను కలిసే అవకాశం దొరుకుతుందో లేదో పాపం. ఇంతకీ ఇతని సమస్య ఏమిటంటే వికలాంగ పింఛన్, కిరాణా కొట్టు పెట్టుకోవడానికి రుణం. – తుళ్లూరు -
రేపు మెగా జాబ్‌మేళా
హిందూపురం రూరల్ : స్థానిక ఎంజీఎం పాఠశాలలో శుక్రవారం దివ్యాంగుల మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు డీఆర్డీఏ జాబ్ కోఆర్డినేటర్ లక్ష్మిదేవి తెలిపారు. మేళాను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. పదోతరగతి ఉత్తీర్ణులైన, ఆపైన చదివిన వారు అర్హులన్నారు. అదేవిధంగా 18 నుంచి 32 ఏళ్ల లోపు వయసు ఉండాలి. శారీరక వికలాంగులు (ఆర్థోపెడిక్), బధిరులు (డెఫ్ అండ్ డంబ్), పార్షిక అంధులందరికీ ఈ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు ఉచితంగా బ్యుటీషియన్, కాల్‌సెంటర్, ట్యాలీ, కంప్యూటర్ ఆపరేటర్, రీటైల్, హోటల్ మేనేజ్మెంట్, మొబైల్ సర్వీసింగ్‌తో పాటు స్పోకెన్ ఇంగ్లిషు, పర్సనాలిటీ డెవలప్మెంట్లో శిక్షణ కల్పిస్తామన్నారు. జాబ్‌మేళాకు హాజరయ్యే దివ్యాంగులు విద్యార్హత సర్టిఫికెట్లు, వికలాంగుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు వెంట తీసుకురావాలన్నారు. -
మేమూ దేశభక్తులమే.. నిలబడేదెలా?
దేశభక్తికి కొలమానమేది? జనగణమన.. అంటూ వినిపించగానే లేచి నిలబడ్డమేనా? మరి అటువంటప్పుడు దివ్యాంగుల పరిస్థితి ఏంటి? వారు లేచి నిలబడలేరు కదా..? అలాంటప్పుడు వారిని ‘దేశద్రోహుల్లా’ ఎందుకు చూస్తున్నారు? ఎక్కడ.. అంటారా? అయితే చదవండి... సినిమా థియేటర్లలో చిత్రం ప్రారంభానికి ముందు జాతీయగీతాన్ని ప్రసారం చేయాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని థియేటర్లలో జనగణమన..ను ప్రసారం చేస్తున్నారు. జాతీయగీతం ప్రసారమవుతున్న సమయంలో థియేటర్లలోని జనాలంతా దేశభక్తిని చాటుతూ లేచి నిలబడుతున్నారు కూడా. ఇక్కడివరకు అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడే దివ్యాంగులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఎదురుగా జనగణమన.. వినిపిస్తున్నా.. గుండెల్లో దేశభక్తి ఉప్పొంగుతున్నా.. లేచి నిలబడలేని పరిస్థితి వారిది. అలా నిల్చోలేనివారిని మిగతా జనాలంతా వింతగా, దేశద్రోహుల్లాగా చూస్తున్నారట. దీంతో తమ గోడును వెల్లబోసుకునేందుకు మహారాష్ట్రలో దివ్యాంగులు పోరాటానికే దిగారు. సమస్య ఎక్కడంటే.. జాతీయ గీతాలాపనకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. థియేటర్లలో జనగణమన.. ప్రసారమవుతున్న సమయంలో అందరూ లేచి నిలబడాలని పేర్కొంది. అయితే మార్గదర్శకాల్లో దివ్యాంగులకు మినహాయింపునిస్తున్నట్లు పేర్కొనలేదు. దీంతో లేచి నిలబడలేని దివ్యాంగులు సినిమా హాల్లో అనేకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఆనాలోచిత మార్గదర్శకాలకు వ్యతిరేకంగా పోరాటానికి దిగారు. ⇔ దివ్యాంగుల అశక్తతపై ప్రేక్షకులకు అవగాహన కలిగించేలా థియేటర్లలో బోర్డులు ఏర్పాటు చేయాలి. ⇔ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్లో దివ్యాంగుల విషయాన్ని ప్రస్తావించాలి. ⇔ బదిరులు జాతీయ గీతాన్ని వినలేరు కాబట్టి.. సబ్ టైటిల్స్ వేసేలా చర్యలు తీసుకోవాలి. ⇔ దివ్యాంగులను కించపర్చేవారిపై కఠిన చర్యలు తీసుకునేలా నిబంధల్లో మార్పులు చేయాలి. –సాక్షి, స్కూల్ ఎడిషన్ -
ఆదరాభిమానాల్లో ‘లక్ష్మీపుత్రుడు’
దివ్యాంగుడికి శుభాకాంక్షలు తెలిపిన ఐటీడీఏ పీఓ డా.లక్ష్మీ షా పార్వతీపురం: ఆయన ఓ ఐఏఎస్ అధికారి. ఆయన చుట్టూ ఎప్పుడూ అధికారులు, సిబ్బంది, రాజకీయ నాయకులు తిరుగుతుంటారు. ప్రత్యేక సందర్భాలు, పండగలు వచ్చాయంటే క్షణం తీరిక లేకుండా ఆయనకు అందరూ శుభాకాంక్షలు చెప్పేందుకు పోటీ పడతారు. ‘ఇతరులలోని లోపాలను వెతికే వారు ఎవ్వరినీ ప్రేమించలేరు’. అన్న సూక్తిని స్ఫూర్తిగా తీసుకున్న ఆ ఐఏఎస్ అధికారి దివ్యాంగుడైన ఓ వ్యక్తిపై ప్రేమాభిమానాలు చూపించి దగ్గరికి వెళ్లి పూలు, పళ్లు ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివారం నూతన సంవత్సరం సందర్భంగా పార్వతీపురం ఐటీడీఏ పీఓ డాక్టర్ లక్ష్మీషాకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు అందరూ పళ్లు, పుష్పగుచ్ఛాలు, డైరీలతో వచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే అందరితో పాటు వచ్చిన (ఉపాధి కార్యాలయ ఉద్యోగి) దివ్యాంగుడైన భాస్కరరావు అధికారికి శుభాకాంక్షలు చెప్పే అవకాశం తనకు వస్తుందో రాదోనని బితుకుబితుకుమంటూ దూరంగా నిల్చున్నాడు. ఈ విషయాన్ని గమనించిన పీఓ లక్ష్మీషా తానే స్వయంగా పుష్పగుచ్ఛం, పళ్లు పట్టుకుని దివ్యాంగుడైన భాస్కరరావు దగ్గరకు వెళ్లి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యాలయంలో అందరూ శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం పీఓ లక్ష్మీషా స్థానిక ‘జట్టు’ ఆశ్రమానికి వెళ్లి అక్కడి పిల్లలకు పళ్లు, పువ్వులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అక్కడి పిల్లలతో పీఓ మాట్లాడుతూ ఏ అవసరమొచ్చినా తాను అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. -
నార్కెట్‌పల్లిలో దారుణం
నార్కెట్‌పల్లి: అంగవైకల్యంతో బాధపడుతున్న యువతి అగ్నికి ఆహుతయింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం మాండ్ర గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా ఇళ్లు మొత్తం మంటలు వ్యాపించడంతో.. అందులో ఉన్న వికలాంగురాలు బోసు సుజాత(16) బయటకు రాలేక మంటలకు ఆహుతై మృతిచెందింది. -
వైకల్యాన్ని జయించాడు
అందరిలాగే బాల్యంలో ఆడుతూపాడుతూ పెరిగాడు. ఐదు సంవత్సరాల వయసులో అమ్మనాన్నతో కలిసి విహారయాత్ర ముగించుకుని ఇంటికి వస్తుండగా వాహనం రోడ్డు ప్రమాదానికి గురయింది. ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. కాస్త కోలుకోవడానికి నెలలు పట్టింది. విధి వైకల్యాన్ని ప్రసాదించినా అతడు కుంగిపోలేదు. తనకంటూ ఓ ప్రత్యేకత కోసం పాటుపడ్డాడు. సంకల్పానికి ఏదీ అడ్డురాదంటూ నిరూపించాడు. కరాటే, క్రికెట్ పోటీల్లో రాణిస్తూ అంతర్జాతీయ స్థాయికి ఎదిగి ఎన్నో పథకాలు, సర్టిఫికెట్లు, ప్రశంసలు పొంది పలువురి ప్రశంసలు పొందుతున్నాడు. అతడే రామచంద్ర. హిందూపురం పరిధిలోని కిరికెర పంచాయతీలో సిరికల్చర్ కాలనీకి చెందిన లక్ష్మీదేవి, వెంకటరమణల కుమారుడు రామచంద్ర. తల్లి కూలి పనికి వెళ్తుండగా, తండ్రి ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. బాల్యంలో ప్రమాదానికి గురయ్యాడు. దీంతో తల ఒక వైపునకు ఒంగి, నడవడానికి, కూర్చోవడానికి వీలుకాని పరిస్థితి ఏర్పడింది. కరాటే నేర్చుకుంటే అవయవాలపై పట్టు సాధించవచ్చని వైద్యులు సలహా ఇచ్చారు. దీంతో శరీరం సహకరించకపోయినా అతడు కరాటేలో శిక్షణ తీసుకున్నాడు. అలాగే క్రికెట్లో సైతం ప్రవేశం పొందాడు. 10వ తరగతి వరకు చదివి ఆర్థిక పరిస్థితులు, వైకల్యంతో ఉన్నత చదువులకు వెళ్లలేకపోయాడు. 1999 నుంచి కరాటే, క్రికెట్‌పై దృష్టి సారించాడు. మెలకువలు తెలుసుకుని పట్టు సాధించాడు. ప్రస్తుతం కరాటేలో బ్లాక్ బెల్ట్ 4వ డాన్‌గా అంతర్జాతీయ స్థాయికి, క్రికెట్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, వికెట్ కీపర్‌గా ఆల్‌రౌండ్ ప్రతిభ సాధించి జాతీయస్థాయికి ఎదిగాడు. ఇప్పటి వరకు 100కి Sపైగా పతకాలు, సర్టిఫికెట్లు సొంతం చేసుకున్నాడు. 14 సార్లు కరాటేలో నేషనల్ స్థాయిలో గోల్డ్‌మెడల్స్‌ను సాధించాడు. ప్రస్తుతం జిల్లా వికలాంగుల క్రికెట్ సెలెక్షన్ కమిటీ సభ్యుడిగా, కుంగ్ ఫూ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ప్రతిభ ఉన్న వారిని ప్రభుత్వాలు ప్రోత్సహించాలి ఆరోగ్యం కోసం అభ్యసించిన కరాటే ఆత్మ విశ్వాçÜం పెంచింది. డ్రాగన్ మార్షల్ ఆర్ట్స్ కరాటే అకాడమీ ద్వారా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాను. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగిన వికలాంగుల క్రికెట్, కరాటే పోటీల్లో ఎన్నో పతకాలను, అవార్డులను సొంతం చేసుకున్నప్పటికీ ప్రతిభకు సహకారం లభించడం లేదు. ప్రతిభ ఉన్నవారిని ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ప్రోత్సహించాలి. – రామచంద్ర, డ్రాగన్ మార్షల్ ఆర్ట్స్ కరాటే అకాడమీ వ్యవస్థాపకుడు -
26 నుంచి వికలత్వ నిర్ధారణ పరీక్షలు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలోని వికలాంగులకు ఈనెల 26వ తేదీ నుంచి వికలత్వ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఆర్డీఏ పీడీ మధుసూదన్‌నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. సదరమ్ సర్టిఫికెట్ కాలపరిమితి పూర్తయిన వారు కూడా ఈ పరీక్షలకు హాజరు కావాలని కోరారు. 26న అలంపూర్, గద్వాల నియోజకవర్గాల వారికి, 27న అచ్చంపేట, నాగర్‌కర్నూల్, 28న దేవరకద్ర, మహబూబ్‌నగర్, 29న జడ్చర్ల, షాద్‌నగర్, 30 కోడంగల్, నారాయణపేట్, వచ్చే నెల 1వ తేదీన కల్వకుర్తి, కొల్లాపూర్, 3న వనపర్తి, మఖ్తల్ నియోజకవర్గాల్లో ఉన్న వారు హాజరు కావాలని కోరారు. శారీకర వికలాంగులకు(అంధులు, మూగ, చెవుడు) జిల్లా ఆస్పత్రిలో, మానసిక వికలాంగులుకు ఎస్వీఎస్ ఆస్పత్రిలో వికలత్వ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. హాజరుకాని వారికి మరో అవకాశంగా వచ్చే నెల 4, 5 తేదీల్లో హాజరు కావచ్చని పేర్కొన్నారు. -
విల పింఛెన్
కొవ్వూరు : భద్రత ఐదు రెట్లు అంటూ ప్రచార ఆర్భాటం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తోంది. అర్హత ఉన్నా సామాజిక పింఛన్లు అందక వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు కాళ్లరిగేలా అధికారులు, ప్రజాప్రతి నిధుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రతి సోమవారం మండల స్థాయిలో నిర్వహించే మీకోసం కార్యక్రమాల్లో వచ్చే వినతుల్లో మూడొంతులు పింఛన్లకు సంబంధించే ఉంటున్నాయి. కనిపించిన ప్రతి అధికారికి దరఖాస్తులిస్తూ.. పింఛను ఇప్పించాలని వేలాదిమంది దీనంగా వేడుకుంటున్నా వారిపై చంద్రబాబు సర్కారు కనికరం చూపడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 24 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మీ కోసం కార్యక్రమంలో అందిన దరఖాస్తులను కలిపితే ఆ సంఖ్య 30 వేలకు పైనే ఉంటుందని అంచనా. కొత్త వారికి దక్కని చోటు జిల్లాలో వివిధ సామాజిక పథకాల కింద 3,39,083 మందికి పింఛన్లు ఇస్తున్నట్టు సర్కారు చెబుతోంది. వీరిలో 1,56,827 మంది వృద్ధులు కాగా, 1,06,308 మంది వితంతువులు ఉన్నారు. 44,409 మంది దివ్యాంగులు, 1,977 మంది కల్లుగీత కార్మికులు పింఛన్లు పొందుతుండగా, 26,399 మంది అభయహస్తం పథకం కింద పింఛన్లు ఇస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. మొత్తంగా అన్ని పథకాల కింద పింఛన్లు పొందుతున్న వారిలో 900 నుంచి 1,100 మంది ప్రతినెలా మృత్యువాత పడుతున్నట్టు డీఆర్డీఏ వర్గాలు చెబుతున్నాయి. సగటున నెలకు వెయ్యి మంది పింఛనుదారులు మరణిస్తున్నట్టు అంచనా. మరణించిన వారి స్థానంలో కొత్త వారికి పింఛన్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. జిల్లాలో ఎక్కడా ఆ దాఖలాలు కనిపించడం లేదు. గడచిన ఏడాది కాలంలో మరణించిన వారి స్థానంలో కొత్తగా ఒక్కరికి కూడా పింఛను మంజూరు కాలేదు. పాత పింఛన్లకూ కొర్రీలు కొత్త పింఛన్ల మంజూరు విషయాన్ని పక్కనపెడితే.. ఇప్పటికే పింఛన్లు పొందుతున్న పాత వారికి వివిధ కారణాలతో చెల్లించకుండా ఎగవేస్తున్నారు. వరుసగా మూడు నెలలపాటు పింఛను సొమ్ము తీసుకోకపోతే వారి పేర్లను శాశ్వతంగా తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. మొదట్లో గుర్తింపు కార్డుల ఆధారంగా పింఛను సొమ్ము చెల్లించేవారు. ఆ తరువాత వేలిముద్రలు, కనురెప్పలు (ఐరిస్) ద్వారా అందిస్తున్నారు. వేలిముద్రలు పడనివారు, పొరుగూళ్లకు వెళ్లిన వారు మరుసటి నెలలో అయినా సొమ్ము అందుకునే వీలుండేది. లబ్ధిదారుల్లో కొందరి పేర్లు మాయమవుతున్నాయి. కనురెప్పలు, వేలిముద్రలు పడని వారికి గ్రామాల్లో అయితే వీఆర్వోలు, పట్టణాల్లో అయితే బిల్లు కలెక్టర్ల వేలిముద్ర ద్వారా సొమ్ము ఇచ్చేవారు. తాజాగా, అందులోనూ అక్రమాలు జరుగుతున్నా నెపంతో కొర్రీలు వేస్తున్నారు. ఈ తరహా కేసులు 5 శాతం మించకూడదని సర్కారు ఆంక్షలు విధించగా, అధికారులు మరో అడుగు ముందుకేసి 2 శాతం మించకూడదనే నిబంధన పెట్టారు. ఫలితంగా వేలిముద్రలు, కనురెప్పలు పడని వారిలో చాలామంది సొమ్ము తీసుకోలేక సతమతం అవుతున్నారు. -
నకిలీ వికలాంగుల లీలలు
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో సకలాంగులైన ఉద్యోగులు వికలాంగులుగా అవతారమెత్తారు. వి కలాంగ ఉద్యోగులకు దక్కాల్సిన అ లవెన్సులు ప్రతినెలా నొక్కేస్తున్నారు. దీంతో లక్షలాది రూపాయలు వర్సిటీ ఖజానాకు చిల్లుపడుతోంది. మరోవైపు పీజీ , ‘లా’, పీహెచ్డీ అభ్యసిస్తున్న వికలాంగ విద్యార్థులకు దక్కాల్సిన సౌకర్యాల కోసం ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోయిందని వారు వాపోతున్నారు. అన్ని విశ్వవిద్యాలయాల్లోను మెస్ బిల్లులు పూర్తిగా మినహాయింపు ఉన్నా, వర్సిటీలో అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుదకు వికలాంగ విద్యార్థులకు వస్తున్న ప్రాజెక్ట్‌లు కూడా వారికి దక్కకుండా చేస్తున్నారు. కానీ ప్రతి నెలా వికలాంగుల పేరుతో వర్సిటీ చెల్లిస్తున్న అలవెన్సులు స్వాహా చేస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకొన్న పాపాన పోలేదు. నకిలీ మెడికల్ సర్టిఫికెట్లతో పబ్బం ప్రతి నెలా ఒక్కో ఉద్యోగికి ప్రత్యేక అలవెన్స్ జీతం కాకుండా అదనంగా రూ. 1350 వర్సిటీ చెల్లిస్తుంది. ఈ అలవెన్స్‌ను తీసుకోవడానికి ఆరోగ్య అధికారి నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకరావాల్సి ఉంటుంది. పీహెచ్సీ 60శాతం పైగా ఉంటేనే వీరికి అలవెన్సు తీసుకోవడానికి అర్హత ఉంటుంది. అది కూడా జన్మతా గానీ, ప్రమాదవశాత్తు వికలాంగులై ఉండాలి. అయితే తప్పుడు ధ్రువీకరణ పత్రాలను పొందుపరచి ప్రతినెలా అలవెన్సులు స్వాహా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ యాక్ట్ ప్రకారం పనిచేసే శాశ్వత కార్మికులకు విధి నిర్వహణలో ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్లకు స్వాంతన కలిగించడం కోసం ఈ అలవెన్సులు చెల్లించాలని సూచించింది. కానీ వేలికి స్వల్పపాటి గాయమైనా కూడా పీహెచ్ కోటాలో ఈ విధంగా లబ్ధి పొందడం గమనార్హం. రెండు దశాబ్దాలుగా అక్రమాలు రెండు దశాబ్దాలకుపైగా వికలాంగుల∙కోటాలో అలవెన్సులు తీసుకొంటున్నారని సమాచారం. మొత్తం 26 మంది ఉద్యోగులు వికలాంగ అలవెన్సు తీసుకొంటున్నారు. ఇందులో 12 మంది సకలాంగులు అయినప్పటికీ ప్రత్యేక అలవెన్సు తీసుకోవడం గమనార్హం. ఏ విధమైన వికలాంగత్వం లేకపోయినప్పటికీ వికలాంగులుగా పరిగణించి ధ్రువపత్రాలు ఏవిధంగా ఇచ్చారు. అవి సరైన పత్రాలా? కాదా? అని అధికారులు పరిశీలించిన దాఖలాలు లేవు. -
మంత్రి శిద్దాకు దివ్యాంగుల డెడ్‌లైన్
♦ 48 గంటల్లో సమస్యలు పరిష్కరించకుంటే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిక ♦ 40 శాతంపైన వికలత్వం ఉన్న అందరికీ బస్సు పాసులు ఇవ్వాలని డిమాండ్ ♦ మ్యానిఫెస్టో ప్రకారం ప్రతి దివ్వాంగునికి రూ.1500 పింఛన్ ఇవ్వాల్సిందే ♦ రాజకీయ రిజర్వేషన్లు 7 శాతం ఇవ్వాలి.. లేకుంటే గుణపాఠం తప్పదు ♦ అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు ఒంగోలు : దివ్వాంగుల హక్కులు కాలరాయాలనుకుంటే సహించేది లేదని, 40 శాతం, ఆపైన వికలత్వం ఉన్న ప్రతి ఒక్కరికీ ఆర్టీసీ బస్సు పాసులు జారీ చేయాల్సిందేనని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక అంబేడ్కర్ భవన్లో జిల్లాలోని దివ్యాంగులతో ఆయన సమావేశమయ్యూరు. బస్సు పాసుల వ్యవహారంపై రవాణశాఖ మంత్రి శిద్దా రాఘవరావుకు 48 గంటల డెడ్‌లైన్ ఇస్తున్నామని, ఆ సమయంలోగా ఉత్తర్వులు జారీ చేయకుంటే ఇంటిని ముట్టడించడంతో పాటు అక్కడే తిని, అక్కడే పడుకుంటామని హెచ్చరించారు. చెవిటి, మూగ, అంధుల విషయంలో దొడ్డిదారిన ఆర్టీసీ యాజమాన్యం 100శాతం వికలత్వం ఉంటేనే బస్సు పాసులు జారీ చేస్తామంటూ ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగులకు అంత్యోదయ కార్డులు మంజూరు చేయకుంటే అనంతపురంలో పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ఇంటిని సైతం ముట్టడించడం ఖాయమన్నారు. సదరం సర్టిఫికెట్ వికలత్వాన్ని చూపుతుంటే స్థానికంగా నివాసం ఉండడం లేదంటూ ప్రభుత్వం ఇంటి రుణం మంజూరుకు సైతం ఆంక్షలు పెట్టడం సరికాదన్నారు. సదరం సర్టిఫికెట్ల జారీకి సైతం నిధులు లేవంటూ ప్రభుత్వం చేతులెత్తేయడం దారుణమన్నారు. రాజధాని నిర్మాణం కోసం వేలాది ఎకరాలు సేకరిస్తున్న ముఖ్యమంత్రి వికలాంగుల కార్యాలయం కోసం కనీసం 5 సెంట్ల స్థలం కూడా ఇచ్చేందుకు ముందుకు రావడంలేదని కొల్లి విమర్శించారు. 2 వేల పింఛన్లు కట్ చేసిన జన్మభూమి కమిటీలు రాష్ట్ర అధ్యక్షుడు దూళిపాళ్ల మల్లికార్జునరావు మాట్లాడుతూ 3శాతం రిజర్వేషన్లు అంటున్నా కనీసం బ్యాంకు రుణాలు కూడా మంజూరు కావడం లేదన్నారు. టీడీపీ తన మ్యానిఫెస్టోలో వికలాంగులకు రూ.1500లు పింఛన్ ఇస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చాక 80శాతంపైన వికలత్వం ఉన్న వారికే పింఛన్ ఇస్తామనడం మోసం చేయడమేనన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో జిల్లాలో 2 వేల మందికిపైగా వికలాంగుల పెన్షన్లు రద్దు చేశారని ఆగ్రహించారు. ఆగస్టు 15వ తేదీలోగా సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. రాజధాని నిర్మాణం పేరుతో ఎన్ని దేశాలు తిరిగినా తాము అభ్యంతరం పెట్టమని, కాకుంటే ముందుగా రాష్ట్రంలో ఉన్న వికలాంగుల సమస్యలను పరిష్కరించేందుకు దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండువ వెంకట్రావు, జిల్లా అధ్యక్షుడు వనిపెంట గురవారెడ్డి, అంబటి చవరబాబు, చెన్నుబోయిన సుబ్బారావు, కాలేషా, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మహబూబ్‌బాషా, జిల్లా కార్యదర్శి సోమయ్య, కనిగిరి నియోజకవర్గ కార్యదర్శి వై.మైనర్‌బాబు పాల్గొన్నారు. -
ఈ చిన్నారికి పింఛన్ అందించరూ..!
అధికారులకు తల్లిదండ్రుల వేడుకోలు కడప రూరల్: ఈ చిత్రంలో కనిపిస్తున్న బాలుడి పేరు యెహోషువా(8). త ల్లిదండ్రులు కళావతి, వెంకటేష్. వీరు నిరుపేదలు. కడప నగరం 3వ డివిజన్ లక్ష్మీనగర్‌లోని ఎస్సీ కాలనీలో నివసిస్తున్నారు. కూలి పనులకు వెళితే గానీ పూట గడవని పరిస్థితి. ఇద్దరు సంతానం. వారిలో యెహోషువా పుట్టుకతోనే వికలాంగుడు. రెండు కాళ్లు, రెండు చేతులు, మెడ సచ్చుబడి పోవడంతో మంచానికే పరిమితమయ్యాడు. ఈ చిన్నారికి వంద శాతం వికలత్వం ఉన్నప్పటికీ పింఛన్ అందకపోవడం గమనార్హం. ఎన్నో మార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేదని ఆ బాలుడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. వంద శాతం వికలత్వం ఉంటే నెలకు రూ. 1500 చొప్పున పింఛన్‌ను మంజూరు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ చిన్నారి పరిస్థితి పట్ల అటు పాలకులు, ఇటు అధికారులు ఏ మాత్రం పట్టించుకోకపోవడం దారుణం. జిల్లా వ్యాప్తంగా ఇలా ఎందరో.. జిల్లా వ్యాప్తంగా 20 వేల మందికి పైగా వివిధ కేటగిరిలకు చెందిన అర్హులు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జమ్మలమడుగు, బద్వేలు నియోజకవర్గాల్లోని అర్హులకు మాత్రమే 5 వేలకు పైగా కొత్త పింఛన్లను పంపిణీ చేసింది. మిగిలిన 8 నియోజకవర్గాల్లో 15 వేల మందికి పైగా అర్హులుండగా వారిని పాలకులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇలా యోహోషువా లాంటి చిన్నారులు, ఇతరులు జిల్లా వ్యాప్తంగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఆదుకోండయ్యా... నా బిడ్డకు వంద శాతం వికలత్వం ఉందని డాక్టర్లు చెప్పారు. పింఛన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదు. మేము దళితులం. పేద వారం. మా కోసం కాదు, మా బిడ్డ కోసం పింఛన్ ఇచ్చి ఆదుకోవాలి - కుమారుడి తల్లి కళావతి -
గమ్యానికి 'ఊతం'!!!
మానవ సంబంధాలు కరెన్సీ బంధనాల్లో చిక్కుకుంటున్నారుు. చివరకు మానవత్వం కూడా నోట్ల కట్టల వాసన ఆస్వాదిస్తూ భూగోళానికి దూరంగా పారిపోతోంది. ..ఆప్యాయత.. అనురాగం.. మమకారాలు బ్యాంకు లాకర్లలో శాశ్వతంగా నిద్రపోవడానికి సిద్ధమవుతున్నారుు. దీనికి ఎన్నో ఉదాహరణలు నిత్యం సమాజంలో కనిపిస్తూనే ఉన్నారుు. అరుుతే అక్కడక్కడా.. అప్పుడప్పుడూ తోక చుక్కల్లా.. ఇంద్రధనసుల్లా స్వచ్ఛమైన ప్రేమ.. రుచికరమైన వెనీలా ఫ్లేవర్‌ను కురిపిస్తూనే ఉంది. శ్రీరామ్మూర్తి అనే వికలాంగుడు ఎక్కడ నుంచో ఎన్నో ఏళ్ల క్రితం ఒంగోలుకు చేరుకున్నాడు. అరుునవాళ్లంతా కాదు పొమ్మంటే చక్రాల బండిపై తిరుగుతూ భిక్షాటన చేస్తున్నాడు. కొంతకాలానికి అఖిల అనే మహిళ తోడైంది. నీకు నేనున్నానంటూ అతని చేతికర్ర తీసుకుంది. స్త్రీ, పురుషుల బంధానికి డబ్బు.. భవంతులు.. సౌకర్యాలు అక్కరలేదని రెండు మనసులు ఒకటైతే చాలంది. అప్పటి నుంచి ఇద్దరూ కలిసి భిక్షాటన చేస్తున్నారు. కష్టసుఖాలు మాట్లాడుకుంటూ అన్యోన్యంగా జీవిస్తున్నారు. ఈయన వికలాంగుడైనా.. ఆధార్ కార్డు ఉన్నా ప్రభుత్వం పింఛను అందించడంలేదు. - సాక్షి, ఒంగోలు -
దివ్యమైన ఆలోచన
దివ్యాంగుల కోసం మరో దివ్యాంగుడి చేయూత దక్షిణ ఆఫ్రికాలోని స్నేహితుని ద్వారా జైపూర్ కాళ్లు ఏర్పాటు డర్బన్‌కు చెందిన కూబ్‌లాల్ పౌండేషన్ ద్వారా స్థానికంగా క్యాంపులు అన్నీతానై సేవ చేస్తున్న యువకుడు తనకొచ్చిన కష్టం ఇంకొకరికి రాకూడనుకున్నాడు. అలాంటి వారి కష్టాన్ని తీర్చుతున్నాడు. వారిలో ఆనందాన్ని చూసి తాను సంతృప్తి పడుతున్నాడు. రోడ్డు ప్రమాదాలు, అనారోగ్య సమస్యలతో కాళ్లు, చేతులు పోగొట్టుకున్న వారికి జైపూర్ కాళ్లు, చేతులను అమర్చే ఏర్పాట్లు చేసి మానవత్వాన్ని చాటుతున్నాడు ఓ దివ్యాంగుడు (వికలాంగుడు). పలమనేరు: పలమనేరు నియోజకవర్గంలోని గంగవరం మండలం గండ్రాజుపల్లెకు చెందిన శంకర్‌కు పుట్టిన ఐదేళ్లకు పోలియో సోకింది. కడికాలు మోడిబారిపోయింది. దీంతో నడవలేకపోయాడు. అతని తండ్రి వెంకటేష్, అన్న కృష్ణప్ప కూలికి వెళ్లి కుటుంబాన్ని పోషించేవారు. పదో తరగతి దాకా పలమనేరులోని ఎస్సీ హాస్టలో చదువుకుని ఆపై ఇంటర్, డిగ్రీలను తిరుపతి ఎస్వీయూలో పూర్తిచేశాడు. అక్కడే ఉన్న బర్డ్స్ ఆస్పత్రిలో పోలియోకు మూడేళ్ల చికి త్స తీసుకున్నాడు. ఓ కర్ర సాయంతో నడవగలిగే స్థితికి చేరుకున్నాడు. వికలాంగ కోటాలో పలు ఉద్యోగాలకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఇంటికొచ్చి రెండు పాడి ఆవులను మేపుకుంటూ జీనవం సాగిస్తున్నాడు. స్నేహితుడి సాయంతో.. గంగవరం మండలంలోని కీలపల్లెకు చెందిన సాగర్ అనే వ్యక్తి శంకర్‌కు స్నేహితుడు. సాగర్ దక్షిణ ఆఫ్రికాలోని డర్భన్‌లో పనిచేస్తున్నాడు. అతను పనిచేసే కంపెనీకి సమీపంలో కూబ్‌లాల్ పౌండేషన్ అనే సంస్థ నిర్వాహకులు దివ్యాంగులకు జైపూర్ కాళ్లను అమర్చుతారు. వారికి మనదేశంలోని జోధ్‌పూర్‌లో ఓ బ్రాంచి ఉంది. ఇదే సమయంలో శంకర్ వికలాంగుల సమస్యలను గురించి సాగర్‌తో వివరించాడు. దీంతోసాగర్ పక్కనే ఉన్న స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులతో మాట్లాడారు. భారత్‌లోని ఓ గ్రామంలో క్యాంపు పెట్టేందుకు ఒప్పించారు. వికలాంగులకోసం సర్వే తమ గ్రామంలో క్యాంపు నిర్వహించేందుకు కూబ్‌లాల్ ఫౌండేషన్ ఒప్పుకోవడంతో శంకర్ గంగవరం మండలమంతా తిరిగాడు. 660 మంది దివ్యాంగులను గుర్తించాడు. వీరిలో 35 మందికి జైపూర్ కాళ్లు అవసరమని తెలుసుకున్నాడు. ఆ స్వచ్ఛంద సంస్థకు ఓ నివేదిక పంపాడు. గత ఏడాది మేనెలలో విదేశీ సంస్థ పత్తికొండలోని పీహెచ్సీలో క్యాంపు నిర్వహించింది. 23 మందికి రూ.14 లక్షల విలువజేసే జైపూర్ కాళ్లను అమర్చిందింది. వారంతా ప్రస్తుతం నడవగలుగుతున్నారు. అనంతరం తాను గుర్తించిన 660 మందిలో వికలత్వ ధ్రువపత్రాలు కలిగిన వారిని 15 మంది సభ్యులతో శంకర్ సంఘాలు ఏర్పాటు చేయించాడు. వారికి ప్రభుత్వం నుంచి అందే సాయంతో పాటు మండల సమాఖ్య ద్వారా బ్యాంకు రుణాలను అందేలా చొరవచూపాడు. ఇక నేనింతే అనుకున్నా మడక దున్నుతూ ఉంటే కాలుకు కందిమోటు తగిలి పుండుగా మారింది. ఇన్ఫెక్షన్ సోకడంతో వైద్యులు కాలు తేసేశారు. జైపూర్ కాలు వేసుకోవాలంటే 70వేలు కావాలన్నారు. అంత డబ్బు లేదు. అలాంటి సమయంలో శంకర్ క్యాంపు పెట్టించాడు. నాకు కాలు అందేలా చేశాడు. నేనిప్పుడు నడవగలుగుతున్నా. ఆవును మేపుకుంటూ బతుకుతున్నా. ఇక బడికెళ్లలేనేమో అని బాధపడ్డా నాలుగేళ్ల క్రితం కరెంటుషాక్‌తో కాలు పోయింది. జైపూర్ కాలు అమర్చాలంటే లక్ష అవుతుందన్నారు. ఏం చేయాలో అర్థంగాక మా అమ్మనాన్న బాధపడ్డారు. అలాంటి సమయంలో పత్తికొండలో సౌత్ఆఫ్రికా వారు క్యాంపు పెట్టారని తెలిసింది. అక్కడికెళ్లి జైపూర్ కాలు పెట్టించుకున్నా. ఇప్పుడు నడవగలుగుతున్నా. ఇక్కడే ఏడో తరగతి చదువుతున్నా. వారి కష్టాలు నాకు తెలుసు నేనూ ఓ దివ్యాంగుడినే. కాళ్లు, చేతులు లేని వారు పడే బాధ చూసి వారికి కాళ్లు, చేతులు పెట్టించాలని అనుకున్నా. నా స్నేహితుడి సహకారం తీసుకున్నా. అవసరమైన వారికి జై పూర్ కాళ్లు పెట్టించా. కొత్తగా కాలు పెట్టించుకున్న వారు నడుస్తూవుంటే నాకు చాలా సంతృప్తిగా ఉంటుంది. మళ్లీ ఈసారి జూన్‌లో దక్షిణఆఫ్రికా సంస్థతో ఇక్కడ క్యాంపు పెట్టిస్తాం. - శంకర్ -
ప్రభుత్వ దృష్టికీ వైకల్యమేనా?
ఇంతమంది వికలాంగులకు ఈ రాష్ట్రంలో కేవలం ఏడు పాఠశాలలు ఉండడం మరీ దారుణం. తెలంగాణలోని ఆరోగ్య, సామాజిక పరిస్థితుల వల్ల ఇలాంటి బాలల సంఖ్య దురదృష్టవశాత్తు ఈ ప్రాంతంలో చాలా ఎక్కువ. తల్లిగర్భం ధరించినప్పటినుంచి ఐదేళ్ళ వరకు తల్లీబిడ్డలకు పౌష్టికాహారం అందించడం ప్రభుత్వ బాధ్యత. అందరికీ ఆరోగ్యం, అందరికీ విద్య అందేలా చూడటం కూడా ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. ఫ్లోరైడ్ రహిత, రక్షిత తాగునీటిని అందించాల్సిన బాధ్యత సైతం ఏలికలదే. వీటిలో ఏ ఒక్క విషయంలో పాలకులు తమ బాధ్యత మరిచినా దాని దుష్ర్పభావం చిన్నారుల జీవితాలపై పడుతుంది. మరి మనచుట్టూ వివిధ రకాలైన వైకల్యాలతో పుట్టిన చిన్నారుల పట్ల దశాబ్దాలుగా ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తుంటే దానిని ఏమనాలి? వైకల్యం ప్రకృతి ఇచ్చిన శాపమైతే, వారి పట్ల నిర్లక్ష్యంగా ఉండడం సమాజం ఇచ్చిన మరో శాపం కిందే పరిగణించాలి. అలాంటి వారు తెలంగాణ వ్యాప్తంగా ఒక లక్షా 30 వేల మంది ఉన్నట్టు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. అనధికారిక లెక్కల ప్రకారం వారు దాదాపు 2 లక్షల మంది ఉంటారని ఒక అంచనా. మూగ, చెవిటి, అంధత్వం లాంటి వివిధ రకాలైన అంగవైకల్యం కలిగిన పిల్లలకు ప్రత్యేక అవసరాలుంటాయని ప్రభుత్వం గుర్తించింది. అయితే వారి అవసరాలకు తగిన విధంగా అన్ని అవకాశాలున్న పిల్లల మాదిరిగానే విద్యా వకాశాలను కల్పించాలని వారి కోసం అనేక చట్టాలు చేసింది. 1992లో వచ్చిన భారత పునరావాస మండలి చట్టంలోని 27, 28, 30, 31 సెక్షన్లు వికలాంగుల విద్యాభివృద్ధికి తోడ్ప డేందుకు రవాణా సదుపాయాలు కల్పించాలని సూచిస్తుంది. 1999 లో వచ్చిన జాతీయ ట్రస్ట్ ప్రకారం తల్లిదండ్రులు లేని వికలాంగులైన పిల్లలను ప్రభుత్వమే దత్తత తీసుకొని వారి బాధ్యతలను చూడాలని చెపుతోంది. వీటితోపాటు విద్యా హక్కు చట్టంలో కూడా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు అన్ని రకాలుగా విద్యావకాశాలు కల్పించేం దుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వీటికి తోడు ఈ పిల్లలకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయాలి. అలాగే కేవలం శిక్షణ కలిగిన మహిళా టీచర్లు మాత్రమే వీరికి బోధించాల్సి ఉం టుంది. కానీ ఇవేవీ అమలుకు నోచుకోవడం లేదని తెలంగాణ ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లిదండ్రుల సంఘం ఆరోపిస్తోంది. విద్యాహక్కు చట్టం (2009), ప్రాథమిక హక్కు 21(ఎ) చట్టాలు కూడా అమలు కావడం లేదు. ఇందులో 2009 నాటి చట్టంపై పార్లమెంటులో చర్చ జరిగినప్పుడు నాటి మానవవనరుల అభివృద్ది మంత్రి గొప్ప ఆశను కల్పించే అంశాన్ని ప్రతిపాదించారు. పాఠశాలకు హాజరు కావడం కూడా సాధ్యంకాని స్థితిలో ఉన్న బాల బాలికలకు ఇంటి దగ్గరే చదువు నేర్చుకునే అవకాశం కల్పిస్తామని చెప్పుకున్నారు. కానీ ఆ ప్రతిపాదన ఒక్క అడుగు కూడా ముందుకు వేయ లేకపోయింది. ప్రాథమిక హక్కుల జాబితాలో ఉచిత నిర్బంధ విద్య కూడా ఉంది. అది కూడా అమలు జరగడం లేదు. ఇలాంటి హామీలు అమలు కాకపోతే ప్రధానంగా నష్టపోయేది ప్రత్యేక అవసరాలు కలిగిన ఇలాంటి చిన్నారులే. సర్వశిక్షా అభియాన్ వంటి పథకాల కారణంగా కొందరు బాలలు ఇంటి వద్ద అక్షరానికి నోచుకుంటున్నా, పాఠశాలలకు వెళ్లే సమ యానికి వారికి కొన్ని వాస్తవికమైన ఇబ్బందులు ఎదురవుతు న్నాయి. వీరి స్థాయినీ, పరిస్థితినీ అర్థం చేసుకుని బోధించగల, ప్రత్యేక శిక్షణ కలిగిన ఉపాధ్యా యులు అక్కడ ఉండడం లేదు. ఇదొక విషాదం. సమాజంలో అన్ని వర్గాల అభివృద్ధి అక్ష రాస్యత మీద ఆధారపడి ఉందన్న మాట నిజమే కానీ, ఇలాంటి శాపగ్రస్త బాలలకు చదువు గొప్ప వరమవుతుంది. ఆ అవసరం వారికి ఇంకాస్త ఎక్కువ. వారిలోని నిరాశా నిస్పృహలను తొలగించి, కొత్త జీవితం సంతరించుకుని, ఆత్మగౌరవంతో బతకడానికి వీరికి చదువు మరీ మరీ అవస రమన్న సంగతి ఇప్పటికైనా గుర్తించాలి. ఈ అంశం మీద ప్రజా చైతన్యం అత్యవసరం. ఇది అలాంటి బాలబాలికలను కలిగి ఉన్న తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు. మొత్తం సమాజం దీనిని తమ బాధ్యతగా స్వీకరించి, వారిని తమతో సమంగా నడిచేటట్టు చేయడం కోసం కనీసం ప్రయత్నించాలి. నిజానికి ఐక్యరాజ్య సమితి కూడా ఇలాంటి బాలల పట్ల దృష్టి పెట్టింది. ఐక్యరాజ్య సమితి వికలాంగుల హక్కుల ఒప్పందం- 2007 అందుకు సంబంధించినదే. దీని ప్రకారం సమితిలోని సభ్య దేశాలన్నీ వికలాంగ బాలల సమస్యలను పరిష్కరించి, వారికి కూడా అభివృద్ధి ఫలితాలు అందేలా చేయాలి. దీనిని నాటి కేంద్ర మంత్రిమండలి సిఫారసుతో రాష్ట్రపతి ఆమోదించడం కూడా జరిగిపోయింది. కానీ అమలులో మాత్రం పూర్తిగా విఫలమైంది. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల మంది మూగ, చెవిటి, అంధ, మానసిక వైకల్యం గల పిల్లలున్నా వారి సంఖ్యకు తగిన విధంగా పాఠశాలలు లేవు. వీరికోసం ప్రత్యేకించిన కళాశాల ఒక్కటి కూడా లేదు. వారికి ప్రభుత్వ పరంగా అందుతున్న సౌకర్యాలు అంతంత మాత్రమే. వీరి లాంటి విద్యార్థులకు బోధించడానికి అవసరమైన ప్రత్యేక అర్హతలు కలిగిన ఒక్క ఉపాధ్యాయుడిని కూడా ప్రభుత్వం తయారు చేయలేదు. ఇంతమంది వికలాంగులకు ఈ రాష్ట్రంలో కేవలం ఏడు పాఠశాలలు ఉండడం మరీ దారుణం. తెలంగాణలోని ఆరోగ్య, సామాజిక పరిస్థితుల వల్ల ఇలాంటి బాలల సంఖ్య దురదృష్టవశాత్తు ఇక్కడ ఎక్కువ. ‘డిఫరెంట్లీ ఏబుల్డ్’ అని ఒక పేరు పెట్టినా ఆ విధంగా ఈ నిర్భాగ్యులను ప్రభుత్వం కనికరించడం లేదు. కనీసం అన్ని అవయవాలు సరిగా ఉన్నవారు అక్రమమార్గంలో సౌకర్యాలు పొందుతున్నా, అలాంటి అనైతిక వర్తనను కూడా ప్రభుత్వాలు అరికట్టలేక పోతున్నాయంటే, ఈ పిల్లల పట్ల ప్రభుత్వాలకు ఉన్న శ్రద్ధ ఏపాటిదో అర్థమవుతుంది. ఈ అంశంలో అలాంటి అవినీతిపరుల కన్ను తెరిపించే చర్యలు కూడా అవసరమే. వికలాంగులకు ఇప్పటికే ఇస్తున్న 3 శాతం రిజర్వేషన్ ని పది శాతానికి పెంచాలని, వీరికోసం ప్రత్యేక బడ్జెట్ ను ఏర్పాటు చేయాలని, వీరికి ప్రత్యేక పాఠశాలలను ఏర్పాటు చేసి, శిక్షణ కలిగిన ఉపాధ్యాయులను నియమించా లంటూ వస్తున్న డిమాండ్లు ఎంతో సమంజసమైనవి. కొత్త రాష్ట్రం ఏర్పడడం సంతోషదాయకమే. కానీ పాత సమస్యలు అలాగే మిగిలిపోతే తెలంగాణను సాధించుకున్న ప్రయోజనం నెరవేరుతుందా? - అత్తలూరి అరుణ (ఈ నెల 29వ తేదీన ఇందిరాపార్కు వద్ద వేలాది మంది మూగ, చెవిటి, అంధ పిల్లలతో భారీ బహిరంగ సభను తలపెట్టిన సందర్భంగా ...) -
పుట్టిన రోజు నాడే బలవన్మరణం
వైరా: పుట్టుకతో వికలాంగుడు.. అయినా పింఛన్ మంజూరు కాకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన మెండెం ప్రవీణ్‌కుమార్ (22) శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరం గ్రామానికి చెందిన ప్రవీణ్‌కుమార్ పుట్టుకతో ఎడమకాలు పని చేయదు. తనకు వికలాంగ పింఛన్ మంజూరు చేయాలని పలుమార్లు అధికారుల చుట్టు తిరిగాడు. ఎమ్మెల్యేకు సైతం వినతిపత్రం ఇచ్చినా ఫలితం దక్కలేదు. తండ్రి ఆర్టీసీ కండక్టర్ కావడంతో అధికారులు పింఛన్ మంజూరు చేయలేదు. ఇటీవలే తండ్రి గాబ్రేయిల్ సర్వీసు నుంచి రిమూవల్ అయ్యాడు. దీంతో పరిస్థితిని వివరిస్తూ మరోసారి దరఖాస్తు చేసుకున్నా.. పింఛన్ మంజూరు కాలేదు. దీంతో ప్రవీణ్‌కుమార్ మనస్తాపానికి గురయ్యాడు. కాగా, శుక్రవారం ప్రవీణ్‌కుమార్ పుట్టినరోజును స్నేహితులు, కుటుంబ సభ్యుల నడుమ జరుపుకున్నాడు. మధ్యాహ్నం బంధువుల ఇంటికి వెళ్తున్నానని చెప్పి వెళ్లిన ప్రవీణ్‌కుమార్ బోనకల్ రైల్వే స్టేషన్ సమీపంలో శవమై కనిపించాడు. పింఛన్ మంజూరు కాలేదన్న మనోవేదనతోనే ప్రవీణ్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. -
వృద్ధ వికలాంగుడి ఆకలిచావు
వనపర్తి రూరల్: ఓ వృద్ధ వికలాంగుడు ఆకలి చావుకు గురయ్యాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి మండలం కడుకుంట్లలో జరిగింది. గ్రామానికి చెందిన తలారి లక్ష్మయ్య (70) వికలాంగుడు కావడంతో ఏ పనీ చేయలేక ఇంటివద్దే ఉండేవాడు. ఉన్న ఇద్దరు కూతుళ్లు అత్తారింటికి, కుమారుడు ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వె ళ్లగా, భార్య మూడేళ ్లక్రితమే మృతి చెందింది. అప్పటి నుంచి ఇంట్లో ఒంటరిగా జీవిస్తుండడంతో కాలనీవాసులు ఆయన పరిస్థితిని చూసి అప్పుడప్పుడు అన్నం పెట్టేవారు. కొంతకాలంగా సమయానికి భోజనం వండిపెట్టే వారు లేక నీరసంగా కనిపించేవాడు. ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా కావడం, ఆహారం తీసుకోకపోవడంతో ఆరోగ్యం క్షీణించింది. చివరకు బుధవారం సాయంత్రం మృతిచెందాడు. గురువారం ఉదయం విషయం వెలుగులోకి వచ్చింది. -
రక్షకులా.. భక్షకులా...
-
వికలాంగుల విలవిల
సంగారెడ్డి : మెదక్ జిల్లా సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం నిర్వహించిన ‘సదరం’ వైద్య శిబిరానికి వికలాంగులు ఇలా పోటెత్తారు. ఉదయం 6 గంటల నుంచే భారీగా క్యూ కట్టారు. గంటల తరబడి నిలబడలేక కొందరు సొమ్మసిల్లి పడిపోగా తొక్కిసలాట జరిగింది. కూర్చోవడానికి స్థలం లేక.. తాగడానికి నీళ్లు లేక అవస్థల పాలయ్యారు. - సంగారెడ్డి -
పింఛన్ బెంగతో ఆగిన గుండెలు
ఆరుగురు మృతి.. హైదరాబాద్‌లో వికలాంగుడు సాక్షి నెట్వర్క్: పింఛన్ రాదని, రాలేదనే బెం గతో వృద్ధుల గుండెలు ఆగుతున్నాయి. వేర్వేరు జిల్లాల్లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు ఆరుగురు మృతి చెందారు. వరంగల్ జిల్లా వెంకటాపురానికి చెందిన భూస చంద్రయ్య(60) పేరు పింఛన్ల జాబితాలో లేదు. దీంతో ఆదివారం రాత్రి గుండెపోటుతో మరణించాడు. కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన దీటి గంగవ్వ(75), పింఛన్ రావడం లేదని గుండెపోటుతో మృతి చెందింది. హైదరాబాద్‌లోని బాగ్ అంబర్‌పేట మండలం బతుకమ్మకుంటకు చెందిన కొండ అమురేష్(25)కు కాళ్లు, చేతులు సరిగా లేవు. పింఛన్ వచ్చిందని చెబుతున్న అధికారులు ఏ కేంద్రానికి వెళ్లాలో మాత్రం చెప్పడం లేదు. అన్ని కేంద్రాలు తిరిగిన ఫలితం లేకపోయింది. దీంతో మనస్తాపం చెంది మృతి చెందాడు. హయత్‌నగర్ డివిజన్ పరిధికి సాహెబ్‌నగర్‌కు చెందిన శశిరేఖ అనే వృద్ధురాలు గుండెపోటుతో చనిపోయింది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన యశోద(70) పేరు పించన్ జాబితాలో ఉన్నా పంపిణీ చేయడంలో జాప్యం జరగడంతో నీరసించి కేంద్రం వద్ద పడిపోయింది. ఆస్పత్రికి తరలించగా చనిపోయింది. కొడంగల్‌కు చెందిన మహ్మద్ ఉస్మాన్అలీ పింఛన్ జాబితాలో పేరు లేదనే బెంగతో గుండెపోటుకు గురై చనిపోయాడు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం కాకరవాయికి చెందిన నల్లగుట్టు లచ్చమ్మ(80) పింఛన్ జాబితాలో పేరు గల్లంతు కావడంతో తుట్టుకోలేక సొమ్మసిల్లింది. మంచినీళ్లు తాగించే ప్రయత్నం చేసేలోపే చనిపోయింది. వృద్ధుడికి వితంతు పింఛన్: ఆసరా పథకంలో వింతలు బయటపడుతున్నాయి. మలక్‌పేట సింగరేణి కాలనీకి చెందిన విశ్వనాథం పేరు వితంతు పింఛన్లో నమోదు చేశారు. -
వికలాంగ ఉద్యోగుల సమస్యలివీ..!
-
పింఛన్.. బాంచన్..
దరఖాస్తు అందజేతకు ఓ వికలాంగుడి యాతన పల్లెల్లో..పట్టణాల్లో ఏ నోట విన్నా.. ఏ వీధిలోకి వెళ్ళినా..ఏ కార్యాలయాన్ని దర్శించినా..పింఛన్లు..ఆహార భద్రత కార్డుల గురించే వినిపిస్తుంది. అర్హులైన లబ్ధిదారులంతా తిరిగి కొత్తగా దరఖాస్తు చేసుకోవాలన్న నిబంధనలతో జనాలు బెంబేలెత్తి పోతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం మండల రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవడానికి వచ్చి బస్సు దాటిపోతుందని పరేషాన్లో దరఖాస్తు ఫారాల కవర్‌ను నోటితో పట్టుకొని రోడ్డుపై వేగంగా పాక్కుంటూ ముందుకు వెళ్తున్న దృశ్యం అక్కడున్న వారిని కలిచి వేసింది. పాపన్నపేట మండలం కొంపల్లి గ్రామానికి చెందిన కుర్మసాయిలు పుట్టుకతోనే వికలాంగుడు. కిష్టమ్మ, సంగయ్య దంపతులకు పెద్ద కుమారుడు. ఇంతకి అసలు విషయం ఏమిటంటే దరఖాస్తు చేసుకునేందుకు మండల కార్యాలయానికి వచ్చిన సాయిలు రోజంతా కార్యాలయం ముందు పడిగాపులు కాసి రాత్రి అధికారుల వద్దకు వెళ్తే..దరఖాస్తు చేసుకునేది ఇక్కడ కాదు..మీ ఊరిలోనేనంటూ.. చావు కబురు చల్లగా చెప్పారు. దీంతో తిండి తిప్పలు లేని సాయిలు ఉన్న బస్సుపోతే రాత్రంతా శివరాత్రేనంటూ బస్సుకోసం ఇలా పరుగులు పెట్టాడు. గతంలో సాయిలుకు ట్రైసైకిల్ ఇచ్చినా..అది చెడిపోయింది. తిరిగి అధికారులకు విజ్ఞప్తి చేసుకున్నా..అతని మొర అరణ్యరోదనే అయ్యింది. - పాపన్నపేట -
వికలాంగురాలిపై తోటి ఉద్యోగుల వేధింపులు
-
వికలాంగుడి దారుణహత్య
- కలకలం రేపిన ఘటన - పరిశీలించిన డీఎస్పీ అడ్డాకుల : తన గుడిసె ఎదుట మంచంపై నిద్రిస్తున్న ఓ వికలాంగుడిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. ఈ సంఘటన కలకలం సృష్టించింది. స్థానికుల కథనం ప్రకారం... అడ్డాకులకు చెందిన గొల్ల ఈర్ల నాగన్న (39) పుట్టుకతో వికలాంగుడు. పదిహేనేళ్ల క్రితం వనపర్తికి చెందిన లక్ష్మితో వివాహం కాగా రెండేళ్లలోపే వదిలేశాడు. అనంతరం కొత్తకోటకు చెందిన కొండమ్మను పెళ్లి చేసుకున్నా ఆమెనూ విడిచి పెట్టాడు. ఈయనకు కొంత పొలం ఉండగా సుమారు పన్నెండేళ్ల నుంచి ఒంటరిగా జూనియర్ కాలేజీ పక్కన గుడిసె వేసుకుని సారా విక్రయిస్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలోనే మంగళవారం అర్ధరాత్రి ఆరుబయట మంచంపై నిద్రిస్తున్న అతడిని గుర్తుతెలియని వ్యక్తులు మారణాయుధంతో పాశవికంగా హత్య చేసి పారిపోయారు. బుధవారం ఉదయం చుట్టుపక్కల వారు ఇది గమనించి వెంటనే వీఆర్ఓ బాలస్వామితో పాటు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలాన్ని వనపర్తి డీఎస్పీ కంచి శ్రీనివాసరావు, కొత్తకోట సీఐ రమేష్‌బాబు, పెద్దమందడి ఎస్ఐ మురళీగౌడ్, అడ్డాకుల ఏఎస్ఐ మహ్మద్ ఇక్బాల్‌అహ్మద్ పరిశీలించారు. అక్కడ రెండు బీరు సీసాలు, క్వార్టర్ బాటిల్ ఉన్నాయి. జిల్లా కేంద్రం నుంచి జాగిలాన్ని రప్పించి ఆధారాల కోసం అన్వేషించారు. గుడిసె నుంచి హైవే వైపు కొద్దిదూరం వెళ్లి అది తిరిగొచ్చింది. అలాగే క్లూస్‌టీం ఏఎస్ఐ రాజేంద్రప్రసాద్ సిబ్బందితో కలిసి వేలిముద్రలను సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రధాన ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. కాగా, ఈ హత్యకు వివాహేతర సంబంధాలు లేదా ఇతర కారణాలేవైనా ఉన్నాయా అన్న కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
‘పట్టు’జారని విక్రమార్కుడు
అడ్డురాని వైకల్యం కరెంటు స్తంభాన్ని అవలీలగా ఎక్కేసిన లోవరెడ్డి ఉత్కంఠగా జూనియర్ లైన్‌మన్ ఎంపికలు విశాఖపట్నం : చెట్టులెక్క గలవా...ఓ నరహరి పుట్టలెక్కగలవా...అని ఏ అమ్మడూ ఆట పట్టించకుం డానే అతడు చకచకా స్తంభాలెక్కేశాడు. స్తంభాలెక్కడం ఏం విడ్డూరమా అనుకోవద్దు. లోవరాజు స్తంభాలెక్కడం చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టక మానరు. ఎందుకంటే అతనికి ఓ కాలు లే దు. ఒంటికాలితో స్తంభాలెక్కడం ఎందుకంటారా... జూనియర్ లైన్‌మన్‌గా ఎంపిక కావడం కోసం...!..ఇవీ వివరాలు. రెండు కాళ్లూ చేతులూ బాగా పని చేసినా తాటి చెట్టంత స్తంభం ఎక్కడానికి అందరూ సాహసించలేరు. కానీ ఆ యువకుడు విధి వెక్కిరించి ప్రమాదంలో కాలు కోల్పోయినా సాహసంతో రెండు స్తంభాలెక్కేశాడు. విశాఖలోని గోపాలపట్నం ఏపీఈపీడీసీఎల్ క్వార్టర్స్ గ్రౌండ్లో మూడు రోజులుగా జరుగుతున్న జూనియర్ లైన్‌మన్ ఎంపిక లు శనివారం ఉత్కంఠ భరితంగా సాగాయి. ఈ పోటీలకు యన్నమరెడ్డి లోవరెడ్డి అనే వికలాంగుడు హాజరవడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. అతన్ని చూసి తొలుత అధికారులు అభ్యంతరం చెప్పినా ఆ తర్వాత తాను విద్యుత్ కాంట్రాక్టు కార్మికుడినని చెప్పడంతో వెసులుబాటు ఇచ్చారు. అతనికి పరీక్ష పెట్టారు. తన కాలికి తగిలించుకున్న కృత్రిమ అవయవం తీసి లోవరెడ్డి చకచకా రెండు సార్లు రెండు రకాల స్తంభాలెక్కి దిగాడు. దీనిని చూసి అబ్బురపడిన చీఫ్ జనరల్ మేనేజర్ విజయలలిత, జీఎం వైఎస్ఎన్ ప్రసాద్ తదితరులు అభినందించారు. పోల్ ఎక్కి..కాలు కోల్పోయాడు... లోవరెడ్డి స్వస్థలం పాయకరావుపేట వద్ద కందిపూడి గ్రామం. ఇతని తండ్రి మంగిరెడ్డి నిరుపేద కూలీ. లోవరెడ్డి ఐటీఐ చదివాడు. ఐదేళ్ల క్రితం ఏపీఈపీడీసీఎల్‌లో పాయకరావుపేట రూరల్ సబ్‌స్టేషన్ పరిధి శ్రీరామపురం విద్యుత్ కేంద్రంలో కాంట్రాక్టు కార్మికునిగా చేరాడు. రెండేళ్ల క్రితం అతను పోలెక్కి పని చేస్తుండగా, హఠాత్తుగా మంటలు చెలరేగి పోల్‌పైనే కాలు కోల్పోయాడు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. కోలుకొన్నాక విద్యుత్ అధికారులు అతనికి ఉద్యోగం చేసుకునే అవకాశం ఇచ్చారు. లోవరెడ్డి మాత్రం ఎప్పటికైనా తాను శాశ్వత ఉద్యోగం సంపాదించాలని ఆరాటపడ్డాడు. శనివారం అందరి కంటే తక్కువ సమయంలో స్తంభాలెక్కి తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకున్నాడు. -
పింఛన్ పంపిణీలో తొక్కిసలాట
ప్రొద్దుటూరు టౌన్: ఎంతగానో పింఛన్ కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులు ఒకరినొకరు తోసుకుంటూ తీవ్ర అస్వస్థతకు గురై రోధించిన సంఘటన సోమవారం గోపవరం పంచాయతీ కార్యాలయంలో చోటుచేసుకుంది. ఒక్క మిషన్ పెట్టుకుని 1600 మందికి ఒకేచోట పింఛన్ ఇవ్వడం సాధ్యమా.. కాదని సర్పంచ్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. మూడు ప్రాంతాల్లో పింఛన్ పంపిణీని చేపట్టాలని ఆయన సూచించారు. తొక్కిసలాటలో వృద్ధులు, వికలాంగులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ‘మా ప్రాణాలు పోతున్నాయ్.. మా గోడు కొట్టుకుంటుంది’ అంటూ వృద్ధులు, వికలాంగు లు అధికారులను శపించారు. ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ పరిధిలో ఉన్న యానాది కాలనీ, భగత్‌సింగ్ కాలనీ, లింగారెడ్డినగర్, శ్రీనివాసపురం, ద్వారకానగర్, ఆచార్యుల కాలనీ, హౌసింగ్ బోర్డు, ఇందిరానగర్, రాజీవ్నగర్లలోని 1600 మంది పింఛన్ లబ్దిదారులకు హౌసింగ్ బోర్డులోని గోపవరం పంచాయతీ కార్యాయలంలో పింఛన్ పంపిణీ చేపట్టారు. ఇచ్చే నాలుగు రోజుల్లోనే లబ్ధిదారులు అష్టకష్టాలు పడి పింఛన్ తీసుకెళ్లాలి. అలా కాకపోతే పింఛన్ ఇవ్వరు. ఇలా వందల మంది లబ్ధిదారులకు మూడు నెలలుగా పింఛన్ ఇవ్వలేదు. కొందరి పేర్లు ఆటోమేటిక్‌గా తొలగించారు. యానాదకాలనీ నుంచి వృద్ధులు, వికలాంగులు పింఛన్ పంపిణీ కేంద్రానికి రావాలంటే దాదాపు 5 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఈ కాలనీకి దగ్గరలో ఉన్న కాల్వకట్ట, లింగారెడ్డి నగర్‌లతో కలిపి 500 మందికి పైగా ఫించ న్ లబ్ధిదారులున్నారు. తొక్కిసలాటతో అస్వస్థత : మూడు, నాలుగు నెలల నుంచి పింఛన్ అందక పోవడంతో వృద్ధులు, వికలాంగులు ఒక్కసారిగా కార్యాలయానికి వచ్చారు. పింఛన్ తీసుకోకపోతే తమ పేర్లను తొలగిస్తారనే భయం, ఆత్రుతతో వారు ఎగబడ్డారు. ఒకరినొకరు తోసుకోవడంతో తీవ్ర తొక్కిసలాట చోటు చేసుకుంది. డీఆర్డీఏ అధికారులు నియమించిన పింఛన్ పంపిణీ చేస్తున్న సీఎస్వీ లక్ష్మిదేవి, సిబ్బంది ఎవ రూ కూడా లబ్ధిదారులను పట్టించుకోలేదు. ఊపిరాడక కొందరు వృద్ధులు, వికలాంగులు రోధిస్తూ బయటకు వచ్చారు. లోపల కూర్చున్న లబ్ధిదారులను పింఛన్ పంపిణీ చేస్తున్న సీఎస్వీ వృద్ధులు, వికలాంగులని కూడా చూడకుండా ఈడ్చిపడేసింది. ఇష్టాను సారంగా తిడుతూ ‘మీ ఇష్టం వచ్చిన వారికి చెప్పుకోపొండి, నేను ఇలాగే తిడతా’ అంటూ లోపలి నుంచి గెంటివేసినంత పని చేసింది. ఈ విషయంపై అక్కడే ఉన్న పంచాయతీ కార్యదర్శికి లబ్ధిదారులు ఫిర్యాదు చేశారు. పింఛన్ పంపిణీ చేస్తున్న లక్ష్మిదేవి మామను కార్యదర్శి పిలిపించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత మందికి ఒక్క మిషన్ పెట్టుకుని ఎలా పంపిణీ చేస్తారని ప్రశ్నించారు. తమకు మూడు, నాలుగు నెలలుగా పింఛన్ ఇవ్వలేదని, తమ పేర్లు లేవని చెబుతున్నారని వృద్ధులు, వికలాంగులు కార్యాదర్శికి ఫిర్యాదు చేశారు. కార్యదర్శి కూడా తన నిస్సహాయతను ప్రదర్శించారు. ఈ విషయాన్ని పింఛన్ పంపిణీ కో-ఆర్డినేటర్ రఘు దృష్టికి తీసుకెళ్లేందుకు పలుమార్లు ఫోన్లో ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. -
ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మార్చుతాం
భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ నల్లగొండ రూరల్, న్యూస్‌లైన్ : ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మార్చడమే టీఆర్ఎస్ లక్ష్యమని, అందుకు కేసీఆర్ కంకణబద్దులై ఉన్నారని భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫ్లోరైడ్ నీటి వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, అంగవైకల్యం తో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు కృష్ణాజలాలు అందించాలని కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని, త్వరలోనే జిల్లాకు ఫ్లోరైడ్ పీడ విరుగడ అవుతుందని చెప్పారు. కేసీఆర్‌తో భువనగిరిలోని నిమ్స్ ఆస్పత్రిని ప్రారంభిస్తామన్నారు. పార్టీ మేనిఫెస్టోను అమలు చేసి రాజ కీయ అవినీతి లేకుండా చేస్తామన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందిస్తామని చెప్పారు. తనను గెలిపించి వారికి పార్టీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో పార్టీ నాయకులు మైనం శ్రీనివాస్, మాలే శరణ్యారెడ్డి, నాగార్జున, సాయి, వెంకన్న పాల్గొన్నారు. -
చిరంజీవిని నమ్మిమోసపోయిన వికలాంగుడు