సాక్షి, హైదరాబాద్: పవిత్రమైన ఓటును పవిత్రంగానే ఉపయోగించుకోవాలి.. ఇది ఓటర్లకు పెద్దలు ఇస్తున్న సందేశం. తెలంగాణ ఓటర్ల జాతర నేపథ్యంలో.. ఎనిమిది పదుల వయసు దాటిన కొందరు చురుకుగా, అదీ ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు సైతం ఇంట్లో వాళ్ల సాయంతో ఓటింగ్ పాల్గొని.. ఓటుకు దూరంగా ఉండొద్దని మిగతా వాళ్లకు పిలుపు ఇస్తున్నారు.
అంబర్‌పేటలో 92 సంవత్సరాల వృద్ధుడు ఓటు హక్కు వినియోగించుకుని.. యువత ఇంట్లో ఉండకుండా బయటికి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పారు. అలాగే.. శివానంద రిహబిలిటేషన్ లో వృద్దులు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినయోగించుకున్న దృశ్యాలు కనిపించాయి.
మరోవైపు దివ్యాంగులు సైతం ఎన్నికల్లో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. తెలంగాణ ఎన్నికల కోసం తొలిసారిగా.. ఓట్ ఫ్రమ్ హోం ద్వారా 27వేలమందికి పైగా వృద్ధులు, దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకోవడం తెలిసిందే. మిగిలిన వాళ్లు ఇవాళ నేరుగా పోలింగ్‌కేంద్రాలకు వెళ్తూ ఓటేస్తున్నారు. తద్వారా ఓటు హక్కు అందరి బాధ్యత అని గుర్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment