70 ఏళ్లుపైబడినవాళ్లకు ఆయుష్మాన్‌ భారత్‌ అమలు | Cabinet approves 5 lakh health insurance for senior citizens aged 70 and above | Sakshi
Sakshi News home page

70 ఏళ్లుపైబడినవాళ్లకు ఆయుష్మాన్‌ భారత్‌.. కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలివే

Published Wed, Sep 11 2024 8:56 PM | Last Updated on Wed, Sep 11 2024 9:04 PM

Cabinet approves 5 lakh health insurance for senior citizens aged 70 and above

న్యూఢిల్లీ, సాక్షి: దేశంలో 70 ఏళ్లు పైబడిన సీనియర్‌ సిటిజన్లకు సైతం ఆయుష్మాన్ భారత్‌ ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియాకు వెల్లడించారు.

  • 70 ఏళ్లు పైబడిన వారికి ఆయుష్మాన్‌భారత్‌ వర్తింపజేస్తూ నిర్ణయం. ఈ నిర్ణయంలో గొప్ప మానవతా దృక్పథంతో కూడుకున్నది: మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

  • తాజా నిర్ణయంతో దాదాపు 6 కోట్ల మంది సీనియర్‌ సిటిజన్లకు లబ్ది కలుగుతుంది: మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

  • వీరంతా రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స సౌకర్యాన్ని పొందే అవకాశం దక్కుతుంది: మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య బీమా (AB PMJAY) పథకాన్ని 2018 సెప్టెంబర్‌లో కేంద్రం లాంఛనంగా ప్రారంభించింది. ఈ పథకం కింద దేశంలోని పేద కుటుంబాల్లోని ప్రతి సభ్యునికి ఆయుష్మాన్ కార్డు అందిస్తారు. ఈ కార్డుతో ఆసుపత్రిలో చేరినప్పుడు రూ. 5లక్షల వరకు ఉచిత వైద్యసేవలు అందుతాయి.

కేబినెట్‌ నిర్ణయాలు

  • పీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్‌ పథకానికి ఆమోదం.. రూ.10,900 కోట్ల కేటాయింపు.. ఈవీలపై సబ్సిడీ కొనసాగింపు.. 88,500 ప్రదేశాల్లో ఛార్జింగ్‌ల ఏర్పాట్లు
     
  • జలవిద్యుత్‌ ప్రాజెక్టులకు రూ.12,461 కోట్ల కేటాయింపు
     
  • ప్రధానమంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన.. రూ. 70,125 కోట్ల రూపాయల కేటాయింపునకు ఆమోదం.. 25,000 గ్రామాలను కలిపేలా రోడ్ల నిర్మాణం    
  • పీఎం ఈ -బస్ సేవా పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం.. రూ. 3,435 కోట్ల రూపాయలతో 38వేల ఈ -బస్ ల ఏర్పాటు 
     
  • వాతావరణ శాఖ టెక్నాలజీ(మిషన్‌ మౌసమ్‌)  కోసం రూ.2 వేల కోట్ల కేటాయింపు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement