old people
-
70 ఏళ్లుపైబడినవాళ్లకు ఆయుష్మాన్ భారత్ అమలు
న్యూఢిల్లీ, సాక్షి: దేశంలో 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు సైతం ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.70 ఏళ్లు పైబడిన వారికి ఆయుష్మాన్భారత్ వర్తింపజేస్తూ నిర్ణయం. ఈ నిర్ణయంలో గొప్ప మానవతా దృక్పథంతో కూడుకున్నది: మంత్రి అశ్వినీ వైష్ణవ్తాజా నిర్ణయంతో దాదాపు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ది కలుగుతుంది: మంత్రి అశ్వినీ వైష్ణవ్వీరంతా రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స సౌకర్యాన్ని పొందే అవకాశం దక్కుతుంది: మంత్రి అశ్వినీ వైష్ణవ్ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా (AB PMJAY) పథకాన్ని 2018 సెప్టెంబర్‌లో కేంద్రం లాంఛనంగా ప్రారంభించింది. ఈ పథకం కింద దేశంలోని పేద కుటుంబాల్లోని ప్రతి సభ్యునికి ఆయుష్మాన్ కార్డు అందిస్తారు. ఈ కార్డుతో ఆసుపత్రిలో చేరినప్పుడు రూ. 5లక్షల వరకు ఉచిత వైద్యసేవలు అందుతాయి.కేబినెట్ నిర్ణయాలుపీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ పథకానికి ఆమోదం.. రూ.10,900 కోట్ల కేటాయింపు.. ఈవీలపై సబ్సిడీ కొనసాగింపు.. 88,500 ప్రదేశాల్లో ఛార్జింగ్‌ల ఏర్పాట్లు జలవిద్యుత్ ప్రాజెక్టులకు రూ.12,461 కోట్ల కేటాయింపు ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన.. రూ. 70,125 కోట్ల రూపాయల కేటాయింపునకు ఆమోదం.. 25,000 గ్రామాలను కలిపేలా రోడ్ల నిర్మాణం పీఎం ఈ -బస్ సేవా పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం.. రూ. 3,435 కోట్ల రూపాయలతో 38వేల ఈ -బస్ ల ఏర్పాటు వాతావరణ శాఖ టెక్నాలజీ(మిషన్ మౌసమ్) కోసం రూ.2 వేల కోట్ల కేటాయింపు -
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా.. జపాన్ మహిళ!
జపాన్‌కు చెందిన 116 ఏళ్ల టొమికో ఇటుకా ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా నిలిచారు. ఆమె గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నట్లు అమెరికాకు చెందిన జెరోంటాలజీ రీసెర్చ్ గ్రూప్ బుధవారం ప్రకటించింది. ఇంతకీ ఆమె పుట్టిందెప్పుడో తెలుసా? రైట్ బ్రదర్స్ ఐరోపా, అమెరికాల్లో తొలిసారిగా విమానాలను ప్రారంభించిన 1908లో. అదే ఏడాది ఈఫిల్ టవర్ నుంచి తొలి సుదూర రేడియో సందేశం పంపించారు. ఇటుకా జపాన్‌లోని నగరమైన అషియా నివాసి.ఆమె 70వ ఏట జపాన్‌లోని 3,067 మీటర్ల ఎత్తయిన ఒంటాకే పర్వతాన్ని రెండుసార్లు అధిరోహించారు. అది కూడా బూట్లు ధరించకుండా స్నీకర్స్‌తో ఎక్కి గైడ్‌నే ఆశ్చర్యపరిచారు. 100 ఏళ్ల వయసులో ఆషియా మందిరంలోని అతి పొడవైన రాతి మెట్లెక్కారు. ఇప్పటిదాకా అత్యంత వృద్ధురాలిగా ఉన్న స్పెయిన్‌కు చెందిన మరియా బ్రాన్యాస్ మొరెరా (117) మంగళవారం కన్నుమూయడంతో ఇటుకాకు రికార్డు దక్కింది. ప్రపంచంలో అత్యంత ఎక్కువ కాలం బతికిన వ్యక్తి ఫ్రెంచ్ మహిళ జీన్ లూయిస్ కాల్మెంట్. ఆమె 122 ఏళ్ల 164 రోజులు జీవించి 1997లో మరణించారు. -
ఎటువంటి ‘చార్జీ’లు లేకుండానే పింఛన్ ఇవ్వండి
సాక్షి,అమరావతి: ఎన్నికల సంఘం ఆదేశాలతో అవ్వాతాతల పింఛన్ సొమ్మును వారి బ్యాంక్ ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పింఛన్ సొమ్మును ఎలాంటి చార్జీలకు మినహాయించుకోకుండా ఇవ్వాలని బ్యాంక్‌లను రాష్ట్ర బ్యాంకర్ల సంఘం (ఎస్ఎల్బీసీ) ఆదేశించినట్లు సెర్ప్ అధికారులు గురువారం తెలిపారు. అవ్వాతాతలు తమ బ్యాంక్ అకౌంట్లను చాలా కాలంగా ఉపయోగించని కారణంగా ఆ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ లేదు.దీంతో ఆయా అకౌంట్లకు బ్యాంక్‌లు చార్జీలు విధిస్తున్నాయి. దీనిపై దృష్టి పెట్టిన ప్రభుత్వం..అవ్వతాతలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా వారు పింఛన్ డబ్బులు డ్రా చేసుకునే సమయంలో ఎటువంటి చార్జీలను బ్యాంక్‌లు తీసుకోకుండా చర్యలు తీసుకుంది. కాగా, మొత్తం లబి్ధదారులు 65.94 లక్షల మందిలో 48.92 లక్షల మందికి వారి బ్యాంక్ ఖాతాల్లో పింఛన్ సొమ్ము జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.అయితే, వారందరి బ్యాంక్ ఖాతాల్లో బుధవారమే అధికారులు డబ్బులు జమ చేయగా, అందులో 74,399 మందికి వారి సాంకేతిక కారణాలు కారణంగా సొమ్ము జమ కాలేదు. వీరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పింఛన్ అందేలా వారి ఇళ్ల వద్దనే పింఛన్ పంపిణీకి చర్యలు తీసుకుంటామని సెర్ప్ అధికారులు తెలిపారు. కాగా, మే నెలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 65,49,864 మంది లబి్ధదారులకు పింఛన్ల పంపిణీ నిమిత్తం రూ.1,945.39 కోట్లు ప్రభుత్వం విడుదల చేయగా గురువారం సాయంత్రం వరకు డీబీటీ విధానంలో 48.92 లక్షల మంది లబి్ధదారులలో 48.17 లక్షల మందికి వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ తెలిపింది. దివ్యాంగులు, మంచం/వీల్‌చైర్‌కు పరిమితమైన వారిలో 16.57 లక్షల మందికి వారి ఇంటి వద్దనే పింఛన్ పంపిణీ చేయాలని నిర్ణయించగా, అందులో 15.13 లక్షల మందికి గురువారం నాటికి పంపిణీ పూర్తయినట్లు వివరించింది. డీబీటీ విధానంలో 98.47% మందికి, లబి్ధదారుల ఇంటి వద్దనే పంపిణీ చేసేవారిలో 91.34% మందికి పంపిణీ పూర్తయినట్లు పేర్కొంది. -
పింఛన్ కోసం.. నలుగురు మృత్యువాత
సాక్షి నెట్వర్క్: అవ్వాతాతలు, వృద్ధులు, వితంతువులు తదితరుల ఇళ్లకే వెళ్లి ప్రతీనెలా ఠంఛనుగా ఒకటో తేదీ పొద్దున్నే వలంటీర్ల ద్వారా పింఛన్లను అందజేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ విధానంపై టీడీపీ–బీజేపీ–జనసేన కూటమి అక్కసుకు వారు బలవుతున్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ మైలేజీ వస్తుందేమోనన్న దుగ్థతో కూటమి పార్టీలు ఎన్నికల సంఘానికి పదేపదే ఇ చ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో గత నెలలో సచివాలయాల వద్ద ఇవ్వగా దీనిపైనా కూటమి అభ్యంతరాలు చెప్పడంతో ఈనెల బ్యాంకుల్లో పింఛన్ మొత్తం జమచేయమని ఈసీ ఆదేశించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు ఖాతాలున్న వారికి బ్యాంకుల్లో పింఛన్లను జమచేసింది. ఈ నేపథ్యంలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకులకు తరలివెళ్లిన అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులు భగభగలాడుతున్న మండుటెండల్లో నానా అవస్థలు పడ్డారు. ఇలా ఎండలకు తాళలేక వడదెబ్బతో ముగ్గురు మృత్యువాత పడగా మరొకరు పెన్షన్ ఎలా తెచ్చుకోవాలో తెలీక చింతిస్తూ మరణించారు. వివరాలివీ.. చిత్తూరులో జిల్లాలో స్పృహతప్పి.. చిత్తూరు జిల్లా కార్వేటినగరం పరిధిలోని పద్మసరస్సు ఎస్టీ కాలనీకి చెందిన చిన్నముత్తయ్య (గోపాలయ్య) మామిడి తోటలో కాపలాదారు. పింఛన్ కోసం బ్యాంకుకు వెళ్లి తిరిగి వస్తుండగా జీలగల్లు ప్రాంతంలో ఎండ వేడికి తాళలేక స్పృహతప్పి పడిపోయాడు. స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పెన్షన్ కోసం చింతిస్తూ.. ఇన్నాళ్లూ ఇంటికే వచ్చిన పింఛన్ సొమ్ము బ్యాంకులో జమకావడంతో ఎలా తెచ్చుకోవాలో తెలీక శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెమళ్లదిన్నె ఎస్టీ కాలనీకి చెందిన రాగి తిరుపాలమ్మ (75) చింతిస్తూ గురువారం మృతిచెందింది. తిరుపాలమ్మ బుధవారం పింఛను డబ్బుల కోసం సచివాలయం వద్దకు వెళ్లగా బ్యాంకు ఖాతాలో జమ అయినట్లు సమాచారం ఇచ్చారు. కానీ, డబ్బులు చేతికి అందలేదనే దిగులుకు తోడు ఆ డబ్బుల్ని ఎలా తెచ్చుకోవాలో తెలీక చింతిస్తూ తెల్లవారుజామున ప్రాణాలు విడిచింది. పింఛను తీసుకున్న పది నిమిషాలకే వడదెబ్బ.. అన్నమయ్య జిల్లా పెనగలూరుకు చెందిన బుజ్జమ్మ (60) బ్యాంకులో పింఛన్ తీసుకుని ఇంటికి బయల్దేరుతుండగా ఎండవేడిమి తాళలేక దారిలోనే కుప్పకూలింది. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మరణించింది. బ్యాంకు బయటే కుప్పకూలి.. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొటాలకు చెందిన వెంకట నాగులు (72) తన ఖాతాలో పింఛను డబ్బులు జమకావడంతో ఏ.రంగంపేటలోని బ్యాంకుకు వెళ్లాడు. ఎండ వేడిమికి తట్టుకోలేక బ్యాంకు వెలుపలగుండెపోటుతో కుప్పకూలిపడిపోయాడు. తిరుపతి రుయాలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
నోటిఫికేషన్ వచ్చిన 5 రోజుల్లో ఇంటి వద్ద ఓటుకు దరఖాస్తు
సాక్షి, అమరావతి: పోలింగ్ కేంద్రం వరకు రాలేని వృద్ధులు, దివ్యాంగులకు ఈ ఎన్నికల్లో ఇంటి వద్దే ఓటు వేసే సౌకర్యం కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) నిర్ణయం తీసుకుంది. దేశంలో 85 ఏళ్లు పైబడిన ఓటర్లు, 40 శాతం, అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగ ఓటర్లు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ఈమేరకు రాష్ట్రాల వారీగా ఇంటి వద్దే ఓటు వేసేందుకు అర్హత ఉన్న ఓటర్ల సంఖ్యను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధు శుక్రవారం ప్రకటించారు. వీరికి ఇంటి వద్దే ఓటు వేయాలనేది తప్పనిసరి కాదని, ఇది ఐచ్ఛికం మాత్రమేనని చెప్పారు. ఇటువంటి ఓటర్లు దేశవ్యాప్తంగా 1.70 కోట్లకు పైగా ఉన్నట్లు సీఈసీ తెలిపింది. ఇందులో 85 ఏళ్లు పైబడిన వారు 81 లక్షలకు పైగా, దివ్యాంగులు 90 లక్షలకుపైగా ఉన్నారు. 85 ఏళ్లు పైబడిన ఓటర్లలో మహిళలు ఎక్కువ ఉన్నారు. వీరిలో 33.84 లక్షల మంది పురుషులు కాగా, 47.27 లక్షల మంది మహిళా ఓటర్లు, 18 మంది థర్డ్ జెండర్లు ఉన్నారు. 40 శాతం వైకల్యం ఉన్న ఓటర్లలో 53.64 లక్షల మంది పురుషులు, 36.42 లక్షల మంది మహిళలు, 442 మంది థర్డ్ జెండర్లు ఉన్నారు. ఈ వర్గాల వారికి ఇంటి వద్దే ఓటు వేసే సదుపాయం కల్పించడం ప్రగతిశీల చర్యగా ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ వర్గాలకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేసే సమయంలో ఇబ్బందులు కలగకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఈ సదుపాయాన్ని పొందే విధానం సరళంగా, సమగ్రంగా, పారదర్శకంగా కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించింది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన ఐదు రోజుల్లోగా అర్హులైన ఓటర్లు ఇంటి వద్ద ఓటు వేసేందుకు 12 డి ఫారమ్‌ను పూర్తి చేసి రిటర్నింగ్ అధికారికి ఇవ్వాలి. దివ్యాంగులు 12 డి ఫామ్‌తో పాటు వైకల్య ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. వీరి నుంచి 12 డి ఫామ్‌ను బూత్ లెవల్ ఆఫీసర్ సేకరిస్తారు. జవాబుదారీ, పాదర్శకత కోసం ఇంటి వద్ద ఓటు వేసే వారి వివరాలను అభ్యర్ధులకు అందుబాటులో ఉంచుతారు. అవసరమైతే అభ్యర్థులు ఈ ప్రక్రియను పర్యవేక్షించుకోవచ్చు. ఈ ఓటర్ల ఇళ్లకు భద్రతా అధికారులతో పాటు ప్రత్యేక పోలింగ్ బృందం వెళ్తుంది. ఎప్పుడు ఇంటికి వస్తారో ముందుగానే ఆ ఓటర్లకు తెలియజేస్తారు. ఇంటి వద్ద ఓటు వేసే పూర్తి ప్రక్రియను వీడియో తీస్తారు. ఓటు ఎవరికి వేశారో తెలియకుండా గోప్యతను పాటిస్తారు. ఇంటి వద్ద ఓటు వేసిన తరువాత ఆ బ్యాలెట్లను భద్రంగా బ్యాక్సుల్లో ఉంచి తిరిగి రిటర్నింగ్ అధికారికి స్వాధీనం చేస్తారు. రాష్ట్రంలో 85 ఏళ్లు పైబడిన ఓటర్లు మొత్తం ఓటర్లు 2,11,088 పురుషులు 84,155 మహిళలు 1,26,927 థర్డ్ జెండర్ 6 రాష్ట్రంలో 40 శాతం వైకల్యం గల ఓటర్లు మొత్తం ఓటర్లు 5,18,193 పురుషులు 3,02,374 మహిళలు 2,15,795 థర్డ్ జెండర్ 24 -
బాధపడొద్దు.. నేనున్నా
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆదివారం ‘‘మేమంతా సిద్ధం’’ బస్సు యాత్ర సందర్భంగా పలువురు అనారోగ్య బాధితులు, వృద్ధులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి తమ సమస్యలు విన్నవించి ఆదుకోవాలని అభ్యర్ధించారు. వారి కష్టాలను సావధానంగా ఆలకించిన సీఎం జగన్ ప్రతి ఒక్కరి నుంచి అర్జీలను స్వీకరించారు. ‘‘బాధపడొద్దు.. నేను ఉన్నాను. తప్పకుండా మీ సమస్యలను త్వరగా పరిష్కరిస్తా’’ అని భరోసా ఇచ్చి అర్జీలను వ్యక్తిగత సిబ్బందికి అందజేశారు. – సింగరాయకొండ (మర్రిపూడి) పొన్నలూరు/పీసీపల్లి టీడీపీ వాళ్లు పొలం కబ్జా చేశారయ్యా.. మర్రిపూడి మండలం చిలంకూరు గ్రామానికి చెందిన రాయిపాటి లక్ష్మీనరసయ్య (70) వైఎస్సార్ మరణానంతరం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ పదేళ్ల పాటు గడ్డం పెంచాడు. 2019 ఎన్నికలకు ముందు జగన్‌తో పాటు పాదయాత్రలో పాల్గొన్నాడు. దీనిపై కక్షగట్టిన టీడీపీ సానుభూతిపరులు లక్ష్మీనరసయ్యకి చెందిన 9 ఎకరాల పొలాన్ని కబ్జా చేశారు. బస్సు యాత్ర సందర్భంగా ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తేవడంతో పెద్దాయన సమస్యను నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగం కోసం వినతి 2017లో బీకాం చదివిన పీసీపల్లి మండలం అలవలపాడు కొత్తూరుకు చెందిన రావి సురేష్ ప్రస్తుతం వలంటీర్‌గా పని చేస్తున్నాడు. కుటుంబ పోషణ భారంగా ఉన్నందున ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ సీఎం జగన్‌కు వినతిపత్రం అందజేశాడు. ట్రై సైకిల్ ఇప్పించండన్నా బస్సు యాత్ర కనిగిరి మండలం అజీజ్పురానికి చేరుకున్న సమయంలో గ్రామానికి చెందిన కేశారపు దేవమ్మ అనే దివ్యాంగురాలు సీఎం జగన్‌ను కలిసింది. దివంగత వైఎస్సార్ గతంలో తనకు ఇచి్చన ట్రైసైకిల్ మూలనపడినందున కొత్తది ఇప్పించాలని విన్నవించింది. నలుగురు బిడ్డలున్నా... ‘‘చూపు కోల్పోయి పని చేయడానికి వీలు లేకుండా పోయింది. కుటుంబ పోషణ అంతంత మాత్రం. ఆర్థిక సాయం చేయండి సారూ’’ అంటూ కనిగిరి మండలం అజీస్‌పురంలో కేశారపు రోశయ్య వేడుకున్నాడు. తనకు నలుగురు పిల్లలున్నా పట్టించుకోవడం లేదని, ఒంటరినయ్యానని సీఎం జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు. ఆరి్థక సాయం చేసి ఆదుకోవాలంటూ విలపించాడు. దివ్యాంగుడిని ఆదుకోండయ్యా కనిగిరి మండలం ఏరువారిపల్లిలో గ్రామానికి చెందిన లక్కె మంగమ్మ దివ్యాంగుడైన తన కుమారుడు లక్కె సాయిని వెంటబెట్టుకుని సీఎం జగన్‌ను కలిసింది. మన ప్రభుత్వంలో దివ్యాంగ పింఛన్ వస్తోందని తెలిపింది. తన కుమారుడికి ఆరి్థక సాయం చేసి ఆదుకోవాలంటూ విన్నవించింది. ► శారీరక ఎదుగుదల లేని పొన్నలూరు గ్రామానికి చెందిన వెలగపూడి ఏసుబాబు అర్హత ఉన్నా తనకు సదరం సరి్టఫికెట్ మంజూరు చేయడం లేదని, పింఛన్ పొందలేకపోతున్నానని విన్నవించాడు. ► పరుచూరివారిపాలెం గ్రామానికి చెందిన నేలపాటి నరసింహం ఎడమ కాలు రోడ్డు ప్రమాదంలో విరిగిపోయింది. తనకు మెరుగైన వైద్యం అందించాలని సీఎంకు విన్నవించాడు. ► కల్లూవారిపాలెం గ్రామానికి చెందిన కప్పల రియాగ్రేస్కు రెండు కళ్లు కనిపించకపోవడంతో శస్త్ర చికిత్స చేశారు. అయితే దురదృష్టవశాత్తూ శస్త్ర చికిత్స విఫలమైందని, మరోసారి శస్త్ర చికిత్స కోసం ఆర్థికంగా ఆదుకోవాలని ఆమె తల్లిదండ్రులు కోరారు. ► మరికొందరు వృద్ధులు తమకు ఆరోగ్య సమస్యలున్నాయని, వాటిని నయం చేసేందుకు వైద్య సాయం అందించాలని వేడుకున్నారు. -
చంద్రబాబు కుట్రలు.. పెన్షన్ కోసం వృద్ధుల పాట్లు
సాక్షి, విజయవాడ: హేయమైన రాజకీయాలకు నిరుపేదలకు బలి అవుతున్నారు. చంద్రబాబు, ప్రతిపక్ష పార్టీల కుట్రతో వృద్దులు పెన్షన్ కోసం పాట్లు పడుతున్నారు. ప్రతినెల ఇంటికే పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఈ నెల లేదు. ఎన్నిలకు కమిషన్ కి ఫిర్యాదు చెయ్యడంతో వాలంటీర్లు సేవలు బంద్ అయ్యాయి. నడవలేని వృద్దులు ఎండలో వస్తున్నారు. సచివాలయాల వద్ద పెన్షనర్లు కు సౌకర్యాలు కల్పించి పెన్షన్ డబ్బులు అందిస్తున్నారు సిబ్బంది. కానీ ఎండలలో సచివాలయాలకు రావాలంటే అష్టకష్టాలు పడుతున్నారు. చంద్రబాబు చేసిన కుట్రకు మేము బలి అయ్యామని, మాకొద్దు చంద్రబాబు అంటున్నారు. ఓటుతో చంద్రబాబు కి బుద్ధి చెప్తామని పెన్షనర్లు చెబుతున్నారు. -
ఈయన ఓటేశారు.. ఆ తర్వాత ఏమన్నారంటే..
సాక్షి, హైదరాబాద్: పవిత్రమైన ఓటును పవిత్రంగానే ఉపయోగించుకోవాలి.. ఇది ఓటర్లకు పెద్దలు ఇస్తున్న సందేశం. తెలంగాణ ఓటర్ల జాతర నేపథ్యంలో.. ఎనిమిది పదుల వయసు దాటిన కొందరు చురుకుగా, అదీ ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు సైతం ఇంట్లో వాళ్ల సాయంతో ఓటింగ్ పాల్గొని.. ఓటుకు దూరంగా ఉండొద్దని మిగతా వాళ్లకు పిలుపు ఇస్తున్నారు. అంబర్‌పేటలో 92 సంవత్సరాల వృద్ధుడు ఓటు హక్కు వినియోగించుకుని.. యువత ఇంట్లో ఉండకుండా బయటికి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పారు. అలాగే.. శివానంద రిహబిలిటేషన్ లో వృద్దులు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినయోగించుకున్న దృశ్యాలు కనిపించాయి. మరోవైపు దివ్యాంగులు సైతం ఎన్నికల్లో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. తెలంగాణ ఎన్నికల కోసం తొలిసారిగా.. ఓట్ ఫ్రమ్ హోం ద్వారా 27వేలమందికి పైగా వృద్ధులు, దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకోవడం తెలిసిందే. మిగిలిన వాళ్లు ఇవాళ నేరుగా పోలింగ్‌కేంద్రాలకు వెళ్తూ ఓటేస్తున్నారు. తద్వారా ఓటు హక్కు అందరి బాధ్యత అని గుర్తు చేస్తున్నారు. -
ఇంట్లో తల్లిదండ్రులు ఒంటరిగా ఉన్నారా? ఇకపై భయపడాల్సిన పనిలేదు
పిల్లలు ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు ఇంట్లో ఒంటరిగా ఉంటారు. ఇలాంటి ఒంటరి తల్లిదండ్రులను ప్రమాదాల బారి నుంచి రక్షించడానికి కేరళ స్టార్టప్ ‘స్మార్ట్‌కేర్’ ఎమర్జెన్సీ అలర్ట్ టెక్నాలజీతో కొన్ని పరికరాలను రూపొందించింది.... హైదరాబాద్ కూకట్‌పల్లిలోని రిటైర్డ్ ఉద్యోగి రాజేశ్వరరావు ఒంటరిగా ఉంటాడు. భార్య రెండు సంవత్సరాల క్రితం చనిపోయింది. కొడుకు, కోడలు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. విశాఖపట్టణంలో ఉండే అనసూయమ్మకు ఒక్కగానొక్క కూతురు పుణెలో ఉద్యోగం చేస్తుంది. అనసూయమ్మ భర్త చనిపోయి చాలాకాలం అయింది.రాజేశ్వరరావు ఒకరోజు ఇంట్లో కాలు జారిపడ్డాడు. ఆ సమయంలో వేరే ఊరి నుంచి వచ్చిన బంధువు ఒకరు ఉండడంతో ఆయనను త్వరగా హాస్పిటల్‌కు తీసుకువెళ్లాడు.అనసూయమ్మకు కూడా ఇలాగే జరిగింది. పడిన తర్వాత చాలాసేపటికి ఎవరో ఇంటికి రావడంతో ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లారు. మరింత ఆలస్యం అయి ఉంటే అనసూయమ్మ ప్రమాదంలో పడేది. అయితే అన్ని సందర్భాల్లోనూ ఎవరో ఒకరు వచ్చి బాధితులను హుటాహుటిన హాస్పిటల్‌కు తీసుకువెళతారని గ్యారెంటీ లేదు. ఇక కేరళ విషయానికి వస్తే ఒంటరిగా జీవిస్తున్న వృద్ధుల సంఖ్య అక్కడ ఎక్కువగా ఉంది. వారు ప్రమాదాల బారిన పడిన సంఘటనలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసిందే... స్మార్ట్‌కేర్.కేరళకు చెందిన వేణునాథ్ స్వీడన్లో చదువుకునే రోజుల్లో ఒక వృద్ధురాలి ఇంట్లో అద్దెకు ఉండేవాడు. ఆమె వయసు ఎనభై సంవత్సరాలు. ఆ వృద్ధురాలి ఒంటరి జీవితం చూసి వేణుకు జాలిగా అనిపించేది. ఒక రాత్రి ఆమె అనారోగ్యానికి గురైంది. సీరియస్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఆమె తన చేతికి ఉన్న కంకణంలాంటి దానిపై ఉన్న బటన్‌ను నొక్కింది. వెంటనే టేబుల్ మీద ఉన్న పరికరం తనతో మాట్లాడడం మొదలుపెట్టింది. తనకు ఇబ్బందిగా ఉన్న విషయం గురించి చెప్పింది ఆమె. ఇరవై నిమిషాల లోపే వైద్యుడు, సహాయక బృందం ఆమె ఇంటికి వచ్చారు. ప్రాథమిక చికిత్స చేసి హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. ఆ సమయంలో ఆ పరికరం గురించి వేణుకు విపరీతమైన ఆసక్తి ఏర్పడి దాని గురించి వివరాలు తెలుసుకున్నాడు. మన దేశంలో కూడా ఇలాంటి టెక్నాలజీ ఉంటే బాగుండేది అనుకున్నాడు. స్వీడన్లో డాటా సైంటిస్ట్‌గా కొంతకాలం ఉద్యోగం చేసిన వేణు ఆ తరువాత ఇండియాకు వచ్చి స్నేహితుడు అరుణ్ నాయర్‌తో కలిసి ‘అన్స్ఫ్రిడ్ స్మార్ట్‌కేర్ ప్రొడక్స్’ కంపెనీ మొదలు పెట్టాడు.అంతకుముందు ఉద్యోగం చేస్తూనే జీతంలో సగం మొత్తాన్ని వృద్ధులకు ఉపకరించే ఉపకరణాల గురించి రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్పై ఖర్చు చేసేవాడు. ఎంతోమంది నిపుణులతో మాట్లాడేవాడు. స్మార్ట్‌కేర్ ఉత్పత్తుల్లో ఒకటి... వైర్లెస్ ఫాల్ సెన్సర్. దీన్ని బాత్రూమ్ గోడలకు బిగిస్తారు. వృద్ధులు పడిపోతే కంపెనీకి అలర్ట్ పంపుతుంది. కంపెనీ వెంటనే వైద్యులను ప్రమాద బాధితుల ఇంటికి పంపుతుంది. చేతికి ధరించే ‘విబ్బీ డిటెక్టర్’ కూడా వృద్ధులు ప్రమాదంలో ఉన్నప్పుడు అలర్ట్ పంపుతుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధ పడేవారికి ఇది బాగా ఉపకరిస్తుంది. ‘హీట్ అలారమ్’ అనేది వైర్లెస్ ఇండోర్ సెన్సర్. లాకెట్‌లా మెడలో ధరించవచ్చు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు హెచ్చరిస్తుంది. తక్కువ బరువుతో ఉండే ‘మైఎమీ’ లాకెట్ వృద్ధులు ఇల్లు దాటి బయటికి వెళ్లినప్పుడు ఉపయోగపడుతుంది. ఆపద సమయంలో సహాయం కోసం దీనిపై ఉన్న బటన్‌ను నొక్కాలి...‘స్మార్ట్‌కేర్’ ఉత్పత్తుల్లో ఇవి కొన్ని మాత్రమే.‘స్మార్ట్‌కేర్’ నలభై హాస్పిటల్స్‌తో కలిసి పనిచేస్తోంది. కోల్కత్తా, ముంబై, చెన్నై, దిల్లీ, బెంగళూరు నగరాలకు కూడా కంపెనీ విస్తరించే ప్రయత్నాల్లో ఉంది. -
అమ్మమ్మలకు అండగా.. మతిమరుపుతో బాధపడేవాళ్లకు ఇది బెస్ట్ సొల్యూషన్
మన చుట్టూ మనకు తెలియకుండానే ఎంతో మంది రకరకాల బాధలకు లోనవుతుంటారు. వారిలో ముఖ్యంగా వృద్ధులు, వికలాంగుల సమస్యలకు సరైన పరిష్కారం తెలియక ఇబ్బందులు పడుతుంటారు. వారి మానాన వారిని అలాగే వదిలేయడం కన్నా పరిష్కారాన్ని కనుగొంటాను అనుకున్నాడు. తనదైన మార్గంలో ప్రయత్నించాడు. విజయం సాధించాడు. సత్కారాలను పొందుతున్నాడు హైదరాబాద్ వాసి హేమేష్ చదలవాడ. దేశవ్యాప్తంగా వివిధ రంగాలలో సేవలు అందించిన 21 ఏళ్ల లోపు 20 మంది యువ సాధకులను ఢిల్లీలో మొన్న జరిగిన ‘అన్‌స్టాపబుల్ 21’ వేదికగా సత్కరించారు. హ్యూమన్ స్టడీస్, సైన్స్, క్రీడలు, ఫైన్ ఆర్ట్స్, పెర్ఫార్మింగ్ ఆర్ట్, సోషల్ ఇంపాక్ట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనే ఏడు రంగాలలో ప్రతిభావంతులైన యువతకు ఈ సత్కారాన్ని అందజేశారు. వారిలో హైదరాబాద్‌కు చెందిన 16 ఏళ్ల హేమేష్ చదలవాడ ఎలక్ట్రానిక్స్ రంగంలో కనబరిచిన ప్రతిభకు గుర్తింపు పొందాడు. వృద్ధులకు సహాయం.. హేమేష్ పన్నెండేళ్ల వయసు నుంచి ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్ రంగంలో గణనీయమైన ప్రతిభను చూపుతున్నాడు. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న అమ్మమ్మను చూసి ఆమెకు ఏదైనా సాయం చేయాలనుకున్నాడు. తన ఆలోచనల గురించి హేమేష్ చెబుతూ ‘నడిచేటప్పుడు అమ్మమ్మ అడుగులు తడబడుతుండేవి. మతిమరపు ఉండేది. ఆమెకు తన మీద తనకు కంట్రోల్ ఉండేది కాదు. కొన్నిసార్లు అర్థరాత్రి మంచంపై నుంచి లేచి ఎటో వెళ్లిపోయేది. దీంతో ఆమెను కనిపెట్టి ఉండటం కష్టమయ్యేది. అమ్మమ్మకు, ఆమెను చూసుకునే మాకూ ఇదో సవాల్‌గా ఉండేది. కొన్ని అందుబాటులో ఉన్న డివైజ్‌లను ప్రయత్నించి చూశాం. కానీ, ఏ మాత్రం సంతృప్తిగా అనిపించలేదు. అమ్మమ్మకు సాయపడే డివైజ్‌ను నేనే సొంతంగా తయారుచేయాలనుకున్నాను’ అని తనలో రూపుదిద్దుకున్న ఆలోచనను వివరిస్తాడు. హేమేష్ కృషి, పట్టుదల, అంకితభావానికి అతని తల్లిదండ్రులు కిశోర్, సంధ్యలు ప్రోత్సాహం అందించారు. పరికరం ఎలా పనిచేస్తుందంటే.. ఈ పరికరం వాచ్‌లాగా మణికట్టుకూ కట్టుకోవచ్చు. బ్యాడ్జ్గానూ ధరించవచ్చు. రోగి నడక, భంగిమ, శరీర ఉష్ణోగ్రత, నాడిని పర్యవేక్షిస్తుంది. నీళ్లు జారిపడుతుండే శబ్దాన్ని కూడా గుర్తించగలదు. మనిషి దూరంగా తిరుగుతున్నప్పుడు లేదా పడిపోవడం వంటి ప్రమాదంలో ఉన్నప్పుడు వెంటనే తెలియజేస్తుంది. ఇంకా అలారంలో ‘పిల్‌బాక్స్’ ఫీచర్ కూడా ఉంటుంది. ఇది రోగులు వారి మందులు తీసుకునే సమయం వచ్చినప్పుడు హెచ్చరికలను పంపుతుంది. ‘ఈ డివైజ్ మా అమ్మమ్మ కోసం తయారు చేసినప్పుడు ఇంటర్నెట్ సరైన మార్గం చూపింది. అయితే, ఈ పరికరం పూర్తయ్యేసరికి అమ్మమ్మ చనిపోయారు’ అని హేమేష్ తెలిపాడు. ఇప్పుడీ అబ్బాయి 12వ తరగతి చదువుతున్నాడు. తన తదుపరి ప్రాజెక్ట్స్‌తో ఎలక్ట్రానిక్స్, రోబోటిక్ రంగంలో మరిన్ని అడుగులు వేస్తున్నట్టుగా వివరించాడు. 2021లో ప్రధానమంత్రి చేతుల మీదుగా రాష్ట్రీయ బాల పురస్కారాన్ని అందుకున్నాడు. పేరున్న కంపెనీల నుంచి గ్రాంట్లను పొందాడు. – నిర్మలారెడ్డి -
పల్లెవెలుగు బస్సుల్లో టీ9 టికెట్
సాక్షి, హైదరాబాద్: పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే వృద్ధులు, మహిళల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా టీ9 పేరుతో కొత్త టికెట్‌ను అందుబాటులోకి తెస్తోంది. ప్రయాణ చార్జీ భారాన్ని కొంతమేర తగ్గించే ఈ టికెట్లను ఆదివారం నుంచి అమలులోకి రానుంది. పల్లె వెలుగు బస్సుల్లో 60 కి.మీ. నిడివి ప్రయాణించేవారు రూ.100 చెల్లించి ఈ టీ9 టికెట్ కొంటే, అప్ అండ్ డౌన్‌కు అదే వర్తిస్తుంది. విడిగా మరో టికెట్ కొనాల్సిన అవసరం ఉండదు. 60 కి.మీ. పరిధి దాటితే మాత్రం ఇది వర్తించదు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఈ వెసులుబాటు ఉంటుంది. పల్లెవెలుగు బస్సుల్లో 60 కి.మీ. నిడివికి రెండువైపులా (అప్ అండ్ డౌన్) ప్రయాణానికి దాదాపు రూ.120 టికెట్ చార్జి అవుతుంది. ఒకేసారి టీ9 టికెట్ కొంటే రూ.100 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. దీంతో కనీసం రూ.20 ఆదా అవుతుంది. ఆ ప్రయాణ మార్గంలో టోల్గేట్ ఉంటే టికెట్‌పై రూ.20 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. టీ9 టికెట్‌తో టోల్ చార్జి భారం కూడా ఉండదు. మొత్తంగా రూ.40 ఆదా అయినట్టవుతుంది. ఆటోల దూకుడుకు కళ్లెం చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఆటోలు విపరీతంగా పెరిగిపోయి, బస్సు ప్రయాణికులను ఎగరేసుకుపోతున్నాయి. ఇప్పుడు ఈ టికెట్ రూపంలో కనీసం రూ.20 ఆదాతో ఆటో తాకిడి నుంచి బయటపడేందుకు యత్నించనుంది. వెళ్లేప్పుడు ఓ పల్లెవెలుగు బస్సులో ఈ టీ9 టికెట్ కొంటే, వచ్చేప్పుడు మరో పల్లెవెలుగు బస్సులో దాన్ని విని యోగించుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. అయితే, దాన్ని ఆ మార్గంలో ఒకే ప్రయాణానికి మాత్రమే వాడాల్సి ఉంటుంది. మహిళలు, 60 ఏళ్లు పైబడ్డ వృద్ధులు వయసు ధ్రువీకరణ పత్రం చూపి ఈ వెసులుబాటు పొందాల్సి ఉంటుంది. సాయంత్రం 6తో ఈ అవకాశం ముగియనున్నందున కండక్టర్లు సాయంత్రం 4 వరకు మాత్ర మే ఆ టికెట్లు జారీ చేస్తారు. కాగా, పల్లెవెలుగు బస్సుల్లో ప్రయాణించే వృద్ధులు, మహిళలకి ఆర్థికంగా వెసులుబాటు కల్పిం చేలా ఈ కొత్త టికెట్‌ను అందుబాటులోకి తెస్తున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన బస్‌భవన్‌లో ఈ టికెట్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ టికెట్‌కు సంబంధించిన సమాచారం కావాలనుకునేవారు ఆర్టీసీ కాల్‌సెంటర్ (ఫోన్ నెంబర్లు 040–6944 0000, 040–23450033)ను సంప్రదించొచ్చని సజ్జనార్ తెలిపారు. -
ఆ ఆశ్రమం..‘మమత’ల కోవెల
నందిగామ(ఎన్టీఆర్ జిల్లా): కన్నబిడ్డలకు భారమై, ఆత్మీయుల ఆదరణకు దూరమై క్షణం ఒక యుగంలా గడుపుతున్న అవ్వాతాతలను అక్కున చేర్చుకుని ‘మమత’ను పంచుతోంది ఎన్టీఆర్ జిల్లా లచ్చపాలెంలోని వృద్ధాశ్రమం. పచ్చని చెట్ల నడుమ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆశ్రమం నడుస్తోంది. మలిదశలో ఉన్న వారి మనస్సుకు ప్రశాంతతను ఇస్తోంది. సేవే లక్ష్యంగా ఆశ్రమాన్ని నిర్వహిస్తూ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం లింగాలపాడు గ్రామానికి చెందిన వేముగంటి మమత. ఆహ్లాదకర వాతావరణంలో ఆత్మీయతలను పంచే వృద్ధాశ్రమంపై ప్రత్యేక కథనం.. సొంతూరుకు ఏదో చేయాలని.. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం లింగాలపాడు గ్రామానికి చెందిన వేముగంటి మమత ప్రస్తుతం హైదరాబాదులో బుక్ డిజైనింగ్ కంప్యూటర్ వర్క్ చేస్తుంటారు. ఆమె భర్త చక్రవర్తి వ్యాపారి. వీరు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. చిన్నతనం నుంచి సేవా దృక్పథం కలిగిన మమత హైదరాబాద్‌లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాను పెరిగిన గ్రామానికి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో లింగాలపాడు సమీపంలోని లచ్చపాలెం గ్రామంలో 2020 సంవత్సరంలో 50 సెంట్ల స్థలంలో సుమారు రూ.90 లక్షల వరకు వెచ్చించి ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. అభయం సొసైటీ ద్వారా పి.వి.ఆర్.కె.ప్రసాద్ శేష సదన్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఆశ్రమంలో వృద్ధులకు అవసరమైన అన్ని సదుపాయాలు సమకూర్చారు. సాయంత్రం వేళ ఆహ్లాదం కోసం పచ్చని గార్డెన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆశ్రమంలో 22 మంది ఆశ్రయం పొందుతున్నారు. నందిగామ ప్రాంత వాసుల సహకారం.. సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న మమత తన దగ్గర ఉన్న నగదుతో పాటు మరో రూ.30 లక్షల వరకు బ్యాంక్ ద్వారా రుణం తీసుకొని మొత్తం సుమారు రూ.90 లక్షలతో ఆశ్రమ నిర్మాణం పూర్తి చేశారు. ఆమె ఆలోచనకు పలువురు దాతలు సహకారం అందించారు. ఆశ్రమానికి తరచూ వచ్చి వెళుతూ వృద్ధుల బాగోగులు చూసుకుంటున్నారు. నందిగామ చుట్టు పక్కల ప్రాంతాల వారు ఆశ్రమంలో జన్మదిన వేడుకలు, వివాహ మహోత్సవ వేడుకలు జరుపుకుంటూ ఆశ్రమానికి మరింత అండగా నిలుస్తున్నారు. రెండేళ్ల నుంచి ఇక్కడే నా భర్త 30 ఏళ్ల కిందట చనిపోయాడు. ప్రస్తుతం నాకు 70 సంవత్సరాలు. పిల్లలు ఉన్నప్పటికీ వాళ్లు నన్ను పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో రెండేళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నా. ఇక్కడ నన్ను సొంత తల్లి లాగా చూసుకుంటున్నారు. నాకు ఇక్కడ ఎంతో ప్రశాంతంగా ఉంటోంది. –కన్నూరి రాజేశ్వరమ్మ, తిరువూరు మరింత అభివృద్ధి చేయాలి చిన్నతనం నుంచి ఎదుటి వారికి సేవ చేయడమంటే ఇష్టం. ఈ ఉద్దేశంతోనే సొంత ఊరిలో ఆశ్రమం ఏర్పాటు చేశా. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేయాలి. ఆశ్రమంలో ఉండేవాళ్లు ప్రశాంతంగా ఉండాలన్న లక్ష్యంతో ప్రకృతి ఒడిలో ఆశ్రమాన్ని నిర్మించాం. –వేముగంటి మమత, ఆశ్రమ నిర్వాహకురాలు -
కన్నపేగు కన్నీరు!
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు ఆమె. ఆమె కొడుకు, ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు అయ్యాయి. కొడుకు, కోడలు ఆమెను ఊళ్లోనే వదిలేసి కామారెడ్డికి వలస వెళ్లారు. తర్వాత కొడుకు బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్లాడు. ఆమె వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో వంట కూడా చేసుకోలేక ఆకలితో అలమటించింది. కోడలికి సమాచారం ఇచ్చినా రాకపోవడంతో గ్రామస్తుల సాయంతో పోలీసులను ఆశ్రయించింది. వారు కోడలిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చినా ఫలితం లేదు. వృద్ధురాలు ఇరుగుపొరుగు వారు నాలుగు మెతుకులు పెడితే తిని కాలం వెళ్లదీసేది. ఆవేదనతో ఓ రోజు ఉరివేసుకుంది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం బండరామేశ్వర్పల్లికి చెందిన ఓ వృద్ధుడు తన కొడుకు పట్టించుకోవడం లేదంటూ ఇటీవల పోలీసులను ఆశ్రయించాడు. ఆయన కష్టపడి ఎనిమిది ఎకరాల భూమి సంపాదించి పెట్టాడు. కుమార్తెలకు పెళ్లిళ్లు అయిపోయాయి. భార్య చనిపోయింది. తాను కష్టపడి సంపాదించిన భూమిని సాగు చేసుకుంటున్న కొడుకు తనకు తిండి కూడా పెట్టక పోవడంతో తల్లడిల్లిపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కొడుకును పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా మార్పు రాలేదని ఆ వృద్ధుడు ఆవేదన చెందుతున్నాడు. సాక్షి, కామారెడ్డి: వారు వయసు మీద పడిన వృద్ధులు.. పిల్లాజెల్లా అంతా ఉన్నా పట్టించుకునేవారు లేక బాధపడుతున్నవారు.. నడిచే శక్తి, పలికే ఓపిక లేక ఇబ్బందిపడుతున్నవారు.. పిడికెడు మెతుకులు పెట్టి, కాసింత చోటు ఇస్తే.. బిడ్డల నీడలో కన్నుమూస్తామని ఆరాటపడుతున్నారు. ఇలాంటి వృద్ధ దంపతుల్లో ఇద్దరు ఉన్నంత కాలం ఎలాగోలా బతికేస్తున్నా.. ఎవరైనా ఒకరు దూరమైన తర్వాత ఒంటరి జీవితం నరకప్రాయంగా మారుతోంది. తోడు కోల్పోయి, బిడ్డల ఆదరణ కరువై మానసికంగా కుంగిపోతున్నారు. వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతూ.. సరైన వైద్యం అందక కన్నుమూస్తున్నారు. మరికొందరు ఈ జీవితం మాకొద్దంటూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవలికాలంలో చాలా చోట్ల వృద్ధుల బలవన్మరణాలు వెలుగు చూస్తున్నాయి. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై.. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణాల్లోనూ చాలా వరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. కొన్ని కుటుంబాల్లో తండ్రులే కాదు తాతలు కూడా కలిసి జీవించారు. ఆ పెద్దల మాట మేరకు ఎవరి పనివారు చేసుకుంటూ ఉండేవారు. కొన్నేళ్లుగా ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి. చాలా కుటుంబాల్లో కన్నవారిని కూడా భారంగా భావించే పరిస్థితి నెలకొంది. ఉద్యోగం, వ్యాపారం పేరుతో పట్టణాలకు వెళ్తున్నవారు కన్నవారిని ఇంటి దగ్గరే వదిలేస్తున్నారు. ఊర్లలోనూ విడిగా ఉంటున్నారు. దీనితో వృద్ధులు ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఆశ్రమాల్లో వదిలేస్తున్నారు ఆర్థికంగా కాస్త వెసులుబాటు ఉన్న కుటుంబాల్లో కొందరు కన్నవారిని ఆశ్రమాల్లో వదిలేస్తున్నారు. తాము ఉద్యోగాలు, వ్యాపారాల్లో బిజీగా ఉండి ఆలనా పాలనా చూడటం ఇబ్బందని చెప్పుకొంటూ డబ్బులు కట్టి ఆశ్రమాల్లో చేర్పిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఇలాంటివి ఎక్కువగా ఉంటున్నాయి. ఆశ్రమాల్లో ఉన్న అలాంటి వృద్ధులను కదిలిస్తే చాలు కన్నీటి పర్యంతమవుతున్నారు. అయినా తమ పిల్లలకు చెడ్డ పేరు రావొద్దని బాధను దిగమింగుకుంటున్నారు. కొందరిని బతికిస్తున్న ‘ఆసరా’ ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లు ఎంతో మంది వృద్ధుల బతుకులకు ‘ఆసరా’గా నిలుస్తున్నాయి. రాష్ట్ర జనాభాలో 41 లక్షల మంది వృద్ధులు ఉండగా.. 15,94,650 మందికి వృద్ధాప్య పింఛన్ అందుతోంది. మందులు, నిత్యావసరాలకు కొంత వరకు పింఛన్ సొమ్ము ఉపయోగపడుతోంది. ఇదే సమయంలో కన్నవారి పింఛన్ డబ్బుల కోసం పిల్లలు వేధిస్తున్న ఘటనలూ ఉన్నాయి. ఆత్మహత్యల్లో 14% వృద్ధులవే.. తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యల ఘటనల్లో 14 శాతం వృద్ధులవే ఉంటున్నాయని ఎన్సీఆర్బీ నివేదిక పేర్కొంటోంది. కన్నబిడ్డల ఆదరణ లేకపోవడం, ఒంటరితనం, అనారోగ్య సమస్యలతో వృద్ధులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఏడాదిలో తెలంగాణలో 8 వేల పైచిలుకు ఆత్మహత్యలు జరిగితే.. అందులో 12 వందల మంది వరకు వృద్ధులు ఉంటున్నారు. రాష్ట్ర జనాభాలో వృద్ధులు 11 శాతం తెలంగాణ జనాభాలో వృద్ధులు పదకొండు శాతం ఉన్నారు. 2021 అంచనాల ప్రకారం రాష్ట్ర జనాభా 3.77 కోట్లుకాగా.. ఇందులో వృద్ధుల సంఖ్య 41 లక్షలు దాటింది. ఇందులో 60–64 ఏళ్ల మధ్య వయసు వారు 12.77 లక్షల మంది.. 65–69 ఏళ్లవారు 10.18 లక్షలు, 70–74 ఏళ్లవారు 8.33 లక్షలు, 75–79 ఏళ్లవారు 5.62 లక్షలు, 80ఏళ్లు పైబడినవారు 4.70 లక్షల మంది ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వం కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలి చాలా కుటుంబాల్లో పేదరికం ఇబ్బందులు సృష్టిస్తోంది. తాను, భార్యాపిల్లలు బతకడమే కష్టమని, ముసలివాళ్లను ఎలా పోషించాలంటూ కొందరు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆర్థికంగా ఉన్న కుటుంబాల్లో మరో రకమైన సమస్య ఉంటోంది. తమకు ముసలివాళ్లు అడ్డుగా ఉంటున్నారంటూ ఆశ్రమాలకు పంపడమో, వేరుగా ఉంచడమో చేస్తున్నారు. ఒంటరితనం, సరైన ఆహారం దొరకకపోవడం, పిల్లలు పట్టించుకోకపోవడంతో వృద్ధులు మానసికంగా కుంగిపోతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొన్ని కుటుంబాల్లో చాదస్తం ఎక్కువైందంటూ వృద్ధులను ఇబ్బంది పెడుతుంటారు. నెలలు, ఏళ్ల తరబడి ఒకేచోట ఉండటంతో చాదస్తం వస్తుంది. అందుకే పెద్దలకు నలుగురితో కలిసి ముచ్చటించుకునే అవకాశం కల్పించాలి. మన దగ్గర ప్రభుత్వమే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ సి.వీరేందర్, సైకాలజిస్ట్, హైదరాబాద్ -
Pensions: ప్రతినెలా ఇదే తంతు.. సర్వర్ మొరాయింపు
కీసర(మేడ్చల్ జిల్లా): ఆసరా పింఛన్ల పంపిణీ ప్రహాసనంగా మారింది. పింఛన్ల సోమ్ము తీసుకునేందుకు వృద్ధులకు ఆగచాట్లు తప్పడం లేదు. సర్వర్లు మొరాయించడంతో వేలిముద్రలు తీసుకోవడం ఆలస్యం అవుతుండటంతో వృద్ధులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. దీంతో పింఛను పంపిణీ కేంద్రాల వద్ద లబ్ధిదారులు బారులుతీరుతున్నారు. ఒక్కోసారి రోజుల తరబడి తిరగాల్సి వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు. ప్రతినెలా ఇదే తంతు నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలో నిలబడాల్సి వస్తోందని వాపోతున్నారు. రోజంతా పింఛన్ కేంద్రం వద్ద ఉన్నా పింఛన్ డబ్బులు తీసుకుంటామన్న నమ్మకం లేదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. తిప్పలు తప్పాలంటే నేరుగా ఖాతాలోకి వేయాలి రెండు, మూడు రోజులుగా పింఛన్ల కోసం తిరుగుతున్నా సర్వర్ సమస్యతో డబ్బులు తీసుకోలేకపోతున్నానని ఎస్వీనగర్‌కు చెందిన మోహన్‌రావు వాపోయారు. మరికొందరు ఉదయం 7 గంటలకు టిఫిన్ తీసుకొని వచ్చి పింఛన్ల డబ్బుల కోసం మధ్యాహ్నం వరకు అక్కడే ఉంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ తిప్పలు తప్పాలంటే తమకు బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా చూడాలని ఉన్నతాధికారులను లబ్ధిదారులు కోరుతున్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో చాలా ప్రాంతాల్లో ఫించన్ డబ్బులను నేరుగా లబ్ధిదారుల ఖాతాలో వేస్తున్నారని మున్సిపాలిటీల్లోనూ ఇది అమలు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు. -
గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆన్ ది ఎర్త్ ఇక లేరు
Oldest Woman Kane Tanaka Dies: ప్రపంచంలో అత్యధిక వయసుతో పేరుబడ్డ వ్యక్తి ఇక లేరు. జపాన్‌కు చెందిన 119 ఏళ్ల కేన్ టనాకా.. సోమవారం కన్నుమూసినట్లు తెలుస్తోంది. జనవరి 2, 1903లో పుట్టిన కేన్ టనాకా.. 2019లోనే ఈ భూమ్మీద అత్యధిక వయసున్న వ్యక్తిగా అధికారికంగా రికార్డుల్లో ఎక్కారు. పశ్చిమ జపాన్‌లోని ఫుకువా నగరంలోని ఓ ఆస్పత్రిలో వృద్ధాప్య రిత్యా సమస్యలతో ఆమె కన్నుమూసినట్లు ఒక ప్రకటన వెలువడింది. ఇదిలా ఉండగా.. జపాన్‌లో వందేళ్లు దాటుతున్న వృద్ధుల సంఖ్య సుమారు 85 వేలమందికి పైనే ఉంది. ప్రపంచంలోనే ఇదొక రికార్డు. ఇందులో ప్రతీ పది మందిలో తొమ్మిది మంది ఆడవాళ్లే ఉంటున్నారు. వాళ్ల ఆరోగ్య రహస్యాలపై, జీవన శైలిపై పరిశోధనలూ జరుగుతున్నాయి కూడా. -
61.03 లక్షల మందికి 1 నుంచి పింఛన్లు
సాక్షి, అమరావతి: ఏప్రిల్ రెండో తేదీ ఉగాది పండుగ నేపథ్యంలో రాష్ట్రంలో పింఛనుదారులందరికీ 1న పింఛన్ చేతికందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 61,03,530 మంది అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. రెండు రోజుల ముందే రూ.1,551.15 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. బుధవారం ఉదయం నుంచే లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు గ్రామ, వార్డు సచివాలయాల వారీగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. వలంటీర్ల ఆధ్వర్యంలో 1న తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీ మొదలుపెట్టి, సాయంత్రంలోగా కనీసం 90 శాతం మందికి డబ్బులు చేరవేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. చదవండి: రాయచోటి.. ప్రత్యేకతల్లో మేటి -
కరోనా కష్టకాలంలో వృద్ధులపై పెరిగిన వేధింపులు
-
‘వృద్ధులకు వ్యాక్సిన్‌ను రెండురోజుల్లో పూర్తి చేస్తాం’
సాక్షి, అమరావతి : ఆధార్‌కార్డు లేని వృద్ధులకు వ్యాక్సినేషన్‌కు సంబంధించిన సుమోటో కేసును ఏపీ హైకోర్టు గురువారం విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాది మాట్లాడుతూ.. చిత్తూరు, కృష్ణా జిల్లాల్లోని ఆశ్రమాల్లో వృద్ధులకు వ్యాక్సిన్ పూర్తి చేశామన్నారు. మరికొన్ని జిల్లాల్లోని వృద్ధాశ్రమాల్లో వ్యాక్సినేషన్ మొదలు పెట్టామన్నారు. వృద్ధులకు వ్యాక్సిన్‌ను రెండురోజుల్లో పూర్తి చేస్తామని కోర్టుకు తెలిపారు. హైకోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. -
Tamil Nadu: సొంత ఇళ్లు.. ఆటోలో వచ్చి అడుక్కుంటారు!
కరోనా సమయంలో రోడ్ల మీద కష్టాలు పడుతున్న భిక్షగాళ్లను ఆదుకునేందుకు సిద్ధమైన పోలీసులకు పెద్ద షాక్ తగిలింది. యాచకుల్లో ఒకరు.. సొంతంగా తనకున్న ఇళ్లను అద్దెకిచ్చి.. భిక్షాటన చేస్తున్నట్లు చెప్పగా, ఇంకొకరు తన వద్ద నోట్ల కట్టలున్నాయని చెప్పడంతో ఖాకీలు అవాక్కయ్యారు. సాక్షి, చెన్నై : కరోనా కష్టాలు ఎవర్నీ వదలి పెట్ట లేదు. అన్ని వర్గాలు నానా ఇబ్బందులు పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రోడ్ల మీద , బస్టాండ్లలో తలదాచుకుని భిక్షాటనలో ఉన్న వారు ఎదుర్కొంటున్న కష్టాల్ని పరిగణించి నాగర్ కోయిల్ పోలీసులు, కార్పొరేషన్ వర్గాలు సేవలకు సిద్ధం అయ్యారు. ఆ దిశగా మంగళవారం నుంచి నాగర్ కోయిల్‌లో ఉన్న భిక్షగాళ్లను ఆశ్రమానికి తరలించే పనిలో పడ్డారు. వీరికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఇద్దరికి పాజిటివ్ రావడంతో కలవరం తప్పలేదు. ఈ పరిస్థితుల్లో బుధవారం ఉదయాన్నే బస్టాండ్ ఆవరణలో ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్న వృద్ధులు, దివ్యాంగులు స్థానిక పోలీసుల వద్దకే వెళ్లి అన్నం పొట్లాలు ఇప్పించాలని వేడుకున్నారు. దీంతో వీరందర్నీ పోలీసులు విచారించి కొంతకాలం ఆశ్రమానికి తరలించాలని నిర్ణయించారు. ఈక్రమంలో వారికి కొన్ని షాకింగ్ విషయాలు తెలిశాయి. ఆటోలో వచ్చి మరీ.. ఈ సమయంలో నలుగురు భిక్షగాళ్లు అక్కడి నుంచి జారుకునే యత్నం చేశారు. దీనిని గుర్తించిన పోలీసులు, కార్పొరేషన్ సిబ్బంది మందలించారు. ఈసమయంలో ఓ భిక్షగాడు అయితే, తాను ఆశ్రమానికి వెళ్లే ప్రసక్తే లేదని, తనకు సొంతంగా ఇళ్లు ఉన్నాయని, వాటిలో కొన్నింటిని అద్దెకు కూడా ఇచ్చి ఉన్నట్టు వెల్లడించారు. విచారణ చేపట్టిన పోలీసులు సొంతిళ్లను అద్దెకు ఇచ్చిన భిక్షగాడు నగర శివారు వరకు రోజు ఆటోలో వచ్చి, భిక్షాటన అనంతరం తిరిగి వెళ్లే వాడు అని తేలింది. దీంతో అతడ్ని తీవ్రంగా మందలించారు. మరోమారు చిక్కితే కటకటాల్లోకి నెడుతామని హెచ్చరించారు. మరో వృద్ధుడు అయితే, తన వద్ద రెండు నోట్ల కట్టలు ఉన్నాయని, ఇదంతా భిక్షాటనతో తాను సంపాదించినదిగా వెల్లడించారు. మూడో వ్యక్తి వద్ద రూ. 3500 నగదు, పొడవైన కత్తి బయట పడింది. విచారించగా అతడు రామనాథపురంకు చెందిన కుమార్‌గా తేలింది. రాత్రుల్లో కొందరు గంజాయి మత్తులో వచ్చి వేధిస్తున్నారని, వారి నుంచి ఆత్మరక్షణ కోసం ఈ కత్తి పెట్టుకున్నట్టు పేర్కొనడంతో పోలీసులు విస్తుపోయారు. మిగిలిన వారు కూడా వివిధ కారణాలతో ఆశ్రమానికి వెళ్లేందుకు సమ్మతించలేదు. దీంతో వారికి పోలీసులు అవగాహన కల్పించారు. అందరూ కరోనా పరీక్షలు చేసుకోవాలని సూచించారు. చదవండి: గోల్డ్ స్కామ్‌లో కీలక మలుపు: ప్రధాన సూత్రధారి అరెస్ట్ -
కన్న ఒడి.. కన్నీటి తడి!
సాక్షి, హైదరాబాద్: జీవన సంధ్యాసమయంలో పేగు బంధం తల్లడిల్లలేదు. వృద్ధాప్యంలో ఒంటరి బతుక్కు ఊతమవ్వలేదు. చిన్నప్పుడు చంటి పాపలను కంటిపాపలుగా చూసిన ఆ కళ్లు చెమ్మగిల్లితే తుడవనూలేదు. చేయి పట్టి నడిపించిన ఆ చేతులను చేరదీయలేదు. బుక్కెడు బువ్వ పెట్టి కడుపు నింపేవారే దూరంగా వెళ్లిపోయారు. బిడ్డలను నమ్ముకున్న ఆ తల్లులకు చివరికి కన్నీరే మిగిల్చారు. రెక్కలొచ్చి ఎక్కడికో వెళ్లిపోయారు. రెక్కలు అలసి ఆ మాతృమూర్తులు ఒంటరి వారయ్యారు. నగరంలోని బంజారాహిల్స్ రోడ్డునంబర్– 10లోని ఫుట్‌పాతే ఇద్దరు అమ్మలకు ఆశ్రయంగా మారిన వ్యథార్థ జీవన యథార్థ గాథ ఇది. బసవతారకం కేన్సర్ ఆస్పత్రి వద్ద కేబీఆర్ పార్కును ఆనుకొని ఉన్న ఫుట్‌పాత్‌పై ఇద్దరు ‘అమ్మ’లు ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ కష్టాల పాలవుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి సమీపంలోని దొడుకొండపల్లికి చెందిన కాశమ్మ (60)కు ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. ఆమె కుటుంబం 25 ఏళ్ల క్రితమే బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చింది. కూలిపనులు చేస్తుండేవారు. కొన్నేళ్ల కిందట కాశమ్మ భర్త చనిపోయరు. కుమారులు, కుమార్తెకు వివాహాలయ్యాయి. వేర్వేరుగా బతుకున్నారు. ఈ క్రమంలో గత ఏడాది మొదటి దశ కరోనా సమయంలోనే పనులు లేక తలోదారి పట్టారు. కొడుకులిద్దరూ తల్లిని వదిలేసి వెళ్లిపోయా రు. కాశమ్మ ఒంటరిదైంది. కూతురు కూడా చూసే పరిస్థితి లేదు. ఒంటరిగా మారిన కాశమ్మ ఫుట్‌పాత్‌నే ఆశ్రయంగా చేసుకుంది. దారిన పోయేవారు ఇంత తిండిపెడితే కడుపు నింపుకొంటోంది. వెంకమ్మది మరో దీనగాథ.. నెల్లూరు జిల్లా మొల్కురుకు చెందిన వెంకమ్మ (60)కి ఓ కుమారుడున్నాడు. బంజారాహిల్స్ రోడ్డు నం.10లోని సింగాడికుంటలో ఉంటున్నాడు. కరోనా కష్టకాలంలో కొడుకును చూద్దామని వెంకమ్మ నగరానికి ఇటీవల వచ్చింది. తమకే కడుపుకింత తిండిలేక సతమతమవుతున్నామని నువ్వు మాకు భారమంటూ కొడుకు ముఖం మీదే చెప్పి పంపించాడు. వెళ్లడానికి దారి ఖర్చులు లేకపోవడంతో బసవతారకం కేన్సర్ ఆస్పత్రి వద్ద అన్నం పెడుతున్నారంటే వచ్చింది. ఇక ఇక్కడే ఆశ్రయం ఏర్పాటు చేసుకుంది. కాశమ్మతో పాటు తనూ ఉంటోంది. తమ కష్టాలు పంచుకుంటున్నారు. కాగా.. బసవతారకం కేన్సర్ ఆస్పత్రి వద్ద ఫుట్‌పాత్‌పై సుమారు 150 మంది వరకు నిరాశ్రయులు నానా కష్టాలు పడుతున్నారు. ఎవరైనా ఇంత తిండిపెడితేనే వీరి కడుపు నింపుకొంటున్నారు. ఆదుకోని నైట్‌షెల్లర్లు జీహెచ్ఎంసీ సర్కిల్– 18 పరిధి కిందకు వచ్చే ఈ ప్రాంతంలో నిత్యం వందలాది మంది ఫుట్‌పాత్‌లపై ఆశ్రయం పొందుతున్నారు. రాత్రిపూట వీటిపైనే నిద్రిస్తున్నారు. ఎవరైనా ఇంత అన్నం పెడితే తింటూ కాలం గడుపుతున్నారు. కనీసం వృద్ధులనైనా నైట్ షెల్టర్లలోకి చేర్చాల్సిన బాధ్యతను అధికారులు మర్చిపోయారు. – బంజారాహిల్స్ -
ధైర్యే సాహసే.. ఆరోగ్యం: కరోనా భయాన్ని జయించిన వృద్ధులు
వైద్యుల ఆత్మీయ స్పర్శే ప్రాణం నిలిపింది కరోనా సోకిందని తెలియగానే ఆందోళన చెందాను. కుటుంబసభ్యులు కూడా ఇబ్బందిపడ్డారు. కానీ, నేను మాత్రం మనోస్థైర్యం తో ఉన్నా. 90 ఏళ్లకు వచ్చాను. ఇప్పుడేదైతే అదే అవుతుందని భావించాను. ఈ నెల ఐదో తేదీన గచ్చిబౌలిలోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(టిమ్స్)లో చేరాను. వైద్యసిబ్బంది ఎంతో ప్రేమగా చూసుకున్నారు. వేళకు ఆహారం, మందులు ఇచ్చారు. ఆరోగ్యంగా ఇంటికి చేరాను. వారి ఆతీ్మయస్పర్శే నాకు పునర్జన్మను ప్రసాదించింది. – మాణిక్యమ్మ(90), నేదునూరు, కందుకూరు మండలం, రంగారెడ్డి మానసిక ప్రశాంతతతో ఎదుర్కొన్నాను నా పేరు నాగమణి, నాకు 73 ఏళ్లు. జ్వరం, జలుబు ఉండటంతో ఏప్రిల్ 15న నిర్ధారణ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచి్చంది. తొలుత భయాందోళనకు గురైనా పాజిటివ్‌గా ఆలోచిస్తూ కరోనాను ధైర్యంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాను. టీవీలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చూడటం, ఆవిరి పట్టడం, వేళకు ట్యాబ్లెట్లు వేసుకోవడంతోపాటు తేలికపాటి వ్యాయామాలు చేశాను. బలవర్థకమైన ఆహారం తీసుకున్నాను. హోం క్వారంటైన్ అనంతరం టెస్ట్ చేయించుకుంటే నెగెటివ్ వచి్చంది. – నాగమణి, పార్శిగుట్ట భయపడలేదు నాకు పదిరోజుల క్రితం దగ్గు, జలుబు, ఒంటినొప్పులు, ఆయాసం వంటి సమస్యలు మొదలయ్యాయి. వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇంట్లో వాళ్లంతా ఆందోళన చెందినా నేను భయపడలేదు. తొలుత ఫీవర్ ఆస్పత్రిలో చేరాను. అక్కడ ఎవరూ పట్టించుకోకపోవడంతో మరునాడు కొత్తపేటలోని మరో ప్రైవేటు ఆస్పత్రిలో చేరాను. ప్రస్తుతం ఏ సమస్యా లేకపోవడంతో గురువారం ఉదయం డిశ్చార్జ్ చేశారు. – సత్యనారాయణ(88), హస్తినాపురం వారంరోజుల్లోనే ఇంటికి వచ్చిన.. నేను కె.రాములమ్మ. నాకు 92 ఏళ్లు. మాది గౌతంనగర్ డివిజన్ ఇందిరానెహ్రూనగర్. 15 రోజుల క్రితం కరోనా సోకింది. కుటుంబసభ్యులు స్థానికంగా ఉండే అంగన్వాడీ టీచర్ సహాయంతో అంబులెన్స్‌లో కింగ్‌కోఠిలోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాను. వారంపాటు చికిత్స తీసుకొని కరోనాను జయించి క్షేమంగా తిరిగి వచి్చన. నా రెండో కొడుకు స్వామిగౌడ్‌కు గత ఏడాది కరోనా సోకడంతో భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు. – రాములమ్మ(92), గౌతంనగర్ ఏం చేశావ్, ఏం తిన్నావని అడుగుతుండ్రు నా పేరు పడాల రాములు. మాది యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం. 17 రోజుల కింద కాళ్ల నొప్పులు, కొద్దిగా జ్వరం వచ్చింది. పరీక్ష చేయించుకుంటే పాజిటివ్ అని వచ్చింది. ఇంట్లోనే ఉంటూ రోజూ మూడు పూటలా ఆవిరిపట్టాను. డాక్టర్ చెప్పినట్టు ఉదయం, సాయంత్రం గుడ్లు తిన్నా. ప్రభుత్వ దావకాండ్ల ఇచ్చిన మందులతోనే 14 రోజుల తర్వాత కరోనాను జయించాను. చాలామంది వచ్చి ఏ చేశావ్, ఏం తిన్నావని అడుగుతుండ్రు. ధైర్యంగా ఉంటే కరోనా చంపే రోగమేమీకాదు. – పడాల రాములు(80) భయమే ప్రాణాంతకం ‘మాది కోనరావుపేట మండలం నిమ్మపల్లి. పక్షంరోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్లాం. అక్కడ నాతోపాటు ఇద్దరు కొడుకులకు కరోనా అంటింది. అయినా భయపడలేదు. ఇంట్లోనే ఉంటూ డాక్టర్లు ఇచి్చన మాత్రలు వేసుకున్నాం. నాకు ఒకరోజు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటే సిరిసిల్లలోని జిల్లా ఆస్పత్రికి వెళ్లాను. అక్కడ బెడ్లు ఖాళీ లేవనడంతో ఇంటికి వచ్చి మందులు వాడిన. ధైర్యంగా ఉండి కరోనా నుంచి కోలుకున్నాను. భయమే ప్రాణాంతకం. అందుకే భయపడొద్దు. – విక్కుర్తి నర్సయ్య(96) గుండె ధైర్యం రక్షించింది నా పేరు బద్దం వెంకటరెడ్డి. మాది మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కొత్తూరు(సి). జ్వరం, దగ్గు, జలుబు, ఒంటి నొప్పులు రావడంతో కురవిలో పరీక్ష చేయిస్తే కరోనా నిర్ధారణ అయింది. ఇంట్లోనే ఉంటూ ఆశ కార్యకర్త, ఏఎన్ఎంలు ఇచ్చిన మందులు వాడాను. ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో పనిచేసే నా కొడుకు చెప్పిన సూచనలు పాటించాను. పౌష్టికాహారం తీసుకుంటూ రోజూ ఉదయం ఎండలో కొద్దిసేపు కూర్చునేవాడిని. ఈ సమయంలోనే సూర్యాపేటలో ఉండే నా కుమార్తె కన్నుమూసింది. నాకు కరోనా ఉండటంతో కుమార్తెను కడసారి చూడలేకపోయాను. ఈ బాధ ఉక్కిరిబిక్కిరి చేసినా గుండెధైర్యంతో ఉండి కోలుకున్నా. – బద్దం వెంకటరెడ్డి(78), కొత్తూరు(సి), మహబూబాబాద్ జిల్లా వందేళ్ల బామ్మ.. ఇంట్లోనే కోలుకుంది! ఈ ఫొటోలో కనిపిస్తున్న బామ్మ పేరు యాళ్ల సీతారామమ్మ. వయసు వందేళ్లు. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం కుమ్మరిగుంట గ్రామానికి చెందిన ఈమెకు గత నెల 20న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అప్పటి నుంచి హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూ.. సకాలంలో మందులు, సరైన ఆహారం తీసుకుంటూ, వైద్యుల సలహాలు పాటించడంతో ఆమె కరోనాను జయించారు. ప్రస్తుతం ఆక్సిజన్ స్థాయి 97 నుంచి 98 ఉంటోందని కుటుంబసభ్యులు తెలిపారు. ఈమె ఏపీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావులకు స్వయానా పెద్దమ్మ కావడం విశేషం. – సారవకోట (శ్రీకాకుళం జిల్లా) -
అక్కడ సమయానికి వడ్డీ కూడా ఇస్తారు.. ఎలాగంటే!
స్విట్జర్లాండ్‌కి ప్రపంచ పటంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇటీవలి కరోనా కాలంలో కూడా ఆ దేశంలో ఒక్క కేసు కూడా రాకుండా జాగ్రత్తపడ్డారు. అన్ని విషయాలలోనూ కొత్తగా ఆలోచిస్తారు ఆ దేశీయులు. ఏ ఆసరా లేని వృద్ధుల గురించి ఒక కొత్త పథకం ప్రవేశపెట్టారు. అదే ‘టైమ్ బ్యాంక్ ’ స్కీమ్. ఒంటరిగా, కుటుంబ సభ్యుల సహకారం లేకుండా నివసిస్తున్న సీనియర్ సిటిజెన్లకు అండగా నిలబడటానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. స్విట్జర్లాండ్‌లో ఒక పాఠశాల దగ్గర 67 సంవత్సరాల ఒంటరి మహిళ ఉండేవారు. ఆవిడ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేసి రిటైరయ్యారు. తనకొచ్చే పెన్షన్‌తో ఆవిడ హాయిగా కాలం గడపవచ్చు. కాని ఆమె ఖాళీగా కూర్చోవటానికి ఇష్టపడలేదు. తనకంటె 20 సంవత్సరాలు ఎక్కువ వయసున్న ఒక వృద్ధురాలికి సేవ చేసే పనిలో కుదిరారు. డబ్బు కోసం పనిచేయవలసిన అవసరం లేదు ఆమెకకు. తన సమయాన్ని టైమ్ బ్యాంకులో దాచుకోవటానికి పనిచేశారు. అక్కడే మొదలు.. టైమ్ బ్యాంక్‌ను స్విట్జర్లాండ్‌లోని ప్రభుత్వ సామాజిక భద్రతా మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసింది. అక్కడి ప్రజలు యవ్వనంలో, ఆరోగ్యంగా ఉన్నప్పుడు... నిస్సహాయులైన వృద్ధులకు సేవలందిస్తూ, సమయాన్ని దాచుకొని, తిరిగి వారికి అవసరంలో ఉన్నప్పుడు ఉపయోగించుకోవచ్చు, ఇందుకోసం వారు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుదారులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి. చక్కగా మాట్లాడే సంభాషణ నైపుణ్యం ఉండాలి. ప్రతిరోజు వారి సేవలను కోరుకునే వారికి కావలసిన సేవలు అందించగలిగే స్థితిలో ఉండాలి. వారి సేవాకాలాన్ని వారి వ్యక్తిగత ఖాతాలో ‘సామాజిక భద్రత మంత్రిత్వశాఖ’ జమ చేస్తుంది. అలా ఆ 67 సంవత్సరాల మహిళ వారానికి రెండు రోజులు రెండు గంటల చొప్పున వృద్ధులకు సేవలు అందించటానికి వెళ్లేవారు. వారి గదుల్ని శుభ్రం చేయటం, వారికి కావలసిన సరుకులు తేవటం, వారికి ఎండలో స్నానం చేయటానికి సహకరించటం వంటి పనులకు సహాయపడేవారు.. కొద్దిసేపు వారితో సరదాగా ముచ్చటించటానికి సమయం కేటాయించేవారు. వారు దరఖాస్తులో చేసుకున్న ఒప్పందం ప్రకారం. సంవత్సరం తర్వాత ‘టైమ్ బ్యాంక్’ వారు ఆమె సేవాకాలాన్ని లెక్కించి, ‘టైమ్ బ్యాంక్ కార్డు’ జారీ చేసింది. ఆమెకు ఇతరుల సహాయం అవసరం ఉన్నపుడు తన కార్డును ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఉంది. బ్యాంకులో డబ్బులు దాచుకుంటే వడ్డీ వచ్చినట్లుగానే, ఖాతాలో ఉన్న సమయాన్ని వడ్డీతో సహా తిరిగి వాడుకోవచ్చు. దరఖాస్తును పరిశీలించి, టైమ్ బ్యాంక్ ఒక వాలంటీర్‌ను ఆమె ఇంటికి గానీ, ఆస్పత్రికి గానీ పంపుతారు. ఒక టీచర్ తన అనుభవాన్ని, ‘‘ఒకరోజు నేను స్కూల్లో ఉన్నపుడు నాకు పిలుపు వచ్చింది. నేను అక్కడకు వెళ్లాను. ఆవిడ... తాను కిటికీ శుభ్రం చేస్తుంటే స్టూల్ మీద నుంచి జారిపడ్డానని చెప్పింది. నేను వెంటనే స్కూల్‌కి సెలవు పెట్టి, ఆవిడను ఆసుపత్రికి తీసుకువెళ్లాను. ఆవిడకు మడమ దగ్గర ఫ్రాక్చర్ అయ్యిందనీ, కొంతకాలం పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలనీ చెప్పారు డాక్టర్. నేను కొన్ని రోజుల పాటు ఆవిడ ఇంటి దగ్గర ఉండటానికి సిద్ధపడ్డాను. అయితే ఆవిడ నన్ను దిగులుపడద్దని, అప్పటికే తాను టైమ్ బ్యాంక్‌కి దరఖాస్తు చేసుకున్నానని చెప్పారు. ఆసుపత్రిలో చేరిన రెండు గంటలకే, ఆవిడకు సేవలందించడానికి టైమ్ బ్యాంక్ వారు వాలంటీర్లను పంపారు. నెల రోజుల పాటు ఆ వాలంటీర్ ఆమె యోగక్షేమాలు చూసుకున్నారు. ఆమెకు ఇష్టమైన వంటకాలు తయారు చేసి పెట్టారు. మనసుకు ఉల్లాసం కలిగించేలా కబుర్లు చెప్పారు. సకాలంలో మంచి సేవలు అందటం వల్ల, త్వరగా కోలుకుని, తిరిగి తన పనులు తాను చేసుకోవటం మొదలుపెట్టారామె. తాను ఇంత ఆరోగ్యంగా ఉండటానికి టైమ్ బ్యాంక్‌లో మరింత కాలాన్ని నమోదు చేసుకుంటానంది ఆవిడ’’ అని చెప్పారు. రెండు సంవత్సరాల క్రితం ప్రారంభమైన టైమ్ బ్యాంకు సేవలను ఇప్పుడు స్విట్జర్లాండ్‌లో అందరూ ఆనందంగా వినియోగించుకోవటం సర్వసాధారణమైపోయింది. ఈ పద్ధతి వల్ల ఆ దేశంలో బీమా ఖర్చులు బాగా తగ్గాయి. అనేక సామాజిక సమస్యలు కూడా పరిష్కారమవుతున్నాయి. ఆ దేశప్రజలు ఈ విధానాన్ని మనస్ఫూర్తిగా స్వాగతించారు. అక్కడ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం ఆ దేశ పౌరులలో సగం మంది పౌరులు టైమ్ బ్యాంకు విధులలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ప్రభుత్వం ఈ విధానాన్ని చట్టబద్ధం చేసింది. ప్రస్తుతం ఆసియా దేశాల్లో ఒంటరి గూటి వృద్ధ పక్షుల సంఖ్య బాగా పెరిగిపోతుండటం వల్ల వారి సంక్షేమం ఒక సామాజిక సమస్యగా మారుతోంది. అన్ని దేశాల వారు స్విట్జర్లాండ్ ‘టైమ్ బ్యాంక్ ‘ విధానం గురించి ఆలోచన చేసి, టైమ్ బ్యాంకు విధానాన్ని ప్రవేశపెట్టి, చట్టబద్ధం చేస్తే మంచిదేమో. ఆలోచించాల్సిన విషయమే. టైమ్ బ్యాంకు... ఈ పేరు వినగానే ఇది ఏమిటి అనిపిస్తుంది. మన దగ్గరున్న డబ్బులు మనీ బ్యాంకులో వేస్తాం. ఆ బ్యాంకుల గురించి అందరికీ తెలుసు. అలాగే మనం చేసిన పని సమయాన్ని టైమ్ బ్యాంకులో వేస్తాం. అదే టైమ్‌బ్యాంక్. ఆ టైమ్‌ను, తను కదలలేని పరిస్థితుల్లో వినియోగించుకోవచ్చు. వినటానికి ఈ మాట కొత్తగా అనిపిస్తోందా. ఇది నిజం. స్విట్జర్లాండ్‌లో ఇప్పుడు అందరూ బాగా వినియోగించుకుంటున్న ఏకైక బ్యాంకు టైమ్ బ్యాంక్. -
మీసం తిప్పితే ఆ సంతోషమే వేరు
సాక్షి, కామారెడ్డి: ఆ ఊళ్లో అడుగు పెట్టగానే పెద్ద పెద్ద మీసాలతో ఉన్న పెద్దమనుషులు కనిపిస్తారు. యాభై ఏళ్లు దాటిన వాళ్లందరూ దాదాపు మీసం రాయుళ్లే. మీసాల గురించి ఎవరినైనా అడిగినా.. ‘మగోడు అన్నప్పుడు మీసం ఉండాలె. మీసం ఉంటేనే రోషం ఉంటది’ అనే సమాధానం వస్తుంది. ‘మా తండ్రి, తాత, ముత్తాతలు పెంచిండ్రు. మేం గూడ పెంచినం’ అంటారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం లింగంపల్లి కలాన్‌లో దాదాపు 100 మందికి పైనే మీసం రాయుళ్లు ఉంటారు. పది మందిలో ఏడెనిమిది మందికి కచ్చితంగా మీసాలు ఉంటాయి. మగవాళ్లకు మీసాలు ఉండాలని, ఆ దర్పం వేరేగా ఉంటుందని వారు చెబుతున్నారు. కొందరైతే నలుగురిలో నిలబడినప్పుడు మీసాలను మెలేస్తుంటారు. ఆ ఊరికి కొత్తగా ఎవరొచ్చినా మీసం రాయుళ్లను ఆసక్తిగా చూస్తారు. తాము మాత్రం బతికున్నన్ని రోజులు మీసాలను కాపాడుకుంటామని చెబుతున్నారు. మీసం తిప్పితే ఆ సంతోషమే వేరు తాతల కాలం నుంచి మగవాళ్లందరూ మీసాలు పెంచుతున్నారు. మా తాత నుంచి మా తండ్రికి అబ్బింది. నాకు కూడా మీసం మీద అభిమానంతోని పెంచినా. ఇప్పటికీ మీసాలను కంటికి రెప్పలా కాపాడుకుంటా. మీసం తిప్పితే ఆ సంతోషం వేరేగా ఉంటది. ఇప్పటోళ్లు మీసాలన్నీ గీకేసుకుంటున్నరు. – కడెం లస్మయ్య మా అన్నదమ్ములందరికీ మీసాలున్నయి మేం ఆరుగురం అన్నదమ్ములం. అందరికీ మీసాలు ఉన్నయి. మా తాతలు, తండ్రుల నుంచి మా అన్నలు అందరూ పెంచిండ్రు. ఆళ్లను చూసి నేను గూడ పెంచిన. మీసం ఉంటే అందరూ గొప్పగ జూస్తరు. మా ఊళ్లె చానా మంది మీసాలతోనే ఉంటరు. –బందంల అశోక్ -
నార్వేలో టీకా విషాదం.. 23 మంది మృతి
ఓస్లో: నార్వేలో విషాదం చోటు చేసుకుంది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 23 మంది వృద్ధులు మరణించారు. దాంతో నార్వే ప్రభుత్వం బాగా ముసలివారు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు వ్యాక్సిన్ తీసుకోవద్దని సూచించింది. వివరాలు.. ఫైజర్ ఎన్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్ ఫస్ట్ డోసు తీసుకున్న వారిలో 23 మంది వృద్ధులు మరణించారు. వీరిలో 13 మందికి శవపరీక్షలు నిర్వహించగా.. టీకా తీసుకున్న తర్వాత వచ్చే సాధారణమైన దుష్ర్పభావాలు తలెత్తి.. అవి తీవ్రంగా మారి మరణించారని నార్వేజియన్ మెడిసిన్స్ ఏజెన్సీ తెలిపింది. అంతేకాక వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కనిపించే సాధారణ సైడ్ ఎఫెక్ట్స్ కూడా బాగా బలహీనంగా ఉన్న వారిలో తీవ్రంగా మారాయన్నారు. (చదవండి: ‘వ్యాక్సిన్ వేసుకోవడానికి బలవంతం లేదు’) బాగా ముసలివారు, అనారోగ్య సమస్యలతో ఉన్న వారు వ్యాక్సిన్ తీసుకోకపోవడమే మంచిదని సూచించారు నార్వే అధికారులు. అతి తక్కువ జీవితకాలం ఉన్నవారు టీకా తీసుకోవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని.. వారికి టీకా అనవసరం అన్న అభిప్రాయాన్ని నార్వే ఆరోగ్య శాఖ వ్యక్తం చేసింది. ఆరోగ్యవంతులు, యువకులు టీకాను తీసుకోవచ్చు అని నార్వే ప్రభుత్వం తెలిపింది. ఇక తమ వ్యాక్సిన్ తీసుకుని 23 మంది మరణించిన ఘటనపై ఫైజర్ కంపెనీ విచారణ చేపడుతున్నది. టీకా వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న వారి సంఖ్య తక్కువగానే ఉందని, తాము ముదుగా అనుకున్న రీతిలో సంఘటనలు జరుగుతున్నట్లు ఫైజర్ ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఇక ఇప్పటి వరకు నార్వేలో వైరస్ వల్ల రిస్క్ ఉన్న సుమారు 33 వేల మందికి టీకా ఇచ్చారు. 29 కేసుల్లో సైడ్ ఎఫెక్ట్స్ ప్రభావం ఉండగా.. దాంట్లో మూడో వంతు మంది 80 ఏళ్లు దాటినవారే ఉన్నారు. -
మనోధైర్యమే మందు: ఓల్డ్ ఈజ్ గోల్డ్!
వందేళ్లు, 90 ఏళ్లు దాటినా... కరోనాను జయించిన వారియర్స్ వీళ్లు. మనోధైర్యమే ఆయుధంగా కరోనాను ఎదుర్కొన్నారు. అదే అసలైన మందు అంటున్నారు. ఇతర అనారోగ్య సమస్యలున్నా... టెన్షన్ పడలేదు. ఆందోళన పడతారని కరోనా సోకిన విషయాన్ని పిల్లలకు కూడా చెప్పని నిబ్బరం ఉన్నవాళ్లు కొందరు. ప్రశాంతంగా ఉంటూ, డాక్టర్లు ఇచ్చిన మందులు వేసుకొని బయటపడ్డారు.. ఈయన పేరు శుభ్ కరణ్ అర్హ. 102 ఏళ్ల శుభ్‌కరణ్‌కు అక్టోబర్ 24వ తేదీన కరోనా సోకింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐఏఎస్ అధికారిగా కీలక పదవుల్లో పనిచేసి రిటైరైన సీడీ అర్హ తండ్రి. శతాధికుడైన తండ్రికి కరోనా రావడంతో సీడీ అర్హ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. శుభ్‌కరణ్ అర్హకు షుగర్, బీపీ వంటివి లేవు. జ్వరం, తీవ్ర జలుబు ఉండటంతో హోం ఐసో లేషన్‌లోనే ఉంచి చికిత్స చేశారు. ఒకసారి శ్వాసకోశ సమస్య ఎదురైనా అంతటి వయస్సులోనూ ఆయన గట్టెక్కారు. నవంబర్ రెండో తేదీన పరీక్షిస్తే ఆయనకు కరోనా నెగెటివ్ వచ్చింది. కుటుంబసభ్యులంతా ఊపిరి పీల్చుకున్నారు. 102 ఏళ్ల వయస్సులోనూ శుభ్‌కరణ్ అర్హ ప్రతిరోజూ ఉదయం ఒక కిలోమీటర్, సాయంత్రం ఒక కిలోమీటర్ వాకింగ్ చేస్తారు. శాకాహారి. మధ్యాహ్నం ఒక చపాతి, రాత్రి ఒక చపాతి తీసుకుంటారు. ఎక్కువగా పండ్లు, సలాడ్లు తింటారు. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రార్థనలు చేస్తారు. బీపీ, ఆస్తమా ఉంది... అయినా గట్టెక్కా ఆగస్టులో కరోనా వచి్చనట్లు తేలింది. ఎలాంటి లక్షణాలు లేవు. కిమ్స్‌కు వెళ్లాను. చెస్ట్ స్కాన్ చేశారు. అక్కడ పది రోజులు ఉన్నాను. నాకు బీపీ, ఆస్తమా ఉంది. అయినా త్వరగా కరోనా నుంచి బయటపడ్డాను. కరోనా వచ్చింది ఏం చేస్తాం... అనుకున్నానే కానీ టెన్షన్ పడలేదు. నా పిల్లలకు కూడా చెప్పలేదు. ఏం చేస్తుందిలే అని ధైర్యంగా ఉన్నాను. డాక్టర్లు చెప్పినట్లుగా మందులు వేసుకున్నాను. అంతే కోలుకున్నాను. – జి.లలితకుమారి (90), హైదరాబాద్, సీఆర్‌ఫౌండేషన్ వృద్ధాశ్రమం బీపీ, షుగర్ ఉన్నా భయపడలేదు.. నాకు కూడా ఆగస్టులోనే కరోనా సోకింది. వైరస్ లోడ్ అంతగా లేదని డాక్టర్లు చెప్పారు. సమీపంలోని టిమ్స్‌లో జాయిన్ చేశారు. బీపీ, షుగర్ ఉన్నాయి. మందులు వేసుకున్నాను. ధైర్యంగా ఉన్నానంతే. అందువల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడలేదు. టిమ్స్‌లో వారం రోజులు ఉంచుకొని పంపించారు. – కాట్రగడ్డ అనసూయ (93),సీఆర్ ఫౌండేషన్,హైదరాబాద్ ప్లాస్మా ఎక్కించారు నాలుగు నెలల కిందట నాకు కరోనా వచ్చింది. వైరస్ నిర్ధారణకు ముందు జ్వరం వచి్చపోయేది. నాలుక పొక్కింది. పట్టించుకోలేదు. మందులు వాడాను. టెస్టు చేస్తే కరోనా అని తెలిసింది.ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉంది. షుగర్ ఉంది. టిమ్స్ ఆసుపత్రిలో ఉంచారు. ప్లాస్మా ఇచ్చారు. ఆరు రోజులు ఉన్నాను. టెన్షన్ పడలేదు. కరోనాకు ముందు రోజుకు 40 నిమిషాలు వాకింగ్ చేసేవాడిని. ఆసుపత్రి నుంచి వచ్చాక నీరసం ఉండేది. ఇప్పుడు బాగానే ఉన్నాను. – వెల్లంకి రామారావు (73), సీఆర్ ఫౌండేషన్ మనోధైర్యమే కారణం 90 ఏళ్లు... వందేళ్లు దాటిన వారు కూడా కరోనా నుంచి గట్టెక్కారంటే వారి మనోధైర్యమే ప్రధాన కారణం. పైగా త్వరగా వైరస్‌ను పసిగట్టడం, వెంటనే చికిత్స పొందడంతో వారంతా వైరస్‌ను జయించారు. ఆహారపు అలవాట్లు అత్యంత కీలకం. దాని కారణంగా రోగనిరోధక శక్తి బాగుంటుంది. దానికి తోడు మనోధైర్యం ఆరోగ్యకరంగా ఉండటానికి ప్రధానంగాతోడ్పడుతుంది. – డాక్టర్ కృష్ణ ప్రభాకర్, ఐసీయూ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్,సిటీ న్యూరో సెంటర్,హైదరాబాద్