సాక్షి, అమరావతి : ఆధార్‌కార్డు లేని వృద్ధులకు వ్యాక్సినేషన్‌కు సంబంధించిన సుమోటో కేసును ఏపీ హైకోర్టు గురువారం విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాది మాట్లాడుతూ.. చిత్తూరు, కృష్ణా జిల్లాల్లోని ఆశ్రమాల్లో వృద్ధులకు వ్యాక్సిన్ పూర్తి చేశామన్నారు. మరికొన్ని జిల్లాల్లోని వృద్ధాశ్రమాల్లో వ్యాక్సినేషన్ మొదలు పెట్టామన్నారు. వృద్ధులకు వ్యాక్సిన్‌ను రెండురోజుల్లో పూర్తి చేస్తామని కోర్టుకు తెలిపారు. హైకోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment