![Two Old Wife And Husband Died In Burnt Alive At Warangal Rural - Sakshi](/styles/webp/s3/article_images/2019/10/30/warangal.jpg.webp?itok=SIcbjmZu)
సాక్షి, నెక్కొండ: ఇద్దరు వృద్ధ దంపతులు సజీవ దహనం చేసుకొని ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన నెక్కొండ మండలంలోని మడిపల్లి శివారు గేట్ తండాలో చోటు చేసుకుంది. తండాకు చెందిన భూక్య ధస్రు(68), బాజు(65)లు అనుమానాస్పద స్థితిలో బుధవారం సాయంత్రం సజీవదహనం అయ్యారు. ఈ క్రమంలో వారు నివసిస్తున్న ఇల్లు సైతం మంటలకు ఆహుతైంది. స్థానికులు సమాచారం అందించడంతో నెక్కొండ ఎస్సై నవీన్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి సంబంధించన వివరాలు అడిగి తెలిసుకున్నారు. ఘటనకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment