Food Delivery Agent Wife Baby Heart Touching Video Viral - Sakshi
Sakshi News home page

భర్త చంకలో పిల్లాడు.. భార్య చేతిలో సైకిల్‌.. డెలివరీ బాయ్‌ ఫ్యామిలీ వీడియో వైరల్‌!

Published Sat, Jul 8 2023 1:58 PM | Last Updated on Sat, Jul 8 2023 2:07 PM

food delivery agent wife baby heart touching video viral - Sakshi

సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమయ్యే కొన్ని వీడియోలు మనల్ని భావోద్వేగానికి గురిచేస్తుంటాయి. తాజాగా ఢిల్లీ ఉమెన్స్‌ కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతీ మాలవీయ్‌ తన ట్విట్టర్‌ హ్యాండిల్‌లో ఒక జంటకు సంబంధించిన  వీడియోను షేర్‌ చేశారు. ఇది ఆ దంపతుల ప్రేమకు ప్రతీకగా కనిపిస్తుంది. ఈ వీడియోను షేర్‌ చేసిన ఆమె. ‘నువ్వుండగా నాకు మరేం కావాలి?.. ఈ పాట ఒరిజినల్‌ వీడియోగా ఇది ఉండాలి’ అని రాశారు. 

పిల్లాడిని ఎత్తుకున్న భర్త, సైకిల్‌ నడుపుతున్న భార్య
సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియో చాలామందిని ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో జొమాటో డెలివరీ ఏజెంట్‌ తన పనంతా ముగిసి, చీకటిపడ్డాక తన భార్య, పిల్లాడితో పాటు ఇంటికి వెళుతుంటాడు. జొమాటో టీషర్టు ధరించిన ఆ వ్యక్తి ఒక పిల్లవాడిని ఎత్తుకుంటాడు. అతని భార్య సైకిల్‌ హ్యాండిల్‌ పట్టుకుని దానిని ముందుకు నడుపుతుంటుంది. కుటుంబం కోసం కష్టిస్తున్న భర్త, అతనికి సాయం అందిస్తున్న భార్యతో కూడిన ఈ వీడియో హృదయాలకు హత్తుకునేలా ఉంది.

భార్యాభర్తల బంధం
ఈ వీడియోను జాగ్రత్తగా గమనిస్తే  ఆ మహిళ తమ పిల్లాడితో పనికి వెళ్లిందని, భర్త సైకిల్‌పై జొమోటా డెలివరీ చేస్తున్నాడని అర్థం అవుతుంది. ఇద్దరి పనులు ముగిశాక రాత్రి ముగ్గురూ కలిసి ఇంటికి చేరుకుంటున్నారని అర్థం చేసుకోవచ్చు. స్వాతి మాలవీయ్‌ షేర్‌ చేసిన ఈ పోస్టుకు కొద్ది గంటల వ్యవధిలోనే 56 వేల మంది వీక్షించారు. 19 వేలకుపైగా లైక్స్‌ వచ్చాయి.

ఇది కూడా చదవండి: వృద్ధునిపై గాడిద దాడి.. ఎంతమంది అడ్డుకున్నా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement