husbend
-
తాగుబోతు భర్తతో విసిగి.. రికవరీ ఏజెంట్‌తో పెళ్లి
రోజూ మద్యం తాగి వచ్చి వేధింపులకు గురిచేస్తున్న భర్తపై ఆమెకు విరక్తి కలిగింది. మద్యం తాగవద్దని ఎంత చెప్పినా వినని భర్త తీరుపై విసుగు చెందిన ఆ ఇల్లాలు ఒక విచిత్ర నిర్ణయం తీసుకుంది. ఇది స్థానికంగా చర్చనీయాంశంగా నిలిచింది. విషయం తెలుసుకున్న కొందరు భర్తకు తగిన శాస్తి జరిగిందని అంటున్నారు. వివరాల్లోకి వెళితే..బీహార్‌లోని జముయీలో విచిత్రమైన ప్రేమకథ వెలుగు చూసింది. ఈ ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల ఇంద్రకుమారి మందుబాబు అయిన తన భర్తను విడిచిపెట్టి, లోన్ రికవరీ ఏజెంట్ పవన్ కుమార్‌ను ఒక ఆలయంలో వివాహం చేసుకుంది. ఈ ప్రేమ పెళ్లిని ఇక్కడివారంతా వింతగా చెప్పుకుంటున్నారు. ఇంద్రకుమారికి 2022లో చకాయీ నివాసి నకుల్ శర్మతో వివాహం జరిగింది. అయితే నకుల్ శర్మ నిత్యం మద్యం తాగేవాడు. గృహహింసకు కూడా పాల్పడేవాడు. దీంతో ఇంద్రకుమారి భర్త తీరుకు విసిగిపోయింది.ఇదేసమయంలో ఆమెకు వవన్ కుమార్ యాదవ్ పరిచయమయ్యాడు. పవన్ ఒక ఫైనాన్స్ కంపెనీలో రికవరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. వారిద్దరి మధ్య కుదిరిన స్నేహం కొంతకాలానికి ప్రేమగా మారింది. గత ఐదేళ్లుగా వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఫిబ్రవరి 4న వారు తమ ఇళ్లలో చెప్పకుండా, అసన్సోల్ చేరుకున్నారు. అక్కడ ఇంద్రకుమారి మేనత్త ఉంటోంది. ఫిబ్రవరి 11న ఇంద్రకుమారి, పవన్ కుమార్ అక్కడి ఒక శివాలయంలో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి పవన్ కుటుంబ సభ్యులు మద్దతునివ్వగా, ఇంద్రకుమారి కుటుంబ సభ్యులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు చకాయీ పోలీస్ స్టేషన్లో పవన్‌పై ఫిర్యాదు చేశారు.ఇంద్రకుమారి మీడియాతో మాట్లాడుతూ తన ఇష్టాపూర్వకంగానే పవన్‌ను వివాహం చేసుకున్నానని తెలిపారు. పవన్‌పై పోలీసులకు ఫిర్యాదు అందిన నేపధ్యంలో ఈ జంట తమకు రక్షణ కల్పించాలని అధికారులను కోరుతోంది. మరి పోలీసులు ఈ జంట విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి. ఇది కూడా చదవండి: న్యూఢిల్లీ: వందరోజుల కార్యాచరణకు బీజేపీ కసరత్తు -
మూడో పెళ్లికి సిద్ధమైన నిత్య పెళ్లికొడుకు అరెస్ట్
దొడ్డబళ్లాపురం: రెండవ భార్యను హత్య చేసి మూడో వివాహం చేసుకోవడానికి సిద్ధపడ్డ నిందితుడిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. బిహార్‌కు చెందిన మహమ్మద్ నసీమ్ (39) అరెస్ట్ నిందితుడు. రుమేశ్ ఖాతున్(22) హత్యకు గురైన రెండవ భార్య. సర్జాపురలో పెయింటర్‌గా పని చేస్తున్న నసీమ్‌కు మొటి భార్య ఆమెకు ముగ్గురు పిల్లలు, రెండో భార్య ఖాతున్‌కు కూడా ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే రెండవ భార్య శీలాన్ని శంకించిన నసీమ్ ఆమెను నవంబర్ 11న గొంతు నులిమి హతమార్చాడు. తరువాత ఆమె మృతదేహాన్ని కాళ్లు, చేతులు కట్టి మురుగు కాలువలో పడేశాడు. బిహార్ వెళ్లి తలదాచుకున్నాడు. మరోవైపు సర్జాపుర పోలీసులు ఖాతున్ మృతదేహం లభించడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి నసీమ్ జాడ తెలుసుకుని బిహార్ వెళ్లగా అక్కడ అతడు మూడో వివాహం చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. సర్జాపుర పోలీసులు అతడ్ని పెళ్లింటి నుండే అరెస్టు చేసి తీసుకువచ్చారు. -
పెన్షన్ సొమ్ము కోసం భర్తకు నిప్పు!
ప్రపంచంలో అంతకంతకూ అడుగంటుతున్న మానవత్వానికి ఉదాహరణగా నిలిచే ఉదంతం మహారాష్ట్రలోని థానేలో వెలుగు చూసింది. స్థానిక కళ్యాణ్ నగర్లో ఓ భార్య.. భర్త పెన్షన్ కోసం అతనికి నిప్పంటించి, హత్య చేసేందుకు ప్రయత్నించింది. ఈ ఘటనలో భర్త తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మీడియాకు ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. మరో ఇద్దరి సహకారంతో ఈ మహిళ ఘాతుకానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. 61 ఏళ్ల భర్తకు నిప్పంటించి చంపేందుకు ప్రయత్నించిన నేరంపై సదరు మహిళపై ఎఫ్ఐఆర్ నమోదైంది. బాధితుని కుమార్తె స్నేహితులైన ఇద్దరు యువకులు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. కాగా ఈ కేసులో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. అతని భార్య.. అతనికి నెలనెలా వచ్చే పెన్షన్ విషయమై గొడవ పడేది. అలాగే ఆ ఇద్దరు యువకులు తమ ఇంటికి రావడంపై అతను అభ్యంతరం వ్యక్తం చేసేవాడు. తన ప్రాణాలకు ఆ యువకుల వలన ముప్పు ఉందని బాధితుడు గతంలో ఆ యువకులిద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాజాగా బాధితుడు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. అతని భార్యతో పాటు ఆ ఇద్దరు యువకులు అతనికి నిప్పంటించారు. దీనిని గమనించిన పొరుగింటివారు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: ‘ఇదేందిది... హల్దీ ఫంక్షన్లో ఇంత అవసరమా?’ -
టాయిలెట్‌కు కారు దిగిన భర్త.. అంతలోనే మాయమైన భార్య!
రోడ్ ట్రిప్‌లంటే చాలామంది అమితమైన ఇష్టాన్ని చూపిస్తుంటారు. కుటుంబ సమేతంగా కారులో కూర్చుని, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడమంటే చాలామందికి ఇష్టం. ఓ భార్యాభర్తల జంట ఇలానే రోడ్ ట్రిప్‌కు బయలుదేరింది. కానీ భర్త చేసిన పొరపాటు కారణంగా భార్య నానా అవస్థలు పడింది. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. రోడ్డు ప్రయాణంలో భర్త టాయిలెట్ కోసం కారు దిగాడు. పావుగంట తరువాత తిరిగి కారును స్టార్ట్ చేశాడు. అయితే ఆ సమయంలో కారులో తన భార్య లేదన్న విషయాన్ని అతను గమనించలేదు. ఆమె కారులో నిద్రపోతున్నదని అనుకున్నాడు. అయితే కొద్దిసేపటి తరువాత కారు వెనుక సీటులోకి చూశాడు. అక్కడ భార్య లేదు. అతను తన పొరపాటు తెలుసుకునే సరికే 160 కిలోమీటర్ల దూరం వచ్చేశాడు. భర్త పేరు బ్రూనో టామ్చామ్ (55), భార్య పేరు అమ్నుయ్ టామ్చామ్ (49). ఇద్దరూ థాయిలాండ్‌కు చెందినవారు. ఇద్దరూ తెల్లవారుజామున మూడు గంటలకు మహాసర్ఖా ప్రావిన్స్‌కు బయలుదేరారు. దారిలో బ్రూనో ఒక టాయిలెట్ కోసం దిగవలసి వచ్చింది. ఒక అడవికి సమీపంలో రోడ్డు పక్కగా కారును ఆపాడు. టాయిలెట్ ముగించి, తిరిగి కారులోకి వచ్చి కూర్చున్నాడు. అయితే బ్రూనో కారు దిగాక అతని భార్య కూడా కారు దిగి టాయిలెట్‌కు వెళ్లింది. అయితే అమ్నుయ్ తిరిగి వచ్చేసరికి, రోడ్డుపై కారు కనిపించలేదు. అమె దగ్గర డబ్బు, ఫోన్ కూడా లేవు. అవన్నీ కారులోనే ఉన్నాయి. దీంతో ఆమె ఎవరినైనా సాయం అడిగేందుకు ముందుకు నడక ప్రారంభించింది. దాదాపు 20 కిలోమీటర్ల దూరం నడిచాక తెల్లవారుజామున 5 గంటలకు అమ్నుయ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. జరిగిన సంఘటనను పోలీసులకు తెలియజేసింది. దీంతో పోలీసులు బ్రూనోకు పలుమార్లు కాల్ చేశారు. అతను కాల్ ఎత్తలేదు. ఉదయం 8 గంటల సమయంలో ఫోన్ రిసీవ్ చేసుకున్నాడు. తరువాత పోలీసు స్టేషన్‌కు వెళ్లి, తన భార్యను కలుసుకున్నాడు. ఇది కూడా చదవండి: కామాఖ్య అమ్మవారి దర్శనంలో టీవీ రాముడు -
కూరలో టమాటా వేశాడని.. కుమార్తెను తీసుకుని వెళ్లిపోయిన భార్య!
మధ్యప్రదేశ్‌లోని షాహ్డోల్లో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. టమాటాల కారణంగా భార్యాభర్తల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఇది మరింత పెద్దదిగామారడంతో భార్య తమ కుమార్తెతో సహా ఇంటిని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ ఘటనపై భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, వారు ఈ భార్యాభర్తల మధ్య సయోధ్య కుదిర్చారు. వివరాల్లోకి వెళితే టిఫిన్ సెంటర్ నడుపుతున్న సంజీవ్ వర్మన్ వంటలు చేస్తున్న సందర్భంలో కూరలో టమాటాలు వినియోగించాడు. దీనిని గమనించిన అతని భార్య.. భర్తపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇంటి నుంచి వెళ్లిపోతానని బెదిరించింది. అయితే భర్త ఇకపై ఇలాంటి తప్పు చేయనని, భవిష్యత్‌లో ఎప్పుడూ టమాటా జోలికి వెళ్లనని హామీ ఇచ్చినప్పటికీ ఆమె భర్త మాటను పట్టించుకోకుండా ఇంటిని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్లిపోయింది. దీంతో ఆందోళన చెందిన భర్త తన భార్యను గాలించేందుకు పోలీసులను ఆశ్రయించాడు. భార్య అదృశ్యమయ్యిందంటూ ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సంజీవ్ నుంచి అతని భార్య ఆరతి ఫోన్ నంబరు తీసుకుని ట్రేస్ చేశారు. ఆమె ఉమరియాలోని తన సోదరి ఇంటివద్ద ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులు ఆమెతో మాట్లాడారు. ఆ దంపతుల మధ్య సయోధ్య కుదిర్చారు. ధనపురి పోలీస్‌స్టేషన్ అధికారి సంజయ్ జైశ్వాల్ ఈ ఉదంతం గురించి మాట్లాడుతూ ఆరతి వర్మ తమతో ఫోనులో మాట్లాడినప్పుడు తన భర్త తాగివచ్చి తనను, కుమార్తెను కొడుతుంటాడని ఫిర్యాదు చేసిందన్నారు. సందీప్, ఆరతిలకు 8 ఏళ్లక్రితం వివాహమయ్యిందని, వారికి 4 ఏళ్ల కుమార్తె ఉన్నదని తెలిపారు. కాగా దేశంలో టమాటా ధరలు మండిపోతున్న నేపధ్యంలో వీటి కొనుగోలు, విక్రయాల విషయమై పలు వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇది కూడా చదవండి: చెత్త డబ్బాలో ‘సెర్చ్’,‘అన్‌లాక్’,‘డౌన్లోడ్’.. ఎందుకిదంతా జరుగుతోంది? -
భర్త చంకలో పిల్లాడు.. భార్య చేతిలో సైకిల్.. డెలివరీ బాయ్ ఫ్యామిలీ వీడియో వైరల్!
సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యే కొన్ని వీడియోలు మనల్ని భావోద్వేగానికి గురిచేస్తుంటాయి. తాజాగా ఢిల్లీ ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్ స్వాతీ మాలవీయ్ తన ట్విట్టర్ హ్యాండిల్లో ఒక జంటకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఇది ఆ దంపతుల ప్రేమకు ప్రతీకగా కనిపిస్తుంది. ఈ వీడియోను షేర్ చేసిన ఆమె. ‘నువ్వుండగా నాకు మరేం కావాలి?.. ఈ పాట ఒరిజినల్ వీడియోగా ఇది ఉండాలి’ అని రాశారు. పిల్లాడిని ఎత్తుకున్న భర్త, సైకిల్ నడుపుతున్న భార్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చాలామందిని ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో జొమాటో డెలివరీ ఏజెంట్ తన పనంతా ముగిసి, చీకటిపడ్డాక తన భార్య, పిల్లాడితో పాటు ఇంటికి వెళుతుంటాడు. జొమాటో టీషర్టు ధరించిన ఆ వ్యక్తి ఒక పిల్లవాడిని ఎత్తుకుంటాడు. అతని భార్య సైకిల్ హ్యాండిల్ పట్టుకుని దానిని ముందుకు నడుపుతుంటుంది. కుటుంబం కోసం కష్టిస్తున్న భర్త, అతనికి సాయం అందిస్తున్న భార్యతో కూడిన ఈ వీడియో హృదయాలకు హత్తుకునేలా ఉంది. “Tu hai to mujhe fir aur kya chahiye” This should be the official video of the song ❤️ pic.twitter.com/G9MQOnfW9x — Swati Maliwal (@SwatiJaiHind) July 7, 2023 భార్యాభర్తల బంధం ఈ వీడియోను జాగ్రత్తగా గమనిస్తే ఆ మహిళ తమ పిల్లాడితో పనికి వెళ్లిందని, భర్త సైకిల్‌పై జొమోటా డెలివరీ చేస్తున్నాడని అర్థం అవుతుంది. ఇద్దరి పనులు ముగిశాక రాత్రి ముగ్గురూ కలిసి ఇంటికి చేరుకుంటున్నారని అర్థం చేసుకోవచ్చు. స్వాతి మాలవీయ్ షేర్ చేసిన ఈ పోస్టుకు కొద్ది గంటల వ్యవధిలోనే 56 వేల మంది వీక్షించారు. 19 వేలకుపైగా లైక్స్ వచ్చాయి. ఇది కూడా చదవండి: వృద్ధునిపై గాడిద దాడి.. ఎంతమంది అడ్డుకున్నా.. -
ప్రియురాలి కోసం భార్య ముక్కు తెగ్గోసి, జేబులో వేసుకుని..
గర్ల్‌ఫ్రెండ్ మోజులో పడిన ఒక యువకుడు మారణాయుధంతో తన భార్య ముక్కును తెగ్గోసి, దానిని జేబులో పెట్టుకుని పరారయ్యాడు. రక్తమోడున్న ముక్కుతోనే ఆ భార్య పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భర్త చేసిన నిర్వాకంపై ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ.. ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపుర్ ఖీరీ జిల్లాకు చెందిన ఒక యువకుడు తన ప్రియురాలి కోసం భార్య ముక్కును తెగ్గోశాడు. భార్య ఫిర్యాదుతో పోలీసులు అతనిని వెదికి పట్టుకున్నారు. బాంస్తాలీ గ్రామానికి చెందిన విక్రమ్‌కు కొన్నేళ్ల క్రితం మొహమ్మదాబాద్ గ్రామానికి చెందిన సీమాదేవితో వివాహం జరిగింది. తరువాత వీరికి ఇద్దరు పిల్లలు కలిగారు. అయితే ఇంతలో విక్రమ్.. గ్రామానికి మరో యువతితో అఫైర్ పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సీమ భర్తతో గొడవపడుతుండేది. రాత్రి భోజనాలయ్యాక.. ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ వివాదాలు చోటుచేసుకునేవి. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం రాత్రి భోజనాలయ్యాక భార్యాభర్తల మధ్య ఆ యువతితో అఫైర్ విషయమై వాగ్వాదం జరిగింది. అదే సమయంలో ఆగ్రహంతో ఊగిపోయిన విక్రమ్ ఆ కోపాన్ని తన కుమార్తెపై చూపించాడు. దీనిని భార్య అడ్డుకుంది. దీంతో విక్రమ్ ఒక పదునైన ఆయుధంతో సీమ ముక్కును తెగ్గోశాడు. దానిని జేబులో వేసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తమోడుతున్న స్థితిలో.. వెంటనే ఆమె అదే స్థితిలోనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భర్తపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది. మరోవైపు పోలీసులు నిందితుడు విక్రమ్‌ను పట్టుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి నిందితుడిని జైలుకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. ఇది కూడా చదవండి: ఈ 8 రైల్వే స్టేషన్లు బ్రిటీష్ కాలం నాటివి.. ఇప్పుడెలా ఉన్నాయో తెలిస్తే.. -
‘నా భార్యను అందుకే హత్య చేశాను’ అంటూ..!
భార్యాభర్తల మధ్య గొడవలనేవి సహజం. అయితే దంపతులలో ఎవరైనా వేరొకరితో అక్రమ సంబంధం ఏర్పరుచుకుంటే వారి బాంధవ్యం బీటలు వారుతుంది. అప్పుడు పరిస్థితులు ఎంతవరకైనా దారితీస్తాయి. ఇలాంటి ఉదంతం ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే యూపీలోని కాన్పూర్ దెహాత్ ప్రాంతానికి చెందిన ఒక యువకుడు అనుమానంతో తన భార్య గొంతునులిమి హత్యచేశాడు. తరువాత నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి, జరిగిన విషయాన్ని చెప్పి సరెండర్ అయ్యాడు. అతను పోలీసులకు ఈ విషయం చెబుతున్నప్పుడు అక్కడున్నవారంతా నిర్ఘాంతపోయారు. వెంటనే పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని, సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన రసూల్‌బాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కండవర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ గ్రామానికి చెందిన ములాయం సంఖ్వార్ భార్య ఖుష్బూ కొన్ని రోజుల క్రితం వారి ఎదురింటిలో ఉంటున్న ఆమె ప్రేమికుడు వివేక్‌తో పాటు ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ నేపధ్యంలో ములాయం సంఖ్వార్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఈ ఉదంతం పోలీస్‌స్టేషన్ వరకూ చేరుకుంది. అక్కడ భార్యాభర్తల మధ్య రాజీ కుదిరింది. దీంతో వారిరిద్దరూ తిరిగి కలిసివుండసాగారు. అయితే భార్య గతంలో ప్రియుడితో వెళ్లిపోయిన విషయాన్ని ములాయం సంఖ్వార్ మరచిపోలేకపోయాడు. దీంతో గత మూడు రోజులుగా భార్యాభర్తలమధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలోనే ములాయం తన భార్య ఖుష్బూ గొంతు నులిమి హత్యచేశాడు. తరువాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయమంతా చెప్పి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
రెండో భార్యతో కలిసి భర్త ఆత్మహత్య
పెద్దపంజాణి (చిత్తూరు జిల్లా): కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన రెండో భార్యతో కలసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలంలో శనివారం చోటుచేసుకుంది. పెద్దపంజాణి ఎస్ఐ లోకేష్‌రెడ్డి కథనం మేరకు.. పెద్దపంజాణి మండలం పెనుగొలకల గ్రామానికి చెందిన అమరనాథ్‌కు 2014లో మదనపల్లె మండలం నాయునివారిపల్లికి చెందిన సంధ్యారాణితో వివాహమైంది. వారికి స్నేహప్రియ (3) సంతానం ఉంది. బతుకు దెరువు కోసం నాలుగేళ్ల క్రితం అమరనాథ్ (32) భార్య సంధ్యారాణి, కుమార్తె స్నేహప్రియతో కలిసి బెంగళూరుకు వెళ్లాడు. కోరమంగలలోని ఓ హోటల్లో పనిచేస్తూ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అదే హోటల్లో పని చేస్తున్న త్రిపుర రాష్ట్రానికి చెందిన అంజలీనాథ్ (23)ను రెండో పెళ్లి చేసుకుని వేరు కాపురం పెట్టించాడు. గురువారం అమరనాథ్, అతని మొదటి భార్య సంధ్యారాణి పెళ్లి రోజు. ఆరోజు అంజలీనాథ్ మొదటి భార్య సంధ్యారాణి ఇంటికి వచ్చి, కేక్ ఇచ్చేందుకు వచ్చానని చెప్పి కొంతసేపు ఉండి వెళ్లిపోయింది. ఇంటికి చేరుకున్న అమరనాథ్‌ను సంధ్యారాణి నిలదీసింది. ఆ మహిళను తాను రెండో వివాహం చేసుకున్నానని చెప్పడంతో గొడవ జరిగింది. శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చిన అమరనాథ్ ‘‘మేము చస్తే నీకు ఎటువంటి బాధ ఉండదు’ అని చెప్పి వెళ్లిపోయాడు. తర్వాత రెండో భార్య అంజలీనాథ్‌తో కలిసి ద్విచక్రవాహనంలో బెంగళూరు నుంచి స్వగ్రామమైన పెనుగొలకలకు చేరుకున్నాడు. గ్రామ సమీపంలోని తన సొంత పొలంలోని ఓ చెట్టుకు ఇద్దరూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం సంధ్యారాణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
వృద్ధ దంపతుల సజీవ దహనం
సాక్షి, నెక్కొండ: ఇద్దరు వృద్ధ దంపతులు సజీవ దహనం చేసుకొని ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన నెక్కొండ మండలంలోని మడిపల్లి శివారు గేట్ తండాలో చోటు చేసుకుంది. తండాకు చెందిన భూక్య ధస్రు(68), బాజు(65)లు అనుమానాస్పద స్థితిలో బుధవారం సాయంత్రం సజీవదహనం అయ్యారు. ఈ క్రమంలో వారు నివసిస్తున్న ఇల్లు సైతం మంటలకు ఆహుతైంది. స్థానికులు సమాచారం అందించడంతో నెక్కొండ ఎస్సై నవీన్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి సంబంధించన వివరాలు అడిగి తెలిసుకున్నారు. ఘటనకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. -
ఇడ్లీ.. పూరీ... మరియు భర్త
బొట్టు, కాటుక, చీరకట్టు...ఇవీ భార్య అని కొందరు భర్తలకు అనిపించవచ్చు.ఉద్యోగం, ఐశ్వర్యం, మేధోతనం..ఇవీ భార్య అని కొందరికి అనిపించవచ్చు.కార్యదక్షత, సామర్థ్యం, సమఉజ్జీ..భార్యంటే ఇలా ఉండాలి అని కొందరు భర్తలకు అనిపించవచ్చు.సంతానం, మాతృత్వమే భార్య అనికొందరు భర్తలకు అనిపించవచ్చు.కాని భార్య అంటే కేవలం ఇడ్లీ, పూరి, వెజిటెబుల్ బిర్యానీ,చేపల పులుసు అని భర్తకు అస్తమానూ అనిపిస్తూ ఉంటేఆ భర్తకు చికిత్స చేయాలి. ఆ కాపురాన్ని రిపేరు చేయాలి. ఆఫీసులో మేనేజర్ కేబిన్ నుంచి బయటికొచ్చి సెక్షన్ వైపు చూశాడు.అందరూ పని చేసుకుంటూ ఉన్నారు.. ఒక్కడు తప్ప. ఆ ఒక్కడు సీట్లో లేడు.‘జగదీష్ ఏమయ్యాడు’ పక్క సీటతన్ని అడిగాడు.‘ఆకలిగా ఉందని క్యాంటీన్‌కి వెళ్లాడు సార్’ అన్నాడు.మేనేజర్ తలాడించి కేబిన్‌లోకి వెళ్లాడు.పదిహేను నిమిషాలు గడిచిపోయాయి.ఇంటర్‌కమ్ నొక్కి అడిగాడు ‘జగదీష్ వచ్చాడా?’‘ఇంకా రాలేదు సార్’ఐదంతస్తుల ఆ బిల్డింగ్‌లో రూఫ్‌టాప్ మీద క్యాంటిన్ పెట్టారు. థర్డ్ ఫ్లోర్ నుంచి క్యాంటిన్‌కు వెళ్లి ఏదైనా తిని రావడానికి పదిహేను నిమిషాలకు మించి పట్టదు. మేనేజర్‌కు కోపం వచ్చింది. సెల్లో కాంటాక్ట్ చేశాడు.‘జగదీష్ ఎక్కడ ఉన్నావు’‘ఆకలిగా ఉంటే తినడానికి వచ్చాను సార్’‘ఎక్కడ తింటున్నావు?’‘అమీర్‌పేట్ వచ్చాను సార్. ఇక్కడ కొత్తగా పెట్టిన సందర్శినిలో ఇడ్లీ బాగుంటుందనీ’... జగదీష్ నసిగాడు.మేనేజర్‌కు ఫీజు ఎగిరిపోయింది.ఆఫీస్ ఉన్నది జూబ్లీహిల్స్‌లో. అక్కడి నుంచి ఇడ్లీ తినడానికి, అది కూడా క్యాంటిన్ ఉండగా, ఆఫీస్ అవర్స్‌లో అంతదూరం వెళ్లినందుకు జగదీష్‌ని ఏం చేయాలి అని చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ఇలా చేయడం మొదటిసారి కాదు. కానే కాదు.జగదీష్ శోభనం రాత్రి అనుకున్న ముహూర్తానికి జరగనే లేదు. పెళ్లయ్యాక అత్తగారి ఇంట్లోనే ఏర్పాట్లు చేశారు. భార్య అలంకరించుకుని గదిలోకి వచ్చింది. ఆ సమయానికి జగదీష్ ముఖం గంటు పెట్టుకొని వచ్చాడు.‘ఏంటి అలా ఉన్నారు?’ కంగారుగా అడిగింది భార్య.‘మైసూర్‌పాక్ నూనె వాసన వస్తోంది. ఇలాంటి స్వీట్లా పెట్టేది’ అన్నాడు.‘పోనీలేండి. వేరేవి ఉన్నాయిగా. అవి తీసుకోండి’‘జాంగ్రీ చక్కెర తక్కువ. లడ్డూలో ఒక్క జీడిపప్పు కూడా లేదు’ఈ క్షణాల్లో ఏ భర్తకైనా ఎదురుగా ఉన్న భార్య జీడిపప్పులా కనిపించాలి. ఇతను ఇలా ఉన్నాడేమిటా అని భార్యకు నిజంగానే కంగారు వచ్చింది.‘మధ్యాహ్నం భోజనాలు కూడా గమనించాను. చాలా చెత్తగా ఉన్నాయి. వంటకు ఒంగోలు వాళ్లు వద్దు నెల్లూరు వాళ్లను పిలవండి అన్నాను. విన్లేదు. మాడిపోయిన బజ్జీలు, ముదిరిపోయిన మునగ మసాలా, పోపు తక్కువైన సాంబారు... పెరుగు ఎర్రగా ఉండాలని ముందే చెప్పాను. పాండురోగం వచ్చినట్టుగా తెల్లగా ఏడ్చిందది’భార్యకు భయం వేసింది.‘మంచి టేస్ట్‌గా ఏదైనా తిని నిన్ను స్వీట్‌గా కిస్ చేయాలనుకున్నాను. నా మూడంతా పాడు చేశారు’ నస మొదలుపెట్టాడు.భార్య బిక్కముఖం వేసుకు కూచుంది. అతడు కోపంతో పచార్లు చేసి చేసి నిద్రపోయాడు.జగదీష్‌ని బంధువుల ఇంటికి తీసుకెళ్లడమే మానేసింది భార్య. ఆమె తరపువారు మంచి ఉద్యోగాలలో ఉన్నారు. కొందరు రెవిన్యూ డిపార్ట్మెంట్లో పని చేస్తారు. మరికొందరు బ్యాంకు ఉద్యోగులు. ఎప్పుడైనా ఫంక్షన్స్‌కు వెళ్లక తప్పదు. అప్పుడు భార్యకు చాలా టెన్షన్‌గా ఉంటుంది. జగదీష్ వారితో తన పని గురించి ఏనాడూ మాట్లాడిన పాపాన పోలేదు. రాజకీయాలు మాట్లాడడు. సినిమాల గురించి కూడా మాట్లాడడు. వంట. కేవలం వంటే.‘మొన్న కాకినాడ వెళ్లినప్పుడు సుబ్బయ్య హోటల్లో పనసకాయ బిర్యానీ తిన్నాను బావగారూ. బిర్యానీ అంటే అది. అందరూ మటన్ బిర్యానీకి నాలుక వేళ్లాడేసుకుంటారు కాని తినాల్సింది పనస బిర్యానీయే’‘వైజాగెళ్లినప్పుడు అందరూ భీమిలీ రోడ్డుకెళ్లి సముద్రం చూస్తూ కూలబడతారేంటండీ నా బొంద. అక్కడ నాలుగడుగులు దాటి వెళితే చిన్నపాకలో బ్రహ్మాండమైన మెస్ ఉంటుంది. నలభైఏళ్లుగా నడుపుతున్నాడో మనిషి. ఫిష్ కర్రీ పెడతాడండీ బాబూ... ’బంధువులు ఇతని వాలకం చూసి చూసి ఇతని పేరు ‘ప్లేట్ జగదీష్’ అని పెట్టారు. రాను రాను ‘ప్లేటొచ్చాడా’ అంటే ‘జగదీష్ వచ్చాడా’ అని అర్థం.భార్యకు తల కొట్టేసినట్టయ్యింది. పెళ్లయ్యి ఎనిమిదేళ్లయ్యింది. ఒక పాప. కాని జగదీష్ ఉద్యోగంలో ఏ ఎదుగుదలా లేదు. ఇంట్లో ఏ అనురాగమూ లేదు. ఆఫీసుకెళ్లాక భర్తలు భార్యలకు హాయ్ అనో, ఏం చేస్తున్నావ్ అనో, తిన్నావా అనో మెసేజ్ పెడుతుంటారు. కొందరు లవ్ సింబల్స్ నొక్కుతారు. కాని జగదీష్ అలా కాదు.‘రాత్రికి బంగాళదుంప అల్లం పచ్చిమిర్చి వేసి ముద్దకూర వొండు’‘ఆదివారం కాప్సికం, ఆలూ, వంకాయలు, క్యారెట్ వేసి వాంగిబాత్ చేసుకుందాం’...భర్త దృష్టిలో తాను భార్యను కానని, కాంటినెంటల్ కిచెన్లాంటిదని భార్యకు తెలిసి వచ్చే కొద్దీ ఆమెకు మెల్లగా డిప్రెషన్ పెరిగింది.భర్త తిండి పిచ్చికి తిండి సయించడం క్రమేపీ తగ్గిపోయింది. మరోవైపు ఎక్కడ ఉద్యోగం పోగొట్టుకుంటాడోనని ఆందోళన పెరిగిపోతోంది.ఒకరోజతను తెల్లారి మూడున్నరకు లేచి ప్యాంటు వేసుకుంటుంటే ‘ఎక్కడికండీ?’ అని అడిగింది.‘అబిడ్స్‌లో ఒకతను సరిగ్గా తెల్లారి నాలుగ్గంటలకు వేడి వేడి ఇడ్లీ, కొబ్బరి పచ్చడి బండి పెడతాడు. ఒకసారి తినేసొస్తా’ అని అనేసరికి ఆమె మంచం పట్టింది. జగదీష్‌కు అతి తిండి పిచ్చి, అతి రుచి పిచ్చి హద్దులు దాటిపోయిందని జగదీష్ తల్లిదండ్రులకు కూడా అర్థమైంది. కూతురు గోడు విన్న ఆమె తల్లిదండ్రులు ‘ఇలాగైతే మీ కొడుకును తీసుకెళ్లి ఏదైనా అయ్యర్ హోటల్లో వంటగదిలో పడేయండి. మా అమ్మాయిని ఇంటికి తీసుకెళతాం. ఇటొచ్చాడంటే పొయ్యికట్టెను గొంతులో దూర్చుతాం’ అని వార్నింగ్ ఇచ్చారు.అందరూ కలిసి జగదీష్‌ను సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లి పడేసినప్పుడు సైకియాట్రిస్ట్ చెప్పిన వివరాలు విని ఆశ్చర్యపోయారు.‘ఇది డ్రగ్ ఎడిక్షన్ కంటే ప్రమాదకరమైన ఎడిక్షన్. మద్యం మాన్పించడానికి, డ్రగ్స్ మాన్పించడానికి ఎంతటి చికిత్స, కౌన్సెలింగ్ అవసరమో దీనికీ అంతే చికిత్స, కౌన్సెలింగ్ అవసరం’ అంది లేడీ సైకియాట్రిస్ట్.‘ఇది ఈటింగ్ డిజార్డర్’ అని చెప్పిందామె.‘ఇది ఉన్న వాళ్లు పని మీద ధ్యాస పెట్టరు. ఇంట్లోని విషయాల పట్ల కూడా శ్రద్ధ ఉండదు. ఎంతసేపూ తిండి ధ్యాసే ఉంటుంది. పైగా ప్రవర్తనలో హెచ్చుతగ్గులు ఉంటాయి. కోపం వుంటుంది. ఆహారం మీదా తినే తిండి మీదా అందరికీ ఎంతోకొంత శ్రద్ధ, ఆసక్తి ఉంటాయి. కాని ఇలా ఉన్మాదస్థాయిలో వ్యవహరిస్తుంటే కచ్చితంగా చికిత్స చేయించాల్సిందే. ఈ పిచ్చి ఉన్నవాళ్లు సరైన పచ్చిమిరపకాయ బజ్జీల కోసం రెండు వందల మైళ్లు కూడా కారు వేసుకు వెళతారు’ అందామె.జగదీష్‌కు కూడా తన పరిస్థితి కొంచెం అర్థమైంది. ఇప్పటికి మూడు మెమోలు అయ్యాయి. ఇంకో రెండు ఇస్తే ఉద్యోగం పోతుంది. భార్య పుట్టింటి బెదిరింపు కూడా పని చేసింది.‘నేను చికిత్సకు సహకరిస్తాను డాక్టర్’ అన్నాడు సైకియాట్రిస్ట్‌తో.చికిత్స మొదలైంది.మూడు నెలలు గడిచాయి.బ్రహ్మాండం బద్దలైపోలేదు కాని జగదీష్లోని అతి చాలా వరకు తగ్గింది.‘ఏదో ఒకటి మన క్యాంటిన్‌లోనే తిందాం బ్రదర్’ అంటున్నాడు ఆఫీస్‌లో.భార్య ఫోన్ చేసి ‘ఇవాళ వంటా’.. అని ఏదో చెప్పబోతుంటే ‘అదేం వద్దు. టికెట్లు తెస్తా. సెకండ్‌షోకు రెడీ అవ్వు’ అన్నాడు మొన్న.అమృతం అనేది తాగే పదార్థమే అయినా ఆ క్షణాన భార్యకు చెవిలో అమృతం పోసినట్టే అనిపించింది. – కథనం: సాక్షి ఫ్యామిలీ -
ఆర్ధిక ఇబ్బందితో బ్యార భర్త ఆత్మహత్య
-
కోడిగుడ్డు కూర వండలేదని భార్యపై కాల్పులు
లక్నో: కోడిగుడ్డు కూర వండలేదన్న కోపంతో కట్టుకున్న భార్యనే కడతేర్చాడో మూర్ఖుడు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో గురువారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని దేవదాస్ గ్రామానికి చెందిన నవనీత్(33)కు 12 ఏళ్ల క్రితం మంగేశ్ శుక్లా(30) తో వివాహమైంది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. నవనీత్ వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొద్ది రోజులుగా మద్యానికి బానిసైన నవనీత్ గురువారం పీకలదాకా మద్యం తాగి ఇంటికొచ్చాడు. అనంతరం తనకు కోడి గుడ్డు కూర వండాలని భార్యతో ఘర్షణ పడ్డాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో భార్యాభర్తల మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నవనీత్ ఇంట్లో ఉన్న తన తండ్రి లైసెన్స్డ్ తుపాకీతో భార్యపై కాల్పులు జరిపాడు. కాల్పుల శబ్దం విన్న స్థానికులు ఇంటి వద్దకు చేరుకుని, తీవ్ర గాయాలపాలైన శుక్లాను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించేందకు యత్నించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందింది. శుక్లా సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు నవనీత్‌ను శుక్రవారం అదుపులోకి తీసుకుని చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. శుక్లా ముగ్గురు పిల్లలను నవనీత్ తల్లిదండ్రులకు అప్పగించారు. -
భార్యపై అనుమానంతో వికృత చేష్టలు
సాక్షి, కర్నూల్: కర్నూల్ జిల్లా కృష్ణగిరి మండలంలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్నఓ ప్రబుద్ధుడు ఆమెపై వికృత చేష్టలకు దిగాడు. ఈ సంఘటన గురువారం స్థానికంగా కలకలం రేగింది. కృష్ణగిరిలో నివాసముంటున్న రాజు అనే వ్యక్తి భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో భార్యను చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా ఆమె శరీర భాగాలపై కత్తితో దాడి చేసి, గాయాలపై కారం చల్లి.. చెప్పలేని రీతిలో ఆమెను నరకమాతనకు గురిచేశాడు. దీంతో భర్త పెట్టె హింసలను తట్టుకోలేక అతను ఇంట్లో లేని సమయంలో పారిపోయి వచ్చిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. భర్త రాజు కోసం గాలింపు చేపట్టారు. -
మహిళ అనుమానాస్పద మృతి
గద్వాల క్రైం: అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతిచెందింది. ఈ సంఘటన మండలంలోని కాకులారంలో శుక్రవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన లక్ష్మణ్, యశోదమ్మ(40) దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. గ్రామంలోనే పలువురికి అప్పులు ఇస్తు.. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే తెలిసిన వ్యక్తులకు అప్పుగా ఇచ్చిన క్రమంలో తిరిగి చెల్లించేందుకు వచ్చిన వారితో మాట్లాడటం భర్తకు రుచించలేదు. దీంతో ఇద్దరి మధ్య పలుమార్లు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే గురువారం రాత్రి సైతం ఇద్దరి మధ్య గొడవ చోటుచేసుకుంది. దీంతో మనస్తాపానికి గురైన యశోదమ్మ పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే ఈమె భర్త లక్ష్మణ్ పరారీలో ఉండటం గమనార్హం. పోలీసులకు అందించిన ఫిర్యాదులో.. భార్యాభర్తలు ఇద్దరూ గురువారం అర్ధరాత్రి గొడవ పడినట్లు బంధువులు, వారి పిల్లలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అర్ధరాత్రి సమయంలో అందరూ నిద్రపోయిన తర్వాత 12.50 గంటల సమయంలో తండ్రి లక్ష్మణ్ తమ తల్లి యశోదమ్మను ఆరుబయట వేసి.. పురుగు మందు తాగిందని చెప్పి కనిపించకుండా వెళ్లాడని తెలిపారు. అయితే తండ్రి లక్ష్మణ్ తాను కూడా చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ రాసి వదిలి వెళ్లిన లెటర్‌ను పోలీసులకు అందించారు. సూసైడ్ నోట్లో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వివిధ బ్యాంకుల్లో అప్పుల వివరాలు, ఖర్చులు.. ఇక బంధువుల పిల్లలను, తన కుమారులను బాగా చూసుకోవాలని లెటర్లో కోరారు. గొంతు నులిమి హత్య యశోదమ్మను భర్త గొంతు నులిమిన ఆనవాళ్లు, స్వరపేటికపై ఘాట్లు ఉన్నాయి. అయితే తనపై అనుమానం రాకుండా హత్య చేసిన అనంతరం పురుగు మందు తాపి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశా రు. భార్యపై పెంచుకున్న అనుమానమే హత్యకు దారితీసి ఉంటుందని బంధువులు వాపోయారు. ఈ సంఘటన జరిగినప్పటి నుంచి లక్ష్మణ్ పరారీలో ఉండటంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ సంఘటనపై అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఏఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆస్పత్రి ప్రాగణంలో రోదిస్తున్న బంధువులు -
భార్యపై భర్త పైశాచికం
సాక్షి, నూజివీడు : కృష్ణా జిల్లా నూజివీడు మండలం బోర్వంచకు చెందిన బెజవాడ రామకృష్ణ అనే అతను అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్య రుద్రకళ్యాణిని(28) గొడ్డును బాదినట్లు బాదాడు. అపస్మారక స్థితి నుంచి బైటపడి పుట్టింటి వారికి ఫోన్ చేయగా వారు వెళ్లి ఆమెను తీసుకువచ్చి ఆసుపత్రిలో చేర్చిన మీదట ఈ సంఘటన వెలుగుచూసింది. దీనికి సంబంధించి బాధితురాలు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆగిరిపల్లి మండలం సింహాద్రి ఏడుకొండలు, రేణుకమ్మల కుమార్తె అయిన రుద్రకళ్యాణి(28)ని ఏడాదిన్నర క్రితం నూజివీడు మండలం బోర్వంచకు చెందిన బెజవాడ రామకృష్ణకు ఇచ్చి వివాహం చేశారు. రామకృష్ణ కెమిస్ట్రీ ఉపాధ్యాయుడిగాను, రుద్రకళ్యాణి హిందీ పండిట్గాను పట్టణంలోని ప్రైవేటు స్కూళ్లలో పనిచేస్తున్నారు. ఈమెను పెళ్లిచేసుకున్న ఆరో రోజు నుంచే భర్త చిత్రహింసలు పెట్టేవాడు. ఉన్నత విద్య చదువుకున్న వ్యక్తి అయినప్పటికి అనాగరికంగా ప్రవర్తించేవాడు. అతను ఎంత కొడుతున్నా అత్త కాని, ఆడపడుచులు కాని ఆపేవారే కాదు. ఇలా గొడవలు జరగడం, పెద్దల వద్ద పంచాయతీలు నిర్వహించడం మరల కాపురానికి పంపడం జరుగుతూనే ఉంది. ఇటీవల బాధితురాలు రుద్రకళ్యాణి భర్త బండి పై నుంచి కింద పడిపోవడంతో మోకాలుకు దెబ్బతగిలింది. దీంతో కాలు నెప్పిగా ఉండటంతో తను పాఠశాలలో పనిచేసే తోటి ఉపాధ్యాయిని ఇందు తన బండిపై ఎక్కించుకుని శుక్రవారం సాయంత్రం 6.30గంటల ప్రాంతంలో ఇంటి వద్ద దింపింది. ఇంటిలోకి వచ్చి చెప్పి వెళ్లకుండా వీధిలోనే ఎందుకు దింపి వెళ్లిందని చెప్పి రాత్రి 8.30గంటల ప్రాంతంలో రెండు కర్రలు విరిగేదాకా ఇష్టం వచ్చినట్లు గొడ్డును బాదినట్లు బాదాడు. దీంతో రుద్రకళ్యాణి శరీరం నిండా తీవ్ర గాయాలు కావడమే కాకుండా దెబ్బ తగిలినటచోటల్లా ఎర్రగా దద్దులు ఏర్పడ్డాయి. ఈ దెబ్బలకు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. అయితే ఎప్పుడు స్పృహలోకి వచ్చిందో ఏమో కాని శనివారం ఉదయాన్నే ఫోన్ ద్వారా పుట్టింటికి ఫోన్ చేసి పెద్దనాన్న కొడుకైన వట్టిగుడిపాడు ఎంపీటీసీ సింహాద్రి రంగారావుకు విషయాన్ని చెప్పింది. దీంతో వెంటనే ఆయన బోర్వంచ వెళ్లి చెల్లెల శరీరంపై ఉన్న దెబ్బలు చూసి వైద్యచికిత్స నిమిత్తం హుటాహుటిన నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించాడు. నడుముపైన, భుజాలపైన, తొడభాగంలో ఎక్కడపడితే అక్కడ దెబ్బలు ఉన్నాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ చిరంజీవి శనివారం కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. పెళ్లైన ఆరోరోజు నుంచే వేధింపులు: ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి ప్రవేశించిన రుద్రకళ్యాణికి పెళ్లైన ఆరో రోజు నుంచే భర్త రామకృష్ణ వెధింపులను అనుభవించడం ప్రారంభమైంది. అత్త, ఆడబిడ్డలు కూడా లేనిపోని మాటలు చెప్తూ భర్తను ఆమెమీదకు ఉసిగొలిపేవారు. పలుమార్లు గొడవలు కావడంతో ఇరువైపులా పెద్దలు పంచాయతీ చేసి సర్దిచెప్పడం, మరల కాపురానికి పంపడం చేస్తుండేవారు. తన కుమార్తె జీవితం ఇలా అయిందేమిటని బాధతో, ఆవేదనతో తండ్రి ఏడుకొండలు తాగుడుకు బానిసయ్యాడు. దీంతో లివరు పాడైపోయి మూడు నెలల క్రితమే చనిపోయాడు. రుద్రకళ్యాణి కూడా నాలుగు రోజుల క్రితమే పుట్టింటి వద్ద నుంచి భర్త ఇంటికి రాగా ఇంతలోనే ఇంత దారుణం జరిగింది. తోటి ఉపాధ్యాయిని బండిమీద తీసుకువచ్చి ఇంటివద్ద దింపినందుకు ఇంత దారుణంగా కొట్టడంపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఐద్వా పట్టణ అధ్యక్షురాలు నండూరి పద్మాంజలి రూరల్ ఎస్ఐ చిరంజీవిని కలిసి నిందితుడికి కఠినశిక్ష పడేలా చూడాలని, ఇలాంటి సంఘటనలు ఎక్కడా జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. -
భార్యకు నిప్పంటించి భర్త పరారీ
సాక్షి, దావణగెరె : భార్య శీలాన్ని శంకించిన ఒక భర్త ఆమెకు నిప్పంటించి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఇరుగుపొరుగువారు గమనించి ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోందని వైద్యులు తెలిపారు. ఈ సంఘటన కర్ణాటక దావణగెరె జిల్లా హరపనహళ్లి తాలూకా నందిబేవూరులో జరిగింది. గ్రామానికి చెందిన లక్ష్మీబాయి శీలంపై ఆమె భర్త కబాడి తిప్పా నాయక తరచూ అనుమానపడుతూ వేధింపులకు గురి చేస్తుండేవాడు. దీంతో విసిగిపోయిన ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే ఇటీవల ఆమెకు నచ్చజెప్పి తిరిగి కాపురానికి పిలుచుకొచ్చిన తిప్పా నాయక తన వక్రబుద్ధిని ప్రదర్శించి ఆమెకు నిప్పంటించి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం దావణగెరె ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఆలస్యంగా వెలుచూసిన ఈ సంఘటనపై హరపనహళ్లి పోలీసులు సోమవారం కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. -
అనుమానంతో భార్యను నరికిన భర్త
ఎమ్మిగనూరు రూరల్: పట్టణంలోని కబరస్తాన్ ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి ఓ వ్యక్తి అనుమానంతో భార్యపై గొడ్డలితో దాడి చేశాడు. ఆమె తీవ్ర గాయాలతో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. బాధితురాలి తండ్రి ఉసేని తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన బాషా, పర్వీన్‌కు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రెండేళ్ల కుమార్తె కూడా ఉంది. ఇప్పుడు పర్వీన్ మూడు నెలల గర్భిణి. బాషా తన భార్యపై అనుమానం పెంచుకొని నిత్యం వేధిస్తుండేవాడు. కుటుంబ సభ్యులు నచ్చజెబుతూ వచ్చారు. కొంతకాలం క్రితం బాషా తన భార్యను బెంగళూరులో ఉండే సోదరుడి దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడే ఇద్దరూ కూలి పని చేసుకుంటూ జీవించేవారు. అక్కడ కూడా గొడవ పడుతుండటంతో బాషాను అతని సోదరుడు తిట్టి పంపాడు. అయితే..అతను ఎమ్మిగనూరుకు రాకుండా 20 రోజుల క్రితం కేరళకు తీసుకెళ్లాడు. కేరళలో నడిరోడ్డుపై భార్యతో గొడవ పడి.. చంపటానికి ప్రయత్నించటంతో అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు తెలుసుకొని పర్వీన్ తండ్రికి సమాచారమిచ్చారు. అతను కేరళకు వెళ్లి కుమార్తెను ఎమ్మిగనూరుకు తీసుకొచ్చారు. బాషా నాలుగు రోజుల క్రితం మళ్లీ భార్య దగ్గరకు రావటంతో మామ, కుటుంబ సభ్యులు సర్దిచెప్పారు. అయితే.. శుక్రవారం అర్ధరాత్రి నిద్రిస్తున్న భార్యపై గొడ్డలితో తలపై నరికాడు. శబ్దం రావటంతో çపర్వీన్ తండ్రి వచ్చి చూడగా.. గొడ్డలితో నరుకుతుండటం గమనించి కేకలు వేశాడు. దీంతో బాషా పరారయ్యాడు. తీవ్ర గాయాలతో ఉన్న కుమార్తెను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు రెఫర్ చేశారు. కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. -
భార్య హత్యకు రూ.15 లక్షల సుపారీ
సాక్షి, బెంగళూరు: కష్టసుఖాల్లో భార్యకు తోడుంటానని బాస చేసిన భర్త.. ఆమెపై పగబట్టి కటకటాలపాలయ్యాడు. కుటుంబ కలహాలతో భార్యను హత్య చేసేందుకు భర్త సుపారీ ఇచ్చిన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. మధ్యలో పోలీసులు ఎంటరై భర్తతో పాటు సుపారీ ముఠాను అరెస్ట్ చేశారు. వివరాలు....వయ్యాలికావల్‌కు చెందిన వ్యాపారి నరేంద్రబాబు, వినుత దంపతులు. వీరికి వివాహమై ఏడేళ్లవుతుండగా, ఐదేళ్ల నుంచి గొడవలు జరుగుతున్నాయి. నరేంద్రబాబు ఆస్తిలో తనకు భాగం కావాలని వినుత ఒత్తిడి చేస్తున్నా ఫలితం లేదు. దీంతో ఇటీవల ఆమె వయ్యాలికావల్ పోలీస్ స్టేషన్లో భర్త, అత్తమామలపై ఫిర్యాదు చేసింది. భార్యను అంతమొందించాలని నిశ్చయించుకున్న నరేంద్రబాబు ఒక హంతకముఠాతో రూ.15 లక్షలకు డీల్ కుదుర్చుకున్నాడు. రూ.2లక్షల అడ్వాన్స్ చెల్లించాడు. బుధవారం ఈ గ్యాంగ్ సభ్యులు వినుతను చంపాలని ప్రయత్నించారు. అయితే ఆ ప్లాన్ విఫలం కావడంతో గురువారం రోజున వయ్యాలికావల్ ప్రాంతంలో ఓ ఆటోలో కూర్చుని వినుతా కోసం కాపు కాస్తున్నారు. ఆ సమయంలో అటుగా వెళ్లిన పోలీసులు వీరి వైఖరిపై అనుమానం వచ్చి ప్రశ్నించగా హత్య విషయం బయటపడింది. దీంతో సుపారి గ్యాంగ్ సభ్యులు చిన్నస్వామి, అభిలాష్‌లతో పాటు నరేంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, గతంలో కూడా తనపై భర్త, అత్తమామలు కిరోసిన్ పోసి తగలబెట్టేందుకు ప్రయత్నించారని వినుతా తెలిపింది. -
భర్త ఇంటి ముందు భార్య నిరసన
కాశీబుగ్గ: తనకు న్యాయం చేయాలని భర్త ఇంటిముందు ఓ భార్య దీక్ష చేసింది. పెళ్లైన పదేళ్ల తర్వాత తనను దూరం చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన బాట పట్టింది. బాబు పుట్టి చనిపోయిన తర్వాత వేధింపులు ఎక్కువ కావడంతో పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కింది. దళితురాలివని, అదనపు కట్నం తేవాలని ఇంటి నుంచి నెట్టేయడంతో పెద్దమనుషులతో కలిసి పోరు బాట సాగిస్తోంది. ఈ సంఘటన పలాస–కాశీబుగ్గ పట్టణంలో సంచలనమయింది. దీనికి సంబంధించి వివరాలు ఇలావున్నాయి. కాశీబుగ్గలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వెనుక భాగంలో ఉంటున్న కింతలి యోగేశ్వరరావు(శ్రీను)కు రాధమ్మకు వివాహం(రిజిష్టర్ మ్యారేజ్) జరిగింది. ఇతడు కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పదేళ్లు కాపురం అనంతరం యోగేశ్వరరావు తనను పట్టించుకోవడంలేదని భార్య కింతల రాధమ్మ భర్త ఇంటి ముందు దీక్ష చేసింది. తల్లిదండ్రులు, బంధువులు, పెద్దమనుషులతో కలిసి ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిసింది. ఈ సందర్భంగా బాధితురాలు విలేకరులతో మాట్లాడుతూ కులాలకు అతీతంగా ప్రేమించానని, రిజిష్టర్ మ్యారేజ్ ద్వారా ఒక్కటైయ్యామన్నారు. తల్లి, అన్నయ్య మాటలు విని భర్త యోగేశ్వరరావు నన్ను ఇంటినుంచి బయటకు గెంటివేశాడని వాపోయింది. అద్దె ఇల్లు తీయించి, అద్దెలు కాని భత్యం కాని వేయడంలేదని కంటతడి పెట్టింది. మా ఇద్దరి కాపురంలో బాబు పుట్టి చనిపోయాడని, అప్పటినుంచి నన్ను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించింది. అదనపు కట్నం తీసుకురావాలని ఇంటినుంచి నెట్టేశారని వాపోయింది. నన్ను విడిచి వేరే మహిళతో యోగేశ్వరరావు ఉంటున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయం చేయాలని తల్లిదండ్రులు, బంధువులు, పెద్ద మనుషులతో కలిసి ఇంటికి వస్తే, దళితురాలివని పేరు పెట్టి నన్ను వెళ్లగొట్టారని, దీంతో చేసేది లేక తల్లిదండ్రులు, బంధువులతో కలిసి తన భర్త ఇంటి ముందు నిరసన తెలుపుతున్నట్టు వాపోయింది. ఈ మేరకు కాశీబుగ్గ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. కాశీబుగ్గ ఎస్ఐ ప్రసాదరావు సంఘటన స్థలానికి వచ్చి బాధితురాలిని సముదాయించి, న్యాయం చేస్తామని తెలిపారు. రాధమ్మకు సంఘీభావంగా ఎంఆర్పీఎస్ జిల్లా, రాష్ట్ర నాయకులు రానా శ్రీనివాస్‌మాదిగ, దాసరి తిరుమల మాదిగ, సంబాన రామారావు, పొట్నూరు భాస్కరరావు మాదిగ, మీల జోగారావు మాదిగ, ఉర్నాన అప్పలరాజు, కుమరాన భారతి మాదిగ, చెరుకుపల్లి నరసింహాలు తదితరులు నిరసన దీక్షలో పాల్గొన్నారు. -
మహిళతో సహజీవనం.. భర్తకు దేహశుద్ధి
సాక్షి, విజయనగరం : కట్టుకున్న భార్యను పుట్టింటికి పంపి.. తనతో పాటు పనిచేస్తున్న మరో ఉద్యోగినితో సహజీవనం చేస్తున్న భర్తను.. భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఈ సంఘటన విజయనగరం పట్టణంలోని పద్మావతి నగర్ వసంతవిహార్ టౌన్ షిష్‌లో సోమవారం జరిగింది. స్థానికంగా నివాసముంటున్న వినోద్‌కుమార్, సునీత భార్య భర్తలు. ఏడాదిగా భార్యను పుట్టింటిలో వదిలిన వినోద్.. పెళ్లైన మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. భర్తపై అనుమానంతో ఆరా తీసిన భార్యకు అసలు విషయం తెలిసింది. దీంతో సునీత మహిళా సమాఖ్య సభ్యులతో కలిసి ఇంటి వద్దకు వెళ్లి భర్తకు, ప్రియురాలికి దేహశుద్ధి చేసింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. -
ఒంగోలులో దారుణం
ఒంగోలు క్రైం: ఒంగోలు నగరంలో అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. మంగమూరు రోడ్డులోని రామచంద్ర మిషన్ సమీపంలో సోమవారం రాత్రి 10:45 గంటల సమయంలో భార్యని భర్త చంపి పరారైన సంఘటన కలకలం సృష్టించింది. మంగమూరు రోడ్డులో అపార్ట్మెంట్ కూడలికి చివర ఉన్న ఇంట్లో నివాసం ఉంటున్న కొర్రపాటి అంజలి (33)ని భర్త ఏడుకొండలు అత్యంత కిరాతకంగా హతమార్చాడు. వివరాలు.. తాళ్లూరు మండలం కొర్రపాటివారిపాలెం గ్రామానికి చెందిన ఏడుకొండలు తన కుటుంబంతో కలిసి ఏడాది కిందట బేల్దారి పనులు చేసుకునేందుకు ఒంగోలుకు వచ్చాడు. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడిని చదివించుకుంటూ ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఏం జరిగిందో ఏమో కాని సోమవారం రాత్రి భార్యభర్తల మధ్య చోటుచేసుకున్న వివాదంలో ఏడుకొండలు తన భార్య అంజలిని అత్యంత కిరాతకంగా రాయితో నుజ్జునుజ్జు చేసి హతమార్చాడు. సంఘటనను ప్రత్యక్షంగా చూసిన ఇద్దరు కుమార్తెలు భీతిల్లిపోయి విషయాన్ని ఇంటి యజమానులకు తెలిపారు. దీంతో ఏడుకొండలు తన కుమారుడిని బైక్‌పై ఎక్కించుకుని పారిపోయాడు. విషయం తెలుసుకున్న తాలుకా సీఐ గంగా వెంకటేశ్వర్లు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డీఎస్పీ డి.శ్రీనివాసరావు హత్య జరిగిన ఇంటిని పరిశీలించి అక్కడి నుంచే హత్యకు సంబంధించిన సమాచారం ఎస్పీ సత్య ఏసుబాబుకు ఫోన్ ద్వారా అందించారు. పోలీసులు హత్యపై దర్యాప్తు చేస్తున్నారు. -
కిరాతకం
ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల పాటు వారి వివాహ బంధం సజావుగా సాగింది. ఆ తర్వాత భార్య ప్రవర్తనపై అతనికి అనుమానం మొదలైంది. అదికాస్తా పెనుభూతంలా మారింది. కసితో రగిలిపోయాడు. కట్టుకున్న భార్య అనే కనికరం లేకుండా.. అభం శుభం తెలియని పిల్లలనే కనీస జ్ఞానం కూడా కరువై అతి దారుణంగా హతమార్చాడు. బి.కోడూరు: అనుమానం పెనుభూతమై భార్యా పిల్లలను హత్య చేసిన ఘటన బి.కోడూరు మండలం పాయలకుంట్ల గ్రామంలో సంచలనం రేపింది. బద్వేలు మండలం చెర్లోబోయన పల్లెకు చెందిన కాశిని రమణారెడ్డి నాలుగేళ్ల క్రితం పెనగలూరు మండలం సాతుపల్లెకు చెందిన లక్ష్మిప్రియను (24) కులాంతర వివాహం చేసుకున్నాడు. మండలంలోని పాయలకుంట్లలో నివసిస్తూ బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. వీరికి సాయి శ్రీహిత (4), చింటు(2) సంతానం ఉన్నారు. రెండేళ్ల పాటు సజావుగా సాగిన వీరి కాపురంలో అనుమానం అనే విష బీజం మొలకెత్తింది. దీంతో రమణారెడ్డి నిత్యం మద్యం సేవిస్తూ భార్యను చిత్ర హింసలకు గురిచేస్తుండేవాడు. అయితే కులాంతర వివాహం చేసుకుందనే కారణంగా తల్లిదండ్రులు కూడా లక్ష్మిప్రియను ఆదరించలేదు. దీంతో ఆమె తన బాధను ఎవ్వరికీ చెప్పుకునే అవకాశం లేక బాధపడుతూనే ఉండేది. ఈ క్రమంలో గత మూడు రోజుల నుంచి లక్ష్మిప్రియను వివాహేతర సంబంధం పెట్టుకున్నావని వేధిస్తూ తీవ్రంగా కొడుతుండేవాడని స్థానికుల ద్వారా తెలిసింది. ఇదే సమయంలో లక్ష్మిప్రియను హతమారుస్తానని కూడా బెదిరించినట్లు తెలిసింది. ఈ నేపధ్యంలో ఆదివారం రాత్రి కూడా ఇరువురి మద్య గొడవ జరిగిన అనంతరం ఇంటిలోనే నిద్రించారు. ఆ తర్వాత సోమవారం తెల్లవారుజామున నిద్రపోతున్న భార్య లక్ష్మిప్రియను, ఇద్దరు పిల్లలను గొడ్డలితో అతి కిరాతకంగా చంపి పక్క ఇంట్లో నివసిస్తున్న తల్లిదండ్రులకు విషయం తెలిపి పరారయ్యాడు. మైదుకూరు డీఎస్పీ బీఆర్ శ్రీనివాసులు, పోరుమామిళ్ల సీఐ పద్మనాభన్, బి.కోడూరు ఎస్ఐ మద్దిలేటి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అలాగే హత్యకు ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. వీఆర్ఓ అమర్నాథరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోలీసుల అదుపులో నిందితుడు? భార్యా పిల్లలను అతి కిరాతకంగా హత్యచేసిన రమణారెడ్డి కోసం బి.కోడూరు పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు బద్వేలు నాలుగురోడ్ల కూడలి సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
ఇల్లాలి దారుణహత్య
మద్యానికి బానిసై కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాడు. కూలి పనికి వెళ్లి ముగ్గురు పిల్లలను పోషించుకుంటున్న ఇల్లాలికి చిత్రహింసలతో నరకం చూపించాడు. చివరకు విచక్షణారహితంగా దాడి చేసి మట్టుబెట్టాడు. పిల్లలను అనాథల్ని చేశాడు. ఈ సంఘటన గుంతకల్లు మండలం గుండాల గ్రామంలో శుక్రవారం జరిగింది. గుంతకల్లు రూరల్ : గుండాల గ్రామానికి చెందిన మంగమ్మ, రామాంజనేయులు దంపతుల కుమారుడు రాజుకు, పామిడి మండలం కొండాపురం గ్రామానికి చెందిన చిన్న మునెప్ప, సుంకమ్మ దంపతుల కూతురు నాగమునెమ్మ అలియాస్ చిట్టెమ్మ(28)కు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు రామాంజినమ్మ(6), షర్మిల (4), ఒక కుమారుడు వీరాంజనేయులు (2) ఉన్నారు. వివాహం తరువాత భార్యతో కలిసి వేరుకాపురం పెట్టిన రాజు తన తండ్రి నుంచి ఆస్తిగా వచ్చిన గొర్రెలను తాగుడు కోసం అమ్మేశాడు. భర్త తాగుడుకు బానిసగా మారి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసినా తట్టుకున్న నాగమునెమ్మ కూలి పనులు చేసుకుంటూనే తన ముగ్గురు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది. రాజు తన భార్య సంపాదనలో దాచుకున్న డబ్బుతోపాటు, ఇంట్లోని వస్తువులను అమ్ముకుని రోజూ మద్యం తాగి వచ్చేవాడు. నిత్యం భార్యను చిత్రహింసలకు గురిచేస్తూ వేధించేవాడు. భర్త ప్రవర్తనతో పూర్తిగా విసిగిపోయిన నాగమునెమ్మ 15 రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. ఇకపై బుద్ధిగా ఉంటానంటూ రాజు నమ్మబలికి మూడు రోజుల క్రితం ఆమెను తిరిగి గుండాలకు తీసుకువచ్చాడు. రెండు రోజులుగా మద్యం మత్తులోనే తూగుతున్న రాజు గురువారం రాత్రి తన భార్య నాగమునెమ్మపై విచక్షణా రహితంగా దాడిచేసి చంపాడు. మృతిపై పొంతనలేని సమాచారం భర్త దాడిలో తీవ్రంగా గాయపడి మృతిచెందిన నాగమునెమ్మను గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధంచేసుకున్న రాజు శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో ఆమె పుట్టింటి వారికి సమాచారం అందించాడు. అదికూడా తనకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆటోలో ఆస్పత్రికి తీసుకెళుతుండగా కిందపడి మృతిచెందిందని ఒకసారి, మిద్దెపైకి ఎక్కుతూ కాలుజారి కిందపడటం వల్ల మృతిచెందిందని మరోసారి పొంతనలేని సమాధానాలతో వారిని మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు. దీంతో హడావిడిగా గుండాలకు చేరుకున్న బంధువులు మృతురాలి శరీరంపై ఉన్న గాయాలను చూసి.. భర్తే కొట్టిచంపాడన్న ఆగ్రహంతో అతడిపై మూకుమ్మడిగా దాడిచేశారు. దీంతో రాజు అక్కడినుండి పరారయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అమ్మా.. అమ్మా... భర్త ఎన్ని చిత్రహింసలు పెట్టినా ఓర్చుకుంటూ కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన ఆ తల్లి చనిపోవడంతో.. ‘అమ్మా... అమ్మా...’ అంటూ రెండేళ్ల బాలుడు విలపించిన తీరు అందరినీ కలచివేసింది. తల్లి కనిపించకపోవడంతో అక్క చంక నుండి దిగకుండా, ఇతరుల దగ్గరకు వెళ్లకుండా గుక్కపట్టి ఏడ్చాడు. ఏడేళ్ల వయసులోనే కన్నతల్లిలాగా బాలుడిని బుజ్జగిస్తున్న అక్కను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. -
మామపై కత్తితో దాడి..అడ్డొచ్చిన భార్యను..
సాక్షి, హిందూపురం: తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి మామపై కత్తితో దాడి చేశాడు. అడ్డువచ్చిన భార్యపైనా దాడి చేసి గాయపరిచాడు. అనంతపురం జిల్లా పరిగి మండలం బీచిగానిపల్లెలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మల్లప్ప శుక్రవారం పూటుగా మద్యం తాగి తన ఇంటికి వెళ్లాడు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుండటంతో మామ మైలారప్ప(56) అడ్డు చెప్పబోయాడు. దీంతో మల్లప్ప వేటకొడవలితో అతని తలపై కొట్టాడు. ఇది గమనించిన భార్య గంగమ్మ అడ్డురాగా ఆమెను కూడా తీవ్రంగా గాయపరిచాడు. బాధితులిద్దరినీ స్థానికులు హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. -
పెళ్లీడుకొచ్చిన పిల్లలు ఉన్నారు.. తాగి వస్తే ఎలా..
ఆలూరు: పెళ్లీడుకొచ్చిన పిల్లలు ఇంట్లో ఉన్నారు రోజు తాగి వస్తే ఎలా అని ప్రశ్నించినందుకు భార్యను దారుణంగా నరికి చంపాడు ఆమె భర్త. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆలహారిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కురుమ మాలమ్మ(55), కురుమ గాదెప్ప(60) భార్యాభర్తలు. గాదెప్ప రోజూ మద్యం తాగి ఇంట్లో బీభత్సం సృష్టించేవాడు. ఆదివారం మధ్యాహ్నాం మద్యం మత్తులో ఇంటికి వచ్చిన గాదెప్పను మాలమ్మ నిలదీసింది. దీంతో ఆవేశానికి గురైన గాదెప్ప గొడ్డలితో కిరాతకంగా ఆమెను నరికి చంపాడు . తీవ్రగాయాలతో మాలమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. ఈ విషయం తెలిసిన ఆలహారి ఎస్ఐ కృష్ణమూర్తి సంఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దంపతుల ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలో విషాద సంఘటన వెలుగుచూసింది. కుటుంబ కలహాల నేపథ్యంలో దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బోయిన్‌పల్లిలోని కళింగ ఎన్‌క్లేవ్‌లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న సందీప్ యాదవ్(35), రుక్మిణి(30)దంపతులు గురువారం రాత్రి కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నారు. ఇది గుర్తించిన చుట్టుపక్కల వారు వారిని రక్షించడానికి యత్నించినా లాభం లేకపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
భార్యను హతమార్చిన భర్త
సౌపాడు (వట్టిచెరుకూరు): మండల పరిధిలోని సౌపాడు గ్రామంలోని బురదగుంటపల్లె ఎస్సీ కాలనీకి చెందిన నూతనపాటి మౌనిక (26) అనే వివాహిత సోమవారం దారుణహత్యకు గురైంది. పోలీసుల కథనం మేరకు.... సౌపాడు గ్రామానికి చెందిన నూతనపాటి మౌనికకు ప్రకాశం జిల్లాకు చెందిన వెంకటేశ్వరరావుకి గతేడాది వివాహమైంది. అప్పటి నుంచి వెంకటేశ్వరరావు కొంతకాలం జిల్లాలోని అమృతలూరు గ్రామంలో, ఆ తర్వాత మౌనిక స్వగ్రామైన సౌపాడు గ్రామంలో నివాసం ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో మౌనిక వెంకటేశ్వర్లు పెళ్ళి రోజు కావటంతో ఇంటి వద్దె ఉన్నారు. ఇంట్లో భార్య మౌనికపై భర్త దాడి చేసి గొంతు నులిమి చంపి ఇంటికి గడి పెట్టి ఊరు వదిలి పారిపోయాడని తెలిపారు. భార్యను హతమార్చిన వెంకటేశ్వరరావు ఊరు దాటి వెళ్ళిన తర్వాత కొంతసేపటికి మౌనిక పెద్దమ్మ, పెద్దనాన్నలకు ఫోన్ చేసి మీ అమ్మాయిను చంపాను, ఇంట్లో ఉందని తెలిపాడు. దీంతో కంగారుపడిన వారు మౌనిక తమ్ముడు రత్నరాజుకు సమాచారం అందించారు. మౌనిక తమ్ముడు రత్నంరాజు, తల్లిదండ్రులు ఇంటికి చెరుకుని పరిశీలించగా మౌనిక మృతి చెంది ఉండటం గమనించి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. నాలుగు నెలల గర్భిణి అయిన మౌనిక హత్యకు గురవటంతో కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అనుమానం పెనుభూతమై..
భార్యను హత్యచేసిన భర్త పోస్టుమార్టం నివేదికతో నిందితుడి అరెస్టు రామచంద్రపురం : కట్టుకున్న భార్యను అనుమానంతో కడతేర్చిన భర్త ఆ నేరం నుంచి తప్పించుకునేందుకు విఫలయత్నం చేసి చివరకు పోలీసులకు లొంగిపోయాడు. రామచంద్రపురం డీఎస్పీ ఎ¯ŒS.బీ.ఎం.మురళీకృష్ణ గురువారం స్థానిక పోలీస్టేçÙ¯ŒSలో విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. మండపేట మండలం మారేడుబాకకు చెందిన పడాల వీరవెంకట సతీష్‌కు 2014లో కె.గంగవరం మండలం కూళ్ల గ్రామానికి చెందిన నాగదుర్గ ప్రసన్న (24) తో వివాహం అయ్యింది. మారేడుబాకలోనే నివసిస్తున్న వారికి ప్రస్తుతం 11నెలల కుమారుడున్నాడు. ఇటీవల కాలంలో సతీష్ తన భార్య నాగదుర్గప్రసన్న ప్రవర్తనపై అనుమానం పెంచుకుని ఆమెను కొట్టి అమ్మ గారింటికి కూళ్లకు పంపించివేశాడు. కాగా ప్రసన్న అనారోగ్యానికి గురైందని ఆమె ఇంటి నుంచి ఫో¯ŒS రావడంతో సతీష్ కూళ్ల వచ్చాడు. గత నెల 9న తెల్లవారు జామున భార్యనాగదుర్గ ఫో¯ŒSలో మాట్లాడుతుండగా చూసి అనుమానంతో తన భార్యను చంపేందుకు నిర్ణయించుకున్నాడు. ఈమేరకు పడుకున్న ఆమె పీక నొక్కి, తలగడతో ముఖంపై అదిమి ఊపిరాకుండా చేసి హతమార్చాడు. హత్య చేసినట్లు తెలియకుండా ఉండాలని సాక్ష్యాలు లేకుండా చేశాడు. అనంతరం ఆమె తల్లితో అనారోగ్యంగా ఉండడం వల్ల మాట్లాడడం లేదని చెప్పడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే నాగదుర్గ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈమేరకు నాగదుర్గ తల్లి అడపా రాజేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేశారు. పోస్టుమార్టం రిపోర్టులో హత్య చేయబడినట్టు ఉండడం, దీనికి తోడు సతీష్ తన అత్తగారితో ఫో¯ŒSలో మాట్లాడుతూ ‘నీకూతుర్ని నేనే హత్యచేసాను, మీరు నన్నేమీ చేయలేరు’ అని బెదిరించడంతో పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు డీఎస్పీ తెలిపారు. ఇదిలా ఉండగా పోలీసులు గాలిస్తున్నారని తెలిసిన సతీష్ భయపడి మారేడుబాక వీఆర్వో వద్ద తను చేసిన నేరాన్ని ఒప్పుకుని అతని ద్వారా పామర్రు పోలీసుస్టేçÙ¯ŒSలో బుధవారం లొంగిపోయినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ మేరకు ముద్దాయి సతీష్‌ను అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన సీఐ కె. శ్రీధర్‌కుమార్, ఎస్సై నరేష్‌లను డీఎస్పీ అభినందించి, రివార్డులను అందించనున్నట్లు తెలిపారు. ఎస్సై ఎల్.శ్రీనునాయక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
భర్త దాడిలో గాయపడిన మహిళ మృతి
చెన్నారావుపేట : భర్త చేతిలో దెబ్బలు తిని తీవ్రగాయాలపాలైన ఓ మహిళ చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన మండలంలోని అక్కల్చెడ శివారు లచ్చినాయక్ తండాలో శుక్రవారం జరిగింది. ఎస్సై జగదీష్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మాలోతు చంద్రు చిన్న కుమారుడు రవికి కొత్తగూడెం మండలం ఓటాయి తండాకు చెందిన భూక్య జామ్‌ల–పాక్రిల కూతురు రమ(32)తో 17 ఏళ్ల క్రితం వివాహమైంది. వారి సంసార జీవితంలో కుమార్తెలు అశ్విని, మధుమతి, కుమారుడు నవీ¯ŒS జన్మించారు. సోమవారం రవి తన భార్యను అదనపు కట్నం తేవాలని కొట్టాడు. దీంతో ఆమెకు తీవ్రగాయాలు కాగా నర్సంపేట ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్‌కు అక్కడ నుంచి హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందింది. రమ మృతితో కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. మృతురాలి తండ్రి జామ్‌ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
మృత్యువులోనూ.. నీ వెంటే..!
చిలుకూరు: ఆరు దశాబ్దాలకు పైగా కలిసి జీవించారు.. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా కలిసిపోయారు.. మృత్యువు కూడా మమ్మల్ని వీడదీయలేదని నిరూపించుకున్నారు.. ఆ అన్యోన్యదంపతులు. అనారోగ్యంతో బాధపడుతున్న భార్య మృత్యుఒడికి చేరిందన్న చేదువార్తను జీర్ణించుకోలేని ఆ భర్త గుండెపోటుతో వెంటనే హఠాన్మరణం పొందాడు. ఈ విషాదకర ఘటన శనివారం రాత్రి చిలుకూరు మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని బేతవోలు గ్రామానికి చెందిన దొంగరి లింగయ్య(85), దొంగరి అనసూర్యయమ్మ (77) దంపతులు. వీరికి ఆరుగురు కుమార్తెలు ఉన్నారు. వీరు చిన్న కుమార్తె ఇంట్లో బేతవోలు గ్రామంలో ఉంటున్నారు. అనసూర్యయమ్మ కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ ఇంటి వద్దనే చిక్సిత పొందుతోంది. శనివారం రాత్రి అనసూరయమ్మ మృతిచెందింది. ఈ వార్త విన్న మూడు నిమిషాలకే ఆమె భర్త లింగయ్య గుండెపోటుతో కన్నుమూశాడు. వృద్ధ దంపతులు ఒక్క సారే చనిపోవడంతో కుటుంబæసభ్యుల రోదనలు మిన్నంటాయి. -
భార్య మృతిని తట్టుకోలేక..
సీతానగర్ కాలనీ(పాల్వంచ రూరల్): భార్య మృతిని తట్టుకోలేని ఓ వ్యక్తి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సీతానగర్ కాలనీలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సోములగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని సీతానగర్ కాలనీలో రిక్షా నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న ఎస్కే.వజీర్(46) భార్య నెల రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. అప్పటి నుంచి మనస్తాపానికి గురయిన వజీర్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో మంగళవారం రాత్రి కేబుల్ వైరుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు వజీర్‌కు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. కొడుకు ఫిర్యాదు మేరకు ఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
రోకలిబండతో బాది భార్యను హతమార్చాడు
బంజారాహిల్స్ : భార్యపై అనుమానంతో రోకలిబండతో తలపై బాది అమానుషంగా హత్య చేసిన నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని సయ్యద్ నగర్లో నివసించే సయ్యద్ అక్రం(35) నాంపల్లిలోని ఓ బేకరీలో పని చేస్తున్నాడు. తొమ్మిదేళ్ల క్రితం షాహినాబేగం(30)తో వివాహం కాగా వీరికి ముగ్గురు పిల్లలున్నారు. షాహినాబేగం శనివారం ఉదయం కూతురిని సమీపంలో ఉండే ప్రియదర్శిని స్కూల్లో వదిలేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా అక్రం ఆమెతో గొడవపడ్డాడు. ఆవేశంలో సమీపంలో ఉన్న రోకలిబండతో ఆమె తలపై అందరూ చూస్తుండగానే బాదాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై తలపగిలి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. నిందితుడు అక్కడి నుంచి పరారుకాగా పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. గత ఆదివారం కూడా భార్య భర్తల మధ్య తీవ్ర గొడవకాగా ఆమె అలిగి పుట్టింటికి వెళ్లింది. పెద్ద మనుషులు మాట్లాడి నచ్చజెప్పి ఆమెను మళ్లీ భర్త వద్దకు పంపించారు. ఇంతలోనే ఈ ఘోరం జరగడంపట్ల మృతురాలి తల్లిదండ్రులు, పిల్లలు కన్నీరుమున్నీరయ్యారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
భర్త వదిలేశాడు.. దెయ్యం వేధించింది..
బేబీ సిస్టర్(ఆయా)గా చిన్నారులను ఆడించాల్సిన ఆమె.. అత్యంత కర్కశంగా నాలుగేళ్ల పాపాయిని గొంతునులిమి చంపింది. కత్తితో తల నరికి, దాన్ని పట్టుకుని రోడ్డుపైకొచ్చి ఊరిని పేల్చేస్తానంటూ వీరంగం సృష్టించింది. సోమవారం మాస్కో నగరంలో కలకలం సృష్టించిన ఈ హత్యోదంతం.. నిందితురాలి నేరాంగీకారంతో మరింత సంచలనాత్మకంగా మారింది. మాస్కో నగరం పశ్చిమ ప్రాంతంలోని ఓ అపార్ట్ మెంట్ లో మెషెర్యాకోవా అనే ఇల్లాలు భర్త, 15 ఏళ్ల కొడుకు, 4 ఏళ్ల కూతురితో ఉంటోంది. పాపాయి ఆలనాపాలనా చూసుకునేందుకు గ్యుల్ చెహరా బబొకులోవా(38)అనే మహిళను బేబీ సిస్టర్(ఆయా)గా నియమించారు. సోమవారం పాపను ఆయాకు అప్పగించి బయటికి వెళ్లొచ్చిన మెషెర్యాకోవా.. తిరిగొచ్చేసరికి తమ ఫ్లాట్ తగలబడిపోవటం చూశారు. ఫైరింజన్ వచ్చి మంటలు ఆర్పేలోపే ఇంకో షాకింగ్ వార్త తెలిసింది.. బేబీ సిస్టర్ గా పనిచేస్తోన్న బబోకులోవా.. 4ఏళ్ల చిన్నారి న్యాస్తాను చంపేసిందని! కర్కషరీతిలో చిన్నారి తల నరికి చేతిలో పట్టుకుని రోడ్డుపై సంచరించిన బబొకులోవాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 16 గంటల సుదీర్ఘ విచారణలో నిందితురాలు బబోకులోవా నేరం అంగీకరించింది. హత్య ఎలా చేసిందో, ఎందుకు చేసిందో వెల్లడించింది.. 'మాది ఉజ్బెకిస్థాన్. భర్త ముగ్గురు పిల్లలతో చాలాకాలంపాటు నా జీవితం ఆనందంగా గడిచింది. అయితే కొద్ది కాలం కిందట నా భర్తతో పడక రష్యా వచ్చేశాను. నేను ఉండగానే ఆయన ఇంకోపెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యగా ఉండటం నాకు ఇష్టం లేదు. అందుకే పిల్లల్ని ఆయన దగ్గరే వదిలేసి మాస్కో వచ్చేశా. పిల్లల్ని ఎలా ఆలించాలో ముగ్గురుపిల్లల తల్లిగా నాకు బాగా తెలుసు. అందుకే బేబీ సిస్టర్ గా పనిచేద్దామనుకున్నా. మాస్కో వచ్చిన కొద్దిన రోజులకే మెషెర్యాకోవా ఇంట్లో పని దొరికింది. బస కూడా అక్కడే. చిన్నారి న్యాస్తాను బాగా చూసుకునేదాన్ని. అయితే కొద్ది రోజులుగా నాకు వింత శబ్ధాలు వినిపించేవి. ఒంటరిగా ఉన్నప్పుడు, పడుకున్నప్పుడు కలలో ఎవరో నాతో మాట్లాడేవాళ్లు. ఆదేశిస్తున్నట్లుగా గద్దించేవాళ్లు. ఆ రోజు కూడా అదృశ్యవాణి నాతో మాట్లాడింది. ఇంట్లో వాళ్లంతా బయటికి పోగానే నా గదిలోకి వెళ్లి ప్రార్థన చేసేటప్పుడు వేసుకునే బురఖా ధరించా. అలా చెయ్యమని అదృశ్యవాణి చెప్పింది. తర్వాత న్యాస్తాను బల్లపై పడుకోబెట్టి గొంతునులిమి చంపేశా. కిచెన్ లో నుంచి కత్తి తీసుకొచ్చి పాప గొంతుకోసి, ఇంటికి నిప్పుపెట్టి బయటికొచ్చేశా' అని బబొకులోవా వెల్లడించినట్లు మాస్కో పోలీసు అధికారులు పేర్కొన్నారు. 'నేను ఉగ్రవాదిని.. దగ్గరికొచ్చే పేల్చేస్తా' బబొకులోవా మాస్కో మెట్రో రైల్ స్టేషన్ వద్ద చేసిన నినాదాలపైనా దృష్టిసారించిన పోలీసులు.. ఆమెకు టెర్రరిస్టు గ్రూపులతో ఎలాంటి సంబంధాలు లేవని తేల్చారు. అయితే భర్తను వదిలి మాస్కో వచ్చిన తర్వాత ఉబ్జెకిస్థాన్ కే చెందిన ఓ యువకుడితో బబొకులోవా ప్రణయం సాగించింది. కేవలం ఆమెను అవసరాలకు వాడుకున్నఆ ప్రియుడు కొద్దికాలంలోనే బొబోకులోవాను వదిలించుకున్నాడు. అటు భర్తను వదిలేయటం, ఇటు ప్రియుడు మోసం చేయడంతో ఆమె తీవ్ర మనోవేదనుకు గురై సైకోలా మారి ఉంటుందని మానసిక నిపుణులు అంటున్నారు. నలికడలేని జీవితంతో విసిగిపోనందునే హంతకురాలిగా మారి ఉంటుందనే అంచనాకు వచ్చారు. చార్జిషీటు పూర్తయిన పక్షంలో త్వరలోనే ఈ కేసు న్యాయస్థానానికి చేరుతుంది. సాక్ష్యాధారాల సేకరణ కోసం మంగళవారం నిదితురాలిని అపార్ట్ మెంట్ కు తీసుకొచ్చిన సందర్భంలో చుట్టుపక్కలవారు 'ఆమెను చంపేయండి' అంటూ బిగ్గరగా నినాదాలుచేశారు. చిన్నారి తలతో రోడ్డుపై సంచరిస్తున్న బబోకులోవా (ఇన్ సెట్: నాలుగేళ్ల చిన్నారి న్యాస్తా) -
అత్తింటి ఎదుట వివాహిత ఆందోళన
- కుటుంబీకులు కాపురానికి - రావొద్దంటున్నారని ఆరోపణ ఇబ్రహీంపట్నం రూరల్: అత్తింటివారు కాపురానికి రావొద్దంటున్నారని ఓ వివాహిత భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. ఈ సంఘటన మండల పరిధిలోని కప్పపహాడ్‌లో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బూడిద మోహన్‌రెడ్డి గతేడాది డిసెంబర్ 12న మీర్‌పేట్‌కు కవితను రెండో వివాహం చేసుకున్నాడు. అనంతరం ఐదు నెలల వరకు వారి కాపురం హాయిగా సాగింది. కవితకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో కుటుంబీకులు పుట్టింటికి పంపారు. ఆరోగ్యం కుదుటపడగానే నెల రోజుల తర్వాత ఆమె అత్తారింటికి వచ్చింది. తర్వాత రావాలని కుటుంబీకులు చెప్పడంతో తిరిగి కవిత పుట్టింటికి వెళ్లింది. మరోసారి రాగా ఆడపడుచు అనసూయ, ఆమె భర్త బాగిరెడ్డి తనను బెదిరించి వెళ్లగొట్టారని బాధితురాలు తెలిపింది. మూడు రోజుల క్రితం అత్తారింటికి వచ్చిన ఆమెను చూసి కుటుంబీకులు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. గ్రామస్తులు తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది. -
కాపురానికి రాలేదని...
భార్యపై సైకో భర్త దాడి.. ఆపై ఆత్మహత్యాయత్నం సోంపేట మార్కెట్లో సంచలనం సోంపేట : సోంపేట పట్టణంలోని కూరగాయల మార్కెట్ (బజారు)లో మంగళవారం పట్టపగలు అందరూ చూస్తుండగానే ఓ ప్రబుద్ధుడు భార్యపై దాడిచేశాడు. బ్లేడుతో ఆమె పీకను కోయడమే కాకుండా తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన మార్కెట్ వ్యాపారులు, ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేశారు. సోంపేట పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... బీన పద్మ (23), బీన శ్రీనివాసరావు (27)భార్య భర్తలు. కంచిలి మండలం పెద్ద శ్రీరాంపురం గ్రామానికి చెందిన పర్రి కేశవరావు, లోలమ్మ కుమార్తె పద్మను ఒడిశాలోని ఖుర్దా రోడ్డు చెందిన శ్రీనివాసరావుతో మూడేళ్ల క్రితం వివాహంచేశారు. శ్రీనివాసరావు పెళ్లినాటి నుంచి సైకోలా వ్యవహారిస్తూ హింసిస్తున్నాడని పద్మ తల్లిదండ్రులకు చెప్పుతూ ఉండేది. తల్లిదండ్రులు సర్దుకుపోమ్మంటూ సలహా ఇస్తూ ఉండేవారు. పద్మ గర్భవతిగా ఉన్నప్పుడు కూడా ఒకటి రెండు సార్లు శ్రీనివాసరావు చేయి చేసుకున్నాడని తల్లిదండ్రులు తెలిపారు. ఆరు నెలల క్రితం పద్మకు ఒక కుమారుడు పుట్టి చనిపోయాడు. అప్పటి నుంచి పద్మ కన్నవారి ఇంటి వ ద్దే ఉంటోంది. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావు పద్మను కాపురానికి రావాలని కోరగా, ఆమె ససేమిరా అంది. ఆపై, ఆమె భర్త హింసను తట్టుకోలేకపోతున్నానంటూ కంచిలి పోలీస్ స్టేషన్లో వారం క్రితం ఫిర్యాదు చేయడంతో శ్రీనివాసరావుపై గృహహింస చట్టంపై కేసు నమోదయింది. కంచిలి ఎస్ఐ వేణుగోపాలరావు అతడిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. దీంతో భార్యపై శ్రీనివాసరావు కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం పెద్ద శ్రీరాంపురం గ్రామం నుంచి పద్మ తన పిన్ని సంతోషితో కలసి సోంపేట మార్కెట్‌కు రాగా, శ్రీనివాసరావు వెళ్లి ఆమెతో ఘర్షణకు దిగాడు. తనవెంట తెచ్చుకున్న బ్లేడుతో పద్మ మెడపై, గెడ్డంపై దాడి చేశాడు. ఆపై అతడూ కంఠం పై బ్లేడుతో కోసుకున్నాడు. దీంతో మార్కెట్లో ఒక్కసారిగా అలజడి రేగింది. ఇద్దరినీ స్థానికులు సోంపేట సామాజిక ఆస్పత్రికి తరలించారు. సోంపేట సీఐ సూరినాయుడు భార్య, భర్తల వద్ద నుంచి వివరాలు సేకరించారు. సోంపేట ఇన్చార్జి ఎస్ఐ వేణుగోపాలరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వీళ్లనెలా సాకను!
కల్తీకల్లు దొరక్క అస్వస్థతకు గురై మృతిచెందిన దస్తయ్య నలుగురు పిల్లలతో దిక్కుతోచని స్థితిలో భార్య లక్ష్మి భర్త సంపాదనపైనే ఇన్నాళ్లూ ఆధారపడ్డాం. ఇప్పుడు మా కుటుంబానికి దిక్కులేకుండా పోయింది. నలుగురు పిల్లలను ఎలా చదివించుకోను. రోజు గడవడమే కష్టంగా మారింది. ప్రభుత్వమే ఆదుకోవాలి. - లక్ష్మి, దస్తయ్య భార్య ల్తీ కల్లు ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఇంటిభారం మోసే పెద్దను బలితీసుకుని.. భార్య, నలుగురు పిల్లలను దిక్కులేని వారిని చేసింది. ధారూరుకు చెందిన దస్తయ్య(35) కల్లుకు బానిస. రోజూ రసాయనాలు కలిపిన కల్లుతాగి ఇంటికొచ్చేవాడు. ఇటీవల అధికారులు దాడులు ముమ్మరం చేయడంతో వ్యాపారులు కల్లులో రసాయనాలను తగ్గించారు. దీంతో దస్తయ్యకు ‘నిషా’ తగ్గింది.. ఎంత తాగినా ‘ఎక్కడంలేదు’. ఈ క్రమంలోనే పిచ్చిగా ప్రవర్తిస్తూ అస్వస్థతకు గురయ్యాడు. భార్య అతడిని తాండూరు ఆస్పత్రిలో చూపించగా కాస్త కోలుకున్నట్టు కన్పించాడు. అయితే ఇంటికి తీసుకొచ్చిన రాత్రే ఆరోగ్యం విషమించి తనువు చాలించాడు. మరో విషయం ఏమిటంటే.. ఇతడి తల్లి రత్నమ్మ కూడా కల్తీకల్లు బాధితురాలే. తాండూరు ఆస్పత్రిలో కొన్నాళ్లు చికిత్స పొంది ఇంటివద్దే ఉంది. ఈమె ఆరోగ్యం కూడా సరిగాలేదు. దస్తయ్య భార్య లక్ష్మి, కుమారులు దుర్గాప్రసాద్(13), గణేశ్(4), కూతుళ్లు ప్రవళిక(10), సుశీల(7)లు ఇప్పుడు దిక్కులేనివారయ్యారు. మమ్ములను ఆదుకోవాలని లక్ష్మి కోరుతోంది. - ధారూరు -
భార్య నోట్లో పురుగుల మందు పోశాడు
ఖమ్మం : ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం, పడమట నర్సాపురం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. భార్యను కొట్టి ఆపై నోట్లో పురుగు మందు పోశాడో భర్త. వివరాలు ... గ్రామానికి చెందిన బూరుగు నర్సమ్మ(32), ముక్తేశ్వరరావు భార్యాభర్తలు. ముక్తేశ్వర రావు బుధవారం రాత్రి మద్యం తాగి భార్యను కొట్టాడు. అంతటితో ఆగకుండా ఆమె నోట్లో పురుగుమందు పోశాడు. కొన ఊపిరితో ఉన్న నర్సమ్మను స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ఆమె మరణించింది. దాంతో ఆగ్రహించిన నర్సమ్మ తరపు బందువులు ముక్తేశ్వరరావుకు దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. (జూలూరుపాడు) -
బాబోయ్ భర్త!
-
భర్తలతో పూజలందుకున్న భార్యలు!