కల్తీకల్లు దొరక్క అస్వస్థతకు గురై మృతిచెందిన దస్తయ్య
నలుగురు పిల్లలతో దిక్కుతోచని స్థితిలో భార్య లక్ష్మి
భర్త సంపాదనపైనే ఇన్నాళ్లూ ఆధారపడ్డాం. ఇప్పుడు మా కుటుంబానికి దిక్కులేకుండా పోయింది. నలుగురు పిల్లలను ఎలా చదివించుకోను. రోజు గడవడమే కష్టంగా మారింది. ప్రభుత్వమే ఆదుకోవాలి.
- లక్ష్మి, దస్తయ్య భార్య
ల్తీ కల్లు ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఇంటిభారం మోసే పెద్దను బలితీసుకుని.. భార్య, నలుగురు పిల్లలను దిక్కులేని వారిని చేసింది. ధారూరుకు చెందిన దస్తయ్య(35) కల్లుకు బానిస. రోజూ రసాయనాలు కలిపిన కల్లుతాగి ఇంటికొచ్చేవాడు. ఇటీవల అధికారులు దాడులు ముమ్మరం చేయడంతో వ్యాపారులు కల్లులో రసాయనాలను తగ్గించారు. దీంతో దస్తయ్యకు ‘నిషా’ తగ్గింది.. ఎంత తాగినా ‘ఎక్కడంలేదు’. ఈ క్రమంలోనే పిచ్చిగా ప్రవర్తిస్తూ అస్వస్థతకు గురయ్యాడు. భార్య అతడిని తాండూరు ఆస్పత్రిలో చూపించగా కాస్త కోలుకున్నట్టు కన్పించాడు. అయితే ఇంటికి తీసుకొచ్చిన రాత్రే ఆరోగ్యం విషమించి తనువు చాలించాడు.
మరో విషయం ఏమిటంటే.. ఇతడి తల్లి రత్నమ్మ కూడా కల్తీకల్లు బాధితురాలే. తాండూరు ఆస్పత్రిలో కొన్నాళ్లు చికిత్స పొంది ఇంటివద్దే ఉంది. ఈమె ఆరోగ్యం కూడా సరిగాలేదు. దస్తయ్య భార్య లక్ష్మి, కుమారులు దుర్గాప్రసాద్(13), గణేశ్(4), కూతుళ్లు ప్రవళిక(10), సుశీల(7)లు ఇప్పుడు దిక్కులేనివారయ్యారు. మమ్ములను ఆదుకోవాలని లక్ష్మి కోరుతోంది.
- ధారూరు
వీళ్లనెలా సాకను!
Published Tue, Nov 24 2015 12:38 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM
Advertisement