రెండో భార్య హత్య కేసులో నిందితుడి అరెస్ట్
దొడ్డబళ్లాపురం: రెండవ భార్యను హత్య చేసి మూడో వివాహం చేసుకోవడానికి సిద్ధపడ్డ నిందితుడిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. బిహార్‌కు చెందిన మహమ్మద్ నసీమ్ (39) అరెస్ట్ నిందితుడు.
రుమేశ్ ఖాతున్(22) హత్యకు గురైన రెండవ భార్య. సర్జాపురలో పెయింటర్‌గా పని చేస్తున్న నసీమ్‌కు మొటి భార్య ఆమెకు ముగ్గురు పిల్లలు, రెండో భార్య ఖాతున్‌కు కూడా ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే రెండవ భార్య శీలాన్ని శంకించిన నసీమ్ ఆమెను నవంబర్ 11న గొంతు నులిమి హతమార్చాడు. తరువాత ఆమె మృతదేహాన్ని కాళ్లు, చేతులు కట్టి మురుగు కాలువలో పడేశాడు.
బిహార్ వెళ్లి తలదాచుకున్నాడు. మరోవైపు సర్జాపుర పోలీసులు ఖాతున్ మృతదేహం లభించడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి నసీమ్ జాడ తెలుసుకుని బిహార్ వెళ్లగా అక్కడ అతడు మూడో వివాహం చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. సర్జాపుర పోలీసులు అతడ్ని పెళ్లింటి నుండే అరెస్టు చేసి తీసుకువచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment