
మృతిచెందిన వజీర్
భార్య మృతిని తట్టుకోలేని ఓ వ్యక్తి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సీతానగర్ కాలనీలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.
సీతానగర్ కాలనీ(పాల్వంచ రూరల్): భార్య మృతిని తట్టుకోలేని ఓ వ్యక్తి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సీతానగర్ కాలనీలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సోములగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని సీతానగర్ కాలనీలో రిక్షా నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న ఎస్‌కే.వజీర్(46) భార్య నెల రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది.
అప్పటి నుంచి మనస్తాపానికి గురయిన వజీర్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో మంగళవారం రాత్రి కేబుల్ వైరుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు వజీర్‌కు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. కొడుకు ఫిర్యాదు మేరకు ఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.