deid
-
బర్డ్ ఫ్లూ కలకలం: వియత్నాంలో 47 పులుల మృతి
బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా దక్షిణ వియత్నాంలోని ఓ జూలో 47 పులులు, మూడు సింహాలు, ఓ పాంథర్ మరణించినట్లు స్థానిక మీడియా బుధవారం ఓ కథనంలో వెల్లడించింది. వియత్నాం న్యూస్ ఏజెన్సీ (VNA) మీడియా కథనం ప్రకారం.. లాంగ్ యాన్ ప్రావిన్స్‌లోని ప్రైవేట్ మై క్విన్ సఫారీ పార్క్ , హో చి మిన్ సిటీకి సమీపంలోని డాంగ్ నైలోని వూన్ జోయ్ జూలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఈ మరణాలు సంభవించాయని పేర్కొంది.నేషనల్ సెంటర్ ఫర్ యానిమల్ హెల్త్ డయాగ్నోసిస్ పరీక్ష ఫలితాల ప్రకారం ఈ జంతువులకు H5N1 రకం A బర్డ్ ఫ్లూ వైరస్ సోకటంతో మృతి చెందినట్లు తెలిపింది. అయితే పులుల మరణాలుపై జూ అధికారుల స్పందించకపోటం గమనార్హం. అదేవిధంగా జంతువులతో సన్నిహితంగా ఉన్న జూ సిబ్బంది ఎవరిలో కూడా శ్వాసకోశ లక్షణాలను బయటపడలేదని తెలుస్తోంది.⚠️Bird flu kills 47 tigers, 3 lions and a panther in Vietnam zoos, state media reports.47 tigers, 3 lions and a panther have died in zoos in south Vietnam due to the H5N1 bird flu virus, state media said Wednesday.@ejustin46@mrmickme2@DavidJoffe64https://t.co/P99Dn71HMF— COVID101 (@COVID19info101) October 2, 2024 ఎడ్యుకేషన్ ఫర్ నేచర్ వియత్నాం (ENV) ప్రకారం.. 2023 చివరి నాటికి వియత్నాంలో మొత్తం 385 పులులు జూలో ఉన్నాయి. ఇందులో 310 ప్రైవేట్ అధీనంలోని జూలలో ఉండగా.. మిగిలినవి ప్రభుత్వ అధీనంలోని జూల సంరక్షణలో ఉన్నాయి. 2022 నుంచి బర్డ్ ఫ్లూ వైరస్ H5N1 వేగంగా వ్యాప్తి చెందటం వల్ల పలు క్షీరదాల మరణాలు పెగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.ఈ H5N1 వైరస్ ఇన్ఫెక్షన్లు మానవుల్లో కూడా తేలికపాటి నుంచి తీవ్రమైన స్థాయి వరకు ఉండవచ్చని, కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా కూడా మారవచ్చని ప్రపంచ ఆగర్యో సంస్థ పేర్కొంది. మరోవైపు.. గతంలో 2004లో సైతం డజన్ల కొద్దీ పులులు బర్డ్ ఫ్లూ కారణంగా చనిపోయాయని వియాత్నం స్థానిక మీడియా తెలిపింది.చదవండి: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపై భారత్ ఆందోళన చెందుతోంది: జై శంకర్ -
మ్యాన్‌హోల్‌లో పనిచేస్తున్న కార్మికునిపై దూసుకెళ్లిన కారు.. వీడియో వైరల్..
ముంబయి: ముంబయిలో దారుణం జరిగింది. నడిరోడ్డుపై ఉన్న మ్యాన్‌హోల్‌లో పనిచేస్తున్న కార్మికునిపై కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో కార్మికుడు మృతి చెందినట్లు తెలుస్తోంది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన.. కందివాలి ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. A manual scavenger was mowed to death by a vehiclein Kandivali, Mumbai. An FIR has been registered in this case at Kandivali police station under sections 304 (A), 336 and 279. Two people - driver and the contractor - have been arrested. pic.twitter.com/86pwBaW5AM — TIMES NOW (@TimesNow) June 26, 2023 ఈశాన్య రుతుపవనాలతో ముంబయిలో వర్షాలు కుండపోతగా కురిశాయి. దీంతో డ్రైనేజీల్లో వర్షపు నీరు పొంగి పారుతోంది. దీంతో చాలాచోట్ల డ్రైనేజీల్లో సమస్యలు ఎదురయ్యాయి. ఈ క్రమంలో రహదారిపై ఉన్న డ్రైనేజీ మ్యాన్‌హోల్ మూత తీసి కార్మికులు మరమ్మతులు చేస్తున్నారు. ఓ వ్యక్తి మ్యాన్‌హోల్‌లో దిగి చెత్తను అందిస్తుండగా.. మరో వ్యక్తి దానిని దూరంగా పారబోస్తున్నాడు. ఇదే సమయంలో మ్యాన్‌హోల్‌లో ఉన్న వ్యక్తి కిందికి వంగాడు. అది గమనించని కారు డ్రైవర్.. కార్మికుని మీదుగానే వాహనాన్ని పోనిచ్చాడు. ఇదీ చదవండి: రెచ్చిపోయిన దొంగలు.. గన్‌తో బెదిరించి.. కారును అడ్డగించి.. వీడియో వైరల్.. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కార్మికున్ని మ్యాన్‌హోల్ నుంచి బయటకు తీశారు. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స తీసుకుంటూ అతను మరణించినట్లు తెలుస్తోంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. కార్మికున్ని గమనించని కారు డ్రైవర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు మరమ్మతులు చేసేప్పుడు కార్మికులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలను కామెంట్ చేశారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్.. రాత్రంతా రోడ్డుమీదే.. పర్యటకుల అవస్థలు.. -
దైవదర్శనానికి వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు
ఇటిక్యాల (అలంపూర్): దైవ దర్శనానికి వెళ్తూ.. ట్రాక్టర్ బోల్తాపడటంతో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం మునగాల గ్రామ శివారులోని జాతీయ రహదారిపై సోమవారం రాత్రి 11 గంటల సమయంలో చోటుచేసుకుంది. మానవపాడు మండలం చిన్నపోతులపాడుకు చెందిన మల్లికార్జున్ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ట్రాక్టర్‌పై మంగళవారం గద్వాలలోని జమ్ములమ్మ దేవతను దర్శించుకొనేందుకు సోమవారం రాత్రి బయలుదేరారు. అయితే మునగాల శివారులో జాతీయ రహదారిపై ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో మల్లికార్జున్ (45), పార్వతమ్మ (39), అయిజ మండలం మేడికొండకు శైలజ (10) అక్కిడికక్కడే దుర్మరణం పాలవగా.. ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే గద్వాల జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇందులో పదిమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో సుమారు 40 మంది ప్రయాణిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
భార్య మృతిని తట్టుకోలేక..
సీతానగర్ కాలనీ(పాల్వంచ రూరల్): భార్య మృతిని తట్టుకోలేని ఓ వ్యక్తి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సీతానగర్ కాలనీలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సోములగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని సీతానగర్ కాలనీలో రిక్షా నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న ఎస్కే.వజీర్(46) భార్య నెల రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. అప్పటి నుంచి మనస్తాపానికి గురయిన వజీర్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో మంగళవారం రాత్రి కేబుల్ వైరుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు వజీర్‌కు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. కొడుకు ఫిర్యాదు మేరకు ఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
సెల్ చార్జింగ్ పెడుతూ..
సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ ప్రమాద వశాత్తూ విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం బాలెం తండలో సోమవారం ఉదయం జరిగింది. వివరాలు... గ్రామానికి చెందిన సబావత్ మోహన్(18) ఇంటర్ ద్వితియ సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం తన మొబైల్లో చార్జింగ్ తక్కువగా ఉండటంతో.. చార్జింగ్ పెట్టడానికి ప్రయత్నిస్తుండగా.. విద్యుధ్ఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. -
రోడ్డు ప్రమాదంలో ఈవెంట్ మేనేజర్ మృతి
-
లారీ ఢీకొని విద్యార్థి మృతి
తెర్లాం: అతి వేగంగా వెళ్తున్న లారీ పాఠశాలకు వెళ్తున్న ఓ బాలున్ని ఢీకొట్టింది. దీంతో బాలుడు లారీ వెనక చక్రాల కింద నలిగిపోయాడు. ఈ సంఘటన విజయనగరం జిల్లా తెర్లాం మండలం పెరుమాలి జంక్షన్ దగ్గర శనివారం ఉదయం జరిగింది. వివరాలు.. తెర్లాం మండలం జగన్నాధవలస గ్రామానికి చెందిన చౌడవాడ కామేశ్వర్రావు(12) పెరుమాళి ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో శనివారం సైకిల్‌పై పాఠశాలకు వెళ్తున్న బాలుడు పెరుమాళి జంక్షన్ వద్దకు చేరుకోగానే రాజాం నుంచి రామభద్రాపురం వె ళ్తున్న లారీ సైకిల్‌ను ఢీకొట్టింది. దీంతో లారీ కింద పడిపోయిన కామేశ్వర్రవు పై నుంచి లారీ వెనక చక్రాలు పోవడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పాఠశాలకు వెళ్తున్న బాలుడు ప్రమాదానికి గురయ్యాడని సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. -
ఆర్టీసీ బస్సులో యువకుడి హఠాన్మరణం
అర్వపల్లి: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ఓ యువకుడు హఠాన్మరణం చెందాడు. నల్లగొండ జిల్లా అర్వపల్లి మండలం డి.కొత్తపల్లికి చెందిన శివరాత్రి రమేష్ శుక్రవారం ఉదయం జనగామ నుంచి స్వగ్రామం వెళుతుండగా నాగారం బంగ్లా గ్రామం సమీపంలో ఈ ఘటన జరిగింది. ఫిట్స్ వల్లే రమేశ్ మృతి చెందాడని తోటి ప్రయాణికులు అంటున్నారు. కాగా, రమేశ్ మూడు నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నాడు. -
విద్యుత్ షాక్‌తో తల్లీ కూతురు మృతి
ప్రకాశం(కొత్తపట్నం):కరెంట్ షాక్ తో తల్లీ కూతురు మృతి చెందారు. ఈ ఘటన గురువారం ఉదమం వెలుగులోకి వచ్చింది. కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామానికి చెందిన సరోజనమ్మ(65) కూతురు తిరుమల(36)తో కలసి ఉంటుంది. అయితే బుధవారం రాత్రి మోటురు వేసేందుకు వెళ్లిన తిరుమలకు విద్యుత్ షాక్ తగిలింది. ఆమెను రక్షించేందుకు వెళ్లిన సరోజనమ్మకు కూడా షాక్ తగలడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయం గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. -
విద్యుదాఘాతానికి యువరైతు బలి
జగిత్యాల రూరల్: విద్యుదాఘాతంలో ఓ రైతు పొలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా జగిత్యాల రూరల్ మండలం పెరకపల్లి గ్రామంలో మంగళవారం ఉదయం జరిగింది. రవి (22) అనే రైతు ఉదయం పొలానికి వెళ్లి నీరు పెట్టేందుకు మోటార్ ఆన్ చేయగా విద్యుత్ షాక్‌కు గురై కుప్పకూలిపోయాడు. పక్క పొలంలోని రైతులు వచ్చి చూసేసరికి అతను చనిపోయాడు. చేతికి అందిన కొడుకు మృతిచెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
బస్సులోంచి దూకేసిన మహిళా కండక్టర్ మృతి
జంగారెడ్డి గూడెం: పశ్చిమగోదావరి జిల్లా పట్టిసీమ సమీపంలో బస్సులోంచి దూకేసిన మహిళా కండక్టర్ చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందింది. శుక్రవారం ఉదయం పట్టిసీమ ఎల్ఎన్డీ కాలనీలో ఆర్టీసీ అధికారులు జంగారెడ్డిగూడెం నుంచి పట్టిసీమకు వెళుతున్న బస్సును ఆపి తనిఖీ చేయగా జారీ చేసిన టికెట్ల కంటే ప్రయాణికులు ఎక్కువగా ఉన్నట్టు తేలింది. దీంతో కండక్టర్ పద్మావతి సరిగా విధులు నిర్వర్తించడం లేదంటూ రిమార్క్ రాశారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె బస్సులోంచి దూకగా తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూసింది.