సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ ప్రమాద వశాత్తూ విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం బాలెం తండలో సోమవారం ఉదయం జరిగింది. వివరాలు... గ్రామానికి చెందిన సబావత్ మోహన్(18) ఇంటర్ ద్వితియ సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం తన మొబైల్‌లో చార్జింగ్ తక్కువగా ఉండటంతో.. చార్జింగ్ పెట్టడానికి ప్రయత్నిస్తుండగా.. విద్యుధ్ఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.
సెల్ చార్జింగ్ పెడుతూ..
Published Mon, Nov 2 2015 9:17 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
Advertisement
Advertisement