electricity department
-
కరెంటోళ్లం.. మాకే ఫైన్ వేస్తారా..?
మెదక్ మున్సిపాలిటీ: ‘మేం కరెంటోళ్లం.. మాకే ఫైన్ వేస్తారా?’అంటూ విద్యుత్‌శాఖ ఉద్యోగులు ట్రాఫిక్ సిగ్నళ్లకు విద్యుత్ నిలిపివేసిన ఘటన మెదక్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఈ నెల 14న ట్రిపుల్ రైడ్‌గా వెళ్తున్న ఓ బైక్‌కు ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారు. దీంతో ‘మేం కరెంటోళ్లం. డ్యూటీపై వెళ్తున్నాం. మాకే ఫైన్ వేస్తారా? మేమేంటో చూపిస్తాం’అని బెదిరించి వెళ్లిపోయారు. తర్వాత పట్టణంలోని రెండు ప్రధాన కూడళ్లలో ఉన్న ట్రాఫిక్ సిగ్నళ్లకు విద్యుత్ సరఫరాను నిలిపేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ట్రాఫిక్ చలాన్లను సరిచేస్తామని చెప్పినప్పటికీ విద్యుత్ లైన్ తొలగించారని సీఐ నాగరాజు తెలిపారు. అనంతరం ట్రాన్స్‌కో అధికారులతో చర్చించడంతో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు వెల్లడించారు. ఇదే విషయమై ఏఈ నవీన్‌ను వివరణ కోరగా.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద విద్యుత్ మీటర్లు లేవని, వాటిని బిగించుకోవాలని సూచిస్తూ సరఫరాను నిలిపివేసి.. తర్వాత పునరుద్ధరించినట్లు చెప్పారు. -
Hyderabad: గచ్చిబౌలి ఏడీఈ అక్రమాస్తులు రూ.100కోట్ల పైనే
గచ్చిబౌలి: అవినీతికి పాల్పడిన అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం టీజీఎస్పీడీసీఎల్ గచ్చిబౌలి ఆపరేషన్స్ విద్యుత్ ఏడీఈ కె.సతీష్ కార్యాలయంలో ఉన్న సమయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కార్యాలయంలోని టేబుల్ డెస్‌్కలో రూ.50 వేలను గుర్తించి స్వాదీనం చేసుకున్నారు. గచ్చిబౌలి డివిజన్లోని గోపన్‌పల్లిలో ఓ ఇంట్లో ట్రాన్స్ఫార్మర్, సీటీ మీటర్ బిగించడానికి ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టర్ శివారెడ్డి ఏర్పాట్లు చేసుకున్నారు. వీటిని ఏర్పాటు చేసేందుకు రూ.75 వేలు ఇవ్వాలని ఏడీఈ సతీష్ డిమాండ్ చేశాడు. దీంతో మొదట రూ.25 వేలు తీసుకున్నాడు. మిగతా రూ.50వేలు శుక్రవారం అందించగా తీసుకొని టేబుల్ డెస్క్‌లో పెట్టారు. ఇదే సమయంలో ఏసీబీ అధికారులు కార్యాలయానికి చేరుకొని తనిఖీలు చేయగా కెమికల్‌తో కూడిన డబ్బులు డెస్‌్కలో దొరకడంతో స్వా«దీనం చేసుకొని సతీష్ ను నాంపల్లిలోని ఏసీబీ కోర్టుకు తరలించారు. రూ. 100 కోట్లకుపైనే అక్రమాస్తులు హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో 22 ఎకరాల వ్యవసాయ భూమి, ఓపెన్ ప్లాట్లు, విల్లా, భవనాలు సదరు అధికారికి ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ స్థిరాస్తుల మార్కెట్ విలువ రూ. 100 కోట్లకుపైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అవినీతి సమాచారాన్ని టోల్‌ఫ్రీ నంబర్ 1064కు అందించాలి.. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు అవినీతికి పాల్పడితే వెంటనే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు సమాచారం అందించాలని ఏసీబీ అధికారులు సూచించారు. సోషల్ మీడియా వాట్సప్ నంబర్ 94404 46106కు సైతం సమాచారం అందించవచ్చన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వారు స్పష్టం చేశారు. -
డిస్కంలలో 3,260 కొత్త కొలువులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో కొలువుల జాతర ప్రారంభం కానుంది. వరంగల్ కేంద్రంగా పనిచేసే ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్)లో 2,212 జేఎల్ఎం (జూనియర్ లైన్మెన్), 30 సబ్ ఇంజనీర్, 18 అసిస్టెంట్ ఇంజనీర్ల (ఎలక్ట్రికల్, సివిల్)తో పాటు హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్)లో 600 జూనియర్ లైన్ మెన్ (జేఎల్ఎం), 300 సబ్ ఇంజనీర్, 100 అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు విద్యుత్ సంస్థలు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ)కి సమర్పించిన నివేదికలో తెలిపాయి.2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ బిజినెస్, వీలింగ్ టారిఫ్ వార్షిక ఆదాయ అవసరాల (ఏఆర్ఆర్) పిటిషన్లలో విద్యుత్ సంస్థలు ఈ కొత్త నియామకాల అంశాన్ని ప్రస్తావించాయి. కాగా, ఐటీఐ చేసిన వారు జేఎల్ఎం ఉద్యోగాలకు, పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన వారు సబ్ ఇంజనీర్, బీఈ/బీటెక్ అభ్యర్థులు అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు అర్హులు. ఈ మేరకు పోస్టుల భర్తీ కోసం రెండు డిస్కంలు త్వరలో ఏకకాలంలో నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశాలున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలోనే ఈ ఉద్యోగాల భర్తీ ఉంటుందని సమాచారం. -
పెట్రోల్ పోయవా? అయితే కరెంట్ కట్
లక్నో: రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్రవాహనదారుల మరణాలను నివారించే ఉద్దేశంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన ఒక నిబంధన రాష్ట్రంలోని విద్యుత్ శాఖ లైన్మెన్కు ఆగ్రహం తెప్పించింది. దీంతో అతను పెట్రోల్‌బంక్‌కు విద్యుత్ సరఫరాను నిలిపేసిన ఘటన హాపూర్ జిల్లా లోని పార్థాపూర్ రోడ్డులో జరిగింది. హెల్మెట్ ధరి స్తేనే ద్విచక్రవాహనదారులకు పె ట్రోల్‌ను విక్రయించాలనే నిబంధనను అమలుచేయాలని యూపీ సర్కార్ ఆదేశించింది. దీంతో పార్థాపూర్ రోడ్డులోని ఒక పెట్రోల్‌బంక్ సైతం ఇదే నియమాన్ని పాటిస్తోంది. మంగళవారం ఈ పెట్రోల్‌బంక్‌కు వచ్చిన కరెంట్ డిపార్ట్మెంట్ లైన్మెన్ పెట్రోల్ అడగ్గా బంక్ సిబ్బంది నిరాకరించారు. హెల్మెట్ ధరించి వస్తేనే బైక్‌కు పెట్రోల్ కొడతామని కరాఖండీగా చెప్పారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన లైన్మెన్ అక్కడి నుంచి కొంతదూరం వెళ్లి బంక్‌కు విద్యుత్‌సరఫరా అందిస్తున్న ట్రాన్స్ఫార్మర్ ఉన్న కరెంట్‌స్తంభం ఎక్కి వైర్‌ను కత్తిరించాడు. దీంతో బంక్‌లో విద్యుత్‌సరఫరా ఆగిపోయింది. దీంతో ఇంధన వినియోగదారుల చాంతడంత క్యూలైన్ ఏర్పడింది. వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంతో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. అయితే లైన్మెన్ కరెంట్ లైన్‌ను కత్తిరించిన విషయం అక్కడి సీసీటీవీలో రికార్డ్‌కావడంతో అది లైన్మెన్ పని అని తర్వాత తెలిసింది. వెంటనే స్థానికులు ఫిర్యాదుచేయడంతో విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. -
ఎగిసిపడ్డ ప్రజాగ్రహం
సాక్షి, అమరావతి: కరెంట్ చార్జీలను పెంచబోమని... ఇంకా తగ్గిస్తామని ఎన్నికల్లో నమ్మించి అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లలోనే రూ.15,485.36 కోట్ల షాకులిచ్చిన సీఎం చంద్రబాబు మోసాలపై ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. టీడీపీ కూటమి సర్కారు విద్యుత్తు చార్జీల బాదుడుపై నిరసన జ్వాలలు భగ్గుమన్నాయి. ప్రభుత్వ వేధింపులు.. పోలీసుల బెదిరింపులకు వెరవకుండా.. నయవంచన పాలనను నిరసిస్తూ కిరోసిన్ లాంతర్లతో జన వాహిని కదం తొక్కింది. కరెంటు చార్జీలు పెంచి ఇప్పటికే వసూలు చేస్తున్న రూ.6,072.86 కోట్లను తిరిగి వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనవరి నుంచి మోపనున్న రూ.9,412.50 కోట్ల భారాన్ని రద్దు చేయకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కూటమి సర్కారు మంగళం పాడిన ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని తక్షణమే పునరుద్ధరించాలని నినదించారు. ‘ఓటు’ దాటాక హామీలను తగలేయడాన్ని నరనరాన జీర్ణించుకున్న చంద్రబాబు మోసాలను ఎండగడుతూ విద్యుత్తు బిల్లుల బాదుడుకు నిరసనగా వైఎస్సార్ సీపీ శుక్రవారం నిర్వహించిన పోరుబాటకు ప్రజలు ఉప్పెనలా కదలివచ్చారు. పోలీసుల ఆంక్షలకు వెరవకుండా కిరోసిన్ లాంతర్లు చేతబట్టి కూటమి ప్రభుత్వం చేసిన దగాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంట్ చార్జీల పెంపును వెంటనే రద్దు చేయాలి.. నయవంచక చంద్రబాబు డౌన్ డౌన్.. అంటూ గర్జించారు. దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తూ వేలాది మంది కిలోమీటర్ల తరబడి విద్యుత్ శాఖ కార్యాలయాల వరకూ ర్యాలీగా కదిలి వచ్చారు. విద్యుత్ కార్యాలయాల వద్ద నిరసనలు నిర్వహించి అధికారులకు డిమాండ్ పత్రాలను అందజేశారు. ఈనెల 13న నిర్వహించిన రైతు పోరును మించి కరెంటు చార్జీల బాదుడుపై పోరుబాటలో జనం ఉద్యమించడంతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో కదనోత్సాహం నెలకొంది. » కృష్ణా జిల్లాలో విద్యుత్‌చార్జీల పెంపుపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లాలో భారీ స్పందన లభించింది. » విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాలు హోరెత్తాయి.» శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ‘పోరుబాట’కు జనం పోటెత్తారు. బుచ్చిరెడ్డిపాళెంలో రెండు కిలోమీటర్ల మేర నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై వేలాది మందితో ర్యాలీ నిర్వహించారు. » ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పోరుబాట నిరసన కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. ఏలూరు జిల్లాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. » తూర్పు గోదావరి జిల్లాలో కోటిపల్లి బస్టాండ్ నుంచి విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ కార్యాలయం వరకు భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. » పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాల్లో నిరసన ప్రదర్శనల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీలు, పాదయాత్రలు, విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద ధర్నాలు నిర్వహించారు. » వైఎస్సార్ జిల్లా కడపలో పార్టీ కార్యాలయం నుంచి విద్యుత్ భవన్ వరకూ ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. పులివెందులలో ఎంపీ అవినాష్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లాలో విద్యుత్ పోరు కొనసాగింది.» కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు.» తిరుపతి నగరంలో నిరసన ర్యాలీ పద్మావతిపురంలోని భూమన కార్యాలయం నుంచి ఏపీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం వరకూ సాగింది. నాయుడుపేట, చంద్రగిరి, శ్రీకాళహస్తి, గూడూరు, నాగలాపురంలో ర్యాలీలు నిర్వహించారు.» కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నేతలు ర్యాలీగా విద్యుత్ కార్యాలయానికి చేరుకుని అధికారులకు డిమాండ్ పత్రాన్ని అందచేశాయి.» చిత్తూరు జిల్లా పుంగనూరులో మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ కూడలి నుంచి ర్యాలీగా పీఎల్ఆర్ రోడ్డులోని ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయానికి చేరుకుని విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలంటూ నినదించారు. చిత్తూరు, నగరి, పూతలపట్టు, కార్వేటి నగరం, పలమనేరులో నిరసన ప్రదర్శనలు జరిగాయి. -
ఎస్సీ, ఎస్టీలకు ‘షాక్’ ఉచిత విద్యుత్ కట్
నెల రోజులుగా చీకట్లోనే.. 200 యూనిట్లు లోపు విద్యుత్ వినియోగిస్తున్న మా ఇంటికి గత ప్రభుత్వంలో ఫ్రీగా కరెంట్ ఇచ్చారు. ఇప్పుడు సబ్సిడీ లేదని, పాత బకాయిలు రూ.22 వేలు చెల్లించాలంటూ కనెక్షన్ తొలగించారు. నెల రోజులకుపైగా చీకట్లోనే మగ్గుతున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చాకే మాకీ దుస్థితి దాపురించింది. – కొల్లి విమల, రెడ్డిగణపవరంఅన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం రాఘవరాజపురం దళితవాడలో నివసించే రోజువారీ కూలీ బంటుపల్లి మధు నివసిస్తున్న ఇంటికి రూ.35 వేలు కరెంట్ బిల్లు రావడంతో షాక్ తిన్నాడు. రోజంతా కష్టపడితే వచ్చే ఐదారొందలు ఇంటి ఖర్చులు, పిల్లల చదువులకే సరిపోవడం లేదు. ప్రభుత్వం ఇంత డబ్బు కట్టమంటే ఎక్కడి నుంచి తేవాలని మధు వాపోతున్నాడు.ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం రెడ్డి గణపవరంకి చెందిన గిరిజనులు కాక వెంకమ్మ, మారెయ్యలకు ఏ నెలలోనూ 200 యూనిట్లు దాటి కరెంట్ బిల్లు రాలేదు. రూ.40 వేలు పాత బకాయిలుగా చూపిస్తూ అక్టోబర్ నెలాఖరున అధికారులు వారి కరెంట్ కనెక్షన్ తొలగించారు. అప్పు చేసి ఆ మొత్తాన్ని చెల్లించి నాలుగు రోజులపాటు తిరిగితే ఎట్టకేలకు కనెక్షన్ ఇచ్చారు. నాలుగు రోజుల క్రితం మరోసారి వచ్చిన విద్యుత్తు సిబ్బంది మరో రూ.22 వేలు బకాయిలున్నాయని, అవి కూడా చెల్లించకుంటే కనెక్షన్ తొలగిస్తామని హెచ్చరిస్తున్నారు.సాక్షి, అమరావతి: ఉచిత విద్యుత్‌పై కూటమి సర్కారు మోసంతో రాష్ట్రవ్యాప్తంగా దళిత, గిరిజన నివాసాల్లో చీకట్లు కమ్ముకుంటున్నాయి. గత ప్రభుత్వం ఉచితంగా అందించిన విద్యుత్‌ను కూడా పాత బకాయిలుగా చూపిస్తూ ఎస్సీ, ఎస్టీల నుంచి బలవంతపు వసూళ్లకు దిగుతోంది. రూ.లక్షలు.. వేలల్లో బకాయిలు చెల్లించాలంటూ ఆదేశిస్తోంది. అంత డబ్బు కట్టలేని పేదల కరెంట్ కనెక్షన్లను విద్యుత్ సిబ్బంది నిర్దాక్షిణ్యంగా కట్ చేస్తూ మీటర్లను తొలగిస్తున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం, కొయ్యలగూడెం మండలాల్లో పలు గ్రామాల్లో గిరిజన, దళితులకు చెందిన విద్యుత్ కనెక్షన్లను అధికారులు కట్ చేశారు. పుట్లగట్లగూడెం, మైసన్నగూడెం, రెడ్డిగణపవరం, పాలకుంట, వీరభద్రపురం లాంటి గిరిజన గూడేలు, దళితపేటలు అంధకారంలో మగ్గిపోతున్నాయి. దాదాపు 250 కుటుంబాలు నివసించే అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం రాఘవరాజపురం దళితవాడలో బకాయిలు చెల్లించాలంటూ విద్యుత్‌శాఖ సిబ్బంది బిల్లులు జారీ చేయడంతో స్థానికులు నిరసనకు దిగారు. పలువురికి రూ.4,000 నుంచి రూ.10,000 వరకు బిల్లులు జారీ అయ్యాయి. ఇంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలంటూ పేదలు ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్ కడప జిల్లా సింహాద్రిపురం మండలం హిమకుంట్ల ఎస్సీ కాలనీలో గత నెలాఖరున విద్యుత్ అధికారులు కనెక్షన్లు తొలగించడంతో ఎస్సీ కాలనీ వాసులు రెండు రోజులపాటు అంధకారంలో మగ్గిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి చొరవ చూపడంతో దళితవాడలో విద్యుత్తు వెలుగులు వచ్చాయి. 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇచ్చిన జగన్ వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ఏడాది జనవరి వరకు 15,29,017 ఎస్సీ కుటుంబాలకు ఉచిత విద్యుత్తుతో రూ.2,361.95 కోట్ల మేర లబ్ధి చేకూరగా 4,57,586 ఎస్టీ కుటుంబాలకు రూ.483.95 కోట్ల మేర ప్రయోజనం కలిగింది. మొత్తం 19,86,603 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.2,845.90 కోట్ల మేర ఉచిత విద్యుత్తు ద్వారా మేలు చేశారు. మీటర్ల తొలగింపు... దళితులు, గిరిజనులు నిబంధనల ప్రకారం నెలకు 200 యూనిట్లలోపు వినియోగించుకున్నప్పటికీ ఉచిత విద్యుత్‌ను అందించకుండా కూటమి ప్రభుత్వం బిల్లులు జారీ చేస్తోంది. 150 యూనిట్లు లోపు వినియోగించుకున్న వారికి సైతం రూ.వేలల్లో పాత బకాయిలు ఉన్నారని బిల్లులు జారీ అవుతున్నాయి. పాత బకాయిల పేరుతో విద్యుత్తు సిబ్బంది కరెంట్ మీటర్లు తొలగించి తీసుకుపోతున్నారు. బకాయిలు చెల్లిస్తేనే విద్యుత్‌ను పునరుద్ధరిస్తామని తేల్చి చెబుతుండటంతో పేదలు తీవ్ర షాక్‌కు గురవుతున్నారు. తాటాకు ఇళ్లు, రేకుల షెడ్లు, ప్రభుత్వ కాలనీల్లో నివసించే వారంతా చీకట్లోనే కాలం గడుపుతున్నారు. ఉచిత విద్యుత్‌పై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, తమకు పైనుంచి ఆదేశాలు వచ్చాయని, బిల్లు కట్టాల్సిందేనంటూ సిబ్బంది పేర్కొంటున్నారు. గ్రామాల్లో ఒత్తిడి చేస్తున్నారు.. కరెంట్ బిల్లులు చెల్లించాలంటూ అధికారులు గ్రామాల్లో తిరుగుతూ ఒత్తిడి చేస్తున్నారు. ఇంట్లో తనిఖీ చేసి కట్టాల్సిందేనని దురుసుగా మాట్లాడారు. మేం ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. – డోలా కాశమ్మ, రాఘవరాజపురం దళితవాడ, అన్నమయ్య జిల్లా గత ఐదేళ్లు అడగలేదు.. గత ఐదేళ్ల పాటు మాకు ఉచిత విద్యుత్తు అందింది. ఎప్పుడూ బిల్లు కట్టమని అడగలేదు. 200 యూనిట్ల లోపే వినియోగిస్తున్నాం. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ బిల్లు కట్టాలంటూ విద్యుత్ సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారు. – కన్నేపల్లి కుమారి, గాందీగ్రామం, చోడవరం, అనకాపల్లి జిల్లా బకాయిలు కడితేనే కనెక్షన్.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాకు ఉచిత విద్యుత్ అందించింది. గతంలో వినియోగించుకున్న ఉచిత విద్యుత్‌ను కూడా ఇప్పుడు బకాయిలుగా చూపిస్తూ బిల్లులు కట్టమంటున్నారు. అక్టోబర్ నెలాఖరున విద్యుత్ కనెక్షన్ తొలగించారు. రూ.15 వేల బకాయిలు కడితేనే కనెక్షన్ ఇస్తామంటూ మీటర్ తీసుకెళ్లిపోయారు. – బల్లే రమాదేవి, రెడ్డిగణపవరం, బుట్టాయగూడెం మండలం. అంధకారంలో అవస్థలు.. పాత బకాయిల పేరుతో కరెంట్ కనెక్షన్లు తొలగించడం దారుణం. బుట్టాయగూడెం, మైసన్నగూడెం, రెడ్డి గణపవరం, వీరభద్రపురం లాంటి ఆరు గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీల ఇళ్లలో కరెంట్ కనెక్షన్లు తొలగించారు. ఒక్కొక్కరు రూ.16 వేల నుంచి రూ.25 వేల వరకు బకాయిలు ఉన్నట్లు చూపిస్తున్నారు. డబ్బులు కట్టలేక నెల రోజులకు పైగా చీకట్లో అవస్థ పడుతున్నారు. దీనిపై డీఈ, విజయవాడలోని ఉన్నతాధికారులకు మొర పెట్టుకున్నా ఆలకించే నాథుడే లేడు. – అందుగుల ఫ్రాన్సిస్, బుట్టాయగూడెం మండల దళిత నేత స్పష్టత ఇవ్వకుంటే ఉద్యమిస్తాం.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దళితులు, గిరిజనులకు నెలకు 200 యూనిట్లు చొప్పున ఉచితంగా విద్యుత్ అందించింది. కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇవ్వకపోగా పాత బకాయిలు చెల్లించాలంటూ దళితులు, గిరిజనులను బెదిరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత విద్యుత్‌ను కట్ చేసింది. దీనిపై విద్యుత్‌శాఖ మంత్రి రవికుమార్, ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌కు వినతిపత్రం అందించాం. ఉచిత విద్యుత్ విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుంటే ఉద్యమిస్తాం. – అండ్ర మాల్యాద్రి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
ఇచ్చేది కొంత.. వడ్డింపు కొండంత
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో విద్యుత్ శాఖకు అరకొర కేటాయింపులతో సరిపెట్టింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులు, వివిధ వర్గాలకు అందించిన ఉచిత, రాయితీ విద్యుత్ పథకాలను కూటమి సర్కారు తమవిగా చెప్పుకుంది. ఈ ఏడాది నుంచే రాష్ట్ర ప్రజలపై దాదాపు రూ.17 వేల కోట్ల ఇంధన సర్దుబాటు చార్జీలను వసూలు చేస్తున్న ప్రభుత్వం విద్యుత్ రంగానికి, ప్రజలకు ఇచ్చే రాయితీలు, సబ్సిడీల కోసం కేవలం రూ.8,207.64 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే ఇచ్చే దానికంటే రెట్టింపు వసూలు చేయనుంది.జగన్ పథకాలే తమవిగా..ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గత ప్రభుత్వ తప్పిదాల వల్లే ఇప్పుడు వినియోగదారులపై ట్రూ అప్ చార్జీల భారం మోపాల్సి వచ్చిందంటూ నిందలు మోపారు. నిజానికి గతంలో టీడీపీ హయాంలో జరిగిన అధిక ధరల విద్యుత్ కొనుగోళ్ల కారణంగానే రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు అప్పుల ఊబిలోకి కూరుకుపోయాయి. ఆ వాస్తవాన్ని ఆర్థిక మంత్రి దాచిపెట్టారు. పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించడం కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వమే ప్రత్యేక పాలసీని తీసుకువచ్చింది. దానినే కూటమి ప్రభుత్వం కాపీ కొట్టింది.తమ ప్రభుత్వం ఆక్వా రైతులకు తక్కువ ధరకే విద్యుత్ సరఫరా చేస్తూ, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారి కాలనీల్లో ప్రతి ఇంటికీ నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తోందని ఆర్థిక మంత్రి తెలిపారు. ధోబీ ఘాట్లకు, దారిద్య రేఖకు దిగువనున్న రజకులు నిర్వహిస్తున్న లాండ్రీలకు, నాయీబ్రాహ్మణుల క్షౌ రశాలలకు, స్వర్ణకారుల దుకాణాలకు, అత్యంత వెనుకబడిన కులాలకు, చేనేత కార్మికులకు ఉచితంగా, రాయితీపై విద్యుత్ అందిస్తున్నామన్నారు.అయితే.. ఈ పథకాలన్నీ గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టి అమలు చేసినవే. ఎన్నికల ముందు రైతులకు సబ్సిడీపై పంపుసెట్లు మంజూరు చేస్తామనే హామీ బడ్జెట్లో ఎక్కడా కనిపించలేదు. భవిష్యత్‌లో పెరగనున్న విద్యుత్ డిమాండ్‌ను అందుకోవడం కోసం ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్త విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టును ప్రకటించలేదు. ఇంధన పొదుపు, సంరక్షణ కోసం ఒక్క రూపాయి కూడా విదల్చలేదు. డిస్కంలకు కూడా ఒక్క పైసా సాయం ప్రకటించలేదు. సభను హుందాగా నడిపేలా సహకరించండిసాక్షి, అమరావతి: సభను హుందాగా నడిపేలా సహకరించాలని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు సభ్యులకు హితవు పలికారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సోమవారం ప్రారంభమైన సభలో తొలుత కొద్దిసేపు మాట్లాడిన మోషేన్‌రాజు సభ్యులకు పలు సూచనలు చేశారు. పెద్దల సభ గౌరవాన్ని, ప్రభుత్వ ప్రతిష్టను కాపాడుకునేలా సభ్యులు హుందాగా వ్యవహరించాలన్నారు. రాష్ట్ర సాధారణ బడ్జెట్‌ను మంత్రి కొల్లు రవీంద్ర, వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి పి.నారాయణ శాసన మండలిలో ప్రవేశపెట్టారు. మండలిలో వైఎస్సార్సీపీ పక్ష నాయకుడు బొత్సా సత్యనారాయణ వైఎస్సార్సీపీ, టీడీపీ, పీడీఎఫ్ సభ్యులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం చెప్పిన బడ్జెట్ లెక్కలు⇒ ఏపీ విద్యుత్ నియంత్రణ మండలికి రూ.4.25 కోట్లు⇒ స్టేట్ ఎనర్జీ ఎఫిషియెన్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కి రూ.0⇒ ఏపీ ట్రాన్స్‌కోకి రూ.742.56 కోట్లు⇒ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు రూ.0⇒ ఆక్వా రాయితీ విద్యుత్‌కు రూ.738 కోట్లు⇒ విద్యుత్ రంగ సంస్కరణలు, నష్టాలకు రూ.0⇒ వ్యవసాయ ఉచిత, అనుబంధ రంగాల రాయితీ విద్యుత్‌కు రూ.5,760.74⇒ ప్రపంచ బ్యాంక్, ఏషియన్ బ్యాంకుల రుణాలకు రూ.611.76 కోట్లు⇒ డైరెక్టరేట్ ఆఫ్ ఎలక్ట్రికల్ సేఫ్టీ కోసం రూ.10.16 కోట్లు⇒ ఏపీ జెన్కో హెడ్‌వర్క్స్, హైడ్రో ఎలక్ట్రిక్ కోసం రూ.37.69 కోట్లు⇒ ఇంధన శాఖ ఆర్థిక కార్యకలాపాలకు రూ.302.46 కోట్లు -
పవర్ ఇక ప్రీ పే!
కొత్తపేట: రానున్న రోజుల్లో విద్యుత్ చార్జీల చెల్లింపు విధానం ప్రీపెయిడ్ విధానంలోకి మారనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న విద్యుత్ మీటర్ల స్థానే స్మార్ట్ మీటర్లు రానున్నాయి. మొదట మాన్యువల్ మీటర్ల నుంచి ప్రారంభమైన విద్యుత్ మీటర్లు ఆధునిక పరిజ్ఞానానికి అనుగుణంగా మారుతూ వచ్చాయి. ప్రస్తుతం స్మార్ట్ మీటర్ల వంతు వచ్చిoది. ప్రీపెయిడ్ ఆప్షన్‌తో ఈ మీటర్లు రూపొందించారు. సాధారణంగా ఈ నెల వినియోగించిన విద్యుత్ బిల్లును వినియోగదారులు మరుసటి నెల చెల్లిస్తున్నారు. బిల్లు ఇచ్చిన 15 రోజుల వరకు ఎటువంటి అపరాధ రుసుం చెల్లించవలసిన అవసరం లేదు. ఈ లెక్కన వినియోగదారుడికి బిల్లు చెల్లించడానికి దాదాపు నెల వరకు సమయం ఉంటుంది. ఇప్పటి వరకు అనుసరిస్తున్న పద్ధతి ఇదే. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా దశల వారీగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మీటర్లలో ప్రీపెయిడ్ ఆప్షన్ జతచేశారు. దీని ద్వారా విద్యుత్ సరఫరా కోసం ముందుగానే రీచార్జి చేయాల్సి ఉంటుంది. అలా చేయక పోతే సరఫరా ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. విద్యుత్ మీటర్లలో మార్పులు మొదట మెకానికల్ (మాన్యూవల్) మీటర్లు ఉండేవి వాటిలో యూనిట్లు చూసి రీడర్లు బుక్‌లో రీడింగ్ రాసుకునేవారు. తర్వాత ఎలెక్ట్రో మెకానికల్ మీటర్లు, హై యాక్యురసీ మీటర్లు వచ్చాయి. ఆ తరువాత ఐఆర్ పోర్ట్ అంటే స్కాన్ చేస్తే రీడింగ్ ఆటోమేటిక్ రికార్డు అవుతుంది. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు వస్తున్నాయి. ఇవన్నీ మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా రూపొందించినవే. ఇప్పటి వరకు అమలవుతున్న విధానానికి అలవాటు పడిన వినియోగదారులకు స్మార్ట్ మీటర్‌పై మరింత అవగాహన కల్పించాల్సి ఉంటుంది. జీతాలకు కోట్లు విద్యుత్ శాఖ పరిధిలో వేల సంఖ్యలో ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రతి నెలా విద్యుత్ శాఖ జీతాలు, పింఛన్లు చెల్లించడానికి రూ.కోట్లు కావాల్సి వస్తోంది. ఇక శాఖాపరంగా అభివృద్ధి కోసం వందల కోట్లు కావాల్సి వస్తోంది. వీటికి మూలాధారం విద్యుత్ బిల్లుల ద్వారా వచ్చే ఆదాయమే. జిల్లాలో నెలకు సుమారు రూ.50 కోట్లకు పైగా విద్యుత్ బిల్లుల రూపంలో ఆదాయం వస్తోంది. అదే స్మార్ట్ మీటర్లు పెడితే ఇంకా పెరుగుతుందని అంచనా. ప్రభుత్వ బకాయిలు రూ.103 కోట్లు జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖలు, పంచాయతీలు, పరిశ్రమలు, వ్యాపార, గృహావసరాలు కలిపి మొత్తం 6,12,317 సర్విసులు ఉన్నాయి. వాటిలో ప్రభుత్వ, పంచాయతీ కార్యాలయాల పరంగా ఇప్పటి వరకు రూ.103 కోట్ల బిల్లులు రావాల్సి ఉంది. ఆ బకాయిల చెల్లింపుల కోసం ఎన్ని నోటీసులు ఇచ్చినా వసూళ్లు మాత్రం అంతంత మాత్రమేనని ఆ శాఖ రెవెన్యూ అధికారులు చెపుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలే కదా విద్యుత్ సరఫరా కట్ చేయరనే భావన ఏర్పడడంతో అవి మొండి బకాయిలుగా మారాయి. స్మార్ట్ మీటర్ల ద్వారా ప్రీపెయిడ్ విధానం అమలులోకి వస్తే విద్యుత్ శాఖకు బకాయిల బాధ ఉండదు. ఉపయోగాలు.. » సెల్ ఫోన్లో బ్యాలెన్స్ ఏ విధంగా చూసుకుంటామో.. ఇక్కడ అదే విధంగా యాప్‌లో చెక్ చేసుకోవచ్చు. »బ్యాలెన్స్ ఉన్నంత వరకే విద్యుత్ సరఫరా ఉంటుంది. నగదు అయిపోయిన వెంటనే సరఫరా బంద్ అవుతుంది. రీచార్జి చేస్తేనే విద్యుత్ వెలుగులుంటాయి. »బ్యాలెన్స్ ఎంత ఉందో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. నష్టాలూ.. » విద్యుత్ సంస్థను నమ్ముకుని ఎన్నో ఏళ్లుగా మీటర్ రీడర్లు పనిచేస్తున్నారు. ఈ విధానం పూర్తిస్థాయిలో అమలైతే వారి ఉపాధికి పెద్ద దెబ్బేనని చెప్పాచ్చు. » అవగాహన లేమితో రీచార్జ్ చేసుకోవడంలో వినియోగదారులు ఏ మాత్రం అలసత్వం వహించినా, సరఫరాకు ఆటంకం కలిగే అవకాశం ఉంటుంది. » విద్యుత్ చౌర్యం పెరిగే అవకాశం ఉంది. లైన్ల నుంచి విద్యుత్‌ను అక్రమంగా వాడుకునే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
బదిలీకి లేఖ.. దండుకోవడమే ఇక
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆ పార్టీల ప్రజాప్రతినిధులు అందినకాడికి దండుకోవడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల బదిలీలు వారికి రూ. లక్షలు కుమ్మరిస్తున్నాయి. ఆ కోవలోనే విద్యుత్ శాఖలో కూడా భారీగా డబ్బులు చేతులు మారాయి. అర్హతను, నిబంధనలను బట్టి చేయాల్సిన బదిలీల్లో రాజకీయ నేతల సిఫారసు లేఖలే రాజ్యమేలుతున్నాయి. ఏ ఉద్యోగిని కదపాలన్నా, ఎక్కడికి బదిలీ చేయాలన్నా, ఉన్నచోటనే ఉంచాలన్నా.. ఈ లేఖా్రస్తాన్ని సంధిస్తే చాలు పనైపోతోంది. ఇందుకోసం ఒక్కో పోస్టుకు దాని ప్రాధాన్యతను బట్టి రూ.5 లక్షల నుంచి దాదాపు రూ.30 లక్షల వరకూ ఉద్యోగులు సమర్పించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఉద్యోగుల బదిలీలకు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన సిఫారసు లేఖలు, వాటి ఆధారంగా విద్యుత్ సంస్థలు తయారు చేసిన రాజకీయ బదిలీల జాబితాలు ‘సాక్షి’ చేతికి చిక్కాయి. నేతల చేతుల్లో కీలుబొమ్మలుగా ఉన్నతాధికారులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ తమ మాట వినని వారిని వేధించడం, రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు వంటి చర్యలను చూస్తున్న ఉన్నతాధికారులకు ఆ పారీ్టల నేతలు చెప్పింది చేయడం తప్ప మరో గత్యంతరం లేదు. తమకు అనుకూలురైన వారిని కూటమి ప్రభుత్వం అందలం ఎక్కిస్తోంది. విద్యుత్ సంస్థల్లోని డైరెక్టర్ల చేత బలవంతంగా రాజీనామా చేయించిన ప్రభుత్వం ఏపీఈపీడీసీఎల్‌లో ఫైనాన్స్ డైరెక్టర్‌గా ఉన్న చంద్రానికి మాత్రం ఏపీసీపీడీసీఎల్లోనూ అదే స్థానాన్ని కట్టబెట్టింది. కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడుతో ఆయనకు సత్సంబంధాలు ఉండటంతోనే రెండు డిస్కంలలో ఒకే పోస్టులో కొనసాగుతున్నారు. ఇక బదిలీల కోసం ప్రజాప్రతినిధులు సిఫారసు చేసిన ఉద్యోగుల పేర్లతో ప్రత్యేకంగా జాబితాలను సీఎండీలు తయారు చేయించారు. ఆ జాబితాలు దగ్గర పెట్టుకుని బదిలీల ప్రక్రియను జరిపిస్తున్నారు. డబ్బులు ఇచ్చుకోలేని వారు, ఎవరి నుంచీ రాజకీయ సిఫారసులు తీసుకుని రాలేని వారు దీనివల్ల బలైపోతున్నారు. వారిని అప్రా«దాన్య పోస్టుల్లోకి, ప్రాంతాలకు బదిలీ చేసేస్తున్నారు.ఇవిగో సాక్ష్యాలు » ఏలూరు సర్కిల్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఓ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ (ఏఈఈ) రాజమండ్రి డి7 సెక్షన్‌కు బదిలీ కోసం తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీకి ప్రస్తుత రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరితో పాటు, మాజీ మంత్రి, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సిఫారసు చేశారు. » విశాఖ సర్కిల్లో ఓ ఏఈఈని రాజమండ్రి సర్కిల్లోని గోపాలపట్నం రూరల్ సెక్షన్‌కు బదిలీ చేయాలని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సిఫారసు చేశారు. » మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఓ ఏఈని ఏలూరు సర్కిల్ నుంచి రాయవరం బదిలీ చేయమని చెప్పారు. » రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణ ఏలూరు సర్కిల్ నుంచి ఓ ఏఈఈని సంపత్‌నగరం పంపమన్నారు. n ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి) ఓ ఏఈని రాజమండ్రి సర్కిల్ నుంచి ఏలూరు సర్కిల్‌కు బదిలీ చేయాలని సిఫారసు చేశారు. » ఏలూరు సర్కిల్లో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్(ఏడీఈ)ని కొయ్యలగూడెం సబ్ డివిజన్‌కు మార్చాల్సిందిగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సీఎండీకి లేఖ ఇచ్చారు.ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లతో పాటు ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్కోలలో జరుగుతున్న బదిలీలు మొత్తం ఇదే విధంగా ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖల ఆధారంగానే జరుగుతున్నాయి. (ఆ ఉద్యోగుల పేర్లు, వారు ప్రస్తుతం పనిచేస్తున్న స్థానాల పేర్లతో సహా ‘సాక్షి’ వద్ద అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ వారి ఉద్యోగ భద్రత దృష్ట్యా ఆ వివరాలను ప్రచురించడం లేదు.)మేమెందుకు తగ్గాలి?బదిలీల్లో పలువురు ఉన్నతాధికారులూ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఏపీసీపీడీసీఎల్‌కు కొత్త సీఎండీని నియమించినా ఇటీవల బదిలీపై వచ్చిన ఉన్నతాధికారే మొత్తం బదిలీల ప్రక్రియను చూస్తున్నారు. ఈ డిస్కం పరిధిలో ఓ ఎమ్మెల్యేకి మరో ఉన్నతాధికారి స్వయంగా డబ్బులు వసూలు చేసి ఇస్తున్నారు. ఏపీఈపీడీసీఎల్‌లో ఓ ఉన్నతాధికారి పశి్చమ గోదావరి జిల్లాలో ఉన్న ఓ ఉద్యోగి సాయంతో సొంత వారి చేత వసూళ్ల పర్వాన్ని నడిపిస్తున్నారు.రాజమండ్రికి చెందిన ఓ యూనియన్ నేత మధ్యవర్తిగా వ్యవహరిస్తూ డబ్బులు వసూలు చేసి సంబంధిత అధికారులకు సమర్పిస్తున్నారు. ఇక ఏపీఎస్పీడీసీఎల్లో ఓ ఉన్నతాధికారికి మూడు డిస్కంలతో అనుబంధం ఉండటంతో ప్రజాప్రతినిధులకు అనుగుణంగా వాటిని నడిపిస్తున్నారు. ముఖ్యంగా ఉన్నతాధికారులు సామాజిక సమీకరణాలకు కూడా పెద్దపీట వేస్తున్నారు. -
విద్యుత్ షాక్‌తో ముగ్గురు స్నేహితులు సజీవ దహనం
కనిగిరి రూరల్: కరెంట్ షాక్‌తో ముగ్గురు స్నేహితులు సజీవ దహనమయ్యారు. ఈ విషాద ఘటన మంగళవారం ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పునుగోడు వద్ద జరిగింది. వివరాలు.. కనిగిరిలోని దేవాంగనగర్‌కు చెందిన వీరమాస గౌతమ్‌కుమార్(16), ఇందిరాకాలనీకి చెందిన దేశబోయి నజీర్(16), కామినేని బాలాజీ (16) పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు.గౌతమ్, నజీర్ పట్టణంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతుండగా.. బాలాజీ చదువు ఆపేశాడు. వీరు ముగ్గురూ మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పునుగోడు చెరువులో సరదాగా ఈత కొట్టేందుకు స్కూటీపై బయల్దేరారు. పునుగోడులోని ఎస్టీ కాలనీ సమీపంలో విద్యుత్ తీగ(11 కేవీ) తెగి కిందకు వేలాడుతోంది. వీరు ముగ్గురూ స్కూటీపై వెళ్తూ ఆ విద్యుత్ తీగకు తగిలారు. దీంతో ఒక్కసారిగా షాక్ కొట్టి ముగ్గురూ కిందపడిపోగా.. స్కూటీ నుంచి మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే ఈ విషయాన్ని విద్యుత్, పోలీస్ అధికారులకు తెలియజేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేసినప్పటికీ.. ముగ్గురూ కాలిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ రత్నాకరం రామరాజు, సీఐ, ఎస్సై, విద్యుత్, రెవెన్యూ అధికారులు పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.మృత్యువులోనూ వీరి స్నేహం విడిపోలేదంటూ కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యమే తమ బిడ్డల ప్రాణాలు తీసిందని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ ప్రమాదంపై మంత్రి గొట్టిపాటి రవి, వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ నారాయణ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందించి ఆదుకుంటామని మంత్రి చెప్పారు. మా సిబ్బంది నిర్లక్ష్యం లేదు ఈ ఘటనలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యమేమీ లేదని విద్యుత్ శాఖ డీఈఈ స్పష్టం చేశారు. ఈదురు గాలులకు విద్యుత్ తీగ తెగిందన్నారు. అయితే నేలపై పడకుండా చిల్లచెట్లపై ఉండటంతో పునుగోడు ఫీడర్ ట్రిప్ కాలేదని చెప్పారు. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోలేదన్నారు. అప్పుడే అటుగా వెళ్తున్న విద్యార్థులు విద్యుత్ తీగకు తగలడంతో షాక్‌కు గురై మృతి చెందారని విద్యుత్ శాఖ డీఈఈ, ఏడీఈలు ఒక ప్రకటనలో వెల్లడించారు. -
రాజస్తాన్‌లో సింగరేణి సోలార్ ప్లాంట్
గోదావరిఖని (రామగుండం): రాజస్తాన్‌లో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సింగరేణి సన్నా హాలు చేస్తోంది. ఈ మేరకు సంస్థ సీఎండీ ఎన్.బలరాం గురువారం రాజస్తాన్ రాజధా ని జైపూర్‌లో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమావేశ మయ్యారు. ఆ రాష్ట్ర ఇంధన శాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ, ట్రాన్స్‌కో సీఎండీ అలోక్‌ను కలిశారు. సింగరేణి ఆధ్వర్యంలో ప్లాంట్ ఏర్పాటుకు ముందుకువస్తే రాజస్తాన్ ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని అలోక్ తెలిపినట్లు వెల్లడించారు. అనంతరం రాజస్తాన్ జెన్కో సీఎండీ దేవేంద్రశ్రింగి, రెన్యూవబుల్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ నథ్‌మల్, డిస్కమ్స్ చైర్మన్ భానుప్రకాశ్ ఏటూరును కలిసి ప్లాంట్ ఏర్పాటు, తర్వాత విద్యుత్ కొనుగోలు తదితర అంశాలపై చర్చించారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్న యోచనలో ఉన్నట్లు సంస్థ చైర్మన్ బలరాం.. రాజస్తాన్ ఉన్నతాధికారులకు వివరించారు. సోలార్ పార్కులో సింగరేణి ప్లాంట్‌కు అనుకూలమైన స్థలాన్ని పరిశీలించిన తర్వాత పూర్తి ప్రతిపాదనలతో మరోసారి సమావేశం అవుతామని బలరాం తెలిపారు. సీఎండీ వెంట డైరెక్టర్ సత్యనారాయణరావు, సోలా ర్ ఎనర్జీ జీఎం జానకీరాం, చీఫ్ ఆఫ్ పవర్ విశ్వనాథరాజు ఉన్నారు. -
వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండండి
సాక్షి, హైదరాబాద్: వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆదేశించారు. వర్షాలు, ఈదురుగాలుల మూలంగా చెట్లు విరిగిపోవడం, స్తంభాలు కూలిపోవడం, విద్యుత్ తీగలు ఊడిప డటం లాంటి ఘటనలు జరుగుతుంటాయని, క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండి సమస్య వచి్చన వెంటనే స్పందించాలని సూచించారు. శని వారం సచివాలయంలో ఆయన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘ప్రజలు, పరిశ్రమలకు అవసరమైన విద్యుత్ అందుబాటులో ఉంది.సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టండి. లైన్స్ క్లియరెన్స్ (ఎల్సీ) విషయంలో జాగ్రత్త వహించాలి. ఒకేసారి పలు ప్రాంతాల్లో ఎల్సీలు ఇవ్వొద్దు. ఎల్సీ తీసుకునే సమయంలో స్థానిక వినియోగదారులకు ముందస్తు సమాచారం ఇవ్వండి. వర్షాకాలంలో కరెంటు సరఫరా, మరమ్మతులు, పునరుద్ధరణ విషయంలో ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి నుంచి క్షేత్రస్థాయిలోని లైన్మెన్ వరకు అప్రమత్తంగా ఉండాలి. నిరంతరం సమీక్షలు నిర్వహించడంతో పాటు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసుకోండి’అని భట్టి ఈ సమీక్షలో సూచించారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్.ఎం.ఎ.రిజ్వి, ఎస్పీడీసీఎల్ ఎండీ ముషారఫ్ అలీ, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అమరుల ఆశయాలకు అనుగుణంగా ప్రజాపాలన.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు భట్టి విక్రమార్క శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆలోచనల మేరకు యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ ప్రజల చిరకాల కోరికను నెరవేర్చారని శనివారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఆశయాలు, ఆకాంక్షలు పదేళ్లుగా ఆచరణకు నోచుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పాలన మొదలయ్యాక ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారని తెలిపారు. -
ఏపీలో ఆల్‌టైం హై విద్యుత్ వినియోగం!
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వినియోగం ఆల్‌టైం హై రికార్డును తాకింది. ఎండల తీవ్రత, వడగాల్పుల నేపథ్యంలోనే వినియోగం పెరిగిందని విద్యుత్ శాఖ అధికారులు అంచనాకి వచ్చారు. గడిచిన మూడు రోజుల్లో కరెంట్‌ను ప్రజలు విపరీతంగా వినియోగిస్తున్నారని చెబుతున్నారు. ఏపీ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో బుధవారం 253 మిలియన్ యూనిట్లు, గురువారం 259 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. ఈ రోజు రికార్డుస్ధాయిలో 260 మిలియన్ యానిట్ల దాటే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. అయితే గత ఏడాది ఇదే సమయంలో విద్యుత్ డిమాండ్ 219 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉండడం గమనార్హం. ఇక గత ఎనిమిదేళ్లలో మే నెలలో రికార్డు స్ధాయి విద్యుత్ వినియోగం ఇదే కావడం మరో విశేషం. ఎన్నడూ లేని విధంగా 13231 మెగావాట్లకి పైగా విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. గత ఏడాది కంటే 26 శాతం అధికంగా విద్యుత్ డిమాండ్ నెలకొనడం ఇంకో విశేషం. ఏపీ సర్కార్ ముందు జాగ్రత్తగడిచిన మూడు రోజులుగా ఏపీలో కరెంట్ కాలుతోంది. మరో మూడు, నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే.. డిమాండ్ పీక్‌లో ఉన్న టైంలోనూ కోతలు లేకుండా విద్యుత్ సరఫరా కొనసాగుతోందని అధికారులు స్పష్టత ఇచ్చారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక కారణంగా యూనిట్ విద్యుత్ రూ.7లకే కొనుగోలు చేస్తోంది. మొత్తం రూ.15 కోట్లతో 22 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేస్తోంది ఏపీ విద్యుత్ శాఖ. -
సిద్ధిపేటలో మున్సిపల్, విద్యుత్ శాఖల మధ్య సమన్వయ లోపం
-
ఆ 553 పోస్టులను మెరిట్ ప్రకారం భర్తీ చేయండి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న 553 జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) పోస్టులను పరీక్షలు నిర్వహించిన వారితో భర్తీ చేయాలని తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్కంపెనీ లిమిటెడ్ (టీఎస్ఎస్పీడీసీఎల్)ను హైకోర్టు ఆదేశించింది. జేఎల్ఎం నియామకాలకు రాష్ట్రపతి ఉత్తర్వులు, ‘స్థానికత’లాంటి అంశాలు వర్తించవని తేల్చిచెప్పింది. ఇప్పటికే స్తంభం ఎక్కే పరీక్ష నిర్వహిస్తే వారితో పోస్టులను భర్తీ చేయాలని, ఒకవేళ ఆ పరీక్ష నిర్వహించిన వారు లేకుంటే వెంటనే నిర్వహించి ఖాళీలను భర్తీ చేయాలని స్పష్టం చేసింది. 2019లో టీఎస్ఎస్పీడీసీఎల్ 2,500 జేఎల్ఎం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయడాన్ని సవాల్ చేస్తూ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన తిరుమలేశ్ సహా మరికొందరు హైకోర్టులో 2020లో పిటిషన్లు దాఖలు చేశారు. జిల్లాల విభజన కారణంగా అటు ఉమ్మడి జిల్లాకు, ఇటు కొత్త జిల్లాకు కాకుండా తాము నష్టపోయామని పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై జస్టిస్ మాధవీదేవి విచారణ చేపట్టి గురువారం తీర్పు వెలువరించారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి, న్యాయవాదులు సుంకర చంద్రయ్య, చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయూమూర్తి.. రాష్ట్రపతి ఉత్తర్వులను జేఎల్ఎం పోస్టులకు వర్తింపజేయలేరని టీఎస్ఎస్పీడీసీఎల్కు తేల్చిచెప్పారు. కొత్తగా ఏర్పాటైన జిల్లాలను యూనిట్‌గా తీసుకొని 95 శాతం స్థానిక రిజర్వేషన్లు అమలు చేయడాన్ని తప్పుబడుతూ కొత్త జిల్లాల అభ్యర్థులు ఉమ్మడి జిల్లాకు నాన్ లోకల్ కారని చెప్పారు. ఇప్పటికే 1,900కుపైగా పోస్టులను అధికారులు భర్తీ చేయడంతో మిగిలిన ఖాళీలను మెరిట్ ప్రకారం భర్తీ చేయాలని ఆదేశించారు. -
విద్యుత్ ఆదా కోసం ‘బిల్డింగ్ కోడ్’!
సాక్షి, అమరావతి: భవన నిర్మాణ రంగంలో విద్యుత్ ఆదా చర్యల ద్వారా పర్యావరణానికి మేలు చేసేందుకు కేంద్ర విద్యుత్ శాఖ నేతృత్వంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ(బీఈఈ) మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే తీసుకువచ్చిన ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్(ఈసీబీసీ) ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో సత్ఫలితాలను ఇస్తుండగా.. తాజాగా దానిని సవరిస్తూ ఎనర్జీ కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ బిల్డింగ్ కోడ్(ఈసీఎస్‌బీసీ) పేరుతో కొత్త డ్రాఫ్ట్‌ను బీఈఈ రూపొందించింది. ఈ ముసాయిదాపై ఈ నెల 12లోగా అభ్యంతరాలు, అభిప్రాయాలు వెల్లడించాలని ప్రజలను, రాష్ట్రాలను బీఈఈ కోరింది. ఇది అమల్లోకి వస్తే కొత్తగా నిర్మించే వాణిజ్య–నివాస భవనాల్లో నిబంధనలకు అనుగుణంగా విద్యుత్ పొదుపు చర్యలను పాటించాల్సి ఉంటుంది. ఏమిటీ ముసాయిదా.. ప్రపంచంలో విద్యుత్ వల్ల వెలువడే కర్బన ఉద్గారాల్లో 39 శాతం భవన నిర్మాణ రంగం నుంచే వస్తోంది. అలాగే మొత్తం విద్యుత్ వినియోగంలో 36 శాతం భవనాల్లోనే జరుగుతోంది. పారిస్ ఒప్పందానికి అనుగుణంగా 2030 నాటికి నిర్మాణ రంగ ఇంధన డిమాండ్‌ను 50 శాతం తగ్గించగల సామర్థ్యం ఈసీఎస్బీసీకి ఉందని బీఈఈ గుర్తించింది. ఇంజనీర్లు, డెవలపర్లు, నిర్మాణ సంస్థల సంయుక్త సహకారంలో దీనిని విజయవంతం చేయాలని బీఈఈ భావిస్తోంది. వనరుల సంరక్షణతో పాటు వ్యర్థాలు, కాలుష్యం, పర్యావరణ క్షీణతను తగ్గించడం, పగటిపూట సహజ వెలుతురు ప్రసరణ వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ముసాయిదాను తయారు చేసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహించేందుకు అన్ని విభాగాలను భాగస్వామ్యం చేసిన సంగతి తెలిసిందే. గృహ, పరిశ్రమ, వ్యవసాయం సహా అనేక రంగాల్లో ఇంధన సామర్థ్య కార్యక్రమాలను అమలు చేస్తోంది. భవనాల్లో దాదాపు 5,600 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేయవచ్చని అంచనా వేసింది. స్కూళ్లు, ఆస్పత్రులు, టీటీడీ, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఇంధన సామర్థ్య ప్రాజెక్టులతో పాటు వాణిజ్య భవనాలు, నివాస భవనాల్లో ఇంధన సంరక్షణను ప్రోత్సహించడం కోసం ఈసీబీసీని కూడా అమలు చేస్తోంది. ప్రభు త్వం ఇందుకోసం ప్రత్యేక బడ్జెట్‌ను కూడా అందించింది. వ్యవసాయంలో డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్పై దృష్టి సారించి రైతులు, పంప్ టెక్నీషియన్లతో వివిధ అవగాహన సెషన్లను నిర్వహించింది. ఇటువంటి చర్యలతో గతేడాది జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రతిష్టాత్మక నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు–2023ను ఆంధ్రప్రదేశ్ అందుకుంది. ‘ఈసీబీసీ’లో ఏపీ ఆదర్శం వెయ్యికి పైగా భవనాల్లో ఈసీబీసీ అమలుతో పాటు 3 వేల మంది కంటే ఎక్కువ వాటాదారులకు శిక్షణ ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించింది. వేగంగా అభివృద్ధి చెందుతూ.. విస్తరిస్తున్న విశాఖ వంటి నగరాల్లో ఈసీబీసీ అమలు వల్ల విద్యుత్ ఆదాతో పాటు కర్బన ఉద్గారాలు తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతోంది. నీటి వనరులు కూడా కలుషితం కావు. ఉత్పాదక రంగం వృద్ధి చెందుతుంది. భవన నిర్మాణ రంగంలో ఆవిష్కరణలు, పోటీతత్వం, గ్రీన్ ఉద్యోగాలు, నైపుణ్యాలు, సాంకేతికతలకు అవకాశాలు పెంచడంలో ఈ కోడ్ సహాయపడుతుంది. ఈ క్రమంలోనే విశాఖలో సూపర్ ఈసీబీసీ భవన నిర్మాణాన్ని చేపట్టిన ఏపీ.. దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. – అభయ్ భాక్రే, డైరెక్టర్ జనరల్, బీఈఈ -
స్మార్ట్ మీటర్లతో విద్యుత్ నష్టాలకు చెక్
సాక్షి, అమరావతి: స్మార్ట్ మీటర్ల వల్ల విద్యుత్ నష్టాలను అరికట్టవచ్చని.. సరఫరా వ్యయాన్ని తగ్గించవచ్చని కేంద్ర విద్యుత్ శాఖ తాజాగా వెల్లడించింది. ఈ మీటర్లను పెట్టడం వల్ల ఎనర్జీ ఆడిటింగ్, అకౌంటింగ్‌కు అవకాశం ఉంటుందని తెలిపింది. అందుకే వ్యవసాయ, వాణిజ్య, గృహ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు అమర్చాలని రాష్ట్రాలకు సూచించినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2025 మార్చి నాటికి దేశమంతటా.. కేంద్ర విద్యుత్ శాఖ ప్రతిపాదిత పంపిణీ వ్యవస్థ పునరుద్దీకరణ పథకం(ఆర్డీఎస్ఎస్)లో భాగంగా విద్యుత్ స్మార్ట్‌మీటర్ల బిగింపు ప్రక్రియ దేశంలోని అనేక రాష్ట్రాలతో పాటు ఏపీలోనూ జరుగుతోంది. ఇప్పుడు ఉన్న దాదాపు 1.80 కోట్ల మంది (వ్యవసాయేతర) వినియోగదారులలో నెలకు 200 యూనిట్ల వరకు వినియోగించేవారిని మినహాయించి మిగిలిన వారికి స్మార్ట్ మీటర్లు బిగించాలని డిస్కంలు ప్రతిపాదించాయి. అలాగే ‘ఆర్డీఎస్ఎస్’లో భాగంగా 2025 మార్చి నాటికి దేశమంతటా అన్ని రాష్ట్రాలూ స్మార్ట్ విద్యుత్ మీటర్లు పెట్టాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు 2019లోనే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఒక రెగ్యులేషన్ ఇచ్చింది. దాని ప్రకారం ఏపీలో 18.56 లక్షల వ్యవసాయ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు అమర్చాలని ప్రభుత్వం 2020వ సంవత్సరంలో ఆదేశాలిచ్చింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో స్మార్ట్ మీటర్ల ప్రక్రియ 50 శాతం నుంచి 100 శాతం వరకు పూర్తయ్యింది. అయితే స్మార్ట్ మీటర్లపై అనేక అపోహలు, విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం తాజాగా వివరణ ఇచ్చింది. రైతులపై పైసా కూడా భారం పడదు.. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ఇచ్చే విద్యుత్‌ను కచ్చితత్వంతో లెక్కించలేకపోవడం వల్ల ఇంధన ఆడిట్ కష్టమవుతోంది. వ్యవసాయ రంగంలో ఉచిత విద్యుత్ పథకం ద్వారా ఎంత వినియోగం జరుగుతుందో తెలుసుకోవడానికి, లబ్ధిదారులకు నగదు బదిలీ కింద ప్రతి నెలా సబ్సిడీ రూపంలో ఎంత మొత్తం చెల్లించాలనే సమాచారం కోసం.. వ్యవసాయ కనెక్షన్లకు బిగించే స్మార్ట్ మీటర్లు ఉపయోగపడతాయి. అలాగే విద్యుత్ ప్రమాదాల నుంచి రైతులను రక్షించేందుకు అలైడ్ మెటీరియల్‌ను ఉచితంగా అందిస్తారు. ఈ ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. వినియోగదారులపై గానీ, విద్యుత్ సంస్థలపై గానీ ఒక్క పైసా కూడా భారం పడదు. ‘ఆర్డీఎస్ఎస్’కు ఏపీ డిస్కంలు ఎంపికైనట్టు కేంద్రం ప్రకటించింది. తద్వారా మీటరుకు రూ.1,350 వరకు గ్రాంట్ పొందే అవకాశం ఏర్పడింది. స్మార్ట్ మీటర్ల సరఫరా, నిర్వహణ, ఆపరేషన్ బాధ్యత మొత్తం సర్వీస్ ప్రొవైడర్లదేనని కేంద్రం వివరించింది. స్మార్ట్‌మీటర్లతో ఉపయోగాలు.. మన రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య భవనాలు, పరిశ్రమలతో పాటు విద్యుత్ పంపిణీ ట్రాన్స్ఫార్మర్లకు, 11కేవి ఫీడర్లకు అన్నింటికీ కలిపి 42 లక్షల స్మార్ట్ మీటర్లను బిగించేందుకు డిస్కంలు చర్యలు చేపట్టాయి. గృహాలకు స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు పెట్టడం వల్ల సమయానుసార(టైం ఆఫ్ డే) టారిఫ్ విధానంలో పాల్గొనే అవకాశం వస్తుంది. విద్యుత్ కొనుగోలు ధరలు తక్కువగా ఉండే సమయంలో వారి వినియోగాన్ని పెంచుకుని టారిఫ్ లాభం పొందే అవకాశం ఉంది. అలాగే బిల్లును ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఆ బిల్లు మొత్తాన్ని ఒకేసారి కాకుండా అవసరాలకు అనుగుణంగా చెల్లించవచ్చు. విద్యుత్ సరఫరా చేసే సమయం, విద్యుత్ నాణ్యత తెలుసుకోవచ్చు. విద్యుత్ చౌర్యాన్ని అరికట్టవచ్చు. ఈ మీటర్ల పెట్టుబడిలో దాదాపు 40 శాతం వరకు రాయితీ లభిస్తుంది. రైతులకు అభ్యంతరం లేదు స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల వ్యవసాయ బోరు పనితీరు మెరుగుపడుతుంది. మోటార్ కాలిపోకుండా ఉంటుంది. ఇప్పటికంటే మెరుగైన విద్యుత్ వస్తుందని విద్యుత్ శాఖ సిబ్బంది మాకు వివరించారు. దీంతో మీటర్ పెట్టడానికి మా లాంటి రైతులందరూ ముందుకు వస్తున్నారు. మీటర్‌తో పాటు రక్షణ పరికరాలు అందించడం బాగుంది. మాకు 8 బోర్లు ఉన్నాయి. స్మార్ట్ మీటర్ వల్ల ఏ సర్వీసునూ తొలగించలేదు. – బొల్లారెడ్డి రామకృష్ణారెడ్డి, రైతు, వీరంపాలెం, పశ్చిమగోదావరి జిల్లా -
విద్యుత్ శాఖలో భారీ మార్పులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త సర్కారు విద్యుత్ శాఖలో భారీగా మార్పులు చేపట్టింది. ఆయా విద్యుత్ సంస్థల సారథ్య బాధ్యతల్లో ఉన్న రిటైర్డ్ విద్యుత్ శాఖ అధికారుల (నాన్ ఐఏఎస్)ను తొలగించి.. ఐఏఎస్ అధికారులకు ఆ బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ, పోస్టింగ్‌తోపాటు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి, ఇన్చార్జి డైరెక్టర్ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీని ఇంధనశాఖ కార్యదర్శిగా నియమించారు. అంతేగాక రాష్ట్ర విద్యుత్ శాఖలో కీలకమైన తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సంస్థల సీఎండీగా ఆయనకే అదనపు బాధ్యతలు అప్పగించారు. ట్రాన్స్‌కో, జెన్కోలకు సీఎండీగా దాదాపు పదేళ్లు కొనసాగిన డి.ప్రభాకర్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రాజీనామా చేశారు. దీంతో సర్కారు కొత్త సీఎండీని నియమించింది. ముర్తుజా రిజ్వీ 2013 జూలై 2 నుంచి 2014 జూలై 19 వరకు టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీగా వ్యవహరించారు. యువజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖల ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌కు వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలను అప్పగించారు. మరోవైపు కీలకమైన ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (జేఎండీ)గా 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సందీప్‌కుమార్ ఝాను ప్రభుత్వం నియమించింది. గత ఎనిమిదేళ్లుగా ఈ పోస్టులో కొనసాగిన సి.శ్రీనివాసరావుకు ఉద్వాసన పలికింది. డిస్కంలకు యువ అధికారులు: రాష్ట్రంలోని రెండు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు అధిపతులుగా యువ ఐఏఎస్ అధికారులను సర్కారు నియమించింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీగా వెయిటింగ్లో ఉన్న 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ముషార్రఫ్ అలీ ఫారూఖీని.. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్) సీఎండీగా వెయిటింగ్లో ఉన్న 2019 బ్యాచ్ ఐఏఎస్ అధికారి కర్నాటి వరుణ్‌రెడ్డిని నియమించింది. ఐటీ–ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్న సందీప్‌కుమార్ ఝాను ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (జేఎండీ)గా బదిలీ చేసింది. టీఎస్ఎన్పిడీసీఎల్ సీఎండీ ఎ.గోపాల్‌రావు తన పదవికి రాజీనామా చేయగా, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి ఇప్పటివరకు పదవిలో కొనసాగారు. కాంగ్రెస్ ముఖ్య నేతలతో రఘుమారెడ్డికి మంచి సంబంధాలు ఉండటంతో ఆయనను కొనసాగించే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరిగింది. కానీ ఆయనను తప్పించారు. ఇక కేంద్ర డెప్యుటేషన్ నుంచి తిరిగొచ్చి వెయిటింగ్లో ఉన్న కాటా ఆమ్రపాలిని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. వెయిటింగ్లో ఉన్న బి.గోపికి వ్యవసాయ శాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించింది. త్వరలో కొత్త డైరెక్టర్లు కూడా..! రాష్ట్ర విద్యుత్ సంస్థలకు కొత్త సీఎండీలను నియమించిన ప్రభుత్వం.. త్వరలో కొత్త డైరెక్టర్లను సై తం నియమించనున్నట్టు చర్చ జరుగుతోంది. ప్ర స్తుతం ట్రాన్స్‌కోలో నలుగురు, జెన్కోలో ఆరుగు రు, టీఎస్ఎస్పీడీసీఎల్లో ఏడుగురు, టీఎస్ఎన్పి డీసీఎల్‌లో ఆరుగురు డైరెక్టర్లు పనిచేస్తున్నారు. వారిలో కొందరు ఉమ్మడి రాష్ట్రం నాటి నుంచి, మరికొందరు తెలంగాణ ఆవిర్భావం నాటి నుంచి డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. కొన్ని సంస్థల్లో నిర్దేశిత సంఖ్యకు మించి డైరెక్టర్లు ఉన్నారు. ఈ క్రమంలో దీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న డైరెక్టర్ల స్థానంలో కొత్తవారిని నియమించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించినట్టు తెలిసింది. -
విద్యుత్ లెక్కలు తేల్చండి !
-
పేదల ఇళ్లల్లో.. ‘ఉచిత’ వెలుగులు
ఈ చిత్రంలో కనిపిస్తున్న వివాహిత పేరు.. జర్రిపోతుల పార్వతి. పెళ్లయిన పన్నెండేళ్ల నుంచి గున్నవానిపాలెం అగ్రహారంలో చిన్న ఇంటిలో ఉంటూ అవస్థలు పడుతోంది. సొంత ఇంటి కోసం గతంలో ఎంతో మంది నేతలకు, అధికారులకు విన్నవించినా ఫలితం శూన్యం. ఎట్టకేలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం అందడంతో సొంతింటి కలను నెరవేర్చుకుంది. విద్యుత్ శాఖ.. స్తంభాలు వేసి, వైర్లు లాగి ఆ ఇంటికి కనెక్షన్, మీటర్, బల్బులు ఉచితంగా అందించింది. ఎక్కడా ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వనవసరం లేకుండా పార్వతి సొంతింటిలో విద్యుత్ వెలుగులు ప్రసరించాయి. అమ్మఒడి సాయంతో పాటు తన పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో ఉచిత విద్యను ఈ ప్రభుత్వం అందిస్తోందని పార్వతి సంతోషంతో చెబుతోంది. అనకాపల్లి జిల్లా లంకెలపాలెం విద్యుత్ సెక్షన్‌లోని మారేడుపూడి కాలనీ (బోణం గణేష్, అనకాపల్లి జిల్లా మారేడుపూడి కాలనీ నుంచి సాక్షి ప్రతినిధి) .. ఇలా ఒక్క పార్వతే కాదు.. ఎంతోమంది మహిళలు తమ కుటుంబంతో కలిసి జగనన్న ఇళ్లల్లో విద్యుత్ వెలుగుల మధ్య సంతోషంగా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా అనకాపల్లి జిల్లా మారేడుపూడి కాలనీలో పర్యటించిన ‘సాక్షి’తో లబ్ధిదారులు తమ ఆనందాన్ని పంచుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జగనన్న కాలనీల్లో ఇళ్లకు అత్యుత్తమ ప్రమాణాలతో విద్యుత్ సౌకర్యాలను కల్పిస్తూ పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నారని, అందుకు తామే నిదర్శనమని చెబుతున్నారు. పచ్చని ప్రకృతి నడుమ, ఎతైన కొండల మధ్య ఉన్న మారేడుపూడి కాలనీలో 67 విద్యుత్ సర్విసులను అక్కడ కొత్తగా నిర్మించిన ఇళ్లకు అందించారు. ఇందుకోసం కాలనీ మొత్తం విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. స్తంభం నుంచి ఇంటి వరకు సర్విసు వైరును సమకూర్చారు. మీటర్‌తో సహా అన్ని పరికరాలు, సర్విసును ఉచితంగా ఇచ్చారు. ఆ విద్యుత్ సదుపాయంతో అక్కడి ప్రజలు తమ కొత్త ఇంటిలో రంగురంగుల ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేసుకుని మురిసిపోతున్నారు. తమకు ఈ భాగ్యం కల్పించిన సీఎం వైఎస్ జగన్‌కు చెమర్చిన కళ్లతో కృతజ్ఞతలు చెబుతున్నారు. ఖర్చుకు వెనుకాడకుండా.. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద తొలి దశలో పేదలకు ప్రభుత్వం నిరి్మస్తున్న లేఔట్లలో ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కంలు)ల ద్వారా ముందుగా 14,49,133 సర్విసులకు విద్యుత్ సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కల్పిస్తోంది. ముఖ్యంగా లేఔట్లలో విద్యుత్ లైన్లు వేసి, పేదల ఇళ్లకు, బోర్లకు ఉచితంగా విద్యుత్ సర్విసులను అందిస్తోంది. ఈ పనులకు రూ.7,080 కోట్లు ఖర్చవుతోంది. ఇందులో మొదటి దశలో 10,741 లేఔట్లకు రూ.5,541.94 కోట్లతో విద్యుత్ సంస్థలు పనులు చేపట్టాయి. కోట్లాది రూపాయల ఖర్చుతో విద్యుత్ సౌకర్యం.. తూర్పు డిస్కంలో వాటర్ వర్క్స్‌కు సంబంధించి ఇప్పటివరకు 2,492 దరఖాస్తులు నమోదు కాగా రూ.50.36 కోట్లతో 2,386 బోర్లకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు అందించారు. లైన్ షిఫ్టింగ్ కోసం 76 ప్రాంతాలను గుర్తించారు. ఈ పనులకు రూ.1.85 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసి పని మొదలుపెట్టారు. ఇక దక్షిణ డిస్కంలో రూ.49.17 కోట్లతో 2,555 బోర్లను విద్యుదీకరించారు. 435 ప్రాంతాల్లో లైన్లు మార్చడానికి రూ.9.73 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. జగనన్న కాలనీల్లో రెండు విధాలుగా విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. 550 ప్లాట్ల కంటే తక్కువ ఉన్న లేఔట్లకు ఓవర్ హెడ్, 550 ప్లాట్ల కంటే ఎక్కువగా ఉన్న లేఔట్లకు భూగర్భ విద్యుత్‌ను వేస్తున్నారు. ఇలా మొత్తం 389 లేఔట్లకు భూగర్భ, 9,678 లేఔట్లకు ఓవర్ హెడ్ విద్యుత్ అందిస్తున్నారు. ఓవర్ హెడ్ విద్యుదీకరణకు ఒక్కో ఇంటికి సగటున రూ.98,521 ఖర్చవుతుండగా, భూగర్భ విద్యుదీకరణకు ఒక్కో ఇంటికి సగటున రూ.1,32,284 ఖర్చవుతోంది. అందరం సంతోషంగా ఉన్నాం.. జగనన్న మాకు స్థలం ఇచ్చి.. ఇల్లు కట్టుకోవడానికి ఆరి్థక సాయం కూడా చేశారు. ఇంటికి విద్యుత్ సర్విసును కూడా ఉచితంగా అందించారు. మేం గతంలో పాతూరులో ఉమ్మడి కుటుంబంలో చాలా ఇబ్బందులు పడుతుండేవాళ్లం. ఇక్కడికి వచ్చాక నా భర్త, ఇద్దరు పిల్లలతో అందరం సంతోషంగా ఉన్నాం. –మౌనిక, మారేడుపూడి కాలనీ మా దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.. పదేళ్లుగా సాలోపల్లిపాలెంలో అద్దెకు ఉన్నాం. నా భర్త, ఇద్దరు పిల్లలతో అద్దె ఇంటిలో అవస్థలు పడ్డాం. సీఎం జగనన్న చలువ వల్ల మాకు సొంతిల్లు వచి్చంది. వీధి లైట్లు వేశారు. మా ఇంటికి ఉచితంగా కరెంటు మీటర్, బల్బు ఇచ్చారు. మా దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. –కనుమూరి దేవి, మారేడుపూడి కాలనీ ఉచితంగానే విద్యుత్ సర్విసులు.. పేదలందరికీ ఉచితంగా విద్యుత్ సర్విసులు అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. దానికి తగ్గట్టుగానే జగనన్న కాలనీల్లో ఉచితంగా మీటర్లు అమర్చుతున్నాం. ఇందుకు అవసరమైన సబ్ స్టేషన్లు నిర్మించి విద్యుత్ స్తంభాలు, లైన్లు వేస్తున్నాం. –ఎల్.మహేంద్రనాథ్,ఎస్ఈ విశాఖ సర్కిల్, ఏపీఈపీడీసీఎల్ తాగునీటి అవసరాలకూ త్వరితగతిన విద్యుత్.. జగనన్న కాలనీల్లో నిరంతరం విద్యుత్ సరఫరా అందించేందుకు అవసరమైన విద్యుత్ పంపిణీ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాం. అలాగే తాగునీటి అవసరాలకు బోర్లకు కూడా త్వరితగతిన విద్యుత్ సదుపాయం కల్పిస్తున్నాం. కె.విజయానంద్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇంధనశాఖ -
ఏపీ చొరవతో దేశవ్యాప్తంగా పరిశ్రమలకు మేలు
సాక్షి, అమరావతి: పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో మన రాష్ట్రం దేశానికి మార్గనిర్దేశం చేస్తోంది. ఇప్పటికే అనేక రంగాల్లో ఎన్నో జాతీయస్థాయి అవార్డులను, గుర్తింపును దక్కించుకున్న ఆంధ్రప్రదేశ్.. కేంద్రప్రభుత్వ నిర్ణయాలను సైతం ప్రభావితం చేస్తోంది. దీనికి ప్రత్యక్ష నిదర్శనమే తాజాగా కేంద్ర విద్యుత్‌శాఖ ప్రవేశపెడుతున్న పరిశ్రమలకు వడ్డీ రాయితీ పథకం. దేశవ్యాప్తంగా పరిశ్రమల్లో ఇంధన సామర్థ్య కార్యక్రమాలను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా నూతన సాంకేతిక విధానాలను అవలంభించే పరిశ్రమలకు, అవి తీసుకున్న రుణాలపై చెల్లించే వడ్డీలో కొంత రాయితీగా ఇచ్చేందుకు కేంద్ర ఆర్థికశాఖ సహకారంతో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ)తో కలిసి కేంద్ర విద్యుత్‌శాఖ ఈ పథకాన్ని తీసుకొస్తోంది. ఇందుకోసం రూ.12 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు బీఈఈ డైరెక్టర్ జనరల్ (డీజీ) అభయ్ భాక్రే చెప్పారు. ఇందులో రూ.6 వేల కోట్లను విద్యుత్ పొదుపు చర్యలను అమలు చేసే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)లకు కేటాయిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన జాతీయ ఎనర్జీ ఎఫిషియెంట్ సమ్మిట్–2023లో ఆయన మాట్లాడారు. రెండేళ్ల కిందట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ప్రతిపాధనల ఆధారంగానే ఈ పథకానికి రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఇంధన సామర్థ్యరంగంలో పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని చెప్పారు. దేశంలోనే తొలి ఇన్వెస్ట్మెంట్ బజార్‌ను విశాఖపట్నంలో నిర్వహించిన ఏపీ ఇంధన సామర్థ్య ప్రాజెక్టుల్లో రూ.430 కోట్ల పెట్టుబడులను సాధించిందన్నారు. ఏపీని ఆదర్శంగా తీసుకుని ఇతర రాష్ట్రాల్లోను అలాంటి సదస్సులు నిర్వహించగా మొత్తం రూ.2,500 కోట్ల పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడం పారిశ్రామిక రంగానికి ప్రత్యేక వడ్డీ రాయితీ పథకాన్ని ప్రవేశపెట్టడానికి బీజం వేసిందని, అలాగే ఏపీ ఇంధనశాఖ కూడా రెండేళ్ల కిందట వడ్డీ రాయితీ కోరుతూ ప్రతిపాదనల లేఖ రాసిందని తెలిపారు. ఇంధనం ఆదా, తగ్గుతున్న కాలుష్యం జి–20 సమ్మిట్‌లో ప్రపంచదేశాల నేతలు ఆశించినట్లు.. దేశంలో 2050 నాటికి కర్బన ఉద్గారాలు లేకుండా చేయాలనే లక్ష్యానికి ఈ పథకం దోహదపడుతుందని చెప్పారు. 2021–22లో బీఈఈ చర్యలతో 27.75 ఎంటీవోఈ ఇంధనం ఆదా అయిందని, 130.21 బిలియన్ యూనిట్ల విద్యుత్ పొదుపు చేశామని తెలిపారు. 175.22 మెట్రిక్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించగలిగామన్నారు. పెర్ఫార్మ్, అచీవ్ అండ్ ట్రేడ్ (పాట్) పథకం ద్వారా ఈ ఏడాది మార్చి నాటికే 13 రంగాల్లో సుమారు 26 ఎంటీవోఈ ఇంధనాన్ని ఆదా చేయడమేగాక 70 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించగలిగామని ఆయన వివరించారు. ఈ సమ్మిట్‌లో ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్విసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) సీఈవో విశాల్‌కపూర్ తరఫున ఈఈఎస్ఎల్ సౌత్ సలహాదారు ఎ.చంద్రశేఖరరెడ్డి ఏపీలో వివిధ రంగాల్లో ఇంధన సామర్థ్య చర్యలు, ప్రభుత్వ ప్రోత్సాహంపై నివేదిక సమర్పించారు. -
అధికారులకు షాక్: సబ్‌స్టేషన్ అమ్ముతా.. కొంటారా ?
సాక్షి, నేలకొండపల్లి: విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి ఒకరు స్థలం దానంగా ఇవ్వగా, నేతలు, అధికారులు ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ నెరవేరకపోవడంతో ఆ దాత వినూత్నంగా నిరసనకు దిగాడు. దీంతో, అతడి నిరసన.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువుమాదారం గ్రామానికి 2014లో విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరైంది. గ్రామానికి చెందిన రైతు ఆకుల నరసింహారావు 12 గుంటల భూమి ఇచ్చాడు. అప్పుడు సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా ఉద్యోగం ఇస్తామని చెప్పినా, హామీ నెరవేరకున్నా పైసా జీతం లేకుండా పనిచేశాడు. గతంలో పలుమార్లు నిరసన తెలిపినా, ఆత్మహత్యయత్నానికి పాల్పడినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో, విసుగు చెందాడు ఈ క్రమంలో బుధవారం విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద దిగిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన నరసింహారావు.. సబ్‌స్టేషన్ అమ్ముతున్నందున కావాల్సిన వారు తనను సంప్రదించాలని కోరాడు. ఈ విషయమై ఆయనతో మాట్లాడగా ఉద్యోగమైనా ఇవ్వాలని, లేకపోతే ఎకరం భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ అంశంపై అధికారులు ఇంకా స్పందించలేదు. ఇది కూడా చదవండి: రీసేల్.. రివర్స్ -
కరెంట్ తీగల్లోనూ ముడుపుల డొంక
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో కోట్లాది రూపాయలు చేతులు మారినట్లుగానే విద్యుత్ శాఖలోనూ భారీ ఎత్తున అవినీతి చోటుచేసుకుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఈ శాఖలో జరిగిన అనేక అవినీతి, అవకతవకలను విద్యుత్ రంగ నిపుణులు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. విద్యుత్ తీగల మార్పిడి కాంట్రాక్టు వ్యవహారంలో టెండరు నిబంధనలు సైతం మార్చేసి రూ.కోట్ల విలువైన పనులను రెండు ప్రైవేటు సంస్థలకు అడ్డగోలుగా కట్టబెట్టిన వ్యవహారాన్ని వారు ఉదహరిస్తున్నారు. సర్కారు పెద్దలు కోరుకున్న ఆ సంస్థల జేబుల్లోకి రూ.కోట్లు వెళ్లిపోయిన విధానాన్ని వివరిస్తున్నారు. తక్కువకే వేస్తామంటే వద్దని.. చంద్రబాబు హయాంలో ఏపీ ట్రాన్స్‌కో పరిధిలో 132, 220 కిలోవాట్ల (కేవీ) సామర్థ్యం గల విద్యుత్ లైన్లు 45 వేల కిలోమీటర్ల పొడవున ఉండేవి. అయితే, ఇందులో చాలావరకూ తీగలు వంగిపోయి, తెగిపోయే స్థితిలో సరఫరాకు అంతరాయం కలిగిస్తున్నాయి. దీంతో పాత తీగలను తొలగించి, కొత్తవి వేయాలని 2014లో నిర్ణయించారు. 2016లో కేంద్ర ప్రభుత్వ హామీతో పలు ఆరి్థక సంస్థల నుంచి పొందాలని భావించినప్పటికీ రుణానికి హామీగా ఉండలేమని కేంద్రం చెప్పడంతో కొన్నేళ్లు ఊరుకున్నారు. 2018లో మళ్లీ తెరపైకి ఈ అంశాన్ని తీసుకొచ్చారు.తొలి విడతగా 90 కిలోమీటర్ల మేర 15 లైన్లు మార్చాలని భావించి, మేలో టెండర్లు పిలిచారు. కిలోమీటర్ మేర విద్యుత్ తీగల పనులను రూ.4.5 లక్షలకే పూర్తిచేసేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. కానీ, ఆయా సంస్థలు ప్రీ బిడ్‌లో అర్హత పొందకుండా ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేశారు. ముందే కుదిరిన ‘ఒప్పందం’ ప్రకారం రెండు సంస్థలు మాత్రమే అర్హత పొందాయి. పోటీలేకపోవడంతో ఈ రెండు కంపెనీలు కుమ్మక్కై టెండర్లో కిలోమీటర్‌కు రూ.6 లక్షల చొప్పున కోట్ చేశాయి. 90 కిలోమీటర్లకు రూ.1.35 కోట్లు అదనంగా చెల్లించేందుకు ట్రాన్స్‌కో సిద్ధపడింది. ఈ వ్యవహారం ఇంతటితో ఆగిపోలేదు. మిగిలిన 45 వేల కిలోమీటర్లలో కనీసం 25 వేల కిలోమీటర్లలోనూ ఇదే తంతు కొనసాగింది. ఫలితంగా రూ.675 కోట్లు ప్రైవేటు సంస్థల జేబుల్లోకి, అక్కడి నుంచి అప్పటి ప్రభుత్వ పెద్దలకు అప్పనంగా వెళ్లాయి. కాంట్రాక్టుపై టీడీపీ ప్రజాప్రతినిధి కన్ను.. ఇక ఈ కాంట్రాక్టుపై కన్నేసిన విజయవాడకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధి కోల్‌కతాకు చెందిన ఓ సంస్థ పేరుతో టెండర్ వేశారు. ఇతర సంస్థలను పోటీ నుంచి ఉపసంహరించుకునేలా చేశారు. హైదరాబాద్, ముంబైకు చెందిన నాలుగు సంస్థలు మాత్రం పోటీలో నిలిచాయి. సాంకేతిక అంశాల సాకుతో ఈ నాలుగు సంస్థలపై అనర్హత వేటువేసి తప్పించారు. వివరణ ఇస్తామని ఆ నాలుగు సంస్థలు మొత్తుకున్నా ఆలకించలేదు. దీంతో టీడీపీ ప్రజాప్రతినిధికి బినామీగా ఉన్న కోల్‌కతా సంస్థ టెండర్లు దక్కించుకుంది. అయితే, ట్రాన్స్‌కో లైన్లు మార్చేందుకు ఒక్కొక్కటి 100 మీటర్లకు పైగా ఎత్తు ఉండే టవర్లను కృష్ణా నదిలోని లంక భూముల్లో ఏర్పాటుచేయాలి. నదిలో దాదాపు 500 క్యూబిక్ మీటర్ల మేర పటిష్టంగా పునాదులు నిర్మించాలి. కానీ, కోల్‌కతా సంస్థకు ఇలాంటి ప్రాజెక్టులు చేసిన అనుభవంలేదు. అయినా బినామీ కావడంతో టెండర్ దక్కేలా చేసి ముడుపులు దండుకున్నారు. అనుభవంలేని సంస్థకు హైటెన్షన్ లైన్లు.. నిజానికి.. బయటి వ్యక్తులకు చిన్న పని అప్పగించాలన్నా గతంలో ఎలా చేశారో బేరీజు వేసుకున్నాకే నిర్ణయాలు తీసుకుంటారు. పనితీరు, అనుభవం ప్రాతిపదికగా నిర్ణయాలు తీసుకుంటారు. మరి వందల కోట్ల రూపాయల ప్రజాధనంతో ముడిపడి ఉన్న వ్యవహారాల్లో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో ప్రభుత్వానికి ప్రత్యేకంగా చెప్పాలా? కానీ, అమరావతిలో రూ.380 కోట్లతో చేపట్టిన హైటెన్షన్ విద్యుత్ లైన్ల మార్పిడి కాంట్రాక్టును ఇలాంటి పనుల్లో అనుభవంలేని సంస్థ చేతిలో పెట్టారు. కోల్‌కతాకు చెందిన ఓ బినామీ సంస్థ పేరుతో కథ నడిపించి పోటీదారులను తప్పించారు. 400 కేవీ విద్యుత్ లైన్లను అమరావతిలో నిర్మాణాల కోసం ఇబ్రహీంపట్నం సమీపంలోని లంక భూముల మీదుగా మళ్లించాలని ట్రాన్స్‌కో నిర్ణయించింది. 15 కి.మీ. మేర రెండు వరుసలుగా కొత్త లైన్ల నిర్మాణాన్ని ట్రాన్స్‌కో, సీఆర్డీఏ ఆమోదించాయి. దీనికోసం రూ.380 కోట్ల అంచనా వ్యయంతో ట్రాన్స్‌కో టెండర్లు పిలిచింది. -
ఏపీ: విద్యుత్ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తీపికబురు
-
AP: విద్యుత్‌శాఖ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. జీతం పెంపు
సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యుత్ శాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను భారీగా పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివరాల ప్రకారం.. ఏపీలో విద్యుత్ శాఖ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు 37 శాతం పెంచింది ప్రభుత్వం. ఈ మేరకు విద్యుత్ శాఖ స్పెషల్ సీఎస్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో 27వేల మంది విద్యుత్ శాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. కాగా, సీఎం జగన్ సూచనలతో విద్యుత్ శాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచినట్టు ఆయన తెలిపారు. తాజాగా ప్రభుత్వం నిర్ణయంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతం రూ.21వేలు దాటింది. అలాగే, గ్రూప్ ఇన్యూరెన్స్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం కాంట్రాక్ట్ ఏజెన్సీలను ఆదేశించింది. ఇది కూడా చదవండి: పుంగనూరు అల్లర్లపై నేడు హైకోర్టులో విచారణ.. చంద్రబాబే ఏ1.. -
విద్యుత్ ఉద్యోగుల సమస్యలు, సమ్మె కార్యచరణపై చర్చలు
-
విద్యుత్ శాఖ అప్రమత్తం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, సంభవిస్తున్న వరదల వల్ల ప్రజలకు ఎలాంటి సమస్య తలెత్తకుండా విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల సీఎండీలు ఐ.పృథ్వితేజ్, జె.పద్మాజనార్దనరెడ్డి, కె.సంతోషరావు ‘సాక్షి’ తో మాట్లాడారు. వర్షాకాలంలో విద్యుత్‌తో సంబంధమున్న ఏ వస్తువునైనా.. ఒకటికి రెండు సార్లు పరిశీలించిన తర్వాతే తాకాలని ప్రజలకు సూచించారు. ఆక్వా రైతులు ఏరియేటర్స్‌ను పట్టుకోద్దని, గృహ వినియోగదారులు సర్విస్ వైర్లను, వాటితో వేలాడే ఇనుప తీగలను, కరెంట్ స్తంభాలను, ఇనుప స్తంభాలను, లైన్ల మీద పడిన చెట్టు కొమ్మలను పట్టుకునే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. పొలాల్లో తెగిపడిన, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని.. ముఖ్యంగా 11 కేవీ, 33 కేవీ విద్యుత్ తీగల కింద, 132/220 కేవీ సరఫరా టవర్ల దగ్గరలో నిల్చోవద్దని సూచించారు. విద్యుత్‌కు సంబంధించిన సమస్య ఉంటే.. వెంటనే సిబ్బందిని సంప్రదించాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు తమ సిబ్బందికి వాకీ టాకీ సెట్లు అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే టోల్ ఫ్రీ నంబర్–1912 అందుబాటులో ఉందన్నారు. దానికి అదనంగా పర్యవేక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలతో పాటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినడం తదితర సమస్యల పరిష్కారం కోసం పర్యవేక్షణ కేంద్రాల నంబర్లను సంప్రదించాలని సూచించారు. ప్రజల రక్షణకు, విద్యుత్ పునరుద్ధరణ పనులకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక అధికారులను, సహాయక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవసరమైన స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, వైర్లు తదితర విద్యుత్ సామగ్రిని.. జేసీబీలు, ట్రీ కట్టర్లు, జనరేటర్లు, రవాణా వాహనాలు, కారి్మకులను సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. జిల్లా/సర్కిల్ వారీగా పర్యవేక్షణ కేంద్రాల ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచారు. -
జగనన్న ఇళ్లలో ‘హరిత’ వెలుగులు
సాక్షి, అమరావతి: పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “జగనన్న ఇళ్లు’ పథకంలో ప్రతి ఇంటిలో హరిత వెలుగులు ప్రసరించనున్నాయి. ఈ ఇళ్లకు విద్యుత్ ఆదా ఉపకరణాలను మార్కెట్ ధరకంటే తక్కువకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విద్యుత్తు శాఖకు చెందిన ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్)తో ఒప్పందం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ఇంధన సామర్థ్య అభివృద్ధి సంస్థ (ఏపీసీడ్కో)తో కలిసి ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ (ఏపీఎస్‌హెచ్‌సీఎల్) ఈఈఎస్ఎల్తో ఈ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. గోవాలో శనివారం జరిగిన జీ20 వర్కింగ్ గ్రూప్ సదస్సులో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఈఈఎస్ఎల్ సీఈవో విశాల్ కపూర్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. గృహ నిర్మాణ పథకం లబ్దిదారులకు కరెంటు బిల్లులను తగ్గించడమే కాకుండా పర్యావరణాన్ని పరిరక్షించడం కూడా ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం. ప్రతి ఇంటికీ కరెంటు బిల్లులో ఏటా రూ.2,259 మిగులు రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న జగనన్న ఇళ్లకు ఈఈఎస్ఎల్ దశలవారీగా 6 లక్షల ఎల్ఈడీ బల్బులు, 3 లక్షల ఎల్ఈడీ ట్యూబ్ లైట్లు, 3 లక్షల డీఎల్డీసీ సీలింగ్ ఫ్యాన్లు సరఫరా చేస్తుంది. ప్రతి ఇంటికీ 4 ఎల్ఈడీ బల్బులు, 2 ట్యూబ్ లైట్లు, 2 ఎనర్జీ ఎఫిషియెన్సీ ఫ్యాన్లను రాయితీ ధరలకు ప్రభుత్వం అందించనుంది. ఈ ఉపకరణాల వల్ల ప్రతి ఇంటికీ ఏడాదికి 734 యూనిట్ల విద్యుత్ మిగులుతుంది. తద్వారా కరెంటు బిల్లులో ఏడాదికి రూ.2,259 ఆదా అవుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 5 లక్షల జగనన్న ఇళ్లు నిర్మాణంలో ఉండగా.. తొలి దశలో నిరి్మస్తున్న 1.56 లక్షల ఇళ్లలో ఈ ఉపకరణాలను వినియోగిస్తారు. దీనివల్ల ఏడాదికి 1,145 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం ప్రాజెక్టు విలువ దాదాపు రూ.400 కోట్లు కాగా తొలి దశలో రూ.100 కోట్లతో ఈ ఉపకరణాలను అందించేందుకు శనివారం ఒప్పందం జరిగింది. ఏపీ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం: విశాల్ కపూర్ ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకం ఇళ్లను ప్రపంచంలోనే ఇంధన సామర్ధ్య గృహాలుగా తీర్చిదిద్దడం రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని ఈఈఎస్ఎల్ సీఈవో విశాల్ కపూర్ ప్రశంసించారు. సుస్థిర ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విజన్‌తో చేపడుతున్న ఈ కార్యక్రమం దేశంలోని ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని కొనియాడారు. ఏపీతో ఒప్పందం సందర్భంగా జరిగిన జి 20 సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హరిత ఇంధన లక్ష్యాల సాధనలో ఇదో కీలక ముందడుగని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ చెప్పారు. ఎనర్జీ ఎఫిషియన్సీ హౌసింగ్ ప్రోగ్రామ్ దేశంలోనే అతిపెద్దదని, ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని అన్నారు. ఈ ఒప్పందం ద్వారా పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని వెల్లడించారు. ఈ సదస్సులో ఈఈఎస్ఎల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అనిమేశ్ మిశ్రా, జాతీయ సీనియర్ సలహాదారు ఎ.చంద్రశేఖరరెడ్డి, ఏపీసీడ్కో ఎండీ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. -
బూతు ‘కూన’ల బరితెగింపు.. విద్యుత్తు శాఖ ఏఈకి బెదిరింపులు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అధికారంలో లేకున్నా వారి ఆగడాలకు అంతులేదు. ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించడం, దూషించడం ‘బూతుల బ్రదర్స్’కు నిత్యకృత్యంగా మారింది. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆగడాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. గతంలో పలువురు ప్రభుత్వ అధికారులను దుర్భాషలాడిన రవికుమార్ తాజాగా పొందూరు విద్యుత్తు శాఖ ఏఈని ఫోన్లో బెదిరించిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం చేయాలని లేదా..? ‘కాస్త మర్యాదగా ఉద్యోగాలు చేయడం నేర్చుకో..! నీకు సర్విసు లేదా? ఉద్యోగం చేయవా నువ్వు...? (రాయలేని భాషలో తిడుతూ) నాకు రూల్స్ చెబుతావా? తమాషాలు దొబ్బుతున్నావా? విద్యుత్ మీటర్ విషయంలో నా మనిషికే నోటీసు ఇస్తావా? డిస్ కనెక్ట్ చెయ్.. జీవితంలో ఇంత పెద్ద తప్పు చేశానా అని బాధపడే రోజు వస్తుంది చూడు నీకు... గుర్తు పెట్టుకో.. నువ్వు ముందు నోటీసు విత్‌డ్రా చేసుకో. ఎవడా డీఈ...? నా కొడుకు.. ఆడికి చెప్పు.. మళ్లీ నీకు చెబుతున్నా వెధవ వేషాలు వేశావా.. మళ్లీ జీవితంలో కోలుకోలేవు..’ అంటూ పొందూరు ఎలక్ట్రికల్ ఏఈ పైడి దుర్గా ప్రసాద్‌ను కూన రవికుమార్ బెదిరించాడు. ఈ ఘటన మూడు నెలల క్రితం జరగ్గా ఆ సంభాషణ ఆలస్యంగా వెలుగు చూసింది. ఇలాంటి వ్యక్తులు పొరపాటున ఎన్నికైతే ప్రజలను, ఉద్యోగులను బతకనిస్తారా? అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. తాజా బాగోతమిది పొందూరులో ‘గరుడ’ పేరుతో రెస్టారెంట్‌ను ఏర్పాటు చేసిన టీడీపీ ఎంపీటీసీ బాడాన గిరి అనుమతి లేకుండా విద్యుత్ మీటర్‌ను అమర్చారు. పంచాయతీ అనుమతి లేదని లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందడంతో వివరణ ఇవ్వాలని ఎలక్ట్రికల్ ఏఈ పైడి దుర్గా ప్రసాద్ నోటీసు ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన కూన రవికుమార్ ఫోన్ చేసి అసభ్యంగా దూషించారు. ఈ అవమానాన్ని భరించలేక విద్యుత్ శాఖ అధికారి కుమిలిపోయారు. కూన బ్రదర్స్‌కు ఆనవాయితీనే.. ♦ శ్రీకాకుళం సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన ఆర్ఈసీహెచ్ ప్రసాద్‌ను గతంలో కూన రవికుమార్ నోటికొచ్చినట్టు దూషించారు. నీకు ఉద్యోగం, యూనిఫాం లేకుండా చేస్తా... ఆఫ్టర్ టూ అండ్ ఆఫ్ ఇయర్స్ నీకు ఉద్యోగం ఉండదు.. గుర్తుపెట్టుకో అంటూ బెదిరించారు. ♦ కోవిడ్ సమయంలో మందీ మార్బలంతో పోలీసు స్టేషన్‌కు వచ్చిన రవికుమార్ శంకరగిరి మాన్యాలు పట్టిస్తానంటూ పోలీస్ అధికారులను బెదిరించారు. ‘మీ స్థాయి ఎంత..? మీరు ఎంత..?’ అంటూ నరసన్నపేట సీఐ, ఎస్లనుద్దేశించి నోరు పారేసుకున్నారు. ♦ పొందూరులో టీడీపీ కార్యాలయం నిర్వహిస్తున్న భవనాన్ని ఖాళీ చేయాలని కోరినందుకు ఆ ఇంటి యజమానికి ఫోన్లో వార్నింగ్ ఇచ్చారు. ♦ పింఛన్ల విషయంలో తన మాట వినలేదని మండల కార్యాలయంలోనే సరుబుజ్జిలి ఎంపీడీవో, ఈవోపీఆర్డీకి వార్నింగ్ ఇచ్చారు. ఆఫీసులోనే తలుపులు వేసి మరీ బాదేస్తా.. నన్ను ఎవరూ ఆపలేరు. చెట్టుకు కట్టి కాల్చేస్తా.. చెప్పింది చేయకపోతే నేనేంటో చూపిస్తానంటూ బెదిరించారు. ♦ పనుల విషయంలో తాను చెప్పినట్లు వినకుంటే కుర్చిలో కూర్చున్నా లాక్కుని వచ్చి తంతానంటూ పంచాయతీ కార్యదర్శులను కూన రవికుమార్ భయపెట్టారు. ♦ ఒక బిల్లు విషయంలో సరుబుజ్జిలి ఇన్చార్జి ఈవోపీఆర్డీపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ♦ మట్టి అక్రమంగా తరలించిన వాహనాలను విడిచిపెట్టలేదని పొందూరు తహసీల్దార్‌పై బెదిరింపులకు పాల్పడ్డారు. ‘పట్టుకున్న వాహనాలను విడిచి పెట్టకపోతే లంచం డిమాండ్ చేశావని నీమీద కంప్లైంట్ చేస్తా. చెప్పు ఎంత కావాలి...? పది వేలు కావాలా? లక్ష కావాలా? ఎంత కావాలి...? ప్రాసెస్ గురించి నాకు చెబుతున్నావా? అంటూ రాయలేని భాషలో ఏకంగా ఎమ్మార్వోను దూషించారు. ♦కూన రవికుమార్ తమ్ముడు కూన వెంకట సత్యనారాయణ ఇటీవల పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ కెసీహెచ్ మహంతిపై దాడి చేసే వరకు వెళ్లారు. తాను చేసిన పనులకు సంబంధించి ఏఈ అభ్యంతరం వ్యక్తం చేయడంతో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ కార్యాలయంలోనే దౌర్జన్యం చేశారు. ‘ఎంత ధైర్యం రా...! నాకే నోటీసు ఇస్తావా..? ఏమనుకుంటున్నావ్.. నేను కూన రవికుమార్ బ్రదర్‌ని.. జాగ్రత్త... ఇక్కడే పాతేస్తా... ’ అంటూ సత్యనారాయణ రెచ్చిపోయాడు. -
ఏపీయే స్ఫూర్తి
సాక్షి, అమరావతి : ఏ దేశమైనా, రాష్ట్రమైనా ఆర్థికాభివృద్ధిని సాధించిందని చెప్పడానికి ఉపయోగపడే ప్రధాన సూచికల్లో విద్యుత్ వినియోగం ఒకటి. అందుకే విద్యుత్ వినియోగం ఎంత ఎక్కువగా ఉంటే అక్కడ పారిశ్రామిక, వాణిజ్య రంగాలు, జీవన ప్రమాణాలు అభివృద్ధి పథంలో ఉన్నాయని లెక్కిస్తుంటారు. అలాంటి విద్యుత్ సరఫరాకు దీర్ఘకాలంగా ఆటంకం ఏర్పడితే ఆర్థిక వ్యవస్థ మందగించే ప్రమాదం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రభుత్వాలు భవిష్యత్ విద్యుత్ సరఫరాకు ముందుగానే ప్రణాళికలు వేస్తుంటాయి. ఈ విషయంలో మన రాష్ట్ర ప్రభుత్వం దేశానికి మరోసారి ఆదర్శంగా నిలిచింది. ఏపీ చర్యలను స్ఫూర్తిగా తీసుకుని అన్ని రాష్ట్రాలూ పదేళ్ల విద్యుత్ వినియోగానికి ముందుగానే ప్రణాళికలు వేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు తొమ్మిదేళ్ల ముందుగానే విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోవాలని నిర్దేశించింది. జల విద్యుత్ కొనాలంటే తొమ్మిదేళ్ల ముందు, థర్మల్‌కు ఏడేళ్ల ముందు, పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లకు ఐదేళ్లు, పవన విద్యుత్‌కు మూడేళ్లు, సౌర విద్యుత్‌కు రెండేళ్ల ముందు ఒప్పందాలు కుదుర్చుకోవాలని కేంద్రం వెల్లడించింది. 2031 నాటికి రెట్టింపు వినియోగం.. రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ డిమాండ్ ఆధారంగా రానున్న పదేళ్లలో వినియోగం ఎంత ఉంటుందో అంచనా వేయాలని కేంద్రం కోరింది. దీంతో.. 2031 నాటికి ఏపీలో ఇంధన వినియోగం రెట్టింపు అవుతుందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) తన 20వ ఎలక్ట్రిక్ పవర్ సర్వే (ఈపీఎస్) నివేదికలో ఇప్పటికే వెల్లడించగా, ఇటీవల జాతీయ విద్యుత్ ప్రణాళిక కమిటీ దానిని ధుృవీకరించింది. ఇక రాష్ట్రంలో 2021–22 ఏడాదిలో విద్యుత్ వినియోగం 60,495 మిలియన్ యూనిట్లు ఉండగా, 2031–32 నాటికి 1,21,798 మిలియన్ యూనిట్లకు చేరుతుందని అధ్యయనాలు పేర్కొన్నాయి. దానికి తగ్గట్లుగా రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కూడా మరో 13,510 మెగావాట్లు పెరగనుంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా.. థర్మల్ విద్యుత్ సామర్థ్యాన్ని పెంచేందుకు ఇప్పటికే కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్కేంద్రంలో 800 మెగావాట్లను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతికి అంకితమిచ్చారు. అలాగే, ఈ నెలలోనే డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్లో మరో 800 మెగావాట్ల యూనిట్ వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఇంధన శాఖ, ఏపీ జెన్కో సన్నాహాలు చేస్తున్నాయి. పునరుత్పాదక విద్యుత్‌కు పెద్దపీట.. ఇక 2030 నాటికి వినియోగించే విద్యుత్‌లో 50 శాతం పునరుత్పాదక విద్యుత్ ఉండాలని కేంద్రం స్పష్టంచేసింది. ఈ విషయంలోనూ రాష్ట్రం ముందంజలోనే ఉంది. వ్యవసాయానికి ఏకంగా ముప్పై ఏళ్ల పాటు పగటివేళలోనే 9 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరాను అందించేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంలు ఇప్పటికే యూనిట్‌కు రూ.2.49 పైసల చొప్పున ఒప్పందం చేసుకున్నాయి. సెకీ నుంచి తీసుకుంటున్న 7 వేల మెగావాట్ల విద్యుత్ సౌర విద్యుత్ కావడం విశేషం. దీంతోపాటు 44,250 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో రూ.9.47 లక్షల కోట్ల విలువైన పునరుత్పాదక ప్రాజెక్టుల స్థాపనకు ఒప్పందాలు కూడా చేసుకుంది. -
ఇక నేను తప్పుకుంటా, సీఎంకు తెలియజేయండి.. జెన్కో సీఎండీ వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ‘నా ఆరోగ్యం సహకరించడం లేదు. సాధ్యమైనంత త్వరగా రిటైర్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నా. ముఖ్యమంత్రికి విన్నవించే సాహసం చేయలేకపోతున్నా. నా విన్నపాన్ని ముఖ్యమంత్రికి తెలియజేయాల్సిందిగా విద్యుత్ శాఖ మంత్రిని కోరుతున్నా..’ అని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు చెప్పారు. తాను బాధ్యతల నుంచి విరమించుకుంటున్నట్టు వార్తలు వస్తే మరోలా భావించరాదని విద్యుత్ ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. విద్యుత్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం జెన్కో ఆడిటో రియంలో జరిగింది. మంత్రి జగదీ శ్‌రెడ్డి దీనికి హాజరయ్యారు. కాగా మంత్రి సమక్షంలో ప్రభాకర్‌రావు చేసిన వ్యాఖ్యలు విద్యుత్ ఉద్యోగు లతో పాటు ప్రభుత్వ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. పదవీ విరమణ ఆలోచనను విరమించుకోవాలని జేఏసీ కన్వీనర్ రత్నాకర్‌రావు సభా వేదికపై నుంచి ప్రభాకర్‌రావుకు విజ్ఞప్తి చేశారు. అయితే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా గత నెల 5న విద్యుత్ సౌధలో నిర్వహించిన విద్యుత్ ప్రగతి ఉత్సవాల్లో సైతం ప్రభాకర్‌రావు ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి మీడియాను ఆహ్వానించకపోవడంతో అప్పట్లో పెద్దగా చర్చ నీయాంశం కాలేదు. ప్రభాకర్‌రావు 2014 జూన్ 5 నుంచి జెన్కో, 2014 అక్టోబర్ 25 నుంచి ట్రాన్స్‌కో ఇన్చార్జి సీఎండీగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో గత నెలలోనే ఆయన సీఎండీగా 9 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. తొలుత ఆయ న్ను రెండేళ్ల పదవీ కాలానికి సీఎండీగా నియమించినా, ఆ తర్వాత ఎప్పటికప్పుడు ప్రభుత్వం పదవీ కాలాన్ని పొడిగిస్తూ వస్తోంది. చివరిసారి పొడి గింపు సమయంలో తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు ఆయనే సీఎండీగా కొనసాగుతారని పేర్కొంది. సూర్యుడి మీద ఉమ్మేయడమే: మంత్రి జగదీశ్‌రెడ్డి కోడి గుడ్డు మీద ఈకలు పీకే ఒకరిద్దరు సబ్‌స్టాండర్డ్ గాళ్లు.. సీఎండీ ప్రభాకర్‌రావు వంటివారి మీద అవాకు లు చెవాకులు పేలడం సూర్యుడి మీద ఉమ్మేయడ మే నని మంత్రి జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఆశించినదానికంటే అధిక పీఆర్సీ: ప్రభాకర్‌రావు విద్యుత్ ఉద్యోగులు ఆశించినదానికంటే అధిక పీఆర్సీ ఇచ్చామని ప్రభాకర్‌రావు చెప్పారు. వెయిటేజీ లేకుండా 10 నుంచి 15 శాతం పీఆర్సీని ఉద్యోగులు ఊహించు కుంటే, జీతాలు మాత్రం 18.5 శాతం పెరిగాయని అ న్నారు. టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ సంస్థల సీఎండీలు రఘుమారెడ్డి, గోపాల్ రావు, జేఏసీ చైర్మన్ సాయిబాబా, కో–చైర్మన్ శ్రీధర్, కో–కన్వీనర్ బీసీ రెడ్డి, వైస్ చైర్మన్ వజీర్ తదితరులు పాల్గొన్నారు. -
కోతి చేసిన పనికి 20 గ్రామాలకు పవర్ సప్లై కట్!
సాక్షి, వరంగల్: కోతి తన చేష్టలతో కరెంటోళ్ళకే షాక్ ఇచ్చింది. 20 గ్రామాలకు కరెంటు సప్లై లేకుండా చేసింది. కోతి తన ప్రాణాల మీదకు తెచ్చుకుంది. విద్యుత్ అధికారులను ముప్పుతిప్పలు పెట్టి, లక్షా రూపాయల వరకు నష్టం కలుగజేసింది. జనగామ జిల్లా వడ్లకొండ 220 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ లో విద్యుత్ స్తంభాలపై ఎగిరిన కోతి, ట్రాన్స్ ఫార్మర్ను పట్టుకుంది. దీంతో ట్రాన్స్ ఫార్మర్ పేలిపోవడంతో పాటు కోతికి తీవ్ర గాయాలయ్యాయి. వడ్లకొండ 220 కేవీ సబ్ స్టేషన్ నుంచి లింగాలఘనపురం, జనగామ, అడవికేశ్వాపూర్, గానుగుపహాడ్, పసరమడ్ల 33/11 కేవీ ఫీడర్లకు విద్యుత్ సరఫరా అవుతుంది. విద్యుత్ సంబంధించి ఎప్పటికప్పుడు రీడింగ్ నమోదు చేసేలా అక్కడే ప్రొటెన్షల్ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ప్రొటెన్షల్ ట్రాన్స్ ఫార్మర్ను కోతి పట్టుకోవడంతో పేలిపోవడంతో పాటు జంపర్లు పూర్తిగా తెగిపడ్డాయి. ఫలితంగా 20 గ్రామాలకు మూడుగంటలకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న విద్యుత్ సిబ్బంది ట్రాన్స్ ఫార్మర్లో చిక్కుకున్న కోతిని కిందికి దింపి, మరమ్మతులు నిర్వహించి కరెంటు సరఫరాను పునరుద్ధరించారు. కోతి కారణంగా సంస్థకు లక్ష రూపాయల నష్టం వాటిల్లింది. -
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో కొత్త కోణం..
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. వరంగల్ జిల్లాకు చెందిన విద్యుత్ శాఖ డీఈ పేరు కొత్తగా వెలుగులోకి వచ్చింది. విద్యుత్ శాఖ డీఈ కనుసన్నల్లో ఏఈ పేపర్ చేతులు మారినట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో విద్యుత్ శాఖ జూనియర్ అసిస్టెంట్ రవికిషోర్‌ను సిట్ అరెస్ట్ చేసింది. ఆయన 20 మందికి పశ్నాపత్రాలు విక్రయించినట్లు సిట్ బృందం గుర్తించింది. డీఈ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఓ కోచింగ్ సెంటర్లో శిక్షకుడిగా పనిచేస్తున్నాడని, అభ్యర్థులతో పరిచయం పెంచుకుని ఈ దందాకు తెరలేపినట్లు సిట్ అధికారులు గుర్తించారు. టాప్ మార్కులు వచ్చిన వారి వివరాలను సిట్ బృందం సేకరిస్తోంది. కాగా, ప్రశ్నపత్రాల లీకేజి కేసులో సిట్ అధికారులు గురువారం మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, దీంతో ఈ కేసులో నిందితుల సంఖ్య 43కి, అరెస్ట్ అయిన వారి సంఖ్య 42కు చేరింది. ఈ వ్యవహారంలో సూత్రధారులుగా ఉన్న కమిషన్ మాజీ ఉద్యోగులు పులిదిండి ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డి ద్వారా అనేక ప్రశ్నపత్రాలు ఒకప్పుడు కమిషన్‌లో పని చేసిన వీరి స్నేహితుడు సురేశ్‌కు చేరాయి. చదవండి: రవికిశోర్ ద్వారా మరో ముగ్గురికి.. ఇతడు వీటిలో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ), డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) పేపర్లను తన అపార్ట్మెంట్లో నివసించే వారికి మధ్యవర్తి ద్వారా విక్రయించాడు. ఈ వ్యవహారంలో నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పూల రవికిశోర్ మధ్యవర్తిగా వ్యవహరించాడు. సురేశ్ గతంలోనే అరెస్టు కాగా.. రవికిశోర్‌తోపాటు ఏఈ, డీఏఓ పేపర్లు ఖరీదు చేసిన అన్నాచెల్లెళ్లు రాయపురం విక్రమ్, దివ్యలను బుధవారం అరెస్టు చేశారు. -
త్రైమాసిక నివేదికలివ్వండి
సాక్షి, అమరావతి: విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి త్రైమాసిక నివేదికలు సమర్పించాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. వివిధ పథకాల ద్వారా రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు ఇస్తున్న రాయితీ విద్యుత్‌కు సంబంధించిన ఆడిట్ వివరాలు, బిల్లుల లెక్కలను ఏపీఈఆర్సీకి ఇవ్వాల్సిందిగా మన రాష్ట్ర డిస్కంలకు సూచించింది. అక్కడి నుంచి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (సీఈఆర్సీ) సేకరిస్తుందని తెలిపింది. ఒకవేళ డిస్కంలు చెబుతున్న లెక్కల్లో తేడాలున్నట్టు తేలితే కేంద్రం నుంచి ప్రస్తుతం డిస్కంలకు అందుతున్న రీవాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం స్కీమ్ (ఆర్డీఎస్ఎస్) ప్రోత్సాహకాలను నిలిపివేస్తామని, జరిమానాలు కూడా విధిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు డ్రాఫ్ట్ ఎలక్ట్రిసిటీ రూల్స్ 2005కి సవరణ చేయాలని నిర్ణయించిన కేంద్రం రాష్ట్రాలకు సమాచారం పంపింది. ఈ నిబంధనల ప్రకారం.. విద్యుత్ సబ్సిడీ, దాని అకౌంటింగ్‌ను క్రమబద్ధీకరించాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. విద్యుత్ సబ్సిడీ పంపిణీ వివరాలను డిస్కంల నుంచి తీసుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన యూనిట్ సబ్సిడీకి సబ్సిడీ కేటగిరీ, వినియోగదారుల కేటగిరీ వారీగా వినియోగించే విద్యుత్‌కు సంబంధించిన కచ్చితమైన లెక్కల ఆధారంగా డిస్కం సబ్సిడీ డిమాండ్‌ను పెంచారా లేదా అనే వివరాలు నివేదికలో ఉండాలని పేర్కొంది. విద్యుత్ చట్టంలోని సెక్షన్–65 ప్రకారం సబ్సిడీకి సంబంధించిన వాస్తవ చెల్లింపు వివరాలు, ఇతర సంబంధిత వివరాల్లాగే చెల్లించాల్సిన సబ్సిడీ, చెల్లింపులో అంతరం వివరాలు కూడా నివేదికలో ఉండాలని చెప్పింది. దీనిపై అభిప్రాయం తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ‘టైమ్ ఆఫ్ డే’ విధానానికీ సవరణ రోజులో గంటల లెక్కన విద్యుత్ ధరల ప్రకారం బిల్లులు విధించే ‘టైమ్ ఆఫ్ డే’ విధానంలోనూ సవరణలు చేయాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతానికి కొన్ని పరిశ్రమలకే పరిమితమైన ఈ పద్ధతిని అన్ని పరిశ్రమలు, వాణిజ్య సర్విసులకు వర్తింపజేసేలా ముసాయిదా విద్యుత్ (వినియోగదారుల హక్కులు) సవరణ నిబంధనలు–2023 పేరిట కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసి.. రాష్ట్రాలు, విద్యుత్ సంస్థల నుంచి అభిప్రాయాలు తీసుకుంది. ఈ నిబంధనలు అమలులోకి వస్తే విద్యుత్ డిమాండ్ గరిష్టంగా (పీక్) ఉండే వేళల్లో వాడిన విద్యుత్‌కు అధిక చార్జీలు విధించే అవకాశం ఉంది. అదే సమయంలో డిమాండ్ తక్కువగా ఉండే వేళల్లో వినియోగించిన విద్యుత్ చార్జీల్లో 20 శాతం వరకూ రాయితీ లభించనుంది. అయితే, ఇందుకోసం స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని కేంద్రం ఆదేశించింది. -
రాష్ట్ర డిస్కంలకు అప్పుల షాక్!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల అప్పులు కొండల్లా పేరుకుపోతున్నాయి. ఆర్థిక లోటు, నిర్వహణ మూలధన వ్యయం కొరత కారణంగా ఏటా మరింతగా అప్పులు చేస్తున్నాయి. దీంతో 2019–20లో రూ.5.01 లక్షల కోట్లుగా డిస్కంల అప్పులు.. 2021–22 నాటికి రూ.6.2లక్షల కోట్లకు (24%వృద్ధి) ఎగబాకాయి. చాలా రాష్ట్రాల్లో డిస్కంల ఆస్తులతో పోల్చితే వాటి అప్పులు 100 శాతానికి మించిపోయి దివాలా బాటపట్టాయి. అందులో తెలంగాణ సహా మరో మూడు రాష్ట్రాల్లోని డిస్కంల అప్పులు ఆస్తుల కంటే 150శాతానికి మించిపోయి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. కేంద్ర విద్యుత్ శాఖ తాజాగా ప్రకటించిన డిస్కంల 11వ వార్షిక రేటింగ్స్, ర్యాంకింగ్స్ నివేదిక ఈ అంశాలను బహిర్గతం చేసింది. విద్యుత్ సబ్సిడీల విడుదలలో రాష్ట్ర ప్రభుత్వాల జాప్యం, బిల్లుల వసూళ్లలో ఆలస్యంతో డిస్కంలు అప్పులు చేయకతప్పడం లేదని ఈ నివేదిక పేర్కొంది. డిస్కంల ఆర్థిక పునర్వ్యవస్థీకరణకు గతంలో కేంద్రం ప్రవేశపెట్టిన ఉజ్వల్ డిస్కం యోజన (ఉదయ్) పథకం కింద డిస్కంల రుణాలను రాష్ట్ర ప్రభుత్వాలు టేకోవర్ చేసుకోవడంతో కొంత భారం తగ్గిందని తెలిపింది. రెండింటి పనితీరు మెరుగుపడాలి రాష్ట్రంలోని ఉత్తర/దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల (టీఎస్ఎన్పీడీసీఎల్/ టీఎస్ఎస్పీడీ సీఎల్)ల పనితీరు, ఆర్థిక పరిస్థితిపై ఈ నివేదికలో కేంద్ర విద్యుత్ శాఖ కీలక వ్యాఖ్యలు చేసింది. రెండు డిస్కంలు కూడా ఇంధన వ్యయం పెరుగుదల భారాన్ని వినియోగదారులపై ఎప్పటికప్పుడు ఆటోమేటిగ్గా బదిలీ చేయాలని.. డిస్కంల నష్టాలను ప్రభుత్వం టేకోవర్ చేసుకోవాలని సూచించింది. రాష్ట్ర ఈఆర్సీ ట్రూఅప్ ఆర్డర్ 2020–21ను జారీ చేయాలని, ఉద్యోగుల వ్యయ భారాన్ని సంస్థ తగ్గించుకోవాలని స్పష్టం చేసింది. నష్టాల్లో కూరుకుపోయిన ఉత్తర డిస్కం ♦ ఉత్తర తెలంగాణలోని 17 జిల్లాల పరిధిలో 63,48,874 మంది వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేస్తున్న ఎన్పీడీసీఎల్.. దేశంలోని 51 డిస్కంలలో 47వ స్థానంలో నిలిచింది. దీనికి 2020–21లో రూ.204 కోట్ల నష్టాలు వచ్చాయి. ♦ఒక్కో యూనిట్ విద్యుత్ సరఫరా అంచనా వ్యయం, వాస్తవ వ్యయం మధ్య తేడా 2020–21లో 0.68 పైసలుకాగా.. 2021–22లో రూ.1.52కి పెరిగింది. అంటే సరఫరా చేసిన ప్రతి యూనిట్ విద్యుత్‌పై నష్టాలు గణనీయంగా పెరిగాయి. ♦సాంకేతిక, వాణిజ్య నష్టాలు (ఏటీఅండ్‌సీ) 2020–21లో 9శాతం ఉండగా.. 2021–22లో ఏకంగా 14.1 శాతానికి ఎగబాకాయి. ♦ వినియోగదారుల నుంచి కరెంట్ బిల్లులను 60 రోజుల్లోగా వసూలు చేసుకోవాల్సి ఉండగా.. ఈ డిస్కం పరిధిలో సగటున 267 రోజులు పడుతోంది. ♦ గత మూడేళ్లలో ప్రభుత్వానికి సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించి ఏకంగా 40శాతం బిల్లులు వసూలు కాలేదు. దక్షిణ డిస్కంపై బకాయిల బండ ♦ దక్షిణ తెలంగాణలోని 1,04,36,589 మంది వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేస్తున్న ఎస్పీడీసీఎల్.. దేశంలోని 51 డిస్కంలలో 43వ ర్యాంకు సాధించింది. 2020–21లో రూ.627 కోట్ల నష్టాలను మూటగట్టుకుంది. ♦ సరఫరా చేసిన ప్రతి యూనిట్ విద్యుత్‌పై రూ.1.40 నష్టం వస్తోంది. ♦ జెన్కోలకు సంస్థ బిల్లుల చెల్లింపులకు 375 రోజులను తీసుకుంటోందని.. దీనిని 45 రోజులకు తగ్గించుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. ♦ వినియోగదారుల నుంచి కరెంట్ బిల్లుల వసూళ్లకు 130 రోజులు తీసుకుంటోంది. ♦ గత మూడేళ్లలో ప్రభుత్వానికి సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించి 25శాతం బిల్లులు వసూలు కాలేదు. -
కరెంట్‌కు ‘సెంట్రల్’ ఆంక్షలు!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ అదీనంలోని ‘సెంట్రల్ పూల్’నుంచి కరెంట్‌ను రాష్ట్రాలకు కేటాయించే విషయంలో కేంద్ర విద్యుత్ శాఖ కొత్త ఆంక్షలు తెచ్చింది. విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు సబ్సిడీ బకాయిలను చెల్లించకపోయినా, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులపై పన్నులు విధించినా, అంతర్రాష్ట్ర విద్యుత్ క్రయవిక్రయాలకు అడ్డంకిగా మారినా ఆయా రాష్ట్రాలకు ‘సెంట్రల్ పూల్’నుంచి కరెంట్ కేటాయించబోమని ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ గత నెల 31న ఉత్తర్వులు జారీ చేసింది. రెగ్యులేటరీ ఆస్తులు కలిగిన రాష్ట్రాలకు సైతం సెంట్రల్ పూల్ నుంచి కరెంట్ కేటాయించబోమని తేల్చి చెప్పింది. ఓ ఆర్థిక సంవత్సరంలో వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసేందుకు అయ్యే మొత్తం వ్యయాన్ని వారి నుంచి బిల్లుల రూపంలో వసూలు చేసుకునేందుకు వీలుగా విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్లు టారీఫ్‌ను నిర్ణయించాల్సి ఉంటుంది. దీనికి విరుద్ధంగా ఈఆర్సీలు తక్కువ టారీఫ్‌ను నిర్ణయిస్తే డిస్కంలకు మిగిలే నష్టాలను విద్యుత్ రంగ పరిభాషలో రెగ్యులేటరీ అసెట్స్‌గా పేర్కొంటారు. ఏటేటా రెగ్యులేటరీ అసెట్స్ రూపంలో డిస్కంల నష్టాలు రూ.వేల కోట్లకు పేరుకుపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనను తీసుకొచ్చింది. డిస్కంలకు నష్టాలు మిగలకుండా పెరిగే వ్యయానికి తగ్గట్టూ ఏటేటా విద్యుత్ చార్జీలను పెంచాలని ఈ నిబంధన ద్వారా కేంద్రం స్పష్టం చేస్తోంది. జల, సౌర విద్యుత్ వంటి గ్రీన్ఎనర్జీ, అంతర్రాష్ట్ర క్రయవిక్రయాలపై పన్నులు, సెస్‌లను విధించే రాష్ట్రాలకు సెంట్రల్ పూల్ నుంచి కరెంట్‌ను కేంద్రం కేటాయించదు. ఇకపై షరతులు పాటిస్తేనే కరెంట్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఎన్టీపీసీ, ఇతర కంపెనీలు ఉత్పత్తి చేసే విద్యుత్‌లో 80 శాతం మేర దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ద్వారా రాష్ట్రాలకు కేంద్రం విక్రయిస్తోంది. మిగిలిన 20 శాతాన్ని ఎవరికీ కేటాయించని విద్యుత్ పేరుతో ‘సెంట్రల్ పూల్’కింద తమ వద్దే ఉంచుకుంటుంది. ఉదాహరణకి రామగుండంలో ఎన్టీపీసీ నిర్మిస్తున్న 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రానికి సంబంధించిన విద్యుత్‌లో రాష్ట్రానికి 1,280 మెగావాట్ల(80 శాతం) విద్యుత్‌ను మాత్రమే రాష్ట్రానికి కేంద్రం కేటాయించింది. మిగిలిన 320 మెగావాట్ల(20 శాతం) విద్యుత్‌ను సెంట్రల్ పూల్ కింద తన వద్దే ఉంచుకుంది. రాష్ట్రాల నుంచి విజ్ఞప్తుల ఆధారంగా ఈ విద్యుత్‌ను తాత్కాలిక కేటాయింపులు చేస్తుంది. ఇకపై ఏదైనా రాష్ట్రం సెంట్రల్ పూల్ నుంచి విద్యుత్ కావాలని విజ్ఞప్తి చేస్తే ఆ రాష్ట్రం సంబంధిత అంశాలను పాటిస్తుందా? లేదా ? అని కేంద్రం పరిశీలిస్తుంది. ఒక వేళ పాటించడం లేదని గుర్తిస్తే సెంట్రల్ పూల్ నుంచి ఆయా రాష్ట్రాలకు విద్యుత్ కేటాయింపులు జరపదు. -
డిస్కంల నష్టాలు 5.49 లక్షల కోట్లు!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఏకంగా రూ. 5.49 లక్షల కోట్ల మేర నష్టాల్లో కూరుకుపోయినట్లు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ స్వయంగా ప్రకటించింది. ఈ నష్టాలకు తోడు విద్యుత్ ఉత్పాదన సంస్థలకు మరో రూ. 1.20 లక్షల కోట్ల మేర డిస్కంలు బకాయిపడ్డట్లు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం గత జూన్‌లో తీసుకొచ్చిన కొత్త విద్యుత్ విధానం ప్రకారం పంపిణీ సంస్థలకు ఉత్పాదన సంస్థలు విద్యుత్ సరఫరా చేసిన 45 రోజుల్లోగా బిల్లులు చెల్లించాలి. సకాలంలో బిల్లులు చెల్లించకుంటే ఉత్పత్తి సంస్థలు డిస్కంల నుంచి అధిక వడ్డీ వసూలు చేస్తాయి. ఈ గడువు దాటినా బిల్లులు చెల్లించకపోతే సంబంధిత డిస్కంలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తాయి. కానీ ఈ నిబంధనను కూడా బేఖాతరు చేస్తూ విద్యుత్ పంపిణీ సంస్థలు సకాలంలో బిల్లులు చెల్లించకుండా బకాయిలు పెంచుకుంటూ పోతూనే ఉన్నాయి. గతేడాది జూన్ 3కు ముందు విద్యుత్ బకాయిలు రూ. 91,061 కోట్లుగా ఉండగా కొత్త నిబంధన అమల్లోకి వచ్చాకఉత్పాదన సంస్థలకు డిస్కంలు మరో రూ. 25, 470 కోట్లు బాకీ పడ్డాయి. నిర్లక్ష్యం ఫలితం... విద్యుత్ పంపిణీ వ్యవస్థలోని లొసుగులు, లెక్కాపత్రంలేని విద్యుత్ వాడకం, వసూళ్లలో నిర్లక్ష్యం, పంపిణీ అవుతున్న విద్యుత్‌కు.. వస్తున్న ఆదాయానికి కూడా పొంతనలేకపోవడం డిస్కంల నష్టాలకు ఓ కారణం. అదే విధంగా డి్రస్టిబ్యూషన్ కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ కింద చెల్లించాల్సిన నిధులు సకాలంలో విడుదల చేయకపోవడం కూడా ఈ నష్టాల పెరుగుదలకు కారణంగా భావిస్తున్నారు. నష్టాల్లో అగ్రస్థానం తమిళనాడు... కేంద్రం లెక్కల ప్రకారం అత్యధిక నష్టాలు మూటగట్టుకుంటున్న రాష్ట్రాల్లో తమిళనాడు తొలి స్థానంలో నిలిచింది. అక్కడి విద్యుత్ పంపిణీ సంస్థలు ఏకంగా రూ. 1.25 లక్షల కోట్ల మేరకు నష్టాల్లో ఉన్నాయి. 2022–23 లెక్కలు పూర్తిగా వస్తే ఈ నష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది. రెండో స్థానంలో రాజస్తాన్‌లోని డిస్కంలు రూ. 89,556 కోట్ల నష్టాలను మూటగట్టుకోగా రూ. 77,937 కోట్లతో యూపీ, రూ. 59,546 కోట్లతో మధ్యప్రదేశ్, రూ. 49,816 కోట్లతో తెలంగాణకు చెందినడిస్కంలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. పెద్ద రాష్ట్రాల్లోనే డిస్కంలబకాయిలు అధికంగా ఉండగా బెంగాల్ సహా దాదాపు 20 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల విద్యుదుత్పాదన సంస్థలకు పెద్దగా బకాయిలు లేవు. సంస్కరణలతోనే డిస్కంల బాగు.. విద్యుత్ పంపిణీ సంస్థలు జవాబుదారీగా వ్యవహరిస్తే నష్టాలు తగ్గించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. నష్టాలు తగ్గించుకొని ఆర్థికంగా డిస్కంలు బాగుపడాలంటే యుద్ధప్రాతిపదికన ప్రీపెయిడ్ మీటర్ల ఏర్పాటు, ఉత్పత్తి, సరఫరా, పంపిణీకి ఆటోమేటిక్ మీటరింగ్ వ్యవస్థ అమలుఅవసరమని సూచిస్తోంది. -
సీఈఆర్సీ ఉత్తర్వులు..రూ.20కి ‘హైప్రైస్’ కరెంట్!
సాక్షి, హైదరాబాద్: వేసవిలో దేశవ్యాప్తంగా డిమాండ్ భారీగా పెరిగిన నేపథ్యంలో హైప్రైస్ సెగ్మెంట్ కింద విద్యుత్ ఎక్చేంజీల్లో యూనిట్‌కు రూ.20 గరిష్ట పరిమితితో విద్యుత్‌ను విక్రయించుకోవడానికి అనుమతిస్తూ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (సీఈఆర్సీ) ఉత్తర్వులు జారీ చేసింది. హైప్రైస్ డే అహెడ్ మార్కెట్ సెగ్మెంట్ పేరుతో ఈ విక్రయాలు జరపుకోవచ్చు. ఇతర సెగ్మెంట్ల కింద యూనిట్‌కు రూ.10 గరిష్ట పరిమితితో విక్రయాలు జరపాలని ఆదేశించింది. గతేడాది వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో ఎక్చేంజీల్లో ధరలు ఆకాశాన్ని తాకాయి. దీంతో ఎక్చేంజీల్లో విక్రయించే ధరలపై యూనిట్‌కు రూ.12 గరిష్ట పరిమితి విధిస్తూ 2022 జూన్ 30న సీఈఆర్సీ సుమోటో ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా జారీ చేసిన ఉత్తర్వులతో పవర్ ఎక్చేంజీల్లో విద్యుత్ ధరలు యూనిట్‌కు హైప్రైస్ సెగ్మెంట్ కింద రూ.0–20, ఇతర సెగ్మెంట్ల కింద రూ.0–10 వరకు ఉంటాయి. మరుసటి రోజుకు అవసరమైన అదనపు విద్యుత్‌ను ఒకరోజు ముందే విద్యుత్ ఎక్చేంజిల్లో డే అహెడ్ మార్కెట్, గ్రీన్ డే అహెడ్ మార్కెట్ విధానంలో డిస్కంలు కొనుగోలు చేస్తాయి. అదేరోజు అవసరమైన విద్యుత్‌ను కనీసం 15 నిమిషాల ముందు రియల్ టైమ్ మార్కెట్ విధానంలో బుక్ చేసుకుంటాయి. ఈ విభాగాల కింద రూ.0–10 ధరతో యూనిట్ విద్యుత్ విక్రయాలకు తాజాగా సీఈఆర్సీ అనుమతిచ్చింది. దిగుమతి చేసిన బొగ్గు/గ్యాస్ ఆధారిత విద్యుత్‌ను ఎక్చేంజీల్లో హైప్రైస్ డే అహెడ్ మార్కెట్ విభాగం కింద యూనిట్‌కు రూ.50 ధరతో విక్రయించడానికి ఇండియన్ ఎనర్జీ ఎక్చేంజీకి అనుమతిస్తూ ఫిబ్రవరి 16న సీఈఆర్సీ ఉత్తర్వులిచ్చింది. తాజా ఆదేశాలతో యూనిట్‌కు రూ.20 గరిష్ట ధరతో హైప్రైస్ విద్యుత్ అమ్ముకోవడానికి అన్ని పవర్ ఎక్చేంజీలకు అనుమతిచ్చినట్టు అయింది. -
కంటైనర్‌లో విద్యుత్ సబ్‌స్టేషన్
విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మించాలంటే దాదాపు 20 సెంట్ల స్థలం అవసరం. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో.. సబ్‌స్టేషన్ కాస్తా ఓ కంటైనర్లోనే ఇమిడిపోతోంది. నగర, పట్టణ ప్రాంతాల్లో స్థలాల ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ.. సబ్ స్టేషన్లు నిర్మించాలంటే అనేక ఇబ్బందులు ఎదురువుతున్నాయి. కంటైనర్ సబ్స్టేషన్లను అందుబాటులోకి తీసుకురావడం వల్ల.. స్థల భారం తప్పడంతోపాటు అనేక లాభాలుంటాయని విద్యుత్‌శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే విజయవాడలోని గొల్లపూడి వద్ద తొలి కంటైనర్ సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తి కాగా.. వచ్చే నెలలో ప్రారంభించనున్నారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ: సాధారణంగా నౌకల్లో సరుకుల్ని తరలించేందుకు కంటైనర్లను వినియోగిస్తుంటారు. ఇటీవల కాలంలో కంటైనర్ ఇళ్లు సైతం నిర్మిస్తున్నారు. తాజాగా కంటైనర్ విద్యుత్ సబ్స్టేషన్లు అందుబాటులోకి వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ మధ్యప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ సీపీడీసీఎల్) కంటైనర్ సబ్‌స్టేషన్ నిర్మించింది. విజయవాడ సమీపంలోని గొల్లపూడి శ్రీనివాస నగర్లో రూ.5.50 కోట్లు వెచ్చించింది. ఇప్పటికే ట్రయల్ రన్ విజయవంతం కాగా.. మార్చిలో ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సబ్‌స్టేషన్ 4.5 మీటర్ల వెడల్పు, 13 మీటర్ల పొడవు ఉంది. అందులోనే సబ్‌స్టేషన్‌కు సంబంధించిన పరికరాలన్నీ అమర్చారు. అత్యాధునిక రీతిలో తక్కువ స్థలంలో కంప్యూటర్ ఆధారంగా ఆపరేట్ చేసేలా దీనిని నిర్మించారు. పూర్తి ఆటోమేషన్ విధానంలో ఇది∙పనిచేస్తుంది. తిరుపతి, విశాఖపట్నంలోనూ ఈ కంటైనర్ సబ్స్టేషన్లు నిర్మిస్తున్నారు. ప్రత్యేకతలు ఇవీ.. ► సాధారణ సబ్‌స్టేషన్‌కు 20 సెంట్ల స్థలం అవసరం. కంటైనర్ సబ్‌స్టేషన్‌కు 2నుంచి 3 సెంట్ల జాగా సరిపోతుంది. ► సాధారణ సబ్‌స్టేషన్‌కు మూడు నెలలకొకసారి నిర్వహణ తప్పనిసరి. కంటైనర్‌కు నిర్వహణ వ్యయం అవసరం లేదు. విద్యుత్ పంపిణీ సాధారణ సబ్‌స్టేషన్ కంటే మెరుగ్గా ఉంటుంది. ► అంతరాయం లేని విద్యుత్ సరఫరాకు వీలుంటుంది. బ్రేక్ డౌన్స్ ఉండవు. ఓఎన్ఎం సిబ్బందికి పూర్తి రక్షణ ఉంటుంది. ► రద్దీగా ఉండే ప్రదేశాలు, మార్కెట్ ప్రాంతాల్లో సైతం వీటిని నిర్మించవచ్చు. అక్కడ అవసరం లేకపోతే మరో ప్రాంతానికి తరలించవచ్చు. ► వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనిచోట శివారు ప్రాంతాల నుంచి కూడా కంప్యూటర్ ద్వారా ఆపరేట్ చేయవచ్చు. సమస్య తలెత్తితే.. సబ్‌స్టేసన్‌లో సమస్య తతెత్తితే సెన్సార్ల ద్వారా ఆటోమేటిక్‌గా తలుపులు తెరచుకొంటాయి. వీడియో కాల్ ద్వారా పరిశీలించి తగు సూచనలు ఇచ్చి పరిష్కరించే వెసులుబాటు ఉంది. లోపల ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకునేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సబ్స్టేషన్ల పరిధిలో విద్యుత్ లైన్లు తెగిన వెంటనే ట్రిప్ అయి సరఫరా నిలిచిపోయే వ్యవస్థ ఉంది. ఏ వీధిలోనైనా సమస్య తలెత్తితే సబ్స్టేసన్లోనే ఉండి తెలుసుకునే వీలుంది. ఎంతో ప్రయోజనం కంటైనర్ సబ్స్టేషన్ల వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా గొల్లపూడిలో ప్రయోగాత్మకంగా దీనిని నిర్మించాం. వీటివల్ల డిస్కంలకు నిర్వహణ వ్యయం తగ్గుతుంది. వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుంది. జనావాసాల్లో స్తంభాలతో పనిలేకుండా ఈ కంటైనర్ సబ్స్టేషన్లు ఆకర్షణీయంగా పనిచేస్తాయి. – జె.పద్మ జనార్దనరెడ్డి, సీఎండీ, ఏపీ సీపీడీసీఎల్ గొల్లపూడి ప్రాంతానికి వరం గొల్లపూడి ప్రాంత ప్రజలకు కంటైనర్ సబ్ స్టేషన్ వరం లాంటిది. ఈ ప్రాంతం అతివేగంగా అభివృద్ధి చెందుతోంది. నూతన గృహ, వాణిజ్య సముదాయాలు విస్తరిస్తున్నాయి. భవిష్యత్‌లో వాటికి నిరంతర విద్యుత్ సరఫరా అందుబాటులోకి తీసుకు రావడానికి కంటైనర్ సబ్‌స్టేషన్ నిర్మించారు. విద్యుత్ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే నిర్మాణానికి సహకరించిన మంత్రి, అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు. – తలశిల రఘురాం, ఎమ్మెల్సీ, ఉమ్మడి కృష్ణా జిల్లా -
చనిపోయిన వ్యక్తికి పోస్టింగ్ ఇచ్చిన విద్యుత్ సంస్థ
ఇదిగోవయ్యా! నీ పోస్టింగ్ ఆర్డర్.. త్వరలో ప్రమోషన్ కూడా ఇస్తాం.. హ్యాపీనా! -
సంక్రాంతి పండగ షాకిచ్చిన విద్యుత్ సంస్థ.. ఏసీడీ డ్యూ పేరుతో..
సాక్షి, నిజామాబాద్: జిల్లాలోని విద్యుత్ వినియోగారులకు ఆ సంస్థ సంక్రాతి పండగ షాకిచ్చింది. ఈ నెలలో ఏసీడీ డ్యూ పేరుతో కొత్త రకం వసూళ్లకు పూనుకుంది. బిల్లులు చూసి వినియోగదారులు షాకవుతున్నారు. ఇదేం బాదుడంటూ ట్రాన్స్‌కో అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రతి నెల వచ్చే సాధారణ బిల్లుతో పాటు అదనపు బిల్లు రావడంతో మొదట్లో అర్థం కాక వదిలేశారు. బిల్లులు కట్టేందుకు వెళ్లిన వినియోగదారులకు సిబ్బంది ఏసీడీ డ్యూ చెల్లించాలని చెప్పడంతో ఖంగుతింటున్నారు. కొంత మందికి రూ. వందల్లో ఏసీడీ బిల్లు రాగా, మరి కొందరికి రూ. వేలల్లో బిల్లులు వచ్చాయి. దీంతో కొత్త రకం చార్జీలు ఎందుకు చెల్లించాలని వినియోగదారులు సిబ్బందిని ప్రశి్నస్తున్నారు. ముందుగా వినియోగదారులకు అవగాహన కల్పించాల్సిన ట్రాన్స్‌కో అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోక పోవడంతో బిల్లులు చెల్లించేందుకు ఆందోళన చెందుతున్నారు. డిసెంబర్లో వినియోగించిన విద్యుత్ బిల్లును జనవరిలో విద్యుత్ వినియోగదారులకు అందించారు. అందులో ఏసీడీ డ్యూపేరుతో బిల్లుతో పాటు అదనపు బిల్లును వేశారు. గత సంవత్సరం వినియోగదారుల నుంచి అభివృద్ధి చార్జీల పేరుతో అదనంగా వసూలు చేసిన విద్యుత్ పంపిణీ సంస్థ ఈ యోడు మరో పిడుగు వేసింది. ఏసీడీ డ్యూ అంటే.. ఏసీడీ (అడిషనల్ కన్జమ్షన్ డిపాటిజ్) పేరు బిల్లుల్లో చేరడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. వినియోగంతో సంబంధం లేకుండా వేలల్లో బిల్లులు రావడంతో లబోదిబోమంటున్నారు. జిల్లాలో 4 లక్షల 80 వేల వరకు గృహావసరాల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వినియోగదారు వినియోగించిన యూనిట్లతో సంబంధం లేకుండా చిన్నా, పెద్దా తేడాలేకుండా వినియోగదారైతే చాలు అన్నట్లు విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) వ్యవహరించిందనే విమర్శలు వస్తున్నాయి. గత సంవత్సరం గృహావసరాల వినియోగదారులకు యూనిట్‌కు 50 పైసలు, వ్యాపార సముదాయాలకు రూ. 1 చొప్పున పెంచారు. దీంతో పాటు కస్టమర్, డెవలప్మెంట్ చార్జీలు వసూలు చేశారు. తాజాగా సంస్థ ఏసీడీ పేరుతో మరో రకం బాదుడుతో వినియోగారులు విలవిల్లాడుతునారు. అడ్జస్ట్ చేస్తాం.. తర్వాత విడతల వారీగా నెలవారి యూనిట్లలో వచ్చే బిల్లుల్లో తగ్గించడం జరుగుతుంది. వినియోగదారులు సంవత్సరం పాటు వినియోగించిన యూ నిట్లను యావరేజ్‌గా తీసుకుని ఈ నెల బిల్లులో వేయడం జరిగింది. ప్రతి నెలా చెల్లించే బిల్లులో అడ్జస్ట్ చేస్తాం –రాపెల్లి రవీందర్, ఎస్ఈ -
కోర్టు ముందు హాజరు కావడానికి నామోషీనా?
సాక్షి, అమరావతి: అధికారులు కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరు కావడం నామోషీగా ఎందుకు భావిస్తున్నారని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేసి తీరాల్సిందేనని తేల్చి చెప్పింది. కోర్టు ఆదేశాలను అమలు చేయనందుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని సింగిల్ జడ్జిలు ఆదేశాలు జారీ చేయగానే, వాటిని సవాలు చేస్తూ ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేసే ధోరణి పెరిగిపోయిందని ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం గురువారం ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ తీరు సరైనది కాదంది. వ్యక్తిగత హాజరు శిక్షేమీ కాదని, జడ్జేమీ ఉరి తియ్యరని, ఆ అధికారం తమకు లేదని వ్యాఖ్యానించింది. ఫలానా అధికారి కోర్టు ముందు హాజరయ్యారని పత్రికల్లో రావడం పరువు తక్కువగా భావిస్తున్నందునే అప్పీళ్లు దాఖలు చేస్తున్నట్లుందని వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడమేగాక, ఉత్తర్వుల కాపీని తీసుకునేందుకు నిరాకరిస్తూ కోర్టునుద్దేశించి కింది స్థాయి అధికారులు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి, సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (సీపీడీసీఎల్) సీఎండీ, చీమకుర్తి సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్ఈ), ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ), మరికొందరు అధికారులను వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ సింగిల్ జడ్జి జస్టిస్ బట్టు దేవానంద్ ఇచ్చిన ఆదేశాల్లో జోక్యానికి నిరాకరించింది. సింగిల్ జడ్జి ఆదేశాలను సవాలు చేస్తూ సీపీడీసీఎల్ చీమకుర్తి ఎస్ఈ తదితరులు దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టేసింది. సింగిల్ జడ్జి ముందు హాజరై, అన్నీ అక్కడే చెప్పుకోవాలని అధికారులకు స్పష్టం చేసింది. ఈ మేరకు సీజే జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన వీఎల్ గణపతి గ్రానైట్స్ విద్యుత్ బిల్లులు బకాయి పడటంతో సీపీడీసీఎల్ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపేశారు. దీనిపై ఆ కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. కంపెనీపై ఆధారపడి పలువురు జీవనం సాగిస్తున్నందున విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని దీనిని విచారించిన జస్టిస్ బట్టు దేవానంద్ డిసెంబర్ 16న మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఈ వ్యాజ్యం ఈ నెల 3న మరోసారి విచారణకు రాగా.. కోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయలేదని, అంతేగాక కోర్టు ఆదేశాల కాపీని కూడా తీసుకోలేదని, పైపెచ్చు కోర్టునుద్దేశించి అనుచిత వ్యా ఖ్యలు చేశారని గణపతి గ్రానైట్స్ న్యాయవాది తెలిపారు. ఆ వ్యాఖ్యల సీడీని న్యాయమూర్తి ముందుంచారు. కోర్టు ఆదేశాలను అమలు చేయని అధికారులపై తీవ్ర చర్యలు తీసుకోవాలని ఈ కోర్టు భావిస్తున్నప్పటికీ, వారి వాదన కూడా వినడం సమంజసమని, ఈ నెల 6న కోర్టు ముందు హాజరు కావాలంటూ ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ సీపీడీసీఎల్ చీమకుర్తి ఎస్ఈ తదితరులు సీజే ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. అధికారుల తరపున వీఆర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. గణపతి గ్రానైట్స్ సంస్థ రూ.48 లక్షల వరకు బిల్లులు బకాయి పడినందునే విద్యుత్ సరఫరా నిలిపేశామన్నారు. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలుకు గడువు ఉందన్నారు. వాదనలు విన్న ధ ర్మాసనం.. కోర్టు పట్ల అధికారుల సంభాషణను దృష్టిలో పెట్టుకుని వారి తీరును ఆక్షేపించింది. -
ప్రగతి బాటలో విద్యుత్ రంగం
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యుత్ రంగం ప్రగతి బాటలో పయనిస్తోందని ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. చేసిన పనులు, సాధించిన ఫలితాలు, అవార్డులే ఇందుకు నిదర్శనమన్నారు. ట్రాన్స్‌కో, జెన్కో, ఏపీసీపీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్, ఏపీఎస్ఈసీఎం సంస్థలకు సంబంధించిన డైరీలు, క్యాలెండర్లను మంత్రి పెద్దిరెడ్డి బుధవారం విజయవాడలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర పురోగాభివృద్ధి విద్యుత్ రంగంపైనే ఆధారపడి ఉంటుందన్నారు. 99 శాతం మంచి చేసి, ఎక్కడో ఒక శాతం పొరపాటు జరిగితే దానినే పనిగట్టుకొని కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామని మంత్రి ఉద్ఘాటించారు. విద్యుత్ సమర్థ వినియోగానికి సంబంధించి రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్‌కు రాష్ట్రపతి అవార్డుతో పాటు, ఏపీ ట్రాన్స్‌కో, డిస్కం, నెడ్కాప్లకు జాతీయ అవార్డులు రావడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే రాష్ట్ర వినియోగానికి పోగా.. మిగిలిన మొత్తాన్ని ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తామన్నారు. వచ్చే మార్చిలో ఆర్టీపీఎస్ 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్‌ను ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. ఉద్యోగుల న్యాయమైన కోర్కెలను పరిశీలించి ప్రభుత్వం తప్పకుండా పరిష్కరిస్తుందని మంత్రి ప్రకటించారు. కార్యక్రమంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఉన్నతాధికారులు బి.శ్రీధర్, మల్లారెడ్డి, పద్మా జనార్దన్‌రెడ్డి, సంతోష్‌రావు, రమణారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. ఫ్లైయాష్ ఉత్పత్తిదారులు, వినియోగదారుల కోసం పోర్టల్ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. విజయవాడలోని ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ(పర్యావరణం) నీరబ్‌కుమార్ ప్రసాద్, కార్పొరేషన్ ఎండీ ఖజూరియా, చైర్మన్ గుబ్బా చంద్రశేఖర్‌తో కలిసి బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. కాలుష్య కారక వ్యర్థాల నిర్వహణకు ఏర్పాటు చేసిన పోర్టల్‌ను మంత్రి ప్రారంభించారు. -
ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం: కె విజయానంద్
సాక్షి, విజయవాడ: దేశాభివృద్ధికి వెన్నెముక విద్యుత్ రంగం అని ఇంధనశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె. విజయానంద్ అన్నారు. అలాంటి కీలకమైన విద్యుత్ శాఖలో పనిచేయడం మనందరి అదృష్టమని చెప్పారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఉద్యోగులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ.. 'విద్యుత్ ఉద్యోగులు బాధ్యతగా పనిచేయాలి. విద్యుత్ రంగం అభివృద్ది దిశగా పయనిస్తోంది. 11 వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్ద్యానికి ఏపీ విద్యుత్ శాఖ పెరిగింది. కృష్ణపట్నం ప్రాజెక్ట్‌ని ఇప్పటికే జాతికి అంకితం చేశాం. విజయవాడలో 800 మెగావాట్ల ధర్మల్ ప్లాంట్‌ను త్వరితగతిన పూర్తి చేస్తాం. ప్రజలకి నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం. వేసవిలో విద్యుత్ కోతలు ఉండకుండా చర్యలు తీసుకుంటున్నాం. రైతులకి 9 గంటల నిరంతర విద్యుత్ అందిస్తున్నాం' అని విజయానంద్ చెప్పారు. చదవండి: (ఈ పిట్ట రుచికి నాటుకోళ్లు, పొట్టేలు కూడా సాటిరావు) -
ఉత్తమ్‌కుమార్ బదిలీతో సంబరాలు చేసుకున్న ఉద్యోగులు
-
విద్యుత్ అధికారి బదిలీ.. ఉద్యోగుల సంబరాలు!
పండుగ చేసుకున్నారు... బ్యాండ్‌తో తీన్మార్ స్టెప్లు వేశారు.. ఇది పెళ్లికో, పేరంటానికో కాదు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విద్యుత్ శాఖలో ఎస్ఈగా పని చేసిన ఉత్తమ్ కుమార్ బదిలీ కావడంతో ఉద్యోగులు పండుగ చేసుకున్నారు. ఇలా పండుగ చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. ఒక అధికారి బదిలీ అయితే సహ ఉద్యోగులు ఇలా పండుగ చేసుకుంటారా అంటూ గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారి బదిలీతో పండుగ చేసుకున్న వారిపై చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. లంచాలను కట్టడి చేసిన అధికారి బదిలీ కావడంతో సంబరాలు చేసుకోవడం స్థానికుల్లో ఆగ్రహం తెప్పించింది. ఏకంగా బ్యాండ్ వాయిద్యాలతో మరీ ఉద్యోగులు ఎస్ఈ కార్యాలయం ముందు చిందులు వేయడం ప్రజల్లో ఆగ్రహానికి కారణమైంది. -
నాణ్యమైన విద్యుత్‌తోనే పెట్టుబడులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో పరిశ్రమలను ప్రోత్సహించడంతో పాటు, మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు పారిశ్రామిక రంగానికి నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేయడంపై దృష్టి సారించాలని ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. విద్యుత్ శాఖ అధికారులతో ఆదివారం వర్చువల్‌గా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రానికి గడిచిన రెండున్నరేళ్లలో కొత్తగా రూ.24,956 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. జనవరి 2020 నుంచి జూన్ 2022 మధ్య పెట్టుబడులు పెట్టేందుకు 129 మెగా యూనిట్లు ఒప్పందాలు చేసుకున్నాయని వివరించారు. విద్యుత్ రంగం బలోపేతానికి సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతోందని, రాష్ట్రం పారిశ్రామిక హబ్‌గా మారుతోందని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం ఆర్థిక కార్యకలాపాలు బాగా పెరుగుతున్నాయని, ఇదే సమయంలో విద్యుత్ వినియోగం కూడా గణనీయంగా పెరుగుతోందన్నారు. విశాఖ సర్కిల్లో ఐదేళ్లుగా విద్యుత్ వినియోగం పెరగడమే ఇందుకు నిదర్శనమన్నారు. సత్వర ఆర్థికాభివృద్ధికి ఇదే నిదర్శనం అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలి.. అత్యంత నాణ్యమైన, నమ్మకమైన విద్యుత్‌ను అందిస్తేనే రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులొస్తాయని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో విద్యుత్‌ను సరఫరా చేయాలంటే సరికొత్త అంతర్జాతీయ టెక్నాలజీలను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలని సూచించారు. ఇందుకోసం ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్(టెరి) వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల మద్దతుతో రాష్ట్ర విద్యుత్ సంస్థలు సరికొత్త టెక్నాలజీలను అమలు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. సమావేశంలో రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్ సీఈవో చంద్రశేఖరరెడ్డి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఏపీ ట్రాన్స్ కో సీఎండీ బి.శ్రీధర్, డిస్కంల సీఎండీలు తదితరులు పాల్గొన్నారు. -
AP: ఆ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు.. అంతా ఒట్టిదే: విద్యుత్ శాఖ
సాక్షి, అమరావతి : వినాయక చవితి ఉత్సవాల పందిళ్లకు విద్యుత్ ఛార్జీలు పెరిగాయంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని భక్తులకు విద్యుత్ శాఖ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ తూర్పు, దక్షిణ, మధ్య ప్రాంత పంపిణీ సంస్థల సీఎండీలు కె. సంతోషరావు, జె. పద్మాజనార్థనరెడ్డి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటుచేసే వినాయక మండపాలకు తాత్కాలిక విద్యుత్ టారిఫ్‌ను పెంచలేదని, పైగా గతంలో 250 వాట్స్‌కి కూడా రూ.వెయ్యి తీసుకునేవారని, కానీ ఇప్పుడు రూ.750గా నిర్ణయించామన్నారు. అప్పట్నుంచీ అవే ఛార్జీలు.. రాష్ట్రవ్యాప్తంగా వినాయక మండపాలకు 2014 నుంచి అమలులో ఉన్న టారిఫ్ ప్రకారం 500 వాట్స్‌కి రూ.1000, 1000 వాట్స్‌కి రూ.2,250, 1,500 వాట్స్‌కి రూ.3,000, 2000 వాట్స్‌కి రూ.3,750, 2,500 వాట్స్‌కి రూ.4,550, 3000 వాట్స్‌కి రూ.5,250, 3,500 వాట్స్‌కి రూ.6,000, 4000 వాట్స్‌కి రూ.6,750, 5000 వాట్స్‌కి రూ.8,250, 6,000 వాట్స్‌కి రూ.9,750, 10,000 వాట్స్‌కి రూ.15,750 చొప్పున చెల్లించి తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లను తీసుకోవాలని సూచించారు. విద్యుత్ శాఖ నిబంధనల మేరకు ఈ కనెక్షన్ల ద్వారా పది రోజులపాటు విద్యుత్‌ను వినియోగించుకోవచ్చని సీఎండీలు తెలిపారు. అవసరమైతే టోల్‌ఫ్రీ నంబర్ 1912కు ఫోన్ చేయాలని వారు కోరారు. -
Electricity Charges: నెలనెలా కరెంట్ షాక్! కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్
సాక్షి, హైదరాబాద్: ఇకపై ప్రతి నెలా విద్యుత్ చార్జీల మోత మోగనుంది. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరల హెచ్చుతగ్గులకు తగ్గట్టు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుకుంటూ పోయినట్టు.. ముందు ముందు కరెంటు చార్జీలు కూడా పెరిగిపోనున్నాయి. విద్యుత్ కొనుగోలు ధరలు, బొగ్గు, ఇంధన ధరల్లో హెచ్చుతగ్గుల ప్రభావాన్ని ఎప్పటికప్పుడు ఆటోమేటిగ్గా విద్యుత్ టారిఫ్‌లో సర్దుబాటు చేసేలా కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకువస్తోంది. ఏ నెలకు ఆ నెల భారాన్ని వినియోగదారులపై మోపేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ మేరకు ప్రస్తుతం అమల్లో ఉన్న ‘విద్యుత్ నిబంధనలు–2005’కు సవరణలు చేస్తూ.. శుక్రవారం ‘విద్యుత్ నిబంధనలు (సవరణ)–2022’ముసాయిదాను కేంద్ర విద్యుత్ శాఖ ప్రకటించింది. ముసాయిదా ప్రతులను అన్ని రాష్ట్రాల ఇంధన శాఖలు, ఈఆర్సీలు, కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలకు పంపింది. ముసాయిదా నిబంధనలపై సెప్టెంబర్ 11లోగా అభ్యంతరాలు, సలహాలను పంపించాలని కోరింది. ఏ రకంగా భారం పడినా.. వినియోగదారుడిపైనే.. విద్యుదుత్పత్తికి ఇంధనంగా వినియోగించే బొగ్గు, గ్యాస్ వంటి వాటి ధరలు పెరిగితే.. అందుకు అనుగుణంగా విద్యుత్ చార్జీలూ పెరుగుతాయి. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో (పీపీఏ) మార్పులు, డిమాండ్‌కు అనుగుణంగా గ్రిడ్ నుంచి అధిక ధరలకు కొనుగోళ్లు వంటి వాటితో పెరిగే భారాన్నీ.. ఏ నెలకు ఆ నెల వినియోగదారుల నుంచి వసూలు చేయాలని కేంద్ర ప్రతిపాదనలు స్పష్టం చేస్తున్నాయి. ‘విద్యుత్ నిబంధనలు (సవరణ)–2022’అమల్లోకి వచ్చాక 90 రోజుల్లోగా రాష్ట్రాల ఈఆర్సీలు ఇంధన ధరలు, విద్యుత్ కొనుగోలు ధరల్లో హెచ్చుతగ్గులను టారిఫ్‌లో సర్దుబాటు చేసేందుకు ఫార్ములాను ప్రకటించాల్సి ఉంటుంది. ఆలోగా ప్రతి నెలా టారిఫ్ సవరణ జరపడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఓ ఫార్ములాను ప్రతిపాదించింది. మళ్లీ ఏడాదికోసారి ‘ట్రూఅప్’! ఇక ప్రతి నెలా సవరించిన విద్యుత్ చార్జీలన్నింటినీ ఏడాదికోసారి రాష్ట్రాల ఈఆర్సీలు సమీక్షించాల్సి ఉంటుంది. విద్యుత్ కొనుగోళ్లకు చేసిన వాస్తవ వ్యయం, వినియోగదారుల నుంచి వసూలు చేసిన టారిఫ్‌ను సరిపోల్చి.. ఒకవేళ ఎక్కువ వసూలు చేస్తే తిరిగి వినియోగదారులకు చెల్లించాలి. అదే తక్కువ వసూలు చేసి ఉంటే మాత్రం.. ఆ సొమ్మునూ వినియోగదారుల నుంచి డిస్కంలు వసూలు చేసుకోవచ్చు. విద్యుత్ రంగ పరిభాషలో వీటిని ‘ట్రూఅప్’చార్జీలు అంటారు. విద్యుత్ చట్టసవరణ బిల్లులోని అంశాలు ముసాయిదాలో.. విద్యుత్ రంగంలో సంస్కరణల కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం ‘విద్యుత్ చట్ట సవరణ బిల్లు–2022’ను పార్లమెంటులో ప్రవేశపెట్టింది. విపక్షాల నిరసనల నేపథ్యంలో స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపింది. ఆ బిల్లు ప్రతిపాదించిన ముఖ్యమైన సవరణలు కొన్ని తాజాగా ప్రకటించిన ‘విద్యుత్ నిబంధనలు (సవరణ)–2022’ముసాయిదాలో ఉండటం గమనార్హం. విద్యుత్ చట్ట సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదించడానికి ముందే.. ఈ మార్గంలో దాని అమలుకు కేంద్రం ప్రయత్నిస్తోందని నిపుణులు చెప్తున్నారు. పక్కాగా విద్యుత్ సబ్సిడీ లెక్కలు వ్యవసాయం, గృహాలు, ఇతర కేటగిరీల వినియోగదారులకు ఉచితంగా/రాయితీపై విద్యుత్ సరఫరా చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు అంచనాల మేరకు సబ్సిడీ నిధులను ఇస్తోంది. ఇకపై సబ్సిడీ లెక్కలు కచ్చితంగా ఉండనున్నాయి. కేంద్రం ప్రకటించనున్న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఆధారంగా సబ్సిడీ బకాయిలను డిస్కంలు లెక్కించాల్సి ఉంటుంది. గడువులోగా జల విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతులు ఇకపై జల విద్యుత్ ప్రాజెక్టులను 150 రోజుల్లో, పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టులకు 90 రోజుల్లోగా అనుమతులు జారీ చేయాలన్న నిబంధనను కేంద్రం ప్రతిపాదించింది. ఇప్పటివరకు ఇలాంటి నిబంధన లేక అనుమతుల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పునరుత్పాదక విద్యుత్‌కు ఒకే ధర సెంట్రల్ పూల్ ద్వారా దేశవ్యాప్తంగా ఒకే ధరతో డిస్కంలు పునరుత్పాదక విద్యుత్ కొనుగోళ్లు జరిపే వీలు కల్పిస్తూ కేంద్రం మరో కీలక ప్రతిపాదన చేసింది. సౌర, పవన, హైడ్రో, హైబ్రిడ్, స్మాల్ హైడ్రో వంటి ప్రతి పునరుత్పాదక విద్యుత్‌కు ఒక ప్రత్యేక సెంట్రల్ పూల్ ఉండనుంది. అయితే ఏవైనా కంపెనీలు(ఇంటర్మీడియేటరీలు) పునరుత్పాదక విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా కరెంటు కొని.. ఎక్కువ రాష్ట్రాల్లోని డిస్కంలకు తిరిగి విక్రయిస్తే ఈ నిబంధన వర్తిస్తుంది. సెంట్రల్ పూల్ నిర్వహణ కోసం కేంద్రం ఏర్పాటు చేసే ప్రత్యేక ఏజెన్సీ (ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ) ప్రతి నెలా పునరుత్పాదక విద్యుత్ ధరను ఖరారు చేస్తుంది. సెంట్రల్ పూల్ ఐదేళ్లపాటు మనుగడలో ఉంటుంది. తర్వాత కొత్త శ్రీ సెంట్రల్ పూల్ ఏర్పాటు చేస్తారు. సెంట్రల్ పూల్ నుంచి రాష్ట్రాలు కచ్చితంగా విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. కొంటే మాత్రం కేంద్రం కనుసన్నల్లో లావాదేవీలు జరుగుతాయి. -
విద్యుత్ ఉద్యోగుల ఆందోళన
-
విద్యుత్ శాఖపై సీఎం జగన్ సమీక్ష
-
ఒప్పందాల మేరకు బొగ్గు సప్లై జరిగేలా చూడాలి: సీఎం జగన్
-
విద్యుత్ శాఖపై సీఎం జగన్ సమీక్ష సమావేశం
-
విద్యుత్ శాఖపై సమీక్ష.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, తాడేపల్లి: థర్మల్ కేంద్రాల వద్ద సరిపడా బొగ్గు నిల్వలు ఉండేలా చూసుకోవాలని, దీని కోసం సరైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఆయన తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో విద్యుత్ శాఖపై గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: వైఎస్సార్ కాపు నేస్తం; సీఎం జగన్ కాకినాడ జిల్లా పర్యటన షెడ్యూల్ ఇదే.. ‘‘విద్యుత్ డిమాండ్ అధికంగా రోజుల్లో పూర్తి సామర్థ్యంతో పవర్ప్లాంట్లు నడిచేలా చూసుకోవాలి. కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు బొగ్గు సప్లై జరిగేలా చూసుకోవాలి. ఏపీఎండీసీ నిర్వహిస్తున్న సులియారీ బొగ్గు గని నుంచి మరింత మెరుగ్గా ఉత్పత్తి జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలి. వ్యవసాయ మెటార్లకు మీటర్లు వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలంటే చెప్పాలని, దీనిపై రైతులకు లేఖలు రాయాలని’’ సీఎం జగన్ ఆదేశించారు. ‘‘రైతుపై ఒక్కపైసాకూడా భారం పడదని, బిల్లు అంతా ప్రభుత్వమే చెల్లిస్తున్న విషయాన్నికూడా వారికి వివరించండి. శ్రీకాకుళంలో పైలట్‌ప్రాజెక్ట్ ఎలా విజయవంతం అయ్యిందో వివరించండి. రైతులకు జరిగిన మేలు కూడా వివరించండి. 33.75 మిలియన్ యూనిట్ల విద్యుత్ అక్కడ ఆదా అయిన విషయాన్ని రైతులకు వివరించాలి. మోటార్లకు మీటర్లు కారణంగా మోటార్లు కాలిపోవు, ఎంత కరెంటు కాలుతుందో తెలుస్తుంది, నాణ్యంగా విద్యుత్ సరఫరా ఉంటుందనే విషయాన్ని వారికి వివరించాలి. వ్యవసాయ పంపుసెట్లకోసం పెట్టుకున్న వారికి వెంటనే కనెక్షన్లు మంజూరుచేయాలి. ఎక్కడ ట్రాన్సాఫార్మర్ పాడైనా వెంటనే రీప్లేస్ చేయాలని సీఎం ఆదేశించారు. -
ఏఎల్ఎం హత్య కేసు: భార్యే కుంటలో వేసి తొక్కి.. ఏమీ ఎరగనట్లు
సాక్షి, అనంతపురం: విద్యుత్ శాఖలో అసిస్టెంట్ లైన్మెన్గా పనిచేస్తున్న అశోక్ హత్యకేసులో మిస్టరీని గుత్తి పోలీసులు ఛేదించారు. ప్రియుడితో కలిసి భార్యనే హతమార్చినట్లుగా తేల్చారు. వివరాలను గుత్తి పోలీస్ స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తాడిపత్రి డీఎస్పీ చైతన్య, గుత్తి ఇన్చార్జ్ సీఐ రామకృష్ణ వెల్లడించారు. పెద్దవడుగూరులో అసిస్టెంట్ లైన్‌మన్‌గా పనిచేస్తున్న చెట్నేపల్లికి చెందిన అశోక్ ఈ ఏడాది ఏప్రిల్ 12న చెట్నేపల్లి సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్ద నీటి కుంటలో పడి మృతి చెందాడు. తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక అందిన తర్వాత హత్యగా నిర్ధారణ కావడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు కొనసాగింది. ఈ క్రమంలోనే అశోక్ భార్య కవిత ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. బసినేపల్లి నివాసి హరికృష్ణతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న కవిత.. తమ అనుబంధానికి అడ్డుగా ఉన్న భర్తను హతమార్చేందుకు ప్రియుడితో కలిసి పథకం రచించింది. చదవండి: (పెళ్లి చేసుకుందామని అడిగితే.. కడుపు మీద తన్నడంతో..) ఏప్రిల్ 12న చెట్నేపల్లి సమీపంలోని రైల్వే బ్రిడ్జి కుంట వద్ద ఒంటరిగా అశోక్ మద్యం సేవిస్తున్నట్లుగా తెలుసుకుని కవిత, హరికృష్ణ అక్కడకు చేరుకున్నారు. మాటల్లో అశోక్ చేత ఫుల్‌గా మద్యం తాగించి అనంతరం కుంటలోకి వేసి తొక్కి హతమార్చారు. అనంతరం మద్యం మత్తులో కుంటలో పడి తన భర్త మృతి చెందాడంటూ పోలీసులకు కవిత ఫిర్యాదు చేసింది. లోతైన దర్యాప్తుతో ఈ కేసులోని మిస్టరీని ఛేదించి, నిందితుల అరెస్ట్‌లో చొరవ చూపిన సిబ్బందిని డీఎస్పీ చైతన్య అభినందించారు. నిందితులపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. -
నచ్చిన కంపెనీ నుంచి కరెంట్
సాక్షి, హైదరాబాద్: ఓ టెలికాం కంపెనీ రీచార్జీల రేట్లు ఎక్కువ. కావాలనుకుంటే వేరే కంపెనీకి మారిపోవచ్చు. ఒక డీటీహెచ్‌లో చానళ్ల ప్యాకేజీ రేట్లు ఎక్కువ.. తక్కువ ధరకు ఇచ్చే మరో డీటీహెచ్‌ను పెట్టుకోవచ్చు.మరి మనకు సరఫరా చేసే కరెంటు చార్జీలు ఎక్కువ.. చచ్చినట్టు ఉన్న ఒక్క డిస్కం నుంచే విద్యుత్ వాడుకోవాలి. వచ్చినంత బిల్లులు కట్టాల్సిందే... కానీ ఇక ముందు విద్యుత్ సరఫరా చేసే కంపెనీల సంఖ్య పెరగనుంది. తక్కువ ధరకు కరెంటు ఇచ్చే కంపెనీనిగానీ.. కోతల్లేకుండానో, వోల్టేజీ హెచ్చు తగ్గులు లేకుండానో కరెంటు ఇచ్చే కంపెనీని గానీ ఎంచుకునే అవకాశం రానుంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లు–2022లో ఈ మేరకు విప్లవాత్మక సంస్కరణలను ప్రతిపాదించింది. ఒకే ప్రాంతంలో ఒకటికి మించి విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసేందుకు వీలు కల్పించనుంది. ఒకే ప్రాంతంలో విద్యుత్ సరఫరా చేసేందుకు ఎన్ని డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ముందుకొచ్చినా.. రాష్ట్రాల విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)లు వాటికి తప్పనిసరిగా లైసెన్సులు జారీ చేసేలా నిబంధనలను తీసుకువస్తోంది. ప్రైవేటు డిస్కంలకు తలుపులు బార్లా తెరిచేందుకు వీలుకల్పించే ఈ చట్టాన్ని కేంద్రం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టబోతోంది. ముసాయిదా బిల్లులోని కీలక ప్రతిపాదనలను కేంద్ర విద్యుత్ శాఖ తాజాగా ఓ నివేదికలో బహిర్గతం చేసింది. ఇప్పటిదాకా సొంత వ్యవస్థలున్న వాటికే.. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. డిస్కంలు తమ సొంత వ్యవస్థ ద్వారా వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసేందుకు మాత్రమే వీలుంది. అంటే డిస్కంలు విద్యుత్ స్తంభాలు, లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లతో సొంత సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటేనే లైసెన్స్ ఇస్తారు. ఇకపై ఆ అవసరం ఉండబోదు. ‘సొంత వ్యవస్థ ఉండాల’నే నిబంధనను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఒకే ప్రాంతంలో విద్యుత్ సరఫరా కోసం ఎక్కువ సంఖ్యలో డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు తప్పనిసరిగా ఓపెన్ యాక్సెస్ సదుపాయం కల్పించే దిశగా కొత్త నిబంధనను తీసుకువస్తోంది. ఈ లెక్కన కొత్తగా వచ్చే ప్రైవేటు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు తమ సరఫరా వ్యవస్థను వాడుకునేలా ప్రభుత్వ రంగ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు అనుమతి ఇవ్వాల్సి రానుంది. దీనికి బదులుగా ప్రైవేటు కంపెనీలు ప్రభుత్వ డిస్కంలకు వీలింగ్ చార్జీలను చెల్లిస్తాయి. కొత్త డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి లైసెన్స్‌ల జారీలో రాష్ట్రాల ఈఆర్సీలు విఫలమైనా, దరఖాస్తును తిరస్కరించినా.. ఆయా సందర్భాల్లో లైసెన్స్ జారీ చేసినట్టే పరిగణించేలా కేంద్రం నిబంధన తెస్తుండటం గమనార్హం. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు ఇష్టం లేకపోయినా ప్రైవేటు కంపెనీలకు లైసెన్స్ జారీ చేయక తప్పని పరిస్థితి ఏర్పడనుంది. వినియోగదారుడే రాజు! ప్రస్తుతం ఒక ప్రాంతంలో ఒకే ప్రభుత్వ రంగ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ద్వారా విద్యుత్ సరఫరా జరుగుతుండడంతో వాటి గుత్తాధిపత్యం కొనసాగుతోంది. ఇకపై ప్రైవేటు కంపెనీలతో పోటీపడి వినియోగదారులకు కాపాడుకోవాల్సిన పరిస్థితిని ప్రభుత్వ రంగ కంపెనీలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రెండు, అంతకు మించిన సంఖ్యలో డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఒకే ప్రాంతంలో విద్యుత్ సరఫరా చేస్తే.. ధరల విషయంలో వాటి మధ్య పోటీని ప్రోత్సహించేలా కేంద్రం అవకాశమివ్వడమే దీనికి కారణం. ఆయా ప్రాంతాల్లో రిటైల్ విద్యుత్ సరఫరాకు సంబంధించి గరిష్ట, కనిష్ట ధరలను మాత్రమే రాష్ట్రాల ఈర్సీలు నిర్ణయిస్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు డిస్కంలు గరిష్ట, కనిష్ట ధరల మధ్యలో ఏ రేటుకైనా విద్యుత్ సరఫరా చేసుకోవచ్చు. దీనితో తక్కువ ధరకు విద్యుత్ ఇచ్చే కంపెనీని ఎంచుకునేందుకు వినియోగదారులకు అవకాశం ఉంటుందని కేంద్రం పేర్కొంది. ప్రస్తుత పీపీఏల విద్యుత్, వ్యయం పంపిణీ చేసి.. ప్రస్తుతం డిస్కంలకు ఉన్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)లపై కేంద్రం కీలక స్పష్టతనిచ్చింది. వీటి ద్వారా వచ్చే విద్యుత్‌ను, అందుకు అయ్యే వ్యయాన్ని రాష్ట్రాల ఈఆర్సీలు అన్ని డిస్ట్రిబ్యూషన్ కంపెనీల మధ్య పంచాల్సి ఉంటుంది. ఏదైనా కొత్త డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి అదనపు విదుŠయ్త్ అవసరమైతే.. ఇతర కంపెనీలతో సంబంధం లేకుండా కొత్తగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను కుదుర్చుకోవచ్చు. క్రాస్ సబ్సిడీలకు ప్రత్యేక ఫండ్! పరిశ్రమలు, వాణిజ్యం వంటి కేటగిరీల వినియోగదారుల నుంచి అధికంగా వసూలు చేసిన టారిఫ్‌ను.. గృహాలు, వ్యవసాయం వంటి ఇతర వినియోగదారులకు సబ్సిడీగా ఇవ్వడాన్ని క్రాస్ సబ్సిడీ అంటారు. ఇలా క్రాస్ సబ్సిడీ ఇచ్చేందుకు ప్రభుత్వం.. క్రాస్ సబ్సిడీ బ్యాలెన్సింగ్ ఫండ్‌ను రాష్ట్రం ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఏదైనా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మిగులు క్రాస్ సబ్సిడీ కలిగి ఉంటే.. ఆ మొత్తాన్ని ఈ ఫండ్‌లో జమ చేస్తారు. లోటు క్రాస్ సబ్సిడీ ఉన్న డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు ఈ నిధిని పంచుతారు. ఈఆర్సీలకు అరెస్టు చేయించే అధికారం ఈఆర్సీల ఉత్తర్వులను సివిల్ కోర్టు ఆదేశాలతో సమానంగా పరిగణించనున్నారు. ఆస్తుల విక్రయం, అరెస్టుకు ఆదేశించడం, జైలులో పెట్టడం వంటి అధికారాలు ఈఆర్సీలకు లభించనున్నాయి. ఈఆర్సీ ఉత్తర్వులను స్థానిక సివిల్ కోర్టుకు బదిలీ చేసి అమలుకు చర్యలు తీసుకోవచ్చు. నిర్లక్ష్యంగా వ్యవహరించే కమిషన్ సభ్యులను తొలగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంలకు అధిపతిగా గానీ/ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా అనుభవమున్న వారినే ఈఆర్సీ చైర్‌పర్సన్‌గా నియమిస్తారు. మరిన్ని కీలక నిబంధనలివీ.. ►డిస్కంలు కేంద్రం నిర్దేశించిన మేర పునరుత్పాదక విద్యుత్‌ను కొనాల్సిందే. తగ్గితే ప్రతి యూనిట్‌కు తొలి ఏడాది 25–35 పైసల చొప్పున, తర్వాత 35–50 పైసల చొప్పున జరిమానా చెల్లించాలి. ►డిస్కంలు విద్యుదుత్పత్తి కంపెనీలకు ఒప్పందం ప్రకారం చెల్లింపులు జరపడంలో విఫలమైతే.. ఆయా డిస్కంలకు విద్యుత్ సరఫరా ఆపేసే అధికారాన్ని ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్ల (ఆర్ఎల్డీసీ)కు కేంద్రం అప్పగించనుంది. ఇప్పటికే రూ.వేల కోట్లు బకాయి పడిన డిస్కంలకు ఇది గుదిబండగా మారనుంది. ►సరఫరా చేసిన విద్యుత్‌కు సరితూగేలా వినియో గదారుల నుంచి బిల్లులు వసూలయ్యేలా ఈఆర్సీ లు చార్జీలను నిర్ణయించాలి. డిస్కంలు టారిఫ్ ప్రతిపాదనలను గడువులోగా సమర్పించకుంటే.. ఈఆర్సీలే మధ్యంతర టారిఫ్ జారీ చేయాల్సి ఉంటుంది. చార్జీలు ఆటోమేటిగ్గా పెరుగుతాయి. -
ఇష్టానుసారంగా అమ్మితే కుదరదు!
సాక్షి, అమరావతి: బొగ్గు, విద్యుత్ కొరతను విద్యుత్ ఉత్పత్తి సంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయి. బహిరంగ మార్కెట్లో భారీ ధరలకు విద్యుత్‌ను అమ్మేస్తున్నాయి. దీనిపై సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (సీఈఆర్సీ) స్పందించింది. ఇకపై ఇష్టమొచ్చిన ధరలకు అమ్మడం కుదరదని స్పష్టం చేసింది. యూనిట్ రూ.12 లేదా అంతకంటే తక్కువకు మాత్రమే విక్రయించాలని ఆదేశించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రాలకు సరిపడా విద్యుత్ సమకూరే అవకాశం ఏర్పడింది. కొందామన్నా దొరకట్లేదు.. గతేడాది అక్టోబర్‌లో బొగ్గు సంక్షోభం తలెత్తడంతో దేశవ్యాప్తంగా విద్యుత్ కొరత ఏర్పడింది. ఈ ఏడాది మార్చి నుంచి తీవ్రమైంది. ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకున్న విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ధరలను విపరీతంగా పెంచేశాయి. దీన్ని అప్పట్లోనే గమనించిన కేంద్ర విద్యుత్ శాఖ యూనిట్ రూ.12 కంటే ఎక్కువ ధరకు విక్రయించొద్దని చెప్పింది. ఏప్రిల్ 2నుంచి ధరల సీలింగ్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. కానీ ఉత్పత్తి సంస్థలు తెలివిగా వ్యవహరించడం మొదలుపెట్టాయి. మార్కెట్లను విడదీసి.. డిమాండ్ ఆధారంగా ధరలను అమలు చేయడం ప్రారంభించాయి. యూనిట్‌ను రూ.16 నుంచి రూ.20 వరకు కొనాల్సిన పరిస్థితిని కల్పించాయి. ఏపీ, తెలంగాణ తదితర రాష్ట్రాలకైతే బహిరంగ మార్కెట్లో విద్యుత్ దొరకడమే కష్టంగా మారింది. ఏపీలో రోజుకు 200 మిలియన్ యూనిట్ల నుంచి 230 మిలియన్ యూనిట్ల వరకు డిమాండ్ ఉండటంతో.. రోజుకు దాదాపు రూ.40 కోట్లు వెచ్చించి మరీ విద్యుత్ కొంటున్నారు. అన్నీ పరిగణనలోకి తీసుకుని ఆదేశాలు ఈ నేపథ్యంలో పవర్ ఎక్సే్చంజీల్లోని అన్ని సెగ్మెంట్లలో ఒకే విధమైన ధరల పరిమితి అవసరమని సీఈఆర్సీ గుర్తించింది. విద్యుత్ కంపెనీలు అధిక చార్జీలు వసూలు చేస్తున్నాయని తేల్చింది. అత్యవసరం ఏర్పడినప్పుడు మాత్రమే విద్యుత్ కొనుగోలుకు కొన్ని రాష్ట్రాలు ప్రయత్నిస్తుండటం వల్ల.. ఆ సమయంలో ధరలు భారీగా పెరుగుతున్నాయని కూడా గ్రహించింది. రాష్ట్రాల నుంచి వచ్చిన ఫిర్యాదులు, మార్కెట్లో జరుగుతున్న పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న సీఈఆర్సీ సుమోటోగా తాజా ఆదేశాలిచ్చింది. జూన్ 30 వరకు ఇవే ఆదేశాలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. -
పరిశ్రమలకు విద్యుత్ సడలింపులు
సాక్షి, అమరావతి: పరిశ్రమలకు విద్యుత్ వినియోగ పరిమితులను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) శనివారం సడలించింది. ఈ మేరకు వివిధ పారిశ్రామికవర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఆదేశాలు జారీ చేసింది. వీటి ప్రకారం.. హెచ్‌టీ సర్వీసుల వినియోగదారులకు బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలుకు అనుమతి లభిస్తుంది. దీనికి అవసరమైన నిరభ్యంతర పత్రం కూడా సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలని విద్యుత్ పంపిణీ సంస్థలను ఏపీఈఆర్సీ ఆదేశించింది. అలాగే మార్కెట్లో కొనే విద్యుత్‌పై క్రాస్–సబ్సిడీ సర్‌చార్జ్, అదనపు సర్‌చార్జ్‌ల నుంచి మినహాయింపునిచ్చింది. అదేవిధంగా పరిమితులు అమలులో ఉన్నంతవరకు కనీస చార్జీలు వర్తించవని.. వాస్తవ వినియోగంపైనే డిమాండ్ చార్జీలు విధించాలని డిస్కంలకు స్పష్టం చేసింది. వినియోగదారులు ఓపెన్ యాక్సెస్ ద్వారా విద్యుత్‌ను పొందే విషయంలో స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ) ద్వారా నెలవారీ కోటా పూర్తి చేసిన తర్వాత మాత్రమే పరిమితుల ప్రకారం జరిమానాలు విధించాలి. డిస్కమ్‌ల అభ్యర్థనకు ఏపీఈఆర్సీ ఆమోదం రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ వినియోగం రోజుకి 209 మిలియన్ యూనిట్లు ఉంది. దీనిలో థర్మల్ 70 మి.యూ, సెంట్రల్ గ్యాస్ స్టేషన్లు 38 మి.యూ, హైడ్రో 6 మి.యూ, గ్యాస్, సెయిల్ 8 మి.యూ, పవన విద్యుత్ కంపెనీలు 16 మి.యూ, సౌర విద్యుత్ కంపెనీలు 25 మి.యూ, హిందుజా 12 మి.యూ, ఇతర ఉత్పత్తి కేంద్రాలు 0.04 మిలియన్ యూనిట్ల చొప్పున అందిస్తున్నాయి. ఇప్పటికీ పవర్ ఎక్ఛ్సేంజ్‌ల నుంచి 34 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేస్తే తప్ప డిమాండ్‌కు సరిపడా విద్యుత్ సరఫరా చేయలేని పరిస్థితి ఉంది. దీంతో ఈ నెల 30 వరకు పరిశ్రమలు, హెచ్‌టీ సర్వీసులపై విధించిన పరిమితులను పొడిగించాలని డిస్కమ్‌లు చేసిన అభ్యర్థనకు ఏపీఈఆర్సీ ఆమోదం తెలిపింది. పరిమితుల వల్ల 290 మిలియన్ యూనిట్లు ఆదా.. దేశవ్యాప్తంగా ఏర్పడ్డ బొగ్గు, విద్యుత్ కొరత నేపథ్యంలో రాష్ట్రంలో వ్యవసాయ, గృహావసరాలకు కోతలు లేకుండా సరఫరా అందించడం కోసం ఈ నెల 8 నుంచి పరిశ్రమల విద్యుత్ వినియోగంపై పరిమితులు అమలులోకి వచ్చాయి. ఈ కాలంలో పరిశ్రమలకు ఇచ్చే 290 మిలియన్ యూనిట్లను ఆదా చేసి గృహావసరాలకు నిరంతరం, వ్యవసాయావసరాలకు 7 గంటలు విద్యుత్‌ను అందించారు. ఇంకా కొరత ఉండటం, పంటలకు విద్యుత్ అవసరం వంటి కారణాలతో పరిమితులను మరికొన్ని రోజులు పొడిగించారు. ఈ నెలాఖరు వరకు నిరంతరం నడిచే పరిశ్రమలు రోజులో వాడే విద్యుత్ వినియోగంలో 50 శాతం వరకు వాడుకోవచ్చు. మిగతా పరిశ్రమలకు వారంలో ఒక రోజు (వారాంతపు సెలవు కాకుండా) పవర్ హాలిడే అమలు జరుగుతుంది. అయితే ప్రజాప్రయోజనాల దృష్ట్యా దాదాపు 22 పరిశ్రమలు, హెచ్‌టీ సర్వీసులకు ఈ నిబంధనల నుంచి పూర్తి మినహాయింపునిచ్చారు. -
‘ఉచిత విద్యుత్’పై కేంద్రం కుట్ర
సూర్యాపేట రూరల్: తెలంగాణ విద్యుత్ ప్రాజెక్టులకు కేంద్ర సంస్థలు రుణాలు నిలిపివేయడంపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరాపై కేంద్రం కుట్ర చేస్తోందన్నారు. గురువారం సూర్యాపేటలో రవాణా శాఖ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరాకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 17 వేల మెగా వాట్లకుపైగా విద్యుత్ డిమాండ్ వచ్చినా సరఫరాకు సిద్ధంగా ఉన్నామన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో ముందు వరుసలో ఉన్న తెలంగాణను ప్రోత్సహించాల్సిన కేంద్రం, వివక్ష చూపెడుతోందని దుయ్యబట్టారు. విద్యుత్‌కు అధిక డిమాండ్ ఉన్న నేపథ్యంలో.. ఇతర సంస్థలు తెలంగాణకు విద్యుత్ విక్రయించవద్దంటూ కేంద్రం బెదిరిస్తోందని ఆయన ఆరోపించారు. కేంద్రం ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ ఉన్నంత వరకు తెలంగాణ రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ చార్జీల పాపం కేంద్రానిదేనని అన్నారు. బొగ్గు దిగుమతుల ధరలు, పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడంతో పాటు, కేంద్రం అడ్డగోలుగా పన్నులు విధించడం వల్లే తప్పనిసరి పరిస్థితుల్లో విద్యుత్ చార్జీలు పెంచాల్సి వచ్చిందని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ వెంకట్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, జెడ్పీటీసీ జీడి భిక్షం తదితరులు పాల్గొన్నారు. -
పెరుగుతున్న విద్యుత్ వినియోగం
సాక్షి, అమరావతి బ్యూరో: ఎండలతో పాటే విద్యుత్ వాడకం కూడా పెరిగిపోతోంది. ఈ ఏడాది మార్చి మొదటి వారం నుంచే మండుటెండలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో సాధారణం కంటే 2–4 డిగ్రీలు అధికంగా (40 డిగ్రీలకు పైగా) ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యలో ఒకింత తగ్గినట్లు అనిపించినా పది రోజులుగా మళ్లీ సెగలు మొదలయ్యాయి. సరఫరాకు మించి డిమాండ్ నెలకొనడంతో పవర్ ఎక్చేంజ్‌లో యూనిట్ రూ.8–20 వరకు వెచ్చించి అత్యవసరంగా అప్పటికప్పుడు విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇది ప్రభుత్వానికి ఎంతో భారమైనప్పటికీ ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో వెచ్చిస్తోంది. గత సంవత్సరం కోవిడ్ ప్రభావం వల్ల డిమాండ్ లేకపోవడంతో మార్కెట్లో కాస్త చౌకగానే విద్యుత్ లభ్యమైంది. లభ్యత ఇదీ.. రాష్ట్రంలో ఏపీ హైడెల్ నుంచి 1,728 మెగావాట్లు, ఏపీ థర్మల్ నుంచి 5,010, జాయింట్ సెక్టార్ నుంచి 34, సెంట్రల్ సెక్టార్ నుంచి 2,403, ప్రైవేటు సెక్టార్ (గ్యాస్) నుంచి 1,492, ప్రైవేటు సెక్టార్ (విండ్) నుంచి 4,179, ప్రైవేటు సెక్టార్ (సోలార్) నుంచి 3,800, స్టేట్ పర్చేజెస్ ద్వారా 631, ఇతరుల ద్వారా 585 వెరసి 19,862 మెగావాట్ల విద్యుత్ లభ్యత ఉంది. ఈ సంవత్సరం 11,991 మెగావాట్ల డిమాండ్ ఉంటుందని, సగటున మార్చిలో రోజుకు గ్రిడ్ డిమాండ్ 228 మిలియన్ యూనిట్ల వినియోగం అవుతుందని విద్యుత్ శాఖ అంచనా వేసింది. గత ఏడాది మార్చి 26న పవర్ గ్రిడ్ డిమాండ్ 219.334 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండగా ఈ ఏడాది మార్చి 26న 228.428 మిలియన్ యూనిట్లు ఉంది. వృథా నివారించాలి.. సరఫరాకు మించి డిమాండ్ పెరుగుతున్నందున వినియోగదారులు విద్యుత్ వృథా నివారించాలి. అత్యవసరమైనవి మినహా ఇతర విద్యుత్ ఉపకరణాలను వాడవద్దు. సాయంత్రం ఆరు నుంచి రాత్రి పది గంటల వరకు విద్యుత్ వాడకంలో నియంత్రణ పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. –జె.పద్మ జనార్దనరెడ్డి, సీఎండీ, ఏపీసీపీడీసీఎల్ ఏప్రిల్ 15 తర్వాత ఊరట! విద్యుత్ డిమాండ్‌కు ఏప్రిల్ 15 తర్వాత కాస్త ఉపశమనం కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు. అప్పటికి వ్యవసాయ విద్యుత్ వినియోగం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. రోజుకు సగటున వినియోగం 223 మిలియన్ యూనిట్లకు తగ్గవచ్చని పేర్కొంటున్నారు. అయితే వేసవి తీవ్రత పెరిగితే మళ్లీ డిమాండ్ అధికమయ్యే పరిస్థితి తలెత్తే అవకాశం లేకపోలేదంటున్నారు. -
Andhra Pradesh: ఖజానాకు ఆదా..ఉచితానికి భరోసా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వ్యవసాయానికి పగటిపూటే 9 గంటలపాటు ఉచిత విద్యుత్‌ను వచ్చే 25 ఏళ్లపాటు నిరాటంకంగా అందించేందుకే కేంద్ర ప్రభుత్వం సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో ఒప్పందం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ తెలిపారు. ఆదివారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా దీర్ఘకాలం నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, ఇది రైతులకు పూర్తి భరోసానిస్తుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం కొనుగోలు చేస్తున్న ధర కంటే తక్కువకే కొంటున్నందున ఏడాదికి రూ.2,400 కోట్లు ఆదా అవుతుందని తెలిపారు. ఇవాక్యులేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యయం మరో రూ.2,260 కోట్లు కూడా ఆదా అవుతాయని వెల్లడించారు. సెకీతో విద్యుత్ ఒప్పందం రాష్ట్రానికి ప్రయోజనకరమని అంశాలవారీగా వివరించారు... యూనిట్‌కు రూ.1.87 ఆదా.. 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను కలుపుకొని వ్యవసాయానికి పగటి పూట 9 గంటలు నిరాటంకంగా నాణ్యమైన విద్యుత్ అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రస్తుతం వ్యవసాయానికి అందించే విద్యుత్‌ను యూనిట్ సగటున రూ.4.36 చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు ఉచితంగా అందిస్తోంది. సెకీతో ఒప్పందం వల్ల ఈ విద్యుత్ యూనిట్ రూ.2.49కే వస్తుంది. ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ద్వారా పిలిచిన టెండర్లలో కనీస బిడ్ యూనిట్‌కు రూ.2.49కు కోట్ చేశారు. తద్వారా యూనిట్‌కు దాదాపు రూ.1.87 ఆదా అవుతుంది. ఆ ప్రకారం ఏడాదికి రూ.2,400 కోట్ల వరకూ ప్రజాధనాన్ని ఆదా చేయొచ్చు. మనకు మరింత చౌకగా.. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ చట్టం ప్రకారమే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆప్ ఇండియా (సెకీ) యూనిట్ రూ.2.49 చొప్పున ప్రతిపాదించగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. తమిళనాడు ప్రభుత్వం సెప్టెంబర్ లోనే సెకీ నుంచి యూనిట్ రూ.2.61చొప్పున సోలార్ విద్యుత్‌ను కొనుగోలు చేసింది. ఏపీ ప్రభుత్వం అంతకంటే తక్కువకే రూ.2.49కే సెకీ సంస్థ నుంచి కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకోనుంది. 2014 నుంచి ఆంధ్రప్రదేశ్ చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలలో ప్రస్తుతం సెకీ ప్రతిపాదించిందే అతి తక్కువ ధర. అలాగే ఐఎస్టీఎస్ ఛార్జీల నుంచి కేంద్రం మినహాయింపు ఇచ్చింది. కేంద్ర చట్టాల ప్రకారమే.. డిస్కంలపై పడే నెట్ వర్క్ ఛార్జీల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నాం కాబట్టి కేంద్ర విద్యుత్ చట్టాన్ని అనుసరించాల్సి ఉంటుంది. విద్యుత్ కొనుగోళ్లపై ముందుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాతే విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్(ఈఆర్సీ) కు ప్రతిపాదిస్తుంది. ఈఆర్సీ ఆమోదించిన తరువాతే సెకీతో ఒప్పందం కుదుర్చుకుంటుంది. 2014 నుంచి పీపీఏ ఒప్పందాలలో భాగంగా చేంజ్ ఆఫ్ లా ప్రకారం విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు మీద పన్నులు పెరిగినా, తగ్గినా కొనుగోలుదారుడే (ప్రభుత్వం, డిస్కంలు) భరిస్తాయి. కేంద్ర విద్యుత్ చట్టంలో దీన్నొక నిబంధనంగా నోటిఫై చేశారు. ప్రస్తుతం దేశంలో అన్ని టెండర్లలో ఈ నిబంధన అమల్లో ఉంది. దీన్ని మార్చడానికి అవకాశం లేదు. లైన్ల ఖర్చుండదు.. ఇతర అవసరాలకు భూములు సెకీ నుంచి సౌర విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల ఇవాక్యులేషన్ లైన్ల ఖర్చు భారం ఉండదు. రాష్ట్రంలో ఏర్పాటు చేసే ప్లాంట్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలంటే ప్రభుత్వం రూ.2,260 కోట్లు ఖర్చు పెట్టి ఇవాక్యులేషన్ లైన్లు నిర్మించాల్సి ఉంటుంది. సెకీతో ఒప్పందంతో ఆమేరకు భారీగా ప్రజాధనం ఆదా అవుతుంది. రాష్ట్రంలో ప్రాజెక్టు ఏర్పాటు చేస్తే జీఎస్టీ ఆదాయాన్ని పరిగణలోకి తీసుకున్నాసరే అది ఒకసారికే పరిమితమవుతుంది. కానీ కేంద్ర గ్రిడ్‌కు ఛార్జీలు 25 ఏళ్లపాటు కట్టాల్సి ఉంటుంది. దాంతో రాష్ట్రం చాలా ఆర్థిక భారాన్ని భరించాల్సి వస్తుంది. మరోవైపు సెకీ విద్యుత్ వల్ల మనం భూములు ఇవ్వాల్సిన అవసరం లేదు. అవసరమైతే వేరే ప్రాజెక్టుల కోసం ఈ భూమి ఉపయోగించుకోవచ్చు. తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ కంటే రాజస్థాన్‌లో సూర్యుడు ఎక్కవ సేపు ప్రకాశిస్తాడు. మన రాష్ట్రంలో కంటే అక్కడ గంటన్నర సేపు అధికంగా సూర్యరశ్మి ఉండటంతో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల డిమాండ్ అధికంగా ఉండే పీక్ అవర్స్‌లో సెకీ విద్యుత్ బాగా ఉపయోగపడుతుంది. అదే ఎక్సే్చజీ నుంచి కొనుగోలు చేస్తే పీక్ అవర్‌లో కరెంట్ ధరలు అధికంగా ఉంటాయి. ఐదేళ్లలో అస్తవ్యస్థం గత సర్కారు హయాంలో డిస్కంలపై తీవ్ర ఒత్తిడి తెచ్చి 25 ఏళ్లకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేసుకోవడంతో 2014– 2019 మధ్య రాష్ట్ర విద్యుత్ రంగం పూర్తిగా దివాళా తీసింది. కొనుగోలు నష్టాలు కొండలా పేరుకుపోయాయి. అప్పులు గుదిబండల్లా మారాయి. చౌక విద్యుత్తు కొనుగోళ్లకు ప్రాధాన్యమివ్వకుండా దీర్ఘకాలిక ఒప్పందాలపై గత సర్కారు మొగ్గు చూపడంతో డిస్కమ్‌లు నష్టాల భారంతో దివాళా స్థితికి చేరుకున్నాయి. నోట్: ‘సెకీ’ 2017 డిసెంబర్లో నిర్వహించిన వేలంలో ధరలు, గత సర్కారు కొన్న ధరల్లో వ్యత్యాసం వివరాలు ఇవీ. చదవండి: 'పల్లె..' ఇవేం నీతిమాలిన పనులు?.. ఆడియో వైరల్ -
కలలు కల్లలు.. ఉద్యోగంలో చేరిన గంటల్లోనే...
నందిగామ: ఉద్యోగం వచ్చిందన్న ఆనందం ఒక్క రోజులోనే ఆవిరైంది. మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో బలి తీసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ఏపీలోని కృష్ణా జిల్లా పరిటాల గ్రామానికి చెందిన వేముల మారుతీరావుకు తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచకు చెందిన కాల్వ సావిత్రి (33)తో వివాహమైంది. వారు పరిటాలలోనే నివాసముంటున్నారు. మహబూబ్‌నగర్ పట్టణంలో అసిస్టెంట్ లైన్ ఉమెన్‌గా సావిత్రికి ఉద్యోగం వచ్చింది. దీంతో భార్యాభర్తలిరువురు ఆనందంగా ద్విచక్ర వాహనంపై 14న బయలుదేరి వెళ్లి ఉద్యోగంలో చేరారు. అదే రోజు పరిటాలకు తిరుగు ప్రయాణమయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున నందిగామ పట్టణ శివారుల్లో 65వ నంబరు జాతీయ రహదారిపై బైక్ అదుపు తప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. సావిత్రి అక్కడికక్కడే దుర్మరణం చెందగా, తీవ్ర గాయాలపాలైన మారుతీరావును స్థానికులు ఆస్పత్రికి తరలించారు. (చదవండి: ఆర్కేను రక్షించుకోలేకపోయాం: కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి) -
విద్యుత్ రంగంలో సంక్షోభం తాత్కాలికమే
సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా బొగ్గు కొరత దృష్ట్యా రాష్ట్ర విద్యుత్ రంగంలో నెలకొన్న తాత్కాలిక ఒడిదుడుకులను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. తాజా పరిస్థితులపై సోమవారం రాష్ట్ర ప్రజలకు ఓ ప్రకటన ద్వారా వివరణ ఇచ్చారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఏదో ఒక స్థాయిలో విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నాయని, మన రాష్ట్రంలో ఏర్పడిన సంక్షోభం తాత్కాలికమేనని ఆయన పేర్కొన్నారు. జెన్కో కేంద్రాల మూసివేత అనాలోచితం కాదు ► జెన్కో కేంద్రాలను అనాలోచితంగా మూసివేయలేదు. బహిరంగ మార్కెట్లో జెన్కో కేంద్రాల చర వ్యయం కంటే తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించడం కోసం మార్కెట్ వేలం నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నాం. ► బొగ్గు కొరత దృష్ట్యా యూనిట్లను పూర్తిస్థాయిలో నడపలేని పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (ఆర్టీటీపీ)లో వార్షిక మరమ్మతులు చేపట్టాం. ఇలా చేయకపోయినా బొగ్గు కొరత వల్ల వాటిని మూసివేయాల్సి వచ్చేది. ► తెలంగాణ రాష్ట్రానికి బొగ్గు కొరత లేదు. అక్కడున్న బొగ్గు నిల్వలను ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వడం లేదు. మనం శ్రీశైలంలో మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేసుకోగలుగుతున్నాం. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని మనవి చేస్తున్నాను. -
విద్యుత్ శాఖలో వేధింపులు!
సాక్షి, అమరావతి: జనరల్ మేనేజర్ స్థాయి అధికారి, మరో అధికారి తమను వేధిస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్)లోని ముగ్గురు మహిళా ఉద్యోగులు ఉన్నతాధికారులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. తమను రాత్రి 11 గంటల వరకు కార్యాలయంలోనే ఉంచేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, విధి నిర్వహణలో ఉండగా అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని లేఖలో వారు పేర్కొన్నారు. పరస్పర అంగీకార బదిలీలకూ అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఇదే జనరల్ మేనేజర్ వేధింపులు తట్టుకోలేక గతంలో విశాఖ సర్కిల్ కార్యాలయంలో ఓ మహిళా ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేశారని, ఈ ఘటనలో జనరల్ మేనేజర్‌పై కేసు నమోదైందని, మరో అధికారిపై కూడా రాజమండ్రి, విశాఖపట్నంలో వేధింపుల ఫిర్యాదులు ఉన్నాయని వారు గుర్తు చేశారు. సీజీఎం స్థాయి అధికారి వారికి వత్తాసు పలుకుతుండటం తమను మరింతగా బాధిస్తోందని, తమను గానీ, వారిని గానీ బదిలీ చేసి ఈ వేధింపుల నుంచి విముక్తి కలిగించాలని, లేదంటే ఆత్మహత్యలే శరణ్యమని వారు సీఎండీని, ఇతర ఉన్నతాధికారులను విజ్ఞప్తి చేశారు. డిస్కంలో అధికారుల వేధింపులపై తమకు అందిన లిఖిత పూర్వక ఫిర్యాదు మేరకు విచాణకు ఆదేశించినట్లు ఏపీ ట్రాన్స్‌కో విజిలెన్స్ జాయింట్ మేనేజర్ కర్రి వెంకటేశ్వరరావు తెలిపారు. -
పశ్చిమ గోదావరి: ఎనర్జీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ తరఫున గ్రామ/ వార్డు సచివాలయాల్లో పనిచేసేందుకు ఎనర్జీ అసిస్టెంట్ (జూనియర్ లైన్మెన్ గ్రేడ్–2) పోస్టుల భర్తీ కోసం ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె.సంతోషరావు నోటిఫికేషన్ విడుదల చేశారు. డిస్కం పరిధిలో 398 పోస్టులను భర్తీ చేయనుండగా, వాటిలో ఏలూరు ఆపరేషన సర్కిల్ పరిధిలో 43 పోస్టులు ఉన్నాయి. వీటిలో 13 బ్యాక్లాగ్, 30 జనరల్ పోస్టులు. రెండేళ్ల కాలపరిమితికి ఎంపిక చేసే అభ్యర్థులకు నెలకు రూ.15 వేలు వేతనంగా చెల్లించనున్నారు. అభ్యర్థులు పదోతరగతితో పాటు ఎలక్ట్రికల్ ట్రేడ్ / వైర్‌మెన్ ట్రేడ్‌తో ఐటీఐ లేదా రెండేళ్ల ఒకేషనల్ ఇంటర్మీడియట్లో ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లయన్సెస్ అండ్ రివైండింగ్ కోర్సును పూర్తి చేసి ఉండాలన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 24లోపు తమ దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలని, అదే నెల 26 నుంచి 28 వరకు ఆన్లైన్ దరఖాస్తుల వివరాల్లో తేడాలను సరిచేసుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. అక్టోబర్ రెండో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు రాత పరీక్షకు సంబంధించి హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని, అక్టోబర్ 10న ఎంపిక చేసిన కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి 12.45 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఇవీ చదవండి: భర్తతో విడిపోయి, మరొకరితో సహజీవనం.. బాలికపై అత్యాచారం మహిళా పూజారి దారుణ హత్య. 38 రోజుల్లో నాలుగు హత్యలు -
ఇంధన ఆదా రూ. 2,350 కోట్లు!
సాక్షి, అమరావతి: ఇంధనాన్ని సమర్థవంతంగా వినియోగించడం, పొదుపు చేయడంలో ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన పనితీరును ప్రదర్శించింది. పారిశ్రామిక రంగంలో అమలు చేస్తున్న పాట్ (పెర్ఫార్మ్, అచీవ్, ట్రేడ్) పథకంలో భాగంగా సైకిల్–2లో 3,430 మిలియన్ యూనిట్ల విద్యుత్‌కు సమానమైన (0.295 మిలియన్ టన్స్ ఆఫ్ ఆయిల్ ఈక్వలెంట్ – ఏంటీవోఈ) ఇంధనాన్ని ఆదా చేసింది. దీని విలువ సుమారు రూ.2,350 కోట్లు ఉంటుంది. 1.38 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదలను తగ్గించగలిగింది. కేంద్ర విద్యుత్ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) ఈ వివరాలను అధికారికంగా ప్రకటించింది. పాట్ మొదటి దశతో పోల్చితే మన రాష్ట్రం పాట్ సైకిల్–2లో 40 శాతం ఎక్కువ ఇంధనాన్ని ఆదా చేసినట్లు బీఈఈ తెలిపింది. మొదటి దశలో ఏపీ 0.205 ఎంటీవోఈ ఇంధనాన్ని పొదుపు చేసింది. పారిశ్రామిక ఇంధన వినియోగంలో ఆధునిక విధానాలను అవలంబించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఈ ఘనత సాధించిందని బీఈఈ ప్రశంసించింది. ఈ మేరకు నిర్వహించిన వెబినార్‌లో ఇంధన పొదుపు సర్టిఫికెట్లను కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి అలోక్‌కుమార్ విడుదల చేసినట్లు రాష్ట్ర ఇంధన పర్యవేక్షణ మిషన్ సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి సోమవారం తెలిపారు. ఇంధన సామర్థ్య సాంకేతికతను అభివృద్ధి చేసి విస్తృతంగా వినియోగంలోకి తెస్తే భారీ పరిశ్రమలే కాకుండా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కూడా ప్రయోజనం పొందుతాయని వెబినార్‌లో అలోక్‌కుమార్ అన్నారు. బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్ బాక్రే మాట్లాడుతూ.. పాట్ అమలుకు రాష్ట్రాలకు సహకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్ర పరిశ్రమల శాఖతో కలిసి ప్రత్యేక పాట్ సెల్ ద్వారా పథకాన్ని పకడ్బందీగా అమలు చేసిన ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌ను ఈ సందర్భంగా అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంధన సామర్థ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని శ్రీకాంత్ వివరించారు. దీనివల్ల రాష్ట్రంలో ప్రతి కుటుంబం ప్రయోజనం పొందుతోందన్నారు. దేశవ్యాప్తంగా 542 పరిశ్రమల ఎంపిక దేశవ్యాప్తంగా పరిశ్రమల రంగంలో 11 సెక్టార్లకు సంబంధించిన 542 పరిశ్రమలను పాట్ సైకిల్–2లో ఎంపిక చేశారు. వాటిలో 349 పరిశ్రమలు ఇంధన పొదుపు లక్ష్యాలను సాధించాయి. వీటికి 57.38 లక్షల ఎనర్జీ సేవింగ్ సర్టిఫికెట్లను అందజేశారు. లక్ష్యాలు చేరుకోని 193 పరిశ్రమలు 36.67 లక్షల సర్టిఫికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంది. దేశవ్యాప్తంగా పాట్ సైకిల్–1లో 8.8 ఏంటీవోఈ ఇంధనం ఆదా చేయగా.. పాట్ సైకిల్–2లో 14.08 ఏంటీవోఈ ఆదా అయ్యింది.ఆయా పరిశ్రమలు పవర్ ఎక్సే్ఛంజీల్లో సర్టిఫికెట్లను విక్రయించడం ద్వారా లాభాలు ఆర్జించవచ్చు. పాట్ సైకిల్–2 ట్రేడింగ్ సెప్టెంబర్ చివరి నాటికి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. -
గ్రామాల్లో ఎల్ఈడీ వెలుగులు
సాక్షి, అమరావతి: గృహ వినియోగదారుల విద్యుత్ బిల్లులను తగ్గించేందుకు వీలుగా గ్రామాల్లో ఎల్ఈడీ బల్బుల వాడకాన్ని ప్రోత్సహించేందుకు రూపొందించిన గ్రామ ఉజాలా పథకాన్ని త్వరలోనే ఏపీలో అమలు చేయనున్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, ఏపీ సీడ్కోల సహకారంతో కేంద్ర ప్రభుత్వ సంస్థ కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (సీఈఎస్ఎల్) ఈ ఎల్ఈడీ బల్బుల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతుంది. ఈ పథకం అమలుపై చర్చించేందుకు సీఈఎస్ఎల్ ఎండీ మహువా ఆచార్య బుధవారం రాష్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిశారు. రాష్ట్రంలో పథకం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 450 కోట్లు వెచ్చించేందుకు అవకాశం ఉందని మహువా వివరించారు. ఈ పథకాన్ని ఇప్పటికే బిహార్, యూపీలో అమలు చేస్తున్నామని, ఇప్పుడు ఏపీలో ప్రారంభించడానికి అవసరమైన లాంఛనాలన్నీ పూర్తి చేసినట్టు తెలిపారు. గ్రామాల్లో నమూనా సర్వే కూడా పూర్తయిందన్నారు. ఎల్ఈడీ లైట్లు 75 శాతం తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తాయని, 25 రెట్లు ఎక్కువ కాలం పనిచేస్తాయని వివరించారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ఈ పథకం విజయవంతానికి వలంటీర్ల సేవలు వినియోగించుకుంటామన్నారు. గ్రామ ఉజాలా కార్యక్రమం ప్రారంభ తేదీ, వేదికను ఖరారు చేయాలని అధికారులకు మంత్రి పెద్దిరెడ్డి సూచించారు. అమలు ఎలా? ► ఈ పథకంలో భాగంగా అర్హులైన గ్రామీణ ప్రజల నుంచి వాళ్ల ఇళ్లలో ఇప్పుడు వినియోగిస్తున్న 60 వాట్, 100 వాట్ బల్బులను తీసుకొని వాటి స్థానంలో ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేస్తారు. ► ఒక్కో కుటుంబానికి గరిష్టంగా 5 ఎల్ఈడీ బల్బులను అందజేస్తారు. ► బహిరంగ మార్కెట్లో 7 వాట్ ఎల్ఈడీ బల్బు రూ.70, 12 వాట్ ఎల్ఈడీ బల్బు రూ.120 ధర ఉండగా.. కేవలం రూ. 10కే వాటిని అందజేస్తారు. లాభం ఇలా.. పథకం అమలుతో ప్రతి ఇంటికీ ఏడాదికి రూ. 600 నుంచి రూ.700 వరకు విద్యుత్ బిల్లుల ఖర్చు తగ్గే అవకాశం ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖకు అనుబంధంగా పనిచేసే స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఏస్‌ఈసీఎం) అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో విద్యుత్ డిమాండ్ ఏడాదికి 1,144 మెగా వాట్ల మేర తగ్గి, డిస్కంలకు లబ్ధి చేకూరుతుందన్నారు. మన రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 81,55,316 కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతాయని తెలిపారు. -
అక్రమ సంతానం అంటూ ఏమీ ఉండదు: కర్ణాటక హైకోర్టు
బెంగళూరు: అనైతిక బంధంతో పిల్లలకు జన్మనిచ్చేవారు ఉంటారేమోగానీ, అక్రమ సంతానం మాత్రం ఉండదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. తమ పుట్టుక ఎలా సంభవిస్తుందన్న విషయంతో పిల్లలకు ఎలాంటి సంబంధం ఉండదని పేర్కొంది. బెంగళూరు ఎలక్ట్రిసిటి సప్లై కంపెనీ(బీఈఎస్‌సీఓఎమ్)లో ఉద్యోగం నిమిత్తం ఓ వ్యక్తి దాఖలు పిటిషన్‌పై విచారణ చేపట్టిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది. వివరాలు... బీఈఎస్‌సీఓఎమ్‌లో పనిచేసే ఓ వ్యక్తి కొన్ని రోజుల క్రితం మరణించారు. ఈ క్రమంలో 2014లో ఆయన కుమారుడు కె. సంతోష కారుణ్య నియామకం కింద తండ్రి ఉద్యోగం తనకు ఇవ్వాల్సిందిగా సంస్థకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, సంతోష తన తండ్రికి రెండో భార్య ద్వారా జన్మించిన సంతానం. అది కూడా మొదటి భార్య ఉండగానే, తన తల్లిని తండ్రి వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తమ నిబంధనల ప్రకారం, సంతోష అర్జీని బీఈఎస్‌సీఓఎమ్ తిరస్కరించింది. దీంతో అతడు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. సింగిల్ బెంచ్ సంతోష పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ క్రమంలో తాజాగా అతడి అభ్యర్థనపై విచారణ చేపట్టిన జస్టిస్ బీవీ నాగరత్న, హంచాటె సంజీవ్‌కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం సంతోషకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా... ‘‘తల్లి, తండ్రి లేకుండా ఈ ప్రపంచంలో ఏ బిడ్డ జన్మించదు. అదే విధంగా పుట్టుకలో తన ప్రమేయం కూడా ఉండదు. కాబట్టి అనైతికంగా తల్లిదండ్రులుగా మారిన వారు ఉంటారేమో గానీ, అక్రమ సంతానం అనేది ఉండదు. ఈ కేసుకు సంబంధించి, వ్యక్తిగత చట్టాలను అనుసరించి.. అక్రమ సంతానం అనే పదం లేదు. అదే విధంగా.. హిందూ వివాహ చట్టం-1954 ప్రకారం చట్టబద్ధ, చట్టవిరుద్ధ పెళ్లిళ్ల ద్వారా జన్మించిన సంతానానికి సమాన హక్కులు అన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నియామకం విషయమై పునరాలోచన చేయాలని ఆదేశిస్తున్నాం’’ అని పేర్కొంది. అదే విధంగా.. కారుణ్య నియామకాలకు.. ఒక ఉద్యోగి మొదటి పెళ్లి రద్దు కాకుండానే, రెండో భార్య లేదా రెండో వివాహం ద్వారా జన్మించిన సంతానం అర్హులు కాలేరంటూ బీఈఎస్‌సీఓఎమ్ 2011, సెప్టెంబరు 23న జారీ చేసిన సర్కులర్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. -
8 కోట్ల ఖరీదైన కారు.. మరి 35 వేలకు కక్కుర్తి ఎందుకు?!
ముంబై: శివసేన నేత, కళ్యాణ్‌కు చెందిన వ్యాపారవేత్త సంజయ్ గైక్వాడ్‌కు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ‘‘ఖరీదైన కార్లలో తిరిగే మీకు.. ఇదేం దొంగ బుద్ధి.. సార్’’ అంటూ నెటిజన్లు ఆయనపై సెటైర్లు వేస్తున్నారు. బాధ్యతాయుతంగా ప్రవర్తించాలంటూ హితవు పలుకుతున్నారు. అసలేం జరిగిందంటే.. సంజయ్ గైక్వాడ్ విద్యుత్ చౌర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో మహారాష్ట్ర రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(ఎమ్‌ఎస్‌ఈడీసీఎల్) ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ వివరాల ప్రకారం.. తూర్పు కళ్యాణ్ ప్రాంతంలో గల కోక్సెవాడిలో ఉన్న గైక్వాడ్‌కు చెందిన కన్స్ట్రక్షన్ సైట్ వద్ద విద్యుత్ చైర్యం గురించి జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో రూ. 34,840 బిల్లుతో పాటు 15 వేల జరిమానా విధిస్తున్నట్లు నోటీసులు పంపించారు. అయినప్పటికీ ఆయన నుంచి ఎటువంటి స్పందనా రాకపోవడంతో.. జూన్ 30న ఎమ్‌ఎస్‌ఈడీసీఎల్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సోమవారం(జూలై 12)న సంజయ్ గైక్వాడ్ పెనాల్టితో కలిసి మొత్తం 49,840 రూపాయలు చెల్లించారు. ఈ మేరకు విద్యుత్ సంస్థ సోమవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక ఈ విషయంపై స్పందించిన శివసేన శ్రేణులు.. సంజయ్ గైక్వాడ్‌పై వచ్చిన ఆరోపణలు సరికావని, ఆయనకు విద్యుత్ చౌర్యంతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొనడం గమనార్హం. కాగా సంజయ్ గైక్వాడ్ ఇటీవలే సుమారు 8 కోట్ల రూపాయలు వెచ్చించి రోల్స్ రాయిస్ కారును సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కారు ఖరీదును ప్రస్తావిస్తూ నెటిజన్లు, రాజకీయ ప్రత్యర్థులు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. -
విద్యుత్ ఉద్యోగులపై పోలీసుల ప్రతాపం
సాక్షి ప్రతినిధి నల్లగొండ/హైదరాబాద్: ‘మేం విద్యుత్ ఉద్యోగులం, డ్యూటీకి వెళ్తున్నాం’అని చెప్పినా వినిపించుకోకుండా పోలీసులు వారిపై లాఠీలు ఝళిపించారు. మరో ఇద్దరు మహిళా ఉద్యోగులతో అనుచితంగా మాట్లాడారు. నల్లగొండలో చోటు చేసుకున్న ఈ ఘటనలపై ఉద్యోగులు ఆందోళన చేశారు. అదే సమయంలో పట్టణంలోని రామగిరి ప్రాంతంలోని రెండు ఫీడర్ల బ్రేక్‌డౌన్ కావడంతోపాటు పోలీస్ హెడ్‌క్వార్టర్స్, పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వివరాలు.. నాంపల్లిలో పని చేసే విద్యుత్ శాఖ జూనియర్ అసిస్టెంట్ ప్రభు విధినిర్వహణలో భాగంగా శుక్రవారం రాత్రి నల్లగొండలోని డివిజన్ ఆఫీసుకు వెళ్లి వస్తుండగా రామగిరిలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. శనివారం ఉదయం 10 గంటల తర్వాత ఈఆర్వో కార్యాలయానికి విధుల నిమిత్తం వెళ్తున్న అరుణను వెంకటేశ్వర కాలనీ వద్ద, జానకిని ఎన్టీఆర్ విగ్రహం వద్ద పోలీసులు అడ్డుకొని అనుచితంగా మాట్లాడారు. మనస్తాపం చెందిన ఉద్యోగులు ఈ విషయాన్ని ఎస్ఈకి ఫిర్యాదు చేశారు. అదేసమయంలో 11 గంటల ప్రాంతంలో రెండు ఫీడర్లు డౌన్ కావడంతో వాటికి మరమ్మతులు నిర్వహించేందుకు స్థానిక విద్యుత్ సిబ్బంది నిరాకరించారు. ఈ విషయాన్ని ఎస్ఈ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, కలెక్టర్ ఎస్పీతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. అనంతరం విద్యుత్ సిబ్బంది మరమ్మతులు నిర్వహించి సరఫరాను పునరుద్ధరించారు. పోలీసుల దురుసు ప్రవర్తనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విద్యుత్ శాఖ సేవలకు అడ్డుపడొద్దు: మంత్రి ఈ ఘటనలపై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సీరియస్ అయ్యారు. వెంటనే డీజీపీ మహేందర్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా ఎస్పీతో కూడా ఫోనులో మాట్లాడారు. విద్యుత్‌శాఖ అత్యవసర సర్వీస్ కిందికి వస్తుందని, ఆ శాఖ సేవలకు ఆటంకం కలిగించొద్దని మంత్రి సూచించారు. రాత్రింబవళ్లు పనిచేస్తున్న విద్యుత్ సిబ్బందిపై లాఠీచార్జ్ చేయడం సరి కాదని, పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలని, అదే సందర్భంలో లాక్డౌన్ నిబంధనలు కూడా కఠినంగా పాటించాలన్నారు. మితిమీరి ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మంత్రి సీరియస్ కావడంతో ఎస్పీ రంగనాథ్ స్పందించి విద్యుత్ ఉద్యోగులను ఆపొద్దని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. తీవ్రంగా ఖండిస్తున్నాం... 24 గంటలు పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగులను విచక్షణారహితంగా కొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని 1104 జిల్లా కార్యదర్శి నిమ్మచెట్ల వెంకటయ్య అన్నారు. తమను ప్రభుత్వం ఫ్రంట్‌లైన్ వారియర్లుగా గుర్తించిందని చెప్పారు. -
నల్గొండ జిల్లాలో పోలీసుల ఓవరాక్షన్
-
లాక్డౌన్: విద్యుత్ సిబ్బందికి ఇబ్బందులు.. మంత్రి ఫైర్
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ పేరిట పోలీసులు విద్యుత్ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్రంలో మే 12 నుంచి లాక్డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. అయితే లాక్డౌన్ నుంచి అత్యవసర సేవలకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. వాటిలో విద్యుత్ శాఖ కూడా ఉంది. ఈ నేపథ్యంలో నల్గొండలో లాక్డౌన్లో భాగంగా పోలీసులు విద్యుత్ సిబ్బందిని అడ్డుకుంటున్నారు. ఉద్యోగులు తమ ఐడీ కార్డులు చూపిస్తున్నా పోలీసులు వినిపించుకోవడమే గాక అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో శనివారం విద్యుత్ ఉద్యోగులు ఈ విషయాన్ని మంత్రి జగదీష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. కాగా నల్గొండ ఘటనపై జిల్లా ఎస్పీతో మాట్లాడిన మంత్రి అనంతరం డీజీపీతోనూ ఈ అంశంపై చర్చించారు. విద్యుత్‌శాఖ అత్యవసర సర్వీసు కిందకు వస్తుందన్నారు. విద్యుత్ ఉద్యోగులను ఇబ్బంది పెట్టకుండా చూడాలన్నారు. విద్యుత్ సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని మంత్రి జగదీష్ రెడ్డి కోరారు. చదవండి: లాక్డౌన్: చికెన్ వ్యాపారి కారుకు ప్రెస్ స్టిక్కర్.. చివరికి! -
విద్యుత్ సేవలన్నీ ‘ఆన్’లైన్
సాక్షి, అమరావతి: విద్యుత్ మీటర్ కోసం దరఖాస్తు చేయడం మొదలుకుని.. కట్టే బిల్లుల వరకూ అన్ని సేవలనూ ఆన్లైన్లోనే జరిపేందుకు అవసరమైన మార్పులు తేవాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. కరోనా వంటి కష్టకాలం వచ్చినా ఈ తరహా విధానం శ్రేయస్కరమని పేర్కొంది. దీనివల్ల విద్యుత్ వినియోగదారుల హక్కులకు తగిన భద్రత పెరుగుతుందని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల విద్యుత్ సంస్థలకు గతేడాది పంపించింది. కేంద్రం ముసాయిదాలోని అంశాలివీ ► కనెక్షన్ కోసం దరఖాస్తు, వాటి మంజూరు, డిస్కమ్ పరిధిలో ఉండే కనెక్షన్ల వివరాలన్నీ వెబ్సైట్లో ఉండాలి. ఆన్లైన్లోనే దరఖాస్తు చేసేలా ఏర్పాట్లు చేయాలి. దీనివల్ల జవాబుదారీతనం పెరుగుతుందని సూచించింది. అవసరమైతే డిస్కమ్‌లు మొబైల్ యాప్‌లను అందుబాటులోకి తేవాలి. కొత్త కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే.. మెట్రో సిటీల్లో 7 రోజుల్లో, మునిసిపాలిటీల్లో 15 రోజుల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 30 రోజుల్లో కనెక్షన్ ఇవ్వాలి. ► వినియోగదారుల ఇళ్లు లేదా వ్యాపార సంస్థలకు స్మార్ట్, ప్రీపెయిడ్ మీటర్లు అమర్చాలి. ప్రీపెయిడ్ సర్వీస్ తరహాలో ముందే డబ్బులు చెల్లించే విధానం ఇందులో ఉంటుంది. స్మార్ట్ మీటర్ల వల్ల ఆన్లైన్ ద్వారానే వినియోగం, సేవలు, నాణ్యత తెలుసుకోవచ్చు. ► మీటర్లను వినియోగదారులే కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఇవ్వాలి. ఇలాంటి మీటర్లను ఏపీఈఆర్సీ గుర్తించిన సంస్థ చేత ఎలాంటి ఫీజు తీసుకోకుండా పరీక్షించాలి. మీటర్ రీడింగ్, బిల్లింగ్ ప్రక్రియ మొత్తం వినియోగదారుడికి ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలి. డిస్కమ్‌లు బిల్ వివరాలను వినియోగదారుడికి ఎస్ఎంఎస్ ద్వారా పంపాలి. రూ.వెయ్యి దాటిన బిల్లును ఆన్లైన్ ద్వారా చెల్లించే ఏర్పాటు చేయాలి. బిల్లు కట్టలేదని సరఫరా నిలిపివేస్తే, బిల్లు చెల్లించిన వెంటనే పునరుద్ధరించాలి. లేనిపక్షంలో సంబం ధిత డిస్కమ్ జరిమానా చెల్లించాలి. ► తొలుత ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీ పెయిడ్ మీటర్లు బిగించాలి. ఇప్పటికే ఈ దిశగా డిస్కమ్‌లు అడుగులు వేస్తున్నాయి. క్రమంగా అన్ని వర్గాల వినియోగదారులకు విస్తరింపజేయాలి. నాణ్యత తప్పనిసరి ► వ్యవసాయ విద్యుత్ మినహా.. వినియోగదారులందరికీ 24 గంటలపాటు విద్యుత్ సరఫరా చేయాలి. విద్యుత్ అంతరాయాలను విధిగా ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలి. దీనికోసం సిస్టమ్ యావరేజ్ ఇంట్రప్షన్ డ్యూరేషన్ ఇండె క్స్, సిస్టమ్ యావరేజ్ ఇంట్రప్షన్ ఫ్రీక్వెన్సీ ఇండెక్స్‌ను అనుసరించాలి. ► వినియోగదారుల ఫిర్యాదులు, పరిష్కారం కూడా పారదర్శకంగా ఉండాలి. నాణ్యమైన సేవలు అందించని పక్షంలో డిస్కమ్‌లు వినియోగదారులకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇవన్నీ సక్రమంగా అమలయ్యేందుకు వీలుగా ఫిర్యాదుల విభాగాన్ని బలోపేతం చేయాలి. -
కరోనాతో కరెంటుకు డిమాండ్
సాక్షి, అమరావతి: కరోనా కారణంగా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ గరిష్ట స్థాయికి చేరుతోంది. నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి. రోజూ 228 మిలియన్ యూనిట్ (ఎంయూ)ల విద్యుత్ డిమాండ్ ఉంటోంది. సగటు విద్యుత్ వినియోగం 160 ఎంయూలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడం, కోవిడ్ ప్రభావం దీనికి కారణమని విద్యుత్ ఉన్నతాధికారులు తెలిపారు. కరోనా రోగులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్న నేపథ్యంలో వినియోగం ఎక్కువవుతోంది. మే మొదటి వారానికి డిమాండ్ రోజుకు 235 ఎంయూలు దాటొచ్చని భావిస్తున్నారు. ఆ డిమాండ్ మేరకు విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆ రెండు నగరాలే కీలకం! విజయవాడ, గుంటూరు నగరాలు, సీఆర్డీఏ పరిధిలో 2019 ఏప్రిల్‌లో 267.53 ఎంయూల విద్యుత్ డిమాండ్ రికార్డయితే.. 2020 ఏప్రిల్‌లో ఇది 388.38 ఎంయూలకు చేరింది. 2021 మేలో ఇది 450 ఎంయూలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. తర్వాత స్థానంలో తూర్పుగోదావరి జిల్లా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి కోవిడ్ కేసులు విజయవాడ, గుంటూరు నగరాల్లోని ఆస్పత్రులకే వస్తున్నాయి. ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రుల్లోను ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఎక్కువ విద్యుత్ వినియోగం అనివార్యమవుతోంది. అన్నిచోట్ల 24 గంటలూ ఏసీలు వినియోగిస్తున్నారు. పగటి వేళల్లో డిమాండ్ పెరిగి విద్యుత్ లోడ్ అత్యధికంగా ఉంటోంది. దీనికితోడు కార్యాలయాల సిబ్బంది ఇళ్ల నుంచే పనిచేస్తున్నారు. ప్రజలూ ఇల్లు దాటడం లేదు. ఫలితంగా గృహవిద్యుత్ వినియోగం 2019 కన్నా 20 శాతం ఎక్కువగా ఉందని సీపీడీసీఎల్ సీఎండీ పద్మా జనార్దన్‌రెడ్డి తెలిపారు. విద్యుత్ అంతరాయాల్లేకుండా ఏర్పాట్లు రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా విద్యుత్‌శాఖ అప్రమత్తమైంది. ఎలాంటి విద్యుత్ అంతరాయాలు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాం. ముఖ్యంగా కోవిడ్ సెంటర్లు, ఆస్పత్రులకు విద్యుత్ అంతరాయాలు లేకుండా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తి పెంచాం. అవసరమైతే మార్కెట్లో విద్యుత్ కొంటాం. ఎట్టి పరిస్థితుల్లోను వైద్యసేవలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని క్షేత్రస్థాయి సిబ్బందికి కచ్చితమైన ఆదేశాలు జారీచేశాం. – శ్రీకాంత్ నాగులాపల్లి, ఇంధనశాఖ కార్యదర్శి ఆ రెండు నగరాలపై దృష్టి విజయవాడ, గుంటూరు నగరాల్లో వైద్యసేవలను దృష్టిలో ఉంచుకుని సిబ్బంది నిరంతర సేవలు అందించేందుకు సిద్ధమయ్యారు. ఉన్నతస్థాయిలో పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. జోన్ల వారీగా పర్యవేక్షక బృందాలను ఏర్పాటు చేశాం. లోడ్ పెరిగినా విద్యుత్ సరఫరాకు ఆటకం రావడం లేదు. మేలో మరింత అప్రమత్తంగా ఉంటాం. – పద్మా జనార్దన్‌రెడ్డి, సీఎండీ, సీపీడీసీఎల్ -
ట్రాన్స్ఫార్మర్లు ఇక చల్లగా..!
సాక్షి, అమరావతి: వేసవిలో నిరంతరాయంగా విద్యుత్‌ను అందించేందుకు ఆ శాఖ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని రెండేళ్లుగా గణనీయంగా పెంచింది. సాధారణంగా వేసవిలో ట్రాన్స్ఫార్మర్లపై అత్యధిక లోడ్ పడుతుంది. దీంతో అవి తేలికగా వేడెక్కి, కాలిపోవడమో లేదా ట్రిప్ అయి ఆగిపోవడమో జరుగుతుంటాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. ఈ నేపథ్యంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వాస్తవ లోడ్‌ను క్షేత్రస్థాయి సిబ్బంది ముందే అంచనా వేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైతే వేడిని తగ్గించేందుకు కొద్దిసేపు కొన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. సాధారణంగా ఉష్ణోగ్రత 42 డిగ్రీలు దాటినప్పుడు ట్రాన్స్ఫార్మర్లలో వేడి విపరీతంగా పెరుగుతుంది. ఎక్కువ సామర్థ్యం గల ట్రాన్స్‌కో ట్రాన్స్ఫార్మర్లలో లోడ్ ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్‌గా అందులో ఉండే ఫ్యాన్లు ఆన్ అయ్యి వాటిని కూల్ చేస్తాయి. వినియోగదారులకు అందించే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను కూడా ఇదే తరహాలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ పద్మజనార్థన్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం లోడ్‌ను కంట్రోల్ చేయడం ద్వారానే వేడిని అదుపు చేస్తున్నామని చెప్పారు. 45 డిగ్రీల ఉష్ణోగ్రత వచ్చినప్పుడు ఎక్కువ లోడ్ ఉండే ప్రాంతాలను గుర్తించి నియంత్రించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఉష్ణోగ్రతకు గురవ్వకుండా ఆయిల్ మార్పిడి వేసవి ముందే రాష్ట్రంలోని అన్ని ట్రాన్స్ఫార్మర్ల స్థితిని అంచనా వేసినట్లు ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ ఉష్ణోగ్రతకు గురవ్వకుండా ముందే ఆయిల్ మార్పు చేయాలని సిబ్బందికి ఆదేశాలిచ్చామని చెప్పారు. తరచూ చెడిపోతున్న, కాలిపోయే వాటి స్థానంలో కొత్తవి అమర్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. -
గ్రామ సచివాలయాలకు వీధి దీపాల బాధ్యత
సాక్షి, అమరావతి: పల్లెల్లోని ఎల్ఈడీ వీధి దీపాల నిర్వహణ బాధ్యతలను గ్రామ సచివాలయాలకు అప్పగించబోతున్నారు. ఈ నెల 31న అధికారికంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర ఇంధన శాఖ వెల్లడించింది. ప్రభుత్వ సేవలను ‘జగనన్న పల్లె వెలుగు’ పేరుతో ప్రజల ముంగిటకే తెస్తున్న సర్కారు.. రాత్రి వేళ ప్రతీ వీధి దీపం వెలగాలన్న లక్ష్యంతోనే కీలక అడుగువేసిందని రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈఓ ఎ. చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వీధి దీపాల పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిర్వహణ లోపాలతో.. కేంద్ర ఇంధన పొదుపు సంస్థ అయిన ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) 10,382 గ్రామ పంచాయతీల్లో 23.29 లక్షల ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పాటుచేసింది. ఈ పథకం కిందలేని 2,303 గ్రామ పంచాయతీల్లోనూ అదనంగా 4 లక్షల ఎల్ఈడీ వీధి దీపాలు అమర్చాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. ఇప్పటివరకూ వీధి దీపాల నిర్వహణ బాధ్యత ఈఈఎస్ఎల్ నియమించిన కాంట్రాక్టు సంస్థ పరిధిలో ఉండేది. కానీ, దీనివల్ల అనేక సమస్యలొస్తున్నాయి. వెలగని, కాలిపోయిన వీధి దీపాలను మార్చడంలేదన్న విమర్శలొస్తున్నాయి. ఫలితంగా పల్లెల్లో కారుచీకట్లు నెలకొంటున్నాయని ఫిర్యాదులొస్తున్నాయి. వీటిపై ఇటీవల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్షించారు. గ్రామ సచివాలయాల్లో 7 వేల మంది ఎనర్జీ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవస్థకు వీధి దీపాల నిర్వహణ బాధ్యత అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 48 గంటల్లోనే రిపేర్ వీధి దీపాల నిర్వహణకు అధికారులు ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. వెలగని వీధి దీపంపై ఈ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పిస్తున్నారు. గ్రామ సచివాలయాలకు వీధి దీపాల పోర్టల్ లింక్ అయి ఉంటుంది. వీటిద్వారా వచ్చిన ఫిర్యాదులను ఎనర్జీ అసిస్టెంట్లు, గ్రామ వలంటీర్లు పరిశీలించి తక్షణమే స్పందిస్తారు. ఫిర్యాదు అందిన 48 గంటల్లో దానిని రిపేర్ చేయాల్సి ఉంటుందని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఎనర్జీ అసిస్టెంట్లకు ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు ఇంధన శాఖ వెల్లడించింది. ఇక కాలిపోయిన, చెడిపోయిన లైట్లను మార్చుకునేలా ప్రతీ పంచాయతీ పరిధిలో కొన్ని లైట్లు అందుబాటులో ఉంచనున్నారు. -
ఏపీని ఆదర్శంగా తీసుకోండి
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని నియంత్రించడంలో ఆంధ్రప్రదేశ్ పురోగతిని కేంద్రం ప్రశంసించింది. ఏపీ ప్రభుత్వం సాధించిన విజయాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాల దృష్టికి తీసుకెళ్లిన కేంద్ర విద్యుత్ శాఖ అన్ని రాష్ట్రాలు ఏపీని ఆదర్శంగా తీసుకోవాలని సూచించింది. ఈ నెల 20న నీతి ఆయోగ్ సమావేశం జరగనున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఉన్నతాధికారులతో శనివారం వర్చువల్ పద్ధతిలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి అలోక్‌కుమార్ రాష్ట్ర విద్యుత్ శాఖ పురోగతిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. చౌక విద్యుత్‌కే అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్ ముందుందని, గత ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకూ విద్యుత్ కొనుగోళ్లలో దాదాపు రూ.వెయ్యి కోట్లను ఆంధ్రప్రదేశ్ ఆదా చేసిందని తెలిపారు. పక్కా ప్రణాళిక వల్లే.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యుత్ సంస్థలను గట్టెక్కించే ప్రయత్నం ముమ్మరంగా జరుగుతోంది. పక్కా ప్రణాళికతో వ్యవహరించడంతో 2020–21లో విద్యుత్ కొనుగోలు ఖర్చులో రూ.1,023.80 కోట్లు ఆదా అయ్యింది. ఒక యూనిట్ విద్యుత్‌ను రూ.4.55 వరకూ కొనుగోలు చేసేలా విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతించింది. విద్యుత్ సంస్థలు కొనుగోలు ధరను రూ.3.12 వరకూ తగ్గించగలిగాయి. టీడీపీ హయాంలో ప్రైవేట్ సంస్థల జేబులు నింపేందుకు అత్యధిక రేట్లకు విద్యుత్‌ను కొన్నారు. మార్కెట్లో తక్కువకు వస్తున్నా పట్టించుకోలేదు. యూనిట్‌కు రూ.5.56 వరకూ గరిష్ట ధర చెల్లించారు. ప్రణాళిక లేకపోవడం వల్ల పీక్ అవర్స్‌లో యూనిట్‌కు రూ. 8 పైగా వెచ్చించిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీనివల్ల విద్యుత్ సంస్థలు కోలుకోలేని స్థాయిలో అప్పుల ఊబిలో చిక్కుకుపోయాయి. -
నేడో రేపో భృతి
సాక్షి, హైదరాబాద్ : నిరుద్యోగభృతి, ఉద్యోగాల భర్తీపై ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కె.తారకరామారావు సూచనప్రాయంగా సంకేతాలిచ్చారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రేపో మాపో నిరుద్యోగ భృతిపైనా ప్రకటన చేస్తారని కేటీఆర్ వెల్లడించారు. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థల్లో 50 వేల ఉద్యోగాల భర్తీకి కూడా త్వరలో నోటిఫి3 కేషన్ వెలువడుతుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం (టీఆర్వీకేఎస్)లో తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం (టీఎన్‌వీకేఎస్) విలీనమైన సందర్భంగా గురువారం ఇక్కడ తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో విద్యుత్‌శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డితో కలసి కేటీఆర్ పాల్గొ న్నారు. ‘ఆరున్నరేండ్లలో టీఎస్పీఎస్సీ ద్వారా 36 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేయడంతోపాటు ప్రభుత్వశాఖల్లో అదనంగా మరో 45 వేల ఉద్యో గాలు ఇచ్చాం. జెన్కో, సింగరేణి లాంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇచ్చిన ఉద్యోగాలను కలుపుకుంటే రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొత్తం 1.31 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం. పారిశ్రామిక విధానం ద్వారా రూ.2.05 లక్షల కోట్ల పెట్టుబడులతో కూడిన 14 వేలకుపైగా పరిశ్రమలకు అనుమతులివ్వగా, సుమారు 14.50 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించింది’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ‘కొత్తగా మతం పుచ్చుకున్నోడు ఒళ్లంత బూడిద పూసు కున్నట్లు.. నిన్న, ఇవాళ కండ్లు తెరచిన కొందరు నేతలు రెచ్చిపోయి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. సీఎం వయసును, తెలంగాణ తెచ్చిన విషయాన్ని మరచిపోయి విమర్శిస్తున్నారు. కేసీఆర్ లేకపోతే వీళ్ల బతుక్కి పదవులు కూడా లేవు. ఒకాయన టీపీసీసీ అధ్యక్షుడు.. ఇంకొకాయన టీబీజేపీ అధ్యక్షుడు. ఎగిరి పడు తున్న నాయకులారా.. కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చింది. ఆయన వల్ల మీకు పదవులు వచ్చాయి. ప్రతిదానికి హద్దు ఉంటుంది’ అని కేటీఆర్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. విద్యుత్ రంగంలో తెలంగాణ ఘనవిజయం రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 450 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రాకు అప్పగించినా, విద్యుత్ సమస్యను సవాలుగా తీసుకుని సీఎం కేసీఆర్ పరిష్కరించారని కేఆటీర్ వ్యాఖ్యానించారు. 2014కు ముందు తెలంగాణలో స్థాపిత విద్యుత్ సామర్థ్యం 7 వేల మెగావాట్లు కాగా, సీఎం దూరదృష్టితో ప్రస్తుతం అది 16 వేల మెగావాట్లకు చేరిందన్నారు. దామరచర్ల, ఎన్టీపీసీలో అల్ట్రా మెగావపర్ ప్రాజెక్టుల నిర్మాణం జరుగతోందని, గ్రీన్, రెన్యూవల్ ఎనర్జీ ఉత్పాదనలో 4 వేలకుపై చిలుకు మెగావాట్ల సామర్థ్యంతో తెలంగాణ దేశంలో రెండోస్థానంలో ఉందని చెప్పారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుందని, కరోనా మూలంగా ఆర్థికాభివృద్ధి మందగించినా ఉద్యోగులకు ఇచ్చిన ప్రతిమాటను నిలబెట్టుకుంటామని చెప్పారు. ఆరేండ్ల వ్యవధిలోనే విద్యుత్ సంస్థల్లో 9 వేలకుపైగా కొత్త ఉద్యోగాలు ఇవ్వడంతోపాటు, 23 వేలకుపైగా తాత్కాలిక ఉద్యోగులను పర్మనెంట్ చేసిన విషయాన్ని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి గుర్తుచేశారు. సమావేశంలో మాజీమంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ నేతలు తక్కళ్లపల్లి రవీందర్రావు, బండి రమేశ్, టీఆర్వీకేఎస్ నేతలు జాన్సన్, రమేశ్, ప్రకాశ్, టీఎన్‌వీకేఎస్ నాయకులు మహేందర్, రాంబాబు, టీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు రాంబాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
భళా.. భారతి!
తొర్రూరు: పురుషులకు మాత్రమే పరిమితమైన విద్యుత్ లైన్మెన్ పోస్టును తొలిసారి ఓ గిరిజన యువతి చేజిక్కించుకుంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం బోజ్యా తండా పంచాయతీ పరిధిలోని దేశ్యా తండాకు చెందిన వాంకుడోతు భారతి దేశంలోనే తొలి జూనియర్ లైన్ వుమెన్‌గా ఎంపికై రికార్డు సృష్టించింది. 2019లో రాష్ట్ర ప్రభుత్వం లైన్మెన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయగా.. మహబూబాబాద్ జిల్లా నుంచి భారతి దరఖాస్తు చేసుకుంది. అయితే, ఈ పోస్టులకు పురుషులు మాత్రమే అర్హులని, మహిళా అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించలేమని అధికారులు సెలవిచ్చారు. అయినా వెనక్కు తగ్గని భారతి హైకోర్టును ఆశ్రయించగా.. మహిళలను కూడా లైన్ వుమెన్ ఉద్యోగాలకు పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. దీం తో అధికారులు మహిళా అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించారు. ఇందులో క్లిష్టమైన స్తంభాలు ఎక్కే పరీక్షలో కూడా ప్రతిభ కనబరిచిన భారతి జూనియర్ లైన్ వుమెన్ ఉద్యోగానికి ఎంపికైంది. ఈమెతో పాటు సిద్దిపేట జిల్లాకు చెందిన బబ్బూరి శిరీష కూడా ఉద్యోగాన్ని సాధించింది. లంబాడ సామాజిక వర్గానికి చెందిన తనకు చెట్లు ఎక్కడం, వ్యవసాయ పనులు చేయడం అలవాటేనని, ఆ ధైర్యంతోనే తాను స్తంభాలు ఎక్కగలనని కోర్టుకు, ప్రభుత్వానికి విన్నవించుకున్నానని భారతి చెప్పారు. తాను ఉద్యోగానికి ఎంపికైనట్లు ఇప్పటికే సమాచారం అందిందని, ప్రభుత్వం నుంచి నియామక పత్రం రాగానే ఉద్యోగంలో చేరి విధులు నిర్వర్తిస్తానని తెలిపింది. కాగా, భారతి భర్త మోహన్ ప్రైవేటు ఉద్యోగి. వీరికి ఎనిమిదేళ్ల సాయితేజ, నాలుగేళ్ల శాన్విశ్రీ సంతానం. -
ఆ పేర్లలోనే ఏదో కరెంట్ ఉంది
భారతి, శిరీష... ఆ పేర్లలోనే ఏదో కరెంట్ ఉంది.‘చెట్టులెక్కగలవా ఓ నరహరి’ అని చెంచిత అడిగింది.నరహరి అడగలేదు.ఎందుకంటే చెంచితకు చెట్టులెక్కడం రాదు.. పుట్టలెక్కడం రాదు అని జనాభిప్రాయం.చెట్లే ఎక్కలేని స్త్రీలు కరెంట్ పోల్ ఏమెక్కుతారని కూడా చాలా ఏళ్లుగా అభిప్రాయం.‘మేము ఎక్కగలం’ అన్నారు భారతి, శిరీష.లైన్లను దారిలో పెట్టగలం అని పెట్టి మరీ చూపిస్తున్నారు.ఉమెన్ పవర్ అంటే ఏమిటో కాదు. ఇటువంటి స్త్రీలు చూపేదే. పల్లెటూరులో పుట్టి పెరిగిన ఇద్దరు యువతులు కొత్త చరిత్రకు నాంది పలికారు. విద్యుత్ శాఖలో మహిళలు చేయలేరని భావించే లైన్మెన్ ఉద్యోగానికి రాష్ట్రంలో తొలిసారిగా ఎంపికై ఎంతోమందికి వెలుగు బాట చూపారు. లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో అవరోధాలు ఎదురైనా పట్టుదల తో ముందుకు సాగారు. కోర్టును ఆశ్రయించి అనుకున్నది సాధించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం దేశ్యా తండాకు చెందిన 32 ఏళ్ల వాంకుడోతు భారతి, సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం గణేష్‌పల్లి గ్రామానికి చెందిన 20 ఏళ్ల బబ్బూరి శిరీషల విజయగాథ ఇది. తల్లి, మేనమామతో శిరీష ఇంతకాలం పురుషులకే పరిమితమైన విద్యుత్ లైన్మెన్ పోస్టును మహిళలుగా తొలిసారి మీరు చేజిక్కించుకోవడం ఎలా ఉంది? భారతి: చాలా ఆనందంగా ఉంది. ముందు ఉద్యోగం కోసం చాలా సాధారణంగానే అన్ని ప్రయత్నాలు చేశా. కానీ, ఇలా అందరూ అభినందనలు చెబుతుంటే గర్వంగా కూడా ఉంది. శిరీష: మేం పడిన కష్టానికి ఫలితం దక్కిందనిపించింది. ఈ ఉద్యోగాన్నే ఎంచుకోవడానికి కారణం? భారతి: తండాలో పుట్టి పెరిగాను. గిరిజనులమైన మాకు వ్యవసాయమే ఆధారం. అయినా, ఎంకామ్ వరకు చదువుకున్నాను. ఐటిఐ చేస్తే ఉద్యోగావకాశాలు పెరుగుతాయనీ అదీ పూర్తి చేశాను. గవర్నమెంటు ఉద్యోగాలకు ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఆ క్రమంలోనే లైన్మెన్ నోటిఫికేషన్ గురించి తెలిసింది. చిన్నప్పటి నుంచీ పొలాల్లో చెట్లు ఎక్కాను, నాట్లేశాను, కలుపుతీశాను, ఎండవానలు తేడా లేకుండా పనులు చేశాను. లైన్‌మన్ ఉద్యోగం చేయడం పెద్ద కష్టం అనిపించలేదు. శిరీష: మా అమ్మ నాన్నలకు నేనొక్కదాన్నే కూతురును. మాకు ఎలాంటి ఆస్తిపాస్తుల్లేవు. రెక్కలకష్టమే జీవనాధారం. ఊళ్లో పనులు దొరక్క నా చిన్నప్పుడే అమ్మనాన్నలు మేడ్చల్‌కు వలసవెళ్లారు. అక్కడి కంపెనీల్లో కూలి పనులు చేస్తూ పూటగడుపుకునేవారు. మేడ్చల్‌లోని ప్రభుత్వ పాఠశాలలో పదవతరగతి చదివా. ఆ తర్వాత పరిస్థితుల కారణంగా తిరిగి ఊరికి వెళ్లిపోయాం. ఊళ్లోనే ఉంటున్న నాకు మా మేనమామ చెప్పడంతో ఐటిఐ పూర్తిచేశాను. ఆ తర్వాత అంబేద్కర్ యూనివర్శిటీ నుంచి డిగ్రీ చేస్తూ, ఈ ఉద్యోగానికి అప్లై చేశాను. ఈ ఉద్యోగం ఆడవాళ్లు చేయదగినది కాదు అని నాకు ఎంతమాత్రం అనిపించలేదు. లైన్మెన్ పోస్టుల్లో మహిళా అభ్యర్థులకు అవకాశమే లేదన్నారు. మరి ఆ అవరోధాలను ఎలా ఎదుర్కొన్నారు? భారతి: 2019 సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ వచ్చింది. అందులో స్త్రీలు అప్లయ్ చేసుకోవడానికి అసలు ఆప్షనే లేదు. అన్ని రంగాల్లో స్త్రీలకు 33 శాతం అవకాశాలు ఉన్నాయంటారు, మరి దీనికి ఎందుకు లేదు అని కోర్టుకు వెళ్లాను. కోర్టు పర్మిషన్ ఇచ్చింది. రిటన్ టెస్ట్ అయిపోయింది. పోల్ టెస్ట్‌కి మళ్లీ అడ్డంకులు. మళ్లీ కోర్టుకు వెళ్లాం. భవిష్యత్తులో న్యాయం చేయాలని బెంచ్ తీర్పునిచ్చింది. ఈ కాపీని తీసుకెళ్లి సంబంధిత అధికారులకు చూపించగా... ‘కోర్టు తీర్పు భవిష్యత్తులో అని ఉందిగా...తర్వాత చూద్దాంలే...’ అని దాట వేశారు. మళ్లీ కోర్టుకు వెళ్లాం. గడువు లోపల పోల్ టెస్ట్ పెట్టి, కంప్లీట్ చేయమని మళ్లీ కోర్టు అదేశాలు ఇచ్చింది. ఆ టెస్ట్‌లో 1 మినిట్లోపు పోల్ ఎక్కి దిగాలి. అందులో పాసయ్యాను. అధికారులు అభినందించి, ఎంపికైనట్టు చెప్పారు. శిరీష: ఈ పోస్టుకు దరఖాస్తుచేసే సమయంలో మహిళలకు అప్షన్ లేకపోవడం చాలా ఆందోళనగా అనిపించింది. ఈ రోజుల్లో ఇంకా మగ–ఆడ తేడా చూపే ఉద్యోగాలు ఉన్నాయా అనుకున్నాను. మొత్తానికి కోర్టుకు వెళ్లడంతో పర్మిషన్ వచ్చింది. కిందటి నెల 23న హైద్రాబాద్ యూసుఫ్‌గూడలోని సీపీటీఐ (సెంట్రల్ పవర్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్)లో విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో పోల్ క్లైంబింగ్ పరీక్ష నిర్వహించడంతో విజయవంతంగా పరీక్షలో నెగ్గాను. విద్యుత్ స్తంభాలు ఎక్కడం, దిగడం... ఈ పనులు మీరెలా నేర్చుకున్నారు? భారతి: ఇద్దరు పిల్లల తల్లిని. ఎనిమిదేళ్ల కొడుకు, నాలుగేళ్ల కూతురు ఉన్నారు నాకు. తండాల్లో పుట్టి పెరిగినదాన్ని. చెట్లు ఎక్కి దిగడం చిన్నప్పటి నుంచీ నాకు అలవాటే. ఆ ధైర్యంతోనే స్తంభాలు ఎక్కగలనని కోర్టుకు విన్నవించుకున్నా. అయినా పోల్ టెస్ట్‌కు ముందు వరంగల్‌లోని ఎన్పీసిఎల్ గ్రౌండ్లో నెల రోజుల పాటు రోజూ ఉదయం సాయంత్రం ప్రాక్టీస్ చేశాను. శిరీష: మా మేనమామ శేఖర్‌గౌడ్ ప్రత్యేకంగా తర్ఫీదునిచ్చాడు. ఇంట్లో తాడుతో స్తంభాలు ఎక్కే విధానం, ఆ తర్వాత ప్రజ్ఞాపూర్‌లోని సబ్‌స్టేషన్ లో పోల్ ఎక్కడం నేర్పాడు. రేషన్ బియ్యం తప్ప ఇతర పోషకాహారం లభించని దయనీయ స్థితిలో ఉన్న నాకు ఫిజికల్ ఫిట్నెస్ కోసం పోషకాహారం సమకూర్చాడు. దాదాపు ఆరునెలలు సాధన చేశాను. ఎంతో ఆత్మవిశ్వాసం, అంతకుమించి ధైర్యం తో లైన్మెన్ ఉద్యోగంలో చేరిన వీరికి అభినందనలు చెబుదాం. కష్టమేమీ కాదు.. పేదరికంలో ఎన్నో కష్టాలు పడ్డాను. వాటి ముందు స్తంభాలు ఎక్కి, ఎలక్ట్రికల్ పనులు చేయడం పెద్ద కష్టమేమీ అనిపించలేదు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిరుత్సాహపడలేదు. మొండిగా కోర్టు చుట్టూ తిరిగా. గవర్నర్ అభినందించడం జీవితంలో మరిచిపోలేను. – బబ్బూరి శిరీష నిమిషంలో పోల్ టెస్ట్ పాస్ నా చిన్నతనంలో తండా నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూల్‌కి నడిచివెళ్లేదాన్ని. ఇంటర్ దేరుట్ల కాలేజీలో, డిగ్రీ భద్రాచలంలో గవర్నమెంట్ కాలేజీలో, ఎంకామ్ కేయూ యూనివర్శిటీలో చదివాను. పద్దెనిమిదేళ్ల క్రితం పెళ్లయ్యింది. పిల్లలు పుట్టాక అత్తగారింటివద్దే వ్యవసాయపనులు చేసుకుంటూ ఉండిపోయాను. అయినా, ప్రతీ ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. లైన్‌మన్ జాబ్ ఇన్నాళ్లకు వచ్చింది. రోజు మొత్తం వ్యవసాయం పనులు చేయడం వల్ల నిమిషంలో పోల్ ఎక్కడం పెద్ద కష్టమేమీ అనిపించలేదు. – వాంకుడోతు భారతి – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఇన్పుట్స్: – వై.సురేందర్, సాక్షి, గజ్వేల్ ఫొటోలు: కె.సతీష్, సిద్దిపేట Telangana's 1st linewoman : 20 years old Sirisha cracked the junior lineman Exam by TSSPDCL to become 1st linewoman in Telanagana Congratulations Sirisha proud of your accomplishments #womenempowerment @PMOIndia @MinistryWCD @IPRTelangana @PIBHyderabad @airnews_hyd @DDYadagiri — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) January 2, 2021