
గచ్చిబౌలి: అవినీతికి పాల్పడిన అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం టీజీఎస్‌పీడీసీఎల్ గచ్చిబౌలి ఆపరేషన్స్ విద్యుత్ ఏడీఈ కె.సతీష్ కార్యాలయంలో ఉన్న సమయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కార్యాలయంలోని టేబుల్ డెస్‌్కలో రూ.50 వేలను గుర్తించి స్వాదీనం చేసుకున్నారు.
గచ్చిబౌలి డివిజన్‌లోని గోపన్‌పల్లిలో ఓ ఇంట్లో ట్రాన్స్‌ఫార్మర్, సీటీ మీటర్ బిగించడానికి ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టర్ శివారెడ్డి ఏర్పాట్లు చేసుకున్నారు. వీటిని ఏర్పాటు చేసేందుకు రూ.75 వేలు ఇవ్వాలని ఏడీఈ సతీష్ డిమాండ్ చేశాడు. దీంతో మొదట రూ.25 వేలు తీసుకున్నాడు. మిగతా రూ.50వేలు శుక్రవారం అందించగా తీసుకొని టేబుల్ డెస్క్‌లో పెట్టారు. ఇదే సమయంలో ఏసీబీ అధికారులు కార్యాలయానికి చేరుకొని తనిఖీలు చేయగా కెమికల్‌తో కూడిన డబ్బులు డెస్‌్కలో దొరకడంతో స్వా«దీనం చేసుకొని సతీష్ ను నాంపల్లిలోని ఏసీబీ కోర్టుకు తరలించారు.
రూ. 100 కోట్లకుపైనే అక్రమాస్తులు
హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో 22 ఎకరాల వ్యవసాయ భూమి, ఓపెన్ ప్లాట్లు, విల్లా, భవనాలు సదరు అధికారికి ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ స్థిరాస్తుల మార్కెట్ విలువ రూ. 100 కోట్లకుపైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
అవినీతి సమాచారాన్ని టోల్‌ఫ్రీ నంబర్ 1064కు అందించాలి..
ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు అవినీతికి పాల్పడితే వెంటనే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు సమాచారం అందించాలని ఏసీబీ అధికారులు సూచించారు. సోషల్ మీడియా వాట్సప్ నంబర్ 94404 46106కు సైతం సమాచారం అందించవచ్చన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వారు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment