మహిలామణులు! | Women who excel as judges | Sakshi
Sakshi News home page

మహిలామణులు!

Published Mon, Apr 14 2025 5:48 AM | Last Updated on Mon, Apr 14 2025 12:05 PM

Women who excel as judges

న్యాయమూర్తులుగా రాణిస్తున్న  స్త్రీలు

భవిష్యత్‌లో ఈ సంఖ్య మరింత పెరిగే చాన్స్‌.. 

న్యాయం అర్ధించడం నుంచి అందించే స్థాయికి.. 

రోజూ వందల తీర్పులిస్తూ దేశానికే స్ఫూర్తి

జిల్లా కోర్టుల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం జిల్లా జడ్జీల్లో 60 శాతం వరకు మహిళలున్నారు. భవిష్యత్‌లో రాష్ట్రంలోని న్యాయవ్యవస్థలో పురుషుల కోసం 30% రిజర్వు చేయాల్సిన పరిస్థితి రావొచ్చు (నవ్వుతూ).
జస్టిస్‌ సుజోయ్‌పాల్, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి

లింగ భేదానికి తావులేకుండా తమను తాము నిరూపించుకున్నప్పుడే మహిళలు నిజంగా సంతోషంగా ఉంటారు. కోర్టులకొచ్చే ప్రజలు న్యాయమూర్తి పురుషుడా.. మహిళా.. అని చూడటం లేదు. న్యాయం అందుతోందా? లేదా? అనేదే చూస్తున్నారు.  
జస్టిస్‌ మౌషుమిభట్టాచార్య, హైకోర్టు న్యాయమూర్తి

సాక్షి, హైదరాబాద్‌: కోర్టు అనగానే న్యాయదేవతే అందరికీ గుర్తొస్తుంది. కానీ, చాలా ఏళ్లు పురుషాధిక్యతే కొనసాగింది. ఇప్పుడు న్యాయవ్యవస్థ తమదే అంటూ సాగిపోతున్నారు మహిళలు. కేవలం చిహ్నానికే పరిమితం కాకుండా మహిళలు న్యాయదేవతలుగా అవతరిస్తున్నారు. న్యాయం అరి్థంచే స్థాయి నుంచి న్యాయం అందించే స్థాయికి ఎదుగుతున్నారు. ఈ విషయంలో దేశానికి తెలంగాణ (Telangana) స్ఫూర్తిగా నిలుస్తోంది. 

జిల్లా, కింది కోర్టుల జడ్జీల్లో 56 శాతం మహిళలే న్యాయం అందిస్తున్నారు. ఉన్నత న్యాయస్థానంలోనూ 33 శాతంతో ముఖ్యమైన కేసుల్లోనూ తీర్పులిస్తున్నారు. భవిష్యత్‌లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. మహిళలకు న్యాయవాదిగా ఎన్‌రోల్‌ చేసుకునే హక్కులేదని చెప్పిన ఈ దేశంలోనే పురుషులను మించి సత్తా చాటుకుంటున్నారు. రోజూ వందల తీర్పులిస్తున్న న్యాయదేవతలపై ప్రత్యేక కథనం. 

మహిళా న్యాయవాదా? కుదరదు.. 
కోల్‌కతాకు చెందిన రెజీనా గుహ న్యాయవిద్య పూర్తి చేసుకుని, అలీపూర్‌ జిల్లా జడ్జి కోర్టులో ప్లీడర్‌ (లాయర్‌)గా చేరడానికి 1916లో దరఖాస్తు చేసుకున్నారు. అప్పట్లో అదో పెద్ద వింత. మహిళలు నమోదు చేసుకోవడానికి అనుమతి లేదంటూ ఆమె దరఖాస్తును తిరస్కరించారు. ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ రెజీనా కలకత్తా హైకోర్టులో పిటిషన్‌ వేశారు. లీగల్‌ ప్రాక్టీషనర్స్‌ యాక్ట్‌.. అర్హత కలిగిన ‘వ్యక్తులు’ న్యాయవాదులుగా నమోదు చేసుకోవడానికి అనుమతిస్తుందని పేర్కొన్నారు. వ్యక్తి అంటే మహిళ అని కూడా అర్థం అని నివేదించారు. అయితే విచిత్రంగా ఆమె పిటిషన్‌ను నాటి కోర్టు కొట్టివేసింది.  

హైకోర్టు జడ్జీగా పదవిని స్వీకరించమని చాలామంది మహిళాలను ఆహ్వానించాం. కానీ, వాళ్లంతా నిరాకరించారు. ఇంటి బాధ్యతలున్నాయి, పిల్లవాడు పన్నెండో తరగతి చదువుతున్నాడు.. లాంటి కారణాలు చెప్పి హైకోర్టు జడ్జిగా ఉండటానికి నిరాకరించారని ఒక హైకోర్టు న్యాయమూర్తి నాకు రిపోర్ట్‌ చేశారు. ఈ విషయాలన్నిటినీ బహిరంగంగా చర్చించలేం. 
–2021లో జస్టిస్‌ బోబ్డే  

దేశవ్యాప్తంగా 33 శాతం మహిళా న్యాయమూర్తులున్న అతి కొద్ది హైకోర్టుల్లో తెలంగాణ ఒకటి. జిల్లా కోర్టులతో పోలిస్తే హైకోర్టులు, సుప్రీంకోర్టు మహిళల శాతంలో వెనుకబడి ఉన్నాయి. మహిళలను న్యాయమూర్తులుగా మార్చేందుకు బార్‌ ప్రోత్సాహం మరింత అవసరం. 
–జస్టిస్‌ రాధారాణి  

సమాజంలో మహిళలు శక్తిమంతంగా మారితే అది శాంతికి, శ్రేయస్సుకు దారితీస్తుంది. తల్లిగా, భార్యగా, చెల్లిగా, కూతురిగానే కాదు.. న్యాయమూర్తిగా సేవలు అందించడంలోనూ మహిళలు ముందుంటున్నారు. 
–జస్టిస్‌ సూరేపల్లి నందా  

న్యాయ విద్యలో రాణిస్తున్నారు 
మహిళలు ఎన్నో రంగాల్లో ఉన్నత స్థానాలకు ఎదుగుతున్నారు. న్యాయ వ్యవస్థలోనూ న్యాయమూర్తులుగా ఎంతో మంది మహిళలు న్యాయం అందిస్తున్నారు. రాష్ట్రంలో 56 శాతం మహిళలు ఉండటం శుభపరిణామం. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లోనూ ఈ స్థాయికి చేరాలని అభిలíÙస్తున్నా. న్యాయ విద్యతో మహిళలు తమ హక్కులు తెలుసుకోగలుగుతారు. న్యాయ విద్యతో ఎన్నో ఉపాధి అవకాశాలున్నాయి. మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖలోనూ ప్రత్యేక పోస్టులుంటాయ్‌. మహిళలు న్యాయవ్యవస్థలో మరింత రాణించాలి.  
–సాయి రమాదేవి, సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి  

ఇప్పటికే ఆలస్యమైంది. మనకు దేశంలో స్త్రీ, పురుష నిష్పత్తి 50ః50 ఉంటే న్యాయవ్యవస్థలో కూడా ఈ నిష్పత్తి ప్రతిబింబించాలి. లింగ సమానత్వం ఉండాలి. ఈ సమస్యపై ఎప్పుడో పోరాటం జరగాల్సింది. అలా జరిగి ఉంటే ఈపాటికి మహిళా న్యాయమూర్తుల సంఖ్య పెరిగి ఉండేది. 
–శోభా గుప్త, లాయర్‌  

హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య: 42 
ప్రస్తుతం పనిచేస్తున్న వారు: 30 
పురుషులు: 20 
మహిళలు: 10 
పనిచేస్తున్న న్యాయమూర్తుల్లో మహిళల శాతం: 33.3 

హైకోర్టులో మహిళా న్యాయమూర్తులు.. 
జస్టిస్‌ మౌషుమి భట్టాచార్య, జస్టిస్‌ పీ శ్రీసుధ, జస్టిస్‌ జీ రాధారాణి, జస్టిస్‌ టి.మాధవీ దేవి, జస్టిస్‌ సూరేపల్లి నందా, జస్టిస్‌ జువ్వాడీ శ్రీదేవి, జస్టిస్‌ ఎంజీ ప్రియదర్శిని, జస్టిస్‌ సుజన కళాసికం, జస్టిస్‌ రేణుక యారా, జస్టిస్‌ తిరుమలాదేవి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement