high court judge
-
హైకోర్టు న్యాయమూర్తులుగా ఇద్దరు న్యాయాధికారులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు న్యాయాధికారులు (జిల్లా జడ్జిలు) కోటా నుంచి ఇద్దరు న్యాయాధికారుల పేర్లను కేంద్రానికి సిఫారసు చేస్తూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్మానం చేసింది. జుడిషియల్ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్న అవధానం హరిహరనాథ శర్మ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ (ఆర్జీ)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డాక్టర్ యడవల్లి లక్ష్మణరావును హైకోర్టు న్యాయమూర్తులుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఈ ఇద్దరి నియామకానికి కేంద్రం ఆమోదం తెలిపిన తరువాత అవి ప్రధాన మంత్రి కార్యాలయం ద్వారా రాష్ట్రపతికి చేరుతాయి. రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన తరువాత వీరి నియామకాన్ని కేంద్ర న్యాయ శాఖ నోటిఫై చేస్తుంది.ముగ్గురిని సిఫారసు చేసిన హైకోర్టు కొలీజియంహైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నేతృత్వంలోని హైకోర్టు కొలీజియం గత ఏడాది మేలో న్యాయాధికారుల కోటా నుంచి హరిహరనాథ శర్మ, లక్ష్మణరావుతో పాటు ప్రస్తుతం శ్రీకాకుళం ప్రధాన జిల్లా జడ్జిగా వ్యవహరిస్తున్న జునైద్ అహ్మద్ మౌలానా పేర్లను సుప్రీంకోర్టుకి సిఫారసు చేసింది. వీరిలో సుప్రీం కోర్టు ఇద్దరి పేర్లకు ఆమోద ముద్ర వేసింది. జునైద్ విషయంలో సుప్రీం కోర్టు ఏ నిర్ణయం తీసుకుందో తెలియాల్సి ఉంది. వాస్తవానికి ఈ పేర్లకు సుప్రీం కోర్టు కొలీజియం ఇంతకు ముందే ఆమోదం తెలపాల్సి ఉంది. అయితే ఈ ఇద్దరికి సంబంధించి అదనపు వివరాలు అవసరం కావడంతో కొంత ఆలస్యం జరిగింది. ఈ ఇద్దరి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరుకుంటుంది. మరో 7 పోస్టులు ఖాళీగా ఉంటాయి. ఈ పోస్టులకు హైకోర్టు కొలీజియం త్వరలోనే కొందరి పేర్లను సిఫారసు చేయనుంది.అవధానం హరిహరనాథ శర్మ..కర్నూలుకి చెందిన అవధానం హరిహరనాథ శర్మ 1968 ఏప్రిల్ 16న జన్మించారు. తల్లిదండ్రులు సుబ్బమ్మ, రామచంద్రయ్య. తండ్రి పురోహితులు. శర్మ 1988లో కర్నూలులోని ఉస్మానియా కాలేజీలో బీఎస్సీ, 1993లో నెల్లూరు వీఆర్ కాలేజీలో బీఎల్ పూర్తిచేశారు. 1994లో న్యాయవాదిగా ఎన్రోల్ అయి, కర్నూలు జిల్లా కోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. 1994 నుంచి 98 వరకు సీనియర్ న్యాయవాది రామకృష్ణారావు వద్ద వృత్తిలో మెళకువలు నేర్చుకున్నారు. 1998లో స్వతంత్రంగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2007లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. 2017–18లో అనంతపురం ప్రధాన జిల్లా జడ్జిగా, 2020–22లో విశాఖపట్నం ప్రధాన జిల్లా జడ్జిగా పనిచేశారు. 2022లో హైకోర్టు రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టారు. 2023 నుంచి ఏపీ జుడిషియల్ అకాడమీ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. 2016లో నాగార్జున యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం పట్టా అందుకున్నారు.డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు..ఉమ్మడి ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు 1975 ఆగస్టు 3న జన్మించారు. పద్మావతి, వెంకటేశ్వరరావు తల్లిదండ్రులు. లక్ష్మణరావు ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తం ప్రకాశం జిల్లాలో సాగింది. నెల్లూరు వీఆర్ లా కాలేజీలో న్యాయశాస్త్రం అభ్యశించారు. నాగార్జున యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేసి రెండు మెరిట్ సర్టిఫికెట్లు సాధించారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పొందారు. క్రిమినల్ లా, కంపెనీ లాలో బంగారు పతకాలు సాధించారు. 2000 సంవత్సరంలో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు కావలిలో కూడా న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 2014లో జిల్లా జడ్జిగా నియమితులయ్యారు. ఇందుకు సంబంధించిన పరీక్షలో రాష్ట్రంలో మొదటి ర్యాంక్ సాధించారు. తొలుత ఏలూరులో మొదటి అదనపు జిల్లా జడ్జిగా పనిచేశారు. ఆ తరువాత రాష్ట్రంలో పలు చోట్ల వివిధ హోదాల్లో పనిచేశారు. 2021లో హైకోర్టు రిజిస్ట్రార్ (జుడిషియల్)గా నియమితులయ్యారు. ఆయన పనితీరు, క్రమశిక్షణ నచ్చిన హైకోర్టు ఆయన్ని రిజిస్ట్రార్ జనరల్ (ఆర్జీ)గా నియమించింది. హైకోర్టు న్యాయమూర్తిగా ఈయన నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే 2038 వరకు సుదీర్ఘ కాలం పాటు ఆ పోస్టులో కొనసాగనున్నారు. -
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజోయ్‌పాల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలను జస్టిస్ సుజోయ్‌పాల్‌కు అప్పగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశా రు. ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్న జస్టిస్ అలోక్‌అరాధే బాంబే హైకోర్టు చీఫ్‌గా బదిలీ అయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు ద్రౌపదీ ముర్ము ఆమోదముద్ర వేశారు. సీజే బదిలీతో ఏర్పడనున్న ఖాళీని హైకోర్టులో రెండవ సీనియర్ న్యాయ మూర్తిగా ఉన్న జస్టిస్ సుజోయ్పాల్తో భర్తీ చేశారు. రాజ్యాంగంలోని అధికరణ 223 ద్వారా వచ్చిన అధికారాల మేరకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజోయ్‌పాల్‌ను రాష్ట్రపతి నియమించినట్టు న్యాయశాఖ పేర్కొంది. రాష్ట్రపతి తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకు ఆయన సీజేగా కొనసాగుతారు. 2024 మార్చిలో తెలంగాణకు.. మధ్యప్రదేశ్‌లో 1964, జూన్ 21న జస్టిస్ సుజోయ్‌పాల్ జన్మించారు. బీకాం, ఎంఏ, ఎల్ఎల్బీ పూర్తిచేసి 1990లో మధ్యప్రదేశ్ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా ఎన్రోల్ చేసుకున్నారు. సివిల్, రాజ్యాంగ, పారిశ్రామిక, సర్వీస్‌తోపాటు పలు బ్యాంకులు, మానవ హక్కుల కమిషన్, బోర్డులకు న్యాయవాదిగా పనిచేశారు. 2011, మే 27న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2014, ఏప్రిల్ 14న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ సుజోయ్‌పాల్ కుమారుడు మధ్యప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. దీంతో అక్కడి హైకోర్టు నుంచి బదిలీ చేయాలని ఆయన కోరుకోగా, రాష్ట్రపతి ఆమోదించారు. 2024, మార్చి 21న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. దాదాపు 10 నెలలుగా ఇక్కడ పనిచేస్తున్న ఆయన మార్గదర్శి ఫైనాన్షియర్స్ నిబంధనల ఉల్లంఘన, గ్రూప్–1, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ సహా పలు కీలక కేసులపై విచారణ చేపట్టారు. పలు కేసుల్లో తీర్పులు కూడా వెలువరించారు. కాగా, జస్టిస్ అలోక్‌అరాధే బదిలీతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 26కు చేరుకోనుంది. -
జిల్లా జడ్జిలకు హైకోర్టు జడ్జిలుగా పదోన్నతి
సాక్షి,న్యూఢిల్లీ:నలుగురు జిల్లా జడ్జిలకు తెలంగాణ హైకోర్టు జడ్జిలుగా పదోన్నతి లభించింది. శ్రీమతి రేణుకా యార, నందికొండ నర్సింగ్ రావు, తిరుమలాదేవి, మధుసూదనరావులను హైకోర్టు జడ్జిలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. దీంతోపాటు ఏపీ హైకోర్టుకు ఇద్దరు కొత్త జడ్జిలను కొలీజియం సిఫారసు చేసింది. ఏపీలో జిల్లా జడ్జిలుగా పనిచేస్తున్న అవధానం హరిహరణాధ శర్మ,డాక్టర్ యడవల్లి లక్షణరావులకు ఏపీ హైకోర్టు జడ్జిలుగా పదోన్నతి లభించింది. రాష్ట్రపతి ఆమోదంతో వీరి నియామకాలు అమలులోకి వస్తాయి. ఇదీ చదవండి: కేంద్రమంత్రికి మెటా క్షమాపణలు -
న్యాయమూర్తుల సంతానానికి హైకోర్టు జడ్జిలుగా నో చాన్స్!
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రస్తుత, మాజీ న్యాయమూర్తుల సంతానం, అతి సమీప బంధువులను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించరాదన్న ప్రతిపాదనను సుప్రీంకోర్టు కొలీజియం చురుగ్గా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. అలాంటి వారి పేర్లను సిఫార్సు చేయరాదంటూ హైకోర్టు కొలీజియాలకు సూచిస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. తద్వారా అర్హులైన కొందరికి అన్యాయం జరిగినా బంధుప్రీతి వంటి ఆరోపణలకు తావుండదని, ఎంపిక ప్రక్రియ మరింత పారదర్శకంగా మారుతుందని కొలీజియం సభ్యుడైన సీనియర్ న్యాయమూర్తి అభిప్రాయపడ్డట్టు సదరు వర్గాలు వెల్లడించాయి. తొలి తరం న్యాయవాదులతో పాటు విభిన్న సామాజికవర్గాల వారికి హైకోర్టు న్యాయమూర్తులుగా అవకాశం లభిస్తుందన్నది దీని ఉద్దేశమని వివరించాయి. మళ్లీ తెరపైకి ‘సంప్రదింపులు’ హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి మరో ఇటీవల కీలక పరిణామం కూడా చోటుచేసుకుంది. హైకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన అభ్యర్థులతో సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా సారథ్యంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు కొలీజియం డిసెంబర్ 22న వ్యక్తిగతంగా భేటీ అయింది. తద్వారా గత సంప్రదాయాన్ని పునరుద్ధరించింది. అనంతరం రాజస్తాన్, ఉత్తరాఖండ్, బాంబే, అలహాబాద్ హైకోర్టులకు న్యాయ మూర్తులుగా ఆరుగురు పేర్లను కేంద్రానికి సిఫార్సు చేసింది. దేశంలో మెజారిటీ ప్రజల అభిప్రాయమే సాగాలంటూ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ‘సంప్రదింపు’ల నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటిదాకా హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి అభ్యర్థుల బయోడేటా, వారి అర్హత, సామర్థ్యాలపై కొలీజియం అంచనా, నిఘా సమాచారం తదితరాలను ప్రాతిపదికగా తీసుకుంటూ వస్తుండటం తెలిసిందే. -
ఇది హిందుస్తాన్
ప్రయాగ్‌రాజ్: దేశంలో మెజారిటీ ప్రజల ఇష్టానుసారం పాలన కొనసాగాలని చెప్పేందుకు మాత్రం సంకోచించనని అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ డాక్టర్ శేఖర్ యాదవ్ వ్యాఖ్యా నించారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఆదివారం అలహాబాద్ హైకోర్టు లైబ్రెరీ హాల్లో విశ్వహిందూ పరిషత్ హైకోర్టు యూనిట్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అంశంపై ఆయన మాట్లాడారు. ‘‘మెజారిటీ ప్రజల అభీష్టం మేరకే చట్టం నడుచుకోవాలి. కుటుంబంగా చూసినా, సమాజంగా చూసినా మెజారిటీ ప్రజల సంక్షేమం, సంతోషమే ముఖ్యం’’ అన్నారు. ముస్లింలలో ఉన్న బహుభార్యత్వం, త్రిపుల్ తలాఖ్, హలాలా వంటి విధానాలను జడ్జి పరోక్షంగా విమర్శించారు. ‘‘ మా పర్సనల్ లా వీటికి అంగీకరిస్తోందని అది ఏమాత్రం ఆమోదనీయం కాదు. మన శాస్త్రాలు, వేదాల్లో స్త్రీని శక్తిస్వరూపిణిగా భావించారు. నలుగురు భార్యలను కల్గి ఉంటాను, హలాలా, త్రిపుల్ తలాఖ్‌ను పాటిస్తానంటే కుదరదు. సామరస్యం, లింగ సమానత, సామ్యవాదమే యూసీసీ ధ్యేయం. అంతే తప్ప వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్, హిందూయిజాలను అది ప్రోత్సహించదు’’ అన్నారు. -
హైకోర్టు జడ్జీలుగా ముగ్గురు ప్రమాణం
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా కుంచం మహేశ్వరరావు, తూటా చంద్ర ధనశేఖర్, చల్లా గుణరంజన్‌లు సోమవారం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన కార్యక్రమంలో ఈ ముగ్గురితో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. అంతకుముందు.. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వై. లక్ష్మణరావు ఈ ముగ్గురు నియామకానికి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జారీచేసిన ఉత్తర్వులను చదవి వినిపించారు. అనంతరం సీజే వారితో ప్రమాణం చేయించారు. ఆ తర్వాత సీజే ఒక్కొక్కరికీ రాష్ట్రపతి జారీచేసిన ఉత్తర్వులను అందచేశారు.ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దొనడి రమేష్, విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ చల్లా కోదండరాం, జస్టిస్ మంతోజు గంగారావు, ప్రమాణం చేసిన న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, అదనపు ఏజీ ఇవన సాంబశివ ప్రతాప్, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్జీ) పసల పొన్నారావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కలిగినీడి చిదంబరం, హైకోర్టు రిజిస్ట్రార్లు, న్యాయవాదులు పాల్గొన్నారు.ప్రమాణం అనంతరం జస్టిస్ ధనశేఖర్ సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ గుహనాథన్ నరేందర్‌తో కలిసి కేసులను విచారించారు. జస్టిస్ మహేశ్వరరావు, జస్టిస్ గుణరంజన్‌లు సింగిల్ జడ్జీలుగా కేసులను విచారించారు. ప్రమాణం సందర్భంగా న్యాయవాదులు, శ్రేయోభిలాషులు వీరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ముగ్గురితో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరింది. మరో 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను న్యాయాధికారులు, న్యాయవాదులతో భర్తీచేసేందుకు జనవరిలో చర్యలు చేపట్టే అవకాశం ఉంది. -
విద్వేష వ్యాఖ్యలొద్దు
న్యూఢిల్లీ: కేసుల విచారణ సందర్భంగా వాడే పదజాలం విషయంలో న్యాయస్థానాలు అత్యంత జాగరూకత వహించాలని సుప్రీంకోర్టు సూచించింది. పురుషాధిక్య భావజాలం, స్త్రీద్వేషం తదితరాలతో కూడిన వ్యాఖ్యలకు పూర్తిగా దూరంగా ఉండాలని హితవు పలికింది. కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.శ్రీశానంద ఇటీవల ఒక కేసు విచారణ సందర్భంగా బెంగళూరులో ఒక ముస్లిం ప్రాబల్య ప్రాంతాన్ని పాకిస్తాన్‌తో పోల్చడం, మహిళా న్యాయవాదిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఈ ఉదంతంపై సుమోటో విచారణను సీజేఐ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం బుధవారం ముగించింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలోని ఏ ప్రాంతాన్నీ పాకిస్తాన్‌తో పోల్చకూడదని కుండబద్దలు కొట్టింది. అవి దేశ ప్రాదేశిక సమగ్రతకు విరుద్ధమని గుర్తు చేసింది. ఇలా ప్రాంతాలను, సామాజికవర్గాలను ఉద్దేశించి అభ్యంతకర వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సరికాదని స్పష్టం చేసింది. ‘‘న్యాయవ్యవస్థ నిష్పాక్షికతపై సమాజంలో అన్ని వర్గాల ప్రజలకూ పూర్తి విశ్వాసముండాలి. దీన్ని కాపాడాల్సిన బాధ్యత లాయర్ల నుంచి జడ్జిల దాకా అందరిపైనా ఉంది. న్యాయమూర్తులు యథాలాపంగా చేసే ఇలాంటి వ్యాఖ్యలు వారి వ్యక్తిగత అభిప్రాయాలకు, రాగద్వేషాలకు అద్దం పడతాయి. వాటి ప్రభావం మొత్తం న్యాయవ్యవస్థపై పడుతుంది’’ అంటూ హెచ్చరించింది.మరింత వెలుగే పరిష్కారం!న్యాయవ్యవస్థలో పారదర్శకత చాలా ముఖ్యమని ధర్మాసనం ఈ సందర్భంగా పేర్కొంది. కోర్టుల విచారణ ప్రక్రియపై సోషల్ మీడియాలో విద్వేష వ్యాప్తి పెద్ద సవాలుగా మారిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. దీనిపై సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘వెలుగుకు మరింత వెలుగే పరిష్కారం తప్ప చీకట్లు కాదు. అన్నిరకాల కోర్టుల్లోనూ విచారణ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేయడం, తద్వారా న్యాయవ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చడమే సమస్యకు పరిష్కారం’’ అని కుండబద్దలు కొట్టారు. -
అలాంటి వ్యాఖ్యలు చేయొద్దు: సీజేఐ
న్యూఢిల్లీ, సాక్షి: దేశంలో న్యాయస్థానాలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, న్యాయమూర్తులు పక్షపాత వ్యాఖ్యల జోలికి పోవొద్దని దేశ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. కర్ణాటక న్యాయమూర్తి అభ్యంతరకర వ్యాఖ్యల సుమోటో కేసు విచారణ ముగింపు సందర్భంగా బుధవారం సీజేఐ ఇలా మాట్లాడారు. ‘‘భారత్‌లోని ఏ ప్రాంతాన్ని పాకిస్థాన్‌తో పోల్చడం సరికాదు. ఇది దేశ ప్రాదేశిక సమగ్రతకు విరుద్ధం. పైగా కోర్టులు అప్రమత్తంగా ఉండాలి. న్యాయమూర్తులు కేసుల విచారణ టైంలో ద్వేషపూరితంగా, కేవలం ఒక వర్గాన్ని ఉద్దేశించేలా పక్షపాత వ్యాఖ్యలు చేయొద్దు’’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. ఓ భూవ్యవహారానికి సంబంధించిన కేసులో హైకోర్టు జడ్జి జస్టిస్ వేదవ్యాసాచార్ శ్రీషానంద విచారణ చేపట్టారు. ఆ ప్రాంతాన్ని పాకిస్థాన్‌తో పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాక, ఓ మహిళా న్యాయవాది పైనా తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారమంతా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లింది. దీంతో సుమోటోగా ఈ వ్యవహారాన్ని తీసుకున్న సీజేఐ బెంచ్.. వేదవ్యాసాచార్ను మందలించారు. ఆ టైంలోనే.. న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలపై స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయాల్సిన అవసరాన్ని ఆ టైంలో సీజేఐ బెంచ్ వ్యాఖ్యానించింది కూడా. ఇక.. సదరు జడ్జి బహిరంగ క్షమాపణ చెప్పడంతో ఇవాళ సుమోటో ప్రొసీడింగ్స్‌ను విరమించుకుంది సీజేఐ ధర్మాసనం."Justice Vedavyasachar Srishananda Faces Backlash Over Gender-Insensitive Remark"Karnataka High Court pic.twitter.com/UG2O1gQwMC— ADV Pramod Kumar (@thelawyr) September 20, 2024One month old video of Karnataka High Court, Justice Vedavyasachar Srishananda while Criticizing the cops referred to an area (Gori Palya) in Bengaluru as Pakistan. Gori Palya is an area where a large number of Muslims live. He was referring to auto pooling in that area where… pic.twitter.com/H1FwKKEg7S— Mohammed Zubair (@zoo_bear) September 19, 2024 -
కర్ణాటక న్యాయమూర్తిపై సుప్రీంకోర్టు సుమోటో కేసు
న్యూఢిల్లీ, సాక్షి: వివాదాస్పద వ్యాఖ్యల వీడియోతో సోషల్ మీడియాలో వైరల్ అయిన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి వేదవ్యాసాచార్ శీర్షానందపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం.. పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాల్సిందిగా కర్ణాటక హైకోర్టును ఆదేశించింది.సుప్రీంకోర్టు న్యాయవాదులు ఇందిరా జైసింగ్, సంజయ్ ఘోష్‌లు.. జస్టిస్ వేదవ్యాసాచార్ శీర్షానంద వ్యాఖ్యలతో కూడిన ‘ఎక్స్’ పోస్టును ప్రస్తావిస్తూ తగిన చర్యలను తీసుకోవాల్సిందిగా సీజేఐను అభ్యర్థించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన ఐదుగురు సభ్యుల బెంచ్ ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించింది.ఈ సందర్భంగా సీజే మాట్లాడుతూ ‘‘ఇలాంటి అంశాలపై కొన్ని సాధారణ మార్గదర్శకాలను జారీ చేస్తూనే హైకోర్టు నుంచి నివేదిక తెప్పించండి’’ అని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణిని ఆదేశించారు. కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ నుంచి పరిపాలన పరమైన అనుమతులు పొందిన తరువాత రిజిస్ట్రార్ జనరల్ తమకు నివేదిక అందించాలని స్పష్టం చేశారు. ఈ అంశంపై వచ్చే మంగళవారం మళ్లీ విచారణ చేస్తామని తెలిపారు.‘‘సోషల్ మీడియా విస్తృత వాడకంలో ఉన్న ఈ కాలంలో అందరూ మనల్ని (న్యాయమూర్తులు) చాలా నిశితంగా పరిశీలిస్తూంటారు. ఆ విషయాన్ని మనం గుర్తెరిగి వ్యవహరించాలి’’ అని కూడా సీజేఐ వ్యాఖ్యానించారు.ఇంతకీ కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేదవ్యాసాచార్ శీర్షానంద ఏం మాట్లాడారంటే.. కొన్ని రోజుల క్రితం రెండు వీడియోలో ఎక్స్‌లో పోస్ట్ అయ్యాయి. అందులో జస్టిస్ వేదవ్యాసాచార్ శీర్షానంద మాట్లాడుతూ బెంగళూరులోని ఒక ప్రాంతాన్ని ‘పాకిస్థాన్’తో పోల్చారు. అక్కడ ఒక్కో ఆటోలో పది మంది ప్రయాణిస్తున్నా పోలీసులు పట్టించుకోరని ఆయన వ్యాఖ్యానించినట్లు వీడియోలో ఉంది. ఇది వాస్తవమని.. ఎంతటి పెద్ద అధికారి అయినా అక్కడ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోరని కూడా జడ్జి కన్నడలో తెలిపారు. ఇక రెండో వీడియోలో ఓ మహిళ న్యాయవాదిని ఉద్దేశించి ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.One month old video of Karnataka High Court, Justice Vedavyasachar Srishananda while Criticizing the cops referred to an area (Gori Palya) in Bengaluru as Pakistan. Gori Palya is an area where a large number of Muslims live. He was referring to auto pooling in that area where… pic.twitter.com/H1FwKKEg7S— Mohammed Zubair (@zoo_bear) September 19, 2024 "Justice Vedavyasachar Srishananda Faces Backlash Over Gender-Insensitive Remark"Karnataka High Court pic.twitter.com/UG2O1gQwMC— ADV Pramod Kumar (@thelawyr) September 20, 2024 -
నాగార్జునకు ఊరట.. కూల్చివేత ఆపేయండి.. హైకోర్టు ఆర్డర్స్
-
Supreme Court: అనవసర మాటలొద్దు
న్యూఢిల్లీ: గతంలో సుప్రీంకోర్టు ఇచి్చన ఉత్తర్వులను ఉద్దేశిస్తూ పంజాబ్ హరియాణా హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎగువ కోర్టు పట్ల ఎనలేని గౌరవం చూపాలని, న్యాయ క్రమశిక్షణ పాటించాలని హితవు పలికింది. హరియాణాలోని గుర్గావ్లో ఒక భూవివాదానికి సంబంధించిన కేసులో మే మూడో తేదీన సుప్రీంకోర్టు ఒక ఉత్తర్వులు జారీచేసింది. అయితే జూలై 17వ తేదీన ఒక కేసును విచారిస్తున్న సందర్భంగా పంజాబ్, హరియాణా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజ్బీర్ సహరావత్ సుప్రీంకోర్టును విమర్శించారు. ‘‘ హైకోర్టుల అధికారాలకు సుప్రీంకోర్టు యథాలాపంగా అడ్డు తగులుతోంది. ఇక తామే ‘సుప్రీం’ అన్నట్లుగా సుప్రీంకోర్టులో విపరీత ధోరణి కనిపిస్తోంది’’ అని జడ్జి సహరావత్ అన్నారు. అయితే ఆరోజు హైకోర్టులో కేసు విచారణ ప్రత్యక్ష ప్రసారం కావడంతో సంబంధిత వీడియో వైరల్‌గా మారింది. విషయం తెల్సుకున్న సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సూమోటోగా స్వీకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హృషికేశ్ రాయ్‌ల ప్రత్యేక ధర్మాసనం ఈ అంశాన్ని బుధవారం విచారించింది. ‘‘ కింద కోర్టులు సుప్రీంకోర్టు తీర్పులను శిరసావహించాల్సిందే. ఇందులో వేరే ఆప్షన్ ఎంచుకునే అవకాశమే లేదు. ఎందుకంటే ఇది రాజ్యాంగబద్ధ విధి నిర్వహణ. కోర్టుల్లో తీర్పులపై పిటిషనర్లు, కక్షిదారులు అసంతృప్తి వ్యక్తంచేయొచ్చుగానీ జడ్జీలు తమ సొంత వ్యాఖ్యానాలు చేయకూడదు. దేశంలో ఇక ఏ న్యాయస్థానంలోనూ ఇలాంటివి పునరావృతం కాబోవని భావిస్తున్నాం. కేసు విచారణల ప్రత్యక్ష ప్రసారాల కాలంలో జడ్జీలు ఏవైనా వ్యాఖ్యానాలు చేసేటపుడు సంయమనం పాటించాలి. అనవసర మాటలొద్దు’’ అని హైకోర్టు జడ్జికి ధర్మాసనం మౌఖిక ఆదేశాలిచి్చంది. జిల్లా కోర్టులు మొదలు హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా రాజ్యాంగంలోని ప్రతి అంగంలోనూ క్రమశిక్షణ అనేది కొనసాగాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టు జడ్జి వ్యాఖ్యలు ఖచి్చతంగా కోర్టు ధిక్కారమేనని పేర్కొన్న సుప్రీంకోర్టు.. ఆ జడ్జిపై చర్యలు తీసుకునేందుకు మాత్రం నిరాకరించింది. -
దంపతులలో ఎవరి తప్పూ లేకపోయినా విడాకులు తీసుకోవచ్చా?
పాశ్చాత్య దేశాలలో, ముఖ్యంగా అమెరికాలోని కొన్ని రాష్ట్రాలలో దంపతులలో ఏ తప్పూ లేకపోయినా ‘నో ఫాల్ట్ డివోర్స్’ (అపరాధరహిత విడాకులు) పేరుతో విడాకులు ఇచ్చే చట్టం అమలులో ఉంది. అలాగే ‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్‌డౌన్ ఆఫ్ మ్యారేజ్’ (పునఃస్థాపనకు వీలులేని వివాహ బంధం)లో కూడా విడాకులు తీసుకునేందుకు చాలా దేశాలలోని చట్టాలు వీలు కల్పిస్తున్నాయి. అయితే భారతదేశంలోని పెళ్లిళ్లను నియంత్రించే రెండు ప్రాథమిక చట్టాలైన హిందూ వివాహ చట్టం 1955, ప్రత్యేక వివాహ చట్టం 1954 అపరాధ రహిత విడాకులను, పునఃస్థాపనకు వీలులేని వివాహ బంధంలో విడాకులను మంజూరు చేసేందుకు ఆ ప్రాతిపదికలను అంగీకరించవు.భార్య–భర్తల కొన్ని సంవత్సరాల పాటు విడిపోయి ఉండి, వారి వివాహ బంధం తిరిగి అతుక్కునే వీలులేనంతలా తెగిపోయి, ఇరువురు కలిసి బతికే ఆస్కారం లేకుండా పోయివున్న సందర్భాలను ‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్‌డౌన్ ఆఫ్ మ్యారేజ్’ (పునఃస్థాపనకు వీలులేని వివాహ బంధం) అంటారు. ఇలాంటి వివాహ బంధాలు కేవలం చట్టం దృష్టిలో మాత్రమే వివాహంగా మిగిలి ఉంటాయి. అలాగే ‘నాకు నా భార్యపై (లేదా భర్తపై) ఎటువంటి ఫిర్యాదులు లేవు, వారు వ్యక్తిగతంగా మంచివారే, మా ఇద్దరి మధ్య లేనిది సఖ్యత మాత్రమే.నాకు నా భార్య (లేదా భర్త) విడాకులు ఇవ్వను అంటున్నారు. అందుకే నాకు నో ఫాల్ట్ డివోర్స్ ఇవ్వండి’ అని అడిగితే భారతదేశం లోని ఏ చట్టం ప్రకారమూ విడాకులు ఇవ్వడం కుదరదు. భాగస్వామిపై హింసకు పాల్పడడం, అకారణంగా వదిలేసి వెళ్లడం, వివాహేతర సంబంధం కలిగి ఉండటం, నయం కాలేని అంటు వ్యాధులు కలిగి వుండటం, హేయమైన నేరారోపణ రుజువు కావటం, సంసార జీవనానికి పనికిరాకుండా ఉండడం, మతమార్పిడి చేసుకోవడం, కోర్టు ఆదేశం ఇచ్చినప్పటికీ తిరిగి సంసార జీవితం ఆరంభించకపోవడం వంటివి మాత్రమే విడాకులు తీసుకోవడానికి ప్రాతిపదికగా పరిగణించబడతాయి (గ్రౌండ్స్ ఫర్ డివోర్స్). కాని 1978 లోనే, 71వ లా కమిషన్ తన సిఫార్సులలో ‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్‌డౌన్ ఆఫ్ మ్యారేజ్’ను విడాకులు తీసుకోవడానికి ఒక ప్రాతిపదికగా/కారణంగా గుర్తించేలా చట్టంలో మార్పులు చేయాలి అని సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను పరిగణిస్తూ, ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు చాలా కేసులలో ‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్‌డౌన్ ఆఫ్ మ్యారేజ్’ కింద విడాకులు మంజూరు చేసింది. అంతేకాదు విదేశాలలో నివసిస్తున్న భారతీయులు ఒకవేళ ఈ ప్రాతిపదికన విడాకులు తీసుకొని ఉంటే, భారతదేశంలోని ఏ చట్టంలోనూ ఆ ప్రాతిపదిక లేదు కాబట్టి విడాకులు చెల్లవు అనడం సమంజసం కాదు – అలా విదేశాలలో పొందిన విడాకులు చట్టబద్ధమే అని కొన్ని కేసులలో తీర్పునిచ్చింది.‘‘నో ఫాల్ట్ డివోర్స్’’ – ‘‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్‌డౌన్ ఆఫ్ మ్యారేజ్’’ వంటి చట్టాలకు భారత దేశం పూర్తిగా సిద్ధంగా లేకపోయినప్పటికీ, వీలైనంత మేర సఖ్యత కుదిర్చేలా ప్రయత్నించి, వీలుకాని పక్షంలో సత్వరమే విడాకులు మంజూరు చేసే లాగా చట్టం మారాలి. పరస్పర ఒప్పందం/అంగీకారం ఉంటే భార్యా భర్తలు ఇద్దరూ కలిసి వివాహం అయిన ఒక సంవత్సరం తర్వాత మ్యూచువల్ డివోర్స్ పొందవచ్చు. ఇదివరకు లాగా విడాకుల దరఖాస్తు చేసిన తరువాత ఆరు నెలలు ఆగవలసిన అవసరం లేదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. – శ్రీకాంత్ చింతల, హైకోర్ట్ అడ్వకేట్ -
పిల్లల నుంచి పోషణ కోసం.. తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించవచ్చా?
ప్రదీప్, శాంత భార్యాభర్తలు. ఇద్దరూ 60 ఏళ్లకు పైబడిన వారే! ఇద్దరికీ బీపీ, సుగర్లున్నాయి. వాళ్లకిద్దరు పిల్లలు. మంచి జీతాలు గల ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. కానీ అమ్మానాన్నలను పూర్తిగాగాలికి వదిలేయడంతో దయనీయమైన స్థితిలో రోజులను గడుపుతున్నారు ఆ దంపతులు. పిల్లల నుంచి పోషణ కోసం వీరు కోర్టును ఆశ్రయించవచ్చా?తల్లిదండ్రుల, వయోవృద్ధుల నిర్వహణ, సంక్షేమ చట్టం, 2007 కింద తల్లిదండ్రులకు, వయోవృద్ధులకు చాలా హక్కులే ఉన్నాయి. ముఖ్యంగా తమను తాము పోషించుకోలేని, తమ సంక్షేమాన్ని, తమ ఆరోగ్యాన్ని తాము పర్యవేక్షించుకోలేని తల్లిదండ్రులు, వయోవృద్ధులకు... తమ పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు లేదా బంధువుల (వయోవృద్ధుల ఆస్తికి వారసులు లేదా ఆర్థికంగా గానీ, మరేరకంగా గానీ లబ్ధి పొందిన వారు)ను మెయింటెనెన్స్ అడిగే హక్కును కలిపిస్తోందీ చట్టం.ఈ చట్టం కింద వయోవృద్ధులు, తల్లిదండ్రులు నేరుగా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవచ్చు (స్థానిక ఆర్డీఓ). అలా ఆశ్రయించలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ల పక్షాన ఓల్డ్ ఏజ్ హోమ్ లాంటి ఏ సంస్థ అయినా పిటిషన్ దాఖలు చేయవచ్చు. నోటీసులు అందిన 90 రోజులలోగా పిటిషన్‌పై విచారణ జరిపి ఆదేశాలు ఇవ్వవలసి ఉంటుంది. ఇంటెరిమ్ మెయింటెనెన్స్‌కు కూడా ఆదేశించవచ్చు. వారసులు, పిల్లలు లేదా బంధువులు ట్రిబ్యునల్ ముందుకు రానట్లయితే... ట్రిబ్యునల్ క్రిమినల్ కోర్ట్లా కూడా వ్యవహరించవచ్చు. స్థిరాస్తులకు సంబంధించి ఏ ఇతర చట్టాల్లో లేని వెసులుబాటు, హక్కు కేవలం ఈ చట్టంలోనే పేరెంట్స్, సీనియర్ సిటిజన్స్ కలిగి ఉన్నారు.ఏ ఇతర ప్రాపర్టీ చట్టాలకిందైనా ఒకసారి అమ్మేసిన లేదా గిఫ్ట్ గా ఇచ్చిన స్థిరాస్తిని తిరిగి తీసుకోవడం కానీ రద్దు చేయడం కానీ కుదరదు. కానీ ఈ 2007 చట్టం కింద మాత్రం ఆస్తిని తమ సంతానానికి లేదా తన బంధువులకు లేదా మరే ఇతర వ్యక్తికైనా రాసిచ్చేటప్పుడు ‘మమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యతను నిర్వర్తించాలి.. లాంటి నిబంధనతోనే ఈ ఆస్తిని రాసిస్తున్నాను’ అంటూ ఆస్తిపత్రాలలో పొందుపరచి.. దాన్ని సదరు వారసులు ఉల్లంఘిస్తే.. తమ ఆస్తిని తాము తిరిగి తీసేసుకోవచ్చు.చాలా సందర్భాలలో ఆస్తి రాయించుకున్న తర్వాత తల్లిదండ్రులను లేదా వృద్ధులను ఓల్డేజ్ హోమ్స్‌లో వదిలేయడం లేక సరిగ్గా పట్టించుకోకపోవడం చూస్తుంటాం. అలాంటి సందర్భాలకు ఈ చట్టం చక్కటి ఆయుధం. పైన తెలిపిన నిబంధన కలిగి ఉన్న ఆస్తి పత్రాలను మరెవరైనా కొనుగోలు చేస్తే, అలా కొనుక్కున్న వారిపైనా మెయింటెనెన్స్ విధించవచ్చు. అంతేకాదు వయోవృద్ధులను లేదా తల్లిదండ్రులను వదిలించుకుందామని వారిని ఎక్కడికైనా తీసుకెళ్లి వదిలేయడం లాంటివి చేస్తే అది నేరం. వారికి జరిమానాతో ΄ాటు జైలు శిక్ష కూడా ఉంటుంది.– శ్రీకాంత్ చింతల, హైకోర్ట్ అడ్వకేట్ -
పుణె పోర్షే కారు ఘటన.. మైనర్‌ను వెంటనే విడుదల చేయండి: హైకోర్టు
ముంబై: పుణె పోర్షే ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేసి ఇద్దరు యువ ఇంజనీర్ల మరణానికి కారణమైన నిందితుడు మైనర్ బాలుడిని నిర్బంధం నుంచి వెంటనే విడుదల చేయాలని బాంబే హైకోర్టు మంగళవారం ఆదేశించింది.ప్రభుత్వ అబ్జర్వేషన్ హోమ్ నుంచి విడుదల చేయాలంటూ బాలుడి అత్త వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై జస్టిస్ భారతి, జస్టిస్ మజుషా దేశ్‌పాండే ధర్మాసనం నేడు తీర్పు వెలువరించింది. బాలుడి రిమాండ్ ఆర్డర్ చట్టవిరుద్ధమని పేర్కొంటూ దానిని కోర్టు పక్కన పెట్టింది.కేసును కప్పిపుచ్చుకునేందుకు బాలుడి తల్లిదండ్రులు, తాత ప్రయత్నించి అరెస్టు అయిన నేపథ్యంలో మైనర్ ప్రస్తుతం అతని అత్త సంరక్షణలో ఉంటాడని ధర్మాసనం పేర్కొంది. కాగా ఈ కేసులో నిందితుడికి త్వరితగతిన బెయిల్ మంజూరు చేయడంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవడంతో జువైనల్ జస్టిస్ బోర్డు బాలుడికి రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.అసలేం జరిగిందంటే..కాగా మహారాష్ట్రలోని పుణెలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమారుడు(17 ఏళ్లు).. 12వ తరగతి ఫలితాలు రావడంతో మే 18న రాత్రి మిత్రులతో కలిసి మద్యం తాగి పార్టీ చేసుకున్నాడు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో మత్తులో తూలుతూనే ఇద్దరు మిత్రులను తీసుకొని తన తండ్రికి చెందిన రూ. 2.5 కోట్ల ఖరీదైన పోర్షె కారులో ఇంటికి బయల్దేరాడు.అదే సమయంలోసాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన అనీష్, అశ్విని అనే ఇద్దరు యువతీ, యువకుడు ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో టెక్కీలు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని పోర్షె కారు నడుపుతున్న మైనర్.. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ఢీకొంది. ప్రమాద తీవ్రతకు అనీష్, అశ్విని కొన్ని అడుగుల దూరం ఎగిరిపడి అక్కడికక్కడే చనిపోయారు.అయితే ప్రమాదానికి కారణమైన బాలుడిని రక్షించేందుకు పోలీస్‌స్టేషన్ నుంచి జువైనల్ జస్టిస్ బోర్డు వరకూ అడుగడుగునా ప్రయత్నాలు జరిగాయి. ప్రమాదం జరిగిన మర్నాడు నిందితుడిని జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపర్చగా.. అక్కడ న్యాయమూర్తి ఎల్ఎన్ దన్వాడే నిందితుడికి తక్షణమే బెయిల్ మంజూరు చేశారు. రోడ్డు ప్రమాదాలు-పరిష్కారాలపై 300 పదాలతో వ్యాసం రాయమన్నారు. 15 రోజులు ట్రాఫిక్ పోలీసుల వద్ద పనిచేయడం వంటి నిబంధనలు విధించారు ఈ బెయిల్ నిబంధనలు చూసి జనాలు నివ్వెరపోయారు. 15 గంటల్లోనే బెయిల్ మంజూరుచేయడం తీవ్ర విమర్శలకు దారితీసిన విషయం తెలిసిందే. నిందితుడికి వ్యతిరేకంగా ఆందోళనలు జరగడం, ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడికి పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. తక్షణమే నిందితుడి తండ్రి, మద్యం విక్రయించిన రెస్టారంట్ల యజమానులపై రెండో ఎఫ్ఐఆర్ నమోదైంది. 22వ తేదీన బాలుడి బెయిల్‌ను రద్దు చేసి అబ్జర్వేషన్ హోమ్‌కు తరలించారు.పరారైన నిందితుడి తండ్రిని ఔరంగాబాద్‌లో అరెస్టు చేశారు. మరోవైపు డ్రైవర్‌ను ఈ కేసులో బలవంతంగా ఇరికించేందుకు యత్నించాడన్న ఆరోపణలపై నిందితుడి తాతను అదుపులోకి తీసుకొన్నారు. ఈ కేసులో నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని ఏకంగా డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ ప్రకటించారు. -
భార్యను సెకండ్ హ్యాండ్ అన్నందుకు.. రూ 3 కోట్లు జరిమానా విధించిన కోర్టు
కొన్ని భార్యభర్తల కేసులు కనువిప్పు కలిగిస్తాయి. ఎందుకంటే భార్యను తేలికగా చేస్తూ ఎలా పడితే అలా కించపరుస్తూ మాట్లాడే భర్తల ఆగడాలను ఎలా కట్టడి చేయాలో చెబుతాయి. అలాంటి గమ్మత్తైన ట్విస్టింగ్ కేసు ఇది! ఆ దంపతులిరువురిది సంపన్న కుటుంబ నేపథ్యం. ఇద్దరు ఉన్నత విద్యావంతులే. ఆ జంట వివాహం 1994 జనవరి 3వ తేదీన పెద్దల సమక్షంలో జరిగింది. ఆ తర్వాత ఇద్దరు అమెరికా వెళ్లి అక్కడే ఉద్యోగాలు చేశారు. అయితే అక్కడ చట్టాల ప్రకారం సెక్యూరిటీ కోసం అమెరికాలో మళ్లీ పెళ్లి చేసుకుంది ఆ జంట. అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో వారి కాపురంలో కలతలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో 2005లో ఈ దంపతులు ముంబై తిరిగి వచ్చేశారు. ముంబైలోనే భార్య ఉద్యోగం సంపాదించింది. అయితే భర్తతో గొడవలు కారణంగా తల్లి ఇంట్లోనే ఉంటుంది. 2014లో భర్త తిరిగి అమెరికా వెళ్లిపోయాడు. 2017లో భార్యకు అమెరికా నుంచే విడాకుల నోటీసులు పంపాడు. అదే ఏడాది భార్య ఇండియాలోని ముంబై కోర్టులో గృహ హింస చట్టం కింద కేసు ఫైల్ చేసింది. ఏడాది తర్వాత అంటే 2018లో అమెరికా కోర్టు వారికి విడాకులు కూడా మంజూరు చేసింది. అసలు కథ ఇక్కడే మొదలైంది..ముంబై కోర్టులో భార్య దాఖలు చేసిన పిటీషన్ ఆసక్తికరంగా మారింది. సుదీర్ఘ విచారణకు దారితీసింది. దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. పెళ్లి తర్వాత హనీమూన్కని నేపాల్ వెళ్లిన తర్వాతే ఈ ఇరువురి మద్య గొడవలు ప్రారంభమయ్యాయి. భార్యను సెకండ్ హ్యాండ్ అంటూ పదేపదే కించపరిచే వాడు భర్త. అందుకు కారణం..అప్పటికే తన భార్యకు.. తన పెళ్లి కంటే ముందే నిశ్చితార్థం అయ్యి క్యాన్సిల్ కావటం. ఆ తర్వాత అతడితో పెళ్లి జరిగింది. దీంతో భర్త ఆమెను పదేపదే సెకండ్ హ్యాండ్ అని కించపరిచేవాడు. అలాగే అమెరికా వచ్చిన ఆమె తల్లిదండ్రును అత్యంత నీచంగా చూసేవాడు. పైగా ఆమె తండ్రికి గుండె ఆపరేషన్ జరిగితే మరో ఇంట్లో ఉంచమని గొడవ చేసేవాడని భార్య పిటిషన్లో స్పష్టం చేసింది. గృహ హింస తీవ్ర స్థాయిలో ఉందని.. అనేక మానసిక వేధింపులు, హింసకు గురైనట్లు భార్య తన పిటీషన్లో పేర్కొంది. భార్య వాదనలతో ఏకీభవించిన ముంబై కోర్టు.. 2017లో తీర్పు వెళ్లడించింది. భార్యకు ప్రతినెలా లక్షా 50 వేల రూపాయల భరణం, సెకండ్ హ్యాండ్ అంటూ కించపరిచినందుకు 3 కోట్ల రూపాయల పరిహారం, కోర్టు ఖర్చుల కింద 50 వేల రూపాయలు చెల్లించాలని భర్తను ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ..భర్త సెషన్స్ కోర్టుకు వెళ్లాడు. అక్కడ కూడా భార్యకు అనుకూలంగానే తీర్పు వచ్చింద. ఇక లాభం లేదని ఈ తీర్పులపై ముంబై హైకోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు చేశాడు భర్త. సుదీర్ఘ విచారణ తర్వాత.. ముంబై హైకోర్టు కింది రెండు కోర్టుల తీర్పుని సమర్థిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. భార్యను సెకండ్ హ్యాండ్ అంటూ కించపరిచి.. మానసిక వేదనకు గురి చేసిన భర్త.. 3 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాల్సిందే అని ముంబై హైకోర్టు తీర్పు వెల్లడించింది. భార్య ఆత్మగౌరవాన్ని దెబ్బతిసే అధికారం భర్తకు లేదని స్పష్టం చేసింది. ఇరువురు ఉన్నత చదువులు చదువులు, మంచి ఉద్యగాల్లో స్థిరపడినవారు, పైగా సమాజంలో తమకంటూ ఓ గుర్తింపు ఉన్నవారు.. అలాంటివారు మరోకరి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడ సబబు కాదని పేర్కొంది. ముఖ్యంగా భార్యను సెకండ్ హ్యాండ్ అంటూ.. ఓ మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటం అనేది సామాజిక రుగ్మతగా పరిగణించాలని స్పష్టం చేసింది. ఇలాంటి వాటిని ఉపేక్షించటం అనేది సహించరాని నేరం అని పేర్కొంది. ఉన్నత పదవుల్లో ఉండేవారు.. మరొకరికి మార్గదర్శకంగా ఉండాలని వక్కాణించింది. అస్సలు ఒక మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉండకూడదు అంటూ మండిపడింది ముంబై హైకోర్టు. అందుకుగానూ భార్యకు రూ. 3 కోట్ల రూపాయలు చెల్లించాల్సిందేనని భర్తను ఆదేశిస్తూ ధర్మాసనం తీర్పు వెల్లడించింది. ఈ తీర్పు నిజంగా ఎందరో భర్తలకు కనువిప్పు అనే చెప్పాలి. ఎప్పుడూ భార్యను చులకన చేసి ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా భర్తలకు ఈ తీర్పు పెద్ద చెంపదెబ్బ అని చెప్పొచ్చు. (చదవండి: అందం కోసం పాము రక్తమా? ఎక్కడో తెలుసా!) -
సాయిబాబా నిర్దోషి
సాక్షి, న్యూఢిల్లీ: మావోయిస్టులతో సంబంధాల కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబాతోపాటు మరో ఐదుగురు నిందితులను బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ నిర్దోషులుగా ప్రకటించింది. 2017లో సాయిబాబాతో పాటు ఇతరులను దోషులుగా నిర్ధారిస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పుపై నాగ్‌పూర్ బెంచ్ న్యాయమూర్తులు జస్టిస్ వినయ్ జోషీ, జస్టిస్ వాల్మికి మెనెజెస్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. నిందితులపై వచ్చిన ఆరోపణలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని, అందుకే వారిపై అభియోగాలను కొట్టివేస్తున్నట్లు పేర్కొంది. నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం తోసిపుచ్చింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని, దేశంపై యుద్ధంపై చేసే కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ 2017 మార్చిలో సాయిబాబా, ఇతరులను మహారాష్ట్రలోని గడ్చిరోలీ సెషన్స్ కోర్టు దోషులుగా నిర్ధారించింది. దీనిపై సాయిబాబా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. 2022 అక్టోబరు 14న జస్టిస్ రోహిత్ నేతృత్వంలోని ధర్మాసనం సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తదుపరి రోజు శనివారమైనప్పటికీ ప్రత్యేకంగా విచారించింది. హైకోర్టు ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసింది. అనంతరం జస్టిస్ షా, జస్టిస్ రవికుమార్ సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపి 2023 ఏప్రిల్ 19న బాంబే హైకోర్టు తీర్పును పక్కనపెట్టింది. ఈ తీర్పును మళ్లీ పరిశీలించాలని బాంబే హైకోర్టుకు పంపించింది. ఈ నేపథ్యంలో జస్టిస్ జోషీ, జస్టిస్ వాల్మికిల హైకోర్టు ధర్మాసనం విచారించి, సాయిబాబా, ఇతరులను నిర్దోషులుగా ప్రకటించింది. ప్రొఫెసర్ సాయిబాబా 2014లో అరెస్టయ్యారు. ప్రస్తుతం నాగ్‌పూర్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. పదేళ్ల పోరాటం తర్వాత ఊరట దక్కింది బాంబే హైకోర్టు తీర్పు పట్ల సాయిబాబా భార్య వసంత ఆనందం వ్యక్తం చేశారు. పదేళ్ల తర్వాత ఊరట లభించిందన్నారు. సాయిబాబాకు అండగా నిలిచిన లాయర్లకు, సామాజిక కార్యకర్తలకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. తన భర్త పది సంవత్సరాలు జైలులో ఉన్నారని, ఆర్థికంగా, మానసికంగా తాము ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామని చెప్పారు. సాయిబాబా గురించి ప్రజలకు వాస్తవాలు తెలుసని, ఆయన పట్ల వారికి సంపూర్ణ విశ్వాసం ఉందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో మహారాష్ట్ర సర్కారు పిటిషన్ మావోయిస్టులతో సంబంధాల కేసులో మాజీ ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు మంగళవారం అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. బాంబే హైకోర్టు తీర్పును కొట్టివేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం విన్నవించింది. సాయిబాబాతోపాటు ఇతరులను నిర్దోషులుగా నిర్ధారిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుపై సుప్రీంకోర్టును ఆశ్రయించామని మహారాష్ట్ర అడ్వొకేట్ జనరల్ బీరేంద్ర షరాఫ్ ఈ సందర్భంగా చెప్పారు. నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును కొంతకాలం నిలిపివేయాలని కోరుతూ హైకోర్టు ధర్మాసనం ముందు అప్లికేషన్ దాఖలు చేశారు. ధర్మాసనం స్పందిస్తూ.. న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని పునఃపరిశీలించే అధికారం ఉండదని, ఇది వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన విషయమని స్పష్టం చేసింది. అడ్వొకేట్ జనరల్ దాఖలు చేసిన అప్లికేషన్‌ను కొట్టివేసింది. -
హైకోర్టును ఆశ్రయించిన ఐదేళ్ల బుడ్డోడు.. కారణమిదే!
యూపీలోని కాన్పూర్‌కు చెందిన ఓ బుడ్డోడు అలహాబాద్ హైకోర్టును ఒక ప్రత్యేక అభ్యర్థనతో ఆశ్రయించాడు. తాను చదువుకుంటున్న పాఠశాల సమీపంలో మద్యం దుకాణం ఉందని, దానిని తొలగించాలంటూ ఆ ఐదేళ్ల చిన్నారి హైకోర్టులో పిటిషన్ వేశాడు. మందుబాబులు పాఠశాలను అసాంఘిక కార్యకలాపాలకు ఆడ్డాగా మార్చారని ఆ చిన్నారి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. వారి కారణంగా తమ చదువులు దెబ్బతింటున్నాయని పేర్కొన్నాడు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని యూపీ ప్రభుత్వాన్ని కోరింది. కాన్పూర్‌లోని ఓ పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్న ఐదేళ్ల చిన్నారి అథర్వ తన కుటుంబ సభ్యుల సాయంతో కోర్టుకు ఈ ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారించిన హైకోర్టు ప్రతి సంవత్సరం ఈ మద్యం దుకాణం కాంట్రాక్టును ఎలా పునరుద్ధరిస్తున్నారని యూపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ పాఠశాల కాన్పూర్ నగరంలోని ఆజాద్ నగర్ ప్రాంతంలో ఉంది. అక్కడికి 20 మీటర్ల దూరంలో మద్యం దుకాణం ఉంది. నిబంధనల ప్రకారం మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల తర్వాతే తెరవాలి. అయితే తరచూ ఉదయం ఆరు గంటల నుంచే ఇక్కడ మద్యం విక్రయాలు జరుగుతున్నాయని అథర్వ కోర్టుకు తెలిపాడు. అథర్వ కుటుంబ సభ్యులు ఈ విషయమై కాన్పూర్ అధికారులకు, యూపీ ప్రభుత్వానికి అనేకసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాగా ఈ పాఠశాల 2019లో ప్రారంభమయ్యిందని, మద్యం దుకాణానికి సంబంధించిన ఒప్పందం దాదాపు 30 ఏళ్లనాటిదని వైన్స్ దుకాణ యజమాని వాదనకు దిగారు. ఈ నేపధ్యంలో అధర్వ తన కుటుంబ సభ్యుల సహకారంతో అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసును జస్టిస్ మనోజ్ కుమార్ గుప్తా, జస్టిస్ క్షితిజ్ శైలేంద్రలతో కూడిన డివిజన్ బెంచ్ విచారిస్తోంది. ఈ కేసులో తదుపరి విచారణ మార్చి 13న జరగనుంది. -
న్యాయస్థానాల్లో ‘పెండింగ్’ భారం ఎంత?
దేశంలోని పలు కోర్టుల్లో లెక్కకుమించిన కేసులు పెండింగ్‌లో ఉంటున్నాయనే విషయం విదితమే. అయితే నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ (ఎన్‌జేడీజి) అందించిన తాజా సమాచారం చూస్తే ఎవరైనా నివ్వెరపోవాల్సిందే. దేశంలోని కోర్టుల్లో 4.47 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం 25 హైకోర్టుల్లో అలహాబాద్ హైకోర్టు 10.74 లక్షల కేసులతో ముందుంది. దీని తర్వాత బాంబే హైకోర్టులో 7.13 లక్షల కేసులు, రాజస్థాన్ హైకోర్టులో 6.67 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ (ఎన్‌జీడీజీ) అందించిన తాజా డేటాలో ఈ వివరాలు ఉన్నాయి. 2018 నుంచి పెండింగ్ కేసుల సంఖ్య పెరిగింది. అలహాబాద్ హైకోర్టులో పెండింగ్ కేసులు 50.95 శాతం మేరకు పెరిగాయి. బాంబే హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులు 53.85 శాతం మేరకు పెరిగాయి. అన్ని హైకోర్టుల్లో మొత్తం 62 లక్షల కేసులు పెండింగ్‌లో ఉండగా, వీటిలో 71.6 శాతం సివిల్ కేసులు, 28.4 శాతం క్రిమినల్ కేసులు. 2018 నుంచి ఈ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య పెరిగింది. 24.83 శాతం కేసులు 5 నుంచి 10 ఏళ్ల క్రితం నాటివి. 24.83 శాతం కేసులు 5 నుంచి 10 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. 18.25 శాతం కేసులు 10 నుంచి 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. పలు నివేదికల ప్రకారం పెండింగ్‌లో ఉన్న కేసులకు న్యాయమూర్తుల సంఖ్య సరిపోకపోవడమే ప్రధాన కారణం. 2022 మే నాటికి దాదాపు 25,600 మంది న్యాయమూర్తులు నాలుగు కోట్లకు పైగా పెండింగ్‌లో ఉన్న కేసులను విచారించే లేదా తీర్పునిచ్చే పనిలో ఉన్నారు. -
భర్తకు ఆదాయం లేకపోయినా..మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందేనా?
ఇటీవల కాలంలో దంపతుల మధ్య సయోధ్య లేకపోవడం వల్లనో లేక ఇతరత్ర కారణాల వల్లనో విడాకులకు దారితీస్తున్నాయి. ఫ్యామిలీ కోర్టుల్లో అందుకు సంబంధించిన కేసులు సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇద్దరి సమ్మతంతో విడిపోయినప్పటికీ స్త్రీకి ఎంతో కొంత భరణం ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని క్లైయిమ్ చేసుకోవాల్సింది సదరు మహిళే. ఒకవేళ ఆమె క్లైయిమ్ చేసుకున్నప్పటికీ కొందరూ ప్రబుద్ధులు తనకు ఆదాయం లేదని, లేదా కుటుంబాన్ని చూసుకోవాల్సి ఉందంటూ భరణం ఇవ్వకుండా తప్పించుకునే ప్లాన్లు వేస్తుంటారు. దీంతో సదరు మహిళలు ఇబ్బందులు పడుతుంటారు. అయితే అలాంటి ఎత్తుగడలకు చెక్‌పెడుతూ అలహాబాద్ ధర్మాసనం సంచలన తీర్పు ఇచ్చింది. అసలేం జరిగిందంటే..అలహాబాద్‌కు చెందిన ఓ జంటకు 2015లో వివాహం అయ్యింది. అదనపు కట్నం డిమాండ్ చేస్తున్నారని సదరు మహిళ అత్తమామలపై ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఆమె 2016 నుంచి తల్లిదండ్రులతోనే జీవిస్తుంది. అయితే ఫామిలీ కోర్టు ఆమెకు నెలకు రూ. 2000 భరణం ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ సదరు వ్యక్తి హైకోర్టుని ఆశ్రయించాడు. తనకు ఆదాయం లేదని, తన తల్లిదండ్రులను, అక్కచెల్లెళ్లను చూసుకోవాల్సి ఉండటంతో తాను భరణం చెల్లించలేనంటూ పిటీషన్ వేశాడు. అంతేగాదు తన భార్య టీచింగ్ ద్వారా నెలకు రూ. 10 వేలకు సంపాదిస్తున్నారని కాబట్టి తాను ఇవ్వలేనని పిటిషన్లో పేర్కొన్నాడు. అయితే ధర్మాసనం ఆదాయం లేకపోయినా లేదా ఉద్యోగం లేకపోయినా రోజూ కూలిగా రూ. 300 నుంచి రూ. 400 వరకు సంపాదించొచ్చు అంటూ ఆ వ్యక్తికి మొట్టికాయలు వేసింది. ఉద్యోగం ఉన్నా, లేకపోయినా విడిపోయిన భార్యకు మెయింటెనెన్స్ చెల్లించాల్సిందేనని పేర్కొంది ధర్మాసనం. ఆ వ్యక్తి పిటిషన్‌ను జస్టిస్ రేణూ అగర్వాల్ సారధ్యంలోని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ తోసి పుచ్చింది. సదరు వ్యక్తి ఆయన భార్యకు చెల్లించాల్సిన మొత్తం భరణం రికవరీ బాధ్యతలు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ జడ్జిని ఆదేశించారు జస్టిస్ రేణు అగర్వాల్. అలాగే సదరు వ్యక్తి తన భార్య ఉద్యోగం చేస్తుందనేందుకు ఆధారాలు సమర్పించడంలో కూడా విఫలమయ్యారని హైకోర్టు పేర్కొంది. అదీగాక ఆ వ్యక్తి ఆరోగ్యంగానే ఉన్నందున కార్మికుడిగా పని చేసైనా భార్యకు భరణం ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. కాగా, ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సదరు వ్యక్తి గతేడాది ఫిబ్రవరి 21న రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, సీఆర్పీసీ 125 సెక్షన్ కింద భార్యకు భరణం చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు ఆదేశించడం జరిగింది. ఇలాంటి సమస్యలనే ఫేస్ చేస్తుంటే..భయపడొద్దు. ధైర్యంగా మహిళలకు అనుకూలమైన చట్టాల గురించి సవివరంగా తెలుసుకుని కోర్టులో పోరాడండి. అదే సమయంలో మహిళలు కూడా తమ వైవాహిక బంధాన్ని చిన్న చిన్న విషయాలకు తెంచుకునే యత్నం చేయకుండా పెద్దలతో సయోధ్య చేసుకునేలా ప్రయత్నించి, మను వివాహ వ్యవస్థను కాపాడుకునే యత్నం చేద్దాం. (చదవండి: జీవితాన్ని దిద్దుకుంది... పేదల పక్షాన నిలిచింది) -
వికేంద్రీకరణను అడ్డుకుంటున్న విజ్ఞత లేని పార్టీలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించకుండా కొన్ని విజ్ఞత లేని రాజకీయ పార్టీలు అడ్డుకుంటున్నాయని పరిపాలనా వికేంద్రీకరణ నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ హనుమంతు లజిపతిరాయ్ ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన గురువారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ పరిపాలనా రాజధాని విషయంలో న్యాయపరమైన నిర్ణయం మరింత ఆలస్యం కావడంపై విచారం వ్యక్తంచేశారు. ఏదో ఒకరకమైన సాంకేతిక అంశాలను లేవనెత్తి సుప్రీంకోర్టులో త్వరితగతిన తీర్పు రాకుండా విజ్ఞత లేని రాజకీయ పార్టీలు అడ్డుకోవడాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉండాలని నిర్ణయించే అధికారం ఆయా ముఖ్యమంత్రులకు లేదని తెలిపే అధికరణ భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదని ఆయన స్పష్టంచేశారు. మారుతున్న అభివృద్ధి.. అవసరాల దృష్ట్యా పరిపాలనా వికేంద్రీకరణను ఇప్పటికే ప్రపంచంలో 14కు పైగా దేశాలు పాటిస్తున్నాయని చెప్పారు. మన దేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో హైకోర్టు ఒకచోట ఉంటే శాసనసభ వ్యవహారాలు మరోచోట ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. ఇవి చదవండి: Fact Check: ‘మీటర్ల’ కొద్దీ అసత్యాలు అల్లేస్తున్నారు! -
కొలీజియం సిఫార్సుల అమలేదీ?
న్యూఢిల్లీ: హైకోర్టు న్యాయమూర్తుల బదిలీల విషయంలో సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం, నచి్చన జడ్జిలనే బదిలీ చేయడం, ఇతరులను పెండింగ్‌లో పెట్టడంపై సుప్రీంకోర్టు ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి వైఖరి తప్పుడు సంకేతాలను పంపిస్తుందని వెల్లడించింది. 11 మంది జడ్జిలను బదిలీ చేయాలని కొలీజియం సిఫార్సు చేయగా, ఐదుగురిని కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. మరో ఆరుగురి బదిలీ వ్యవహారం పెండింగ్‌లో ఉంది. కొలీజియం సిఫార్సుల అమలు విషయంలో 2021 నాటి సుప్రీంకోర్టు తీర్పునకు కేంద్ర న్యాయ శాఖ కట్టుబడటం లేదని, కోర్టు ధిక్కరణ కింద చర్యలు చేపట్టాలని కోరుతూ బెంగళూరు అడ్వొకేట్స్ అసోసియేషన్‌తోపాటు మరికొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాంశు ధూలియా ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. హైకోర్టు జడ్జిలుగా పలువురి పేర్లను కొలీజియం ఇటీవల సిఫార్సు చేయగా, 8 మంది పేర్లకు కేంద్రం ఇంకా ఆమోదం తెలియజేయాలని గుర్తుచేసింది. కేంద్రం జడ్జిలుగా నియమించిన వారికంటే వీరిలో కొందరు సీనియర్లు ఉన్నారని వెల్లడించింది. -
కుక్క కాటు.. ఒక్కో పంటి గాటుకు రూ.10వేల పరిహారం!
చండీగఢ్: కుక్క కాటు కేసులపై హర్యానా-పంజాబ్ హైకోర్టులు సంచలన తీర్పు వెలువరించింది. కుక్క కాటుపై రాష్ట్ర ప్రభుత్వాలే ప్రధాన బాధ్యత వహించాలని ధర్మాసనం తెలిపింది. కుక్క కాటు కేసుల్లో ఒక్కో పంటి గాటుకు రూ.10,000 నష్టపరిహారం చెల్లించాలని తీర్పు వెలువరించింది. కుక్క కాటు ఘటనల్లో 0.2 సెంటీమీటర్ల కోత పడితే రూ.20,000 బాధితునికి చెల్లించాలని ఆదేశించింది. కుక్క కాటు కేసులో దాఖలైన 193 కేసుల్లో న్యాయస్థానం విచారణ చేపట్టింది. వీధికుక్కల బెడదపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ తీర్పు వెలువడింది. వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 49 ఏళ్ల పరాగ్ దేశాయ్ అక్టోబర్‌లో వీది కుక్కలు వెంబడించిన ఘటనలో మరణించారు. వీధికుక్కలు ఆయన్ని వెంబడించగా పడిపోవడంతో తీవ్ర రక్తస్రావం అయిందని.. ఆ కారణంగా దేశాయ్ మరణించారని సంబంధిత ఆసుపత్రి ఇటీవల ప్రకటనలో పేర్కొంది. ఈ విషాద ఘటన అనంతరం సోషల్ మీడియాలో వీధి కుక్కల సమస్యను పరిష్కరించాలని పెద్ద ఎత్తున చర్చ సాగింది. పంజాబ్, హర్యానా, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌లలో నమోదైన కుక్క కాటు కేసులపై ఒక కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు కోరింది. జంతువుల దాడి కేసుల్లో చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని నిర్ణయించాలని తీర్పులో స్పష్టం చేసింది. అయితే.. వీది కుక్కలతో పాటు ఆవులు, ఎద్దులు, గాడిదలు, గేదెలు, అడవి, పెంపుడు జంతువులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇదీ చదవండి: Liquor Sale In Delhi: ‘దీపావళి మద్యం’తో ఢిల్లీ సర్కారుకు భారీ ఆదాయం! -
పొలిటికల్ నేతలపై క్రిమినల్ కేసులు.. సుప్రీం కీలక ఆదేశాలు
సాక్షి, ఢిల్లీ: తీవ్రమైన నేరాలకు పాల్పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై జీవితకాల నిషేధం విధించాలని(క్రిమినల్ కేసులకు సంబంధించి) కోరుతూ వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అటువంటి కేసులను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి చర్యలు తీసుకునే బాధ్యతను సుప్రీంకోర్టు.. హైకోర్టులకు అప్పగించింది. వివరాల ప్రకారం.. దేశంలో తీవ్రమైన నేరాలకు పాల్పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులను త్వరితగతిన పరిష్కరించే విషయంలో, ఏకరీతి మార్గదర్శకాలను రూపొందించడం కష్టమని సుప్రీంకోర్టు వ్యాఖ్యనించింది. ఇదే సమయంలో అటువంటి కేసులను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి చర్యలు తీసుకునే బాధ్యతను హైకోర్టులకు అప్పగించింది. ఈ మేరకు కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయాలని, ఈ కేసులను ఏడాదిలోగా పరిష్కరించేలా చూడాలని అన్ని హైకోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించినట్లు పిటిషనర్, న్యాయవాది అశ్విన్ ఉపాధ్యాయ్ తెలిపారు. Supreme Court issues directions for speedy disposal of criminal cases against MP/MLAs. Supreme Court says it would be difficult for it to form a uniform guideline for trial courts relating to speedy disposal of cases against MP/MLAs. Supreme Court asks High Courts to register a… pic.twitter.com/O2izpfV3Nl— ANI (@ANI) November 9, 2023 సుప్రీం కోర్టు మార్గదర్శకాలు ఇవే.. ►ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుల సత్వర పరిష్కారాన్ని పర్యవేక్షించడానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలి. ►కేసులు త్వరగా పరిష్కరించడాన్ని, పర్యవేక్షించడానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తప్పనిసరిగా ప్రత్యేక టైటిల్ ఏర్పాటు చేయాలి ►అవసరాన్ని బట్టి ప్రత్యేక బెంచ్ క్రమ వ్యవధిలో కేసులు లిస్ట్ చేయాలి ►కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు హైకోర్టు తగిన ఆదేశాలు ఇవ్వాలి. VIDEO | "Today, the Supreme Court has given a historic verdict. The Supreme Court judgment has come with regard to our first prayer. The court has directed all the high courts to constitute a special bench to monitor cases of MPs, MLAs and ensure that these cases are decided… pic.twitter.com/WgcLerxIoR— Press Trust of India (@PTI_News) November 9, 2023 -
రాజ్ భవన్ లో ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ జి.నరేందర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం
-
ప్రేమ పెళ్లిళ్లను పెద్దలు కాదనలేరు: ఢిల్లీ హైకోర్టు
ఇకపై మేజర్లయిన పిల్లల పెళ్లిళ్లను పెద్దలు అడ్డుకోలేరు. వివాహానికి తగిన వయసు కలిగిన యువతీయువకులు తమకు ఇష్టమైన భాగస్వామిని వివాహం చేసుకోవచ్చని, ఇటువంటి సందర్భంలో ఆ జంటల వివాహానికి తల్లిదండ్రులు లేదా వారి కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పలేరని, రాజ్యాంగం ఆ జంటకు రక్షణ కల్పిస్తుందని ఢిల్లీ హైకోర్టు తేల్చిచెప్పింది. తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్న జంటలకు పోలీసులు రక్షణ కల్పిస్తారని, అవసరమైన పక్షంలో వారి కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు రక్షణ అందిస్తారని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. భార్యాభర్తల వివాహ హక్కును ఏ విధంగానూ తక్కువ చేయకూడదని, ఇలాంటి జంటలకు రక్షణ కల్పించాల్సిన రాజ్యాంగపరమైన బాధ్యత ఆ రాష్ట్రంపై ఉందని జస్టిస్ తుషార్ రావు గేదెల అభిప్రాయపడ్డారు. ఢిల్లీ హైకోర్టు ఒక కేసులో.. తల్లిదండ్రుల ఇష్టానికి విరుద్ధంగా వివాహం చేసుకున్న ఒక జంటకు పోలీసు రక్షణ కల్పిస్తూ, మేజర్లయిన యువతీయువకులు తమకు ఇష్టమైన వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం రాజ్యాంగం కల్పించిందని కోర్టు పేర్కొంది. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఒక జంట న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. వీరిలో భర్తపై నమోదైన తప్పుడు ఎఫ్ఐఆర్ను గత ఆగస్టులో కోఆర్డినేట్ బెంచ్ రద్దు చేసిందని జస్టిస్ గేదెలకు చెప్పారు. కాగా ఎఫ్ఐఆర్ పెండింగ్‌లో ఉన్న సమయంలోనే వారు వివాహం చేసుకుని, ఆనందంగా జీవిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ దంపతులకు హాని జరగకుండా చూసుకోవాలని ఢిల్లీ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఇది కూడా చదవండి: ‘రెడ్ లైట్ ఆన్- వెహికిల్ ఆఫ్’ అంటే ఏమిటి? ఢిల్లీలో ఎందుకు అమలు చేస్తున్నారు? Right To Marry Person Of Choice Protected Under Constitution, Not Even Family Members Can Object: Delhi High Court @nupur_0111 https://t.co/JEDBQuyQI8 — Live Law (@LiveLawIndia) October 26, 2023