జైపూర్: రాజస్తాన్ హైకోర్టులో తొలిసారిగా భార్యభర్తలిద్దరూ న్యాయమూర్తులుగా సేవలందించనున్నారు. న్యాయమూర్తిగా జస్టిస్ శుభా మెహతా తాజాగా బాధ్యతలు చేపట్టారు. ఆమె భర్త జస్టిస్ మహేంద్ర గోయెల్ 2019 నుంచి అక్కడ న్యాయమూర్తిగా ఉన్నారు. మద్రాసు, పంజాబ్ హైకోర్టుల్లోనూ గతం ఇలా భార్యాభర్తలు న్యాయమూర్తులుగా చేశారు.
మద్రాసు హైకోర్టులో జస్టిస్ మురళి శంకర్ కుప్పురాజు, ఆయన భార్య జస్టిస్ తమిళసెల్వి 2020లో ఒకేసారి న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించారు. 2019 నవంబర్‌లో పంజాబ్‌లో జస్టిస్ వివేక్ పురీ, ఆయన భార్య జస్టిస్ అర్చన పురీ కూడా ఒకే రోజు న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు.
చదవండి: ఫ్యాక్టరీలో భారీ పేలుడు... 13 మంది మృతి
Comments
Please login to add a commentAdd a comment