lawer
-
YSRCP కార్యకర్తల అరెస్టులు.. ప్రభుత్వ లాయర్లపై హైకోర్టు ఆగ్రహం
-
లీలా సేథ్‌ను ‘మదర్ ఆఫ్ లా’ అని ఎందుకంటారంటే..
భారత ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన మూడు ప్రధాన విభాగాలు కనిపిస్తాయి. వాటిలో మొదటిది న్యాయవ్యవస్థ, రెండవది కార్యనిర్వాహక వ్యవస్థ మూడవది శాసనసభ. ఈ మూడు రంగాల్లోనూ మహిళల వాటా గణనీయంగా పెరిగింది. వీటిలో న్యాయవ్యవస్థ విషయానికి వస్తే ఈ రంగంలో మహిళల పాత్ర కీలకంగా మారింది.ప్రస్తుతం దేశంలో పలువురు మహిళా న్యాయమూర్తులు, న్యాయవాదులు ఉన్నారు. అయితే దేశంలోని హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన లీలా సేథ్ పేరు ముందు వరుసలో కనిపిస్తుంది. ఈరోజు (అక్టోబర్ 20)న ఆమె జన్మదినం. ఆమెను ‘మదర్ ఆఫ్ లా అని పిలుస్తారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి వరకూ సాగిన ఆమె ప్రయాణం అంత సులభంగా సాగలేదు.1930, అక్టోబర్ 20న ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నగరంలో లీలా సేథ్ జన్మించారు. తన 11 ఏళ్ల వయసులోనే ఆమె తండ్రిని కోల్పోయారు. తల్లే ఆమెను పెంచి పెద్దచేసి, ఉన్నత చదువులు చదివించారు. చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండే లీలా సేథ్ డార్జిలింగ్‌లో హైస్కూలు విద్య పూర్తి చేశారు. అనంతరం ప్రేమ్ సేథ్‌ను వివాహం చేసుకున్నాక, భర్తతో కలిసి లండన్ వెళ్లారు. అక్కడ గ్రాడ్యుయేషన్, తరువాత న్యాయశాస్త్రం అభ్యసించారు. ఆమె లండన్ బార్ పరీక్షల్లో అగ్రస్థానంలో నిలిచారు.అనంతరం భారత్ తిరిగి వచ్చిన ఆమె తొలుత కోల్‌కతాలో న్యాయవాద వృత్తిని చేపట్టారు. ఆ తర్వాత పట్నాలో, ఢిల్లీలో తన న్యాయవాద వృత్తిని కొనసాగించారు. 1978లో లీలా సేథ్ ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానూ వ్యవహరించారు. భారతదేశ చరిత్రలో తొలిసారిగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన మహిళగా ఆమె రికార్డులలోకి ఎక్కారు. ఈ నేపధ్యంలోనే ఆమెను ‘మదర్ ఆఫ్ లా’ అని అంటారు. నిర్భయ గ్యాంగ్ రేప్ దరిమిలా కేసు విచారణకు ఏర్పాటైన జస్టిస్ వర్మ కమిటీలో లీలా సేథ్ సభ్యురాలు. లీలా సేథ్ 2017లో తన 83 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఇది కూడా చదవండి: అదిరిపోయే దీపావళి గిఫ్ట్: ఆనందంలో ఉద్యోగులు -
మళ్లీ పెళ్లికి సిద్ధమైన.. ముగ్గురు భార్యల ముద్దుల లాయర్‌కు దేహశుద్ది!
జార్ఖండ్‌లోని రాంచీ సివిల్ కోర్టు పరిసరాల్లో ఒక న్యాయవాదిని అతని భార్యలతో పాటు ఇతర లాయర్లు చావచితక్కొట్టారు. తన భర్త నాలుగో పెళ్లికి సిద్ధం అయ్యాడని అతని ముగ్గురు భార్యలు ఆరోపిస్తున్నారు. సదరు న్యాయవాది భార్యలకు తమ భర్త నాలుగో వివాహం చేసుకునేందుకు సిద్ధం అయ్యాడనే విషయం తెలియగానే వారు కోర్టుకు చేరుకుని, భర్తపై దాడి చేశారు. దీంతో కోర్టు పరిసరాల్లో కలకలం చెలరేగింది. కోర్టు ప్రాంగణంలో ఆ లాయర్‌కు అతని ముగ్గురు భార్యలకు మధ్య జరిగిన వివాదం స్థానికంగా చర్చాంశనీయంగా మారింది. ఈ భార్యాభర్తల గొడవలో జోక్యం చేసుకున్న స్థానికులంతా కలసి ఆ లాయర్‌పై తలొదెబ్బ వేశారు. తమ భర్త తమ కళ్లుగప్పి, నాలుగో వివాహం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని, అతనికి బుద్ధి చెప్పేందుకే ఇక్కడికి వచ్చామని అతని భార్యలు మీడియాకు తెలిపారు. నయీముద్దీన్ ఉరఫ్ నూరి అనే న్యాయవాది ముగ్గురు భార్యలు మీడియాతో మాట్లాడుతూ తమ భర్త అతని దగ్గర పనిచేసే జూనియర్‌తో అనైతిక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించారు. ఆమెను నాలుగో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని తెలిపారు. ఆ న్యాయవాది ముగ్గురు భార్యలు ఈ విషయమై మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నయీముద్దీన్ రాంచీలోని సివిల్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఇటీవల అతని ముగ్గురు భార్యలు అతనిని కలుసుకునేందుకు కోర్టుకు వచ్చినప్పుడు అతను వారిని నిందించడం మొదలు పెట్టాడు. దీంతో ఆ ముగ్గురు భార్యలు అతనిపై చేయిచేసుకున్నారు. నయీముద్దీన్ మొదటి భార్య అదే సివిల్ కోర్టు ఉద్యోగి. దీంతో ఆమె సహోద్యోగులు ఆమెకు సహకారం అందిస్తూ, ఆ న్యాయవాదిపై దాడి చేశారు. ఈ ఉదంతంపై భార్యల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: వైట్‌హౌస్ భారతీయ- అమెరికన్ సలహాదారు కీలక నిర్ణయం.. ‘డ్యూక్’కు తిరుగుముఖం! -
డింపుల్‌తో డీసీపీ అసభ్యంగా ప్రవర్తించారు : న్యాయవాది
హీరోయిన్ డింపుల్ హయాతి, డీసీపీ రాహుల్ హెగ్డేల మధ్య వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ ఇష్యూపై డింపుల్ న్యాయవాది పాల్ సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. జంతువులను హింసిస్తుంటే డీసీపీని డింపుల్ వారించిందని, దీంతో ఆయన కక్ష పెంచుకున్నారని తెలిపారు. ''డింపుల్‌తో డీసీపీ చాలాసార్లు ర్యాష్‌గా మాట్లాడారు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. డింపుల్ పార్లింగ్ ప్లేసులో కావాలనే కోన్స్ పెట్టారు. అయినా రోడ్డుపై వుండాల్సిన సిమెంట్ బారికేడ్స్, కోన్స్ ప్రైవేట్ స్థలంలోకి ఎలా వచ్చాయి? ఇదే విషయాన్ని రెండు నెలలుగా అడుగుతున్నాం. జంతువులను హింసిస్టుంటే డింపుల్ వారించింది. అందుకే ఆ కక్షతోనే డీసీపీ ఇలా తప్పుడు కేసు పెట్టారు. డింపుల్ ఎక్కడా కారును తన్నిన ఫుటేజీ లేదు. కానీ ఆమెను తప్పుగా చిత్రీకరించడానికి చూస్తున్నారు. జరిగిన పరిణామాలు చూసి డింపుల్ మానసిక ఒత్తిడికి గురైంది, ఆమె బయటకు వెళ్లేందుకు కూడా భయపడుతుంది. డీసీపీ నుంచి డింపుల్‌కు ప్రాణహాని ఉంది. ఇప్పటికే ఆమెకు చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈ కేసను న్యాయపరంగా ఎదుర్కొంటాం'' అంటూ ఆమె న్యాయవాది పేర్కొన్నారు. -
అతీక్ అహ్మద్ లాయర్‌కు మరో షాక్! ఫొటోలు షేర్ చేశాడని క్రిమినల్ కేసు
లక్నో: గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ లాయర్ ఖాన్ సౌతల్ హనీఫ్పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఉమేష్ పాల్ ఫొటోలను ఇతను అతీక్ కుమారుడు అసద్‌కు పంపినట్లు తెలిపారు. ఆ మరునాడే ఉమేశ్ దారుణ హత్యకు గురయ్యాడు. అసద్ మరికొందరితో కలిసి ఉమేష్‌ను ఇంటిబయటే కాల్చి చంపాడు. ఉమేశ్‌పాల్ హత్యకు సంబంధించి క్రిమినల్ కాన్స్పిరసీ అభియోగాలతో హానీఫ్‌పై సెక్షన్ 120-బీ కింద ధుమన్‌గంజ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు డీసీపీ దీపక్ భూకార్ వెల్లడించారు. ఉమేశ్ కిడ్నాప్ కేసుకు సంబంధించి హానీఫ్కు ఇప్పటికే యావజ్జీవ కారాగార శిక్ష విధించింది న్యాయస్థానం. ప్రస్తుతం నైని కేంద్ర కారాగారంలో ఉన్నాడు. ఫొటోల వ్యవహారానికి సంబంధించి ఇతడ్ని రిమాండ్ కోసం పోలీసులు కోర్టును ఆశ్రయించనున్నారు. బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో ఉమేశ్ పాల్ కీలక సాక్షిగా ఉన్నాడు. ఇతడ్ని గతంలోనే ఓసారి కిడ్నాప్ చేసింది అతీక్ అహ్మద్ గ్యాంగ్. ఈ కేసులోనే హనీఫ్ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే ఫిబ్రవరి 24న ఉమేశ్ పాల్‌ను అతని ఇంటి ఎదుటే అతీక్ కుమారుడు అసద్, మరికొందరు తుపాకీతో కాల్పులు జరిపి హతమార్చారు. అనంతరం పరారయ్యారు. అయితే ఏప్రిల్ 13న అసద్‌ను ఎన్కౌంటర్లో హతమార్చారు యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఆ తర్వాత రెండు రోజులకే అతని తండ్రి అతీక్ అహ్మద్ కూడా దారుణ హత్యకు గురయ్యాడు. ప్రయాగ్ రాజ్ ఆస్పత్రికి పరీక్షల కోసం తీసుకెళ్లిన అతనిపై పోలీసులు, మీడియా ఎదుటే ముగ్గురు యువకులు తుపాకులతో కాల్పులు జరిపి హతమార్చిన ఘటన సంచలనం రేపింది. చదవండి: వాళ్లు కన్పిస్తే కాల్చి పడేయాలి.. గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్‌ను పొగుడుతున్నవారిపై కేంద్రమంత్రి ఫైర్.. -
చిట్టి రోబో.. – ద లాయర్
రోబోలు.. డ్యాన్సులు చేస్తున్నాయి.. ఫుట్‌బాల్ ఆడుతున్నాయి.. ఆకలిగా ఉందని హోటల్‌కు వెళ్తే నచ్చినవన్నీ వేడివేడిగా వడ్డించేస్తున్నాయి.. పాటలు పాడుతున్నాయి.. పాఠాలూ చెబుతున్నాయి.. చివరకు చైనాలో ఓ కంపెనీకి సీఈవోగా కూడా వ్యవహరిస్తున్నాయి. ఇదే క్రమంలో ఇప్పుడు ‘వకీల్’ అవతారంలో ప్రజల ముందుకు రాబోతోంది సరికొత్త రోబో. నిజమే.. యువరానర్.. నా క్లెయింట్ ఏ తప్పూ చేయలేదంటూ కోర్టులో వాదించబోతోంది. ఈ విషయాన్ని రోబో లాయర్ ›తయారీ సంస్థ డునాట్ పే ప్రకటించింది. ఎలాంటి రుసుం లేకుండా ట్రాఫిక్ చలానా కేసుల్ని వాదించేందుకు దీన్ని తయారు చేసినట్లు వెల్లడించింది. ఈనెల 22వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకు అమెరికా కోర్టులో ఈ రోబో లాయర్ మొదటిసారిగా ప్రత్యక్షమవ్వనుంది. మనుషులు తయారు చేసిన అద్భుత ఆవిష్కరణ రోబో. సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న కొద్దీ.. రోబోల వినియోగం విస్తృతమవుతోంది. అన్ని రంగాల్లోకి కృత్రిమ మేధస్సు కలిగిన రోబోలు అడుగుపెట్టేస్తున్నాయి. ఇప్పుడు న్యాయస్థానంలోనూ తనకు ఎదురు లేదని నిరూపించేందుకు రోబో సిద్ధమవుతోంది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఈ రోబో లాయర్‌ను అమెరికాకు చెందిన డునాట్ పే అనే స్టార్టప్ కంపెనీ ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ట్రాఫిక్ చలానాలకు సంబంధించిన కేసులన్నీ వాదించేలా ఈ రోబో పట్టు సాధించిందని సంస్థ వ్యవస్థాపకుడు జోషువా బ్రౌడర్ ప్రకటించారు. 2015 నుంచి పరిశోధనలు... జోషువా బ్రౌడర్ 2015లో ‘డునాట్ పే’ అనే లీగల్ సరీ్వసెస్ చాట్‌బాట్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచి రోబో లాయర్ తయారీపై పరిశోధనలు చేస్తూ.. ఎట్టకేలకు దాన్ని ఆవిష్కరించారు. దీనికి శిక్షణ ఇచ్చేందుకు చాలా సమయం పట్టిందని బ్రౌడర్ చెబుతున్నారు. పరిమితికి మించి వేగంగా వాహనాన్ని నడిపిన రెండు కేసులను ఈ రోబో లాయర్ తొలిసారిగా వాదించనుందని ప్రకటించారు. ఇది స్మార్ట్‌ఫోన్ సహాయంతో పనిచేస్తుందని చెప్పారు. కోర్టులో వాదన విన్న తర్వాత.. కౌంటర్‌గా వాదించాల్సిన అంశాలను ‘ఇయర్ ఫోన్’ ద్వారా సూచిస్తుందని.. కేవలం రోబో లాయర్ చెప్పిన విషయాలను మాత్రమే ప్రతివాది కోర్టుకు విన్నవిస్తారని స్పష్టం చేశారు. దీని వినియోగం వల్ల వేగంగా కేసులు పరిష్కారమయ్యే అవకాశముందని.. కోర్టు ఖర్చులు చాలా వరకు తగ్గుతాయని చెప్పారు. సహేతుక కారణాలు చూపించిన వారికి ఉచితంగా సేవలందించేందుకు సిద్ధమని ప్రకటించారు. చట్టం ఒప్పుకుంటుందా? వాద, ప్రతివాదనలు జరుగుతున్నప్పుడు న్యాయస్థానాల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించకూడదని యూఎస్ సుప్రీంకోర్టు నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో రోబోను వినియోగించడం సాధ్యమా అనే అంశంపై అందరిలోనూ సందేహాలు నెలకొన్నాయి. దీనిపై జోషువా స్పందించారు. ‘డునాట్ పే’ అనేది లీగల్ సరీ్వసులకు సంబంధించిన ఆన్లైన్ చాట్‌బాట్ అని స్పష్టం చేశారు. అందువల్ల న్యాయపరంగా వివాదం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. యూఎస్ సుప్రీంకోర్టులో లాయర్ రోబో చెప్పిన విషయాలను అక్షరం తప్పు లేకుండా చెప్పిన వారికి కోటి డాలర్లు బహుమతిగా ఇస్తానని జోషువా సవాల్ కూడా విసిరారు. భారతదేశంలోని చట్టాల ప్రకారమైతే రోబో లాయర్లను అనుమతించే అవకాశమే లేదని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఇందుకు ప్రస్తుతమున్న చట్టంలో మార్పులు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. అడ్వకేట్ చట్టం–1961 ప్రకారం రోబో లాయర్లను అనుమతించే ప్రొవిజన్ లేదని న్యాయవాది నమిత్ సక్సేనా పేర్కొన్నారు. న్యాయవాదులు ఏఐ ద్వారా వారికి అవసరమైన సమాచారాన్ని తీసుకునే వీలుందని న్యాయనిపుణుల అభిప్రాయపడుతున్నారు. - కె.జి.రాఘవేంద్రారెడ్డి (సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం) -
రోబో లాయర్!
వాషింగ్టన్: న్యాయవాదుల సేవలు నానాటికీ ఖరీదైన వ్యవహారంగా మారుతున్నాయి. ఈ భారీ ఫీజులతో పని లేకుండా ఓ రోబో లాయర్ మన తరఫున ఎంచక్కా కోర్టులో వాదిస్తే? బాగుంటుంది కదా! కృత్రిమ మేధతో పని చేసే అలాంటి రోబో లాయర్ ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికాలో అందుబాటులోకి రానుంది. డునాట్‌పే అనే కంపెనీ తయారు చేసిన ఈ రోబో వచ్చే ఫిబ్రవరిలో ఒకే కేసులో తన కక్షిదారుకు సహకరించనుంది. కోర్టులో వాదనలు జరిగినంతసేపూ సలహాలు సూచనలు అందించనుంది. స్మార్ట్ ఫోన్ సాయంతో వాదనలు వింటూ, ఏం చెప్పాలో, ఎలా స్పందించాలో తన కక్షిదారుకు ఎప్పటికప్పుడు ఇయర్ ఫోన్లో చెబుతుందట. అయితే కక్షిదారు పేరు, వాదనలు జరిగే కోర్టు తదితర వివరాలను సదరు కంపెనీ ప్రస్తుతానికి గోప్యంగా ఉంచుతోంది. స్టాన్‌ఫర్డ్ వర్సిటీకి చెందిన కంప్యూటర్ సైంటిస్ట్ జోషువా బ్రౌడర్ దీని వ్యవస్థాపకుడు. తన యాప్ ఆధారిత రోబో లాయర్లు మున్ముందు లాయర్ల వ్యవస్థ మొత్తాన్నీ భర్తీ చేయాలన్నది ఆయన ఆకాంక్ష! అదెంత మేరకు నెరవేరుతుందో చూడాలి. -
రాజస్తాన్ హైకోర్టులో న్యాయమూర్తుల జంట
జైపూర్: రాజస్తాన్ హైకోర్టులో తొలిసారిగా భార్యభర్తలిద్దరూ న్యాయమూర్తులుగా సేవలందించనున్నారు. న్యాయమూర్తిగా జస్టిస్ శుభా మెహతా తాజాగా బాధ్యతలు చేపట్టారు. ఆమె భర్త జస్టిస్ మహేంద్ర గోయెల్ 2019 నుంచి అక్కడ న్యాయమూర్తిగా ఉన్నారు. మద్రాసు, పంజాబ్ హైకోర్టుల్లోనూ గతం ఇలా భార్యాభర్తలు న్యాయమూర్తులుగా చేశారు. మద్రాసు హైకోర్టులో జస్టిస్ మురళి శంకర్ కుప్పురాజు, ఆయన భార్య జస్టిస్ తమిళసెల్వి 2020లో ఒకేసారి న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించారు. 2019 నవంబర్‌లో పంజాబ్‌లో జస్టిస్ వివేక్ పురీ, ఆయన భార్య జస్టిస్ అర్చన పురీ కూడా ఒకే రోజు న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు. చదవండి: ఫ్యాక్టరీలో భారీ పేలుడు... 13 మంది మృతి -
దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసుపై సుప్రీం కోర్ట్ కీలక నిర్ణయం
-
దిశ కేసు హైకోర్టుకు బదిలీ
-
Wrestler Sushil Kumar: ‘సుశీల్‌పై కుట్ర జరిగింది’
న్యూఢిల్లీ: స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌ను హత్య కేసులో కొందరు కావాలనే ఇరికించారని, దీని వెనక పెద్ద కుట్ర ఉందని అతని తరఫు లాయర్ బీఎస్ జాఖడ్ అన్నారు. పోలీసు దర్యాప్తు జరుగుతున్న తీరును ప్రశ్నించిన ఆయన, సుశీల్‌కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవని, తాము చెప్పదల్చుకున్న అన్ని విషయాలను ఇప్పటికే కోర్టు ముందు ఉంచినట్లు స్పష్టం చేశారు. ‘పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లోనే తప్పులు ఉన్నాయి. ఘటన గురించి తెలిశాక ఛత్రశాల్ స్టేడియానికి వెళ్లి గాయపడిన ముగ్గురి స్టేట్మెంట్ రికార్డు చేయగా వారెవరూ సుశీల్ దాడి చేసినట్లుగా చెప్పలేదు. కానీ సాగర్ చనిపోయాక మాత్రమే కిడ్నాపింగ్, మర్డర్ కేసు పెట్టారు. సుశీల్ కొట్టినట్లుగా చెబుతున్న వీడియోను అందరి ముందు బహిర్గతపర్చవచ్చు కదా. విచారణకు హాజరయ్యేందుకు నోటీసు కూడా సుశీల్ పేరిట కాకుండా అతని భార్య పేరిట పంపించడం నిబంధనలకు విరుద్ధం. ఇదంతా చూస్తుంటే సుశీల్‌పై కావాలనే కుట్ర చేసినట్లు అర్థమవుతోంది’ అని జాఖడ్ వివరించారు. -
చదువులమ్మ ఈ లాయరమ్మ
అనాథ పిల్లలు రోజు గడవడానికే దిక్కులు చూడాల్సిన పరిస్థితి. జీవితంలో ఎదుగుదలకు లక్ష్యం ఏర్పాడటానికి ఊతంగా నిలిచే చదువు లభించాలంటే అందుకు దైవం నుంచి వరం లభించాల్సిందే. అలాంటి అనాథ పిల్లల చదువుకు వరప్రదాయినిగా కృషి చేస్తోంది లాయర్ పౌలోమి పావిని శ్లుక్లా. ప్రతి సంవత్సరం ఫోర్బ్స్ మ్యాగజైన్ 30 సంవత్సరాల వయస్సులో సేవా రంగంలో గణనీయమైన కృషి చేసిన 30 మంది వ్యక్తుల జాబితాను విడుదల చేస్తుంది. ఈ ఏడాది అనాథల విద్య కోసం కృషి చేస్తున్న పావిని పేరును ఆ 30 మంది జాబితాలో చేర్చింది. అనాథ పిల్లలకు సరైన విద్యను అందించడం ఎలాగో 28 ఏళ్ల సుప్రింకోర్టు న్యాయవాది పావినికి తెలుసు. ఆమె చేస్తున్న ఈ సేవా కార్యక్రమానికి ఆమె కుటుంబమే అతి పెద్ద మద్ధతు. పావిని తల్లి అరాధన శుక్లా మాట్లాడుతూ –‘దేశంలో తమ గొంతు వినిపించలేని అనాథ పిల్లలు చదువులో రాణించడం వల్ల వారి హక్కుల గురించి తెలుసుకునే అవకాశం లభిస్తుంది. ఏమీ లేని పిల్లలు జీవితంలో ఎదిగేందుకు ప్రోత్సాహమిస్తున్నది ఒక న్యాయవాది. ఆమె నా కూతురు అవడం మాకెంతో గర్వంగా ఉంది’ అని ఆనందంగా పావిని చేస్తున్న పనిని అభినందించారు ఆమె తల్లి. స్వీయ రచన లక్నోలో ఉంటున్న రచయిత, న్యాయవాది, సామాజిక కార్యకర్త పౌలోమి పావిని శుక్లా దేశం గర్వించదగిన వ్యక్తుల జాబితాలో చేరడం ఒకే రోజులో జరగలేదు. దాని వెనక పదేళ్లుగా ఆమె చేస్తున్న కృషి ఉంది. సీనియర్ ఐఎఎస్ ఆఫీసర్లైన ఆరాధన శుక్లా, ప్రదీప్ శుక్లాల కూతురు పౌలోమి పావిని శుక్లా. 2015 లో భారతదేశంలో అనాథ పిల్లల దుస్థితి గురించి తన సోదరుడితో కలిసి ‘వీకెస్ట్ ఆన్ ఎర్త్– ఆర్ఫాన్స్ ఆఫ్ ఇండియా’ పేరుతో పుస్తకం రాసింది. పావిని అదే ఏడాది అనాథల కోసం లక్నోలో ‘అడాప్ట్ ఎ అనాథాశ్రమం’ ప్రారంభించింది. ఆశ్రమ నిర్వహణకు స్థానిక కంపెనీల మద్దతు తీసుకుంది. వీరి నుంచి నగరంలోని పాఠశాలల నిరుపేద పిల్లలకు, అనాథ పిల్లలకు స్టేషనరీ, పుస్తకాలు, ట్యూషన్ ఫీజులను ఇచ్చి చదివించగలిగింది. పిల్లలను చదివించడానికి గల కారణాలను పావిని తెలియజేస్తూ– ‘నా తొమ్మిదేళ్ల వయసులో నా పుట్టిన రోజున మా అమ్మ అనాథాశ్రమానికి తీసుకెళ్లింది. అక్కడ నేను పిల్లలతో కలిసి ఆడుకున్నాను. మాట్లాడాను. చదువుకోవాలనే వారి ఆశను స్వయంగా తెలుసుకున్నాను. అప్పటి నుండి అనాథల కోసం ఏదైనా చేయాలి అని బలంగా అనుకునేదాన్ని. దాంట్లో భాగంగానే వారి కోసం కొన్ని కార్యక్రమాలు చేపట్టాను’ అని వివరించింది. పదేళ్ల కృషి సాధ్యమైనంత ఎక్కువ మంది అనాథ పిల్లలకు చదువుకునే అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో దాదాపు దశాబ్దం పాటు కృషి చేస్తూనే ఉంది పావిని. విద్యార్థులకు అవసరమైన కోచింగ్, ట్యూషన్ల కోసం ఉత్తరప్రదేశ్ విద్యాశాఖతో కలిసి కీలక పాత్ర పోషించింది. ఎనిమిది నగరాల్లో 13 స్కూళ్లలోని నిరుపేద పిల్లలకు స్టేషనరీ, పుస్తకాలు, ట్యూషన్ డబ్బును అందజేసింది. లాక్డౌన్ సమయంలో నగరంలోని అన్ని అనాథాశ్రమాలలో స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేసింది. దీని వల్ల ఆ ఆశ్రమాల్లో ఉన్న పిల్లలకు ఆ¯Œ లైన్ విద్య సౌకర్యం లభిస్తోంది. ఈ పని ప్రారంభాన్ని వివరిస్తూ, పావిని ఇలా అన్నారు ‘ఫోర్బ్స్ జాబితాలో నా పేరు చూడటం చాలా సంతోషంగా ఉంది. అనాథల కోసం ఎక్కువ పని చేయమని సూచించిన ఈ స్థానం నన్ను మరిన్ని అడుగులు వేసేలా ప్రోత్సహిస్తోంది’ అని తెలిపారు. -
రాజ్‌పుత్‌ది హత్యే..!
న్యూఢిల్లీ: గొంతు నులమడం వల్లనే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయాడని సుశాంత్ ఫ్యామిలీ లాయర్ వికాస్ సింగ్ ఆరోపించారు. తాను పంపిన సుశాంత్ మృతదేహం ఫొటోలు చూసి ఎయిమ్స్ సీనియర్ డాక్టర్ ఒకరు ఈ విషయం స్పష్టం చేశారని పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తులో సీబీఐ చేస్తున్న జాప్యం దారుణమన్నారు. సుశాంత్ అనుమానాస్పద మృతిపై దర్యాప్తును పక్కనబెట్టి, ఎన్సీబీ డ్రగ్స్ కేసుపై ఎక్కువ దృష్టి పెడుతున్నారన్నారు. జూన్ 14న ముంబైలోని తన అపార్ట్మెంట్లో సుశాంత్ ఉరివేసుకుని చనిపోయి కనిపించారు. ఈ మృతికి కారణమంటూ రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులపై సుశాంత్ తండ్రి కేకే సింగ్ పట్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఈ కేసు పలు మలుపులు తిరుగుతూ బాలీవుడ్– డ్రగ్స్ సంబంధాలపైవిచారణ వరకు వచ్చింది. -
లాయర్‌గా!
ప్రస్తుతం ‘విశ్వాసం’ సినిమాలో హీరోగా నటిస్తున్న అజిత్ షెడ్యూల్స్ గ్యాప్‌లో కాస్త టైమ్ దొరికితే కోర్టుకు వెళ్లాలనుకుంటున్నారట. ఎందుకంటే నెక్ట్స్ సినిమాలో ఆయన లాయర్‌గా కనిపించనున్నారని టాక్. అజిత్ హీరోగా ‘చతురంగ వేటై్ట, ధీరమ్ అధికారమ్ ఒండ్రు’ చిత్రాల ఫేమ్ హెచ్.వినోద్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందని సమాచారం. ఇది హిందీ హిట్ ‘పింక్’కి రీమేక్ అని టాక్. అనిరుద్ధరాయ్ భట్టాచార్య దర్శకత్వంలో రూపొందిన ‘పింక్’లో అమితాబ్‌బచ్చన్, తాప్సీ ముఖ్య తారలుగా నటించిన విషయం తెలిసిందే. అమితాబ్ పాత్రలోనే అజిత్ నటిస్తారట. ఈ సినిమాను శ్రీదేవి భర్త బోనీ కపూర్ నిర్మిస్తారట. -
హైకోర్టు న్యాయవాది శైలేష్ సక్సేనా అరెస్టు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని విలువైన భూములపై కన్నేసి, తప్పుడు పత్రాలతో కబ్జా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ ఎమ్మెల్సీ జి.దీపక్‌రెడ్డి భాగస్వామి, న్యాయవాది శైలేష్ సక్సేనా మరోసారి అరెస్టు అయ్యారు. కొన్ని నెలలుగా పరారీలో ఉన్న ఈయనను నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు పట్టుకున్నారు. హైకోర్టులో రిట్ పిటిషన్లకు సంబంధించిన ఫైళ్లు మాయం కావడంపై రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) వెంకటేశ్వరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో ఇతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు సోమవారం వెల్లడించారు. ఇప్పటికే భూ కబ్జా కేసుల్లో దీపక్‌రెడ్డితో పాటు శైలే‹ష్‌ను గతేడాది సీసీఎస్ పోలీసులే అరెస్టు చేసిన విషయం విదితమే. గుడిమల్కాపూర్, భోజగుట్ట ల్లో ఉన్న భూమిని అయోధ్య నగర్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో–ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్‌కు కేటాయిస్తూ ప్రభుత్వం 2008లో జీవో 455 జారీ చేసింది. అయితే ఈ భూమిని కాజేసేందుకు దీపక్‌రెడ్డి, సక్సేనాలు భారీ కుట్ర చేశారు. భూమి అసలు యజమాని జస్టిస్ సర్దార్ అలీ ఖాన్ వారసులంటూ కొందరు బోగస్ వ్యక్తుల్ని తెరపైకి తీసుకువచ్చారు. శివభూషణం అనే వ్యక్తిని ఇక్బాల్ ఇస్లాం ఖాన్‌గా మార్చి భోజగుట్ట భూమికి చెందిన భూ ఆక్రమణల నిరోధక న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. తర్వాత బషీర్ అనే వ్యక్తిని ఇక్బాల్ ఇస్లాం ఖాన్ వారసుడంటూ షకీల్ ఇస్లాం ఖాన్ పేరుతో తెరపైకి తెచ్చారు. ఇతడితో భోజగుట్ట భూమి తనదే అంటూ 2008, 2009, 2012ల్లో హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు చేయించారు. ఆపై షకీల్ తమకు భూమిని విక్రయిం చాడని, అందువల్ల అయోధ్య సొసైటీకి ప్రభుత్వ కేటాయింపు చెల్లదని, దాన్ని రద్దు చేయాలంటూ సక్సేనా తండ్రికి చెందిన జై హనుమాన్ ఎస్టేట్స్ సంస్థ, దీపక్‌రెడ్డి, శైలజ అనే మహిళ 2014లో పిటిషన్లు దాఖలు చేశారు. ఇటీవల వరకు కొన్ని పిటిషన్లపై విచారణ కొనసాగింది. అయితే దీపక్‌రెడ్డి, శైలే‹ష్, శైలజ వేసిన పిటిషన విచారణ జరగలేదు. దీంతో సిబ్బందిఫైళ్ల కోసం వెతికినా లభించలేదు. దీనికి తోడు సీసీఎస్ పోలీసులు గతేడాది జూన్ 6న దీపక్‌రెడ్డి, శైలేష్ తదితరుల్ని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో అయోధ్యనగర్ సొసైటీ ప్రతినిధులు వివరాలు హైకోర్టు ముందుంచారు. పరిశీలించిన అనంతరం దీపక్‌రెడ్డి, శైలేష్ కుట్రలను గుర్తించిన న్యాయమూర్తి బోగస్ వ్యక్తుల పేర్లతో దాఖలు చేసిన 14 పిటిషన్లనూ కొట్టేశారు. శైలేష్ తదితరులపై పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా రిజిస్ట్రార్‌ను ఆదేశించారు. ఈ మేరకు వారిపై కేసు నమోదైంది. ఇది దర్యాప్తు నిమిత్తం సీసీఎస్‌కు బదిలీ అయింది. ఈ కేసులో శైలేష్ నాంపల్లి కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకున్నారు. పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి దీన్ని రద్దు చేయించారు. శైలేష్ కోసం గాలించి పట్టుకున్నారు. అతడి నుంచి 11 బోగస్ గుర్తింపుకార్డులు స్వాధీనం చేసుకున్నారు. జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
చనిపోయిన వ్యక్తి జీపీఏ చేశాడట!
సాక్షి, హైదరాబాద్: ఓ న్యాయవాది కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో (ఎంహెచ్ఏ) క్లర్క్‌గా పని చేస్తు న్న వ్యక్తి ఇచ్చిన సలహాతో భారీ స్కెచ్ వేశాడు. పుణేకు చెందిన కాందిశీకుడు పుప్పాలగూడలోని 50 ఎకరాలు తనకు విక్రయించినట్లు పత్రాలు సృష్టించాడు. చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మిని స్ట్రేషన్ (సీసీఎల్ఏ) నుంచి భూమి తన పేరిట బది లీ చేయించుకున్నాడు. రంగారెడ్డి కలెక్టర్ ద్వారా విషయం సీసీఎస్ పోలీసులకు చేరడంతో కథ అడ్డం తిరిగింది. చనిపోయిన వ్యక్తి ఏడాది తర్వాత జీపీఏ చేసినట్లు పత్రాలు సృష్టించిన ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేసిన అధికారులు మొత్తం ఐదుగురు నిందితులపై అభియోగ పత్రాలు దాఖలు చేశారు. దీంతో ప్రస్తుతం దాదాపు రూ.750 కోట్ల విలువైన ఆ భూమి ప్రభుత్వ పరం కానుంది. ఎంహెచ్ఏ క్లర్క్ ఇచ్చిన సలహాతో... నగరానికి చెందిన న్యాయవాది చెట్ల రాజయ్య లక్ష్మీనారాయణ గతంలో జీపీ ఫర్ రెవెన్యూగా పని చేసిన నేపథ్యంలో నిత్యం ఢిల్లీలోని వివిధ కార్యాలయాలకు వెళ్లి వస్తుండేవారు. ఈ నేపథ్యంలో ఈయనకు ఎంహెచ్‌ఏలోని సెటిల్మెంట్ కమిషనర్ కార్యాలయంలో క్లర్క్‌గా పనిచేసే దేవేందర్ కుమార్ జైన్‌తో పరిచయమైంది. ఆయన 1950లో పాకిస్తాన్ నుంచి వలస వచ్చి కాందిశీకుడిగా మారిన హేమన్‌దాస్ హెచ్ మకీజ భూమి గురించి లక్ష్మీనారాయణకు చెప్పారు. ఆయనకు అప్పటి సెటిల్మెంట్ కమిషనర్ పుప్పాలగూడ ప్రాంతంలో 50 ఎకరాల భూమి కేటాయించారు. ఈ భూమిని భౌతికంగా పొందక ముందే హేమన్‌దాస్ 1970లో మరణించగా... ఆయన కుమారుడైన భగవాన్ దాస్ మకీజ పుణేలో స్థిరపడ్డారు. అనంతరం భగవాన్ దాస్ ఈ స్థలం విషయం పట్టించుకోలేదు. ఇదే విషయం జైన్ ద్వారా లక్ష్మీనారాయణకు తెలిసింది. భూమిపై నకిలీ పత్రాలు సృష్టించి... భారత్‌లో భూముల పొందిన కాందిశీకులు తమ వారసుల వివరాలను ఢిల్లీలో ఉండే సెటిల్మెంట్ కమిషనర్ వద్ద ఉండే క్లైమ్ ఇండెక్స్‌లో నమోదు చేయించాలి. విషయం తెలిసిన హేమన్‌దాస్ తన కుమారుడు భగవాన్ దాస్ పేరును ఇండెక్స్‌లో నమోదు చేయించారు. పుప్పాలగూడలో ఉన్న 50 ఎకరాలు స్వాహా చేయడం సాధ్యమైతే తనకు కమీషన్ ఇవ్వాలనే ఒప్పందంతో జైన్ ఈ వివరాలన్నింటినీ లక్ష్మీనారాయణకు చెప్పారు. దీంతో భగవాన్‌దాస్ మకీజ ఆ 50 ఎకరాలను తనకు విక్రయిస్తూ 1996లో జీపీఏ చేసుకున్నట్లు లక్ష్మీనారాయణ పత్రాలు సృష్టించారు. 2003లో కేటాయించిన సీసీఎల్ఏ ఈ నకిలీ పత్రాల ఆ«ధారంగా సీసీఎల్ఏ పుప్పాలగూడలోని భూమిని 2003లో లక్ష్మీనారాయణకు అప్పగించింది. ఇది నిబంధన ప్రకారం జరగలేదనే ఉద్దేశం తో 2006లో అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శేషాద్రి హైకోర్టును ఆశ్రయించగా ఆ కేటాయింపును రద్దు చేసింది. దీనిపై లక్ష్మీనారాయణ 2016లో సుప్రీం కోర్టు లో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశా రు. దీంతో ఆ సమయంలో కలెక్టర్‌గా పని చేస్తున్న రజిత్ కుమార్ సేన్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చనిపోయిన వ్యక్తి పేరుతో.. సీసీఎస్ ఏసీపీ ఎం.శ్రీనివాసులు ఆరా తీయగా.. భగవాన్‌దాస్ 1995లోనే చనిపోయినట్లు తేలింది. లక్ష్మీనారాయణ దాఖలు చేసిన పత్రాల్లో భగవాన్‌దాస్ 1996లో జీపీఏ చేసినట్లు ఉంది. దీంతో ఇవి బోగస్ పత్రాలుగా నిర్ధారించిన అధికారులు లక్ష్మీనారాయణను విచారించారు. విషయం వెలుగులోకి రావడంతో ఆయనతో పాటు దేవేందర్ కుమార్ జైన్, మిర్యాల నరసింహను గతంలో అరెస్టు చేశారు. వీరితో పాటు మరో ఇద్దరు నిందితులపై నాంపల్లి కోర్టులో గతవారం అభియోగపత్రాలు దాఖలు చేశారు. వీటిని సుప్రీంకోర్టులో దాఖలు చేసి, ఆ 50 ఎకరాలు ప్రభుత్వ పరం చేయడానికి రెవెన్యూ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రెండూ ఖరీదు చేసింది ఒకరే ‘కాందిశీకుడైన మలానీ స్కామ్‌లో పుప్పాలగూడలోని 148 ఎకరాలను సుకుమారెడ్డి నుంచి నందకిశోర్ ఖరీదు చేశారు. ఈ మకీజ స్కామ్‌లోనూ న్యాయవాది లక్ష్మీనారాయణ నుంచి 2005లో ఆ 50 ఎకరాలనూ నందకిశోరే రూ.3 కోట్లకు కొన్నారు. ఈ నేపథ్యంలోనే మకీజ కేసులో నందకుమార్‌తో పాటు ఈ స్కాంలో పాత్ర ఉన్న పి.కృష్ణను నిందితుడిగా చేర్చి, నోటీసులు జారీ చేశాం. మా విచారణ ఫలితంగా పుప్పాలగూడలోని విలువైన 198 ఎకరాల భూమి ప్రభుత్వ పరం కానుంది’ – డాక్టర్ ఎం.శ్రీనివాసులు, సీసీఎస్ ఏసీపీ -
న్యాయవాది కుమారుడి కిడ్నాప్‌నకు యత్నం
కాజీపేట రూరల్: హైకోర్టు న్యాయవాది కుమారుడిని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌కు యత్నించారు. సికింద్రాబాద్‌లోని ఇందిరానగర్ వారసిగూడకు చెందిన హైకోర్టు న్యాయవాది ఎన్.నర్సింహారావు ఇంటికి సోమవారం రాత్రి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వెళ్లి అతడి కుమారుడు సాయి మనోహర్ (12)ను కిడ్నాప్ చేసి మారుతికారులో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ముందు సెంటర్ వరకు తీసుకొచ్చారు. అప్పటికే బాలుడు ఏడుస్తుండగా హోటల్‌కు వెళ్లి ఏమైనా తీసుకొస్తామని ఒకరు లోపలికి వెళ్లగా మరొకరు బయట ఉన్నారు. కాగా, తనను కిడ్నాప్ చేస్తున్నట్లుగా గుర్తించిన మనోహర్ వారి నుంచి తప్పించుకుని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లోపలికి పరుగెత్తుకొచ్చాడు. రాత్రి 11.30 గంటలకు సికింద్రాబాద్ నుంచి గూడూరుకు వెళ్తున్న సింహపురి ఎక్స్‌ప్రెస్‌ను ఎక్కాడు. దీంతో రైలులో ఉన్న ఎస్కార్ట్ పోలీసులు గమనించి కోపగించగా బాలుడు జరిగిన విషయం వారికి తెలిపాడు. కాగా, అర్ధరాత్రి 1.30 గంటలకు రైలు కాజీపేట జంక్షన్‌కు చేరుకోగా ప్లాట్‌ఫాంపై పెట్రోలింగ్ చేస్తున్న ఏఎస్ఐ రాజిరెడ్డికి బాలు డిని ఎస్కార్ట్ పోలీసులు అప్పగించగా.. వారు తల్లిదండ్రులకు అప్పగించారు. -
దాడికి గురైన న్యాయవాది మృతి
హైదరాబాద్: అకారణంగా కొంతమంది ఆకతాయిలు దాడిచేయడంతో తీవ్రంగా గాయపడిన న్యాయవాది చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎర్రమంజిల్ కాలనీకి చెందిన న్యాయవాది కె.జి.కె ప్రసాద్ (58) ఈ నెల 1న రాత్రి కారులో పంజగుట్ట నుంచి సోమాజీగూడ యశోదా ఆస్పత్రి వైపు వెళుతుండగా...కొంతమంది యువకులు రోడ్డుకు అడ్డంగా ద్విచక్ర వాహనాలు నిలిపి మాట్లాడుతున్నారు. తప్పుకోవాలని కోరిన ప్రసాద్‌పై ఐదుగురు యువకులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అప్పటి నుంచి యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రసాద్ పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం మృతి చెందారు. ప్రసాద్ భార్య కనకదుర్గ ఫిర్యాదు మేరకు దాడి జరిగిన మరుసటి రోజే పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా వారిపై నమోదు చేసిన హత్యాయత్నం కేసును హత్య కేసుగా మార్చినట్టు పోలీసులు తెలిపారు.