హీరోయిన్ డింపుల్ హయాతి, డీసీపీ రాహుల్ హెగ్డేల మధ్య వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ ఇష్యూపై డింపుల్ న్యాయవాది పాల్ సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. జంతువులను హింసిస్తుంటే డీసీపీని డింపుల్ వారించిందని, దీంతో ఆయన కక్ష పెంచుకున్నారని తెలిపారు. ''డింపుల్‌తో డీసీపీ చాలాసార్లు ర్యాష్‌గా మాట్లాడారు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు.
డింపుల్ పార్లింగ్ ప్లేసులో కావాలనే కోన్స్ పెట్టారు. అయినా రోడ్డుపై వుండాల్సిన సిమెంట్ బారికేడ్స్, కోన్స్ ప్రైవేట్ స్థలంలోకి ఎలా వచ్చాయి? ఇదే విషయాన్ని రెండు నెలలుగా అడుగుతున్నాం. జంతువులను హింసిస్టుంటే డింపుల్ వారించింది. అందుకే ఆ కక్షతోనే డీసీపీ ఇలా తప్పుడు కేసు పెట్టారు. డింపుల్ ఎక్కడా కారును తన్నిన ఫుటేజీ లేదు.
కానీ ఆమెను తప్పుగా చిత్రీకరించడానికి చూస్తున్నారు. జరిగిన పరిణామాలు చూసి డింపుల్ మానసిక ఒత్తిడికి గురైంది, ఆమె బయటకు వెళ్లేందుకు కూడా భయపడుతుంది. డీసీపీ నుంచి డింపుల్‌కు ప్రాణహాని ఉంది. ఇప్పటికే ఆమెకు చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈ కేసను న్యాయపరంగా ఎదుర్కొంటాం'' అంటూ ఆమె న్యాయవాది పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment