Rahul Hegde
-
డింపుల్ హయాతి అసహనం.. ఆయనెక్కడ అంటూ మంత్రి కేటీఆర్‌కే ట్వీట్
హీరోయిన్ డింపుల్ హయాతి పేరు ఈమధ్య ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది. హైదరబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో జరిగిన వివాదంతో కొన్నిరోజులుగా డింపుల్ పేరు హాట్‌టాపిక్‌గా మారింది. ఈ మధ్య ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజ, యాగం వంటి కార్యక్రమాలు జరిపించింది. అలా సోషల్ మీడియాలో వెరీ పాపులర్ అయిపోయింది. ఈ బ్యూటీ హైదరాబాద్ ట్రాఫిక్‌లో ఇరుక్కుంది. ఆ ట్రాఫిక్ వల్ల ఆమె అసహనానికి గురైంది. దీంతో ట్రాఫిక్ డీసీపీ ఎక్కడంటూ ట్విట్టర్లో ప్రశ్నించింది. (ఇదీ చదవండి: దేవుడు ఉన్నాడు.. వాళ్లు అన్యాయం చేస్తే ఎంతవరకైనా వెళ్తా: గుణశేఖర్) అంతటితో ఆగకుండా ఏకంగా తెలంగాణ మంత్రి కేటీఆర్, తెలంగాణా సీఎంఓ ట్విటర్ ఖాతాలకు ట్యాగ్ చేసింది. హైదరాబాద్‌లో ట్రాఫిక్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎదైనా మెడికల్ ఎమర్జెన్స్తో ఉన్న వారు ఈ ట్రాఫిక్‌లో చిక్కుకొని ఉంటే పరిస్థితి ఏంటి..? ఇంట్లో నుంచి అడుగుపెట్టాలంటే భయం వేస్తుంది. ప్రభుత్వం ఏమైన డీజల్,పెట్రోల్ ఉచితంగా ఇస్తుందా.. అంటూ ఆమె ట్వీట్ చేసింది. ఇంకేముంది హైదరాబాద్‌లో నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కుంటున్న వారు డింపుల్‌ను సపోర్ట్ చేస్తున్నారు. హయాతీ డేరింగ్ చూసి నెటిజన్స్ కూడా షాక్ అవుతున్నారు. హైదరాబాద్‌లో యూ టర్న్ అయ్యే పాయింట్లు కొన్ని మార్చడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కొందరు కామెంట్లు చేస్తున్నారు. (ఇదీ చదవండి: తమన్నాకు గోల్డెన్ ఛాన్స్.. మరోసారి ఆయనతో రొమాన్స్‌కు రెడీ) హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో డింపుల్ హయాతిలు ఇద్దరూ ఒకే అపార్ట్మెంట్లో ఉంటారు. కొన్నిరోజుల క్రితం వీరిద్దరి మధ్య కార్ పార్కింగ్ వివాదం నడిచిన విషయం తెలిసిందే. ఆ గొడవ కోర్టు వరకు వెల్లడంతో ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. అతన్ని టార్గెట్ చేసేందుకే డింపుల్ ఈ తరహా ట్వీట్ చేసిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. I mean seriously this is getting worse than anything just to reach your house it takes more than an hour now where’s the traffic dcps ? What if there is a medical emergency? Can we even step out in Hyderabad ? We don’t get fuel free dear government. @KTRBRS @TelanganaCMO pic.twitter.com/0Z4oCblc3K — Dimple Hayathi (@DimpleHayathi) July 19, 2023 -
డింపుల్ హయాతి వివాదం.. హైకోర్టును ఆశ్రయించిన హీరోయిన్!
ఐపీఎస్ అధికారి, డీసీపీ రాహుల్ హెగ్డే, రామబాణం హీరోయిన్ డింపుల్ హయాతి మధ్య వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. డీసీపీ కారును కాలితో తన్నడమే కాకుండా తన బెంజికారుతో రివర్స్‌లో వచ్చి ఢీకొట్టి దుర్భాషలాడిందంటూ నటిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే తాజాగా ఈ కోర్టుపై డింపుల్ హయాతి హైకోర్టును ఆశ్రయించింది. (ఇది చదవండి: ఐపీఎస్ ఆఫీసర్ కారును తన్నిన డింపుల్ హయాతి..కేసు నమోదు..) తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో డింపుల్ హయాతి పిటిషన్ దాఖలు చేసింది. ట్రాఫిక్ డీసీపీ ఒత్తిడితోనే తప్పుడు కేసు పెట్టారని పిటిషన్లో పేర్కొంది. అయితే డింపుల్ హయాతికి సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు ఇచ్చినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. అయితే వాదనలు విన్న న్యాయస్థానం.. సీఆర్పీసీ 41ఏ నిబంధనల మేరకే వ్యవహరించాలని పోలీసులను ఆదేశించింది. కాగా.. ఐపీఎస్ అధికారి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారుపై డింపుల్ హయాతి దాడి చేశారన్న ఆరోపణలతో ఆయన డ్రైవర్ చేతన్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డింపుల్ హయాతి, డేవిడ్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. (ఇది చదవండి: ఆదిపురుష్ టీం సంచలన నిర్ణయం..వారి కోసమే!) -
జంక్షన్ క్లోజ్.. ట్రాఫిక్ జామ్
బంజారాహిల్స్: ట్రాఫిక్ సజావుగా సాగేందుకు బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ప్రయోగాలకు తెరలేపారు. ఇప్పటికే జూబ్లీహిల్స్‌లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పలు సిగ్నళ్ల వద్ద జంక్షన్లను మూసివేయడంతో పాటు యూ టర్న్‌లను కొనసాగిస్తున్నారు. అదే పంథాను ఇప్పుడు బంజారాహిల్స్‌లో అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ రోడ్ నెం. 2లో ఎంతో కీలకమైన సాగర్ సొసైటీ సిగ్నల్ జంక్షన్‌ను అధికారులు మంగళవారం మూడు గంటల పాటు మూసివేశారు. మధ్యాహ్నం నుంచి 3 గంటల వరకు ట్రయల్ రన్‌గా ఈ జంక్షన్‌ను మూసివేసి వాహనాల రాకపోకలను ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో పాటు బంజారాహిల్స్ ట్రాఫిక్ సీఐ నరసింహ రాజు పరిశీలించారు. నాన్ పీక్ హవర్స్‌లో వాహనాల రాకపోకలు జంక్షన్ మూసివేత వల్ల ఎంత వరకు ఒత్తిడి పెరుగుతుంది, తగ్గుతుంది అనేది పరిశీలించారు. అయితే ఈ మూడు గంటల్లో రద్దీ లేని సమయాలు కాబట్టి వాహనాలు ముందుకు సాగాయని ట్రాఫిక్ పోలీసుల పరిశీలనలో వెల్లడైంది. టీవీ9 జంక్షన్ నుంచి సాగర్ సొసైటీ వైపు వెళ్లే వాహనదారులు కేబీఆర్ పార్కు చౌరస్తాలో యూ టర్న్ చేసుకుని రావాల్సి ఉంటుంది. అప్పటికే కేబీఆర్ పార్కు చౌరస్తాలో వందల సంఖ్యలో బారులు తీరిన వాహనాలకు తోడు ఈ వాహనాలు కూడా కలిపి చుక్కలు కనిపించాయి. ఇక కేబీఆర్ పార్కు వైపు సాగర్ సొసైటీ వైపు నుంచి వచ్చే వాహనాలు టీవీ 9 చౌరస్తాలో యూ టర్న్ తీసుకుని రావాల్సి ఉంటుంది. ఇది కూడా వాహనదారులకు నరకప్రాయంగా మారింది. రోడ్డు విస్తరించకుండా ఫుట్‌పాత్‌లు లేకుండా చేస్తున్న ఈ ట్రయల్ రన్లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు తమకు తోచినట్లుగా ప్రయోగాలు చేస్తూ వాహనదారులపై రుద్దుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45 ట్రాఫిక్ మళ్లింపులతో చుట్టూ తిరిగి వస్తున్న వాహనదారులు ఒక వైపు అసహనం వ్యక్తం చేస్తుండగానే తాజాగా సాగర్ సొసైటీ చౌరస్తాలో మరో ప్రయోగానికి తెరలేపి గందరగోళం సృష్టించారు. ట్రాఫిక్ పోలీసులు చౌరస్తాల్లో ఉండి నియంత్రిస్తే ట్రాఫిక్ సజావుగా ముందుకు సాగుతుందని, అందుకు విరుద్ధంగా జంక్షన్లు మూసివేసి మీ దారిన మీరు పోండి అనే విధంగా ప్రయోగాలు చేస్తుండటంతో వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాగర్ సొసైటీ జంక్షన్ మూసివేత విఫల ప్రయోగమని మొదటి రోజే తేటతెల్లమైంది. -
డీసీపీతో గొడవ.. బాయ్‌ఫ్రెండ్ మ్యాటర్ లీక్ కావడంతో డింపుల్ అప్సెట్!
హీరోయిన్ డింపుల్ హయాతి పేరు ఈమధ్య ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో జరిగిన వివాదంతో కొన్నిరోజులుగా డింపుల్ పేరు హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఈ మొత్తం వ్యవహారంతో డింపుల్ చాలా అప్సెట్ అయినట్లు తెలుస్తుంది. ఆమె బయటకు కూడా రావడానికి ఇష్టపడటం లేదని స్వయంగా డింపుల్ లాయర్ పేర్కొన్న సంగతి తెలిసిందే. అసలే వరుస డిజాస్టర్లతో సతమతం అవుతున్న డింపుల్ ఇప్పుడు ఈ ఇష్యూతో అనసరంగా తన రిలేషన్షిప్ విషయం బయటపడిందని ఫీల్ అవుతుందట. విక్టర్ డేవిడ్ అనే వ్యక్తితో డింపుల్ కొంతకాలంగా సహజీవనం చేస్తుంది. ఇద్దరూ ఇప్పుడు ఒకే ఇంట్లో కలిసుంటున్నారు. కానీ ఇంతవరకు ఈ విషయం ఎక్కడా బయటపడలేదు. అయితే డీసీపీతో జరిగిన గొడవలో డింపుల్ బాయ్‌ఫ్రెండ్ గురించి లీక్ అయ్యింది. ఈ విషయంపైనే డింపుల్ చాలా అసహనంగా ఉందట. కాగా డింపుల్ హయతి, ఆమె బాయ్‌ఫ్రెండ్ విక్టర్ డేవిడ్ ఇద్దరి స్వస్థలం విజయవాడ అని తెలుస్తుంది. అతను గ్రాఫిక్ డిజైనర్ అట. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారి లివింగ్ రిలేషన్లో ఉంటున్నారు. ఇంతకాలం ఈ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచినా డీసీపీతో తలెత్తిన వివాదంతో వీరి ప్రేమ వ్యవహారం బయటకు వచ్చింది. -
డింపుల్‌తో డీసీపీ అసభ్యంగా ప్రవర్తించారు : న్యాయవాది
హీరోయిన్ డింపుల్ హయాతి, డీసీపీ రాహుల్ హెగ్డేల మధ్య వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ ఇష్యూపై డింపుల్ న్యాయవాది పాల్ సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. జంతువులను హింసిస్తుంటే డీసీపీని డింపుల్ వారించిందని, దీంతో ఆయన కక్ష పెంచుకున్నారని తెలిపారు. ''డింపుల్‌తో డీసీపీ చాలాసార్లు ర్యాష్‌గా మాట్లాడారు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. డింపుల్ పార్లింగ్ ప్లేసులో కావాలనే కోన్స్ పెట్టారు. అయినా రోడ్డుపై వుండాల్సిన సిమెంట్ బారికేడ్స్, కోన్స్ ప్రైవేట్ స్థలంలోకి ఎలా వచ్చాయి? ఇదే విషయాన్ని రెండు నెలలుగా అడుగుతున్నాం. జంతువులను హింసిస్టుంటే డింపుల్ వారించింది. అందుకే ఆ కక్షతోనే డీసీపీ ఇలా తప్పుడు కేసు పెట్టారు. డింపుల్ ఎక్కడా కారును తన్నిన ఫుటేజీ లేదు. కానీ ఆమెను తప్పుగా చిత్రీకరించడానికి చూస్తున్నారు. జరిగిన పరిణామాలు చూసి డింపుల్ మానసిక ఒత్తిడికి గురైంది, ఆమె బయటకు వెళ్లేందుకు కూడా భయపడుతుంది. డీసీపీ నుంచి డింపుల్‌కు ప్రాణహాని ఉంది. ఇప్పటికే ఆమెకు చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈ కేసను న్యాయపరంగా ఎదుర్కొంటాం'' అంటూ ఆమె న్యాయవాది పేర్కొన్నారు. -
డింపుల్ డిష్యుం డిష్యుం
-
'డింపుల్‌తో డీసీపీ ర్యాష్‌గా మాట్లాడారు.. అందుకే కాలితో తన్నారు'
రామబాణం ఫేం డింపుల్ హయాతి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే వివాదం సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. హీరోయిన్ డింపుల్ హయాతిపై కావాలనే తప్పుడు కేసు పెట్టారని డింపుల్ తరఫు న్యాయవాది పాల్ సత్యనారాయణ ఆరోపించారు. డింపుల్‌తో డీసీపీ చాలాసార్లు ర్యాష్‌గా మాట్లాడారని అన్నారు. అంతే కాకుండా డింపుల్ కారు పార్కింగ్ ప్లేస్‌లో కోన్స్ పెట్టారని రోడ్డు మీద సిమెంట్ బ్రిక్స్ ప్రైవేట్ ఆపార్ట్‌మెంట్‌లోకి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని తాము రెండు నెలలుగా అడుగుతున్నామని తెలిపారు. ఈ విషయంలో తాము లీగల్‌గానే పోరాటం చేస్తామని వెల్లడించారు. (ఇది చదవండి:డింపుల్ హయాతి కేసులో ట్విస్ట్.. కారుకు వరుస చలాన్లు!) డింపుల్ తరఫు న్యాయవాది పాల్ సత్యనారాయణ మాట్లాడుతూ..'డింపుల్‌పై కావాలనే తప్పుడు కేసు పెట్టారు. డింపుల్‌తో డీసీపీ చాలాసార్లు రాష్‌గా మాట్లాడారు. డింపుల్ పార్కింగ్ ప్లేస్‌లో కోన్స్ పెట్టారు. డింపుల్ ఒక సెలబ్రిటీ. చాలాసార్లు చెప్పినా వినకపోవడంతో అసహనంతో కోన్స్‌ను కాలుతో తన్నారు. డీసీపీపై డింపుల్ కేసు పెడతాను అని బెదిరించడంతో.. తిరిగి డింపుల్పైనే కేసు పెట్టారు. ఆమెను వేధించాలనేదే డీసీపీ ఉద్దేశం. క్వార్టర్స్‌లో ఉండకుండా డీసీపీ ఇక్కడ ఎందుకు ఉన్నారు.' అంటూ ఆరోపించారు. #heroinepolicecase #DimpleHayathi పై తప్పుడు కేస్ పెట్టారు అంటున్న #డింపుల్ లాయర్ Advocate questions #ips why cement bricks & traffic #triangles came into apartment parking area. ? Lot of turns & twists in this case against @DimpleHayathi Truth need to comeout.#18fms #18f pic.twitter.com/sn8nScTAZM — Narayana Pragada (@pragada1) May 23, 2023 లీగల్‌గానే ఫైట్ చేస్తాం: సత్యనారాయణ న్యాయవాది మాట్లాడుతూ.. 'సిమెంట్ బ్రిక్స్ తేవాలి అంటే.. చిన్న క్రేన్‌తో తేవాలి. ఒక ప్రైవేట్ అపార్ట్మెంట్లో వాటిని ఎలా తెస్తారో ముందు చెప్పాలి. ప్రభుత్వ ప్రాపర్టీని మిస్ యూజ్ చేస్తున్నారు. ఒక డీసీపీ స్థాయి వ్యక్తి ఒక అమ్మాయితో ఎలా ప్రవర్తించాలో తెలియదా?. అమ్మాయి మీదకి వెళ్లి మాట్లాడతారా? ఒక సెలబ్రిటీగా.. అందులోనూ పోలీస్ ఆఫీసర్‌పై కేసు పెట్టేందుకు వెనుకాడింది. కానీ ఐపీఎస్ తన డ్రైవర్‌తో కేసు పెట్టించారు. డింపుల్ కూడా ఫిర్యాదు చేసింది.. కానీ తీసుకోలేదు. 4 గంటలు పీఎస్‌లో కూర్చోపెట్టారు. ఈ కేసులో మేము లీగల్‌గానే ఫైట్ చేస్తాం.' అని అన్నారు. (ఇది చదవండి: హన్సికను వేధించిన టాలీవుడ్ టాప్ హీరో.. ఎవరై ఉంటారబ్బా?) -
డింపుల్ హయాతిపై క్రిమినల్ కేసు.. స్పందించిన నటి
రామబాణం ఫేం డింపుల్ హయాతిపై క్రిమినల్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారును కారుతో ఢీకొట్టి ధ్వంసం చేసిన వ్యవహారంపై డీసీపీ డ్రైవర్ జూబ్లిహిల్స్ పోలీసులు ఫిర్యాదు చేశాడు. డింపుల్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ లను కూడా పోలీసులకు సమర్పించాడు. ఫిర్యాదు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: చివరి కోరిక నెరవేరకుండానే కన్నుమూసిన శరత్‌బాబు) ఇదిలా ఉంటే.. ఈ కేసుపై డింపుల్ పరోక్షంగా స్పందించారు. అధికారాన్ని ఉపయోగించి తప్పులను కప్పిపుచ్చుకోలేరని ట్వీట్ చేశారు. అంటే ఈ వ్యవహారంలో తన తప్పులేదని, డీసీపీ రాహుల్ హెగ్డేనే తనకున్న అధికారంతో తప్పుడు కేసులు పెట్టించారని డింపుల్ పరోక్షంగా చెప్పుకొచ్చింది. అసలేం జరిగింది? హైదరాబాద్‌లోని జర్నలిస్ట్ కాలనీలో ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే నివాసం ఉటున్నారు. అదే అపార్ట్మెంట్లో డింపుల్ హయాతి తన స్నేహితుడు డేవిడ్‌తో కలిసి ఉంటున్నారు. రాహుల్ హెగ్డేకు ప్రభుత్వం కేటాయించిన వాహనాన్ని ఆయన డ్రైవర్ చేతన్ కుమార్ అదే అపార్టమెంట్‌లోని సెల్లార్లో పార్కింగ్ చేశాడు. ఆ వాహనం పక్కనే డింపుల్ హయాతి కూడా తన వాహనాన్ని పార్కింగ్ చేస్తుంది. . దీనిపై వారికి పలు మార్లు గొడవైంది.అయితే తాజాగా డింపుల్ సదరు ఆఫీసర్ కారుని ఉద్దేశపూర్వకంగా ఢీ కొట్టడంతో పాటు కాలితో తంతూ గొడవ చేసింది. అక్కడున్న డ్రైవర్‌తోనూ ఆమె గొడవ పడింది. దీంతో ఐపీఎస్ ఆఫీసర్ జూబ్లీ హిల్స పోలీసులకు ఫిర్యాదు చేశారు. Using power doesn’t stop any mistake . 😂 — Dimple Hayathi (@DimpleHayathi) May 23, 2023 -
బీజం వేములవాడలోనే?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన జగిత్యాల త్రిబుల్ మర్డర్ ఉదంతం వెనక సరికొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. వాస్తవానికి నాగేశ్వరరావు, ఆయన కుమారులను మట్టుబెట్టాలన్న పథకం ఇప్పటిదికాదని.. నెల రోజుల కిందే వారిపై వేములవాడలో హత్యాయత్నం జరిగిందని బాధిత కుటుంబం చెప్తోంది. వేములవాడ పోలీసులు కేసులను తారుమారు చేశారని, కేవలం దాడిగా చూపారని ఆరోపిస్తోంది. ఆనాడే హత్యాయత్నం కేసు నమోదు చేసి, నిందితులపై చర్యలు తీసుకుంటే ఇంత ఘోరం జరిగేది కాదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. అయితే వేములవాడలో దాడి, జగిత్యాల ఘటన వేర్వేరని.. అయినా ఈ అంశంలో పూర్తిస్థాయి విచారణ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. డిసెంబర్ 17న ఏం జరిగింది? బాధితుల బంధువుల వివరాల ప్రకారం.. డిసెంబర్ 17న వేములవాడ ఠాణా పరిధి లోని అగ్రహారం శ్మశానవాటిక సమీపంలో ఓ కుల సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సమావేశానికి నాగేశ్వరరావు, అతడి కుమారులు రాంబాబు, రమేశ్ హాజరయ్యారు. సమావేశం తర్వాత వారు ఊరి వైపు బయల్దేరగా.. మధ్యలోనే వారి కారు ను ఏడుగురు వ్యక్తులు అడ్డగించారు. పెద్ద పెద్ద రాళ్లు విసిరారు. కారుదిగిన తండ్రీకొడుకులపై కత్తులు, గొడ్డళ్లు, రాళ్లతో దాడికి దిగారు. సమీపంలో ఉన్న కొందరు మహిళలు, గొర్ల కాపరులు అక్కడికి వచ్చి విడిపించే ప్రయత్నం చేశారు. అప్పటికే తీవ్రంగా గాయపడ్డ తండ్రీకొడుకులు సమీపంలోని గుట్టవైపు పరుగులు తీసి ప్రాణా లు కాపాడుకున్నారు. వేములవాడ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని, ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిని మరునాడు రమ్మన్నారు. బాధితులు తర్వాతి రోజు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లేసరికి.. సీన్ మారిపోయింది. నాగేశ్వరరావు, ఆయన కుమారులు తమపైనే దాడిచేశారంటూ ప్రత్యర్థి వర్గం ఫిర్యాదు చేసి రెడీగా ఉంది. ప్రత్యర్థులు తమను చంపాలని చూశారని నాగేశ్వరరావు వాపోయినా పోలీసులు పెద్దగా పట్టించుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిందితుల ఫిర్యాదునే ముందుకు తెచ్చి! నాగేశ్వరరావు 17వ తేదీనే ఫిర్యాదు చేసినా.. పోలీసులు మరునాడు 341, 427, 324 రెడ్‌విత్ 34 ఐపీసీ కింద ఎఫ్ఐఆర్ నం. 547/2021 నమోదు చేశారు. అదే నాగేశ్వరరావు, అతడి కుమారులపై ప్రత్యర్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 290, 324, 323 రెడ్‌విత్ 34 ఐపీసీ సెక్షన్లతో ఎఫ్ఐఆర్ నం. 546/2021 నమోదైంది. ప్రత్యర్థుల ఫిర్యా దు 18న రాత్రి 8 ప్రాంతంలో వచ్చిందని, తర్వా రాత్రి 9గంటలకు నాగేశ్వరరావు ఫిర్యాదు చేశారని పోలీసులు నమోదు చేశారు. దీనిపై నాగేశ్వరరావు కుటుంబ సభ్యు లు మండిపడుతున్నారు. నాగేశ్వర్రావు 17న సాయంత్రమే ఫిర్యాదు చేసినా.. ప్ర త్యర్థుల ఫిర్యాదు తర్వాతే చేసినట్టు చూపడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్ని స్తున్నారు. పోలీస్‌స్టేషన్ ముందు ఫొటోతో.. 17న దాడి జరిగాక రక్తమోడుతున్న గాయాలతో నాగేశ్వరరావు, ఆయన కుమారులు వేములవాడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాక.. పోలీసుల సూచన మేరకు ఆస్పత్రికి వెళ్లారు. ఆ సమయంలో పోలీస్‌స్టేషన్ నుంచి బయటికి వ స్తూ.. దాదాపు రాత్రి 7.05 సమయంలో ఆయన కుమారులు తమ ఫొటో తీసుకున్నారు. ఇది ఇప్పుడు కీలకంగా మారింది. నాగేశ్వర్రావు 18నే ఫిర్యాదు చేస్తే.. ఆయన గాయాలు తడి ఆరి ఉండాలని గుర్తుచేస్తున్నారు. మరి 17వ తేదీనే ఫిర్యాదు ఇచ్చి ఉంటే.. మొదట నాగేశ్వరరావు ఫిర్యాదు కేసుగా నమోదు కావాలి. ప్రత్యర్థుల కేసు ముందుగా ఎలా తీసుకున్నారని బందువులు ప్రశ్నిస్తున్నారు. ఓ నేత ప్రమేయంతోనే..? నాగేశ్వర్రావు, ఆయన కుమారులపై దాడిచేసిన నిందితుల తరఫున అగ్రహారానికి చెందిన ఓ నాయకుడు పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చాడని.. అందుకే నిందితులపై, బాధితులపై ఒకే సెక్షన్లతో కేసులు పెట్టారని బాధిత కుటుం బ సభ్యులు చెప్తున్నారు. హత్యాయత్నంపై ఫిర్యాదు చేసినా.. పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లనే లేదని, సాక్షులను విచారించలేదని ఆరోపిస్తున్నారు. కాగా, వేములవాడలో హత్యాయత్నానికి ప్రయత్నించిన వారి బంధువులే.. జగిత్యాలలో నాగేశ్వరరావు, ఆయన కుమారులను పొట్టన బెట్టుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హత్యకు వేములవాడలోనే పథకం వేశారని.. జగిత్యాలలో అమలు చేయించారని అంటున్నారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు వేములవాడలో జరిగిన దాడి, జగిత్యాలలో జరిగిన దాడి రెండూ వేర్వేరు. వేర్వేరు కారణాలు, నేపథ్యాలు ఉన్నాయి. ఇరువర్గాల ఫిర్యాదు ఆధారంగా కేసులు నమోదయ్యాయి. నిందితులు తమకు ప్రాణహాని ఉందని పోలీసులతో చెప్పలేదు. ఇక్కడి నిందితులకు, జగిత్యాలలో హత్యలకు పాల్పడినవారికి సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై విచారణ చేయిస్తాం. – రాహుల్ హెగ్డే, ఎస్పీ, రాజన్న సిరిసిల్ల -
యువకులపై దాడి: పోలీసులపై వేటు
సాక్షి, సిరిసిల్ల : నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సిరిసిల్లలో ముగ్గురు విద్యార్థులపై ప్రతాపం చూపించిన పోలీసులపై ఎస్పీ రాహుల్ హేగ్డే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యువకులపై దాడి చేసిన నలుగురు సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. క్రమ శిక్షణ చర్యల కింద ఇద్దరు ఎస్ఐలు, కానిస్టేబుల్, హోంగార్డును పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు ఎస్పీ అటాచ్ చేశారు. కాగా వేడుకల సందర్భంగా నలుగురు యువకులపై పోలీసులు కర్రలతో విచక్షణారహింతగా కొడుతూ.. బూటు కాళ్లతో తన్నుతూ అమానుషంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవడంతో.. ఎస్పీ రాహుల్ సిరియస్‌గా స్పందించారు. (‘ఖాకీ’ మార్కు ప్రతాపం!) -
సర్పంచ్ హత్యతో మూడపల్లిలో పోలీసుల విచారణ
సాక్షి, చందుర్తి/వేములవాడ : మండలంలోని మూడపల్లి సర్పంచ్ గోలి శంకర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి హతమార్చడంతో పోలీసులు మూడపల్లి గ్రామంలో అనుమానితులను సోమవారం విచారించినట్లు సమాచారం. ఏడేళ్ల క్రితం ఇదే గ్రామానికి చెందిన వివాహిత మహిళ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకోగా, ఆమె ఆత్మహత్యకు శంకర్ బాధ్యుడని సదరు మహిళా మృతదేహంతో గ్రామస్తులు ధర్నాను చేపట్టారు. శంకర్ కుటుంబంతో మరో రెండుమూడు కుటుంబాలకు విరోధం ఉండడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. అంతేకాకుండా వేములవాడ పట్టణ శివారు ప్రాంతంలో హంతకులు వెంటాడి హతమార్చడాన్ని పోలీసులు జీర్ణించుకోవడం లేదు. ఫ్యాక్షన్ కక్షలను తలపించే రీతిలో జరిగిన హత్యోందతాన్ని సవాల్‌గా స్వీకరిస్తున్నారు. హత్య సంఘటన స్థలాన్ని ఎస్పీ రాహూల్ హెగ్డే సందర్శించి ఘటనపై ఆరా తీయడంతో జిల్లాలోనే ఈ ఘటన సంచలనంగా మారింది. చందుర్తి పోలీసులు మాత్రం మూడపల్లిలోని శంకర్‌తో విరోధం, పాత కక్షలు ఉన్న వారందరిపై నిఘా తీవత్రరం చేశారు. అంతేకాకుండా శంకర్ ఓ వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో సదరు మహిళ సోదరుడికి, శంకర్‌కు నెల క్రితం గొడవలు తలెత్తాయని అతడి సన్నిహితులు గ్రామంలో చర్చించుకుంటున్నారు. ఈ గొడవలే హత్యకు దా రి తీసి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హంతకులు ఎవరన్నది హత్య జరిగి 24గంటలు గడిచినా పోలీసులకు అంతు చిక్కడం లేదు. మృతుడి కాల్ డేటా సేకరణ? వేములవాడ పట్టణ శివారులో హత్యకు గురైనా మూడపల్లి సర్పంచ్ గోలి శంకర్ సెల్ ఫోన్ కాల్ డేటాతో పాటు పోలీసులు అనుమానితుడిగా భావిస్తున్న కొండన్నపల్లి వివాహిత సోదరుడి కాల్‌డేటాపై దృష్టిసారించుతున్నారు. వివాహత సోదరుడు కేరళలో ఉన్నాడన్న సమాచారం మేరకు పోలీసులు సోమవారం ఉదయం అతడి లొకేషన్‌ను పోలీసులు స్వీకరించినట్లు తెలిసింది. అనుమానితుడు కేరళలో ఉన్నా కిరాయి హంతకులను ఏర్పాటు చేసి హతమార్చాడా ? వివరాలు సేకరించి పనిలో నిమగ్నమైనట్లు ప్రచారం జరగుతోంది. ఏది ఏమైన హత్యను సవాల్‌గా స్వీకరించి నిందితులను సాధ్యమైనంత తొందరలో పట్టుకునేందుకు పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. -
గిరిజన యువకులు అన్ని రంగాల్లో రాణించాలి
► ఐటీడీఏ పీఓ చక్రధర్‌రావు, ఏఎస్పీ రాహుల్ హెగ్డే ఎస్‌ఎస్‌తాడ్వాయి(ములుగు): గిరిజన యువకులు అన్ని రంగాల్లో రాణించాలని ఐటీడీఏ పీఓ చక్రధర్‌రావు అన్నారు. భూమి పండుగను పురస్కరించుకుని కామారంలో బిర్సాముండా యూత్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రాష్ట్ర స్థాయి గ్రామీణ వాలీబాల్ క్రీడత్సోవాలు శుక్రవారం రెండో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఏటూరునాగారం ఏఎస్పీ రాహుల్ హెగ్డేతో కలిసి వచ్చిన పీఓ మొక్కలు నాటడంతో పాటు బిర్సాముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పీఓ మాట్లాడుతూ ఐటీడీఏ సంక్షేమ పథకాలను గిరిజన యువకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలన్నారు. పోలీస్ కానిస్టేబుల్, ఆర్మీ రిక్రూట్మెంట్, డ్రైవింగ్‌పై గిరిజన యువకులకు ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. విజేతలైన క్రీడాకారులకు అం దించే కంపు, మెడల్స్‌కు అయ్యే ఖర్చులను చెల్లించనున్నట్లు పీఓ ప్రకటించారు. ఏఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ యు వకులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకున్నపుడే విజయం సాధిస్తారన్నారు. గిరిజన యువత క్రీడల్లో తమ శక్తిని ఉపయోగించి విజయం సాధించాలన్నారు. ఈ సందర్భంగా పీఓ, ఏఎస్పీ వాలీబాల్ షో మ్యాచ్ అడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో మేడారం జాతర మాజీ చైర్మన్ రేగ నర్సయ్య, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి భర్తపురం నరేష్, కొర్నెబెల్లి నరేందర్, బిర్సాముండా యూత్ అధ్యక్షుడు చోక్కరావు, చర్ప రవి, నారాయణ, ధనసరి లలిత పాల్గొన్నారు.