రామబాణం ఫేం డింపుల్ హయాతిపై క్రిమినల్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారును కారుతో ఢీకొట్టి ధ్వంసం చేసిన వ్యవహారంపై డీసీపీ డ్రైవర్ జూబ్లిహిల్స్ పోలీసులు ఫిర్యాదు చేశాడు. డింపుల్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ లను కూడా పోలీసులకు సమర్పించాడు. ఫిర్యాదు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(చదవండి: చివరి కోరిక నెరవేరకుండానే కన్నుమూసిన శరత్‌బాబు)
ఇదిలా ఉంటే.. ఈ కేసుపై డింపుల్ పరోక్షంగా స్పందించారు. అధికారాన్ని ఉపయోగించి తప్పులను కప్పిపుచ్చుకోలేరని ట్వీట్ చేశారు. అంటే ఈ వ్యవహారంలో తన తప్పులేదని, డీసీపీ రాహుల్ హెగ్డేనే తనకున్న అధికారంతో తప్పుడు కేసులు పెట్టించారని డింపుల్ పరోక్షంగా చెప్పుకొచ్చింది.
అసలేం జరిగింది?
హైదరాబాద్‌లోని జర్నలిస్ట్ కాలనీలో ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే నివాసం ఉటున్నారు. అదే అపార్ట్‌మెంట్‌లో డింపుల్ హయాతి తన స్నేహితుడు డేవిడ్‌తో కలిసి ఉంటున్నారు. రాహుల్ హెగ్డేకు ప్రభుత్వం కేటాయించిన వాహనాన్ని ఆయన డ్రైవర్ చేతన్ కుమార్ అదే అపార్టమెంట్‌లోని సెల్లార్‌లో పార్కింగ్ చేశాడు. ఆ వాహనం పక్కనే డింపుల్ హయాతి కూడా తన వాహనాన్ని పార్కింగ్ చేస్తుంది. . దీనిపై వారికి పలు మార్లు గొడవైంది.అయితే తాజాగా డింపుల్ సదరు ఆఫీసర్ కారుని ఉద్దేశపూర్వకంగా ఢీ కొట్టడంతో పాటు కాలితో తంతూ గొడవ చేసింది. అక్కడున్న డ్రైవర్‌తోనూ ఆమె గొడవ పడింది. దీంతో ఐపీఎస్ ఆఫీసర్ జూబ్లీ హిల్స పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Using power doesn’t stop any mistake . 😂
— Dimple Hayathi (@DimpleHayathi) May 23, 2023
Comments
Please login to add a commentAdd a comment