Dimple Hayathi Questions Telangana IT Minister KTR To Grab Attention - Sakshi
Sakshi News home page

Dimple Hayathi:డింపుల్‌ హయాతి అసహనం.. మంత్రి కేటీఆర్‌కే ట్వీట్‌

Published Thu, Jul 20 2023 1:35 PM | Last Updated on Thu, Jul 20 2023 2:28 PM

Dimple Hayathi Stuck In Hyderabad Traffic Tweet To Minister Ktr - Sakshi

హీరోయిన్‌ డింపుల్‌ హయాతి పేరు ఈమధ్య ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది. హైదరబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ రాహుల్‌ హెగ్డేతో జరిగిన వివాదంతో కొన్నిరోజులుగా డింపుల్‌ పేరు హాట్‌టాపిక్‌గా మారింది. ఈ మధ్య ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజ, యాగం వంటి కార్యక్రమాలు జరిపించింది. అలా సోషల్‌ మీడియాలో వెరీ పాపులర్‌ అయిపోయింది. ఈ బ్యూటీ హైదరాబాద్ ట్రాఫిక్‌లో ఇరుక్కుంది. ఆ ట్రాఫిక్ వల్ల ఆమె అసహనానికి గురైంది. దీంతో ట్రాఫిక్ డీసీపీ ఎక్కడంటూ ట్విట్టర్‌లో ప్రశ్నించింది.

(ఇదీ చదవండి: దేవుడు ఉన్నాడు.. వాళ్లు అన్యాయం చేస్తే ఎంతవరకైనా వెళ్తా: గుణశేఖర్‌)

అంతటితో ఆగకుండా ఏకంగా తెలంగాణ మంత్రి కేటీఆర్, తెలంగాణా సీఎంఓ ట్విటర్‌ ఖాతాలకు ట్యాగ్ చేసింది. హైదరాబాద్‌లో ట్రాఫిక్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎదైనా మెడికల్‌ ఎమర్జెన్స్‌తో ఉ‍న్న వారు ఈ ట్రాఫిక్‌లో చిక్కుకొని ఉంటే పరిస్థితి ఏంటి..? ఇంట్లో నుంచి అడుగుపెట్టాలంటే భయం వేస్తుంది. ప్రభుత్వం ఏమైన డీజల్‌,పెట్రోల్‌ ఉచితంగా ఇస్తుందా.. అంటూ ఆమె ట్వీట్‌ చేసింది.  ఇంకేముంది హైదరాబాద్‌లో నిత్యం ట్రాఫిక్‌ సమస్యలు ఎదుర్కుంటున్న వారు డింపుల్‌ను సపోర్ట్‌ చేస్తున్నారు. హయాతీ డేరింగ్ చూసి నెటిజన్స్ కూడా షాక్ అవుతున్నారు. హైదరాబాద్‌లో యూ టర్న్‌ అయ్యే పాయింట్లు కొన్ని మార్చడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కొందరు కామెంట్లు చేస్తున్నారు.

(ఇదీ చదవండి: తమన్నాకు గోల్డెన్‌ ఛాన్స్‌.. మరోసారి ఆయనతో రొమాన్స్‌కు రెడీ)

హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో డింపుల్ హయాతిలు ఇద్దరూ ఒకే అపార్ట్‌మెంట్లో ఉంటారు.  కొన్నిరోజుల క్రితం వీరిద్దరి మధ్య కార్‌ పార్కింగ్‌ వివాదం నడిచిన విషయం తెలిసిందే. ఆ గొడవ కోర్టు వరకు వెల్లడంతో ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. అతన్ని టార్గెట్ చేసేందుకే డింపుల్ ఈ తరహా ట్వీట్ చేసిందంటూ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement