trafic jam
-
డింపుల్ హయాతి అసహనం.. ఆయనెక్కడ అంటూ మంత్రి కేటీఆర్‌కే ట్వీట్
హీరోయిన్ డింపుల్ హయాతి పేరు ఈమధ్య ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది. హైదరబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో జరిగిన వివాదంతో కొన్నిరోజులుగా డింపుల్ పేరు హాట్‌టాపిక్‌గా మారింది. ఈ మధ్య ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజ, యాగం వంటి కార్యక్రమాలు జరిపించింది. అలా సోషల్ మీడియాలో వెరీ పాపులర్ అయిపోయింది. ఈ బ్యూటీ హైదరాబాద్ ట్రాఫిక్‌లో ఇరుక్కుంది. ఆ ట్రాఫిక్ వల్ల ఆమె అసహనానికి గురైంది. దీంతో ట్రాఫిక్ డీసీపీ ఎక్కడంటూ ట్విట్టర్లో ప్రశ్నించింది. (ఇదీ చదవండి: దేవుడు ఉన్నాడు.. వాళ్లు అన్యాయం చేస్తే ఎంతవరకైనా వెళ్తా: గుణశేఖర్) అంతటితో ఆగకుండా ఏకంగా తెలంగాణ మంత్రి కేటీఆర్, తెలంగాణా సీఎంఓ ట్విటర్ ఖాతాలకు ట్యాగ్ చేసింది. హైదరాబాద్‌లో ట్రాఫిక్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎదైనా మెడికల్ ఎమర్జెన్స్తో ఉన్న వారు ఈ ట్రాఫిక్‌లో చిక్కుకొని ఉంటే పరిస్థితి ఏంటి..? ఇంట్లో నుంచి అడుగుపెట్టాలంటే భయం వేస్తుంది. ప్రభుత్వం ఏమైన డీజల్,పెట్రోల్ ఉచితంగా ఇస్తుందా.. అంటూ ఆమె ట్వీట్ చేసింది. ఇంకేముంది హైదరాబాద్‌లో నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కుంటున్న వారు డింపుల్‌ను సపోర్ట్ చేస్తున్నారు. హయాతీ డేరింగ్ చూసి నెటిజన్స్ కూడా షాక్ అవుతున్నారు. హైదరాబాద్‌లో యూ టర్న్ అయ్యే పాయింట్లు కొన్ని మార్చడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కొందరు కామెంట్లు చేస్తున్నారు. (ఇదీ చదవండి: తమన్నాకు గోల్డెన్ ఛాన్స్.. మరోసారి ఆయనతో రొమాన్స్‌కు రెడీ) హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో డింపుల్ హయాతిలు ఇద్దరూ ఒకే అపార్ట్మెంట్లో ఉంటారు. కొన్నిరోజుల క్రితం వీరిద్దరి మధ్య కార్ పార్కింగ్ వివాదం నడిచిన విషయం తెలిసిందే. ఆ గొడవ కోర్టు వరకు వెల్లడంతో ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. అతన్ని టార్గెట్ చేసేందుకే డింపుల్ ఈ తరహా ట్వీట్ చేసిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. I mean seriously this is getting worse than anything just to reach your house it takes more than an hour now where’s the traffic dcps ? What if there is a medical emergency? Can we even step out in Hyderabad ? We don’t get fuel free dear government. @KTRBRS @TelanganaCMO pic.twitter.com/0Z4oCblc3K — Dimple Hayathi (@DimpleHayathi) July 19, 2023 -
బేగంపేటలో భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: ఇరాన్, అమెరికా దేశాల మధ్య దాడుల నేపథ్యంలో హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. బేగంపేటలోని యూఎస్ కాన్సులేట్ కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు బలగాలను మొహరించారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుస్తు జాగ్రత్త చర్యలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయం వద్ద భారీ భద్రత నేపథ్యంలో బేగంపేటలో ట్రాఫిక్‌కు అవాంతరాలు ఏర్పడుతున్నాయి. ఉదయం ఆఫీసులు, విద్యాసంస్థలకు వెళ్లేవారు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. రద్దీ సమయంలో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను ఎప్పటికప్పుడు నియంత్రించేందుకు నగర ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. కాగా, మన దేశం సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై డిసెంబర్ 31న ఇరాన్ మద్దతున్న హిజ్బుల్ బ్రిగేడ్ తీవ్రవాద సంస్థ మద్దతుదారులు దాడికి పాల్పడటంతో చిచ్చు రగిలింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ జనరల్ ఖాసీం సులేమానిని డ్రోన్ల సాయంతో క్షిపణి దాడులతో అమెరికా అంతమొందించింది. సులేమాని హత్యకు ప్రతీకారంగా ఇరాక్‌లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై తాజాగా ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. అమెరికా, ఇరాన్ పరస్పర దాడుల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సంబంధిత వార్తలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు నష్టాన్ని అంచనా వేస్తున్నాం: ట్రంప్ ఇరాన్ దాడి : భగ్గుమన్న చమురు ట్రంప్–మోదీ ఫోన్ సంభాషణ 52తో పాటు.. 290 కూడా గుర్తుపెట్టుకో ట్రంప్! సులేమానీ అంతిమయాత్రలో తొక్కిసలాట -
భారీగా నిలిచిపోయిన వాహనాలు.. ఓటర్లకు తిప్పలు
-
భారీగా నిలిచిపోయిన వాహనాలు.. ఓటర్లకు తిప్పలు
యాదాద్రి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు వేసేందుకు సొంతూళ్లకు బయలుదేరిన ఓటర్లకు తిప్పలు తప్పడం లేదు. హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారిపై పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రేపు ఎన్నికలు జరుగుతున్నందున ఓటు హక్కును వినియోగించుకునేందుకు హైదరాబాద్ నగరం నుంచి ఓటర్లు మంగళవారం రాత్రి నుంచి సొంతూళ్లకు బయల్దేరారు. దీంతో అర్ధరాత్రి నుంచి ఈ రహదారిపై వాహనాలు భారీగా బారులు తీరాయి. బుధవారం తెల్లవారుజాము నుంచి చౌటుప్పల్ మండలం పంతంగి టోల్గేట్ వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. విజయవాడ వైపుకు వెళ్లే వాహనాలు పోటేత్తడంతో.. ట్రాఫిక్ జామ్ భారీగా అయ్యింది. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. టోల్ ఫీజులేకుండా వాహనాలను వదిలిపెట్టాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. గంటలకొద్ది వేచిఉండడంతో టోల్గేట్ సిబ్బందిపై వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నారు. దీంతో గేట్ వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎన్నికల నేపథ్యంలో రైల్వే స్టేషన్లో కూడా పరిస్థితి ఇదే విధంగా ఉంది. ఏపీకి వెళ్లే ఓటర్లు పెద్దఎత్తున రావడంతో రైళ్లన్ని కిక్కిరిసిపోతున్నాయి. (చదవండి: ఓటేయడానికి పోటెత్తారు!) -
ముక్కుతూ మూలుగుతూ వస్తున్న ఆర్టీసీ ప్రయాణికులు!
సాక్షి, హైదరాబాద్ : దసరా సెలవులు ముగిశాయి. శనివారం నుంచి అంతా తిరుగు ప్రయాణాల్లో ఉన్నారు. కానీ, శనివారంతో పోలిస్తే ఆదివారం రద్దీ రెండింతలుగా ఉంది. దీంతో ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. దసరా సెలవుల సందర్భంగా ఆర్టీసీ 4,480 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. వీటిలో 50% అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. దసరా, ఆ మరుసటి రోజు రద్దీ బాగా తగ్గినా, శనివారం నుంచి తిరిగి ఊపందుకుంది. ఆదివారం ఉదయం నుంచే ఆర్టీసీ బస్సులన్నీ కిటకిటలాడటం మొదలైంది. రిజర్వేషన్ చేయించుకున్న వారి పరిస్థితి పర్వాలేదుగానీ, రిజర్వేషన్ లేని ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. పాత ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ప్రజలు సీట్లు దొరక్క నానా ఇబ్బందులు పడ్డారు. 50% అదనంగా డబ్బులు చెల్లించినా వేలాడాల్సి రావడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. డొక్కు బస్సుల్లో కుక్కిపంపుతున్నారు, కనీస శుభ్రత పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్పెషల్ అన్నబోర్డు పెట్టి 50% అధిక చార్జీలు వసూలు చేయడం దారుణమని వాపోతున్నారు. సెలవులు ముగియడంతో.. సోమవారం నుంచి బడులు, కాలేజీలు తిరిగి తెరుచుకుంటున్న నేపథ్యంలో ఊళ్లకు వెళ్లిన వారంతా ఆదివారం ఒక్కసారిగా బస్సు ప్రయాణాలను ఎంచుకోవడంతో రద్దీతో బస్సులన్నీ కిటకిటలాడాయి. చాలామంది ప్రయాణికులు బస్సుల్లో నిలుచుని, మరికొందరు ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తూ వచ్చారు. ఈ రద్దీ బుధవారం వరకు ఉంటుందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు రైళ్లల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సువిధ రైళ్లు మినహా తిరుగు ప్రయాణంలోనూ ఎలాంటి ప్రత్యేక సర్వీసులు నడపకపోవడంతో జనరల్ బోగీలు కిక్కిరిసిపోయాయి. రోజుకు 50వేలమంది అధికంగా ప్రయాణం చేస్తున్నా.. అధికారులు ప్రత్యేక రైళ్లు నడపకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టోల్గేట్ల వద్ద రద్దీ.. తెలంగాణలో ముంబై, విజయవాడ, బెంగళూరు, పుణే, వరంగల్ జాతీయ రహదారులు, నార్కట్‌పల్లి– అద్దంకి, రాజీవ్ రహదారిపై కలిపి దాదాపు 18 టోల్గేట్లు ఉన్నాయి. ఈ టోల్గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో గంటల తరబడి వాహనదారులు అక్కడే నిరీక్షించాల్సి వచ్చింది. మరోవైపు ఈ మార్గంలో ప్రయాణించే స్థానికులు, ఆర్టీసీ ప్రయాణికులు కూడా ట్రాఫిక్‌జామ్‌ల కారణంగా ఇబ్బందులు పడ్డారు. టోల్గేట్ల వద్ద అదనపు సిబ్బందిని నియమించినప్పటికీ రాత్రి వరకు రద్దీ కొనసాగింది. -
ముంచెత్తిన వాన: భారీ ట్రాఫిక్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరాన్ని భారీ వాన ముంచెత్తింది. ఢిల్లీ నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం భారీ వర్షం కురిసింది. కొన్నిగంటలపాటు కురిసిన భారీ వర్షంతో అనేకచోట్ల రోడ్లపై వరద ముంచెత్తింది. భారీగా ట్రాఫిక్ స్థంభించిపోయింది. బిజీ రోడ్లపై భారీగా నీరుపారడంతో వాహనదారులు, పాదచారులు అనేక ఇబ్బందులకు లోనయ్యారు. కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరా కూడా ప్రభావితమైంది. మరికొన్ని ఏరియాల్లో టెలికాం సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హనుమాన్ మందిర్ సమీపంలో రింగ్ యమునా బజార్లో వర్షపు నీటిలో ప్రభుత్వ బస్సు మొరాయించింది. దీంతో బస్సులో చిక్కుకుపోయిన సుమారు 30 మంది ప్రయాణీకులను అధికారులు రక్షించారు. అలాగే మోడీ మిల్ , భైరన్ మార్గ్, లజపత్ నగర్ మార్కెట్ తదితర ప్రాంతాలలోని రోడ్లపై వరద పారుతోంది. ఈ పరిస్థితిపై నగర ట్రాఫిక్ పోలీసు విభాగం అలర్ట్ జారీ చేసింది. రోడ్లపై నీరు నిలిచిపోయిన కారణంగా కొన్ని మార్గాల్లో ప్రయాణాలను, తప్పించడం లేదా మానుకోవాల్సిందిగా నగరవాసులకు విజ్ఞప్తి చేసింది. మరోవైపు ఢిల్లీ వర్షాలు ట్విటర్ టాప్ ట్రెండ్స్‌లో నిలవడం విశేషం. Traffic Alert Water logging at Iron Bridge Loni Road, Khajuri Chowk Wazirabad Road, Bhajan Pura Main Market Wazirabad Road, R/A Loni, Apsara Border, Yamuna Marg, IP College MGM Road Ring Road, Under IP Flyover Vikas Marg, Chatta Rail Lothian Road, — Delhi Traffic Police (@dtptraffic) September 1, 2018 30 mins of rain and see the condition of Laxmi Nagar Main Market,New Delhi. Drainage Lines choked and waste overflowing. @ArvindKejriwal @MaheishGirri @TajinderBagga @VijayGoelBJP @Gupta_vijender @ManojTiwariMP @msisodia @narendramodi @BJP4India @aajtak @indiatvnews @ZeeNews pic.twitter.com/KtagqrVz7r — Sangeet Khandelwal (@Sangeet_k) September 1, 2018 -
నగరంలోని ఆ నాలుగు రోడ్లలో నరకం..
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని ఖైరతాబాద్‌లో హోంగార్డుల ఆందోళనతో సోమవారం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్‌లో ఇరుక్కున్న వాహనదారులు సుమారు మూడు గంటలుగా నరకం అనుభవిస్తున్నారు. ట్యాంక్ బండ్ మొదలు ఖైరతాబాద్-నెక్లెస్ రోడ్డు, ఖైరతాబాద్-పంజాగుట్ట, సోమాజిగూడ, రాజ్‌భవన్ రోడ్లలో వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. దాదాపు మూడు గంటల సమయం నుంచి ట్రాఫిక్ జామ్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ఖైరతాబాద్ సర్కిల్ కావడంతో వేల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. మహబూబ్‌నగర్‌కు చెందిన గుర్రం గౌడ్ అనే హోంగార్డు ఉద్యోగం నుంచి తొలగించిన 400 మంది హోంగార్డులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలంటూ హోర్డింగ్ ఎక్కి ఆందోళనకు దిగాడు. లేకపోతే పైనుంచి దూకుతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీని కారణంగా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గౌడ్ ఆందోళనకు మద్దతుగా మరో 250 మంది హోంగార్డులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని, ఆందోళనకు దిగారు. తమ ఉద్యోగాలు తమకు ఇవ్వాలంటూ ఖైరతాబాద్ ఫ్లైఓవర్ బైఠాయించారు. పోలీసులు వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.ఉమ్మడి ఏపీలో తొమ్మిదేళ్లు ఉద్యోగం చేయించుకొని, అనంతరం సర్వీస్ నుంచి తొలగించాని ఆవేదన వ్యక్తం చేశారు. 400 మంది హోంగార్డులను తిరిగి విధుల్లోకి తీసుకోవాంటూ డిమాండ్ చేశారు. తమ ఉద్యోగ హామీ ఇచ్చేంత వరకూ ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, నిరసనకారుడిని కిందకు దించే ప్రయత్నం చేస్తున్నారు. -
ఏపీని ముంచెత్తిన భారీ వర్షాలు..
సాక్షి, విశాఖ: రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఉదయం నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. విశాఖ జిల్లాలో తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షం కురిసింది. భీమిలి, పద్మనాభం, పాడేరు ప్రాంతాలు మొత్తం జలమయమయ్యాయి. విజయ నగరం జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఏజెన్సీ ప్రాంతాలైనా జియ్యమ్మవలస, కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాల్లోని పలు గ్రామాల్లో కురిసిన వర్షాలతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శ్రీకాకుళం, విశాఖ, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడడంతో రోడ్లన్ని జలమయమయ్యాయి.అకాల వర్షాలతో పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలులకు మొక్కజొన్న, అరటి తోటలు దెబ్బతిన్నాయి. గుంటూరు జిల్లాలో భారీగా ఈదురుగాలు వీస్తుండటంతో పిడుగులు పడే ప్రమాదముందని వాతావరణశాఖ హెచ్చరించింది. సచివాలయంలోకి మళ్లీ వర్షపు నీరు భారీ వర్షంతో ఏపీ సచివాలయంలోకి మళ్లీ వర్షపు నీరు చేరింది. భవనాలు పూర్తిగా తడిసిపోవడంతో అక్కడక్కడ సీలింగ్ ఊడిపోయి నీరు కార్యాలయంలోకి ప్రవేశించింది. మున్సిపల్ మంత్రి నారాయణ ఛాంబర్లో సీలింగ్ ఎగిరిపోవడంతో సిబ్బంది ఛాంబర్ తలుపులు మూశారు. సచివాలయంలోకి వర్షం నీరురావడంతో ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. సీలింగ్‌లు ఊడిపోవడంతో అక్కడి సెక్యూరిటీ సిబ్బంది తలుపులు పట్టుకొని కాపలా కాస్తున్నారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఛాంబర్ వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. ఛాంబర్లోకి ఎవరూ వెళ్లకూడదని, ఫోటోలు, వీడియోలు తీయకూడదని ఆంక్షలు విధించారు. -
భాగ్యనగరంలో భారీ వర్షం..
-
భాగ్యనగరంలో భారీ వర్షం..
సాక్షి, హైదరాబాద్ : భాగ్య నగరం మరోసారి భారీ వర్షానికి చిగురుటాకులా వణికిపోయింది. సోమవారం సాయంత్రం భారీ వర్షం హైదరాబాద్‌ను ముంచెత్తింది. నగరంలోని డ్రైనేజీలు, నల్లాలు పొంగిపొర్లాయి. సాయంత్రం వేళ కావడంతో వాహనదారులు ఇంటికి చేరడానికి తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా క్యుములోనింబస్ మేఘాలు విస్తరించడంతో భారీ వాన కురుస్తోంది. ఉపరితల ఆవర్తనం కారణంగా మరో రెండురోజుల పాటు నగరంలో భారీవర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎస్ఆర్నగర్ ఎర్రగడ్డ, కూకట్పల్లి, మియాపూర్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వాన కురుస్తోంది. ఖైరతాబాద్, కోఠి, నాంపల్లి దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, బేగంపేట్, సికింద్రాబాద్, ఉప్పల్, నాచారంలో భారీ వర్షం కురుస్తోంది. పాతబస్తీ లాల్ దర్వాజా, అలియాబాద్, చాంద్రాయణగుట్ట, శివాజీ నగర్, అరుంధతి కాలనీ, ఉప్పుగూడ, గౌలిపుర, మొఘల్‌పుర, షా అలీ బండ, ఛత్రినాక, లక్ష్మీనగర్ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. దీంతో జంట నగరాల్లోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, బండ్లగూడ, పెద్ద అంబర్పేటలలోనూ పెద్ద ఎత్తున వర్షం పడుతోంది. జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, పటాన్చెరు, ఉప్పల్, సంతోష్‌నగర్, మెహిదీపట్నం, కార్వాన్, మలక్‌పేట, గోషామహల్ సర్కిళ్లలోనూ భారీ వాన కురుస్తోంది. అలాగే రంగారెడ్డి జిల్లా శంషాబాద్, కందుకూరు, మహేశ్వరం మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. (అంబర్పేట్ వద్ద మూసీ నది వంతెనపై వరద నీటిలో చిక్కుకుపోయిన ఆటో.. తోసుకెళుతున్న ప్రయాణీకులు) (దిల్సుఖ్నగర్ వెళ్లే మార్గంలో అంబర్ పేట మూసీ బ్రిడ్జిపై నుంచి మూసీ నదిలోకి పొర్లుతున్న వరద నీరు) -
వైద్య వృత్తికి వెళుతూ విధి వక్రించి..
ఫిజియోథెరపిస్ట్ దుర్మరణం దొమ్మేరులో ఘటన బంధువులు, స్థానికుల ఆందోళన 7 గంటలపాటు స్తంభించిన ట్రాఫిక్ కొవ్వూరు రూరల్: కష్టాల కడలి నుంచి గట్టెక్కిస్తాడనుకున్న కొడుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన నిమిషాల వ్యవధిలోనే విగతి జీవిగా మారతాడని ఆ కన్నవాళ్లు ఊహించలేదు. అష్టకష్టాలు పడి ఉన్నత చదువులు చదివించుకుని కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్న పెద్దకొడుకు కానరాని లోకాలకు వెళ్లడంతో వారి దుఃఖం కట్టలు తెంచుకుంది. ఆస్పత్రికి వెళ్లి రోగులకు సేవలు అందించి వస్తానమ్మా అని ఇంటి నుంచి బయలుదేరిన పావు గంటలోనే కానరాని లోకాలకు వెళ్లాడని తెలిసి ఆ తల్లి గుండె చెరువయ్యింది. గుర్తుతెలియని వాహనం మృత్యురూపంలో ఎదురుగా వచ్చి ఢీకొట్టడంతో సొంత ఊరిలోనే ఊపిరిలొదిలాడు కొవ్వూరు మండలం దొమ్మేరుకు చెందిన ఫిజియోథెరపిస్ట్ తూతా రమేష్ (25). మంగళవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతితో గ్రామం శోకసంద్రంగా మునిగిసోయింది. సంఘటనా ప్రాంతంలో మృతుడి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. వివరాలిలా ఉన్నాయి.. దొమ్మేరులోని అనంతలక్ష్మి కాలనీలో నివాసముంటున్న వ్యవసాయ కూలి వెంకటరమణ, సీత దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు రమేష్‌ను కష్టపడి ఉన్నత చదువులు చదివించారు. గతేడాది ఫిజియోథెరపిస్ట్ కోర్సు పూర్తిచేసుకున్న రమేష్ రాజానగరం జీఎస్ఎల్ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. రోజూ మాదిరిగా మంగళవారం ఉదయం ఇంటి నుంచి విధి నిర్వహణ నిమిత్తం రాజానగరం వెళుతుండగా దొమ్మేరు ప్రధాన సెంటర్లో ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. భారీ వాహనాల రాకతో ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని, తక్షణమే మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ బంధువులు, స్థానికులు మృతదేహం వద్ద టెంట్టు వేసి రాస్తారోకో చేశారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ ఆందోళన సాగింది. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. మృతుడి బంధువులు, ఆందోళనకారులను బలవంతంగా తొలగించి రమేష్ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
నడిరోడ్డుపై లారీ బోల్తా.. తప్పిన ప్రమాదం
వరంగల్: వరంగల్ అర్బన్ జిల్లా హంటర్ రోడ్డులోని ప్రకృతి చికిత్సాలయం వద్ద మంగళవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. వేగంగా వెళుతున్న ఒక లారీ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని రోడ్డుపై అడ్డంగా బోల్తాపడింది. ఆ సమయంలో రోడ్డుపై జన సంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. లారీ బోల్తా పడేందుకు కొన్ని క్షణాల ముందే పాఠశాల బస్సు ఈ మార్గంలో వెళ్లింది. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి లారీని పక్కకు తప్పించారు. ట్రాపిక్‌ను పునరుద్ధరించారు. -
పోలవరం నిర్వాసితుల నిరసన
తోటపల్లి బంద్ విజయవంతం రెండు గంటల పాటు రాస్తారోకో స్తంభించిన వాహన రాకపోకలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపాటు తోటపల్లి (నెల్లిపాక) : పోలవరం నిర్వాసితులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై తీవ్రంగా నిరసన తెలిపారు. నిర్వాసితుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని రిలేదీక్షలు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని గురువారం ఎటపాక మండలంలో తోటపల్లి బంద్ పాటించారు. ఈ బంద్‌కు వ్యాపారస్తులు, ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు. దుకాణాలు,ప్రభుత్వ కార్యాలయాలు మూసివేశారు. నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో ఉదయం 10.30గంటలకు భద్రాచలం, కూనవరం ప్రధాన రహదారిపై వందలాది మంది నిర్వాసితులు బైటాయించి రెండు గంటలపాటు రాస్తారోకో నిర్వాహించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. డప్పు వాయిద్యాలతో గిరిజనలు రేల నృత్యాలు చేస్తూ తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ...పోలవరం ప్రాజెక్టు 2018 కల్లా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నా కానీ నిర్వాసితులకు న్యాయం చేయాలనే ఆలోచన ఈప్రభుత్వానికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకులు కాంట్రాక్టర్ల లబ్ధికోసం వేల కోట్ల ప్రజా దనం దోచుకునేందుకు ప్రాజెక్టు నిర్మాణంపై అశ్రద్ద చూపుతున్నారని విమర్శించారు. పట్టిసీమ తరహాలోనే నిర్వాసితులందరికీ న్యాయం చేయాలని కొత్త చట్టప్రకారం మెరుగైన ప్యాకేజి, పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ముంపు ప్రాంతాలను సర్వే చేసి ఆర్ ఆండ్ ఆర్ ప్యాకేజి ఇచ్చి పునరావాసం కల్పించాకే ప్రాజెక్టు పూర్తి చేయాలని హెచ్చరించారు. 400 గ్రామాలను జలసమాధి చేసే ప్రాజెక్టు నిర్మించుకుంటూ ఇక్కడి ప్రజల సమస్యలను గాలికి వదిలేయటం సరైందికాదని ఆవేదన వ్యక్తం చేశారు. గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోవటంతో ఎస్సై నాగరాజు అక్కడకు చేరుకుని ఆందోళన కారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారు మాటవినక పోవటంతో సమస్యను ఆయన ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా వివరించారు. మూడు గంటలకు తహసీల్దార్ నర్శింహులు వచ్చి హామీ ఇస్తారని చెప్పడంతో మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో రాస్తారోకో విరమించారు. తహసీల్దార్ నిర్వాసితుల దీక్షా శిబిరం వద్దకు చేరుకుని నిర్వాసితుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపి మండల కన్వీనర్ తానికొండ వాసు, సీపీఎం నాయకులు మర్లపాటి నాగేశ్వరావు,ఐ వెంకటేశ్వర్లు, కాక అర్జున్,కోడూరి నవీన్,గంగుల నర్శింహారావు ఉన్నారు. -
‘జనగామ’ కోసం కదం తొక్కిన జనం
జేఏసీ నాయకులను లాక్కెళ్లిన పోలీసులు ఎన్ఎస్యూఐ జిల్లా మాజీ అధ్యక్షుడు వేణు, జేఏసీ నేత మాజీద్‌కు గాయాలు ప్రభుత్వ కార్యాలయాల ఎదుట టీఎన్జీవో నాయకుల నిరసన జనగామ : జనగామ జిల్లా ఆకాంక్ష, అక్రమ అరెస్టులకు నిరసనగా శనివారం తలపెట్టిన బంద్‌లో వేలాదిగా తరలివచ్చిన జనం కదం తొక్కారు. వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మహిళా పోలీసులను పెద్ద సంఖ్యలో రంగంలోకి దింపారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఒక్కసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అప్పటికే జేఏసీ, విద్యార్థిసంఘ నాయకులతో నిండిపోయిన దీక్షా శిబిరం వద్దకు లింగాలఘణపురం, బచ్చన్నపేట, నర్మెట మం డలం నుంచి ప్రజాప్రతినిధులు, మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. హైదరాబాద్, వరంగల్, సిద్ధిపేట, విజయవాడ హైవేలపై బైఠాయించి రాస్తారోకో మొదలు పెట్టారు. పది నిమిషాల పాటు ఓపికగా ఉన్న పోలీసులు.. నాయకులను అరెస్టు చేసేందుకు సిద్ధం కావడంతో మహిళలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి, ఎన్ఎస్యూఐ జిల్లా మాజీ అధ్యక్షుడు జక్కుల వేణుమాధవ్, కౌన్సిలర్ మేడ శ్రీను, జేఏసీ నాయకులు మాజీద్, మంగళ్లపల్లి రాజు, శ్రావణ్‌ను బలవంతంగా లాక్కెళ్లి డీసీఎంలో పడేశారు. ఈ క్రమం లో వేణుమాధవ్, మాజీద్‌కు తీవ్రగాయాలు కావడంతో పోలీసులు స్వయంగా ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. దీంతో రెచ్చిపోయిన ఉద్యమకారులు మరోసారి జాతీయ రహదారిని దిగ్బంధించారు. అప్పటికే కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలను పంపించే క్రమంలో వాటిని మళ్లీ అడ్డుకున్నారు. మహిళ లు కూడా పెద్ద సంఖ్యలో రావడంతో పోలీసుల కు తలనొప్పిగా మారింది. రంగంలోకి దిగిన మహిళా పోలీసులు రెండు గంటల పాటు అతికష్టం మీద మహిళలను పంపించేశారు. లింగాలఘణపురం మండలం టోల వద్దకు తీసుకువెళ్లి స్వయంగా వారిని ఎక్కించి వెళ్లిపోయే వరకు ఉన్నారు. డీఎస్పీ పద్మనాభరెడ్డి ఆధ్వర్యంలో సీఐ తిరుపతి పర్యవేక్షణలో వరంగల్, నర్సంపేట, మహబూబాబాద్, ఏటూరునాగారం సబ్‌డివిన్‌లోని పోలీసులతో పాటు పారామిలటరీ బలగాలతో బందోబస్తు కొన సాగిస్తున్నారు. రెవెన్యూ, హెడ్‌పోస్టఫీస్, బ్యాంకుల ఎదుట నిరసన తెలిపిన నాయకులకు టీఎన్జీవో నాయకులు మద్దతు పలికారు. అంతకు ముందు జనగామలో విద్యార్థి సంఘం నేతలు బైక్‌ర్యాలీ నిర్వహించారు. ము నిసిపల్ వైస్ చైర్మన్ నాగారపు వెంకట్, సిద్ధిరాములు, నాగరాజు పాల్గొన్నారు. -
తిరుమల ఘాట్ రోడ్డులో కారు దగ్ధం
తిరుమల: కలియుగ వైకుంఠం తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ఓ కారు అగ్నికి ఆహుతైంది. శుక్రవారం ఉదయం చోటుచేసుకున్న ఈ సంఘటనతో దాదాపు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. తమిళనాడుకు చెందినదిగా భావిస్తోన్న కారులో షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. డ్రైవర్ అప్రమత్తతతో కారులో ప్రయాణిస్తున్నవారు సురక్షితంగా బయటపడగటిగారు.