సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు వేసేందుకు సొంతూళ్లకు బయలుదేరిన ఓటర్లకు తిప్పలు తప్పడం లేదు. హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారిపై పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రేపు ఎన్నికలు జరుగుతున్నందున ఓటు హక్కును వినియోగించుకునేందుకు హైదరాబాద్ నగరం నుంచి ఓటర్లు మంగళవారం రాత్రి నుంచి సొంతూళ్లకు బయల్దేరారు.