panthangi toll plaza
-
టోల్ ప్లాజాకు ‘పండుగ’
చౌటుప్పల్: సంక్రాంతి పండుగ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది. హైదరాబాద్ జంటనగరాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి మూడు రోజులు గా పెద్ద ఎత్తున ప్రజలు తమ స్వగ్రామాలకు తరలివెళుతు న్నారు. ఈ క్రమంలో చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా నుంచి రికార్డు స్థాయిలో వాహనాలు వెళ్లాయి. 12వ తేదీన ఇరువైపులా 56,595 వాహనాలు రాకపోకలు సాగించాయి. ఇందు లో కార్లు 42,844, ఆర్టీసీ బ స్సులు 1,300, ప్రైవేట్ బస్సు లు 4,913, గూడ్స్ వాహనాలు 7,538 ఉన్నాయి. 13వ తేదీన 67,577 వాహనాలు ఇరుమార్గాల్లో వెళ్లాయి. ఇందులో కార్లు 53,561, ఆర్టీసీ బస్సులు 1,851, ప్రైవేట్ బస్సులు 4,906, అలాగే 7,259 గూడ్స్, ఇతర వాహనాలు రాకపోకలు సాగించాయి. 11 ఏళ్లలో ఇదే మొదటిసారి: హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిని 4 వరుసలుగా మార్చిన తర్వాత 11 ఏళ్ల కాలంలో ఒక్క రోజులో ఇంత పెద్ద సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగించడం ఇదే మొదటిసారని అంటున్నారు. సాధారణ రోజుల్లో పంతంగి టోల్‌ప్లాజా నుంచి రోజుకు 30 వేల నుంచి 40 వేల వరకు వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ముందస్తు జాగ్రత్తలు: సంక్రాంతి పండుగకు ఈ రహదారిగుండా పెద్ద సంఖ్యలో ప్రజానీకం వెళ్తుండటంతో పోలీసులు, జీఎమ్మార్ అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పంతంగి టోల్‌ప్లాజా, గ్రామాల కూడళ్ల వద్ద ప్రత్యేక సిబ్బందిని నియమించారు. -
టోల్ చార్జీలు పెంపు
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల్లో చార్జీలు పెరిగాయి. రాష్ట్రంలో ఉన్న 29 ప్లాజాల్లో హైదరాబాద్–బెంగళూరు హైవే మినహా మిగతా టోల్ ప్లాజాల రుసుములను ఎన్హెచ్ఏఐ సవరించింది. బెంగళూరు హైవేలో ఓ కాంట్రాక్టరుతో ఉన్న ఒప్పందం ప్రకారం కొత్త ధరలు సెప్టెంబర్‌లో విడుదల కానున్నాయి. మిగతా టోల్ ప్లాజాల్లో ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. ఆయా రోడ్ల నిడివి, వెడల్పు, వాటి మీద ప్రయాణించే వాహనాల సంఖ్య, టోల్ గేట్ల సామర్థ్యం, నిర్వహణ వ్యయం.. ఇలా పలు అంశాల ప్రాతిపదికగా టోల్ ధరలను సవరించారు. కార్లు, జీపులు లాంటి వాహనాలకు 5 నుంచి 8 శాతం, లైట్ కమర్షియల్ వాహనాలకు 10 నుంచి 15 శాతం, బస్సులు, ట్రక్కులకు 10 నుంచి 15 శాతం చార్జీలు పెరిగాయి. ఆయా కేటగిరీల్లో రూ. 5 నుంచి 50 వరకు ధరలు పెరిగాయి. టోల్ ధరలను ఏటా ఏప్రిల్ ఒకటిన సవరిస్తుంటారు. ఆర్టీసీ కూడా: తాజాగా ఆర్టీసీ కూడా టోల్ రుసుమును జనం జేబుపై వేసింది. అన్ని బస్సులకు కలిపి ఒకేసారి ఆర్టీసీ టోల్ రుసుములను చెల్లిస్తుంది. గత నాలుగేళ్లుగా టోల్ రుసుములను సంస్థ సవరించలేదు. గత ఏడాది కాలంలో ప్రయాణికుల నుంచి వసూలు చేసిన మొత్తం కంటే టోల్ నిర్వాహకులకు చెల్లించిన మొత్తం రూ.8 కోట్లు ఎక్కువని ఇటీవల గుర్తించారు. ఈ మేరకు వారం క్రితం ఆర్టీసీ కూడా టికెట్ రేట్లలో టోల్ వాటాను పెంచింది. గతేడాది టోల్ చార్జి, ఏప్రిల్ ఒకటి నుంచి అమలయ్యే కొత్త రేట్లు (మొదటిది పాత, రెండోది కొత్త) ఇలా ఉన్నాయి. హైదరాబాద్విజయవాడ హైవే పై పంతంగి: కారు, జీపు వ్యాన్ ఇతర లైట్ వెహికిల్స్‌కు సింగిల్ ట్రిప్ ఛార్జి రూ.80 నుంచి రూ.90కి, రిటర్న్ జర్నీతో కలిపి ఛార్జి రూ.120 నుంచి రూ.135కు, నెల పాస్ ఛార్జి రూ.2690 నుంచి రూ.2965కు పెరిగాయి. లైట్ కమర్షియల్ వెహికిల్స్ సింగిల్ ట్రిప్ ఛార్జి రూ.130 నుంచి రూ.140కి, రిటర్న్ జర్నీ రూ.190 నుంచి రూ.210కి, నెలపాస్ రూ.4255 నుంచి రూ.4685కు పెరిగాయి. బస్, ట్రక్కుల సింగిల్ ట్రిప్ రూ.265 నుంచి రూ.290కి, రిటర్న్ జర్నీ ఛార్జి రూ.395 నుంచి రూ.435కు, నెల పాస్ రూ.8795 నుంచి రూ.9685కు, ఓవర్‌సజ్డ్ వెహికిల్ సింగిల్ ట్రిప్ రూ.510 నుంచి రూ.560కి, రిటర్న్ జర్నీ రూ.765 నుంచి రూ.845కు, నెలపాస్ రూ.17010 నుంచి రూ.18740కి పెరిగాయి. కోర్లపహాడ్: కార్లు, జీపుల సింగిల్ ట్రిప్ రూ.110 నుంచి రూ.120కి, రిటర్న్ జర్నీ రూ.165రూ.180, నెలపాస్ రూ.3650రూ.4025, లైట్ కమర్షియల్ వెహికిల్స్ సింగిల్ ట్రిప్ ఛార్జి రూ.175రూ.190, రిటర్న్ జర్నీ రూ.260రూ.285, నెలపాస్రూ.5795రూ.6385, బస్సు, ట్రక్కుల సింగిల్ ట్రిప్ రూ.360రూ.395, రిటర్న్ జర్నీ ఛార్జి రూ.540రూ.595, నెలపాస్ రూ.12020రూ.13240, ఓవర్సైజ్డ్ హెవీ వెహికిల్స్ సింగిల్ ట్రిప్ రూ.695రూ.765, రిటర్న్ జర్నీ రూ.1045రూ.1150, నెలపాస్ రూ.23190రూ.25545కు పెరిగాయి. చిల్లకల్లు టోల్గేట్: జీపు కార్ల సింగిల్ ట్రిప్ రూ.90 రూ.100, రిటర్న్ జర్నీ ఛార్జి రూ.135రూ.150, నెలపాస్ రూ.3040రూ.3350, లైట్ కమర్షియల్ వెహికిల్స్ సింగిల్ ట్రిప్ రూ.145రూ.160, రిటర్న్ జర్నీ రూ.215రూ.240, నెల పాస్ రూ.4805రూ.5290, బస్సు, ట్రక్కు సింగిల్ ట్రిప్ రూ.300రూ.330, రిటర్న్ జర్నీ రూ.445రూ.490, నెల పాస్ రూ.9930రూ.10940, ఓవర్సైజ్డ్ వెహికిల్స్ సింగిల్ ట్రిప్ రూ.575రూ.635, రిటర్న్ జర్నీ రూ.865రూ.955, నెల పాస్ రూ.19215రూ.21170. ► ఎన్‌హెచ్ 163 పై ఉన్న కొమల్ల టోల్‌ప్లాజాలో కార్లు, జీపులకు సింగిల్ ట్రిప్ పాత ధర రూ.100 కొత్త ధర రూ.110, రిటర్న్ జర్నీకి రూ.145170, నెలపాస్‌కు రూ.32603745. ► లైట్ కమర్షియల్ వాహనాలకు సింగిల్ జర్నీ రూ.160180, రిటర్న జర్నీకి రూ.235270, నెల పాస్‌కు రూ.52653745, బస్సులు,ట్రక్కు సింగిల్ ట్రిప్‌కు రూ.330 రూ.380, రిటర్న జర్నీకి 495570, నెల పాస్‌కు రూ.1103012675, సెవన్ యాక్సల్ అంతకంటే హెవీ వెహికిల్్సకు సింగిల్ ట్రిప్ రూ.630725, రిటర్న్ జర్నీకి రూ.9451090, నెలపాస్‌కు 2105524195. ► ఎన్‌హెచ్ 163 పై ఉన్న గూడూరు ప్లాజాలో కార్లు, జీపుల సింగిల్ ట్రిప్‌కు రూ.100110, రిటర్న్ జర్నీకి రూ.150 రూ.165, నెల పాస్ రూ.3290రూ.3620, లైట్ కమర్షియల్ వెహికిల్స్‌కు సింగిల్ ట్రిప్ రూ.150 రూ.165, రిటర్న్ జర్కీకి రూ.225 250, బస్, ట్రక్కులకు సింగిల్ ట్రిప్ రూ.305రూ.340, రిటర్న్ జర్నీకి రూ.460రూ.505, నెల పాస్‌కు రూ.10225రూ.11265. ఓవర్సైజ్డ్ హెవీ వెహికిల్్స సింగిల్ ట్రిప్‌కు రూ.605రూ.665, రిటర్న్ జర్నీకి రూ.905 రూ.1000, నెల పాస్‌కు రూ.20160రూ.22210 ► ఆదిలాబాద్‌లోని ఎన్‌హెచ్7పై ఉన్న రోల్మామ్డా టోల్‌ప్లాజా ధరలల్లో మార్పు ఇలా: కార్లు జీపులు సింగిల్ ట్రిప్ రూ.90 రూ.100, రిటర్న్ జర్నీ రూ.135రూ.150, నెలపాస్ రూ.2980 రూ.3285, లైట్ కమర్షియల్ వెహికిల్స్ సింగిల్ ట్రిప్ రూ.145రూ.160, రిటర్న్ జర్నీ రూ.215రూ.240, నెలపాస్ రూ.4815 రూ.5305, బస్, ట్రక్కు సింగిల్ ట్రిప్ రూ.330 రూ.335, రిటర్న్ జర్నీకి రూ.455రూ.500, నెలపాస్ రూ.10090 రూ.11110, ఓవర్సైజ్డ్ హెవీవెహికిల్ సింగిల్ ట్రిప్ రూ.580రూ.635, రిటర్న్ జర్నీ రూ.865రూ.955, నెలపాస్ రూ.19260రూ.21215 ► ఎన్‌హెచ్44పై ఆర్మూర్ఎల్లారెడ్డి సెక్షన్ పరిధిలోని ఇందల్వాయి టోల్ధరలు పాతకొత్త ఇలా.. కార్లు, జీపుల సింగిల్ ట్రిప్పుకు రూ.75రూ.80, రిటర్న్ జర్నీకి రూ.110రూ.125, నెలపాస్‌కు రూ.2470రూ.2720, లైట్ కమర్షియల్ వాహనాల సింగిల్ ట్రిప్పు రూ.120రూ.130, రిటర్న్ జర్నీ రూ.180 రూ.200, నెలపాస్ రూ.3990రూ.4395, బస్, ట్రక్కు సింగిల్ ట్రిప్పు రూ.250రూ.275, రిటర్న్ జర్నీ రూ.375రూ.415, నెలపాసు రూ.8365రూ.9215 -
చౌటుప్పల్‌లో హైవేపై వాహనాల బారులు
చౌటుప్పల్ రూరల్: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్తున్న వారితో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ నెలకొంది. హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున వెళ్లిన కార్లు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద గురువారం రాత్రి క్యూ కట్టాయి. హైవేపై నిత్యం 30వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా, గురువారం మరో 10వేల వాహనాలు అదనంగా వెళ్లినట్టు టోల్‌ప్లాజా నిర్వాహకులు తెలిపారు. భువనగిరి డీసీపీ కె.నారాయణరెడ్డి టోల్‌ప్లాజాను గురువారం మధ్యాహ్నం సందర్శించి, వాహనాల రద్దీని పరిశీలించారు. గూడూరు టోల్‌ప్లాజా దగ్గరా... బీబీనగర్: హైదరాబాద్–వరంగల్ హైవేపై బీబీనగర్ మండలంలోని గూడూరు టోల్‌ప్లాజా వద్ద కూడా గురువారం పండుగ రద్దీ కనిపించింది. నగరం నుంచి భారీగా ప్రజలు పండుగకు గ్రామాలకు వెళ్తుండడంతో టోల్గేట్ వద్ద వాహనాలు బారులు తీరాయి. -
Photo Feature: బడులు రెడీ.. విజయవాడ హైవేపై రద్దీ
పంటల సీజన్ ప్రారంభం కావడంతో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కూడా రైతు అవతారం ఎత్తి స్వయంగా విత్తనాలు చల్లారు. ఇక తెలంగాణలో జూలై 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. వానా కాలం ప్రారంభంతో తెలుగు రాష్ట్రాల్లోని జలపాతాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. మరిన్ని ‘చిత్ర’విశేషాల కోసం ఇక్కడ చూడండి. -
ఎమ్మెల్సీ నర్సిరెడ్డికి చేదు అనుభవం
సాక్షి, యాదాద్రి : చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద సోమవారం ఎమ్మెల్సీ నర్సిరెడ్డి చేదు అనుభవం ఎదురైంది. టోల్ ఫీజు చెల్లించాలంటూ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి వాహనాన్ని టోల్ ప్లాజా సిబ్బంది అడ్డుకుంది. తాను ఎమ్మెల్సీ అని చెప్పినా అనుమతించలేదు. చివరికి ఐడీ కార్డు చూపించినా వదల్లేదు. మొదట గన్‌మెన్ లేకపోవడంతో ఎమ్మెల్సీ అని అనుకోలేదని చెప్పిన సిబ్బంది.. తర్వాత టోల్ మినహాయింపు జాబితాలో ఎమ్మెల్సీ పేరు లేదంటూ బుకాయించారు. చివరికి ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి వాహనాన్ని అనుమతించారు. కాగా, టోల్ ప్లాజా సిబ్బంది తీరుకు నిరసనగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ధర్నాకు దిగారు. ఏ ఎమ్మెల్సీని ఆపకుండా తనను మాత్రమే ఎందుకు ఆపారో చెప్పాలంటూ టోల్ ఫ్లాజా వద్ద బైఠాయించారు. -
టోల్గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
-
టోల్‌ప్లాజా ట్రాఫిక్ జామ్
చౌటుప్పల్/మునిపల్లి: హైదరాబాద్–విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారి బుధవారం వాహనాలతో రద్దీగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు హైదరాబాద్‌లో స్థిరపడిన ఆ రాష్ట్ర ప్రజలు భారీ ఎత్తున సొంతూర్లకు బయలుదేరడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. విజయవాడ మార్గంలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి, నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్ టోల్‌ప్లాజా, అలాగే నార్కట్‌పల్లి – అద్దంకి మార్గంలోని మాడ్గులపల్లి టోల్‌ప్లాజాకు వాహనాలు పోటెత్తాయి. మంగళవారం అర్ధరాత్రి ప్రారంభమైన వాహనాల రద్దీ బుధవారం ఉదయం 11గంటల వరకు కొనసాగింది. తిరిగి సాయంత్రం 6 గంటలకు మరోసారి వాహనాల రద్దీ ప్రారంభమైంది. పంతంగి, కొర్లపహాడ్ టోల్‌ప్లాజాల వద్ద కిలోమీటర్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఒక్కో వాహనానికి టోల్‌ప్లాజా దాటేందుకు గంటల సమయం పట్టింది. ప్లాజా సిబ్బంది నేరుగా వాహనదారుల వద్దకే వెళ్లి ఫీజు వసూలు చేశారు. సాధారణ రోజులతో పోలిస్తే హైదరాబాద్ – విజయవాడ రహదారిపై సుమారు 30 వేల వాహనాలు అదనంగా వెళ్లినట్టు సమాచారం. గంటల తరబడి టోల్‌ప్లాజా వద్ద వేచి ఉండాల్సి రావడంతో వాహనదారులు సిబ్బందితో గొడవకు దిగారు. రద్దీ సమయంలో ఉచితంగా పంపించాలని, లేకుంటే అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని నిరసన వ్యక్తంచేశారు . పోలీసులు సముదాయించి వాహనదారులను పంపించారు. కాగా, సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని కంకోల్ శివారు వద్ద ఉన్న టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాల రద్దీ నెలకొంది. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్గేట్ వద్ద బారులు తీరిన వాహనాలు -
భారీగా నిలిచిపోయిన వాహనాలు.. ఓటర్లకు తిప్పలు
-
భారీగా నిలిచిపోయిన వాహనాలు.. ఓటర్లకు తిప్పలు
యాదాద్రి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు వేసేందుకు సొంతూళ్లకు బయలుదేరిన ఓటర్లకు తిప్పలు తప్పడం లేదు. హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారిపై పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రేపు ఎన్నికలు జరుగుతున్నందున ఓటు హక్కును వినియోగించుకునేందుకు హైదరాబాద్ నగరం నుంచి ఓటర్లు మంగళవారం రాత్రి నుంచి సొంతూళ్లకు బయల్దేరారు. దీంతో అర్ధరాత్రి నుంచి ఈ రహదారిపై వాహనాలు భారీగా బారులు తీరాయి. బుధవారం తెల్లవారుజాము నుంచి చౌటుప్పల్ మండలం పంతంగి టోల్గేట్ వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. విజయవాడ వైపుకు వెళ్లే వాహనాలు పోటేత్తడంతో.. ట్రాఫిక్ జామ్ భారీగా అయ్యింది. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. టోల్ ఫీజులేకుండా వాహనాలను వదిలిపెట్టాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. గంటలకొద్ది వేచిఉండడంతో టోల్గేట్ సిబ్బందిపై వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నారు. దీంతో గేట్ వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎన్నికల నేపథ్యంలో రైల్వే స్టేషన్లో కూడా పరిస్థితి ఇదే విధంగా ఉంది. ఏపీకి వెళ్లే ఓటర్లు పెద్దఎత్తున రావడంతో రైళ్లన్ని కిక్కిరిసిపోతున్నాయి. (చదవండి: ఓటేయడానికి పోటెత్తారు!) -
పంతంగి టోల్‌ప్లాజా వద్ద సంక్రాంతి రద్దీ
చౌటుప్పల్: సంక్రాంతి పండుగ కోసం తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు తమ స్వస్థలాలకు బయలుదేరటంతో 65వ నంబరు జాతీయ రహదారి రద్దీగా మారింది. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం వాహనాలు బారులు తీరాయి. రద్దీ పెరగడంతో వాహనదారులు ఇబ్బంది పడకుండా టోల్ సిబ్బంది, పోలీసులు చర్యలు తీసుకున్నారు. శనివారం తెల్లవారుజాము నుంచి ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశం ఉంది. -
పంతంగి టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్ జాం
నల్లగొండ: దసరా సెలవులు నేపథ్యంలో హైదరాబాద్ వాసులు స్వస్థలాలకు పయనమైయ్యారు. ఈ నేపథ్యంలో నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా వాహనాలు బారులు తీరాయి. దీంతో టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఈ కారణంగా వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. పండుగకు స్వగ్రామాలకు వెళ్లే వారితో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది.