ఎమ్మెల్సీ నర్సిరెడ్డికి చేదు అనుభవం | Panthangi Toll Plaza Staff Blocked MLC Alugubelli Narsi Reddy Vehicle | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ నర్సిరెడ్డికి చేదు అనుభవం

Published Mon, Feb 24 2020 10:51 AM | Last Updated on Mon, Feb 24 2020 1:31 PM

Panthangi Toll Plaza Staff Blocked MLC Alugubelli Narsi Reddy Vehicle - Sakshi

సాక్షి, యాదాద్రి : చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ ప్లాజా వద్ద సోమవారం ఎమ్మెల్సీ నర్సిరెడ్డి చేదు అనుభవం ఎదురైంది. టోల్‌ ఫీజు చెల్లించాలంటూ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి వాహనాన్ని టోల్‌ ప్లాజా సిబ్బంది అడ్డు​కుంది. తాను ఎమ్మెల్సీ అని చెప్పినా అనుమతించలేదు. చివరికి ఐడీ కార్డు చూపించినా వదల్లేదు. మొదట గన్‌మెన్‌ లేకపోవడంతో ఎమ్మెల్సీ అని అనుకోలేదని చెప్పిన సిబ్బంది.. తర్వాత టోల్‌​ మినహాయింపు జాబితాలో ఎమ్మెల్సీ పేరు లేదంటూ బుకాయించారు. చివరికి ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి వాహనాన్ని అనుమతించారు. కాగా, టోల్‌ ప్లాజా సిబ్బంది తీరుకు నిరసనగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ధర్నాకు దిగారు. ఏ ఎమ్మెల్సీని ఆపకుండా తనను మాత్రమే ఎందుకు ఆపారో చెప్పాలంటూ టోల్ ఫ్లాజా వద్ద బైఠాయించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement