భాగ్య నగరం మరోసారి భారీ వర్షానికి చిగురుటాకులా వణికిపోయింది. సోమవారం సాయంత్రం భారీ వర్షం హైదరాబాద్‌ను ముంచెత్తింది. నగరంలోని డ్రైనేజీలు, నల్లాలు పొంగిపొర్లాయి. సాయంత్రం వేళ కావడంతో వాహనదారులు ఇంటికి చేరడానికి తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా క్యుములోనింబస్ మేఘాలు విస్తరించడంతో భారీ వాన కురుస్తోంది. ఉపరితల ఆవర్తనం కారణంగా మరో రెండురోజుల పాటు నగరంలో భారీవర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు.